ఐదు పదుల వయసులోనూ యంగ్‌గా నటి శోభనా..! ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసా.. | Health Tips: Ramayana actress Shobanas fitness secret at 56; | Sakshi
Sakshi News home page

Shobanas fitness secret: ఐదు పదుల వయసులోనూ యంగ్‌గా నటి శోభనా..! ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..

Aug 1 2026 1:22 PM | Updated on Aug 1 2026 1:54 PM

Health Tips: Ramayana actress Shobanas fitness secret at 56;

"యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే రాధా.."అన్న పాట రాగానే అలనాటి అందాల నటి శోభనా(actress Shobana) టక్కున గుర్తొస్తారు. ఆమె తన కళ్లతో అభినయం పలికించగల గొప్ప నటి. 90ల టైంలో అగ్ర తారగా ఓ వెలుగు వెలిగిన నటి. అంతేగాదు మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. కొంతకాలం సినిమాలకు దూరమై..నాట్యానికి జీవితానని అంకితం చేశారామె. మళ్లీ ఇటీవల కల్కి మూవితో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. తాజాగా  బాలీవుడ్‌ నిర్మాత నితేష్ తివారీ ప్రతిష్టాత్మక పౌరాణిక ఇతిహాసం 'రామాయణం'లో కనిపించనున్నారు. అందులో రావణుడిగా నటిస్తున్న యశ్‌ తల్లి కైకేసి పాత్రను పోషించనుందామె. అలాగే ఆమె చెన్నైలో నృత్య అకాడమీ 'కళాతర్పణ'ను కూడా నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె 54 ఏళ్లు. ఈ వయసులోనూ అంతే గ్లామర్‌గా పిట్‌గా ఉంటారు శోభనా. తను ఇంతలా ఎనర్జిటిక్‌గా, హెల్దీగా ఉండటానికి కారణం ఏమిటో ఒక ఇంటర్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించారు. మరి ఆమె అనుసరించే ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటో చూద్దామా..!.

ఆమె భారత్‌లోనూ విదేశాల్లోనే నృత్య ప్రదర్శనలిస్తుంటారు. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో తప్పకుండా ప్రదర్శనలిస్తుంటారామె. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఫిట్‌గా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తానని చెప్పారామె. అలాగే ఆహారం విషయంలో కూడా చాలా  జాగ్రత్తగా ఉంటానన్నారు. ఆమె ప్రోటీన్‌ షేక్‌లు, డైటింగ్‌ రెండిటిని పాటిస్తానని చెప్పారు. ఈ విధానం చూసి చాలా మంది ఆశ్చర్యపోతారని అన్నారు. 

అలా ఎందుకంటే తన ఆకలి ఎక్కువగా ఉంటుందని అందుకని ఇలా చేస్తానని అన్నారామె. తన బిజీ షెడ్యూల్‌కి అనుగుణంగానే ఆహారపు అలవాట్లు రూపొందించుకుంటానని తెలిపారామె. వేదికపై శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు కొనసాగిస్తున్నందున సమతుల్యమైన ఆహారమే తీసుకోవాలని చెప్పారు. అయితే తాను ఏడాదంతా ఒకేరకమైన డైట్‌ ప్లాన్‌ని పాటించనని చెప్పారామె. 

తన శరీరానికి అనుగుణంగా దినచర్యను మార్చుకుంటూ..బరువుని అదుపులో ఉంచడంపై అటెన్షన్‌ పెడతానని అన్నారామె. ఒక్కోసారి మూడు రోజుల డైట్‌ని పాటిస్తే..మరికొన్నిసార్లు ఏకంగా ఏడుసార్లు డైట్‌ పాటిస్తానని చెప్పారు. ఒక్కోసారి క్రాష్‌ డైట్‌ కూడా పాటిస్తానని ధీమాగా వెల్లడించారు. తను ప్రతిసారా కఠినమైన భోజన ప్రణాళిక అనుసరించకుండా అవసరమైనప్పుడల్లా షెడ్యూల్‌ని సర్దుబాటు చేసుకుంటానని తెలిపింది అందాల శోభన. 

దూరంగా ఉంచే ఆహారాలు..
అధిక కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులకు చాలా దూరంగా ఉంటానని అన్నారు. పిజ్జా, బర్గర్లు, పాస్తా, బ్రెడ్‌, శాండ్‌విచ్‌లు, నూనెలో అధికంగా వేయించిన ఆహారాలకు బహుదూరంగా ఉంటానని చెప్పారామె. థాయి వంటకాలు, కొన్ని రకాల డెజర్ట్‌లంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. కాగా ఇక్కడ అందాల నటి శోభన కూడా తన శరీరం మాట వింటూ అందుకు అనుగుణంగా డైట్‌ని అనుసరిస్తున్నట్లు నొక్కి చెప్పారు. ఏ డైట్‌ అయినా గుడ్డిగా కాకుండా శరీరానికి పడేది..అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అని చెప్పకనే చెబుతోంది కదా ఈ నటి డైట్‌.

(చదవండి: ఒంటరిగా ఫ్లైట్‌ జర్నీ..ఆ మహిళను ఎంతలా మార్చిందంటే?)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement