దీప్కే విదేశీ చదువులపై ఆర్టీఐ ఆరా | RTI Activist Demands Probe into Abhijeet Dipkes Fathers Assets and CJP Funding | Sakshi
Sakshi News home page

దీప్కే విదేశీ చదువులపై ఆర్టీఐ ఆరా

Aug 2 2026 8:51 AM | Updated on Aug 2 2026 8:51 AM

RTI Activist Demands Probe into Abhijeet Dipkes Fathers Assets and CJP Funding

సూరత్‌: కొక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దిప్కే తండ్రి భగవాన్‌రావు దీప్కే ఆదాయం, ఆర్థిక పరిస్థితిపై సమగ్ర విచారణ జరపాలని సూరత్‌కు చెందిన ఒక ఆర్‌టీఐ కార్యకర్త డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగి అయిన భగవాన్‌రావు దీప్కే తన కుమారుడి విదేశీ చదువుల కోసం నిధులను ఎలా సమకూర్చారనే దానిపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు.

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన అమిత్ తివారీ అనే ఆర్‌టీఐ కార్యకర్త ఈ విషయమై ఎన్నికల సంఘానికి, ఆదాయపు పన్ను శాఖకు లేఖలు రాసి తనిఖీలు చేపట్టాలని కోరారు. ఇదే సమయంలో, సీజేపీ ఆందోళనకారుల కోసం సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రకటించిన కోటి రూపాయల నిధుల చట్టబద్ధతపై కూడా దర్యాప్తు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ మీడియాతో మాట్లాడుతూ కొక్రోచ్ జనతా పార్టీ అనేది రిజిస్టర్ కాని సంస్థ అయినప్పటికీ, అది ఒక రాజకీయ పార్టీ మాదిరిగా కార్యకలాపాలు సాగిస్తోందని తెలిపారు. లీగల్ డిఫెన్స్ ఫండ్‌గా ఒక కోటి రూపాయలు అందజేస్తామని ప్రకటన వెలువడినందున, 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29-ఏ కింద సీజేపీ ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయిందా లేదా అని ఈసీ పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ పార్టీ రిజిస్టర్ కానట్లయితే, దాని పేరుతో నిధులు సమీకరించడం, వాటిని వినియోగించడం ఎంతవరకు చట్టబద్ధమనే కోణంలో దర్యాప్తు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో తెల్లవారుజామున భూకంపం.. ఉలిక్కిపడిన జనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement