మాస్కోలో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి | Moscow Blast Shocks Capital Deadly Explosion Claims Three Lives | Sakshi
Sakshi News home page

మాస్కోలో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి

Aug 2 2026 9:37 AM | Updated on Aug 2 2026 9:37 AM

Moscow Blast Shocks Capital Deadly Explosion Claims Three Lives

మాస్కో(రష్యా): మాస్కోలోని ఓ రెస్టారెంట్‌లో శనివారం చోటుచేసుకున్న శక్తివంతమైన బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా ఈ వివరాలను వెల్లడించింది. మాస్కో నడిబొడ్డున ఉన్న కుడ్రిన్స్కాయా స్క్వేర్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఈ ప్రమాదం సంభవించినట్లు నేషనల్ యాంటీ టెర్రరిజం కమిటీ తెలిపింది.

ఈ పేలుడు ఘటనలో అనుమానాస్పద మహిళతో పాటు సెక్యూరిటీ గార్డు, ఒక రెస్టారెంట్ వినియోగదారుడు అక్కడికక్కడే మృతి చెందారు. రెస్టారెంట్‌లోకి పేలుడు పదార్థాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన అజ్ఞాత మహిళను సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడని, ఆ సమయంలోనే బాంబు పేలిందని రష్యన్ వార్తా సంస్థ ‘రియా నోవోస్తి’ వెల్లడించింది. ఈ ఘటనపై మాస్కో దర్యాప్తు కమిటీ విచారణ చేపట్టింది. పేలుడుకు గల కారణాలు, ఉగ్రకోణం ఉందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: దీప్కే విదేశీ చదువులపై ఆర్టీఐ ఆరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement