సినిమాల్లోనూ, టీవీల్లోనూ చూస్తుంటాం ఇలాంటి ఘటనలు. హీరో ప్రెగ్నెంట్‌తో ఉన్న హీరోయిన్ కడుపు దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే..కిక్ ఇవ్వడం, స్పందించడం వంటివి చూస్తుంటాం. అలాంటి అరుదైన దృశ్యం రియల్‌గా చోటుచేసుకుంది. పేరెంట్స్ సైతం విస్తుపోయారు తమ పుట్టబోయే పాపాయి స్పందన చూసి..
ఈ విచిత్ర ఘటన కెనడాలో చోటు చేసుకుంది. లియా ఒలివెరా అనే మహిళ తన భాగస్వామితో కలిసి ఒక సాధారణ ప్రినేటల్ అల్ట్రాసౌండ్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు. స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఆ మహిళ భర్త ఎంతో ప్రేమగా ఆమె కడుపుపై ముద్దుపెట్టుకుని తమ కాబోయే పాపతో మాట్లాడడం ప్రారంభించారు.
"గుడ్ మార్నింగ్.. హ్యాపీ శనివారం, నీకు ఆకలిగా ఉందా?" అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అయితే ఆ తండ్రి గొంతు విని వెంటనే.. అల్ట్రాసౌండ్ స్క్రీన్ పై కనిపించిన చిన్నారి ముఖంలో అద్భుతమైన మార్పు చూసి అక్కడున్ను వారంతా కంగుతిన్నారు. నాన్న మాటలకు ఆ పాపాయి చిరునవ్వుతూ స్పందించింది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని కెమెరాలో బంధించి..సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మేరకు తల్లి లియా ఒలివెరా మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకం అంటూ భావోద్వేగానికి గురైంది. పుట్టబోయే బిడ్డతో పేరెంట్స్‌కి ఎంతలా బాండింగ్ ఉంటుందో ఈ ఘటన నిరూపించిందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇది యాదృశ్చికమైనదే అయినా..ఈ అద్భుత దృశ్యం వేలాది మంది హృదయాలను గెలుచుకోని..అందరి ముఖాల్లో నవ్వులు విరిసేలా చేసింది.
My heart ❤️❤️❤️
Baby girl in mommy’s tummy smiles BIG the moment she hears her daddy’s voice during ultrasound.
“Behold, children are a heritage from the Lord, the fruit of the womb a reward. Like arrows in the hand of a warrior are the children of one's youth. Blessed is the… pic.twitter.com/BYJkLDcnw1— MJTruthUltra (@MJTruthUltra) July 31, 2026
(చదవండి: తొలి లేడీ డిటెక్టివ్..! ఆఖరికి పెళ్లి గురించి కూడా...)


