breaking news
Fitness
-
సవాల్‌కు సర్ఫరాజ్ సై
ముంబై: ‘నేను తగినవాడినో కాదు తెలీదు, కానీ నా వద్ద ఉన్నవాటితోనే నేను పోరాడతాను’... ఈ వ్యాఖ్యతో తెలుగు సినిమా జెర్సీలో హీరో నాని ఫోటోను జత కలిపి మూడు రోజుల క్రితం సర్ఫరాజ్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బహుశా భారత జట్టులో తనకు చాలా కాలంగా చోటు దక్కకపోవడంతో నిరాశను అతను ఈ రకంగా ప్రదర్శించినట్లున్నాడు. అయితే ఆదివారమే అతడిని శ్రీలంకతో సిరీస్ కోసం సెలక్టర్లు ఎంపిక చేశారు. 2024 నవంబర్‌లో తన చివరి టెస్టు ఆడిన సర్ఫరాజ్ ఇంతకాలం తర్వాత టీమ్‌లోకి పునరాగమనం చేశాడు. అయితే దీని వెనక కఠోర శ్రమ, పోరాటం ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ సాధన కొనసాగించి అతను సిద్ధమైన తీరు సర్ఫరాజ్ ఆటపై ఆశలు రేపుతోంది. తాను ఆడిన 6 టెస్టుల్లో సర్ఫరాజ్ 37.10 సగటుతో 371 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 అర్ధసెంచరీలు ఉండటం ఎలా చూసినా మెరుగైన ప్రదర్శనే.అనూహ్యంగా దూరమై...దాదాపు రెండేళ్ల క్రితం సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో వైఫల్యం తర్వాత సర్ఫరాజ్ జట్టులో కోల్పోయాడు. నిజానికి ఈ మ్యాచ్ తొలి టెస్టులో అతను సెంచరీతో సత్తా చాటాడు. తర్వాతి రెండు టెస్టుల్లో కలిపి 21 పరుగులే చేశాడు. అయితే భారత్ 0–3తో చిత్తయిన ఈ సిరీస్‌లో ఇతర ఆటగాళ్లంతా కూడా విఫలమైనా వేటు సర్ఫరాజ్పైనే పడింది. ఆ తర్వాత పునరాగమనం చాలా కష్టంగా మారిపోయింది. ఇంగ్లండ్ గడ్డపై భారత ‘ఎ’ జట్టు తరఫున 92 పరుగులు, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సెంచరీ చేసినా ప్రయోజనం లేకపోయింది. నిజానికి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు ముందు టీమ్ మేనేజ్మెంట్ సర్ఫరాజ్‌ను తీసుకోవాలని భావించినా... సెలక్టర్లు అంగీకరించలేదని సమాచారం. ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ టీమిండియా పిలుపు దక్కింది.17 కిలోల బరువు తగ్గి...గత ఏడాదిన్నర కాలంలో సర్ఫరాజ్ శారీరకంగా ఎంతో కష్టపడ్డాడు. ఈ క్రమంలో తన బరువు, ఫిట్‌నెస్‌పై వస్తున్న సందేహాలను సమాధానం ఇచ్చేందుకు అతను సన్నద్ధమయ్యాడు. రంజీ ట్రోఫీలో సుదీర్ఘ సమయం పాట క్రీజ్‌లో నిలిచి ట్రిపుల్ సెంచరీ సాధించినా... ఈ విషయంలో అతనిపై సందేహాలు తీరలేదు. దాంతో పట్టుదలగా ప్రయతి్నంచి ఏకంగా 17 కిలోల బరువు తగ్గించుకున్నాడు. దాంతో అతని శరీరం మరింత చురుగ్గా మారింది. ముంబైలో ఎంసీఏ ఇండోర్ స్టేడియంలో ఆస్ట్రో టర్ఫ్ వికెట్‌పై ప్రాక్టీస్ చేసిన అతను... కుర్లాలోని ప్రైవేట్ అకాడమీలో పూర్తిగా సిద్ధం చేయని ఎర్రమట్టి పిచ్‌లపై గంటల పాటు సాధన కొనసాగించాడు. స్పిన్ బౌలర్లను మరింతగా సమర్థంగా ఎదుర్కొనేందుకు అతను దీనిని అనుసరించాడు. అయితే వర్షాల కారణంగా ప్రాక్టీస్ సాధ్యం కాకపోవడంతో అతను కశ్మీర్‌కు వెళ్లిన తన సాధన కొనసాగించాడు. శ్రీనగర్ సమీపంలోని షేర్–ఎ–కశ్మీర్ స్టేడియంలో సర్ఫరాజ్ సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లోనే నిలిచి తన ఆటకు పదును పెట్టాడు.తుది జట్టులో పోటీ! శ్రీలంకతో రెండు టెస్టులకు ప్రస్తుతం సర్ఫరాజ్ ఎంపికైనా... తుది జట్టులో స్థానం దక్కడం కూడా కీలకమే. భారత జట్టు తమ చివరి టెస్టు ఆడిన తుది జట్టు (అఫ్గానిస్తాన్‌తో)ను చూస్తే సాయి సుదర్శన్ ఆడిన మూడో స్థానానికి దేవ్‌దత్ పడిక్కల్ సిద్ధంగా ఉన్నాడు. దేశవాళీలో మెరుగైన రికార్డు, ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రదర్శనతో పాటు ఎడంచేతి వాటం కావడం అతని స్థానాన్ని దాదాపు ఖాయం చేశాయి. సర్ఫరాజ్ జట్టులో ఇప్పుడు ఆరో స్థానానికి పోటీ పడుతున్నాడు. ఇప్పటి వరకు ఇక్కడ ఆడుతున్న ధ్రువ్ జురేల్ నుంచి ఆశించిన ప్రదర్శన రావడం లేదు. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ జట్టులో ఉండగా రెగ్యులర్ బ్యాటర్‌గా జురేల్ స్థానం ప్రశ్నార్ధకమే. పైగా స్పిన్‌ను ఆడటంలో అతను పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ విషయంలో సర్ఫరాజ్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాడు. ఒకవేళ తుది జట్టులో చాన్స్ లభిస్తే సత్తా చాటి తనను తాను నిరూపించుకోగల సామర్థ్యం సర్ఫరాజ్‌లో ఉందనేది వాస్తవం. -
వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదే!
-
భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఫిట్‌నెస్‌పై జట్టు మేనేజ్మెంట్ కీలక అప్డేట్ ఇచ్చింది. తొలి టెస్టుకు ముందు లంకతో ఆడిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన గిల్ చేతి వేలికి చిన్న గాయమైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దూరంగా ఉన్న గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గిల్ చేతి వేలి గాయంతో ఏమైనా బాధపడ్డాడా లేక బాగానే ఉన్నాడా అన్నదానిపై భారత బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించాడు. 'నెట్ ప్రాక్టీస్ సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ చేతి వేలికి చిన్న గాయమైంది. అయితే అతడికి అయిన గాయం మైనర్దే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే వార్మప్ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆటకు దూరంగానే ఉన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన గిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించాడు. దీంతో అతడి చేతివేలి గాయం పూర్తిగా తగ్గిపోయినట్లే. తన బ్యాటింగ్‌తో తొలి టెస్టుకు దూరమవుతాడన్న సందేహాలను కూడా గిల్ పటాపంచలు చేశాడు. ఇది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే టీమిండియాకు ఎంపికైన 13 మంది ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల బారిన పడి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో పునరావాస కేంద్రంలో గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో మరే ఆటగాడు గాయపడ్డా టీమిండియాకు ఎదురుదెబ్బ అవుతుందని భయపడుతున్నాం. అందుకే గిల్‌కు చిన్న గాయమే అయినప్పటికీ, పూర్తిగా కోలుకోవాలనే వార్మప్ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆడించలేదు. చేతి వేలి గాయం మానడంతో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన గిల్ మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేసి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలిచ్చాడు.' అని చెప్పుకొచ్చాడు. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ 55 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 21వ ఓవర్లో కేషారా నువంతా బౌలింగ్‌లో గిల్ వెనుదిరిగాడు. ఇక గిల్ గాయం మొదట మేనేజ్మెంట్ను భయపెట్టినప్పటికీ, అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక 2025 నుంచి గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో వస్తున్నాడు. అంతకముందు 2020 నుంచి 2023 వరకు గిల్ టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడాడు. అయితే జైస్వాల్‌కు జతగా కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా అదరగొట్టడంతో వీరి జోడినే శ్రీలంక టెస్టు సిరీస్‌లోనూ కంటిన్యూ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ లెక్కన గిల్ మరోసారి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రానున్నాడు. ఇక టెస్టుల్లో గిల్‌కు నాలుగో స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 ఇన్నింగ్స్‌ల్లో 88.75 సగటుతో గిల్ ఆరు సెంచరీలు సాధించడం విశేషం. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది.Read: ఐదేళ్ల వయసులోనే MMA చాంపియన్.. ఎవరీ బుడ్డోడు! -
ఐదు పదుల వయసులోనూ అంతే యంగ్‌గా ప్రిన్స్ మహేశ్..!
ప్రిన్స్ మహేశ్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఆరాధించే ఈ టాలీవుడ్ హీరో ఈ రోజుతో 51వ వసంతంలోకి అగుడుపెట్టారు. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా..ఇప్పటికీ అంతే అందంగా యంగ్‌లుక్‌లో అలరించే నటుడు ఆయన. అందంలో ఈ యువరాజుకి "సరిలేరు నీకెవ్వరు" అనేలా అభిమానులను ఆకట్టుకుంటారాయన. ఇవాళ ప్రిన్స్ మహేశ్ పుట్టినరోజు సందర్భంగా..వృద్ధాప్యాన్నే తిప్పికొట్టేలా అంతలా గ్లామరస్‌గా కనిపించేందుకు మహేశ్ ఏం చేస్తుంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో సవివరంగా తెలుసుకుందామా.టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు ఆగస్టు9, 2026న 51వ ఏటలోకి అడుగుపెట్టారు. వయసు కనపించని ఆయన ఆకర్షణీయమైన రూపానికి ఫిదా అవ్వని వాళ్లు లేరు. అంతలా అభిమానులను సంపాదించుకున్న ఈ నటుడు తన చర్మసంరక్షణ కోసం ఎలాంటి ఖరీదైన చికిత్సలు జోలికి పోరట. అదంతా ఆయన తీసుకునే ఆహారంలో ఉందట. యంగ్ లుక్ కోసం..ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో పేస్ట్రీ, బర్గర్ లేదా పెరుగు అన్నం వీటిలో ఏది ఇష్టంగా తింటారని అడగగా..ఆ మూడు తను తినని అన్నారు. తాను పాల ఉత్పత్తులకు చాలా దూరంగా ఉంటానన్నారు. బ్రెడ్, బర్గర్ల జోలికి పోనన్నారు. తాను ఎక్కువగా మొక్కల ఆధారిత భోజనమే తీసుకుంటానని అన్నారు. వైద్యుల సైతం ఆయన డైట్‌ని 'గట్-స్కిన్ యాక్సిస్' గా పేర్కొన్నారు. ఆయన తీసుకునే ఆహారం పోషణకు, దీర్ఘాయువుకి..చర్మసంరక్షణకు కీలకమైన ఆరోగ్యకరమైన ఆహరంగా చెబుతున్నారు వైద్యులు. ఆ కారణంగానే ఆయన ఏళ్ల తరబడి ఒకేలా అంతే అందంగా కనిపిస్తున్నారని అన్నారు. చర్మానికి చికిత్స అంటే మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఎందుకంటే మనం కూరగాయలు తిన్నప్పుడు వాటిలో మంచి ఫైబర్ ఉంటుంది. దీని వల్ల మీ గట్‌లో మంచి బ్యాక్టీరియా ఆహారంగా మారుతుంది. దాంతో చర్మంపై వాపులు అలాంటివి ధరిచేరవు, పైగా హెల్దీ స్కిన్‌కి, కాంతికి దోహదపడుతుందని చెబుతున్నారు వైద్యులు. గట్ బ్యాక్టీరియా సరిగా లేనప్పుడు చర్మం దెబ్బతినేలా వాపుని కలిగించే రసాయనాలు రక్తప్రవాహంలో చేరి మెటిమలు, ఎరుదనంతో కూడిన ఎగ్జిమా వంటి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయన్నారు. అంతేగాదు మొటిమలు, సోరియాసిస్, ఎగ్జిమా వంటి సమస్యలుంటే వారిలో మైక్రోబయోమ్‌లు దెబ్బతిన్నాయని , ప్రయోజనకరమైన బ్యాక్టీరియా స్థాయిలు తగ్గాయని అర్థమట. ప్రేగు-చర్మం ఆరోగ్యంకోసం..ఫైబర్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రీబయోటిక్ ఫైబర్లు బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందిస్తాయి, ఇవి బ్యూటిరేట్ వంటి షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడటమే గాక చర్మాన్ని ప్రభావితం చేస్తుంది.క్యారెట్లు, మిరపకాయలు, టమోటాలు వంటి ఆహారాలలో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. బీటా-కెరోటిన్, లైకోపీన్, ఆస్టాక్సాంథిన్ ఒక అంతర్గత సన్‌స్క్రీన్‌లా పనిచేసి..ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, చర్మ ఆకృతిని, కాంతిని మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇది చర్మ సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన చర్మ కాంతి కోసం హీరో మహేశ్ బాబులా పాల ఉత్పత్తులకు, బ్రెడ్, బర్గర్లకు దూరంగా ఉండాలే అసాధారణమైన సంకల్పం బలం కావాలన్నారు. మంచి చర్మం అంటే కేవలం ముఖానికి రాసుకునే క్రీమ్‌లు, లోషన్లు మాత్రమే కాదు, అంతర్గతంగా మనం తీసుకునే ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మెరిసే ముఖానికి కుంకుమాది తైలం) -
నో రన్నింగ్, నో కార్డియో..! జస్ట్ 20 నిమిషాల నడకతో 24 కిలోలు..
బరువు తగ్గడం అనేది వ్యాయామలు, చక్కటి డైట్, మంచి ఆహారపు అలవాట్లతోనే సాధ్యం కాదు. చేసే వ్యాయామాలు కాస్త తెలివిగా చేస్తేనే శరరీంలో సత్వర మార్పులు చూడగలం. ఒకటే దినచర్యకు బాడీ అలవాటు పడి.. పెద్దగా బరువులో ఎలాంటి ప్రభావం ఉండదు. పైగా ఇంతలా చేస్తున్నా..బరువులో మార్పు కనిపించక..మధ్యలోనే వెయిట్‌లాస్ జర్నీకి స్వస్తి పలుకుతుంటారు చాలామంది. అలాంటి వాళ్లు ఈ ఫిట్ఇన్ఫ్లుయెన్సర్లా తెలివిగా చేస్తే..అమాంతం బరువు తగ్గడమే గాక స్లిమ్ అవుతారు. మరి ఆ ట్రిక్ ఏంటో చూద్దామా..!.బరువు తగ్గడంలో అందరూ తక్కువ తినడం, ఎక్కువ కదలడం, నిలకడగా ఉండటం వంటి సులభమైన కామన్ సూత్రం పాటిస్తుంటారు. ఇలా నెలల తరబడి, ఇదే వర్కౌట్ రొటీన్‌ని అనుసరిస్తుంటారు. కానీ వెయిట్ మెషిన్లో బరువులో పెద్దగా మార్పు కనిపించక నిరాశ చెందుతుంటారు. ఆ విషయం గురించి ఫిటెనెస్ కంటెంట్ క్రియేటర్ మాట్లాడుతూ..తన వెయిట్‌లాస్ జర్నీలో కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నట్లు వివరించారు. తాను కూడా ఉదయం 6 గంటలకు ప్రతిరోజూ మూడు నెలల పాటు 45 నిమిషాలు ట్రెడ్‌మిల్‌పై చేసినా..తన బరువులో పెద్దగా మార్పులు కనిపించక వదిలేశానని పంచుకున్నారు. ప్రతిరోజూ డెడికేటెడ్‌గా వ్యాయామాలు చేస్తున్నప్పటికీ..కనిపించేంతగా కొలెస్ట్రాల్ తగ్గలేదని, బట్టలు సరిపోయే విధానంలో అస్సలు మార్పు కనపించలేదని చెప్పుకొచ్చారు. తన సమస్య వ్యాయామం చేయడం కాదని, ఒకేరకమైన వ్యాయమాన్ని అదేపనిగా చేయడమే అసలు సమస్య అని తెలిసందంటున్నాడు. శరీరం ఆ దినచర్యకు అలవాటుపడిపోయి..రాను రాను పెద్దగా ప్రభావం చూపించలేదని అన్నారు. అందుకే ట్రెడ్‌మిల్‌పై 45 నిమిషాలు గడపడానికి బదులుగా, వాలు స్థాయిలను మారుస్తూ 20 నిమిషాల పాటు వాలుగా నడిచే దినచర్యకు మారినట్లు తెలిపారు. ఈ వర్కౌట్లలో పరుగుల లేదు. మరి ఎలా చేస్తున్నారంటే..వాలుగా నడక: వేగం 3.5, వాలు 8, 5 నిమిషాల పాటు.నిటారుగా ఎక్కడం: వేగం 3.0, వాలు 12, 5 నిమిషాల పాటు.పవర్ వాక్: వేగం 3.8, వాలు 6, 5 నిమిషాల పాటు.కూల్ డౌన్: వేగం 2.5, వాలు 0, 2 నిమిషాల పాటు.ఈ పద్ధతికి మారిన కేవలం రెండు వారాల్లోనే తనలో స్పష్టమైన మార్పులు కనిపించాయని చెప్పారు. కష్టపడి పనిచేయడం కాదు, తెలివిగా చేస్తే బరువు తగ్గడం మంచి ఫలితాలు అందుకుంటారని అన్నారు. ఆవిధంగానే తాను 89 కిలోల నుంచి 65 కిలోలకు తగ్గినట్లు పేర్కొన్నారు. అయితే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తర్వాత గానీ లేదా ఉదయాన్నే లేవగానే గానీ, ఈ రొటీన్‌ను వారానికి మూడు నుంచి ఐదు సార్లు చేయాలని లోజేష్ సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం స్మార్ట్‌గా వర్కైట్లు చేసి స్లిమ్‌గా మారిపోండి త్వరగా..!. View this post on Instagram A post shared by 𝙇𝙊𝙅𝙀𝙎𝙃 (@im_lojeshofficial)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: అధిక ప్రోటీన్ ఆహారంతో జస్ట్ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్ ఇదే..) -
ఐదు పదుల వయసులోనూ యంగ్‌గా నటి శోభనా..! ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..
"యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే రాధా.."అన్న పాట రాగానే అలనాటి అందాల నటి శోభనా(actress Shobana) టక్కున గుర్తొస్తారు. ఆమె తన కళ్లతో అభినయం పలికించగల గొప్ప నటి. 90ల టైంలో అగ్ర తారగా ఓ వెలుగు వెలిగిన నటి. అంతేగాదు మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. కొంతకాలం సినిమాలకు దూరమై..నాట్యానికి జీవితానని అంకితం చేశారామె. మళ్లీ ఇటీవల కల్కి మూవితో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. తాజాగా బాలీవుడ్ నిర్మాత నితేష్ తివారీ ప్రతిష్టాత్మక పౌరాణిక ఇతిహాసం 'రామాయణం'లో కనిపించనున్నారు. అందులో రావణుడిగా నటిస్తున్న యశ్ తల్లి కైకేసి పాత్రను పోషించనుందామె. అలాగే ఆమె చెన్నైలో నృత్య అకాడమీ 'కళాతర్పణ'ను కూడా నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె 54 ఏళ్లు. ఈ వయసులోనూ అంతే గ్లామర్‌గా పిట్‌గా ఉంటారు శోభనా. తను ఇంతలా ఎనర్జిటిక్‌గా, హెల్దీగా ఉండటానికి కారణం ఏమిటో ఒక ఇంటర్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించారు. మరి ఆమె అనుసరించే ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఆమె భారత్‌లోనూ విదేశాల్లోనే నృత్య ప్రదర్శనలిస్తుంటారు. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో తప్పకుండా ప్రదర్శనలిస్తుంటారామె. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఫిట్‌గా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తానని చెప్పారామె. అలాగే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటానన్నారు. ఆమె ప్రోటీన్ షేక్‌లు, డైటింగ్ రెండిటిని పాటిస్తానని చెప్పారు. ఈ విధానం చూసి చాలా మంది ఆశ్చర్యపోతారని అన్నారు. అలా ఎందుకంటే తన ఆకలి ఎక్కువగా ఉంటుందని అందుకని ఇలా చేస్తానని అన్నారామె. తన బిజీ షెడ్యూల్‌కి అనుగుణంగానే ఆహారపు అలవాట్లు రూపొందించుకుంటానని తెలిపారామె. వేదికపై శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు కొనసాగిస్తున్నందున సమతుల్యమైన ఆహారమే తీసుకోవాలని చెప్పారు. అయితే తాను ఏడాదంతా ఒకేరకమైన డైట్ ప్లాన్‌ని పాటించనని చెప్పారామె. తన శరీరానికి అనుగుణంగా దినచర్యను మార్చుకుంటూ..బరువుని అదుపులో ఉంచడంపై అటెన్షన్ పెడతానని అన్నారామె. ఒక్కోసారి మూడు రోజుల డైట్‌ని పాటిస్తే..మరికొన్నిసార్లు ఏకంగా ఏడుసార్లు డైట్ పాటిస్తానని చెప్పారు. ఒక్కోసారి క్రాష్ డైట్ కూడా పాటిస్తానని ధీమాగా వెల్లడించారు. తను ప్రతిసారా కఠినమైన భోజన ప్రణాళిక అనుసరించకుండా అవసరమైనప్పుడల్లా షెడ్యూల్‌ని సర్దుబాటు చేసుకుంటానని తెలిపింది అందాల శోభన. దూరంగా ఉంచే ఆహారాలు..అధిక కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులకు చాలా దూరంగా ఉంటానని అన్నారు. పిజ్జా, బర్గర్లు, పాస్తా, బ్రెడ్, శాండ్విచ్లు, నూనెలో అధికంగా వేయించిన ఆహారాలకు బహుదూరంగా ఉంటానని చెప్పారామె. థాయి వంటకాలు, కొన్ని రకాల డెజర్ట్లంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. కాగా ఇక్కడ అందాల నటి శోభన కూడా తన శరీరం మాట వింటూ అందుకు అనుగుణంగా డైట్‌ని అనుసరిస్తున్నట్లు నొక్కి చెప్పారు. ఏ డైట్ అయినా గుడ్డిగా కాకుండా శరీరానికి పడేది..అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అని చెప్పకనే చెబుతోంది కదా ఈ నటి డైట్.(చదవండి: ఒంటరిగా ఫ్లైట్ జర్నీ..ఆ మహిళను ఎంతలా మార్చిందంటే?) -
తన బరువుతోనే అసలు యుద్ధం
కామన్వెల్త్... గ్లాస్గో... ఆదివారం రాత్రి. 31 ఏళ్ల మీరాబాయి చాను మళ్లీ నిరూపించింది. 48 కిలోల బరువు విభాగంలో 190 కిలోలు ఎత్తి హ్యాట్రిక్ గోల్డ్‌మెడల్ సాధించింది. కానీ ఈ బంగారం వెనుక ఒక అదృశ్య పోరాటం ఉంది. అది తానెత్తే బరువులతో కాదు... తన బరువుతో. పన్నెండేళ్లుగా మీరాబాయి 48 కిలోల బరువునే మెయింటైన్ చేస్తోంది. 2014లో గ్లాస్గోలో ఏ బరువుతో కామన్వెల్త్లో మొదటిసారి పాల్గొందో, 2026లో గ్లాస్గోలో కూడా అదే బరువుతో పాల్గొని మూడో బంగారం తెచ్చింది. మహిళలకు వయసు పెరిగే కొద్దీ బరువు పెరగడం సహజం. కానీ మీరా మాత్రం ఒకే బరువు, ఒకే క్రమశిక్షణ. ఆమె ఫిట్నెస్ రహస్యం ఏమిటి?‘వెయిట్లిఫ్టర్లం అనగానే అందరూ మేము విపరీతంగా తినేస్తాం అనుకుంటారు. కానీ అది తప్పు, మేం చాలా తక్కువ తింటాం. బ్రెడ్, పాలు కూడా ముట్టలేము. ప్రతి గ్రాముకూ లెక్క ఉంటుంది’ అంటుంది మీరాబాయి చాను. బరువులెత్తడంలో ప్రపంచ విజేతగా నిలుస్తున్న మీరాబాయి తన బరువు విషయంలో కూడా అంతే విజేత. ‘బరువు తగ్గడం సాధ్యం కావడం లేదు’ అనేవారికి మీరాబాయి 12 ఏళ్లుగా స్థిరంగా మెయిన్‌టెయిన్ చేస్తున్న బరువు తప్పక స్ఫూర్తి కలిగించవచ్చు.ఆమె విజయం సులభం కాదుప్రపంచ వేదికల మీద పతకాలు సాధిస్తున్న మీరాబాయి జీవితం మనకు కనిపించేంత గ్లామరస్ కాదు. ‘ట్రైనింగ్‌లో పిచ్చిగా కష్టపడాలి. లేదంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం’ అంటుందామె. సాధన ఒకటే కాదు గాయాలూ వెంటాడుతాయి. 2023లో తొడ గాయం. ఈ ఏడాది భుజం నొప్పి. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళలకు సహజంగా వచ్చే మెన్స్ట్రువల్ పెయిన్‌తో బాధ పడుతూనే పోటీ రోజు వేదిక ఎక్కింది. గ్లాస్గో పోటీకి కొన్ని రోజుల ముందు శిక్షణలో చిన్న గాయం. అయినా సాధన ఆపలేదు. కోచ్ విజయ్‌శర్మతో ఉదయం 5 గంటల నుండి బరువు ఎత్తే సాంకేతికతను వేలాదిసార్లు ప్రాక్టీస్ చేయడం. ఒక మిల్లీమీటర్ తేడా వచ్చినా పతకం జారిపోతుందని ఆమెకు తెలుసు.చిన్నప్పటి నుంచి కష్టాలుమణిపూర్లోని నోంగ్‌పోక్ కచింగ్ గ్రామం మీరాబాయిది. పేద కుటుంబం. మీరాకు ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు. తండ్రి రోజు కూలీ. తల్లి చిన్న టీ కొట్టు నడిపేది. చదువు 12వ తరగతితో ఆగిపోయింది. కానీ ఆమెకు బలం ఉండేది. ఆరేళ్ల వయసులో అన్నయ్య మోయలేని కట్టెల మోపును తనే మోసేది. ఇంట్లో బియ్యం బస్తాలు, నీళ్ల కుండలు లేవనెత్తేది. ‘ఈ పిల్లకు చేతుల్లో బలం ఉంది’ అని ఒక కోచ్ గుర్తించాడు. పన్నెండేళ్లకే ఇంటి నుండి ముప్పై కిలోమీటర్లు సైకిల్ తొక్కి ఇంఫాల్ స్టేడియానికి ప్రాక్టీసుకు వెళ్లేది. అమ్మ నగలు అమ్మి, అన్నయ్య జీతం నుండి డబ్బులు ఇచ్చి పోటీలకు పంపారు. 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనప్పుడు దేశమంతా విమర్శించింది. కానీ, ఆ విమర్శలనే ఇంధనంగా మార్చుకుని 2017లో ప్రపంచ ఛాంపియన్ గా, 2020 టోక్యోలో ఒలింపిక్ రజత విజేతగా నిలిచింది. ఈరోజు ఆమె ధరించే చెవిపోగులు రియోకు ముందు అమ్మ చేయించినవే. ‘అవి నాకు అదృష్టాన్ని తెస్తాయి’ అంటుంది.ముగింపుమీరాబాయి చాను మనకు నేర్పింది ఒకటే. బరువు తగ్గడం అంటే అందం కోసం కాదు. ఆత్మగౌరవం కోసం. ఆరోగ్యం కోసం. లక్ష్యం కోసం. శరీరం బరువు 48 కేజీలైనా ఆమె మనసు 140 కోట్ల భారతీయుల ఆశలను మోస్తోంది.‘నా శరీరం నా ఆలయం. దాన్ని బలంగా ఉంచుకోవడం నా బాధ్యత’ అంటుంది మీరాబాయి చాను. ఈ మాట ఒక్కటి చాలు. మనం కూడా మన శరీరాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి. ఆహార నియమాలుఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. 48 కిలోల క్రీడాకారిణిగా ఉండాలంటే ప్రతి గ్రామూ లెక్కే. పండగ భోజనం, జిలేబి ముక్క కూడా బరువు పెంచేస్తుంది. పోటీకి ముందు రోజులలో నీళ్లు కూడా తక్కువ తాగుతుంది. చెమట పట్టించి, సౌనా బాత్‌లో కూర్చుని ఆవిరితో ఒక్కో గ్రాము తగ్గిస్తుంది. మీరాబాయి ఫిట్‌నెస్‌కు 3 స్తంభాలు ఉన్నాయి. ఆహారం, సాధన, మానసిక బలం.1. ఆహారంఉదయం: గోరువెచ్చని నీళ్లు, తేనె, గుడ్డు తెల్లసొన, ఓట్స్, పండ్లు.మధ్యాహ్నం: ఉడికించిన చికెన్ లేదా చేప, గోధుమ రొట్టెలు, పెద్ద సలాడ్.సాయంత్రం: పాలు, బాదం, ప్రోటీన్ పానీయం.రాత్రి: సూప్, ఉడికించిన కూరగాయలు, పప్పు.నూనె, తీపి, వేయించిన పదార్థాలకు దూరం. రోజుకు 4 నుండి 5 లీటర్ల నీళ్లు. ఆకలి వేసినా నీళ్లు తాగి కంట్రోల్ చేస్తుంది.2. సాధనఉదయం: జిమ్‌లో సాంకేతిక సాధన. బరువు ఎత్తడం, పట్టు.మధ్యాహ్నం: కార్డియో, పరుగు, సైక్లింగ్, తాడు దూకడం. సాయంత్రం: యోగా, స్ట్రెచింగ్. గాయాలు రాకుండా శరీరాన్ని సాగదీయడం.ఒక్కరోజు కూడా సెలవు లేదు. ‘నా క్లాస్రూమ్ జిమ్’ అంటుంది.3. మానసిక బలం‘నా కళ్ల ముందు ఎప్పుడూ దేశ జెండా ఉంటుంది’ అంటుంది మీరా. గ్లాస్గోలో మొదటి ప్రయత్నం విఫలమైనా ఆందోళన చెందకుండా, స్మైల్ ఇస్తూ తర్వాతి రౌండ్లో రికార్డు కొట్టడం ఆమె మానసిక బలానికి నిదర్శనం. -
‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్‌కు చురకలు!
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగుల మెరపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలు సాధించిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా ఎగరేసుకుపోయాడు. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే టూర్‌కు గంభీర్ స్థానంలో కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న వైభవ్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. చిన్న వయసులో అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న వైభవ్ ఫిట్నెస్ విషయంలో మాత్రం మరింత కష్టపడాలని యాజమాన్యం కోరుకుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం లక్ష్మణ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. 'వైభవ్ గురించి మాకు బాగా తెలుసు. సుమారు రెండున్నరేళ్ల క్రితం, 2024 అండర్-19 ప్రపంచకప్‌నకు ముందే అతని ప్రతిభను గుర్తించాం. విజయవాడలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్‌లో ఇండియా-బి తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వైభవ్ ఒకడిగా ఉన్నాడు. అప్పటి నుంచి బీసీసీఐ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) క్యాంపుల్లో వైభవ్ నిరంతరం శిక్షణ పొందుతున్నాడు. అంతేకాదు అండర్-19 ప్రపంచకప్‌లోనూ వైభవ్ సూర్యవంశీ టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు. వైభవ్‌లో వచ్చిన పరిణతి, అవగాహన అసాధారణంగా పెరిగాయి. అందుకే కఠిన పరిస్థితులను సైతం తట్టుకుని, ఒత్తిడిలో మేటి ఆటగాళ్లపై రాణించగలుగుతున్నాడు. అయితే, అతను మెరుగుపరుచుకోవాల్సిన ముఖ్యమైన అంశం అతని ఫిట్నెస్. అతని వయసు కేవలం 15 ఏళ్లేనని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆఖరి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడినా, మైదానంలోనే ఉండాలని అతను కోరుకున్నాడు. కానీ, మా ఫిజియో సూచన మేరకు అతన్ని బయటకు పంపించాల్సి వచ్చింది. జట్టు కోసం ప్రతీ విషయంలోనూ ది బెస్ట్ అందించాలనే తపన అతనిలో ఉంది' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ये #VaibhavSooryavanshi के बारे में बात कर रहे है।“वैभव हर कीर्तिमान पार करेगा”इनका नाम VVS Laxman हैं जिन्हें तब की Mighty आस्ट्रेलियाई खिलाड़ी और मीडिया "Very Very special "Laxman" बोला करती थी।जिसने 134 टेस्ट मैच खेला है और कभी टीम इंडिया के मशहूर fab-4 का हिस्सा थे।…— Uday Yadav (@USY_79) July 27, 2026 -
సుందర్ సందేహమే!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్న భారత టెస్టు జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకు కసరత్తులు చేస్తోంది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయాలు సెలక్షన్ కమిటీని ఇబ్బంది పెడుతున్నాయి. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో చివరి వన్డేకు దూరమైన బుమ్రా... సుదీర్ఘ ఫార్మాట్లో బరిలోకి దిగడంపై సందేహాలున్నాయి. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్టు వరకు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు... శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో తొలి టెస్టు జరగనుండగా... 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్టు నిర్వహించనున్నారు. పేస్ ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కండరాల గాయాలతో ఇబ్బంది పడుతుండగా... వీరిద్దరు లంక పర్యటనకు వరకు కోలుకునే అవకాశం లేదని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) వెల్లడించింది. ‘సుందర్ రెండో టెస్టు వరకు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. దీంతో సెలక్టర్లు అతడిని కేవలం ఒక్క టెస్టుకే పరిగణించవచ్చు. అది కూడా ఫిట్నెస్ సాధిస్తేనే. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్యాదవ్తో పాటు... నాలుగో స్పిన్నర్‌గా హర్‡్ష దూబేకు అవకాశం దక్కొచ్చు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. శ్రీలంక ‘ఎ’ జట్టుతో సిరీస్‌లో భారత్ ‘ఎ’ తరఫున ఆకట్టుకున్న ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్‌ను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. లోయర్ ఆర్డర్లో చక్కటి బ్యాటింగ్ చేయగల సామర్థ్యం సారాంశ్ సొంతం. జీషాన్ అన్సారీ, విప్రాజ్ నిగమ్‌ను కూడా పరిశీలించవచ్చు. బుమ్రా అందుబాటులో లేకుంటే... మొహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకున్న ఆకాశ్‌దీప్ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. హార్దిక్ ఆగస్టు తర్వాతే... మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చే నెల తర్వాతే సెలక్టర్ల పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బెంగళూరుకు మకాం మార్చిన పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ‘వన్డే, టి20 ఫార్మాట్లు ఆడేందుకు హార్దిక్ సిద్ధమవుతున్నాడు. ఈ నెలాఖరులోగా అతడు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. వచ్చే నెలలో అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం బెంగళూరు సీఓఈలో అతడి సాధన సాగుతోంది. అటు ఫిట్నెస్ మెరుగు పరుచుకోవడానికి కృషి చేస్తూనే... పూర్తి స్థాయిలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. -
షేర్లకూ కావాలి ఫిట్నెస్!
తల్వాల్కర్ జిమ్... ఒకప్పుడు ఇదో మెరుపు. స్టాక్ మార్కెట్లో తొలి ఫిట్నెస్ కంపెనీగా లిస్టయింది. విపరీతంగా విస్తరించింది. భారీగా అప్పులు చేసింది. కట్‌చేస్తే... దివాలా తీసి తెరమరుగైపోయింది. ఇన్వెస్టర్లు మునిగిపోయారు. ఇపుడు కల్ట్ ఫిట్. హృతిక్‌రోషన్ దన్నుతో కొన్నేళ్లుగా ఇదో బ్రాండ్‌ను సృష్టించుకుంది. వీధివీధికీ విస్తరించింది. హృతిక్‌తో సహా ప్రస్తుత ఇన్వెస్టర్లకు ఎగ్జిట్ అవకాశమిస్తూ ఐపీఓకు వస్తోంది. డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. నిజానికి లిస్టయిన... లిస్ట్ కాబోతున్న అచ్చమైన ఫిట్నెస్ కంపెనీలు ఈ రెండే. ఒక కథ ముగిసింది. మరో కథ మొదలవుతోంది. కానీ ఇన్వెస్టర్లు చూడాల్సింది ఇది కాదు. వీటి చుట్టూ ఉన్న ఫిట్నెస్ ఎకానమీని. 15 ఏళ్ల కిందట ఫిట్నెస్ అంటే జిమ్. కానీ ఇపుడది జీవనశైలి. ఆ జీవనశైలిని అనుసరించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఎందుకంటే ఒకప్పుడు జిమ్‌కు వెళ్లేవారు... ఇపుడు నడుస్తున్నారు. పరుగులు పెడుతున్నారు. ట్రెక్కింగ్ చేస్తున్నారు. బ్యాడ్మింటన్, పికిల్ బాల్ ఆడుతున్నారు. స్మార్ట్‌వాచ్‌లతో అడుగులు లెక్కబెడుతున్నారు. లెక్కలు కట్టుకుని ప్రొటీన్ తింటున్నారు. ఏడాదికోసారి హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఇపుడు అవసరాలుగా మారిపోయాయి. మరి ఈ ఫిట్నెస్ ఎకానమీలో మెరిసే చాన్సున్న కంపెనీలేంటి? రిటైల్ ఇన్వెస్టర్లు గమనించాల్సినవేంటి? ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ప్రపంచ మధుమేహ రాజధానిగా మనదేశం మారటం... పెరుగుతున్న ఊబకాయం... యువతకూ గుండె సమస్యలు... ఇవన్నీ వ్యాయామాన్ని తప్పనిసరి మెడిసిన్ జాబితాలో చేర్చేశాయి. మధ్యతరగతి ఆదాయాలు పెరగటం... దానికి సోషల్ మీడియా ప్రచారం తోడవటంతో... యోగా, జిమ్, స్పోర్ట్స్ ఎరీనాలు, మారథాన్ ఈవెంట్లు, ప్రొటీన్ సప్లిమెంట్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్పోర్ట్స్‌వేర్ వంటి ఫిట్నెస్ ఎకానమీ వేగంగా విస్తరిస్తోంది. ఈ ఎకానమీలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన రంగాలు, కంపెనీల వివరాలివిగో...ఫిట్నెస్ సెంటర్లు నేరుగా బయటకు కనిపించే ఈ రంగంలో లిస్టెడ్ ప్లేయర్లు తక్కువే. తల్వాల్కర్స్ జిమ్ గతంలో లిస్టయినా రకరకాల కారణాల వల్ల దివాలా తీసేసి డీలిస్ట్ అయింది. కల్ట్‌ఫిట్ త్వరలో ఐపీఓకు వస్తోంది. అయితే గోల్డ్స్ జిమ్, ఎనీటైమ్ ఫిట్నెస్, స్నాప్ ఫిట్నెస్ వంటి అన్‌లిస్టెడ్ చెయిన్లు బాగానే రాణిస్తున్నాయి. ఈ రంగం వేగంగా పెరుగుతున్నా... లాభాలు తక్కువేనని చెప్పాలి. పెరుగుతున్న అద్దెలు, అధిక నిర్వహణ ఖర్చులు, తరచూ మారిపోయే కస్టమర్లు, ఒక సెంటర్లో ఎక్కువ మందికి ఏకకాలంలో అవకాశం ఇవ్వలేకపోవటం వంటివి జిమ్‌ల లాభాల్ని పరిమితం చేస్తున్నాయి.రియల్ ఎస్టేట్ మౌలికంగా జరుగుతున్న అతిపెద్ద మార్పు ఇదే. ఎందుకంటే పదేళ్ల కిందట ఇల్లు కొనేటపుడు ఎన్ని బెడ్రూమ్లు? అనేదే చూసేవారు. ఇపుడు క్లబ్‌హౌస్ ఎంత పెద్దది? అన్నదే ప్రధానం. ప్రధాన ప్రాజెక్టుల్లో ఒలింపిక్ సైజ్ స్విమింగ్‌పూల్స్, పూర్తిస్థాయి జిమ్‌లు, యోగా స్టూడియోలు, ఇండోర్ బ్యాడ్మింటన్, స్క్వాష్, సైక్లింగ్– జాగింగ్ ట్రాక్స్, యాక్టివిటీ పార్క్స్ సహజమైపోయాయి. డెవలపర్లు విక్రయిస్తున్నది కేవలం ఫ్లాట్లు కాదు. లైఫ్‌స్టైల్. వారి మధ్య పోటీ అంతా ఈ సౌకర్యాల్లోనే. ఈ రంగం విపరీతంగా పెరగటంతో పాటు లిస్టెడ్ సంస్థలూ ఎక్కువే ఉన్నాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ. డీఎల్ఎఫ్, శోభా డెవలపర్స్, కల్పతరు, లోధా, ఎన్సీసీ వంటి ప్రధాన కంపెనీల్ని ఇన్వెస్టర్లు వాచ్ చేయొచ్చు.స్పోర్ట్స్ రిటైల్ జాగింగ్‌కో, వాకింగ్‌కో వెళ్లినపుడే స్పోర్ట్స్ షూ వేయటమనేది పోయింది. నిత్యం వాడే పాదరక్షల్లో ఇది చేరిపోయింది. ఈ మార్పు స్పోర్ట్స్ రిటైల్‌ను ఆకర్షణీయ రంగంగా చేసింది. డెకాథ్లాన్, అడిడాస్, నైకీ, పూమా వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు... పేజ్ ఇండస్ట్రీస్ (అథ్లీజర్), క్యాంపస్ యాక్టివ్‌వేర్, బాటా, రిలాక్సో ఫుట్‌వేర్ వంటి లిస్టెడ్ సంస్థలనూ వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. న్యూట్రిషన్ఫిట్నెస్పై మనసు పెట్టేవారంతా... ఎక్కువ ప్రొటీన్... తక్కువ చక్కెర, హెల్తీ స్నాక్స్ వంటివి రెగ్యులర్ ఆహారాల్లో భాగంగా మార్చేసుకుంటున్నారు. దీంతో ప్రొటీన్ ఇపుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చేసింది. హెల్త్‌కార్ట్, ఫాస్ట్ అండ్ అప్, మజిల్ బ్లేజ్, జీఎన్సీ ఇండియా వంటి అన్‌లిస్టెడ్ కంపెనీలతో పాటు బ్రిటానియా, నెస్లే ఇండియా, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ వంటి లిస్టెడ్వీ ఉన్నాయి.హెల్త్‌కేర్ అనారోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఆసుపత్రుల కంటే డయాగ్నస్టిక్ కంపెనీలు, బీమా కంపెనీలు అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నాయి. ప్రధానంగా అపోలో హాస్పిటల్స్, డాక్టర్ లాల్ పాత్లాబ్స్, థైరోకేర్, మెట్రోపాలిటన్ హెల్త్‌కేర్, విజయా డయాగ్నస్టిక్స్ వంటి సంస్థలతో పాటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు.స్పోర్ట్స్ టూరిజంజనం ఇపుడు మారథాన్లు, సైక్లింగ్, ట్రెక్కింగ్, ట్రయాథ్లాన్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం రకరకాల ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ మారథాన్, లడఖ్ సైక్లింగ్, అడ్వెంచరస్ స్పోర్ట్స్ వంటివేవీ పదేళ్లకిందట పెద్దగా లేవు. కానీ ఇపుడు ఫిట్నెస్తో ట్రావెల్ డిమాండ్ కూడా పెరుగుతోంది. స్మార్ట్ వేరబుల్స్యాపిల్, శామ్సంగ్ వంటి విదేశీ లిస్టెడ్ కంపెనీలతో పాటు బోట్ వంటి దేశీ అన్‌లిస్టెడ్ సంస్థలూ వేరబుల్స్ మార్కెట్‌ను శాసిస్తున్నాయిపుడు. ఎందుకంటే స్మార్ట్‌వాచ్ అనేది కేవలం టైమ్ తెలియజేయటానికి కాదు. హార్ట్ రేట్ నుంచి మొదలు పెడితే... ఎన్ని అడుగులు నడిచారు? ఎంత సేపు మంచి నిద్రపోయారు? ఈసీజీ ఎలా ఉంది? ఒత్తిడి ఎంత ఉంది? కేలరీలెన్ని? ఇవన్నీ చెబుతోంది. అందుకే ఇది అతివేగంగా విస్తరిస్తూ... ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్లు ప్రవేశించడానికి కారణమవుతోంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ఇపుడిపుడే ఎదుగుతున్న రంగమిది. ఒకవంక స్పోర్ట్స్ ఇన్ఫ్రాపై ప్రభుత్వాలు భారీగా వెచ్చిస్తుండగా... మరోవంక ప్రయివేటు అకాడమీలూ వేగంగా పుట్టుకొస్తున్నాయి. ప్రత్యేక మారథాన్లు, సైక్లింగ్, బ్యాడ్మింటన్, పికిల్‌బాల్ వంటి క్రీడల్లో ఇన్ఫ్రా సౌకర్యాలు కల్పిస్తూ ప్రయివేటు ప్లేయర్లు ప్రవేశిస్తున్నారు. వీటన్నిటినీ చూశాక అనిపించేదొకటే!. దేశంలో ఫిట్నెస్ బూమ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీని లబ్ధిదారులెవరు? ఒకటి జిమ్‌లు. రెండు యాక్టివ్ లైఫ్‌స్టయిల్‌ను అలవాటుగా మార్చే కంపెనీలు!!. సమాధానం రెండే. ఎందుకంటే ఒక వ్యక్తి కల్ట్‌ఫిట్ జిమ్‌లో చేరి... ఆ తరవాత మానేశాడనుకోండి. తన ఫిట్నెస్ ప్రయాణం ఆగిపోదు కదా!!. తను స్పోర్ట్స్ షూలు వాడతాడు. ప్రొటీన్ పౌడర్ కొంటాడు. స్మార్ట్ వాచ్ పెట్టుకుంటాడు. రోజూ వాకింగ్ చేస్తాడు. తన కమ్యూనిటీలో క్లబ్‌హౌస్ ఉంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. ట్రెక్కింగ్‌కు వెళ్లడం... బ్యాడ్మింటన్ ఆడటం వంటివి చేస్తూనే ఉంటాడు. అంటే... తను చేసే ఖర్చు మారింది తప్ప ఆగిపోలేదు. -రమణమూర్తి మంథా -
హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్‌ప్లాన్!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించాలనే ఉద్దేశంతో అప్పటివరకు జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లకు అతడిని ఎంపిక చేయబోమని బీసీసీఐ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయం బారిన పడ్డ పాండ్యా కోలుకొని ఫిట్నెస్ సాధించిన పాండ్యాను మొదట అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ ఇదే సమయంలో పాండ్యాకు తొడ కండరాల్లో గాయం తిరగబెట్టడంతో ఆఫ్గన్‌తో పాటు ఇంగ్లండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరంలోనే చికిత్స తీసుకుంటున్న పాండ్యా పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నాడు. రేవ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం పాండ్యా తన ఫిట్‌నెస్‌పైనే పూర్తి దృష్టి సారించాడని తెలుస్తోంది. అందుకే పూర్తిగా కోలుకున్నా ఇప్పుడే టీమిండియాలోకి రాకూడదనే ఉద్దేశంతో పాండ్యా 'పర్ఫార్మెన్స్ బ్లాక్' పేరిట దీర్ఘకాలిక ఫిట్నెస్ టార్గెట్ చేసుకొని దానిని అనుసరిస్తున్నట్లు సమాచారం. 32 ఏళ్ల వయసున్న పాండ్యా ఇప్పటికే తన ప్రోగ్రామ్‌లో గరిష్ట ఫిట్నెస్ను సాధించేందుకు దగ్గర్లో ఉన్నాడని, అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ కూడా పాండ్యాను 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆచితూచి వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. అందుకే వన్డే ప్రపంచకప్‌లోపు జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పాండ్యాను ఎక్కువగా ఆడించే అవకాశం లేదనిపిస్తోంది. ఒకవేళ సెలెక్ట్ చేసినా అది 50 ఓవర్ల ఫార్మాట్ మాత్రమే అతడికి ప్రాధాన్యమివ్వనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా పాండ్యా కీలకం కానున్నాడని బీసీసీఐ బలంగా నమ్ముతోంది. అందుకే ప్రపంచకప్ సమీపిస్తుందనగా, అప్పుడు జరిగే వన్డే సిరీస్‌లకు పాండ్యాను ఎంపిక చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యాను ఆ ఫ్రాంచైజీ విడుదల చేయనుంది. దీంతో ట్రేడింగ్‌లో పాండ్యా కేకేఆర్ లేదా చెన్నై జట్లకు వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.Read: ‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’ -
76 ఏళ్ల వయసులోనూ అంతే ఫిట్‌గా రాకేశ్ రోషన్..! ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం..
బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్ రాకేష్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తాను రాణించలేకపోయినా..కుమారుడు హృతిక్ రోషన్‌ని వెండితెరకు పరిచయం చేసి హీరోగా వెలుగొందేలా చేశాడు. అలాగే దర్శకుడిగా, మంచి స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన వయసు 76 ఏళ్లు. ఈ వయసులో కూడా ఎంతో ఫిట్‌గా, స్మార్ట్‌గా ఉండటమే కాదు..యువ హీరోలకు తీసిపోని విధంగా గ్లామరస్‌గా కనిపిస్తుంటారు. ఆయన అంత ఏజ్‌లోనూ అంతలా ఎలా స్లిమ్‌గా చురుకుగా ఉన్నారు. అందుకోసం ఏం చేస్తుంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు వంటి విషయాల గురించి సవివరంగా చూద్దామా!.ప్రముఖ చిత్ర నిర్మాత రాకేశ్ రోషన్ 76 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్‌నెస పట్ల తనకున్న అచంచలమైన నిబద్ధతతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వృద్ధాప్యంలో కూడా ఎంతో చురుకుగా, శక్తిమంతంగా ఉండటానికి తనకు సహయపడిని అలవాట్ల గురించి తన కుమార్తె సునైనా రోషన్ ఇన్స్టాగ్రామ్ పేజీలో జరిపిన సంభాషణలో వెల్లడించారు. అంతేగాదు తాను అనుసరించే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి గురించి కూడా చెప్పారు. వయసు పెరిగే కొద్దీ మరింతగా శిక్షణ పొందాలని, అదే మనల్ని ఫిట్‌గా ఉంచుతుందని అన్నారు. 65 లేదా 70 ఏళ్ల తర్వాత భుజాలు వంగిపోయి, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చిన వారిని చూశానని అన్నారు. కఠినమైన డైట్ తోపాటు క్రమం తప్పకుండా జిమ్,వెయిట్ ట్రైనింగ్ చేస్తుతంటానని అన్నారు. మంచి ఆరోగ్యానికి వ్యాయామం కంటే ఆహారమే ముఖ్యమని అన్నారు. అంతేగాదు మనం ఆరోగ్యంగా ఉండటంలో వ్యాయామం కేవలం 10% మాత్రమేనని, మిగిలిన 90% తీసుకునే ఆహారమేనని అన్నారు. గత మూడేళ్లుగా ఇలాంటి జీవనశైలిని ప్రారంభించానని, ఇది తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. తాను బాగా నిద్రపోతానని, ఉత్సాహంగా మేల్కొంటానని చెప్పారు. అది ఇవాళ తనకొక దినచర్యగా మారిందని అన్నారు. వ్యాయామం చేయాలనే మూడ్ లేని రోజుల్లో ఏం చేస్తారని కుమార్తె అడగ్గా..అలా చాలా అరుదుగా జరుగుతుందని, ఆ టైంలో కూడా తనను తాను చేసేలా ప్రేరేపించుకుంటానని అన్నారు. తనకు బద్ధకంగా అనిపించి వ్యాయామం చేయాలనిపించకపోయినా..జిమ్‌లోకి అడుగుపెట్టి, తనకు సాధ్యమైనంత మేరకు వర్కౌట్లు చేస్తుంటానని అన్నారు. ఆయన అనేది శిక్షణ కంటే హాజరు ముఖ్యం అనుకుంటే..కనీసం వార్మప్ వ్యాయామాలైనా చేయగలుగుతామని అన్నారు. ప్రతిరోజూ ఎలాగైతే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం చేస్తామో, వ్యాయామం కూడా మన దినచర్యలో ఒక భాగం కావాలని అన్నారు. అలా అనుకుని చేస్తే ఆరోగ్య సమస్యల బారిన పడరని, పైగా పోరాడే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. అయినా అంతర్గతంగా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడు జీవితం చాలా సులభం అవుతుందని అన్నారు. ఇక కుమార్తె సునైనా రోషన్ సైతం..తండ్రి మాటలకు మద్దతిస్తూ.తాను కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతోనో తన ఆరోగ్యంలో నిజంగా పెద్ద మార్పు చోటుచేసుకుందంటూ తన అనుభవాన్ని పంచుకుంది. అందువల్లే తనకు గ్రేడ్1 ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిందని పేర్కొంది. కాగా, రాకేష్ రోషన్‌కు 2019లో గొంతు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నారు. అప్పటి నుంచి ఈ చిత్ర నిర్మాత క్రమం తప్పని వ్యాయామం, ఆలోచనాత్మకమైన ఆహారాన్ని తన దినచర్యలో భాగంగా చేసుకుని, మరింత క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకున్నారు. View this post on Instagram A post shared by Sunaina Roshan (@roshansunaina) (చదవండి: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖ్యలు) -
రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..
ఆరోగ్యం కోసం వ్యాయామాలు, వాకింగ్ , రన్నింగ్ వంటివి అన్ని చేస్తుంటాం. ఇది సర్వసాధారణం. చాలామంది రోజువారి దినచర్యలో భాగం కూడా. కానీ అదొక జస్ట్ రోజు చేసే ఒక సాధారణ దినచర్య కాదని, అంతకుమించి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా అంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిజాయితీగా వెల్లడించిన ఆ అభిప్రాయం నెటిజన్ల మనసుని హత్తుకుంది. ఆ వీడియోలో ప్రఖర్ నేగి అనే ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు తనకు 29 ఏళ్లు అని, స్థిరమైన ఉద్యోగం కూడా ఉందని చెప్పాడు. గురుగ్రామ్‌లో రాత్రి 7:30 గంటలకు తాను 15 కిలోమీటర్లు పరుగెత్తడానికి కారణం ఏదో తప్పనిసరి పరిస్థితులు కాదని, తనను కాపాడటానికి ఎవ్వరూ రారని తెలుసుకోవడమేనని అన్నారు. తాను సాధించాల్సిన లక్ష్యాలు తనంతట తానే సాధించుకోవాలని అన్నారు. ఇది అంగీకరించేందుకు కష్టంగా ఉన్నా..ఇదే నిజం అని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలనే ఆశావాదం పెంపొందించుకుంటే..ఏదైనా సాధ్యమేనని మనఃపూర్వకంగా విశ్వసించాలని అన్నారు. అలా రోజు చేయడం కాస్త కష్టం ఉన్నా..గొప్పగా లైప్ ఉండాలి, మరిన్ని చూడాలంటే తప్పదని అన్నారు. అలాంటి వాళ్ల గొప్ప విజయాలకు అర్హులని చెప్పారు. దయచేసి మీరు కూడా ఇలాంటి ఆశావాహ దృక్పథాన్నే అలవరుచుకోవాలని పిలుపునిస్తూ..అందరికీ "హ్యాపీ రన్నింగ్" శుభాకాంక్షలని చెప్పారు. నెటిజన్లకు ప్రఖర్ పంచుకున్న ఆలోచనలు ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు..ఆరోగ్యంగా ఉండటంపై మంచి స్ఫూర్తినిచ్చారు, ధన్యవాదాలు అని పోస్టులు పెట్టడం విశేషం. View this post on Instagram A post shared by Prakhar Negi (@negisdayintheliferunning) (చదవండి: కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..!) -
నైంటీ.. అయితే ఏంటి?
ఫిట్నెస్ అనేది కేవలం యువకులకు, బాడీబిల్డర్లకు మాత్రమే సొంతం కాదని నిరూపిస్తున్నాడు ఓ 90 ఏళ్ల వృద్ధుడు. ముసలితనం వచ్చిందని ఇంట్లోనే కూర్చోకుండా, జిమ్‌కు వెళ్తూ ఆయన చేస్తున్న కఠినమైన వర్కవుట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైకి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆకాష్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వృద్ధుడికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఈవిధంగా రాసుకొచ్చారు.‘జిమ్ అనేది కేవలం సిక్స్ ప్యాక్ కోసమో, కండలు పెంచి అందంగా కనిపించడం కోసమో మాత్రమే కాదు. అంతకు మించి.. వయసు పైబడిన వారు తమ దైనందిన పనులను ఎవరి సహాయం లేకుండా చేసుకోగలగడానికి, శరీర బ్యాలెన్స్ మెరుగుపరుచుకోవడానికి, కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం.’ మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలను కూడా శారీరక శ్రమ వైపు ప్రోత్సహించేలా ఉన్న ఈ వీడియో ఎంతో స్ఫూర్తిదాయకం. -
ఏఐ ఫిట్నెస్ యాప్స్‌ని నమ్మొచ్చా?
సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ ఫిట్నెస్ రంగంలోకి కూడా దూసుకొచ్చింది. మనం వ్యాయామం చేసే విధానాన్ని, లైఫ్‌స్టైల్‌ను ఇది పూర్తిగా మార్చేస్తోంది. ప్రతి ఒక్కరి శరీర తత్వానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ వర్కవుట్ ప్లాన్స్ ఇవ్వడం, న్యూట్రిషన్ నియమాలను సూచించడం, రోజువారీ పురోగతిని ట్రాక్ చేస్తూ రియల్–టైమ్ సమాచారాన్ని అందించడం వంటి ఎన్నో ఫీచర్ల తో ఏఐ యాప్స్ సరికొత్త ట్రెండ్‌ను సృష్టి్టస్తున్నాయి. అయితే ఈ ఏఐ ఫిట్నెస్ యాప్స్‌తో లాభాలెన్నో.. నష్టాలు కూడా అదేవిధంగా ఉంటాయంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.ఏఐ యాప్స్ డేటాను విశ్లేషించడంలో ఎంత నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, ఒక హ్యూమన్ కోచ్ స్థానాన్ని భర్తీ చేయలేవు. ఉదాహరణకు, ఎవరైనా డెడ్‌లిఫ్ట్ వ్యాయామం చేస్తున్నప్పుడు.. పొడవాటి కాళ్లు ఉన్న వ్యక్తి చేసే విధానం, పొట్టిగా ఉండే వ్యక్తి చేసే విధానం వేరువేరుగా ఉంటాయి. ఒక మంచి ఫిట్నెస్ కోచ్ మాత్రమే ఈ శారీరక వ్యత్యాసాలను గమనించి సరైన గైడెన్స్ ఇవ్వగలరు. కానీ ఏఐ యాప్స్ ఈ తేడాలను గుర్తించలేక, కరెక్ట్‌గా చేస్తున్నా తప్పు అని చెప్పే ప్రమాదం ఉంది.అంతేకాకుండా, గతంలో ఏవైనా గాయాలు అయ్యాయా? బాడీలో ఎక్కడైనా నొప్పి ఉందా? లేదా అలసట కారణంగా తప్పుగా చేస్తున్నారా? అనే మానవీయ కోణాలను ఏఐ అర్థం చేసుకోలేదు. ఇవి కేవలం మీ ఫిట్నెస్ను మెరుగుపరచడానికి మాత్రమే, ఏదైనా అనారోగ్యం లేదా గాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే.ఫోన్ లో సులభంగా ఫిట్నెస్ ప్లాన్ కావాలనుకునే వారికి, క్రీడాకారులకు ఏఐ యాప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామాన్ని మరింత సరదాగా మార్చుకోవడానికి ఇవి చక్కటి సాధనాలు. అయినప్పటికీ, ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ కోచ్ పర్యవేక్షణలో వీటిని వాడుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఏఐ ఫిట్నెస్ యాప్స్ చాలా అద్భుతమైనవే.. కానీ అవి ఎప్పటికీ ఒక నిజమైన కోచ్‌కి ప్రత్యామ్నాయం కాలేవు. -
ఇంతలో ఎంతలా మారిపోయారో? ఫొటోలు వైరల్
కరోనా వచ్చి వెళ్లిపోయిన తర్వాత చాలామందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తిండి, ఫిట్నెస్ చాలా అవగాహన పెంచుకుంటున్నారు. అందుకు తగ్గట్లే బరువు తగ్గుతూ సన్నగా మారిపోయి షాకిస్తున్నారు. ఇప్పుడు అలానే నటి ఖుష్బూ ఫ్యామిలీ కూడా మారిపోయింది. గతేడాది ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పటికీ ఇప్పుడు మరోసారి సదరు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే)ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీలో హీరోయిన్గా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఖుష్బూ తర్వాతి కాలంలో దర్శకుడు సుందర్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు అవంతిక, ఆనందిత అని ఇద్దరు కూతుళ్లు పుట్టారు. అయితే 2020 టైంలో వీళ్ల కుటుంబంలో అందరూ బొద్దుగా ఉండేవారు. దీంతో ఖుష్బూ కూతుళ్లపై ట్రోలింగ్ కూడా జరిగింది. తర్వాత కాలంలో బరువు తగ్గడంపై దృష్టి పెట్టి అంతా ఒకేసారి తగ్గిపోయి షాకిచ్చారు.గతేడాది వినాయక చవితి సందర్భంగా ఖుష్బూ పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫొటోతో అందరూ షాకయ్యారు. ఇప్పుడు కూతురు అవంతిక పెళ్లి సందర్భంగా మరోసారి అప్పుడలా ఉండేవారు ఇప్పుడిలా మారిపోయారు అని చెప్పి సోషల్ మీడియాలో ఈ నటి ఫ్యామిలీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అవంతిక.. శ్రవణ్ శ్రీనివాస్‌ని పెళ్లి చేసుకుంది. గోవాలో జరిగిన ఈ వివాహానికి చిరంజీవి, నాగార్జున, త్రిష, తమన్నాతో పాటు చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఘనంగా కూతురి పెళ్లి.. ఫొటోలు షేర్ చేసిన ఖుష్బూ) -
72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..
వెయిట్‌లాస్ జర్నీలో ఒక్కోక్కరిది ఒక్కో విధానం. వారి శరీరానికి అనుగుణమైన విధంగా..భారంగా కాకుండా నిలకడగా చేసేలా హెల్దీగా అధిక బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు చాలామంది. తాజాగా ఆ కోవలోకి మరో ఫిట్నెస్ ట్రైనర్ చేరారు. ఆమె తాను చేస్తున్న తప్పిదాలను సరిచేసుకుంటూ బరువు తగ్గి స్ఫూర్తిగా నిలిచారామె. అధిక బరువుని తగ్గించుకోవడానికి ఆంటకంగా ఉన్న అలవాట్లకు స్వస్తి పలికి మరీ ఏకంగా 23 కిలోలు తగ్గారు. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా అందుకోసం ఎలాంటి క్రాష్ డైట్లు, డిటాక్స్ టీలను తీసుకోలేదు. కేవలం తన వెయిట్‌లాస్ జర్నీలో చేస్తున్న తప్పులను సరిచేసుకుని మంచి ఫలితాలను అందుకున్నట్లు చెబుతోంది ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా. ఆమె ఏ అలవాట్లను వదులుకున్నారు..ఏ తప్పిదాలను పునరావృతం కానివ్వలేదంటే..అల్పాహారం మానేయడం..బరువు తగ్గాలనే ఉద్దేశంతో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మానేసేదాన్ని దాంతో విపరీతమైన ఆకలితో ఉండేదాన్ని అన్నారు. ఫలితంగా జీవక్రియ మందగించేది. అదీగాక నేరుగా రాత్రిపటే తినేదాన్ని అన్నారు. దీని వల్ల తెలియకుండానే ఎక్కువ తినేయడం, బరువులో పెద్దగా మార్పులు కనిపించకపోవడం గమనించి ఆ విధానాన్ని పూర్తిగా మానేశానని చెప్పారు. ఆ తర్వాత నుంచి నిద్రలేచిని గంటలోపే తినడం మొదలు పెట్టానని అన్నారు. చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం..జ్యూస్‌లు, చక్కెరతో కూడిన టీ, కోల్డ్ కాఫీ వంటి ద్రవాలు ఆరోగ్యకరమైనవిగా అనిపించినా..అవి ఎంతమంది మంచివి కావని అన్నారు. అందుకు బదులుగా నీళ్లు, బ్లాక్ కాఫీ, చక్కెర లేని సాధారణ టీ తీసుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన ఫుడ్స్ మోతాదు మేరకే..మఖానా, డ్రై ఫ్రూట్స్, పీనట్ బటర్ వంటివి ఆరోగ్యకరమైనవే అయినా..మోతాదు మేరకు తీసుకుంటేనే మంచివని అన్నారు. ఎంత పోషకవంతమైనదైనా..కేలరీల లెక్క మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి అదనపు మోతాదులు త్వరగా కేలరీలను పెంచేస్తాయన్నారు. వెయిట్ ట్రైనింగ్ అస్సలు చేయకపోవడం..తాను బరువులు ఎత్తడం మొదలు పెట్టాకే శరీరంలో నిజమైన మార్పు రావడం కనిపించింది. ట్రెడ్‌మీల్ మీద గంటల తరబడి ఉండటం కంటే..ఇలాంటివి మంచివని తెలుసుకున్నానని అన్నారు. తక్కువ నిద్ర, ఎక్కువ ఒత్తిడిరాత్రిపూట ఆలస్యంగా నిత్రపోవడం, కార్డిసాల్ స్థాయిలు అధికంగా ఉండటం తదితరాల వల్ల తెలియకుండానే అధికంగా తినాలేన కోరక కలుగుతుందని అన్నారు. మంచి ఆరోగ్యానికి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరని అన్నారు. బయట తినడం మానేయడం..రెస్టారెంట్ భోజనం అప్పడప్పుడు పర్లేదనే భావన తప్పుడు ఆలోచన అని అంటోంది. ఇంటి భోజనమే మంచిదని, వెయిట్‌లాస్ కోసం ప్రయత్నించేవారికి ఇది అత్యంత ముఖ్యమని పేర్కొంది. చీట్ మీల్ వద్దు..పోనీలే సరదాగా పిజ్జా, కేక్ చిన్న ముక్కే కదా వంటివి వద్దు. ఏది చేసినా..పరిపూర్ణత కంటే..నిలకడగా చేయడం అనేది అత్యంత ప్రధానం అని గ్రహించండని నొక్కి చెబుతోంది. మంచి సమయం లేదా..అనుకూలమైన రోజు అంటూ గడపడం ఏ దినచర్య పాటించడానికి అయినా..క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. ఏ మార్పు చేసినా..సరైన సమయం కోసం కాకుడం వెంటనే ఆచరించడండని అన్నారు.ప్రతీరోజు ఆలోచనాత్మకంగా ఆరోగ్యదాయకమైనవి ఎంచుకుంటూ స్థిరంగా బరువు తగ్గడం కీలకం. అదే మిమ్మల్ని నాజూకుగా మారుస్తుందని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా నెట్టింట షేర్ చేశారు.గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి. View this post on Instagram A post shared by Shikha Surana (@coachshikhasurana) (చదవండి: Weight Loss: 144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్, నో ట్రైనర్ జస్ట్..) -
144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్, నో ట్రైనర్ జస్ట్..
ఒక పారిశ్రామిక వేత్త అత్యంత అధిక బరువుతో నరకం చూశాడు. బరువు తగ్గేందుకు ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. చివరికి ఒక రోజు తీవ్ర అనారోగ్యం పాలవ్వడమే మేల్కోలుపుగా మారి..అతడి వెయిట్‌లాస్ పరివర్తను నాంది పలకింది. అలా ఓపికతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు ప్రయత్నించి సఫలమవ్వడమే గాక తనలా ఇబ్బంది పడుతున్నవాళ్లు కూడా స్లిమ్‌గా మారాలని '3ఈ' ఫిట్నెస్ సెంటర్‌ని కూడా స్థాపించాడు. అంతేగాదు అందరు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అంటూ తన వెయిట్‌లాస్ స్టోరీని షేర్ చేస్తూ..ఆరోగ్య స్పృహ కలిగిస్తున్నాడు.అతడే 'ADSMITH' వ్యవస్థాపకుడు నీరజ్ ఝూ. తన సంస్థ బాధ్యతలతో తలామునకలవ్వుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. దాంతో అతడు ఏకంగా 144 కిలోల బరువుతో ఊబకాయంతో ఇబ్బందిపడేవాడు. అలాంటి వ్యక్తి కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 65 కిలోలు తగ్గి.. సుమారు 79 కిలోల బరువుకు చేరుకున్నాడు. అయితే దీని కోసం ఎలాంటి వెయిట్‌లాస్ మందులు, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్, జిమ్ వంటి వాటి జోలికి పోకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తన బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలిచాడు. అతడు తన పాత అలవాట్లకు స్వస్తి పలకాలనే దృఢమైన సంకల్పంతోనే స్లిమ్‌గా మారానని చెబుతున్నాడు. తాను వృత్తిపరంగా సక్సెస్ అందుకున్నా..అందుకు మూల్యం తన శరీరం చెల్లించాల్సి వచ్చిందంటాడు. తనకు ఆ అధిక బరువుతో అస్సలు నిద్ర పట్టేది కాదని, పైగా వొంట్లో అస్సలు శక్తి ఉండేది కాదని, చాలా ఆయాసంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. అయితే తాను కూడా అందరిలా బరువు తగ్గే ప్రయత్నం మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసేవాడినని చెప్పుకొచ్చాడు. శరీరం బాగా అలిసిపోయినట్లుగా అనిపించి, మధ్యలో స్కిప్ చేసేవాడినని అన్నాడు. కానీ బయట వాళ్ల నుంచి వచ్చే ఛీత్కారాలకు భయపడి మళ్లీ బరువు తగ్గే ప్రయత్నాలు చేసేవాడినని చెప్పుకొచ్చాడు. ఐసీయూ తెచ్చిన మేల్కొలుపు..ఒకరోజు తీవ్రం అనారోగ్య బారినపడి, ఆస్పత్రిలో చేరినప్పుడు నరకం చూశానని, నాటి సంఘటనను గుర్తు తెచ్చుకున్నాడు. చాలాసార్లు ఆస్పత్రిలో చేరాను కానీ ఆవేళ మాత్రం తన పరిస్థితి ఘెరంగా ఉందని, తీవ్రమైన ఎల్‌ఆర్‌టీఐ(దిగువ శ్వాసకోశ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) కారణంగా శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు. వైద్యులు బైపాప్ యంత్రాన్ని అమర్చారు. అది తనకు ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలనే కనువిప్పుని కలగజేసిందన్నారు. అంతేగాదు చాలా ఏళ్ల తర్వాత హాయిగా నిద్రపోయినట్లు పేర్కొన్నారు. అప్పుడే తెలిసింది ఏళ్లుగా తాను ఊపిరాడక సతమతమయ్యాననని తెలుసుకున్నానని అన్నాడు. అసలు బరువు తగ్గించుకుంటే తనకు ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదని తెలిసి వచ్చిందని అంటాడు నీరజ్. అయితే అందరిలా జిమ్, ట్రైనర్ల జోలికిపోకుండా ..చాలామందిలా జిమ్‌లో జాయినవ్వడం, ఫిట్నెస్ ట్రైనర్లను పెట్టుకోవడం వంటివి చేయకుండా..ప్రాథమికంగా తాను చేయగలిగే వాటిపై దృష్టిపెట్టాడు. ముందు నిలకడగా వ్యాయామాలు చేసేలా చిన్నగా ప్రారంభించాడు. అలాగే ఆహారపరంగా కేలరీలోటు మంత్రని అనుసరించాడు. చిన్నగా వాకింగ్ మొదలుపెట్టి..నెమ్మదిగా అధిక దూరాలకు నడిచేలా కేర్ తీసుకున్నాడు. అలాగే పదే పదే వెయిట్ చెక్ చేయడం వంటివి కూడా చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఒత్తిడి మనల్ని ఆహారం తినేలా ప్రోత్సహిస్తుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేసినట్లు తెలిపాడు. మంచి లేదా చెడు జరిగినా కూడా..నిశబ్దంగా పరిస్థితిని అంగీకరిస్తూ..ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు దూరంగా ఉన్నట్లు తెలిపాడు. దాంతో దాదాపు 120 కిలోలు తగ్గానని చెప్పుకొచ్చాడు నీరజ్. అయితే ఆ తర్వాత మాత్రం తన శరీరంలో అంగుళం కడా మార్పు రాకపోవడంతో షుగర్‌కి సంబంధించిన వాటన్నింటిని దూరం పెట్టి, అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకున్నట్లు తెలిపాడు. అలా గుడ్లు, చికెన్, చేపలు, పనీర్, గ్రీక్ యోగర్ట్, కూరగాయలు తీసుకోవడం వంటి మార్పులు చేసినట్లు తెలిపాడు. అలాగే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించి రెండు పుల్కాలు వంటివి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే బిస్కెట్లు, అధిక చక్కెర ఉండే పండ్లకు, మద్యంకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. అలా 18 నెలలు కష్టపడగా చివరకు 79 కేజీల బరువుకి చేరుకున్నట్లు తెలిపారు. తాను పూర్తిగా ఇదివరకటి నీరజ్‌లా రూపుదిద్దుకున్నట్లు చెప్పుకొచ్చారు ఆ మూడు సూత్రాల ఆధారంగా..అలా తనలా మరింత మంది చక్కగా స్లిమ్‌గా అవ్వాలనే ఉద్దేశ్యంతో 3E ఫిట్నెస్ను స్థాపించాడు. తన జీవితాన్ని మార్చిన మూడు సూత్రాలపై ఈ వెల్నెస్ ఫ్లాట్‌ఫామ్‌ని ప్రారంభించాడు. ఆ మూడు Eలు – చెప్పేది..సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండటం. వైద్యులు సైతం ఆయన అనుసరించిన వెయిట్‌లాస్ జర్పీపై ప్రశంసల జల్లులు కురిపించారు. నెమ్మదిగా, స్థిరంగా బరువు తగ్గడం వల్ల శరీరం జీవక్రియ, హార్మోన్ల స్థాయి మెరుగ్గా ఉండటమే కాకుండా కండర ద్రవ్యరాశిని నిలుపుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. అలాగే మళ్లీ తిరిగి బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. ఎప్పుడైనా బరువు తగ్గడం అనేది మానసిక భారంలా కాకుండా..చిన్నగా వాకింగ్, తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెడితే సునాయాసం బరువు తగ్గగలరని చెబుతున్నాడు నీరజ్. ఇక్కడ కేవలం వదులుకోకుండా నిలకడతో క్రమం తప్పకుండా చేస్తే.. తప్పక సత్ఫలితాలను అందుకోగలమని, అందుకు నిదర్శనం తానేనని చెబుతున్నాడు. -
‘జీలం’ ఒడ్డున అద్భుత యోగా విన్యాసాలు
శ్రీనగర్: నేడు(ఆదివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో జమ్ముకశ్మీర్ లోయలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. పచ్చని ప్రకృతి, గలగల పారే జీలం నది కలయిక మధ్య సరికొత్త యోగా జోష్ కనిపించింది. ఫిట్నెస్, మానసిక ప్రశాంతతను చాటిచెబుతూ జమ్ముకశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్వహించిన ఈ ప్రత్యేక ఈవెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.జీలం నది సాక్షిగా యోగాసనాలుఅంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శ్రీనగర్‌లోని జీలం నది ఒడ్డున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కనువిందు చేసే కాశ్మీరీ లోయల నేపథ్యంలో సాగిన ఈ వినూత్న వెల్నెస్ సెషన్లో వందలాది మంది యోగా ప్రేమికులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చల్లని నదీ తీరాన ప్రకృతితో మమేకమవుతూ ప్రతి ఒక్కరూ వివిధ రకాల యోగాసనాలను ప్రదర్శించి ఫిట్‌నెస్‌పై తమకున్న మక్కువను చాటుకున్నారు.క్రీడాకారుల అద్భుత ప్రదర్శనఈ విశేష వేడుకలో వివిధ క్రీడా విభాగాలకు చెందిన అథ్లెట్లు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. నిత్య జీవితంలో ఎదురయ్యే శారీరక, మానసిక ఒత్తిళ్లను అధిగమించడానికి యోగా ఏ విధంగా తోడ్పడుతుందో ఈ సందర్భంగా క్రీడాకారులు ఆచరించి చూపించారు. క్రీడల్లో రాణించాలన్నా, నిత్యం చురుగ్గా ఉండాలన్నా యోగాను మించిన సాధనం లేదని ఈ కార్యక్రమం ద్వారా వారు నిరూపించారు.సరికొత్త చైతన్యం వైపు అడుగులుభారతీయ ప్రాచీన సంస్కృతి అయిన యోగా విశిష్టతను ప్రతి ఒక్కరికీ చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రోజువారీ జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే తమ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. కాశ్మీర్ లోయలో నిర్వహించిన ఈ వినూత్న ప్రయత్నం మరింత మందిని యోగా వైపు నడిపించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..
బరువు తగ్గడం అంటే స్ట్రిక్ట్ డైట్, కఠినతరమైన వ్యాయామాలు అనే భావిస్తారు. ఈ వెయిట్‌లాస్ జర్నీని భారం, అలసటతో కూడిన కష్టసాధ్యమైన సవాలుగా భావిస్తారు. దాంతో కొంత వరకు చేసి మధ్యలో స్వస్తి పలుకుతారు. ఫలితంగా అధిక బరువు తగ్గించుకోలేకపోతున్నాం అంటూ నిరాశనిస్ప్రుహలకు లోనవ్వుతుంటారు. ఆవిధంగా కంటే నిధానంగా శరీరం అలసటకు లోనవ్వకుండా మెరుగైన ఫలితాలు పొందాలంటే ఆ నాలుగు రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అంటోంది కంటెంట్ క్రియేటర్ సుల్లివన్ డ్రేపర్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ సుల్లివన్ డ్రేపర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో సులభంగా బరువు తగ్గడం ఎలాగో పంచుకున్నారు. బరువు తగ్గడం అంటే వీలైనంత తక్కువ తినడం, కాదు, అలసిపోయేంత వ్యాయామాలు చేయడం అస్సలు కాదని అంటోందామె. ఇక్కడ లక్ష్యం బరువు తగ్గడం ఒక్కటే కాదు..మొత్తం ఆరోగ్య శ్రేయస్సు అని గ్రహించమని చెబుతోంది. అందుకే సులభంగా ఇష్టపూర్వకంగా బరువు తగ్గమని పిలుపునిస్తోందామె. అలా చేసే..పొట్టిగా ఉండే తానే తొమ్మిదికేజీల వరకు తగ్గానని చెబుతోంది. తాను ఇది కఠినమైన డైటింగ్లు, తీవ్రతతో కూడిన వర్కౌట్లు చేయకుండానే సాధించానని చెబుతోంది. అందుకోసం ఈ నాలుగు రూల్స్‌ని పాటించానని వీడియోలో తెలిపారువెయిట్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంసుల్లివన్ ప్రకారం, వర్కౌట్ తర్వాత అలసిపోతున్నాననే భావనను వెంబడించడం మానేసి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌పై దృష్టి పెట్టడం ప్రారంభించినప్పుడే అతిపెద్ద మార్పు వచ్చింది. "కండరాలను పెంచుకోవడం తోటే ఆ టోన్డ్ లుక్‌ను ఇస్తుందని ఆమె వివరించారు.కండరాలను కాపాడుకోవడం వల్ల కాలక్రమేణా సన్నగా ఉండటం సులభం అవుతుందని, ఎందుకంటే కండర ద్రవ్యరాశికి మద్దతు ఇవ్వడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుందని ఆ కంటెంట్ క్రియేటర్ తెలిపారు. ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ప్రయత్నించే బదులు, ఆమె బలంగా మారడంపై దృష్టి పెట్టారు.కేలరీల లోటును ఆపడంఆమె పోస్ట్‌లోని అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి ఆమె ఆహారం తీసుకునే విధానం. తాను కేలరీ లోటుని ఇష్టపడనన్నారు. ఎక్కువ కాలం కేలరీల లోటులో ఉండటం వల్ల ప్రజలు అలసిపోయినట్లు అనిపించి, వారి ఫలితాలను నిలబెట్టుకోవడం కష్టతరం అవుతుందని అంటోంది. అందుకే తాను శరీరంలోని కొవ్వును కోల్పోయిన తర్వాత, ఆమె రివర్స్ డైటింగ్ విధానాన్ని అనుసరించానని, ప్రోటీన్ వినియోగాన్ని ఎక్కువగా ఉంచుతూ నెమ్మదిగా తన కేలరీల తీసుకోవడాన్ని పెంచుతానని చెప్పారు.వాకింగ్..తీవ్రమైన వర్కౌట్లు తరచుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ, సుల్లివన్ సాధారణ కదలికల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రోజువారీ నడకలు,తక్కువ-తీవ్రత గల కార్డియో తన శక్తి స్థాయిలను పెంచడానికి, ఆకలిని నియంత్రించడానికి, మొత్తం ఫిట్‌నెస్‌కు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయని అన్నారు. ప్రతిరోజూ కఠినమైన వర్కౌట్ దినచర్యలపై ఆధారపడకుండా, ఆమె నడకను ఒక సాధారణ అలవాటుగా మార్చుకున్నారు.తరుచుగా వెయిట్ చెక్ చేయొద్దు..చాలా మంది వెయిట్ మిషన్‌పై చిన్న మార్పులను చూసి వెంటనే తాము కొవ్వు పెరిగామని అనుకుంటారు. బరువులో హెచ్చుతగ్గులు ఉంటాయి. అంతమాత్రాన కొవ్వు పెరగడం కాదని అంటున్నారామె. ఆమె ఇప్పుడు ఒక ఖచ్చితమైన సంఖ్యపై దృష్టి పెట్టడానికి బదులుగా, ఆరోగ్యకరంగా బరువు తగ్గడమే తన లక్ష్యంగా నిర్ణయించుకున్నాని చెప్పారామె.ఇక్కడ సుల్లివన్ డేపర్ ప్రయాణం చిన్న, నిలకడైన అలవాట్లు దీర్ఘకాలంలో బరువు నిర్వహణను ఎంత సులభతరం చేస్తాయో తెలియజేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి..స్మార్ట్‌గా మారే ప్రయత్నం చేయండి మరి.. View this post on Instagram A post shared by sullivan draper (@sullivan.draper)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పీసీఓఎస్‌తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..! కానీ ఆ ఐదు పొరపాట్లు..) -
నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్
ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవన శైలి, సమతుల ఆహారం, కనీసం వ్యాయామం అవసరమని ఆరోగ్యనిపుణులు నిరంతరం చెప్పేమాట. దాదాపు 93 ఏళ్ల వయసులోనూ సగం వయసున్న వారి కంటే ఎక్కువ ఫిట్నెస్తో జీవించాలంటే ఏం చేయాలి? శాస్త్రవేత్తలనే అబ్బుర పరిచిన ఇటలీకి చెందిన ఎమ్మీ మరియా మజ్జెంకా (Emma Maria Mazzenga) ఫిట్నెస్ రహస్యాల గురించి తెలుసుకుందాం.ఇటలీలోని పాడువా నగరానికి చెందిన 92 ఏళ్ల ఎమ్మీ మరియా మజ్జెంకా ఒక రిటైర్డ్ హైస్కూల్ సైన్స్ టీచర్. 90-94 ఏళ్ల విభాగంలో పలు ప్రపంచ రికార్డులను సృష్టించిన ఎలైట్ స్ప్రింటర్ (పరుగు పందెం క్రీడాకారిణి). ఆమె శారీరక దృఢత్వంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా అద్భుతమైన విషయాలు వెలుగు చూశాయి.ఆమె శరీరం ఆక్సిజన్‌ను గ్రహించి, కండరాలకు సరఫరా చేసే సామర్థ్యం ప్రస్తుతం 30 ఏళ్ల యాక్టివ్ యువతులలో ఉన్నంత శక్తివంతంగా ఉంది. కణాలకు శక్తిని అందించే మైటోకాండ్రియా (Mitochondria) పని తీరు 20 ఏళ్ల యువతలో ఉన్నంత బలంగా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. వ్యాయామం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను పూర్తిగా మార్చేయవచ్చని ఎమ్మీ జీవితం నిరూపిస్తోందని వ్యాయామ ఫిజియాలజిస్ట్ సిమోన్ పోర్సెల్లి పేర్కొన్నారు.ఎమ్మీ ఫిట్నెస్ వ్యూహం గంటల తరబడి కష్టపడే మారథాన్లపై ఆధారపడలేదు. ఆమె కేవలం క్రమశిక్షణ (Consistency) ను నమ్ముకున్నారు.వర్కౌట్ ప్లాన్ఆమె వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే వర్కౌట్ చేస్తారు. ప్రతి సెషన్ గంట లోపే ఉంటుంది. ఆమె సుదీర్ఘ పరుగు పందాల్లోనూ పాల్గొనరు.తేలికపాటి జాగింగ్‌తో వార్మప్, కొన్ని షార్ట్ స్ప్రింట్స్ (వేగవంతమైన పరుగు), ప్రతిరోజూ అవుట్డోర్ వాకింగ్, అప్పుడప్పుడు తేలికపాటి రెసిస్టెన్స్ వ్యాయామాలు అంతే ఆమె రొటీన్.ఇక ఆహార నియమాలువిషయానికి వస్తే..పెద్దగా నియంత్రణలు కూడా ఏమీలేవు. కఠినమైన డైట్ జోలికి వెళ్లరు. కానీ చాలా తేలికపాటి సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా చేపలు, గుడ్లు, కూరగాయలు ఎక్కువగా తింటారు. అయితే, తనకు నచ్చినప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా మాంసం కూడా తింటూ సమతుల్యతను కాపాడుకుంటారు.90 ఏళ్ల వయసు దాటినా కూడా శరీరం వ్యాయామానికి ఎంతో అద్భుతంగా స్పందిస్తుందని ఎమ్మీ మరియా మజ్జెంకా జీవితం ప్రపంచానికి నిరూపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మీ జీవనశైలి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వృద్ధాప్య మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంది.WHO ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు పాటించాల్సిన రూల్స్ వారానికి కనీసం 150 నుండి 300 నిమిషాల మధ్యస్థ-తీవ్రత కలిగిన వ్యాయామం, లేదా 75 నుండి 150 నిమిషాల కఠినమైన వ్యాయామం .శారీరక సమతుల్యత , కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలను వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువ రోజులు చేయడం వల్ల కింద పడకుండా ఉండటంతో పాటు ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది.కదలికలు లేకుండా కూర్చునే అలవాట్లను మానుకుని, కేవలం తేలికపాటి వాకింగ్ చేసినా కూడా వృద్ధాప్యంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా? -
92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..
తొమ్మిది పదుల వయసులో వృద్ధాప్యాన్ని దిక్కరించేలా చురుగ్గా ఉందామె. సింపుల్‌గా చెప్పాలంటే 30 ఏళ్ల వ్యక్తిలా ఉంది. ఆమె కండరాల శక్తి, యాక్టివిటీని చూసి శాస్త్రవేత్తలే విస్తుపోయారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు మించి తీవ్రమైన వ్యాయామాలు చేస్తంటుంది. పైగా 60 దాటినవారు చేయకూడని వ్యాయమాలే అయినా..ఈ బామ్మ మాత్రం చాలా సునాయాసంగా చేసేస్తుంది. అంతేగాదు ఆమెను చూడగానే తొమ్మిది పదుల వయసు ఉన్న వ్యక్తిలా కనిపించదు..జస్ట్ 30 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఇంతలా యంగ్‌లుక్‌లో ఆశ్చర్యపరుస్తున్న ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఆ బామ్మ పేరే ఎమ్మా మరియా మజెంగా. ఇటలీలో పాడువాలో నివశిస్తున్న రిటైర్డ్ సైన్స్ టీచరమ్మ. ఆమె ఎన్నో ప్రపంచిరికార్డులు కలిగి ఉన్న అగ్రశ్రేణి స్ప్రింటర్. పరుగు పందెంలో ఆమెకు సాటిలేరెవ్వెరూ అన్నట్లుగా ఎన్నో పతకాలు సొంతం చేసుకుందామె. వయసు పరంగా 90 ఏళ్లు పైబడిన వ్యక్తిలా ఉండదు..30 ఏళ్ల మాదిరిగా కనిపిస్తోంది. వృద్ధాప్యాన్నే ధిక్కరించేలా హెల్దీగా ఉండే తీరు శాస్త్రవేత్తలను సైతం అబ్బురపర్చింది. వాళ్లు సైతం ఆమె ఆరోగ్యంపై స్టడీ చేయగా..ఆమె శరీరంలోని కండరాలు..30 ఏళ్ల వ్యక్తుల మాదిరిగా శక్తిమంతంగా ఉన్నాయని చెప్పారు. తొంభై ఏళ్ల వయసులో కూడా ఈ రన్నింగ్ పోటీల్లో ఎలా పాల్గొనగలుగుతోందే అనే కుతూహలంతో ఆమె శరీరం తీరుపై పరిశోధన చేయగా..30 ఏళ్ల క్రీడాకారుల ఫిట్‌నెస్‌ని పోలి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అంతేగాదు ఆక్సిజన్‌ను శక్తిగా మార్చే మైటోకాండ్రియా, ఆమె కండరాలలోని 20 ఏళ్ల యువకుడిలో ఉన్నంత దృఢత్వంతో పనిచేస్తోందట. ఎమ్మా కథ వ్యాయామ దినచర్య వృద్ధాప్యాన్ని తిరగరాయగలదని చెబుతోంది. అయితే గంటల తరబడి మారథాన్ చేయదామె..కేవలం నిలకడతో తేలికపాటి వ్యాయామాలోతోనే ఈ ఫిట్‌నెస్‌ని సాధించిందామె. ఎమ్మా చేసే వ్యాయామం గంటలోపే పూర్తవ్వుతుందట. వార్మప్, తేలికపాటి జాగింగ్, లక్షిత స్ప్రింట్ల శ్రేణి, వాకింగ్, చిన్నపాటి తీవ్రత వ్యాయామాలు ఉంటాయంతే. అలాగే డైట్ పరంగా గుడ్లు, చేపలు, కూరగాయలపై దృష్టి పెడుతూ..సమతుల్యత పాటిస్తానంటోందామె.ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలుఎమ్మా జీవనశైలి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం దీర్ఘాయువు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్వకాలను అనుగుణంగా ఉంటుందట. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం డబ్ల్యూహెచ్ఓ వారమంతా 150 నుంచి 300 నిమిషాల తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను, లేదా 75 నుంచి 150 నిమిషాల అధిక-తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను సిఫార్సు చేస్తుంది. అలాగే పడిపోవడాన్ని నివారిస్తూ..ఎముకల ఆరోగ్యం కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు శక్తి శిక్షణకు ప్రాధాన్యతనిచ్చే వర్కౌట్లను సూచించింది. అలాగే వృద్ధులు తమ వ్యక్తిగత ఫిట్‌నెస్‌కు అనుగుణంగా తమ శ్రమ స్థాయిలను సర్దుబాటు చేసుకోవాలని WHO స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎమ్మా వంటి వారు అందుకు విభిన్నమని తొంభైలో కూడా యువకుల మాదిరి అధిక తీవ్రత వ్యాయమాలు చేయగలరని తెలుస్తోంది. View this post on Instagram A post shared by The Washington Post (@washingtonpost) (చదవండి: నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..) -
బరువు తగ్గాలంటే.. మోయాలంతే!
స్మార్ట్ ఉండాలంటే ఆలోచిస్తే సరిపోదు.. ఫిట్‌గా కూడా ఉండాలి. అలాంటప్పుడే బ్రెయిన్ బాగా పని చేస్తుంది. పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది ఫిట్సెస్ సెంటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. వ్యాయామాల్లో కూడా కొత్త విధానాలొచ్చేస్తున్నాయి. జిమ్, ఏరోబిక్స్, యోగా లాంటివి..కాని ఇవ్వన్నీ కామన్.. ఇప్పుడు కొత్తరకం ఫిట్నెస్ మంత్ర వచ్చింది అదే ‘రక్కింగ్’.కొత్త ఫిట్నెస్ ట్రెండ్ ఇప్పుడు బాగాప్రాచుర్యం పొందుతోంది. ఈ పద్ధతిలో ఒక నిర్దిష్ట బరువున్న వెస్ట్‌ను లేదా బ్యాక్‌ప్యాక్‌ను ధరించి నడస్తూ వెళ్లాలి. అలా అనుకున్న టార్గెట్ వరకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఒకసారి టార్గెట్ పూర్తయ్యాక నడకలో కాస్త వేగాన్ని పెంచాలి. అమెరికా, యూరప్‌లలో ఇప్పటికే ఈ పద్ధతిని లక్షల మంది ఫాలో అవుతున్నారు.ఈ రక్కింగ్ వల్ల కాళ్ల కండరాలు రక్తప్రసరణ జరిగి ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. వాస్తవానికి ఇదేం కొత్త పద్ధతేం కాదు.. మిలటరీ శిక్షణలో భాగంగా సైనికులకు తుపాకీ, బ్యాక్‌ప్యాక్ ఇచ్చి నడిపిస్తారు. ఈ పద్ధతినే జనబాహుళ్యంలోకి తీసుకొచ్చి కొత్తరకం ఫిట్నెస్ సూత్ర అంటూ ప్రచారం చేస్తున్నారు. కాని ఊబకాయంతో బాధపడేవారికి మాత్రం ఈ రక్కింగ్ పద్ధతే కరెక్ట్... పైగా రక్కింగ్ చేయడానికి జిమ్‌లకు, యోగా క్లాసులకు వెళ్లక్కర్లేదు. ఎవరైనా ఇంట్లో ఉంటూ రక్కింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. -
ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..!
బరువు తగ్గడం ఒక్కోక్కరికీ ఒకోలా ఉంటుంది. కొందరు సులభంగా బరువు తగ్గితే..కొందరికీ అది భారంగా ఉంటుంది. కాఈ ఇక్కడ ఈ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అధిక బరువు ఏ రేంజ్లో ఉందంటే తగ్గుతుందామె అనే ప్రశ్న కలిగేలా ఉంది. అంత అధిక బరువును తగ్గించుకునేందుకు ఉపక్రమించి..చాలా కొద్ది టైంలో మంచి పలితాన్ని అందుకుంది. పైగా ఓ హీరోయిన్ మాదిరి స్మార్ట్ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఆ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటరే కాజల్. తన బరువు తగ్గే ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్యుమెంట్ చేస్తూ..ఏడాది లోపే 101 కేజీల నుంచి 65 కేజీలకు ఎలా తగ్గిందో పంచుకుంది. ఆమె వీడియోల ప్రకారం, కాజల్ ఆగస్టు 2025లో తన పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఏడు నెలల్లో దాదాపు 36 కేజీలు తగ్గారు. అందుకోసం డైట్ విషయంలో చాలా కేర్ తీసుకున్నానని, అదే తనను ఇంతలా బరువు తగ్గేలా చేసిందని చెప్పుకొచ్చింది. భోజన ప్రణాళిక..తొలిరోజు..ఆమె వారంలోని మొదటి రోజు ఒక సాధారణమైన, సమతుల్యమైన ఇంట్లో వండిన భోజనంతో మొదలవుతుంది. ఉదయం, ఆమె నానబెట్టిన ఐదు నట్స్‌తో ఒక కప్పు జీరా నీటిని తాగుతుంది. ఆ తర్వాత పుదీనా చట్నీతో రెండు చిన్న బేసన్ చిల్లాలను ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంగా తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక గిన్నెడు పండ్లు అంటే.. మాగ్జిమ్ బొప్పాయితో పాటు, ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలను ఇష్టపడుతానని అన్నారు. మధ్యాహ్న భోజనంలో అర కప్పు బ్రౌన్ రైస్, శనగపప్పు, బెండకాయ కూర ఉంటాయి. తర్వాత, ఆమె 20 గ్రాముల వేయించిన మఖానాతో ఒక కప్పు గోరువెచ్చని హెర్బల్ టీ తాగుతుంది. రాత్రి భోజనంలో, ఆమె టోఫు బుర్జీ, వేయించిన బీన్స్, ఒక బాజ్రా రోటీ తింటుంది.రెండవ రోజురెండవ రోజు, కాజల్ జీరా నీటికి బదులుగా నానబెట్టిన చియా గింజలతో గోరువెచ్చని నిమ్మ నీటిని తీసుకుంటుంది. అల్పాహారంగా సోయా చంక్స్‌తో వెజిటబుల్ పోహా తింటుంది. ఆమె ఉదయం పూట అల్పాహారంగా ఒక పూర్తి ఆపిల్, ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తింటుంది. తర్వాత మధ్యాహ్న భోజనంలో రెండు రోటీలు, పెసరపప్పు, సొరకాయ కూర, సలాడ్ తీసుకుంటుంది. సాయంత్రం అల్పాహారం కోసం, కాజల్ ఒక కప్పు మజ్జిగ, వేయించిన శనగలను ఎంచుకుంటుంది. ఆమె తన రోజును 100 గ్రాముల పాలక్ పనీర్, ఒక జొన్న రొట్టె, దోసకాయ రైతాతో ముగిస్తుంది.3వ రోజుఆమె 3వ రోజు భోజనాలు సాదాసీదాగా కడుపు నింపే వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె ఉదయాన్ని అలోవెరా షాట్, గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత రాగి దోస, ప్రోటీన్ అధికంగా ఉండే సాంబార్, చట్నీ తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక జామకాయ, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తింటుంది. మధ్యాహ్న భోజనంలో ఒక చిన్న జొన్న రొట్టె, కందిపప్పు, పాలకూర కూర, సలాడ్ ఉంటాయి. సాయంత్రం, ఆమె చియా గింజలు, బెర్రీలు లేదా దానిమ్మ గింజలతో కలిపిన తీపి లేని గ్రీక్ పెరుగు గిన్నెను ఎంచుకుంటుంది. రాత్రి భోజనంలో వెజిటబుల్ క్వినోవా పులావ్, దోసకాయ-టమోటా సలాడ్ ఉంటాయి.4వ రోజుకాజల్ 4వ రోజు భోజన ప్రణాళిక నానబెట్టిన మెంతి గింజల నీరు, వెజిటబుల్ ఉప్మాతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక బేరీపండు, 8-10 నానబెట్టిన ఎండుద్రాక్షలు తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో, ఆమె మిల్లెట్ ఖిచిడీ, కచ్రీ తింటుంది. సాయంత్రం, ఆమె నిమ్మరసం తాగి, హమ్మస్‌తో రెండు రైస్ కేక్‌లు తింటుంది. రాత్రి భోజనంలో సోయా కూర, ఒక రోటీ ఉంటాయి.5వ రోజుఆమె తన రోజును నిమ్మ-అల్లం నీళ్లు, నానబెట్టిన ఐదు వాల్నట్లు, కూరగాయలు, గ్రీన్ చట్నీతో కూడిన ఓట్స్ చిల్లాతో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత, ఈ కంటెంట్ క్రియేటర్ పండ్లు, గింజలు, ఆపై మధ్యాహ్న భోజనంలో రెండు బాజ్రా రోటీలు, మసూర్ పప్పు, బెండకాయ కూర, సలాడ్ తింటుంది. సాయంత్రం, ఆమె మజ్జిగ వేయించిన వేరుశెనగలు తింటుంది. రాత్రి భోజనంలో పనీర్ టిక్కా, వేయించిన జుకినీ,అర కప్పు బ్రౌన్ రైస్ ఉంటాయి.బరువు తగ్గే ఫలితాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నప్పుడు నిలకడ, పరిమాణ నియంత్రణ, సమతుల్య ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యత అత్యంత ముఖ్యమని అంటున్నారు కాజల్. అప్పుడే చక్కటి ఫలితాలను సత్వరమే అందుకోగలమని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Fit kajal (@flex_fit_kajal) (చదవండి: 'సక్సెస్'కి సరైన నిర్వచనం ఇదే..! తొలిసారిగా పేరెంట్స్‌ని..) -
నాలుగు నెలల్లో 15 కిలోలు తగ్గాలంటే..! ఈ ఐదు సింపుల్ చిట్కాలతో..
బరువు తగ్గాలంటే చక్కని డైట్లు, ఫోర్స్బుల్ వ్యాయామాలు చేస్తుంటారు. శరీరానికి భారం కలిగించేలా ఇలాంటి వర్కౌట్లతో బరువు తగ్గడం ఎలా ఉన్నా.. సమస్యలే ఎక్కువ. కొందరు తగ్గకపోగా..మరింత బరువు పెరుగుతారు. అలా కాకుండా శరీరానికి హాయినిచ్చేలా సులభంగా చేసే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేయడమే గాక సులభంగా బరువు తగ్గగలుగుతారని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా.!.15 కిలోల బరువును విజయవంతంగా తగ్గించుకున్న ఆమె తన వెయిట్‌లాస్ జర్నీని సాధారణమైన రోజువారీ జీవనశైలి అలవాట్లతో ప్రారంభించినట్లు తెలిపారు. ఏం చేసినా..స్కిప్ చేయకుండా నిలకడగా చేస్తే తప్పక ఫలితం పొందగలమని అంటోందామె. తాను తీవ్రమైన వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్ల జోలికి పోకుండా తగ్గానని చెబుతోంది. అందుకోసం ఏం చేసిందో కూడా షేర్ చేశారామె. వాకింగ్..ఇది కార్షియో వ్యాయామంలా పనిచేస్తుంది. కుదిరినప్పుడల్లా మెట్లు ఎక్కండి, లిఫ్టులు వాడండి.నీరు తాగడం..నిద్రలేవగానే నీళ్లు తాగండి, గోరువెచ్చని నీరైనా.మరే ఏవిధంగానైన నీటిని ఎక్కువగా తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చేసుకోండి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. దీనివల్ల రోజంతా మన శక్తిని స్థిరంగా ఉంచుతుంది.ఫైబర్‌ను మర్చిపోవద్దుప్రోటీన్ ముఖ్యమే, కానీ ఫైబర్ కూడా అంతే ముఖ్యమని గుర్తించండి. అదుకోసం భోజనంలో మంచి మొత్తంలో ఫైబర్‌ను చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.ఇంట్లో వండిన ఆహారంప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా ఇంట్లో తయారు చేసిన వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల పదర్థాఆల పరిమాణాలు, వంట పద్ధతులపై ఒక నియంత్రణ ఉంటుంది. అలాగే అధిక సోడియం, ఉప్పుని తగ్గించే వీలు కూడా ఉంటుంది.కేలరీ లోటుతినే ఆహార పరిమాణాలను అర్థం చేసుకోండి. ద్రవరూప క్యాలరీల పట్ల జాగ్రత్త వహించండి. పండ్ల రసాల కంటే ఎల్లప్పుడూ పండ్లనే తినండి. కొవ్వును తగ్గించుకోవడానికి, కొద్దిపాటి కేలరీ లోటును పాటించాల్సి ఉంటుంది.తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, ఫిట్నెస్ లక్ష్యాలను సాధించాలని చూస్తున్న వారికి, ఈ సాధారణ అలవాట్లు చాలా బాగా హెల్ప్ అవుతాయని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. (చదవండి: 76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..) -
నాపై ఒత్తిడి పెరిగింది.. ఇకపై: వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానన్నాడు. అయితే, చిన్న వయసులోనే వచ్చిన ఈ ‘అమితాదరణ’ ఒక్కోసారి తనను ఒత్తిడిలోకి నెట్టేస్తుందని తెలిపాడు.గతేడాది.. పద్నాలుగేళ్ల వయసులో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా సత్తా చాటి వరల్డ్‌కప్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.ఆరెంజ్ క్యాప్ విజేతఇక ఐపీఎల్-2026లో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్తాన్ ఓపెనర్‌గా ఈసారి పూర్తి స్థాయిలో బరిలోకి దిగి.. ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకోవడంతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ తదితర అవార్డులు గెలుచుకున్నాడు.ఈ క్రమంలో ప్రజెంటర్, టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రితో మాట్లాడుతూ వైభవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘అందరూ నా గురించి మాట్లాడుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది. అయితే, వరుస ఇంటర్వ్యూలు నాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. నేను గర్వించదగ్గ క్షణం ఇది.నాపై ఒత్తిడి.. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానువచ్చే సీజన్లోనూ ఇలాగే ఆడటానికి ప్రయత్నిస్తాను. కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని జయించడం ఎలాగో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మ్యాచ్.. మ్యాచ్‌కూ నా ఆట తీరు మారుతుంది. పరిస్థితులకు తగ్గట్లుగా.. జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడతాను. ఈ సీజన్లో నేను నేర్చుకున్న ప్రధాన అంశాలు ఇవే.ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం ఫిట్నెస్ మీదే ఉంది. నేను సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించాలంటే.. గాయాల బారిన పడకుండా ఉండాలి. అందుకోసం ఫిట్‌గా ఉండాలి. మా జట్టు మొత్తం నాకు అండగా నిలబడింది. సీనియర్ల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్ మనీ?! -
76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..
బరువు తగ్గడం అనగానే తీవ్రమైన జిమ్ సెషన్లు, అధిక వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్ తప్పనిసరని అనుకుంటాం. అలాగే చాలామంది శ్రమతో కూడిన వ్యాయామాలు చేసి..చివరికి శరీరం అలిసిపోయి..మా వల్ల కాదని మధ్యలోనే వెయిట్‌లాస్ జర్నీని వదిలేస్తుంటారు. అయితే అలా ఇబ్బందిపడకుండా కొద్దిపాటి వ్యాయామాలతోనే సులభంగా కేజీల కొద్దీ బరువు తగ్గొచ్చని అంటున్నారు ఫ్యాట్ లాస్ కోచ్. కీళ్లపై అధిక ఒత్తిడిని కలిగించకుండా, కేలరీలను బర్న్ చేసే చిన్నపాటి వ్యాయామాలు కూడా ఉన్నాయని అంటున్నురామె. అదెలాగో తెలుసుకుందామా.!.అధికబరువుతో ఉండి కొవ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే..వర్కౌట్లు చాలా ప్రభావవంతంగా ఉంటాయంటున్నారామె. అయితే కీళ్లకు నొప్పి కలిగించి, ప్రేరణను దూరం చేసే అధిక ప్రభావ వ్యాయామాలతో ప్రయత్నించమని చెబుతున్నారు. మోకాళ్లు, కీళ్లను దెబ్బతీయకుండా కొవ్వును కరిగించే, క్రమబద్ధమైన, తక్కువ-ప్రభావం, అధిక-తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకోమని చెబుతున్నారు.స్టాండింగ్ జాక్స్తక్కువ-ప్రభావం గల స్టాండింగ్ జాక్స్ మీ హృదయ స్పందన రేటును పెంచడానికి మరియు కేలరీలను కరిగించడానికి కీళ్లకు అనుకూలమైన మార్గం. ఒక పాదాన్ని నేలపై ఉంచడం ద్వారా, మొత్తం శరీరాన్ని నిమగ్నం చేస్తూనే ప్రభావాన్ని తగ్గిస్తారు. కొవ్వు తగ్గించే కోచ్ నియంత్రిత కదలికతో 20 సార్లు చేయమని సిఫార్సు చేస్తున్నారు.స్టాండింగ్ హై నీస్ఒక పాదాన్ని నేలపై ఉంచి, మోకాళ్లను మీ ఛాతీ వరకు పైకి లేపండి. ఈ వ్యాయామం మీ కోర్‌ను తీవ్రంగా నిమగ్నం చేస్తుంది, హృదయ స్పందన రేటును పెంచుతుంది. చేసే వేగం ఆధారంగా కచ్చితంగా ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తారనేది ఆధారపడి ఉంటుంది. అందుకోస ఆన్లైన్ కేలరీ బర్న్ కాలిక్యులేటర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ కదలికను స్థిరమైన వేగంతో 20 సార్లు యండి.పల్స్ స్క్వాట్స్ఈ బాడీవెయిట్ వ్యాయామం కీళ్ళను సురక్షితంగా ఉంచుతూనే,క్వాడ్స్ (తొడ ముందు కండరాలు), గ్లూట్స్ (పిరుదులు), కోర్ (శరీర మధ్యభాగం) కండరాలను ఉత్తేజపరుస్తుంది. సాధారణ స్క్వాట్‌లో ఉండే పూర్తిగా నిలబడి, తిరిగి యధాస్థానానికి వచ్చే కదలికను తొలగించడం ద్వారా,కండరాలపై నిరంతర ఒత్తిడిని ఉంచుతారు. ఇది లీన్ కండరాలను నిర్మించడానికి, జీవక్రియ రేటు పెంచడానికి సహాయపడుతుంది.వాల్ క్లైంబర్పాదాలను నేలపై స్థిరంగా ఉంచి, 30 రెప్స్ చేయడం వల్ల భుజాలు, ఛాతీ, కోర్ కండరాలు ఉత్తేజితమవుతాయి. ఇది హృదయ స్పందన రేటును పెంచుతూ, మోకాళ్లు కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల కేలరీలను కరిగించడంలో సహాయపడే కార్డియోవాస్కులర్ ప్రభావం ఏర్పడుతుంది.వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి(చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి) -
ట్రంప్ హెల్త్ రిపోర్ట్: ఫుల్ ఫిట్.. కానీ..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై నెలకొన్న సందేహాలకు వైట్ హౌస్ తెరదించింది. త్వరలో 80వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ట్రంప్.. తన విధులను నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఆరోగ్యంతో ఉన్నారని తాజాగా విడుదలైన వైద్య నివేదిక వెల్లడించింది. అయితే దీర్ఘకాలం పాటు ఆయన ఉత్సాహంగా ఉండాలంటే బరువు తగ్గడంతో పాటు వ్యాయామంపై దృష్టి సారించాలని వైద్యులు సూచించారు.పూర్తిగా ఫిట్.. కానీ జాగ్రత్తలు అవసరంవాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో ట్రంప్‌నకు వైద్య పరీక్షలు జరిగిన అనంతరం, వైట్ హౌస్ ఫిజీషియన్ డాక్టర్ సీన్ బార్బబెల్లా అధికారిక నివేదక విడుదల చేశారు. ట్రంప్ తన కమాండర్ ఇన్ చీఫ్ విధులను నిర్వహించడానికి ఎటువంటి శారీరక ఇబ్బందులు లేవని నివేదిక తెలిపింది. ఆయన బరువు 238 పౌండ్లు ఉండగా, గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 73 సార్లుగా నమోదైంది. వైద్యపరంగా అన్ని అవయవాల పనితీరు సాధారణ స్థితిలోనే ఉన్నదని, క్యాన్సర్ స్క్రీనింగ్‌తో పాటు గుండె సంబంధిత పరీక్షలన్నీ సజావుగా సాగాయని అధికారులు తెలిపారు.మేధో శక్తికి పక్కా స్కోరువయసు రీత్యా ట్రంప్ మేధస్సుపై వస్తున్న విమర్శలకు ఈ నివేదిక గట్టి సమాధానం ఇచ్చింది. పూర్తిస్థాయి నాడీ సంబంధిత పరీక్షలు నిర్వహించగా, ట్రంప్ 30కి 30 మార్కులు సాధించి, తన మానసిక పదునును నిరూపించుకున్నారు. గతంలో పలుమార్లు ఆయన సభల్లో కళ్లు మూసుకోవడంపై వచ్చిన విమర్శలను ట్రంప్ కొట్టిపారేశారు. అలసట వల్ల కాకుండా, కేవలం విశ్రాంతి కోసమే అలా చేస్తానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత ఆరోగ్య స్థితిని కాపాడుకునేందుకు ఆయనకు వ్యక్తిగత ఆహార నియమాలు, వ్యాయామాలపై ప్రత్యేక సూచనలు చేశారు.నిరంతర పర్యవేక్షణలో ఆరోగ్యంనివేదికలో పేర్కొన్నట్లుగా, ట్రంప్ చేతులపై ఉన్న స్వల్ప రంగు మార్పులు తరచుగా షేక్‌హ్యాండ్స్ ఇవ్వడం, గుండె ఆరోగ్యం కోసం తీసుకునే ఆస్ప్రిన్ మందుల ప్రభావమేనని వైద్యులు వివరించారు. ఈ చిన్నపాటి సమస్యలు మినహా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని వెల్లడించారు. గతంలో ఆరోగ్యంపై వచ్చిన వదంతులను పక్కనపెట్టి, ఇప్పుడు సూచించిన జీవనశైలి మార్పులను ట్రంప్ పాటించాలని డాక్టర్లు కోరారు. -
ఫిట్నెస్... ఫర్ స్ట్రెస్!
గ్లామర్ రంగంలో ఉంటూ ఫిట్నెస్ ద్వారా ప్రభావం చూపిన అతి కొద్దిమంది వ్యక్తులలో మిళింద్ సోమన్ ఒకరు. చాలామందికి రిటైర్ మెంట్ తీసుకునే 60 ఏళ్ల వయసులో ఆయన యువతరానికి గొప్ప స్ఫూర్తిని ఇస్తూనే ఉండడం విశేషం.‘యూరప్ నుంచి ఆఫ్రికా దాకా 15 కి.మీ దూరం సముద్రంలో ఈత కొట్టాను. అదో అందమైన అనుభవం’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు మిళింద్ సోమన్. బాడీ ఫిట్నెస్తో దేశంలో తరచు చర్చనీయాంశం గా మారే ఏకైక సెలబ్రిటీ మిళింద్. తెరపై నటుడిగా ఆయన సినిమా ప్రేక్షకులకు మాత్రమే పరిచితులు కావచ్చు.. ఫిట్నెస్ ఐకాన్‌గా మాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి.సూపర్ మోడల్ టూ సూపర్ రన్నర్...ఆయన ప్రయాణం 1990లలో సూపర్ మోడల్‌గా నిలవడంతో మొదలైంది. ఆ తర్వాత జుర్మ్ , ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరోవైపు దాదాపు పాతికేళ్లుగా రన్నింగ్ ట్రాక్ మీద సాటిలేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సుదూరప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అనూహ్యమైనప్రాంతాల్లో పరుగులు తీయడం ద్వారా ఫిట్‌నెస్‌కు సరికొత్త అర్థాన్ని చె΄్పాడు. చెప్పులు లేకుండా పరుగెత్తడంలో కూడా ఆయన పాపులర్.పింక్‌థాన్.. మహిళలకు ఇన్స్పిరేషన్ప్రస్తుతం దాదాపు ప్రతినగరంలో సర్వసాధారణంగా మారిన మారథాన్లు, ఫిట్నెస్ ఈవెంట్స్‌కు ఆయన దాదాపు దశాబ్దమున్నర క్రితమే రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి లేదని గమనించాక... మహిళల కోసం ప్రత్యేకించి ఒక ఈవెంట్‌ను రూపకల్పన చేయాలన్న ఆలోచనతో గత 2012లో, సోమన్, ఆయన భార్య అంకితా కోన్వర్‌లు కలిసి ప్రారంభించిన పింక్‌థాన్ ఈవెంట్ ప్రస్తుతం మన దేశంలోనే అతిపెద్ద మహిళల రన్నింగ్ ఈవెంట్ గా అవతరించింది.హిట్... ఫిట్... ఫీట్స్ ఎన్నో...50 ఏళ్ల వయసులో గత 2015లో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో జరిగిన ఐర¯Œ మ్యాన్ ట్రయాథ్లాన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. 3.86 కిలోమీటర్ల ఈత, 180.25 కిలోమీటర్ల సైకిల్ రైడ్, 42.2 కిలోమీటర్ల పరుగును కలిపి... 15 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశాడు.2017లో ఫ్లోరిడాలో 3రోజుల పాటు జరిగిన, 517 కిలోమీటర్ల ట్రయాథ్లా¯Œ లో భాగంగా 10 కిలోమీటర్ల ఈత, 421 కిలోమీటర్ల సైకిల్, 84.4 కిలోమీటర్ల పరుగు పూర్తి చేశాడు.సిక్స్ ΄్యాక్ కాదు... స్ట్రెస్ బ్యాక్ ముఖ్యంకండలు తిరిగిన శరీరం కన్నా తన దృష్టిలో ఫిట్నెస్ అంటే ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యమేనంటాడు సోమన్. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన అభి్రపాయం. ఎంతో డబ్బు వెచ్చించి జిమ్‌లకు వెళ్లడానికి బదులు పుష్–అప్స్ పుల్–అప్స్ వంటి సహజమైన బాడీ వెయిట్ వ్యాయామాలపై దృష్టి పెట్టాలని, స్వల్పకాలిక శిక్షణ కంటే రోజువారీ కదలికకుప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నాడు. సమతుల్యమైన, ΄ోషకాహారం కోసం ఇంటి భోజనానికేప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నాడు.30 రోజుల్లో 1500 కి.మీ. పరుగు తీయడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.59 ఏళ్ల వయసులో ఐదు రోజుల్లో పూణే నుంచి వసాయి వరకు 240 కి.మీ. పరుగెత్తాడు. – ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్ మస్ట్
అందరికీ స్మార్ట్‌గా, స్లిమ్‌గా అవ్వాలని ఉంటుంది. కానీ తక్కువటైంలోనే తగ్గాలనేది అందరి కోరకి. కానీ ఆ క్రమంలో శరీరం కాస్త ఒత్తిడికి గురై బరువు తగ్గడం ఎలా ఉన్నా అధిక బరువు పెరిగిపోతుంటాం. అలాంటి వాళ్లు హెల్దీ కమ్ స్పీడ్‌గా బరువు తగ్గేందుకు ఈ 15 రూల్స్‌ని ఫాలో అయితే చాలని అంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్. కేవలం చీటింగ్‌కి తావు లేకుండా క్రమశిక్షణతో కూడిని దినచర్యకు కట్టుబడి ఉంటే చాలని అంటున్నారామె. అలాంటప్పుడే ఈ 15 నియమాలు చాలా సమర్థవంతంగా ఫలితాలనిస్తాయిని చెబుతున్నాడు.క్రమబద్దమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు, సరైన నిద్ర, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించే డెడికేషన్ తదితరాలు ఉంటే 30 రోజుల్లో బరువు తగ్గడం సులభమేనని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్. అందుకోసం ప్లాన్ ఎలా ఉండాలో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నియంత్రిత ఆమారం, అధిక ప్రోటీన్‌తో కూడినా ఆహారాలు, శారీరక శ్రమ వంటి వాటితో కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెబుతున్నారు రాషిద్. అందుకోసం స్ట్రిక్ట్‌గా శిక్షణను కొనసాగించాలని నొక్కి చెప్పారు. ఆ వెయిట్‌లాస్ ప్లాన్ ఏంటంటే..కేలరీల లోటుతో తినండినిర్వహణ స్థాయి కంటే 500-750 తక్కువ. గరోజువారీ ప్రోటీన్ లక్ష్యాన్ని చేరుకోండిశరీర బరువులో ప్రతి పౌండ్‌కు 0.8-1 గ్రా. చాలా మందికి కనీసం 130-180 గ్రా.ప్రతి భోజనంలో 20-30 గ్రా ప్రోటీన్ తినండిప్రోటీన్కు అనుగుణంగా ప్రతి భోజనం ఉండాలివారానికి కనీసం 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండివారానికి 3-5 సార్లు ఇంక్లైన్ వాక్ / స్టెయిర్‌మాస్టర్ చేయండి 30-45 నిమిషాలు. ఈ వారం నేను పంచుకున్న వాకింగ్ ఛాలెంజ్ లాగా.ప్రతిరోజూ పదివేల పైనే అడుగులు నడవడంఇది ఒత్తిడి లేకుండా కొవ్వును కరిగించడం.రాత్రికి 7-9 గంటలు నిద్రపోండినిద్ర లేకపోతే కొవ్వు కరగడం నెమ్మదిస్తుంది.భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండిప్రణాళిక లేకపోతే ఇష్టం వచ్చినట్లు తినడంతో ఫలితం పొందలేరు. ప్రధానంగా సంపూర్ణ ఆహారాలనే తినండి. కొవ్వు తక్కువగా ఉండే మాంసం, అన్నం, గుడ్లు, పండ్లు, ఓట్స్, ఆకుకూరలు.అధిక కేలరీలు గల పానీయాలను మానుకోండినీళ్లు, కాఫీ, కేలరీలు లేని పానీయాలు. స్మూతీలను లెక్కపెడితే ఫర్వాలేదు.ప్రాసెస్ చేసిన చక్కెరను తగ్గించండిమిఠాయిలు, పేస్ట్రీలు, చక్కెర కలిపిన తృణధాన్యాలు, లేదా జంక్ ఫుడ్ వద్దు.చివరగా 30 రోజుల పాటు చీట్ మీల్స్ వద్దుప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే బరువు చూసుకోండిమొదట్లో కాస్త కష్టంగా అనిపించినా..స్మార్ట్‌గా మారాలన్న లక్ష్యంపై గురిపెడితే ప్రతి శారీరక బాధ ఇష్టంగా మారుతుందని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్ . View this post on Instagram A post shared by Takai Raashid | MacroMaster® (@takai.raashid)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..) -
ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్‌కట్, నో స్ట్రిక్ట్ డైట్
బరువు తగ్గడం అనగానే కఠినమైన వ్యాయామాలు, స్ట్రిక్ట డైట్‌నే ఫాలో అయిపోతుంటారు. నిజానికి ఇలా ఎప్పుడైతే శరీరాన్ని ఒకేసారి కష్టపెడతామో అదికాస్తా సహకరించడానికి బదులుగా వ్యతిరేకించడం మొదలుపెడుతుంది. ఫలితంగా బరువు తగ్గడం దేవుడెరుగు మొత్తానికి మరిన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవ్వుతాయని అంటోంది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. చిన్నచిన్న మార్పులే అద్భుతం చేస్తాయని..త్వరిగతిన బరువు తగ్గుతామని అంటున్నారామె. అదెలాగంటే..ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ కేవలం ఐదు నెలల్లో 30 కేజీలు తగ్గారు. అందుకోసం ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయ్యారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. నిజానికి కఠినమైన వ్యాయామాలు, డైట్లు త్వరిగతగతిన అలిసిపోయేలా చేసి, బరువు తగ్గడాన్న మధ్యలోనే వదిలేస్తారని చెబుతోందామె. అదే చిన్నగా శరీరం అలవాటుపడేలా నెమ్మదిగా పెంచుకుంటూ పోతే అద్భుతమైన ఫలితాలు పొందుతామని అంటోంది. తానేమి కఠినమైన డైట్లు, రెండు గంటల జిమ్ సెషన్లు వంటివి చేయలేదన్నారామె. తాను అనుసరించిన విధానం అందరు చూసి నవ్వేలా, సిగ్గుపడేంతగా మొదలైందని చెబుతోంది. అంటే అంతా రోజూ పదివేల అడుగులతో దినచర్య మొదలుపెడితే, తానే కేవలం 4000 అడుగులతో తన వెయిట్‌లాస్‌ని మొదలుపెట్టానని అంటోంది. ఎందుకంటే అధిక బరువు ఉన్నవాళ్లకు ప్రారంభంలోనే అధిక వర్కౌట్లు సమస్యాత్మకమవుతాయని అంటోందామె. శరీరం మనం చేసే వ్యాయామాలకు అలవాటుపడుతుందనగా, నెమ్మదిగా, నిధానంగా వర్కౌట్లు, అడుగులు పెంచాలని సూచిస్తోంది. ఇక్కడ లక్ష్యం కేవలం కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడం కాదని అంటోంది. అలాగే ఆయాసం, శ్రమతో కూడిన విధంగా వర్కౌట్లు చేయొద్దని అంటున్నారు. సంతోషంగా ఎంజాయ్ చేసేలా మొదలుపెట్టండి, బాడీ అలవాటు పడుతుందనగా చిన్నగా కార్డియోసెషన్ వంటి వేగవంతమైనవి మొదలు పెట్టమని అంటోంది. అలా చేయడం వల్ల కీళ్లు మరింత బలపడతాయి, తెలియకుండానే ఆ వర్కౌట్లకు అలవాటుపడేలా కోలుకుంటారు. అదీగాక భారాన్ని తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది. నెమ్మదగా దశల వారీగా సాగే ప్రక్రియని, రాత్రికి రాత్రే జరిగేది కానీ తేల్చి చెప్పారామె. కేవలం స్థిరంగా నిదానంగా, ఓపికతో చేస్తుకుంటూ వెళ్తే..అనుకున్నది సాధ్యమవుతుందని చెబుతోందామె. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_) (చదవండి: 40 డిగ్గ్రీల ఉష్ణోగ్రతల్లో సైతం ఇళ్లను కూల్‌గా..! ఆ ఐడియాకు ఆనంద్ మహీంద్రా ఫిదా) -
70 ఏళ్ల వయసులో కూడా 20 లో లాగా ఉండడం ఎలా ?
-
మూడు రోజులు తిండి మానేస్తే ఏమవుతుంది?
సోషల్ మీడియాలో హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్లు మొదలుకొని ఫిట్నెస్ విషయంలో అత్యంత శ్రద్ధ వహించే సెలబ్రిటీల వరకు.. ఇప్పుడు అందరి నోటా ‘72 గంటల ఉపవాసం’ గురించే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ తన ఫిట్నెస్ సీక్రెట్‌ను బయటపెడుతూ.. క్రమశిక్షణతో పాటు ఫిట్నెస్ను కాపాడుకునేందుకు తాను అప్పుడప్పుడు మూడు రోజుల పాటు కఠిన ఉపవాసం చేస్తానని చెప్పడంతో ఈ ట్రెండ్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. అసలు 72 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటే శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? ఇది నిజంగానే సురక్షితమేనా? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరి మదినీ తొలిచేస్తున్నాయి.72 గంటల ఫాస్టింగ్‌పై ఎందుకంత క్రేజ్ఒకప్పుడు కేవలం వైద్యపరమైన లేదా మతపరమైన కారణాలకే పరిమితమైన ఉపవాసం, ఇప్పుడు మోడ్రన్ వెల్నెస్ కల్చర్‌లో భాగమైపోయింది. చాలా మంది సెలబ్రిటీలు, ఫిట్నెస్ నిపుణులు శరీరాన్ని ‘రీసెట్’ చేయడానికి, క్రమశిక్షణను మెరుగుపరచుకోవడానికి, బరువు తగ్గడానికి ఉపవాసాలు ఒక గొప్ప మార్గమని చెబుతున్నారు. మూడు రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం వల్ల అధిక ఏకాగ్రత అలవడటంతో పాటు శరీరం చాలా తేలికగా అనిపిస్తుందంటూ వారు చేస్తున్న పోస్టులు చూస్టుంటే.. ఇది కొత్త ఆరోగ్య రహస్యమా లేక మరొక ట్రెండా అనే క్యూరియాసిటీ సామాన్యుల్లో సైతం కలుగుతోంది.శరీరంలో జరిగే సైంటిఫిక్ మ్యాజిక్ ఇదే72 గంటల ఉపవాసం అంటే.. మూడు రోజుల పాటు శరీరానికి ఎలాంటి క్యాలరీలు ఇవ్వకపోవడం. కేవలం నీరు, టీ లేదా బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకుంటారు. ఉపవాసం మొదలైన ఒక రోజు తర్వాత, శరీరంలో నిల్వ ఉన్న చక్కెర స్థాయిలు పూర్తిగా తగ్గిపోయి, అప్పటి నుండి శక్తి కోసం కొవ్వును కరిగించడం మొదలవుతుంది. ఈ ప్రక్రియనే ‘కీటోసిస్’ అంటారు. మూడవ రోజుకు, శరీరం పూర్తిగా ఈ స్థితికి అలవాటు పడి, కార్బోహైడ్రేట్లకు బదులుగా కొవ్వు ద్వారా వచ్చే ఇంధనాన్ని వాడుకుంటుంది. దీనివల్ల కొందరిలో ఆకలి తగ్గి మానసిక స్పష్టత వస్తే, మరికొందరిలో శరీరం సర్దుబాటు చేసుకునే క్రమంలో విపరీతమైన అలసట, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఇది నిజంగానే బాడీని ‘డీటాక్స్’ చేస్తుందా?సాధారణ చర్చలలో ‘డీటాక్స్’ అనే పదం తరచుగా వినిపిస్తుంది. కానీ శాస్త్రీయంగా చూస్తే మన శరీరంలో సహజంగానే కాలేయం, మూత్రపిండాలు డీటాక్స్ వ్యవస్థలుగా పనిచేస్తాయి. నిజానికి ఉపవాసం ఎలా పనిచేస్తుందంటే.. శరీరం శక్తిని గ్రహించే విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. ఈ సుదీర్ఘ ఉపవాస సమయంలో, ఇన్సులిన్ స్థాయిలు పడిపోయి, కొవ్వు నిల్వలు చురుకుగా కరగడం మొదలవుతుంది. దీనికి తోడు పాడైన కణాలను శుభ్రపరిచే ‘ఆటోఫాగీ’ వంటి ప్రక్రియలు వేగవంతం అవుతాయి. అందుకే చాలా మంది దీనిని ఒక ‘మెటబాలిక్ రీసెట్’గా భావిస్తారు. అయితే ఈ ప్రభావాలు అందరిలో ఒకేలా ఉండవు.ఎవరెవరు ఈ సాహసానికి దూరంగా ఉండాలి?నిజానికి ఈ 72 గంటల ఉపవాసం అనేది అందరూ క్యాజువల్‌గా చేసే ఒక లైఫ్‌స్టైల్ అలవాటు కాదు. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర పరిణామాలు తప్పవు. బిజీ షెడ్యూల్, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేసేవారు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఉపవాసం చేస్తే తీవ్రమైన నీరసం, లో బ్లడ్ షుగర్ లేదా డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఆరోగ్యవంతులైన వ్యక్తులు సైతం సరైన పర్యవేక్షణ లేకుండా చేస్తే తలనొప్పి, అలసట, ఏకాగ్రత లోపించడం అనేవి జరుగుతాయి. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, శిక్షణలో ఉన్న అథ్లెట్లు దీనికి కచ్చితంగా దూరంగా ఉండాలి.లాభాల కంటే ముప్పు ఎక్కువసోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా 72 గంటల ఉపవాసం అనేది అద్భుతాలు చేసే మ్యాజిక్ ట్రిక్ కాదు. నిపుణుల పర్యవేక్షణలో, సరైన ప్రణాళికతో చేస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన అవగాహన లేకుండా ఎవరికి వారు సొంతంగా ప్రయోగాలు చేస్తే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. దీని ఫలితాలు అందరికీ ఒకేలా ఉండవు కాబట్టి, వైద్యుల సలహా లేకుండా.. ముఖ్యంగా గర్భిణిలు, మందులు వాడేవారు, 18 ఏళ్ల లోపు వారు ఈ ఉపవాసాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు! -
సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి మొత్తం 107 స్థానాలలో విజయకేతనం ఎగురవేసి అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఈ నేపథ్యంలో విజయ్ ఫిట్నెస్ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఉండాలంటే..ఆరోగ్యపట్ల ఎలాంటి స్ప్రుహతో వ్యవహరించాలి వంటి వాటి గురించి విజయ్ ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ వెల్లడించారు. ఆయనతో ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవంతోపాటు..ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయంటూ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. అంతటి స్టార్డమ్ ఉన్నా..ఆరోగ్యం పట్ల విజయ్ వ్యవహరించే తీరు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దామా..!.సెట్లో విజయ్‌తో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ..ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్..విజయ్ కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే కాకుండా..తెర వెనుక కూడా చాలా నిబద్దతతో వ్యవహరించే ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడారు. ఆయన ఫిట్నెస్ పరంగా చాలా స్ట్రిక్ట్‌గా ఉండటమేగాక, అత్యంత నిలకడగా చేస్తుంటారని అన్నారు. ఆయనతో పనిచేయడం ఒక మరుపురాని అనుభవంగా పేర్కొన్నారు. ఆయన ఎంతటి బిజీ షెడ్యూల్లో గడుపుతున్నప్పటికీ..తన ఆరోగ్యాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఎంతటి విరామంలేని స్థితిని కూడా ఆయన చాలా చాకచక్యంగా సమతుల్యం చేసుకుంటారని, అదే ఆయన ప్రత్యేకత అని చెబుతున్నారు. సమయ నిర్వహణ నుంచి శారీరక దృఢత్వం కాపాడుకోవడం, శక్తిమంతమైన ప్రదర్శనలు ఇవ్వడం వరకు ప్రతిదీ నిశబ్దమైన ఏకాగ్రతతో చేస్తారని కుమార్ తెలిపారు. ఎంతటి హడావిడి రాజకీయ ర్యాలీలలోనైనా, ఆయన తన భోజనాన్ని తానే తీసుకువెళ్లేవారని అన్నారు. బయటి ఆహారానికి చాలా దూరంగా ఉంటారని చెప్పారు. ఆయనలో సాధారణ స్థాయిని మించిన క్రమశిక్షణను స్పష్టంగా చూడొచ్చని చెబుతున్నాడు. 51 ఏళ్ల వయసులోనూ యువ హీరోలను తలదన్నేలా ఉండే ఆయన ఫిజిక్‌కి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే అంటూ పొగడ్తలజల్లు కురిపించారు. అంతేగాదు విజయ్ క్షణం తీరక లేని ఒత్తిడితో కూడిన పరిస్థితిని సైక్లింగ్, జిమ్ సెషన్లు, రన్నింగ్ వంటి మార్గాలతో చిల్ అవుతారని చెప్పుకొచ్చారు. పైగా విజయ్‌కి ఇప్పటి వరకు మోకాలి లేదా నడుము నొప్పి వంటి సమస్యలు కూడా లేవన్నారు. ముఖ్యంగా విజయ్ వినయం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని, అదే ఆయనకు ఇంతలా ప్రజాదరణ తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని సమాన గౌరవంతో చూస్తారు, అదే అయన మార్క్‌ని స్పెషల్‌గా చూపించడమే గాక..విక్టరీకి కేరాఫ్‌గా నిలిచేలా చేసిందని అంటున్నారు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల పరంగా అంచనాలకు అందని విజయ్ ఘన విజయం యాదృచ్ఛికంగా వచ్చిందికాదని, ఆయన అంకితభావం, ఏకాగ్రత, అభిరుచి ఫలితంగా వచ్చిన గొప్ప గెలుపుగా అభివర్ణించారు. అంతేగాదు క్రమశిక్షణ అనే పునాదిపై నిర్మించబడిన విజయంగా పేర్కొన్నారు. అలాగే ఏ రంగంలోనైనా తూచా తప్పకుండా నిలకడతో వ్యవహరిస్తే..విజయం తథ్యమని అందుకు దళపతి, తమినాడు సీఎం విజయ్‌నే నిదర్శనమని అన్నారు. (చదవండి: హాట్‌టాపిక్‌గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..) -
హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు!
బరువు తగ్గడం ప్రస్తుత రోజుల్లో ఒక ట్రెండ్‌గా మారింది. అంతా శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించుకుని స్మార్ట్‌గా మారడంపైనే ఫోకస్ పెడుతున్నారు. అంతేగాదు ఆరోగ్యస్ప్రుహతో ఆ దిశగా పోషకాహార నిపుణులు, ఫిట్నెస్ నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తున్నారు. బరువు తగ్గడం అంటే తక్కువగా తీసుకోవడం, కేలరీలు మితంగా ఉండేలా కేర్ తీసుకోవడంపై ఆధారపడి ఉంటుందనేది అందరి నమ్మకం కానీ, ఇది అందరికీ వర్తించదని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ఫిట్నెస్ కోచ్ హన్నా బటన్. కొందరిలో ఈ విధానం దీర్ఘకాలిక కొవ్వు నష్టానికి దారితీస్తుందని అంటున్నారు. అలాంటివాళ్లు, జీవక్రియ , హర్మోన్ల సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా డైట్ తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. అదెలాగో సోషల్ మీడియా ఎక్స్ వేదిక వివరించారామె. ఆస్ట్రేలియాకు చెందిన ఫిట్నెస్ కోచ్ హన్నా బటన్ తాను సాధారణంగా తినే విధానం కంటే ఎక్కువగా తింటూ కోరుకున్న విధంగా బరువు ఎలా తగ్గొచ్చో ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. ఆ పోస్ట్‌లో మనకు స్థిరమైన కొవ్వు నష్టం జరగకుండా మంచి డైట్‌ని అనుసరించాలని అన్నారామె. అయితే చాలామంది నిపుణులు తక్కువ తినండి, కార్బోహైడ్రేట్లు తగ్గించండి, అలాగే ప్రతి కేలరీని లెక్కించడని సూచిస్తుంటారు. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్‌గా ఈ విధానం వల్ల కండరాలు కోల్పోయాను, హార్మోన్లు దెబ్బతిన్నాయ్, పైగా మరింత అధ్వాన్నంగా కనిపించానని చెప్పుకొచ్చింది. ఈ సలహా ముమ్మాటికీ తప్పు మాత్రమే కాదు హానికరం అని అంటున్నారామె.తక్కువగా తినడం వల్ల శక్తిని ఆదా చేసేందుకు జీవక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా కొవ్వు నిల్వలు, కండరాలు తగ్గిపోతాయ్, అలసిపోతారు కూడా. అలాగే మీ బరువులో ఎలాంటి మార్పు కనిపించదు కూడా. అందువల్ల ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు డైటింగ్ పద్ధతిని మార్చాలంటున్నారామె.ప్రోటీన్ ఆటను మార్చేస్తుందిఫిట్నెస్ కోచ్ హన్నా ప్రతిరోజూ శరీర బరువులో ప్రతి పౌండ్‌కు 0.7–1 గ్రాముల ప్రోటీన్‌ను లక్ష్యంగా పెట్టుకోమని సూచిస్తున్నారు. శరీరం ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోవడం ద్వారానే దాని నుంచి వచ్చే కేలరీలలో 30% ఖర్చు చేస్తుంది. కొవ్వును తగ్గించుకుంటున్నప్పుడు ఇది లీన్ కండరాలను కాపాడుతుంది. చాలా మంది తమకు వాస్తవంగా అవసరమైన దానిలో సగం మాత్రమే తింటారు.ఎక్కువగా తింటే.. చురుకుగా జీవక్రియ..తీవ్రమైన ఆహార నియంత్రణ ఆకలికి సంకేతం, దీని ఫలితంగా కార్టిసాల్ స్థాయిలు పెరిగి, శరీరం కొవ్వును తీవ్రంగా నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. తీవ్రమైన ఆహార నియంత్రణ కంటే 300-400 కేలరీల లోటు ఎల్లప్పుడూ ఉత్తమమైనది. హన్నా ప్రకారం, తీవ్రమైన ఆహార నియంత్రణ కంటే నిలకడగా పాటించగలిగే డైట్‌ను ఎంచుకోవాలి.కండరాలే కొవ్వును కరిగించే చోదక శక్తిఎంత ఎక్కువ కండరాలను పెంచుకుంటే, విశ్రాంతి జీవక్రియ అంత ఎక్కువగా ఉంటుంది. అంటే విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కొవ్వును కరిగించడం ప్రారంభిస్తారు. ఇక్కడ కండరాలను పెంచుకోవాలంటే, తగినంత ఆహారం తీసుకుంటూ..బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. అలాకాకుండా నియంత్రణ పేరుతో ఆకలితో ఉండటం అనేది కండరాలను నాశనం చేస్తుంది, పైగా జీవక్రియ మందగించి, అదనంగా కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.40 ఏళ్లు పైబడిన వారిలో హార్మోన్లు చాలా ముఖ్యందీర్ఘకాలంగా తక్కువగా తిన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరిగి, శరీరం ఎక్కువ కొవ్వును నిల్వ చేసుకునేలా చేస్తాయి. అదే సమయంలో, నిరంతరం తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల, కడుపు నిండినట్లు సంకేతం ఇచ్చే లెప్టిన్ అనే హార్మోన్‌ను అణచివేస్తుంది. ఇది మీకు అంతులేని ఆకలిని కలిగించి, మిమ్మల్ని అతిగా తినేలా చేస్తుంది.తినవలసిన ఆహారంహన్నా చికెన్, చేపలు, గుడ్లు మరియు గ్రీక్ యోగర్ట్ వంటి లీన్ ప్రోటీన్‌ను ఎక్కువగా తినమని సిఫార్సు చేస్తుంది. కూరగాయలను ఎక్కువ పరిమాణంలో, తక్కువ కేలరీలతో తీసుకోవాలి. డైట్‌కు అనుగుణంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను నియంత్రిత మోతాదులో తీసుకోవాలి.ఫలితాలుతాను స్ట్రిక్ట్ డైట్ నుంచి సరైన ఆహారానికి మారిన తర్వాత, వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపించాయని అంటోంది హన్నా. ముఖ్యంగా శరీర కొలెస్ట్రాల్ పూర్తిగా కరిగిపోయింది, పైగా తన శక్తి, పనితీరు పుంజుకున్నాయని చెప్పుకొచ్చింది. ఆమె అత్యంత సన్నగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువగా తింటున్నప్పటి నుంచే, మునుపెన్నడూ లేనంత ఆరోగ్యంగా కనిపిస్తోందని చెబుతోంది."1960లలో శారీరక శ్రమ లేని వారి కోసం 1,200-కేలరీల నమూనా రూపొందించారు, కానీ ఇది అందరికీ వర్తించదని అంటోంది. సాధ్యమైనంతవరకు పనితీరును పెంచే పోషకాహార ప్రణాళిక అవసరం. ఇది సరళమైనది. ప్రభావవంతమైనది. ఎవ్వరైనా దీన్ని సరిగా అనుసరిస్తే..వాటంతటే అవే మంచి మెరుగైన ఫలితాలు వస్తాయని నమ్మకంగా పేర్కొంటూ తన పోస్ట్‌ని ముగించింది హన్నా.I lost body fat by eating MORE.Not less. Not 1,200 calories. More.Here's the science to sustainable fat loss:= Thread = pic.twitter.com/GtiTLcwYJI— Hannah - Apex Fitness Advisory (@hannahapexfit) May 1, 2026 గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్‌లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు) -
76 ఏళ్ల వయసులో జోరుగా ట్రైసెప్ డిప్స్ : ఈ యాక్టర్‌కి ఫ్యాన్స్ ఫిదా!
ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తన ఫిట్నెస్ మంత్రాతో అందర్నీ అశ్చర్య పరుస్తున్నారు. 76 ఏళ్ల వయసులో కూడా చాలా సునాయాసంగా ట్రైసెప్ డిప్స్ (Tricep Dips) చేస్తూ అటు ఫిట్నెస్ ఇండస్ట్రీని, ఇటు ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. దీనికి వీడియో ఒకటి వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోందిప్రముఖ ఫోటోగ్రాఫర్ అండ్ ప్రొడ్యూసర్ అతుల్ కస్బేకర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "నానా సాహెబ్.. మీరు నా ఫిట్నెస్ లక్ష్యాలను మార్చుకునేలా చేశారు. ఆయన వయసు 76 ఏళ్లు. ఆయన 15 రెప్స్ చేశారు, నేను రికార్డింగ్ ఆలస్యంగా మొదలుపెట్టాను" అంటూ అతుల్ ఈవీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నానా పటేకర్ తెల్లటి బనియన్, షార్ట్స్ ధరించి, మెడలో గమ్చా వేసుకుని బార్‌పై ఎంతో అలవోకగా ఎక్సర్సైజ్ చేస్తూ కనిపించారు. దీనిపై నటీమణులు శిల్పా శెట్టి, రాహుల్ దేవ్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ వీడియోను చూసి ప్రశంసలు కురిపించడం విశేషం.నెటిజన్లు ఫిదాఈ వయసులో కూడా నానా పటేకర్ తన క్రమశిక్షణ, ఫిట్నెస్, పవర్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "నానా సార్.. మీరు ఒక స్ఫూర్తి" అని కొందరు, "నిజమైన బలం అంటే ఇదే" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, క్రమశిక్షణ ఉంటే ఏ వయసులోనైనా ఫిట్‌గా ఉండవచ్చని నానా పటేకర్ మరోసారి నిరూపించారు.ఇక నానా పటేకర్ వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'ఓ రోమియో' (O'Romeo) సినిమాలో నానా పటేకర్ కనిపించారు. షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆయన ఒక పోలీసు అధికారి పాత్రను పోషించారు. View this post on Instagram A post shared by Atul Kasbekar (@atulkasbekar) -
60లోనూ 40లా.. వృద్ధురాలి యంగ్‌లుక్!
వయసు పైబడిన..చిన్నవాళ్లలా యంగ్‌లుక్‌లో కనిపించాలని పరితపిస్తుంటారు చాలామంది. అయితే అందుకు తగ్గట్టుగా జీవనశైలిలో మార్పులు చేసుకోరు. అలాగే శరీరానికి కావాల్సినంత వ్యాయామాలు వంటి వాటిపై దృష్టిసారించరు. యంగ్ లుక్ అటుంచి..ఆరోగ్యంగా ఉండటం కోసం అయినా చేయరు..ఇక యవ్వనంగా ఎలా కనిపిస్తారు అని అంటోంది ఈ చెన్నైకి చెందిన వృద్దురాలు. 67 ఏళ్ల వయసున్న ఆమెని చూస్తే జస్ట్ 40 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆ వృద్ధురాలి ఆహార్యం. మరి ఆమె చెప్పే పిట్నెస్ రహస్యలేంటో సవివరంగా చూద్దామా..!.కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ ఆ వృద్ధరాలి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఆమెను ఫిట్నెస్ రొటీన్ గురించి అడగడం చూడొచ్చు.మంచి ఆరోగ్యానికి వ్యాయామమే కీలకంవయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడుతుంది; ఇది సాధారణ జీవశాస్త్రం. అయితే, క్రమం తప్పని వ్యాయామంతో మన శరీరానికి శిక్షణ ఇస్తే..న క్రియాత్మక బలం, సామర్థ్యాలను నిలుపుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని అంటోందామె. ఆమె ఉదయం 5:30 నుంచి 5:45 గంటల మధ్య నిద్రలేచి, ఇంటి పనులు ముగించుకుని, యోగాతో రోజుని ప్రారంభిస్తానని అంటోంది. ఇక ఉదయం 7:30 గంటలకు పార్కులో వాకింగ్ చేస్తానని చెప్పారు. ఆరోగ్యంగా ఉండటానికి కేవలం వాకింగ్ సరిపోదని అన్నారు. శక్తినిచ్చే వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహార తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. అలాగే తానేమి సప్లిమెంట్లని ఉపయోగించనని అన్నారు. అల్పాహారంగా కేవలం మజ్జిగ మాత్రమే తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో మాత్రం అవసరమైన పోషకాలు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్నం ప్రోటీన్ కోసం చికెన్, మటన్ లేదా గుడ్లతో కూడిన చాలా మంచి భోజనం చేస్తాను. ప్రత్యేకంగా పాటించే డైట్ అంటూ ఏమి లేదని అన్నారామె. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతానని అన్నారు. భోజనం మధ్యలో ఆకలి వేస్తే నచ్చిన పండ్లను తీసుకుంటానని చెప్పారు. కానీ వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటానని అన్నారు. మంగళవారం, శనివారాలు తప్పనిసరిగా ఉపవాసం ఉంటానని చెప్పారు. గృహిణిగా ఉంటూనే ఆరోగ్యం పట్ల ఇంత కేర్ తీసుకుంటున్నా ఆమె అందరికీ స్ఫూర్తి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే సరైన ఆహారం తీసుకోవడం, శరీరానికి తగిన వ్యాయామం చేయడం తదితరాలే అత్యంత ముఖ్యమని అని చెబుతున్నారామె. ఎక్కువగా మానసిక ఆరోగ్యంపై దృష్టిపెడితేనే ఏదైన సాధ్యమని అన్నారు. ఆడవాళ్లు, ఇంట్లో శాంతి, సంతోషంగా ఉండేలా చూసుకోవడం ప్రధానమని అన్నారు. అలాగే ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే విషయాలను పట్టుకుని వేలాడకుండా..జీవితంలో ఏది వచ్చినా..యథాతథంగా స్వీకరించడం అత్యంత ముఖ్యం అని అన్నారు. అప్పుడే మనం శారీరకంగా ఫిట్‌గా ఉండగలుగుతామని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Jhaal Muri: మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..) -
వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..
ఇటీవల బరువు తగ్గడం ఆధునిక ట్రెండ్‌గా మారింది. అందరూ చక్కటి శరీరాకృతిలో యంగలుక్లో కనిపించడం కోసం రకరకాల డైటింగ్లు, వర్కౌట్లతో పాట్లుపడుతున్నారు. కానీ కొందరు సింపుల్ చిట్కాలతో అద్భుతంగా బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తున్నారు. బరువు తగ్గిన చాలామంది ఎంతో కొంత వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేశామని చెప్పగా ఈ పిల్లల తల్లి మాత్రం అవేమి చేయకుండానే బరువు తగ్గానంటోంది. పైగా ఆరోగ్యకరమైన రీతీలోనే తగ్గానని చెబుతుండటం విశేషం. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ముంబైకి చెందిన పిల్లల తల్లి, కంటెంట్ క్రియేటర్ సురభి పిసల్ తన వెయిట్‌లాస్ జర్నీని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ప్రసవానంతరం గుర్తుపట్టలేనంతగా మారిపోయానని చెప్పుకొచ్చింది. మళ్లీ తనలా మార్పు కోసం నెమ్మదిగా బరువతగ్గే యత్నం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తాను వ్యాయామాలు చేయలేదని చెబుతోంది. తన జీవనశైలికి సరిపోయే విధంగా చిన్న, చిన్న స్థిరమైన మార్పులు మాత్రమే చేశానని అంటోంది. అయితే డెలివరీ తర్వాత పరిస్థితులు కాస్త కష్టంగా ఉన్నాయని, ఏ డైట్చేసినా కడుపు ఉబ్బరం, బరువు పెరడం వంటి సమస్యలతో ఇబ్బందిపడ్డట్లు వివరించారామె. అప్పుడే తాను ఆపిల్ సైడ్ వెనిగర్‌ని ఉపయోగించటం ప్రారంభించానని అన్నారు. ఇది తన జీవక్రియను మెరుగుపరిచి, ఆకలి కోరికలను నియంత్రించడానికి సహాయపడిందని అంటోంది. అది క్రమంగా తన బరువులో మార్పులకు దారితీసింది. ఇంతకుమునుపు సరిపోని బట్టలు సరిపోవడంతో మానసికంగా కాస్తం స్థైర్యం రావడం మొదలైందని తెలిపింది. కేవలం బరువు తగ్గడం పైనే కాకుండా మొత్తం ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెట్టానన్నారు. అందుకోసం ఏ చాశారో కూడా చెప్పారు.నల్ల జీలకర్ర నూనె (ఖాళీ కడుపుతో): జీవక్రియను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానిక హెల్ప్ అవుతుందట.బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ (బ్లాక్ కాఫీ + కొబ్బరి నూనె): ఇది తక్షణ శక్తిని అందిస్తుందట. పైగా కొబ్బరినూనెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుందట.ఎల్డర్‌బెర్రీ పొడి: దీన్ని పెరుగుతో కలిపి తీసుకుంటే దీనిలోని యాంటీఆక్సిడెంట్లను మెరుగైన రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తుందని చెప్పుకొచ్చారామె.తాను తన ఆరోగ్యంపై దృష్టిపెట్టడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గిపోయానని అంటోంది. నిజం చెప్పాలంటే వెయిట్‌లాస్ దానంతట అది జరిపోయిందని చెబుతోంది ఈ న్యూ మామ్. View this post on Instagram A post shared by Surabhi Pisal (@surabhi_littlereviews) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..) -
హీరోలు అంత ఫిట్ గా ఎలా ఉంటున్నారో తెలుసా? వీరి డైట్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు!
-
చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..
ఆధునిక కాలంలో బరువు తగ్గడం అనేది చాలా సమస్యాత్మకంగా మారింది. చాలామంది వెయిట్‌లాస్ అయ్యేలా సర్జరీలు, మందుల వెంట పరిగెడుతున్నారు. మరికొందరు ఆరోగ్యకరంగా తగ్గేందుకు పాట్లు పడుతున్నారు. ఆ క్రమంలో కొందరు ఇతరులకు ప్రేరణ కలిగించేలా అద్భుతంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు కూడా. కానీ వాళ్లందరూ చెప్పేది కొద్దికిద్దిగా తింటూ ఎక్కువసార్లు తినమని, మంచి ఆహారపు అలవాట్లు తదితర టిప్స్ ఇస్తే. ఈ వ్యక్తి మాత్రం అత్యంత వింత వెయిట్‌లాస్ చిట్కాలు ఇచ్చాడు. అవి చూస్తే ఇవేం చిట్కాలు అనిపించినా..అంతకుమునుపు, తదుపరి పరివర్తన చూస్తే నిజంగా అవే సరైనవా? అనే ఆశ్చర్యం కలుగకమానదు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామాకువార్ కపూర్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన వెయిట్‌లాస్ జర్నీని షేర్ చేశారు. తాను ఒకప్పుడు 142 కిలోల బరువు ఉండేవాడినని తెలిపాడు. పైగా కొన్ని రకాల వింత ఫిట్నెస్ టిప్స్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తదితరాలు తన వెయిట్‌లాస్ సీక్రెట్ అని చెబుతున్నాడు. వర్కౌట్లు, మంచి ఆహారపు అలవాట్లు వరకు ఓకే. కానీ ఈ వింత ఫిట్నెస్ టిప్స్ ఏంటి..?. బరువు తగ్గడానికి అవెలా ఉపయోగపడ్డాయ్?డైట్ సోడా తాగడంబరువు తగ్గే ప్రయాణంలో డైట్ కోక్, సోడా, శీతల పానీయాలు, ఇతర చక్కెర పానీయాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కానీ భోజనంతో పాటు డైట్ సోడా తాగడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుందని కువార్ నొక్కి చెప్పారు. కేలరీలు లేని, సాధారణ ఫిజీ డ్రింక్ లాగే రుచిగా ఉండే సోడాను ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు.చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడంభోజనం తర్వాత చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం వల్ల అతిగా తినాలనే కోరికలను నివారిస్తుందట. కొలెస్ట్రాల్ తగ్గేలా ఎక్కువ కేలరీలు తీసుకోకుండా చేస్తుందట. ముందుగా ప్రోటీన్ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం వింతైన చిట్కా కాదు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లకు ఇది చాలా అవసరం. ప్లేట్లో ఎల్లప్పుడూ ముందుగాప్రోటీన్, తర్వాత కార్బోహైడ్రేట్లు చేర్చుకోవాలని కువార్ పేర్కొన్నారు.టీ మాక్సింగ్రోజంతా ఎక్కువగా కదలడం, ఉదాహరణకు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కాలు ఊపడం లేదా అటూ ఇటూ తిరగడం వంటివి, మనకు తెలియకుండానే అదనపు కేలరీలను ఖర్చు చేస్తాయంట. పైగా అనుకున్నదానికంటే వేగంగా కేలరీలు ఖర్చు అవుతాయట.ఎక్కువగా నిలబడటంకువార్ ప్రకారం, మీరు స్క్రీన్ చూసే సమయంలో సగం సేపు కేవలం నిలబడటం వల్ల ఎక్కువ శక్తిని ఖర్చు అవుతుందట. జువారీ కేలరీల ఖర్చులో ఇది కూడా చిన్నగా బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట3-2-1 రూల్..3-2-1 రూల్ కువార్కు మరింత స్థిరంగా కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడింది. దీని ప్రకారం నిద్రపోయే మూడు గంటల ముందు చివరి భోజనం ముగించడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడటానికి సమయం లభిస్తుంది. త్వరిత గతిన బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట. ఇక రెండు గంటలు హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం,ఇక ఒక గంట స్క్రీన్టైమ్ కోసం. ఇలా ప్లాన్‌చేస్తే అమాంతం చాలా బరువు తగ్గుతామని చెబుతున్నాడు.మంచి అరుగుదల కోసం నడకభోజనం చేసిన వెంటనే ఐదు నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడానికి బదులుగా కండరాలకు చేరవేయడానికి సహాయపడుతుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంటాయి. View this post on Instagram A post shared by Kuwar Kapur (@fitnessbykuwar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అందరికీ ఈ టిప్స్ వర్తించవు. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్‌లో టాపర్‌గా..!) -
ఫిట్‌నెస్‌పై ఇంత క్రేజా?!
పట్టణాల్లో, నగరాల్లో మారథాన్, అధిక ఫోర్స్‌తో చేసే వర్కౌట్లు వంటి ఫిట్నెస్ ఈవెంట్ల పట్ల ప్రజల ఆదరణ ఏ రేంజ్లో ఉందో తెలిస్తే షాకవ్వుతారు. వాటిపై పెడుతున్న ఖర్చులకు మాటలు రావ్. అందుకు ఉదాహరణ బెంగుళూరు ఫిట్నెస్ సెంటర్ ఈవెంటే. ఏం జరిగిందంటే..బెంగళూరులో హైరాక్స్ ఫిట్నెస్ ఈవెంట్ ధరలు చూస్తూ కళ్లు బైర్లుకమ్ముతాయ్. అందుకు సంబంధించిన పోస్ట్‌ని అంకిత్ కేడియా అనే యూజర్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ ప్రకారం..అక్కడ జరిగిన ఫిట్నెస్ ఈవెంట్లో దాదాపు తొమ్మిది వేల మంది దాక పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రూ. 9 వేలు చొప్పున ప్రవేశ రుసుము చెల్లించారు. అంటే ఒక్క రోజుల్లోనే సుమారుగా రూ. 8.1 కోట్లు వచ్చాయ్. మారథాన్‌లో కూడా ఇదో ధోరణి కనిపిస్తోంది. కేవలం ఒక రోజు పరుగుతీయడానికే రూ. 3 వేలు నుంచి రూ. 5 వేలు ఛార్జ్ చేస్తున్నారంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు కేడియా. ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు ఇదంతా ఫిట్నెస్ కోసం కాదని, కేవలం గుర్తింపు కోసం జరుగుతున్న ఆరాటం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఫిట్నెస్ అనేది ఒకరోజు ప్రదర్శన కాదు, అది జీవితాంతం కొనసాగే ప్రయాణం అని అబివర్ణిస్తున్నారు కొందరు ఫిట్నెస్ ప్రియులు. HYROX fitness event in Bengaluru saw around 9,000 participants.They charged ₹9,000 per person to participate, which comes to roughly ₹8.1 crore made in a single day.Same trend is showing up in marathons. People are paying ₹3,000–₹5,000 just to run for a day.Being fit is…— Ankit Kedia (@Ankittskedia) April 13, 2026 (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!) -
18 కోట్ల క్రికెటర్ ఆగమనం.. కేకేఆర్ భవిష్యత్తు మారేనా!
ఐపీఎల్ 2026 సీజన్లోకి మరో ఇద్దరు విదేశీ స్టార్లు త్వరలోనే అడుగుపెట్టే అవకాశముంది. శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ, మతీశా పతీరానాలు త్వరలోనే ఫిట్నెస్ టెస్టులో పాసయ్యి లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ పొందేందుకు సిద్ధమవుతున్నారు. ఐపీఎల్లో హసరంగ లక్నో సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పతీరానా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడనున్నాడు. హసరంగను రూ. 2 కోట్ల కనీస ధరకు లక్నో దక్కించుకోగా, పతీరానాను కేకేఆర్ రూ. 18 కోట్ల భారీ ధర చెల్లించి కొనుగోలు చేసింది. పతీరానా రాకతో కేకేఆర్ బౌలింగ్ లైనప్ ఫుంజుకునే అవకాశముంది. నిఖార్సైన బౌలర్ లేక కేకేఆర్ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే పరాజయాలనే మూటగట్టుకుంది. కాగా టీ20 ప్రపంచకప్‌కు ముందు గాయాలతో హసరంగ, పతీరానాలు మేజర్ టోర్నీకి దూరమయ్యారు. ఐర్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా తొడ వెనుక కండరాల్లో చీలిక రావడంతో హసరంగ టోర్నీ నుంచి తప్పుకోగా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు పతీరానా కండరాల గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. అప్పటినుంచి ఈ ఇద్దరు కొలంబోలోని ఫిట్నెస్ అకాడమీలో చికిత్స పొందుతున్నారు. లంక క్రికెట్లో సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న 15 మంది ఆటగాళ్ల జాబితాలో హసరంగ, పతీరానాలు చోటు దక్కడంతో బయటి లీగుల్లో ఆడాలంటే లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ తప్పనిసరి. ప్రస్తుతం గాయంతో కోలుకున్న ఈ ఇద్దరు ఫిట్నెస్ టెస్టు పాసయ్యేందుకు శ్రమిస్తున్నారు. అయితే వీరిలో హసరంగా ఐపీఎల్లో ఆడేందుకు ఎన్వోసీకి దరఖాస్తు చేసుకోకపోవడంతో అతడు ఐపీఎల్ ఆడతాడా లేదా అన్నది స్పష్టత రాలేదు.పతీరానా మాత్రం ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో మరో రెండు రోజుల్లో అతను ఫిట్నెస్ టెస్టుకు హాజరవనున్నాడు. ఫిట్నెస్ టెస్టులో క్లియరన్స్ వచ్చిన మరుక్షణం లేదా ఏప్రిల్ మూడో వారంలో పతీరానా కేకేఆర్‌తో కలిసే అవకాశముంది. ఇక పతీరానా ఐపీఎల్లో 32 మ్యాచ్‌లాడి 47 వికెట్లు పడగొట్టాడు. ఇక హసరంగ ఐపీఎల్లో 37 మ్యాచ్‌లాడి 46 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 19వ సీజన్లో కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓటములు ఎదురవ్వగా.. పంజాబ్‌తో మ్యాచ్ వర్షార్పణమయింది. ఇక లక్నో సూపర్‌జెయింట్స్ తొలి మ్యాచ్‌లో ఓటమి చెందినప్పటికీ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో గెలిచి సీజన్లో బోణీ చేసింది.చదవండి: అన్నింటా విఫలం.. ‘తలా’ లేక సీఎస్కే ఆగమాగం! -
ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్‌గానా..
20, 30 లేదా 40 ఏళ్ల వయసులో ఉండి వ్యాయామం చేయాలంటే రకరకాల సాకులు చెబుతూ స్కిప్ చేస్తుంటారు. కొన్ని రోజులు మొక్కుబడిగా చేసి..మళ్లీ యథావిధిగా మానేస్తుంటారు. అలాంటివాళ్లు ఈ 90 ఏళ్ల వృద్ధుడిని చూస్తే కచ్చితంగా కనువిప్పి కలుగుతుంది, దృక్పథం కూడా మార్చుకోవచ్చని చెబుతున్నారు ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్. తేలికపాటి వ్యాయామాలు చేసే వయసులో యువకులకు పోటీ ఇచ్చేలా ఆయన చేసే స్ట్రెంగ్త్ వ్యాయామాలు చూస్తే కచ్చితంగా విస్తుపోతారు. ఇంతకీ ఎవరా తాతగారు..?, అతని ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ అయిన జెన్నిఫర్ మార్టిన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన గురించి చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో చాలామంది మంచం నుంచి లేవడానికి ఇబ్బంది పడే తొమ్మిది పదుల వయసులో స్వతంత్రంగా బతకాలనే ఆశయం, కఠోర శ్రమ ఫలితమే అతడి స్ట్రాంగ్ ఫిట్నెస్ సీక్రెట్ అని చెబుతోందామె. ఆమె వయసు పైబడటం సమస్య కాదని అంటోంది, బలం కోల్పోవడమే సమస్య. దీర్ఘాయువుకి కండరాలే కీలకం. ఆ విషయంలోనే ఈ తాతాగారు చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. సవంత్సరాల తరబడి చేసిని నిరంతర వర్కౌట్లు..ఆయన్ని ఇంతలా బలంగా ఫిట్‌గా ఉండేలా చేశాయి. నిజానికి ఆయనకు 90 ఏళ్లు అంటే ఎవ్వరు నమ్మలేరు.పైగా ఆయన ఫిట్నెస్ దినచర్యలో ఏ యువకుడికైన గట్టి పోటీ ఇచ్చేలా చేయగలరు కూడా. ఆయన ఒంటరిగానే జిమ్‌కి వెళ్తారని, వారంలో మూడు రోజులు జిమ్‌కి కేటాయిస్తారని చెబుతోంది. ఆయన ఫుల్లింగ్ వ్యాయామాల దగ్గర నుంచి ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడం, క్లైంబింగ్ వర్కౌట్లను ఆస్వాదించడం వరకు అన్నింటిని చేస్తారు. మెషీన్లు, డంబెల్స్‌ను ఉపయోగించి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటివి కూడా చేస్తారాయన. ఈ వ్యాయామ దినచర్య కేవలం దీర్ఘాయువు కోసం కాదని, తుంటి మార్పిడి శస్త్ర చికిత్స నుంచి కోలుకోవడానికి కూడా సహాయపడిందని చెప్పుకొచ్చింది. శస్త్రచికిత్సకు ముందే ఆ వ్యక్తి శారీరకంగా చురుకుగా ఉంటూ, వ్యాయామం చేస్తుండటం వల్ల, ఇతర రోగుల కంటే వేగంగా కోలుకోగలిగారని చెప్పుకొచ్చింది. నెటిజన్లు సైతం ఆయన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను చూసి..ఆ వయసుల పట్టుదలను అభినందించడమే గాక..ఇది నిజంగా అద్భుతం అని కొనియాడారు. View this post on Instagram A post shared by JEN | Personal Trainer | Functional Movement & Longevity (@jennifermartinnn) (చదవండి: నాడు జేఈఈ ఫెయిల్యూర్ ఇవాళ ఏకంగా యూట్యూబ్‌లో..!) -
హైరాక్స్ ఫిట్నెస్ రేసులో 72 ఏళ్ల బామ్మ రికార్డు..!
సాధారణంగా మారథాన్, ఫుల్ మారథాన్.. వంటి పలు రకాల ఫిట్నెస్ ఫార్మాట్లో వృద్ధులు సైతం పాల్గొని రికార్డులు తిరగరాశారు. వాటన్నింటకంటే ఇటీవల సరికొత్తగా హైరాక్స్ అనే ఫిట్నెస్ ట్రెండ్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. చాలా మంది ఫిట్నెస్ ఔత్సాహికులు ఈ ట్రెండ్‌ని ఆదరిస్తున్నారు కూడా. అయితే ఇది సాధారణ మారథాన్ వలే జస్ట్ పరుగు కాదు..మల్టీటాస్కింగ్ వర్కౌట్లుగా చెప్పొచ్చు. కాస్త క్లిష్టతరమైనది కూడా. అలాంటి కఠినమైన హైరాక్స్ ఫంక్షనల్ రేసింగ్ పోటీలో ఓ 72 ఏళ్ల మహిళ అవలీలగా రికార్డు నెలకొల్పింది. పైగా ఆమె తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ ఈ ఘనత సృష్టించడం విశేషం. ఎవరామె..? అంత ఏజ్‌లో ఆమెకు ఇదెలా సాధ్యమైందంటే..స్కాట్లాండ్కి చెందిన 72 ఏళ్ల కరోల్ మున్నో అనే మహిళ ఈ ఘనతను సృష్టించింది. ఏకంగా మూడుసార్లు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఈ హైరాక్స్ ఫిట్నెస్ రేసులో రికార్డు నెలకొల్పిందామె. ప్రపంచంలోని అత్యంత కఠినమైన ఫిట్నెస్ రేసులలో ఒకటైన హైరాక్స్‌లో రికార్డులు బద్దలు కొట్టి అంచనాలకు మించి సత్తా చాటిందామె. ఈ హైరాక్స్ రేసులో పాల్గొన్న అత్యంత పైబడిన వారిలో ఒకరిగా..తన సహచర క్రీడాకారిణిలో పోటీపడి ఈ రికార్డుని సృష్టించింది. ఈ రేసు వ్యాయామం, ఓర్పుతో కూడిన పరుగు. చాలా ఓర్పుతో చేయాల్సి పోటీ ఇది. ఆమెకు మూడు హిప్ రీప్లేస్మెంట్లు జరిగాయి. అంటే అధిక శారీరక ప్రభావం చూపే కార్యకలాపాలను పరిమితం చేసే పరిస్థితి ఆమెది..అయినప్పటికీ డోంట్ కేర్ అంటూ అవలీలగా ఈ క్లిష్టమైన రేసులో సత్తా చాటి స్ఫూర్తిగా నిలిచింది ఈ బామ్మ. హైరాక్స్ అంటే..ఇదొక గ్లోబల్ ఇండోర్ ఫిట్నెస్ రేస్. ఇందులో ఎనిమిది.. ఒక కిలోమీటరు పరుగు తోపాటు స్లైడ్పుష్లు, రోయింగ్, బర్పీలు, వెయిటెడ్ లంజెస్ వంటి ఎనిమిది ఫంక్షనల్ వర్కౌట్లు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంలే ఒకేసారి బలం, ఓర్పు, మానసిక స్థైర్యాన్ని పరీక్షించడానికి రూపొందించిన రేసింగ్ ఫార్మాట్ ఇది. సాంప్రదాయ మారథాన్లు లేదా జిమ్ పోటీల వలె కాకుండా, అత్యంత కఠినంగా, విభిన్నంగా ఉంటుంది. అలాంటి కఠినతరమైన ఈ రేసును వయసు పైబడి, అందులోనూ శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న వారికి పూర్తి చేయడం అత్యంత కష్టం. కానీ ఈ స్కాటిష్ బామ్మ అచంచలమైన పట్టుదల ఉంటే ఈ శారీరక ఇబ్బందులు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది. తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత పరిస్థితి..సాధారణంగా తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత జీవనశైలి నెమ్మదిగా మారిపోతుంది. ముఖ్యంగా వృద్ధులు ఇలాంటి ఆపరేషన్లు చేయించుకుంటే..వారిని అధిక ప్రభావం చూపే వ్యాయమాల విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండమని సూచిస్తుంటారు వైద్యులు. అయితే ఈ 72 ఏళ్ల బామ్మ ఆ అభిప్రాయాన్నే అందరూ ఆశ్చర్యపోయేలా తిరగరాసింది. అయితే ఈ బామ్మ క్రమం తప్పకుండా వర్కౌట్ల శిక్షణ తీసుకోవడం తోపాలు పలు రకాల వ్యాయామాలు మార్చుతుండటం వల్ల హైరాక్స్‌లో సులభంగా రాణించగలిగేలా ఓర్పుతో కూడిన బలం సంపాదించుకుంది. అలాగే వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించింది కూడా. కాగా ఈ సరికొత్త ఫిట్నెస్ ట్రెండ్ హైరాక్స్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ఇతర నగరాల్లో ఎక్కువగా జరుగుతాయి.(చదవండి: పర్యాటక అద్భుతం..'రివర్‌కేఫ్'గా వంతెన!) -
బరువు పెరిగితే జీతంలో కోతే!
న్యూఢిల్లీ: కేబిన్ సిబ్బంది ఫిట్నెస్ విషయమై ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యం, ఫిట్నెస్ నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. బరువు పెరిగితే జీతంలో కోత విధించనుంది. ఇక, బరువు, ఫిట్నెస్ అసెస్మెంట్ మీదే సిబ్బంది జీతం, ఉద్యోగం ఆధారపడి ఉండనున్నాయి! బీఎంఐ 18 నుంచి 24.9 మధ్య ఉంటేనే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) రీడింగ్ 18 నుంచి 24.9 మధ్య ఉంటే సాధారణ బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్టు పరిగణిస్తారు. 18 కంటే తక్కువగా ఉంటే తక్కువ బరువున్నవారిగా అంచనా వేస్తారు. బీఎంఐ 25 నుంచి 29.9 మధ్య ఉంటే వారు అధిక బరువు కేటగిరీలోకి వెళ్తారు. ఇక బీఎంఐ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పరిగణిస్తారు. బీఎంఐ 18 కంటే తక్కువగా ఉన్నా, 25 నుంచి 29.9 మధ్య ఉన్న సిబ్బందిని విధుల నుంచి తొలగించి, వారిని ఫంక్షనల్ అసెస్మెంట్కు పంపిస్తారు. అందులో ఉత్తీర్ణులై, ఆరోగ్యంగానే ఉన్నారని, విధుల్లో కొనసాగడానికి అర్హులని నిర్ధారణ అయితేనే వారిని కొనసాగిస్తారు. ఫంక్షనల్ అసెస్మెంట్లో విఫలమైతే.. అర్హత ప్రమాణాలను చేరుకునేవరకూ వారి జీతంలో కోత (లాస్ ఆఫ్ పే) విధిస్తారు. ఊబకాయంతో ఉన్నవారిని విధుల నుంచి తొలగించడమే కాకుండా తక్షణమే వేతనం నిలిపేస్తారు. వారు నిర్దిష్ట కాల వ్యవధిలో తమ బీఎంఐని ఆరోగ్యకరమైన స్థాయిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తారు. శిక్షణలో ఉన్నవారికీ వర్తింపు... మే 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం ప్రస్తు™è ం పనిచేస్తున్న క్యాబిన్ సిబ్బందితోపాటు శిక్షణ పొందుతున్న వారికీ వర్తించనుంది. సిబ్బందికి ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కలి్పంచడం, సరైన బరువుతో ఉండేలా చూడటం కోసమే ఈ విధానాన్ని ప్రారంభించినట్టు ఎయిరిండియా తెలిపింది. మెరుగైన ఫిట్నెస్ ప్రమాణాలను అమలు చేయడానికి ముందు సన్నాహక చర్యగా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఎయిరిండియాను 2022 జనవరిలో టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. సంస్థ పునర్వ్యవస్థీకరణపై దృష్టిసారించి, నాలుగేళ్లలో పాత ఉద్యోగుల్లో ఎక్కువ మందిని దశలవారీగా తొలగించింది. -
జస్ట్ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!
బరువు తగ్గడం అనేది అత్యంత కష్టమైన సవాలుగా భావిస్తుంటారు చాలామంది. అలాంటిది ఆరు పదుల వయసులో వెయిట్లాస్కు ఉపక్రమించి సక్సెస్ అందుకుంది ఈ మహిళ. అది కూడా మూడు నెలల్లో తగ్గి వయసు కేవలం సంఖ్య మాత్రమే అని ప్రూవ్ చేసింది. ఒత్తిడితో కూడిన వృత్తిజీవితాన్ని హ్యాండిల్ చేస్తూ..బరువు తగ్గడం విశేషం. మరి అంతలా స్లిమ్‌గా మారిన ఆ మహిళ ఫిట్నెస్ మంత్రా ఏంటో చూద్దామా..!.కెరీర్ కోచ్ అయిన క్రిస్ బోయెట్చెర్ తాను ఫిట్నెస్కి వయసు ఎప్పుడు అడ్డంకి కాదని నిరూపించడానికే ఈ వెయిట్‌లాస్ జర్నీకి ఉపక్రమించినట్లు తెలిపారు. ఇంతకుమునుపు పని నిమిత్తం జర్నీలు, ఎక్కువ గంటల పని, తదితరాలతో బిజీగా గడిపి, ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. అందుకే తన జీవితానికి అనుకూలమైన వ్యవస్థకు కట్టుబడి ఉండాలని డిసైడ్ అయ్యానని అంటోంది. అలా మూడు నెలల్లో తన శరీరాకృతిని మార్చుకోగలిగానని అంటోంది. ఆ క్రమంలో దశాబ్దాలుగా అనుభూతి చెందని బలాన్ని తిరిగి పొందగలిగానని చెబుతోంది. తనకు ఎంత తీరిక లేని దినచర్యతో ఉన్నప్పటికీ, క్రమబద్ధమైన ప్లాన్‌ని మిస్ చేయలేదట. ఇన్నాళ్లు ఆత్యానూన్యత భావంతో ఉన్న అధిక బరువుని..సక్రమమైన జీవనశైలితో చెక్‌పెట్టి స్లిమ్‌గా మారినిట్లు చెబుతోంది. అలా 73 కిలోల నుంచి 66 కిలోలకు అనూహ్యంగా తగ్గిపోయానని అంటోంది. అలాగే తానేమి కఠినమైన త్యాగాలు చేయలేదని, తన వాస్తవిక జీవితానికి అనుకూలమైన, నిర్వహించదగిన జీవనశైలిని ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆ ప్రణాళిక పక్కాగా ఫాలో అయ్యేలా కేర్ తీసుకున్నానని, దాంతో నాజూకుగా మారి ఆత్మవిశ్వాసంతో అందరి ముందుకు రాగలిగానని అంటోంది. నెటిజన్లు సైతం ఆమె రూపు రేఖల్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఎన్ని దశాబ్దాలు జీవించినా సరైన జీవన విధానం, నిరంతర కృషి, బలం, ఆత్మవిశ్వాసంతో మొత్తం ఆరోగ్యాన్ని ఇట్టే మార్చుకోగలరని ప్రూవ్చేసింది, స్ఫూర్తిదాయకంగా నిలిచింది మేరీ అంటూ పోస్టులు పెడుతున్నారు. Mary is a 62 year old administrator.She thought she would never lose the belly fat and build strength at her age.Mary was beginning to believe "I'm too old for that." But she decided to try anyway.She was dealing with travel for work, long hours, and the belief that her… pic.twitter.com/atZvUZgTnO— Chris Boettcher (@chrisboettcher9) February 16, 2026 (చదవండి: మూడు వేల ఏళ్లనాటి పురాతన తైలం..! నలుపుదనాన్ని తొలగించి..) -
9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!
చాలామటుకు 9 టు 5 ఉద్యోగాల చేసే వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందట. పగలు అంత ఆపీస్‌లోనే గడిచిపోవడంతో వ్యక్తిగతంగా సమయం కేటాయించుకునే వీలు అస్సలు ఉండు. అందులోనూ ఇక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేంత అవకాశం అస్సలు ఉండదు. అలాంటప్పుడు అధిక బరువు సంబంధిత అనారోగ్య సమస్యల బారిన ఇట్టే పడుతుంటారు. అలాంటివాళ్లు ఫిట్‌గా ఉండాలంటే ఈ ఫిట్నెస్ అండ్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలకు ప్రసిద్ధిగాంచిన విద్యుత్ జమ్మాల్ టిప్స్ ఫాలో అయితే చాలు. మరి అవేంటో చూద్దామా..!.టాటాప్లే ఫిట్‌నెస్‌లో ‘ఫిట్ అండ్ ఫేమస్’తో జరిగిన సంభాషణలో ప్రముఖ ఫిట్నెస్ నిపుణుడు విద్యుత్ జమ్వాల్ ఇలా చెప్పుకొచ్చారు. సమయం దొరికినప్పుడు వ్యాయామం చేస్తానని, దొరకనప్పుడు అస్సలు బాధపడని అన్నారు. కానీ ఆఫీస్‌కి వెళ్లేవారు, క్రమబద్ధమైన జీవితం గడిపేవారు ముఖ్యంగా 9-5 ఉద్యోగాలు చేసేవారు నెలకు ఐదు కిలోలు తగ్గాలని లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు. అందుకోసం కనీసం పదికిలోమీటర్లు లేదా కనీసం ఒక కిలోమీటరైనా నడవాలని చెప్పారు. వాళ్ల అవసరాలకు అనుగుణంగా టైమ్టైబుల్ పెట్టుకోవడం, దాన్ని అలవాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. అలా చేస్తే కచ్చితంగా అనారోగ్యం బారిన పడరని అన్నారు.వాకింగ్ ఒక్కటి చాలా..!?దీర్ఘకాలిక ఆరోగ్యానికి నడక ఒక అద్బుతమైన పునాది. దీనివల్ల హృదయ సంబంధ ఆరోగ్యం, బరువు నియంత్రణ, మెరుగైన జీవనశైలి, వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సంపూర్ణ ఫిట్నెస్ కోసం వాకింగ్ మాత్రమే సరిపోదు. బల శిక్షణ, ఫ్లెక్సిబిలిటీ వ్యాయమాలు కూడా తోడవ్వాలి అని చెబుతున్నారు. కేవలం నడకపైనే ఆధారపడితే కష్టమని అన్నారు. దీర్ఘకాలికా ఆరోగ్యం కోసం శరీరానికి తగినంత కదలిక ఉండాలని, నడవడంలో కూడా కొంగొత్త వాటిని జోడించి వాక్ చేయడం మరింత మంచిదని అన్నారు. కండరాలను పెంచుకోవడానికి వారానికి కనీసం రెండుసార్లు రెసిస్టెన్స్ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. దినచర్యలో యోగా, స్ట్రెచింగ్‌ను నేర్చుకుంటే మరింత మంచిదని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) (చదవండి: మా మాష్టారే పేషెంట్‌గా..!) -
అంకుర్ వారికూ ఫిట్నెస్ సీక్రెట్..! నో స్టెరాయిడ్లు, నో షార్ట్‌కట్
వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్ మీడియా వేదికగా 45 ఏళ్ల వయసులో 13% శరీర కొవ్వుని ఎలా తగ్గించుకున్నారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ఎలాంటి స్టెరాయిడ్లు, షార్ట్కట్లు, ఏఐ సలహాలు తీసుకోలేదని చెప్పారు. నిజానికి వయసు పెరిగే కొద్దీ శరీర కొవ్వు సాధారణంగా పెరుగుతుంది. బరువు స్థిరంగా ఉన్నా కొలెస్టాల్ స్థాయిలు పెరుగుతాయట. పైగా వయసుతోపాటు కండర ద్రవ్యరాశిని కోల్పోతామట. దాంతో చర్మం కింద, పొత్తుకడుపు వంటి అంతర్గత అవయవాలలోకి కొవ్వు విసరల్ ఫ్యాట్‌గా స్టోర్ అవుతుందని చెబుతున్నారు. ఇది టైప్2, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట. పైగా రానురాను బరువు తగ్గడం కష్టంగా మారిపోతుందట. పురుషులలో సుమారు 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ..టెస్టోస్టెరాన్ క్రమంగా తగ్గడం జరుగుతుంది. దాంతో కండరాలను నిర్మించడం, కొవ్వు పంపిణీ చేయడంలో సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు అంకుర్ వారికూ. అందుకే తాను 3టీ ఫార్ములాతో ఆరోగ్యకరమైన రీతీలో కొలెస్ట్రాల్‌ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఏంటా ఫార్ములా..? ఎలా అనుసరించాలంటే..T3 ఫార్ములా:T1 - ట్రాక్ వారానికి సుమారు 0.5 కిలోల బరువు తగ్గడానికి, రోజుకు 300 నుండి 500 కేలరీల స్వల్ప లోటు ఆరోగ్యకరమైనదట. డైట ప్లాన్..ఉదయం 9:30 - 1 స్కూప్ వే ప్రోటీన్, క్రియేటిన్, 1 వాల్నట్, 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, 5-6 ఎండుద్రాక్షలుఉదయం 11 గంటలకు - 200 గ్రాముల పనీర్/టోఫు/టెంపే, లేదా దాల్ చిల్లా, అప్పుడప్పుడు గుడ్లు.మధ్యాహ్నం 1 గంటకు - పండ్లుసాయంత్రం 4 గంటలకు - 2 రోటీలు (ఎమ్మర్ గోధుమ/జొన్న/సోయా బీన్) + కూర + పప్పు + తక్కువ కొవ్వు గల పెరుగుసాయంత్రం 6:30 గంటలకు - పెరుగుతో 1 స్కూప్ వే ప్రోటీన్అయితే తనకు ఇష్టమైన చోలే భటూరేని మాత్రం వదిలేయలేదట. అలాగే మిఠాయిని కూడా తిన్నట్లు తెలిపారు. అయితే కేలరీలు బ్యాలెన్స్‌గా ఉండేలా కేర్ తీసుకున్నారట.T2 - శిక్షణగుండె ఆరోగ్యానికి కార్డియో మంచిదే అయినప్పటికీ, వృద్ధులలో దీర్ఘకాలిక కొవ్వు తగ్గడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అత్యంత ప్రభావవంతమైన సాధనం.ఎందుకంటే ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఒకేసారి ఎక్కువ కండర సమూహాలను ఉత్తేజపరచడానికి, సిట్-టు-స్టాండ్స్ లేదా మోడిఫైడ్ ప్లాంక్స్ వంటి బహుళ కీళ్లను ఉపయోగించే వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.వ్యాయామ దినచర్య:టెన్నిస్ - వారానికి 6 రోజులు, 1 గంట (కార్డియో పూర్తయింది)వెయిట్స్ - వారానికి 6 రోజులు, 45 నిమిషాలుప్రతి రోజు: 2 వ్యాయామాలు x 3 శరీర భాగాలకు సంబంధించిన వర్కౌట్లు = 6 వ్యాయామాలు10-12 సార్లు పునరావృతం చేస్తూ మొత్త మూడు సెట్లు చేయాలి.T3 - రూపాంతరంమార్పులను నమోదు చేయడానికి రోజువారీ బరువును, వారపు కొలతలను ట్రాక్ చేసినట్లు తెలిపారు. అలాగే తన ఫోటోలను తన ట్రైనర్‌కు పంపిచినట్లు చెప్పారు.చాలామటుకు అదే డైట్ ప్లాన్ ఫాలో అయినట్లు తెలిపారు.సెలవులకు టూర్‌కి వెళ్లేముందు లేదా బ్రేక్ తీసుకోవాలనుకుంటే.. మరింతగా ఈ దినచర్యను వేగవంతం చేసినట్లు తెలిపారు. శరీరంలోని కొవ్వును తగ్గించడం అంటే మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇక్కడ కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వుని తగ్గించుకుంటే..మొత్తం జీవన నాణ్యతనే మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని అనుభవించవచ్చు అని చెప్పుకొచ్చారు అంకుర్ వారికూ.మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక, వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు శారీరక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల, కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వును కోల్పోవడం మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు వృద్ధాప్య జీవసంబంధమైన సూచికలను నెమ్మదింపజేస్తుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చిం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను పంపించడం ఉత్తమం. (చదవండి: వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు') -
ఫిట్‌నెస్‌లో సరికొత్త ట్రెండ్
నగరవాసులు శాకాహారులుగా మారుతున్నారు.. ఆహారంపై క్రమంగా పెరుగుతున్న అవగాహనతో అటువైపు అడుగులు వేస్తున్నారు. వేగవంతమైన లైఫ్‌స్టైల్‌కు కేంద్రమైన హైదరాబాద్‌లో.. ఓ వైపు మెట్రో పరుగులు, ఆఫీస్ డెడ్లైన్లు, పార్టీ కల్చర్, మరోవైపు వీకెండ్ హ్యాంగౌట్స్.. ఇవన్నీ కలిసి మన ఆహార అలవాట్లను పూర్తిగా మార్చేశాయి. ఎప్పుడు, ఏమి, ఎంత తింటున్నాం అన్న ఆలోచన లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఫలితం.. డైట్ బ్యాలెన్స్ తప్పుతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి. దీనికితోడు అడుగడుగునా రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్.. అంతేనా! మొబైల్ ఫోన్లో ఒక్క క్లిక్‌తో.. నిమిషాల్లో ఇంటికి వచ్చే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వంటివి మన అలవాట్లను దెబ్బతీస్తున్నాయి. దీన్ని మార్చేందుకు కొందరు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు.. సిటీ ట్రెండ్స్ కారణంగా మన ఆహార అలవాట్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పని ఒత్తిడి కారణంగానో.. అలసట కారణంగానో.. ‘ఈ రోజు వండుకోకపోతే ఏమైంది?’ అనే భావన సాధారణం అయ్యింది. ఉదయం అల్పాహారాన్ని తప్పించి కాఫీతో సరిపెట్టడం, లంచ్‌కు బిర్యానీ/ బర్గర్తో ముగించడం, రాత్రి ఆలస్యంగా హెవీ డిన్నర్.. ఇవన్నీ నగర యువతలో సాధారణ అంశాలు. వీటన్నింటినీ సమత్యుల్యం చేయడంపై దృష్టి సారిస్తున్నారు కొందరు నగరవాసులు. ఇందులో భాగంగా వెజ్ వీక్, లంచ్ బాక్స్ మంథ్ అంటూ కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతున్నారు. నాన్ వెజ్ డామినేషన్? ఒకప్పుడు మాంసాహారం వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే ఉండేది. ప్రస్తుతం చికెన్, మటన్, ఫిష్ పేర్లతో రోజుకో వెరైటీ మన ప్లేట్లో వచ్చి చేరుతోంది. ప్రొటీన్ పేరుతో మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, కూరగాయల నిర్లక్ష్యం.. వంటి కారణాలతో ఊబకాయం, కొలె్రస్టాల్, షుగర్ వంటి రోగాల భారిన పడుతున్నారు. ముఖ్యంగా 25–40 ఏళ్ల వయసులోనే లైఫ్‌స్టైల్ రోగాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని అధిగమించేందుకు నిపుణుల సూచనల మేరకు కొందరు క్రమంగా శాకాహారంపై ఆసక్తి కనబరుస్తున్నారు.నో ఔట్‌సైడ్ ఫుడ్ చాలెంజ్.. ఇలాంటి పరిస్థితుల్లో నగరవాసుల్లో కొత్త అవేర్నెస్ కనిపిస్తోంది. పూర్తిగా డైట్ మార్చలేకపోయినా, కనీసం కొన్ని రోజులు నియంత్రణలో ఉండాలనే ప్రయత్నం పెరిగింది. ‘వెజ్ వీక్’, ‘వెజ్ మంథ్’ అంటూ కొన్ని రోజులు నాన్‌వెజ్‌కు బ్రేక్ పెట్టడం.. ఏడు రోజులు ‘నో ఔట్‌సైడ్ ఫుడ్’ చాలెంజ్, ఓన్లీ హోమ్ ఫుడ్’, రెగ్యులర్ లంచ్ బాక్స్.. వంటివి ట్రెండ్‌గా మారాయి. ఆఫీసులో సహోద్యోగులతో కలిసి ‘హోమ్ ఫుడ్ డేస్’ ప్లాన్ చేయడం.. ఒకప్పటి స్కూల్ డేస్‌ను గుర్తు చేస్తున్నాయి. స్వయంగా వంట చేసుకునే యువత కూడా పెరుగుతోంది. రైస్, కూర, పప్పు, పెరుగు వంటి సింపుల్ మీల్స్ ఎంత ఆరోగ్యకరమో మళ్లీ అర్థమవుతోంది. దీనికి తోడు మీల్ ప్రిప్ కల్చర్, వారం రోజులు వంట సిద్ధం చేసుకోవడం వంటి కాన్సెప్్ట్స హైదరాబాద్‌లో పాపులర్ అవుతున్నాయి.చిన్న ప్రయత్నం.. పెద్ద మార్పు.. అందరూ ఒక్కసారిగా ఫిట్ ఫుడ్‌కే మారాలి అనుకోవడం ఆచరణసాధ్యం కాకపోవచ్చు. కానీ వారానికి కొన్ని రోజులు కంట్రోల్డ్ డైట్, ఇంటి ఆహారానికి ప్రాధాన్యం, నాన్ వెజ్‌ను పరిమితంగా తీసుకోవడం, బయట ఆహారం తగ్గించడం.. ఇవే పెద్ద మార్పుకు పునాది. నగర జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్ తప్పదనిపించినా, ఆరోగ్యం కోసం తీసుకునే చిన్న నిర్ణయాలే భవిష్యత్తును కాపాడతాయనేది డైట్ నిపుణుల అభిప్రాయం. -
ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు..ఆ సామర్థ్యం పొందడమే!
భారతదేశంలో గ్లామర్ రంగంలో ఉంటూ ఫిట్‌నెస్‌లో గట్టి ప్రభావం చూపిన కొద్దిమంది వ్యక్తులలో మిలింద్ సోమన్ ఒకరు. సాధారణంగా ప్రతీ ఒక్కరూ రిటైర్ మెంట్ తీసుకునే 60 సంవత్సరాల వయస్సులో ఆయన యువ తరానికి గొప్ప ప్రేరణగా మారాడు. కానీ, సోమన్ తనను తాను ప్రేరణగా భావించుకోడు, అది మన చుట్టూ ఎప్పటి నుంచో ఉన్నదని గమనించడంలోనే తేడా ఉందని అంటాడు. తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించలేదని ఆయన అంటున్నాడు. అయితే కొందరైనా ప్రేరణ పొందినందుకు తనకు సంతోషంగా ఉందన్నాడు. మిళింద్ సోమన్ 1990లలో సూపర్ మోడల్‌గా నిలిచాడు. ఆ తర్వాత జుర్మ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్,, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు సిరీస్‌లలో నటించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వీటికి అదనంగా, అతను రన్నింగ్ ట్రాక్‌పై తనకు సాటిలేని స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకున్నాడు సుదూర ప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అసాధ్యమైన పరిస్థితులను పరుగుతో కవర్ చేశాడు.మనం మహిళలకు మాత్రమే ఒక ప్రత్యేక ఫిట్నెస్ ఈవెంట్‌ను సృష్టిస్తే? ఈ ప్రశ్నకు సమాధానంగా గత 2012లో, సోమన్ ఆయన భార్య అంకితా కోన్వర్‌లు కలిసి పింక్‌థాన్‌ను స్థాపించారు ఇప్పుడు ఆ ఈవెంట్ భారతదేశంలోనే అతిపెద్ద మహిళల పరుగు కార్యక్రమంగా అవతరించింది. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు అనుభవాలు పంచుకున్నారు.చాలా మంది కండలు తిరిగిన శరీరం అనుకుంటారని అయితే తన దృష్టిలో ఫిట్నెస్ అంటే అది ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యం అని ఆయన పేర్కొంటాడు. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, జీవితం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నాడు. ఇది సిక్స్ ప్యాక్స్ లేదా బైసెప్స్ గురించి అవి అందించే లుక్స్ గురించి కాదు. ఇది మన శరీరపు పనితీరు గురించి అని విశ్లేషిస్తున్నాడు.తాను దాదాపు 25 సంవత్సరాల క్రితమే పరుగు ప్రారంభించానని, కొంత కాలం తర్వాత చాలా మంది పరుగు ప్రారంభించారని, అలాగే కేవలం ముంబైలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గమనించానన్నాడు. అయితే మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి ఉండడం లేని పరిస్థితిలో.. మనం మహిళలకు మాత్రమే ఒక ఈవెంట్‌ను సృష్టించాలని ఆలోచించానన్నాడు. అయితే వారు స్పందిస్తారా?అని తొలిదశలో సందేహించానన్నాడు. ఎందుకంటే చాలా మంది మహిళలు ఇప్పటికీ వ్యాయామం క్రీడలు అంటే పురుషుల కోసమే అని భావిస్తున్నారని..అయితే మేం ధైర్యంగా ముందడుగు వేశామన్నాడు. చీర ధరించి పరుగులు తీయడం, చీర ధరించి సైక్లింగ్ చేయడం, యోగా నడక...వంటివన్నీమేళవించి.. ఈ కార్యక్రమం తన కోసం కాదని ఏ మహిళా భావించకుండా దీనిలో భాగం చేశామని వివరించాడు. మహిళలు ఎవరికోసమో లేదా బయటి దానికోసమో కాదు, తమ కోసం తాము పరుగు తీయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నాడు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning)(చదవండి: ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
జస్ట్ ఒక్క ఏడాదిలో 26 కిలోల బరువు..! నో డైట్ ప్లాన్, నో ఫిట్నెస్ మంత్ర
దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్య అధిక బరువు అందర్నీ వేధిస్తున్న సమస్యగా మారింది. గంటల తరబడి కూర్చొని చేసే డెస్క్ ఉద్యోగాలు, కదలికలు లేకపోవడం, వీటికి తోడు జంక్ ఫుడ్ ఇవన్నీ ఊబకాయానికి దారితీస్తున్నాయి. దీన్ని తగ్గించుకోవాలని ఎంతో ప్రయాసపడి కఠిన డైట్లు అనసరించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాంటి వాళ్లు తప్పనిసరిగా ఈ మిరాకిల్ పద్ధతిని అనుసరించి త్వరితగతిన బరువు తగ్గొచ్చని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ జెసికా ఆర్ట్వానీ. అదెలాగో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాను ఆ పద్ధతిలోనే దాదాపు 26 కిలోలు బరువు తగ్గినట్లు తెలిపారు కూడా. మరి ఆ మిరాకిల్ టెక్నిక్ గురించి సవివరంగా తెలుసుకుందామా..!.చాలామంది బరువు తగ్గేందుకు షార్ట్కట్లు, తీవ్రమైన దినచర్యలు అనుసరిస్తుంంటారు. నిజానికి బరువు తగ్గడం అనేది సాధారణంగా స్థిరంగా చేసే చిన్న అలవాట్ల వల్లే సాధ్యమవుతుందని అంటున్నారు. గతేడాది నుంచి తాను చిన్ని చిన్న సాధారణ అలవాట్లపై దృష్టిపెట్టి 26 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. తనకు ఈ 26 కిలోలు బరువు తగ్గడానికి ఆ ఐదు సాధారణ అలవాట్లు హెల్ప్ అయ్యాయని చెబుతోంంది. త్వరితగతిన బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఓ అద్భుతమైన పద్ధతని అభివర్ణిస్తోంది. తాను ఎలాంటి స్ట్రిక్ట్ డైట్లు, ఖరీదైన ఫిట్నెస్ ప్రోగ్రామ్‌లు పాటించలేదని చెబుతోంది జెసికా. తన వెయిట్‌లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ..తాను బరువు తగ్గడానికి స్థిరంగా ఈ ఐదు పనులు చేశానని తెలిపింది. ఎలాంటి ఫ్యాన్సీ హ్యాక్స్, షార్ట్కట్లు లేవని అంటోంది. సహాయపడిన ఆ ఐదు అలవాట్లు..వీలైనంత ఎక్కువగా నడవడం: నడక తన దినచర్యలో అతిపెద్ద మార్పులలో ఒకటి. సాధ్యమైనప్పుడల్లా తన రోజులో కదలికను ఒక భాగంగా చేసుకున్నానని జెసికా చెప్పింది. ఆమె మార్నింగ్ వాకింగ్, భోజనం తర్వాత రాత్రి తప్పనిసరిగా కొద్దిసేపు నడక చేసినానని వివరించారామె.ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తగ్గించడం: ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తొలగించానని తెలిపింది. అంటే అప్పుడప్పుడూ కనీసం దాని జోలికి పోలేదని, పూర్తిగా దూరం పెట్టానని చెప్పుకొచ్చింది. ఎక్కువ నీరు త్రాగడం: ఆమె దృష్టి సారించిన మరో అలవాటు హైడ్రేషన్. కానీ తగినంత నీరు త్రాగడం చాలా పెద్ద తేడాను చూపిస్తుంది. ఇది చాలా శక్తిమంతమైన మార్పుకి నాంది అని అంటోంది. ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం: ప్రోటీన్ తన భోజనంలో కీలక పాత్ర పోషించిందని చెబుతోంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి పైగా అనవసరమైన చిరుతిండిని తగ్గిస్తాయి. ఇక్కడ ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతినందించి, ఆకలి కోరికలను నియంత్రిస్తుంది.ఒక సవాలు పెట్టుకోవడం: తాను అనుకున్నట్లుగా అన్ని పాటించానా లేదా అనే సెల్ఫ్ చెకింగ్ లేదా జవాబుదారితనం తనకు బరువు తగ్గాలనే ఆకాంక్షను రెట్టింపు చేసేదట. దాంతో చాలా కేర్‌ఫుల్‌గా ఉండటమే గాక తనను తాను ప్రశ్నించుకునేటప్పడూ..దోషిలా ఉండకూదన్న భయం సదా వెయిట్‌లాస్ అయ్యేందుకు ప్రేరేపించేదట.ఇక్కడ జెసికా వెయిట్‌లాస్ జర్నీలో ..బరువు తగ్గాలంటే తీవ్రమైన మార్పులు, అతి వర్కౌట్లు అవసరం లేదు. కేవలం చిన్న అలవాట్లే స్థిరంగా.. కంటిన్యూటీ మిస్ కాకుండా చేస్తే చాలు బరువు తగ్గడం చాలా సులభమని తెలుస్తోంది కదూ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు) -
ఆ నిర్ణయం ఆ జంటను హెల్దీగా మార్చింది..! ఏం చేశారంటే..
ఆరోగ్యం, వ్యాయామాలు సామాన్యుల వల్ల ఎక్కడవుతుంది అన్నమాటలు ఎన్నోసార్లు విని ఉంటారు. బాగా డబ్బున్నవాళ్లకు, యువతకు మాత్రమే సాధ్యం అనేది చాలామంది భావన. వాళ్లకు ఏ బాధ్యతలు, బరువులు అంతగా ఉండవు కాబట్టి హాయిగా చేయగలరని అనుకుంటుంటారు. కానీ ఈ మధ్యతరగతి జంట గురించి విన్నాక ఆ అభిప్రాయం కచ్చితంగా మారుతుంది. 50లలో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని.. మేల్కొని విజయం సాధించడమే గాక..ఇతరులకు స్వచ్ఛందంగా ఆరోగ్యస్పృహ కలిగిస్తున్నారు. మరి ఆ జంట ఫిట్నెస్ ప్రయాణం ఎలా సాగిందంటే..చాలామందికి ఫిట్నెస్ అనేది యువతకు చెందినదిగా అనిపిస్తుంది. పెద్దలకు సుదీర్ఘ పనిదినాలు, కుటుంబ బాధ్యతలు ఆరోగ్యాన్ని పక్కన పెట్టేలా చేస్తాయి. కనీసం శరీరం చెప్పే సంకేతాలను కూడా పట్టించుకోరు. తమ ఆరోగ్యం కంటే..కుటుంబ బరువు బాధ్యతలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలానే భావించారు డెహ్రాడూన్‌కు చెందిన తారా థాపా ఆయన భార్య సుశీలా. తార ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ రిపేర్ షాపుని నడుపుతుండగా, సుశీల బీమా సలహాదారుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరి ఫోకస్ కుటుంబ బాధ్యతలపైనే ఉంది. తమ ఇద్దరు కుమారులను పెంచడం, ఓ చక్కటి ఇంటిని నిర్మించుకోవడం ఇవే తమ ఆశయలు, జీవితం అన్నట్లుగా బతికారిద్దురు. అనుకున్నట్లుగా కుమారులు చక్కగా జీవితంలో స్థిరపడ్డారు. ఒకరు సోలార్ పర్మిట్ డిజైనర్‌గా, మరొకరు కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్నారు. కానీ అప్పటికే ఆ జంటను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తారాకి తీవ్రమైన వెన్నునొప్పి, సుశీల నిరంతర అలసట, పునరావృతమయ్యే మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డారు ఇద్దరూ. అప్పుడే ఇరువురికి తమ శారీరక పరిమితులను అంగీకరిస్తూ ఆగిపోకూడదని అనిపించింది. ఆ అనారోగ్య సమస్యలను సవాలు చేసేలా.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నారు. 2017లో, తార ఫిట్‌నెస్‌పై తీవ్రంగా దృష్టి పెట్టడం ప్రారంభించారు. దాన్ని చూసి భార్య సుశీల రెండేళ్ల తర్వాత 2019లో ఆయన బాటలోనే నడిచింది. అలా ఈ జంట రోజు సూర్యోదయానికి చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. ఉదయం ఐదు గంటలకల్లా..వ్యాయామాలు చేయడానికి, వాకింగ్‌కి రెడి అయిపోతారు. కొండలలో నివసించడం వల్ల వారు ప్రకృతిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా మారింది. తరచుగా డెహ్రాడూన్ చుట్టూ ఉన్న పర్వతాల గుండా ట్రెక్కింగ్ చేస్తూ సెలవులను ఆస్వాదిస్తుంటారు. భోజనంలో కూడా పప్పులు, కూరగాయలు, కాలనుగుణ పండ్లను భాగం చేసుకునేవారు. పండుగల సమయంలో కూడా, వారు అతిగా తినడం కంటే సమతుల్యతపే పాటిస్తూ.. మితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయాణం తమ సొంత ఇంటిని దాటి ప్రేరేపించడం మొదలైంది. మూడేళ్ల క్రితం సుశీల పింక్ పాంథర్ అనే మహిళా సమూహాన్ని ప్రారంభించారు. ఈ బృందంలో మహిళలు సౌకర్యవంతమైన ప్రాంతాల నుంచి బయటకు వెళ్లి ఫిట్నెస్ను స్వీకరించమని ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు తమ ఇళ్లను వదిలి వెళ్ళడానికి కూడా సంకోచించిన చాలా మంది సభ్యులు ఇప్పుడు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం పరిగెత్తుతుండటం విశేషం. అంతేగాదు ఈ జంట తమ ఫిట్నెస్ ప్రయాణాన్ని ఆన్లైన్లో పంచుకోవాలని నిర్ణయించుకోవడంతో వారి కథ చాలమందికి కనెక్ట్ అయ్యి..ఎందరినో ప్రేరేపించింది. ఈ జంట వ్యక్తిగత వృద్ధి వాయిదాగా మారకూడదని, వయసు ఎప్పుడూ సాకుగా మారకూడదని తమ చేతలతో చెప్పకనే చెప్పారు కదూ. నెటిజన్లు సైతం చాలా స్ఫూర్తిదాయకం అని ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) గమనిక: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికే. అనుసరించే ముందు వ్యక్తిగత సమస్యలను పరిగణనలోనికి తీసుకోవాలి, అలాగే వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!) -
8 రోజులు.. 800 కిలోమీటర్లు..!
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది రోజుల పాటు హైదరాబాద్ నుంచి ముంబై వరకూ 800 కిలోమీటర్ల సైకిల్ యాత్రకు సంకలి్పంచాడు.. ఇందులో భాగంగా 30 చోట్ల ఫిట్నెస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు నిర్ణయించుకున్నాడు.. మార్చి 7 ప్రారంభమైన ఈ సైకిల్‌యాత్ర 14 వరకూ కొనసాగనుంది. ప్రజలకు ఫిట్నెస్, సైక్లింగ్ ప్రాముఖ్యతను వివరించడమే లక్ష్యంగా వెల్నెస్ అడ్వొకేట్ కాంతి దత్ ముందుకు కదులుతున్నాడు. ఫియర్ ప్రాజెక్ట్ పేరిట స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నోవోటెల్ హోటల్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఫిట్నెస్ ప్రేమికులు పాల్గొని కాంతి దత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచే సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు. ఎనిమిది రోజుల పాటు.. మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ సుమారు 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సమావేశమై ఫిట్నెస్ ప్రాముఖ్యత, సైక్లింగ్ ప్రయోజనాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించనున్నారు. ‘పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థ అయిన సైక్లింగ్‌ను ప్రోత్సహించడం, రోజువారీ జీవితంలో సైక్లింగ్‌ను భాగం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అవగాహన కల్పించడం’ ప్రాధాన లక్ష్యమని కాంతి దత్ తెలిపారు. (చదవండి: తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవాడైనా..) -
జిమ్ చేద్దాం... ఫిట్‌గా ఉందాం...
పురుషులకే కాదు, మహిళలకూ వ్యాయామం అవసరం. నిజానికి మహిళలకు వ్యాయామం మరింత ముఖ్యం. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే, తర్వాతి తరం ఆరోగ్యంగా ఉంటుంది. మొత్తం సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామం చేసినా, చేయకపోయినా యవ్వనంలో సహజంగానే ఆరోగ్యంగా ఉంటాం. వయసు గడిచే కొద్ది కండరాల పటుత్వం సడలిపోతుంది. మన శరీరానికి శక్తి కావాలి, కండరాలకు పటుత్వం కావాలి. వయసు మళ్లినా, కండరాల్లో పటుత్వం సడలిపోకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. తేలికపాటి వ్యాయామాలు మొదలుకొని బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలు చేస్తూ ఉంటే, క్రమంగా శక్తి పెరిగి, కండరాలు పటుత్వాన్ని సంతరించుకుంటాయి. హార్మోన్లలో అసమతుల్యతలు ఉన్నట్లయితే, క్రమంగా అవి ఒక కొలిక్కి వస్తాయి. నాకు చిన్నప్పటి నుంచే చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి ఉండేది. స్కూల్ రోజుల్లోనే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ వంటి పోటీల్లో బహుమతులు గెలుచుకునేదాన్ని. మా నాన్నగారు నన్ను ప్రోత్సహించేవారు. నా బాల్యమంతా కాకినాడలో జరిగింది. అక్కడే ఏడో తరగతి వరకు చదువుకున్నాను. టెంత్, ఇంటర్, డిగ్రీ రోజుల్లో స్టేట్ లెవల్‌కు వెళ్లాను. పెళ్లయిన తర్వాత వైజాగ్ వచ్చాను. జిమ్ నడపాలని అనుకుంటున్నట్లు మావారికి చెబితే, ప్రోత్సహించారు. వైజాగ్‌లో జిమ్ పెట్టడానికి ముందు ఏరోబిక్స్‌లో శిక్షణ తీసుకున్నాను. మహిళలు తలచుకుంటే ఏమైనా సాధించగలరు. అయితే, సాధించాలనే తపన ఉండాలి. క్రమశిక్షణ, చేసే పని పట్ల ఏకాగ్రత, అంకితభావం ఉండాలి. మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఈ సూత్రాలను తప్పకుండా పాటించాలి. నా దగ్గరకు వచ్చే మహిళల్లో ఎక్కువమంది నెలసరి క్రమం తప్పడం, స్థూలకాయం, హార్మోన్ అసమతుల్యతలు, కాన్పుల తర్వాత శరీరతత్త్వంలో మార్పులు వంటి సమస్యలతో బాధపడేవారే ఎక్కువ. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి వారి శరీర తత్త్వం తెలుసుకుని, వారి వయసును బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి ఎలాంటి వ్యాయామాలు చేయాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో వారికి చెబుతుంటాను. చాలామంది మహిళలు ఒకటి రెండు రోజులు జిమ్‌కు వచ్చాక తర్వాత మానేస్తారు. ముందు వాళ్ల మైండ్‌సెట్ మార్చాలి. ఆరోగ్యం కాపాడుకోవడానికి అతిగా ప్రయాస పడనక్కర్లేదు. మన వంటిల్లే ఔషధాలయం. వంటింట్లో తరచుగా వాడుకునే దినుసులతోనే చాలావరకు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. జీలకర్ర, మిరియాలు, మెంతులు, దాల్చినచెక్క, లవంగాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉసిరి, గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు, చియా విత్తనాలు వంటివి శరీరాన్ని డీటాక్స్ చేసుకోవడానికి బాగా ఉప కరిస్తాయి. ఫిట్నెస్ నిపుణురాలిగా ఈ సమాజం నాకు ఒక స్థానాన్ని ఇచ్చింది. సమాజానికి నేను తిరిగి ఇవ్వగలిగేది నా విద్యను మాత్రమే! నాకు తెలిసిన విద్య హెల్త్ అండ్ ఫిట్నెస్. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో ప్రతిరోజూ తప్పనిసరిగా ఒక ఫిట్నెస్ రీల్ పెడతాను. నాకు దాదాపు ఎనభైవేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంట్లోనే ఉంటూ మహిళలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ఉపయోగపడే వ్యాయామాలు, చిట్కాలతో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు తగిన రెసిపీస్ కూడా పెడుతుంటాను. పగటిపూట వేళకు తినడం, రాత్రివేళ త్వరగా భోజనం ముగించడం, రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. కూల్‌డ్రింక్స్, మద్యం, పొగతాగడం వంటివి మానుకుని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే చిరకాలం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఫిట్నెస్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదు, జిమ్‌లో వ్యాయామాలు చేయడం మాత్రమే కాదు. మనిషికి ఫిట్నెస్ నాలుగు రకాలుగా ఉండాలి. ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్, స్పిరిచ్యువల్ ఫిట్నెస్ ఉంటేనే మనిషి సంపూర్ణంగా ఫిట్‌గా ఉన్నట్లు. -అను ప్రసాద్ , హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్ -
అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్ రహస్యం ఇదే..
కొందరు వయసు గడుస్తున్న కొద్దీ.. వృద్ధుల్లా కనిపించరు. యంగ్‌లుక్‌లో యువకుల మాదిరిగా ప్రకాశవంతంగాకనిపిస్తూ ఆశ్చర్యపరుస్తారు. అస్సలు అదెలా సాధ్యం అనిపిస్తుంది కూడా. వయసు రీత్యా అంత ఏజ్ ఉన్నా కూడా.. ఏ మాత్రం వృద్ధాప్య ఛాయలు కనుచూపు మేరలో కూడా కానరావు. ఇక్కడ ఈ మోడల్ కూడా అదే కోవకు చెందినవాడు. ఎవరతను అంటే..సింగపూర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, మోడల్ చువాండో టాన్‌కి మార్చి 03, 2026న అధికారికంగా 60 ఏళ్లు నిండాయి. కానీ దశాబ్దాలుగా టీనేజ్ యువకుడిలా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అతడి యంగ్‌లుక్ అందర్నీ విస్మయపరుస్తుంటుంది. కనీసం మచ్చుకైనా వృద్ధాప్య ఛాయలు ఎక్కడ కానరావు. అంతలా మెయింటైన్ చేస్తున్నా అతడి గ్లామర్ రహస్యం ఏంటో తెలసుకోవాలన్న కుతుహలం అందరిలోనే రేకెత్తిస్తుంటుంది. మరి అంతలా యవ్వనంగా కనిపించాలంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో తెలుసా..!?.లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందంటే..ఎలాంటి బ్యూటీ చికిత్సలు తీసుకోడు. దీర్ఘకాలిక క్రమశిక్షణయుత జీవనమే మేలుబ్రేక్ఫాస్ట్: గుడ్లు, తేనె, అవకాడోతో ప్రోటీన్ షేక్స్ లేదా ఓట్మీల్ అల్పాహారాన్ని తీసుకుంటానని తెలిపాడు. లంచ్ లేదా డిన్నర్:భోజనంలో సాధారణంగా ఉడకబెట్టిన లేదా కాల్చిన చికెన్ లేదా చేప, రసం విత్ రైస్ ఉంటాయి. తప్పనిసరిగా వర్కౌట్లు. ఇవి కేలరీలు బర్న్ చేయడానికి సమతుల్యతను బ్యాలెన్స్ చేసేలా డైట్ అత్యంత ముఖ్యమని చెబుతున్నాడు. పగటిపూట చేసే కార్యకలాపాలు ఆ రోజుల్లో మీరు బర్న్ చేసే కేలరీలకు సమానంగా ఉండాలని చెబుతున్నాడు. నాణ్యమైన నిద్ర తప్పనిసరి. ఒత్తిడిలేని సానుకూల మనస్తత్వం అత్యంత ముఖ్యం. ఆరోగ్యమైన వృద్ధాప్యానికి ఇవి అత్యంత కీలకమని చెబుతున్నాడు టాన్. అయితే తాను మద్యం, కాఫీ, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడట. వారానికి మూడు నుంచి ఐదు సార్లు బల శిక్షణ, కార్డియో వ్యాయామాలు, ఈత తదితరాలు ఉంటాయట. కాగా, టాన్ ఇటీవల కొద్దికొద్దిగా వృద్ధాప్యంలో దరిచేరే కొద్దిపాటి శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. సహజంగా కాలంతో వచ్చే వృద్ధాప్యాన్ని ఆపలేమని, కాకపోతే దాన్ని హెల్దీగా మార్చుకుంటే..ఆరోగ్యకరమైన వార్దక్య జీవితాన్ని గడపొచ్చని టాన్ చెబతున్నాడు. అంతేగాదు అతడి పోస్ట్‌ల్లో సైతం ఆసక్తికరమైన సందేశాలతో నెటిజన్లను ఆకట్టుకుంటాడు. వాటిని చూస్తే అవగతమవుతోంది ఫిట్నెస్ పట్ల ఎంత కేర్‌గా ఉంటాడనేది. కాగా, టాన్ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. సమయాన్ని నిజమైన సంపదగా పేర్కొన్నాడు. ప్రతి సూర్యోదయం చూసేలా, అనుభవించేలా చేస్తున్నందుకు, ఇప్పటికీ ఈ భూమిపై ఉన్నందకు సదా కృతజ్ఞుడును. ప్రతి రోజు ప్రకృతిలో గడపడం, సూర్యకాంతిలో గడపడం మిస్ చేసుకోవద్దు అని రాసుకొచ్చాడు పోస్ట్‌లో. సింపుల్‌గా చెప్పాలంటే సమయం, ఆరోగ్యం అత్యంత విలువైనవని, వాటిని నిర్లక్ష్యం చేస్తే.. అన్ని దూరమైపోతాయని చెప్పకనే చెప్పాడు టాన్. View this post on Instagram A post shared by CHUANDO TAN 陈传多 (@chuando_chuandoandfrey) (చదవండి: ఫ్లైట్ వాష్‌రూమ్‌ని జిమ్‌గా మార్చేశాడుగా..!) -
ఫ్లైట్ వాష్‌రూమ్‌ని జిమ్‌గా మార్చేశాడుగా..!
కొందరు భలే విచిత్రంగా ఉంటారు. ఒక్కరోజు వర్కౌట్లు మిస్సైతేనే ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా లబోదిబోమంటారు. ఎలా ఉన్నా..ఎక్కడ ఉన్నా..టెన్షన్‌గా వ్యాయామాలు చేసేయాల్సిందే. అందుకోసం ఏం చేసేందుకైనా, ఎంత కష్టమైనా డోంట్ కేర్. ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఈ టైపే. అయితే ఈ వ్యక్తి ఫిట్నెస్ పిచ్చి ఏ రేంజ్లో ఉందో చూస్తే..ఓర్నీ గాల్లో కూడానా. అంటారు.ఇంతకీ ఏం చేశాడంటే..బెర్లిన్‌కు చెందిన ఎండ్యూరెన్స్ అథ్లెట్, కంటెంట్ క్రియేటర్ డోమ్ స్ట్రోహ్..ఫ్లైట్‌లో దాదాపు పదకొండు గంటల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే ఆ క్రమంలో చాలా గంటలు కూర్చోనే ఉండాల్సి ఉంటుంది. కనీస కదలికలు కాస్త కష్టమే. అందువల్ల మనోడు ఎక్కడ ఆరోగ్యం పాడవ్వుతుందని అనుకున్నాడో ఏమో గానీ. ఎలాగైనా..ఈ పరిస్థితుల్లో కూడా తన ఫిట్‌నెస్‌ని కాపాడు కోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాడు. అందుకని ఏకంగా ఫ్లైట్‌లో ఉండే టాయిలెట్‌నే జిమ్‌గా మార్చేశాడు. విమానంలో సాధారణంగా వాష్‌రూమ్‌లు చాలా చిన్నగా ఉంటాయి. అంత ఇరుకైనా వాష్ రూమ్‌లో మనోడు ఏకంగా 5కే రన్ పూర్తి చేసే సాహసం చేశాడు. అసలు మనిషి ఒక్కడే పట్టేంత స్థలంలో వాకింగ్ అనేదే సాధ్యం కాదు..కానీ డోమ్ ఏకంగా రన్ చేయాలనుకుంటున్నాడు. ఎలా చేశాడో కూడా అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశాడు డోమ్. అంతేకాదండోయ్ నిజంగానే 5.5 కిలోమీటర్లు రన్చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మనిషి అటు ఇటు కదలడానికి ఏ మాత్రం చోటు లేని ఆ చిన్న బాత్రూమ్లో మనోడు అంత వర్కౌట్ పూర్తి చేశాడా..? అని ఆశ్చర్యం కలుగక మానదు. ఇంకెందుకు ఆలస్యం డోమ్ ఆ స్టంట్ ఎలా పూర్తిచేశాడో చూసేయండి మరి..!. నెటిజన్లు కూడా మీరొక్కరే బాత్రూంలో అంతసేపు ఉండిపోయి..ఎంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టారో ఏంటో అని కొందరు. పాపం గాల్లో స్టంట్ చేయాలనుకున్నాడు కాబోలు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Dom Stroh (@dom.stroh) (చదవండి: ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’) -
ఫిట్నెస్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ‘జెఫింగ్’
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎవరికైనా సరే ఒక పెద్ద సవాలుగా మారింది. బరువు తగ్గాలని ఉత్సాహంగా పరుగు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే తీవ్రమైన అలసట, కండరాల నొప్పులు వచ్చేస్తుంటాయి. అటువంటి వారి కోసం ‘జెఫింగ్’ అనే సరికొత్త వ్యాయామ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇది కేవలం పరుగు మాత్రమే కాదు, అలాగని కేవలం నడక కూడా కాదు.. ఈ రెండింటి కలయికతో కూడిన ఒక అద్భుతమైన ఫిట్నెస్ సూత్రం... అద్భుత మంత్రం..ఎలా మొదలయ్యింది?ఒలింపిక్ రన్నర్ జెఫ్ గాల్లోవే ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ విధానానికి ఆయన పేరు మీదనే ‘జెఫింగ్’ అని పేరు వచ్చింది. ఇటీవలే తన 80 ఏళ్ల వయసులో కన్నుమూసిన గాల్లోవే.. ఫిట్నెస్ ప్రపంచానికి అందించిన అతిపెద్ద కానుక ఇది. నిర్ణీత సమయం పాటు పరిగెత్తడం, ఆ వెంటనే కొంత సమయం వేగంగా నడవడం అనే ప్రక్రియ ద్వారా శరీర సత్తువను పెంచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. బరువు తగ్గాలని ఉత్సాహంగా పరుగు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే తీవ్రమైన అలసట, కండరాల నొప్పులను చూసి నీరసించిపోయే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అటువంటి వారి కోసం ‘జెఫింగ్’ అనే సరికొత్త వ్యాయామ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.‘30-30’ మ్యాజిక్ ఫార్ములానిర్ణీత సమయం పాటు పరిగెత్తడం, ఆ వెంటనే కొంత సమయం వేగంగా నడవడం అనే ప్రక్రియ ద్వారా శరీర సత్తువను పెంచడమే ‘జెఫింగ్’ ప్రధాన ఉద్దేశ్యం. జెఫింగ్లో అత్యంత ప్రాచుర్యం పొందిన సూత్రం ‘30-30’ ఫార్ములా. అంటే 30 సెకన్ల పాటు పరుగు, ఆ వెంటనే 30 సెకన్ల పాటు చురుకైన నడక. ఇలా చేయడం వల్ల కండరాలు పూర్తిగా అలసిపోకముందే వాటికి స్వల్ప విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల సాధారణంగా పరిగెత్తే దూరం కంటే ఎక్కువ దూరం సులువుగా పరుగెత్తగలుగుతారు.సామర్థ్యం అనుసరించి మూడు స్థాయిలుఈ వ్యాయామాన్ని ప్రారంభించే వారు తమ శారీరక స్థితిని అనుసరించి మూడు స్థాయిలలో సాధన చేయవచ్చు. కొత్తగా మొదలుపెట్టే వారు 30 సెకన్ల పరుగు-నడక విరామాలను పాటించవచ్చు. మధ్యస్థ స్థాయి వారు 3 నిమిషాల పరుగుకు ఒక నిమిషం నడకను, నిష్ణాతులు 9 నిమిషాల పరుగుకు ఒక నిమిషం నడకను అనుసరించవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. పూర్తిగా అలసిపోయేంత వరకు వేచి చూడకుండా, మొదటి నుంచే ఈ విరామాలను పాటించడం వల్ల కండరాల ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు.నడక అంటే అదొక స్ట్రాటజీజెఫింగ్లో ‘నడక’ అంటే విశ్రాంతి అని భావించకూడదు. గుండె కొట్టుకునే వేగం తగ్గకుండా చురుకుగా సాగాలి. పరుగు తీసే సమయంలో వీపు, భుజాలు నిటారుగా ఉంచి, చేతులను 90 డిగ్రీల కోణంలో ఉంచుతూ పక్కవారిలో సులువుగా మాట్లాడగలిగే వేగంతో సాగాలి. ఒకవేళ ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తే ‘హఫ్ అండ్ పఫ్’ నిబంధన ప్రకారం పరుగు సమయాన్ని తగ్గించి, నడక సమయాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.గాయాల ముప్పు తక్కువఈ క్రమబద్ధమైన విధానం వల్ల కీళ్ల మీద పడే ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. బరువు తగ్గడమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. సాధారణ పరుగులో ఎదురయ్యే గాయాల బారిన పడకుండా, ఎక్కువ కాలం ఫిట్నెస్ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ‘జెఫింగ్’ తోడ్పడుతుంది.కండరాల నొప్పులను తగ్గించి..ఈ వ్యాయామ విధానం కండరాల నొప్పులను తగ్గించి, శరీరం త్వరగా కోలుకునేందుకు అద్భుతంగా పని చేస్తుంది. పరుగును ఒక శిక్షగా కాకుండా ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక సరైన మార్గం. అందుకే మీరు కూడా ఈరోజే మీ ‘జెఫింగ్’ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేయండి. ఇది కూడా చదవండి: చపాతీలు చేస్తూ చెత్త బుట్ట.. వంట మనిషిని పట్టుకున్న ఏఐ బాట్ -
Yoga ఉత్కటాసనం ప్రయోజనాలు అమోఘం, ఈ జాగ్రత్తలు మస్ట్
Yoga రోజూ ఎకువసేపు కూర్చుని పనిచేసేవారిని క్రమంగా నడుం నొప్పులు వెంటాడుతుంటాయి. ఈ నొప్పి నుంచి ఉపశమనం అందించే ఆసనాల్లో సాధన చేయదగిన ముఖ్యమైన శ్రేణిలో నిలిచే ఆసనం ఉత్కటాసనం. ‘ఉత్కట’ అంటే శక్తిమంతమైన/తీవ్రమైన అని అర్థం. ఈ ఆసనం శరీరానికి బలాన్ని, స్థైర్యాన్నీ ఇస్తుంది.ఉత్కటాసనం ప్రయోజనాలు...కాళ్ల కండరాలు, తొడలు కండరాలు బలపడతాయి. రక్తప్రసరణ, శ్వాసక్రియ మెరుగుపడతాయి. శరీరంలో మెటబాలిజం పెరిగి అధికబరువు సమస్య తగ్గు ముఖం పడుతుంది. కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. పొట్ట భాగం, వెన్నెముకకు సపోర్ట్ పెరుగుతుంది. బ్యాలెన్స్– స్టెబిలిటీ మెరుగు పడుతుంది. శరీర సమతుల్యత పెంపొందుతుంది. మెటబాలిజం ఉత్తేమవు తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగు పడుతుంది, శరీరానికి ఉత్సాహం వస్తుంది. మనసుకు ఏకాగ్రత ఫోకస్ పెరుగుతాయి.ఇదీ చదవండి: పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్,షాకింగ్ వీడియోజాగ్రత్తలు...మోకాళ్ల నొప్పి/ వెన్నునొప్పి / డిస్క్ సమస్య ఉన్నవారు డాక్టర్ లేదా యోగా గురువు పర్యవేక్షణలో చేయాలి. బీపీ లేదా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారు ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దు. మోకాళ్లు పాదాల వేళ్లకు ముందుకు వెళ్లకూడదు. వెన్నెముక నిటారుగా ఉంచాలి – వంగిపోవద్దు. గర్భిణులు తప్పనిసరిగా గైడెన్స్‌తో మాత్రమే చేయాలి. ∙మొదట 10–20 సెకండ్లు హోల్డ్ చేయండి. తర్వాత 3–5 రిపిటేషన్స్ చేయాలి. శ్వాస నెమ్మదిగా, సమంగా ఉంచాలి. - పాతర్ల అనిత, యోగా ట్రైనర్ ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?శక్తిని ఇచ్చే ఉత్కటాసనం చేసే విధానం..ముందుగా నిటారుగా నిలబడాలి. పాదాలు రెండూ దగ్గరగా ఉంచి, చేతులను పైకి ఎత్తాలి. కుర్చీలో కూర్చున్నట్టు మోకాళ్లను ముడుచుకుని కిందకు వంగాలి. మోకాళ్లు ముందుకు పడకుండా జాగ్రత్త పడాలి. చేతులను నమస్కార భంగిమలో ఉంచాలి. ఈ స్థితిలో పొట్ట భాగాన్ని లోపలికి తీసుకుంటూ, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. దృష్టి నాసికా పుటాలపై లేదా ముందు ఉన్న ఒక బిందువుపై కేంద్రీకరించాలి. ∙5 నుంచి 6 సార్లు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా కండరాలు బలపడతాయి. -
మందిరా బేడి ఫిట్నెస్ మంత్ర..! 30 ఏళ్ల వయసులో కంటే ఇప్పుడే..
ఫ్యాషన్ డిజైనర్, నటి, టీవీ వ్యాఖ్యాత మందిర బేడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఆమె హవా మాములుగా లేదు. ఆమె స్వరం, నటనతో వేలాది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ మందిరా బేడి. ఐదు పదుల వయసులోనూ యువ హీరోయిన్ మాదిరి ఆహార్యంతో..ఆకర్షణీయమైన లుక్‌తో అలరిస్తుంటుందామె. ఇంతలా హెల్దీగా, యంగ్‌గా ఉండటానికి గల రీజన్ గురించి హెర్బాలైఫ్ పాడ్‌కాస్ట్ వెల్లడిస్తూ..తన బ్యూటీసీక్రెట్ని షేర్ చేసుకున్నారామె.మరి అవేంటో తెలుసుకుందామా..!.మందిరా తన వయసు గురించి చెప్పడానికి అస్సలు భయపడనని, కానీ ఆహార్యం పరంగా యంగ్‌గానే కనిపిస్తానని అన్నారామె. అందరు కదలిక ఓ మెడిసిన్, వ్యాయామం ఓ ఔషధ అని అంటుండటం వినేదాన్ని. కానీ అది తన విషయంలో నిజమైందని అంటోందామె. వ్యాయామం ఒక్కటే ప్రజలను అనారోగ్యం బారినపడకుండా చేస్తుందని, అదొక సప్లిమెంట్‌గా అభివర్ణించింది. అన్ని సమస్యలకు వ్యాయామం అద్భుతమైన నివారిని అని నమ్మకంగా చెబుతోందామె. అంతేగాదు 50లలో అధిక బరువు శిక్షణ తప్పనిసరి అని అంటోందామె. ఎందుకంటే..ఆ సమయంలో వృద్ధాప్యం మనలోకి ఎంటర్ అవుతుంటుంది. కాబట్టి ఆ టైంలో ఫిట్నెస్ చాలా ముఖ్యం, అదీగాక శారీరక క్షీణతకు దారితీసే సమయం కూడా అదే. అందువల్ల బలశిక్షణ శరీరానికి ఎంతో అవసరమని అన్నారు. ఇది మనకు శక్తిమంతమైన మార్పుతో పాటు, మన కండరాలను బలోపేతం చేస్తాయని చెబుతోంది. అంతేగాదు వర్కౌట్లు శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యద్భుతమైనవని అన్నారు. దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ అవుతాయని అన్నారు. అయితే దీన్ని తీవ్రంగా భయపెట్టేలా చెయ్యొద్దని చెప్పారామె. ఇష్టంతో..స్వాంతన చేకూరేలే చేయాలి. అప్పుడే వృద్ధాప్యాన్ని ధీమాగా తిప్పికొట్టగలమని అన్నారామె. అంతేగాదు ఈ ఏజ్‌లో నిరంతర సంరక్షణ, నిబద్దతతో చేసే రోజువారీ వ్యాయామాలు మన ఆయుష్షుకి శ్రీరామరక్ష అని చెబుతున్నారు మందిరా బేడి. View this post on Instagram A post shared by Herbalife India Official (@herbalifeindiaofficial)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్) -
మజిల్ మమ్మీ
మహిళలకు సంబంధించి సోషల్ మీడియాలో తాజా ట్రెండ్.. మజిల్ మమ్మీ. ‘బాగా సన్నబడాలి... మెరుపు తీగలా కనిపించాలి’ అనుకునే ట్రెండ్లు ఎన్నో వచ్చాయి. వాటికి భిన్నమైన ట్రెండ్ ఇది. వెల్నెస్ సంస్కృతికి సంబంధించిన పాత స్టీరియోటైప్‌లను తోసిరాజని మహిళల శక్తి, ఫిట్నెస్ను పునర్నిర్వచిస్తున్న ట్రెండ్ ఇది. గత ఫిట్నెస్ ట్రెండ్ల మాదిరిగా కాకుండా ‘మజిల్ మమ్మీ’ కండరాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఈ ట్రెండ్ ప్రధాన సందేశం...బలం బలంలాగే కనిపించాలి. బరువు తగ్గడం మాత్రమే ఫిట్నెస్ కాదు. స్త్రీలు సన్నగా కనిపించాలి, బరువులు ఎత్తవద్దు, స్ట్రెంత్ ట్రైనింగ్ మనకు సంబంధించింది కాదు, నాజూకుగా కనిపించాలంటే మజిల్ అక్కర్లేదు...ఇలాంటి సంప్రదాయ సౌందర్య ప్రమాణాలను నేటి తరం మహిళలలో చాలామంది తిరస్కరిస్తున్నారు. కండరాలపై దృష్టి సారించే ఈ ఫిట్నెస్ ట్రెండ్ ఊపందుకోవడానికి మరో ప్రధాన కారణం...దీర్ఘకాలిక ఆరోగ్యం గురించి అవగాహన పెరగడం. మెరుగైన ఎముక సాంద్రత(బోన్ డెన్సిటీ), హార్మోన్ల సమతుల్యత...మొదలైవాటికి ప్రాధాన్యతన పెరిగింది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి ΄్లాట్ఫామ్లలో ‘మజిల్ మమ్మీ’ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ‘అసలు సిసలు ఫిట్నెస్ అంటే ఏమిటి?’ అనే కాప్షన్‌తో జనాదరణ పొందిన డెడ్‌లిఫ్ట్‌లు, స్క్వాట్లు, రెసిస్టెంట్స్ వర్క్‌కు సంబధించిన వీడియో క్లిప్‌లకు, ఆఫ్‌బీట్ మ్యూజిక్, జోక్స్ జోడించి పోస్ట్ చేస్తున్నారు. -
తలకిందులుగా వేలాడుతున్న ఈ హీరోని గుర్తుపట్టారా?
పైన ఫోటోలో తలక్రిందుగా వేలాడుతూ కనిపిస్తున్న ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా? తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైన నటుడు. కేవలం నటనతోనే కాదు, క్రమశిక్షణతో కూడిన ఫిట్నెస్తో కుర్రకారుకు ఇన్పిరేషన్‌గా నిలుస్తుంటారు. ఆయనే మాస్ హీరో విశాల్. ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం రాజీపడని ఈ హీరో, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా డెంగ్యూ బారిన పడటం, షూటింగ్స్ ఒత్తిడి వల్ల కొన్నాళ్ల పాటు వ్యాయామానికి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ జిమ్‌లోకి అడుగుపెట్టారు.తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన జిమ్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. శరీరాన్ని దృఢంగా మార్చుకుంటూ, పాత 'పందెంకోడి' లుక్‌ను గుర్తుచేస్తున్నారు. ఈ మార్పు కేవలం ఆరోగ్యం కోసమే కాదు, తన తదుపరి ప్రాజెక్టుల కోసం కూడా అని తెలుస్తోంది.ప్రస్తుతం విశాల్ తన 36వ చిత్రంలో బిజీగా ఉన్నారు. సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో 'మొగుడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'మగ మహారాజు', 'యాక్షన్' సినిమాల తరహాలోనే ఇది కూడా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Vishal (@actorvishalofficial) -
91 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గానా..!
ఏడుపదుల వయసుకు చేరుకోగానే ఎంతటి ఫిట్నెస్ కోచ్‌లు అయినా లేదా క్రమం తప్రకుండా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహ ఉన్నా కూడా..యువకుల మాదిరిగా చురుకుగా ఫిట్‌గా ఉండటం కష్టమే. కానీ ఈ బామ్మ తొమ్మిది పదుల వయసులో యువతే విస్తుపోయాలే యాక్టివ్‌గా ఉండటమే కాదు..ఫోర్స్‌తో కూడిన వ్యాయామాలు చేస్తూ భళా అనిపించుకుంటోంది. ఎవరా ఆ సూపర్ బామ్మ అంటే..ఆ బామ్మే ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల జిల్. ఆమె కఠినమైన క్రమశిక్షణ కలిగిన జీవనశైలికి పేరుగాంచింది. ఆమె రోజుకు సగటున 12 వేల అడుగులు నడుస్తుందట. అంతేగాదు తరుచుగా సిడ్నీ హార్బర్ వంతెన మీదుగా ఒపెరా హౌస్‌కు వెళ్లే ఐకానిక్ ట్రెక్కు వెళ్తుందట. ఇది నిటారుగా ఉన్న కొండలు, అంతులేని మెట్లకు ప్రసిద్ధి చెందిన మార్గం. అలాగే వారానికి రెండుసార్లు ఈత కొట్టడం, బలాన్ని కాపాడుకునేలా యోగ, పైలేట్స్ వంటి సెషన్లు తప్పనిసరిగా చేస్తానని చెబుతోంది. అలాగే అందరితోనూ సన్నిహితంగా ఉండేలా టచ్‌లో ఉంటానని, అది శారీరక వ్యాయామం వలే మనసుకోక ఆహ్లాదకరమైన వ్యాయామం అని అంటోంది. అంతేగాదు ఈ జిల్ బామ్మ దీర్ఘాయువు కోసం చురుగ్గా ఉండటమే మంచిదనేది తన అభిప్రాయామని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోని ఫిట్నెస్ కోచ్ థెరిసా మోలోనీ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా, శారీరక వ్యాయామం వలే దీర్ఘాయవు కోసం సామాజిక అనుసంధానం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నాయి అధ్యయనాలు. పైగా చురుకైన జీవనశైలి మంచి మానసిక ఆనందాన్ని, శారీరక శ్రమను స్థిరంగా ఉంచుతుందని పలు పరిశోధనల్లో తేలింది కూడా. నిజంగా ఈ బామ్మ సూపరో సూపర్ కదూ..!. View this post on Instagram A post shared by Certified Nutritionist and Fitness Coach (@theresa_moloney) (చదవండి: ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!) -
పెరిమెనోపాజ్ సమయంలో బరువు తగ్గాలంటే...!
సాధారణ వ్యక్తులకు బరువు తగ్గడమే కష్టమైన టాస్క్ అనుకుంటే..అందులోనూ ఇలా పెరిమెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మూడ్ స్వింగ్స్ సవ్యంగా ఉండవు. హర్మోన్ల మార్పులతో ఒక రకమైన చికాకు, ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు. దాంతో కొందరికి విపరీతమైన ఆకలి వేసేస్తుంటుంది కూడా. అందువల్ల ఆ టైంలో బరువుని అదుపులో ఉంచడం అనేది మాములు విషయం మాత్రం కాదు. అయితే దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తూ వెయిట్‌లాస్ అవ్వొచ్చని చెబుతోంది స్వతహాగా ఫోటోగ్రాఫర్ అయిన ఈ ఇన్ఫ్లుయొన్సర్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.పెరిమెనోపాజ్ సమయంలో బరువు తగ్గడం ఎలాగో అందుకు హెల్ప్ అయ్యే చిట్కాల గురించి షేర్ చేసుకున్నారు ఫోటోగ్రాఫర్ . ఆమె ఆ సమయంలోనే తాను ఆరు నెలల్లో 11 కిలోలు వరకు తగ్గానని చెప్పుకొచ్చారామె. ఈ సీక్రెట్ ఏంటో ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేసుకున్నారామె. మొదట్లో పెరిమెనోపాజ్‌లో ఉన్నప్పుడు బరువు తగ్గాను అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డా..కానీ ఇప్పుడు గట్టిగా అరిచి చెబుతా. ఎందుకంటే..ఆ సమయంలో తన శరీరం చాలా లావుగా అసహస్యంగా ఉండటంతో..తనను తాను గుర్తించడం మానేసిన దారుణమైన పరిస్థితని చెప్పుకొచ్చారామె. అయితే లాక్డౌన్ సమయం నుంచి ఇప్పటి వరకు బరువుని అదుపులో ఉంచేలా చక్కటి ఆహారాన్ని తీసుకుని సత్ఫలితాలు పొందానని ఆనందంగా వెల్లడించారామె. భవిష్యత్తులో 50 ఏళ్లు నిండిన నా ఆహార సంబంధాన్ని ఆరోగ్యప్రదంగానే ఉంచుకుంటానంటోంది. తాను ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం, బరువులు ఎత్తడం, చిరుతిళ్లకు దూరంగా ఉండటం అలవాట్లను తన డైట్లో భాగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేగాదు ఆ సమయంలో బరువు తగ్గాలంటే మన జీవనశైలి ఎలా ఉండాలో కూడా వివరించిందామె. బరువులు ఎత్తడం..కండర ద్రవ్యరాశికి, జీవక్రియలు మెరుగుపడేందుకు వారానికి నాలుగు సార్లు బరువులు ఎత్తడం వంటివి చేసేదాన్ని అని తెలిపారామె.వాకింగ్అడుగుల సంఖ్యను రోజు రోజుకి పెంచుతూ అలా పదివేల అడుగులు వేసేలా సెట్ చేసుకున్నారట ఆమె. దీంతోపాటు వారానికి రెండుసార్లు యోగా సెషన్లకు హాజరయ్యేదాన్ని అని తెలిపింది.ప్రోటీన్‌కి ప్రాధాన్యత..ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇచ్చే ఆరోగ్యకరమైన ప్రోటీన్లను ఎంపిక చేసుకుని మరి తినేదాన్ని అని చెప్పారు.చిరుతిళ్లుకు చెక్..సంతృప్తిగా తినడం ప్రారంభించడంతో..చిరుతిళ్ల జోలికి వెళ్లిపనే తప్పిందని చెప్పింది. తన అల్పాహారంలో అదనపు కేలరీల ప్రధాన మూలం తన బరువు పెరిగేందుకు కారణమని భావించే వాటికి దూరంగా ఉన్నానని వివరించింది.సహజసిద్ధమైన వాటిని తీసుకుంటూ.. ఫిట్నెస్ యాప్‌తో తన ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం ప్రారంబించారమె. అలాగే వెయిట్‌లాస్ ప్రక్రియలో ఇతరులు సహాయం తీసుకుంటూ మనలో మార్పులు వచ్చాయో లేదా అడగి తెలుసుకోవడం తదితరాలను చేయాలని చెప్పొకొచ్చింది ఫోటోగ్రాఫర్ కింబర్లీ ఎస్పినెల్. View this post on Instagram A post shared by Kimberly Espinel (@thelittleplantation) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: పోగొట్టుకున్న రూ. 30 కోట్లు తిరిగి సంపాదించా..! కానీ అతి విలువైన..) -
తొందరగా బరువు తగ్గాలంటే..! ఏం చేయాలి? ఏం చేయకూడదు?
బరువు తగ్గడానికి కొవ్వు కరిగించే మందులు, ఇంజెక్షన్లపై ఆధారపడుకుండా అత్యంత సహజసిద్ధంగా బరువు తగ్గాలంటే చాలా ఓపిక, స్ట్రాంగ్ మైండ్‌సైట్ చాలా ముఖ్యం. అలా నిలకడగా ప్రయత్నానికి బ్రేక్ ఇవ్వని వారే అద్భుతాలు సృష్టిస్తారు..మంచి ఫలితాలను అందుకుంటారు. అందుకు ఉదాహరణే ఈ ఫిట్నెస్ ట్రైనర్ టార్న్ కౌర్. ఆమె కేవలం ఎనిమిది నెలల్లోనే 31 కిలోలు తగ్గి శెభాష్ అనిపించుకుంది. అందుకు ఉపకరించిన మూడు వాస్తవిక త్యాగాల గురించి ఇస్టాగ్రామ్‌లో వివరిస్తూ..పోస్టు పెట్టారామె. మరి బరువు తగ్గేందుకు ఆమె వ్యక్తిగతంగా చేసిన ఆ మూడు మార్పులేంటి? అంతలా ఎలా బరువు తగ్గారామె అంటే..ఆమె చేసుకున్న వ్యక్తిగత మార్పులు..పక్కా ప్లానింగ్..బరువు తగ్గేందుకు ప్రయత్నించిన ప్రతిసారి నూటికినూరు శాతం పర్ఫెక్షన్ ఉండాలనుకునేది. అలా అనుకున్న ప్రతిసారి తన డైట్ మళ్లీ మొదటకు రావడం..జరుగుతుండేది. ముఖ్యంగా నిద్ర తర్వాత ప్లానింగ్ స్కిప్ అవ్వతూ ఇబ్బంది పడేది. అందుకే పరిపూర్ణ కంటే..సవ్యంగా అనుకున్నది ప్రతి రోజు జరిగేలా ప్లాన్ ఉంటే సరి అని డిసైడ్ అయ్యింది.నిర్విరామంగా, స్థిరంగా..అస్తామాను బరవు తగ్గాలి అంటూ పరిష్కారాల కోసం ప్రయత్నించడం అనేవి వృధా ప్రయాసేనని అంటోందామె. దానికంటే..రోజువారి ఆరోగ్యకరమైన అలవాట్లు క్రమం తప్రకుండా చేసేలా చూసుకోవడం బెటర్. ముఖ్యంగా నిలకడ(స్థిరత్వానికి) ప్రాముఖ్యత ఇస్తేనే..మంచి ఫలితాలు సొంతం అవుతాయి.సాకులుసమయం లేదనే మాటకు ఆస్కారం ఇవ్వకూడదంటోంది. సెలవులు, వివాహాలు, సుదీర్ఘ ప్రయాణ రోజులు, తల్లిదండ్రుల బాధ్యతలు, పని ఒత్తిళ్లు, ఇలా ఎన్ని ఉన్నా..బరువు తగ్గాడానికి బ్రేక్ ఇవ్వకూడదని, సమయం లేదనే మాట ఉండకుండా ఉండేలా కేర్ తీసుకోవాలంటోంది. ఎందుకంటే ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్న చాలామంది బరువు తగ్గుతున్నప్పుడూ మనమెందుకు తగ్గం అనేది విశ్లేషించుకుంటే..పరిష్కారం ఆటోమేటిగ్గా దొరుకుతుందంటోంది. View this post on Instagram A post shared by Tarn Kaur | Online Coach 🏋🏼♀️💕 (@weightlosswithtarn) ఇక ఇక్కడ ఫిట్నెస్ ట్రైనర్ తన బరువ తగ్గే జర్నీలో డైట్లో మార్పులు చేసుకున్నా మొత్తం 20 ఆహారాల జాబితాను కూడా షేర్ చేశారు. అవేంటో చూద్దామా..!1. మిల్కీ షుగర్ చాయ్ బదులు - బ్లాక్ కాఫీ2. ప్యాక్ చేసిన జ్యూస్‌లు - ఎలక్ట్రోలైట్స్ కోసం దోస, కీర జ్యూస్‌లు లేదా కొబ్బరి నీళ్లు3. రాత్రిపూట తెల్ల బియ్యం - క్వినోవా/కాలీఫ్లవర్ బియ్యం4. మైక్రోవేవ్ పాప్‌కార్న్ - ఎయిర్-పాప్డ్ పాప్‌కార్న్5. చీజ్ క్రాకర్స్ - కాల్చిన చిక్పీస్6. క్రీమీ పాస్తా - హోల్‌వీట్ నూడుల్స్ + పాలకూర సాస్7. షుగర్ తృణధాన్యాలు - దాల్చిన చెక్క, ఆపిల్ & తేనెతో రాత్రిపూట ఓట్స్8. క్రిస్ప్స్ ప్యాకెట్లు - వెజ్జీ స్టిక్స్ + గ్రీక్ పెరుగు డిప్9. మిల్క్ చాక్లెట్ - డార్క్ చాక్లెట్ స్క్వేర్10. షుగర్ బిస్కెట్లు - బాదం పిండి కుకీలు11. బిస్కెట్లు - వేరుశెనగ వెన్న మరియు తేనెతో రైస్ క్రాకర్స్12. వేయించిన స్నాక్స్ - బేక్డ్ వెజ్జీ చిప్స్13. ఐస్ క్రీం - గ్రీక్ పెరుగు + ఫ్రోజెన్ బెర్రీస్14. షుగర్ సాస్‌లు - ఇంట్లో తయారుచేసిన టమోటా/పెస్టో సాస్15. వైట్ బ్రెడ్ - హోల్‌గ్రెయిన్ లేదా సీడ్ బ్రెడ్16. షుగర్ డ్రింక్స్ - మెరిసే నీరు + నిమ్మకాయ17. సూపర్ మార్కెట్ మఫిన్లు - ఇంట్లో తయారుచేసిన ప్రోటీన్ అరటిపండు/ఓట్ మఫిన్లు18. చాక్ బార్లు - నట్ + డార్క్ చాక్లెట్ బైట్స్19. హెవీ సలాడ్ డ్రెస్సింగ్‌లు - ఆలివ్ ఆయిల్ + బాల్సమిక్ వెనిగర్20. ఫాస్ట్ ఫుడ్ బర్గర్లు - ఇంట్లో తయారుచేసిన టర్కీ/వెజ్జీ బర్గర్లు View this post on Instagram A post shared by Tarn Kaur | Online Coach 🏋🏼♀️💕 (@weightlosswithtarn)బరువు తగ్గడానికి 8 'విచిత్రమైన' అలవాట్లుటెంప్ట్ చేసే ఆహారాలు కంట పడకుండా ఉండేలా చేసుకోవడం లేదా దూరంగా ఉండేలా నోటిని అదుపులో ఉంచుకోవడం. భోజనం తర్వాత ఏమైనా తినాలనిపిస్తే..పుదీనా లేదా ఆరోగ్యకరమైన హెల్దీ ఆకులను తినేలా మెదడుని పాజ్ చేయడంముందుగానే ఇంత తినాలనేలా ప్లాన్ చేసుకోవడంఆహారం సరిపోయిన సంతృప్తిని అందివ్వకపోతే..ఆ కోరికను స్కిప్ చేసి..ఏదైనా పనిలో లీనమవ్వడంఅలాగే కడుపు నిండింది అని బిగ్గరగా చెబుతూ మన మైండ్‌ని కంట్రోల్ చేయడంరెస్టారెంట్లలో బ్రెడ్ వంటి వాటి జోలికి పోకుండా ఉండటం.ఫిట్‌గా ఉండే మోడ్రన్ దుస్తులు ధరించాలనే విషయాన్ని గుర్తించుకుంటూ..తక్కువగా తినడం తనను ఏదో రకంగా తినాలనిపించేలా చేసే ఆకర్షణీయమైన వంటకాలన్నింటిని చెత్తబుట్టలో వేసేయడం తదితరాలతో ఫిట్నెస్ ట్రైనర్ టార్న్ కౌర్ విజయవంతంగా బరువు తగ్గారామె. ఈమె వెయిట్‌లాస్ జర్నీ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే..ఇక్కడ మనం బరువు తగ్గాలనే విషయంపై గట్టి ఫోకస్ తోపాటు ఆ దిశగా మనం తినే ఆహారం, వర్కౌట్లు ఉండేలా కేర్ తీసుకోవడమే గాక నిలకడతో చేయాలి. అప్పుడే సత్ఫలితాలు పొందగలం అని చెబుతున్నారు నిపుణులుగమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: 73 ఏళ్ల తాత గారి సిక్స్‌ప్యాక్ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..) -
73 ఏళ్ల తాత గారి సిక్స్‌ప్యాక్ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..
జస్ట్ ఆరు పదుల వయసు దాటగానే ముఖంలో ముడతలు..చర్మం వదులుగా వచ్చేసి..ముసలి రూపు వచ్చేస్తుంటుంది. ఒకవేళ ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ఆస్వాదించేవారు కూడా ఓ మోస్తారు వర్కౌట్లు, చిన్న పాటి వాకింగ్ వంటివి చేస్తూ ఆరోగ్యంగా ఉండటం చూశాం. కానీ ఇతడని చూస్తే..నోరెళ్లబెట్టేస్తాం. బాడీ ఏమో 25 ఏళ్ల యువకుడిలా చాకులా ఉంటుంది. వయసు చూస్తే వామ్మో అనేస్తాం. ఇది నిజమేనా అనే సందేహం కూడా వచ్చేస్తుంది ఆ తాతగారి ఫిజిక్‌ని చూస్తే. అంత అద్భుతమైన దేహ ధారుడ్యంతో..ముఖ్యంగా సిక్స్ ప్యాక్స్‌తో నవ మన్మధుడిలా ముగ్ధమనోహరంగా ఉంటాడు. మరి అతడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి?, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఏమైనా తీసుకుంటాడా అంటే..?సాధారణంగా డెభైల వయసులో కండరాలు దృఢంగా ఉండటం అంత సులభం కాదు. ముఖ్యంగా చర్మం ఎంత వదులుగా మారిపోతుందో తెలిసిందే. అలాంటిది ఆ తాతగారి ఉక్కులాంటి శరీరాన్ని చూసి షాకవ్వుతాడు. అంతలా ఉండటానికి ఎంతలా వర్కౌట్లు చేస్తాడో తలుచుకుంటూనే భయమేస్తుందంటూ..నేరుగా ఆయన్నే అడుగుతాడు ఫిట్నెస్ కోచ్ లాంగోవ్స్కీ. చక్కటి పోషకాహారం, స్మార్ట్ వ్యాయామాలు మయసుని దిక్కారిస్తాయని నిరూపించాడు ఈ 73 ఏళ్ల వ్యక్తి. అందుకు తనకు ఉపకరించిన హెల్త్ సీక్రెట్ గురించి కూడా ఫిట్నెస్ కోచ్ స్కీతో పంచుకుంటాడు కూడా. ఇంత స్ట్రాంగ్ బాడీ మెయింటైన్ చేసేందుకు జిమ్‌లో ఎంతలా కష్టపడుతుంటారని అడుగుతాడు. అందుకు ఆ తాతగారు గట్టిగా నవ్వేసి..తేలికపాటి వ్యాయామాలే చేస్తాను, కానీ కష్టపడకుండా తేలిగ్గా చేస్తానని సమాధానమిచ్చారు. మరి ఎలాంటి పుడ్ తీసుకుంటారు అని ఫిట్నెస్ కోచ్ స్కీ అడగగా..మంచి ప్రోటీన్, కొల్లాజెన్, క్రియేటిన్ మాత్రమే తీసుకుంటానని అన్నారు. ఉపవాసం ఉంటే తప్ప..ప్రతిరోజు వైన్ పడాల్సిందేనని అన్నారు. రోజుకి రెండు గ్లాస్‌ల వైన్ హాంఫట్ చేస్తారట ఈ తాతయ్య. ఆ తర్వాత కోచ్ ఎన్ని పుషఅప్లు చేయగలరు? అని కుతుహలంగా అడుగుతాడు..దానికి ఆయన దాదాపు 30 వరకు చేయగలనని నమ్మకంగా చెప్పారు. అంతేకాదండోయ్ ఆ ఫిట్నెస్ కోచ్ ముందే ఏకంగా 36 పుష్ అప్లు చేసి చూపించాడు కూడా. తన శరీర కొవ్వు శాతం కూడా 8.5% అని వెల్లడించాడు. పైగా క్రమశిక్షణతో కూడిన మంచి పోషకాహారం, కొంచెం వైన్‌ని సేవిస్తూ..డెభైలలో కూడా ఫిట్‌గా ఉండటం ఈజీనే అని నిరూపించాడమే కాదు వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని తన ఆహార్యంతో గొంతెత్తి చెప్పకనే చెప్పాడు ఈ తాతయ్య. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by ʙᴏᴅʏ ʙʏ ᴍᴀʀᴋ™ (@bodybymark) (చదవండి: థాంక్యూ అమెరికా..కానీ భారత్ అంటే ప్రేమ..! వైరల్‌గా భారత సంతతి వ్యక్తి పోస్ట్) -
శాకాహారంతో సహజ సౌందర్యం: జాక్వెలిన్ ఫెర్నాండెజ్
శీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ..అక్కడ వేలాది అభిమానులను సొంతం చేసుకున్నారామె. అంతేగాదు ఫ్యాషన్, ఫిట్నెస్ విషయంలో ఐకాన్. ఎప్పటికప్పడూ సోషల్ మీడియాలో తన ఆహారం, వ్యాయామాల గురించి నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారామె. అలానే ఈ సారి ఆమె తాను శాకాహారిగా మారడంతో తన బాడీలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయంటూ షేరు చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం గురించి స్వయంగా చెప్పారామె.తాను మొక్కల ఆధారిత భోజనం తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత తన శరీరంలో చాలా మార్పులు సంతరించుకున్నాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన ముఖంలో సహజసిద్ధమైన మెరుపు రావడమే గాక మొటిమలు కూడా మాయమైపోయాయని అన్నారామె. తన చర్మ సంరక్షణ విషయంలో అద్భుతంగా ఈ డైట్ పనిచేసిందన్నారు. తాను మొటిమలతో చాలా ఇబ్బంది పడ్డానని, ఎప్పుడైతే శాకాహారిగా మొక్కల ఆధారితో ఫుడ్‌ని తీసుకోవడం ప్రారంభించానో అప్పటి నుంచి మొటిమలు, మచ్చలు తగ్గి కాంతిమంతంగా ఉందని తెలిపింది. అలాగే బరువు సైతం అదుపులో ఉంది. ఇంతకుమునుపు తగ్గుతూ..పెరుగుతూ ఉండేది. కానీ ఈ శాకాహారం మన బరువుని అద్భుతంగా అదుపులో ఉంచుతుంది. మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నమ్మకంగా చెప్పుకొచ్చారామె. అందుకు శాస్త్రీయ నిర్థారణ లేకపోయినా..పొట్ట ఉబ్బరం, బరువు విషయంలో చాలా రిలీఫ్ పొందానంటోంది. శరీరాని అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు అందుతాయి. View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) ముఖ్యంగా మంచి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. మాంసకృత్తులు సైతం మొక్కల ఆధారిత ఆహారం నుంచే పొందవచ్చని అంటుందామె. అందుకోసం కూరగాయలు, బీన్స్, టోపు వంటి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవాటిని తీసుకుంటే చాలని చెబుతోంది. అలాగే నోటి శుభ్రత కోసం ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటానని, ఒక లీటరు డిటాక్స్నీరు తాగి హైడ్రేషన్‌గా ఉండేలా చూసుకుంటానని చెబుతోంది జాక్వెలిన్.(చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్ రీల్స్‌తో మొదటి సంపాదన..!) -
ఎక్కువమంది ఫాలో అయిన ఫిట్నెస్ సూత్రాలివే
2025వ సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం మనం. ఈ సందర్భంగా వివిధ రంగాలలో జీవన శైలి పరంగా ముఖ్యంగా ఫిట్నెస్ కోసం అత్యధికులు అనుసరించిన ట్రెండ్స్ ఏమిటో తెలుసుకుందాం..ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఫిట్‌గా ఉండేందుకు ఎంచుకునే విధానాలే రకరకాలుగా ఉంటాయి. కొందరు జిమ్ మెంబర్షిప్ తీసుకుని ఫిట్ అవుతారు. మరికొందరు యోగా చేయడాన్ని ఇష్టపడతారు. ఇంకొంతమంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువమంది దేనిని అనుసరించారో ఓసారి రివైండ్ చేసుకుందాం.మొబైల్ ఫిట్నెస్ యాప్స్ఈ సంవత్సరంలో ప్రజలు తమ ఫిట్నెస్ను (Fitness) ట్రాక్ చేయడానికి ట్రాకింగ్ యాప్స్‌ను విస్తృతంగా ఉపయోగించారు. ధరించే పరికరాలు, ఆటోమేటెడ్ అలర్ట్‌లు ఇచ్చే ఫిట్నెస్ ట్రాకర్స్, స్మార్ట్ వాచ్‌లు, హార్ట్ రేట్ మానిటర్ల వంటి పరికరాలు ఈ సంవత్సరం బాగా చర్చలో నిలిచాయి. పర్సనల్ ట్రైనర్‌ను నియమించుకోవడం కంటే ప్రజలు ఈ సంవత్సరం తమ ఫిట్నెస్ను సొంతంగా ట్రాక్ చేసుకున్నారు.మితంగా తినే మినిమల్ ఈటింగ్ హ్యాబిట్ఈ సంవత్సరంలో ఎక్కువమంది సమతుల్య ఆహారం (Balanced Diet) ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. దీనిపై సోషల్ మీడియా ప్రభావం కూడా ఉందని చెప్పవచ్చు. రోజూ ప్రోటీన్ అధికంగా ఉండే హెల్తీ స్నాక్స్ రీల్స్ చూసి చూసీ చూసీ ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం ప్రారంభించి, తమ డైట్లో మంచి మార్పులు చేసుకున్నారు.ఔట్‌డోర్ యోగా2025లో అధిక సంఖ్యాకులు ఫిట్నెస్ను సీరియస్‌గా తీసుకుని ఔట్‌డోర్ యాక్టివిటీస్‌పైనా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఔట్‌డోర్ యోగా చేయడం ద్వారా తమను తాము ఫిట్‌గా ఉంచుకున్నారు. వీటితో పాటు వాకింగ్ చేయడం, పరుగెత్తడం, హైకింగ్, స్కీయింగ్ వంటి యాక్టివిటీస్ కూడా ప్రజల ఫిట్నెస్ రొటీన్లో భాగమయ్యాయి.చదవండి: వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?మార్నింగ్ వర్కవుట్స్సాయంత్రం సమయాన్ని బయట తిరగడానికి కేటాయించడం కోసం చాలామంది తమ ఉదయం రొటీన్లో వ్యాయామాన్ని చేర్చుకున్నారు. కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా యోగా లేదా వాక్ చేయడానికి కూడా ఉదయం సమయం సరైనదిగా నిలిచింది.కలిసి మెలిసి..2025లో వైరల్ అయిన వాటిలో గ్రూప్ ట్రైనింగ్ యాక్టివిటీ ఒకటి. అదేంటంటే... ఇంట్లో ఒంటరిగా వ్యాయామం చేయడం కంటే స్నేహితులు లేదా భాగస్వామితో కలిసి వ్యాయామం చేయడం మరింత మెరుగ్గా ఉంటుందనిపించి చాలామంది తమకు తోడుగా ఎవరైనా ఉంటే జిమ్‌కి వెళ్లడం లేదా వర్కవుట్ చేయడంలో మునిగిపోయారు. -
2 వేల మందితో కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్
హైదరాబాద్: ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్న కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2025కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ రన్నర్స్ సంస్థలో భాగంగా ఏర్పడిన ఎల్బీనగర్ రన్నర్స్ ఆధ్వర్యంలో ప్రతియేటా నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక వార్షిక రన్నింగ్ ఈవెంట్ ఈ నెల డిసెంబర్ 28న ఘనంగా జరగనుంది.ఈ మారథాన్‌కు సంబంధించిన టీషర్టులు, మెడళ్ల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి ఇందిరా ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కామినేని ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డా.గోకుల్ రఘురామ్, ఆస్పత్రి మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఏఆర్ఎస్ సత్యనారాయణలు పాల్గొని అధికారికంగా టీషర్టులు, మెడళ్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎల్బీ నగర్ రన్నర్స్‌కు చెందిన సుమారు 30 మంది రన్నర్లు, అలాగే కామినేని ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఈ ఈవెంట్‌కు తమ మద్దతు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వార్షిక రన్నింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతీ సంవత్సరం పాల్గొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం విశేషం. హైదరాబాద్ నగరంతో పాటు నగరం వెలుపల ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజూ నడక, పరుగులపై ఆసక్తి ఉన్న అనేక మంది ఈ మారథాన్‌లో పాల్గొంటున్నారు.ఈ సంవత్సరం నిర్వహించనున్న కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2025లో మొత్తం నాలుగు విభాగాలు ఉన్నాయి. హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు), 10 మైళ్లు (16.1 కిలో మీటర్లు), 10 కిలో మీటర్లు, 5 కిలోమీటర్లు. ఈ నాలుగు విభాగాల్లో కలిపి సుమారు 2,000 మంది రన్నర్లు పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 28న ఆదివారం ఉదయం నిర్వహించనున్న ఈ రన్నింగ్ ఈవెంట్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్బీనగర్ రన్నర్స్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. -
హీరో మహేశ్ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
వారణాసి’మూవీతో ప్రేక్షకుల ముందుకురానున్నారు హీరో మహేశ్ బాబు. ఆ మూవీ కోసం ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు (Kalarippayattu) నేర్చుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్ పెట్టిన పోస్ట్‌తో ఈ విషయం బయటకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పవర్ఫుల్ పాత్ర కోసం ఆయన కలరిపయట్టు నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇక కలరిపయట్టు ఇటీవల చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఎంతో ఇష్టంతో నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ కోసం, మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకు దీన్ని నేర్చుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి కలరియపట్టు యుద్ధ కళ? ఇది ఫిట్నెస్కి ఎలా ఉపకరిస్తుంది సవివరంగా తెలుకుందాం.!.ఇంతకముందు ఈ కలరిపయట్టుని సైనా నెహ్వాల్ బయోగ్రఫీలో కథానాయకిగా తన నటనతో మెప్పించి తెలుగువారి అభిమానాన్నీ పొందిన బాలీవుడ్ నటి పరిణితిచోప్రా కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు కూడా. దీన్ని సాధన చేస్తే..బాడీ ఎంతో యాక్టివ్‌గా ఉన్నట్లు ఉంటుందని చెప్పుకొచ్చారామె. కలరిపయట్టు అంటే.కళరిపయట్టు లేదా కళరి అనేది కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ధ క్రీడ. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా అభివర్ణిస్తారు. దీన్ని కేరళ, తమిళనాడు, శ్రీలంక, మలేషియాలో ఉండే మలయాళీలు తప్పక ప్రదర్శిస్తారట. కలరిపయట్టు శిక్షణలోని వేగవంతమైన కదలికలు ప్రతిచర్యలు, కంటి-చేతి ఏకీకరణ వంటివి ప్రాథమిక మోటార్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అంతేగాదు మన శరీరం, మనస్సును అప్రమత్తంగా, చురుకుగా ఉంచుతాయి.ఎలా శిక్షణ ఇస్తారంటే..కలరి'గా పిలిచే ఒక ప్రత్యేక శిక్షణా స్థలంలో ఈ యుద్ధ కళ నేర్పుతారు. పోటీ పడుతున్న ప్రత్యర్థి కలరి అభ్యాసకుడికి కొత్త పోరాట కదలికలను నేర్పిస్తుంటాడు. శిక్షణ పొందే వ్యక్తి ఈ కొత్త విధానాలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రతిఘటించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. దీన్ని తమిళ రాజ్యాలతో యుద్ధాల చేసే సమయంలో మళయాళులు దీన్ని ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు..కలరిపయట్టు శిక్షణలో బలం, ఓర్పు ప్రాముఖ్యతను నేర్పిస్తుంది. ఇది శరరీ ధృడ్వత్వాన్ని పెంచుతుంది. హృదయనాళ ఆరోగ్యం మెరుగుపడుతుంది : ఇందులో వుండే వేగవంతమైన ఏరోబిక్ కదలికలు, శక్తివంతమైన దాడులు హృదయ స్పందన రేటును పెంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగ్గా ఉంటుందిప్రాథమిక మోటారు వ్యవస్థకు సంబంధించిన డిజార్డర్‌తో బాధపడేవారికి, నరాల సమస్యలతో బాధపడేవారికి కలరిపయట్టుని నిపుణుల సమక్షంలో తర్ఫీదు పొందితే మంచి ఫలితం ఉంటుందట. అలా పలువురి విషయంలో నిరూపితమైందట కూడా. అంతేగాదు ఈ ప్రాచీన యుద్ధ విద్య పనిలో ఏకాగ్రత, నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందట. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలరియపట్టుని నేర్చుకుని..ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం. View this post on Instagram A post shared by kalari Hyderabad (@a_martialarts_space) (చదవండి: పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..!భారత్ ఆరోగ్య సంరక్షణపై ఎన్నారై ప్రశంసల జల్లు) -
ఆ అందాల నటి వయసు 92 ...ఆరోగ్య రహస్యం ఇదే...
చాలా మందికి కదలడం కూడా కష్టంగా ఉండే వయస్సులో ఆ నటి నృత్యం చేస్తున్నారు. చురుకైన కదలికలు, వన్నె తరగని ముఖ వర్ఛస్సుతో ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఆమె ప్రముఖ సీనియర్ నటి–నర్తకి వైజయంతిమాల బాలి. ప్రస్తుతం 92 ఏళ్ల ఈ ఐకానిక్ సంగం స్టార్ ఇప్పటికీ తరగని తేజస్సుతో కళాత్మక శక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ట్వింకిల్ టోస్ అని ప్రేమగా పిలువబడే ఆమె, ఒక ప్రదర్శనకారిణి, గురువు, పండితురాలు సాంస్కృతిక సంరక్షకురాలిగా బహుళ పాత్రలను సజావుగా సమతుల్యం చేసుకుంటున్నారు. ప్రేక్షకులను తన ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేశారు, భావోద్వేగ లోతు శాస్త్రీయ వైభవంతో నిండిన ప్రదర్శన సమర్పించారు.నాట్యమే...ఆరోగ్యంఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా , తన శారీరక బలాన్ని మానసిక స్పష్టతను నిలబెట్టిన సూత్రాల గురించి వైజయంతిమాల మీడియాతో పంచుకున్నారు. నిర్మాణాత్మక జీవనం, బుద్ధిపూర్వక ఆహారం వీటన్నింటితో పాటు భరతనాట్యం పట్ల అచంచలమైన నిబద్ధత తదనుగుణ శారీరక శ్రమల సమ్మేళనమే తన దీర్ఘాయువు రహస్యం అంటారామె. తన జీవితంలో భరతనాట్యం కేంద్ర శక్తిగా మిగిలిపోయిందని వైజయంతిమాల వివరించారు. ప్రస్తుతం ఆమె ప్రతిరోజూ సాధన చేయకపోవచ్చు, కానీ ఎంపిక చేసిన యువ విద్యార్థుల బృందానికి శిక్షణ ఇవ్వడం ద్వారా తన జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. తన రోజులో మిగిలిన గంటలు పరిశోధనలో పెట్టుబడి పెడతారు, ఇది ఆమె దశాబ్దాలుగా అనుసరించిన కళారూపంతో మేధోపరంగా నిమగ్నమై ఉండటానికి వీలు కల్పిస్తుంది.మితాహారం...యోగా ధ్యానం...ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె దినచర్య గురించి మరింత విపులంగా వెల్లడయింది. ఆ ఛానల్ ప్రకారం, వైజయంతిమాల తన ఉదయాలను క్రమం తప్పని నడకలతో ప్రారంభిస్తుంది, ఈ అలవాటు శరీరాన్ని అప్రమత్తంగా శక్తివంతం చేస్తుందని ఆమె నమ్ముతుంది. ఆమె ఆరోగ్య దినచర్యలో స్థిరమైన యోగాభ్యాసం ధ్యానం కూడా భాగమై ఉంటాయి, ఆహారం కూడా ఆమె చురుకైన జీవనశైలిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె సాంప్రదాయ శాఖాహార దక్షిణ భారత భోజన శైలికి కట్టుబడి ఉంటారు. ఆమె ఉదయం పూట తరచుగా దోస, ఊతప్పం లేదా ఉప్మా వంటి సుపరిచితమైన అల్పాహారాలను తీసుకుంటారు, అదే విధంగా తాజా పండ్ల రసంతో పాటు. పోషకాలతో నిండిన తేలికపాటి భోజనం చేస్తారు. భోజనంలో సాధారణంగా బియ్యంతో రసం లేదా పప్పు చావల్ వడ్డిస్తారు. సాయంత్రం వేళలో ఆమె పండ్ల రసం లేదా కొద్దిగా పొడి పండ్ల వంటి తేలికపాటి రిఫ్రెష్మెంట్లను ఇష్టపడతారు. రాత్రి పూట ఆహారం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా తన డిన్నర్ కూరగాయలతో రోటీ లేదా పప్పు చావల్ లలో ముగుస్తుంది. నమ్మిన వృత్తి పట్ల నిబద్ధత క్రమశిక్షణతో కూడిన జీవనశైలి నిత్యనూతనంగా ఉంచే అభిరుచులు కలగలిపిన మనిషి వయసుతో సంబంధం లేని ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు అనే దానికి వైజయంతిమాల బాలి జీవితం ఓ నిదర్శనం. -
60లో కూడా సల్మాన్‌లా కండలు తిరిగిన బాడీ ఉండాలంటే...
బాలీవుడ్ ప్రముఖ నటుడు భాయిజాన్ సల్మాన్‌ఖాన్‌కి ఈ డిసెంబర్ 27కి 59 ఏళ్లు నిండనున్నాయి. ఇంకో ఆరు రోజుల్లో 60వ పుట్టిన రోజు జరుపుకునున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ.. తాను అరవైవ దశకంలో కూడా ఇంతే యంగ్‌గా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నా అంటూ పోస్టుపెట్టారు. అంతే ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్‌గా మారడమే కాకుండా, 'మీరు ఫిట్నెస్ ఐకాన్' అంటూ ప్రశంసిస్తూ అభిమానులు పోస్టులు పెట్టారు. అంతలా ఆరు పదుల వయసులోనూ అలాంటి బాడీ మెయింటైన్ చేయాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు ఫాలో అవ్వాల్సిందే అని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..కండలు కలిగిన దేహధారుఢ్యం కోసం..ముందు నుంచి వ్యాయమాలు చేసే అలవాటు ఉంటే..మంచి ఫిట్నెస్ ట్రైనర్ సమక్షంలో కసరత్తులు ప్రారంభించాలి. క్రమంతప్పకుండా వర్కౌట్లు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా కండలు తిరిగి దేహధారుడ్యం కోసం.. ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్..లాంటి కార్డియో వ్యాయామాలు, వెయిట్ ట్రైనింగ్ కసరత్తులు, తదితరాలు తప్పనిసరి అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణుల.అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆరుపదుల వయసులోనూ యంగ్‌గా ఆరోగ్యంగా ఉండాలంటే.. వారానికి 150 నిమిషాల వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలని నొక్కిచెప్పింది. అంతేగాదు ఏం చేయాలన్నా.. ఆరోగ్యం బాగుండాలన్న సూత్రం మరువకండి అంటున్నారు నిపుణులు.కనీసం జిమ్ వెళ్లని వాళ్లు ఓ ఇరవై నిమిషాలు నడిస్తే మంచిదని సూచించింది డబ్ల్యూహెచ్ఓ.డైట్ ఎలా ఉండాలంటే..ఉదయం: 5 ఎగ్‌వైట్స్, ఉడికించిన కూరగాయలు. పాల నుంచి తీసిన పెద్ద చెంచాడు వెన్న ప్రొటీన్. రెండుసార్లు రెండు రకాల పండ్లు. పది వేయించిన లేదా నానబెట్టిన బాదం పప్పులు.మధ్యాహ్నం: నూనె లేకుండా చేసిన 100 గ్రాముల చికెన్, కూరగాయలు, 50 గ్రాముల అన్నం, 150 గ్రాముల పండ్లు.రాత్రి: 100 గ్రాముల చికెన్ లేదా 150 గ్రాముల చేపలు, కూరగాయలు. వాటితోపాటు మూడు పూటలా కూరగాయలు, కీర దోస, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలట. అయితే ఇది వ్యక్తికి-వ్యక్తికి డైట్ మారిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల దృష్ట్యా మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ఇది కేవలం ఆరోగ్యకరమైన వృధాప్యాన్ని ఆస్వాదించడం కోసం ఇచ్చిందే తప్ప అందరికీ సరిపడదని కూడా హెచ్చరించారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.చదవండి: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్‌కి..! ఆ ఉద్యోగాల వల్లే.. -
ఉత్సాహానికి ఉల్లాసానికి లైన్ డ్యాన్సింగ్
డాన్స్ చేయడమంటేనే ఉత్సాహం. అందరూ కలిసి ఒక వరుసలో చేస్తూ ఉంటే భలే ఉల్లాసం. ఇవాళ రేపు లైన్ డాన్సింగ్ చిన్నా పెద్దల్లో ట్రెండ్ అవుతోంది. మన పల్లెల్లో ఎప్పటి నుంచో కోలాటం, భజనల్లోఉండే లైన్డాన్స్ ఇప్పుడు ఫిట్నెస్ మంత్రగా ఉంది. వివరాలు.చిన్నప్పుడు పాఠశాలల్లో ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు టీచర్లు పిల్లల చేత డ్యాన్స్ చేయించేవారు. అందర్నీ ఒక వరసలో నిలబెట్టి, వారికి తగ్గ స్టెప్పులు నేర్పించి, అందరూ ఒకేలా చేసేందుకు శిక్షణ ఇచ్చేవారు. దీన్ని ‘లైన్ డ్యాన్సింగ్’ అనేవారు. అందరూ ఒకే లైన్ లో నిల్చుని చేసే డ్యాన్స్ ఇది. ప్రస్తుతం ఇది సరికొత్త ట్రెండ్‌గా మారింది. చిన్నాపెద్దా, యువత, ముసలి అనే తేడా లేకుండా చాలామంది ఇందులో పాల్గొంటున్నారు. ఈ లైన్ డ్యాన్స్ ను వీడియోలు తీసి నెట్లో ట్రెండ్ అవుతున్నారు.ఈ ట్రెండ్ ఎలా మొదలైంది?లైన్ డ్యాన్సింగ్ అనేది కొత్త పద్ధతి కాదు. అయితే కొవిడ్ అనంతర కాలంలో ఈ డ్యాన్స్ ట్రెండ్‌గా మారింది. ఒంటరితనంతో ఇబ్బంది పడేవారు, తోడు లేదని బాధపడేవారు, ఇతర మానసిక సమస్యలున్నవారు ఒకచోట చేరి లైన్ డ్యాన్స్ క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నారు. వరుసగా నిలబడి, సంగీతానికి తగ్గట్లు లయబద్ధంగా నృత్యం చేయడం ద్వారా తాము ఒంటరివాళ్లం కాదు అనే భావనను పెంచుకున్నారు. మెల్లగా ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చాలామంది ఈ లైన్ డ్యాన్సింగ్‌ను ఒక విధానంగా పాటిస్తున్నారు. అందరిముందూ డ్యాన్స్ చేసేందుకు భయపడేవారు, సిగ్గు, మొహమాటం కలిగినవారికి ఇది సౌకర్యవంతంగా మారింది. డ్యాన్స్ రాకపోయినా ఇతరుల నుంచి స్టెప్స్ నేర్చుకొని నాట్యం చేయడం మొదలుపెట్టారు.శారీరక ఆరోగ్యానికి మేలుగా..లైన్ డ్యాన్సింగ్ అనేది శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇందులో భారీ స్టెప్స్, స్పీడ్ మూమెంట్స్ ఉండవు. చేసేవారి వయసు, వారి శరీరాకృతి, వయసును బట్టి కొందరు ఈ లైన్ డ్యాన్సింగ్కి డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటారు. ఒక్కోసారి ఎవరికి నచ్చినట్లు వారు కూడా డ్యాన్స్ చేయొచ్చు. ఒకరితో కలిసి మరొకరు డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని పలు సమస్యలు దూరమవుతాయి. యువత ఎక్కువగా కొత్త రకాల స్టెప్స్ ఫాలో అవుతుండగా, వయసు పైబడినవారు నిదానంగా, హాయిగా సాగే డ్యాన్స్ ని ఇష్టపడుతున్నారు. వారి ఆరోగ్యాన్ని బట్టి, వారికి అనువైన రీతిని ఎంచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా కీళ్లనొప్పులు, నడుమునొప్పి తగ్గి శరీరం చురుగ్గా ఉంటుందని వారు అంటున్నారు.మానసిక ఆరోగ్యానికి ఊతంలైన్ డ్యాన్స్ కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది. అందరూ కలిసి డ్యాన్స్ చేయడం ద్వారా శరీరంలో నొప్పి, బాధ తగ్గించే రసాయనాలు విడుదలై వారిని ఉల్లాసంగా ఉంచుతాయి. ఈ నృత్యం చేసిన తర్వాత తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, తమలో ఆందోళనలు తగ్గాయని అంటున్నారు. లైన్ డ్యాన్స్ చేసేవారే కాదు, చూసేవారు కూడా ఆహ్లాదాన్ని ΄÷ందుతున్నామని అంటున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి కొందరు వైద్యులు ఈ డ్యాన్స్ చేయమని సలహా ఇస్తున్నారు.సామాజిక బంధాలూ పదిలంలైన్ డ్యాన్సింగ్ ద్వారా సామాజిక బంధాలూ పదిలమవుతున్నాయి. ఒంటరిగా బాధపడే లైన్ డ్యాన్స్ చేయడం ద్వారా ఇతరులతో కలిసిపోతున్నారు. తమ మనసులోని బాధల్ని దూరం చేసుకుంటున్నారు. సుమారు 43 శాతం మంది యువత ఇదే మాట చెప్తున్నారు. ఈ లైన్ డ్యాన్స్ తమకు బోలెడంత మంది మిత్రుల్ని దగ్గర చేసిందనేది వారు చెప్పే మాట. వయసు మళ్లినవారు సైతం ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు ఇటువంటి లైన్ డ్యాన్స్ క్లబ్‌లలో చేరుతున్నారు. ఇతర వ్యాపకాలతో పోలిస్తే మానసిక ఆందోళన, ఒంటరి భావనలు దూరం చేసుకునేందుకు ఇది మేలైన మార్గం అని నిపుణులు అంటున్నారు. -
12 ఏళ్లు దాటిన వాహనాలు 10 నుంచి బంద్
లబ్బీపేట(విజయవాడతూర్పు): కేంద్రప్రభుత్వం రవాణా వాహనాల ఫిట్నెస్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి 12 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను నిలిపివేసి బంద్ పాటించనున్నట్లు ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు వై.వి.ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడులోని వెల్లూరులో సోమవారం జరిగిన సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (సిమ్టా) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రైల్వే గూడ్స్, షిప్ యార్డులకు వెళ్లే వాహనాలు, పౌర సరఫరాలకు ఉద్దేశించిన పన్నెండు సంవత్సరాలకు పైబడిన రవాణా వాహనాలు కలిగి స్వయం ఉపాధి పొందుతున్న ఆపరేటర్లు ఈ బంద్‌లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకూ రూ.1340 ఉన్న ఒక్కో వాహనం ఫిట్నెస్ చార్జీలను ఏకపక్షంగా రూ.33 వేలకు పెంచుతూ కేంద్రప్రభుత్వం గత నెల 11న నోటిఫికేషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం పాత లారీల యజమానులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని, ఇప్పటికే దక్షిణ రాష్ట్రాల్లో వేలసంఖ్యలో లారీలు ఫిట్నెస్ చేయించుకోలేక నిలిచిపోయాయని తెలిపారు. పాత రేట్లనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఆ డిమాండ్ నెరవేరేవరకు 12 ఏళ్లకు పైబడిన లారీలు రోడ్లపై నడపకుండా ఆందోళన చేసేందుకు సిమ్టా సమావేశం తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల లారీ యజమానుల సంఘాల నాయకులు పాల్గొన్నట్టు ఈశ్వరరావు తెలిపారు. -
సంయుక్తా మీనన్ ఫ్యాషన్, ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
చీర కట్టుకుంటే క్లాసిక్ క్వీన్ , గౌన్ వేసుకుంటే గ్లామర్ గర్ల్, కేజువల్ వేర్లో వెళ్తే చీర్‌ఫుల్ చిక్! ఇలా ప్రతి లుక్‌లోనూ ‘వావ్!’ అనిపించేస్తుంది నటి సంయుక్తా మేనన్ . ఇప్పుడు ఆ అందం వెనక దాగి ఉన్న ఫ్యాషన్ రహస్యాలు, ఫిట్నెస్ మంత్రాలు మీ కోసం... ఫిట్నెస్ విషయంలో నేను చాలా కాన్షియస్! రుచిగా ఉన్న ప్రతి ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోవచ్చని ఇప్పుడిప్పుడే గ్రహించాను. అందుకే చక్కెర, ఉప్పు, మసాలా, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నింటినీ దూరం పెడుతున్నాను. ఇక స్టయిలింగ్ విషయానికి వస్తే, ప్రతి ఔట్ఫిట్లో చిన్న చిన్న డీటెయిల్స్ ఉండాలి, అప్పుడు లుక్ కంప్లీట్ ఫీల్ వస్తుంది.సంయుక్తా ముత్యాల వడ్డాణం!‘పూసల వడ్డాణం’ అంటే పాతకాలపు ఆభరణం అనుకుంటే, పొరపడినట్టే! ఇప్పుడు ఈ ముత్యాల వడ్డాణం ఫ్యాషన్ ర్యాంప్ మీదే కాదు, ఇన్‌స్టా రీల్స్‌లో కూడా హాట్ ఫేవరెట్! చిన్న చిన్న పూసలు, ముత్యాలతోనే బంగారు వడ్డాణం కంటే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. డార్క్ కలర్ శారీస్‌పై ఇది పర్ఫెక్ట్ చాయిస్! ఇది ఎలిగెన్స్‌కి గ్లామర్ కలిపిన కాంబినేషన్ . పర్ల్ వర్క్ బ్లౌజ్ ఉంటే, అదనపు ఆభరణాలు ఇక అవసరం కూడా ఉండవు. అయితే, ఈ పూసల వడ్డాణం వేసుకునే ముందు హెయిర్ స్టయిల్ లోబన్ లేదా ఆప్డో ఉండేలా చూసుకోండి. దానికి తగ్గట్టుగానే చీరను డార్క్ కలర్స్‌తో పెయిరప్ చేస్తే లుక్ మరింత హైలైట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ హూప్ లేదా స్టేట్మెంట్ పీస్ ఉంటే మోడర్న్ వైబ్ వస్తుంది. స్మోకీ ఐస్, న్యూడ్ లిప్ కలర్ వంటి మినిమల్ మేకప్‌తో క్లాసీ లుక్ క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ సంయుక్త మీనన్ ధరించే చీర..బ్రాండ్: క్యూబీ ఐక్యూధర: రూ. 45,000, జ్యూలరీ బ్రాండ్: సుహానీ పిట్టె, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?) -
సెలబ్రిటీల ఫిట్నెస్ సీక్రెట్..ఇలా చేస్తే..!
ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. అయితే రకరకాల కారణాల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఫిట్ నెస్, ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ చూపలేకపోతున్నారు. కొంతమంది సినిమా సెలబ్రిటీలు మాత్రం తమ ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. వారెవరో, వారి ఆరోగ్య రహస్యాలేమిటో తెలుసుకుందాం. దీపికా పదుకోన్, అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి వంటి సినీ తారలు తమ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ సెలబ్రిటీలు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోడానికి, ఆరోగ్యాన్ని కా΄ాడుకోడానికి అసలు ఏం తింటారు, ఏం చేస్తారో తెలుసుకుందాం. శిల్పాశెట్టి.. ఒకప్పుడు భారత సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి శిల్పాశెట్టి. ఈ మంగుళూరు భామ తరచు తన ఫిట్ నెస్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. శిల్పా శెట్టి ఆహారపు అలవాట్లు, వ్యాయామ నియమాలు చాలా మందికి స్ఫూర్తినిస్తున్నాయి. దాదాపుగా ఐదుపదుల వయస్సులో కూడా శిల్పాశెట్టి ఫిట్ గా ఉండటానికి ఆమె ఆహారపుటలవాట్లే కారణం. ఉదయాన్నే నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగే శిల్పాశెట్టి.. బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్, పోహా, పప్పు చీలా వంటి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంది. లంచ్‌లో బ్రౌన్ రైస్, కూరగాయలు, పండ్లు, చికెన్, చేపలు వంటివి తీసుకుంటుంది. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటానంటుంది శిల్పాశెట్టి.శిల్పాశెట్టి ఆరోగ్య యోగం: రెగ్యులర్‌గా యోగా చేయడంతోపాటు వెయిట్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు కూడా చేస్తూ చురుగ్గా ఉండటమే ఆమె ఆరోగ్య రహస్యం. అక్షయ్ కుమార్.. ఆరుపదల వయస్సుకు చేరువ అవుతున్నా కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ బాలీవుడ్ హీరోని మించినవాళ్లు లేరంటే అతిశయోక్తి లేదు. క్రమశిక్షణకు మారుపేరైన అక్షయ్ కుమార్వ్యాయామం, యోగా, కార్డియోలకు ప్రాధాన్యతనిస్తారు. ఇవి ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా, టోన్గా ఉంచుతాయి. ఆహారం విషయానికొస్తే అక్షయ్ కుమార్.. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లను, శక్తిని అందించేలా ఉదయాన్నే పాలు, పరాటాలు తీసుకుంటారు. దీపికా పదుకోన్.. భారత సినీ పరిశ్రమలోనే కాకుండా విదేశాల్లో కూగా తన నటనతో అద్భుతమైన ప్రశంసలు,ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన దీపికా పదుకొణె ఫిట్ నెస్ విషయంలో అసలేమాత్రం రాజీపడదు. త్వరలోనే నాలుగవ పదిలోకి అడుగు పెట్టనున్న దీపికా పదుకోన్ ఫిట్ నెస్, అందం వెనుక ఆరోగ్యకరమైన ఆహారమే అసలు రహస్యం.దీపికా పదుకొణె ఉదయం ఆహారంలో గ్రీన్ టీ, ఓట్ మీల్ తీసుకుంటుంది. దీపికాకి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే బాగా ఇష్టపడే దీపికా బ్రేక్ ఫాస్ట్ లోకి దక్షిణ భారతీయ వంటకాలైన ఇడ్లీ, దోసెలను తీసుకుంటుంటుంది. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తుంది. రణ్వీర్ సింగ్.. తన డిఫరెంట్ లుక్స్, స్టైల్, స్మైల్‌తో అందరినీ ఆకట్టుకునే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్.. తన రోజును వ్యాయామం, కార్డియోతో ప్రారంభిస్తాడు, ఇది అతని శరీరాన్ని ఎల్లప్పుడూ చురుగ్గా, ఫిట్‌గా ఉంచడంలో తోడ్పడతాయి. ఉదయాన్నే ఎనర్జీ డ్రింక్స్ తాగుతాడు. ఆ తర్వాత అల్ఫాహారంలోకి ఓట్స్, డ్రై ఫ్రూట్స్, స్మూతీలు తీసుకుంటానంటున్నాడు. నిజానికి వీరు అనుసరించేవన్నీ చాలా చిన్న చిన్న ఆరోగ్య నియమాలే. అయితే వాటినే మనం ఫాలో కాము అసలు. ఇక్కడే వచ్చింది అసలు తేడా. -
శిఖరాలపై సింహనాదం..!
పంచభూతాల్లో భాగమైన నింగి, నేల, నీరు, వాయువులను ఎదురీది సాహసోపేతమైన ప్రయాణం చేయడం మనుషులకు సాధ్యమేనా అంటే.., ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం, మనో సంకల్పం ఉంటే సాధ్యమేనని నిరూపిస్తున్నాడు ‘ఐన్ మ్యాన్’ చాలెంజ్ పూర్తి చేసిన సాహసికుడు కళాలి జై సింహ గౌడ్. ప్రపంచంలోని వివిధ ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించడం, మహాసముద్రాలను ఈదడం, అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఫుల్ మారథాన్లు పూర్తి చేయడం, బాడీ బిల్డింగ్‌లో సత్తా చాటడం.. అన్నింటికీ మించి ‘మేక్ ఫిట్ ఇండియా’లో భాగంగా ఫిట్‌నెస్‌పై అందరికీ అవగాహన కల్పించడం తన వృత్తి, ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఎవరెస్ట్ అధిరోహణం వంటి లక్ష్యాలతో తన భవిష్యత్ ప్రణాళికలు నిర్దేశించుకుంటూనే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఫిట్నెస్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. యూరప్‌లోనే అత్యంత ఎత్తైన మంచు శిఖరం మౌంట్ ఎల్బ్రస్.. 18,600 అడుగుల ఎత్తులో ఎముకలు కొరికే 14 డిగ్రీల మైనస్ ఉష్ణోగ్రతల్లో ఈ మహా పర్వతాన్ని గతంలోనే అధిరోహించి జాతీయ జెండాతో పాటు జై తెలంగాణ పతాకాన్ని సగర్వంగా ఎగరేశారు నగరానికి చెందిన జై సింహ. అంతేకాకుండా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వత శిఖరాల్లో ప్రసిద్ధి చెందిన కిలిమంజారో పర్వతాన్ని సైతం అధిరోహించారు. అంతేకాకుండా లద్దాక్‌లోని కాంగ్ యాట్సే 1, 2 పర్వతాలను సైతం ఈ లిస్ట్‌లో చేరిపోయాయి. పర్వతారోహణతో పాటు.. లద్దాక్ వేదికగా 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, హైదరాబాద్ నగరంలో ఎన్ఎండీసీ ఫుల్ మారథాన్.. వీటితో పాటు పలు ప్రతిష్టాత్మక మారథాన్లు పూర్తిచేశారు. ఇదే నెల ప్రారంభంలో గోవా వేదికగా మిరామర్ బీచ్‌లో నిర్వహించిన 5వ ఎడిషన్ ఐరన్ మ్యాన్ 70.3లో ఏకకాలంలో 1.9 కిలో మీటర్ల స్విమ్మింగ్, 90 కిలో మీటర్ల సైక్లింగ్, 21.1 కిలో మీటర్ల రన్నింగ్ పూర్తిచేసి సత్తాచాటారు. 46 ఏళ్ల ఈ పర్వతారోహకుడు, బాడీబిల్డర్, ఫిట్నెస్ ట్రైనర్.. రంగాల్లో రాణిస్తూ.. మొత్తంగా ఐరన్ మ్యాన్ అనిపించుకుంటున్నారు. ఈ స్ఫూర్తితో మరిన్ని పర్వతాలు అధిరోహించడానికి సన్నద్ధమవుతున్నారు. ఫిట్నెస్ అవగాహనే లక్ష్యం.. ఓవైపు వ్యక్తిగతంగా ప్రపంచ రికార్టులు తన ఖాతాలో వేసుకుంటన్నారు. మరోవైపు విభిన్న కార్యక్రమాలతో సామాజికంగా అందరికీ శారీరక ఆరోగ్యం అవసరమని అవగాహన కలి్పస్తున్నారు. మారథాన్లు, ఫిట్నెస్ అవేర్నెస్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నగరంలో ‘సిమ్ లయన్ ఫిట్నెస్’ సెంటర్లు ప్రారంభించి ఔత్సాహికులకు ఫిట్నెస్, జిమ్ సేవలు అందిస్తున్నారు. ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్ వంటి ప్రాంతాల్లో జిమ్ సేవలతో పాటు బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహిస్తూ సామాజిక దృఢత్వానికి తానొక పునాదిలా నిలుస్తున్నారు. గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా, మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్గా సుదీర్ఘ కాలం పనిచేసిన జై సింహ.. ఫిట్నెస్ రంగాన్ని విస్తృతం చేయాలనే లక్ష్యంతో వాటన్నింటికీ స్వస్తిపలికానని తెలిపారు. వచ్చే ఏడాది అర్జెంటీనాలోని అకాన్గువా పర్వతంతో పాటు ప్రపంచంలో మరో ఎత్తైన పర్వతం ఎవరెస్టును సైతం అధిరోహించనున్నారు. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తున్న నగరవాసి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి నగరానికి వచి్చన నేను.. ఫిట్నెస్ను జీవిత లక్ష్యంగా మార్చుకుని ఖండాంతరాల్లోని ఎత్తైన శిఖరాలపై దేశ ఖ్యాతిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా. వచ్చే ఏడాది జనవరి 9న అర్జెంటీనాలోని అకాన్గువా పర్వతాన్ని, తదుపరి మార్చ్ నెలలో ఎవరెస్ట్ పర్వతారోహణకు సన్నద్ధమవుతున్నా. అంతేకాకుండా ఓషన్మ్యాన్గా రికార్డు సృష్టించేందుకు మహాసముద్రంలో 10 కిలోమీటర్ల స్విమ్మింగ్‌కు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఈ తరం యువతలో శారీరక క్రమశిక్షణ, వ్యాయామ అభిరుచి పెంచడం, అరోగ్య సంరక్షణలో ఫిట్నెస్ ప్రాధాన్యతను తెలియజేయడం,శారీరక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం సంకల్పంగా ముందుకు సాగుతున్నా. ఫిట్ ఇండియా భవిష్యత్ కార్యాచరణ, ఇప్పటి వరకూ చేసిన పర్వతారోహణలన్నీ సిమ్ లయన్ ఫిట్నెస్ ప్రయత్నంలో సొంత ఖర్చులతోనే పూర్తి చేశాను. తదుపరి తలపెట్టిన పర్వతారోహణకు లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ప్రభుత్వం, ఇతర సంస్థలు, వ్యక్తుల నుంచి స్పాన్సర్షిప్ లభిస్తే దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. గోవాలో జరిగిన ఐరన్ మ్యాన్ 70.3 నేపథ్యంలో పోటీదారులను మోదీ అభినందించిన విధానం నాలో మరింత స్ఫూర్తి నింపింది. – కళాలి జై సింహ గౌడ్, ఫట్నెస్ నిపుణుడు (చదవండి: Cancer Fighting Foods: ఏయే కూరగాయలు, పండ్లు కేన్సర్‌కి చెక్పెడతాయంటే..!) -
లేటు వయసులో వెయిట్ లాస్ జర్నీ..! గుర్తుపట్టలేనంత స్లిమ్‌గా బామ్మ..
బరువు తగ్గడం అనే ప్రక్రియ కాస్త యంగ్ ఏజ్‌లోనే ప్రారంభిస్తాం. అది వాళ్ల ఆహార్యం, హెల్త్ సమస్యల రీత్యా ఇంకాస్త మందు లేదా 40 నుంచి 50,60ల వయసులో మొదలు పెడతారు. అంతకుమించి మరీ లేటు వయసులో..అది కూడా విశ్రాంతి తీసుకునే వయసులో ఎవ్వరూ మొదలుపెట్టే సాహసం చేయరు. కానీ ఈ బామ్మ అలా కాదు. ఏడు పదలు వయసులో బరువు తగ్గాలనుకోవడమే కాదు, ఆ వయసులో కష్టతరమైన కసరత్తులు చేసి గుర్తుపట్టలేనంత నాజూకుగా మారిపోయింది. పైగా ఫిట్నెస్ టిప్స్ చెప్పేస్తోంది.కెనడాలోని ఒంటారియాకు చెందిన 79 ఏళ్ల జోన్ మెక్‌డొనాల్డ్ అసాధారణమైన సాహాసానికి పూనుకుని బరువు తగ్గాలనే ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచారామె. వయసు కేవలం నెంబరేనని ప్రూవ్చేసింది. అంతేగాదు 70 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కౌట్లు చేసి ఔరా అనిపించుకుంది. దాదాపు ఎనిమిదేళ్లుగా అధిక బరువుతో ఉండేదాన్ని అని ఇన్‌స్టా వేదికగా తన వెయిట్ లాస్ స్టోరీ షేర్ చేసుకుందామె. తాను ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా కేర్ తీసుకున్నట్లు తెలిపింది. బరువు తగ్గడం అనేది ఎప్పుడూ కష్టతరమైన ప్రక్రియ కాదు. కూరగాయలు, ఫైబర్‌పై ఫోకస్ పెడుతూ..కండరాలను బలోపేతం చేసేలా వ్యాయామాలు చేస్తే చాలంటోంది ఈ బామ్మ జోన్. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా ఎలాంటి వర్కౌట్లు చేస్తే బెటర్ అనేది తెలుసుకున్నానని వివరించింది. అందుకోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రారంభించినట్లు తెలిపింది. వార్మప్ నుంచి మొదలుపెట్టి..వేగవంతంగా చేసే వ్యాయామాలు దాదాపు 60 నుంచి 70 నిమిషాలు కొనసాగేవని చెప్పుకొచ్చింది. అంతేగాదు ప్రతి నెల తనలో వస్తున్న పరివర్తనను గమనించానని, అదీగాక తాను మరింత బలంగా ఫిట్‌గా ఉన్నట్లు అనిపించిందని వెల్లడించింది. ఇక వర్కౌట్ల పరంగా బామ్మ వారానికి రెండు లెగ్ సెషన్లు, రెండు అప్పర్ బాడీ, ఒక గ్లూట్-ఫోకస్డ్ సెషన్ తప్పనిసరిగా చేసేదాన్ని అని అంటోదంది ఈ బామ్మ. ఏ వయసులో వెయిట్‌లాస్ ప్రక్రియ ప్రారంభించినా..డెడికేషన్ మస్ట్ అప్పుడే సత్ఫలితాలు పొందగలరని చెప్పకనే చెప్పింది కదూ ఈ బామ్మ జోన్. View this post on Instagram A post shared by Joan MacDonald (@trainwithjoan) (చదవండి: పెళ్లి వేడుకలో కిరణ్ మజుందార్ షా, సుధామూర్తిల స్టెప్పులు..!) -
ఫిట్నెస్కి పప్పీ టచ్!
జిమ్‌కి వెళ్లడం బోర్‌గా అనిపిస్తోందా? అయితే ఈ కొత్త ఫిట్నెస్ ట్రెండ్ మీకు ఒక ‘ఫన్ వర్కౌట్’లా అనిపించొచ్చు! ఎందుకంటే ఇందులో మనుషులు జంతువుల్లా చేతులు, కాళ్లు నేల మీద వేసుకుని పరుగెడతారు. పేరు ‘క్వాడ్రోబిక్స్(Quadrobics)’! కాని, ఫిట్నెస్ ప్రేమికులు దీన్ని ‘ఫుల్ బాడీ ఫన్నీ వర్కౌట్’ అంటున్నారు. అంతే కాదు, సాధారణ వర్కౌట్స్ మాదిరి గంటల తరబడి కాకుండా, కేవలం ఐదు నిమిషాలే చేస్తే ఊపిరి బిగుసుకుంటుంది! అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే, వైద్యులు మాత్రం ‘ఇది కాస్తా జంతువుల్లా ప్రవర్తించే అలవాటుగా మారితే ప్రమాదం!’అని హెచ్చరిస్తున్నారు. చేతులు, మణికట్టు, భుజాలు ఇవన్నీ మన బాడీకి ఈ లోడ్‌కి అలవాటు ఉండవు. కాబట్టి ఫిట్నెస్ కన్నా ఫ్రాక్చర్ ఫాస్ట్‌గా రావచ్చు! అని చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ‘ఫోర్ లెగ్ ఫిట్నెస్’ శరీరానికి కాకపోయినా, లైక్స్‌కి మాత్రం బాగా పని చేస్తోంది! -
ఒక సమోసా... యాభై నిమిషాల వాక్
కొందరికి సమోసా ఇష్టమైతే కొందరికి పూరీ ఫేవరెట్టు. ఇంకొంతమంది పిజ్జా బర్గర్లంటే ్ర΄ాణం పెడతారు. అన్నీ హాటేనా, మరి స్వీటు సంగతో.... అంటే తడవకో గులాబ్‌జామూన్ గుటుక్కుమనిపించేవారికి, అదను దొరికితే చాలు... జిలేబీలు, లడ్డూల మీద దండయాత్ర చేసేవారికి కొదవేం లేదు. బాగానే ఉంది మరి.. వీటిని కరిగించడానికి... సారీ... అవి తినడం వల్ల మన ఒంట్లోకి వచ్చిపడే క్యాలరీలను కరిగించడానికి ఏం చేస్తున్నారు? తినడం వరకే కానీ క్యాలరీల కౌంటుతో మాకేం పని అంటారా? అదేం కుదరదు... మీరు ఒక్క సమోసా లేదా వడాపావ్ తింటే వంట్లోకి దాదాపు 250 క్యాలరీలు వచ్చి పడతాయి. వాటిని కరిగించాలంటే దాదాపు యాభై నిమిషాలు నడవాలి. అదే ఒక పిజ్జా ముక్కను కరిగించాలంటే కనీసం గంట సేపు వాక్ చేయాలి. అన్నట్టు ఇవన్నీ మనం వేసిన కాకిలెక్కలేం కాదు... ముంబైకి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనన్ వోరా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో భారతదేశంలో అత్యంత ఇష్టమైన కొన్ని ఆహారాల కేలరీల సంఖ్య, వాటిని సమతుల్యం చేసుకోవడానికి మీరు ఎంత సమయం నడవాలి అనే దాని గురించి ఇటీవల వివరించారు.‘మీరు చిప్స్ ప్యాకెట్ తింటుంటే, అది సుమారు 300 కేలరీలు వరకు చేరుతుందని, మీకు గంటకు పైగా నడక అవసరం‘ అని డాక్టర్ వోరా పేర్కొన్నారు. తీపి పదార్థాలు ఇష్టపడేవారికి,‘1 గులాబ్ జామున్‌లో 180 కేలరీలు ఉంటాయి, అంటే దాదాపు 35 నిమిషాల నడక‘ అని ఆయన చెప్పారు.. ఒక ప్లేట్ చోలే భతురే అంటే పూరీ, శనగల కూర 600 కేలరీలు ప్యాక్ చేస్తుంది, మీరు దాదాపు 2 గంటలు నడవాలి. అలాగని కడుపు మాడ్చుకోవాల్సిన పనేం లేదని, నచ్చిన వాటిని ఆస్వాదిస్తూనే వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి చిన్నపాటి ఎక్సర్‌సైజులతో వాటిని సమతుల్యం చేసుకోవడం మంచిదని ఆయన పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Dr. Manan Vora (@dr.mananvora) (చదవండి: ఇదిగో ఏఐ... అదిగో పులి!) -
'వంట నూనె వాడకం తగ్గించండి': వరల్డ్‌కప్ విజేతలతో ప్రధాని మోదీ
భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. చారిత్రాత్మక విజయం సాధించినందుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. వారితో సంభాషణ సందర్భంగా దేశంలో పెరుగుతున్న ఊబకాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దేశ పౌరులంతా తమవంతు సాయం అందించాలని కోరారు. జాతీయ ఆరోగ్య చొరవలో భాగంగా నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఫిట్ ఇండియ ఉద్యమం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. నిజానికి మోదీ ప్రతి భారతీయుడు దైనందిన జీవితంలో ఫిట్నెస్ను అంతర్భాగం చేయడానికి 2019 నుంచి ఈ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. మన దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు ఫిట్ ఇండియా ఒక్కటే పరిష్కారమని నొక్కి చెబుతున్నారు. దయచేసి అంతా వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గిస్తే, పైగా కొనుగోలు చేసే సమయం కూడా తగ్గుతుందని అన్నారు. అలాగే భారత మహిళా జట్టుని ఉద్దేశించి..తమ పాఠశాలలను సందర్శించి యువతరాలకు స్ఫూర్తినివ్వాలని సూచించారు. కాగా, గట్టి భద్రతా చర్యల మధ్య ప్రదానమంత్రితో సమావేశం కావడానికి భారత జట్టు మంగళవారమే న్యూఢిల్లీకి చేరుకుంది. అలాగే భాతర జట్టు అద్భుతమైన విజయ సాధించిన వెంటనే మోదీ సోషల్ మీడియా పోస్ట్‌లో "టోర్నమెంట్ అంతటా భారత జట్టు అసాధారణమైన కృషిని, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారులందరికి అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు చాంపియన్ క్రీడలను చేపట్టడానికి ప్రేరేపిస్తుంది." అని పోస్ట్‌లో పేర్కొన్నారు మోదీ.(చదవండి: అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్ యూనివర్స్ పోటీ..) -
60 ఏళ్ల హీరో.. అర్థరాత్రి 2 గంటలకు జిమ్.. ఉదయం నిద్రపోతాడు!
సీనీ హీరోలు ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. గంటలపాటు జిమ్ లో కష్టపడి నోరుకట్టుకుని మరీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటారు. రాత్రి త్వరగా పడుకోవడం.. ఉదయాన్నే లేచి.. వ్యాయామం..ఒక్క పూట భోజనం చేస్తూ తమ ఫిజిక్‌ని వయసు కన్న తక్కువగా ఉండేలా చూసుకుంటారు. అయితే ఓ హీరో మాత్రం ఇందుకు విరుద్ధంగా డైట్ ఫాలో అవుతున్నాడు. ఉదయం జిమ్ చేయకుండానే.. రాత్రిళ్లు త్వరగా నిద్రపోకుండానే అద్భుతమైన ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేస్తూ..60లోనూ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఆయనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan ). ఆయన రాత్రంతా మెలకువతో ఉండి ఉదయం ఐదు గంటకు నిద్రపోతాడు అట. అంతేకాదు అర్థరాత్రి 2 గంటకు జిమ్ చేస్తాడట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.‘నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకు పడుకొని పది గంటలకు అలా మెల్కొంటాను. అర్థరాత్రి రెండు గంటలకు జిమ్ చేస్తాను. ఆ తర్వాత స్నానం చేసుకొని ఉదయం 5 గంటలకు నిద్రపోతాను. అప్పుడప్పుడు మద్యం కూడా తీసుకుంటాను.అయితే ఎప్పుడైన నిర్ధిష్టమైన పాత్ర కోసం ఒక షేప్‌లోకి రావాలంటే మాత్రం మద్యం తీసుకోవడం మానేస్తాను. అలాగే వైట్ రైస్, స్వీట్లు కూడా తినడం మానేస్తాను. కొన్నిసార్లు చాక్లెట్, ఐస్‌క్రీం కూడా తింటాను. కానీ వర్కౌట్ మాత్రం చేస్తుంటాను’ అని షారుఖ్ ఖాన్ అన్నారు. నేటితో(నవంబర్ 2) ఆయన 60 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. అయినప్పటికీ ఫిట్నెస్ విషయంలో మాత్రం 20 ఏళ్ల కుర్రాడిలాగే కనిపిస్తాడు. -
జిమ్ లేకున్నా హోమ్ చాలు
ఈ రోజుల్లో మహిళల బాధ్యతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇంట్లో గృహిణిగా, ఆఫీసుల్లో ఉద్యోగినిగా మల్టీ టాస్కింగ్‌గా పనులను చక్కబెట్టాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు మైండ్ అండ్ బాడీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందుకు రోజువారీ వ్యాయామాలు చేయాలి. జిమ్‌కు వెళ్లలేం అనుకునేవారు ఇంట్లోనే పాటించదగిన ఫిట్నెస్ కేర్ గురించి తెలుసుకుని ఆచరిస్తే ఎంతో మేలు జరుగుతుంది. బాలీవుడ్ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ యాస్మిన్ చెబుతున్న జిమ్ ఫిట్నెస్΄పాఠాలు ఇవి... దీపికా పదుకొనే, అలియాభట్ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ మహిళల దినచర్యలకు తగిన విధంగా ఇంట్లోనే చేసుకోదగిన ఫిట్‌నెస్‌కు మార్గనిర్దేశం చేస్తుంది. పోషకాహారంపైనా దృష్టి పెడుతుంది. మహిళల ఫిట్నెస్ కోసం కోర్ స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో కూడిన బ్యాలెన్స్‌ను గట్టిగా చెబుతుంది. అంతేకాదు, మెనోపాజ్ వంటి దశలలో మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి సరైన సూచనలనూ అందిస్తుంది.స్థిరత్వం ముఖ్యంచాలా మందిలో ఫిట్నెస్ విషయంలో తీవ్రమైన నిర్ణయాలు ఉంటాయి. ఎక్కువ సమయం, వేగంగా వ్యాయామాలు చేయడం కంటే సరైన సమయంలో సరైన వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ సాధించడం ముఖ్యం. సమతుల ఆహారం : ప్రాసెస్ చేసి, చక్కెర ఉన్న ఆహారాలను నివారించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఫిట్నెస్ లక్ష్యాలలో చాలా ముఖ్యమైనది.అనుకూలమైన వ్యాయామాలు: ఇంట్లో, జిమ్‌లో ఎక్కడైనా చేయడానికి ఎన్నో రకాల వ్యాయామాలు ఉన్నాయి. నిత్యం బిజీగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలమైనవి ఎంచుకొని చేయవచ్చు.ఇంట్లోనే చేయదగిన కొన్ని వ్యాయామాలుట్రైసెప్ డిప్స్: మీ ట్రైసెప్స్ కోసం డిప్స్ చేయడానికి బలమైన కుర్చీని ఉపయోగించవచ్చు. అప్పర్కట్, పంచ్: చేతులను బలోపేతం చేసేలా బాక్సింగ్ విధానంలో కదలికలు ఉండాలి.∙డబుల్ లెగ్ స్ట్రెచ్: నేలపైన పడుకొని, మోకాళ్ళను ఛాతీ వద్దకు తీసుకురావడం, తిరిగి చేతులు, కాళ్లను యధాస్థానానికి తీసుకువెళ్లడం.. ఇలా పదే పదే చేయడం ద్వారా ఉదర కండరాలలో మార్పులు తీసుకురావచ్చు.స్ట్రెయిట్ లెగ్ లిఫ్ట్‌లు : నేలమీద వీపుపై పడుకుని, కాళ్లను సమాంతరంగా చాపుతూ పైకి ఎత్తాలి. తర్వాత తిరిగి కిందకు చేర్చాలి. మడమ స్పర్శ: నేలమీద పడుకొని, మోకాళ్ల దగ్గర కాళ్లను వంచి, చేతులతో మడమలను తాకడానికి ప్రయత్నం చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు శ్వాస లయను కూడా ఒక రిథమ్‌గా నిర్వహించడం ముఖ్యం. ఎటువంటి గాయం కాకుండా మరొకరి పర్యవేక్షణలో సాధన చేయడం ఉత్తమం.నిటారుగా నిల్చొని, ఒక చేతిని తలకిందుగా పట్టుకుని, నెమ్మదిగా వంగిపాదాన్ని మరొక చేతితో తాకండి. అలాగే రెండో చేతితో చేయాలి. తక్కువ పరికరాలతో వ్యాయామాలుహాలో డంబెల్: పాదాలను, భుజాలను వెడల్పుగా ఉంచి భుజాలు, ట్రైసెప్స్, వీపును లక్ష్యంగా చేసుకోవడానికి రెండు చేతులతో డంబెల్‌ను పట్టుకొని, దానిని తల చుట్టూ తిప్పాలి. బ్యాండ్ ట్విస్ట్: మార్కెట్లో జిమ్ బ్యాండ్స్ లభిస్తాయి. కాళ్లు, చేతులతో ఈ బ్యాండ్ పట్టుకుంటూ ఎగువ, దిగువ వీపు కండరాలపై నిమగ్నం చేయాలి.కెటిల్‌బెల్ : ఇది సైడ్ బెండ్ చేయడానికి బాగా ఉపయోగపడే మరొక పరికరం. ఈ కెటిల్‌బెల్ తో మోచేయి నుండి మోకాలికి ఒక డైనమిక్ కదలిక ఉంటుంది. దీనివల్ల నడుము టోన్ అవ్వడమే కాకుండా, కోర్ కో ఆర్డినేషన్ కూడా మెరుగుపడుతుంది. చేతితో కెటిల్‌బెల్ తీసుకొని, బరువు ఉన్న వైపు పక్కకు వంగి, రెండో మోకాలిని మోచేయి కలిసే విధంగా పైకి ఎత్తాలి. ఇలా పది నుంచి పన్నెండు సార్లు చేయాలి.మెడిసిన్ బాల్ ట్విస్ట్ దీనితో వ్యాయామం చేస్తే పక్కలు బలోపేతం అవుతాయి. ఇందులో ఛాతీ స్థాయిలో మెడిసిన్ బాల్ పట్టుకుని, తల కింద నుంచి ఒక వైపు నుండి మరొక వైపుకు కదలించాల్సి ఉంటుంది.రోజులో ఖాళీ కడుపుతో కొంత సమయం ఈ వ్యాయామాలు చేస్తే మైండ్‌కు–బాడీకీ మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. పనులకు తగినట్టు శక్తిని పుంజుకోవడానికి, శారీరక చురుకుదనం పెంపొందించుకోవడానికి, పోషకాహారంపై దృష్టి పెట్టడానికి ఈ పై వ్యాయమాలు పనిచేస్తాయి. చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
పూజా బాత్రా ఫిట్నెస్ సీక్రెట్..! టోన్డ్ బాడీ కోసం..
బాలీవుడ్ నటి పూజా బాత్రా తన గ్లామర్‌తో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. తన అందం అభినయంతో కుర్రాళ్ల మదిని కొల్లగొట్టిన ఈ బ్యూటీ..నాలుగు పదుల వయసు దాటినా..ఇంకా అంతే అందం, ఫిట్నెస్తో అలరించడమే కాదు. ఇప్పటకీ ఆమెకు అంతే క్రేజ్ ఉంది. పూజ అంతలా ఫిట్‌గా యంగ్ లుక్‌లో కనిపించడానికి గల సీక్రెట్ ఏంటో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా బయటపెట్టింది. మరి అవేంటో చూద్దామా..!.ఈ నెల అక్టోబర్ 27తో 49 ఏళ్లు నిండాయి. అయినా ఇప్పటికీ అంతే అందంగా గ్లామర్‌గా కనిపిస్తుంది పూజ బాత్రా. అందుకోసం ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటానని అంటోందామె. అంతేగాదు ఫిట్నెస్ అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా అని అంటోందామె. మన శరీరాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం, మాననసిక ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నాం అనే దానిపైనే మన లుక్ ఆధారపడి ఉంటుందని పూజా నొక్కి చెబుతోంది. మానసికంగా స్ట్రాంగ్ ఉండటమే అసలైన గేమ్ ఛేంజర్ అని అంటోంది. తాను ఆరేళ్లుగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నానని, వారానికి మూడు రోజులు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. పైగా దాంట్లో తాను రెండు బ్రౌన్ బెల్ట్‌లు గెలుచుకున్నట్లు కూడా వెల్లడించిందామె. ఇది తనను చురుకుగా ఉండేలా చేసి, బరువుని నిర్వహించడం సులభమయ్యేలా చేస్తుందని చెబుతోంది. అన్నిట్లకంటే సంతోషంగా ఉండేందుకు ఫిట్నెస్ అనేది అందరికి అవసరం అని పూజా పేర్కొంది. అంతేగాదు ఆమె మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ హైకింగ్ కూడా చేసినట్లు తెలిపింది. హైకింగ్ పరంగా మౌంట్ ఎవరెస్ట్, మోంట్ బ్లాంక్,యోస్మైట్ బేస్ క్యాంప్‌లతో సహా పలు ఎత్తైన ప్రదేశాలను చుట్టొచ్చారామె. View this post on Instagram A post shared by Pooja Batra Shah (@poojabatra) లండన్‌లోని లాస్ ఏంజిల్స్‌లో ఉండే పూజా యోగా టీచర్ కూడా. మార్షల్ ఆర్ట్స్‌తోపాటు యోగా అంటే కూడా మహా ఇష్టమని పూజ చెప్పుకొచ్చింది. ఇది సమతుల్య జీవితాన్ని గడపడానికి హెల్ప్ అవుతుందని అంటోంది. చివరగా ఆమె మానవవులు అభివృద్ధి చెందాలంటే సత్వ అనే సంస్కృపదానికి ప్రాధాన్యత ఇవ్వాలంటుంది. అంటే సమతుల్యత అనే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే అంతలా హాయిగా జీవితాన్ని గడిపేలా అవకాశం లభిస్తుందని అంటోంది పూజా బాత్రా.(చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..) -
శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..
వయసు సాహసోపేతమైన పోటీల్లో పాల్గొనేందుకు అడ్డంకి కాదని చాలామంది వృద్ధులు నిరూపించారు. అలా కాకుండా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని ప్రారంభించి..సెంచరీ వయసు వరకు అదే ఫిట్నెస్తో ఉండటం అంటే మాటలు కాదు కదా.!. కానీ ఈ శతాధిక వృద్ధుడు ఇప్పటికీ అదే ఫిట్నెస్తో ఉండటమే కాదు..వందేళ్ల వయసులో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు యువకుడిగా ఉండగా ఆర్మీలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో తన వంతు పాత్రను పోషించి అజేయమైన ధైర్య సాహాసాలు కనబర్చాడు. పైగా ఈ వయసులో కూడా హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తూ.. ఫిట్నెస్ టిప్స్ కూడా చెబుతున్నారు. చెప్పాలంటే తరతరాలకు ఆయనొక స్ఫూర్తి..ఆయనే అమెరికాకు చెందిన అత్యంత వృద్ధ బాడీబిల్డర్ ఆండీ బోస్టింటో. ఆయన బాడీబిల్డింగ్‌లో ప్రపంచ ఛాంపియన్ కూడా. అంతేగాదు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాడీబిల్డింగ్ ఔత్సాహికులకు అంతర్జాతీయ రోల్ మోడల్. ఇటీవలే వందేళ్ల వయసులో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని అరుదైన ఘనతను సృష్టించాడు. ఈ వయసులో కాలు కదిపేందుకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఆయన బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. అంతేగాదు ఈ ఏడాది ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ స్టాఫ్ సార్జెంట్ రెండో ప్రపంచ యుద్ధంలో 101వ రెజిమెంట్‌గా అసామాన్య పరాక్రమాన్ని చూపించినందుకు గానూ ఆండీని కాంస్య నక్షత్రంతో గౌరవించింది.బాల్యం మొదలైంది అలా..ప్రపంచ ప్రఖ్యాత బాడీబిల్డర్‌గా పేరుగాంచిన ఆండీ ప్రస్థానం న్యూయార్క్ నగరం నుంచి మొదలైంది. 1925 జనవరి 11న ఇటాలియన్ కుటుంబంలో జన్మించిన అతను తల్లి, సోదరడుతో కలిసి పెరిగాడు. క్రిస్మెస్ చెట్టు బహుమతులిస్తుందని అమాయకంగా నమ్మిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ..తన ఆశను ఒమ్ము చేయకుండా విశాల హృదయంతో పొరుగింటివారు తనకందించిన బహుమతులను మర్చిపోనంటాడు. అదే తనకు దాతృత్వం విలువను నేర్పించిందని చెబుతుంటాడు. ఇక ఆండీకి చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ పట్ల మక్కువ ఎక్కువ. 12 ఏళ్లకే అందులో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. 16 ఏళ్లకు బాడీబిల్డింగ్ మ్యాగ్జైన్ల కోసం ఫోటోలు తీయబడ్డాడు కూడా. ఆ తర్వాత ఆర్మీలో చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేసి..తిరస్కరణకు గురయ్యాడు. చివరికి పట్టుదలతో తనకిష్టమైన రంగంలో చేరి అక్కడి అధికారులచే ప్రశంసలందుకున్నాడు. అయితే తనకిష్టమైన బాడీబిల్డింగ్ని మాత్రం వదులుకోలేదాయన. అలా 1977లో సీనియర్ మిస్టర్ అమెరికా టైటిల్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత తన భార్య ఫ్రాన్సిస్‌తో కలిసి నేషనల్ జిమ్ అసోసియేషన్‌ను స్థాపించాడు. అక్కడ హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తుంటాడు ఆండీ. ఆండి యువతరానికి ఇచ్చే సలహా..దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ఫిట్నెస్ ఔత్సాహికులను తన అనుభవాన్ని షేర్ చేయడమే గాక సలహాలు సూచనలు షేర్ చేసుకుంటుంటారు. అందులో కొన్ని..శారీరక శిక్షణలాంటిది మానసికంగా సిద్ధంకావడం. ఇది మన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించేలా చేయడమే కాదు మన సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. అవసరం అనుకుంటే సర్దబాటుని కూడా స్వీకరించండిఇక్కడ ఆండీ రెండు ప్రపంచయుద్ధం కాలికి గాయం, స్ట్రోక్ వంటి పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయితే ఆండీ తన పరిమితులపై ఫోకస్ పెట్టకుండా కేవలం శిక్షణపైనే దృష్టి పెట్టి తన సామార్థ్యానికి అనుగుణంగా మార్చుకుంటానని చెబుతున్నాడు. అన్నింట్లకంటే అప్లికబుల్ లేదా పాటించటం అనేది అత్యంత కీలకం. ఇంట్లో లేదా జిమ్‌లో అయినా.. సరైన టెక్నీక్స్ పాటించాలి. అప్పుడే సత్ఫలితాలు అందుకోగలరని చెబుతున్నారు ఆండీ బోస్టింటో. (చదవండి: weight loss journey: 15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..) -
15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..
అధిక బరువు తగ్గడం అతిపెద్ద సమస్య కాదు అని నిరూపిస్తున్నారు పలువురు. మెరుగైన ఫలితాలు రావాలంటే సరైన విధంగా, మంచి నిపుణుల సలహాల సూచనలు పాటించాలి. ఈ అధిక బరువుకి చెక్‌పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించేది కేవలం డైట్ మాత్రమే కాదు, వర్కౌట్లుదే అగ్రస్థానం. ఎందుకంటే శారీరక శ్రమతో ఫ్యాట్‌ని కరిగించడమే గాక బరువులో మార్పులు కూడా సంభవిస్తాయి. కొందరికి చేతులు, కాళ్లు, పిరుదులు బాగా లావుగా కనిపిస్తాయి. ఆ ప్రదేశాల్లోని కొలెస్ట్రాల్ తగ్గి..ఫ్లాట్‌గా అవ్వడమేగాక చెక్కిన శిల్పంలా ఆకృతి మారాలంటే ఈ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది ఫిట్నెస్ కోచ్ సాచి పాయ్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా చూద్దామా..!. టొరంటోకు చెందిన ఈ ఫిట్నెస్ కోచ్ సాచి పాయ్(Saachi Pai) జస్ట్ 15 నెలల్లో 40కిలోలు పైనే బరువు తగ్గింది. అంతలా బరువు తగ్గడంలో తనకు హెల్ప్ అయిన వ్యాయామాలు, ఆహారాలు గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. బరువు తగ్గడంలో మార్పులు బాహ్యంగా కనిపించాలంటే..కాళ్లు, చేతులు, పిరుదుల సైజ్ తగ్గితేనే..బరువు తగ్గినట్లు తెలుస్తుంది. అందుకోసం ఈ ఐదు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయలంటోంది సాచి పాయ్. సైడ్ రైజెస్ఈ వ్యాయామం కోసం నిటారుగా నిలబడి ప్రారంభించాలి. ఒక కాలును పక్కకు ఎత్తి, దానిని నిటారుగా ఉంచండి. కాలును నెమ్మదిగా క్రిందికి తీసుకురండి ..ఇలా పునరావృతం చేయాలి.ముందు, వెనుక కిక్స్ఎత్తుగా నిలబడి, ఒక కాలును ముందుకు తన్నండి, ప్రారంభానికి తిరిగి వెళ్లి, ఆపై దానిని వెనుకకు తన్నండి. ఆ తర్వాత యథాస్థానానికి వచ్చి..కదలికలను నియంత్రించాలి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేయండి. సింగిల్ ఇన్నర్ లెగ్ రైజెస్మీ దిగువ కాలును నిటారుగా ఉంచి, పై కాలును దానిపై వంచి సైడ్‌కు పడుకోండి. ఇది, లోపలి తొడలపై ఒత్తిడి కలుగుజేసేలా దిగువ కాలును పైకి ఎత్తండి. ఇలా మీ కాలును నెమ్మదిగా తగ్గించి.. పునరావృతం చేయండి. నిర్దిష్ట సంఖ్యలో ప్రాక్టీస్ అయ్యాక..మరోవైపకి తిరిగి ఇలానే పునరావృతం చేయాలి..ఫైర్ హైడ్రాంట్స్నాలుగు కాళ్లపై ప్రారంభించండి, ఒక మోకాలిని పక్కకు ఎత్తండి, దానిని వంచి ఉంచండి. వ్యాయామం చేస్తున్నప్పుడు మీ తుంటిని తిప్పవద్దు. ఇప్పుడు, వీపును క్రిందికి తగ్గించి రెండో కాలికి ఇలానే వ్యాయామం రిపీట్ చేయండి.డాంకీ కిక్స్నాలుగు కాళ్లపై నిలబడి, ఒక మోకాలిని వంచి, మడమను పైకప్పు వైపుకు ఎత్తాలి. ఈ వ్యాయామాలు కొవ్వును కాల్చడానికి, టోన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. పలితంగా శిల్పంలా శరీరాకృతి మారేందుకు దోహదపడుతుంది. ఈ వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలో సరిగా చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారని, అదే తప్పుగా చేస్తే లేనిపోని శారీరక సమస్యలు తప్పవని చెప్పుకొచ్చారు. సాధ్యమైనంతవరకు నిపుణుడైన ఫిట్నోస్ పర్వవేక్షకుడి సమక్షంలో నేర్చుకోవడమే మంచిదని సూచిస్తున్నారు సాచిపాయ్. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్‌లాస్ పాఠాలు..) -
వెయిట్ లాస్లో ఈ మూడింటిని నమ్మకండి : రణబీర్ ఫిట్నెస్ కోచ్ వార్నింగ్
లవర్ బాయ్‌లా ఉండే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఒక్కసారిగా కండలు తిరిగిన దేహంతో కనిపించి ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేశాడు. ఫిట్నెస్ కోచ్ శిక్షణలో తీవ్రమైన కసరత్తు చేసి ఫిట్‌గా కనిపించాడు. అయితేతాజాగా రణబీర్‌ను తీర్చిదిద్దిన ఫిట్నెస్ కోచ్ శివోహం భట్ వెయిట్ లాస్ పై ఉన్న అపోహలు గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు. బరువు తగ్గాలంటే కొత్త డైటీమీ అవసరం లేదు... అశాస్త్రీయమైన వాటిని నమ్మకుండా ఉండే చాలు అని హితవు పలికారు. ఫిట్నెస్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆ మూడు మిత్స్ ఏంటో చూసేద్దామా మరి.శివోహం భట్ ప్రకారం కడుపు మాడ్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు అనుకుంటే పొరపాటే. దీని వల్ల మజిల్స్ బర్స్ అవుతాయి,కానీ కరిగేది కొవ్వు కాదని తేల్చారు. అపోహలను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దచాలా మంది తక్కువ తినడం, ఎక్కువ పని చేయడం అనేది కొవ్వు తగ్గడానికి కీలకమని భావిస్తారు. దీని వల్ల తీవ్రమైన కేలరీల లోటులోకి వెళ్లిపోతారని శివోహం హెచ్చరించారు.ఆకలి మెటబాలిజాన్ని తగ్గించేస్తుంది (Starving Slows Metabolism) దీనివల్ల వాస్తవానికి ఏమి జరుగుతుంది? బాడీ సర్వైవల్ మోడ్‌లోకి వెళుతుంది. కొవ్వును కరిగించడానికి బదులుగా శక్తి కోసం కండరాల కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో మెటబాలిజం నెమ్మదిస్తుంది. మజిల్ అనేది మెటబాలిజాన్ని యాక్టివ్‌గా ఉంచే టిష్యూ. ఇది విశ్రాంతి సమయంలో కూడా కేలరీలను బర్న్ చేస్తుందన్నారు. కాబట్టి ఆకలితో ఉండటం వల్ల, స్కేల్ పడిపోతుంది. శరీరం నీరసించిపోతుంది. అంతిమంగా ఇది తిరిగి మళ్లీ కొవ్వు పేరుకుపోవడానికే దోహదపడుతుంది. అందువల్ల బరువు తగ్గడం అంటే తక్కువ తినడం కాదు సరిగ్గా తినడం అన్నారు.చదవండి: 7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్‌తో సెంచరీ కొట్టేశా! కార్డియో కేలరీలను బర్న్ చేస్తుందా?కార్డియో చేస్తే ఎక్కువకేలరీలు బర్న్ అవుతాయనుకుంటారు. ఆపివేసిన మరుక్షణం, కేలరీల బర్న్ కూడా ఆగిపోతుందని శివోహామ్ భట్ గుర్తు చేశారు. వెయిట్ ట్రెయినింగ్ భిన్నంగా ఉండాలి. బరువులు ఎత్తినప్పుడు మజిల్స్ దృఢపడతాయి. ఇవి జీవక్రియ రేటును పెంచుతాయి, అంటే నిద్రపోతున్నప్పుడు కూడా. అందుకే అధిక కొవ్వును కరిగించుకోవాలన్నా, సన్నగా మారాలన్న, కార్డియో, వెయిట్ ట్రెయినింగ్ రెండూ ఉండాలని సూచించారు.డిసిప్లీన్ బెస్ట్: డిసిప్లీన్ పవర్ ఫుల్.. మోటివేష్, విల్వపర్ ఇవన్నీ ఒక ట్రాప్. ఇవి లేక చాలామంది ఇబ్బంది పడతారు. ప్రోటీన్-రిచ్ న్యూట్రిషన్, డీప్ రికవరీ (నిద్ర), స్థిరత్వం ఇదే బెస్ట్ ఫార్ములా. ఇవే గేమ్ చేంజర్స్ అన్నారు. అంతేకానీ ఫ్యాట్ బర్నర్స్, డీటాక్స్ టీలు, క్రాష్ డైట్ ఇవన్నీ తాత్కాలిక చిట్కాలు మాత్రమే అని శివోహామ్ భట్ పేర్కొన్నారు. లేనిపోని హైప్ ఇవ్వడం కాకుండా అలవాట్లను పెంపొందించేలా చూస్తాడు ఫిట్నెస్ కోచ్ . అన్ని సమస్యలకు నిబద్ధతే పరిష్కారమని శివోహామ్ తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్ -
44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్‌లాస్ పాఠాలు..
ఆరోగ్యకరమైన జీవినశైలి బరువు తగ్గడానికి సంబంధించి..తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్ కారణంగానే చాలామంది వెయిట్‌లాస్ కాలేకపోతుంటారని చెబుతున్నాడు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ యష్ వర్ధన్ స్వామి. కొందరు విఫల ప్రయత్నం చేసి విసిగిపోయినవాళ్లు కూడా ఉన్నారని అంటున్నాడు. తాను ఒకప్పుడు అధిక బరువు ఉండేవాడనని, ఇప్పుడు వెయిట్‌లాస్ అయ్యి ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాని కూడా చెప్పారు.ఆ మార్పు కొన్ని పాఠాలను నేర్పించిందని, అవి శ్రేయోభిలాషులకు తప్పక ఉపయోగపడతాయాంటూ..తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు బరువు తగ్గడం అనేది క్రమ శిక్షణ, మనసును కంట్రోల్ చేయడం వంటి అంశాలను తప్పక నేర్పిస్తుందని అంటన్నారు. వాటి కారణంగా బరువు తగడ్డం అనేది ఆధారపడి ఉంటుందట. మరి అదెలా అనేది ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.ఫిట్నెస్ ట్రైనర్(Fitness coach) యష్ వర్ధన్ స్వామి(Yash Vardhan Swami) 13ళ్ల క్రితం వరకు అధిక బరువుతో ఉండేవాడనని చెప్పారు. ఆ తర్వాత 44 కిలోలు మేర బరువు తగ్గి విజయవంతమయ్యాక..కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా అర్థమయ్యాయన్నారు. తను క్రమంగా బరువు తగ్గుతున్నప్పుడూ సంతరించుకున్న మార్పుని గమనిస్తూ..నేర్చుకున్న వెయిట్‌లాస్ పాఠాలను గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బరువు తగ్గడం అనే శారీరక సవాలు.. మానసిక భావోద్వేగాలను సంబంధించిన అంశమని నొక్కి చెప్పారు. ఇక్కడ ఊబకాయం(Obesity) అనేది కేవలం శరీర సమస్య కాదు, జీవిత సమస్య అని అన్నారు. దీని కారణంగా అన్ని సంబంధాలు కోల్పోతామట. ముఖ్యంగా ఆరోగ్యం, సంపద, సంబధాలపై ప్రభావం చూపి..పూర్తిగా సత్సంబంధాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అలాగే వెయిట్‌లాస్ జర్నీలో అతి ముఖ్యమైన సవాలు మనసుతో యుద్ధం చేయడమేనని అన్నారు. కొలస్ట్రాల్ తగ్గించుకుంటే బరువు తగ్గుతామని అందరికీ తెలుసు. అది కార్యరూపంలోకి రావాలంటే..మనసు కంట్రోల్లో ఉండాలన్నారు. అప్పుడే మనం వేసుకునే వెయిట్‌లాస్ ప్లాన్ సక్సెస్ అవ్వగలదు. అది నియమానుసారంగా సాగితే..క్రమశిక్షణ, నిబద్ధత అలవడుతుందట. ఎప్పుడైతే మనలో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అప్పుడూ కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి ఆటోమేటిగ్గా మద్దతు లభించడమే కాదు..మనకో ప్రాముఖ్యత ఏర్పడేలా మన రూపురేఖల్లో మార్పులు సంతరించుకుంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇంకొక విషయం తప్పక గుర్తించుకోండి అంటూ..ఊబకాయం ఏమి రాత్రికి రాత్రికి మన జీవితాన్ని నాశనం చేయదని చెప్పారు. మన ఆహారపు అలవాట్లతో రోజువారిగా నెమ్మదిగా మన సౌందర్యాన్ని దెబ్బతీసేలా బరువు పెరుగుతుంటామని అన్నారు. అందుకే ఎదుట వ్యక్తులకు శారీరక పరంగా మనపట్ల ఉన్న అభిప్రాయాన్ని లైట్ తీసుకోవద్దని అని సూచిస్తున్నారు. అప్పుడే లోపాన్ని సరిచేసుకునే యత్నం చేసి..బరువు తగ్గేందుకు ట్రై చేస్తామని అన్నారు. అందుకు మనసు తోపాటు డెడికేషన్ అనేది అత్యంత ప్రధానమని గ్రహించమని సూచించారు ఫిట్నెస్ కోచ్ యష్ వర్ధన్ స్వామి. View this post on Instagram A post shared by Yash Vardhan Swami (@trainedbyyvs) (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
ఫుట్ వేర్కి బై.. 'బేర్‌ఫుట్ వాక్'కి సై..! అధ్యయనాలు సైతం..
అప్పులేకుండా తన కాళ్ల మీద తాను నిలబడడం అంటే ఆర్థికంగా స్థిరపడినట్టే అనేవారు పెద్దలు. కానీ చెప్పుల్లేకుండా తన కాళ్లపై తాను నడవడం అంటే ఆరోగ్యం లభించినట్లే అంటున్నారు నేటి వైద్య నిపుణులు. ప్రస్తుతం గ్రౌండింగ్/ఎర్తింగ్ పేర్లతో మెట్రో నగరాల్లో పాదరక్ష రహిత నడక ఆరోగ్య సాధనంగా మారింది. దీనివల్ల ఆరోగ్యపరమైన లాభాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఇప్పటికే వెల్నెస్ చికిత్సా కేంద్రాల్లో ఆదరణ పొందుతున్న ఈ బేర్‌ఫుట్ వాక్‌పై నగరవాసుల్లో క్రమంగా ఆకస్తి పెరుగుతోంది. ఆరోగ్య రక్షణపై పెరుగుతున్న అవగాహనే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలికి చెప్పుల్లేకుండా మైళ్ల దూరం నడిచేవాళ్లం అంటూ మొన్నటి తరం గొప్పగా చెప్పుకోవడం విన్నాం. అప్పట్లో చెప్పులూ లేవు.. ప్రయాణించడానికి సరైన రవాన సౌకర్యాలూ లేవు.. కాబట్టి వారి ఆరోగ్యానికి అవన్నీ దోహదం చేశాయని చెప్పొచ్చు. ఎటువంటి పాదరక్షలూ లేకుండా నడిచినప్పుడు కాళ్లకి మరింతగా స్టిమ్యులేషన్ జరుగుతుందని వైద్యులు అంటున్నారు. ప్రయోజనాలివే.. పాదాలకు చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరానికి, కాళ్లకూ మధ్య మెరుగైన సమన్వయం, రక్త ప్రసరణ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. పాదరక్షలు లేకుండా నడవడం స్వేచ్ఛగా, కొంత సంతృప్తిగా కూడా అనిపిస్తుంది. ఇది బాల్యపు జ్ఞాపకాలను తిరిగి తీసుకువస్తుంది. ఈ నడక వల్ల నేలతో మరింత సమన్వయం ఏర్పడుతుంది. ఇది ప్రొప్రియోసెప్షన్ (శరీర కదలికల–అవగాహన)ను మెరుగుపరుస్తుంది. శరీరం కదలిక స్థానాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచి పాదాలపై పట్టు జారిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. మెరుగైన ప్రొప్రియోసెప్షన్తో మెరుగైన భంగిమ వస్తుంది. కొంతకాలం పాటు చెప్పులు లేకుండా నడవడం వల్ల వెన్నెముక, కీళ్లు బలోపేతమై మరింత స్థిరత్వంతో తక్కువ వంగి నడవడానికి కూడా సహాయపడుతుంది. పాదాలకు అసంఖ్యాక నరాలు, రక్త నాళాలు ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వాటిని చురుకుగా మారుస్తుంది. రక్త ప్రసరణ పెంచుతుంది. ప్రసరణ సమస్యలు ఉన్నవారికి, చల్లని పాదాలకు లేదా రోజంతా కూర్చొని గడిపే వారికి ఇది చాలా మేలుచేస్తుంది. అంతేకాదు ఇది నాడీ వ్యవస్థను కూడా మేల్కొలుపుతుంది. భూ ఉపరితలంతో ప్రత్యక్ష సంబంధం ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. పాదాలు నేలను నేరుగా తాకినప్పుడు చర్మంలో సంభవించే మార్పుల కారణంగా మెదడు చురుకుగా మారుతుందని స్పర్శాజ్ఞానం అత్యుత్తమం అవుతుందని, సెన్సరీ స్టిమ్యులేషన్, మోటార్ స్కిల్స్.. బాడీ బ్యాలెన్సింగ్ నైపుణ్యం వంటివి పెరుగుతాయని చెబుతున్నారు. షూస్, సాక్స్లలో చేరుకునే బాక్టీరియా, ఫంగస్ నుంచి తప్పించుకోవచ్చు. చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కడ? దేనిపై అడుగు పెడుతున్నారు? పాదాలు ఏ స్థితిలో ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చదునైన పాదాలు, ప్లాంటార్ ఫాసిటిస్ లేదా పాదాల నొప్పి ఉన్నవారు దీన్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫ్లాట్ ఆర్చ్‌లు, ప్లాంటార్ ఫాసిటిస్, లేదా దీర్ఘకాలిక నొప్పి వంటి కొన్ని ప్రత్యేక తరహా పాదాలు ఉంటే చెప్పులు లేకుండా నడవడం మరింత దిగజార్చుతుంది. అందరికీ కాదు.. అన్ని చోట్లా కాదు.. పాదరక్షలను వదిలే ముందు, పాడియాట్రిస్ట్ లేదా ఫిజియోథెరపిస్ట్‌ను ముందస్తుగా సంప్రదించడం అవసరం ఇది అందరికీ లేదా ప్రతి వాతావరణానికి తగినది కాదు. పట్టణ ప్రాంతాలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి కొన్ని పరిస్థితులు ప్రమాదాన్ని కలిగిస్తాయి. గడ్డి, ఇసుక లేదా నేల వంటి సహజ ఉపరితలాలపై సహజమైన ప్రకృతిలో మాత్రమే పాదరక్ష రహితంగా నడవవచ్చు. పరిశుభ్రమైన పరిసరాలు కూడా తప్పనిసరి. వృద్ధులకు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది సరైన ఎంపిక కాదు. ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తెస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని కఠిన ఉపరితలాలు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొన్ని ఆరోగ్య పరిస్థితులు చెప్పులు లేకుండా నడవడాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి. బేర్ ఫుట్ వాక్ పూర్తయ్యాక వైద్యులు సూచించిన యాంటిబయాటిక్ సోప్స్ లేదా లోషన్స్ ఉపయోగించి పాదాలను శుభ్రపరుచుకోవడం మంచిది. పచ్చని గడ్డి మీద, పరిశుభ్రంగా ఉండే కార్పెట్స్ మీద నడవవచ్చు. సముద్రపు ఇసుక మీద నగక కూడా మంచిదే. ఆరోగ్యకరం.. తగిన జాగ్రత్తలు తీసుకుని బేర్‌ఫుట్ వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. ముఖ్యంగా దీనివల్ల ఫుట్ పొజిషన్ (అడుగు పడే స్థితి) మీద నియంత్రణ వస్తుంది. నడకలో బ్యాలెన్స్ పెరగడానికి, నొప్పి నివారణ వేగంగా జరగడానికి ఉపయోగపడుతుంది. పిరుదులు, కీళ్లు, కోర్ మజిల్స్ మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. సరిగా నప్పని పాదరక్షలు ధరించడం వల్ల వచ్చే ఇబ్బందులకు చెక్ పడుతుంది. లోయర్ బ్యాక్ ప్రాంతపు కండరాలను శక్తివంతం చేస్తుంది. – డా.కల్పన, ఫ్యామిలీ ఫిజీషియన్ (చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..) -
భారత్‌లోని జిమ్లే బాగుంటాయ్..! ఉక్రెయిన్ మహిళ మనోగతం..
విదేశీయులు మనదేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను ఇష్టపడటం కొత్తేం కాదు, గానీ తాజాగా జిమ్ పరంగా కూడా భారత్‌నే మేటి అనే కితాబిచ్చేసింది ఓ విదేశీ మహిళ. వాస్తవానికి మనకంటే అత్యాధునిక టెక్నాలజీని అనుసరించే పాశ్చాత్య దేశాలు..ఫిట్నెస్ విషయంలో మనకంటే ముందుంటారు. అలాంటిది భారత్‌లోని జిమ్ సౌకర్యమే బాగుటుందని చెబుతోంది. ఇక్కడ ట్రైనర్స్ శిక్షణే బాగుంటుందని, ఈ విషయంలో యూరప్ దేశాలు భారత్‌ని నేర్చుకోవాలంటూ చురకలంటిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఎనిమిదేళ్లకుపైగా భారత్‌లోనే నివశిస్తున్న విక్టోరియా చక్రవర్తి భారత్ జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్నట్లు పేర్కొంది. యూరోపియన్ ఫిట్నెస్ ఇండస్ట్రీ భారతీయ జిమ్ సౌకర్యం నుంచి చాలా నేర్చుకోవాలని అంటుంది. రూల్స్, సేవలు, వెసులబాటు వరకు అంతా సామాజిక వాతావరణం ఉంటుంది. ఆ పరంగా ఇరు దేశాల మధ్య జిమ్ సంస్కృతిలో చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ఈ నాలుగు పాఠాలను తప్పక నేర్చుకోవాలని అంటోంది. ఆ నాలుగు పాఠాలు.సరసమైన ధరలో జిమ్ సౌకర్యం దొరుకుతుంది. అధికంగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. అలాగే తక్కువ ధరకే పూర్తి సౌకర్యాలందించే జిమ్‌లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చిందికమ్యూనిటీ వెబ్: భారతీయ జిమ్‌లు సామాజికంగా కనిపిస్తాయి. ప్రజలు మాట్లాడుకుంటారు, చిట్కాలు పంచుకుంటారు, ఒకరినొకరు గుర్తిస్తారు, ట్రైనర్ పేరును కూడా తెలుసుకుంటారు. యూరప్‌లోలా ఎవరికివారుగా ఉండరు. జిమ్‌లు సాధ్యమైనంత త్వరితగతిన తెరుచుకుంటాయి. నెల ఇట్టే గడిచిపోతుంది. విద్యార్థులు, కొత్తగా నేర్చుకునేవారికి ప్రత్యేక నిపుణుల సూచనతో కూడిన శిక్షణా సౌకర్యం ఉంటుంది. ఈ విషయంలో యూరప్ జిమ్‌లో వార్షిక ఒప్పందాలు ఉంటాయి. అవి కూడా కఠిన నిబంధనలని అంటోంది విక్టోరియా. అలాగే భారత్‌లో ట్రైనర్ల సలహాలు సూచనలకు అధనంగా సొమ్ము చెల్లించాల్సిన పని ఉండదు. భారత్‌లో ఫిట్నెస్ ట్రైనర్లు తమ శిక్షకులకు స్వయంగా మార్గనిర్దేశం చేస్తారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కూడా. ఇలాంటి వ్యక్తిగత శ్రద్ధ కొరకు యూరప్‌లో అదనంగా చెల్లించాలని అంటోంది. ఫిట్నెస్ పరంగా భారత్ నుంచి యూరప్ చాలా నేర్చుకోవాలని, భారత్‌లా ఉండాలని అంటోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమెతో ఏకభవించడమే కాదు, భారతీయ సంస్కృతిని ఇంతలా ఇష్టపడుతున్నందుకు ధన్యావాదాలు చెప్పారు పోస్టులyో. కాగా, సదరు ఇన్ఫ్లుయెన్సర్ విక్టోరియా గతంలో తనను చాలామంది భారత్‌కు వెళ్లవద్దని సూచించినట్లు వెల్లడించింది. అయితే ఆమె ఇక్కడకి రావడమే గాక ప్రేమలో పడటమేగాక ఇక్కడే వ్యాపారాన్ని కూడా నిర్మించిన తన విజయవంతమైన ప్రస్థానాన్ని అంతకుమునుపే పంచుకుంది కూడా. View this post on Instagram A post shared by Foreigner In India | Influencer | Kolkata | UGC (@viktoriia.chakraborty)(చదవండి: నలభై ఏళ్ల తల్లి వెయిట్‌లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..) -
Yoga ఐదుపదులైనా ఫిట్‌గా...అయ్యంగార్ యోగ!
48 సంవత్సరాల వయస్సులో కూడా చక్కటి సౌష్టవంతో యువ నటీమణులతో పోటీ పడుతున్న బాలీవుడ్ నటి మల్లికా షెరావత్(Mallika Sherawat). ఆమె తనను ఫిట్‌గా ఉంచే అయ్యంగార్ యోగా(Iyengar yoga) సాధన గురించి ఇటీవల ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వేగంగా బరువు తగ్గాలని, తొందరగా ఫిట్నెస్ పెంచుకోవాలని ఇంచుమించు అందరూ అనుకుంటారు. అయితే అలాంటి క్విక్–ఫిక్స్ డైట్లు, ట్రెండింగ్ వర్కౌట్లు, సోషల్ మీడియా ట్రిక్స్ మూలంగా వచ్చిన ఫిట్నెస్ అంతే తొందరగా కరిగిపోతుందని తెలుసుకోలేక చాలామంది స్థిరమైన ఫిట్నెస్ మార్గాన్ని గాలికి వదిలేస్తుంటారు.నా ఫిట్నెస్ ఫిలాసఫీ‘‘నా ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు యోగా చేయడమే కారణం. అంతేగానీ ఫ్యాషన్ డైట్లు లేదా క్రాష్ ప్రోగ్రామ్ లు కాదు’ అని మల్లిక ఇన్‌స్టా సాక్షిగా తేల్చి చెప్పింది. ఆరోగ్యంగా ఉండాలన్న తపన.. క్రమశిక్షణ, స్థిరత్వం తన అతిపెద్ద సాధనాలని నొక్కి చెప్పింది. ట్రెండీ ఫిట్నెస్ హ్యాక్‌లను ఆమోదించే చాలా మంది సెలబ్రిటీల మాదిరిగా కాకుండా, మల్లికా దీర్ఘకాలిక అలవాట్లను పెంపొందించుకోవడం వైపే మొగ్గు చూపుతుంది. అందుకే అయ్యంగార్ యోగాను తన దినచర్యలో భాగంగా మార్చుకుంది. View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) ఫిట్నెస్ను తాను తాత్కాలికంగా తీసుకోలేదని, దానిని తన జీవనశైలిలో భాగంగా చేసుకున్నానని చెబుతూనే, అయ్యంగార్ యోగా వల్ల తన శరీరాన్ని షేప్ కోల్పోకుండా ఉంచుకోవడమే కాకుండా, తన బిజీ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి, ముఖ్య విషయాల మీద దృష్టి పెట్టడానికి సహాయపడిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. అయ్యంగార్ యోగకూ పతంజలి ఋషి యోగ సూత్రాలకూ అవినాభావ సంబంధం ఉంది. అష్టాంగ యోగా ఎనిమిది అంశాలను ఆచరణాత్మక వ్యవస్థలో మిళితం చేస్తుంది. అధికారిక అయ్యంగార్ యోగా వెబ్సైట్ ప్రకారం, దాని క్రమం, ఆధారాల ఉపయోగం, భద్రతపై ప్రాధాన్యత దీనిని ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా అభ్యసించే యోగా రూపాలలో ఒకటిగా మార్చాయి.చదవండి: బాలీవుడ్‌ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తేఅయ్యంగార్ యోగాలో కీలకమైన అంశం ఏమిటంటే పట్టీలు, బోల్ట్లర్లు, బ్లాక్స్, తాళ్లు వంటి ఆధారాలను ఉపయోగించడం. ఈ సాధనాలు ప్రారంభకులకు అధునాతన అభ్యాసకులకు సరైన భంగిమను సాధించడంలో సహాయపడతాయి, అదే సమయంలో గాయం ప్రమాదాలను తగ్గిస్తాయి. ఇది అభ్యాసాన్ని అత్యంత సమగ్రంగా చేస్తుంది, అన్ని వయసుల వారికి, ఫిట్నెస్ స్థాయులకు అనుకూలంగా ఉంటుంది. -
స్పేస్‌లో వ్యోమగాములు ఫిట్నెస్ను ఎలా నిర్వహిస్తారంటే..!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో కాలుమోపి చరిత్ర సృష్టించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష వ్యాయామ పద్ధతుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మెక్రోగ్రావిటీలో శారీరక శ్రమ ఎంత ప్రధానమైనదో వివరించారు. వాళ్లు ఫిట్‌నెస్‌పై ఉంచే దృష్టి మొత్తం మిషన్ సక్సెస్‌కి అత్యంత కీలకమని చెప్పారు. అయితే ఇక్కడ భూమ్మీద ఉన్నట్లుగా జిమ్ సభ్యత్వం ఉండదు. అక్కడ చేసిన సౌలభ్యకరమైన పరికరాలతో చేసే ఛాన్సే ఉండదు. మరి ఎలా చేస్తారంటే..అలాంటప్పుడూ ప్రత్యేక శిక్షణతో కూడిన వ్యాయామాలను వ్యోమగాములు అనుసరిస్తారని చెబుతున్నారు శుభాంశు. జీరో గ్రావిటీలో చాలా రకాల శారీరక మార్పులు ఉంటాయి. శరీరం జీరో గురుత్వాకర్షణ వద్ద మొత్తం బాడీ బద్ధకంగా ఉంటుందట. కండరాలు కుచించుకుపోయి, ఎముకలు బలహీనంగా అయిపోతాయట. దాంతోపాటు శరీరంలోని శక్తి కూడా సహకరించేందుకు ఇష్టపడదట. మన కార్డియో, బలం రెండూ దెబ్బతింటాయట. అందువల్ల అంతరిక్షంలో వ్యాయామం అనేది ఒక ఆప్షన్ కాదు. వ్యోమగాములకు అది తప్పనిసరిగా చేయాల్సిన శారీరక శ్రమ. స్పేస్ బైక్..అందుకోసం స్పేస్ స్టేషన్‌లోని వ్యోమగాములు CEVIS (వైబ్రేషన్ ఐసోలేషన్ సిస్టమ్‌తో సైకిల్ ఎర్గోమీటర్) వంటి పరికరాలను ఉపయోగిస్తారని చెప్పారు శుభాంశు. ఇది ప్రాథమికంగా షాక్ అబ్జార్బర్కు బోల్ట్ చేయబడిన స్పేస్ బైక్ లాంటిదని అన్నారు. CEVIS వ్యవస్థ వ్యాయామం ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలను గ్రహిస్తుంది. ఫలితంగా అంతరిక్ష కేంద్రం అనాలోచిత కదలికలను నిరోధిస్తుంది. ఈ స్పేస్ బైక్‌లో సీటు ఉండదు ఎందుకంటే తేలుతున్నట్లు ఉంటుంది ాకాబట్టి ీసీటుతో పని ఉండదట. దానిపై కూర్చొన్న భంగిమలో పాదాలను లాక్ చేసి పెడలింగ్ చేస్తారట. అంతేగాదు పాదాలను పట్టీల సాయంతో నియంత్రణలో సురక్షితంగా ఉంచుకుంటారట. ఈ వ్యాయామం సమగ్ర హృదయనాళ వ్యవస్థను మెరుగ్గా ఉంచి, కండరాల క్షీణత, ఎముక సాంద్రత నష్టాన్ని నివారిస్తుందని చెప్పుకొచ్చారు వ్యోమగామి జీపీ కెప్టెన్. ఇక్కడ స్పేస్ వాతావరణానికి తగ్గట్టుగా ఫిట్నెస్ పరంగా "జీరో గ్రావిటీ, జీరో సాకులు." అని చమత్కరించారు శుభాంశు. చివరగా అంతరిక్షంలో జీవిత సవాళ్లకు అనుగుణంగా ఆరోగ్యంగా ఉండేలా పనితీరును నిర్వహించడానికి అంకితభావంతో కూడిన నిబద్ధత అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. (చదవండి: హ్యాట్సాఫ్ గుత్తా జ్వాలా..! అమ్మతనానికి ఆదర్శంగా..) -
పీసీఓఎస్ & ఫిట్నెస్
అందమే ఆనందం... ఆనందమే ఆత్మవిశ్వాసం!ఆత్మవిశ్వాసం శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రతిబింబం!అందుకే నార్మల్ గర్ల్ నుంచి సారా టెండూల్కర్ దాకా ఎవరికైనా ఫిట్నెసే జీవనసాఫల్య మంత్రం!దీనికి సెలబ్రిటీల అనుభవాలే ఉదాహరణలు!ముఖం మీద ఓ మొటిమ రాగానే అమ్మాయి ఇబ్బంది పడుతుంది. దాన్ని దాచడానికి ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తుంది. చివరకు బయటకు వెళ్లడానికి.. కనీసం ఫ్రెండ్స్‌ని కలవడానిక్కూడా ఇష్టపడదు. ఈ క్రీమ్ వాడండి.. తెల్లారికల్లా మొటిమ మాయమంటూ స్క్రీన్ మీద ఓ క్రీమ్‌ను చూపిస్తూ ఓ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఇలాంటి ప్రకటనలతో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు, రిజిస్టర్డ్ న్యూట్రిషనిస్ట్ సారా టెండూల్కర్ కూడా ప్రభావితమైంది.ఒక్క కాస్మెటిక్ క్రీమ్స్కే కాదు హెయిర్ ఆయిల్ యాడ్స్‌కూ ఇన్ఫ్లుయెన్స్ అయింది.. ఆమె స్కూల్ రోజుల్లో. ఆ టీనేజ్‌లో ఆమెకు ముఖం నిండా మొటిమలు, జుట్టు సమస్యలుండేవి. అవి ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. దాంతో ఫ్రెండ్స్‌ని కలవాలన్నా మేకప్ వేసుకునే వెళ్లేదట. టీవీ కమర్షియల్స్‌లో కనిపించిన క్రీములు, ఆయిల్స్ అన్నిటినీ వాడిందట. అసలామె సమస్యలకు కారణం .. పీసీఓఎస్. దేశంలో రీప్రొడక్టివ్ ఏజ్‌లోని ప్రతి అయిదుగురు అమ్మాయిల్లో ఒకరు దీనితో బాధపడుతున్నారు.సారా ఏం చేసింది?మొటిమలు, జుట్టు సమస్యల్లాంటి సైడ్ఎఫెక్ట్స్ మీద శ్రద్ధ పెట్టి సత్వర ఫలితాల కోసం ఆరాటపడిన సారా.. అసలు సమస్య అయిన పీసీఓఎస్‌ను పట్టించుకోలేదు. దాన్ని కంట్రోల్ చేసే శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించలేదు. కాస్మెటిక్స్‌తో రిజల్ట్స్ రాక΄ోయేసరికి ఒత్తిడికిలోనై డాక్టర్ కూడా అయిన అమ్మ అంజలి టెండూల్కర్ దగ్గర వా΄ోయింది. అప్పుడు అంజలి తన కూతురిని వైద్యనిపుణుల దగ్గరకు తీసుకెళ్లింది. ‘వాళ్లు నా దినచర్య, డైట్ హాబిట్స్ గురించి అడిగారు. పౌష్టికాహారం తీసుకొమ్మన్నారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ తప్పనిసరని చె΄్పారు.ఆ సలహాలు, సూచనలు పాటించసాగాను. మైండ్‌ఫుల్‌నెస్ మీదా కాన్సన్ట్రేట్ చేశాను. వెంటనే రిజల్ట్స్ రాలేదు. కొంచెం టైమ్ పట్టింది.. ఆలస్యమైనా ఆరోగ్యం చేకూరింది. పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి. ముఖం మీది మొటిమలు పోయాయి. జుట్టూ పెరగసాగింది. అప్పటి నుంచి అదే జీవనశైలిని అనుసరిస్తున్నాను. పీసీఓఎస్‌తో లైఫ్ సవాలే. అది శారీరకంగానే కాదు మానసికంగానూ కుంగదీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. దాని వల్ల నేను స్ట్రెస్ ఫీలయ్యి, ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు కోకొల్లలు. అయితే సరిచేసుకోలేనంత మొండి సమస్య కాదు. ఇన్స్టంట్ రిజల్ట్స్ పర్మినెంట్ సొల్యుషన్స్ కావు. కాబట్టి షార్ట్ టర్మ్ రిజల్ట్స్ మీద టైమ్ వేస్ట్ చేసే బదులు మన జీవనశైలిని మెరుగుపరచుకునే ప్రయత్నం చేయాలి.పర్ఫెక్షన్ మీద కన్నా స్థిరత్వం మీద శ్రద్ధ పెట్టాలి. బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్‌సైజ్‌లను జీవితంలో భాగం చేసుకుని కొనసాగించాలి! శారీరక, మానసిక ఆరోగ్యానికవే దివ్యౌషధాలు. అయితే నిపుణుల సలహా, హెల్ప్ కంపల్సరీ. ఈ విషయంలో అమ్మకు థాంక్స్ చెప్పుకోవాలి. సరైన సమయంలో నన్ను నిపుణుల దగ్గరకు తీసుకెళ్లింది. నిజానికి మా ఇంట్లో నాన్న గానీ, అమ్మ గానీ ఫిజికల్ యాక్టివిటీ, మిత ఆహారం, మైండ్ఫుల్నెస్కి చాలా విలువిస్తారు.ఫిట్నెస్ అండ్ వెల్నెస్ మా డిన్నర్ టేబుల్ కన్వర్జేషన్స్‌లో భాగం. అలాంటి వాతావరణంలో పెరిగిన నేను.. స్కూల్ డేస్‌లో కాస్త నిర్లక్ష్యం చేశాను. కానీ అమ్మ గైడెన్స్ వల్ల త్వరగానే మళ్లీ సరైన దారిలో పడ్డాను. ఇప్పుడు బ్లాక్ కాఫీతో నా డే స్టార్ట్ అవుతుంది. ఎక్సర్సైజ్, నట్స్, మాచా టీ, బ్యాలెన్స్డ్ డైట్.. ఎట్సెట్రాతో కంటిన్యూ అవుతుంది’ అని చెబుతుంది సారా టెండూల్కర్.పీసీఓఎస్ అండ్ పీసీఓడీ అంటే...పీసీఓఎస్ ( పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) అనేది హార్మోన్ల సమస్య. అండాశయాలు అధిక స్థాయిలో మేల్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల నెలసరి క్రమం తప్పడం, అధిక రక్తస్రావం లేదంటే రక్తస్రావం సరిగాకాక΄ోవడం, అండాశయాల్లో సిస్ట్లు, అవాంఛిత రోమాలు, జుట్టు పలచబడటం, మొటిమలు, అలసట, మూడ్ స్వింగ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, స్థూలకాయం, టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బుల రిస్క్ పెరగడం, కొలెస్ట్రాల్ అధికమవడం, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తుతాయి.పీసీఓడీ ( పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్)లో అండాశయాలు అపరిపక్వ లేదా పాక్షికంగా పరిపక్వత చెందిన అండాలను ఉత్పత్తి చేస్తాయి. తర్వాత ఇవి సిస్ట్స్గా మారే చాన్స్ ఉంటుంది. పీసీఓఎస్, పీసీఓడీ రెండిటికీ జీవనశైలి, హార్మోన్ల అసమతౌల్యం, జన్యపరమైన అంశాలు కారణాలు. పీసీఓఎస్, పీసీఓడీ రెండూ కూడా 15–30 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో కనపడతాయి. జీవనశైలి మార్పులతో పాటు డాక్టర్ సూచించిన చికిత్సతో ఈ రెండు సమస్యలను తగ్గించుకోవచ్చు. – డాక్టర్ పూజిత సూరనేని, సీనియర్ ఆబ్స్టట్రీషన్, గైనకాలజీ అండ్ లాపరోస్కోపిక్ సర్జన్ఇంకెంతో మంది సెలబ్రిటీలు.. ఒక్క సారా టెండూల్కరే కాదు పీసీఓఎస్, పీసీఓడీలతో సోనమ్ కపూర్, శ్రుతి హాసన్, మసాబా గుప్త, సారా అలీఖాన్ లాంటి సెలబ్రిటీలూ బాధపడ్డారు. పీసీఓఎస్ వల్ల సోనమ్ కపూర్ స్థూలకాయంతో ఇబ్బంది పడింది. ‘పీసీఓఎస్‌ని డీల్ చేసే ఏకైక విధానం.. జీవనశైలిని మార్చుకోవడమే. లైఫ్‌స్టయిల్ అండ్ యోగాతోనే నేను పీసీఓఎస్‌ను మేనేజ్ చేశాను’ అని చెబుతుంది సోనమ్ కపూర్. శ్రుతి హాసన్, మసాబా గు΄్తాలూ అంతే! లైఫ్స్టయిల్లో మార్పులు, వ్యాయామం, పౌష్టికాహారంతోనే పీసీఓఎస్‌కి చెక్ పెట్టారు. సారా అలీఖాన్ పీసీఓడీ బాధితురాలు. దానివల్ల ఆమె 96 కిలోల బరువుండేది. దానికి ఆమె కూడా జీవనశైలిని మార్చుకోవడమే పరిష్కారమని గ్రహించి కసరత్తు మొదలుపెట్టింది. బరువు తగ్గడం మొదలయ్యాక పీసీఓడీ తగ్గింది. ఆమె ఆ ఎక్సర్సైజ్ ఆపలేదు. క్రమశిక్షణ గల జీవనశైలిని తప్పలేదు. ఈ ఆరోగ్య సూత్రం సమస్యలున్న వారికే కాదు.. భవిష్యత్‌లో ఎలాంటి శారీరక, మానసిక సమస్యలు రావద్దని కోరుకుంటున్న అందరికీ అనుసరణీయమే! -
మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!
ఒకప్పుడు డ్యాన్స్ క్లాస్‌లో చేరుతున్నారంటే.. నృత్యంలో నైపుణ్యం సాధించడానికి అని అనుకునేవాళ్లు. ఇప్పుడు అది క్యాలరీల ఖర్చుకో, వెయిట్‌లాస్ కోసమో అన్నట్టు మారింది. నగరంలో డ్యాన్స్‌ను ఆసక్తితోనో, ఆదాయ మార్గంగా మలుచుకుందామనో అనుకునేవారికన్నా.. సమూహంలో కలిసిపోవడానికి, సందడిగా గడపడానికి, వీటన్నింటినీ మించి ఆరోగ్య మార్గంగా చూస్తున్నవారే ఎక్కువయ్యారు. బరువులు మోస్తూ వ్యాయామం చేయడానికి ఇష్టపడని, జిమ్ వర్కవుట్స్‌కి దూరంగా ఉండే వారు ఫిట్నెస్ సాధించడానికి డ్యాన్స్ ప్రత్యామ్నాయంగా అవతరించింది. నగరంలోని ప్రతి డ్యాన్స్ స్టూడియో నేమ్‌బోర్డుల్లో డ్యాన్స్‌కు అదనంగా‘ఫిట్నెస్’ జోడిస్తున్నారు. ఏరోబిక్స్‌ను ఒక వ్యాయామంగా కన్నా డ్యాన్స్ వర్కవుట్గానే చాలా మంది ఇప్పటికీ పరిగణిస్తున్నారు.అధ్యయనాలు చెబుతున్న లాభాలు..అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్సైజ్ ప్రకారం, జుంబా గంటకు 300–600 కేలరీల మధ్య బర్న్ చేయగలదు, ఇది ఉత్సాహంగా ఉంటూనే బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన మార్గం అని.. జర్నల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్త్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, డ్యాన్స్ కార్డియో హృదయనాళాల ఆరోగ్యంతోపాటు మొత్తం ఫిట్నెస్ను గణనీయంగా మెరుగుపరుస్తుంది. క్యాలరీలను బర్న్ చేయడానికి ఇది ఒక ఆహ్లాదకరమైన మార్గం. జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్‌లోని అధ్యయనం ప్రకారం, హిప్–హాప్ డ్యాన్స్ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది.క్యాలరీలు కరుగుతున్నాయ్..సుమారు 100కిలోల బరువున్న వ్యక్తి నిమిషం పాటు నృత్యం చేస్తే దాదాపు 1.4 క్యాలరీలు ఖర్చు అవుతాయి. 70కిలోల బరువున్న వ్యక్తి 20 నిమిషాలు నృత్యం చేస్తే దాదాపు 196 క్యాలరీలు ఖర్చు అవుతాయని, సావధానంగా చేయడం వల్ల 20 నిమిషాలకు 140 నుంచి 150 క్యాలరీలు, మధ్యస్థంగా చేయడం వల్ల 160 నుంచి 180 క్యాలరీలు, వేగంగా చేసే విధానం వల్ల 180 నుంచి 200 క్యాలరీలు ఖర్చవుతాయని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ డ్యాన్స్ వర్కవుట్స్‌ని వారంలో 2 నుంచి నాలుగు సార్లు తమ వ్యాయామ రొటీన్లో భాగంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. లాటిన్ అంతర్జాతీయ సంగీతాన్ని సరదా, ఉత్సాహభరిత నృత్య కదలికలతో మిళితం చేసే నృత్య వ్యాయామం జుంబా. ఇది వ్యాయామాన్ని డ్యాన్స్ పారీ్టగా మారుస్తుంది. దీని ద్వారా మనం వ్యాయామం చేస్తున్నామనే విషయం మర్చిపోయేలా ఇది రూపొందింది.లాభాల నృత్యం.. ఫుట్ వర్క్ బ్యాలెన్స్ చేసుకోవడం నేర్పుతుంది. రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. కొన్ని సైకలాజికల్, బిహేవియర్ సమస్యలకు నాన్ వెర్బల్ సైకోథెరపీగా పనిచేస్తుందని డాన్స్ థెరపిస్టులు అంటున్నారు. డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్స్ వంటి సమస్యలను దూరంచేస్తుంది. ఎముకల్లో క్యాల్షియం సమన్వయానికి, ఆస్టియోపొరోసిస్ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. లో బీపీ, అధిక కొలె్రస్టాల్ సమస్యలకూ సమాధానం ఈ డాన్స్. కోర్ మజిల్స్ పటిష్టతకు సహకరిస్తుంది. ఫీల్‌గుడ్ హార్మోన్ లైన అడ్రినలిన్, సెరొటోనిన్, ఎండారి్ఫన్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. బాడీ లాంగ్వేజ్ మెరుగుపరుస్తుంది. కాళ్లు, హిప్ జాయింట్స్‌తో పాటు లోయర్ పార్ట్ మరింత దృఢత్వాన్ని సంతరించుకునేందుకు దోహదం చేస్తుంది. డ్యాన్స్‌ఫ్లోర్.. పారా హుషార్.. చల్లని వాతావరణంలో నర్తించేటప్పుడు ముందుగా బాడీ వార్మప్ కావాల్సిందే. లేకపోతే గాయాలకు కారణమవుతుంది. బాల్రూమ్ ప్రాక్టీస్‌కు తగిన షూస్ ఎంపిక చేసుకోవాలి. టర్న్ తిరిగేటప్పుడు అత్యుత్సాహం కూడదు. షోల్డర్ జాయింట్స్ మీద ఒత్తిడిని గమనించాలి. సామర్థ్యానికి అనుగుణంగా నిర్ణీత సమయంలో చేయడం మేలు. ఒత్తిడిని జయిస్తుంది..ఆరోగ్యసాధనకు ఉపకరించి పని ఒత్తిడిని దూరం చేస్తుంది నృత్యం. కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.. ‘కార్పొరేట్ ఉద్యోగుల్లో అత్యధికులు జంటగా చేసే సల్సా నృత్యం పట్ల మక్కువచూపుతున్నారు. చక్కని ఫిట్‌నెస్‌కు ఇదో మార్గమని వారు చెబుతున్నారు. కనీసం గంట పాటు చేసే నృత్యం 450 నుంచి 550 క్యాలరీలు ఖర్చవుతాయని స్పెషల్ డ్యాన్స్ ట్రైనింగ్ ప్యాకేజ్‌లు అందిస్తోన్న స్టెప్స్ అకాడమీ నిర్వహకులు పృధ్వీరాజ్ చెప్పారు.డ్యాన్స్ మస్ట్.. లుక్ బెస్ట్.. ‘బాగా డాన్స్ చేయడమంటే బాగా కని్పంచడమే’ అని ప్రసిద్ధ ఫిట్నెస్ శిక్షకురాలు దినాజ్ వర్వత్ వాలా సూత్రీకరించారు. సిటీలో ఇంటర్నేషనల్ డ్యాన్సింగ్ స్టైల్స్‌కు భారీగా ఆదరణ ఉంది. వీటిలో చిన్నారుల్ని బాలీవుడ్ డ్యాన్స్ స్టైల్స్ ఆకర్షిస్తుంటే.. టీనేజర్స్ హిప్–హాప్, వర్కింగ్ పీపుల్ సల్సాని లైక్ చేస్తున్నారని డ్యాన్స్ మాస్టర్ బాబీ చెబుతున్నారు. హిప్–హాప్ డ్యాన్స్.. హిప్–హాప్ వర్కౌట్లు ఫిట్నెస్ను తాజా నత్య కదలికలతో కలపడానికి ఒక గొప్ప మార్గం. ఈ దినచర్య తరచూ బలం, చురుకుదనం, సమన్వయాన్ని కలిగి ఉంటాయి. ఉల్లాసమైన సంగీతాన్ని ఇష్టపడేవారి ఫిట్నెస్ దినచర్యకు కొంచెం చురుకుదనాన్ని జోడిస్తుంది హిప్–హాప్. (చదవండి: శ్రీనగర్ టూర్..! మంచుతోటలో చందమామ కథ) -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టులో పాసైన కెప్టెన్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్నెస్ టెస్టులను క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 31న రోహిత్‌కు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో హిట్‌మ్యాన్‌కు యో-యో టెస్టు,బ్రాంకో టెస్టు నిర్వహించారు.ఈ రెండు టెస్టుల్లోనూ రోహిత్ శర్మ ఉత్తీర్ణత సాధించినట్లు రేవ్ స్పోర్ట్స్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే రోహిత్ స్కోర్‌ను మాత్రం బయటకు వెల్లడించలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ చివరసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇప్పటికే టీ20, వన్డేలకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో రోహిత్ ఆడనున్నాడు. అయితే ఈ సిరీస్ తర్వాత రోహిత్ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వినిపించాయి. వన్డే ప్రపంచకప్-2027కు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో రోహిత్, కోహ్లిలు వన్డేల నుంచి తప్పుకొంటారని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను బీసీసీఐ తోసిపుచ్చింది. కాగా రోహిత్ ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి సారించాడు. గతంతో పోలిస్తే రోహిత్ ప్రస్తుతం రోహిత్ చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా కన్పిస్తున్నాడు. ఇదే ఫిట్నెస్ను కొనసాగిస్తే రాబోయో వన్డే ప్రపంచకప్‌లో ఆడినా ఆశ్చర్యపోన్కర్లేదు. ఆసీస్ పర్యటనకు ముందు హిట్‌మ్యాన్ స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగే అనాధికారిక వన్డే సిరీస్‌లో ఆడే అవకాశముంది.వాళ్లు కూడా పాస్..రోహిత్ పాటు ఇతర టీమిండియా ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణలు కూడా తమ ఫిట్నెస్ పరీక్షలలో పాసైనట్లు తెలుస్తోంది. వీరిందరిలో పేసర్ ప్రసిద్ద్ కృష్ణ ఎక్కువ స్కోర్ సాధించినట్లు సమాచారం.కాగా ఆటగాళ్ల శారీరక సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు యో-యో టెస్టుతో పాటు ఎముకల సాంద్రతను తెలుసుకునేందుకు డీఎక్స్ఏ స్కాన్‌ను కూడా నిర్వహించారు. అయితే మరో భారత స్టార్ విరాట్ కోహ్లి తన ఫిట్నెస్ టెస్టుకు ఎప్పుడు హాజరవుతాడో ఇంకా స్పష్టత లేదు.చదవండి: ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు ఆసీస్‌తో టెస్టు మ్యాచ్! సిరాజ్ ఎమన్నాడంటే? -
ఆరుపదులు దాటినా ఫిట్‌గా కనిపించాలంటే..! నాగార్జున ఫిట్నెస్ మంత్ర.
టాలీవుడ్ కింగ్, హీరోయిన్ల మన్మథుడు హీరో నాగార్జున ఇవాళ 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఆయన ఇప్పటికీ అంతే గ్లామర్‌గా టోన్డ్ బాడీతో ఆకర్షణగా కనిపిస్తారు. ఆగస్టు 29 ఆయన పుట్టిన రోజు సందర్భంగా అంతలా ఫిట్‌గా ఉండేందుకు నాగార్జున ఎలాంటి వ్యాయామాలు చేస్తుంటారు, ఆరుపదులు వయసులో కూడా అంతలా యంగ్‌గా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలు అనుసరిస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నాగార్జున ఇంచుమించుగా గత 30 లేదా 35 సంవత్సరాలుగా వర్కౌట్లు చేస్తూనే ఉన్నారు. ఎన్నడు స్కిప్ చేయలేదని ఆయన ఫిట్నెస్ ట్రైనర్ చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తానని ఆయనే స్వయంగా చెప్పారు. వాటిలో కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు తప్పనిసరి. అయితే అవన్ని ప్రతి ఉదయం జస్ట్ 45 నిమిషాల నుంచి ఒక గంట వరకే చేస్తారట. అంతలా ఫిట్‌గా ఉండటానికి రీజన్..క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి అని చెబుతున్నారు నాగార్జున. అంతేగాదు పనిచేయకుండానైనా ఉంటాను గానీ వ్యాయామం చేయకుండా అస్సలు ఉండనని చెబుతున్నారు. మేల్కొన్న వెంటనే వ్యాయామం తన తొలి ప్రాధాన్యతని చెబుతున్నారు. కచ్చితంగా వారానికి ఐదు నుంచి ఆరు రోజులు వర్కౌట్లనేవి తన దినచర్యలో భాగమని చెబుతున్నారు. అయితే అవి చాలా తీవ్రంగా ఉంటాయట.ఆ ఏజ్‌లో కూడా యంగ్‌గా కనిపించాలంటే..వర్కౌట్ల సమయంలో తన హృదయ స్పందన రేటును గరిష్ట రేటు 70 శాతం కంటే ఎక్కువగా ఉంచుకోవడం ఎలాగై తన ట్రైనర్ నేర్పించాడని తెలిపారు నాగార్జున. అధిక జీవక్రియను నిర్వహించడానికి వర్కౌట్ల సమయంలో విశ్రాంతి , పరధ్యానం అనేవి అస్సలు పనికిరావని, పైగా మెరుగైన ఫలితాలు అందుకోలేమని చెప్పారు. చేసేపని చిన్నదైన, పెద్దదైనా ఫోకస్, స్కిప్ చేయని అంకిత భావం అంత్యంత ముఖ్యమని, అప్పుడే ఎప్పటికీ యవ్వనంగా ఉండగలమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు హీరో నాగార్జున. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) (చదవండి: ఫుడ్ డెలివరికి వెళ్లి కస్టమర్‌కి ప్రపోజ్ చేశాడు ..కట్‌చేస్తే..!) -
హీరోయిన్ ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్.. అందరూ ఒకేసారి
ప్రస్తుతం మనలో చాలామందిని వేధిస్తున్న సమస్య బరువు. అరె ఇలా అయిపోయామేంటి? వెంటనే ఎక్సర్సైజ్ చేయాలి, సన్నగా అవ్వాలని అనుకుంటాం. కానీ దాన్ని అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు చాలా కష్టాలు పడుతుంటాం. కానీ ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు ఉంది. తను మాత్రమే కాదు తన కుటుంబాన్ని కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేలా చేసింది. దీంతో ఇప్పుడు ఈమె కుటుంబాన్ని చూసి అందరూ షాకవుతున్నారు.దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసిన ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళ దర్శకుడు సుందర్‌ని పెళ్లి చేసుకున్న ఈమెకు ఇద్దరు కుమార్తెలు అవంతిక, ఆనందిత కూడా ఉన్నారు. గతంలో ఖుష్బూతో పాటు కూతుళ్లు కూడా కాస్త లావుగా కనిపించేవారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ట్రోల్స్ వచ్చేవి. బరువుపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేసేవాళ్లు. మరి ఈ విషయాన్ని ఖుష్బూ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లుంది.(ఇదీ చదవండి: ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ)ఏడాది తిరిగేలోపు ఖుష్బూ కుటుంబంలోని అందరూ లుక్ మార్చేశారు. పైన కనిపిస్తున్న ఫొటోల్లో ఒకటి గతేడాది సెప్టెంబరులో తీసుకున్నది. ఇందులో అందరూ కాస్త బొద్దుగా కనిపించారు. ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత అందరూ సన్నగా మారిపోయి కనిపించారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఖుష్బూ తన ఫ్యామిలీ ఫొటోని పోస్ట్ చేసింది. ఇది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతలోనే ఇంత మార్పు అని మాట్లాడుకుంటున్నారు.చాన్నాళ్ల క్రితమే యాక్టింగ్ పక్కనబెట్టిన ఖుష్బూ.. ఓవైపు రాజకీయాల్లోనూ ఉంటూనే మరోవైపు 'జబర్దస్త్' లాంటి రియాలిటీ షోల్లో జడ్జిగా కనిపిస్తోంది. ఈమె కూతుళ్లు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బహుశా అందుకే అందరూ ఒకేసారి ఇలా లుక్ మార్చి కనిపించారా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: స్టేజీపై హీరో షాకింగ్ ప్రవర్తన.. హీరోయిన్ నడుము తాకుతా) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో ఆ అమ్మ లైఫే మారిపోయింది..! బీపీ, షుగర్ మాయం..
ఓ వయసు వచ్చాక రోగాల బారినపడటం అనేది సహజం. అయితే అప్పటికైనా తేరుకుని జీవనశైలిలో మార్పులు, ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి కేర్ తీసుకుంటే చాలు. చాలామటుకు వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇక్కడ ఆలస్యం అనే పదం గాక..ఆశావాహ దృక్పథానికి చోటిస్తే..కచ్చితంగా అద్భుతాలు తప్పక జరుగుతాయి. అందుకు నిదర్శంన ఈ అమ్మే..!. పాపం నడవలేక ఇబ్బంది పడింది. ఓ పక్క మధుమేహం, బీపీతో నరకం చూసింది. అలాంటామె కొడుకు సపోర్టుతో ఎంతలా ఆమె జీవితం మలుపు తిరిగిందంటే..ఈమె ఆమేనా అనే సందేహం కలిగేంతలా చురుగ్గా మారిపోయింది. ఓ అథ్లెటిక్ మాదిరిగా తయారైంది. అంతేగాదు చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలన్ని ఒక్కొక్కటిగా మాయమైపోయాయి. ఎలా అంటే..ఫిట్నెస్ నిపుణుడు కుల్విందర్ సింగ్ ఆరోగ్యవంతంగా మారిన తన 59 ఏళ్ల తల్లి కథను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తన తల్లి ఒకప్పుడు డయాబెటిస్ , రక్తపోటు సమస్యలతో బాధపడుతుండేదని తెలిపారు. వాటికి తోడు ఆర్థరైటిస్ సమస్య కూడా జత అవ్వడంతో కనీసం బాత్రూమ్కి కూడా వెళ్లలేని పరిస్థితికి చేరుకుందని చెప్పుకొచ్చారు. తన పరిస్థితి చూసి తనకే బాధగా అనిపించేదని అన్నారు. కనీసం కాలు కదిపేందుకు చాలా బాధపడిపోయేదన్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్స్ పెరిగిపోయి ఆమెకు కనీసం మోకాలిని వంచలేని పరిస్థితికి వచ్చేసింది. ఫలితంగా ఆమె 90 కిలోల అధిక బరువు కూడా చేరుకున్నట్లు తెలిపారు. ఇక ఇలానే ఉంటే ఆమె పరిస్థితి క్రిటికల్‌గా మారిపోతుందని తానే ఆమెను జిమ్‌కు తీసుకువెళ్లి బల శిక్షణ తీసుకోవాల్సిందిగా బలవంతం చేశారట.అద్భుతమైన పరివర్తన..దాంతో ఆమె పరిస్థితి రెండు నెలల్లోనూ పూర్తిగా మారిపోయిందిచి. పైగా మెరుగైన ఫలితాలు కనిపించాయని అన్నారు. చెప్పాలంటే శరీరంలో కొవ్వు చాలామటుకు తగ్గిపోయిందని చెప్పారు. రక్తపోటు, మధుమేహం సాధారణ స్థితికి వచ్చేశాయి. అలాగే ఆమె మోకాలి నొప్పి 50% మెరుగ్గా ఉండటమేగాక, చాలా అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు.స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే..బరువులు ఎత్తడం వంటి శిక్షణతో కండరాలను బలోపేతం చేయడం. ఇక్కడ కుల్విందర్ సింగ్ తల్లి ఒక గంటపాటు నిరంతరాయంగా నడవడం, రెండు గంటల వ్యాయామం, 40 కిలోలు వరకు బరువులు ఎత్తడం వంటివి చేసేది. ఒక నిమిషం పైనే ప్లాంక్ పొజిషన్లో ఉండటం వంటివి చేసి అద్భుతమైన మార్పులు చవిచూశారామె. అంతేగాదు జస్ట్ ఆరు నెలలకే చలాకీగా పరిగెత్తగలిగింది. వృద్ధాప్యంలో ఇలాంటివి చేయడం గురించి ఆలస్యంగా పరిగణించొద్దు..ఆరోగ్యవంతమైన మార్పుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడమని భావించండి అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులుడు కుల్విందర్ సింగ్స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రాముఖ్యత..కార్డియో, యోగా, పైలేట్స్ వంటి ఇతర రకాల వ్యాయామాలు మానసిక ఆరోగ్యానికి మంచివైతే ఈ బల శిక్షణ అనేది జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందట. అంతేగాదు రోజువారీ కార్యకలాపాలను చేసేలా సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా చేస్తుందని పరిశోధనలో తేలింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా జరిగిన 16 అధ్యయనాల్లో కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఆయుర్ధాయాన్ని పెంచుతాయని నిరూపితమైంది కూడా. ఇది కండర ద్రవ్యరాశిని సంరక్షించడమే కాదు పెంచేందుకు సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఇది కండరాలు, ఎముకల పెరుగుదలను ప్రేరేపించి బోలు ఎముకల వ్యాధి, బలహీనతలను నివారించి, తద్వారా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుందట. View this post on Instagram A post shared by Kulwinder Singh (@freebird.sodhi)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వ్యైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: కూలీ కుమార్తె సక్సెస్ స్టోరీ..! టీసీఎస్ నుంచి ఐఏఎస్ రేంజ్‌కి..) -
బొజ్జలు కాదు.. కండలు పెంచగలం..!
‘మనం బొజ్జలనే కాదు.. అందమైన ఆకృతితో కూడిన కండలను పెంచగలం.. అయితే దీనికి సరైన సమయంలో సరైన మార్గనిర్దేశం అవసరం. అప్పుడే సాధన ఫలితాలనిస్తుంది.. కండలు పెంచేందుకు జెనిటిక్స్‌తో ఎలాంటి సంబంధం లేదు. బాడీ బిల్డింగ్‌పై ఉన్న అపోహలు, తెరలు తొలగిపోవాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో మనం సత్తా చూపించగలం’ అని సినీనటుడు అల్లు శిరీష్ అన అభిప్రాయాన్ని వెల్లడించారు. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్‌లో ‘డెక్కన్ అప్రైజింగ్–2025 పేరిట ఐసీఎన్ (ఐ కాంపీట్ నేచురల్) సంస్థ నిర్వహించిన సహజసిద్ధ శరీర దృఢత్వ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను, నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం ఫిట్‌నెస్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుర్తింపు అవసరం.. ప్రపంచస్థాయిలో బాడీ బిల్డింగ్‌కి మంచి గుర్తింపు ఉంది. ఇందులో రాణించిన అథ్లెట్లు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. మన దేశంలో మాత్రం బాడీ బిల్డర్లు కోచ్‌లుగా మాత్రమే మిగిలిపోతున్నారు. క్రికెట్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలకు మన దేశంలో ఇచ్చిన ప్రాధాన్యత బాడీబిల్డింగ్కు కూడా దక్కేలా చర్యలు తీసుకోవాలి. అనేక అపోహలు.. శరీర దారుఢ్యానికి మందులు, స్టిరాయిడ్లు వాడతారనే అపోహల కారణంగా చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు. అవేవీ అవసరం లేకుండా కూడా సరైన సమయంలో సరైన కోచ్ ద్వారా శిక్షణ తీసుకుని సాధన చేస్తే అంతర్జాతీయ అథ్లెట్లను తయారు చేసుకోవచ్చు.. ఐసీఎన్ లాంటి సంస్థలు ఆ దిశగానే కృషి చేస్తున్నాయి.. అందుకే ఎంతో ఇష్టంతో గత రెండేళ్లుగా ఇక్కడికి వచ్చి అథ్లెట్లను ప్రొత్సహిస్తున్నాను. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు వందల మంది యువత ఈ పోటీల్లో పాల్గొన్న తీరు చూస్తుంటే మన వద్ద కూడా ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నాకు తగ్గ కథ వస్తే..కండలు పెంచేందుకు జన్యుపరమైన సంబంధాలేవీ లేవు. ఫిట్‌నెస్‌కు రాంగ్‌రూట్, షార్ట్‌కట్స్ ఎంత మాత్రం సరైంది కాదు. శరీర తత్వం బట్టి బొజ్జలు వస్తాయనే ప్రచారం సరికాదు. సహజంగానే ఫిట్నెస్ అంటే నాకు ఎంతో ఇష్టం. నా ఎత్తు, బరువు, ఆకృతికి అనువైన మంచి స్పోర్ట్స్ కథ వస్తే అలాంటి సినీమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఇప్పటి వరకూ వచ్చిన క్రికెట్, రన్నింగ్, ఫుట్‌బాల్ వంటి కథలు కాకుండా కొత్తగా ఉంటే బాగుంటుంది. (చదవండి: ఉత్తర భారత్ హెరిటేజ్ టూర్..!) -
మెగాస్టార్ చిరంజీవి 7 పదుల వయస్సులోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్
మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు. ఈ మాట వినిగానే చిరంజీవికి డెబ్భై ఏళ్లా? అని ఆశ్చర్యపోతారు. నటనలోనే కాదు, అందం, ఆరోగ్యం విషయంలోనూ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసే ఫిట్ నెస్ చిరంజీవి సొంతం. 70 ఏళ్ల వయస్సులో చాలా చురుగ్గా ఉంటూ డ్యాన్సులైనా, ఫైట్లైనా నేను ఎవర్ రెడీ అన్నట్టు ఉంటారాయన. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టుంటే ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.తాము అనుకున్న రంగంలో విజయం సాధించి స్టార్‌గా నిలవడం ఎంత అవసరమో, ముఖ్యంగా ఎంటర్టైన్ మెంట్ రంగంలో నిలదొక్కుకోవాలంటే.. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకొని, ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకొని, ఇప్పటికీ చిరు అన్నయ్యగా పిలిపించుకునే ఘనత ఆయనది. ఎన్నో విభిన్నమైన చిత్రాలు, మరెన్నో విభిన్న పాత్రలతో ఎందరో యువ హీరోలకు సైతం స్ఫూర్తినిచ్చే చిరంజీవి ఆరోగ్యం రహస్యం వెనుకాల గొప్ప శ్రమే ఉంది. జీవితంలో ఒడిదుకులు, ఒత్తిడిని తట్టుకుంటూ, చక్కని జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహార నియమావళి క్రమ తప్పనివ్యాయామం ఇవే ఆయన సీక్రెట్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చిరంజీవి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. ఇంటి ఫుడ్‌కే ప్రాధాన్యత, తక్కువ నూనె, తక్కువ చక్కర, ప్రాసెస్డ్ ఫుడ్ పూర్తిగా దూరం. ఆరోగ్య నిపుణుడిపర్యవేక్షణలో ఆహార ప్రణాళికలో ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు సమపాళ్లలో ఉండేలా జాగ్రత్త పడతారు.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లుఒకసారి స్వయంగా ఆయనే చెప్పినట్టు రోజువారీ ఆహారంలో తేలికపాటి, పోషకాలతో కూడిన అల్పాహారంతో ప్రారంభిస్తారు. ఎక్కువగా ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ, దోశ లేదా గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లెట్‌ను తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో ఒక బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ తో పాటు, కూరలు ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడతారు. ప్రోటీన్ కోసం పప్పు లేదా గ్రిల్ చేసిన చికెన్, చేపలు, బాయిల్డ్ ఎగ్స్ తింటారు. డిన్నర్ చాలా లైట్‌గా ఉండేలా చూసుకుంటారు.ఇదీ చదవండి: పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్ వీడియోకసరత్తులుసాధారణంగా వయసు పెరిగే కొద్ది శక్తి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. చర్మ ఆరోగ్యంలో కూడా తేడాలొస్తాయి. వీటినుంచి బయటపడాలంటే ఖచ్చితంగా డైలీ రొటీన వ్యాయామంతోపాటు, బాడీ స్ట్రెంత్, మజిల్ బిల్డింగ్,కార్డియో, కసరత్తు అవసరం. ఇవి శరీరం బరువు పెరగకుండా మెటబాలీజం పెంచి, కలకలం ఆరోగ్యంగా చురుగ్గా ఉండేందుకు తోడ్పడతాయి. సరిగ్గి చిరంజీవికూడా ఇదే ఫాలో అవుతున్నారు. దీనికి విశ్వంభర సినిమా కోసం జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో బెంచ్ ప్రెస్, డంబెల్ కర్ల్స్, స్క్వాడ్స్, కార్డియో ఎక్స్ర్ సైజ్లు చేయడం మనం చూశాం. సో ఏజ్ ఈజ్ నంబర్ మాత్రమే. ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే ఒత్తిడిలేని జీవితం, మంచినిద్ర, చక్కటి జీవనశైలి, ఆరోగ్య కరమైన ఆహారం, కనీస వ్యాయామం, అప్పుడప్పుడు కొన్ని ఆరోగ్య పరీక్షలు చేసుకుంటే ఫిట్ నెస్ సొంతం చేసుకోవచ్చు అని నిరూపించిన చిరంజీవికి హ్యాపీ బర్తడే చెప్పేద్దామా! -
పర్యాటక ప్రాంతాలకు 'పరుగో పరుగు'
ఉరుకు పరుగుల జీవితాల నుంచి ఉరుకుల పోటీల వైపు దృష్టి సారిస్తున్నారు పలువురు నగరవాసులు. నగరంలో రెగ్యులర్‌గా నిర్వహించే ఏదో ఒక మారథాన్‌లో భాగస్వాములు అవుతుంటారు కొందరు.. ఇది క్రమంగా నగరం నుంచి విదేశాలకూ వ్యాపించింది.. పలువురు ఔత్సాహికులు వెకేషన్‌తో పాటు మారథాన్ కూడా చేస్తున్నారు.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే మారథాన్లలోనూ పాలుపంచుకుంటున్నారు. మరికొందరు ఏకంగా రికార్డులవైపు పరుగు పెడుతున్నారు.. ఈ క్రమంలోనే రన్‌కేషన్ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది.. మారథాన్ పరుగునే క్రమంగా వెకేషన్‌తో కలగలిపి రన్‌కేషన్ అని పిలుస్తున్నారు.. ఈ ట్రెండ్ టూరిజానికి కూడా భారీగా ఊపునిస్తోందని పలువురు నిపుణులు చెబుతున్నమాట. అనుభవజ్ఞులైన రన్నర్లకు, అంతర్జాతీయ రేసులు అంటే కేవలం ఒక ప్రధాన మారథాన్‌కు అర్హత సాధించడం లేదా మరో వ్యక్తిగత పరుగు పందెం వేయడం మాత్రమే కాదు.. అవి కొత్త పర్యాటక గమ్యస్థానాలను అన్వేషించడానికి ఒక అవకాశం కూడా. ‘సెలవులు ఇప్పుడు రన్ కేషన్లుగా మారాయి’ అని ప్రముఖ మారథాన్ రన్నర్లు ఈ ట్రెండ్‌ను నిర్వచిస్తున్నారుఈవెంట్ల కోసమే..‘మారథాన్ టూర్లో పాల్గొనేవారిలో ఎక్కువ మంది పేరున్న అథ్లెట్లు కాదు, ఈవెంట్ల కోసం మాత్రమే శిక్షణ పొందే అమెచ్యూర్ రన్నర్లు. అందుకే మారథాన్ టూరిజం ఊపందుకుంటోంది’ అని మారథాన్ టూర్లను నిర్వహించే గౌరీ జయరామ్ అంటున్నారు. నగరం నుంచి పర్యాటక పరుగుల కోసం ఎంచుకుంటున్న వాటిలో దేశీయంగా ముంబైలో జరిగే టాటా ముంబై మారథాన్, అలాగే న్యూఢిల్లీ, చెన్నైలలో జరిగే రన్స్, అదే విధంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సిడ్నీ మారథాన్, రియో మారథాన్, అంటార్కిటికా మారథాన్, లండన్, టొరంటో, న్యూయార్క్.. వంటివెన్నో ఉన్నాయి. మారథాన్ టూరిజం అంటే..మారథాన్ అంటే అత్యంత సుదీర్ఘ దూరంలో పాల్గొనే పరుగు పందెం పోటీలు. రోజు రోజుకూ ఆదరణ పెంచుకుంటున్న ఈ మారథాన్ ఈవెంట్స్ దేశంలోని ప్రతి ప్రధాన నగరానికీ ఒక అలంకారంగా మారాయి. అంతర్జాతీయంగానూ అనేక నగరాల్లో విందు, వినోదాల సమ్మేళనంగా సాగే ఈ మోడ‘రన్’ ఫెస్టివల్స్.. రాను రానూ పర్యాటక ఆకర్షణగా కూడా స్థిరపడుతున్నాయి. ఒకసారి స్థానికంగా జరిగే పరుగు పోటీలో పాల్గొని మారథాన్ రన్నర్‌గా మారిన తర్వాత కాలక్రమంలో.. ఇతర నగరాల్లోని మారథాన్స్‌లో పాల్గొనడంపై నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతోంది. అదే మారథాన్ టూరిజంకు ఊపునిస్తోంది. ఏటా మారథాన్ టూరిజంలో పాల్గొనే భారతీయ రన్నర్లలో ఐదు రెట్లు పెరుగుదల ఉందని నిపుణులు చెబుతున్న మాట. నిపుణుల సూచనలు.. మారథాన్ పర్యాటకులకు నగరానికి చెందిన నిపుణులు పలు సూచలను చేస్తున్నారు.. అవగాన లేకుండా, శిక్షణ లేకుండా మారథాన్లలో పాల్గొంటే ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. ప్రయాణించే ముందు తగినంత శిక్షణ పొందాలి. మారథాన్ పర్యటనలలో పేరొందిన మారథాన్ ప్రయాణ సంస్థలను ఎంచుకోవాలి. స్థానిక వాతావరణ పరిస్థితులకుసంపూర్ణంగా సిద్ధం అవ్వాలి. హ్యాండ్ లగేజీలో రేస్ డే పరికరాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆతిథ్య దేశంలో అత్యవసర కాంటాక్ట్స్ అందుబాటులో ఉంచుకోవాలి. మారథాన్ టూరిజం కోసం ప్రణాళిక సాధారణంగా ఆరు నెలల ముందుగానే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. సకుటుంబ సమేతంగా ‘రన్’డి.. రన్నర్లు క్రీడ పట్ల తమ మక్కువను పెంచుకుంటూనే కొత్త నగరాలు సంస్కృతీ, సంప్రదాయాలను అన్వేషించేందుకు ఈ ట్రెండ్ వీలు కలి్పస్తోంది. స్థానిక సంప్రదాయాలు హృదయపూర్వక ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ సుందరమైన ప్రకృతి దృశ్యాల మీదుగా పరుగు తీసే అవకాశాన్ని మారథాన్ టూరిజం అందిస్తోంది. ‘పని ఒత్తిడి కారణంగా, నేను నా కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. మారథాన్ల కోసం ప్రయాణించే సమయాన్ని పాఠశాల సెలవులతో మేళవింపు చేయడం ద్వారా రన్కేషన్లో ఆ లోటు పూడ్చగలుగుతున్నా’ అని కొన్ని సంవత్సరాలుగా మారథాన్ రన్నర్‌గా ఉన్న నగరవాసి డాక్టర్ కునాల్ అంటున్నారు. తాము పాల్గొనే మారథాన్ ఈవెంట్స్ కోసం కుటుంబాన్ని తీసుకెళ్లడం అనేది కుటుంబంతో ఒక వెకేషన్‌ను గడపడం వంటి ప్రయోజనాలతో పాటు స్ఫూర్తిని నింపుతోంది. ‘ఇది నా భార్యను మారథాన్ రన్నర్‌గా మార్చింది. ఇప్పుడు నా 14 ఏళ్ల కొడుకు 5 కె రన్నర్‌గా శిక్షణ పొందుతున్నాడు.’ అని కునాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ తరహా రన్కేషన్స్ నిర్వహించేందుకు ప్రత్యేక ఈవెంట్ ప్లానర్లు కూడా పుట్టుకొచ్చేశారు. (చదవండి: నమితకు వీజీ మిసెస్ ఇండియా టైటిల్) -
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు ‘అగ్ని పరీక్ష’!
సెప్టెంబరులో ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ మొదలు.. వరుస సిరీస్‌లతో టీమిండియా బిజీబిజీగా గడుపనుంది. ఈ ఖండాంతర ఈవెంట్ తర్వాత స్వదేశంలో అక్టోబరులో వెస్టిండీస్‌తో టెస్టులు.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.ఆటగాళ్లు ఫిట్‌గా ఉంటేనే..ఆ తర్వాత నవంబరులో టీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికా (IND vs SA)తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో తలపడనుంది. మరి ఈ బిజీ షెడ్యూల్లో భారత జట్టు అనుకున్న ఫలితాలు రాబడుతూ సాఫీగా ముందుకు సాగాలంటే ఆటగాళ్లు ఫిట్‌గా ఉండటం అత్యంత ముఖ్యం.బీసీసీఐ కీలక నిర్ణయంఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదింట.. కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడిన విషయం తెలిసిందే. ఫలితంగా టీమిండియా యాజమాన్యం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫిట్నెస్ పరీక్షలో భాగంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CoE) సరికొత్త టెస్టును ప్రవేశపెట్టినట్లు సమాచారం. రగ్బీ, ఫుట్‌బాల్ క్రీడాకారులకు నిర్వహించే బ్రోంకో టెస్టు ద్వారా భారత ఆటగాళ్ల ఫిట్నెస్ను పరీక్షించనున్నట్లు తెలిసింది. బీసీసీఐ కాంట్రాక్టు ప్లేయర్లు, ముఖ్యంగా పేసర్లకు ఈ పరీక్ష ద్వారా ఫిట్నెస్ స్థాయి పెంచుకునే వీలు కలుగుతుందని భావిస్తున్నట్లు సమాచారం.ఫాస్ట్ బౌలర్లు పరిగెత్తడం లేదు!ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బ్రోంకో టెస్టును ప్రవేశపెట్టింది. కొంత మంది సెంట్రల్ కాంట్రాక్టు క్రికెటర్లు బెంగళూరుకు వెళ్లి ఈ పరీక్ష చేయించుకున్నారు. ఫిట్నెస్ ప్రమాణాలు పెంచేందుకే సీఓఈ ఈ నిర్ణయం తీసుకుంది.భారత క్రికెటర్లలో చాలా మంది.. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు జిమ్‌లో ఎక్కువ సమయం (స్పీడ్ రన్నింగ్) గడపడం లేదని తెలిసింది. తప్పకుండా ఎక్కువ సేపు రన్నింగ్ చేయాలని స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆడ్రియన్ లే రౌక్స్ వారికి చెప్పారు’’ అని పేర్కొన్నాయి.ఇంతకీ ఏమిటీ బ్రోంకో టెస్టు?ఇదొక రకమైన ఫిట్నెస్ పరీక్ష. ఇందులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 40 మీటర్లు, 60 మీటర్ల షటిల్ రన్లో పాల్గొంటాడు. ఈ మూడింటిని కలిపి ఒక సెట్‌గా వ్యవహరిస్తారు.పరీక్ష సమయంలో ఆటగాడు ఇలాంటి ఐదు సెట్లు పూర్తి చేయాలి. అంటే.. మొత్తంగా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా వేగంగా పరిగెత్తాలి. ఆరు నిమిషాల్లోనే సదరు ప్లేయర్ ఈ పని పూర్తి చేయాలి.ఇదిలా ఉంటే.. రెండు కిలోమీటర్ల టైమ్ ట్రయల్‌లో ఫాస్ట్ బౌలర్లు ఎనిమిది నిమిషాల పదిహేను సెకండ్లలో బెంచ్ మార్కును అందుకోవాలి. మరోవైపు.. బ్యాటర్లు, వికెట్ కీపర్లు, స్పిన్నర్లకు ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల టైమ్ ఉంటుంది. కాగా అంతకు ముందు బీసీసీఐ ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించేదన్న విషయం తెలిసిందే.చదవండి: ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదు.. వారికి మరో ఛాన్స్: అగార్కర్ -
82 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా అమితాబ్..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..
‘వయసు పైబడడం అనేది సహజం... వచ్చే సమస్యలు కూడా సహజం’ అని ఆరోగ్యాన్ని గాలికి వదిలేసేవారు కొందరు. ‘వయసు పైబడడం అనేది సహజమే అయినా, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం తప్పనిసరి’ అని ముందుకు వెళ్లేవారు కొందరు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రెండో కోవకు చెందిన వ్యక్తి.తన ఆలోచనలను పర్సనల్ బ్లాగ్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు బిగ్ బి. 82 సంవత్సరాల అమితాబ్ తాజాగా వృద్ధాప్యానికి సంబంధించిన సవాళ్ల గురించి తన తాజా పోస్ట్‌లో రాశారు. ఇంట్లో ‘హ్యాండిల్ బార్స్’ అవసరం గురించి ప్రస్తావించారు.వృద్ధుల కోసం బాత్రూమ్లో, ఇంట్లోని కొన్ని చోట్ల హ్యాండిల్ బార్స్ లేదా గ్రాబ్ బార్స్ ఏర్పాటు చేస్తారు.‘మీట్–అండ్–గ్రీట్ విత్ ఫ్యాన్స్’లో భాగంగా అభిమానులను కలుసుకున్న తరువాత తన దినచర్య గురించి రాశారు బిగ్ బి.‘శరీరం క్రమేణా సమతుల్యత కోల్పోతోంది’ అని రాసిన బచ్చన్ తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. యోగా, శ్వాస వ్యాయామాలు, మొబిలిటీ వ్యాయామాల ప్రాముఖ్యత గురించి తన పోస్ట్‌లో నొక్కి చెప్పారు.‘82 సంవత్సరాల వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్‌లే సమాధానం చెబుతాయి. సందర్భానుసారంగా ఉన్నత జీవనశైలికి సంబంధించిన అలవాట్ల గుంచి ఎన్నో పోస్ట్‌లలో వివరించారు అమితాబ్.ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించి ఉత్సాహంగా ముందుకు వెళుతున్న సూపర్ స్టార్ నిజమైన పోరాట యోధుడు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి. (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్‌నెస్‌లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్‌నెస్‌లో సరిలేరు ఈమెకెవ్వరూ..
సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించిన ఎందరో బామ్మలు, ముత్తాతల స్టోరీలను చూశాం. ఒక్కొక్కరిది ఒక్కో కథ. వివిధ కారణాల రీత్యా వారంతా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టారు. కానీ వందేళ్లకు చేరువయ్యేటప్పటికీ.. అంత చురుగ్గా లేరు. కానీ వృద్ధాప్యాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవడంలో స్ఫూర్తిని కలిగించారు. కానీ ఈ బామ్మ వందేళ్లుంటాయా..! అని ఆశ్చర్యపోయేలా ఆమె ఆహార్యం ఉంటుంది. అచ్చం సంతూర్ యాడ్ తలపించేలా భలే యాక్టివ్‌గా యంగ్ విమెన్లా ఉంటుంది. అంతేకాదండోయ్ చూడటానికి మంచి అందంగా కూడా ఉంటుంది ఈ బామ్మ. ఆఖరికి ఫిట్‌నెస్‌లో కూడా ఆమెకు సరిరావెవ్వరూ..!.. అన్నట్లుగా కసరత్తులు చేస్తుంది ఈ బామ్మ. ఆ బామ్మ పేరు హోస్ట్ ర్యాన్ జేమ్స్ రూత్. ఆమెకు వందేళ్లు. ఆమె స్వయంగా తన దీర్ఘాయువు రహస్యాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ..తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోని పంచుకుంది. ఆ వీడియో క్లిప్‌లో జిమ్‌లో రకరకాల మిషన్లపై ఎలాంటి వ్యాయామాలు చేయగలదో చూపించడమే గాక..ప్రతిరోజూ తప్పకుండా 4 మైళ్లు దూరం నడుస్తానని అంటోంది. అదే తనను ఇన్నాళ్లు ఆయురారోగ్యాలతో జీవించేలా చేసిందని చెబుతోంది. తాను పదవీవిరణమణ చేసినప్పటి నుంచి నాలుగు మైళ్లు దూరం నడుస్తున్నట్లు తెలిపింది. చక్కటి వ్యాయామాలు, 9.30 కల్లా కంటినిండా నిద్రపోవడం తదితరాలే తన ఆరోగ్య రహస్యమని అంటోంది. ఎక్కువగా కూరగాయలే తీసుకుంటాను, పైగా ఆరోగ్యంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటానంటోంది. చివరగా తాను అత్యంత ధనవంతురాలిగా పేర్కొంది. అంటే ఆయురారోగ్యాలకు మించిన ఐశ్వర్యం లేదని పరోక్షంగా ఇలా చెప్పింది ఆ బామ్మ. ఇదిలా ఉండగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం..వృద్ధాప్యంలో చక్కగా వ్యాయామాలు చేస్తే రక్తపోటు, బ్రెయిన్-గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయట. అలాగే కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. పైగా బరువుని నిర్వహించగలమని, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. కాగా, నెటిజన్లు ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం విని విస్తుపోవడమే కాదు..ఆమె ఈ వయసులో ఏకంగా నాలుగు మైళ్ల దూరం నడుస్తోందంటే..ఈమె సూపర్ బామ్మ. ఫిట్‌నెస్‌లో ఈమెకు సరిరెవ్వరూ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by evry.day club (@evrydayclub) (చదవండి: Pregnant Women: బీకేర్‌ఫుల్.. మార్నింగ్ సిక్‌నెస్‌ని లైట్ తీసుకోవద్దు!) -
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
ఆరోగ్యంగా మంచి ఫిజిక్‌తో తమ వయసు కన్నా బాగా తక్కువున్నట్టు కనిపించే ఎవరిని ఫిట్నెస్ సీక్రెట్ చెప్పమన్నా....సాధారణంగా వచ్చే సమాధానాలు అన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ‘‘ఉదయాన్నే లేస్తాను, వ్యాయామం చేస్తా, తాజా పండ్లు తింటాను..దురలవాట్లకు దూరంగా ఉంటా, రాత్రుళ్లు త్వరగా నిద్రపోతా, కనీసం 7గంటలైనా నిద్ర ఉండేలా చూసుకుంటా...’’వంటివి. అయితే వీటన్నింటికీ భిన్నంగా చెబుతున్నాడో హీరో. మరో రెండు నెలల్లో 60ఏళ్ల వయసుకు చేరుకోబోతున్న ఆ హీరో ఇప్పటికే సిక్స్ ప్యాక్ మాత్రమే కాదు ఎయిట్ ప్యాక్ కూడా చేసేశాడు. అది కూడా మద్యం సేవించడం, రాత్రుళ్లు నిద్రపోకపోవడం...వంటివి చేస్తూనే... ఎవరా హీరో? ఏమాతని కధ?వచ్చే నవంబర్ 2వ తేదీ నాటికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)కు 60 ఏళ్లు నిండుతాయి, కానీ అతని వయస్సులో సగం ఉన్న పురుషులను కూడా సిగ్గుపడేలా చేసే శరీరాకృతి అతని స్వంతం. గత ఎన్నో సంవత్సరాలుగా గ్రీకు వీరుని తలపించే ఫిజిక్‌తో ఈ సూపర్ స్టార్ కొనసాగుతున్నాడు. ఇటీవలే తన ఫిట్నెస్ అలవాట్లు ఆహార క్రమశిక్షణ గురించి మీడియాతో పంచుకున్నాడు. బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో లాగే ఇప్పటికీ తనను చురుగ్గా కనిపించేలా చేసే దినచర్యల గురించి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ వివరించాడు.‘నేను ఉదయం ఐదు గంటలకు పడుకుంటాను అంతేకాదు.. తొమ్మిది లేదా పది గంటలకు మేల్కొంటాను‘ అని ఆయన చెప్పాడు. అంతేకాదు రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు పని ముగించుకుని తాను ఇంటికి తిరిగి వస్తానన్నాడు. అప్పుడు ఆ టైమ్‌లోనే తాను వ్యాయామం చేస్తానని చెబుతున్నాడు. బహుశా చాలా మందికి ఇది అసాధ్యం., కానీ షారూఖ్‌కు కొన్ని సంవత్సరాలుగా అది సాధారణం. వ్యాయామం చేసి, స్నాన ం అన్నీ పూర్తి చేసుకుని తెల్లవారుఝామున 5గంటలకు నిద్రపోతాడన్నమాట. అంతేకాదు ఆసక్తికరంగా, షారూఖ్ తాను పండ్లు తిననని చెబుతున్నాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారి నుంచి సాధారణంగా ఇలాంటి మాట వినడం # జరగదు. ఆయన తన మందు అలవాటు గురించి మాట్లాడుతూ...‘‘ఒక నిర్దిష్ట పాత్ర కోసం ఒక షేప్ లోకి రావాలంటే మాత్రం ఆల్కహాల్‌ను మానేస్తాను అని చెప్పాడు. దానితో పాటే తెల్ల రొట్టె, తెల్ల బియ్యం, స్వీట్లు కూడా అంటూ వివరించాడు. కొన్నిసార్లు ఐస్ క్రీం లేదా చాక్లెట్ తింటాను అంటున్న షారుఖ్ జంక్ ఫుడ్ లేదా డెజర్ట్‌లను తానేమీ ప్రత్యేకంగా ఇష్టపడనని చెప్పాడు. అంతేకాదు తందూరీ చికెన్ అంటే తాను పడి చస్తానంటున్నాడీ హీరో.దశాబ్దాలుగా ఆయన వదల్లేని వంటకం ఏదైనా ఉంటే, అది తందూరీ చికెన్. దీనిని తన కంఫర్ట్ ఫుడ్ అని పేర్కొంటూ నేను దీనికి బానిసని చెప్పాలి. అవసరమైతే నేను సంవత్సరంలో 365 రోజులు ఇదే తినగలను’’ అన్నాడు.మరి మంచి లక్షణాలు, అలవాట్లు ఏమీ లేవా అంటే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కఠినమైన వ్యాయామం, ప్రోటీన్ అధికంగా ఉండే, శుభ్రమైన భోజనం తన ఆహారం, తన ఎవర్ గ్రీన్ ఎనర్జీకి ఆధారం అంటాడు షారుఖ్. తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ ‘నేను గ్రిల్డ్ చికెన్, లీన్ మీట్స్, పప్పుధాన్యాలు తీసుకుంటాను. గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటాను‘ అని స్పష్టం చేశాడు. ‘నేను తక్కువ పరిమాణంలోనే ఆహారం తీసుకుంటాను. ‘ అని ఆయన చెప్పాడు. ఇది వివిధ సినిమా పాత్రల డిమాండ్లకు అనుగుణంగా తన శరీరాన్ని త్వరగా మార్చుకోవడానికి తాను అనుసరించే వ్యూహం అని చెప్పాడు.సినిమా సెట్లలో తయారుచేసిన ఆహారానికి బదులుగా ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినడానికి ఇష్టపడతాడు. అతని సాధారణ మధ్యాహ్నం భోజనంలో తరచుగా చేపలు లేదా తందూరీ చికెన్ ఉంటుంది, కొన్నిసార్లు బీన్ స్ప్రౌట్స్ లేదా ఏదైనా వెజ్‌కర్రీ జతవుతుంది. ‘సాధారణంగా తందూరీ రోటీతో తందూరీ చికెన్, అప్పుడప్పుడు మటన్ డిష్‘ అంటూ తన డిన్నర్ మెనూ వివరిస్తాడు.ఆయన భార్య చిత్ర నిర్మాత ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ ‘డైజెస్టివ్ బిస్కెట్లతో మంచి ఐస్ క్రీం‘ అని పిలిచే దానిని తయారు చేస్తారు. మీ 50 ఏళ్ల వయసు దాటాక ఫిట్‌గా ఉండటం అంటే విపరీతమైన భోజన ప్రియత్వమో, దురలవాట్లో కాదు అలాగే ఆకలితో అలమటించడం కూడా కాదు. శరీరానికి ఏది పని చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం అంటాడు షారూఖ్. -
జిమ్ ఎంపికలో బీకేర్‌ఫుల్..!
జీవితం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి.. వ్యాయామం అంటే సరైన జిమ్‌ను ఎంచుకోవాలి. లేదంటే ఆరోగ్యం సంగతి దేవుడెరుగు.. జీవితమే కోల్పోవాల్సి రావొచ్చు.. సిటీ యూత్‌లో పెరుగుతున్న ఫిట్నెస్ క్రేజ్‌ను వాడుకుని లాభార్జనే ధ్యేయంగా ఎటువంటి అవగాహన లేకుండా జిమ్‌లు నెలకొల్పుతున్న వారూ ఉన్నారు.. సో బీకేర్ ఫుల్.. జిమ్ ఎంపికలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు.. వ్యాయామాలు చేయడానికి ఎంచుకునే జిమ్ వీలైనంత వరకూ ఇంటికి దగ్గరగానే ఉండాలి. దీనివల్ల సమయం కలిసి రావడమే కాకుండా, రెగ్యులారిటీ అలవాటై డుమ్మాలు కొట్టే అవకాశం తగ్గుతుంది. నగరంలో ఇపుడు వీధికో జిమ్ ఉంది. ఏరియాకో ఫిట్నెస్ సెంటర్ ఉంది. అయితే అన్నీ మన అవసరాలను తీర్చేవి కాకపోవచ్చు. కొన్నింటిలో చేరితే లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే జిమ్ని ఎంచుకునేటప్పుడు కొన్ని సందేహాలను తప్పనిసరిగా నివృత్తి చేసుకోవాలి. సదరు జిమ్/ఫిట్నెస్ సెంటర్ గత చరిత్ర ఏమిటి? అక్కడ మెంబర్లుగా ఉన్న ఇతరుల అభిప్రాయాలూ సేకరించాలి. అంతేకాకుండా వర్కవుట్స్ చేసే ప్రాంగణం సరిపడా విస్తీర్ణంలో ఉందా? లేదా? ఏసీ జిమ్ అయితే లోపలి గాలి బయటకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా? వంటివి సరిచూసుకోవాలి.శిక్షణ అందించే కోచ్‌లకు సరైన సర్టిఫైడ్ అర్హతలు ఉన్నాయో లేదో వాకబు చేయాలి. పర్సనల్ ట్రైనింగ్ కావాలంటే విడిగా మాట్లాడుకోవాలని పలు జిమ్స్ సూచిస్తుంటాయి. సదరు జిమ్‌లో మెంబర్ల సంఖ్య ఎంత అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే సామర్థ్యానికి మించి మెంబర్లను చేర్చుకుంటే అక్కడి ఎక్విప్మెంట్ను ఉపయోగించుకోవడానికి మనం క్యూలో నిలుచునే దుస్థితి కూడా తలెత్తవచ్చు.కొన్ని జిమ్‌లు చూడటానికి ఆర్భాటంగా ఉండి, శిక్షణ పరంగా అంత మెరుగ్గా ఉండకపోవచ్చు. కొన్ని చూసేందుకు సాధారణంగా ఉన్నా.. మంచి ట్రాక్ రికార్డు ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ లుక్కు.. పడిపోవద్దు. జిమ్‌లో సభ్యత్వం తీసుకునేటప్పుడు నిర్వాహకుల తీయటి పలుకుల మాయలో పడిపోవద్దు. వీలున్నంత వరకూ లైఫ్ మెంబర్‌షిప్‌ల జోలికి పోవద్దు. ఏడాది లోపున మాత్రమే పరిమితం కావాలి. అప్పుడే మధ్యలో మీకేమైనా అసౌకర్యం కలిగినా, జిమ్ నచ్చకపోయినా మారేందుకు ఇబ్బంది ఉండదు.జిమ్‌లో దుస్తులు మార్చుకునేందుకు, మన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకునేందుకు సరైన వసతులు ఉన్నాయా లేదా ముందుగానే చూసుకోవాలి.చాలా వరకూ జిమ్‌లలో యువతీ యువకులకు ప్రత్యేక సమయాలు ఉంటాయి. ఇది గమనించి అవసరాన్ని బట్టి సమయాన్ని ఎంచుకోవాలి.ఒకసారి వర్కవుట్ టైమ్ ఎంచుకున్న తర్వాత అది వెంట వెంటనే మార్చుకోవడానికి జిమ్‌లో నిబంధనల ప్రకారం వీలుండకపోవచ్చు. కాబట్టి, రోజూ ఎక్సర్సైజ్లు చేసేందుకు అనువైన సమయాన్ని ఒకటికి రెండుసార్లు ముందుగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఎంసీహెచ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహిస్తున్న వ్యాయామ కేంద్రాలలో సాధారణ స్థాయిలోనే నెలవారీ రుసుము వసూలు చేస్తున్నారు. తక్కువ్చ ఫీజు చెల్లించగలిగిన వారికి ఇవి నప్పుతాయి.స్టార్ హోటల్స్, క్లబ్స్, రిసార్ట్స్.. అన్నీ జిమ్‌లను నిర్వహిస్తున్నాయి. రూమ్స్‌లో బస చేసిన అతిథులతో పాటు కేవలం జిమ్ మాత్రమే ఉపయోగించుకునే నగరవాసులకూ తమ సేవలను ఇవి అందిస్తున్నాయి. కొన్ని బ్రాండెడ్ జిమ్స్ ప్రొటీన్ షేక్‌ల విక్రయంతో మొదలుపెట్టి సభ్యులకు రకరకాల ఆకర్షణలు చూపిస్తూ డబ్బులు గుంజాలని చూస్తుంటాయి. అలాంటివి ఎంచుకునేటప్పుడు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. స్వల్పకాలిక ఫలితాల మీద ఆశతో స్టెరాయిడ్స్ జోలికి మాత్రం అస్సలు పోవద్దు. కొన్ని జిమ్‌లు అందిస్తున్న ప్రత్యేక సభ్యత్వం తీసుకుంటే సదరు జిమ్‌కు నగరంలో అన్ని ప్రాంతాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధ సంస్థలలో కూడా దానిని ఉపయోగించుకునే వీలుంటుంది. తరచూ ఇళ్లు మారేవారికి, ఇతర ఊర్లకు, వేరే ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి ఈ తరహా సభ్యత్వం బాగా ప్రయోజనకరం. ఒకటీ అరా జిమ్‌లు ఇంటర్నేషనల్ మెంబర్‌షిప్‌లను కూడా అందిస్తున్నాయి. ఈ జిమ్స్‌లో మెంబర్షిప్ తీసుకుంటే విదేశాల్లో కూడా ఆ సభ్యత్వాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని జిమ్‌లలో మనకు కేటాయించిన సమయంలో అదనపు రుసుము చెల్లించగలిగితే.. మనకు మాత్రమే పరిమితమై వ్యక్తిగత సేవలు అందించే కోచ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే తొలి దశలోనే పర్సనల్ ట్రైనింగ్ కోసం డబ్బులు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంత కాలం చేశాక.. మన వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. కొన్ని జిమ్‌లు అందిస్తున్న ప్రత్యేక సభ్యత్వం తీసుకుంటే సదరు జిమ్‌కు నగరంలో అన్ని ప్రాంతాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధ సంస్థలలో కూడా దానిని ఉపయోగించుకునే వీలుంటుంది. తరచూ ఇళ్లు మారేవారికి, ఇతర ఊర్లకు, వేరే ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి ఈ తరహా సభ్యత్వం బాగా ప్రయోజనకరం. ఒకటీ అరా జిమ్‌లు ఇంటర్నేషనల్ మెంబర్‌షిప్‌లను కూడా అందిస్తున్నాయి. ఈ జిమ్స్‌లో మెంబర్షిప్ తీసుకుంటే విదేశాల్లో కూడా ఆ సభ్యత్వాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నగరంలోని జిమ్‌ల మెంబర్షిప్ వివరాలు.. టాప్‌క్లాస్ కేటగిరిలోకి వచ్చే ‘స్పా’లలో ఎక్సర్సైజ్లు చేసే అవకాశంతో పాటు మసాజ్, స్టీమ్‌బాత్, సోనాథెరపీ, పార్లర్.. వంటి అదనపు సౌకర్యాలూ ఉంటాయి. ఇంటి తరహాలో కొన్ని గంటల పాటు ఇక్కడ గడిపేందుకు వీలుంది. సభ్యత్వ రుసుము ఏడాదికి రూ.25వేలు.మూడో కేటగిరీలోకి వచ్చే జిమ్స్‌లో అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. జిమ్ మొత్తానికి ఒకరిద్దరు మించి ట్రయినర్లు ఉండరు. వీటికి రుసుము ఏడాదికి రూ.8వేలు ఆపైన. ఆ తర్వాత కేటగిరిలోకి వచ్చే ఫిట్నెస్ సెంటర్లలో అత్యాధునిక జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాగే స్టీమ్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, ప్రత్యేకంగా ఫిట్నెస్ డ్యాన్స్ ఫ్లోర్స్.. వగైరా వసతులుంటాయి. వీటి సభ్యత్వ రుసుము ఏడాదికి రూ.15వేలు ఆపైన. (చదవండి: ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఐనా..! స్టేజ్ 4 కేన్సర్ బాధితురాలి అవేదన..!) -
ఫిట్నెస్ ఉంటేనే ఏదైనా సాధ్యం
న్యూఢిల్లీ: ఆటలో కొత్తగా వస్తున్న మార్పులను ఆహ్వానిస్తూ... ఫిట్నెస్ కాపాడుకోవడం ద్వారానే ఇంకా జాతీయ హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించగలుగుతున్నానని మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో మన్‌ప్రీత్ 402 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా... మాజీ కెప్టెన్ , ప్రస్తుత హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ 412 మ్యాచ్‌లాడి అగ్రస్థానంలో ఉన్నాడు. త్వరలోనే టిర్కీని దాటేయనున్న మన్‌ప్రీత్... ప్రస్తుతానికి వచ్చే ఏడాది జరగనున్న ఆసియా క్రీడలపై దృష్టి సారించాడు. కఠినమైన సాధనతో పాటు కఠోరమైన ఆహార నియమాలతో ఫిట్నెస్ను కాపాడుకుంటున్నట్లు వెల్లడించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్యం గెలిచిన భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన మన్‌ప్రీత్... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 14 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 32 ఏళ్ల మన్‌ప్రీత్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే... ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి... 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌ను పొడిగించాలంటే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. జట్టులోకి ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు దూసుకొస్తున్నారు. వారితో పోటీపడి రేసులో నిలవాలంటే ఫిట్నెస్ తప్పనిసరి. అనుభవం మంచిదే కానీ, కేవలం అనుభవంతో జాతీయ జట్టులో కొనసాగే పరిస్థితి లేదు. టాలెంట్‌తో పాటు వేగం కూడా అవసరం. శరీరాకృతిని కాపాడుకునేందుకు కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నా. తీపి పదార్థాలు తినడం పూర్తిగా మానేయడంతో పాటు జంక్‌ఫుడ్‌కు స్వస్తి చెప్పా. ‘లో–కార్బ్’ డైట్ ఫాలో అవుతున్నా. వారంలో ఒక్కసారి చాలా తక్కువ మోతాదులో మాత్రమే స్వీట్స్ తీసుకుంటున్నా. కసరత్తులు కూడా క్రమపద్ధతిలో చేస్తున్నా. దీని వల్ల ఏడు కిలోల బరువు తగ్గా. ఆ మార్పు మైదానంలో స్పష్టంగా కనిపిస్తుంది. బరువు తగ్గిన తర్వాత వేగం పెరిగింది. యోయో పరీక్షల్లోనూ ఎంతో మెరుగయ్యా. అందుకే ఇక ముందు కూడా దీన్నే కొనసాగించాలనుకుంటున్నా. క్రిస్టియానో రొనాల్డో నాకు స్ఫూర్తి... 19 ఏళ్ల వయసులో 2011లో తొలిసారి జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కింది. అప్పటి నుంచి అంతే ఉత్సాహంతో ఆడుతున్నా. గత రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత జట్టులో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నా కెప్టెన్సీలో భారత జట్టు 41 ఏళ్ల తర్వాత పతకం గెలవడం ఎప్పటికీ మరచిపోలేనిది. 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్ గురించి ఇప్పటినుంచి ఆలోచించడం లేదు. ప్రస్తుతానికి వచ్చే ఏడాది జరగనున్న ఆసియా క్రీడలపై దృష్టి సారించా. ఇదే ఫిట్నెస్ కొనసాగిస్తే అది పెద్ద కష్టం కాదు. నేను ఫిట్‌గా లేనని అనుకుంటే తక్షణమే తప్పుకొని మరో ఆటగాడికి జట్టులో అవకాశమిస్తా. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను అభిమానిస్తా. అతడు నలభై ఏళ్ల వయసులోనూ చాలా ఫిట్‌గా ఉంటాడు. అతడే నాకు స్ఫూర్తి. 14 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా... దీన్ని మరింత పొడిగించేందకు నిరంతరం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నా. ప్రతి మ్యాచ్ ఆడాలనుకుంటా... ప్రస్తుత భారత జట్టు నైపుణ్యం, ఫిట్నెస్, తీవ్రత విషయంలో అగ్రజట్లకు ఏమాత్రం తీసిపోదు. టోక్యో ఒలింపిక్స్ ముందు నుంచే ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, జర్మనీ వంటి జట్లపై నిలకడగా విజయాలు సాధిస్తున్నాం. అయితే వ్యూహాలను అమలు చేసే విషయంలో ఇంకాస్త మెరుగు పడాల్సిన అవసరముంది. మేం దానిపై దృష్టి సారించాం. జాతీయ జట్టు, భారత్ ‘ఎ’, భారత్ అండర్–19 ఇలా ఎందరో ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. యువ ఆటగాళ్లకు కూడా అవకాశాలు లభిస్తాయి. వర్క్‌లోడ్ నిర్వహణను జాగ్రత్తగా చూసుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ప్రతిఒక్కరికీ రాదు. అలాంటి దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోను. నా వరకైతే జాతీయ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లో నేను ఉండాలనుకుంటా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప గౌరవం ఏముంటుంది. టోర్నమెంట్ అనంతరం తిరిగి ఎలా కోలుకోవాలో తెలుసు. దానిపై దృష్టి పెట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటా అంతేకాని మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని అనుకోను. హాకీ వరల్డ్‌కప్‌లో సత్తా చాటుతాం... వచ్చే ఏడాది జరగనున్న హాకీ ప్రపంచకప్‌నకు భారత జట్టు అర్హత సాధించడం ఖాయమే. 1975లో జరిగిన టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. 2023లో భువనేశ్వర్ వేదికగా జరిగిన మెగా టోరీ్నలో ఆతిథ్య భారత జట్టు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు 41 ఏళ్లుగా విశ్వక్రీడల్లో మన ప్రదర్శన నామమాత్రమే. అలాంటి ఒక సందర్భం వస్తుంది. ఈసారి ప్రపంచకప్‌లో మెరుగైన ఆటతీరు కనబరుస్తాం. గత వరల్డ్‌కప్‌లో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటూ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆధునిక హాకీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఫేవరెట్ అంటూ ఎవరూ లేరు. ఎవరు ఎవరినైనా ఓడించవచ్చు. ఒలింపిక్స్‌లో జర్మనీపై దక్షిణాఫ్రికా గెలుపొందింది. అనూహ్య ఫలితాలు అంటూ ఏమీ ఉండవు. మా వరకైతే ప్రత్యర్థుల గురించి పట్టించుకోము... మా బలాలను పెంచుకొని మెరుగైన ఫలితాలు సాధిస్తాం. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల్లో వరస పరాజయాలు ఎదురైన మాట వాస్తవమే. అయితే ఓడిన మ్యాచ్‌ల్లో సైతం మేం ఎంతో పోరాడాం. చివరి నిమిషంలో ప్రత్యరి్థకి ఆధిక్యం సమర్పించుకునే అలవాటును దూరం చేసుకోవాల్సి ఉంది. డిఫెన్స్‌లో మరింత రాటుదేలుతాం. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ యువ ఆటగాళ్ల సత్తాకు పరీక్ష కానుంది. -
ఇలా చేస్తే.. జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోల బరువు..!
బరువు తగ్గాలని స్ట్రాంగ్ డిసైడ్ ఉన్నావారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలంటోంది ఫిట్నెస్ కోచ్ అమకా. జస్ట్ ఐదు నెలల్లోనే మంచి ఫలితాలు అందుకోవాలని ప్రగాఢంగా కోరుకుంటే ఇలాంటి చిట్కాలు అనుసరించడం మంచిదని సూచిస్తుంది. తాను ఆ రెమిడీస్తోనే ఐదు నెలల్లోనే అనూహ్యంగా కిలోలు కొద్దీ బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది. త్వరితగతిన ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే.. బెస్ట్ టిప్స్ ఇవే అని చెబుతోంది ఫిట్నెస్ కోచ్ అమకా.బరువు తగ్గాలనుకుంటున్నవారు ముందుగా తాను ఎందుకు బరువు తగ్గలనుకుంటున్నా, ఎంత వెయిట్ లాస్ అవ్వాలన్నది లక్ష్యం అనేవి స్ట్రాంగ్‌గా నిర్దేశించుకోవాలంటున్నారు అమకా. అది మీకు లక్ష్యంపై ఫోకస్ పెట్టేలా చేస్తుందట. బరువు తగ్గాలనుకునేవారు ఎవ్వరైనా సింపుల్ దినచర్యను ప్రారంభించాలని చెప్పారు. ముందుగా రోజుకు మూడు లేదా రెండు సార్లు సమతుల్య భోజనం, పది నుంచి 20 నిమిషాల నడక, రెండు లీటర్ల నీరు, మంచి నిద్ర, సరైన క్వాంటిటీలో తీసుకోవడం వంటివి చాలని చెప్పారు. ఇక్కడ ఆహారం శరీరానికి సరిపడ పోషకాలు అందేలా సంతృప్తిని కలిగించేలా ఉండాలని చెప్పారు. అతిగా తినడాన్ని నివారించాలన్నారు. ముఖ్యంగా ప్రతి భోజనంలో ప్రోటీన్, అధిక ఫైబర్ తప్పనిసరిగా భాగం చేసుకోవాలని చెప్పారు. కార్బోహైడ్రేట్లు కూడా తగు మోతాదులో తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా సమతుల్యతను పాటిస్తే చాలు ఎలాంటి ఆహారమైనా ధైర్యంగా తినొచ్చని చెబుతున్నారామె. ప్రతి రోజు వాకింగ్, చక్కెర పానీయాలు దూరంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యం. ఈ చిన్నపాటి రెమిడీలు భారీ ఫలితాలను అందించి..శరీరంలో సత్వర మార్పులకు నాంది పలుకుతుందట. ఇలా స్ట్రిక్ట్‌గా డైట్‌ని అనుసరిస్తే..జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోలు మేర బరువు తగ్గుతారట. తాను కూడా అలాంటి సింపుల్ చిట్కాలను అనుసరించే ఐదునెలల్లోనే 25 కిలోలు పైనే తగ్గానని చెప్పుకొచ్చింది. ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే ఈ విధానం చాలా హెల్ప్ అవుతుందని సూచిస్తోంది ఫిట్నెస్ కోచ్ అమకా. View this post on Instagram A post shared by CERTIFIED NUTRITIONIST (@shred_with_amaka) (చదవండి: Mona Singhs weight loss journey: యోగా, డైట్‌తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్‌గా మోనాసింగ్) -
శభాష్ ఖుషీ!
ఇండస్ట్రీలో రాణించాలంటే యాక్టింగ్ ప్రతిభతోపాటు స్క్రీన్‌పై ఫిట్‌గా కూడా కనిపించాల్సి ఉంటుంది. ఆ ఫిట్నెస్ కోసం కఠినమైన కసరత్తులు చేస్తుంటారు తారలు. ఇందులో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తుంటారు. అయితే ఓ అమ్మాయి ఓ వంద కేజీలు బరువు ఎత్తితేనే హాట్ టాపిక్ అయిపోతుంది. అలాంటిది ఖుషీ కపూర్ జిమ్‌లో ఏకంగా 290 కేజీల బరువును లిఫ్ట్ చేయడంతో చాలామంది షాక్ అయ్యారు.దివంగత ప్రముఖ తార శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ హిందీ సినిమాలు చేస్తున్నారు. ఓ హీరోయిన్గా ఫిట్‌గా ఉండటం కోసం ఆమె వర్కౌట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే హిప్ థ్రస్ట్ వర్కౌట్‌లో భాగంగా 290 కిలోల బరువును ఖుషీ కపూర్ లిఫ్ట్ చేశారు. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు, ఆమె సోషల్ మీడియా ఫాలోయర్స్ విభిన్నరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.కొందరు శభాష్ ఖుషీ అని మెచ్చుకుంటుంటే, మరికొందరు ఈ ముద్దుగుమ్మకు ఎంత కష్టం వచ్చిందో అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఖుషీ కపూర్ సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారట. మంచి మాస్ కమర్షియల్ సబ్జెక్ట్ లేదా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఆమె ఇష్టపడుతోందని రెగ్యులర్ లవ్‌స్టోరీ, గాళ్ నెక్ట్స్ డోర్... వంటివి చేసే ఆలోచన ప్రస్తుతానికి ఖుషీకి లేదని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. -
77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..
సెలబ్రిటీలు, ప్రముఖులు ఫిట్నెస్ ట్రైనర్లు, పోషకాహారుల నిపుణులు పర్యవేక్షణ వంటివి ఉంటేనే మంచి ఫిట్‌నెస్‌ని సాధించగలరు. అవన్నీ కూడా పెద్దపెద్ద వాళ్లకే మనలాంటి వాళ్లకు అలాంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి మనవల్ల కాదు అనుకుంటారు చాలామంది. కానీ ఈ బామ్మని చూస్తే ఆ విధమైన ఆలోచనతీరునే మార్చుకుంటారు. సాదాసీదాగా ఉన్నవాళ్లు కూడా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టొచ్చు అని తెలుస్తుంది ఈ బామ్మని చూస్తే. వృద్ధాప్యాన్ని అత్యంత ఆనందంగా ఎలా ఆస్వాదించాలో నేర్పుతోందామె. ఆమెనే హర్యానాకు చెందిన సాబో దేవి అనే 77 ఏళ్ల బామ్మ. గ్రామీణ హర్యానాకు చెందిన సాబోదేవి..అసాధారణమైన ఫిట్నెస్కి కేరాప్ అడ్రస్ ఆమె. చక్కటి జీవనశైలి, మంచి వర్కౌట్లతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులో అంతలా వ్యాయమాలా అని ఆశ్చర్యపోయేలా చేస్తోందామె. అంతేగాదు ఆమె ఫిట్నెస్ పట్ల ఫోకస్‌ని చూసి చుట్టుపక్కల వాళ్లంతా 'హర్యానా ఫిట్నెస్ క్వీన్' అని ఆమెకు కితాబు కూడా ఇచ్చారు. అంతలా ఆకర్షించేలా ఆమె ఏం చేస్తుంది అనే కదా సందేహం. ఆమె బాల్యంలో సరదాగా నేర్చుకున్న ఈత తన దినచర్యలో భాగం చేసుకుంది. ఆమె తన ప్రతి ఉదయాన్ని ఈతతో ప్రారంభిస్తారామె. ఈ ఈత నైపుణ్యంతోనే గంగానదిలో పడిపోయిన ముగ్గురు వ్యక్తులను కాపాడి సూపర్ బామ్మ అని కూడా అనిపించుకుంది. ఈ తరాన్ని ప్రేరేపించేలా స్క్వాట్లు చేస్తుంది. తన వయసు శారీరక పరిమితులకు సంబంధం లేకుండా యువత మాదిరిగా చురుకుగా ఉంటుందామె. అందులోనూ ఆమెది గ్రామీణ నేపథ్యమే అయినా..ప్రతి ఉదయం వ్యాయమాలు, తీసుకునే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంది. అథ్లెట్లకు కూడా కష్టసాధ్యమైన గంగానది ఈతను అలవోకగా చుట్టొచ్చేసింది. అంతేగాదు 2024లో తన మనవడితో కలసి సాబోదేవి 'ఐస్ ఛాలెంజ్'ను స్వీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన మనవడి పక్కన మంచుతో నిండిన తొట్టిలో గంటల తరబడి ఉండి మరి అతడిని ఓడించింది.ప్రమాదవశాత్తు సోషల్ మీడియా ఐకాన్..హర్యానాలో సోనిపట్‌లోని సీతావాలి గ్రామంలో జన్మిచింది సాబో దేవి. హుల్లెడి గ్రామానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ కృష్ణను వివాహం చేసుకుంది. చిన్న వయసులోనే ఆమె భర్త మరణించడంతో ఆమె ఒక్కత్తే ఆ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచింది. పిల్లలందరికి వివాహలైపోగా, తన రెండో కుమారుడితో ఉంటుందామె. అతడి కొడుకు చిరాగ్ అకా ఖగత్ కారణంగా సోషల్ మీడియా ఐకాన్‌గా మారింది. చిరాగ్ తన బామ్మ వ్యాయామాలు, ఈత కొడుతున్న చేస్తున్న వీడియోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. సాంప్రదాయ భారతీయ జీవన విధానం ప్రాముఖ్యతను తెలియజేసేలా ఆమె ఆహార్యం అందరిని ఆకట్టుకుంటుంది. ఆవనూనె, నెయ్యి, తాజా ఆకుకూరలు, తేలికపాటి పదార్థాలనే తీసుకుంటానని చెబుతోంది. అంతేగాదు దేశీ నెయ్యి, ఆవాల నూనె, పచ్చి కూరగాయలు, గోధుమలు తదితరాలే మంచి ఆరోగ్యానికి ప్రధానమైనవని నిపుణులు సైతం సూచించడం విశేషం. అందువల్ల ఆమెను అంతా ఫిట్నెస్ క్వీన్ కీర్తిస్తున్నారు. ఆమె జీవిత విలువలకే కాదు ఫిటనెస్కు, సాంస్కృతిక పరిజ్ఞానానికి, ధైర్యానికి ఐకాన్‌గా నిలిచి అందరికి స్ఫూర్తిని కలిగిస్తోంది. (చదవండి: పిల్లికి హైలెవల్ సెక్యూరిటీ..! ఇంకా ఇలానా..!) -
రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్, అధిక బరువు..
ఇటీవల కాలంలో అందరిని వేదించే సమస్య అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలు. ఎందుకంటే నచ్చిన ఆహారం కాస్త ఎక్కువగా తినకుండా ఉండలేరు చాలామంది. చెప్పాలంటే.. ఫుడ్ విషయంలో నోరు కంట్రోల్లో ఉంటే చాలా వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అది చాలా కష్టం. ఎందుకంటే నోరూరించే పదార్థాలు తినమని పిలుస్తుంటే ఆగకుండా ఉండటం ఎవరికి సాధ్యం. మరి అలాంటి సమస్యను అధిగమించి రుచిని ఆస్వాదిస్తూ..బి లిమిట్‌ని పాటించటం ఎలాగో తెలుసుకుందామా..!.బాలీవుడ్ నటి కరీనా కపూర్ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ ..మనసారా నచ్చిన ఆహారం తింటూనే అధిక బరువు, గ్యాస్ సమస్యకు ఎలా చెక్ పెట్టొచ్చొ షేర్ చేసుకున్నారు. నిజానికి మనం ఏ ఆహారాన్ని తింటున్నా..ఒకటి రెండు, మూడు..అలా అన్ని సార్లు పెట్టుకుంటూ లాగించేస్తాం. మరి ఇష్టమైన ఫుడ్ అయితే ..ఎంతలా తింటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నియంత్రణ లేకుండా తినడాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే..ఈ మైండ్‌ఫుల్‌నెస్ టెక్నీక్ అయినా జోర్డాన్ ఫార్ములాను ఫాలోకండని చెబుతున్నారామె. ఇంతకీ అదేంటంటే..అందుకు ఆమె ఒక స్నాక్స్ ఐటెంని ఉదాహారణ తీసుకుంటూ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉదాహరణకు సగ్గుబియ్యం వడలు స్నాక్స్‌గా తినాలనుకున్నారు. అప్పుడు వెంటనే ప్లేట్ ఓ ఐదు వడలు తక్కువ కాకుండా లాగించేస్తారు. కానీ అలా కాకుండా ఇంత వరకు తినాలని ఫిక్స్అవ్వాలి. వంటకాలు నోరూరించేలా ఉండొచ్చు..కానీ ఆరోగ్యంపై ధ్యాస..ఎలా తింటే బెటర్‌గా ఉంటానన్నది ఆ పదార్థాలను చూడగానే ఠక్కున గుర్తుకు రావాలి. అలాంటి ఆలోచన రాగానే తినాలనే ఆలోచన ఆటోమెటిగ్గా నియంత్రణలోకి వచ్చేస్తుంది. వేసుకునేటప్పుడే రెండు లేదా మూడుతో ఆపేస్తారని చెబుతున్నారామె. పైగా దాన్ని ఎంజాయ్ చేసేలా చట్నీ లేదా ఇతరత్రా వాటిని సిద్ధం చేసుకుని ప్రతి ముక్కను ఆస్వాదిస్తూ..తింటుంటే కడుపు నిండిన అనుభూతి ప్లస్..తక్కువ తినడం రెండు సాధ్యమవుతాయట. దీన్ని మైండ్‌ఫుల్‌నెస్ తినడం అంటారని అన్నారు. రుజుతా ఈ చిట్కాకు జోర్డాన్ ఫార్ములాగా పేర్కొన్నారు. మంచి జోష్‌తో నచ్చిన ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ లిమిట్‌గా తినడమే ఈ జోర్డాన్ ఫార్ములానట. ఈ టెక్నిక్‌లో బేసి సంఖ్యలో పదార్థాలను తీసుకునేలా ఫిక్స్ అవ్వడం తోపాటు..క్రమశిక్షణతో తినడం అలవడుతుందట. అయితే ఇక్కడ తప్పనిసరిగా బుద్ధిపూర్వకంగా, నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినడం అనేది అత్యంత కీలకం. అప్పుడే తీసుకునే ఆహారంపై కంట్రోల్ ఉంటుందట. ఇది స్వీయ నియంత్రణను మెరుగుపరుస్తూ..ఆహారంపై అవగాహన ఉండేలా తీసుకునేలా చేస్తుందట. ఇది చక్కటి సత్ఫలితాలనిస్తుందని ఆమె ధీమాగా చెబుతున్నారు. మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, ఆకలే ప్రధానం. అందుకోసం ఆనందిస్తూ తినేలా..పరిమితంగా తినడం అనేదానిపై శ్రద్ధ పెట్టడం అనే జోర్డాన్ సూత్రం పాటిస్తే చాలు అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. మరి ఇంకెందు ఆలస్యం ప్రయత్నంచి చూడండి. View this post on Instagram A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!)) -
నా కూతురు కూడా అంతే.. ఫిట్నెస్ లేకుంటే కష్టం: ధోని
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయు ప్రమాణం గురించి మాట్లాడుతూ.. ఫిట్నెస్ ఆవశ్యకతను వివరించాడు. శారీరక శ్రమ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని.. కానీ యువతరం ఈ విషయంలో అంతగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనిపించడం లేదన్నాడు. 44 ఏళ్ల వయసులోనూభారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని 44 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు సారథిగా ఐదు ట్రోఫీలు అందించిన తలా.. ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో మరోసారి కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా పేరొందిన ధోని.. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా మైదానంలో పాదరసంలా కదలడం విశేషం. వికెట్ల మధ్య పరుగులు తీయడంలోనూ యువ ఆటగాళ్లకు అతడు పోటీ ఇస్తాడంటే అతిశయోక్తి కాదు.నా కూతురు కూడా అంతేకాగా.. తాజాగా ధోని తన స్వస్థలం రాంచిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫిట్నెస్ ప్రాముఖ్యత గురించి వివరించాడు. ‘‘ఈ రోజుల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. ఫలితంగా ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతోంది.భారతీయుల సగటు ఆయు ప్రమాణం క్షీణిస్తోంది. నా కూతురు కూడా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసేందుకు ఇష్టపడదు. తనకు ఆటలాడటం పెద్దగా ఇష్టం ఉండదు. పిల్లలు బయటకు వెళ్లి ఆడకపోతే శారీరకంగా ఎలా చురుగ్గా ఉండగలరు?కచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. అందుకోసం ప్రతి తల్లిదండ్రులు వాళ్లను కొత్త ఆటలు ఆడేలా వారిలో స్ఫూర్తి నింపాలి’’ అని ధోని చిన్ననాటి నుంచే ఫిట్నెస్ మీద అవగాహన అవసరమని చెప్పుకొచ్చాడు.కాగా 2010లో సాక్షి సింగ్ రావత్‌ను పెళ్లాడాడు ధోని. ఈ జంటకు 2015లో కుమార్తె జన్మించగా.. జీవాగా నామకరణం చేశారు. పదేళ్ల జీవా కాస్త బొద్దుగా ఉండేది. తల్లి సాక్షితో కలిసి ధోనీ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే జీవా.. తండ్రి ఆటను ఆస్వాదిస్తూ కరతాళ ధ్వనులతో అతడిని ఉత్సాహపరచడంలో ముందే ఉంటుంది. చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే? -
114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..
ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్(114) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయేంత వరకు మంచి ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరిచేవారు. "టర్బన్డ్ టోర్నడో"గా మంచి గుర్తింపు తెచ్చకున్న ఫౌజా సింగ్ జూలై 14న 114 వయసులోకి అడుగుపెట్టారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత శతాధిక వృద్ధ మారథాన్ అథ్లెట్‌గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడం బాధకరం. ఆయన చనిపోయేంత వరకు చక్కటి క్రమశిక్షణయుత జీవనశైలికి మారుపేరుగా నిలిచారాయన. వందేళ్ల వయసులో కూడా యువకుడు మాదిరి దూకుడుగా ఉండే అతడి తీరు అందర్నీ ఆశ్చచకితులను చేసేది. అంతలా సుదీర్ఘకాలం జీవించడమే కాకుండా..ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండేందుకు ఆయన ఎలాంటి ఆహార తీసుకునేవారు..?. అతడి జీవన విధానం ఎలా ఉండేది అంటే..ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఫౌజా సింగ్ 1911లో జన్మించారు. వందేళ్లు పూర్తి అయిన వెంటనే మారథాన్‌లో పాల్గొని పరుగుపెట్టడం ప్రారంభించారు. ఆ వయసులో అతడి అపారమైన ఓపిక, చలాకితనం చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. ఆయన ఈ మారథాన్ ప్రయాణాన్ని 89 ఏళ్ల వయసులో ప్రారంభించి 2000 నుంచి 2013 మధ్య మొత్తం 9 మారథన్లు పూర్తి చేశారు. అంతేగాదు ఆయన తన 101వ పుట్టి రోజు జరుపుకున్న మూడు వారాలకే లండన్ మారథాన్‌లో పాల్గొని ఏడు గంటల 49 నిమిషాల్లో పూర్తి చేశారట. గత 12 ఏళ్లలో మొత్తం ఎనిమది మారథాన్లు పూర్తి చేశారు. ఇంతలా యాక్టివ్‌గా ఆ వయసులో మారథాన్లు పూర్తి చేయడానికి గల సీక్రెట్ సింపుల్ ట్రిక్సేనని అంటారు ఫౌజా సింగ్. తాను శాకాహారాలు మాత్రమే తింటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతున్నారు. అంతేగాదు ఆయన శాకాహారులు మాంసం తినేవారికంటే సుదీర్ఘకాలం బతుకుతారని బలంగా విశ్వసిస్తాడాయన. ఇదే విషయం అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. తాను ప్రతిరోజు చపాతీ, పప్పు, సబ్జీ, సాగ్ వంటి శాకాహారాలు తినడం తోపాటు నడవడం, జాగింగ్ వంటివి కూడా చేస్తానని వెల్లడించారు. వయసు పరిణితిని అందిచవచ్చేమో గానీ ఓర్పు, ప్రశాంత జీవనం, మంచి ఆరోగ్యం మాత్రం పోషకాహారమైన శాకాహారంతోనే వస్తుందని సదా పిలుపునిచ్చేవారు ఫౌజా. తాను జీవితాంతం శాకాహారినే అని ప్రకటించారు కూడా. సిక్కు మతం "జీవించడానికి తినాలే తప్ప తినడానికే జీవించకూడదు" అని ప్రభోదిస్తుంది. తాను పుట్టిన భారతావనిలోని పంజాబ్‌లో స్వయంగా తాము పండించే పంటలనే తింటారని, అదే వారి దీర్ఘాయువు రహస్యమని తరుచుగా చెబుతుండేవారు. ఆ క్రెడిట్ అంతా శాకాహారాలకే ఆపాదిస్తానని అంటుండేవారు. మన భారత ప్రధాని మోదీ సైతం శాకాహారాలతోనే ఆరోగ్యం అని మన్‌కీ బాత్‌లో చెబుతుంటారు. అలానే చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా మొక్కల ఆధారిత ఆహారాలతోనే అనారోగ్యం బారిన పడకుంటా ఉంటామని చెబుతుండటం విశేషం. (చదవండి: హీరో మాధవన్ వెయిట్‌లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..) -
రిమ్ 'జిమ్'.. హోమ్..! కోవిడ్ తర్వాత పెరుగుతున్న ట్రెండ్..
నగరంలో ఆరోగ్యంపై అవగాహనతో పాటు కొత్త కొత్త ట్రెండ్స్ పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం హోమ్ జిమ్స్‌కు డిమాండ్ ఊపందుకుంటోంది. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు, సంపన్నులకు మాత్రమే పరిమితమైన ఇవి ప్రస్తుతం మధ్యతరగతి ఇళ్లలో సైతం సాధారణంగా మారాయి. బ్యాచిలర్ హోమ్స్‌లో, కో–లివింగ్ ఫ్లాట్స్‌లో సైతం నలుగురైదుగురు యువత కలిసి వీటిని ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. హోమ్ జిమ్ కాన్సెప్ట్ ఇటీవల కాలంలో నగరంలో స్థిరపడుతోంది. నగరంలో హోమ్ జిమ్ ట్రెండ్ ఊపందుకోడానికి కోవిడ్ పుణ్యమాని వర్క్ కల్చర్‌లో వచ్చిన మార్పులు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఒక కారణమే. ఇంట్లో అధిక సమయం గడపడం అలవాటవుతున్న పలువురు వృత్తి నిపుణులు ఇంట్లోనే వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే హోమ్ జిమ్ ఏర్పాటు చేసుకునే ముందు దాని వల్ల కలిగే ప్రయోజనాల నుంచి ప్రతికూలతల వరకూ ఒకసారి బేరీజు వేసుకోవడం మంచిదని ఫిట్నెస్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. స్థలం ఉంటేనే ఫలం.. ఒక మోస్తరు హోమ్ జిమ్ ఏర్పాటుకు కనీసం 60–100 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందని అంచనా. బేసిక్ హోమ్ జిమ్ అయితే 60–80 చదరపు అడుగులు (ఉదాహరణకు బెడ్రూమ్ కార్నర్ లేదా బాల్కనీలో) అలా కాకుండా ఫుల్ సెటప్ చేసుకోవాలంటే.. 100–150 చ.అ. (ఒక ప్రత్యేక గది అయితే మరింత మంచిది) అవసరం అవుతుంది. బడ్జెట్ ఇలా.. హోమ్ జిమ్ బడ్జెట్ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎంట్రీ లెవల్ హోమ్ జిమ్కైతే పెట్టుబడిగా రూ.30,000 నుంచి రూ.50,000 మధ్య సరిపోతుంది. అదే మిడ్ రేంజ్లో వెళ్లాలనుకుంటే రూ.50,000 నుంచి రూ.1.5 లక్షలు, పూర్తి సెటప్ కోరుకుంటే రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ (బ్రాండెడ్ ఎక్విప్మెంట్ను బట్టి మారవచ్చు) వెచ్చించాల్సి ఉంటుంది.ప్రాథమిక పరికరాలు.. ఇంట్లో జిమ్‌లో ఉండాల్సిన పరికరాల్లో డంబెల్స్ సెట్స్ (రూ.3,000 నుంచి రూ.10,000) రాడ్స్, వెయిట్స్ (రూ.5,000 నుంచి రూ.15,000), బెంచ్ ప్రెస్ (రూ.8,000 నుంచి రూ.20,000) యోగా మ్యాట్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ (రూ.1,000 నుంచి రూ.3,000 ), ట్రెడ్మిల్ లేదా ఎలిప్టికల్ మిషన్ (రూ.20,000 నుంచి రూ.లక్ష) ఆల్ ఇన్ వన్ మల్టీ జిమ్ మిషన్ (రూ.40,000 నుంచి రూ.1.5 లక్షల వరకు), లాట్ మిషన్ (రూ.15,000 నుంచి రూ.25,000)లు కొనుగోలు చేయాలి. ప్రతికూలతలు.. సరైన శిక్షకులు అందుబాటులో లేకపోవడం ఒక సమస్య. ఒకవేళ ఇంటికి వచ్చి శిక్షణ ఇచ్చే ట్రైనర్స్‌ను ఎంచుకుంటే వారికి చెల్లించాల్సిన మొత్తం ఆర్థిక భారంగా మారుతుంది. ఒంటరిగా చేయడం వల్ల సరిపడా మోటివేషన్ దొరకదు. వర్కవుట్స్‌ను వాయిదా వేసే అవకాశం ఎక్కువ. ఎంత వరకూ చేయాలో, ఏ వర్కవుట్ ఎలా చేయాలో తెలుసుకుని చేయకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు. అద్దెకు ఉంటున్న ఇళ్లు అయితే ఇంటి యజమానులతో ఇబ్బందులు రావచ్చు. అంతేకాకుండా ఇళ్లు మారే సమయంలో ఈ ఎక్విప్మెంట్ భారంగా పరిణమించవచ్చు. ఇవీ ప్రయోజనాలు.. నగర ట్రాఫిక్‌లో రాకపోకలకు పట్టే సమయం, ఎండ, వాన తదితర వాతావరణ అడ్డంకులు ఉండవు. జిమ్‌లో పదుల సంఖ్యలో ఉండే ఇతర సభ్యుల మధ్య చేయడం, కొన్ని సార్లు ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండకపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక్క హోమ్ జిమ్‌తో కుటుంబ సభ్యులందరికీ వ్యాయామం చేసే అవకాశం లభిస్తుంది. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ చక్కని ఆరోగ్యకర వాతావరణానికి దోహదపడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడిగా దీన్ని చెప్పుకోవచ్చు. నెలవారీగానో, వార్షిక ఫీజు రూపంలోనో చెల్లించాల్సిన జిమ్ మెంబర్షిప్ ఖర్చును దూరం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, ఒకరిద్దరు సన్నిహితులను కూడా కలుపుకుంటే స్వల్ప కాలంలోనే పెట్టుబడి రికవరీ అయినట్టు భావించవచ్చు. -
వాకింగూ కాదు, రన్నింగూ కాదు అరవైలో ఇరవైలా ఫిట్‌గా : ఇవిగో టిప్స్
సాక్షి, హైదరాబాద్: వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అధిక శాతం మంది నడక లేదా స్వల్ప శరీర వ్యాయామమే సరిపోతుందనుకుంటారు. అయితే.. తాజాగా హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్య యనం ప్రకారం చూస్తే.. వయసు పైబడినవారు ఆరో గ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కేవలం నడక సరిపో దని.. మొత్తంగా వారి ఆలోచనల్లో మార్పు రావడానికి శారీరకంగా చైతన్యంగా ఉండేందుకు కదలికలు అవసరమని వెల్లడైంది. ఈ ప్రయోగంలో శరీరానికి మాత్రమే కాక, మనసుకు కూడా ఉత్తేజం కలిగించే వ్యాయామాల ప్రాధాన్యాన్ని వివరించారు. తై చీ, ఐకిడో, వింగ్ చున్.. వంటి మార్షల్ ఆర్ట్స్ పద్ధతులు వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ అధ్యయ నంలో పేర్కొన్నారు.ఏమిటీ అధ్యయనం..?హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ పీటర్ ఎం.వె యిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరిశీలనలో తై చీ వంటి నెమ్మదిగా, స్వల్ప కదలి కలతో సాగే మార్షల్ ఆర్ట్స్ మనుషుల శరీరంలో ‘ఫిజి యొలాజికల్ కాంప్లెక్సిటీ’ ను పెంచుతాయని వెల్లడైంది. అంటే.. వృద్ధాప్యంలో ఎదురయ్యే అడ్డంకులకు మెరుగ్గా స్పందించే సామర్థ్యం శరీరానికి పెరుగుతుందని తేలింది.ఇవి కేవలం శారీరక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాక, జీవన నాణ్యత మెరుగుదలకు తోడ్పడుతున్నట్టు స్పష్ట మైంది. ఇప్పటిదాకా మన దగ్గర పెద్దల ఆరోగ్యంపై దృష్టి చికిత్సాపరంగా ఉండేది. కానీ తాజా అధ్యయనం సూచిస్తున్న మార్గం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, పునరావాస కేంద్రాలు, సామాజిక కార్యక్రమాల రూపంలో మార్షల్ ఆర్ట్స్ వంటి చురుకైన లేదా మృదువైన కదలికలతో కూడిన వ్యాయామాలను ప్రవే శపెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది.నడకతో పోలిస్తే ?నడక.. కేవలం కాలి కదలికలతో పరిమితమైన వ్యాయామం. తైచీ.. శరీరం, శ్వాస, మేధస్సు.. మూడింటినీ ఒకే సమయంలో సమతుల్యంగా ఉత్తేజపరిచే ప్రక్రియ. వృద్ధులకు.. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి సులభ, స్వల్ప తరహా మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయి.ఇది వృద్ధుల్లో.. తూలిపడిపోవడం వంటి వాటిని తగ్గిస్తుందినిద్ర నాణ్యత మెరుగవుతుందిమానసిక స్థైర్యం పెరుగుతుందితెలుగు రాష్ట్రాల్లో వృద్ధుల పరిస్థితి మార్పు ఆవశ్యకత..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా అనేది 13 శాతానికి పైగా ఉందని 2011 జనగణన ద్వారా వెల్లడైంది. 2036 నాటికి ఇది 20 శాతం దాటే అవకాశం ఉంది. ఈ వయోధిక వర్గానికి సరిపడే ఆరోగ్య విధానాలు, శారీరక దృఢత్వం కలిగించే వ్యాయామాలను అందుబాటులోకి తేవడం అత్యవసరం.వృద్ధులకు ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ తగినవి.. ఉపయోగాలు..తై చీ: నెమ్మదిగా జరిగే ప్రవాహ రూప కదలికలు, శ్వాస నియంత్రణ, శరీర సమతుల్యత, మానసిక ప్రశాంతతఐకిడో: శక్తిని మళ్లించే శక్తివంతమైన కాన్సెప్ట్, కణజాలానికి మెరుగైన కదలికలువింగ్ చున్: ఓ మోస్తరు క్లిష్టమైన కదలికలు, మెరుగైన ప్రతిస్పందన సామర్థ్యం, స్వీయ రక్షణఇదీ చదవండి: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గిందివృద్ధాప్యం ఓ ప్రతిబంధకం కాదు. అది మనం కొత్త విషయాలు నేర్చుకోవాలనే సంకల్పానికి తెరలేపే అవకాశంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై వృద్ధుల్లోనే కాకుండా అందరి ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చి అవగాహన పెరిగితే సమాజానికి మంచి ప్రయోజనా లు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నా రు. వృద్ధుల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడడంతో పాటు.. 60 ఏళ్ల తర్వాత జీవితానికి సంబంధించి కచ్చితమైన అవగాహన, చైతన్యం ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు.చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు -
‘ఫేస్‌జిమ్’లో రిలయన్స్‌కు వాటా
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్ఆర్వీఎల్) తాజాగా యూకే సంస్థ ఫేస్జిమ్లో మైనారిటీ వాటాను సొంతం చేసుకుంది. తద్వారా దేశీయంగా ఫేషియల్ ఫిట్నెస్, స్కిన్‌కేర్ బ్రాండును ప్రవేశపెట్టనుంది. తాజా పెట్టుబడులతో దేశీయంగా అధిక వృద్ధిలోనున్న సౌందర్యం, వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. అయితే వాటా కొనుగోలు విలువను వెల్లడించలేదు.ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికబురుఓమ్నిచానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫామ్ ‘టిరా’ ద్వారా ఫేస్జిమ్ను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు తాజా భాగస్వామ్యం వీలు కల్పించనున్నట్లు పేర్కొంది. రానున్న ఐదేళ్లలో ఫేస్జిమ్ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలియజేసింది. కీలక పట్టణాలలో స్టాండెలోన్ స్టుడియోలు, ఎంపిక చేసిన టిరా స్టోర్ల ద్వారా ఇందుకు అవకాశాలను సృష్టించనున్నట్లు వివరించింది. -
స్మార్ట్ రింగ్‌లో.. మన ఆరోగ్యం
ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌నూ స్మార్ట్‌గా తెలుసుకోవడానికి వాడే స్మార్ట్ బ్యాండ్, స్మార్ట్ వాచ్లకు పోటీగా ఇప్పుడు స్మార్ట్ రింగ్స్ వచ్చాయి. చిన్నదే గానీ వేరబుల్స్ రంగంలో ఇవి కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. వినియోగంలో ఎక్కువ సౌలభ్యం.. 24 x 7 ధరించే వెసులుబాటు.. అధిక బ్యాటరీ సామర్థ్యం.. తేలిగ్గా, స్టైలిష్ లుక్‌తో ట్రెండీగా, ఉండటం వంటివి ఈ రింగ్స్‌కి కలిసి వచ్చే అంశాలు. నిద్ర తీరును తెలుసుకోవాలంటే స్మార్ట్ వాచ్ కంటే ఈ రింగే అత్యుత్తమం. ఇలాంటి ఎన్నో అనుకూలాంశాలు ఉన్నాయి కాబట్టే.. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఈ స్మార్ట్ ఉంగరాన్ని ఎంచక్కా తొడిగేస్తున్నారు.స్మార్ట్ రింగ్‌లో రకరకాల సెన్సార్స్ ఉంటాయి. చర్మం కిందనున్న రక్తంలోకి ప్రసరిస్తూ హృదయ స్పందనల వేగాన్ని తెలుసుకునే ఫొటోప్లిథైస్మోగ్రఫీ (పీపీజీ) సెన్సార్స్, ఉష్ణోగ్రతను కొలిచే టెంపరేచర్ చెకర్, నడక, పరుగు, సైక్లింగ్, నిద్రలో కదలికలు, నిద్రాభంగాన్ని కొలిచే మినీ మోషన్ సెన్సార్ (యాక్సిలరేటర్), రక్తంలో ఆక్సిజన్ మోతాదులను కొలిచే ఎస్పీఓ–2 సెన్సార్ ఉంటాయి. సేకరించిన సమాచారం ఇందులోని బ్లూటూత్ సాయంతో యూజర్ స్మార్ట్‌ఫోన్ లోని యాప్‌లో నిక్షిప్తం అవుతుంది. యాప్‌ను తెరిచి ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.నిద్ర సమస్యలుస్మార్ట్ రింగ్ ధరించిన వారు ఉదయం ఎప్పుడు నిద్రలేస్తున్నారు, రాత్రి నిద్రను ఆపుకొంటూ ఉంటున్నారా, వారి నిద్రలో నాణ్యత ఉందా అన్న అంశాలతో పాటు నిద్రకు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయా అని తెలుపుతుంది. అలాగే స్లీప్ ఆప్నియా సమస్యను తెలుసుకుని, మెదడుకు ఆక్సిజన్ అందనప్పుడు ఆ విషయాన్ని తెలియజేయడం, ముప్పు గురించి హెచ్చరిక పంపడం.. తద్వారా ప్రాణాలను రక్షించడమూ చేస్తుంది. గుండె ఆరోగ్య సమాచారంగుండె స్పందనల వేగాన్నీ, వైవిధ్యాన్ని బట్టి ఓ వ్యక్తి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడా, ఆ ఒత్తిడి ప్రభావం అతడి గుండె మీద ప్రతికూలంగా పడుతోందా అన్న అంశాలను తెలుసుకుంటుంది.జ్వరం, ఇన్ఫెక్షన్ల వివరాలుదేహ ఉష్ణోగ్రతలూ, శ్వాస వేగం వీటన్నింటి ఆధారంగా ఓ వ్యక్తికి జ్వరం ఉందా అన్న అంశాన్ని గుర్తించవచ్చు. ఉదాహరణకు ఇటీవల కోవిడ్–19 స్వైరవిహారం చేసినప్పుడు ఈ తరహా రింగ్స్ చాలామందిని హెచ్చరిస్తూ అప్రమత్తం చేశాయి.మహిళల ఆరోగ్యంమహిళల శరీర ఉష్ణోగ్రత, ఇతరత్రా సమాచారంతో పాటు.. అండం ఎప్పుడు విడుదలైంది, భాగస్వామితో ఎప్పుడు కలిస్తే గర్భధారణ తేలిగ్గా జరుగుతుంది, గర్భధారణ వద్దనుకుంటే ఏ సమయంలో కలవకూడదు లాంటి సమాచారం రెడీగా దొరుకుతుంది. రిమోట్ డాక్టర్ మానిటరింగ్ గుండె జబ్బులూ లేదా ఉపిరితిత్తుల సమస్యలున్న వృద్ధులకు ‘సర్కల్ +’ లాంటి స్మార్ట్ రింగ్స్ ఎప్పటికప్పుడు డాక్టర్లకు సమాచారాన్ని తెలియజేస్తుంటాయి. తద్వారా అవసరమైన ఆరోగ్య సలహాలూ, సూచనలూ లేదా ప్రిస్క్రిప్షన్స్ లో వైద్యులు మార్పులు, చేర్పులు చేస్తారు.వేటికవే ప్రత్యేకంఔరా రింగ్ (యూఎస్ఏ): ఇది పూర్తి ఆరోగ్య సమాచారంతో పాటు నిద్రకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ సైంటిస్టులకు బాగా ఉపయోగపడుతున్నాయి.అల్ట్రా హ్యూమన్ రింగ్ ఎయిర్: వ్యాయామాలకూ, దేహ జీవక్రియల పనితీరును (మెటబాలిక్ రేట్ ట్రాకింగ్) గమనించేందుకు, అలాగే చక్కెర విలువలను తెలుసుకునేందుకు పనికొస్తుంది.సర్క్యులర్ రింగ్: దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన సమాచారం తీసుకునేలా అవసరమైన అమరికలు జరుపుకోవచ్చు. ఇవి వైబ్రేషన్ ద్వారా హెచ్చరికలు (వైబ్రేషన్ అలర్ట్స్) కూడా పంపుతూ అప్రమత్తం చేస్తుంటాయి.ఈవీ రింగ్ (యూఎస్ఏ): ఇది మహిళలకూ, యువతులకూ ఉపయోగపడేది. రుతుచక్రాల వివరాలను తెలుపుతుంది.గో 2 స్లీప్: ఇది చైనాకు సంబంధించినది. నిద్రలో ఎవరికైనా ఊపిరి ఆగితే వెంటనే అప్రమత్తం చేసి నిద్రలేపుతుంది.సర్కల్ + రింగ్ (యూఎస్ఏ): ఇది ఆసుపత్రుల్లో రోగులకు ఉపయోగపడేది. వీటి ద్వారానే అనేక మెడికల్ రీడింగ్స్ తెలుసుకోవచ్చు. వీటిని వృద్ధులకూ వాడతారు.వీటికీ పరిమితులుఇవి పూర్తిగా స్మార్ట్ అని చెప్పలేం. వీటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఫలితాలు తెలియజేసే స్క్రీన్ వీటికి ఉండదు. కొన్ని స్మార్ట్ వాచెస్ మాదిరిగా ఇవి ఇంకా ఈసీజీ తీసుకోలేవు. జీపీఎస్ లేనందువల్ల నడక, పరుగు మార్గాలను చూపలేవు.వీటి అలర్ట్ బజ్ శబ్దం చాలా గట్టిగా వినిపించేలా ఉండదు. చివరగా... ఈ రింగ్స్ స్మార్ట్‌గా అందంగా అలంకరించుకునే ఓ చిన్ని ఉంగరంలా కనిపిస్తూ.. ఆరోగ్య రక్షణకోసం అవసరమైన అనేక రకాల సమాచారాన్ని సేకరిస్తూ.. వాటిని తొడుక్కున్నవారికీ, భవిష్యత్తులో డాక్టర్లకూ ఆ సమాచారం అందిస్తూ ఉండే ఉపకరణాలు. -
Rahul Gandhi: ఇప్పటికీ యువకుడిలా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పార్టీ అధ్యక్షుడిగా తమ పార్టీని సరైన దాడిలో నడిపించడంలో ఎన్నో విమర్శలు చవిచూసినా..అన్నింటిని తనదైన శైలిలో తిప్పికొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్న నేత రాహుల్. ముఖ్యంగా భారత్ జోడో యాత్రతో అందర్నీ ఆశ్చర్యపరిచేలా అమిత ప్రజాదరణ పొందడమే గాక తన పార్టీని అధికారంలోకి వచ్చేలా శతవిధాల కృషి చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన పుట్టినరోజు(జూన్ 19). ఈ రోజు రాహుల్ తన 55వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.రాహుల్ గాంధీ జూన్ 19, 1970న న్యూఢిల్లీలో జన్మించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దంపతుల సంతానం. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే.. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు. ఆయన భారత్, విదేశాలలో విద్యను అభ్యసించారు. ఫ్లోరిడాలోని రోలిన్స్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల నుంచి ఎం.ఫిల్. డిగ్రీని పొందారు. ఇక ఆయన ఫిట్నెస్ దినచర్య పరంగా చాలామందికి స్ఫూర్తి. అంతేగాదు తన ఫిట్నెస్ గురించి 2023లో రాజస్థాన్‌లోని భారత్ జోడో యాత్రలో ఉన్నప్పుడు ట్రావెల్ అండ్ ఫుడ్ ఛానల్ కర్లీటేల్స్తో జరిగిన సంభాషణలో షేర్ చేసుకున్నారు కూడా. ఆ ఇంటర్వ్యూలో తన డైట్, వర్కౌట్ల గురించి మాట్లాడారు. తాను ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తానని, అలాగే అనారోగ్యం పాలుకాకుండా ఉండేలా మంచి ఆహారం తీసుకుంటానని చెప్పారు. Check out this fun interaction between @RahulGandhi and Kamiya Jani of Curlytales where they discuss food, travel, marriage plans, first paycheck & much more...Click on the link below to watch the full video.https://t.co/K5JKixgQXb#BharatJodoYatra pic.twitter.com/i5lzQvFHXs— Congress (@INCIndia) January 22, 2023 తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్‌లో కూడా ఈ విషయం చెప్పారు. తాను ఎప్పుడూ ఒకేవిధమైన వర్కౌట్లను చేస్తానని, వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ చేయనని అన్నారు. ఇక రాహుల్ మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ అన్న విషయం తెలిసిందే. ఆయనకు డైవింగ్ కూడా తెలుసు. అంతేగాదు తాను చేపట్టిన భారత జోడో యాత్రలో సైతం క్రమం తప్పకుండా మార్షల్ ఆర్ట్స్ తరగుతులు తీసుకునేవాడినని పలు సందర్భాల్లో చెప్పారు కూడా. తీసుకునే ఆహారం..డైట్ విషయంలో తాను కార్బోహైడ్రేట్లు అస్సలు తినని అననారు. తాను ఎక్కువుగా రోటీని ఇష్టపడతానని అన్నారు. తాను ఎక్కువగా మాంసహార ప్రియుడినని చెప్పారు. వంటకాల్లో ఎక్కువగా చికెన్ టిక్కా, సీఖ్ కబాబ్, సాదా ఆమ్లెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అయితే ప్రతి ఉదయం ఒక కప్పు కాఫీ మాత్రం తప్పనిసరిగా తీసుకుంటానని చెప్పారు.కాగా, గురువారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజును పురస్కరించుకుని, పార్టీ ఢిల్లీ యూనిట్, ఇండియన్ యూత్ కాంగ్రెస్ సంయుక్తంగా తల్కటోరా స్టేడియంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నాయి. ఇక ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి పలువురు ప్రముఖులు రాహుల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.(చదవండి: ఆ టీచర్ పాఠాలు చెప్పే తీరే వెరేలెవెల్..! ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే) -
నటి స్నేహ ఫిట్నెస్ సీక్రెట్..! ఆ డైట్ బాగా పనిచేస్తోంది..కానీ అది మాత్రం..
టాలీవుడ్ నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళం నుంచి వచ్చినా..తెలుగు ప్రేక్షకుల అశేష ఆదరాభిమానాలు పొందిన నటి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీలతో అలరించిన హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. నాలుగు పదుల వయసులో కూడా అంతే అందం గ్లామర్‌తో తన అభిమానులను కట్టిపడేస్తోంది స్నేహ. అంతలా వన్నెతరగని లావణ్యంతో కట్టిపడేసే స్నేహ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.తమిళంలో పున్నాగై అరిసిగా పిలిచే స్నేహ వెయిట్‌లాస్ ట్రైనింగ్ తర్వాతే తాను చాలా స్ట్రాంగ్ ఉన్నట్లు భావిస్తున్నాని పేర్కొంది. తాను ఆహారపరంగా చాలా క్లీన్ అండ్ నీట్‌గా తింటానని చెబుతోంది. అంతేగాదు రోజులో ఎన్ని కేలరీలు తీసుకుంటాననే దానిపై పూర్తి ఫోకస్ పెడాతానంటోంది. నెలకు ఒక్కసారి తప్ప చక్కెర తీసుకునే ఛాన్సే లేదంటోంది. ఆహారం అనేది పిండిపదార్థం, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్ల మిశ్రమం అందువల్ల సమతుల్యంగా తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం అని చెబుతోంది. అంతేగాదు ఎక్కువ నీళ్లు తీసుకుంటానని అంటోంది. శుభ్రమైన నీరు, చక్కటి ఆహారం తన దినచర్యలో భాగమని అంటోంది. ఉప్పు, మసాలా చాలా తక్కువగా తీసుకుంటానంటోంది. ఇక వ్యాయామాల పరంగా..యోగా, ఏరోబిక్ వంటి అన్ని వర్కౌట్లు చేస్తానంటోంది. View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) నిపుణుల సూచన..చక్కెర కలిగిన ఆహారాలు రక్తంలోని చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. పైగా తిన్న వెంటనే కొవ్వు నిల్వ, ఆకలిని పెంచుతుంది. ముఖ్యంగా సోడాలు, కాఫీలు, ప్యాక్ చేసిన ఆహారాలు, కడుపు నిండినట్లు ఉంటాయి గానీ, సరైనా ఆహార ఎంపికలు కావని చెబుతున్నారు వైద్యులు. ఎవ్వరైన చక్కెరను తీసుకోవడం తగ్గిస్తే..రోజువారీ కేలరీల్లో దాదాపు 200–500 కేలరీలు తగ్గినట్లేనట. అంటే వ్యక్తి వారానికి 0.5 నుంచి 1 కిలో బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఇది సమగ్ర ఆరోగ్య విధానానికి సరైనది చెబుతున్నారు. అలాగే బరువు అదుపులో ఉండటం అనేది మంచి ఆహారపు అలవాట్లు, శారీర శ్రమ, మంచి నిద్ర, ఒత్తిడి నిర్వహణ వంటివే కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఇక నూనె, ఉప్పు, మసాలాలు తగ్గించడం అనేది మంచి జీర్ణక్రియకు ఇది సరైన పద్ధతని అన్నారు. పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన భోజనం తదితరాల నుంచే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఫలితంగా హైడ్రేటెడ్‌గా ఉండటమే కాకుండా బరువు కూడా అదుపులోనే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవ్వుతారు) -
జిమ్స్, వర్కవుట్స్ లేకుండానే ఆరోగ్యం
ప్రస్తుతం ఆరోగ్యం/ఫిట్నెస్ సాధన అంటే తప్పకుండా జిమ్‌కి వెళ్లాలి, చెమటలు కక్కేలా కసరత్తులు చేయాలి అనుకుంటున్నారు చాలామంది. అయితే ఎలాంటి ప్రత్యేకమైన వ్యాయామం లేకుండానే రోజువారీ పనుల ద్వారానే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునే విధానం ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. దానికి దోహదం చేస్తోంది నీట్.. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థెర్మోజెనిసిస్(ఎన్ఇఎటి)అంటే మన శరీరం నిద్రపోవడం, తినడం లేదా ప్లాన్ చేసిన వ్యాయామం కాకుండా చేసే ప్రతి చిన్న చలనం ద్వారా ఖర్చయ్యే ఎనర్జీ.. దీనినే నీట్‌గా పేర్కొంటున్నారు. ఉదాహరణకు నడక, నిలబడటం, ఇల్లు శుభ్రపరచడం, పిల్లలతో ఆడుకోవడం వంటివాటి వల్ల వచ్చే శక్తి నీట్. సంక్షిప్తంగా చెప్పాలంటే..: జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడమే నీట్ పెరుగుదలకు ఆరోగ్య జీవనానికి దోహదం చేస్తుంది. శరీరం నుంచి ఎక్కువ కేలరీస్ ఖర్చయ్యేలా రోజువారీ పనులను నిర్వహించుకుంటూ నీట్‌ను సొంతం చేసుకునే వ్యక్తులకు మెరుగైన బాడీ కంపోజిషన్, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నీట్ టూ ఫిట్.. ఇలా.. రోజులో ఖర్చు చేసే మొత్తం కేలరీల సంఖ్య బాగా పెరిగి, బరువు నియంత్రణకు నీట్ దోహదం చేస్తుంది. ఇది సంతులితమైన ఎనర్జీ బ్యాలెన్స్‌కి దారితీస్తుంది. ముఖ్యంగా డెస్క్ జాబ్స్ చేస్తున్నవారికి ఇది ఒక ఆచరణీయ మార్గం. కొన్ని అధ్యయనాల ప్రకారం నీట్ ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. వ్యాయామం ఒక జీవనశైలిగా మారుతుంది. జిమ్‌కి వెళ్లకపోయినా ఈ తరహా జీవనశైలి వల్ల చురుకుదనం, ఆరోగ్యం సొంతం అవుతాయి. నీట్‌ను వెలుగులోకి తెచ్చినది ఈయనే.. ఈ కాన్సెప్ట్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ ఓబెసిటీ రీసెర్చర్ డా.జేమ్స్ లెవిన్ పరిచయం చేశారు. ఆయన తన మయో క్లినిక్‌లో పరిశోధనలు చేస్తూ ఈ పద్ధతి ద్వారా సాధ్యమయ్యే ఆరోగ్యలాభాలను వివరించారు. ఆయన పరిశోధనల ప్రకారం రోజూ చేసే చిన్న చిన్న కదలికలే (అంటే నడక, మెట్లు ఎక్కడం, కదులుతూ మాట్లాడటం వంటివి) చాలా ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తాయి. ఇవే మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రధాన మార్గాలుగా మారుతున్నాయి. ఈ కాన్సెప్ట్ ప్రస్తుతం అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల్లో ప్రముఖంగా వినియోగంలో ఉంది. మన దేశంలోనూ బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తమ రోజువారీ జీవనశైలి మార్చుకుంటూ నీట్‌ను, ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటున్నారు.ఒక్క రోజులో 8 వేల నుంచి 10 వేల అడుగులు నడవడం కోసం.. వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా, ఫోన్ మాట్లాడాలన్నా దానిలో నడకను భాగం చేయడం. మీటింగ్స్‌ని వాక్ – టాక్‌గా మార్చడం జిమ్‌లో, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో స్టెప్ ఎరోబిక్స్ చేయనక్కర్లేదు. సింపుల్‌గా లిఫ్ట్‌కు గుడ్‌బై చెప్పి ఎలివేటర్ బదులుగా మెట్లు ఎక్కడం అన్ని ఫ్లోర్స్ కాకపోయినా రోజూ కనీసం 3 అంతస్తుల వరకూ మెట్లపై వెళ్లగలిగితే.. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంట్లో వార్తల కోసమో మరేదైనా కార్యక్రమం కోసమో టీవీ చూసేందుకు కుర్చీ, సోఫాలు కాకుండా సైక్లింగ్ చేస్తూనో, బాల్‌పై కూర్చునో చూడటం.. భోజనం తర్వాత కనీసం 10–15 నిమిషాలు నడవడం ఒకవేళ వెంటనే కూర్చుని పనిచేయాల్సి వస్తే దానికి బదులుగా నుంచోవడం..పని సమయంలో ప్రతి 30 నిమిషాలకు ఒక్కసారి లేచి కనీసం 2–3 నిమిషాలు నడక.. సినిమా చూస్తున్నా, మధ్యలో లేచి నుంచోవడం, లేదా అటూ ఇటూ నడవడం.ఇంటి ఫ్లోర్‌ను తుడవడం, గిన్నెలు కడగడం, తోట, వంట పనులు చేయడం.. ఇంట్లో పిల్లలు ఉంటే వారితో ఆడుకోవడానికి కొంత సమయం కేటాయించడం..వర్కవుట్ చేసినా ‘నీట్’గానే ఉండాలి మనం ఇంటి పనులను మనమే చేసుకుంటూ, మన వ్యక్తిగత కార్యకలాపాల్లోనూ కదలికల్ని భాగం చేస్తే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అది జిమ్‌కు ప్రత్యామ్నాయం కాకపోవచ్చు కానీ.. ఖచి్చతంగా మన ఆరోగ్యానికి ప్రయోజనకరమే. నేనైతే ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు తగ్గకుండా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తాను. అంతేగాకుండా చురుగ్గా ఉండడానికి నీట్ మీద ఆధారపడతాను. ఆస్పత్రిలో నేను ఎప్పుడూ లిఫ్ట్‌కి బదులుగా మెట్లనే వినియోగిస్తాను. విభిన్న విభాగాల మధ్య తిరగడంతో పాటు వీలున్నంతగా నడుస్తూనే ఉంటాను. రోజుకు కనీసం 3వేల నుంచి 10వేల అడుగుల వరకూ నడిచేలా చూస్తాను. – డా.ఎ.ప్రణతిరెడ్డి, క్లినికల్ డైరెక్టర్, బర్త్ రైట్ బై రెయిన్ బో హాస్పిటల్ ఆఫీసుల్లో ఉన్నప్పుడు టీ తేవడానికి లేదా ప్రింట్ అవుట్స్ తీసుకోవడానికి ఫ్యూన్స్తో కాకుండా çస్వయంగా నడిచి వెళ్లి తెచ్చుకోవడం.ఎక్కువ సేపు నిలబడాల్సి వచ్చినప్పుడు సులభమైన స్ట్రెచింగ్స్ చేస్తూ ఉండటం.. ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా కాలూ చేయీ కదుపుతూ ఉండటం. వాటర్ బాటిల్ తెచ్చి పక్కన పెట్టుకోకపోవడం వల్ల దాని కోసం తరచూ కాస్తంత దూరం నడవడం..ఈ చిన్న చిన్న మార్పు చేర్పులతో నీట్ పెంపు అనేది ఆరోగ్యానికి దోహదపడే ఒక సహజమైన, సులభమైన మార్గం. ఇది ప్రత్యేకంగా వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా, ఇలా నీట్‌ను పెంచుకుంటే అది మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. -
డైట్ సెన్స్ ఉంటే చాలు..! ఆరోగ్యం మన చేతిలోనే..
ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్ల (15 లక్షలమంది) ఫాలోవర్స్ ఉన్న ఫిట్నెస్, న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్ తన పుస్తకాల ద్వారా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘డోంట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ యువర్ వెయిట్’ పుస్తకంతో పాపులర్ అయింది. ఆమె తాజా పుస్తకం...కామన్సెన్స్ డైట్. మన ఆహారం, ఆహారపు నియమాలు, ఉపవాసాలు... ఇలా అనేక అంశాలపై తలెత్తే సందేహాలకు సమాధానం ఇస్తుందామె.‘ఏది తినాలి... ఏది తినకూడదు అని తెలుసుకోవడానికి ఇబ్బంది పడనక్కర్లేదు. అదేమీ రాకెట్ సైన్స్ కాదు. కామన్ సెన్స్ మాత్రమే. హెల్త్ అంటే సిక్స్–ప్యాక్ మెయింటైన్ చేయడం. బరువు తగ్గడమే పనిగా పెట్టుకోవడం కాదు’ అంటుంది రుజుత.‘మంచి ఆరోగ్యం గురించి ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. బేసిక్స్‌ను చెక్ చేసుకుంటే సరిపోతుంది. సమయానికి భోజనం చేస్తున్నామా? వ్యాయామాలు మరీ ఎక్కువగా చేస్తున్నామా? అసలే చేయడం లేదా? రాత్రి లేటుగా నిద్ర΄ోతున్నామా?... మొదట ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి’‘ఆరోగ్యానికి సంబంధించి ఏది సరిౖయెన సమాచారమో, కాదో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సోషల్ మీడియా ద్వారా హెల్త్‌కు సంబంధించిన సమాచారం కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’‘తినే ఆహారం మనకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. అలా కాని పక్షంలో జాగ్రత్త పడాల్సిందే’... ఇలాంటి విషయాలెన్నో ‘కామన్ సెన్స్ డైట్’ పుస్తకంలో ఉన్నాయి. (చదవండి: కెమిస్ట్రీ ప్రొఫెసర్నా.. మజాకా! ఆమె వాదనకు కోర్టే కంగుతింది!) -
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
ప్రస్తుత కాలంలో అందర్నీ భయపెడుతున్న సమస్య అధిక బరువు. జీవన శైలి, ఆహార అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు. చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఈ బాధలనుంచి విముక్తి పొందేందుకు, స్లిమ్‌గా కనిపించేందుకు భారీ కసరత్తులే చేస్తున్నారు. అంతేకాదు బరువు తగ్గడంతో తాము సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 14 నెలల్లో 63 కిలోలు తగ్గిన మహిళ వెయిట్ లాస్ జర్నీ నెట్టింట వైరల్‌గా మారింది. ఈమె కథ చాలా హైలైట్‌గా నిలిచింది. కొన్ని టిప్స్‌ను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. అవేంటో తెలుసుకుందాం ఈ కథనంలో.ఫిట్నెస్ మోడల్ నెస్సీ చుంగత్ వెయిట్ లాస్ జర్నీ చాలా స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. 138 కిలలో బరువున్న ఆమె కష్టపడి 75 కిలోలకు చేరింది. 2023లో నవంబరులో మొదలు పెట్టి, 2025 జనవరి నాటికి అంటే 14 నెలల్లో ఏకంగా 63 కిలోల బరువు తగ్గించుకుంది. "138 కిలోల నుండి బరువు తగ్గే ప్రయాణం అంత సులభం కాదు" అని నెస్సీ తన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను 40 లక్షలమంది వీక్షించారు. బరువు తగ్గాలనే స్థిర చిత్తం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బలమైన సంకల్ప శక్తి ద్వారా 63 కిలోల బరువును తగ్గించుకుంది. "ఇది ఒక మైండ్ గేమ్" అని చెబుతుంది నెస్సీ.‘‘ఇక నేను చేయలేను .. ఆపేస్తా..’’అని చాలాసార్లు అనిపించినా .. ఆమె దివంగత తల్లి ఊబకాయం సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడిన తీరు గుర్తొచ్చి, తన ప్రయత్నాన్ని కొనసాగించింది. తన సొంత అనుభవంతో రూపొందించుకున్న నిబంధనలు, సూత్రాల ద్వారా నెస్సీ తన ఫ్యాట్‌ను తగ్గించుకునే ప్లాన్‌కు కట్టుబడి ఉంది. చివరికి అనుకున్నది సాధించింది.ఇదీ చదవండి: రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్ చేస్తే..!మూడంటే..మూడు టిప్స్షుగర్కు చెక్: ముఖ్యంగా మూడే మూడు డైట్ చిట్కాలు పాటించినట్టు నెస్సీ చెప్పుకొచ్చింది. చక్కెరను తగ్గించండి, కానీ ఆనందాన్ని , సంతోషాన్ని కాదు సుమా. రోజువారీ ఆహారం నుంచి చక్కెను పూర్తిగా తొలగించాలి. కానీ వారానికి ఒక కేక్ ముక్క లేదా చిన్న చాక్లెట్ ముక్క తినవచ్చు.ఉదయాన్నే వేడి నీళ్లు : ఉదయం గోరువెచ్చని నీటితో ప్రారంభించాలి. ఇది ఒక చిన్న అడుగే, కానీ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది వెయిట్లాస్కు బాగా ఉపయోగపడుతుంది.చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీట్రస్ట్ది ప్రాసెస్: మీరు పాటిస్తున్న పద్ధతిపై విశ్వాసాన్ని కోల్పోకండి. అద్దాన్ని కాదు.. నమ్మేది.. ట్రస్ట్‌ది ప్రాసెస్ మొదలు పెట్టిన తొలినెలలో మార్పు కనిపించకపోతే.. భయపడకండి అంటుంది ఆమె. ఆ నమ్మకమే తనకు బాగా ఉపయోగపడిందని నెస్సీ వెల్లడించింది. తక్షణం వచ్చే ఫలితంపై కాకుండా, నిరాశపడకుండా, దీర్ఘకాలిక లక్ష్యంపై గురి పెట్టి తన శరీర బరువును తగ్గించుకున్న నెస్సీ స్టోరీ నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.నోట్ : బరువు పెరగడం, తగ్గడం అనేది శరీరతత్వం, మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి శరీరం భిన్నంగా ఉంటుందనే గమనించాలి. ఆరోగ్య మార్పులు, వ్యాయామం, విశ్వాసం ప్రధాన పోషిస్తాయి. ఏదైనా కొత్త ఆహారం లేదా ఫిట్నెస్ దినచర్యను ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Nessy chungath ❇️🧸🌸 (@call_me_nessykutty) -
60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
వ్యాపారవేత్త, దేశీయ అతిపెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఆరుపదుల వయసులో కూడా ఫిట్‌గా ఉంటారు. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫిట్నెస్ రహస్యాన్ని వెల్లడిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. చాలా అలవోకగా యోగాసనాలు వేస్తూ కనిపించారు. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసు కోవాలని ఈ సందర్భంగా మహిళలకు సలహా ఇచ్చారు. 40 ఏళ్లు దాటిన తరువాత ప్రతీ మహిళ తన ఆరోగ్యంపై, శరీరంపై శ్రద్ధ పెట్టాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కూడా. తాజాగా కోచ్ వినోద్ చన్నా నీతా అంబానీ వ్యాయామ పద్ధతులపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.నీతా అంబానీ ఫిట్నెస్ కోచ్ వినోద్ చన్నా, తన అనుభవాన్ని బాలీవుడ్ షాదీస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పంచుకున్నారు . 60 ఏళ్ళ వయసులో కూడా నీతా అంబానీ వ్యాయామానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారంటూ వినోద్ చన్నా ఆమె వ్యాయామ దినచర్య గురించి మాట్లాడారు. తన సలహాలను, సూచనలను తు.చ తప్పకుండా పాటిస్తారని వెల్లడించారు. " నేను నిర్ణయించినట్టే ఆమె వ్యాయామం చేస్తారు.చాలా కష్టపడతారు. వ్యాయామం చేయడానికి సిద్ధంగా ఉంది. నేను ఏమి చెప్పినా, అనుసరించి లక్ష్యాన్ని చేరుకుంటారు" అని చెప్పారు. వినోద్ మార్గదర్శకత్వంలో వివిధ యోగా ఆసనాలు, స్ట్రెచింగ్ ,శ్వాస వ్యాయామాలు చేసిన వీడియోను నీతా ఇటీవల షేర్ చేసిన సంగతి తెలిసిందే.వినోద చన్నా వ్యాయామ సలహాలు50 ఏళ్లు పైబడిన వారు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇస్తున్న సమయంలో వారి వారి విభిన్న జీవనశైలి, ప్రతిదాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు తమ పోషకాహారాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, కాల్షియం స్థాయి గురించి తెలుసుకోవాలని చెప్పారు. లేదంటే పైకి బాగానే ఉన్నప్పటీ, ఎముకలు పెళుసుగా మారి తొందరగా గాయపడతారని తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ కండరాల నిర్మాణం తగ్గుతుంది కాబట్టి పోషకాహారం పరిపూర్ణంగా ఉండాలని, కదలిక లేకపోవడం వల్ల ఎముక సాంద్రత తగ్గుతుంది కాబట్టి, మంచి ఆహారం తీసుకోవడం, శక్తి, స్థిరత్వం, మనస్సు,శరీరం మధ్య సమన్వయాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు.చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!ఉదయమా? సాయంత్రమా? ఉదయం లేదా రాత్రి వ్యాయామం చేయాలా వద్దా అని ప్రశ్నిస్తే.. రోజులో ఏ సమయంలోనైనా వ్యాయామం చేయవచ్చని చెప్పారు వినోద్ . శరీరానికి చురుకుదనం, కదలికలే ముఖ్యం అని చెప్పారు. "ఆడ అయినా మగ అయినా వర్కౌట్ వెయిట్ ట్రైనింగ్ అనేది చేతులు, భుజాలు, పొట్ట, వీపు , కాళ్లు వంటి శరీర భాగాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే చురుగ్గా ఉండరో, వారికి భవిష్యత్తులో ప్రతీ విషయంలోనూ సమస్యలొస్తాయి. చురుగ్గా ఉండని వారు ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్లకి వెయిట్ ట్రైనింగ్‌లో ముందుగా మొబిలిటీ అనేది చూడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుకాగా సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ వినోద్ చన్నా నీతాతోపాటు, ఆమె కుమార్తె ఇషా , చిన్న కుమారుడు అనంత్ అంబానీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు, వ్యాపారవేత్త, అనన్య బిర్లా, నటి శిల్పా శెట్టి, జాన్ అబ్రహం, రితేష్ దేశ్‌ముఖ్,ఆయుష్మాన్ ఖురానా ఇతర నటులు కొంతమందికి వినోద్ దగ్గర శిక్షణ పొందిన వారే కావడం విశేషం. -
సరికొత్త వెల్నెస్ ట్రెండ్ ఫార్ట్ వాక్ అంటే ..? వైద్య నిపుణుల సైతం బెస్ట్..
ప్రస్తుతం అభివృద్ధి చెందిన సాంకేతికత తోపాటు..సరికొత్త వెల్నెస్ ట్రెండ్లు తెగ పుట్టుకొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. పైగా ఇంట్లో వాళ్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ డైట్ మంచిది, ఇలా చేస్తే బెటర్ అంటూ ఎన్నెన్నో ఆరోగ్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అలానే ఇప్పుడు మరో వెల్నెస్ ట్రెండ్ నెట్టింట సందడి చేస్తోంది. ఆఖరికి నిపుణులు సైతం చాలా మంచిదని చెబుతుండటం మరింత విశేషం. మరీ ఆ ట్రెండ్ ఏంటి..? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ అంటే.."ఫార్ట్ వాక్"(Fart Walk) అనే పదాన్ని తొలిసారిగా కెనడియన్ కుక్‌బుక్ రచయిత్రి మైర్లిన్ స్మిత్ రూపొందించారు. ఇదే చాలామంది వ్యక్తుల దీర్ఘాయువు రహస్యం అట. తక్కువ శ్రమతో కూడిన ఆరోగ్య రహస్యమని అంటున్నారు. ఇంతకీ అసలు ఈ వాక్ ఎలా చేస్తారంటే..ఫార్ట్ వాక్ అంటే..భోజనం తర్వాత తేలికపాటి నడకనే ఫార్ట్వాక్ అంటారు. అంటే ఇక్కడ రాత్రిభోజనం తర్వాత తప్పనిసరిగా వాక్ చేయడంగా భావించాలి. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందిస్తుందని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యానికి సహాయపడుతుందట. ఈ ఫిట్నెస్ దినచర్య ప్రాథమిక లక్ష్యం జీర్ణక్రియకు సహాయపడటం, తీవ్రమైన వ్యాధులను నివారించడం అని రచయిత్రి స్మిత్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Dr. Tim Tiutan | Internal Medicine (@doctortim.md) మనం ఫైబర్‌తో కూడిన భోజనం తీసుకుంటాం కాబట్టి గ్యాస్ సమస్య ఉత్ఫన్నమవుతుందట. అలాంటప్పుడు గనుక ఇలా ఫార్ట్ వాక్ చేస్తే.. ఆపానవాయువు నోరు లేదా కింద నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుందట. జస్ట్ రెండు నిమిషాలు ఆ విధంగా నడిస్తే..టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడ తగ్గుతాయని చెబుతున్నారు స్మిత్. కేన్సర్ వైద్యుడు డాక్టర్ టిమ్ టియుటన్ రచయిత్రి స్మిత్ సూచించిన ఫిట్నెస్ చిట్కాని సమర్థించారు. ఆమె చెప్పింది సరైనదేనని, నిజంగానే దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పారు. భోజనం తర్వాత నడవడం వల్ల పేగు చలనశీలత - లేదా మన ప్రేగుల కదలిక అనేది గ్యాస్‌ను వదిలించుకోవడమే గాక మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందని చెప్పారు. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నివారించడం లేదా 24 గంటల వరకు ఇన్సులిన్ సమస్య ఏర్పడదని అన్నారు. అలాగే మరో వైద్యుడు అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ డామన్ కూడా ఈ ఫిట్‌నెస ట్రెండ్‌కి మద్దుతిచ్చారు. భోజనం తర్వాత నడక అనేది తిన్న గంటలోపు చేస్తేనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఆలస్యంగా నడక ప్రారంభిస్తే అప్పటికే పోషకాలు శోషించబడి రక్తంలో కలిసిపోతాయని, అలాగే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయని చెబుతున్నారు డామన్. కలిగే లాభాలు..కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి దీర్ఘాయువుని అందిస్తుందిఎలాంటి అనారోగ్యల బారినపడకుండా కాపాడుతుందివృద్దాప్యంలో ఎలాంటి సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటేనే కాసేపు ఓ రెండడుగులు అటు.. ఇటు..నడిచి ఆరోగ్యంగా ఉందామా మరీ..!. (చదవండి: Summer Tips: ఏసీతో పనిలేకుండానే సహజసిద్ధంగా ఇంటిని చల్లగా మార్చేద్దాం ఇలా..!) -
నటి రెజీనా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రెండు వారాలకోసారి కలబంద గుజ్జు..
‘‘నా ఉదయం వేడి వేడి మసాలా టీతో మొదలవుతుంది. ఆ ఎనర్జీతో మొదలయ్యాక రోజంతా అదే ఉత్సాహం, శక్తితో ఉండటానికి నాకు సరిపడే ఆరోగ్యవంతమైన డైట్‌ని తీసుకుంటాను’’ అని రెజీనా కాసాండ్రా పేర్కొన్నారు. హీరోయిన్గా పలు భాషల్లో సినిమాలు చేస్తూ... బిజీ బిజీగా ఉండే రెజీనా కాసాండ్రా డైట్ విషయం లో స్ట్రిక్ట్‌గా ఉంటానంటున్నారు. కానీ వారంలో ఒక్కరోజు మాత్రం ‘చీట్ డే’ అని నవ్వేశారు. ఇక ఆ రోజు ఆయిల్ అని, ఫ్యాట్ అని నియమాలేం పెట్టుకోకుండా అన్నీ తింటానన్నారు. ఇంకా రెజెనా చెప్పిన విశేషాలు ఈ విధంగా... ఉదయం మసాలా టీ తాగిన కాసేపటికి అల్పాహారానికి మొలకలు, బాదంలాంటి డ్రై ఫ్రూట్స్ (పొట్టు తీసినవి), పండ్ల రసం తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ బాగా తినాలి. అందుకే వీటితోపాటు ఇడ్లీ, దోసె తింటాను. సాంబార్ కాంబినేషన్ ఉండాల్సిందే. మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇస్తాను. బీన్స్, క్యారెట్, ఇంకా ఉడికించిన కూరగాయలు, పప్పు తప్పకుండా ఉండాల్సిందే. అన్నంతోపాటు ఇవన్నీ తింటే ఇటు కార్బోహైడ్రేట్స్ అటు ప్రోటీన్ రెండూ అందుతాయి. బ్రౌన్రైస్ని ప్రిఫర్ చేస్తాను. మన రోజుని మనం హెవీ బ్రేక్‌ఫాస్ట్‌తో మొదలుపెట్టి, రాత్రి వరకూ క్రమ క్రమంగా తగ్గించుకుంటూ తినాలి. డిన్నర్ ఎంత లైట్ అయితే అంత బెటర్. అందుకే నేను సూప్ లాంటి వాటిని ప్రిఫర్ చేస్తాను. ఇప్పటివరకూ చెప్పినది ఒక రోజులో తీసుకునే డైట్ అయితే నా వారం ప్లాన్ ఎలా ఉంటుందంటే... వారంలో ఒక రోజంతా కేవలం పండ్ల రసాలతోనే సరిపెట్టేస్తాను. ఒక రోజంతా పండ్ల రసాలు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు పోతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఇలా మలినాలను పోగొట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే రెండు వారాలకోసారి కలబంద గుజ్జు తింటాను. దీనికోసం పొట్ట ఖాళీగా ఉంచుకుంటాను. అలా ఎమ్టీ స్టమక్‌తో తింటేనే మంచిది. కలబంద గుజ్జు చర్మానికి నిగారింపుని ఇస్తుంది. ఇక ఒకేసారి కాకుండా రోజు మొత్తంలో కొంచెం కొంచెంగా నీళ్లు తాగుతుంటాను. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్‌కి నేను దూరం. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే... ఎక్సర్సైజ్లు చేయడటం, ఆహారం విషయంలో నియమాలు పాటించడం వంటివి స్లిమ్‌గా ఉండటం కోసమే కాదు... ఆరోగ్యంగా ఉండటం కోసం కూడా. సన్నగా ఉండాలని కడుపు మాడ్చుకున్నా ప్రమాదమే. అందుకే చక్కగా తినాలి... వ్యాయామాలు చేయాలి. అప్పుడు ఫిట్ అండ్ ఫైన్‌గా ఉంటాం’’ అంటూ ముగించారు రెజీనా.నేను, యోగా వేరు కాదని అనుకుంటాను. అంతలా యోగాని ఇష్టపడతాను. నేను ఫిట్ అండ్ ఫైన్‌గా ఉండటానికి యోగా ఓ కారణం. సూర్య నమస్కారాలతో మొదలుపెట్టి, భుజంగాసనం, సర్వాంగాసనం... ఇలా చాలా చేస్తాను. అలాగే ఇతర వ్యాయామాలు కూడా చేస్తుంటాను. నా ఎక్సర్సైజ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే... ఒకరోజు అప్పర్ బాడీ చేస్తే తర్వాతి రోజు లోయర్ బాడీ వర్కవుట్స్ చేస్తాను. – డి.జి. భవాని(చదవండి: -
ఇదేందయ్యా ఇది!.. ఒక్క నిమిషంలోనే ముగించేసింది.. సైంటిస్టులు సైతం ఫిదా
వయసుతో సంబంధం లేకుండా కొందరు అద్భుతాలు చేసి ఆశ్చర్యపరుస్తుంటారు. అదికూడా లేటు వయసులో సాహసోపేతమైన పనులు చేసి వయసు అనేది శరీరానికే గానీ మనసుకు కాదని చేతల్లో చూపిస్తుంటారు. వృద్ధాప్య దశలో పీజీలు, పీహెచ్‌డీలు చేస్తే..కొందరు మాత్రం ఆ వయసుకి సాధ్యవుతాయా..? అనేలా ఛాలెంజింగ్ సాహసాలకు పూనుకుని, రికార్డులు సృష్టిస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ 91 ఏళ్ల బామ్మ. ఈమె ఏం చేసిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. శాస్త్రవేత్తలక సైతం ఆమె చురుకైన యాక్టివిటీని చూసి కంగుతిన్నారు.ఇటలీకి చెందిన 91 ఏళ్ల ఎమ్మా మరియా మజ్జెంగా(Emma Maria Mazzenga) అనే బామ్మ 90 ప్లస్ 200 మీటర్ల రన్నింగ్ రేసులో ఊహకందని విధంగా ప్రపంచ రికార్డును సృష్టించింది. జస్ట్ ఒక్క నిమిషంలోపే రన్నింగ్ రేస్‌ని ముగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఆ వయసులో మరొకరి సాయం లేనిదే అడుగులు వేయలేరు. కానీ ఆమె మాత్రం చాలా వేగంగా పరుగులు తీయడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. పైగా ఎలాంటి ఆయాసం లేకుండా యువకుల మాదిరిగా అత్యంత ఉత్సాహంగా పరుగులు తీయడం అత్యంత షాకింగ్ విషయం. ఆమె తోటివారందరూ ఆయాసంతో ఆందోళపడుతుంటే..ఆమె మాత్రం చాలా ప్రశాంతంగా సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఇది శాస్త్రవేత్తలను ఎంతగానో ఆకర్షించింది. ఈ వయసులో ఆ బామ్మ మజ్జెంగా ఇంత చురుగ్గా ఉండటానికి వెనుకున్న ఆరోగ్య రహస్యం ఏంటా అని ఆసక్తిని రేకత్తించింది. చివరికి అదేంటో సవివరంగా తెలుసుకున్నారు కూడా.ఇక్కడ బామ్మ 200 మీటర్ల పరుగును కేవల 51.47 సెకన్లలో పూర్తిచేసి, మునుపటి 90-ప్లస్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. ఇంత వేగంగా చేయడానికి ఆమె శరీరం ధర్మం ఎలా సహకరిస్తుందో తెలుసుకునే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. అందుకోసం ఆమెకు శారీరక కసరత్తులకు సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించి మరీ ఆమె ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకున్నారు. 90 ఏళ్ల వయసులో బామ్మను సూపర్ ఫిట్‌గా ఉండేలా చేసినవి..పుణుల అభిప్రాయం ప్రకారం బామ్మ మజ్జెంగా వండర్ ఉమెన్. అందుకు రెండే రెండు ప్రధాన అంశాలని చెబుతున్నారు. ఆమె కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌లో ఆమె గుండె,ఊపిరితిత్తులు, రాలకు ఆక్సిజన్‌ను పంప్ చేసే విధానం 40 లేదా 50 ఏళ్ల వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన మహిళతో సమానంగా ఉంటుందట.ఆమె కండరాలు ప్రత్యేకమైనవి మరియు తక్కువ బర్నింగ్‌ని కలిగి ఉంటాయి. అంటే ఎనర్జీని కోల్పోకుండా ఉండటంతో అలిసిపోతు. అందువల్లే ఆమె సుదురాలకు సులభంగా పరిగెత్తగలతు. ఆమెలో "చాలా ఎక్కువ శాతం" వేగవంతమైన సంకోచ ఫైబర్లు కూడా ఉన్నాయి, ఇవి శక్తివంతమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవే ఆమె వేగవంతమైన కదిలికలకు కారణమని అన్నారు. ఈ ప్రత్యేకమైన లక్షణాలే ఈ 200 మీటర్ల రన్నింగ్ రేసులో అలవోకగా రికార్డు చేచేసందుకు దారితీసిందని చెబుతున్నారు డాక్టర్ మార్టా కొలోసియో.ఈ ప్రత్యేకమైన శరీరాకృతి ఎలా వచ్చిందంటే..ఆమె దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తోంది. అదే ఆమె శరీరానికి వరంగా మారింది1933లో జన్మించిన మజ్జెంగా మొదట విశ్వవిద్యాలయంలో తన ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించింది, 100, 200, 400 మరియు 800 మీటర్ల రేసుల్లో కూడా పోటీ పడింది. అప్పటి నుంచే ఆమె విజయపరంపర మొదలైంది. ఆరోజుల్లో రోమ్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో నాల్గవ స్థానంలో నిలిచింది.తన విజయాలకు బ్రేక్‌పడింది పెళ్లి, పిల్లలు అనే చెప్పొచ్చు. అలా ఆమె రెండు దశాబ్దలకు పైగా తన ఫిట్నెస్ కెరీర్‌కు దూరంగాఉంది. మళ్లీ తిరిగి 1986లో తన కెరీర్ రన్నింగ్ రేస్‌లోకి వచ్చింద. అంటే.. 50ల వయసులో తన పాత సహచరులతో పోటీ పడటం మొదలైంది. మళ్లీ పుంజుకోవడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చినా..ఈ రన్నింగ్ రేసులో పాల్గొనడం చాలా సంతృప్తినిస్తుందని అంటోంది బామ్మ. అదే కారణం..ఒక రేసు ఇచ్చే కిక్కే వేరు అంటోంది. ప్రతి శిక్షణా సెషన్ తనకు మంచి జీవితకాల వ్యాయామ శిక్షణ, అసాధారణ పనితీరుని అందిస్తుందట. అందువల్లే తొమ్మిది పదుల వయసులో కూడా ఇంతలా యువ క్రీడాకారులతో సరితూగేలా పోటీపడగలను అంటోంది. కాగా, బామ్మ ఐదు ప్రపంచ రికార్డులు, తొమ్మిది యూరోపియన్ రికార్డులు, మాస్టర్ స్ప్రింటింగ్ విభాగంలో 28 ఉత్తమ ఇటాలియన్ పెర్ఫామెన్స్‌గా అవార్డులు గెలుచుకుంది. ఈ బామ్మ నేటి యువతరానికి ఎంతోస్ఫూర్తి కదూ..!.(చదవండి: పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!) -
జర్నలిస్టులకు.. సండేస్ ఆన్ సైకిల్
సండేస్ ఆన్ సైకిల్ మిషన్‌లో తెలంగాణలోని జర్నలిస్టులు పాల్గొనాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాత చతుర్వేది కోరారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య స్పృహ కలిగిన రవాణా విధానాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్ చేపట్టనుందన్నారు. దీని ద్వారా సాధారణ శారీరక శ్రమ, ఫిట్నెస్ ప్రోత్సహించడం ద్వారా పౌరులను ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ప్రేరేపించడమే లక్ష్యమన్నారు. ముఖ్యంగా జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుకు అనుగుణంగా తమ శాఖ ఈ నెల 27న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘సండేస్ ఆన్ సైకిల్’ ప్రత్యేక ఎడిషన్‌ను నిర్వహించ తలపెట్టామని, ఈ కార్యక్రమం గచ్చిబౌలిలో జరుగుతుందన్నారు. ఈ డ్రైవ్‌ను గతేడాది డిసెంబర్ 17న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారని గుర్తుచేశారు. తెలంగాణ జర్నలిస్టులందరూ తమ పేర్లను నమోదు చేసుకుని పాల్గొనాలని ఆ శాఖ కార్యదర్శి సుజాత శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. (చదవండి: వేసవిలో మహాపానీయం 'మజ్జిగ'..! ఆరోగ్యానికి ఏవిధంగా మేలు చేస్తుందంటే..) -
అమ్మాయిలూ మీ కోసం కష్టపడండి: అనసూయ
చిన్నితెర మీద యాంకర్‌గా అనసూయ(Anasuya Bharadwaj ) ప్రయాణం ఓ స్పెషల్. అటు చిన్నితెర మీదా ఇటు వెండితెర మీద కూడా గుర్తుంచుకోదగిన పాత్రలు పోషించే అవకాశం ఆమెకు మాత్రమే దక్కిందని చెప్పవచ్చు. కేవలం యాంకర్, యాక్ట్రెస్‌గా మాత్రమే కాకుండా సోషల్ మీడియా సెలబ్రిటీగా కూడా అనసూయ ముందంజలో ఉంది. యాక్టింగ్, యాంకరింగ్ టాలెంట్‌తో పాటు తనదైన శైలిలో గ్లామర్ కూడా పండించడంతో ఆమె తరచుగా వార్తల్లో వ్యక్తి అవుతుంటారనేది వాస్తవం. ప్రస్తుతం మిడిల్ ఏజ్‌లో ఉన్న ఈ బ్యూటీ మధ్యలో కాస్త ఓవర్ వెయిట్ అనిపించినా.. ఇప్పుడు మళ్లీ మంచి శరీరాకృతి సాధించి అభిమానులను ఆకర్షిస్తోంది. అంతేకాదు వారితో ఆమె తరచుగా తన ఫిట్నెస్ జర్నీ విశేషాలు కూడా పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమె అమ్మాయిలకు అందించిన ఓ సందేశం ఆసక్తికరంగా ఉంది.మహిళలు, ఉద్యోగినులు అయినా గృహిణులు అయినా, తమ కోసం తాము టైమ్ కేటాయించుకోలేక ఒత్తిడికి గురవుతారు; వారి షెడ్యూల్ ఉదయం నుంచి రాత్రి వరకు ఫుల్ అయిపోయి ఉంటుంది. పిల్లలని స్కూల్‌కి రెడీ చేయడంతో మొదలుపెడితే.. భర్తలు అత్తమామలకు టిఫిన్లు ప్యాక్ చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, ఆపై నేరుగా వంట లేదా ఇతర పనుల్లోకి తలమునకలవడం... తో రోజు గడచిపోతుంటుంది. ఇటువంటి దినచర్య మధ్య, తరచుగా చాలా మంది మహిళలకు ఫిట్నెస్ అనేది ఓ టైమ్ వేస్ట్ పనిలా అనిపిస్తుంది.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ యాంకర్ అనసూయ భరద్వాజ్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంది. ఆమె మహిళలకు కొన్ని ఆచరణీయ సలహాలను కూడా అందించింది, తనకు కూడా ఒకప్పుడు జిమ్‌కి వెళ్లడానికి ఆసక్తి ఉండేది కాదని ఇప్పుడు జిమ్ వర్కువట్స్ ప్రారంభించిన తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని చెప్పిందామె. ఇన్ స్ట్రాగామ్‌లో తన జిమ్ వర్కౌట్ల వీడియోను పోస్ట్ చేస్తూ, అనసూయ ఇలా వివరించింది‘‘వంశపారంపర్యంగా నేను ఫిట్‌గా పుట్టాను. అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడతాను ఇక జిమ్‌కి ఎందుకు వెళ్లాలి?’ అని నేను అనుకున్నాను. ఓ ఇంటర్వ్యూలో అదే విషయం చెప్పాను కూడా. కానీ క్రమం తప్పకుండా రెండేళ్ల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామం చేశాక.. దాని ప్రాముఖ్యతను నేను ఇప్పుడు గ్రహించాను.. అంతేకాదు 30 ఏళ్ళ వయసు నుంచి 40కి చేరువవుతున్నప్పుడు నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం మొదలయ్యాక.. అప్పుడు అనిపించింది ఈ వ్యాయామాలను ముందుగానే ప్రారంభించి ఉండాల్సింది అని. కాబట్టి ‘అమ్మాయిలూ మీరు ఎంత త్వరగా జిమ్‌కి వెళ్లడం ప్రారంభిస్తే అంత మంచిది. ఇది మీ కోసం, మీ కుటుంబం కోసం కాదు. నాకు తెలుసు మీరు మూడు పూటలా వంట చేయాలి. మీ భర్త పిల్లల అత్తమామల బాగోగులు చూసుకోవాలి. కానీ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ కుటుంబాన్ని కూడా కొంత భారం పంచుకోమని చెప్పండి. ఓ గంట మీకోసం మీరు కేటాయించుకోండి. అప్పుడు మార్పు చూసి మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకుంటారు. జిమ్‌కి వెళ్లడం ఒక అవసరం, విలాసం కాదు’’ అంటూ ఇన్‌స్టా ద్వారా అనసూయ అందించిన సందేశం ఎంతైనా అనుసరణీయం. ఇంటి పనిభారం మోసే మహిళలు, అమ్మాయిలను తమ కోసం కూడా సమయాన్ని వెచ్చించమని ప్రోత్సహిస్తోంచే ఈ సలహాను అమ్మాయిలు పాటిస్తారనే ఆశిద్దాం. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ టాలీవుడ్ కోలీవుడ్‌లో తనదైన ముద్రవేసిన ప్రసిద్ధ నటి. 90లలో తన అందం, నటనతో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన నటి ఆమె. ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలో ప్రేక్షకుల, విమర్శకుల మెప్పుని పొందారు. అంతేగాదు వేలాదిగా అభిమానులను సొంతం చేసుకున్న తమిళ నటి. అలాగే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అక్కడ కూడా తన హవాను చాటుతున్నారు. అవసరమైనప్పుడూ ప్రజల తరుపున గళం విపుత్తు..వార్తల్లో నిలుస్తున్నారు కూడా. రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉండే ఆమె కూడా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతుంటారు. అందుకు నిదర్శనమే ఆమె కొత్త గ్లామరస్ లుక్. ఎంతో లావుగా ఉండే ఆమె ఒక్కసారిగా పదహారణాల పడుచు పిల్లలా మారిపోయారు. నెటిజన్లు సైతం ఆమె కొత్త లుక్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరీ.. అంతలా బరువు కోల్పోయినా..ఖుష్బు వెయిట్‌లాస్ సీక్రెట్ ఏంటో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఐదుపదుల వయసులో ఖుష్బూ అద్భుతంగా తన బాడీ ఆకృతిని మార్చుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారామె. ఇటీవలే అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నిజంగా ఆమెనా..? ఖుష్బు కూతురా..? అని కన్ఫ్యూజ్ అయ్యేలా గ్లామరస్ లుక్‌లో కనిపించారామె. అయితే ఆమె కొత్త లుక్‌ని చూసి.. కొందరు నెటిజన్లు మెచ్చుకోగా మరికొందరు మాత్రం ఇంజెక్షన్లు ఏవో తీసుకునే బరువు తగ్గారామె అంటూ కామెంట్లు చేశారు. అయితే ఖుష్బూ వాటిన్నంటిని కొట్టిపారేస్తూ..తాను ఎలా బరువుని తగ్గించుకోగలిగరో షేర్ చేసుకున్నారు. అలాగే తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో కూడా చెప్పారు. బరువు తగ్గడానికి షార్ట్ కట్స్ ఉండవని నర్మగర్భంగా తేల్చి చెప్పారామె. ఒకవేళ్ల తగ్గినా..అది తాత్కాలికమే అని కూడా అన్నారు ఖుష్బూ. కేవలం క్రమశిక్షణాయుతమైన జీవనశైలి, బరువు తగ్గాలన్న కృత నిశ్చయాలే..అద్బుతంగా బరువు తగ్గేందుకు దారితీస్తాయని అంటున్నారామె. అంతేగాదు అందుకోసం తాను ఎలాంటి లైఫ్‌స్టైల్‌ని అనుసరించారో కూడా పంచుకున్నారు. మనసుపెట్టి తినడం, ఒక గంటపాటు వర్కౌట్లు, అలాగే సాయంత్రం 45 నుంచి 50 నిమిషాలు తప్పనిసరి వాక్ తదితరాలే ఈ సరికొత్త లుక్‌కి కారణమని అన్నారు. అయితే తాను ఇలా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడానికి ప్రధాన కారణం కూడా వివరించారు. షూటింగ్‌ల సమయంలో సంవత్సరాల తరబడి అయిన గాయాలు, శస్త్రచికిత్సలు తన మోకాళ్లను పూర్తిగా బలహీనపరిచాయన్నారు. వాటిపై ఒత్తిడిపడకూడదంటే బరువు తగ్గక తప్పదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. చీలమండలాలు బాగానే ఉన్నాయని, మోకాళ్లు ఆల్మోస్ట్ అరిగిపోయాయని అన్నారు. అప్పుడే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే అంతే సంగతులని భావించి..బరువు తగ్గాలని గట్టిగా ఫిక్స్ అయ్యానన్నారు. అలా తాను దాదాపు 20 కేజీల బరువుని కోల్పాయానన్నారు.ఇక్కడ ఖుష్బూ బరువు తగ్గేందుకు ఎటువంటి సౌందర్య చికిత్సల జోలికిపోకుండా.. అందంగా..ఆరోగ్యకరంగా వృద్ధాప్యాన్ని ఎలా మలుచుకోవచ్చో చూపించారు. ఏదీఏమైనా.. వయసురీత్యా మార్పులనేవి సహజం. వాటిని దాచే ప్రయత్నం కంటే..ఆరోగ్యదాయకమైన పద్ధతిలో తీసుకొస్తే..అటు అందం, ఇటు ఆరోగ్యాన్ని పదిలపరుచుకున్న వాళ్లమవుతామని తన చేతలతో చెప్పకనే చెప్పింది నటి ఖుష్బూ. (చదవండి: ఎవరీ రేష్మా కేవల్రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్‌లో చోటు..) -
ఇదేం ఫిట్నెస్ స్టంట్..? తిట్టిపోస్తున్న నెటిజన్లు
మంచి మంచి రీల్స్‌తో ఆకట్టుకోవడం కోసం ఇన్ఫ్లుయెన్సర్లు చాలా కష్టపడుతుంటారు. అందుకోసం చాలా రిస్క్ తీసుకుంటారు. అది వాళ్ల అభిరుచి కావొచ్చు కూడా. కానీ ఆ రీల్స్ ప్రజలను పక్కదోవ పట్టించేలా ఉండకూడదు. అవి ఆరోగ్యదాయకంగానూ, ఆహ్లాదంగానూ ఉండాలి. అయితే ఇక్కడొక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అత్యుత్సాహంతో మరింత క్రియేటివిటీ కోసం చేసిన పని విమర్శలపాలు చేసింది. చివరికి నెటిజన్ల ఆగ్రహానికి గురైందిఇంతకీ ఆమె ఏం చేసిందంటే..ఢిల్లీకి చెందిన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కొత్త ట్రెండ్ సెట్‌చేసే క్రమంలో డేరింగ్ స్టంట్ రీల్ చేసేందుకు రెడీ అయిపోయింది. అయితే ఆమె అది ఎలాంటి సాహసోపేతమైన స్టంట్ అనేది పరిగణించలేదు. కేవలం వ్యూస్, క్రేజ్ కోసం ఏకంగా స్పీడ్‌గా దూసుకపోతున్న రైలు పక్కనే పరిగెడుతున్నట్లు చేసిన వీడియోని షేర్చేసింది. అందులో రైలు ఆమెను దాటి వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పైగా "రైలుతో పరుగు'అనే క్యాప్షన్‌ని జత చేసి మరీ పోస్ట్ చేయడంతో మరింత ఆగ్రహం తెప్పించేలానే కాకుండా తప్పుదోవ పట్టించేలా కూడా ఉంది. అసలు ఇది ఫిట్నెస్ అవేర్నెస్ లేక ఎంత రిస్క్ చేసి అయినా ప్రాణాలు పోగొట్టుకోవడమెలా? అని సందేశం ఇస్తున్నావా..? అని మండిపడుతూ పోస్టులు పెట్టారు. డేరింగ్ స్టంట్‌కి అర్థమే మార్చేస్తున్నారా కథా..! మీరు అని మరొకందరూ విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. డేరింగ్ స్టంట్ అంటే కళ్లు ఆర్పడమే మర్చిపోయేలా ఉండాలి గానీ ఇదేంటిరా బాబు అని తలపట్టుకునేలా ఉంటే ఇలానే ఉంటుందేమో..!.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..:(చదవండి: ఖండాంతరాలు దాటిన నృత్యం) -
గ్లోబల్ స్టార్ రామ చరణ్ ఫిట్నెస్ సీక్రెట్..! డైట్లో అవి ఉండాల్సిందే..
చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. నటన పరంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఎందులోనైనా తండ్రికి ధీటుగా చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ రోజుతో ఆయనకు 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చరణ్ ఫిట్నెస్ సీక్రెట్, డైట్‌ప్లాన్‌లు ఏంటో చూద్దామా. ఆయన తొలి చిత్రం చిరుత మూవీ నుంచి ఇటీవల విడుదలైన గేమ్‌ఛేంజర్ మూవీ వరకు అదే లుక్‌తో కనిపించేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. అంతలా ఫిట్‌గా కనిపించేందుకు వెనుక ఎంతో డెడీకేషన్తో చేసే వర్కౌట్లు అనుసరించే డైట్లే అత్యంత ప్రధానమైనవి. అవేంటో చూద్దామా..రామ్ చరణ్ ఒకసారి అపోలా లైఫ్ డాట్ కామ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు, ఆహారం తీసుకుంటారో షేర్ చేసుకున్నారు. జంపింగ్ జాక్‌లు, సీటెడ్ మెషిన్ ప్రెస్‌ల నుంచి మిలిటరీ పుషప్‌లు, బార్బెల్ స్టిఫ్-లెగ్ డెడ్ లిఫ్ట్‌ల వరకు ప్రతిదీ చేస్తానని అన్నారు. అయితే ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకుంటానని అన్నారు. సమతుల్య జీవనశైలికి ప్రాధన్యాత ఇస్తానని చెప్పారు. ప్రతిరోజూ కొన్ని క్రీడలు తప్పనిసరిగా ఆడతానని అన్నారు. వారంలో నాలుగు రోజులు అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తానని అన్నారు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఒక గంటన్నర పాటు వ్యాయామం చేస్తానని తెలిపారు. అంతేగాదు శరీర బరువుని అదుపులో ఉంచే వ్యాయామాలపై దృష్టి పెడతానని చెప్పారు. 80% ఆహారంపైనే..ఫిట్ బాడీని నిర్వహించడంలో ఆహారం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు రామ్‌చరణ. మన ఆరోగ్యం 80 శాతం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్ల మనం ఏం తింటున్నాం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. అలాగే తాను ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకుంటానని చెప్పారు. అనారోగ్యకరమైన ఆహారాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పారు. అంతేగాదు ప్రతి ఆదివారం చీట్మీల్స్లో పాల్గొంటా, కానీ అది సృతి మించకుండా చూసుకుంటానని అన్నారు. డైట్ సీక్రెట్స్ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్ రూపొందించిన డైట్ ప్లాన్ ప్రకారం..కెఫిన్, ఆల్కహాల్, చక్కెర పానీయాలు, రెడ్ మీట్, గోధుమలు, ప్రోటీన్ షేక్‌లకు దూరంగా ఉంటారట రామ్‌చరణ్. తన రోజుని గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లేట్ లేదా పూర్తి గుడ్లు, ఓట్స్, బాదంపాలతో ప్రారంభిస్తారట. ఆ తర్వాత మధ్యాహ్నం కూరగాయలతో చేసి సూప్‌ని తీసుకుంటారట. ఇక భోజనంలో చికెన్ బ్రెస్ట్, బ్రౌన్ రైస్, గ్రీన్ వెజిటేబుల్ కర్రీ తీసుకుంటారట. సాయంత్రం స్నాక్స్ కోసం గ్రిల్డ్ ఫిష్, చిలగడదుంప, గ్రిల్డ్ వెజిటేబుల్స్‌ను ఇష్టపడతారని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనంలో 'లార్జ్ మిక్స్డ్ గ్రీన్ సలాడ్', కొన్ని అవకాడోలను తీసుకుంటారని తెలిపారు ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్.వారంలో చేసే వర్కౌట్లు:సోమవారం: బైసెప్స్ (తప్పనిసరి)మంగళవారం: క్వాడ్స్బుధవారం: క్లేవ్స్ అండ్ అబ్స్గురువారం: ఛాతీ ట్రైసెప్స్శుక్రవారం: బ్యాక్ వర్కౌట్లుశనివారం: హామ్ స్ట్రింగ్ అండ్ ఇన్నర్ థై అబ్స్ఆదివారం: ఫుల్ రెస్ట్ View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) (చదవండి: బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి) -
బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి
ఇటీవల ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది అంటూ తెగ నెట్టింట ఫిట్నెస్ మంత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. పాపం కొందరు ఫాలో అయ్యి వర్కౌట్ అవ్వాక ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు మరిన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజగా ఓ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ తన విభిన్నమైన వెల్నెస్ రోటీన్ని నెట్టింట షేర్ చేశాడు. అది చూసి నెటిజన్లు బాబోయ్ మరీ ఇంత మంచి అలవాట్లా..అని విస్తుపోతున్నారు. నో ఛాన్స్ అదంతా వర్కౌట్ అయ్యే అవకాశం లేదని కామెంట్లు కూడా చేస్తున్నారు. మరీ అంత విచ్రితంగా అనిపించినా.. అతడి వెల్నెస్ రొటీన్ ఏంటో చూద్దామా..!.29 ఏళ్ల ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆష్టన్ హాల్తన తీవ్రైమన ఆరోగ్య స్ప్రుహ కారణంగా నెట్టింట వైరల్‌గా మారాడు. అతడి ఫిట్నెస్ మంత్ర చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అతడి స్ట్రిట్ ఫిట్నెస్ రొటీన్ ఎలా ఉంటుందంటే..అత్యంత క్రమశిక్షణాయుతమైన జీవనశైలి అతడిది. హాల్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ఉదయం 3:52 ప్రారంభమైమార్నింగ్ 9.30 గంటలకు ముగుస్తుంది. హాల్ నిద్రపోయేటప్పుడు తన నోటికి మౌత్ట్యాప్ వేసుకుంటాడు. ఇది గురకను నివారస్తుందనేది అతడి నమ్మకం. ఆ తర్వాత 7.30 నుంచి 8.30 గంటల వరకు స్విమ్మింగ్ పూల్‌లో గడిని తదనంతరం బ్రేక్‌ఫాస్ట్‌గా అరటిపళ్లు తీసుకుంటాడు.ఆ తర్వాత అదే అరటిపండు తొక్కలను ముఖానికి రుద్దుకుంటాడు. ఆ తర్వాతమ బ్రాండెడ్ మినరల్ వాటర్, గిలకొట్టన పచ్చిగుడ్లు, అవకాడో టోస్ట్ వంటివి అతడి ఆహారాలు. ఈ వెరైటీ దినచర్యకు గానూ హాల్ నెట్టింట వైరల్‌గా మారాడు. ఇది సాధ్యమయ్యేది కాదనేది నెటిజన్ల వాదన. అంతేగాదు సోషల్ మీడియాలో బ్రో బిజీ లైప్ ఇవన్నీ కష్టం అని కామెంట్ చేస్తూ పోస్టుల పెడుతున్నారుహాల్ అనుసరించే కొన్ని మంచి వెల్నెస్ ట్రెండ్లు..మౌత్ ట్యాపింగ్మౌత్ ట్యాపింగ్ అనేది రాత్రిపూట నోటిని మూసి ఉంచడానికి ఉపయోగించే ప్రత్యేక టేప్. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రసిద్ధ వెల్నెస్ ట్రెండ్ ముక్కు ద్వారా శ్వాస తీసుకునేలా చేస్తుంది. అలాగే పీల్చే గాలి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా అలర్జీ కారకాలు, శిధిలాలు లేదా విషపదార్థాలు ఊపిరితిత్తులకు చేరక మునుపే ఫిల్టర్ అవుతాయి. అంతేగాదు తేలికపాటి స్లీప్ అప్నియా ఉంటే మౌత్ ట్యాపింగ్ హెల్ప్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖాన్ని ఐస్ వాటర్‌లో ముంచడం..చల్లటి నీటిలో ముఖాన్ని ముంచడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడి హర్మోన్ స్థాయిని తగ్గిస్తుందట. నాడీ వ్యవస్థపై ప్రశాంతత ప్రభావాన్ని చూపుతుంది. చల్లటి నీరు రక్త నాళాలను ఇరుకుగా చేయడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. చర్మ కణాలకు ఆక్సిజన్ పోషకాలను అందిస్తుంది. ప్రకాశవంతమైన రంగుని అందించడంలో హెల్ప్ అవుతుందట. అంతేగాదు ఈ మంచులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయట. ఇవి మొటిమల రంధ్రాల పరిమాణాన్ని తగ్గిస్తాయట. అదే సమయంలో వాపు వంటివి దరిచేరనీయదు అని చెబుతున్నారు నిపుణులు.చర్మంపై అరటి తొక్క ప్రభావంఅరటిపండ్లు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియంల శక్తివంతమైన వనరు. మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి. చర్మంపై అరటి తొక్కను రుద్దడం వల్ల మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మాని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముడతలు తగ్గుతాయి. గీతలు లేకుండా చేస్తుంది. అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తుందని చెబుతున్నారు చర్మ నిపుణులుమార్నింగ్ వ్యాయామంఉదయం వ్యాయామం ప్రత్యేకమైన జీవక్రియ ప్రభావాలను కలిగి ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, వ్యాయామం చేసే సమయంలో శరీరం జీవక్రియ ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది. ఉదయం వ్యాయామాలు కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా గ్లూకోజ్ టాలరెన్స్‌ను మెరుగుపరిచి అలసటను తగ్గిస్తుంది. అంతేగాదు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది కూడా. అలాగే బాడీని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మంచి నిద్రను, మెరుగైన ఏకాగ్రత అందిస్తుంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: చిరాకుగా ఉన్నా..చిద్విలాసంగా ఉన్నా..చిరుతిండికే ఓటు..!) -
‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..
మన దేశానికి నానా సమస్యల శిరోభారాలు ఉన్నాయి. జనాల్లో పెరుగుతున్న దేహభారం దేశానికి అదనపు శిరోభారంగా మారింది. ఐదేళ్ల పిల్లలు మొదలుకొని ముప్పయ్యేళ్ల లోపు యువత వరకు స్థూలకాయులుగా తయారవుతున్నారు. చిన్న వయసు వారిలో పెరుగుతున్న దేహపరిమాణం ఇటీవలి కాలంలో జాతీయ సమస్యగా పరిణమించింది. ఈ సమస్యను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి, ‘స్థూలకాయంపై పోరాటం’ ప్రకటించాల్సిన పరిస్థితి వాటిల్లింది. స్థూలకాయం సమస్య ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంటుండటంతో కేంద్ర ప్రభుత్వం ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ పేరుతో జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగాలకు చెందిన పదిమంది ప్రముఖులను ప్రచారకర్తలుగా ఎంపిక చేశారు.అధిక బరువు స్థూలకాయంశరీరం ఉండవలసిన దానికంటే అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్నట్లు తెలుసుకోవడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ను (బీఎంఐ) ప్రమాణంగా పరిగణిస్తారు. ఎత్తు, బరువుల నిష్పత్తి ఆధారంగా దీనిని లెక్కిస్తారు. బీఎంఐ 18.5 కంటే తక్కువ ఉన్నట్లయితే, తక్కువ బరువుతో ఉన్నట్లు లెక్క. 18.5–25 ఉంటే ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నట్లు, 25–29.9 ఉన్నట్లయితే, అధిక బరువుతో ఉన్నట్లు లెక్క. బీఎంఐ 30–34.9 ఉంటే, స్థూలకాయంతో ఉన్నట్లు, బీఎంఐ 35 కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. స్థూలకాయం ఒకప్పుడు నడివయసులో ఉన్నవారిలో కనిపించేది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా స్థూలకాయం బారినపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి అవకాశంలేని చదువులు, ఉద్యోగాల్లో మితిమీరుతున్న ఒత్తిడి వంటివి చిన్న వయసు వారిలో స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. స్థూలకాయం నానా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయం మితిమీరినప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. దేశ జనాభాలో ప్రస్తుతం దాదాపు 5 శాతం మంది ప్రాణాంతక స్థాయిలోని స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుత శతాబ్ది ప్రారంభం నుంచి మన దేశంలో స్థూలకాయం సమస్య తీవ్రత ఎక్కువవుతూ వస్తోంది. ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా–2023–24’ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే సగానికి పైగా జనాభా వ్యాధులకు లోనవుతున్నారు. దేశ ఆరోగ్యరంగంపై ఏర్పడే ఆర్థిక భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వాటిల్లుతోంది. ఒకప్పుడు మన దేశంలో స్థూలకాయులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం సమస్య ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లోని 70 శాతం పట్టణ జనాభా అధిక బరువుతోను, స్థూలకాయంతోను బాధపడుతున్నారు. ‘లాన్సెట్’ అధ్యయనం ప్రకారం దేశంలోని 3 కోట్ల మంది పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో 6.2 కోట్ల మందిలో స్థూలకాయం లక్షణాలైన అధిక బరువు, శరీరంలో అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. స్థూలకాయం సమస్య దేశంలో నానాటికీ పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని మొహాలీకి చెందిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అమిత్ గర్గ్ చెబుతున్నారు.అధిక బరువుకు, స్థూలకాయానికి కారణాలు దాదాపు ఒకటే! ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే, తొలి దశలోనే జాగ్రత్తలు ప్రారంభించినట్లయితే, స్థూలకాయాన్ని నిరోధించడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితికి ముఖ్య కారణాలు:శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడంఅనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీర్ఘకాలం తగినంత నిద్ర లేకపోవడంమితిమీరిన ఒత్తిడఇతరేతర ఆరోగ్య సమస్యలుజన్యు కారణాలుకొన్ని ఔషధాల దుష్ప్రభావంచికిత్స పద్ధతులుఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంఆహారంలో అనవసర కేలరీలను తగ్గించుకోవడంఅధిక బరువు ఉన్నట్లయితే, వెంటనే వ్యాయామం ప్రారంభించడంస్థూలకాయం అదుపు తప్పితే, శస్త్రచికిత్స చేయించుకోవడంస్థూలకాయం ఒకప్పుడు నడివయసులో ఉన్నవారిలో కనిపించేది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా స్థూలకాయం బారినపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి అవకాశంలేని చదువులు, ఉద్యోగాల్లో మితిమీరుతున్న ఒత్తిడి వంటివి చిన్న వయసు వారిలో స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. స్థూలకాయం నానా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయం మితిమీరినప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. దేశ జనాభాలో ప్రస్తుతం దాదాపు 5 శాతం మంది ప్రాణాంతక స్థాయిలోని స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుత శతాబ్ది ప్రారంభం నుంచి మన దేశంలో స్థూలకాయం సమస్య తీవ్రత ఎక్కువవుతూ వస్తోంది. ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా–2023–24’ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే సగానికి పైగా జనాభా వ్యాధులకు లోనవుతున్నారు. దేశ ఆరోగ్యరంగంపై ఏర్పడే ఆర్థిక భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వాటిల్లుతోంది. ఒకప్పుడు మన దేశంలో స్థూలకాయులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం సమస్య ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లోని 70 శాతం పట్టణ జనాభా అధిక బరువుతోను, స్థూలకాయంతోను బాధపడుతున్నారు. ‘లాన్సెట్’ అధ్యయనం ప్రకారం దేశంలోని 3 కోట్ల మంది పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో 6.2 కోట్ల మందిలో స్థూలకాయం లక్షణాలైన అధిక బరువు, శరీరంలో అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. స్థూలకాయం సమస్య దేశంలో నానాటికీ పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని మొహాలీకి చెందిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అమిత్ గర్గ్ చెబుతున్నారు.మన దేశంలో స్థూలకాయం తీవ్రతమన దేశంలో గడచిన పదేళ్లలో స్థూలకాయుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం మన దేశంలో స్థూలకాయుల సంఖ్య 10 కోట్లకు పైబడింది. మహిళల్లో 40 శాతం, పురుషుల్లో 12 శాతం మంది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల స్థూలకాయులుగా మారారు. సాధారణ స్థూలకాయం కంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే స్థూలకాయం మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని 5–14 ఏళ్ల లోపు చిన్నారుల్లో 1.44 కోట్ల మంది స్థూలకాయులుగా ఉన్నారు. ‘కోవిడ్–19’ తర్వాత దేశంలో స్థూలకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చిన్నారుల్లో స్థూలకాయం దేశ ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. విద్యా విధానంలో మార్పులు; సామాజిక, ఆర్థిక కారణాలు; టీవీలు, స్మార్ట్ఫోన్లకు అలవాటు పడటం వల్ల నిద్ర సమయం తగ్గడం; ఇదివరకటి పిల్లలతో పోల్చుకుంటే ఇప్పటి పిల్లల్లో వ్యాయామం లోపించడం; చాలా పాఠశాలలకు అనుబంధంగా పిల్లలు ఆడుకోవడానికి తగిన మైదానాలు లేకపోవడం; చదువుల్లో ఒత్తిడి పెరగడం; అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు; పాఠశాలల పరిసరాల్లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు వంటివి ఉండటం తదితర కారణాలు పిల్లల్లో స్థూలకాయానికి దోహదపడుతున్నాయి. స్థూలకాయం, దాని వల్ల కలిగే ఇతర ఆరోగ్య సమస్యల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ.3.11 లక్షల కోట్ల మేరకు భారం పడుతోంది.పొట్టు చుట్టూ కొవ్వు ప్రమాదకరంపొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏర్పడే స్థూలకాయాన్ని ‘సెంట్రల్ ఒబేసిటీ’ అంటారు. ఒళ్లంతా విస్తరించి ఉండే స్థూలకాయం కంటే ఈ పరిస్థితి మరింత ఎక్కువ ప్రమాదకరం. పొట్ట కండరాల లోపలి వైపు మాత్రమే కాకుండా జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ‘సెంట్రల్ ఒబేసిటీ’ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల టైప్–2 డయాబెటిస్, హై బ్లడ్‌ప్రెషర్, రక్తంలో కొవ్వు పెరగడం వల్ల హైపర్ లిపిడీమియా వంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణ స్థూలకాయులతో పోల్చుకుంటే, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారిలో ఈ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొవ్వులను తగ్గించుకోవడం, తగిన వ్యాయామం చేయడం ద్వారా స్థూలకాయాన్ని జయించవచ్చు.ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే..అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, టీవీలు, స్మార్ట్ఫోన్లకు అలవాటు పడి నిద్రకు దూరం కావడం వంటి కారణాలు పిల్లల్లో స్థూలకాయానికి దారితీస్తున్నాయి. ఆహారపు అలవాట్లను ఆరోగ్యంగా మార్చుకుంటేనే పిల్లల్లో స్థూలకాయాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో చాలామంది వేళకు తగిన పోషకాహారం తీసుకోలేకపోతున్నారు. ఉదయం ఫలహారం చేసి బడికి వెళ్లే పిల్లలు మధ్యాహ్నం సరిగా భోజనం చేయలేకపోతున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ ఎక్కువ మోతాదులో తింటున్నారు. ఎక్కువ వ్యవధి లేకుండానే రాత్రి భోజనం చేస్తున్నారు. ఎక్కువగా జంక్‌ఫుడ్‌కు అలవాటుపడుతున్నారు. పిల్లలు వేళకు సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతో పాటు వ్యాయామం కలిగించే ఆటలు ఆడేలా తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే, స్థూలకాయం బారిన, దానివల్ల కలిగే ఇతర వ్యాధుల బారిన పడకుండా వారిని కాపాడుకోవచ్చు. పిల్లల్లో స్థూలకాయం లక్షణాలుకొందరు పిల్లలు మిగిలిన పిల్లల కంటే కాస్త ఎక్కువ బరువు ఉండవచ్చు. అంతమాత్రాన వారిని స్థూలకాయులుగా పరిగణించలేమని నిపుణులు చెబుతున్నారు. ఎముకల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల కొందరు పిల్లలు కాస్త ఎక్కువ బరువుతో ఉంటారని అంటున్నారు. బీఎంఐ పద్ధతి ద్వారా పిల్లలు అధిక బరువుతో ఉన్నారా, స్థూలకాయులుగా ఉన్నారా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. స్థూలకాయులైన పిల్లల్లో కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు కనిపించవచ్చని, వాటిని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు.ఇవీ లక్షణాలుఒక పట్టాన తగ్గని తలనొప్పిఅధిక రక్తపోటువిపరీతమైన దాహంతరచు మూత్రవిసర్జన చేయడంఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు నిద్రలో శ్వాసక్రియ కష్టంగా మారడంవయసుకు తగిన ఎదుగుదల లేకపోవడంపిల్లల్లో స్థూలకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు మరికొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. స్థూలకాయులైన పిల్లలు టైప్–2 డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కీళ్లనొప్పులు, శ్వాస సమస్యలు, శరీరంలోని జీవక్రియ మందగించడం, లివర్ జబ్బులు, హార్మోన్ల అసమతుల్యతలు వంటి సమస్యలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థూలకాయులైన పిల్లలకు బడిలో మిగిలిన పిల్లల నుంచి వెక్కిరింతలు ఎదురవుతుంటాయి. వాటి కారణంగా వారు ఆందోళన, మానసిక కుంగుబాటు, చురుకుదనం లోపించడం, తిండి తినడంలో నియంత్రణ కోల్పోవడం వంటి మానసిక సమస్యల బారినపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. (చదవండి: ఆరోగ్యానికి మంచిదని తినేయ్యొద్దు..! కొంచెం చూసి తిందామా..)స్థూలకాయం వల్ల పిల్లల్లో అనర్థాలుపిల్లల్లో స్థూలకాయం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల పిల్లల్లో స్థూలకాయం కలుగుతుంది. దీనివల్ల టైప్–2 డయాబెటిస్, హైబీపీ, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. పిల్లలు బరువు పెరిగే కొద్ది వారి ఎముకలపై భారం, ఒత్తిడి పెరిగి, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలు తలెత్తుతాయి. స్థూలకాయం వల్ల పిల్లలు ఆత్మన్యూనతకు లోనై రకరకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. పరీక్షల్లో రాణించలేకపోతారు. స్థూలకాయం వల్ల ఆడపిల్లల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని త్వరగా రుతుక్రమం మొదలవడం వంటి సమస్యలు వస్తాయి.డాక్టర్ శివనారాయణ రెడ్డి, పిల్లల వైద్యనిపుణుడుస్థూలకాయంపై పోరాటందేశంలో స్థూలకాయం సమస్య ఆందోళనకరమైన స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ పేరుతో స్థూలకాయంపై పోరాటాన్ని ప్రకటించింది. దీని కోసం ‘స్వస్థ భారత్, సుదృఢ భారత్: స్థూలకాయంపై ఉమ్మడి పోరాటం’ అనే థీమ్‌ను ఎంచుకుంది. స్థూలకాయంపై పోరాటం కార్యక్రమానికి ప్రచారకర్తలుగా ప్రధాని నరేంద్ర మోదీ పదిమంది ప్రముఖులను ఎంపిక చేశారు. ఆయన ఎంపిక చేసిన వారిలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, భోజ్‌పురి నటుడు దినేశ్‌లాల్ యాదవ్, ఒలింపిక్స్ విజేత, షూటర్ మను భాకర్, వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ సాయిఖోమ్ మీరాబాయి చానూ, మలయాళ నటుడు, ఎంపీ మోహన్‌లాల్, తమిళ నటుడు మాధవన్, గాయని శ్రేయా ఘోషాల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. వీరు ఒక్కొక్కరు తమకు నచ్చిన మరికొందరు సెలబ్రిటీలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయవచ్చు. ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతి ఇంట్లోనూ వంటనూనె వినియోగాన్ని కనీసం పదిశాతం తగ్గించుకున్నట్లయితే, దీని వల్ల ప్రజల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని అన్నారు. అధిక బరువు, స్థూలకాయం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, స్థూలకాయంపై పోరాటంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. (చదవండి: మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..) -
74 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉండటానికి కారణం అదే..!: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా అనూహ్యంగా ఉంటాయో.. అలాగే అత్యంత విభిన్నంగా ఉండే ఆయన వ్యవహారతీరు ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అయితే మోదీ ఏడుపదుల వయసులోనూ అంతే ఫిట్‌గా, చలాకీగా ఉంటారు. ఎక్కడ అలసటను దరిచేరనీయరు. ఏ కార్యక్రమంలోనైన ముఖంపై రచిరునవ్వు, ఉత్సాహం చెరగనివ్వరు. మోదీ ఈ ఏజ్‌లో కూడా యువకుల మాదిరి నూతనోత్సహాంతో పనులు చక్కబెట్టుకుంటారు. అలా చలాకీగా ఉండేందుకు తాను పాటించే ఆ దినచర్యేనంటూ తన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.24 గంటల్లో ఒక్కసారే భోజనం..అమెరికాకు చెందిన పాడ్‌కాస్టర్ ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన సంభాషణలో మోదీ తన ఉపవాస షెడ్యూల్ గురించి, జీవనశైలి గురించి వివరించారు. జూన్ మధ్యలో ప్రారంభమైన దీపావళి నుంచి 4 నెలలు పాటు భారత వైదిక ఆచారమైన చాతుర్మాస్ దీక్షను అవలంభిస్తారట. ఆ రోజుల్లో 24 గంటల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఏమైనా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు మోదీ. సరిగ్గా అది వర్షాకాలం ఆ టైంలో మనిషి జీర్ణక్రియ ఎలా మందగిస్తుందో వివరించారు. అంతేకాదు తాను పాటించే నవరాత్రి ఉపవాస దీక్ష గురించి కూడా మాట్లాడారు. ఆ సమయంలో మోదీ పూర్తిగా ఆహారం తీసుకోకుండా తొమ్మిది రోజులు కేవలం వేడినీరు మాత్రమే తీసుకుంటానని అన్నారు. అయితే వేడినీరు ఎల్లప్పుడూ తన దినచర్యలో ఒక భాగమేనని చెప్పారు. అది తనకు ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. అలాగే మోదీ మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రి ఉపవాసాన్ని కూడా అనుసరిస్తానన్నారు. అంతేగాదు తన దృష్టిలో ఉపవాసం అనేది ఒక రకమైన స్వీయ-క్రమశిక్షణగా పేర్కొన్నారు. ఇది భక్తితో కూడిన దినచర్య. నెమ్మదించేలా చేయదు. మరింత చురుకుగా ఉండేలా చేస్తుంది. ఉపవాసం శక్తి..ఉపవాసం శరీరాన్ని బలహీనపరస్తుందనే సాధారణ నమ్మకాన్ని సవాలు చేస్తూ..మనస్సు, ఆత్మ రెండింటిని రీచార్జ్ చేసుకునే ఓ గొప్ప మార్గంగా అభివర్ణించారు. ఆ టైంలో వాసన, స్పర్శ, రుచి వంటి జ్ఞానేంద్రియాలు సున్నితంగా మారడాన్ని గమనించొచ్చన్నారు. ఉపవాసం అంటే భోజనం దాటవేయడం మాత్రమే కాదు. శరీరాన్ని తిరిగి సమతుల్యం చేసుకోవడం, సంకల్ప శక్తిని బలోపేతం చేయడం, అంతర్గత సామరస్యాన్ని సాధించడం అని ఆయన వివరించారు. (చదవండి: Coconut Water Vs Sugarcane Juice: భగభగమండే ఈ ఎండలకు ఏ పానీయం మేలు అంటే..?) -
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్: బాడీలో ఇన్ని మార్పులా..?
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ ఇటీవల బాగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే త్వరితగతిన బరువు తగ్గిపోతుండటంతో చాలామంది దాన్నే ఫాలో అవుతున్నారు. కొందరు తమ ట్రైనర్స్ ఆధ్వర్యంలో చేస్తుంటే మరికొందరూ అనాలోచితంగా ఫాలో అయ్యి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. అయితే ఓ న్యూట్రిషన్ ఈ డైట్‌ని ఫాలో అయ్యి తన అనుభవాన్ని పంచుకున్నారు. అందరూ చెబుతున్నట్లు బరువు తగ్గినా..బాడీలో ఎంత సడెన్ ఛేంజ్‌లు వస్తాయో తెలిపారు. స్లిమ్‌గా మారడం ఎలా ఉన్నా..లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అవేంటంటే..పొట్ట వద్ద ఉన్న ఫ్యాట్‌ని తగ్గించాడానికి తాను ఏడు రోజులు జీరో కార్బోహైడ్రేట్స్ డైట్‌ని తీసుకున్నట్లు తెలిపారు ప్రముఖ న్యూట్రిషన్ కోచ్ జస్టిన్ గిచాబా. అయితే ఏడు రోజుల్లో తన శరీరంలో పలు మార్పులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. బాడీ తేలికగా మారుతుంది. అయితే మిగతా పనులేవి చురుకుగా చేయలేకపోతున్న ఫీల్ కలిగిందని చెప్పారు. వర్కౌట్ చేస్తుంటే శక్తి సన్నగిల్లినట్లు అనిపించిందట. ఇదివరకటిలా ఏ బరువులు అంతగా ఎంతలేకపోయానని అన్నారు. బాడీలో ఫ్యాట్ తగ్గింది కానీ అనుహ్యంగా దాంతోపాటు బాడీలో ఉండే ఎనర్జీ కూడా తగ్గిపోయిందన్నారు. అలాగే మానసికంగా కూడా చాలా మార్పులు చూశానన్నారు. చివరికి తనకి ఇది ఆరోగ్యకరమైనది కాదని క్లియర్‌గా అర్థమైందన్నారు.జీరో కార్బోహైడ్రేట్స్ వల్ల సంభవించే మార్పులు..ఈ డైట్‌ని వరసగా ఏడురోజులు అనుసరించినప్పుడు సంభవించిన మార్పులను సవివరంగా ఇలా వివరించారు. గ్లైకోజెన్ క్షీణత: ఈ డైట్ ప్రారంభించిన మొదటి 24 నుంచి 48 గంటల్లో, శరీరం కండరాలు, కాలేయంలో నిల్వ చేయబడిన చక్కెర రూపంలో ఉన్న గ్లైకోజెన్‌ను ఉపయోగిస్తుంది. ప్రతి 1 గ్రా గ్లూకోజ్‌తో శరీరం 3 గ్రా నీటిని కలిగి ఉంటుంది కాబట్టి ుముందుగా శరీరం నీటి బరువును కోల్పోతుంది. కీటోసిస్ ప్రారంభమవుతుంది: గ్లైకోజెన్ నిల్వలు క్షీణించిన తర్వాత, శరీరం ప్రత్యామ్నాయ శక్తి వనరుగా కీటోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అంటే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు ఖర్చవ్వడం మొదలవుతుందన్నారు. View this post on Instagram A post shared by Justin Gichaba | Nutrition Coach (@justin_gichaba) శక్తి, మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు: చురుకుదనం కోల్పోయి, తలనొప్పి, అలసట వంటివి దరిచేరుతాయి. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా నిద్రలేమి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్పారు. ఆకలి తగ్గిపోవడం: కీటోన్లు తరచుగా ఆకలిని అణిచివేస్తాయి. ఈ డైట్లో కొంతమంది సహజంగానే కొన్ని రోజుల తర్వాత తక్కువ తింటారని అన్నారు. జీర్ణ మార్పులు: కార్బ్ మూలాల నుంచి ఫైబర్ లేకపోవడం మలబద్ధకం వచ్చి.. గట్ మైక్రోబయోటాకు దారితీయవచ్చు.ఇన్సులిన్ స్థాయిలు: పిండి పదార్థాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి లేదా ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఒకరకంగా ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడవచ్చునని అన్నారు. ఎలా తీసుకుంటే బెటర్..జీరో కార్బో హైడ్రేట్లు బదులు తక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడండి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువుగా ఉండేలా చూసుకుంటే చాలని చెప్పారు. ఫైబర్‌తో కూడిన కార్మోహైడ్రేట్లు ఎప్పటికీ ఆరోగ్యదాయకమైనవే అని అన్నారు. మన శరీరం ధర్మానికి అనుగుణంగా అన్ని సమతుల్యంగా తీసుకోవాలని సూచించారు. చివరగా కార్బోహైడ్రేట్లు తీసుకోకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉండే, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఎనర్జీని కోల్పోయే ప్రమాదం ఉండదు. పైగా దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని నమ్మకంగా చెప్పారు. అంతేగాదు సమతుల్య ఆహారం అనేది అన్ని విధాల ఆరోగ్యానికి మేలని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.(చదవండి: మహిళా వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?) -
నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రీ ఫిట్నెస్ సీక్రెట్ వెపన్ ఇదే!
అందాల హీరోయిన్ త్రిప్తి దిమ్రి(Triptii Dimri) కేవలం బ్యూటీకే కాదు. ఫిట్‌నెస్‌కు కూడా చాలా ప్రాముఖ్యతనిస్తుంది. అద్భుతమైన నటనతో పాటు, టోన్డ్ ఫిగర్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. తాజా తన ఫిట్నెస్ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇది ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ మూవీతో ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రీ తన మంచి ఆహార ప్రియురాలు. అలాగే యోగా, ధ్యానం,జిమ్ వర్కౌట్స్‌ను అంతే శ్రద్ధగా ఆచరిస్తుంది. తాజాగా ఫిట్నెస్ ఫార్ములా గురించి ఇన్‌స్టా స్టోరీలో వివరించింది. స్వెట్ ఫస్ట్.. స్వీట్స్...స్వీట్స్ లేటర్ (Sweat Now...Sweets Later)అంటూ ఫోటోను షేర్ చేసింది. వింక్ ఎమోజీతో జిమ్ మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేసింది. హోలీ పండుగ సీజన్లో అదనపు కేలరీలన్నింటినీ కోల్పోవడానికి ఆమె తన జిమ్ వర్కౌట్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల త్రిప్తి దిమ్రీ నాసిక్‌లోని త్రయంబకేశ్వరాలయాన్ని సందర్శించింది. అక్కడ ప్రత్యేకపూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కూడా. ఫిట్‌గా ఉండేందుకు మూడు టిప్స్ స్క్వాట్ జంప్ : స్క్వాట్ జంప్‌లు లేదా జంపింగ్ స్క్వాట్లు. ఇవి ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో చాలా బాగా ఉపయోగ పడతాయి. జంప్ స్క్వాట్స్ లేదా జంపింగ్ స్క్వాట్స్ అని కూడా అంటారు. ప్రతి ఫిట్నెస్ క్లాస్‌లో ఏదో ఒక రకమైన స్క్వాట్ ఉంటుంది.దీని వల్ల కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి. ఒకేసారి బహుళ కండరాలనుబలోపేతం చేసేందుకు ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా కాళ్లు, పిరుదులు . కోర్ కండరాలు బలోపేతమవుతాయి. బర్పీ: స్ట్రెంథ్ ట్రైనింగ్‌లో ఒకటిగా చెప్పుకునే బర్పీస్ , ఫుల్ బాడీ వర్కౌట్ అని చెప్పొచ్చు. వీని వల్ల మజిల్ స్ట్రెంథ్ పెరుగుతుంది. కేలరీలు కరుగుతాయి, చాలా బరువు తగ్గుతారు.బెల్లీ ఫ్యాట్, హిప్, థై ఫ్యాట్ తగ్గి టోన్డ్ బాడీ వస్తుంది. స్కిప్పింగ్: స్కిప్పింగ్ అనేది సరళమైన, ఈజీ ఎక్సర్ సైజులలో ఒకటి. 10 నిమిషాలు లేదా దాదాపు 120 రౌండ్ల స్కిప్పింగ్ వల్ల 650 నుండి 1000 కేలరీలు ఖర్చవుతాయి. కేలరీలు బర్న్ అవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు టోన్ అవుతాయి. జీవక్రియ పెరుగుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది. -
వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..
మగవాళ్లకు కుదిరినట్లుగా మహిళలకు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడం సాధ్యం కాదనేది చాలామంది వర్కింగ్ మహిళల వాదన. ఎందుకంటే, పొద్దున లేచినప్పటి నుంచి పిల్లలు, కుటుంబ బాధ్యతలే సరిపోతాయి. ఇంకెక్కడ టైం ఉంటుంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి..?. అలాంటి బిజీ వర్కింగ్ విమెన్స్ ఫిట్నెస్ కోచ్ అకన్నీ సలాకో సింపుల్ టిప్స్ ఫాలోఅయ్యి, ఈజీగా బరువు తగ్గండి. మరి ఇంకెందుకు ఆలస్యం హెల్ప్ అయ్యే ఆ చిట్కాలేంటో చూసేద్దామా..!.అత్యంత బిజీగా ఉండే మహిళలు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేలా ప్లాన్ చేసుకోవాలో వెయిట్ లాస్ కోచ్ డాక్టర్ అకన్నీ సలాకో ఇన్‌స్టా వేదికగా వీడియోలో వెల్లడించారు. పనులు వేగవంతంగా చేయాలన్న ధ్యాసలో ఆకలి ఆటోమేటిగ్గా ఎక్కువ అవుతుంది. దాంతో తెలియకుండానే స్వీట్స్, జంక్ఫుడ్స్ స్పీడ్‌గా లాగించేస్తుంటారని చెబుతున్నాడు అకన్నీ. అందుకే వ్యాయమాలు చేయడం కష్టం అనుకున్న మహిళలు వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ దరిచేరనీయకూడదు. సౌకర్యమంతమైన ఆరోగ్యదాయకమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వమని సూచించారు. పోనీ ఇది కష్టం అనుకుంటే ఓ రెండు రోజులు స్వీట్లు ముట్టనని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వండిచాలు అంటున్నారు అకన్నీ. దీంతోపాటు ఏదోలా చిన్నపాటి వ్యాయామాలు చేసుకునేలా ప్లాన్ చేయాలి. ఇక్కడ ఉద్యోగం, పిల్లలు కుటుంబం తోపాటు ఆరోగ్యం కూడా ప్రధానమే అన్న విషయం గుర్తించండి. ముందు మీరు బాగుంటేనే కదా ఈ పనులన్నీ సవ్యంగా పూర్తి చేయగలరు. కాబట్టి ఎలాగైన చిన్న చిన్న వ్యాయామాలు చేద్దాం. పోనీ అలా కాదు నో ఛాన్స్ అంటే.. వారంలో రెండు లేదా మూడు రోజులు కనీసం 30 నిమిషాలు వ్యాయామాలకి కేటాయించండి చాలు. అప్పుడు ఆటోమేటిగ్గా నెమ్మదిగా మనంతట మనమే రోజులు పెంచుకునే ఛాన్స్ ఉంటుందని అన్నారు. భోజనం విషయంలో సమయాపాలన పాటించండి. పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండని చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకి మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్. అలాగే సాయంత్రం 6 గంటకి, మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్లతో పూర్తి చేయండి. స్నాక్స్ జోలికిపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రోటీన్, కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్ వంటి సమతుల్య భోజనానికి ప్రాధాన్యత ఇస్తే ఆకలి నియంత్రణలో ఉంటుంది, అలాగే బరువు పెరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ అకన్నీ. అలాగే ఇది పోషకాహారం, ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చే సమసర్థవంతమైన డైట్‌ప్లాన్ అని అన్నారు ఫిట్నెస్ నిపుడు అకన్నీ.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr. Akanni Salako | Women’s Weight Loss Coach (@dr.salako) (చదవండి: పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..? అధ్యయనంలో అవాక్కయ్యే విషయాలు..) -
మహిళలూ ఒక్క అరగంట మీ కోసం : నీతా అంబానీ సందేశం వైరల్ వీడియో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మహిళల కోసం ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా ఫిట్నెస్ గురించి, ఆమె ష్యాషన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆరు పదుల నిండిన వయసులో కూడా అనేక కార్యక్రమాలతో చాలా చురుగ్గా నిర్మాణాత్మకంగా ఉంటారు ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ మార్చి 8న నీతా అంబానీ మహిళల కోసం ఒక వీడియోను షర్ చేశారు. ఫిట్నెస్ రొటీన్లో క్రమశిక్షణ, అభిరుచిరెండింటినీ మిళితం చేయాలని సూచించారు. అన్ని వయసుల మహిళలు తమ ఆరోగ్యం , శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాయామం మనలో సానుకూల ధోరణిని పెంచుతుంది,మనసుకు ప్రశాతంనిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడిగా మారింది. తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి వ్యాయామం చేస్తారో, తన జీవన శైలి వివరాలను పంచుకున్నారు. అలాగే మహిళలు తమ ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని నీతా అంబానీ సూచించారు. ప్రస్తుతం తన వయసు 61 ఏళ్లని.. ఆరేళ్ల వయస్సునుంచి డ్యాన్స్ ప్రాక్టీస్, వ్యాయాం చేస్తూ ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ దినచర్య గురించి కూడా వివరించారు. రోజూ 30 నిమిషాల పాటూ ఫిట్నెస్ కోసం కేటాయిస్తానని, వాకింగ్, జిమ్, స్విమ్మింగ్ చేస్తానని తెలిపారు. చురుగ్గా ఉండటం చక్కెర, చక్కెర ప్రత్యామ్నాయ పదార్థాలను కూడా తీసుకోనని వెల్లడించారు. రోజుకి 5-7వేల అడుగులు నడవడంతోపాటు శాఖాహారంమాత్రమే తీసుకుంటూ, సరైన మోతాదులో ప్రోటీన్, పోషకాలు ఉండేలా జాగ్రత్తపడతానని చెప్పారు.ముఖ్యంగా అంతేకాదు మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడానికి, దీనికి సంబంధించిన చర్యను ప్రారంభించడానికి సమయం మించిపోలేదని గుర్తు చేశారు. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరమన్నారు. కండరాలు బలహీనపడతాయి. ఎముకల బలం తగ్గుతుంది. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్క అరగంట : నీతా అంబానీ ఫిట్నెస్ మంత్రా వైరల్ వీడియో ‘‘61 ఏళ్లలో నేనుచేయగిలిగనపుడు.. మీరెందు చేయలేరు.. కదలండి! ఒక్క అరగంట మీకోసం కేటాయించుకోండి!!’’ అంటూ నీతా అంబానీ మహిళలకు పిలుపునిచ్చారు. -
61 ఏళ్ల వయసులో నీతా అంబానీ ఫిటెనెస్ సీక్రెట్ ఇదే..
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ(61) ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన రోజువారీ ఫిట్నెస్ షెడ్యూల్‌ను పంచుకున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఈమేరకు ఒక వీడియో విడుదల చేశారు. అదికాస్తా వైరల్ అవుతోంది.వీడియోలో నీతా అంబానీ తెలిపిన వివరాల ప్రకారం..‘రోజూ 5,000 నుంచి 7,000 అడుగులు నడుస్తాను. నేను చురుకుగా ఉండటానికి సరళమైన ప్రభావవంతమైన మార్గం ఇది. దినచర్యలో భాగంగా నిత్యం జిమ్ వ్యాయామాలు, స్విమ్మింగ్, యోగా, ఆక్వా వ్యాయామాలు ఉంటాయి. అదనంగా డ్యాన్స్ చేస్తాను. ఇది నన్ను శారీరకంగా ఫిట్‌గా ఉంచడంతోపాటు మానసిక స్థితికి ఎంతో తోడ్పాటు అందిస్తోంది. ప్రతిరోజూ #StrongHERMovement(ట్విటర్-ఎక్స్‌లో ట్యాగ్)లో చేరి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మరింత దృఢంగా మారి ఎన్నో విజయాలు సాధించాలి’ అన్నారు.‘షుగర్-ఫ్రీ’ లైఫ్స్టైల్నీతా అంబానీ ఫిట్నెస్ జర్నీలో ఆహారం కీలక అంశమని తెలిపారు. ఆర్గానిక్, ప్రకృతి ఆధారిత ఆహార పదార్థాలపై దృష్టి సారించాలని సూచించారు. తాను ఎప్పుడూ శాకాహారం తీసుకుంటానని పేర్కొన్నారు. ఆమె షుగర్(చక్కెర ఉండే పదార్థాలు) అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. సమతుల భోజనం, ప్రోటీన్లు, పోషకాలు సమృద్ధిగా ఉండేలా జాగ్రత్త పడతానని చెప్పారు.ఆరోగ్యానికి 30 నిమిషాలుUnstoppable at 61! This International Women’s Day, Mrs. Nita Ambani shares her inspiring fitness journey and invites women of all ages to prioritize their health and wellbeing. With her dedicated workout routine, she shows us that age is just a number. Join the #StrongHERMovement… pic.twitter.com/CyhfT1zm9r— Reliance Industries Limited (@RIL_Updates) March 8, 2025మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాలపాటు వారి ఆరోగ్యానికి సమయం కేటాయించాలని నీతా అంబానీ సూచించారు. ఫిట్నెస్ అంటే వయసుతో పోరాడటం కాదని, దాన్ని పాజిటివిటీతో స్వీకరించడం అని నొక్కి చెప్పారు. నీతా ఫిట్నెస్ సందేశం అన్ని వయసుల మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. అతివల స్వీయ సంరక్షణ, శ్రేయస్సుకు ఎంతో దోహదం చేస్తుంది. ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండాలనుకునేవారికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. -
బరువు తగ్గాలన్నా, ఫిట్‌గా ఉండాలన్నా ది బెస్ట్ ఫార్ములా!
బరువు తగ్గాలంటే జీవన శైలి మార్పులు చేసుకోవాలి. వాకింగ్, యోగా ఇలాంటి ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి. అంతేకాదు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలన్నా కూడా వాకింగ్‌కు మించింది లేదు. ఈ వాకింగ్‌లో చాలా పద్దతులు న్నాయి. రోజులో కనీసం 5 వేల అడుగులు వేయాలని, 10 వేల అడుగులు నడిచే వారికి ఊబకాయం అనే సమస్య ఉండదని నిపుణులు చెబుతారు. అయితే ఒక పద్ధతిని పాటిస్తే వాకింగ్ బోర్ కొట్టకుండా ఉత్సాహంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకుందామా మరి.ఫిట్‌గా ఉండటానికి నడక కంటే మెరుగైన వ్యాయామం లేదు. రెగ్యులర్ వాకింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నడక వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. గుండెకు బలం చేకూరుతుంది. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు, దృఢంగా మారతాయి. కండరాల శక్తి పెరుగుతుంది. బీపీ, షుగర్ లాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. వీటన్నింటికి మించి ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే, ఈ రోజువారీ నడకలో చిన్న మార్పులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలొస్తాయని నిపుణులు అంటున్నారు. అదే 2:2:1 వాకింగ్ ఫార్ములాచదవండి: ఇంటి గుట్టు :దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!ఏంటీ 2:2:1 వాకింగ్ ఫార్ములా రెండు(2) నిమిషాలు వేగంగా నడవడం (Brisk walking) తరువాతి రెండు(2) నిమిషాలు జాగింగ్ (jogging) చేయడంఆ తరువాత ఒక నిమిషం (1) పాటు సాధారణ నడక(normal walking) అన్నమాట. ఈ సైకిల్‌ను రిపీట్ చేస్తే అటు బరువు తగ్గడంతోపాటు, ఇటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. రోజులో కనీసం అరగంట ఈ పద్ధతినే పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలని చూస్తున్న వారికి గేమ్-ఛేంజర్‌గా భావిస్తారు. ప్రయోజనాలుకేలరీలు తొందరగా,ఎక్కువగా బర్న్ అవుతాయి. 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల 200 కేలరీలు బర్న్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయిజీవక్రియ వేగవంతమవుతుంది.వేగంగా నడవడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఆ తరువాత చేసే జాగింగ్ కొవ్వును వేగంగా కరిగించడానికి సాయపడుతుంది. బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్తాయి పెరుగుతుంది. నెమ్మదిగా నడుస్తున్నప్పుడు జాగింగ్‌తో అలసిన కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. ఈ విధానంలో అలసట రాదు , ఆసక్తికరంగా ఉంటుంది కూడా. నెమ్మదిగా, స్థిరంగా చేసే ఒకే రకమైన వ్యాయామాల కంటే ఇంటర్వెల్-స్టైల్ వ్యాయామాలు కొవ్వును కరిగించ డానికి, సమర్థవంతంగా ఉంటాయని అధ్యయనాల ద్వారా వెల్డైంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే 2:2:1 ఫార్ములా ఉత్తమమంటున్నారు నిపుణులు. -
Sundeep Kishan: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..
స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్.బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పక్కింటి కుర్రాడిలా ఉంటే సందీప్ చాలా స్మార్ట్‌గా మంచి బాడీని మెయింటైన్ చేస్తాడు. అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా తన రూపురేఖలను కూడా మార్చుంటాడు చాలా సులభంగా. మరీ అతడి ఫిటనెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.అందరి హీరోల మాదిరిగా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వడట. తనకస్సలు స్ట్రిక్ట్ డైట్'పై నమ్మకం లేదని తేల్చి చెప్పాడు. దానికంటే ఏడాది పొడవునా మంచిగా తినడమే మంచిదని చెబుతున్నాడు. చాలామంది కఠినమైన డైట్లు ఎంచుకోమని చెబుతారు గానీ, దానిపై తకెందుకనో నమ్మకం రాదని, హయిగా నచ్చిన ఫుడ్ తింటూ వ్యాయామాలు చేసుకోవడమే మేలు. అలాగే అందరీ బాడీకి ఒకేవిధమైన డైట్ సెట్ అవ్వదు. ప్రతి శరీరానికి వివిధ రకాలు ఆహార నియమాలు అవసరమవుతాయిని అన్నాడు సందీప్. కాబట్టి ఎవరికి వారు తమ బాడీకి ఏది సూటవ్వుతుందో పరీక్షించుకుని ఎంచుకోవడమే ఉత్తమం అని సూచిస్తున్నాడు. తీవ్రమైన కఠిన ఆహార నియంత్రణ కంటే ఒత్తిడిని దూరం చేసే మంచి ఉత్తేజకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నొక్కి చెబుతున్నాడు. ఏదైతే ఇష్టంగా తింటారో దాన్నే తీసుకోండి, అయితే అది ఆరోగ్యకరమైనదే అయ్యి ఉండాలన్నది గుర్తించుకోండి అని అంటున్నాడు. తాను మాత్రం వివిధ రకాల ఆహారాలను ఆస్వాదించడం తోపాటు, రోజంతా యాక్టివ్‌గా ఉంచే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తన బాడీకి సరిపోయే వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేస్తానని అన్నాడు సందీప్. కాగా, సందీప్ నటించిన అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 3' షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన 'మజాకా' మూవీ విడుదలైంది. (చదవండి: పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్ పదిసార్లు ఫెయిల్.. అయినా..!) -
మూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!
తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సౌందర్యానికి ప్రతీక చీరకట్టు.. అలాంటి చీరకట్టులోని ఔన్నత్యాన్ని నలుదిశలా చాటిచెప్పేలా నగర నారీమణులు ఉత్సాహంగా శారీ రన్లో పాల్గొన్నారు. అద్భుతమైన చీరకట్టుకు తామే బ్రాండ్ అంబాసిడర్లమనేలా వివిధ రకాల చీరకట్టుతో హాజరయ్యారు. ఆదివారం ఉదయం ట్యాంక్ బండ్ వేదికగా నారీమణులు తెలుగు సంప్రదాయ చీరకట్టుతో పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ మీదుగా శారీ రన్లో పాల్గొని తిరిగి పీపుల్స్ ప్లాజా చేరుకున్నారు. సుప్రసిద్ధ బ్రాండ్ తనైరా, ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ శారీ రన్‌ను తనైరా సీఈఓ అంబుల్ నారాయణ్, జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ప్రారంభించారు. తనైరా శారీ రన్ ఐక్యత, స్ఫూర్తి చిహ్నంగా మహిళలలోని స్త్రీతత్వం, ఫిట్‌నెస్‌కు ప్రేరణగా నిర్వహించినట్లు అంబుల్ నారాయణ్ తెలిపారు. మహిళల ఆరోగ్యం, సమగ్రతను ప్రోత్సహించేందుకు మొదటి ఎడిషన్‌ను 2020లో పూణె, బెంగళూరు, హైదరాబాద్‌లో నిర్వహించామని రెండో ఎడిషన్‌ను మరోసారి హైదరాబాద్‌లో నిర్వహించినట్లు తెలిపారు. చదవండి: ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీచందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఉత్సాహంగా సాగిన శారీ రన్లో మహిళలు అందమైన చీరకట్టుతో హాజరుకాగా.. కొందరు బుల్లెట్లు తోలుతూ, మరికొందరు సైకిళ్లు తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున సాగర తీరంలో శారీ రన్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రన్లో పాల్గొన్న పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సుమారు మూడు వేల మందికిపైగా రన్లో పాల్గొన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. వీరంతా ఫినిషింగ్ పాయింట్లో సెల్పీలు, గ్రూఫ్ ఫొటోలు దిగారు. జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముందు వామ్ అప్ ఫిట్నెస్, జుంబా చేయించారు. -
ఈవినింగ్ వాక్? మార్నింగ్ వాక్? ఎక్కువ ప్రయోజనాలు కావాలంటే?!
ఆధునిక జీవితం కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే శారరీక శ్రమ తగ్గిపోతున్న తరుణంలో అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా జీవించాలంటే విధిగా వాకింగ్ చేయాల్సిన అవవసరం చాలా ఉంది. అయితే వాకింగ్ ఉదయం చేస్తే మంచిదా లేక సాయంత్రం చేస్తే మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అసలు ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఎక్కువ ఫలితాలు లభిస్తాయి ఆలోచిస్తూ ఉంటారు. అసలు సమస్యలు ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, చిన్నా పెద్దా అన్న భేదమేలేదు. ఎవరైనా, ఎపుడైనా ఎంచక్కా వాకింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. దీని వల్ల రాబోయే అనేక ఆరోగ్య సమస్యలు పరారవుతాయి. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు ఉండేందుకు వివిధ రకాల పోషకాలే కాదు శారీరక శ్రమ కూడా అవసరం అనేది ముఖ్యం అని గమనించాలి. మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక పరిస్థితులను నివారించడానికి, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నడక ఒక ముఖ్యమైన వ్యాయామం. ఎపుడు ఎలా చేసినా ఆరోగ్యానికి చాలా మంచిది. వాకింగ్ వల్ల మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరగుతుంది. కండరాలకు,కీళ్లకు బలం చేకూరుతుంది. వివిధ రకాల అధ్యయనాల ప్రకారం మార్నింగ్ వాకింగ్ ప్రయోజనాలు, ఈవెనింగ్ వాక్ ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఉదయం వాకింగ్ ఉదయం వేళ లేత ఎండలో వాకింగ్ లేదా సాయంత్రం చల్లగాలిలోవాకింగ్ రెండూ ప్రత్యేకమే. మార్నింగ్ వాకింగ్ వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ డీ లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు, ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యంగా ఒత్తిడి దూరమౌతుంది. రోజంతా ఎనర్జెటిక్‌గా ఉంటారు. ఉదయం పూట స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. సాయంత్రం పూట వాకింగ్సాయంత్రం వాకింగ్ లాభాలను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఉదయం నుంచి ఉన్న అలసట, పని ఒత్తిడి దూరం కావాలంటే, చికాకు పోవాలన్నా నడక చక్కని పరిష్కారం. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వాకింగ్‌తో ఇన్ని సమస్యలకు చెక్ చెప్పవచ్చుగాలి నాణ్యత, ఉష్ణోగ్రత ,భద్రత దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు ఉదయమా, సాయంత్రమా అనేది నిర్ణయించుకోవాలి. ఉదయపు చలిగాలులు పడని వారు సాయంత్రం వాకింగ్ చేస్తే మంచిది. కాలుష్యానికి దూరంగా ఉండే ప్రశాంతమైన వాతావరణంలో నడక మంచి ఫలితాలనిస్తుంది. అన్ని వయసుల వారికి అనువైన వ్యాయామం. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గుతుంది. ఎండార్ఫిన్లను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇవే కాకుండా రోజూ మీకునచ్చిన సమయంలో వాకింగ్ వల్ల జుట్టు రాలటం, మొటిమలు, చర్మం నల్లబడటం, ఆటో ఇమ్యూన్ సమస్యలు, మలబద్ధకం,తలనొప్పి, దిగులు, ఆందోళన, డిమెన్షియా, పార్కిన్ సన్స్, మతిమరుపు, ఏకాగ్రత లేమి, చికాకు, కోపం, పీసీఓడీ, బహిష్టు సంబంధిత సమస్యలు ఇలాంటి వాటికెన్నింటికో చెక్ చెప్పవచ్చు. -
Visakhapatnam: ఓటమిని అంగీకరించని ఫర్జానా బేగం
ఎన్ని మేఘాలొచ్చినా..ఆకాశం కదలదు..ఎన్ని తుఫానులైనా..సముద్రం నిలిచిపోదు.. ఎదురయ్యే బాధలన్నీ..ఎగసి పడే తరంగాలే..ఆపదల గాలి ఎంత వేగంగా వీచినా, దృఢమైన మనసు చలించదు. కోల్పోయినవేమీ కన్నీటి కథలవ్వవు..ఎలాంటి కష్టాలు ఎదురొచ్చినా ధైర్యం చేతిలో తలవంచక తప్పదు..నీ ధైర్యమే నీ గెలుపు పతాకం..తట్టుకొనే శక్తి ముందు, ఏ గెలుపైనా తక్కువే. వాడిపోయిన పువ్వుల్లా రాలిపోతాయి..కష్టానికి పూచే పూలే నిజమైన..విజయాలై వికసిస్తాయి. అచ్చం ఫర్జానా బేగంలా..క్యాన్సర్ వచ్చిందని ఆమె కుంగిపోలేదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసింది. ఆమె సంకల్పం ముందు క్యాన్సర్ ఓడిపోయింది. ఆనందంగా..ఆరోగ్యకరంగా సాగుతున్న జీవితం. శారీరక వ్యాయామ, పోషకాహార నిపుణురాలిగా అందరికీ సూచనలిచ్చే వ్యక్తి. ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా సాగుతున్న కుటుంబం. ఒక్కసారిగా ఆమె శరీరంలోకి క్యాన్సర్ మహమ్మారి ప్రవేశించింది. భయపడిన ఆమె వైద్యులు చెప్పిన మాట విని అంతలోనే తేరుకుంది. మనోధైర్యాన్ని సడలనివ్వలేదు. క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొంది. వైద్యుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగింది. కాన్సర్ బారిన పడి దానిని అధిగమించి నూతన జీవితాన్ని పొందాలనేవారికి స్ఫూర్తిగా నిలిచారు..నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ ఫర్జానా బేగం.ఆనందంగా సాగుతున్న జీవితంలో.. గృహిణిగా తన కుటుంబాన్ని, సొంత ఫిట్నెస్ సెంటర్‌ను నిర్వహిస్తూ ఆనందంగా సాగుతున్న బేగం జీవితంలో 2017 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. షోల్డర్ పెయిన్‌తో వైద్యుల వద్దకు వెళ్లిన ఆమె ఎంఆర్ఐ లో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ఆ ట్యూమర్ రిబ్స్లోని వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. వైద్యులు సర్జరీ చేశారు. అనంతరం 2019లో తిరిగి తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆమె ఛాతీ పక్కటెముకలు రెండూ ట్యూమర్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులుగుర్తించారు. వైద్యులు బయాప్సీ చేసి క్యాన్సర్‌గా నిర్ధారించారు.కష్టం వచ్చినప్పుడు పోరాడాలి ఇద్దరు కుమార్తెలకు తాను ఒక ఉదాహరణగా నిలవాలని ఫర్జానా నిర్ణయించుకున్నారు. కష్టం వచ్చినపుడు పోరాడాలని, ఎప్పుడూ వెనకడుగు వెయ్యకూడదని భావించి, ఆచరణలో చూపారు. సమస్యలు జీవితంలో నిత్యం వస్తుంటాయని, పోరాటం మానకూడదంటారు ఫర్జానా. నేను గెలవాలి అనే బలమైన ఆకాంక్ష సంపూర్ణ ఆరోగ్యంతో తయారయ్యేలా చేసిందన్నారు. నేడు ఎందరో క్యాన్సర్ బాధితులకు ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయక పాఠం. ఇటీవల ఆమె బాలకృష్ణ నిర్వహించే అన్‌స్టాపబుల్ షోలో కూడా పాల్గొని తన జీవిత ప్రయాణాన్ని, క్యాన్సర్‌ను జయించిన విధానాన్ని ప్రజలతో పంచుకున్నారు.ధైర్యం కోల్పోలేదుతొలుత కాస్త భయపడినా కొద్దిరోజుల్లోనే ఆత్మస్థైర్యంతో ధైర్యంగా చికిత్సకు వెళ్లారు. కిమో థెరపీ తీసుకున్నారు. కిమో థెరపీ పర్యవసనాలు ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలను చవిచూశారు. వాటన్నింటినీ భరిస్తూ, అధిగమిస్తూ పూర్తిస్థాయిలో చికిత్స తీసుకున్నారు. మనసునిండా మనోబలం, దైవంపై నమ్మకంతో చికిత్సకు సానుకూల ఆలోచనలతో వెళ్లారు. అదే సమయంలో తనకు సంబంధించిన ఫిట్నెస్ జిమ్‌లో తన వృత్తిని యథావిధిగా కొనసాగించారు. వారే నా ధైర్యం క్యాన్సర్ వచ్చిందని తెలిసిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తన వద్ద శిక్షణ తీసుకున్న ఫిట్నెస్ ట్రైనర్లు అందించిన మానసిక స్థైర్యం వ్యాధి నుంచి త్వరగా కోలుకొనేలా చేసింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా, మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగడం వలనే త్వరగా కోలుకోవడం సాధ్యపడింది. అదే సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన స్థైర్యం మరవలేనిదని ఆమె చెప్పారు. చికిత్స సమయంలో రోజుకో విధంగా శరీరం స్పందించడం, అనేక సందేహాలు రావడం జరిగేది. వీటిని వైద్యులకు వివరిస్తూ వారి సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగారు. -
బుమ్రా ఫిట్‌గా ఉన్నాడా!
బెంగళూరు: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఆడే అవకాశాలపై సందిగ్ధత వీడనుంది. వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటూ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న బుమ్రా ఫిట్‌నెస్‌పై నేడు స్పష్టత రానుంది. అతనికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం శనివారం బీసీసీఐకి తమ నివేదికను అందజేస్తుంది. ఇందులో బుమ్రా గాయం తీవ్రత, చికిత్సతో పాటు మ్యాచ్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ప్రస్తుతానికి భారత పేసర్ బెంగళూరులోనే ఉండనున్నాడు. నివేదికను అందుకున్న తర్వాత బోర్డు అధికారులు బుమ్రాను ఆడించే విషయంపై భారత టీమ్ మేనేజ్మెంట్తో చర్చించే అవకాశం ఉంది. జనవరిలో సిడ్నీ టెస్టు అనంతరం ఆ్రస్టేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత బుమ్రా గాయానికి స్కానింగ్ తీశారు. వెన్ను నొప్పి కారణంగానే ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌కు దిగలేదు. నాడు ఆ రిపోర్టులను న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ క్రీడా వైద్యుడు డాక్టర్ రోవన్ షూటెన్కు చూపించారు. అతని పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగింది కాబట్టి ఇప్పుడు కూడా రోవన్ అభిప్రాయం కీలకం కానుంది. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు ఈ నెల 12 వరకు గడువు ఉంది. బుమ్రా పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో భారత జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లేదా పేసర్ హర్షిత్ రాణాలలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మార్చి 1న బీసీసీఐ ఎస్జీఎం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్త కార్యదర్శి పదవి కోసం ఆసక్తికర పోటీ సాగుతోంది. బోర్డులో ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు సీనియర్ సభ్యులు ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. అవిషేక్ దాల్మియా (బెంగాల్ సంఘం), రోహన్ జైట్లీ (ఢిల్లీ సంఘం), సంజయ్ నాయక్ (ముంబై సంఘం)లలో ఒకరికి ఈ అవకాశం దక్కనుంది. అయితే కార్యదర్శి, కోశాధికారి ఎంపిక తరహాలోనే ఈ పదవికి కూడా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. నిబంధనల ప్రకారం సంయుక్త కార్యదర్శి ఎంపిక కోసం మార్చి 1న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) నిర్వహించనుంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర సంఘాలకు నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న దేవ్జిత్ సైకియా కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. -
Jasprit Bumrah: ‘విజయావకాశాలు 35% తగ్గుతాయి’
దుబాయ్: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం ఇంకా సందేహంగానే ఉంది. ఆ్రస్టేలియాతో చివరి టెస్టులో వెన్నునొప్పితో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయని బుమ్రా ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అతను ఎంతవరకు కోలుకున్నాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకుంటాడని చెబుతున్నా దానిపైనా సందేహాలు ఉన్నాయి. భారత జట్టుకు సంబంధించి అతని బౌలింగ్ విలువ ఎంత అమూల్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను చాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే టీమిండియా బలహీనంగా మారిపోవచ్చు. మాజీ ఆటగాడు రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. బుమ్రా గైర్హాజరు చాలా ప్రభావం చూపిస్తుందని అతను వ్యాఖ్యానించాడు. ‘బుమ్రా ఫిట్‌గా లేకపోతే భారత జట్టు విజయావకాశాలు చాలా తగ్గిపోతాయి. సరిగ్గా చెప్పాలంటే 30–35 శాతం వరకు గెలుపుపై ప్రభావం పడుతుంది. అతను పూర్తి ఫిట్‌గా ఉండి బరిలోకి దిగితే ఆట స్వరూపమే మారిపోతుంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో అతను కచ్చితంగా చెలరేగి గెలిపించగలడు. అయితే బుమ్రాను ఆడించే విషయంలో తొందర పడవద్దు. లేకపోతే గాయం తీవ్రత మరింత పెరిగిపోతుంది. కెరీర్ కీలక దశలో ఉన్న అతను రాబోయే రోజుల్లో ఎంతో ఆడాల్సి ఉంది. అలాంటివాడిని ఒక్కసారిగా పిలిపించి గెలిపించమని కోరడం సరైంది కాదు. బుమ్రా చాలా విలువైనవాడు.అతనిపై అంచనాలూ భారీగా ఉంటాయి. వచ్చి రాగానే చెలరేగిపోవాని అంతా కోరుకుంటారు. నాకు తెలిసి గాయంనుంచి కోలుకొని వచ్చి అలా ఆడటం సాధ్యం కాదు’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మొహమ్మద్ షమీపై అందరి దృష్టీ ఉంటుందని...అతని ఫిట్‌నెస్‌కు కూడా ఇది పరీక్ష కానుందని కూడా భారత మాజీ కోచ్ అభిప్రాయ పడ్డాడు. -
బోసు బాల్‌తో నటి కొత్త కసరత్తులు వైరల్ : అసలేంటీ బోసు బాల్ ఎక్స్‌ర్‌సైజ్?
బరువు తగ్గడానికి శరీరాన్ని దృఢంగా ఆ మార్చుకోవడానికి వ్యాయామం ఒక్కటే మార్గం. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనేది వారి వారి వ్యక్తిగత అవసరాలు, ఇష్టా ఇష్టాలమీద ఆధారపడి ఉంటుంది. యోగా, వాకింగ్, జాకింగ్ లాంటి వాటితో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది బోస్ బాల్ వ్యాయామం. బోసు బాల్ (BOSU Ball) వ్యాయామం మొత్తం శరీరాన్ని పటిష్టంగా మారుస్తుంది. శరీరంతోపాటు, జీవిత సమన్వయ సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. తాజాగా బోసు బాల్ వ్యాయామాన్ని అలవోకగా చేస్తోంది నటి శిల్పా శెట్టి (Shilpa Shetty Kundra).యోగాసనాలు, జిమ్‌లో కసరత్తులతో అభిమానుల ఆకట్టుకునే శిల్పా బోసు బాల్ మీద చాలా బ్యాలెన్సింగ్ వ్యాయామాలుచేస్తున్న వీడియోను మండేమోటివేషన్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.బోసు బాల్ వ్యాయామం శరీరంలోని అన్ని కండరాలను బలోపేతం చేస్తుందని శిల్పా చెప్పుకొచ్చింది. సమతుల్యతను, బ్యాలెన్సింగ్ మెరుగుపరుస్తుందని తెలిపింది. క్రియాత్మక ఫిట్నెస్ను పెంచుతుందని, అలాగే పట్టు తప్పి పడిపోవడం, గాయాల ప్రమాదాలను తగ్గిస్తుందని తెలిపింది.ఎలా చేస్తారు?ఒక ప్లాస్టిక్ బేస్‌మీద రబ్బరు బంతిని అమరుస్తారు. దీనిమీద స్క్వాట్స్, పుష్ అప్ప్, జంపింగ్, ప్లాంక్స్, హాప్స్, షోల్డర్ టాప్స్, మౌంటైన్ క్లైంబర్స్ఇలాచాలా రకాల వ్యాయామాలను చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. బరువు కూడా తొందరగా తగ్గుతారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) బౌన్స్ అవుతున్న బంతిమీద వ్యాయామం అంటే అన్ని కండరాలను యాక్టివేట్ చేస్తుంది. శరీరాన్ని ఎలా నియంత్రించుకోవాలో అలవడుతుంది. బోసు బాల్ వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి మంచిది. సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పుష్-అప్స్, జంప్స్ చేయడంలో వల్ల టోన్ల్ బాడీ సొంతం చేసుకోవచ్చు. వివిధ రకాల కండరాల సమూహాలను లక్ష్యంగా 15 నిమిషాల పాటు చేస్తే చేయాలి.45-60 నిమిషాలు మంచి ఫలితం ఉంటుంది. మెదడికి, శరీరానికి మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. మానసిక బలం చేకూరుతుంది. బోసు బాల్ వ్యాయామాలు, ప్రయోజనాలుబోసు బాల్ వ్యాయామంతో అనేక రకాల(health benefits) ప్రయోజనాలున్నాయి. నిజానికి ఈ వ్యాయామం శారీరక బలానికి ఒక పరీక్ష లాంటిది. ఇది ఒక్కసారి అలవాటైతే చక్కని శరీర సౌష్టవంతోపాటు దేహ దారుఢ్యంగా కూడా పెరుగుతుంది, బ్రహ్మాండమైన ఫిట్నెస్ మన సొంతమవుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలుఆరంభంలో సరియైన నిపుణుడు, లేదా శిక్షకుడి ఆధ్వర్యంలో వీటిని చేయాల్సి ఉంటుంది. బోసు బంతితో వ్యాయామం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే ఈ బాల్‌పై ఎలాంటి ఎక్స్‌ర్‌సైజ్ చేసినా, తొందర పడకుండా, నిదానంగా బ్యాలెన్సింగ్‌ను అలవర్చుకోవాలి. భుజాలు వెనుకకు, తల తటస్థంగా ఉండేలా సరియైన భంగిమలో ఉండాలి. బంతిపై నిలబడి ఉన్నప్పుడు మోకాళ్లను వదులుగా ఉంచుకోవాలి. ఇది బాల్ పై కదలికల సమయంలో, లేదా కొంచెం వంగినపుడు పడిపోకుండా సహాయపడుతుంది ఇవీ చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంపెళ్లై పాతికేళ్లు : ఆంటీ కోసం అంకుల్ రొమాంటిక్ డ్యాన్స్! వైరల్వీడియో -
స్వీట్లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గింది..!
బరువు తగ్గడం అనగానే నచ్చిన ఆహారాన్ని త్యాగం చేయడమే. ఒకవేళ నచ్చింది తినాలనిపించినా.. మనస్పూర్తిగా తినలేక డైట్‌ని మధ్యలోనే వదిలేయలేక ఎంతలా తిప్పలు పడతారో చెప్పాల్సిన పనిలేదు. కొందరైతే వెయిట్ లాస్ జర్నీలో నోరుని కట్టేసుకుని మరీ కఠినమైన డైట్లు, వర్కైట్లపై దృష్టిసారిస్తారు. అధికంగా వ్యాయమాలు చేసి తీపి పదార్థాలు దరిచేరనివ్వకుండా ఉంటేనే బరువు తగ్గుతారనేది చాలమంది అభిప్రాయం. అయితే వాటన్నింటిని కొట్టిపారేసేలా ఈ మహిళ వెయిట్ లాస్ జర్నీ ఉంది. పైగా తీపి పదార్థాలు తింటూనే బరువు తగ్గిందంట. అది నిజమేనా..? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆమె చెబుతున్న వెయిట్ లాస్ టిప్స్ వింటే నమ్మకుండా ఉండలేరు.ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కార్లా విసెంటిన్ వెయిట్ లాస్ జర్నీ చాలా విభిన్నంగా కొత్తగా ఉంది. బరువు తగ్గడం అంటే ఇష్టమైన ఆహారాన్ని దూరం చేసుకోవడం కాదని అంటోంది క్లారా. తన విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ..తాను ప్రతిరోజు ఇష్టమైన స్వీట్స్‌ని తింటూనే బరువు తగ్గానని నమ్మకంగా చెబుతోంది. అలా స్వీట్లు తింటూనే తన బరువు వ్యూహాలను ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. తనకు వెయిట్‌లాస్ జర్నీలో హెల్ప్ అయిన చిట్కాలను కూడా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..వ్యాయామం ఒక్కటే బరువు తగ్గడానికి సరిపోదని అంటోంది క్లారా. కేలరీలను తగ్గించే డైట్ తోపాటు మంచి కదిలకలతో కూడిన శారీరక శ్రమతోనే బరువు తగ్గుతారని అంటోంది. దాహం ఆకలి మారువేషంలో ఉంటుంది. అలాంటప్పుడు ఆకలితో ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి తరుచుగా నీరు తాగుతూ ఉండండి. ప్రతిరోజు ఒకే ఆహారం తినడం వల్ల కేలరీలు తీసుకోవడం, ట్రాక్ చేయడం సులభం అవుతుంది. అదీగాక భోజనం త్వరగా సిద్ధం చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. చిన్న ప్లేటుల్లో తింటే..ఎక్కువ తీసుకున్న అనుభూతి కలుగుతుంది. అలాగే నెమ్మదిగా తినడం తెలియకుండానే వస్తుందట. వ్యాయామం చేసే ముందు మంచి డిటాక్స్ వాటర్‌ని తీసుకుంటే జిమ్‌కి వెళ్లేలా బాడీ సిన్నద్ధం అవుతుందట. అంతేగాదు ఉత్సాహంగా వ్యాయమాలు చేయగలుగుతారు. నచ్చిన ఆహారం వదులుకోకుండా హాయిగా తినాలంటే..కేలరీలను తగ్గించుకునే యత్నం చేయాలి. ఇక్కడ క్లారాకి ప్రతిరోజు ఏదో ఒక స్వీట్ తప్పనిసరిగా తినే అలవాటు ఉందట. అందుకుని తనకు నచ్చిన స్వీట్‌ని హాయిగా తినేసి అదనపు కేలరీలు తీసుకోకుండా చూసుకుంటుందట. ఇలా చేస్తే తినాలనే పిచ్చికోరిక అదుపులో ఉంటుందని చెబుతుంది. స్వీట్స్ అధికంగా తినాలనిపించినా లేదా ఆకలిగా అనిపించినప్పుడల్లా చక్కెర లేని గమ్ నమలాలని సూచిస్తోంది.అలాగే మనల్ని మనం ఇష్టపడితేనే తొందరగా బరువు తగ్గకలుగుతామని అంటోంది.చివరగా అన్నింటికి సానుకూల దృక్పథంతో ఉండాలి అప్పుడే చక్కటి మార్పులు సాధ్యమవుతాయని నమ్మకంగా చెబుతోంది క్లారా.ఇక్కడ పాజిటివ్ ఆటిట్యూడ్ తోపాటు మనల్ని మనం ప్రేమించుకుంటేనే చక్కటి రూపం సొంత చేసుకోగలమని క్లారా కథే చెబుతోంది కదూ..!. View this post on Instagram A post shared by Carla Visentin (@carlavisentin_)(చదవండి: 'ఇది కాస్మెటిక్ సర్జరీనే కానీ కళ్లకు'..శాశ్వతంగా కంటి రంగు మారిపోతుంది..!) -
50 నిండినా వన్నె తగ్గని అందం, ఫ్యాషన్‌కి, పిట్‌నెస్‌కి పెట్టింది పేరు (ఫోటోలు)
-
ఫిట్నెస్ ఎలాస్టిక్ రోప్: దెబ్బకు కొవ్వు మాయం..!
ఈ రోజుల్లో వ్యాయామం చేయకపోతే ఇట్టే బరువు పెరగడం, కొలతలు సరిలేక, అందం తగ్గడం సాధారణ సమస్యలుగా మారిపోతున్నాయి. తినే తిండి, ఎక్కువ సమయం కూర్చునే వర్క్ చేయడం, పెద్దగా శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో, చాలామందికి ఫిట్నెస్ దూరమవుతోంది. అయితే జిమ్‌లో చేసుకున్నట్లే ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడానికి ఈ ’ఫిట్నెస్ ఎలాస్టిక్ రోప్’ చక్కగా పని చేస్తుంది.ఈ రోప్‌తో వర్కౌట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్ని భంగిమల్లోనూ వ్యాయామం చేయడానికి, శారీరక శ్రమను కలిగించి, కొవ్వును తగ్గించడానికి సహకరిస్తుంది. మన్నికైన ఈ రోప్.. వీపు, నడుము, పొట్ట, తొడలు, చేతులు వంటి భాగాల్లో పేరుకున్న కొవ్వును కరిగించుకోవడానికి వినియోగించొచ్చు. దీంతో వ్యాయామం చేస్తే కండరాలు బలపడి, శరీరం దృఢంగా తయారవుతుంది.వ్యాయామ సమయంలో దీన్ని ఎలా కావాలంటే అలా సులభంగా, బలం ఉపయోగించి సాగదీయొచ్చు. సాగదీసే క్రమంలోనే గ్రిప్ తప్పి లేని నొప్పులు వస్తాయేమోనన్న భయం అవసరం లేదు. సౌకర్యవంతమైన పట్టును అందించగల ఈ సాగే తాడు.. చేతులకు, కాళ్లకు అలసట కలిగించదు. ఎకో–ఫ్రెండ్లీ మెటీరియల్‌తో రూపొందిన ఈ రోప్ కొత్తగా వ్యాయామం ప్రారంభించే వాళ్లకు కూడా అనువుగానే ఉంటుంది. దీని ధర 14 డాలర్లు (రూ.1,286) మాత్రమే! -
కిక్ బాక్సింగ్‌తో రష్మిక...ఫ్లెక్సిబులిటీ కోసం జాన్వీ...!
బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సినీ తారలంతా ఇప్పుడు వర్కవుట్స్ మీద దృష్టి పెడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్‌గా కనిపిస్తున్నారు. తారలే స్వయంగా ఇంటర్వ్యూల్లో వెల్లడించిన ప్రకారం... కొందరు తారల గ్లామర్–ఫిట్నెస్ రొటీన్ ఇదీ...ఫ్లెక్సిబులిటీ కోసం ఈ బ్యూటీ... చుట్టమల్లే చుట్టేత్తాంది తుంటరి చూపు అంటూ టాలీవుడ్ దేవరను ప్రేక్షకుల్ని ఒకేసారి కవ్వించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ తెరపై గ్లామర్ డోస్‌ని విజృంభించి పంచే హీరోయిన్స్‌లో టాప్‌లో ఉంటుంది. తన తల్లి శ్రీదేవిలా కాకుండా పూర్తిగా అందాల ఆరబోతనే నమ్ముకున్న ఈ క్యూటీ...దీని కోసం ఫిజిక్ ను తీరైన రీతిలో ఉంచుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది. తన శరీరపు ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి స్ట్రెచింగ్, ట్రెడ్మిల్ లపై దృష్టి పెడుతుంది. తన ఫిట్నెస్ రొటీన్లో బెంచ్ ప్రెస్‌లు, డెడ్‌లిఫ్ట్‌లు, స్క్వాట్లు, షోల్డర్ ప్రెస్‌లు పుల్–అప్ల ద్వారా బాడీ షేప్‌ని తీర్చిదిద్దుకుంటుంది. టిని ఆమె రోజువారీ వ్యాయామాలు ఆమె టోన్డ్ ఫిజిక్‌ను నిర్వహించడానికి మాత్రమే కాదు ఆమె కండరాలలో బలాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.‘కిక్’ ఇచ్చేంత అందం...వత్తుండాయి పీలింగ్సూ, వచ్చి వచ్చి చంపేత్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సూ... అంటూ పుష్పరాజ్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం తనను చూసి పిచ్చెత్తిపోవాలంటే ఏం చేయాలో రష్మికకు తెలుసు. అందుకే వారానికి 4–5 సార్లు జిమ్‌కి వెళుతుందామె. ఆమె ఫిట్నెస్ రొటీన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, కార్డియోతో పాటు ముఖ్యంగా నడుం దగ్గర ఫ్యాట్‌ని పెంచనీయని, అదే సమయంలో క్లిష్టమైన డ్యాన్స్ మూమెంట్స్‌కి ఉపకరించే కోర్ వర్కౌట్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఫిట్‌గా ఉండటానికి ఇంట్లో పవర్ యోగా, స్విమ్మింగ్ చేస్తుంది. ఇటీవలే రష్మిక తన ఫిట్నెస్ మెనూలో అధిక–తీవ్రత గల కిక్‌బాక్సింగ్ సెషన్లను కూడా చేర్చుకుంది, ఇది తన ఒత్తిడిని తగ్గించడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ఆమె జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.దీపికా...అందం వెనుక...జవాన్ సినిమాలో దీపికా పదుకొణెను చూసినవాళ్లు తెరపై నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టం. పెళ్లయిన తర్వాత ఈ ఇంతి ఇంతింతై అన్నట్టుగా మరింతగా గ్లామర్ హీట్‌ను పుట్టిస్తోంది. ఇంతగా తన అందాన్ని తెరపై పండించడానికి తీరైన ఆకృతి చాలా అవసరమని తెలిసిన దీపిక.. దీని కోసం బ్లెండింగ్ యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కార్డియోను సాధన చేస్తుంది. అవే కాదు... స్విమ్మింగ్, పిలాటిస్, వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తుంది, ఆమె శారీరక థృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తూ తన వర్కవుట్ రొటీన్‌ను డిజైన్ చేసుకుంటుంది.కార్డియో...ఆలియా...ఆర్ఆర్ఆర్ సినిమాలో మెరిసిన బ్యూటీ క్వీన్ అలియా భట్ తాజాగా జిగ్రా మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ రెండింటినీ పండించే ఈ థర్టీ ప్లస్ హీరోయిన్.. ఫిట్‌గా ఉండటానికి కార్డియో అవసరమని అర్థం చేసుకుంది. అది ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నా లేదా స్పిన్నింగ్ చేసినా, ఆమె స్టామినాను పెంచుకోవడంపైనే దృష్టి పెడుతుంది వర్కవుట్స్‌లో ఆటల్ని కూడా మిళితం చేసే అలియా తాజాగా పికిల్ బాల్ ఫ్యాన్ క్లబ్‌లోని సెలబ్రిటీస్ లిస్ట్‌లో తానూ చేరింది.కత్తిలా..కత్రినా..తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన కనిపించిన మల్లీశ్వరి కత్రినా కైఫ్...నాజూకు తానికి మరోపేరులా కనిపిస్తుంది. మైనేమ్ ఈజ్ షీలా, చికినీ చమేలీ వంటి పాటల్లో కళ్లు తిరిగే స్టెప్స్‌తో అదరగొట్టిన కత్రినా.. తన వ్యాయామాల్లో డ్యాన్స్, పిలాటì స్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ల సమ్మేళనాన్ని పొందుపరిచింది. అందమైన ఆ‘కృతి’...ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన సీత...కృతి సనన్ అంతకు ముందు దోచెయ్ సినిమా ద్వారానూ తెలుగు తెరకు చిరపరిచితమే. అద్భుతమైన షేప్‌కి కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే ఈ పొడగరి... తన శరీరాన్ని సన్నగా బలంగా ఉంచుకోవడానికి పిలాటిస్, కోర్ వర్కౌట్లతో శ్రమిస్తుంటుంది. వ్యాయామాల ద్వారా తన పోస్చర్‌ను మెరుగుపరచడానికి కూడా ఈమె తగు ప్రాధాన్యత ఇస్తుంది.


