అద్భుతమైన ‘5’ టిప్స్‌తో 72 కిలోలు బరువు తగ్గింది! | Woman who lost 72 kg shares 5 things she did every day for drastic weight loss | Sakshi
Sakshi News home page

అద్భుతమైన ‘5’ టిప్స్‌తో 72 కిలోలు బరువు తగ్గింది!

Published Fri, Nov 29 2024 3:52 PM | Last Updated on Sat, Nov 30 2024 1:08 PM

Woman who lost 72 kg shares 5 things she did every day for drastic weight loss

బరువు తగ్గడం అనేది  అంత  ఆషామాషీ వ్యవహారం కాదు. అలాగని అంత కష్టమూ కాదు. బాడీ తత్వాన్ని తెలుసుకుని సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో  మనం కోరుకున్న బరువు లక్ష్యాన్ని చేరు కోవచ్చు.  ఈ విషయాన్ని  అంబర్ క్లెమెన్స్ మరోసారి నిరూపించారు. పట్టుదలగా, నిబద్దతగా  కొన్ని రకాల నియమాలను పాటించి రెండేళ్లలో ఏకంగా 160 పౌండ్లు (72 కిలోలు) బరువును తగ్గించుకుంది. అంతేకాదు తగ్గిన బరువును స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ ప్రయాణంలో తాను అనుసరించిన ముఖ్యమైన సూత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

 

విజయవంతంగా బరువు తగ్గడం అనేది అలవాట్లను మార్చుకోవడంతో మొదలవుతుంది అంటుంది అంబర్‌.  అంతకుముందు పిచ్చి పిచ్చిగా డైటింగ్‌ చేశానని, ఆ తరువాత తాను అనుసరించిన పద్దతి, ఆహార నియమాల మూలంగా చక్కటి  ఫలితం సాధించానని తెలిపింది. ముఖ్యంగా ప్రతిరోజూ చేసే ఐదు విషయాలను పంచుకుంది.  ప్రతి భోజనంతో కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది.  అలాగే స్నాక్స్‌గా ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. అలా ఆమె రోజువారీ తీసుకోవాల్సిన ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఎక్కువ నీళ్లు తాగడం చేయడం వలన మంచి ఫలితం సాధించానని చెప్పుకొచ్చింది.  

 

అద్భుతమైన 5 టిప్స్‌
రోజుకి 7-10 వేల అడుగులు నడవడం: చిన్న అడుగులు పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి.  రోజూ నడవడం అలవాటుగా చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చు. తన రోజుకి మరింత శారీరక శ్రమ కలిగేలా ఎక్కువగా నడవడం,లిఫ్ట్‌ లేదా ఎలివేటర్‌కు బదులుగా నడుచుకుంటూ వెళ్లానని  అంబర్ చెప్పింది.

3 లీటర్ల నీరు తాగడం: హైడ్రేషన్ కీలకం, కనీసం మూడు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంటుందని చెబుతోంది అంబర్‌.

25-30 గ్రాముల ప్రోటీన్: ప్రతి భోజనంతో, అంబర్ కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. స్నాక్స్ కోసం, ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. ఇది ఆమె రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడిందట.

ముందస్తు ప్లాన్‌ : రోజు  రాత్రి ఆహారాన్ని ముందస్తుగా తినడం లాంటివి చేసింది.  రేపు ఏం తినాలి అనేది ముందుగానే నిర్ణయించుకొని సిద్ధం చేసుకోవడం కూడా ఇందులో భాగంగా పాటించింది.

కొద్దిగా స్వీట్‌: అలాగే స్వీట్స్‌ తినాలనే తన కోరిక మేరకు రాత్రి డెజర్ట్ లేదా టిఫిన్‌లో కొద్దిగా ఏదైనా తీపిని జోడించినట్టు తెలిపింది.  

అలాగే వ్యాయామాన్ని ఆనందంగా ఎంజాయ్‌ చేస్తూ చేయాలనీ, రోజుకి కనీసం 30 నిమిషాలు, వారానికి నాలుగు సార్లు  చేయాలి.  దీంతోపాటు మంచి నిద్ర ఉంటే చాలు బరువు తగ్గడం ఈజీ అంటోంది ఈ ఫిట్‌నెస్‌ కోచ్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement