breaking news
weight loss
-
వెయిట్ లాస్ సర్జరీ కోసం యూకే నుంచి భారత్‌కు వచ్చిన మహిళ
హైదరాబాద్: ఎక్కడో లండన్‌లో ఉంటూ బ్లాక్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేసుకుంటున్న ఓ బ్రిటిష్ మహిళ.. బరువు తగ్గాలన్న ఉద్దేశంతో భారతీయ డాక్టర్‌ను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. 102 కిలోల నుంచి శస్త్రచికిత్స అనంతరం 70 కిలోలకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలి కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. ఆస్పత్రి మెటబాలిక్, బేరియాట్రిక్ సర్జరీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కేశవరెడ్డి మన్నూర్ తెలిపారు.“అలెగ్జాండ్రియా ఫాక్స్ అనే 59 ఏళ్ల మహిళ భర్త జేన్ ఫాక్స్‌కు 2023లో లండన్‌లో ఉండగా బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేశాను. ఆయన 64 కిలోల బరువు తగ్గారు. ఫలితంగా కీళ్ల నొప్పులు తగ్గిపోయాయి, మధుమేహం, రక్తపోటు కూడా అదుపులోకి వచ్చాయి. ఆ ఫలితంతో ఆయన చాలా సంతోషించారు. దాంతో 102 కిలోల బరువు ఉన్న అలెగ్జాండ్రియా తాను కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుని, అందుకు భారతీయ వైద్యుడైన డాక్టర్ కేశవరెడ్డి దగ్గరకే వెళ్లాలని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. ఆమెకు ఊబకాయంతో పాటు అధిక రక్తపోటు, కిడ్నీ వైఫల్యం, థైరాయిడ్ లాంటి సమస్యలున్నాయి. దాంతో తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చేశారు.ఆమెకు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే శస్త్రచికిత్స చేశాం. ముందుగా మత్తుమందుకు సంబంధించిన పరీక్షలు చేశాం. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో శస్త్రచికిత్స చేసి, ఉదరభాగంలో 2/3 వంతు తొలగించాం. దాంతో కడుపు చిన్నగా అయిపోయింది. దీనివల్ల ఆమె మధుమేహం, రక్తపోటు అదుపులోకి వచ్చాయి. దాంతోపాటు కిడ్నీ వైఫల్యం కూడా తగ్గింది. ఆమెకు చాలా సానుకూల దృక్పథం ఉండడంతో 24 గంటల్లోనే కోలుకున్నారు. దాంతో శస్త్రచికిత్స అయిన మర్నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. రెండురోజుల్లోనే తన హోటల్ గదిలో ఆమె అటూ ఇటూ హాయిగా తిరిగేస్తున్నారు. త్వరగా కోలుకుని తన పనులు తాను చేసుకుంటున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. మూడు రోజుల్లో తిరిగి ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.అలెగ్జాండ్రియా ఇంగ్లండ్‌లో బ్లాక్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. అది అక్కడ చాలా గౌరవప్రదమైన, కష్టమైన వృత్తి. దానికి ముందుగా మూడేళ్ల శిక్షణ తీసుకోవాలి. లండన్ నగరంలోని ప్రతి వీధి బాగా తెలిసి ఉండాలి. ఈ టాక్సీలను అక్కడ చాలా గౌరవనీయంగా చూస్తారు. ఇంత గౌరవప్రదమైన పని చేసేటప్పుడు తనకు ఆరోగ్య సమస్యలు ఉండకూడదని భావించడం వల్లే అలెగ్జాండ్రియా ఇక్కడివరకు వచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నారు.స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది చాలా సులభమైన శస్త్రచికిత్స. ఇందులో సరికొత్త పరిశోధనలు కూడా చేసి ఉదరభాగం మళ్లీ వ్యాకోచించకుండా ఉండేలా చేస్తున్నాం. దీనివల్ల దీర్ఘకాలం పాటు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత మధుమేహం, రక్తపోటు, నిద్రలేమి లాంటి చాలా సమస్యలు తగ్గిపోతాయి. జీవన ప్రమాణం కూడా మరో పదేళ్లు పెరుగుతుంది. ఇది చాలా సురక్షితమైన శస్త్రచికిత్స. బరువు తగ్గడానికి మందులు వాడడం కంటే ఇది చేయించుకోవడం చాలా మంచిది” అని డాక్టర్ కేశవరెడ్డి వివరించారు. -
అర్జున్ చక్రవర్తి కోసం ముప్పై కేజీలు తగ్గాను
విజయ రామరాజు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. ఈ చిత్రంలో సిజా రోజ్ హీరోయిన్. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ రామరాజు మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కోసం దాదాపు 30 కేజీల బరువు తగ్గాను. ఆ తర్వాత బరువు పెరిగాను. నేను సిక్స్ ప్యాక్‌తో ఉన్న సీన్స్ తీసినప్పుడు రెండు రోజులు ఏమీ తినలేదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అయితే ట్రైలర్ విజువల్స్ చూసివారు పెద్ద సినిమాలా ఉందని అంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా నా తొమ్మిదేళ్ల కల. ఆరేళ్ల మా టీమ్ కష్టం. విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. బడ్జెట్ పెరిగినా మా నిర్మాత నన్ను స΄ోర్ట్ చేశారు’’ అని చె΄్పారు విక్రాంత్ రుద్ర. ‘‘ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన మా సినిమా అదే రోజు రిలీజ్ అవుతోంది’’ అని చెప్పారు శ్రీని గుబ్బల. – విజయ రామరాజు ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
ఐస్‌క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!
వివిధ వ్యాధులకు మూలమైన అధిక బరువు ప్రస్తుతం అందర్నీ వేధించే పెనుసమస్యగా మారింది. బరువు తగ్గడం అనేది ఓ సవాలు. మాటల్లో చెప్పినంత సులవు కాదు తగ్గడం. స్ట్రాంగ్మైండ్ అచంచలమైన అంకితభావం ఉన్నవాళ్లే బరువు తగ్గడంలో విజయవంతమవ్వగలురు. అందుకోసం ఫిట్నెస్ నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులు సలహాలు సూచనలతో ప్రారంభించడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఏఐ సాంకేతికతను స్మార్ట్‌గా ఉపయోగించుకుంటూ ఆశ్చర్యపరిచేలా స్లిమ్‌గా అవుతున్నారు. సాంకేతికతను వాడోకవడం వస్తే..బరువు అనేది భారం కాదని ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడొక ఆరోగ్య నిపుణురాలు ఏఐ సాంకేతికను ఉపయోగించుకుంటూ.. తన కిష్టమైన ఐస్క్రింని త్యాగం చేయకుండానే బరువు తగ్గి చూపించింది. అది కూడా హాయిగా ఐస్‌క్రీంలు లాగించేస్తూనే ఎన్నికిలోలు తగ్గిందో వింటే నోరెళ్లబెడతారు.వెయిట్‌లాస్ జర్నీలో ఆహారాలు, వ్యాయామ షెడ్యూల్, జీవనశైలి తదితరాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ఈ మహిళ ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కృత్రిమ మేధ సాయాన్నితీసుకుంది. ఇది మనిషి సందేహాలను సత్వరమే నివృత్తిచేసి..గైడ్ చేయగలదని చాలామంది ప్రగాఢంగా నమ్ముతుండటం విశేషం. ఆ నేఫధ్యంలోనే ప్రముఖ ఆరోగ్యనిపుణురాలు సిమ్రాన్ వలేచా కూడా ఏఐ ఆధారిత చాట్‌జీపీటి సాయంతో తీసుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. డిసెంబర్ 2024లో ఈ చాట్‌జీపీటీ(ChatGPT) సాయం తీసుకుని వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించారామె. అయితే ఆమె తనకెంతో ఇష్టమైన ఐస్క్రీని అస్సలు త్యాగం చేయకుండా బరువు తగ్గానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేగాదు వెయిట్‌లాస్ కోసం చాట్‌జీపీటీతో మాట్లాడి ధైర్యంగా ముందడుగు వేయొచ్చని ధీమాగా చెప్పేస్తున్నారామె. ఇన్‌స్టా పోస్ట్‌లో సిమ్రాన్ ఇలా రాశారు. "ఐస్‌క్రీం తింటూనే పది కిలోలు తగ్గాను. అలాగే బరువు తగ్గాలనుకుంటే స్వంతంగా డైట్‌ని ఎంచుకోండి. అందుకోసం చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి". అంటూ సవివరంగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది.చాట్‌జీపీటీలో ఎలా అడగాలంటే..చాట్‌జీపీటీలో సిమ్రాన్ తన ఎత్తు, బరువు వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనకుంటున్నా..అందుకోసం తీసుకోవాల్సిన ఆహారాలు, చిరుతిండ్లు వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్లు పేర్కొంది. అలాగే తన పనిగంటలు, ఖాళీ సమయం వంటి వివరాలు కూడా ఏఐకి ఇచ్చినట్లు తెలిపింది. ఎన్నిగంటలు వ్యాయమానికి కేటాయించగలను అనేది కూడా ఇచ్చినట్లు తెలిపింది. అల్పాహారం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలో సవివరంగా తెలుసుకుని బరువు తగ్గానని పోస్ట్‌లో రాసుకొచ్చింది సిమ్రాన్. గమనిక: ఇక్కడ సాంకేతికత అనేది జస్ట్ ఆరోగ్యంపైన అవగాహన కల్పించగలదని, అదే కచ్చితమని భావించరాదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అది మనలను ఆరోగ్యంపై ఒక అవగాహన కల్పించే అప్లికేషన్ అని గుర్తించగలరు. వ్యక్తిగతంగా అనుసరించాలనుకుంటే వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Simran - Health, Wellness & Weight Loss Expert (@simvalecha) (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్‌నెస్‌లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
గ్రాండ్మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గా
టీవీ షోలు, తనదైన ప్రత్యేక పాత్రలతో బాలీవుడ్లో పేరు తెచ్చుకున్న నటి నేహా ధూపియా (Neha Dhupia) . 2018లో నటుడు అంగద్ బేడీని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లైన ఆమె 45 ఏళ్ల నటి ప్రసవానంతర బరువు తగ్గినప్పుడు వార్తల్లో నిలిచింది. అనేక విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలగా 23 కిలోల బరువు తగ్గినవైనం విశేషంగా నిలిచింది. తక్కువ తినడం గురించి కాదు, సరిగ్గా తినడం గురించి తెలుసుకోవాలని తెలిపింది. మరింకెందుకు ఆలస్యం నేహా ధూపియా వెయిట్‌లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.నేహా ధూపియా ప్రసవానంతర బరువును ఎలా తగ్గించుకుందో మీడియాతో పంచుకుంది. నాలుగేళ్ల కాలంలో పదే పదే బరువు పెరిగాను, సన్నగా అయ్యాను. చాలా విమర్శలెదుర్కొన్నాను. అయినా సరే గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవానంతర సమయంలో ఎలా ఉన్నాను అనేది పట్టించుకోలేదు. తల్లిగా తాను తన పిల్లలకు తల్లిపాలు ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెట్టాను తప్ప, బరువు తగ్గడం గురించి ఆలోచించలేదని చెప్పింది. అయితే లాక్డౌన్ సమయంలోనే తాను లో-కేలరీ డైట్‌పై దృష్టిపెట్టినట్టు చెప్పింది. చదవండి: నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీఆతరువాత ఆరోగ్య రీత్యా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారు. అదీ ఎలాంటి షార్ట్ కట్లు, క్రాష్ డైట్‌లూ లేకుండా. అయితే ఈ విషయంలో మొదట చాలా ఇబ్బందులు పడ్డాననీ కానీ సమతుల్య ఆహారం, వ్యాయామంతో బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా చక్కెర, వేయించిన ఆహారాలు, గ్లూటెన్ను తగ్గించుకుంది. జిమ్‌కు వెళ్లడం తనకు పెద్దగా ఇష్టం ఉందనీ, అందుకే పరుగు లాంటి వ్యాయామ దినచర్యను ఎంచుకు న్నానని వెల్లడించింది. అలా తల్లిగా బిజీగా ఉన్నప్పటికీ, జీవనశైలి మార్పులు, దానికి తగ్గ ఆహారం, వ్యాయామంతో ఏడాది కాలంలో దాదాపు 24 కిలోలు బరువును తగ్గించుకుంది.ఇదీ చదవండి: జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటినేహా ధూపియా ఇంకా ఇలా పంచుకున్నారు. నిజానికి ఇందులో దీనికి షార్ట్ కట్స్ లేవు, అంత ఈజీకూడా కాదు రాకెట్ సైన్స్ కూడా లేదు, గట్టి నిలబడండి, స్థిరంగా ఉండండి, కష్టపడి పనిచేయండి. ముఖ్యంగా మీకు అస్సలు మనస్కరించని రోజుల్లో ఇంకా స్ట్రాంగ్‌గా ఉండండి అని తెలిపింది. ఈ శారీరక మార్పులు తన మానసిక ఆరోగ్యానికి కూడా ఎలా సహాయపడ్డాయో కూడా వివరించింది. "ఆరోగ్యంగా ఉండటం వల్ల నా పిల్లలతో కలిసి చురుగ్గా ఉండటానికి తోడ్పడింది. కాన్ఫిడెన్స్ పెరిగింది. మానసిక బలానికి శారీరక ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుందని కూడా వెల్లడించింది. రాత్రి 7 గంటల కల్లా పిల్లలతో కలిసి డిన్నర్ చేయడం. ఇక మరుసటి రోజు ఉదయం 11 గంటలకు నా భర్త అంగద్తో కలిసి బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని మధ్యలో ఏమీ తీసుకునేదాన్ని కాదు అంటూ వెయిట్‌లాస్ సీక్రెట్స్‌ని పంచుకున్నారామె. అంతేకాదు చాలామందిలాగా క్రాష్ డైట్లు, జిమ్ కసరత్తులు లేకుండానే వ్యాయామాలతో సింపుల్ లైఫ్‌స్టైల్‌తోనే తాను అనుకున్న వెయిట్‌లాస్ సాధించానని తెలిపింది.కాగా నేహా ధూపియా -అంగద్ బేడీ దంపతులకు ఇద్దరు సంతానం. (కూతురు మెహ్ర్, కొడుకు గురిఖ్) మొదటినుంచీ కాస్తా బొద్దుగా ఉండే నేహా, ప్రెగ్నెన్సీ సమయాల్లో బాగా బరువు పెరిగింది. దీంతో ‘దాదీ ధూపియా, గ్రాండ్మా ‘మోటీ, తిమింగలం అంటూ ఆమెను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా, అటు ఇంటిని, ఇటు కరియర్‌ను చక్కదిద్దుకున్న సూపర్‌మామ్ నేహా ధూపియా. -
జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు..! కష్టసాధ్యమైన ఆ పదింటిని..
బరువు తగ్గడం అనేది సవాలుతో కూడుకున్నది. అందులోనూ ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలంటే అంతఈజీ కాదు కూడా. కానీ పోషకాహార నిపుణురాలు(Nutritionist) ఆ భారమైన అధిక బరువుని జస్ట్ నాలుగు నెలల్లో మాయం చేసింది. అంత త్వరిగతిన బరువు తగ్గడం ఎలా సాధ్యమైందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుందామె. ఎంతో బాధకరమైన త్యాగాలు చేయడం వల్ల వెయిట్‌లాస్ జర్నీ విజయవంతమైందని అంటోంది.భారాన్ని తగ్గించుకోవాలంటే బాధను కలిగించే ఇష్టమైన వాటన్నింటిని తృణప్రాయంగా వదులుకోవాల్సిందేనని అంటోంది. మరి అవేంటో చూద్దామా..పోషకాహార నిపుణురాలు అమాకా(Amaka) బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నప్పుడూ మొదట్లో చాలా ఇబ్బందిపడ్డానంటోంది. అమ్మో మన వల్ల కాదు అనిపించింది. ఎందుకంటే కచ్చితమైన మంచి ఫలితాలు త్వరితగతిన రావాలంటే కష్టసాధ్యమైన ఆ పదింటిని చాలా స్ట్రాంగ్‌గా వదులుకోవాలి. దాంతో తనకు నరకంలా అనిపించిందని, ఆ తర్వాత బరువు తగ్గుతున్న మార్పులను చూసినప్పుడూ విజయం సాధించానన్న ఆనందం ముందు ఇదేమంతా కష్టం కాదనిపించిందని అంటోంది అమాకా. అందువల్లే జస్ట్ నాలుగు నెల్లలో ఏకంగా 25 కిలోలు వరకు తగ్గాగలిగానని అదికూడా ఆరోగ్యకరమైన రీతీలోనే అని చెబుతోంది పోషకాహార నిపుణురాలు అమాకా. ఇంతకీ ఆమె వదులుకున్న ఆ పది ఇష్టమైనవి ఏంటో చూద్దామా..!.నో కంఫర్ట్ ఫుడ్స్: అమాకా మనకు ఎంతో ఇష్టమైన జంక్ ఫుడ్ లాంటి ఆహారాలన్నింటిని దూరం చేసుకోవడం అంత ఈజీ కాదని అంటోంది. ఎంత బలంగా జంక్‌కు నో చెప్పగలుగుతాం అంత తొందగా మంచి ఫలితాలు అందకోగలమని చెబుతోంది. ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్: వ్యాయామం చేయడానికి బెస్ట్ టైం ఉదయమేనని చెబుతోంది. అదీకూడా కష్టమైనదే. తెల్లవారుజామున నిద్ర ఎంత మధురంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. దాన్ని వదలించుకుని బెడ్‌మీద నుంచి లేగాలంటే కష్టమే అయినా బరువు కోసం త్యాగం చేయక తప్పదని అంటోంది అమాకా. అడపాదడపా ఉపవాసం:వారానికి రెండు మూడు రోజులు అడపాదడపా ఉపవాసం బరువు తగ్గేందుకు ఎంతో హెల్ప్ అవుతుంది. అలా చేయాలంటే ఎంతో కఠినమైన నిబద్ధతోనే సాధ్యమని అంటోంది.రాత్రుళ్లు పార్టీలు, డిన్నర్లకు దూరంగా ఉండటం..ఫిజీ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి అన్నింటికీ దూరంగా ఉండాలి. బయట తినాలనే కోరికను బలంగా నివారించాలి. బయట తింటే మనం అనుసరించే డైట్ ఒక్కసారిగా వృధా అయిపోతుందని హెచ్చరిస్తోంది.సమయాపాలన..టైంకి తినేలా చూసుకునేదాన్ని. మరీ ఆకలి వేసేంత వరకు వేచి ఉండకుండా కేర్ తీసుకునేదాన్ని అంటోంది. దాని వల్ల అతిగా తినేస్తామని చెబుతోంది.మానసికంగా దృఢంగా ఉండటం..బరువు తగ్గడం అనే ప్రక్రియం కష్టతరమైనది కాబట్టి మానసికంగా మనల్ని మనం బలోపేతం చేసుకునేందుకు యోగా వంటి వాటితో ప్రయత్నించాల్సిందే. మనస్సు మన అధీనంలో ఉంటేనే నచ్చినవన్నింటిని తినేయాలనే ఆలోచనను నియంత్రించగలమని చెబుతోంది.తింటున్న ఫుడ్‌ని ట్రాక్ చేయడం..ఇది కాస్త ఇబ్బందిగా ఉన్నా..శరీరంలో ఎంత ేమేర ేకేలరీలు, ప్రోటీన్లు తీసుకుంటున్నాం అనే దానిపై మంచి అవగాహన ఉంటుంది. పైగా అతిగా తినడాన్ని నివారిస్తుంది.క్రమం తప్పకుండా వ్యాయామాలు..వర్షం, చలి కారణంగా వ్యాయామాలు వద్దు అనిపిస్తుంది. దాన్ని అధిగమించాలి. ఈ విషయంలో క్రమశిక్షణతో ఉంటే సత్ఫలితాలు త్వరిగతిన పొందగలం అని అమాకా చెబుతోంది.మార్పులను గమనించడం..శరీరంలో వస్తున్న మార్పులను గమనించడం. ఒక వేళ్ల అనుకున్నట్లుగా మంచి ఫలితం రాకపోతే నిరాశ పొందడం మానేసి ఇంకేలా సత్ఫలితాలు అందుకోగలం అనే దానిపై దృష్టి సారించాలి.స్ట్రాంగ్‌గా ఉండటం..ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎక్కడ వీక్ అవ్వకుండా బలంగా ఉండేలా సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. స్వీట్స్ తినాలనే కోరికను అదుపులో ఉంచడం, కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం తదితరాలపై దృఢంగా ఉండాలే ధ్యానం చేస్తూ ఉండేదాన్ని అని చెబుతోంది అమాకా. View this post on Instagram A post shared by CERTIFIED NUTRITIONIST (@shred_with_amaka) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం . పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Independence Day: 107 ఏళ్ల నాటి షెర్బత్ దుకాణం..నాటి సమర యోధులు నేతాజీ, సత్యజిత్‌రే..) -
అధిక బరువని పొరపడి వర్కౌట్లతో కుస్తీ..కానీ చివరకు..
సాధారణంగా ఉండాల్సిన దానికి మించి బరువు పెరిగితే అధిక బరువుతో బాధపడుతున్నాం అనే అనుకుంటాం. ప్రతీ భారీకాయానికి అధిక బరువే సమస్య అని పొరపడొద్దు. ఎందుకంటే ఇక్కడొక మహిళ అలానే తప్పుగా అనుకుని నానాపాట్లు పడింది. చివరికి అది తగ్గే ఛాన్స్ లేని అసాధారణమైన వైద్య పరిస్థితి అని తెలిసి తల్లడిల్లిపోయింది. అయితే ఆమె తన అచంచలమైన స్థైర్యంతో ఎదుర్కొని ఎంతలా బరువు తగ్గిందో తెలిస్తే విస్తుపోతారు. అధిక బరువుతో ఇబ్బందిపడేవాళ్లకు ఆమె కథే ఒక స్ఫూర్తి . అసలేం జరిగిందంటే.. డెట్రాయిట్(Detroit)కు చెందిన 35 ఏళ్ల జమైక మౌల్దిన్(Jameka Mauldin) అనే సింగిల్ మదర్ విపరీతమైన అధిక బరువుతో ఇబ్బంది పడేది. అందుకోసం వర్కౌట్లు, డైటింగ్ వంటివి పాటించేది. అయితే అనుహ్యంగా ఆమె బరువు పెరగడం, శరీరం ఏదో బిగుతుగా మారి ఇబ్బందికరంగా అనిపించేది ఆమెకు. కచ్చితంగా ఇది అధిక బరువు కాదు అంతకు మించింది ఏదో అయి ఉండొచ్చనే అనుమానం కలిగేది జమైకాకు. అదే విషయాన్ని వైద్యులకు తెలిపినా..మరింత కష్టపడాలి అని సూచించేవారే తప్ప ఆమె సమస్య ఏంటో నిర్థారించలేకపోయేవారు. చివరికి 2019లో ఆమె విపరీతమై శరీర బాధకు తాళ్లలేక వైద్యులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. జమైక లింఫెడిమా అనే సమస్యతో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీని కారణంగా శరీర కణజాలంలో ద్రవం పేరుకుపోయి, వాపుకు దారితీసే దీర్ఘకాలిక వ్యాధి. అంతేగాదు దీన్ని కొవ్వు సంబంధిత రుగ్మతగా కూడా పేర్కొంటారు. దీని వల్ల బరువు పెరగడమే కానీ తగ్గడం అనేది సాధ్యం కాదు. దాంతో జమైకాకు వైద్యులు సైతం వర్కౌట్లు చేయాలని, కష్టపడమని సూచించలేదు. పైగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని తగ్గించే మార్గంపై దృష్టిసారించారు. సంకల్పం బలంతో ఆ వ్యాధిపై పోరాడింది..ఆమె దగ్గర దగ్గర 324 కిలోలు పైనే అధిక బరువుకి చేరుకుంది. దాంతో ఆమెకు రోజువారి పనులతో సహా ప్రతిది కష్టమైపోయేది. ఒకరి సహాయం లేకుండా కనీసం బాత్రూమ్కి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. అయితే దీన్ని ఆమె సానుకూల దృక్పథంతో, సంకల్ప బలంతో జయించే ప్రయత్నం చేసింది. ఈ రోజు ఈ ఒక్కపని ఫినిష్ చేయాలి అని కేటాయించుకుంటూ..చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకునేది. దాంతోపాటు ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులు, ప్రత్యేకమైన లిపోసక్షన్ పద్ధతులతో సుమారు 159 కిలోలకు తగ్గింది. ఇక్కడ జమైక ఎలాంటి అధునాతన ఇంజెక్షన్లు, ఖరీదైన జిమ్‌లు, అద్భుత శస్త్ర చికిత్సలు వంటివి ఏమి లేకుండా కేవలం తన పట్టుదల, సంకల్పంతో ఆ రోగాన్ని జయించి బరువు తగ్గింది. అంతేగాదు సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యింది కూడా. తన కూతురు 15 ఏళ్ల జామ్యా కారణంగానే ఈ భయానక అధిక బరువుపై విజయం సాధించానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఒక పట్టాన నయం కాని వ్యాధులను ధైర్యంగా ఎదుర్కొనడంపై అవగాహన కల్పించేలా తన కథనే వివరిస్తూ ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటోందామె.(చదవండి: చాట్‌జీపీటీ ఆధారిత డైట్‌తో..ఆస్పత్రి పాలైన వ్యక్తి..!) -
పది కిలోలు బరువు తగ్గిన భారత్‌పే సహ వ్యవస్థాపకుడు..ఆ రెండు సూత్రాలే కీలకం..!
భారతదేశపు అతిపెద్ద ఏకీకృత యూపీఐ క్యూర్ కోడ్ ప్రోవైడర్ భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, సీఈవో అష్నీర్ గ్రోవర్(Ashneer Grover) స్లిమ్‌గా మారిపోయారు. ఆయన సోనీ టీవి వ్యాపార రియాలటీ టెలివిజన్ సీరీస్ షార్క్ ట్యాంక్ సీజన్ 1లో న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి ఆయన్ను మోటా వాలా షార్క్‌గా అని పిలుస్తున్నారు. బహుశా ఆ క్రేజ్ అతడిని ఫిట్‌నెస్‌పై దృష్టిసారించేలా చేసి పదికిలోలుమేర బరువు తగ్గేందుకు దారితీసింది. ఆయన ఈ కొత్త లుక్‌లో యంగ్ ఆష్నీర్గా ఆకర్షణీయంగా ఉన్నారు. అందుకు రెండే రెండు ప్రిన్స్పల్స్ హెల్ప్ అయ్యాయట. మరి అవేంటో తెలుసుకుందామా..!.'క్రమశిక్షణ', 'సంకల్పం' వంటి రెండు సూత్రాలను గట్టిగా అనుసరిస్తే భారమైన బరువుని సులభంగా వదిలించుకోగలమని చెబుతున్నారు అష్నీర్. ఇవి రెండు ఎప్పుడూ వినే సాధారణ సూత్రాలే అయినా..ఎందులోనైనా పూర్తి స్థాయిలో విజయం సాధించాలంటే ఇవి అత్యంత కీలకం అనే విషయం గ్రహించాలి. ఇక అష్నీర్ బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించింది పోషకాహారం. కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య భోజనమేనని చెబుతున్నారు. దీంతోపాటు వ్యాయమం కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ అయ్యిందని చెప్పుకొచ్చారు. దీన్ని బరువు తగ్గడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటిగా పేర్కొన్నారు. కేలరీలు బర్న్ చేయడానికి, లీన్ కండరాలను నిర్మించడానికి, బొడ్డు కొవ్వుని తగ్గించుకోవడానికి, మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, స్థిరమైన ఫలితాలు ఇవ్వడానికి సహాయపడుతుంది. ఈ 43 ఏళ్ల వ్యాపారవేత్త వెయిట్ లాస్ అవ్వడంలో ఆహారం, సుదీర్ఘ నడక, అంగుళం నుంచి కిలో గ్రాముల బరువు తగ్గేందుకు దారితీస్తుందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేగాదు ఆరోగ్యకరమైన ఆహారం బరవు తగ్గడంలో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటని న్యూట్రిషన్ జర్నల్ ప్రచురించిన అధ్యయనంలో పేర్కొంది. ప్రోటీన్ , కార్బోహైడ్రేట్ ఆహారాలు కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం బరువు తగ్గడానికి హెల్ప్ అవ్వడమేగాక, అదుపులో ఉంచుకోగలుగుతామని పలు అధ్యయనాల్లో తేలింది. దీనికి కావల్సిందల్ల క్రమశిక్షతో కూడిన జీవనశైలి, వ్యాయామాలు, మంచి ఆహారపు అలవాట్లేనని ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ తన స్వీయానుభవంతో వెల్లడించారు. (చదవండి: హాలీవుడ్ మోడల్‌గా ఈ-రిక్షాడ్రైవర్..!) -
ఒకే ఒక్క టిప్‌తో స్లిమ్‌గా కీర్తి సురేష్ : కానీ ఈ రెండూ కీలకం
నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినపుడు బొద్దుగా ముద్దుగా ఉన్న కీర్తి సురేష్ ఉన్నట్టుండి సన్నగా మారి అభిమానులను అశ్చర్యపర్చింది. అరంగేట్రంలోనే అదరగొట్టిన ఈ మలయాళ కుట్టి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించు కుంది. ఇక ఆ తర్వాత మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది.2018లో మహానటి సావిత్రిలాగా కాస్త బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్ ఆ తరువాతమహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కారి వారి పాట చిత్రంలో స్లిమ్‌గా కనిపించింది. 2018-19లో వేగంగా బరువు తగ్గింది. దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని విశేషాలను షేర్ చేసింది. అప్పట్లో కేవలం షూటింగ్‌కి వెళ్లి వచ్చి తినేసి నిద్రపోయేదాన్ని, అందుకే మరీలావుగా కాకపోయినా కొద్దిగాబొద్దుగా కనిపించానని చెప్పుకొచ్చింది. కానీ తరువాత ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టానని ఈక్రమంలో కేవలం 9 నెలల్లో 8 నుంచి 9 కిలోలు బరువు తగ్గానని వెల్లడించింది. కేవలం కార్డియో ద్వారా తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అయ్యానని గుర్తు చేసుకుంది. రోజుకు కనీసం గంట సేపు కార్డియో వ్యాయామాలు చేసేదట. కార్డియోలో చేసినపుడు మజిల్ లాస్ ఉంటుంది. ఎలాంటి స్ట్రెంత్ ట్రైనింగ్ లేకుండానే కార్డియో చేసా త్వరగా బరువు తగ్గాను అని చెప్పింది. దీంతోపాటు, సింపుల్ డైట్ ఫాలో అయ్యానని తద్వారా తొమ్మిది కిలోల బరువు తగ్గానని తెలిపింది. అయితే తన ఇన్‌స్టాలో యెగా,ధ్యానం చేస్తున్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది కీర్తి సురేష్.నిపుణులేమంటున్నారంటే..అయితే నిపుణులు ఏమంటారంటే కార్డియో కేలరీలను బర్న్ చేయడంలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, దానిపై మాత్రమే ఆధారపడటం వల్ల కాలక్రమేణా కండరాల నష్టానికి దారితీస్తుంది. స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకోకపోతే కండరాలు బలహీనపడవచ్చు , దీర్ఘకాలంలో మొత్తం ఫిట్నెస్ తగ్గవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే స్థిరంగా బరువు తగ్గడ , మెరుగైన ఫిట్నెస్ సాధించడాని రెండు కీలక అంశాలపై దృష్టి పెట్టాలి.ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లుమొదటిది ఎంత, ఏమితింటున్నారో పరిగణనలోకి తీసుకోవాలి. కేలరీలపై జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. రెండవది వ్యాయామం.కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ ఈ రెండింటి కలయిక ఆరోగ్యకరమైంది, మెరుగైన ఫలితాలను నిర్ధారిస్తుంది. ఇది కండర ద్రవ్యరాశిని నిర్మించడమే కాకుండా జీవక్రియను మెరుగుపరుస్తుంది. బాడీ షేప్నకు, దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుందనేది నిపుణుల మాట. -
70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ రోష్ని దేవి సంగ్వాన్ డైట్ సీక్రెట్..!
చాలామంది ప్రముఖుల డైట్ సీక్రెట్ల గురించి విన్నాం. అలా చేస్తే మనం కూడా స్మార్ట్‌గా మారిపోవచ్చు అని ప్రేరణ కలిగించేలా ఉంటాయి అవి. కానీ అలా ఏదీ పడితే అది ఫాలో కావొద్దని చెబుతోంది ఈ 70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్. శరీరం మాట వినండి, అందరికీ ఒక విధమైన డైట్ ఎట్టిపరిస్థితిలో సరిపడదని కూడా సూచిస్తోంది. ఈ వయసులో కూడా చురుగ్గా బరువులు ఎత్తే ఆమె తన డైట్ సీక్రెట్‌ని షేర్ చేసుకోవడమే గాక ఎలా ఆహారం తీసుకుంటే మంచిదో కూడా సూచించారు. రోష్ని దేవి సంగ్వాన్ 68 సంవత్సరాల వయస్సులో వెయిట్‌లిఫ్టింగ్ ప్రారంభించి ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా మారారు. ఆమె ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ తన బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తూ.. ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారామె. అంత లేటు వయసులు బరువులు ఎత్తడం మొదలు పెట్టినా..అంతలా ఎనర్జీగా చేసేందుకు ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటుందంటే..రోజు పది బాదంపప్పులు, ఎండుద్రాక్ష తీసకుంటుందట. సాయంత్రం పెసరపప్పుతో చేసే అట్లు, పనీర్, ఒక కప్పు పాలు తీసుకుంటానని అన్నారు. చాలా తక్కువ మోతాదులో రైస్ తీసుకుంటానని చెప్పారామె. భారతీయ వంటకాలు శరీరానికి మంచి రిప్రెష్ని అందిస్తాయని అంటున్నారామె. పప్పు, బియ్యం, పెరుగు, ఓట్స్, బాదం, మూంగ్ చిల్లా, పనీర్లను కలిగి ఉన్న ఈ డైట్ ప్లాన్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ మిశ్రమాన్ని అందిస్తుంది. శరీరం నెమ్మదిగా జీర్ణమయ్యే శక్తిని, మెరుగైన ప్రేగు ఆరోగ్యం తోపాటు రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలు ఉండేలా చేసే పోషకమైన ఆహారం ఇది. ఇక్కడ పెసరపప్పు, బాదం, పనీర్ వంటి పదార్థాలు జీవక్రియ, కండరాల మరమతఉకు మద్దతు ఇచ్చే అద్భుతమైన శాకాహార ప్రోటీన్ వనరులు అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అయితే వెయిట్ లిఫ్టర్ రోష్ని దేవి ఈ ఆహారాలన్నీ ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ..తినే క్వాండిటీ అనేది అత్యంత ప్రధానం అని చెబుతోందామె. ఉదహారణకు నట్స్, పనీర్ పోషకాలు, కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి తీసుకునే క్వాండిటి ప్రధానం. అలాగే ఈ ఆహారాలు అందరికీ సరిపడకపోవచ్చని అంటున్నారామె. ఎందుకంటే కొందరికి లాక్టోస్ పడకపోవచ్చు, అలాగే వీటిలో కొన్ని పీసీఓడీ, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తీసుకోకూడనివి కూడా అయి ఉండొచ్చని అమె చెబుతున్నారు. ఇన్సులిన్, ధైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు ఎక్కువ ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు అవసరం కావొచ్చు. అందువల్ల ఈ డైట్‌ని ఫాలో కావొద్దని చెబుతున్నారు రోష్ని దేవి. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఆన్లైన్ కంటెంట్ ఆధారంగా ఆహారంలో మార్పులు చేయడం కంటే మంచి డైటీషియన్‌ని సంప్రదించి అనుసరించడమే మంచిదని సూచించారామె. చివరగా ఆమె ఒక్క విషయానికి తప్పక కట్టుబడి ఉండండని అంటున్నారామె. భారతీయ భోజనం సదా శక్తిమంతంగా ఉంటుంది, వ్యక్తిగతమైనది కూడా అనేది గ్రహించండని అంటోందామె. ఒక వ్యక్తికి బాగా పనిచేసిన ఆహారం మరొకరికి ఇబ్బందికరంగా ఉండొచ్చని అన్నారు. అన్నింట్లకంటే మన శరీరం చెప్పింది వినాలని అన్నారామె. సో వ్యక్తిగత వైద్యులను సంప్రదించి శరీరానికి సరపడా డైట్ తీసుకుని ఫిట్‌గా ఉందామా మరి.. View this post on Instagram A post shared by Ranveer Allahbadia (@ranveerallahbadia) (చదవండి: Parenting Tip: తండ్రి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది..! ఇవాళ సీఈవోగా..) -
55 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడిలా డాక్డర్..!
‘దీర్ఘకాల రోగాలతో రోగులు నా తలుపు తట్టని రోజునే నేను వైద్యుడిగా విజయం సాధించినట్టు’ అంటున్నారు నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డా.సుదీర్‌కుమార్. రోగులు రావాలని కాకుండా.. రోగాలు రాకూడదని కోరుకునే మంచి వైద్యుడిగా మాత్రమే కాదు రోగాల బారిన పడకుండా ఏం చేయాలి? అనే దానికి కూడా ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒకప్పుడు అధిక బరువుతో, దీర్ఘకాలిక వ్యాధితో పోరాడిన ఆయన వాటిని మందులతో కాకుండా జీవనశైలి మార్పులతో జయించవచ్చని నిరూపించారు. వైద్యుడిగా బిజీ అయిపోయాక ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గింది. వేళాపాళా లేని నిద్ర, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి.. నాకు 49 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి దాదాపు 100 కిలోల బరువుకు చేరుకున్నా. అలాగే ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి కూడా ఇబ్బంది పెట్టేంది అంటూ గుర్తు చేసుకున్నారు జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో సీనియర్ న్యూరాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్న డాక్టర్ సుదీర్ కుమార్. ఆ పరిస్థితిని తాను అధిగమించిన తీరు, స్ఫూర్తిదాయక ట్రాన్స్ఫార్మేషన్ విశేషాలను సాక్షితో పంచుకున్నారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. లాస్ గుర్తు చేసిన లాక్డౌన్ కోవిడ్–19 లాక్డౌన్ అందించిన ఖాళీ సమయం నా గురించి నేను ఆలోచించుకునే అవకాశం అందించింది. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకుని జాగింగ్ ప్రారంభించాను. రోడ్లు ఖాళీగా ఉండటం కాలుష్యం లేకపోవడం.. నా ప్రయత్నాలకు ఊతమిచ్చింది. అయితే మొదటిసారి 400 మీటర్లు మించి పరుగెత్తడానికి ప్రయత్నించినప్పుడు, నాకు ఊపిరి ఆడలేదు. కానీ ఆపడానికి బదులుగా దాన్ని నడకగా మార్చి కొనసాగించాను. పట్టు విడవకుండా ప్రయచి రోజూ 5–10 కి.మీ నడక, అలా పరుగుకు చేరుకున్నా. ‘ఎటువంటి శిక్షణ లేకుండా మారథాన్ల సమయంలో ఏడాదికి ఒకసారి మాత్రమే పరిగెత్తేవాడిని కాలక్రమేణా నగరంతో పాటు లడఖ్ తదితర చోట్ల మారథాన్లలో పాల్గొని మొత్తం 14,000 కిలోమీటర్లకు పైగా రన్ చేశా. వాటిలో 10కి.మీ పరుగులు 822, హాఫ్ మారథాన్లు 133 ఉన్నాయి. వెయిట్ లాస్.. మజిల్ మిస్.. నిర్విరామ నడక, పరుగు, డైట్లతో రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే 30 కిలోల బరువు తగ్గి 69 కిలోలకు చేరాను. అయితే, మజిల్ లాస్ (కండరాల నష్టాన్ని) కూడా గమనించా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లో చేరి 4.5 కిలోల కండర(మజిల్ మాస్) సముదాయాన్ని తిరిగి పొందాను. శారీరక శ్రమ, ప్రొటీన్ రిచ్ ఫుడ్ పెంచడం వంటి మెరుగైన ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర వంటివి ఈ సక్సెస్‌లో ఇమిడి ఉన్నాయి. అత్యంత క్రమశిక్షణతో కూడిన దినచర్య కూడా అనారోగ్యకరమైన ఆహారం వలన కలిగే నష్టాన్ని భర్తీ చేయలేదని గుర్తుంచుకోవాలి. అందుకే ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, శీతల పానీయాలను పూర్తిగా మానేశా.. పని గంటలు తగ్గించుకుని 7–8 గంటలకు నిద్ర సమయాన్ని పెంచుకున్నా అంటూ వివరించారు డా.సు«దీర్‌కుమార్. రోగాలకు చికిత్స చేయడం కాదు చికిత్స చేసే అవసరం రాకుండా చేయడం కూడా వైద్యుల బాధ్యతే అంటున్న ఆయన అందుకు తనను తానే నిదర్శనంగా మలుచుకున్న తీరు స్ఫూర్తిదాయకం. How an extremely busy Hyderabad doctor lost 30 kg weight. He started his fitness journey at 50 then completed 133 half marathons"For Dr. Sudhir Kumar, a senior neurologist at Apollo Hospital, Jubilee Hills, Hyderabad, fitness wasn’t a priority—until it became one. In 2020, at… https://t.co/q1sqombu5P— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) July 23, 2025 (చదవండి: Punita Arora: ఎవరీ పునీతా అరోరా..? సైన్యం, నేవీలలో అత్యున్నత హోదాలు..) -
5 నెలల్లో 28 కిలోలు : అమీర్ ఖాన్ అద్భుత చిట్కాలు
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తనదైన నటన, వ్యక్తిత్వంతో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. కరీయర్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలను అందించడమాత్రమే కాదు, హీరోగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను పోషించే పాత్ర కోసం ఎలాంటి ప్రయోగానికైనా వెనుకాడని నటుడు. ఫిట్నెస్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ తన ఫిట్నెస్ ప్రయాణంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు. గజని మూవీనుంచి దంగల్ దాకా ఆయన చేసిన ప్రతీ ప్రయోగమూ సక్సెస్‌ను అందుకుంది. 5 నెలల్లో 25 కిలోలకు పైగా బరువు తగ్గినా, కొన్ని నెలల్లో బరువు పెరిగినా అది ఆయనకే చెల్లు.ముఖ్యంగా అమీర్ ఖాన్ 60 ఏళ్ళ వయసులో ఫిట్ అండ్ ఫ్యాబ్‌గా ఉండటంలో ఆయనకు ఆయనే సాటి. 2016లో వచ్చిన తన బ్లాక్ బస్టర్ సినిమా దంగల్ కోసం అనూహ్యంగా బరువు పెరిగి, పాత్ర పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. భారతీయ రెజ్లింగ్ ఛాంపియన్ మహావీర్ సింగ్ ఫోగట్‌లా కనిపించేందుకు పెద్ద సాహసమే చేశారు. ఒక ప్రధాన రెజ్లర్ నుండి మధ్య వయస్కుడైన తండ్రిలా కనిపించేందుకు బాడీసూట్ ధరించడం కంటే, ఆ పాత్రకు న్యాయం చేసేందుకు సహజంగానే బరువు పెరిగి, మళ్లీ బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపరిచారు.. అమీర్ ఖాన్ దంగల్ సినిమా కోసం సుమారు 28 కిలోల బరువు తగ్గారు. కేవలం ఐదు నెలల్లో 97 కిలోల నుండి 68 కిలోలకు చేరుకున్నారు. ఈ సమయంలో తన శరీర కొవ్వు శాతాన్ని 37శాతం నుండి 9.67శాతానికి తగ్గించుకోవడం విశేషం. ఈ మూవీ దర్శకుడు నితేష్ తివారీ అమీర్ అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు."బరువు పెరగడం సరదాగానే ఉంటుంది. కోరుకున్నది తినవచ్చు. కానీ చురుగ్గా కదలలేం. శ్వాస కూడా కష్టంగా మారుతుంది. బాడీ లాంగ్వేజ్, నడక , కూర్చునే విధానం... ప్రతిదీ మారుతుంది. కానీ ఆ తరువాత బరువు తగ్గడం చాలా కష్టం అనిపించింది’’ అంటారు అమీర్. కానీ కఠినమైన ఫిట్నెస్ విధానాన్ని అనుసరించి అనుకున్నది సాధించారు. శరీర బరువులో "ఆహారం నంబర్ వన్" అంటారాయన. మీరెంత వ్యాయామం చేసినా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే ఫలితం ఉండదు. మొదట్లో నిరాశ అనిపించినా, క్రమశిక్షణతో సాగితే ఫలితం ఉంటుంది అనే ఫిట్నెస్ సీక్రెట్‌ను అమీర్ వెయిట్ లాస్ జర్నీ ద్వారా తెలుసుకోవచ్చు.యాభై శాతం ఆహారం. 25 శాతం వ్యాయామం, 25 శాతం విశ్రాంతి కావాలంటూ తన అనుభవాన్ని గతంలోనే వివరించారు అమీర్ ఖాన్. ఎనిమిది గంటలు నిద్ర లేనిదే వెయిట్‌లాస్ జర్నీలేదు అంటారాయన.రాత్రిపూట అన్నం మానేయడం, తక్కువ తినడం లేదా ఆకలితో అలమటించడం లేదా అధిక ప్రోటీన్ భోజనం తీసుకోవడం వంటివి చిట్కాలను చాలామంది పాటిస్తున్నప్పటికీ తాను మాత్రం బరువు తగ్గడానికి పాతకాలపు పద్ధతిని అనుసరించానని చెప్పారు. ‘‘2,000 యూనిట్ల శక్తిని ఖర్చు చేస్తే, అదే మోతాదులో కేలరీలు తింటే, బరువు అలాగే ఉంటుంది. అలా కాకుండా 2,000 యూనిట్ల శక్తిని ఖర్చు చేసి 1,500 కేలరీలు తింటే, ప్రతిరోజు 500 కేలరీలు తగ్గుతాయి. ప్రతిరోజూ 7 కిలోమీటర్లు నడిస్తే వారానికి 7వేల కేలరీలు ఖర్చవుతాయి. ఇది శాస్త్రం. దీంతోపాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వులు, ఫైబర్, సోడియంతో మన ఆహారాన్ని సమతులం చేసుకోవాలి అని అమీర్తెలిపారు. -
బరువు తగ్గి.. డయాబెటిస్ నుంచి బయటపడింది..!
బరువు తగ్గించుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని పలువురు నిపుణులు, వైద్యులు సూచిస్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంలో చాలామంది బరువుతగ్గే ప్రయత్నానికి పూనుకుంటున్నారు కూడా. అయితే ఈ మహిళ మాత్రం తన అధిక బరువుని తగ్గించుకోవడమే ఆమెకు వరంగా మారింది. జస్ట్ 90 రోజుల్లో మధుమేహ సమస్యకు చెక్‌పెట్టి ఔరా అనిపించుకుంది. మరి ఇంతకీ ఇదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా!.40 ఏళ్ల నార్మా లియోన్స్కు, అధిక బరువుతో ఉండటంతో ఆమె రూపు రేఖలన్నీ బొద్దుగా ఉండేవి. దీంతో అధిక ఒత్తిడికి గురై డయాబెటిస్ బారిన పడింది. తరుచుగా తన ఆహార్యాన్ని చూసుకుని కుంగిపోతూ ఉండేది. దాంతో ఆమె ఈ దీర్ఘకాలిక వ్యాధి మధుమేహం కోసం బరువు తగ్గాల్సిందే అని ఫిక్స్ అయ్యింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన నార్మాలియోన్స్కు పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల నడుమ తనపై ఫోకస్ పెట్టడం కుదురేది కాదు. ఆ నిర్లక్ష్యంగా కారణంగానే నార్మాలియోన్స్ అధిక బరువు సమస్యలను ఎదుర్కొందామె. దాంతో ఆమె తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టి బరువు తగ్గాలని పట్టుదలతో ప్రయత్నించింది. అలా ఆ తల్లి కేవలం 90 రోజుల్లో..డైట్, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి తన బరువులో గణనీయమైన మార్పలను అందుకుంది నార్మాలియోన్స్. ఫలితంగాఆ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చేశాయి. ఎలాంటి మెడిసిన్ వాడకుండానే డయాబెటిస్ నుంచి బయటపడింది నార్మాలియోస్. దాదాపు రెండు దశాబ్దల తర్వాత ..ఆ 60 ఏళ్ల తల్లి జస్ట్ ఆహారం, ఆరోగ్యంలో మార్పులు చేసుకోడంతో గణనీయమైన బరువు తగ్గి, తన అనారోగ్యాన్ని స్వయంగా నయం చేసుకుంది. ప్రీ డయాబెటిస్ అంటే..ఇక్కడ నార్మా ప్రీ డయాబెటిస్తో బాధపడుతోంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితి. కానీ టైప్2 డయాబెటిస్‌ని నిర్థారించినట్లుగా..దీన్ని ముందుగా గుర్తించడం అంత ఈజీ కాదుఈ ప్రీడయాబెటిస్ని ఆహారం, వ్యాయమాలు, చక్కటి జీవనశైలి తరితదరాలతో నిర్వహించడమే గాక తిప్పికొట్టొచ్చు. వైద్యులు ఆమెకు ఈ షుగర్ వ్యాధి కోసం నోటి ద్వారా తీసుకునే మెట్ఫార్మిన్ ఇచ్చినప్పటికీ..ఆమె వాటిని వేసుకునేందుకు తిరస్కరించింది. ఇలా చేయొద్దని వైద్యులు హెచ్చరించారు కూడా. చివరికి ఆమె మెడిసిన్ వాడనని మొండిపట్టుపట్టడంతో సరే నీ అదృష్టం అని వైద్యులు వదిలేశారు.అందుకోసం ఏం చేసిందంట..నార్మా లియోన్స్ చాలా అధ్యయనం చేసి కీటో డైట్ అనుసరించింది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లును దరిచేరనీయకుండా కేర్ తీసుకుంది. సమతుల్య ఆహారాన్ని తీసుకునేది. ప్రతిరోజూ ఉదయం గుడ్లు, బేకన్, చీజ్, చికెన్ సలాడ్, లీన్ మాంసం తదితరాలను తీసుకున్నట్లు వివరించింది. ఈ కఠినమై డైట్‌తో నార్మాలియోన్స్ కేవలం మూడు నెలల్లో పది కిలోలు తగ్గి..రక్తంలోని చక్కెర స్థాయిలను పెరగనీయకుండా చేసింది. ప్రస్తుతం ఆమె ప్రీ డయాబెటిక్ పేషెంట్ కాదని వెల్లడించారు వైద్యులు. పట్టుదలతో బరువు తగ్గింది అనారోగ్యం నుంచి కూడా బయటపడింది. ఇక్కడ కావాల్సింది ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే చాలు ఎలాంటి వ్యాధినైనా తిప్పికొట్టచ్చు అనేందుకు నార్మాలియోన్స్ వెయిట్‌లాస్ స్టోరీనే ఉదాహారణ. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: Weight Loss: బరువు తగ్గాలనుకుంటే.. ఇవిగో ఐదు చిట్కాలు!: ఫిట్నెస్ కోచ్) -
ఇలా చేస్తే.. జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోల బరువు..!
బరువు తగ్గాలని స్ట్రాంగ్ డిసైడ్ ఉన్నావారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలంటోంది ఫిట్నెస్ కోచ్ అమకా. జస్ట్ ఐదు నెలల్లోనే మంచి ఫలితాలు అందుకోవాలని ప్రగాఢంగా కోరుకుంటే ఇలాంటి చిట్కాలు అనుసరించడం మంచిదని సూచిస్తుంది. తాను ఆ రెమిడీస్తోనే ఐదు నెలల్లోనే అనూహ్యంగా కిలోలు కొద్దీ బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది. త్వరితగతిన ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే.. బెస్ట్ టిప్స్ ఇవే అని చెబుతోంది ఫిట్నెస్ కోచ్ అమకా.బరువు తగ్గాలనుకుంటున్నవారు ముందుగా తాను ఎందుకు బరువు తగ్గలనుకుంటున్నా, ఎంత వెయిట్ లాస్ అవ్వాలన్నది లక్ష్యం అనేవి స్ట్రాంగ్‌గా నిర్దేశించుకోవాలంటున్నారు అమకా. అది మీకు లక్ష్యంపై ఫోకస్ పెట్టేలా చేస్తుందట. బరువు తగ్గాలనుకునేవారు ఎవ్వరైనా సింపుల్ దినచర్యను ప్రారంభించాలని చెప్పారు. ముందుగా రోజుకు మూడు లేదా రెండు సార్లు సమతుల్య భోజనం, పది నుంచి 20 నిమిషాల నడక, రెండు లీటర్ల నీరు, మంచి నిద్ర, సరైన క్వాంటిటీలో తీసుకోవడం వంటివి చాలని చెప్పారు. ఇక్కడ ఆహారం శరీరానికి సరిపడ పోషకాలు అందేలా సంతృప్తిని కలిగించేలా ఉండాలని చెప్పారు. అతిగా తినడాన్ని నివారించాలన్నారు. ముఖ్యంగా ప్రతి భోజనంలో ప్రోటీన్, అధిక ఫైబర్ తప్పనిసరిగా భాగం చేసుకోవాలని చెప్పారు. కార్బోహైడ్రేట్లు కూడా తగు మోతాదులో తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా సమతుల్యతను పాటిస్తే చాలు ఎలాంటి ఆహారమైనా ధైర్యంగా తినొచ్చని చెబుతున్నారామె. ప్రతి రోజు వాకింగ్, చక్కెర పానీయాలు దూరంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యం. ఈ చిన్నపాటి రెమిడీలు భారీ ఫలితాలను అందించి..శరీరంలో సత్వర మార్పులకు నాంది పలుకుతుందట. ఇలా స్ట్రిక్ట్‌గా డైట్‌ని అనుసరిస్తే..జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోలు మేర బరువు తగ్గుతారట. తాను కూడా అలాంటి సింపుల్ చిట్కాలను అనుసరించే ఐదునెలల్లోనే 25 కిలోలు పైనే తగ్గానని చెప్పుకొచ్చింది. ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే ఈ విధానం చాలా హెల్ప్ అవుతుందని సూచిస్తోంది ఫిట్నెస్ కోచ్ అమకా. View this post on Instagram A post shared by CERTIFIED NUTRITIONIST (@shred_with_amaka) (చదవండి: Mona Singhs weight loss journey: యోగా, డైట్‌తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్‌గా మోనాసింగ్) -
యోగా, డైట్‌తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్‌గా మోనాసింగ్
బరువు తగ్గడంలో ఎందరో ప్రముఖుల, సెలబ్రిటీలు స్ఫూర్తిగా నిలిచారు. అయినప్పటికీ అత్యంత కష్టసాధ్యమైన ఈ టాస్క్‌ని వ్యసనంలా చేస్తే ఈజీగా బరువు తగ్గిపోవచ్చట. అలా పూర్తి ఫోకస్ పెట్టి చేస్తేనే..కచ్చితంగా త్వరిత గతిన బరువు తగ్గిపోతారట. అదీగాక చూస్తుండగానే వేగవంతంగా మనలో వస్తున్న మార్పులను చూసి ఆత్మవిశ్వాసంగా ఫీలవుతామని అంటోంది ప్రముఖ బాలీవుడ్ నటి మోనాసింగ్. అదెలాగో సవివరంగా చూద్దామా..!.బాలీవుడ్ టెలివిజన్ సీరియల్‌తో జస్సీ జైస్సీ కోయి నటి మోనాసింగ్ పలు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. లాల్ సింగ్ చద్దా, అమావాస్, 3 ఇడియట్స్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చివరగా ముంజియా అనే మూవీలో కనిపించారు. గత కొంత కాలం మూవీలకు దూరంగా ఉన్నా ఆమె పాన్ పర్దా సర్దా అనే గ్యాంగ్ స్టర్ సిరీస్ కోసం బరువు తగ్గాలని నిర్మాతలు కోరడంతో వెయిట్ లాస్ అయ్యేందుకు సద్ధమైనట్లు తెలిపింది. వాస్తవానికి ఆమె కూడా గత కొన్నాళ్లుగా బరువు తగ్గాలని అనకుందని గానీ కుదరలేదు. కొత్త ఏడాది సందర్భంగా కూడా బరువు తగ్గే ప్రయత్నం చేయాలనకున్నా సాధ్యం కాలేదు. కానీ ఆ సిరిస్‌లో తన పాత్ర కోసం బరువు తగ్గక తప్పదని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి వెంటనే కసరత్తులు ప్రారంభించింది. నిజానికి బరువు తగ్గడం అనగానే నచ్చిన ఆహారం త్యాగం చేయడం అని ఫీలవుతుంటారు. కానీ ఫలితాలు మంచిగా వస్తున్నప్పుడల్లా అదేమంతా భారమైన పని కాదని అదిమలనో భాగమయ్యేలా వ్యసనంలా మారిపోతుందని అంటోంది మోనాసింగ్. బరువు తగ్గడం అంటే..మంచి ఆకృతిలోకి మారి అందంగా కనిపించడం అనుకుంటే ఏమంత కష్టం కాదట. తాను వెయిట్ లాస్కి ఉపక్రమిస్తున్నా అనగానే..తినే ఆహరంపై స్పష్టత కలిగి ఉండటం, వ్యాయామాలు చేయడమని ఫిక్స్ అయ్యానంటోంది. తన యోగా గురువు చెప్పిన అద్భత ట్రిక్ ఫాలో అవ్వడంతోనే కేవలం ఆరునెలల్లో ఏకంగా 15 కిలోలు తగ్గానని అంటోంది. "రోజుకి ఒకపూట తింటే ఆరోగ్యం, అదే రెండు పూటలా తింటే అనారోగ్యం, అలా కూడా కాకుండా మూడు పూటలా తింటే రోగి" అని ఆదే ఆరోగ్య సూత్రమని చెప్పుకొచ్చింది. తాను ఆరోగ్యకరమైన జీవనశైలితోనే ఇంతలా బరువు తగ్గినట్లు వివరించింది. రాత్రి 9.30 కల్లా నిద్రపోతే సగం అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటోంది. మనకోసం మనం సమయం కేటాయించు కోవాలని సూచించింది. ఇన్నాళ్లు సోమరితనం కారణంగానే దీన్ని సాధించలేకపోయాని చెప్పింది. ఆరోగ్యకరమైన బరువుని నిర్వహించడమే కష్టం తప్ప బరువు తగ్గడం కష్టం కాదంటోదామె. ఆరోగ్య నిపుణుల సంరక్షణలో మంచి జీవనశైలిని పాటిస్తే త్వరితగతిన మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతోంది మోనాసింగ్.(చదవండి: ఆ మట్టి'..మెళియాపుట్టి..! ఔరా అనిపిస్తున్న కళాకారులు..) -
డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..! మసాబా గుప్తా హెల్త్ టిప్స్
బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా, నటుడు సత్యదీప్ మిశ్రా దంపతులు గతేడాది అక్టోబర్‌లో పండంటి బిడ్డకు స్వాగతం పలికారు. ఓ తల్లిగా బిడ్డతో బిజీ బిజీగా లైఫ్ సాగిపోతున్నా.. ఆమె తన ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ని పెట్టడమే కాదు అదనపు బరువుని కూడా తగ్గించుకున్నారు. సాధారణంగా ప్రతి మహిళ ప్రెగ్నెన్నీలో బరువు పెరగడం సహజం. అయితే ప్రసవానంతరం ఆ బరువుని తగ్గించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అయితే మసాబా మాత్రం దాన్ని ఈజీగానే సాధించారు. పైగా డెలివరీ తర్వాత బరువు ఎలా తగ్గించుకోవచ్చో వివరిస్తూ..టిప్స్ కూడా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..ప్రసవానంతరంలో ఆహారంలో కొద్దిమార్పులు చేసుకుంటే బరువు తగ్గడం సులభం అని అంటోంది. తాను ప్రసవానంతరం ఆరు నెలలు బాదం పాలు, వేయించిన కూరగాయలు, కాల్చిన చేప, ఎల్లప్పుడూ తేనె బాల్సమిక్ వెనిగ్రెట్(క్రంచింగ్ కోసం విత్తనాలు) తీసుకున్నట్లు తెలిపారు. వాటి తోపాటు గుడ్లు, వేరుశెనగ, వెన్నటోస్ట్, బీట్రూట్, చికెన్, ఓట్స్ అంజూర పండ్లు, తదితరాలు తీసుకునేదాన్ని. తల్లిగా బిడ్డకు పాలిచ్చేలా, తన బరువు బ్యాలెన్స్ చేసుకునేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్‌నే తీసుకునేదాన్ని అని ఆమె వివరించారు. అలాగే కుదిరినంతలో తేలికపాటి వ్యాయామాలు, కెటిల్‌బెల్ సెషన్ వ్యాయామాలు తదితరాలు చేశానని చెప్పుకొచ్చారు. ఇవి కండరాల కదలికలకు, ఫ్యాట్‌ని కరిగించడంలో సమర్థవంతంగా ఉంటాయని అన్నారు. అలా తాను పదికిలోలు బరువు తగ్గినట్లు వివరించారామె. స్ట్రాంగ్ ఫోకస్ ఉంటేనే బరువు తగ్గడం సాధ్యమవుతుందని అంటోంది మసాబా గుప్తా.(చదవండి: అరుదైన స్ట్రోక్‌తో..మెడుల్లాపై దాడి!) -
బరువు తగ్గాలంటే.. టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్
బరువు తగ్గించుకునే క్రమంలో చప్పచప్పగా తింటూ విసిగిపోయారా? వెయిట్ లాస్జర్నీకి భంగం కలగకుండా ఉండేలా, బోరింగ్ స్నాక్స్ కాకుండా హెల్దీగా, సంతృప్తి కరంగా ఉండేలా కొన్ని రకాల ఆహారాలను తయారు చేసుకోవచ్చు. ఇవాల్టీ టిప్ ఆఫ్‌ది డేలో భాగంగా రుచితోపాటు, సంతృప్తిగా, బరువుతగ్గడంలోనూ కూడా సాయపడే వంటకాల గురించి తెలుసుకుందాం.చనా లేదా చిక్పీస్, లేదా కాబూలీ శనగలు ఎలా పిలిచినా ఇవి పోషకాల గని. వీటినే తెల్ల శనగలు అని కూడా అంటారు. వీటిల్లో ప్రోటీన్, ఫైబర్, ఎన్నో విటమిన్స్, మినరల్స్ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బోర్ కొట్టకుండా, వెరైటీగా, రుచికరంగా ప్రోటీన్-ప్యాక్డ్గా స్నాక్స్, కూర ,సలాడ్ ఇలా ఎన్నో.. సులభంగా తయారు చేసుకోవచ్చు .కాబూలీ శనగలకూర (Kabuli Chana Curry)కావలసినవి: బాగా నానబెట్టి ఉడించిన కాబూలి శనగలు, ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, ఉప్పు.ఒక ప్యాన్‌లో నూనెగానీ నెయ్యిగానీ వేసి వేడెక్కిన తరువాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ,పచ్చిమిర్చి, టొమాటోవేసి వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరంమసాలా వేయించుకోవాలి. వేగాక ఉడికించి పెట్ఘుకున్నశనగలు వేసి ఉడికించాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. బాగా దగ్గరికి వచ్చిన తరువాత టేస్ట్ చూసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన కర్రీ రెడీ.. అన్నంలోగానీ, చపాతీలు, రోటీలోకి గానీ భలే టేస్ట్‌గా ఉంటుంది.Kabuli Chana Pulao కాబూలీ శనగలతో పులావ్ కావలసినవి: కాబూలి శనగలు, బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం-వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, గరం మసాల దినుసులు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పులావ్ఆకులు), ఉప్పు.తయారీ: ఒకప్యాన్లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి మసాలాలు వేసి వేయించుకోవాలి. తరువాతతరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేగాక అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. బాగా వేగిన తరువాత నీళ్లు, బియ్యం, శనగలు వేసి సాల్ట్ టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉడికిన తరువాత కొత్తిమీర, పుదీనాతో గార్నీష్ చేసుకుంటే పులావ్ రెడీ. ఇలా ఉత్తినే తీనేయవచ్చు. లేదా పుదీనా, అల్లం చట్నీతో తినవచ్చు.సలాడ్కావలసినవి: కాబూలి శనగలు, ఉల్లిపాయలు, టొమాటోలు, కీరా నిమ్మరసం, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు.తయారీ: రాత్రంతా నానబెట్టిన ఉడికించిన శనగలు, సన్నగా తరిగిన ముక్కలు, నిమ్మరసం, చాట్ మసాలా, ఆలివ్ ఆయిల్( ఆప్షనల్) వేసి బాగా కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలు.చనా మసాలాకావాల్సినవి : ఉడికించి పెట్టుకున్నశనగలు కాశ్మీరీ ఎండుమిర్చి, టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మసాలాలు (దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు , బిర్యానీ ఆకులు, ధనియాలు, జీలకర్ర , సోంపు)ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యివేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేస్ట్, మసాలాలు బాగా వేయించాలి. పాన్ అడుగున అంటు కోకుండా తిప్పుతూ బాగా వేయించాలి. ఆ తరువాత తరిగి ఉంచుకున్న టమాటాలు ముక్కలు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి, ఉడికాక శనగలు వేసి ఉప్పు, నూనెపైకి వచ్చేదాకా బాగా ఉడికించాలి. రుచి చూసుకొని తినేముందు నిమ్మరసం కలిపి, పైన కొత్తిమీర చల్లుకున్న ఘుమఘుమలాడే చనా మసాలా రెడీ..కాబూలీ శనగల స్నాక్స్రాత్రంతా నానబెట్టి ఉడికించిన కాబూలి శనగలు. నూనె, ఉప్పు, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి. శనగలను నూనెలో బాగా వేయించి, మసాలాలు కూడా యాడ్ చేసి మరికొద్దిసేపు వేగించి ఆరగించడమే.ఇవి కాకుండా ఉడికించిన శనగలను మెత్తగా చేసి, మసాలాలు జోడించి కట్లెట్స్ లాగా చేసుకోవచ్చు. శెనగ పిండితో కలిపి బజ్జీలు చేసుకోవచ్చు.శనగలతో లాభాలురోగనిరోధక శక్తికి కూడా శనగలు చాలా మంచివని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ బి9, మెగ్నీషియం, జింక్ తదితర పోషకాలుంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇదొక యాంటి ఆక్సిడెంట్ కూడా. గ్లూటెన్ రహితం కాబట్టి షుగర్, అదుపులో ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. బెల్లీ ఫ్యాట్‌ను కరిగిస్తుంది. చర్మ సంరక్షణకు కూడా మంచిదేనోట్: శనగలు ఆరోగ్యానికి మంచిది. కానీ ఏదైనా అతిగా తినడం మంచిది కాదు కొంతమందికి గ్యాస్ సమస్యలు రావచ్చు. ఏవైనా సందేహాలు, సలహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.) -
నో ఫ్యాషన్ డైట్.. జస్ట్ ఆరు నెలల్లో 17 కిలోలు! స్లిమ్‌గా నటి దీప్తి సాధ్వానీ
బరువు తగ్గేందుకు సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందరు నానాప్రయాసలు పడి మరీ స్లిమ్‌గా మారుతున్నారు. ఆహార్యం పరంగానే కాదు ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉండాలన్నదే అందరి అటెన్షన్. అయితే ఆ బరువు తగ్గే ప్రయాణం అంత ఈజీగా విజయవంతం కాదు. ఎందుకంటే..ఎక్కడ రాజీపడని దృఢ సంకల్పంతో ముందుకు సాగినవారే మంచి ఫలితాలను అందుకుని చక్కటి ఆకృతితో మన ముందుకు వస్తున్నారు. అలాంటి కోవలోకి బాలీవుడ్ బుల్లితెర నటి తారక్ మెహతా కా ఊల్తా చాష్మా ఫేమ్ దీప్తి సాధ్వానీ కూడా చేరిపోయారు. ఎలాంటి షార్ట్కట్లు డైట్లు పాటించకుండానే ఆరోగ్యవంతంగా బరువు తగ్గి అందరిచేత ప్రశంసలందుకుంటోంది దీప్తి. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో సవివరంగా చూద్దామా..!.34 ఏళ్ల దీప్తి సాధ్వానీ తారక్ మెహతా కా ఊల్తా చాష్మాలో ఆరాధన శర్మ పాత్రతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సంపాదించుకున్న నటి. గతేడాది తన బ్యూటిఫుల్ లుక్‌తో ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచింది. ఇండ సడెన్‌గా అంతలా మెరుపు తీగలా ఎలా అని విస్తుపోయారంతా. అంతలా తన ఆహార్యాన్ని మార్చుకుంది దీప్తి. అంతేగాదు తాను ఎలా స్లిమ్‌గా మారిందో కూడా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారామె. తాను ఎలాంటి క్రాష్ డైట్లు ఫాలో కాలేదని, కనీసం బరువు తగ్గే మాత్రలను కూడా ఉపయోగించలేదని చెప్పుకొచ్చింది. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామాలతోనే బరువు తగ్గించుకున్నానని తెలిపింది. అయితే ఏ నెల స్కిప్ చేయకుండా వెయిట్‌లాస్ జర్నీని విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించింది. అలాగే బరువు తగ్గడం ఏమంత సులువు కాదని చెబుతోంది. ఇక్కడ అంకితభావంతో డుమ్మా కొట్టకుండా పాటిస్తేనే మంచి ఫలితాలు త్వరితగతిన పొందగలమని చెబుతోంది. ముఖ్యంగా చక్కెరకు సంబంధించినవి, ప్రాసెస్ చేసిన ఆహారాలను దరిచేరనివ్వకుండా చేస్తే చాలు బాడీలోని మార్పులు త్వరితగతిన సంతరించుకుంటాయంటోంది. దీంతోపాటు రోజుకి 16 గంటలు అడపాదడపా ఉపవాసం ఉంటుందట. అలాగే మైండ్‌ఫుల్ కేలరీ ట్రాకింగ్ వీటన్నింటితో సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకున్నానని చెబుతోంది. ఇవి మంచివేనా అంటే..కెనడాలోని కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ జర్నల్ సైతం అడపాదడపా ఉపవాసం అనుసరించే వ్యక్తులు తక్కువ వ్యవధిలో 0.8% నుండి 13% బరువు తగ్గుతారని పేర్కొంది. అలాగే కేలరీలరట్రాకింగ్అనేది కూడా అత్యంత ఆరోగ్యకరమైన రీతిలో ఉంటే బరువు తగ్గడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందట. ఇక దీప్తి వ్యాయమాలు దగ్గరకు వచ్చేటప్పటికీ బాక్సింగ్, ఈత, వైమానిక యోగా వంటివి చేసినట్లు వెల్లడించింది. ఒకటే రొటీన్ వ్యాయమాలు కాకుండా మారుస్తూ చేస్తూ.. ఉంటే..బాడీకి స్వాంతన తోపాటు..చేయాలనే ఉత్సాహం వస్తుందని చెబుతోంది. ఇక్కడ బరువు తగ్గడం అనేది శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుందనని అంటోంది దీప్తి సాధ్వానీ. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..) -
జస్ట్ 15 వారాల్లో 50 కిలోలు ..! కానీ ఆ వ్యాధి కారణంగా..
బోనీ కపూర్, మోనా శౌరీ కపూర్ల తనయుడు అర్జున్ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు ఎలా ఉండేవాడు తెలిస్తే విస్తుపోతారు. చక్కటి ఫిజిక్‌తో హీరో లుక్‌లో కనిపించే అర్జున్ బాల్యంలో చాలా బొద్దుగా ఉండేవాడట. జంక్ ఫుడ్ అంటే మహా ఇష్టంగా లాగేంచేవాడట. దాంతో టీనేజ్ వయసులో 140 కిలోల అధిక బరువుతో ఉండేవాడు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేమందే తన రూపు రేఖలను అందరు ఇష్టపడేలా మార్చుకున్నాడు అర్జున్. అతడి న్యూ లుక్ చూసి ఇంట్లో వాళ్లే ఆశ్చర్యపోయారట కూడా. మరి అంత అధిక బరువుని అర్జున్ ఎలా తగ్గించుకున్నాడో ఆయన మాటల్లోనే సవివరంగా చూద్దామా..!.ఇషాక్జాదే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడంతోనే తన లుక్‌ని పూర్తిగా మార్చుకున్నాడట. పూర్తి ఫిట్నెస్తో స్మార్ట్‌గా మారాకే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారట అర్జున్. తన వెయిట్ లాస్ జర్నీలో మంచి మార్పు తీసుకువచ్చింది మాత్రం వాకింగ్ అని చెబుతారు అర్జున్. ఇది తనను శారీరకంగా చురుకుగా ఉండేలా చేస్తుందని అన్నారు. బరువు తగ్గాలనుకుంటే ముందు వాకింగ్‌కే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు కపూర్. తను మంచి ఆహారప్రియుడునని, జంక్ ఫుడ్ అంటే మహా ఇష్టమని చెప్పుకొచ్చారు. అయితే తాను ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చక్కెర కలిగిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. తాజా పండ్లు, కూరగాయలు, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలనే తీసుకుంటానని చెప్పారు. తన రోజు వారి డైట్ ఎలా ఉంటుందో కూడా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు వంటి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు అధికంగా ఉంటాయిని చెప్పారు. భోజనంలో టర్కిష్ కబాబ్‌లు, పుదీనా చట్నీ, కూరగాయల సలాడ్లు వంటివి తప్పనిసరి అని అన్నారు. అలాగే జిమ్‌లో సర్క్యూట్ ట్రైనింగ్, క్రాస్ ఫిట్ ట్రైనింగ్, కార్డియో వంటి వ్యాయామాలు చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యాధి కారణంగా మళ్లీ అధిక బరువు బారిన పడ్డానంటూ నాటి చేదు జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నారు అర్జున్. 2024లో అర్జున్ హషిమోటోస్ థైరాయిడిటిస్ వ్యాధి నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇది జీవక్రియను నెమ్మదించి, బరువు పెరిగేలా చేసే ఆటో ఇమ్యూన్ పరిస్థితి అని తెలిపారు. దీని వల్ల అధిక బరువుని ఎదుర్కొనక తప్పదని తెలుసుకుని చాలా నిరాశకు లోనయ్యానంటూ నాటి బాధను గుర్తుతెచ్చుకున్నారు. అయితే తాను ఆ వ్యాధితో పోరాడలి లేదా అధిక బరువుతో ఉండాలి అనే రెండు ఆప్షన్లే తన ముందు కనిపించాయంటూ భావోద్వేగంగా మాట్లాడారు. దాంతో తాను ఎలాగైన ఆ వ్యాధిని జయించేలా ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకుని..తన వెయిట్‌లాస్ జర్నీని కొనసాగించానని చెప్పుకొచ్చారు. తాను ఎదుర్కొంటున్న వ్యాది తన అమ్మ మోనా శౌరీ కపూర్, సోదరి అన్షులా కపూర్‌కి కూడా ఉందని అన్నారు. అయితే ఆ వ్యాధి పెడుతున్న ఇబ్బందిని అధిగమిస్తూ..ఆరోగ్యంగా ఉండేలా కేర్ తీసుకోవడంతో బరువుని అదుపులో ఉంచుకున్నానని చెప్పుకొచ్చారు. తన వెయిట్ లాస్ జర్నీకి బ్రేక్ ఉండదని..అది అలా సాగుతుందని నవ్వుతూ చెప్పారు అర్జున్. అంతేగాదు అందరిని ఆరోగ్యంగా ఉండండి, ఏదైనా అనారోగ్యం బారిన పడితే కుంగిపోవద్దు..ఎలా బయటపడాలో ఆలోచించండి అని సూచిస్తున్నాడు అర్జున్ కపూర్. (చదవండి: పరాఠా విత్ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..! నటి కరీనా కపూర్ కూడా..) -
నో జిమ్, ఓన్లీ చాట్‌జీపీటీ, డంబెల్స్ 18 కిలోలు తగ్గి మెరుపు తీగలా
అధిక బరువును తగ్గించుకుని ఫిట్‌గా ఉండాలని అందరూ అనుకుంటారు. కొందరు అనుకోవడంతోనే సరిపెట్టుకుంటారు. మరికొందరు దాన్ని సాధించి తీరతారు. అదీ ఖరీదైన జిమ్‌లు, క్రాష్ డైట్లు ఇలాంటివేమీ లేకుండానే శరీరం మీద అవగాహన పెంచుకుని, అధిక బరువును తగ్గించుకుంది. 20 ఏళ్ల వయసులో చాలా పట్టుదలగా అదీ సింపుల్ చిట్కాలతో ఫిట్నెస్ సాధించింది. పదండి ఆమె పాటించిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రముఖ కంటెంట్ సృష్టికర్త ఆర్య అరోరా జత డంబెల్స్ , కొంచెం స్వీయ-అవగాహన, చాట్‌జీపీటీ సాయంతో 18 కిలోల బరువు తగ్గింది. ఈ వెయిట్ లాస్జర్నీని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు, వీడియోల ద్వారా అభిమానులను ఆకర్షిస్తోంది.తన విజయానికి కారణమైన చిట్కాల గురించి పంచుకుంటూ ఆర్య వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏడంటే ఏడు టిప్స్జిమ్ వర్కౌట్స్, ఫ్యాన్సీ డైట్ ఇవేమీ లేకుండా 18 కేజీల బరువు తగ్గింది. ఆర్య మొదట్లో అధిక బరువుతో బాధపడేది. కానీ , ఇపుడు స్లిమ్ అండ్ ట్రిమ్గా మారిపోయింది. ఇందుకు 7 చిట్కాలు ఫాలో అయినట్టు పేర్కొంది. View this post on Instagram A post shared by Aryaa Arora (@wutaryaadoin)BMR : ముందు తన శరీరానికి అవసరమైన కేలరీల గురించి అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. ఇందుకు చాట్ జీపీటీ సాయాన్ని తీసుకుంది. ChatGPT ప్రాంప్ట్‌ని ఉపయోగించి తన బేసల్ మెటబాలిక్ రేట్ (BMR)ను అంచనావేసింది. రోజువారీ కేలరీల అవసరాలను నిర్ణయించడంలో సహాయపడే మెట్రిక్. బరువు తగ్గడానికి కేలరీ ఇంటేక్ ఎంత? అని చాట్ జీపీటీని కోరింది. తన శరీరాకృతిని బట్టి ఏఐ ఇచ్చిన డేటాతో సరైన కేలరీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన పోర్షన్-బ్యాలెన్సింగ్: ఆర్య పోర్షణ్ బ్యాలెన్సింగ్ ప్రధానంగా పాటించింది. 40% ప్రోటీన్, 30% ఫైబర్, 20% కార్బోహైడ్రేట్లు, 10% ఆరోగ్యకరమైన కొవ్వులు.పరిమితంగా తినడం పరిష్కారం కాదని,అవగాహన , నియంత్రణ ముఖ్యమని స్పష్టం చేసింది. "కటింగ్ లేదు, బ్యాలెన్స్ మాత్రమే" అంటుంది. View this post on Instagram A post shared by Aryaa Arora (@wutaryaadoin)బరువు తగ్గడమే కాదు ఎనర్జీ పెంచుకోవాలి : బరువు తగ్గడం, ఫ్యాట్‌ను కరిగించడంతోపాటు బాడీకి శక్తి కావాలి, దానికి తగ్గ వ్యాయామం కావాలి అంటుంది ఆర్య. ఈ విషయంలో తనకైతే డంబెల్స్చాలు అంటుంది.2.5 కిలోలతో ప్రారంచి, 5 కిలోల డంబెల్స్‌తో వర్కైట్స్ చేసింది. రోజూ నడక, రెండు రోజులు , 4 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో కండరాలు దృఢంగా మారడంతో పాటు వేగంగా శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని ఆర్య తెలిపింది. క్యాలరీల లెక్కలు: ఆర్య క్యాలరీల అవగాహన రావాలంటే వారం రోజులు చాలు అని, అలాగ ఒక వారంపాటు తన ఆహారాన్ని ట్రాక్ చేసుకుంటూ, ఆహార అలవాట్లను బాగా అర్థం చేసుసుకుని ఆచరించినట్టు తెలిపింది.జంక్ ఫడ్ : జంక్ ఫుడ్ విషయంలో 80:20 నియమాన్ని పాటించిదట. తినే ఫుడ్ లో జంక్ ఫుడ్ శాతాన్ని 20 శాతానికి పరిమితం చేసింది. ప్రాసెస్ చేసిన ఫుడ్, చక్కెర, పిండి, నూనె పదార్థాలు, ఫ్రై చేసిన ఫుడ్ ను తీసుకోవడం ఆమె తగ్గించింది. నీళ్లు, నిద్ర: బరువు తగ్గే క్రమంలో రోజుకు 2-3 లీటర్ల నీరు, 7-8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరమని తద్వారా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగి, జీర్ణ క్రియ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది.హార్మోన్స్ : బరువు తగ్గడంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని ఆర్య తెలిపింది. ఇందుకోసం క్రమం తప్పకుండా చదవడం, ధ్యానం కృతజ్ఞతా భావంతో ఉండటం ఇవి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొంది. -
తరచు బరువు తగ్గి, పెరగడం వెనుక కారణం అదే..: విద్యా బాలన్
నిర్భయమైన వైఖరి స్వీయ వ్యక్తీకరణకు పేరుగాంచిన విద్యాబాలన్, నటన, గ్లామర్ల కలబోతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. దక్షిణాది నటి సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ ద్వారా సౌత్ ప్రేక్షకల ప్రశంసలూ దక్కించుకున్న విద్యాబాలన్‌కు తరచుగా ఎదురయే విమర్శ, లేదా సలహా ఏదైనా ఉందంటే అది ఆమె ఓవర్ వెయిట్ గురించి మాత్రమే. గతంలోనూ కొన్నిసార్లు బరువు పెరిగి తగ్గి, పెరిగి...మార్పులకు గురవుతున్న విద్యాబాలన్... ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల సందర్భంగా తన శరీరపు బరువు విషయంలో సంవత్సరాలుగా తనపై వచ్చిన విమర్శల నేపధ్యంలో ఈ సమస్యను అధిగమించడానికి తాను పడిన వ్యయ ప్రయాసల్ని ఆమె వెల్లడించింది.‘ నేనొక సిగ్గుపడని ఆశావాదిని నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. బరువు తగ్గడానికి నేను చేయని పోరాటం లేదు. నిజాయితీగా చెప్పాలంటే, ఆ విషయానికి వస్తే నాలో ఏ తప్పు లేదని నేను అనుకుంటున్నాను అంటుందామె. బరువుపై విమర్శలను చూసి బెదిరిపోని ఆమె మనస్తత్వం, విమర్శలను తట్టుకోవడానికి సినీరంగంలో కొనసాగడానికి సహాయపడిందని ఆమె అభిప్రాయపడుతోంది. ‘‘ఆ వైఖరి నాకు సహాయపడింది. నేను ప్రధాన పాత్రలు పోషించడం కొనసాగించాను ఎలాంటి అభద్రతాభావాలు నన్ను ఎప్పుడూ వెనక్కి నెట్టలేదు‘ అంటూ ఓవర్ వెయిట్ అనే సమస్యను జయించడానికి ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో చెప్పకనే చెబుతుందామె.‘నా జీవితాంతం, నేను సన్నగా మారడానికి ప్రయత్నించాను. తీవ్రమైన ఆహార నియమాలు పాటించాను. అన్ని రకాల వ్యాయామాలను చేశాను. కొన్నిసార్లు బరువు తగ్గాను, కానీ మళ్లీ తిరిగి బరువు పెరిగిపోయేదాన్ని.‘ అంటూ గుర్తు చేసుకుంది.ఇటీవల బాగా వెయిట్ లాస్ అయి స్లిమ్ గా కనపడుతున్న విద్యాబాలన్...ఈ సంవత్సరం ప్రారంభంలో చెన్నైకి చెందిన పోషకాహార సంస్థ తో కనెక్ట్ అయినప్పుడు తన సమస్య ఏమిటో తనకి అర్ధం అయిందని చెప్పింది. ‘వారు నాకు, ’మీది కొవ్వు కాదు, అది ఇన్ఫ్లమేషన్’ అని చెప్పారు. అది నా విషయంలో గేమ్–ఛేంజర్ గా పనిచేసింది అని ఆమె వివరించింది తాను స్వతహాగా శాఖాహారిని అని కూరగాయలు తింటున్నా కూడా బరువు పెరగడానికి కారణం ఈ సంస్థను కలిసిన తర్వాత తనకు అర్ధమైందని అంటోంది. ‘‘ అన్ని కూరగాయలు ఆరోగ్యకరమైనవని మనం అనుకుంటాము, కానీ అది నిజం కాదు. మీ శరీరానికి ఏది సరైనదో మీరు అర్థం చేసుకోవాలి. మరొకరికి పనికొచ్చేది మీకు పనికి రాకపోవచ్చు. అదే విధంగా పాలకూర సొరకాయ వంటి కొన్ని నాకు సరిపోవని నాకు అంతకు ముందు తెలియదు’’ అంటూ వెల్లడించింది.ఆత్మవిశ్వాసం అద్దం నుంచి రాదు అది లోపలి నుంచి వస్తుంది అని అంటున్న విద్య... దీర్ఘకాలంగా తాను చేస్తున్న బరువుపై పోరాటంలో సరైన సక్సెస్‌నే సాధించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె తన ఆహారంలో ‘ఇన్ఫ్లమేషన్ను తొలగించే‘ విధానాన్ని అవలంబించింది, శరీర బరువు త్వరగా తగ్గించగలిగింది. అవగాహనతో కూడిన ఈ విజయం ఇకపైనా కొనసాగిస్తుందని ఆమె అభిమానులు ఆశించవచ్చు. -
69 ఏళ్ల ఏజ్‌లో స్లిమ్ అండ్ ట్రిమ్గా : ఈ సిక్రెట్ వెనకాల ‘జగదేక సుందరి’ (ఫొటోలు)
-
జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్ లుక్ వైరల్
అందాల నటి జగదేకసుందరి, దివంగత శ్రీదేవి భర్త, చిత్ర నిర్మాత బోనీ కపూర్ న్యూలుక్లో కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేశాడు. 69 ఏళ్ల వయసులో కేవలం జ్యూస్ డైట్ తర్వాత 26 కిలోలు తగ్గి అంత స్లిమ్‌గా మారాడనే విషయంలో మరోసారి నెట్టింట సందడిగా మారింది. ముఖ్యంగా నిర్మాత కరణ్ జోహార్, టీవీ నటుడు రామ్ కపూర్ బాగా బరువు తగ్గి, న్యూలుక్లో అలరిస్తున్న నేపథ్యంలో వైరల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బోనీ కపూర్ తాజా చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. కపూర్ క్రమశిక్షణతో కూడిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లను నివారించడం, తరచుగా విందుకు బదులుగా తేలికపాటి సూప్‌లను ఎంచుకోవడం ద్వారా ఈ పరివర్తనను సాధించాడట తాను బరువు తగ్గడం వెనుక ప్రేరణ తన భార్య శ్రీదేవి అని 2024లో మీడియాకు ఇంటర్వ్యూలో బోనీ కపూర్ తెలిపాడు. ‘నేను నిన్ను కలిసినప్పుడు, నువ్వు సన్నగా, ట్రిమ్ గా, పొడవుగా అందంగా ఉన్నావు.. ఇపుడు చూడు ఎలా ఉన్నావో.. అంతకంటే నిన్ను ఏమి అడగలను చెప్పు ’’అని నిరంతరం గుర్తు చేసేదట. ఆరోగ్య కారణాల వల్ల, రీత్యా బరువు తగ్గించుకోవాలని కోరుకునేదట. అంతేకాదు కలిసి జిమ్‌కి, వాకింగ్‌కు తీసుకెళ్లేది.. ఆమె కోరుకున్నట్టుగా 10-12 రోజులు కొనసాగించి కానీ కొన్ని సమస్యల కారణంగా మానేశా’ అని తెలిపాడు.కానీ తరువాత సిన్సియర్‌గా ప్రయత్నించి, కొంత బరువును తగ్గించుకున్నాడు. ప్రస్తుతం ఏకంగా 26 కిలోల బరువు తగ్గాడు. మొదట్లో బోనీ కపూర్ బరువు తగ్గడానికి రహస్యం ఏమిటంటే డిన్నర్ మానేసి సూప్ మాత్రమే తాగేవాడు. దీంతో కొంత బరువు తగ్గడంతో మరింత ప్రయత్నించి బ్రేక్‌ఫాస్ట్‌లో పళ్ల రసాలు, జొన్న రోటీ డైట్‌తో 26 కిలోలు తగ్గాడట. ఈ స్లిమ్ లుక్ కోసం బోనీ జిమ్‌కు కూడా వెళ్ళలేదని వైరల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అయితే నెటిజన్లు మాత్రం బరువు తగ్గించే మందు ఓజెంపిక్ లేదా మౌంజారో వాడి ఉంటాడు అందుకే ఇంత మార్పు అని వ్యాఖ్యానించారు. భార్యకు నివాళిగా ఇలా స్లిమ్‌గా మారి ఉంటాడని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.ఇదీ చదవండి: నో జిమ్, నో ట్రైనర్.. 46 రోజుల్లో 11 కిలోలు ఉఫ్..! -
నో జిమ్, నో ట్రైనర్.. 46 రోజుల్లో 11 కిలోలు ఉఫ్..!
అమెరికాకు చెందిన ప్రముఖ యూ ట్యూబర్ కేవలం 46 రోజుల్లో 11 కిలోల బరువు తగ్గడం విశేషంగా నిలుస్తోంది. అదీ 56 ఏళ్ల వయసులో జిమ్‌కు వెళ్లకుండానే, ఎలాంటి ట్రైనర్ లేకుండానే దీన్ని సాధించాడు. అన్నట్టు ఎలాంటి ఫ్యాషన్ డైట్ కూడా పాటించలేదు. మరి అతని వెయిట్ లాస్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా.పసిఫిక్ నార్త్వెస్ట్లోనివసిస్తున్న 'మిస్టర్ రాంగ్లర్ స్టార్'గా పాపులర్ అయిన అమెరికన్ కోడి క్రోన్ తన వెయిట్ లాస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. చాట్ జీపీటీ వంటి ఏఐ సాయంతో తన బరువు తగ్గే ప్లాన్‌ను పక్కాగా అమలు చేశాడు. విజయం సాధించాడు. తన 56వ పుట్టిన రోజునాడు ఆరోగ్యం , ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడుకోడి క్రోన్. బరువు తగ్గాల్సిందే అని తీర్మానించుకున్నాడు. ఇందుకోసం AI ని ఆశ్రయించాడు. తన బరువు, ఎత్తు, జీవనశైలి, శారీరక స్థితిగతులను బట్టి చాట్ జీపీటీ సహాయంతో ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించుకున్నాడు. (6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!)అలా చాట్‌జీపీటి సాయంతో 95 కిలోల నుండి 83 కిలోలకు బరువు తగ్గించుకున్నాడు కోడి. కేవలం ఒకటిన్నర నెలల్లో 25.2 పౌండ్లు (సుమారు 11.4 కిలోలు) కోల్పోయాడు. ఇందుకోసం అతను ఓజెంపిక్ లాంటి బరువు తగ్గించే మందులను ఉపయోగించ లేదు, వ్యక్తిగత కోచ్‌ను నియమించుకోలేదు. దీనికి బదులుగా ఇంట్లోనే చేయగలిగే సాధారణ వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులకు ప్రాధాన్యత ఇచ్చాడు. క్రమశిక్షణ, క్లీన్ ఈటింగ్, స్మార్ట్ సప్లిమెంటేషన్, వ్యాయామాలు ఇవే అతని సీక్రెట్స్.కోడి క్రోన్ పాటించిన నియమాలుపోషకాహారం & ఉపవాసం : లాంగ్ ఫాస్టింగ్ తరువాత రోజుకు రెండు సార్లు సంపూర్ణ భోజనాలు. సాయంత్రం 5 గంటల తరువాత నో ఫుడ్అల్పాహారం: 4 గుడ్లు, అర పౌండ్ లీన్ గ్రాస్-ఫెడ్ బీఫ్, స్టీల్-కట్ ఓట్స్ (తీపి లేనివి), ఆకుకూరల సప్లిమెంట్. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, స్నాక్స్ . సీడ్ ఆయిల్స్ , పాల ఉత్పత్తులకు పూర్తిగా దూరం.రాత్రి భోజనం: 1/3 కప్పు జాస్మిన్ రైస్, సుమారు 225 గ్రా. లీన్ స్టీక్, ఆలివ్ ఆయిల్ లేదా సగం అవకాడో.సప్లిమెంట్లు: క్రియేటిన్, బీటా-అలనైన్, వె ప్రోటీన్, కొల్లాజెన్, మెగ్నీషియం మరియు ఇతర క్లీన్-లేబుల్ పెర్ఫార్మెన్స్ బూస్టర్లువర్కౌట్స్: ఇంట్లోనే పుల్-అప్ బార్, రెసిస్టెన్స్ బ్యాండ్లు, కెటిల్‌బెల్స్, డిప్ బార్ లాంటి వ్యాయామాలు చేసేవాడు. వారానికి ఆరు రోజులు, ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వ్యాయామం.గంట నుంచి గంటన్నర పాటు ఎక్సర్పైజ్లు స్లీప్: 7–8 గంటల నిద్ర. మంచి నిద్ర కోసం నిద్రవేళకు ఒక గంట ముందు స్క్రీన్స్ ఆఫ్. గది అంతా చీకటిగా ఉండేలా ఏర్పాటు.రోజువారీ 4 లీటర్ల నీళ్లు తాగడం. అలాగే జీవక్రియ శక్తిని పెంచడానికి ప్రతిరోజూ ఉదయం 15–20 నిమిషాలు ఉదయం పూట సూర్యరశ్మి తగిలేలా చూసుకునేవాడు.ట్రాకింగ్ ప్రోగ్రెస్: ప్రతి ఉదయం తన ఉపవాస బరువును చెక్ చేసుకునేవాడు. దీన్ని బట్టి AI ప్లాన్‌ను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రణాళికను సర్దుబాటు చేసుకునేవాడు. దీంతో బరువు తగ్గడమే కాకుండాకీళ్ల నొప్పులు తగ్గాయి, మంచి నిద్ర, శక్తి వీటన్నిటితోపాటు, స్పష్టమైన ఆలోచన, మెరుగైన మానసిక ఆరోగ్యం కూడా లభించిందని చెప్పుకొచ్చాడు. 46 రోజుల్లో 11 కజీల బరువు తగ్గడం అనేది సాధారణ విషయం కాదు దీనికి ఎంతో పట్టుదల శ్రమ, ఉండాలి అంటున్నారు నెటిజన్లు. ఖరీదైన జిమ్‌లు, ట్రైనర్లు లేకుండానే సరైన సమాచారంతో ఇంట్లోనే ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చని కోడి క్రోన్ నిరూపించాడు. దీనికి సంబంధించి తన అనుభవాలను యూట్యూబ్ వీడియోల ద్వారా పంచుకుంటూ, ఇతరులకూ స్ఫూర్తినిస్తున్నాడునోట్: అంతర్లీనంగా మరేతర ఆరోగ్య సమస్యలు లేనపుడు బరువు తగ్గే విషయంలో అనుకున్న ఫలితాలు సాధించాలంటే ముందు నిబద్ధత అవసరం. పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, మంచి నిద్ర, రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తదితర సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే శారీరక ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమే. -
రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే?
‘‘అధిక బరువు.. ఫిట్‌గా లేడు.. ఇలాగే ఉంటే కెరీర్‌ను ఎక్కువకాలం కొనసాగించలేడు. బరువు తగ్గితే బెటర్..’’.. టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి మాజీ క్రికెటర్లు తరచూ చేసే విమర్శలు ఇవి. అయితే, ఇకపై వారికి ఆ అవకాశం లేకుండా చేసేందుకు నడుంకట్టాడు ఈ ముంబైకర్.కేవలం రెండు నెలల్లోనే సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా పదిహేడు కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అంతకు ముందు అలా.. ఇప్పుడు ఇలా అంటూ అతడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. మరి ఇంతకీ సర్ఫరాజ్ ఖాన్ ఇంత త్వరగా బరువు తగ్గడానికి ఎలాంటి డైట్ పాటించాడో తెలుసా?!రోటీలు, అన్నం తినడం మానేశాముఈ విషయం గురించి సర్ఫరాజ్ ఖాన్ తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్ మీడియాకు తెలియజేశాడు. ‘‘ ఒక రకంగా నోరు కట్టేసుకున్నామనే చెప్పవచ్చు. దాదాపు నెల, నెలన్నర పాటు రోటీలు, అన్నం తినడం పూర్తిగా మానేశాము.బ్రకోలి, క్యారట్, దోసకాయ, సలాడ్లు ముఖ్యంగా ఆకుపచ్చటి కూరగాయలతో చేసిన సలాడ్లు ఎక్కువగా తిన్నాము. వీటితో పాటు కాల్చిన చేపలు, కాల్చిన, ఉడకబెట్టిన చికెన్, ఉడకబెట్టిన గుడ్లు డైట్లో చేర్చుకున్నాము. గ్రీన్ టీ, గ్రీన్ కాఫీలు తాగాము.చక్కెర ముట్టనేలేదుఅవకాడోలు, మొలకెత్తిన విత్తనాలు ఎక్కువగా తిన్నాము. అయితే, వీటన్నికంటే ముఖ్యంగా మేము అన్నం, రోటీ తినడం మానేయడం వల్లే ఎక్కువ మేలు జరిగింది. అంతేకాదు చక్కెర కూడా అస్సలు ముట్టలేదు. మైదాతో చేసే పదార్థాలు, బేకరీ ఫుడ్‌ను పూర్తిగా పక్కనపెట్టేశాము.పన్నెండు కిలోలు తగ్గిపోయానుఈ క్రమంలోనే సర్ఫరాజ్ నెలన్నరలోనే దాదాపు పది కిలోలకు పైగా తగ్గిపోయాడు. ఇంకా బరువు తగ్గేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. బిర్యానీ తినడం కూడా పూర్తిగా తగ్గించేశాడు. నేను కూడా దాదాపు పన్నెండు కిలోలు తగ్గిపోయాను.ఇప్పుడు నా మోకాలి నొప్పికి కాస్త ఉపశమనం కలిగింది. తనతో పాటు డైట్ చేయడం వల్ల నాకు కూడా ఇలా మేలు జరిగింది’’ అని నౌషద్ ఖాన్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.గతేడాది అరంగేట్రంకాగా దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్.. 2024లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటికి ఆరు టెస్టులు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మూడు అర్ధ శతకాలు, ఒక సెంచరీ సాయంతో 371 పరుగులు చేశాడు.చివరగా ఇటీవల ఇంగ్లండ్-‘ఎ’ జట్టుతో భారత్-‘ఎ’ ఆడిన అనధికారిక టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్ పాల్గొన్నాడు. కాంటర్బరీలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 119 బంతుల్లో 92 పరుగులు చేసి.. సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక నార్తాంప్టన్‌లో జరిగిన రెండో టెస్టులో అతడికి ఆడే అవకాశం రాలేదు. -
6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!
టెక్ప్రపంచంలో చాట్ జీపీటీ ఒక విప్లవం. విద్యార్థులనుంచి మేధావుల దాకా ఏఐ ఒక షార్ట్‌కట్‌గా మారిపోయింది. తాజాగా బరువు తగ్గే విషయంలో కూడా ఇదొక గేమ్ చేంజర్లా మారుతోంది. తాజాగా ఒక యూట్యూబర్ AI సహాయంతో అధిక బరువును విజయవంతంగా తగ్గించుకోవడంతోపాటు, ఆరోగ్యాన్ని ఎలా పొందాడో, జీవితంలో గొప్ప పాఠాన్ని ఏలా నేర్చుకున్నాడో షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ChatGPT ప్రోగ్రామ్ ద్వారా ‘మై లైఫ్ బై AI’ అంటూ తన ఆరు నెలల సుదీర్ఘ ప్రయాణాన్ని వెల్లడించాడు. చాట్‌జీపీటీ లాంటి ఏఐ ద్వారా రూపొందించిన డిజిటల్ అసిస్టెంట్, ఫిట్నెస్ కోచ్ లేదా వర్చువల్ కోచ్‌కి ‘ఆర్థర్’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఆర్థర్ సహాయంతో తన రొటీన్ డైట్ ప్లాన్ చేసుకునేవాడు. భోజనం, వర్కౌట్స్ ఇలా ప్రతీ అంశాన్ని నియంత్రించే సమగ్ర ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేసుకున్నాడు. అదే అతని వెయిట్‌లాస్ జర్నీకి నాంది పలికింది. కేవలం ఆరు నెలల్లోనే కీలక పురోగతిని సాధించాడు. చాట్ జీపీటీ ఇచ్చిన సలహాలతో ఆరు నెలల్లో సుమారు 27 కిలోలు తగ్గాడు. అంతేకాదు తన మెంటల్ హెల్త్, ఎనర్జీ స్థాయిల్లో కూడా మార్పును గమనించాడు. ఇది తన ఫిట్నెస్ ప్రయాణాన్ని మెరుగుపరచడమే కాకుండా, కంటెంట్ సృష్టిపై అభిరుచి మరింత పెంచిందనీ చెప్పాడు. దీంతో ఇప్పుడు పూర్తి సమయం యూట్యూబర్‌గా మారిపోవాలని ఆలోచిస్తున్నాడు. అయితే ఈ జర్నీ అంత సజావుగా లేదు. ఆరంభంలో చాలా కష్టపడ్డాడు. వీకెండ్ మజాగా భావించే ఫాస్ట్ ఫుడ్ - బర్గర్లు, ఫ్రైస్, బీర్ లాంటి అనారోగ్య కరమైన అలవాట్లను మానుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డాడు. ప్రతిరోజూ కిలోమీటర్లు, కిలోమీటర్లు నడవడం, బరువులు ఎత్తడం లాంటి కఠిన వ్యాయామాలపై దృష్టిపెట్టాడు.AI-ఆధారిత భోజన ప్లాన్‌తో క్లీనర్ ఛాయిసెస్, స్మార్టర్ మీల్స్ అంటే శుభ్రమైన, పోషకాహారంపై దృష్టిపెట్టాడు. ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలను పూర్తిగా మానేశాడు. తినే ఆహారంలో పోషకాలు మాత్రమే ఉండేలా చూసుకున్నాడు. అల్పాహారంలో గుడ్లు, పర్మేసన్ చీజ్, టోస్ట్‌లు చేర్చుకున్నాడు. భోజనంలోచిల్లీ బీఫ్, బియ్యం ,రిఫ్రైడ్ బీన్స్ తీసుకునేవాడు. డిన్నర్లో కాల్చిన చికెన్ఒక రకమైన చిలగడదుంప, కాల్చిన ఎర్ర క్యాప్సికమ్, కోర్జెట్లు , గ్రీకు యోగర్ట్ ఇదే డిన్నర్.ఏఐ తన జీవితంలో లైఫ్‌స్టైల్ రీబూట్‌గా మారిందని, స్థిరంగా, పట్టుదలగా ఉండటంలోని పవర్ గురించి ఆర్థర్ తెలియచెప్పిందనీ మొత్తంగా , ఏఐ తన జీవితాన్ని పెర్ఫెక్ట్గా మార్చడమే కాదు ఎదురు దెబ్బలను ఎదుర్కోవడం ఎలాగో నేర్పించింది. నాలైఫ్ మొత్తాన్ని మార్చేసిందని చెప్పుకొచ్చాడు సంతోషంగా. -
వెయిట్‌లాస్‌కి 6 చిట్కాలు : సిల్లీ కాదు..సూపరంటున్న ఫిట్నెస్ కోచ్
బరువు తగ్గాలి అంటే కచ్చితంగా కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. బరువు ఎందుకు ఎక్కువ ఉన్నామనే విషయాలను నిపుణుల సలహా మేరకు అంచనావేసుకోవాలి. ఆ తరువాత బరువు ఎంత? ఎలా తగ్గాలి అనే ప్రణాళిక వేసుకోవాలి. ఎక్కడా నిరాశ పడకుండా, ప్లాన్ ప్రకారం పూర్తి కమిట్మెంట్తో ఓపిగ్గా , స్మార్ట్‌గా ప్రయత్నిస్తే ఫలితం సాధించడం సులువే. ఈ విషయాన్ని అనేక మంది సెలబ్రిటీలు, ఫిట్నెస్ కోచ్‌లు చెబుతున్నమాట. చిన్న, చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఫలితాలను ఎలా సాధించవచ్చో తాజాగా ఫిట్నెస్ కోచ్ వివరించారు.తెలివిగా, వ్యూహాత్మకంగా ఉంటే బరువు తగ్గాలనే లక్ష్యాలను సాధించవచ్చు. చిన్న మార్పులు పెద్ద తేడాను ఎలా కలిగిస్తాయో ఫిట్నెస్ కోచ్ వివరించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా ఫిట్నెస్ సంబంధిత చిట్కాలను పంచుకునే జోష్ ఇటీవల కొన్ని చిట్కాల గురించి చర్చించారు. సిల్లీగా అనిపించినా ఇవి చాలా ప్రభావాన్ని చూపుతాయంటూ 6 ప్రధాన సూత్రాల గురించి వివరించారు.కుడి చేతి వాటం వాళ్లు, ఎడం చేత్తో, ఎడం చేయి వాటం ఉన్న వాళ్లు కుడి చేత్తో తినాలి అంట. దీని వల్ల 30 శాతం తక్కువ తినడానికి ఆస్కారం ఉంటుంది. సిల్లీగా అనిపించినా ఇది ఫలితం ఇస్తుందంటున్నారు. ఒక భోజనంలో 150-300 కేలరీలు తగ్గించుకోవచ్చని చెప్పారు. View this post on Instagram A post shared by Professional Athlete & Online Coach (@joshbainbridgefit)సాయంత్రం తొందరగా పళ్లుతోముకోవడం వల్ల ఇక తినడం అపేయాలనే సంకేతం మెదడుకు అందుతుందని, ముఖ్యంగా అర్థరాత్రి స్నాక్స్ తీసుకోనే అలవాటును మానుకోవడంలో ఇది గేమ్ ఛేంజర్‌లా పనిచేస్తుందని, తత్ఫలితంగా 200-600 కేలరీలను సులభంగా ఆదా చేయవచ్చని చెప్పారు.మోసం చేసే లిక్విడ్ కేలరీస్.. మీరు నమ్మరు గానీ రోజుకు 2-3 కాఫీలు, వందల కేలరీలకు దారితీయవచ్చు,ఆల్కహాల్, క్రీమర్లు, స్మూతీలు... అవన్నీఇందలో కలిసిపోతాయి అంటాడు జోష్. వీటితో అప్రమత్తంగా ఉండాలంటాడు.అలాగే డీప్ ఫ్రైయింగ్ ఆరోగ్యానికి హానికరమంటాడు. ఆయిల్ ఫుడ్‌తో చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు, బ్లడ్ షుగర్ లాంటి ప్రమాదకరమైన అనారోగ్యాల్ని పెంచుతుంది. దీనికి బదులుగా తక్కువ కేలరీల స్ప్రేని లేదా ఎయిర్ ఫ్రైయర్‌ను ఎంచుకోండి అంటాడీ ఫిట్నెస్ కోచ్భోజనానికి ముందు ఒక గ్లాసు నిమ్మకాయ నీరు, తక్కువ కేలరీల పళ్ల రసం తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!బరువు తగ్గడంలో పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్చమని, సరైన ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టిపెట్టాలని చెప్పాడు. తక్కువ కేలరీ ఫుడ్‌తో పొట్టను నింపేయాలి అంటాడు. ముఖ్యంగా సెలెరీ, దోసకాయ, గెర్కిన్స్, టమోటాలు, క్యాబేజీ, ఆకుకూరలులాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటాడు. నోట్: ఫిట్నెస్ కోచ్ ఇన్‌స్టా ఐడీ ఆధారంగా అందించిన టిప్స్ మాత్రం అని గమనించగలరు. వీటితోపాటు కార్డియో, కఠినమైన ఇతర వ్యాయామాలను కూడా ఇక్కడ గమనించవచ్చు. బరువు తగ్గడం అనే ప్రక్రియలో ఎవరికి వారు ఆలోచించి, వైద్యులు సలహా మేరకు ముందుకు సాగాలి -
హీరో మాధవన్ వెయిట్‌లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..
తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న నటుడిగా పేరుగాంచిన ఆర్ మాధవన్..ఐదు పదుల వయసులో కూడా అదే యంగ్ లుక్‌లో అభిమానులను అలరిస్తున్నారు. ఒకనొక టైంలో అధిక బరువుతో ఇబ్బందిపడ్డ మాధవన్ గతేడాది 2024లో అనూహ్యంగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మళ్లీ ఇదివరకటి మాధవన్ మన ముందుకు వచ్చేశాడంటూ అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అది కూడా 21 రోజుల్లోనే అదనపు బరువుని తగ్గించుకోవడం విశేషం. మరి అందుకోసం అతడు ఎలాంటి డైట్ ప్లాన్ అనుసరించాడు, ఎలాంటి వర్కౌట్లు చేసేవాడో తెలుసుకుందామా..!.చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గేందుకు మాధవన్ ఎలాంటి వర్కౌట్లను ఆశ్రయించలేదన. జస్ట్ తీసుకునే ఆహారంలోనే మార్పులు, చక్కటి జీవనశైలితో బరువు తగ్గాడట. ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను అడపాదడపా ఉపవాసం(మెడిటేరియన్ డైట్), రోజుకు 45 నుంచి 60 సార్లు బాగా నమిలి తినడం, నీళ్లు అధికంగా తీసుకోవడం వంటివి అనుసరించినట్లు తెలిపారు. అలాగే రోజులో తన చివరి భోజనం సాయంత్రం 6.45 గంటలకు (వండిన ఆహారం మాత్రమే తీసుకునేవారట). తెల్లవారుజామున సుదీర్ఘ వాకింగ్, గాఢనిద్ర, పోన్కి దూరంగా ఉండటం వంటివి చేశానని చెప్పారు. పుష్కలంగా నీరు, ఆకుపచ్చని కూరగాయలు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. శరీరంగా సులభంగా జీర్ణం చేసుకునే పోషకాహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అలా మాధవన్ 21 రోజుల్లో ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు. ఇది మంచిదేనా అంటే..నిపుణులు ఏమంటున్నారంటే..అడపాదడపా ఉపవాసంఅడపాదడపా ఉపవాసం అనేది ఒక విధమైన తినే విధానం. ఇది ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్.మాధవన్ ప్రతిరోజూ సాయంత్రం 6:45 గంటలకల్లా తన చివరి భోజనం తింటానని, మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత ఎలాంటి పచ్చి ఆహారాన్ని తిననని వెల్లడించాడు.ఆహారాన్ని సరిగ్గా నమలడంఇలా 45 నుంచి 60 సార్లు ఆహారాన్ని నమలడానికి బరువు తగ్గడానికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి కూడా. ఇది బరువు తగ్గాలనుకునేవారికి సరైన వ్యూహంగా చెబుతున్నారు నిపుణులు.ఉదయాన్నే వాకింగ్బరవుని అదుపులో ఉంచడానికి ఉత్తమ మార్గం ఇది. ఎలాంటి కఠిన వ్యాయామాలతో పనిలేకుండా చేసే సుదీర్ఘ వాకింగ్ కండరాలకు మంచి కదలిక తోపాటు సులభంగా కేలరీలను బర్న్ చేయడంలో తోడ్పడుతుంది.స్లీప్ అండ్ స్క్రీన్ డిటాక్స్మంచి నాణ్యమైన నిద్రకు స్కీన్ సమయం తగ్గించడమే అని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు కనీసం ముందు 90 నిమిషాలు పాటు స్క్రీన్లకు దూరంగా ఉండటం చాలామంచిదని సూచించారు.పుష్కలంగా ద్రవాలు, ఆరోగ్యకరమైన ఆకుకూరలుబరువు తగ్గించే ప్రయాణంలో తాను పుష్కలంగా ద్రవాలు తాగానని హైడ్రేటెడ్‌గా ఉంచుకున్నానని ఆర్.మాధవన్ తెలిపారు. మాధవన్ తన శరీరం సులభంగా జీర్ణం చేసే ఆకుపచ్చ కూరగాయలు, ఆహారాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు చాలా దూరంగా ఉన్నారు. ఇది సరైన జీవనశైలికి నిదర్శనమని చెబుతున్నారు నిపుణులు. ఈ విధమైన ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరిస్తే ఎవ్వరైనా..సులభంగా బరువు తగ్గుతారని నమ్మకంగా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan® (@aadaavaan) July 17, 2024 (చదవండి: రిమ్ 'జిమ్'.. హోమ్..! కోవిడ్ తర్వాత పెరుగుతున్న ట్రెండ్..) -
సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు
ప్రముఖ హాస్యనటి,'లాఫర్ క్వీన్' భారతీ సింగ్ (Bharti Singh) చాలా కష్టపడి బరువును తగ్గించుకొని స్లిమ్‌గా మారడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. 10 నెలల్లో దాదాపు 15 కిలోలు వెయిల్ లాస్ అయ్య ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. యూట్యూబర్ నటి ప్రజక్తా కోలితో జరిగిన పాడ్‌కాస్ట్‌లో, భారతీ తన వెయిట్ లాజ్జర్నీ గురించి వివరించింది.భారతీ సింగ్ వెయిట్ లాస్ జర్నీ ఇలాకేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా ఆలోచించింది భారతీ సింగ్. ఎందుకంటే అప్పటికే ఆమె ఆస్తమా . డయాబెటిస్తో బాధపడేది. ఎక్కువగా తల తిరుగుతూ ఉండేది. ఒక్కోసారి ఊపిరి ఆడేది కాదు. డాక్టర్ల సలహామేరకు ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించింది. 2021లో 91 కిలోల నుండి 76 కిలోలకు తగ్గించుకుని ఆటు ఫ్యాన్స్‌ను ఇటు సినీ అభిమానులను ఆశ్చర్య పర్చింది. బరువుతగ్గడం వల్ల ఆత్మవిశ్వాసంతోపాటు, ఆరోగ్యంగా, శక్తివంతంగా మారినట్టు తెలిపింది. అంతేకాదు డయాబెటిస్, ఆస్తమా కూడా నియంత్రణలో ఉన్నాయని సంతోషంగా చెప్పింది. ఇపుడు తాను చాలాఫిట్‌గా, హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. తలతిరగడాలు, ఊపిరి ఆడకపోవడంలాంటి ఇబ్బందులేవీ లేవని వెల్లడించింది.అడపాదడపా ఉపవాసం Intermittent Fastingసాయంత్రం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపవాసం. మధ్యాహ్నం ఆహారం తీసుకునేది. 30-32 ఏళ్లుగా చాలా తినేశాను. ఆ తరువాత సంవత్సరం పాటు విరామం ఇచ్చాను.2022 అధ్యయనం ప్రకారం అడపాదడపా ఉపవాసం జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇదిబ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.కడుపు మాడ్చుకోలే, ఇష్టమైన ఫుడ్‌ను త్యాగతం చేయలేదు: తనకిష్టమైన ప్రతిదాన్ని ఆహారంలో చేర్చుకునేది. కానీ మితంగా తినడాన్ని అలవాటు చేసుకుంది. తనకెంతో ఇష్టమైన రెగ్యులర్ పరాఠాలు, గుడ్లు, పప్పు-సబ్జీ, నెయ్యి ఇవన్నీ తీసుకునేదాన్నని తెలిపింది. పోర్షన్ కంట్రోల్: అతిగా తినకుండా తనను తాను నియంత్రించుకుంది. ఎక్కువ కేలరీలు తీసుకోకుండా పోర్షన్ కంట్రోల్‌ను అలవాటు చేసుకున్నానని భారతీ సింగ్ తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం, పోర్షన్ కంట్రోల్ సాధన చేయడం అధిక బరువును తగ్గించుకోవచ్చు.ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!ఖచ్చితమైన మీల్ టైమింగ్స్ : భోజనం టైమింగ్స్ పాటించకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందనీ, అందుకే తాను తన భోజన సమయాలను పాటించేదానన్ని గుర్తు చేసుకుంది. బాగా హెక్టిక్ పనుల్లో ఉంటే, బాగా లేట్ నైట్ తినడం వదిలివేసింది. వేళగాని వేళ తినడాన్ని పూర్తిగా మానేసింది. మరో విధంగా చెప్పాలంటే రాత్రి 7 గంటల తర్వాత నో డిన్నర్ సూత్రం తు.చ తప్పకుండా పాలించింది. ఇది తన బరువును తగ్గించుకోవడంలో చాలా ఉపయోగపడిందని తెలిపింది. 15 కిలోల భారీ బరువు తగ్గడం చాలా ఆనందానిచ్చిందని భారతీ సింగ్‌కు సంతోషంగా తెలిపింది. క్రాప్ టాప్స్, ఇంకా ఇష్టమైన బట్టలు వేసుకోగలగడం భలే సంతోషాన్నిస్తోందని చెప్పింది.బరువు తగ్గడం స్లిమ్‌గా కనపించడం ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. కష్టంగా కాకుండా, ఇష్టంగా నిష్టగా కృషి చేస్తే భారతీ సింగ్లా మంచి ఫలితాలను సాధించడం కష్టమేమీ కాదేమో కదా!ఇదీ చదవండి: TodayRecepies బనానాతో ఇలాంటి వెరైటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? -
పది కేజీలు తగ్గిన థగ్ లైఫ్ నటుడు.. ఆ సినిమా కోసమేనట!
ఇటీవలే థగ్ లైఫ్ మూవీలో కనిపించిన కోలీవుడ్ హీరో శింబు మరో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యాడు. వెట్రి మారన్ డైరెక్షన్లో ఆయన నటించనున్నారు. ఈ చిత్రంలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో మరింత యవ్వనంగా కనిపించేందుకు శింబు బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆయన పది రోజుల్లోనే 10 కేజీల బరువు తగ్గారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.మరోవైపు అయితే ఈ సినిమా గతంలో వెట్రి మారన్, ధనుశ్ కాంబోలో వచ్చిన చిత్రం వడ చెన్నై మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేం లేదని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో కవిన్, మణికందన్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ధనుశ్ చిత్రం 'వడ చెన్నై'లో నటించిన ఆండ్రియా జెరెమా, సముద్రఖని, కిషోర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. భారీ తారాగణం ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. -
సూపర్ టిప్స్ : ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!
బరువు తగ్గాలంటే ఆహార అలవాట్లను మార్చుకోవాలి. వ్యాయామం చేయాలి. వీటన్నింటి కంటే ముందు అసలు మనం ఎందుకు బరువు ఎక్కువగా ఉన్నాయో విశ్లేషించుకోవాలి. అంతర్లీనంగా ఏవైనా ఆరోగ్యసమస్యలున్నాయేమో అనేది వైద్య నిపుణుల ద్వారా చెక్ చేసుకోవాలి. అప్పుడు వ్యాయామం, ఆహారంమీద దృష్టిపెట్టాలి. అయితే ఎక్స్‌ర్‌సైజ్ చేయడానికి టైం లేదబ్బా.. ఇది అందరూ చెప్పేమాట. మరి దీనికి పరిష్కారమేంటి? బిజీ షెడ్యూల్‌తో సతమతయ్యేవారు, అస్సలు టైం ఉండటం లేదు అని బాధపడే వారు ఏం చేయాలి? ఇవాల్టి ‘ టిప్ ఆఫ్ ది డే’ లో తెలుసుకుందాం.బిజీ బిజీ జీవితాల్లో బరువు తగ్గడంపై దృష్టి పెట్టేందుకు సమయం దొరకడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మన కోసం, మన ఆరోగ్యం కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించడం చాలా అవసరం. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం. స్మార్ట్‌గా మన షెడ్యూల్ ఆధారంగా దినచర్యను అలవాటు చేసుకోవాలి. గంటలు గంటలు జిమ్‌లో గడాల్సిన అవసరం లేకుండానే, సింపుల్ చిట్కాలు, చిన్న చిన్న జీవనశైలి సర్దుబాట్లతో ఫిట్నెస్ సాధించవచ్చు.స్మార్ట్ ప్రిపరేషన్బరువు తగ్గడం, ఫిట్‌గా ఉండాలి అనే విషయంలో కూడా కమిట్మెంట్ చాలా ముఖ్యం. ప్లాన్డ్గా, స్మార్ట్‌గా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్నుంచే మన ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దాం. ఇందుకు పది నిమిషాలు చాలు. ఉడికించిన గుడ్లు, స్మూతీ, లేదా రాత్రి నానబెట్టిన ఓట్స్ బెస్ట్. వీటిని తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పోషకాలు కూడా ఎక్కువే. ఖచ్చితంగా ఇంతే తినాలని అనుకొని, టిఫిన్ లేదా లంచ్ ప్యాక్ చేసుకుంటే..అతిగా తినే ముప్పు తప్పుతుంది. వ్యాయామం- ఆ 2 నిమిషాలు కనీసం వ్యాయామం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. రోజులో కనీసం అర్థగంట వ్యాయామానికి కేటాయిస్తే చాలు. అలాగే సుదీర్ఘ వ్యాయామం చేయలేకపోతున్నామన్న దిగులు అవసరం లేదు. రోజంతా రెండు, రెండు నిమిషాలు మినీ వర్కౌట్లు చేయండి. అంటే కాఫీ విరామాలలో స్క్వాట్లు, డెస్క్ స్ట్రెచ్‌లు లేదా లిఫ్ట్‌లకు బదులుగా ఎక్కడం లాంటివి. డెస్క్ వర్క్ అయినా సరే.. ప్రతీ గంటకు ఒకసారి స్వల్ప విరామివ్వడం ముఖ్యం. వీలు, సౌలభ్యాన్ని బట్టి, చిన్న చిన్న డెస్క్ వ్యాయామాలు చేయవచ్చు.అందుకే ఇటీవల చాలా ఐటీ కంపెనీల్లో స్టాండింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రయాణాల్లో రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్‌పోర్ట్‌లలో సమయం ఉన్నపుడు సాధ్యమైనంత నడవడానికి, నిల్చొని ఉండడానికి ప్రయత్నించండి. ఇవి జీవక్రియను చురుకుగా ఉంచడం తోపాటు, శరీర భాగాల్లో కొవ్వు పేరుకు పోకుండా చేస్తుంది.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!హైడ్రేషన్: ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లండి. హైడ్రేటెడ్‌గా ఉండటం జీవక్రియను మెరుగు పరుస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. మరింత ఉత్సాహంకోసం నిమ్మకాయ, పుదీనా కలిపిన నీళ్లు, లేదా పల్చని మజ్జిగ తాగండి.“స్నాక్ స్మార్ట్”: వండుకునే టైం లేదనో టైం పాస్ కోసమో, ఆకలిగా ఉండనో, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వైపు మళ్లకండి. దీనికి బదులుగా నట్స్, రోస్టెడ్ సీడ్స్, ప్రోటీన్ బార్లు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్ ప్యాక్‌లపై దృష్టిపెట్టండి. వీలైతే వీటిని మీ బ్యాగ్, డెస్క్ లేదా కారులోనో ఉంచుకోండి. వీటి వల్ల పోషకాలు బాగా అందుతాయి. శక్తి లభిస్తుంది. అంతేకాదు దీని వల్ల షుగర్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్, అనారోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్‌కి దూరంగా ఉండొచ్చు. వండుకోవడానికి సమయంలో లేనప్పుడు. తక్కువ సమయంలో, ఎక్కువ ప్రొటీన్డ్ ఫుడ్ తినేలా ప్లాన్ చేసుకోండి. గంటల తరబడి కుర్చీకి, సోఫాకి అతుక్కుపోవద్దు. వీలైనన్నిసార్లు లేచి నడుస్తూ ఉండాలి. ఉదా : ఫోన్ మాట్లాటప్పుడు, టీవీ చూస్తున్నపుడు, పాడ్‌కాస్ట్ వింటున్నప్పుడు నడుస్తూ ఉండాలి. అలాగే భోజనం తరువాత కనీసం 10నిమిషాల నడక అలవాటు చేసుకోండి.ఇలా చేయడం వల్లన యాక్టివ్ఉండటంతోపాటు,రోజంతా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!పోర్షన్ కంట్రోల్: మన తినే ఆహారంలో కొర్బ్స్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. "మైండ్‌ఫుల్ ఈటింగ్" అనేది ముఖ్యం. ఎక్కువ తినకుండా పొట్ట నిండేలా ఉడికించిన కూరగాయ ముక్కలు, మొలకెత్తిన గింజలు, పుచ్చ, బొప్పాయి లాంటి పళ్లకు చోటివ్వండి. కొద్దిగా కొద్దిగా నెమ్మదిగా తినండి. చిన్న ప్లేట్లను ఉపయోగించండి. ఎందుకంటే బిజీగా ఉండేవారు ఆ హడావిడిలో వేగంగా, ఎక్కువగా తినేస్తారు. అలాగని కేలరీలను మరీ అబ్సెసివ్‌గా లెక్కించాల్సిన అవసరం లేదు. పోర్షన్ కంట్రోల్‌పై దృష్టిపెడాలి. అపుడు ఎంత తక్కువ తిన్నా కడుపు నిండిన అనుభూతినిస్తుంది. స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు తినడం మానుకోండి. ఏం తింటున్నామన్న దానిపై దృష్టి పెట్టి శ్రద్ధగా, ఆస్వాదిస్తూ తినండి.గంట కొట్టినట్టు నిద్రపోవాలినిద్ర లేకపోవడం ఆకలి హార్మోన్లను ఉత్తేజితం చేస్తుంది. సమయానికి నిద్రపోవాలి. వారాంతాల్లో కూడా నిద్రవేళకు ఒక నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోండి, దానికి కట్టుబడి ఉండండి. చక్కటి విశ్రాంతి తీసుకున్న శరీరం ఎక్కువ బరువు తగ్గేలా ప్రతిస్పందిస్తుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది.చీట్ మీల్, ఓకే అప్పుడప్పుడూ వ్యాయామాన్ని మిస్ అయినా, కాస్త ఎక్కువ తిన్నే మరీ ఎక్కువ ఆందోళన చెందకండి. చీట్‌మీల్ అనుకోండి. బిజీ షెడ్యూల్లో అన్నీ అనుకున్నట్టు ప్రణాళిక ప్రకారం జరగవు అని సర్దుకుపోండి. మిస్ అయిన వ్యాయాన్ని మరునాడు సర్దుబాటు చేసుకోండి. అంతే... అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మీ సొంతం.నోట్: ఇవి అవగాహనకోసం అందించిన చిట్కాలు మాత్రమే. ఎవరి శరీరాన్నివారు అర్థం చేసుకొని, ప్రేమించాలి. బరువు తగ్గడం అనేది ఎవరికి వారు నిశ్చయించుకొని, స్వీయ క్రమశిక్షణతో, పట్టుదలగా చేయాల్సిన పని అని మర్చిపోవద్దు. -
అవును ఒజెంపిక్ తీసుకున్నా.. తప్పేంటి? నటుడు రామ్‌కపూర్ ఆగ్రహం
ప్రముఖ టీవీ నటుడు బడే అచ్చే లగ్తే హై ఫేమ్ రామ్ కపూర్ (Ram Kapoor) అనూహ్యంగా బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపర్చాడు. ఏకంగా 55 కిలోల బరువు తగ్గి నెట్టింట తెగ హల్చల్ చేశాడు. దీంతో ఓజెంపిక్ , మౌంజారో ( Ozempic and Mounjaro)వంటి మందులు వాడి ఉంటాడనే చర్చ మొదలైంది. తాజాగా దీనిపై రామ్ సంచలన ప్రకటన చేశాడు. బరువు తగ్గడానికి ఓజెంపిక్ వాడితే తప్పేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బరువు తగ్గిన తీరును బట్టి, వారిని జడ్జ్ చేయొద్దని కోరాడు.అంతేకాదు ఎవరైనా డ్రగ్స్ వాడితే జనానికేంటి బాధ అని వ్యాఖ్యానించాడు. ‘‘అవును ఓజెంపిక్ ,మౌంజారో డ్రగ్స్ తీసుకున్నాను. అయితే తప్పేంటి? దయచేసి ఎ వరైనా సమాధానం చెప్పండి? దీనికెవరు సమాధానం చెప్పరే..ఎవరైనా ఒజెంపిక్ తీసుకుంటే అందులో తప్పేంటి? ఆ మనిషి చేసిన నేరం ఏంటి? దీనికి ఎవరూ సమాధానం చెప్పలేరు ఎందుకంటే, అసలు సమాధానమే లేదు.’’ అంటూ ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.బరువు తగ్గడానికి తాను చాలా కష్టపడ్డానని, తన వైద్యుడు మౌంజారో వాడమని ఎందుకుచెప్పాడో రామ్ కపూర్ వెల్లడించాడు. బరువు తగ్గడానికి శారీరక శిక్షణపై దృష్టి పెట్టినట్టు తెలిపాడు. అప్పట్లో ఆయన 140 కిలోల భారీ బరువతో అత్యంత అనారోగ్యకరమైన స్థితితోపాటు చక్కెర అదుపులో ఉండేది కాదు, దీంతో రోజుకు మూడు సార్లు ఇన్సులిన్ తీసుకునేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఇదీ చదవండి: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గిందిమరోపక్క పని ఒత్తిడి, రెస్ట్ లేదు దీంతో ఇంత వర్క్ చేస్తూ, అనారోగ్యంగా ఉంటే డయాబెటిక్ స్ట్రోక్ రావచ్చు, తక్షణమే బరువు తగ్గించుకోవాలని డాక్టర్ సూచించారు అయితే ఇంకా రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన ఉన్ననేపథ్యంలో మరో ఆరు-ఎనిమిది నెలల తర్వాత చూద్దామని చెప్పాను.కానీ డాక్టర్ ససేమిరా అన్నారు. కచ్చితంగా ఇపుడే ఏదైనా మొదలు పెట్టాలని హెచ్చరించారు. మూడు నుండి నాలుగు నెలలు తీసుకోమని కూడా చెప్పారు. కానీ మొదట్లో తన డాక్టర్ మాట వినాలని అనుకున్నా, కానీ తర్వాత భుజం ప్రమాదం, శస్త్రచికిత్స కారణంగా, వెయిట్ లాస్ ఎక్స్ర్సైజులు, బాడీబిల్డింగ్ పై దృష్టి పెట్టానని తెలిపాడు. అయితే ఓజెంపిక్ తీసుకోవద్దని, కావాలంటే మోంజరో తీసుకోవచ్చని సూచించాడు.కాగా ఓజెంపిక్ అనేది వాస్తవానికి మధుమేహం చికిత్సకు ఉపయోగించే ఔషధం. కానీ ఇపుడు దీర్ఘకాలికంగా ఊబకాయంతో తీవ్రంగా బాధపడే వారికి కూడా ఉపయోగపడుతోంది. అనేక మంద్రి సెలబ్రిటీలతోపాటు దీనిని ఆశ్రయిస్తున్నారనే అంచనాలు భారీగానే ఉన్నాయి. సెమాగ్లుటైడ్ (ఒజెంపిక్ ప్రాథమిక భాగం) దీర్ఘకాలిక బరువు నిర్వహణకు ఉపయోగపడుతుందంటున్నారు వైద్య నిపుణులు.ఓజెంపిక్ (GLP-1 డ్రగ్స్) ఆకలిని తగ్గించి, క్రమంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది.సెమాగ్లుటైడ్ ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది.ఇది టైప్ 2 డయాబెటిస్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది. మనం తినే ఆహారం నుండి గ్లూకోజ్ (లేదా రక్తంలో చక్కెర)ను మన కణాలలోకి రవాణా చేయడానికి బాడీకి ఇన్సులిన్ అవసరం.దీనిని శక్తిగా ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.అయితే జాగ్రత్త వైద్యుల పర్యవేక్షణ అవసరమని, ఓజెంపిక్ వంటి డ్రగ్స్కారణంగా, వికారం, వాంతులు, విరేచనాలు , తదితర సమస్యలతో సహా దుష్ప్రభావాలను కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. -
జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
అధిక బరువుకు కారణాలనేకం. జీవన శైలి, ఆహార అలవాట్లు, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అయితే ‘‘చిన్నప్పటినుంచీ నేనింతే’’ అని కొంతమంది సరిపెట్టుకుంటే, మరికొంతమంది మాత్రం భిన్నంగా ఉంటారు. అధిక బరువుతో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా అయితేనే నేమి, అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరికతోనేమి కష్టపడి శరీర బరువును తగ్గించు కుంటారు. అలా జిమ్ కెళ్లకుండానే 95 కిలోల వెయిట్ నుంచి 65 కిలోలకు చేరుకుందో యవతి. అదెలాగో తెలుసుకుందాం.ఇది ఉదితా అగర్వాల్ వెయిట్ లాస్ జర్నీ. బరువు తగ్గడం అనేది కష్టమైన ప్రయాణం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ బరువు తగ్గాల్సి వస్తే ఇంకా కష్టం. అందుకే కారణాలను విశ్లేషించుకుని నిపుణుల సలహాతో ముందుకు సాగాలి. అలా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అయిన ఉదితా అగర్వాల్ కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే కాకుండా తన ఆరోగ్యాన్ని మెరుగుపరచు కోవడానికి కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అద్బుతమైన విజయాన్ని సాధించింది.ఇదీ చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లుఉదితా చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడేది. దీనికి తోడు పిగ్మెంటేషన్, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, విపరీతంగా జుట్టు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద అన్వాంటెడ్ హెయిర్ ఇలా సవాలక్ష సమస్యలతో సతమతమయ్యేది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలికి మారడం ద్వారా 8 నెలల్లో 30 కిలోల బరువు తగ్గింది. అదీ జిమ్‌కు వెళ్లకుండానే 95 కిలోల బరువున్న ఉదితా 65 కిలోలకు చేరుకుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. View this post on Instagram A post shared by Udita Agarwal (@udita_agarwal20) తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. శుభ్రమైన ఆహారాలు తినడం ద్వారా ఆమె సహజంగానే 30 కిలోల బరువు తగ్గింది. ముఖ్యంగా "బరువు తగ్గడంలో జంక్ ఫుడ్‌ను మానేయడమే అది పెద్ద చాలెంజ్’’ అని ఆమె చెప్పుకొచ్చింది.చదవండి: చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ఉదిత వెయిట్ లాస్లో సాయపడిన అలవాట్లుడీటాక్స్ వాటర్: ప్రతిరోజూ డీటాక్స్ వాటర్ తీసుకునేది. ముఖ్యంగా జీరా, అజ్వైన్, సోంపు, మెంతిని నీటిలో మరిగించి తాగేది. ఇది ఉబ్బరాన్ని నివారించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.ఆహారంపై దృష్టి: అప్పుడప్పుడు చీట్ మీల్ తీసుకున్నా.. ఆరోగ్యకరమైన ఆహార నియమాన్ని కచ్చితంగా పాటించేది.ఒక్కోసారి వెయిట్ పెరిగినా నిరాశపడలేదు: ప్రతీ రోజు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండేది. ఒకసారి బరువు పెరిగినా నిరుత్సాహ పడేది కాదు,అసలు ఆ హెచ్చుతగ్గులను పట్టించుకోలేదు.ఇంటి ఫుడ్: ఇంట్లో ఉన్నా, బయటికెళ్లినా, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినేది. చియా సీడ్ వాటర్: చియా విత్తనాలను అర లీటరు నీటి నాన బెట్టి రోజుకు 3-4 లీటర్ల చొప్పున రోజంతా తాగేది. రోజుకు ఒకసారి టీ, మైదా ఫుడ్‌కు దూరంగా ఉంటూ అతిగా తినకుండా ఉండటానికి ఉదిత ప్రతి భోజనానికి ముందు నీరు త్రాగేది. -
రెండే రెండు టిప్స్: 120 కిలోల నుంచి స్మార్ట్ అండ్ స్లిమ్‌గా
తమిళ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ వచ్చి అరంగేట్రంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. స్పోర్ట్స్ ఆధారిత యాక్షన్ డ్రామా ఫీనిక్స్‌లో సూర్య ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఈ సందర్బంగా తన వెయిల్లాస్కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు సూర్య. ‘ఫీనిక్స్’ సినిమా మొదలుకాకముందు నా బరువు దాదాపు 120 కిలోలు ఉండేవాడినని. ఈ బరువును తగ్గించుకోవడానికి నాకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందట. మరి సూర్య వెయిట్‌లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.120 కిలోల బరువుతో బాధపడుతున్న సూర్య ఉన్నట్టుండి అంత బరువు ఎలా తగ్గాడు అనేది నెట్టింట ఆసక్తికరంగా మారింది. ‘ఫీనిక్స్’ సినిమా మొదలుకాకముందు తన బరువు దాదాపు 120 కిలోలు ఉండేదని గుర్తు చేసుకున్న సూర్య దాదాపు సగం బరువు తగ్గించుకోవడం విశేషం. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో సూర్య ఫిట్‌నెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా కష్టపడి బరువు తగ్గానని తెలిపాడు. ఇందుకోసం తనకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందన్నాడు. బరువు తగ్గే క్రమంలోనే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) నేర్చుకున్నానని, ఇదే సినిమాకు కూడా ప్రధానాంశం అని సూర్య వెల్లడించాడు.చదవండి: ఆరోగ్యానికి వెరీ ‘గుడ్డూ’.. ఎగ్స్ట్రా వెరైటీస్ ట్రై చేశారా?నుమ్ రౌడీ ధాన్‌లో తన తండ్రి చిన్నపటి వెర్షన్‌ను పోషించిన సూర్య ఫీనిక్స్‌లో తన ప్రధాన పాత్ర కోసం సిద్ధమయ్యేందుకు అనేక కసరత్తు చేశాడట. చాలా కఠినమైన శిక్షణ తీసుకున్నాడట. అలాగే తన ఆహార ప్రణాళికలలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని, ఈ క్రమంలో మొదటి ఆరునెలలు, ఆయిల్, షుగర్ ఫుడ్స్‌కు పూర్తిగా దూరంగా ఉన్నానని, నిజంగా ఇది చాలా ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పు కొచ్చాడు. మొత్తానికి హీరో అవ్వాలనే డ్రీమ్‌ను నెరవేర్చుకునేందుకు, స్లిమ్ అండ్ ట్రిమ్గా కనిపించేందుకు బరువు తగ్గాలని నిర్ణయించాడు. పట్టుదల, కఠినమైన శిక్షణతో చాలా ఓపిగ్గా తాను అనుకున్నది సాధించాడు.ఇదీ చదవండి: 7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్ అంటున్న నేహా -
Kapil Sharma: రెండు నెలల్లో 11 కిలోలు..!
బాలీవుడ్లో నవ్వుల రారాజు, రిచెస్ట్ కమెడియన్‌గా పేరుగాంచిన కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లోని దిగ్రేట్ ఇండియన్ కపిల్ షోలో స్లిమ్‌గా కనిపించి.. అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఒక్కసారిగా అతడి ఆకృతి చాలా స్మార్ట్‌గా మారిపోయింది. ఇంతకీ కపిల్ అంతలా బరువు ఎలా తగ్గాడు? హెల్ప్ అయ్యిన ట్రిక్ ఏంటి.. వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.భారతీయ బ్రేక్‌ఫాస్ట్‌లలో ముఖ్యంగా బ్రెడ్ విత్ నెయ్యి, టీ సమెసా లేదా పరాఠా తప్పనిసరిగా ఉంటాయని అంటున్నారు కపిల్ శర్మ. బయటకు వెళ్లినా..ముందుగా అవే ఆర్డర్ చేస్తారని అన్నారు. ఇలాంటి ఆహార పదార్థాలే అధిక బరువుకి ప్రధాన కారణమని అన్నారు. మనం ఏంతింటున్నాం అనే దానిపై మనకు అవగాహన, నియంత్రణ ఉండటం అత్యంత ముఖ్యమని చెప్పారు.ఇటీవల ఆయనే స్వయంగా ఓ యూట్యూబ్ ఛానెల్లో తన వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడారు. అందరూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని, బరువుని అదుపులో ఉంచుకోవాలంటూ ఆరోగ్య స్ప్రుహ కలిగించే యత్నం చేశారు. అలాగే మన శ్వాసపై ధ్యాస పెట్టడం వల్ల మనలో మంచి మార్పులు వేగవంతంగా వస్తాయన్నారు. దీంతోపాటు మంచి జీవనశైలి అలవరచుకోవాలని సూచించారు. తాను ఫరా ఖాన్, సోను సూద్ వంటి ప్రముఖులకు శిక్షణ ఇచ్చిన ఫిట్నెస్ కోచ్ యోగేష్ భటేజా పర్యవేక్షణలో తన వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించినట్లు తెలిపారు. అయితే చాలామంది బరువు తగ్గాలంటే అధిక వ్యాయమాలు చేయాలేమోనని అపోహ పడుతుంటారని అన్నారు. కానీ అందులో వాస్తవం లేదని చెప్పారు కపిల్. తన దినచర్యకు అనుగుణంగా బరువుని తగ్గించే స్ట్రెచ్చింగ్ వంటి వ్యాయామాలను చేయాలని, అవి కూడా పరిమితంగానే అని చెప్పారు. నిజానికి వ్యాయామాలు శరీరంలో కండరాల సామర్థ్యాన్ని పెంపొందించి కదలికలకు ప్రోత్సహించడమే గాక బాడీ కూడా తేలిగ్గా ఉంటుందని అన్నారు. తన ట్రైనర్ బరువు తగ్గేలా 21-21-21 రూల్‌ని సూచించినట్టు తెలిపారు. దీనివల్లే తాను రెండు నెల్లలో సుమారు 11 కిలోలు తగ్గి మంచి మార్పులు వచ్చాయని అన్నారు. ఇది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ రూల్ అని చెప్పుకొచ్చారు కపిల్ శర్మ.21-21-21 రూల్ అంటే..ఫిట్నెస్ యోగేస్ భటేజా ప్రకారం..మొదటి 21 రోజుల శరీరాన్ని కదలించడంపై దృష్టిపెడతారు. అంటే..వ్యాయామాలు చేయడంపైనే ఫోకస్ ఉంటుంది.ఆ తర్వాత 21 రోజులు ఆహారంలో మార్పుల చేయాలి. అంటే కార్బోహ్రైడేట్లు, కేలరీలు తగ్గించాల్సిన అవసరం లేదు. బరువ తగ్గేందుకు సహకరించే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.చివరి 21 రోజుల చెబు అలవాట్లను దరిచేరనియకుండా పర్యవేక్షించడం. అంటే కేవలం ధూమపానం, మద్యపానం, కెఫిన్ మాత్రేమేకాదు అతిగా తినడం, టీ లేదా కాఫీలే తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండటం.ఇలా ఈ రూల్‌ని ఎప్పుడైతే 21 రోజుల చొప్పున ఫాలో అవుతామో ఆటోమేటిగ్గా మనం క్రమశిక్షణతో కూడిన జీవన విధానానిక అలవాటు పడిపోతామట. ఇక తినకూడని వాటి జోలికి పొమ్మన్న పోరట.ఇలా ఈ ప్రక్రియలో 42వ రోజుకి చేరుకున్నాక..శరీరంల మంచి మార్పులను చవి చూస్తారని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణుడు భటేజా. అయితే శరీర భావోద్వేగాలను నియంత్రిచడమే అత్యంత కీలకం అని చెబుతున్నారు.అలా 63 రోజుల తర్వాత శరీరంలో పూర్తిగా మార్పుల సంతరించుకోవడమే గాక..దీన్ని కంటిన్యూ చేయలేనేమో అనే టెన్షన్ ఏ మాత్రం రాదట. అది మన దినచర్యలో ఒక భాగమైపోతుందట. <iframe width="703" height="432" src="https://www.youtube.com/embed/msEgvptkW6I" title="21-21-21 Rule for Fat Loss, Muscle Building and Fitness | Ft. Yogesh Bhateja with Gunjanshouts" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>(చదవండి: ఈ 'జీరో కేలరీ పుడ్స్'తో దెబ్బకు బరువు మాయం..! ఫిట్నెస్ కోచ్ సూచనలు) -
7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్ అంటున్న నేహా
అధిక బరువును తగ్గించుకోవాలంటే ఆహారం పాత్ర చాలా కీలకం. ఆహారపు అలవాట్లే బరువు తగ్గడంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇది అందరూ చెప్పేమాట. క్రమం తప్పని వ్యాయామంతోపాటు ఏం తింటున్నాము? ఎంత తింటున్నాం? ఏ సమయంలో తింటున్నాము అనేది బేరీజు వేసుకోవాలని ఆహార నిపుణులు కూడా సూచిస్తారు.అయితే తాజాగా కేవలం 7 నెలల్లో ఏకంగా 35 కిలోల బరువు తగ్గిన మహిళ, తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. పదండి మరి ఆమె సక్సెస్మంత్రా ఏంటో తెలుసుకుందాం.ఇన్‌స్టాలో నేహా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది. ముఖ్యంగా వ్యాయామంతోపాటు, దూరంగాపెట్టాల్సినకొన్ని ఆహారాల గురించి చెప్పుకొచ్చింది. నిజంగా బరువు తగ్గడమే అదొక యజ్ఞంలాగా చేయాలి. భారీ కసరత్తులు, డైట్ చేసినా అనుకున్న ఫలితం కనపించక చాలామంది నిరాశపడిపోతారు చాలామంది . అయితే మనం రోజూ తినే ఆహారపు అలవాట్లే బరువు తగ్గడంలో కీలకం అంటోంది నేహా తాను. కేవలం 7 నెలల్లో ఏకంగా 35 కిలోల బరువు తగ్గినట్టు వెల్లడించింది. ‘‘బరువు తగ్గాలనుకుంటే, ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి లేదా వాటిని చాలా తక్కువగా తీసుకోవాలి" అనే క్యాప్షన్‌లో తన అనుభవాన్ని షేర్ చేసింది. నేహా. View this post on Instagram A post shared by LeanwithNeha (@leanwithneha)p; ఇదీ చదవండి: అవును మేమిద్దరమూ విడిపోతున్నాం.. కానీ!నేహా దూరం పెట్టిన ఆ 10 రకాల ఫుడ్ గ్రానోలా (Granola): ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రచారంలో ఉంది. కానీ ఇందులో చక్కెర, అనారోగ్యకరమైన నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయి.ఫ్లేవర్డ్ యోగర్ట్: ఇందులో కనిపించని చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను పెంచి, శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి.ప్యాక్ చేసిన పళ్ల రసాలు: : వీటిలో ఫైబర్ ఉండదు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాలు సోడా కంటే కూడా ప్రమాదకరమైనవి.డైట్ నమ్కీన్, బేక్డ్ చిప్స్ : "డైట్" అని ఉన్నంత మాత్రాన వీటిని చూసిబుట్టలోపడిపోకండి మోసపోకండి. ఇవి కూడా బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలే. వీటిలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చెడు కొవ్వులు ఉంటాయి సో.. జాగ్రత్త.ప్రోటీన్ బార్స్ (Protein bars): చాలా ప్రోటీన్ బార్లు చక్కెర మిఠాయిల్లాగే ఉంటాయి. కేవలం కొద్దిగా ప్రోటీన్ అదనంగా చేరుస్తారు అంతే. వీటిని కొనే ముందు పదార్థాల జాబితాను జాగ్రత్తగా చూడండి.తేనె, బెల్లం (Honey and jaggery): ఇవి సహజమైనవి కావచ్చు, కానీ అవి కూడా చక్కెరలే. శుద్ధి చేసిన చక్కెరలాగే ఇవి కూడా మీ ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి.బ్రౌన్ బ్రెడ్ (Brown bread): ఇది తరచుగా శుద్ధి చేసిన మైదా పిండితో తయారు చేస్తారు. ఆరోగ్యకరంగా కనిపించడానికి రంగు కలుపుతారు. నిజానికి ఇందులో పోషక విలువలు తక్కువగా ఉంటాయి.స్టోర్స్‌లో కొనే స్మూతీలు: వీటిలో పండ్ల చక్కెరలు, కొన్నిసార్లు కృత్రిమ రుచులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు పెరగడానికి దారితీస్తాయి. (Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్)తక్కువ కొవ్వు ప్యాకేజ్డ్ ఆహారాలు: వీటిలో సహజ కొవ్వులను తొలగించి, రుచి కోసం సాధారణంగా చక్కెరను కలుపుతారు. ఇది తక్కువ కొవ్వు తీసుకునే ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తుంది.సోయా ఉత్పత్తులు: సోయా ఉత్పత్తులను కూడా మితిమీరి, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన సోయాను ఎక్కువగా తీసుకోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. (సినీ దర్శకుడవ్వడమే టార్గెట్ : మత్స్యకార మణిహారం)నోట్ : నేహా ఇన్‌స్టా పోస్ట్ ఆధారంగా అందించింది మాత్రమే అని గమనించగలరు. వృత్తిపరమైన వైద్య సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా సందేహాలుంటే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే హెల్ప్ అయ్యే 'జీరో కేలరీ ఫుడ్స్' ఇవే..
బరువు తగ్గడమే సవాలుగా మారింది యువతకు. ఎందుకంటే దాదాపు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరిని బాధించే భారమైన సమస్య ఇది. అయితే ఎంతలా డైట్ పాటించినా..ఒక్కోసారి చీట్ మీల్స్ తినక తప్పదు. అలాంటప్పుడూ కడుపు నిండుగా..బరువు పెరగకుండా ఉండే కొన్ని రకాలా ఆహారాలు ట్రై చేస్తే చాలంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ సామ్ ఎవెరింగ్హామ్. జస్ట్ అవి శ్రద్ధ పెట్టి తీసుకుంటే చాలట బరువు పెరిగే ప్రసక్తే లేదంటున్నారు. భోజనంలోనూ, బ్రేక్‌ఫాస్ట్‌లోనూ ఈ ఆహారాలను జోడిస్తే..హాయిగా కడుపు నిండా తిన్న అనుభూతి తోపాటు బరువు తగ్గుతారని చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..!కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు మొత్తం 20 ఉన్నాయట. ఇవన్నీ జీరో కేలరీ ఆహారాలట. వీటిని డైట్లో జోడిస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా హెల్దీగా కూడా ఉంటామని నమ్మకంగా చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సామ్. మరి అవేంటొ చూసేద్దామా..పూల్‌మఖానా – 100 గ్రాములకు 15 కిలో కేలరీలుస్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు 32 కిలో కేలరీలుపుట్టగొడుగులు – 100 గ్రాములకు 22 కిలో కేలరీలుబ్రోకలీ – 100 గ్రాములకు 34 కిలో కేలరీలుక్యారెట్లు – 100 గ్రాములకు 41 కిలో కేలరీలుటమోటాలు – 100 గ్రాములకు 18 కిలో కేలరీలుకీరదోసకాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలుకాలీఫ్లవర్ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుక్యాప్సికం – 100 గ్రాములకు 31 కిలో కేలరీలుపైనాపిల్ – 100 గ్రాములకు 50 కిలో కేలరీలుయాపిల్స్ – 100 గ్రాములకు 52 కిలో కేలరీలుఊరబెట్టిన దోసకాయలు (గెర్కిన్స్) – 100 గ్రాములకు 12 కిలో కేలరీలుకొత్తిమీర– 100 గ్రాములకు 14 కిలో కేలరీలుఉల్లిపాయలు – 100 గ్రాములకు 40 కిలో కేలరీలునిమ్మకాయ/నిమ్మకాయ – 100 గ్రాములకు 29 కిలో కేలరీలుపాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలుకాలే(క్యాబేజీ జాతికి చెందిన కూరగాయ) – 100 గ్రాములకు 35 కిలో కేలరీలుక్యాబేజీ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుప్రయోజనాలు..వీటిలో ఎక్కువగా నీరు, పైబర్ని ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడం సులభం అవ్వడమే కాదు అదుపులో పెట్టొచ్చు. ఇవి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా అతిగా తినడం నివారించగలుగుతాం. అదీగాక దీనిలోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని నివారించి ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఇందులో చాలా వరకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకుంటే అదనపు కేలరీల కోసం అదనంగా పోషకాలను జోడించాల్సిన అవసరం రాదు అని చెబుతున్నార ఫిట్నెస్ కోచ్ సామ్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యుల లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!) -
ఎంత కష్టపడినా వెయిట్ తగ్గడం లేదా? ఇవిగో టాప్ సీక్రెట్స్!
బరువు తగ్గాలంటే తిండిమానేస్తే సరిపోదు? ఫ్యాడ్ డైట్,ఉపవాసం అంటూ కడుపుమాడ్చుకుంటే సరిపోదు. ఇంట్లో పని అంతా చేస్తున్నాంగా.. ఏదో కొద్దిగా వాకింగ్ చేస్తున్నాంగా అంటే సరిపోదు. ఊపికి సలపని పనులు అసలు టైమే దొరకడం లేదు.. ఇంకెక్కడి ఎక్స్ర్సైజులు అంటూ నిట్టూరిస్తూ సరిపోదు.. మరి అధిక బరువును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి. పదండి..కొన్ని ముఖ్యమైన చిట్కాలతో సహా, ఇంట్రస్టింగ్ సీక్రెట్స్ తెలుసుకుందాం.ముందు అసలు బరువు ఎందుకు తగ్గాలి దీనిపై అవగాహన ఉంది. మనశరీరం, మన ఆరోగ్యం, దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి? ఫిట్‌గా ఉండాలనే సంకల్పం ఉండాలి. ఎంత బరువు అధికంగా ఉన్నాం, ఎంత తగ్గాలి మన బీఎంస్మాస్ ఇండెక్స్ ఎంత అనే లెక్కలు గమనించుకోవాలి. చివరిగా తగ్గాల్సిన బరువు, సమయం దీనికి సంబంధించి ఒక నిర్దిష్ట ప్లాన్ చేసుకోవాలి. ఇది నిపుణుల ద్వారాగానీ, వ్యక్తిగత అవగాహన ద్వారా గానీ చేసుకోవచ్చు.బరువు తగ్గడానికి కారణమైన అలవాట్లను మార్చుకోవాలనే బలమైన కోరిక ఉందాలేదా అనేది నిర్ధారించు కోవాలి. నా శారీరక శ్రమ ,వ్యాయామ అలవాట్లను మార్చడానికి సిద్ధంగా ఉన్నానా? అనేది ప్రశ్నించుకుని, నిర్ణయించుకుని ముందుకు సాగాలి.ఇదీ చదవండి: ఐకానిక్ ఆటో: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్, ధర తెలిస్తే.!అలాగే ఏదో మంత్రం వేసినట్టు బరువు తగ్గడం అనేది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. మన బరువును బట్టి ఎంత సమయంలో ఎంత బరువు తగ్గవచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓపిగ్గా దీర్ఘకాలం పాటు బరువు తగ్గాలనే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దీన్ని యాక్షన్ గోల్, రిజల్ట్ గోల్ అనే రెండు రకాలు డివైడ్ చేసుకోవాలి.ప్రతిరోజూ 30 నిమిషాలు నడవాలి ఇది యాక్షన్ గోల్. 4.5 కిలోగ్రాముల తగ్గాలి అనేది రిజల్ట్ గోల్.టాప్ టిప్స్జీవనశైలిలో మార్పులు చేసుకోవడం. తీసుకునే ఆహారంపై దృష్టిపెట్టడం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతీ రోజూ నడకతోపాటు, యోగా, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయవచ్చు. అవసరమైతే జిమ్ ట్రైనర్ శిక్షణలో కొన్ని కఠినమైన వ్యాయామాలు కూడా చేయాలి.లోకాలరీ ఫుడ్, హై ప్రొటీన్డ్, సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.ఒత్తిడిని నియంత్రించుకోవడానికి అవసరమైతే ఆరోగ్య సంరక్షణ నిపుణుడితో మాట్లాడండి. ఒత్తిడిని తగ్గించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన జీవనశైలిలో మార్పులు చేసుకోవచ్చు. రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లు. చక్కని నిద్ర చాలా అవసరం.దీర్ఘకాలంలో వారానికి 0.5 -1 కిలోగ్రాము) తగ్గాలని లక్ష్యంగా పెట్టుకోండి. దీని ప్రకారం ప్రతి రోజు తీసుకునే కేలరీలతో పోలిస్తే 500 - 750 కేలరీలు ఎక్కువగా బర్న్ చేయాలి.ఎక్కువగా పండ్లు, కూరగాయలు,తృణధాన్యాలు తినాలి. కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉండేలా కడుపు నిండా తినవచ్చు. ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు.రోజుకు కనీసం నాలుగు సార్లు కూరగాయలు,మూడు సార్లు పండ్లు తినండి. భోజనాల మధ్య మీకు ఆకలిగా అనిపిస్తే పండ్లు ,కూరగాయల సలాడ్ తినవచ్చు. (ట్రంప్ పెర్ఫ్యూమ్స్ : ‘విక్టరీ 45-47’ లాంచ్.. సీక్రెట్ ఏంటంటే..!)బ్రౌన్ రైస్, బార్లీ , హోల్-వీట్ బ్రెడ్ , మిల్లెట్స్‌తో చేసిన ఆహారం, ఇంకా ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్, అవకాడో, నట్స్, నట్స్ బటర్స్ , నట్స్ ఆయిల్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాలి.చక్కెర పదార్థాలకు పూర్తిగా నో చెప్పాలి. ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్‌ను అసలే ముట్టు కోవద్దు. ప్రతి ఆహారం ముద్దను ఆస్వాదిస్తూ, రుచిని ఎంజాయ్ చేస్తూ చక్కగా నమిలి మింగండి. అంతే తప్ప హడావిడిగా అస్సలు ఆహారం తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు టీవీని ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ఇదీ చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!నోట్ : నాలుగు రోజులు చేసి ఫలితం రాలేదని నిరాశ పడకూడదు. పట్టుదలగా బరువు తగ్గిన వారిని చూసి ఇన్ స్పైర్ అవ్వాలి. బరువు తగ్గడం వలన అందం మాత్రమే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. అనేక రకాల, ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్స్ నుంచి బయటపడవచ్చు. కీళ్ల నొప్పులు,గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ రాకుండా జాగ్రత్తపడవచ్చు. అయితే వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించే ముందు, వైద్యుడిని సంప్రదించి అంతర్లీనంగా ఏవైనా సమస్యలున్నాయా? అనేది తనిఖీ చేసుకొని తగిన సలహాలు, సూచనలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి. -
వెయిట్‌లాస్ జర్నీలో ఆహారానిదే కీలక పాత్ర
బరువు తగ్గడానికి అయినా పెరగడానికి అయినా వ్యాయామాలపాత్ర 20 శాతం ఉంటే, ఆహారంపాత్ర 80 శాతం ఉంటుంది. సాధారణ మనిషికి రోజుకు 2,200 క్యాలరిస్ అవసరం. బరువు తగ్గాలి అనుకునే వారు క్యాలరీ లోటులో ఉండాలి. మన శరీరం 2,200 కావాలి అంటే, ఒక 5 – 10 శాతం ఆహార క్యాలరీ లోటు తో మొదలుపెట్టాలి. అంటే రోజుకు 2000 క్యాలోరీలు ఇచ్చే ఆహారం తీసుకోవాలి. అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం. కూరగాయలు, పళ్ళు, మాంసకృత్తులు, ఓట్స్ లాంటివి.ఉదాహరణకు కేజీ బరువు తగ్గాలి అంటే దాదాపు 7500 క్యాలరీలు కరిగించాలి. అంటే ఈ విధంగా చేస్తూ ఉంటే, 3 వారాలకు ఒక కేజీ తగ్గుతారు అన్నమాట. నెమ్మదిగా తగ్గినా ఆరోగ్యంగా తగ్గుతారు ఈ విధంగా. కానీ ఒక మనిషిలో ఎదుటి వాళ్ళు గుర్తించగలిగే మార్పు రావాలి అంటే ఒక 3 కేజీలు అయినా తగ్గాలి. అలా తగ్గడానికి కనీసం 2 నెలలు పడుతుంది.ఇదీ చదవండి: Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు -
Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు
యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా యోగాను సాధన చేయడం వలన సుదీర్ఘ అనారోగ్యాలనుంచి బయటపడటం సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఆధునిక కాలంలో పెద్ద సమస్యగామారిన అధిక బరువును కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల ద్వారా సులువుగా తగ్గించుకోవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా వాటిలో కొన్నింటిని చూద్దాం. సూర్య నమస్కారాలు, విన్యాస యోగ, ఉత్కటాసన, ఉష్ట్రసన, సేతు బంధాసన, తడసన , నవాసన వంటివి బరువు తగ్గడానికి, కొన్ని యోగాసనాలు సహాయపడతాయి.సూర్య నమస్కారాలు: బరువు తగ్గడానికి హృదయ సంబంధ ఆరోగ్యానికి సహాయపడతాయి. విన్యాస యోగ: కేలరీలను బర్న్ చేయడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది,. ఉత్కటాసన: ఈ ఆసనం కాళ్ళు , తుంటిని బలోపేతం చేస్తుంది, పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఉష్ట్రాసన: ఒంటె భంగిమ, ఇది బరువు తగ్గడానికి సహాయపడే ఒక సమగ్ర వ్యాయామం,. సేతు బంధాసన: ఈ ఆసనం బరువు నిర్వహణకు సహాయపడుతుంది. తడాసన: ఇది పర్వత భంగిమ అంటారు. బాలెన్స్‌ను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నవాసన: ఇది పొత్తికడుపు బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ధనూరాసన: వెన్ను, ఛాతి, నడుము, చేతులు, పొత్తి కడుపు, కాళ్లకు మేలు జరుగుతుంది. ఫిట్నెస్ మెరుగవుతుంది. ధనస్సులా శరీరానికి వంచే ఫ్లెక్సిబులిటీ పెరిగి జీవక్రియ వేగవంతమై వెయిట్ లాస్‌కు ఈ యోగాసనం తోడ్పడుతుంది.వీటితో పాటు ఆహార నియమాలు, నడక లాంటి చిన్నపాటి వ్యాయామాలు చేస్తే మరింత త్వరగా ఫలితం లభిస్తుంది. యోగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతిమంగాఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి.యోగాసనాలు ఎలా వేయాలి అనేది యోగా నిపుణుల ద్వారాగానీ, నమ్మకమైన యాప్ ద్వారా గానీ నేర్చుకోవాలి. -
62 కిలోలు తగ్గాడు : నీళ్లు, టీ, ఫన్నీ అండ్ హెవీ కార్డియో ఇవే సీక్రెట్స్
ఒకపుడు బాన పొట్టతో, భారీ బరువుతో ఉన్న యువకుడు పట్టుదలతో తన శరీర బరువును తగ్గించుకున్నాడు. కండలు తిరిగే శరీరంతో చూడముచ్చటగా తయారయ్యాడు. 140 కిలోల నుండి 78 కిలోల బరువుకు చేరాడు. అయితే ఇది అంత ఈజీగా ఏమీ సాగలేదు. ఠినమైన ఆహారం , క్రమం తప్పని వ్యాయామంతో ఫిట్తా మారానంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించాడు.ఇన్స్టాగ్రామ్ యూజర్ పువి 2023 నవంబరులో తన వెయిట్‌లాస్ జర్నీని షేర్ చేశాడు. ప్రధానంగా 'హై-కార్బ్ డైట్' పూర్తిగా పక్కన బెట్టి, ప్రొటీన్డ్ ఆహారం, ధారాళంగా నీరు తాగడం ద్వారా 62 కిలోలు తగ్గిన తరువాత, తన దేహం కండలతో కనిపించిందని చెప్పాడు. 'కార్బోనేటేడ్ డ్రింక్స్ చెత్త'ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు ,చక్కెరలను పూర్తిగా తగ్గించేశాడు. కూల్ డ్రింక్‌లు, చక్కెర కార్బోనేటేడ్ డ్రింక్‌లకు బై బై చెప్పేశాడు. అవి చెత్త తప్ప వాటిల్లో ఏమీలేదంటాడు పువి. పుష్కలంగా నీళ్లు, అప్పుడప్పుడు టీకి మాత్రమే పరిమితమయ్యాడు. చాలా రోజులు కూరగాయలు, చాలా సింపుల్‌గా మసాలా దినుసులతో ఉడికించిన చికెన్ తినేవాడు. View this post on Instagram A post shared by 🅿️uvi (npuvi96) (@transformwithpuvi) 'ట్రెడ్మిల్ కాదు కానీ ఫన్ కార్డియో'బరువును తగ్గించుకోవాలనే లక్ష్యంతో ప్రొటీన్ ఫుడ్‌పై దృష్టిపెట్టాడు. వారానికి 4 సార్లు రెసిస్టెన్స్ ట్రైనింగ్‌తోపాటు, చేయ గలిగినంత కార్డియో(ట్రెడ్మిల్ కాదు) ఫన్ కార్డియో చేసేవాడు. హెవీ బ్యాగ్ కొట్టడం, స్కిప్పింగ్, HIIT (హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్) ఇలా ప్రతీదీ ఆస్వాదిస్తూ వెయిట్‌లాస్ జర్నీని కొనసాగించాడు. లావుగా ఉన్నానని నా బాడీని, జీవితాన్ని ద్వేషించ లేదు, కానీ ఫిట్‌గా మారాలని ప్లాన్ చేసుకున్నారు. ఏమి తిన్నా, ఎంజాయ్ చేస్తూ, ఉపయోగపడేలా తినాలి అంతే అంటాడు పువి. నోట్: బరువు తగ్గాలనే కోరికతో పాటు,దానికి తగిన ప్లాన్, ఆహార అలవాట్లు ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తీవ్రంగా జిమ్ చేయాలంటే నిపుణుడైన శిక్షకుడి ఆధ్వర్యంలోనే చేయాలి. దీనికంటే ముందు అసలు బరువు ఎందుకు పెరుగుతున్నామో విశ్లేషించుకోవాలి. అవసరమైతే వైద్య సలహా తీసుకోవాలి. -
ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..!
వెయిట్ లాస్ జర్నీలలో చాలామంది తమ కిష్టమైన హాబీలతోనూ..ఇతరులను స్ఫూర్తిగా చేసుకుని తగ్గారు. కొందరూ ప్రోటీన్ డైట్ ఫాలో అయితే..మరికొందరు అనారోగ్య భయంతో బరువు తగ్గారు. కానీ ఈ న్యూట్రిషన్ కోచ్ తాను ఎందువల్ల బరువు పెరిగానో కారణాలను విశ్లేషించి ఆ తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటూ బరువు తగ్గింది. పైగా తనలా ఎవ్వరూ ఆ తప్పులు చెయ్యొద్దని, దాని వల్ల కలిగే అనర్థాలేంటో వివరిస్తూ..ప్రేరణగా నిలిచింది. ఆమె కొన్ని నెల్లల్లోనే స్లిమ్‌గా మారి బరువు తగ్గడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించింది. ISS సర్టిఫైడ్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ లాస్ కోచ్ రక్షా భలవి ఒకప్పుడామె దాదాపు వంద కిలోలు పైనే బరువు ఉండేది. ఊబకాయం సమస్యతో చర్మం, జుట్టు, ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం ఆమెకున్న జంక్‌ఫుడ్ వ్యనసం. దాదాపు ప్రతిరోజు చిప్స్, చాక్లెట్లు లేకుండా ఆమె రోజు ఉండేది కాదు. అలా ఆమె 116 కిలోలు బరువుతో ఇబ్బందులు పడింది. తన ఆకృతి కారణంగా ఎదుర్కొన్న బాడీ షేమింగ్లు, మరోవైపు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలతో బరువు తగ్గాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. ఎలాంటి క్రాష్డైట్లు జోలికిపోకుండా పోషకాహారం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. ముందుగా ప్రతిరోజు వ్యాయామాలు చేస్తూ.. తన బరువులో వస్తున్న మార్పులను గమనించింది. అలాగే తాను స్కూల్ డేస్‌లో మధ్యాహ్న భోజనానికి పరాఠాలు తినడంతో ఎలా తాను బరువు పెరిగింది అర్థం చేసుకుంది. దానిలో ఉండే అధిక కార్బ్, అధిక కొవ్వు గలిగిన ఆహారం బొడ్డు కొవ్వుకు కారణమవుతుందని తెలుసుకుంది. అందుకనే తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంది. సమతుల్య ఆహారాలకే పెద్దపీటవేసి..ఫైబర్ కోసం పండ్లు, ప్రోటీన్ కోసం గుడ్లు లేదా పనీర్, కార్బ్ల కోసం గోధుమ రోటీ లేదా బ్రెడ్ వంటివి తీసుకునేది. అలాగే తాను చదువుతున్నప్పుడూ బాగా ఒత్తిడికి గురయ్యేది. అందువల్ల తాను తెలియకుండా ఎలా ఎక్కువగా ఫుడ్ తీసుకుందో కూడా చెప్పుకొచ్చింది రక్ష. అలాగే అధిక ఉప్పు, చక్కెరతో ఉండే స్నాక్స్‌కి దూరంగా ఉండేది. వాటి బదులు మఖానా, తాజా పండ్లతో స్నాక్స్‌ని భర్తీ చేసింది. అలాగే రోజంతా శారీరక శ్రమ లేకుండా ఉండటాన్ని నివారించింది. స్క్రీన్ సమయాన్ని తగ్గించుకుని.. ఆటలు లేదా వ్యాయామాలకు సమయం కేటాయిస్తూ..మానసికంగా ఉల్లాసంగా ఉండేలా చూసుకునేది. చివరగా తాను చెడ్డ ఆహారపు అలవాట్ల వల్లే బరువు పెరుగుతున్నానని చాలా ఆలస్యంగా గ్రహించానని, తనలా మరెవ్వరూ చెయ్యొద్దని సూచిస్తోంది. ప్రస్తుతం ఆమె పూర్తి శాకాహారి. అలాగే తన డైట్‌ప్లాన్‌ని కూడా షేర్ చేసుకున్నారామె.(చదవండి: Nozempic Diet: 130 కిలోల అధిక బరువు..ఎన్నాళ్లో బతకదన్నారు..! కట్‌చేస్తే..)ఆ కోచ్ ఏమి తీసుకునేదంటే..ఉదయం: చియా సీడ్ నీరువ్యాయామం చేయడానికి ముందు: 7 నానబెట్టిన బాదం, 10 గ్రా వేరుశెనగ వ్యాయామం తర్వాత: ప్రోటీన్ పౌడర్ పానీయం (1 స్కూప్), 1 గిన్నె మస్క్మెలోన్ భోజనం: స్టైర్-ఫ్రైడ్ క్యాప్సికమ్‌తో గిన్నె క్వినోవా టోఫురాత్రి భోజనం: 2 బేసన్ చీలాస్, 1 కప్పు పప్పు, 100 గ్రా క్యాబేజీ సబ్జీ, 1 ప్లేట్ దోసకాయ-క్యారెట్ సలాడ్, 30 గ్రా కాల్చిన సోయా ముక్కలు View this post on Instagram A post shared by Raksha Bhalavi | Nutrition & Weight Loss Coach (@fitwithraksha_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఏకంగా..!) -
వెయిట్‌లాస్ కోసం బ్లాక్‌బస్టర్ ఇంజెక్షన్ వచ్చేసింది, ధర ఎంత అంటే!
Wegovy Injection: అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఊరటి నిచ్చే వార్త ఇది. డెన్మార్క్‌కు చెందిన ఔషధ సంస్థ నోవో నార్డిస్క్.. 'వెగోవీ' అనే ఇంజెక్షన్‌ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మంగళవారం (జూన్ 24) ఈ మెడిసిన్‌ను లాంచ్ చేశారు. ఊబకాయం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ ఔషధం ఉపయోగపడుతుందని చెబుతోంది. ఈ నెలాఖరులోగా అన్ని ఫార్మా దుకాణాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వీగోవీ అనే ఇంజెక్షన్ నాలుగు వారాల మోతాదు సైకిల్లోఉంటుంది. నాలుగు వారాల పాటు వారానికి 0.25 mg అతి తక్కువ మోతాదుతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక నెల పాటు వారానికి 0.5 mg మోతాదు క్రమంగా పెరుగుతుంది. నెల పాటు వారానికి 1 mg మోతాదు పెరుగుతుంది. ఆ తర్వాత వైద్యుడి సిఫారసు మేరకు మోతాదును మరింత పెంచాలా, లేదా తగ్గించాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇది 0.25 mg, 0.5 mg, 1 mg, 1.75 mg ,2.4 mg ఐదు మోతాదు రూపాల్లో మార్కెట్లోకి లభిస్తుంది. ఇది ఉపయోగించడానికి సులభమైన పెన్ లాంటి పరికరంగా లభిస్తుంది.CNBC-TV18 Exclusive | We are confident of leading the weight loss #market as we are first to launch and have strong credibility, says Vikrant Shrotriya, MD & Corporate VP, Novo Nordisk India, as the company launches #Wegovy, a weight loss drug, in #India. Tells @ekta_batra that 1… pic.twitter.com/moiu37dB8c— CNBC-TV18 (@CNBCTV18News) June 24, 2025 ధరలు వివరాలునోవో నార్డిస్క్ వీగోవీ 0.25 mg, 0.5 mg , 1 mg మోతాదు నెలకు రూ. 17,345 ఖర్చవుతుంది. 1.75 mg అధిక మోతాదు ఇంజెక్షన్ నెలకు రూ. 24,280 ఖర్చవుతుంది. 2.4 mg మోతాదు రూ. 26,050 ఖర్చవుతుంది. దీర్ఘకాలిక బరువు నిర్వహణ ,హృదయ సంబంధ వ్యాధులకు వెగోవీ తొలిఏకైక బరువు నిర్వహణ ఔషధం. ఈ ఔషధం 30 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (BMI), ఇతర అనారోగ్యాలు లేనివారికి , 27 కంటే తక్కువ BMI ఉన్న, ఇతర అనారోగ్యాలున్నా ఇస్తారు.భారతదేశంలో వెగోవీ కోసం స్థానికంగా తయారీకి ఎటువంటి ప్రణాళికలు లేవని కంపెనీ స్పష్టం చేసింది. నోవో నార్డిస్క్ ఇప్పటికే 2022లో భారతదేశంలో నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
జిమ్‌కి వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది..ఫేస్ గ్లో కోసం..!
తీవ్రమైన వ్యాయామాలు, కఠినమైన ఆహార నియమాలతో బరువు తగ్గడం అంటే శిఖరాన్ని అధిరోహించేందుకు చేసే కసరత్తులా అనిపిస్తుంది. ముఖ్యంగా బిజీ జీవనశైలిలో అధికబరువుపై ధ్యాస, జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేయడం పెద్ద యుద్ధమే అనిపిస్తుంది. పోషకాహార నిపుణురాలు ఉదిత అగర్వాల్ జిమ్‌కి వెళ్లకుండానే 30 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ముఖంలోని కొవ్వును సహజంగా తగ్గించడంలో సహాయపడే కొన్ని సాధారణ చిట్కాలనూ, తీసుకోదగిన ఆహారాలను మన ముందుంచింది.తీసుకునే ఆహారంలో మొత్తం కొవ్వుపై దృష్టి పెట్టాలి. ఎన్ని కేలరీలు ఉన్నాయో, దానికంటే అదనపు కేలరీలను బర్న్ చేయాలని గుర్తించాలి. అప్పుడు కేలరీలు తీసుకోవడం తగ్గిస్తారు. ఉత్తమ ఫలితాల కోసం ఆరోగ్యకరమైన ఆహారం + క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రెండూ జీవనశైలిలో భాగం చేసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోకూడదు. అధిక ప్రొటీన్ తీసుకోవడం ద్వారా కొవ్వు తగ్గుతుంది. కడుపు నిండుగా ఉంటుంది.ఆరోగ్యకరమైన కొవ్వులు మొలకెత్తిన గింజలు, విత్తనాలలో ఉంటాయి.నీళ్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే పండ్లు – కూరగాయలను తీసుకోవాలి. రోజూ కనీసం 2–3 లీటర్ల నీళ్లు తాగాలి. ఒత్తిడిని తగ్గించడం – హాయిగా నిద్రపోవడం ఒత్తిడి కార్టిసాల్‌ను పెంచుతుంది, ఇది కొవ్వు పేరుకుని పోయేలా చేస్తుంది. ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటల సేపు నిద్ర΄ోయేలా చూసుకోండి. నిద్ర సరిగా లేక΄ోవడం వల్ల శరీరం నీరు పట్టినట్టుగా కనిపిస్తుంది. ముఖ వ్యాయామాలు – టోనింగ్ ఈ వ్యాయామాలు చర్మం నునుపును మెరుగుపరుస్తాయిబుగ్గలు ఉబ్బినట్టుగా ఉంటే, మునివేళ్లతో మృదువుగా వెనక్కి మర్దనా చేయాలి. పళ్ళు బిగించి, నవ్వుతూ, 10 సెకన్ల పాటు అలాగే ఉంచాలి. ‘ఫిష్ ఫేస్‘ ప్రయత్నించాలి. అంటే, బుగ్గలను లోపలికి పీల్చుకొని, కొన్ని సెకన్లపాటు ఉంచాలి. చక్కెర పానీయాలకు దూరంమద్యం చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. నీటిని చేరుస్తుంది. చక్కెర పానీయాలలో అధిక కేలరీలు ఉంటాయి. ఇవి ఒంట్లో ఎక్కువ కొవ్వు నిల్వలను చేరుస్తాయి. పై జాగ్రత్తలన్నీ తీసుకొని, బాడీ ఫిట్నెస్ను కాపాడుకున్నాను. డైటీషియన్ కోర్సు కూడా పూర్తిచేశాను. నాపై నేను తీసుకున్న ఈ ప్రత్యేక శ్రద్ధ నన్ను నాజూగ్గా మార్చింది. బరువు తగ్గడానికి 12 రకాల ఆహార పదార్థాలు కూరగాయలు (కేలరీలు చాలా తక్కువ)1. దోసకాయ – 100 గ్రాములకు16 కిలో కేలరీలు లభిస్తాయి. హైడ్రేటింగ్, క్రంచీ, సలాడ్స్, స్నాక్స్ చేయడానికి సరైనది.2. గుమ్మడికాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలు తేలికైనది, చాలా రకాలు చేయవచ్చు. 3. లెట్యూస్– 100 గ్రాములకు 15 కిలో కేలరీలుర్యాప్లకు, సలాడ్ బేస్‌గా అనువైనది.4. పాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలుఐరన్ సమృద్ధిగా లభిస్తుంది, స్మూతీలు, సాగ్ లేదా సాటీయింగ్కు సరైనది.5. కాలీఫ్లవర్ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుఅన్నం, పిజ్జా క్రస్ట్ లేదా సబ్జీలలో ఉపయోగించవచ్చు. పండ్లు (సహజంగా తీపి – తక్కువ కేలరీలు)6. పుచ్చకాయ – 100 గ్రాములకు 30 కిలో కేలరీలు వేడి వాతావరణం ఉన్నప్పడు మరీ మంచిది. 7. స్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు – 32 కిలో కేలరీలు తీపి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, జీర్ణక్రియకు మంచిది.8. బొప్పాయి – 100 గ్రాములకు 43 కిలో కేలరీలుజీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చాలా కడుపు నిండుగా ఉంటుంది. 9. ఉడికించిన గుడ్డులోని తెల్లసొన – గుడ్డులోని తెల్లసొనకు – 17 కిలో కేలరీల స్వచ్ఛమైన ప్రొటీన్, కొవ్వు ఉండదు. కండరాల నిర్వహణకు సరైనది.10. వెన్నలేని పెరుగు (తక్కువ కొవ్వు) – 100 గ్రాములకు 59 కిలో కేలరీలు ప్రొటీన్ అధికంగా ఉంటుంది, జీర్ణాశయ ఆరోగ్యానికి మంచిది.11. టోఫు (లైట్ లేదా తక్కువ కొవ్వు) – 100 గ్రాములకు 70 కిలో కేలరీలు మొక్కల ఆధారిత ్ర΄ోటీన్, మృదువైనది మరియు సంతృప్తికరంగా ఉంటుంది.12. ఎయిర్ -పాప్డ్ పాప్‌కార్న్ (ఉప్పు, వెన్న లేనిది) – కప్పుకు 30 కిలో కేలరీలు. తాను ఇవన్నీ ఫాలో అయాను కాబట్టే బరువు తగ్గినా ముఖం కళ తప్పకుండా కాపాడుకోగలిగాను అని చెబుతోంది ఉదితా అగర్వాల్. View this post on Instagram A post shared by Udita Agarwal (@udita_agarwal20) ‘‘నా చిన్నతనం నుంచీ అధికబరువు సమస్యను ఎదుర్కొన్నాను. ఆరోగ్య సమస్యల బారిన పడ్డాను. జుట్టు రాలి΄ోయేది, ముఖంపై యాక్నె ఉండేది. పాతికేళ్లు వచ్చేసరికి వంద కేజీలకు పైగా బరువు పెరిగాను. జిమ్‌కి వెళ్లకుండా బరువు తగ్గాలనుకున్నాను. ఎనిమిది నెలల్లో 30 కేజీల బరువు తగ్గాను. కానీ, మేని చర్మం సాగినట్టు, ముఖంలోని కొవ్వునూ కోల్పోయి, సన్నబడి, కళ తగ్గినట్టుగా అనిపించింది. ఈ సమస్య దరిచేరకుండా జాగ్రత్త పడ్డాను. -ఉదితా అగర్వాల్. -
నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాలి.చెమటలు చిందించాలి చాలామంది మదిలో మెదిలే ఆలోచన ఇది. కానీ ఇవేమీ లేకుండానే హ్యాపీగా నెలకు 7 కిలల దాకా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు ఒక వైద్యుడు. అదీ కఠినమైన డైట్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమే అంటున్నారు. మరి ఆ జాదూ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. పదండి.. ఆలస్యం ఎందుకు..!నాన్-ఇన్వాసివ్ కార్డియాలజీలో నిపుణుడైన కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ ఛాజెర్ సోషల్‌మీడియా ద్వారా తన ఫాలోయర్లకు అనేక ఆరోగ్య చిట్కాలను అందిస్తూ ఉంటారు. తాజాగా 'జాదూ డైట్ (మ్యాజిక్ డైట్) ఫర్ వెయిట్ లాస్' అంటూ కొన్ని వివరాలను షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియో ప్రకారం ఇది శాకాహారంతో బరువు తగ్గించుకునే ఒక ప్రణాళిక. కడుపు మాడ్చుకోవాల్సి అవసరం లేకుండానే సరళమైన డైట్‌తో కేవలం ఒక నెలలో కనీసం 7 కిలోల బరువును తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని హామీ ఇస్తున్నారు కూడా.వెయిట్ లాస్ జర్నీ- చిట్కాలుడాక్టర్ బిమల్ ఛాజెర్ చెబుతున్న డైట్ సరళమైన, ఆరోగ్యకరమైన ఆహారాల కలయితో ఉంటుంది. బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిదనీ, ఆకలితో ఉండకుండా కేలరీల లోటును భర్తీ చేసి.శరీరం సహజంగా కొవ్వును కరిగించడానికి అనుమతిస్తుంది. ఇదీ చదవండి: 118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్‌తో'జాదూ డైట్ ఫర్ వెయిట్ లాస్'మనం మన కడుపును అధిక కేలరీల ఆహారంతో నింపితే, మన బరువు పెరుగుతుంది, అదే తక్కువ కేలరీల ఆహారంతో నింపితే, ఆకలీ వేయదు, బరువూ పెరగదు సింపుల్ మ్యాజిక్ అంటారాయన. స్వీట్ కార్న్, బీట్ రూట్, క్యారెట్లతో చేసిన సలాడ్, గుమ్మడికాయ, బీన్స్, క్యారెట్ ముక్కలు, రాగిపిండితో చేసిన సూప్ ఇలాంటివి ఆయన షేర్ చేసిన వీడియో మనం చూడవచ్చు.జాదూ డైట్లో నిజానికి బాగా తినాలి, కానీ లో-కేలరీల ఆహారాలకు కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, సలాడ్లు...ఇది శరీరాన్ని ఆహారం లేకుండా ఉంచకుండా వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఫలితంగా నెలలో 7 కిలోల బరువు తగ్గడం పక్కా..అది కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అని చెప్పారు. View this post on Instagram A post shared by Food Link (@ig_foodlink)ఆహారంగా ఇంకా ఏం తీసుకోవచ్చుబ్లాక్ టీ తాగవచ్చు. ఎక్కువ పండ్లు తీసుకోవాలి. ప్రోటీన్ , ఇతర పోషకాల కోసం మూంగ్ లేదా మసూర్ దాల్ తీసుకోవచ్చు. ఇందులో దోసకాయ, బీట్రూట్ క్యారెట్ ఇలా పచ్చి కూరగాయలతో కలిపి పప్పును తినవచ్చు.రాత్రి భోజనంలో సూప్‌తో పాటు సలాడ్ , ఉడికించిన కూరగాయలుఎన్ని రోజులు చేయాలి?ఈ డైట్‌ను కేవలం ఒక నెల పాటు మాత్రమే సాగించాలి.దీన్ని ఎప్పటికీ అనుసరించాల్సిన అవసరం లేదు. ఈ డైట్‌తో మీరు సుమారు 3 నెలల్లో 10-20 కిలోలు తగ్గవచ్చు. ఈ జాదూ డైట్ అద్భుతంగా పనిచేస్తుందనంటూ కోలకత్తాకు చెందిన ఒక మహిళ 86 నుంచి -62 కిలోలకు బరువు తగ్గిన వైనాన్ని ఉదహరించారు.గమనిక: ఈ కథనం డా. బిమల్ షేర్ చేసిన సమాచారం ప్రకారం అందించినంది మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల్లో ఎల్లప్పుడూ వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం. -
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్‌తో
అధిక బరువుతో ఉండే వ్యక్తులు వారి వ్యక్తిగత బాధలు, శారీరక అనారోగ్యం కంటే చుట్టూ ఉండే వారు ఏమనుకుంటారో అనేదానితో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అవమానాలు, వెక్కిరింపుల ఎదుర్కోవాలంటే బరువు తగ్గాల్సిందే అనుకుంటారు. కానీ బరువు తగ్గాలి.. తగ్గాలి.. స్మార్ట్‌గా ఉండాలి, నచ్చిన బట్టలువేసుకోవాలి, పార్టీలకు, ఫంక్షన్లకు అందంగా వెళ్లాలి అని అనుకుంటూ సరిపోదు. దానికి తగ్గట్టుగా కఠోర శ్రమ చేయాలి. బాడీ వెయిట్‌కు తగ్టట్టు ఎంత బరువు తగ్గాలి అనేది అంచనా వేసుకుని నిపుణుల సలహా మేరకు ముందుకు సాగాలి. అలా 6-7 నెలల్లో 118 కిలోల నుండి 80 కిలోలకు చేరిన యువకుడి స్టోరీ గురించి తెలుసుకుందాం. నోయిడాలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు రజత్ బన్సల్ (30). ఫ్రెండ్స్ వేళాకోళాలతో పాటు, అద్దంలో తనను తాను చూసుకుని బాధపడేవాడు. 118 కిలోల బరువు పెరగడం అతని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాకుండా, మానసికంగా అతడ్ని బలహీనుడిని చేసింది. నచ్చిన బట్టలు వేసుకోవడానికి లేదు. దర్జాగా పెళ్లికో, ఫంక్షనకో వెళ్లాలంటే..సిగ్గుగా ఉండేది. బంధువుల మాటలు, స్నేహితుల జోకులు మరింత బాధించేవి. అంతే వన్ ఫైన్ మార్నింగ్ కేవలం బరువు తగ్గాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కేవలం 6-7 నెలల్లో 38 కిలోల బరువు తగ్గి ఔరా అనిపించు కున్నాడు.ఏలా ఊపిరాడుతోందిరా బాబూరజత్ వెయిట్ లాస్ జర్నీలో ఫ్రెండ్స్ జోకులు, ఎగతాళి మాటలు కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు 'నువ్వు చాలా బరువు పెరిగావు, ఏ బట్టలు ధరిస్తావు?' ‘ఎలా నడుస్తావ్.. ఊపిరి ఆడుతోందా? అంటూ అని ఎగతాళి చేసేవారు. చివరికి నోయిడాలోని డైట్ మంత్ర క్లినిక్‌కు చెందిన డైటీషియన్ డాక్టర్ కామిని సిన్హా, రజత్ బరువు తగ్గి, ఫిట్‌గా ఉండేందుకు రంగంలోకి దిగాడు.జంక్ ఫుడ్ - స్వీట్లు వీక్నెస్ రజత్‌కు అతిపెద్ద సవాలు ఏమిటంటే జంక్ ఫుడ్ , స్వీట్లు తినే అలవాటు మార్చుకోవడం. ఏది ఏమైనా సరే తన లైఫ్,ఆరోగ్యంతో రాజీపడకూడదని నిర్ణయించుకున్నాడు.ఆహార అలవాట్లలో విప్లవాత్మక మార్పులు చేసుకున్నాడు.ఉదయాన్నే మార్నింగ్ వాక్ కు వెళ్లేవాడు.చెమటలు పట్టేదాకా వ్యాయామం మెట్లు ఎక్కడం చేసేవాడు. అల్పాహారం: ఉడికించిన ఓట్స్ లేదా పోహా.మధ్యాహ్నం: ఉడికించిన పప్పులు, సలాడ్ మరియు పెరుగు.సాయంత్రం 4 గంటలు: కాల్చిన చిక్పీస్ , పండ్లతో భేల్.రాత్రి భోజనం: ఫ్రూట్ రైతా , సలాడ్.దీనితో పాటు హోం చిట్కాలు కూడా పాటించాడు. మెంతులు, సోంపు, జీలకర్ర, క్యారమ్ గింజలు ,దాల్చిన చెక్కను రాత్రిపూట నానబెట్టి ఉదయం ఉడకబెట్టి, ఉదయం సగం గ్లాసు , రాత్రి సగం గ్లాసు తాగేవాడు.తొలి వారాల్లో చాలా కష్టపడేవాడు. ఆకలిని తట్టుకోవడం కష్టంగా ఉండేది. చాలా నీరసంగా అనిపించేది. కానీ వెక్కిరింపులు, వేళాకోళాలు గుర్తొచ్చేవి. అద్దంలో తగ్గిన వెయిట్ చూసుకొని ఉత్సాహాన్ని తెచ్చుకునేవాడు. అలా శరీరంలో మాత్రమే కాదు, మనస్సులో ఉత్సాహంలో కూడా వచ్చిన మార్పు గమనించి మరింత పట్టుదలగా సాగాడు.6-7 నెలల కృషి తర్వాత, తన బాడీ వెయిట్ 80 కిలోలకు చేరేసరికి కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి.కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, గౌరవం కూడా తిరిగి వచ్చింది. ఎందుకు బరువు తగ్గడం నీ వల్ల కాదురా అని హేళన చేసినవాళ్లంతా 'నువ్వు ఇంత బరువు ఎలా తగ్గావు?' అని ఆశ్చర్యపోవడమే రజత్ వెయిట్ లాస్లో జర్నీలో పెద్ద సక్సెస్.. -
130 కిలోల అధిక బరువు..ఎన్నాళ్లో బతకదన్నారు..! కట్‌చేస్తే..
అధిక బరువు సమస్య అనేది అలాంటి ఇలాంటిది కాదు. వచ్చిందంటే తగ్గదు.. అన్నంతగా వేధిస్తుంది. దీన్ని తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. స్లిమ్‌గా మారాలి, ఆరోగ్యకరంగా ఉండాలనే స్ట్రాంగ్ మైండ్సైట్తో శరీరంపై ఫోకస్ పెట్టి తగ్గినవారెందరో ఉన్నారు. అదే సమయంలో సత్ఫలితాలను పొందలేక ఢీలా పడ్డవాళ్లు కూడా ఉన్నారు. కొన్నిసార్లు మనం సిన్సియర్‌గా బరువు తగ్గాలని చేసిన ప్రయత్నాలన్ని అస్సలు వర్కౌట్ కావు. అసలు అలా ఎందుకు జరుగుతుందన్నది క్షణ్ణంగా ఆలోచిస్తేనే..అధిక బరువు సమస్య నుంచి బయటపడగలం లేదంటే అంతే సంగతులు. అచ్చం అలానే చేసింది ఈ 53 ఏళ్ల సారా జేన్ క్లార్క్. ఆమె ఎంత బరువు ఉండేది తెలిస్తే విస్తుపోతారు. ఆమెలాంటి వాళ్లు తగ్గాలంటే బరువు తగ్గించే ఇంజెక్షన్ల సాయంతోనే సాధ్యం. కానీ ఆమె వాటి జోలికి పోకుండానే బరువు తగ్గి చూపించింది. ఎలాగంటే..?..సారా జేన్ క్లార్క్ టీనేజ్ వయసులోనే 130 కిలోల అధిక బరువుతో బాధపడేది. ఆమె ఉదయం క్యాడ్బరీ చాక్లెట్లు, కోకా కోలాతో మొదలయ్యేది. చక్కెర లేని పదార్థాలను ముట్టుకునేదే కాదు. అంతలా స్వీట్లకు బానిసైంది. అయితే కాలేజ్‌లో ఆమె స్నేహితులంతా నువ్వు లావుగా లేకపోతే ఎంతో అందంగా ఉండేదానివి అన్న మాటలు సారాను విపరీతంగా బాధించేవి. 25 ఏళ్లేక మరింత లావైపోయి..పీరియడ్స్ ఆగిపోయి వృద్ధాప్యానికి చేరువైన వ్యక్తుల మాదిరిగా ఆమెను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సారా పరిస్థితిని చూసి వైద్యులు కనీసం 40 ఏళ్లు వచ్చే వరకు కూడా బతకడం కష్టమే అని చెప్పేశారు. ఆ మాటలే ఆమెపై పవర్ఫుల్ మంత్రంలా పనిచేశాయి. అప్పడే ఆమె ఎలాంటి క్రాష్ డైట్..వెయిట్ లాస్ ఇంజెక్షన్ల జోలికి వెళ్లకుండానే బరువు తగ్గి చూపించాలని స్ట్రాంగ్గాఐదు నియమాలు..రోజూ 30 నిమిషాల నడక, అధికంగా నీరు తీసుకోవడం. అలాగే ఎలాంటి ఆర్డర్లు వేయకుండా అన్ని పనులు చేసుకోవడంప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించడంతీసుకునే ఆహారంలో అధికంగా ఫుడ్ ఉన్నట్లయితే అస్సలు ముట్టుకోకుండా ఉండటంబరువు తగ్గే క్రమంలో ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేలా మైండ్సైట్లో మార్పుకాలక్రమేణ ఈ రూల్స్ అద్భుతమైన ఫలితాలను అందుకునేలా చేసి కేవలం 16 నెలల్లో..అనూమ్యంగా 44 కిలోల బరువు తగ్గిపోయింది. అందంగా మారడమే గాక ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు సంతరించుకున్నాయి. ఆ తర్వాత పెళ్లై ఇద్దరు పిల్లులు పుట్టాక కూడా..అదే పద్ధతిని కొనసాగించింది. అలా సారా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నుంచి ఎల్ సైజ్‌తో స్లిమ్‌గా మారిపోయింది. పైగా తన 40వ పుట్టిన రోజుని గ్రాండ్‌గా జరుపుకుంది కూడా. అంతేగాదు ఆరోగ్య స్ప్రూహను కొనసాగిస్తూ..అందరికి అవగాహన కల్పించేలా 5K రన్ వంటి మారథాన్లలో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె 62 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉంది.అలా చేస్తే మనకు మనం నచ్చం..బరువు తగ్గించే ఇంజెక్షన్ల క్రేజ్ ఉన్నా..వాటిపట్ల జాగ్రత్త వహించాలంటోంది. ఇంజెక్ట్ చేసుకుని మనల్ని మనం ఎలా ప్రేమించుకోగలం. బరువు తగ్గాకా.. అబ్బా స్లిమ్‌గా మారిపోయే అనే గొప్ప అనుభూతి కలుగుతుందా..? అని ప్రశ్నిస్తోంది. ఆరోగ్యకరమైన నియమాలను మనకు సాధ్యమైనవి ఎంపిక చేసుకుని తూచా తప్పకుండా పాటించండి చాలు..అద్భుతాలు సృష్టించొచ్చు అని నమ్మకంగా చెబుతోంది. View this post on Instagram A post shared by Sarah Jane Clark (@stepbystepwithsarahjaneinsta) (చదవండి: లావణ్య బెల్లీ డ్యాన్స్‌కు..నటి ప్రియాంక చోప్రా సైతం ఫిదా..) -
230 -110 కిలోలకు అద్నాన్ సామి :‘ఆపరేషన్‌కాదు,వాక్యూమ్ క్లీనర్’
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సామి భారీకాయంతో ఉండేవాడు. అలాంటిది ఉన్నట్టుండి భారీగా బరువు తగ్గి.. అంటే ఫిట్ అండ్ స్మార్ట్ లుక్‌లో కనిపించాడు. 230 కిలోల నుంచి 110 కిలోలకు తగ్గిపోయాడు. కఠోర శ్రమ, ఆహార నియమాలతో ఏకంగా 120 కిలోల బరువు తగ్గి, అద్భుతమైన లుక్‌లో అందర్ని ఆశ్చర్యపర్చాడు. అయితే అంత బరువును ఆయన ఎలా తగ్గించకోగలిగాడు. ఎలాంటి ఆహార అలవాట్లను పాటించాడు. ఆపరేషన్ లాంటిదేమైనా చేయించుకున్నాడా? పదండి ఆ వివరాలు తెలుసుకుందాంవిలక్షణ స్వరం, పాటలతో సంగీతాభిమానులను ఆకర్షించిన గాయకుడు అద్నాన్ సామి. అద్నాన్ సామి అనూహ్యంగా బరువు తగ్గడం నిజంగా హాట్‌టాపిక్. 230 కిలోలున్న వ్యక్తి 120 కిలోల బరువు తగ్గడం అంటే మాటలు కాదు. మిరాకిల్ ఎలా జరిగిందీ, తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇటీవల పంచుకున్నాడు. బారియాట్రిక్ సర్జరీ ,లైపోసక్షన్ లాంటి ఎలాంటి శస్త్రచికిత్స చేయించుకోకుండా ఈ బరువు తగ్గడం విశేషం.జూన్ 1 నాటి ‘ఆప్ కి అదాలత్ ఎపిసోడ్లో స్వయంగా తన అద్భుతమైన వెయిట్ లాస్, ఫిట్నెస్ సీక్రెట్స్‌ను పంచుకున్నారు.120 కిలోల వెయిట్ లాస్ మంచి జీవనశైలి, ఆహార అలవాట్లతోనే ఈ ఫీట్ సాధించారు.230 భారీ కాయం నుంచి ప్రస్తుతం ఆయన వెయిట్ 110 కిలోలకు చేరింది. అయితే బరువు తగ్గడానికి ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నారా అని షోలో అడిగినప్పుడు, అద్నాన్ ఏమన్నారంటే.. "చాలా ఊహాగానాలు ఉన్నాయి, కొంతమంది నేను బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నానని, మరికొందరు లైపోసక్షన్ అని అన్నారు. అయితే విషయం ఏంటంటే.. లైపోసక్షన్ అనేది సూదితో నిర్దిష్ట ప్రాంతాల నుండి కొవ్వును తొలగించే ప్రక్రియ, సాధారణంగా స్పాట్ రిడక్షన్ కోసం." “నా బరువు 230 కిలోలు. నా విషయంలో, కొవ్వు మొత్తాన్ని తొలగించడానికి నాకు వాక్యూమ్ క్లీనర్ అవసరం ఏర్పడింది!” అని చలోక్తి విసిరారు. అదే పెద్ద ప్రేరణహ్యూస్టన్లోని న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు అధికప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నారు. సుగర్, ఆయిల్, రైస్, బ్రెడ్, మద్యానికి పూర్తిగా ఉన్నారు.కఠినమైన ఆహారం, వ్యాయామంతో ఒక నెలలోనే 20 కిలోల బరువు తగ్గడంతో పట్టుదల మరింత పెరిగింది. ఒక్క నెలలో 20 కిలోలు తగ్గడం నిజంగా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఒకసారి షాపింగ్ సందర్బంగా XL లో టీ-షర్టు చాలా బాగా నచ్చిందట. కానీ అప్పటిక ఆయన 9XL. దీంతో నిరాశ చెందాడు. అంతేకాదు ఆషర్టులో నీచేయి కూడా పట్టదు అని తల్లి అన్నారట. అంతే ఆ క్షణమే బరువుగా తగ్గాలని నిర్ణయించు కున్నా.. అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. కొంచెం బరువు తగ్గినప్పుడల్లా , అదే షర్టును వేసుకోవడం, రెండుమూడుస్లార్లు చూసుకోవడం ఇదే పని. అలాఒక రోజు, సరిగ్గా సరిపోయినపుడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నాన్నకు ఫోన్ చేసి మరీ ఆనందంతో ఎగిరి గంతేశాను అని గుర్తు చేసుకున్నారు. ఆరు నెలల్లో చనిపోతావ్ అన్నా పెద్దగా పట్టించుకోలేదుబరువు తగ్గాలనుకుంటున్న సమయంలో అద్నామ్ తండ్రికి. ప్రాంకియాటిక్ కేన్సర్ సోకింది. ఈ సందర్భంగా హాస్పిటల్ వెళ్తే ఇంత బరువు ప్రమాదకరం, ఇలానే కొనసాగితే ఆరు నెలలో చనిపోతావ్ అని ఒక వైద్యుడు అద్నాన్‌ను హెచ్చరించారట. అయినా పెట్టించుకోలేదు. పైగా బేకరీకి వెళ్లి ఫుల్‌గా లాగించేశడట. ఇది చూసి అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి ఆరోగ్యాన్ని కాపాడుకోమంటూ ఆవేదనతో కన్నీటితో చేసిన అభ్యర్థన, లైఫ్‌స్టైల్ మార్చుకోమని చేసిన హెచ్చరిక అతనిలో పట్టుదల పెంచింది. చివరికి అనుకున్నది సాధించారు. అలాగే తిరిగి బరువు పెరగకుండా ఉండటానికి కఠినమైన దినచర్యను పాటిస్తున్నానని చెప్పారు. కష్టపడి బరువు తగ్గాను.. జీవితంలో షార్ట్కట్లు ఏమీ ఉండవు అని చెప్పారు. -
Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..
చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎత్తు, వయసుకి తగ్గట్టుగా బరువు ఉండటం చాలా అవసరం. ఆరోగ్యకరమైన రోజువారీ అలవాట్లు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీపీ గుండె జబ్బులు, మధుమేహం లాంటి జబ్బులను దూరంగా ఉంచుతాయి. కాబట్టి ఆరోగ్యంగా, చక్కటి శరీరాకృతితో ఆకర్షణీయంగా ఉండాలంటే దినచర్య సవ్యంగా ఉండాల్సిందే. కొన్ని ముఖ్యమైన సూత్రాలు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. లేలేత సూర్యకిరణాలు మన శరీరానికి తాకిడే, చక్కటి డి విటమిన్ అందుతుంది. యోగా, నడక లాంటి వ్యాయామం చేయాలి. ఇది రక్త ప్రవాహం సాఫీగా సాగిపోవడానికి మేలుచేస్తుంది. అంతేకాదు రోజంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. నిర్దిష్ట సమయాల్లోనే భోజనం చేయాలి. అదీ సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఉపాహారం అస్సలు వాయిదా వేయొద్దు. రాత్రి నిద్రకు ముందు అతిభోజనం వద్దు.సరిపడినన్ని నీళ్లు తాగాలి.స్మార్ట్ఫోన్లు, టీవీలకు ఎక్కువగా అతుక్కుపోకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా రోజుకు 10వేల అడుగులు వేస్తే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. నిమిషానికి 80 అడుగులు నడిస్తే సాధారణం. నిమిషానికి 100 అడుగులు నడుస్తుంటే మధ్యస్థంనిమిషానికి 120 అడుగులు నడిస్తే.. అది వేగవంతమైన చురుకైన నడక. ఇది అత్యంత ప్రభావవంతమైనది. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది వారి వారి ఆరోగ్య పరిస్థితి, సామర్థ్యం ఆధారంగా నిర్ధారించుకోవాలి. రాత్రికి రాత్రికే బరువు తగ్గాలనే అత్యాశతో అవగాహన లేని షార్ట్ కట్ పద్దతులు, లేని పోని డైటింగ్‌లను ఆశ్రయించకూడదు ఇది ఒక్కోసారి ప్రమాదం కూడా. శరీర తత్వాన్ని అవగాహన చేసుకొని ఓపిగ్గా ప్రయత్నిస్తే విజయం సాధించడం తథ్యం. నోట్: ఏదైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
స్లిమ్‌గా మారిన నర్సు..బ్రేక్‌ఫాస్ట్‌గా గిన్నెడు పెరుగు..
ఈ వెయిట్ లాస్ స్టోరీ వింటే అవాక్కవ్వుతారు. బాబోయ్ ఇవేం ఫుడ్ అలవాట్లు.. అనిపిస్తుంది. ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లతోనే స్లిమ్‌గా మారింది, కానీ బరువు తగ్గాలనుకునే వారు తీసుకోకూడని హెవీ ఫుడ్స్‌తోనే ఆమె బరువు తగ్గడం విశేషం. నోటిని కట్టడి చేయకుండా.. కడుపు నిండుగా తింటూ బరువు తగ్గి చూపించింది. పైగా అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉంటూ..హాయిగా రుచికరమైన ఆహారం తింటూనే బరువు తగ్గడం ఎలాగో చూపించింది. మరి ఆమె వెయిట్ లాస్ జర్నీ ఎలా జరిగిందో సవివరంగా చూద్దామా.!.కెనడాకు చెందిన మెలనీ కోజ్(21) తన పనివేళల కారణంగా బర్గర్లు, ఫ్రైస్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకునేదట. దాంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొందట. చిన్న వయసులోనే అంత బరువు ఉండటంతో చాలా ఇబ్బందులు పడేది కూడా. పైగా వయసుకి మించిన అధిక బరువు ప్రమాదమని హెచ్చరించడంతో బరువు తగ్గేందుకు ఉప్రక్రిమించిందట. అందుకోసం పలు రకాల వర్కౌట్లు, యోగా, వ్యాయమాలు వంటివి ఎన్నింటినో చేసి.. దాదాపు రెండేళ్లు పూర్తిగా విఫలమైంది. ఇక లాభం లేదనుకుని..డైట్‌లోనే ఏదైనా మార్పు చేయాలి.. లేదంటే కష్టమే బరువు తగ్గడం అని అర్థమైంది మెలోనికి. దాంతో న్యూట్రిషియన్ కోర్సులో చేరి ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటో సవివరంగా తెలుసుకుంది. ఇక అప్పటి నుంచి అధిక ప్రోటీన్‌తో కూడిన ఆహారాలు తినడం ప్రారభించింది. ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా అధిక ప్రోటీన్‌తో కూడిన గిన్నెడు పెరుగు తోపాటు తాజా పండ్లను జోడించి తీసుకునేదట. ఇది కడుపు నిండిన అనుభూతి కలిగించి చాలాసేపటి వరకు ఫుడ్ తినాలనే కోరికను నివారించేదట. అలాగే అనారోగ్యకరమైన చిరుతిండ్లన్నింటికి పూర్తిగా దూరంగా ఉండేదట. దాంతో తన బరువులో అనుహ్యమైన మార్పుల మొదలయ్యాయట. అలా 44 కిలోలక వరకు తగ్గానని, ప్రస్తుతం 69 కిలోలు ఉన్నట్లు తెలిపింది. అయితే తన డైట్లో తక్కువ ఫ్యాట్ కలిగిన చీజ్, చికెన్, చేపలు వంటి ఉన్నాయట. అలాగే తనకు ఇష్టమైన స్వీట్స్ కూడా తినేదాన్ని అంది. అది కూడా హెల్దీ స్వీట్స్ తప్ప..ప్రాసెస్ చేసినవి కావట. ప్రస్తుతం ఈ నర్స్ వెయిట్ లాస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అధిక ప్రోటీన్‌తో కూడిన ఆహారం బరువు తగ్గిస్తుందా..ఇది కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి.. అధికంగా ఫుడ్ తీసుకోవాలనే ఆలోచనను నివారిస్తుంది. అలాగే మంచి బలాన్ని అందించి..బరువు తగ్గాలనే లక్ష్యంపై ఫోకస్ పెట్టేలా చేస్తుంది. తద్వారా కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే..చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు ఉంటే..కఠినమైన డైట్ల జోలికి పోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. సరైన విధంగా తీసుకుంటే..ఆహారమే ఆరోగ్యం అని, అతిగా తీసుకుంటే విషంగా మారి అనర్థాలకు కారణమవుతుందని చెప్పారు. పూర్తిగా చెడు ఆహారపు అలవాట్లను నివారించి హెల్దీ ఫుడ్‌కి ప్రాముఖ్యత ఇస్తే బరువు తగ్గడం అనేది మన చేతుల్లోనే ఉంటుందట. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రొటీన్ వాకింగ్ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !) -
భారీగా బరువు పెరిగా.. 33 ఏళ్ల వయసులోనే ఆంటీ పాత్రలు వచ్చాయి : బాలీవుడ్ నటి
సినిమా తారలకు ఫిట్నెస్ చాలా అవసరం. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సివస్తోంది. కొంచెం బొద్దుగా కనిపించినా సరే.. వాళ్లను దూరం పెట్టేస్తుంటారు. అందుకే హీరోయిన్లు తమ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. బరువుని కంట్రోల్ చేసేందుకు డైటింగ్‌తో పాటు డేటింగ్ కూడా చేస్తుంటారు. అయినప్పటికీ వారి శరీరంపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి కుషా కపిల(Kusha Kapila) శరీరంపై కూడా నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ఉన్నపళంగా బరువు తగ్గడంపై రకరకాల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై స్వయంగా కుషానే వివరణ ఇచ్చింది. తన బాడీ గురించి ఇతరులతో మాట్లాడాల్సిన అవరసం లేదని..తనకు నచ్చినట్లుగా తాను ఉంటానని చెబుతూనే ఎందుకు బరువు తగ్గాల్సి వచ్చింది వివరించింది.బరువు తగ్గడం నాకేమి కొత్తకాదు. స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడే నేను బరువు పెరిగాను. దీంతో మా అమ్మ నన్ను జిమ్‌లో జాయిన్ చేయించడంతో మళ్లీ మాములు స్థితికి వచ్చాను. ఆ తర్వాత కాలేజీ రోజుల్లో మళ్లీ నా బరువు విపరీతంగా పెరిగింది. ఎందుకు అలా జరిగిందో తెలియదు. నా బాడీని పట్టించుకోకుండా నా కామెడీపైనే ఎక్కువ ఫోకస్ చేశాను. లెక్చర్లు కూడా నా చదువుని పట్టించుకోకుండా నా కామెడీని ఎంజాయ్ చేసేవాళ్లు. 22 ఏళ్ల వయసులో నేను చాలా బరువు పెరిగాను. దీంతో నా ఫ్రెండ్స్ ఫోటోలు షేర్ చేసి ‘ఇలా మారిపోయావేంటి?’ అని అడిగారు. వారి మాటలే నా జీవితాన్ని మార్చేశాయి. నా బాడీపై ఫోకస్ పెట్టాను. ఆరు నెలల్లో విపరీతంగా తగ్గిపోయాను. రోజుకు 800 క్యాలరీస్ కంటే తక్కువ ఆహారాన్ని తీసుకున్నాను. ఆ సమయంలో నా శరీరంలో భారీగా మార్పులు జరిగాయి. చాలా సన్నబడిపోయాను. 12 రోజుల పాటు జ్వరం వచ్చింది. కొన్నాళ్ల పాటు అన్నం కూడా తినలేదు. ఆస్పత్రికి వెళితే.. టీబీ అటాక్ అయిందని చెప్పారు. తక్కువ తినడం కారణంగానే టీబీ వచ్చిందని చెప్పారు. ఇమ్యునిటీ పవర్ పూర్తిగా తగ్గిపోయింది.టీబీ కారణంగా బరువు తగ్గినా.. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అంతలా నా మైండ్ మారిపోయింది. కానీ నేను 30 ఏళ్లకు వచ్చేసరికి.. పనిపై ఫోకస్ పెట్టి శరీరాన్ని పట్టించుకోవడం వదిలేశాను. డైట్ ఫాలో కాలేదు. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రం తీసుకున్నాను. ముంబైకి వెళ్లిన తర్వాత బరువు పెరగడం, తగ్గడం స్టార్ట్ అయింది. అయినా కూడా నేను నా పనిపైనే ఫోకస్ పెట్టాను. వైద్యులను సంప్రదిస్తే.. నీ లైఫ్‌స్టైల్‌ని పూర్తిగా మార్చుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి నేను మళ్లీ నా బాడీపై ఫోకస్ చేశాను.డైట్ ఫాలో అయ్యాను. 33 ఏళ్ల వయసులో నేను కాస్త లావుగానే ఉన్నాను. దీంతో 45-50 ఏళ్ల ఆంటీ పాత్రలే ఎక్కువ వచ్చాయి. అప్పట్లో ఆ పాత్రలు చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు అలా చేశానో ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు బరువు తగ్గడానికి కారణం కూడా సినిమా చాన్స్‌ల కోసమే. జిమ్ చేస్తూ డైట్ ఫాలో అవుతున్నాను. నా బాడీపై ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నాను. నా శరీరంతో నేను ఏదైనా చేస్తా. ఏం చేస్తున్నానని ఇతరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు’ అని కుషా కపిల చెప్పుకొచ్చింది.కుషా కపిల కెరీర్ విషయానికొస్తే.. కామెడీ కంటెంట్‌తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. అనంతరం 2017లో కుషా కపిల.. జోరావర్ సింగ్ అహ్లువాలియాను పెళ్లి చేసుకున్నారామె. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2023లో విడిపోయారు. -
Weight Loss వెయిట్ లాస్కి దివ్య ఔషధంలా.. ఆరోగ్యంగా!
సత్తు పిండి గురించి ఎపుడైనా విన్నారా? ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.బరువు తగ్గడంలో ఎంతో సాయపడుతుంది. గుండె, షుగర్వ్యాధి గ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. ఈ సూపర్ ఫుడ్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా?సత్తు పిండిని శనగపప్పు (చనా) లేదా ఇతర పప్పులను పొడిగా వేయించి, మెత్తని పిండిగా తయారు చేస్తారు. ఈ సత్తుపిండి, బెల్లం కలిపి లడ్డూలు చేసుకొని, ఇంకా వివిధ రూపాల్లో రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా, బరువు తగ్గవచ్చు. ఇది ప్రోటీన్, ఫైబర్ , ఇనుము, కాల్షియం ,మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. అందుకే ఇది బరువు తగ్గడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఆకలిని తగ్గించి, అనారోగ్యకరమైన చిరుతిండిని నివారించడంలో సహాయపడుతుంది.సత్తు పిండి బరువు తగ్గడంలో ఎలా సాయపడుతుంది?ప్రోటీన్ అధికంగా ఉండటం వలన మీరు ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంది.ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది కనుక కండరాలను బలిష్టం చేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి ఉండి, చిరుతిళ్లు తినకుండా నిరోధించవచ్చు. తద్వారా మనం తీసుకునే కేలరీల మోతాదు తగ్గుతుంది.ఫైబర్ అధికంగా ఉంటుంది, జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం , ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ పోషకాలను సరిగ్గా గ్రహించేలా చేస్తుంది. అనవసరమైన బరువు పెరగకుండా నిరోధిస్తుంది.జీవక్రియను పెంచుతుంది సత్తులో ఇనుము, మెగ్నీషియం , కాల్షియం జీవక్రియ ప్రక్రియలకు మద్దతు ఇస్తాయి. అధిక జీవక్రియ కేలరీల బర్న్ చేయడానికి గంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.ఇందులోని తక్కువ గ్లైసెమిక్రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బ్లడ్లోకి చక్కెరనునెమ్మదిగా విడుదల చేస్తుంది. దీంతో షుగర్ స్థాయిలు సడన్‌గా పడిపోవడం, పెరిగిపోవడం లాంటివి ముప్పు తప్పుతుంది. రక్తంలో చక్కెర స్థాయి కారణంగా వచ్చే ఆకలి బాధలను నియంత్రింస్తుంది.సత్తు సహజ నిర్విషీకరణకారిగా పనిచేస్తుంది, శరీరం నుండి విషాన్ని (టాక్సిన్స్) బయటకు పంపడంలో సహాయ పడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.అదనపు కేలరీలు లేకుండా శక్తిని అందిస్తుంది. అధిక కేలరీల ప్రాసెస్ చేసిన ఆహారాల మాదిరిగా కాకుండా, సత్తు అనేది సహజమైన శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది. అనవసరమైన కొవ్వులు లేదా చక్కెరలు లేకుండా మంచి శక్తిని అందిస్తుంది.సత్తుతో రెసిపీలుసత్తు పానీయం2 టేబుల్ స్పూన్ల సత్తును ఒక గ్లాసు నీరు, చిటికెడు ఉప్పు, నిమ్మరసంతో కలపుకొని తాగవచ్చు. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్‌లో కేలరీలు తక్కువ. ఉదయం దీనిని తీసుకోవడం వల్ల జీవక్రియ క్రమబద్ధీకరించడంతోపాటు, రోజంతా కడుపు నిండుగా ఉన్న అనుభూతి నిస్తుంది.సత్తు మజ్జిగ: జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, మజ్జిగతో ఈ పిండిని కలిపి తాగవచ్చు. మజ్జిగ జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి సహాయపడితే, సత్తు ప్రోటీన్ , ఫైబర్‌ను అందిస్తుంది. సో ఇది బరువు తగ్గడానికి అనువైన పానీయంగా మారుతుంది.సత్తు రోటీ లేదా పరాఠ : సత్తును గోధుమ పిండితో కలిపి పోషకమైన రోటీ లేదా పరాఠా తయారు చేసుకోవచ్చు.సత్తులడ్డు: సత్తును బెల్లం, కొద్దిగా నెయ్యితో కలిపి లడ్డూలు సిద్ధం చేసుకొని తినవచ్చు. ఇది శక్తినివ్వడంతోపాటు, చక్కెర స్నాక్స్‌కు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటాయి.నోట్ : ఇది సాధారణ అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. ఈ ఆహారాన్ని తీసుకునే ముందు మరింత సమాచారం కోసం నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించగలరు. -
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
భరించలేని భారం అధిక బరువు. ఏటా చాలామంది యువత ఊబకాయం సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరూ పట్టుదలతో బరువు తగ్గి స్ఫూర్తిగా నిలవగా మరికొందరూ సాధించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు వందలు లేదా అంతకు మించి బరువు ఉన్నవారిని చూశాం. కానీ వాటన్నింటిని తలదన్నేలా ఏకంగా 222 కిలోల బరువు అంటే వామ్మో అనేస్తాం. పైగా అంత భారీకాయం ఉన్న వ్యక్తి తగ్గడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ వ్యక్తి సింపుల్‌గా తనికిష్టమైన హాబీతో తగ్గి చూపించి..శెభాష్ అనిపించుకుంటున్నాడు. అంత బరువు ఉండే వ్యక్తి ఎలా స్లిమ్‌గా మారాడో చూద్దామా..!.అమెరికాలోని ఒహియోకు చెందిన 36 ఏళ్ల ర్యాన్ గ్రూవెల్ దాదాపు 222 కిలోల బరవు ఉండేవాడు. ఎన్ని కేలరీలు తీసుకుంటున్నాను అనేది పట్టించుకోకుండా నచ్చిన ఫుడ్ అమాంతం లాగించేసేవాడు. తనకిష్టమైనది ప్రతీది తినేయడం దానికి తోడు శారీరక శ్రమ లేకపోవడం కారణంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నాడు. తెలియకుండానే అలా ఫాస్ట్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవడంతో..అంత ఈజీగా దాన్ని వదిలించుకోలేకపోయాడు. ఫలితంగా తానే విస్తుపోయేలా లావైపోయాడు. ఇక లాభం లేదనుకుని బరువు తగ్గే కార్యక్రమాలకు ఉపక్రమించాడు. వాకింగ్ చేయాలనుకుంటే..తన అధిక బరువు కారణంగా విపరితీమైన మోకాళ్ల నొప్పులు వేధించేవి. ఇక ఇలా కాదని..మే 6, 2023న సైకిల్ కొనుగోలు చేసి..సైక్లింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ హాబీ జీవితాన్నే మార్చేసింది..ర్యాన్‌కి చిన్నప్పటి నుంచి సైక్లింగ్ మంచి హాబీ. సరదా..సరదాగా.. చేసే హాబీతో ఊహించని విధంగా 124 కిలోలకు తగ్గిపోయాడు. ర్యాన్ గణనీయమైన బరువు కోల్పోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దాంతోపాటు స్వీట్లు, ఆల్కహాల్, ఫాస్ట్‌ఫుడ్‌కి పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఈ మేకి 90 కిలోలకు చేరాడు. ర్యాన్ కూడా ఇంతలా బరువు తగ్గుతానని అస్సలు ఊహించలేదంటూ సంబరపడుతున్నాడు. అయితే తాను అనుకున్న లక్ష్యం ఇంకా చేరుకోలేదని..ఆరోగ్యకరమైన వ్యక్తిలా మంచి బరువు చేరుకునేదాక..తన వెయిట్ లాస్ జర్నీ ఆగదని ధీమాగా చెబుతున్నాడు. ఇక్కడ ర్యాన్ కథ చూస్తే..అసాధారణ బరువుని..జస్ట్ మనకు నచ్చిన అభిరుచితో ఎలా మాయం చేయొచ్చొ చెబుతోంది. అలానే అందరూ కూడా తాము చేయగలిగే వర్కౌట్లతో వెయిట్ లాస్కి ప్రయత్నిస్తే..విజయం తథ్యం అని నొక్కి చెప్పొచ్చు కదూ..!. View this post on Instagram A post shared by Ryan Grewell (@ryan_grewell) (చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!) -
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నతనంలోనే చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. అయితే అధికబరువుతో దారితీస్తున్న అనారోగ్యాలపై పెరుగుతున్న అవగాహన కారణంగా అధికబరువును తగ్గించేందుకు కసరత్తుల భారీగానే చేస్తున్నారు. ఆహారంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. తమ సక్సెస్ స్టోరీను సోషల్‌మీడియాలో ఫాలోయర్స్‌తో పంచుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు ఇరవై నాలుగేళ్ల కోపాల్ అగర్వాల్. పదండి ఆమె వెయిట్‌లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం. కోపాల్ అగర్వాల్ చిన్న వయసులోనే 101 బరువుతో బాధపడేది. ఇష్టమైన దుస్తులు వేసుకోవాలంటే కుదిరేదికాదు. పైగా ఏనుగులా వున్నావ్.. నీతో ఎవరు డేటింగ్ చేస్తారు... ఇలాంటి వెక్కింపులు, వేళాకోళాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేది. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించు కుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. చక్కటి ఫలితాన్ని సాధించింది. 101 కిలోల బరువు వద్ద మొదలైన ఆమె వెయిట్ లాస్జర్నీ 62 కిలోలకు చేరింది.కోపాల్ అగర్వాల్ తన అద్భుతమైన సక్సెస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తను పాటించిన ఆహార నియమాలు, వ్యాయామల గురించి అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనం తీసుకునేది. క్రమం తప్పకుండా కఠిన వ్యాయామం చేసింది. దీంతో సుమారు 40 కిలోల బరువును తగ్గించుకుంది. ఇపుడు ఇష్టమైన మోడ్రన్ దుస్తులు కూడా వేసుకుంటోంది. బరువు తగ్గడం వల్ల తన శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా తన మానసిక శ్రేయస్సు , కాన్ఫిడెన్స్ కూడా మెరుగుపడిందని ఆమె చెప్పింది. మరో వీడియోలో, తాను కేవలం ఆరు నెలల్లో 32 కిలోలు తగ్గినట్టు చెప్పుకొచ్చింది అగర్వాల్. View this post on Instagram A post shared by KOPAL AGARWAL | Fitness | Nutrition | Skincare | Travel (@_kopal.agarwal_)బరువు తగ్గడానికి తీసుకున్న రోజువారీ ఆహారం:అల్పాహారం: ఒక రోటీ, 5 గుడ్డులోని తెల్లసొన, ఒక గిన్నె పోహా 2 పనీర్ ముక్కలతో అధిక ప్రోటీన్ కలిగిన ఫ్రూట్స్, పెరుగుమధ్యాహ్నం: పుచ్చకాయ , స్ట్రాబెర్రీలు బ్లాక్ కాఫీ, కొబ్బరి నీరుభోజనం: ఆకుకూరలతో 100 గ్రాముల చికెన్, కిచ్డీ పెరుగుతో పచ్చి కూరగాయలతో పనీర్ భుర్జీమధ్యాహ్నం: గ్రీన్ టీరాత్రి భోజనం: ఆకుకూరలతో సాటేడ్ పనీర్ సలాడ్, 100 గ్రాముల చికెన్, గుడ్డు భుర్జీదీంతో పాటు, రాత్రి తొందరగా నిద్రపోవడం, ఉదయాన్నేతొందరగా మేల్కోవడం లాంటివి పాటించింది. ఇంకా ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీరు త్రాగడం , పరగడుపున గోరువెచ్చని నీరు సేవించడం, ప్రతిరోజూ కనీసం 10వేలు అడుగులు నడవడంతన దినచర్యలో భాగం చేసుకుంది. చక్కెర ఇంట్లో వండిన భోజనాన్ని మాత్రమే తీసుకుంటూ, జంక్ ఫుడ్‌కు కంప్లీట్‌గా నో చెప్పింది. మొత్తానికి కష్టపడి తన శరీర బరువు 101 నుండి 62 కిలోలకు చేరి వావ్ అనిపించుకుంది.నోట్ : ఇదే టిప్స్ అందరికీ పాటించాలనే నియమం ఏదీ లేదు. కానీ కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం, పూర్తి నిబద్దత, ఓపికతో ప్రయత్నిస్తే బరువు తగ్గడం కష్టమేమీ కాదు. అయితే బరువు తగ్గే ప్రయత్నాలను ప్రారంభించేందు ముందు, బరువు పెరగడానికి గల కారణాలును వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకుని ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. -
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..!
ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే శరీర బరువు చాలా కీలకం. మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం చేస్తూ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నామో లేదో తనిఖీ చేసుకోవాలి. ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు. మరి మన శరీర బరువు నియంత్రణలో ఉండాలన్నా, శరీర బరువును తగ్గించుకోవాలన్నా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. సమతుల్య ఆహారం తీసుకునే జాగ్రత్త పడాలి. మరి అధిక బరువును తగ్గించుకునే క్రమంలో శరీరంలో ఫైబర్, ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండాలి. అందుకు మన ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన కొన్నిముఖ్యమైన ఆహార పదార్థాలు గురించి తెలుసుకుందాం.సాధారణ శారీరక శ్రమతో పాటు కొన్ని రకాల ఆహారాలను మన మెనూ చేర్చుకోవడం వల్లన, ప్రొటీన్ ఫుడ్ అందడంతో పాటు, తొందరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉంటూ, కడుపు నిండిన అనుభూతి నింపేవి... రోజువారీ ఆహారంలో చేర్చినప్పుడు బరువు తగ్గడానికి గణనీయంగా సహాయపడతాయి. అంతేకాదు అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తాయి.రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి . జీవక్రియను పెంచుతాయి.ఇదీ చదవండి: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్‌బాస్ ఫేంఆకుకూరలుఆకుకూరలు కేలరీలు , కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించడానికి సహాయపడతాయి. వీటిల్లోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఓట్స్ఓట్స్ అనేది కరిగే ఫైబర్, ముఖ్యంగా బీటా-గ్లూకాన్ అధికంగా ఉండే తృణధాన్యం. కడుపు నిండిన అనుభూతినిచ్చి, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది అతిగా తినకుండా నిరోధిస్తుంది. రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది.గ్రీకు యోగర్ట్ గ్రీకు పెరుగులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గే సమయంలో కండరాల నిర్వహణకు మద్దతు ఇస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపర్చే, మంటను తగ్గించే జీర్ణక్రియకు సహాయపడే ప్రోబయోటిక్లు పుష్కలంలా లభిస్తాయి. చదవండి: బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!గుడ్లుగుడ్లు పోషకాలతో నిండి ఉంటాయి . అధిక-నాణ్యత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , అవసరమైన విటమిన్లను అందిస్తాయి. అల్పాహారంగా గుడ్లు తినడం వల్ల కడుపు నిండి, కేలరీల ఇన్‌టేక్ తగ్గుతుంది. ఆకలి , కొవ్వు నిల్వలో పాల్గొనే హార్మోన్లను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.చియా గింజలు చియాగింజల్లో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అవకాడోఅవకాడోలో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్‌తో సమృద్ధిగా లభిస్తాయి. పొటాషియం కూడా ఉంటుంది.ఇది నీటి నిలుపుదలని నిర్వహించడానికి మరియు ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. పరోక్షంగా కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.బెర్రీలుబెర్రీలు కేలరీలు తక్కువ, ఫైబర్, విటమిన్లు మ,శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. తీపిని వదులుకోకుండా బరువు తగ్గడానికి ప్రయత్నించే ఎవరికైనా ఇవిచక్కగా ఉపయోగపడతాయి.నట్స్ నట్స్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , ఫైబర్‌ను అందిస్తాయి.. అవి కేలరీలు అధికంగా ఉన్నప్పటికీ, గింజలను మితంగా తీసుకుంటే, ఆకలిని అరికట్టి, మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గించే సామర్థ్యం కారణంగా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనాలు చూపిస్తున్నాయి.చిక్కుళ్ళుచిక్కుళ్ళు మొక్కల ఆధారిత ప్రోటీన్ , కరిగే ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి, దీర్ఘకాలిక సంతృప్తిని ప్రోత్సహిస్తాయి. ఆకలిని నియంత్రించి, రక్తంలో చక్కెర పెరుగుదల లేకుండా స్థిరమైన శక్తి వనరును అందిస్తాయి. ఇది కొవ్వు నిల్వలను కరిగేలా చేస్తాయి.నోట్: బరువుతగ్గడం అనేది నిబద్ధతతో చేయాల్సిన పని. ఎవరికి వారు క్రమశిక్షణగా వ్యాయామం చేస్తూ , ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యంగా తమబరువును తగ్గించుకోవాలి. ఇందుకు వైద్యులు, నిపుణుల సలహా తీసుకోవాలి. -
Yoga కూర్చొని కూడా బరువు తగ్గొచ్చు
‘దండాసనం’ (Dandasana or Staff Pose) అని పిలువబడే స్టాఫ్ పోజ్ వెన్నెముక, కాళ్ళు, తుంటి భాగంలో బలాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం కూర్చున్న భంగిమలో ఉంటుంది. యోగా ప్రారంభకులకు అనుకూలమైన అభ్యాసంగా ఉపయోగపడుతుంది.ఎలా చేయాలంటే.మ్యాట్ పైన కూర్చొన, కాళ్ళు ముందు చాపి కూర్చోవాలి. తొడ కండరాలను స్ట్రెచ్ చేయాలి. పాదాలను ముందుకు వంచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. భుజాలను వెడల్పుగా చేస్తూ, నిటారుగా ఉంచాలి. ∙చేతులను హిప్ బాగానికి రెండు వైపులా నేల మీద నిటారుగా ఉంచాలి.ఈ భంగిమలో 5–15 శ్వాసలోపలకు తీసుకొని, వదలాలి, ఈ సమయంలో శ్వాసపై పూర్తి దృష్టి పెట్టాలి. ఇదీ చదవండి : బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్ప్రయోజనాలు.. ∙ఈ ఆసనం ద్వారా వెన్నునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ∙చేతులు, తొడ కండరాలలో ఒత్తిడి రిలీజ్ అవుతుంది. దీర్ఘ శ్వాసల వల్ల ఛాతీ భాగం స్ట్రెంథెన్ అవుతుంది. ఇతర యోగా భంగిమలకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఈ భంగిమ రోజూ సాధన చేయడం ద్వారా శారీరక బరువు పట్ల అవగాహన పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన ఆహారంవైపు దృష్టి మరలి, అధికబరువు సమస్య తగ్గుతుంది.ఈ భంగిమలో తొడ, మోకాలి భాగాలు ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తే యోగా పట్టీని ఉపయోగించవచ్చు. కూర్చోవడంలో ఇబ్బంది పడుతుంటే, సపోర్ట్ కోసం ఒక పలచటి దిండును ఉంచవచ్చు. మొదట్లో కాళ్ళను నిటారుగా ఉంచలేకపోతే ఆందోళన పడనక్కర్లేదు. మెల్లగా అభ్యాసనం ద్వారా కాళ్లు నిటారుగా వస్తాయి. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..! -
అభిమానులకు షాకిచ్చిన ఛార్మి.. ఇలా మారిపోయిందేంటి?
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఛార్మి కౌర్. ప్రస్తుతం నిర్మాతగా మారిపోయింది. గతేడాది పూరి జగన్నాధ్‌తో కలిసి డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మూడు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా మెప్పించింది. నీ తోడు కావాలి అనే మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఛార్మి.. మాస్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలకు దూరమైనా తర్వాత మరింత బొద్దుగా తయారైన ఛార్మి సడన్‌కు అభిమానులకు షాకిచ్చింది. తాను ప్రస్తుతం 9 కేజీల బరువు తగ్గినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరింత బరువు తగ్గుతానని తెలిపింది. ఈ ప్రక్రియ ఇలానే కొనసాగుతుందని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు సూపర్బ్ మేడం అంటూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) -
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
ప్రస్తుత కాలంలో అందర్నీ భయపెడుతున్న సమస్య అధిక బరువు. జీవన శైలి, ఆహార అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు. చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఈ బాధలనుంచి విముక్తి పొందేందుకు, స్లిమ్‌గా కనిపించేందుకు భారీ కసరత్తులే చేస్తున్నారు. అంతేకాదు బరువు తగ్గడంతో తాము సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 14 నెలల్లో 63 కిలోలు తగ్గిన మహిళ వెయిట్ లాస్ జర్నీ నెట్టింట వైరల్‌గా మారింది. ఈమె కథ చాలా హైలైట్‌గా నిలిచింది. కొన్ని టిప్స్‌ను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. అవేంటో తెలుసుకుందాం ఈ కథనంలో.ఫిట్నెస్ మోడల్ నెస్సీ చుంగత్ వెయిట్ లాస్ జర్నీ చాలా స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. 138 కిలలో బరువున్న ఆమె కష్టపడి 75 కిలోలకు చేరింది. 2023లో నవంబరులో మొదలు పెట్టి, 2025 జనవరి నాటికి అంటే 14 నెలల్లో ఏకంగా 63 కిలోల బరువు తగ్గించుకుంది. "138 కిలోల నుండి బరువు తగ్గే ప్రయాణం అంత సులభం కాదు" అని నెస్సీ తన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను 40 లక్షలమంది వీక్షించారు. బరువు తగ్గాలనే స్థిర చిత్తం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బలమైన సంకల్ప శక్తి ద్వారా 63 కిలోల బరువును తగ్గించుకుంది. "ఇది ఒక మైండ్ గేమ్" అని చెబుతుంది నెస్సీ.‘‘ఇక నేను చేయలేను .. ఆపేస్తా..’’అని చాలాసార్లు అనిపించినా .. ఆమె దివంగత తల్లి ఊబకాయం సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడిన తీరు గుర్తొచ్చి, తన ప్రయత్నాన్ని కొనసాగించింది. తన సొంత అనుభవంతో రూపొందించుకున్న నిబంధనలు, సూత్రాల ద్వారా నెస్సీ తన ఫ్యాట్‌ను తగ్గించుకునే ప్లాన్‌కు కట్టుబడి ఉంది. చివరికి అనుకున్నది సాధించింది.ఇదీ చదవండి: రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్ చేస్తే..!మూడంటే..మూడు టిప్స్షుగర్కు చెక్: ముఖ్యంగా మూడే మూడు డైట్ చిట్కాలు పాటించినట్టు నెస్సీ చెప్పుకొచ్చింది. చక్కెరను తగ్గించండి, కానీ ఆనందాన్ని , సంతోషాన్ని కాదు సుమా. రోజువారీ ఆహారం నుంచి చక్కెను పూర్తిగా తొలగించాలి. కానీ వారానికి ఒక కేక్ ముక్క లేదా చిన్న చాక్లెట్ ముక్క తినవచ్చు.ఉదయాన్నే వేడి నీళ్లు : ఉదయం గోరువెచ్చని నీటితో ప్రారంభించాలి. ఇది ఒక చిన్న అడుగే, కానీ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది వెయిట్లాస్కు బాగా ఉపయోగపడుతుంది.చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీట్రస్ట్ది ప్రాసెస్: మీరు పాటిస్తున్న పద్ధతిపై విశ్వాసాన్ని కోల్పోకండి. అద్దాన్ని కాదు.. నమ్మేది.. ట్రస్ట్‌ది ప్రాసెస్ మొదలు పెట్టిన తొలినెలలో మార్పు కనిపించకపోతే.. భయపడకండి అంటుంది ఆమె. ఆ నమ్మకమే తనకు బాగా ఉపయోగపడిందని నెస్సీ వెల్లడించింది. తక్షణం వచ్చే ఫలితంపై కాకుండా, నిరాశపడకుండా, దీర్ఘకాలిక లక్ష్యంపై గురి పెట్టి తన శరీర బరువును తగ్గించుకున్న నెస్సీ స్టోరీ నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.నోట్ : బరువు పెరగడం, తగ్గడం అనేది శరీరతత్వం, మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి శరీరం భిన్నంగా ఉంటుందనే గమనించాలి. ఆరోగ్య మార్పులు, వ్యాయామం, విశ్వాసం ప్రధాన పోషిస్తాయి. ఏదైనా కొత్త ఆహారం లేదా ఫిట్నెస్ దినచర్యను ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Nessy chungath ❇️🧸🌸 (@call_me_nessykutty) -
ఓవైపు బరువు.. మరోవైపు మోకాళ్ల నొప్పి.. అయినా సరే
హీరోయిన్లు తమ గ్లామర్ ఎప్పటికీ కాపాడుకుంటూనే అవకాశాలు వస్తుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించి, నోటికొచ్చింది తిన్నా, జిమ్ చేయకపోయినా బరువు పెరిగిపోతారు. ఇప్పుడు అలానే బరువు పెరిగిపోయిన ఓ టాలీవుడ్ హీరోయిన్.. తన వెయిట్ లాస్ జర్నీ మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.స్వతహాగా కిక్ బాక్సర్ అయిన రితికా సింగ్.. 'సాలా ఖాదుస్' తమిళ సినిమాతో హీరోయిన్ అయింది. ఈ మూవీనే తెలుగులో వెంకటేశ్ 'గురు'గా రీమేక్ చేశారు. గత కొన్నాళ్లలో తమిళంలోనే వరస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఈ మధ్యనే ఎందుకో బరువు పెరిగింది. సరిగ్గా మూడు నెలల్లో మళ్లీ తగ్గిచూపించింది. ఈ వీడియోనే ఇప్పుడు పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: బాలీవుడ్ లో మర్యాద ఇవ్వరు.. యంగ్ హీరో కన్నీళ్లు) 'గత మూడు నెలల్ని అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పటివరకు లేనంతగా బరువు పెరిగాను. మరోవైపు మోకాళ్ల గాయం పరిస్థితి దారుణంగా తయారైంది. నొప్పి తట్టుకోలేకపోయాను. కదల్లేకపోయాను. డ్యాన్స్ కూడా చేయలేకపోయాను. దీంతో నన్ను నేను ఓసారి అద్దంలో చూసి.. ఇక చాలు అని నాతో నేనే చెప్పుకొన్నా.''ఇక ఫుడ్ తో నా రిలేషన్ షిప్ విషయానికొస్తే ఇప్పుడు చాలా చెడు అలవాట్లని నా కంట్రోల్ లో పెట్టుకున్నాను. దీనికోసం చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను' అని రితికా సింగ్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..
వేసవిలో పెరిగే ఉష్ణోగ్రతలు శరీరంలోని నీటిని ఆవిరి చేస్తుంటాయి. ఎన్నిసార్లు నీళ్లు తాగినా దాహం తీరదు. ఆకలిగానూ అనిపించదు. అలసట, నీరసంతో రోజంతా చికాకు. ఈ సమస్యలకు పరిష్కారం మన చేతిలోనే ఉందంటున్నారు పోషకాహార నిపుణులు సుజాతా స్టీఫెన్. ‘శరీరం త్వరగా డీ–హైడ్రేట్ అయ్యే కాలం ఇది. తినే పదార్థాల ఎంపిక సరిగా లేకపోతే జీర్ణవ్యవస్థ గాడి తప్పుతుంది. ఇలాంటప్పుడు... కూరగాయలతో చేసిన సలాడ్స్, సాంబార్, రసం.. వంటివి రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి.రెండు గంటలకు ఒకసారి గ్లాసుడు నీళ్లు, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలి. అకస్మాత్తుగా తలనొప్పి, భావోద్వేగాలలో మార్పు, నీరసం, ఇరిటేషన్.. వంటివీ తలెత్తుతుంటాయి. దీనిని సైలెంట్ డీ–హైడ్రేషన్ సమస్యగా గుర్తించి నీళ్లు తాగి, కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. నిమ్మరసం, సబ్జా గింజలతో తయారు చేసుకున్న లస్సీ ఒంటికి మేలు చే స్తుంది. నిమ్మరసంలో షుగర్‌కు బదులు కొద్దిగా ఉప్పు, సోడా కలుపుకొని తాగచ్చు. మధుమేహులు ఒకేసారి ఎక్కువ మొత్తం తింటే, శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. అందుకని టైమ్ ప్రకారం ఏదో ఒకటి మితంగా తినాలి. గర్భిణులకు ప్రత్యేకంఈ కాలం గర్భిణులు ఏ కొంచెం తిన్నా ఆయాసం వస్తుంటుంది. ఇలాంటప్పుడు మసాలా ఉన్న ఆహారం కాకుండా పండ్లు, జ్యూసులు, సలాడ్స్ పైన దృష్టి పెట్టాలి. దీని వల్ల కడుపులో హెవీగా ఉన్నట్టు అనిపించదు. ఆయాసం సమస్య తలెత్తదు. వయసు పైబడిన వాళ్లు పగటివేళ ఎండగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి అయితే వెంట నీళ్లు, పండ్లు తీసుకెళ్లాలి. డీ హైడ్రేట్ అయితే బీపీ డౌన్ అయ్యి కళ్లు తిరిగి పడి΄ోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వారి వెంట మరొకరు తోడుండాలి. రీ హైడ్రేషన్ వేసవిలో యూరిన్ పసుపు రంగులో వస్తుందంటే శరీరంలో నీటిశాతం తగ్గిందని అర్ధం. రీ హైడ్రేషన్ కోసం నీళ్లు, నిమ్మరసం సరైన ఎంపిక. ఫ్లేవర్డ్, షుగర్ లెస్ మెడికేటెడ్ ఓఆర్ఎస్లను ఎంచుకోవచ్చు. ఇది మంచి సీజన్బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి సీజన్. వేడికి ఎక్కువ ఆహారం తినబుద్ది కాదు.. పండ్లు, కూరగాయలు, జ్యూస్, నీళ్లు ఎక్కువ తీసుకుంటాం. ఇదంతా లో క్యాలరీ ఫుడ్. దీనివల్ల బరువు సులువుగా తగ్గచ్చు. వాకింగ్, జాగింగ్, వ్యాయామాలకు ఉదయం వేళ ఎంచుకోవడమే మంచిది. వేసవిలో పార్టీలకు వెళ్లినప్పుడు తినే మసాలా ఫుడ్స్ మరుసటి రోజు కూడా ప్రభావం చూపుతుంది. పడుకునేటప్పుడు మజ్జిగ తాగితే అసౌకర్యం తగ్గుతుంది.కూల్ సలాడ్కీరా, దోస, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, క్యాప్సికమ్ వంటివి సన్నని ముక్కలుగా తరిగి, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి కలిపి సలాడ్ తయారు చేసుకోవాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టి, రోజులో రెండు మూడుసార్లు తింటే, తేలికగా అనిపిస్తుంది. సొరకాయ జ్యూస్, పుదీనా, కొత్తిమీర షర్బత్‌లు, చట్నీలు, రాగి జావ వంటివి.. ఒంటికి మేలు చేస్తాయి.మాంసాహారులు తాజాగా తయారు చేసుకున్నవి, నూనె తక్కువగా ఉపయోగించినవి తీసుకోవాలి. – సుజాతా స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ (చదవండి: బుల్లితెర నటి అస్మిత హెల్తీ డైట్ ప్లాన్ ఇదే..! 20 ఏళ్లుగా..) -
21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: రకుల్ భర్త
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. జాకీ భగ్నానీ (Jackky Bhagnani) నిర్మాత మాత్రమే కాదు నటుడు కూడా! సినిమాల్లో నటుడిగా కనిపించడానికి ముందు ఏకంగా 60 కిలోలు తగ్గి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత 2009లో కల్ కిస్నే దేఖా చిత్రంతో వెండితెరకు నటుడిగా పరిచయమయ్యాడు. 2017లో ఓ సినిమా కోసం 15 కిలోలు తగ్గాడు. కేవలం 21 రోజుల వ్యవధిలోనే అంత బరువు ఎలా తగ్గాడని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ సీక్రెట్ మాత్రం ఎవరికీ చెప్పనంటున్నాడు జాకీ భగ్నానీ.అది ఆరోగ్యకరం కాదుతాజాగా జాకీ భగ్నానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గాను. కానీ అదంత ఆరోగ్యకరం కాదు. ఈ విషయంలో నేనెవరికీ సలహాలు, సూచనలు ఇవ్వను. ఒక షూట్ కోసం సడన్‌గా బరువు తగ్గాల్సి వచ్చింది. నా చేతిలో ఆప్షన్స్ లేవు. పైగా సమయం తక్కువే ఉంది. అప్పుడు నేను ఏం చేశానన్నది ఎవరికీ చెప్పదలుచుకోవడం లేదు. కానీ, దానివల్ల చాలా దుష్ప్రభావాలు ఎదురయ్యాయి.సైడ్ ఎఫెక్ట్స్ఒకేసారి ఎక్కువ బరువు కోల్పోయినప్పుడు యాసిడిటీ, జుట్టు కోల్పోవడం, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. శరీరం కూడా నీరసించిపోతుంది. ఎందుకంటే సడన్‌గా సన్నబడటం అనేది సహజమైన ప్రక్రియ కాదు కదా.. అయితే రోజంతా కడుపు మాడ్చుకోవాలి.. లేదంటే ఒంట్లో కొవ్వు తగ్గించేందుకు వేరే విధానాలు ఎంచుకోవాలి. ఈ రెండూ మంచివి కావు.శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటా..సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నేను నా బరువును కంట్రోల్లో ఉండేలా చూసుకుంటున్నాను. ఇందుకోసం ప్రతిరోజూ కష్టపడాల్సిందే! ఏదైనా వెకేషన్‌కు వెళ్లానంటే నోరు కట్టేసుకోకపోతే సహజంగానే లావెక్కుతాను. అప్పుడు మళ్లీ కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను అని జాకీ భగ్నానీ చెప్పుకొచ్చాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జాకీ బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ.. రోజుకు 10-15 కి.మీ. పరిగెత్తేవాడినని చెప్పాడు. కేవలం ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లను కూరగాయల రూపంలో ఆరగించేవాడినని తెలిపాడు.చదవండి: చికిత్సకు డబ్బుల్లేవ్.. నటుడు కన్నుమూత -
స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!
ఇంతవరకు ఎందరో వెయిట్ లాస్ జర్నీలు ప్రేరణగా నిలిచాయి. ఒక్కోక్కరిది ఒక్కో నేపథ్యంతో బరువు తగ్గేందుకు ఉపక్రమించారు. అయితే వారంతా డైట్లు వర్కౌట్లతో బరువు తగ్గితే. ఈ బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా మాత్రం మందులతోనే బరువు తగ్గానంటూ కుండబబ్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. అందరు ఆ మందులు దుష్ప్రభావాలు చూపుతాయనే దుష్ప్రచారంతో వాడేందుకు జంకుతున్నారని, అందులో వాస్తవం లేదని మరీ చెబుతున్నారు. తాను ఆ మందులు వాడుతూనే ఎలా ఆర్యోకరంగా బరువు తగ్గారో కూడా వెల్లడించారు. ఇదేంటి మందుల వద్దనే అంటారు కదా నిపుణులు అనే సందేహంతో ఆగిపోకండి అసలు కథేంటో తెలుసుకోండి మరీ..!.బాలీవుడ్ నిర్మాత హన్సల్ మెహతా టెలివిజన్ షోలు తీస్తూ నెమ్మదిగా మంచి బ్లాక్‌బస్టర్ మూవీలు తీసి మంచి నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. ఉత్తమ చలన చిత్ర నిర్మాతగా అవార్డులు కూడా దక్కించుకున్నారు. ఆయన డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఓ పక్క అధిక బరువుతో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా. అయితే మెహతా బరువు తగ్గేందుకు తన ఆరోగ్య సమస్యల రీత్యా డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించే మౌంజారో మందులను వాడానని అన్నారు. దానివల్లే బరువు తగ్గానని చెప్పారు. బరువు తగ్గాడానికి సెలబ్రిటీలు ఉపయోగిచే మౌజరోని తాను వాడానని మెహతా నిర్భయంగా చెప్పడమే గాక ఏకంగా పదికిలోలు తగ్గినట్లు తెలిపారు. అలాగే దీంతోపాటు సరైన జీవనశైలిని పాటించానని అన్నారు. అధిక ప్రోటీన్ భోజనం, చక్కెరను తగ్గించడం, మెడిటేరియన్ డైట్ వంటివి అనుసరించానని అన్నారు. ఆల్కహాల్ సేవించడం కూడా తగ్గించినట్లు తెలిపారు. సరైన జీవనశైలిని అనుసరించడం తోపాటు వర్కౌట్లు, అడదడపా ఉపవాసం, హైడ్రేటెడ్ ఉండేలా తగినంత నీరు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. దాంతో తన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి రావడమే గాక, ఇన్సులిన్ నిరోధకత తగ్గిందన్నారు. ఇప్పుడు యంగ్ ఏజ్‌లో వేసుకున్న పాత బట్టలు అన్ని సరిపోతున్నాయని ఆనందంగా చెప్పారు. ఆ మందులపై అపోహ ఎక్కువ..ఓజెంపిక్, మౌంజారో వంటి జీఎల్పీ-1 మందులు బరువు తగ్గడానికి పేరుగాంచినవి. కొద్దిమేర బరువుత తగ్గాలనుకునేవారికి, దీర్ఘకాలిక బరువుతో సతమతమవుతున్న వారికి ఇవి మంచివే అనేది నిపుణులు అభిప్రాయం. అయితే అనుసరించేటప్పుడు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణుల పరివేక్షణలోప్రారంభించాలట. ఇలాంటి వాడటానికి సిగ్గపడాల్సిన పనిలేదంటున్నారు మెహతా. అయితే వాటితోపాటు సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు అవలంభిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని చెబుతున్నారు. భారత్‌లో ఎలి లిల్లీ లాంఛ్ చేసిన ఈ ఔషధం మౌంజారో గేమ్-ఛేంజర్ కావచ్చని..భవిష్యత్తులో మరిన్ని సంచలనాలను సృష్టిస్తుందని చెబుతున్నారు నిపుణులు.Under medical guidance, I began Mounjaro to address rising blood sugar levels in the pre-diabetic range and to manage my steadily increasing weight. Paired with a committed lifestyle shift—high-protein meals, minimal sugar and alcohol, regular strength training, proper hydration,… pic.twitter.com/R0GnHuEcl7— Hansal Mehta (@mehtahansal) May 1, 2025గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: శరీరానికి సరిపడే ఆహారాలే తీసుకోవాలి..! పోషకాలపై దృష్టి పెట్టాలి..) -
స్లిమ్‌గా నటి మాధురి దీక్షిత్ భర్త..! మొదట తండ్రిపై ఆ తర్వాత..
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90లలో ఎన్నోబ్లాక్బస్టర్ హిట్ మూవీలతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటి. ఇక ఆమె డాక్టర్ శ్రీరామ్‌ని పెళ్లాడి..సినీ రంగానికి దూరంగా ఉన్నారు. ఇటీవలే అడపదడపా బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తళుక్కుమంటున్నారు. ఆమె ఈ వయసులో కూడా అంతే స్లిమ్‌గా అందంగా ఉంటారామె. అందులోనూ ఆమె భర్తే ఆరోగ్య నిపుణుడు కాబట్టి..ఫిట్‌నెస్‌పై మంచి శ్రద్ధ తప్పకుండా ఉంటుంది. అంతేగాదు ఈ ముద్దుగుమ్మ భర్త శ్రీరామ్ బరువు ఏవిధంగా తగ్గించుకోవచ్చో తనపైనే ప్రయోగాలను చేసుకుని మరీ వివరిస్తున్నారు. ఆయన చిన్న చిన్న మార్పులతో బరువు తోపాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గించుకున్నట్లు తెలిపారు. అదెలాగో చూద్దామా..!.ఇంక్టాక్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్డియాక్ థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ అయిన శ్రీరామ్ నేనే ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషించేది జీవనశైలేనని నొక్కి చెప్పారు. చక్కటి ఆరోగ్యం కోసం జీవశైలిలో మంచి మార్పులు అనే పెట్టుబడి పెట్టాలన్నారు. లేదంటే అనారోగ్యం బారిన పడక తప్పదన్నారు. వివిధ సంక్రమిత వ్యాధులకు ప్రధాన కారణం మానవులు అనుసరించే లైఫ్స్టైలేనని అన్నారు. ఆయన తన పేషెంట్లకు వచ్చే వ్యాధులను చక్కటి జీవశైలితో బయటపడేలా చేశాడు. ఆయన తండ్రి 55 ఏళ్ల వయసులో డయాబెటిస్తో బాధపడుతున్నప్పుడూ.. అతని జీవనశైలి మార్చి..మందులపై ఆధారపడకుండా నిర్వహించగలిగేలా చేశానని అన్నారు. ప్రస్తుతం ఆయనకు 86 సంవత్సరాలని అన్నారు. తన తండ్రిలో వచ్చిన మంచి పరివర్తన చూశాక.. ఓ డాక్టర్‌గా తాను కూడా మంచి జీవనశైలిని పాటించాలని గ్రహించానన్నారు శ్రీరామ్. అప్పుడే మంచిగా ప్రజలకు సేవల చేయగలనని విశ్వసించి..మార్పుకు శ్రీకారం చుట్టారట. ఎప్పుడైతే శ్రీరామ్ జీవనశైలిలో మంచి మార్పులు తీసుకురావడం ప్రారంభించారో..త్వరితగతిన సత్ఫలితాలను అందుకున్నారు. దాదాపు 18 కిలోల బరువు తగ్గారు, అలాగే 16శాతం శరీర కొవ్వు కూడా తగ్గిందని చెప్పారు. దీన్ని అలాగే కొనసాగించి..తదుపరి పుట్టిన రోజుకల్లా..12 నుంచి 15 శాతం కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనేది తన లక్ష్యమని అన్నారు. ఇంతలా ఎందుకంటే..తాను ఓ మ్యాగ్జైన్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అంటే మంచి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండొచ్చాని ప్రయోగపూర్వకంగా చెప్పడమే ఎందరికో స్ఫూర్తిని కలిగించారు డాక్టర్ శ్రీరామ్.(చదవండి: ChatGPT: చాట్‌జీపీటీ లేకపోతే ప్రాణమే పోయేది..! వైద్యులే ఆ సమస్య ఏంటో చెప్పలేకపోయారు..) -
5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్
సినీ నటులు సెలబ్రిటీలను ఈ మధ్య కాలంలో తమ శరీర బరువును తగ్గించుకుంటున్నారు. పాత్రకు తగ్గట్టు తన శరీరాకృతిని మార్చుకోవడం లాంటి సాహసాలతోపాటు, నిజజీవితంలో ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జీవనశైలి మార్పులు, ఆహార మార్పులు, తీవ్ర కసరత్తుల ద్వారా స్లిమ్‌గా తయారవుతున్నారు. ముఖ్యంగా బాగా బరువు తగ్గి వార్తల్లో నిలిచిన వారిలో విద్యాబాలన్, ఖుష్బూ, జ్యోతిక లాంటి హీరోయిన్లు ఉన్నారు. అలాగే బాలీవుడ్ నిర్మాత కరణ్‌జోహార్ కూడా ఇటీవలి కాలంలో బాగా బరువుతగ్గి బక్కచిక్కినట్టు కనిపించారు. అయితే కరణ్ జోహార్ ఓజెంపిక్ లాంటి ఇంజక్షన్లు తీసుకున్నారనే పుకార్లు జోరుగా వినిపించాయి. వాటిని కరణ్ తీవ్రంగా ఖండించారు. ఆహార మార్పులు, జీవన శైలి మార్పుల ద్వారానే బరువు తగ్గానని స్పష్టం చేశారు. ఇపుడు ఈ కోవలో టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ వార్తల్లో నిలిచాడు. అయితే కఠినమైన డైట్‌తో తన రాబోయే చిత్రం ‘డ్రాగన్’ కోసం భారీగా బరువుగా తగ్గడం విశేషంగా నిలిచింది.అలనాటి అందాలహీరో దివంగత నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లో వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ‘బాల రామాయణం’ సినిమాలో బాలనటుడిగా అద్భుతమైన నటనతో తానేంటో నిరూపించుకున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ తరువాత రాఖీ, ఆది లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ సినిమాల్లో బొద్దుగా కనిపించి. ఉన్నట్టుంటి ఎన్టీఆర్ స్మార్ట్‌గా, సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అటు అభిమానులను, ఇటు విమర్శలను దిగ్భ్రాంతికి గురి చేశాడు. అప్పటినుంచి అదే బాడీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. డ్రాగన్ మూవీకోసం ఇంత బరువు అంటే..5 నెలల్లో 18 కిలోలు తగ్గాడట. ఆయన ఎలాంటి ఇంజెక్షన్లు వాడలేదని, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లుక్ కోసమే తారక్ బాగా డైటింగ్ చేశాడని అతని టీం స్పష్టం చేసింది. వ్యాయామం, కఠినమైన ఆహారం ఫలితంగా అతని లుక్‌లో మార్పు అని వెల్లడించింది. నేటి (ఏప్రిల్ 22) నుంచి ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. సముద్ర తీరంవద్ద దగ్గర జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ ఉన్న అద్భుతమైన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి రేగింది. ఈ ప్రాజెక్ట్‌ను కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి హరి కృష్ణ కొసరాజు నిర్మిస్తుండగా, నిర్మాతలు ఇప్పటివరకు ఇతర తారాగణం సాంకేతిక సిబ్బంది వివరాలను గోప్యంగా ఉంచారు.ఓజెంపిక్ ఇంజెక్షన్లుఅయితే గతంలో బరువు తగ్గినపుడు లైపోసక్షన్ చేయించుకున్నాడనే పుకార్లు జోరుగా వినిపించాయి. తాజగా ఎన్టీఆర్ బరువు తగ్గడంపై కూడా సెలబ్రిటీలు ఎక్కువగా వాడుతున్న ఓజెంపిక్ ఇంజెక్షన్ తీసుకున్నాడని వదంతులు వ్యాపించాయి. అయితే తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని, తిండి మానేస్తే చాలు ఎవరైనా వెయిట్ తగ్గొచ్చు అని గతంలోనే స్పష్టం చేశాడు. అయితే తన పాత్ర కోసం బాడీని మార్చుకోవడం ఎ న్టీఆర్‌కు కొత్తేమీ కాదంటున్నారు అభిమానులు. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీలోని కొమరం భీమ్ పాత్ర కోసం సెలబ్రిటీ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌తో కలిసి, ఐదు నెలల్లో 18 కిలోలు బరువు తగ్గిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రోజుకు మూడు గంటలు వ్యాయామం, కార్డియో, వెయిట్ ట్రైనింగ్, హై-ప్రోటీన్, జీరో-ఫ్యాట్ డైట్ ఇందులో భాగం. -
ఎన్టీఆర్ సన్నగా మారడానికి కారణం ఆ ఇంజెక్షనేనా...!
-
కరణ్ జోహార్ షాకింగ్ వెయిట్ లాస్ ఒజెంపిక్ ఇంజెక్షన్లే కారణమా?
చిత్రనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) అకస్మాత్తుగా బరువు తగ్గి, బక్కిచిక్కిపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత త్వరగా బాగా బరువు తగ్గి అటు అభిమానులను, ఇటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. అదనపు బరువును తగ్గించడానికి అసహజ పద్ధతులను ఉపయోగిస్తున్నాడనే పుకార్లు జోరుగా వ్యాపించాయి. బరువు తగ్గడానికి ఓజెంపిక్ (Ozempic) ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నాడనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై కరణ్ జోహార్ (కేజో) తాజాగా స్పందించాడు. అసలేంటీ ఓజెంపిక్ ఇంజెక్షన్, దీంతో అంత తొందరగా బరువు తగ్గవచ్చా? కరణ్ జోహార్ ఏమన్నాడు? తెలుసుకుందాం.స్టైలిష్; ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే కరణ్ జోహార్ కరణ్ ఉన్నట్టుండి బక్కగా మారిపోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. విపరీతంగా ఓజెంపిక్స్ తీసుకోవడంతోనే ఇలా అయ్యాడని కామెంట్లు వినిపించాయి.అయితే తాజాగా వీటిపై కరణ్ స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తాను బరువు తగ్గడానికి ప్రధానంగా రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తున్నానని తెలిపాడు. కఠినమైన ఆహార ప్రణాళిక ఈ మార్పునకు కారణమని కరణ్ వెల్లడించాడు. ఇటీవల, కరణ్ జోహార్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో 'ఆస్క్ కేజో' సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులు అతని ఆకస్మిక బరువు తగ్గడం స్లిమ్‌గా మారడం వెనుక గల కారణం గురించి ప్రశ్నించారు. తాను ఇలా మారడానికి చాలా సమయం పట్టిందని, అందరూ అనుకున్నట్టుగా తాను ఎలాంటి మందులు తీసుకోలేదని స్పష్టంగా పేర్కొన్నాడు. ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు, వ్యాయామంతో సరైన మార్గంలో బరువు తగ్గాను. ఇపుడు చాలా బావుంది.కొత్త ఉత్సాహం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అంతేకాదు తాను ఆరోగ్యంగా,హ్యాపీగా ఉన్నానంటూ అభిమానులకు హామీ ఇచ్చాడు. నెటిజన్లు ఒప్పుకోవడం లేదుమరోవైపు కరణ్ జోహార్ ఓజెంపిక్‌ను ఉపయోగించడం లేదని చేసిన వాదనలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఓజెంపిక్‌తో మీరు బరువు తగ్గారని అంగీకరించడంలో తప్పు లేదు. బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. బరువు మీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, మీరు బరువు తగ్గిన తర్వాత బాగానే ఉంటే, మీరు దానిని ఎలా కోల్పోయారన్నది ముఖ్యం కాదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గర్వపడండి మీ డ్రీమ్ అదే కదా .. ఉన్నది ఒక్కటే జీవితం. మన శరీరంతో సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఆల్ ది బెస్ట్..’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘అది ఓజెంపిక్ ముఖమే.. దానిని అంగీకరించడంలో సిగ్గు లేదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిని ఉపయోగిస్తోంది .దాని గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. సార్ నిజం నిర్భయంగా చెప్పడి" అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు. కరణ్ గణనీయంగా బరువుగా తగ్గడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం కూడా ఆయన బరువు తగ్గడం ఆకర్షించింది. బరువు తగ్గడానికి ముందు, తరువాత అంటూ ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి. అలాగే కరణ్ జోహార్ ఓజెంపిక్ ఉపయోగిస్తున్నాడని ఎక్స్ ఖాతాలో ఒక యూజర్ ఆరోపించాడు. దీంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది.అసలేంటీ ఓజెంపిక్ టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న పెద్దలలో ఆహారం, వ్యాయామంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటానికి ఇంజెక్షన్ ఒక మెడిసిన్‌గా వాడతారు. 2017లో తొలిసారి దీనికి ఆమోదం లభించింది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలోకి ఇన్సులిన్ సరైన విడుదలను ఇది నియంత్రిస్తుంది. Ozempic ఇంజెక్షన్ ఆకలిని తగ్గిస్తుంది . జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది చివరికి బరువు తగ్గడానికి దారితీస్తుంది. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో బరువు తగ్గించే ఔషధంగా సెలబ్రిటీలు ఓజెంపిక్‌ను ఉపయోగిస్తున్నారా అని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. -
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
అందరిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఈ అధిక బరువుకి చెక్‌పెట్టడం ఓ సవాలు. ఎంతోమంది సెలబ్రెటీలు దీన్ని ఛాలెంజింగ్ తీసుకుని బరువు తగ్గి చూపించారు. అయితే అది అందరికీ సాధ్యం కాలేదు. కేవలం తగ్గాలన్న లక్ష్యంతో, కృతనిశ్చయంతో ఉన్నవారికే సాధ్యమైంది. అమ్మబాబోయ్ అనుకుని చేతులెత్తేయకుండా పట్టుపట్టి..ఆరోగ్యం కావాలనుకునే వారికే సుసాధ్యమైంది. ఇప్పుడు తాజాగా ఆ కోవలో ప్రముఖ నవలా రచయిత కాలమిస్ట్ శోభా డే కుమార్తె ఆనందితా చేరారు. ఆమె కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనే బరువు తగ్గేందుకు దారితీసిందని చెబుతున్నారు. ఇప్పుడామె ఎంత స్లిమ్‌గా మారారంటే..చూసేవాళ్లకే అసూయ కలిగేంతగా తగ్గిపోయారు. ఎందుకంటే జస్ట్ ఏడు నెలల్లోనే 40 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారామె. మరీ ఆమెకు అదెలా సాధ్యమైందో తెలుసుకుందామా..!.గత ఆగస్టు 23, 2024 వరకు అధిక బరువుతో ఉండేది. అప్పటి నుంచి తన వెల్నెస్ జర్నీ ప్రారంభించానని తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు ఫ్రీలాన్స్ రచయిత ఆనందిత. ఆ పోస్ట్‌లో '40 కిలోల తగ్గుదల' అనే శీర్షికతో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి రాసుకొచ్చారామె. అసలు నమ్మలేకపోతున్నా.. ఇంతలా బరువు తగ్గానా..? అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తాను ఏవిధంగా బరువు తగ్గిందో వివరించింది. ముందుగా తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు గురించి తెలిపారామె. తన అధిక బరువు కారణంతో కనీసం కొద్ది దూరం నడిచేటప్పటికే ఆయాసం వచ్చేసిందని, కనీసం మెట్లు కూడా ఎక్కలేకపోయేదాన్ని అంటూ మాట్లాడారామె. శరరీంలో చెడు కొలస్ట్రాల్ లెవెల్స్ ఏ స్థాయిలో పెరిగాయంటే ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కేటప్పటికే గుండెపోటు వచ్చేస్తుందేమోన్న భయం కలిగిందట. అలాగే చర్మం రంగు మారిపోయి తన ఆకృతే ఒకలా అయిపోందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు స్లీప్ ఆప్నియా, నిద్రలేమి, నిరంతర దగ్గు, డయాబెటిక్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేదాన్ని అన్నారు. ఇక ఇలాగైతే ఎన్నోనాళ్లు ఉండనన్న ఫీల్ కలిగి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టానన్నారామె. ముఖ్యంగా షుగర్ లేని ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వడమే గాక తగిన వ్యాయామం చేయడం వంటివి చేసినట్లు తెలిపారు. ఈ విధానంతో బరువు తగ్గడమే కాకుండా సులభంగా మెట్లు ఎక్కేయగలనని, పైగా మెట్లు లేని హోటల్లో స్టే చేయగలనని ధీమాగా చెబుతోందామె. అంతేగాదు ఆనందిత బరువు తగ్గడం అంటే శరీరాకృతి మారడంగా భావించొద్దు అది మన వెల్నెస్ ప్రయాణంగా భావిస్తేనే..బరువు తగ్గడమే గాక ఆరోగ్యంగానూ ఉంటామని చెబుతోంది ఆనందిత. View this post on Instagram A post shared by Anandita De (@ananditade) (చదవండి: Kushboo Sundar: 20 కిలోలు తగ్గిపోయిన ఖుష్బూ.. అందుకోసం ఏం చేసిందంటే?) -
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ టాలీవుడ్ కోలీవుడ్‌లో తనదైన ముద్రవేసిన ప్రసిద్ధ నటి. 90లలో తన అందం, నటనతో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన నటి ఆమె. ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలో ప్రేక్షకుల, విమర్శకుల మెప్పుని పొందారు. అంతేగాదు వేలాదిగా అభిమానులను సొంతం చేసుకున్న తమిళ నటి. అలాగే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అక్కడ కూడా తన హవాను చాటుతున్నారు. అవసరమైనప్పుడూ ప్రజల తరుపున గళం విపుత్తు..వార్తల్లో నిలుస్తున్నారు కూడా. రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉండే ఆమె కూడా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతుంటారు. అందుకు నిదర్శనమే ఆమె కొత్త గ్లామరస్ లుక్. ఎంతో లావుగా ఉండే ఆమె ఒక్కసారిగా పదహారణాల పడుచు పిల్లలా మారిపోయారు. నెటిజన్లు సైతం ఆమె కొత్త లుక్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరీ.. అంతలా బరువు కోల్పోయినా..ఖుష్బు వెయిట్‌లాస్ సీక్రెట్ ఏంటో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఐదుపదుల వయసులో ఖుష్బూ అద్భుతంగా తన బాడీ ఆకృతిని మార్చుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారామె. ఇటీవలే అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నిజంగా ఆమెనా..? ఖుష్బు కూతురా..? అని కన్ఫ్యూజ్ అయ్యేలా గ్లామరస్ లుక్‌లో కనిపించారామె. అయితే ఆమె కొత్త లుక్‌ని చూసి.. కొందరు నెటిజన్లు మెచ్చుకోగా మరికొందరు మాత్రం ఇంజెక్షన్లు ఏవో తీసుకునే బరువు తగ్గారామె అంటూ కామెంట్లు చేశారు. అయితే ఖుష్బూ వాటిన్నంటిని కొట్టిపారేస్తూ..తాను ఎలా బరువుని తగ్గించుకోగలిగరో షేర్ చేసుకున్నారు. అలాగే తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో కూడా చెప్పారు. బరువు తగ్గడానికి షార్ట్ కట్స్ ఉండవని నర్మగర్భంగా తేల్చి చెప్పారామె. ఒకవేళ్ల తగ్గినా..అది తాత్కాలికమే అని కూడా అన్నారు ఖుష్బూ. కేవలం క్రమశిక్షణాయుతమైన జీవనశైలి, బరువు తగ్గాలన్న కృత నిశ్చయాలే..అద్బుతంగా బరువు తగ్గేందుకు దారితీస్తాయని అంటున్నారామె. అంతేగాదు అందుకోసం తాను ఎలాంటి లైఫ్‌స్టైల్‌ని అనుసరించారో కూడా పంచుకున్నారు. మనసుపెట్టి తినడం, ఒక గంటపాటు వర్కౌట్లు, అలాగే సాయంత్రం 45 నుంచి 50 నిమిషాలు తప్పనిసరి వాక్ తదితరాలే ఈ సరికొత్త లుక్‌కి కారణమని అన్నారు. అయితే తాను ఇలా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడానికి ప్రధాన కారణం కూడా వివరించారు. షూటింగ్‌ల సమయంలో సంవత్సరాల తరబడి అయిన గాయాలు, శస్త్రచికిత్సలు తన మోకాళ్లను పూర్తిగా బలహీనపరిచాయన్నారు. వాటిపై ఒత్తిడిపడకూడదంటే బరువు తగ్గక తప్పదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. చీలమండలాలు బాగానే ఉన్నాయని, మోకాళ్లు ఆల్మోస్ట్ అరిగిపోయాయని అన్నారు. అప్పుడే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే అంతే సంగతులని భావించి..బరువు తగ్గాలని గట్టిగా ఫిక్స్ అయ్యానన్నారు. అలా తాను దాదాపు 20 కేజీల బరువుని కోల్పాయానన్నారు.ఇక్కడ ఖుష్బూ బరువు తగ్గేందుకు ఎటువంటి సౌందర్య చికిత్సల జోలికిపోకుండా.. అందంగా..ఆరోగ్యకరంగా వృద్ధాప్యాన్ని ఎలా మలుచుకోవచ్చో చూపించారు. ఏదీఏమైనా.. వయసురీత్యా మార్పులనేవి సహజం. వాటిని దాచే ప్రయత్నం కంటే..ఆరోగ్యదాయకమైన పద్ధతిలో తీసుకొస్తే..అటు అందం, ఇటు ఆరోగ్యాన్ని పదిలపరుచుకున్న వాళ్లమవుతామని తన చేతలతో చెప్పకనే చెప్పింది నటి ఖుష్బూ. (చదవండి: ఎవరీ రేష్మా కేవల్రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్‌లో చోటు..) -
వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?
స్మార్ట్‌గా..అందంగా కనిపించడం అనేది మోడళ్లు, సినీతారలు ప్రముఖులకే పరిమితం కాలేదు. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్‌నైట్ స్టార్లుగా మారుతున్న వాళ్లు సైతం అదే బాటపడుతున్నారు. ఇది ఆరోగ్యకరంగా ఉంటే ఏం సమస్య లేదు. తక్కువ సమయంలో సన్నగా మారిపోవాలనుకుంటేనే.. ఆరోగ్యమే చిక్కుల్లో పడుతుంది. చాలామంది ఏదీఏమైనా పర్లేదు అంటూ రిస్క్ చేసి మరీ తప్పుడు డైటింగ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. అందుకోసం శరీరాన్ని ఎంతలా కష్టపెడుతున్నారంటే..కేవలం వర్కౌట్లు కాదు, ఆహారం పరంగా శరీరం శుష్కించిపోయేలా చేస్తున్నారు. అవి వింటే.. బరువు తగ్గడం కోసం ఇన్ని పాట్లు పడుతున్నారా అని ఆశ్చర్యమేస్తుంది. ఆకృతికి ఇంత ప్రాముఖ్యత..? అనిపిస్తుంది కూడా. ఒర్రిగా ప్రసిద్ధిచెందిన కంటెంట్ క్రియేటర్ సైతం ఇలాంటి పనులే చేసి బరువు తగ్గాడట. అతడు బరువు తగ్గే క్రమంలో అనుసరించిన విధానాలు తెలిస్తే..నిజంగానే వాంతి చేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందులో నో డౌట్.ఒర్రీగా ప్రసిద్ధి చెందిన ఓర్హాన్ అవత్రమణి అనే కంటెంట్ క్రియేటర్ 2023 ప్రారంభం వరకు 70 కిలోల బరువుతో ఉండేవాడు. చూడటానికి కొద్దిగా లావుగా ఉండేవాడు. ఇప్పుడు కాస్త ఫేమస్ కావడంతో టీవీ షోల్లో కనిపించేందుకు స్మార్ట్‌గా ఉండక తప్పదు. అందుకోసం అతను తిన్న ఆహారాన్ని వాంతి చేసుకునేవాడట. అలా చేసుకుంటే కాసేపటి వరకు వాంతి వస్తున్న ఫీలింగే ఉండి.. తిన్న ఆహారం అంతా బయటకొచ్చేస్తుంది. తద్వారా నీరసించి బరవు తగ్గేవాడట. అలా వాంతులు చేసుకుని చివరకు టాయిలెట్లో నిద్రపోయేవాడట. దాంతో మెడనొప్పితో ఇబ్బందిపడేవాడినంటూ తన అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎలా మొదలయ్యాయో వివరించాడు ఓ ఇంటర్వ్యూలో. బరువు తగ్గడం కోసం ఓజెంపిక్ లాంటి మందులు వాడొచ్చు. అయితే అది ఛీటింగ్ అవుతుందే తప్ప బరవుతగ్గడం కాదనే నమ్ముతా అంటున్నాడు ఒర్రీ. అయితే తన దృష్టిలో బరువు తగ్గడానికి అదే బెస్ట్ అని కితాబిస్తున్నాడు. కాగా, ఒర్రీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేయడమే గాక . ఓ సామాజిక కార్యకర్త కూడా. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సెలబ్రిటీల పార్టీల్లో మెరుస్తుంటాడు. అలాగే బాలీవుడ్ టీవీ షోల్లో తళ్లుకుమంటుంటాడు. ఎంత ప్రమాకరమైనదంటే..తనను తాను ఆకలితో అలమటింపచేసుకునేలా పదేపదే వాంతులు చేసుకోవడం అనే ప్రక్రియ అత్యంత హానికరమైనదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శారీరకంగా మానసికంగా అత్యంత ప్రమాదకరమైనదని అంటున్నారు. దీని కారణంగా తీవ్రమైన నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, జీర్ణశయాంతర సమస్యలు, గుండెకు సంబంధించిన రుగ్మతల బారినపడే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. అంతేగాదు ఆకలి శరీరంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కండరాలను బలహీనపరిచి జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. ఫలితంగా మెదడు పనితీరు కూడా దెబ్బతింటుందని అన్నారు. కెరీర్లో విజయం సాధించడానికి ఎలా షార్ట్కట్లు ఉండవో అలాగే బరువు తగ్గడంలో కూడా ఉండవని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సన్నగా మార్చినప్పటికీ..రాను రాను చిరాకు, ఒత్తిడి, వంటి వాటికిలోనై మొత్తం శరీరం పనితీరుపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. అందువల్ల ఇలాంటి బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మసౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తూ..ఆరోగ్యప్రదంగా బరువు తగ్గే వాటిని అనుసరిస్తే అన్ని విధాల మేలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.(చదవండి: ఇదేం ఫిట్నెస్ స్టంట్..? తిట్టిపోస్తున్న నెటిజన్లు) -
వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?
ఆరోగ్యపరంగా భారంగా మారిన సమస్య అధిక బరువు(ఊబకాయం). ఇదే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటానికి ప్రధాన కారణమని పదే పదే హెచ్చరిస్తున్నారు నిపుణులు. చెప్పాలంటే ఇదే సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే బరువు తగ్గడం అంత ఈజీకాదు. పైగా ప్రస్తుత ప్రజల జీవన విధానం..అందుకు తగ్గట్టుగా ఉన్న ఒత్తిడులు, ఆందోళనలు వెరసీ బాడీపై ధ్యాస పెట్టే ఛాన్సే లేదు. అందువల్లే ఇది జఠిలమైన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సైతం "బరువు తగ్గించుకుందాం..ఆరోగ్యంగా ఉందా" అని పిలుపునిస్తూ అవగాహన కల్పించే యత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కూడా చేరారు. ఏం చేస్తే బరువు తగ్గగలరు అనే అంశం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.ఎంటర్ప్రెన్యూర్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్, ఫిగరింగ్ అవుట్లో బరువు తగ్గడం అనే అంశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. "ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. డబ్బుతో పరిష్కరించ లేని సమస్య ఇది. నేను ప్రధాని మోదీని కలసినప్పుడూ ఈ విషయం గురించే చర్చించాం. యోగా ఆధారిత ఆసనాలతో ఎలా తగ్గించుకోవచ్చో చెప్పారు మోదీ. కానీ ఆ దిశగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం లేదని, ఇంకా ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో మార్పుకి సిద్ధపడలేకపోతోందని చెప్పారాయన. అయితే నేను జీవశైలిలో మార్పులను విశ్వసించనప్పటకీ....వైద్య ఆవిష్కరణలే కీలకపాత్ర పోషిస్తాయని ప్రగాఢంగా నమ్ముతా. ప్రస్తుతానికి మధుమేహం కోసం అభివృద్ధి చేసిన మందులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న బాధితుల్లో ఓ ఆశను రేకెత్తిస్తోంది. ఈ జీఎల్పీ-1 అనే మధుమేహ మందులు ఈ సమస్యకు కొంతమేర శాస్త్రీయ పరిష్కారాన్ని అందించాయి. త్వరలో అందరికి అందుబాటులోకి వచ్చేలా చౌక ధరలలో లభించనున్నాయి. "అని అన్నారు బిల్‌గేట్స్. కాగా, ఈ డయాబెటిక్ మందులు ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో, జెప్‌బౌండ్ వంటివి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి, తినాలనే కోరికను నివారిస్తాయనేది పరిశోధుకుల వాదన. ఇక GLP-1 అనేది మన శరీరంలో జీర్ణక్రియ, ఆకలి నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ మందులు ఆకలని నిర్వహించడంలో చాలా బాగా హెల్పవుతాయని అంటున్నారు నిపుణులుఏదీఏమైనా జీవనశైలే ముఖ్యమైనది..వైద్య ఆవిష్కరణల కంటే దీర్ఘకాలిక బరువు నియంత్రణలో ప్రధానమైనది జీవనశైలేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అయితే అందరూ లైఫ్‌స్టైల్ అనగానే భయపడిపోతున్నారని చెప్పారు. శరీరాన్ని మొత్త కష్టపెట్టకపోయినా..కనీసం కొద్దిపాటి కదలికలకు చోటు ఇస్తే మంచిదంటున్నారు. దీంతోపాటు కొద్దిపాటి ఆరోగ్య చిట్కాలు..పాటించాలి. నమలి నమిలి నెమ్మదిగా తినడం..శరీరానికి వేడి కలిగించేపదార్థాలు తీసుకోవడం.. తదితరాల ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు నిపుణులు. చివగా మోదీ, బిల్‌గేట్స్ ఇరువురు ఊబకాయం అనేది కేవలం వైద్యపరమైన సమస్య కాదని, వాళ్ల వాళ్ల సంస్కృతి ఆచారాలతో ముడిపడి ఉన్న లోతైన సమస్యగా అభివర్ణించారు. అయితే దీన్నుంచి బయటపడాలంటే మాత్రం రోజువారీ దినచర్య బ్రషింగ్‌లా జీవనశైలిలో మార్పులు కూడా భాగమైతేనే బరువు తగ్గడం సాధ్యమని నొక్కి చెప్పారు ఇరువురు. View this post on Instagram A post shared by Figuring Out with Raj Shamani (@figuringout.co) (చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..) -
55 కిలోల వెయిట్ లాస్ : నిర్మాతకు రామ్ భార్య స్ట్రాంగ్ కౌంటర్
ప్రముఖ బుల్లి తెర నటుడు రామ్ కపూర్ 55 కిలోల బరువు తగ్గడం నెట్టింట విస్తృత చర్చకు, ఊహాగానాలకు దారితీసింది. ఓజెంపిక్ లేదా సర్జరీ వంటి షార్ట్కట్ల ద్వారా అంత బరువు తగ్గాడనే అరోపణలను తీవ్రంగా ఖండించిన నటుడు కష్టపడి , అంకితభావంతో 140 కిలోల బరువును 55 కిలోలు తగ్గి 85 కిలోలకు తగ్గించుకున్నట్టు వెల్లడించాడు. దీనిపై రామ్‌కు అనేక ప్రశంసలు లభించాయి కూడా. అయితే రామ్‌కు పేరు తీసుకొచ్చిన టీవీ షో ‘బడే అచ్చే లగ్తే హై’ నిర్మాత ఏక్తా కపూర్ మాత్రం సంచనల వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. తాజాగా ఏక్తాకు కౌంటర్‌గా రామ్ భార్య గౌతమి కపూర్ ఒక వీడియోను పో స్ట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఎంచుకోవాలా లేదా మౌంజారో, ఓజెంపిక్ తీసుకోవాలా, లేదా మౌనంగా ఉండాలా.. బడేహీ అచ్చే లగ్తేహై అంటూ ఒక పోస్ట్ పెట్టింది. పరోక్షంగా రామ్ కపూర్ వెయిట్ లాస్ జర్నీని ఏక్తా కపూర్ ఎగతాళి చేసింది. దీనిపై స్పందించిన గౌతమి వీడియోను విడుదల చేసింది. ఏక్తా కపూర్ తరహాలోనే కౌంటర్ "నేను యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలా? నేను మౌంజారో తీసుకోవాలా?నేను ఓజెంపిక్ తీసుకోవాలా లేదా పైన పేర్కొన్నవన్నీ తీసుకోవాలా? లేదా నా నోరు మూసుకోవాలా? క్యుంకి హుమే బడే నహీ చోటే హే అచ్చే లగ్తే హై..' అంటూ వీడియో పోస్ట్ చేసింది. అలాగే ఎవరికి నచ్చినది వార్ని చేయనివ్వాలి. జీవించాలి, జీవించనివ్వాలి, ఎందుకంటే లైఫ్‌లో అతి ముఖ్యమైనవి ఆరోగ్యం, ఆనందం, శాంతి అంటూ గౌతమి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చివరగా నీ జీవితం నువ్వు చూస్కో అంటూ చురకలంటించింది. దీంతో భర్తకు సపోర్ట్‌గా నిలిచిన గౌతమిని అభిమానులు ప్రశంసించారు. View this post on Instagram A post shared by Gautami Kapoor (@gautamikapoor) ఏక్తా టీవీ సీరియల్ షో, బడే అచ్చే లగ్తే హై సీరియల్లో లీడ్ రోల్లో నటించిన రామ్‌కు, ఏక్తాకపూర్కు మధ్య ఇటీవల పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. బడే అచ్చే లగ్తే హై షోలో గురించి ఒక ఇంటర్వ్యూ లో రామ్ వ్యాఖ్యల నేపథ్యంలో వారువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఈ సీరియల్లో సాక్షి తన్వర్ పాత్రకు మధ్య తనకు సన్నిహిత సన్నివేశాన్ని రాసినది ఏక్తా కపూర్ అని, టీఆర్పీ రేటింగ్ కోసం అలాంటి సీన్లు పెట్టడాన్ని తాను ముందుగానే వ్యతిరేకించానని రామ్ వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఏక్తా కపూర్ పరోక్షంగా 'నోరు మూసుకో’ రామ్‌పై అంటూ మండిపడింది. ప్రొఫెషనల్ యాక్టర్ కాదని, అతనివి 'తప్పుడు' వ్యాఖ్యలని, తాను నోరు విప్పితే అసలు నిజం బయటపడుతుందని, కాన మౌనమే బెటర్ అని సమాధానమిచ్చింది. ఆ తరువాత అతని వెయిట్‌లాస్ జర్నీపై కూడా ఏక్తా వ్యంగ్య బాణాలు విసిరిన సంగతి తెలిసిందే. -
సన్నజాజితీగలా హీరోయిన్ జ్యోతిక, థ్యాంక్స్ టూ విద్యా బాలన్ (ఫోటోలు)
-
ఏడు నిమిషాల్లో బాడీ ఫిట్ : హిట్ హిట్ హుర్రే!
ప్రపంచం వేగంగా మారుతోంది. అలా వేగం పెరుగుతున్న కొద్దీ మన శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం లేదనడమూ సర్వసాధారణంగా మారింది. అయితే నిజానికి మానవ శరీరం చురుకుగా కదులుతూ ఉండేందుకు అనువుగా రూపొందింది. సమయం లేదంటూ దానిని కదిలించ కపోతే శారీరక సమస్యలతో పాటు ఆరోగ్యానికి చేటు తప్పదు. ఈ నేపథ్యంలో గంటల తరబడి చేయడానికి బదులు కేవలం నిమిషాల్లో ముగించేందుకు వీలుగా కొత్త కొత్త వ్యాయామాలు పుట్టుకొస్తున్నాయి. అలా అందుబాటులోకి వచ్చిందేఈ హిట్ పద్ధతి. – సాక్షి, సిటీబ్యూరో అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్ జోర్డాన్ ఈ హిట్ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్ వ్యాయామాలను చేయడమే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఈ హిట్ ఫార్ములా. ప్రతి రౌండ్‌కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్ ఉండాలి. పుష్–అప్స్: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్’ పొజిషన్న్లోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. వాల్ సిటప్స్: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కుర్చీలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్ క్రంచ్: ప్రాథమిక క్రంచ్‌తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి. స్టెప్–అప్: దృఢమైన కుర్చీ లేదా బెంచ్‌కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి. స్క్వాట్: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి. ట్రైసెప్ డిప్: కుర్చీ లేదా బెంచ్ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి. ప్లాంక్: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.చదవండి: 64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లిహై ‘నీస్’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి. లంజెస్: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.ఇదీ చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుసైడ్ ప్లాంక్‌లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం. -
మూడు నెలల్లో 9 కిలోలు తగ్గిన జ్యోతిక: ఈ సక్సెస్ సీక్రెట్ ఆమే!
బోలెడన్ని వ్యాయామాలు అంతులేని ఆహారపు మెళకువలు అందుబాటులో ఉన్నప్పటికీ, బరువు నిర్వహణ తనకు ’ఎప్పుడూ కష్టంగానే అనిపించేది అని నటి జ్యోతిక అన్నారు. రకరకాల వ్యాయామాలు, అంతులేని ఆహారాల మార్పులు, అపరిమిత ఉపవాసం ఇవేవీ నా అదనపు కిలోల బరువును తగ్గించడంలో సహాయపడలేదు. అని కూడా స్పష్టం చేశారు...అలాంటి జ్యోతిక ఇప్పుడు బరువు తగ్గారు. అదెలా సాధ్యమైంది? దీనికి ఓ ఏడాది క్రితం బీజం పడింది అని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఆ బీజం పేరు విద్యాబాలన్. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒక దశలో విపరీతంగా బరువు పెరిగారు. కానీ అకస్మాత్తుగా స్వల్ప వ్యవధిలోనే ఆమె గణనీయంగా బరువును తగ్గించుకోగలిగారు. దీనిపై ఎన్ని రకాల సందేహాలు, అంచనాలు, విశ్లేషణలు వచ్చినప్పటికీ... ఆమె మాత్రం స్పందించలేదు. అయితే గత అక్టోబర్ 2024లో విద్యాబాలన్ తన విపరీతమైన బరువు తగ్గడంపై మౌనం వీడింది జిమ్‌కి వెళ్లకుండానే చెమట్లు కక్కకుండానే తాను అదనపు కిలోల బరువు తగ్గడానికి కారణాలను, తన కొత్త ఆహారపు అలవాట్లను వెల్లడించింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ‘‘ డైట్ బట్ ’నో ఎక్సర్ సైజ్’ రొటీన్ ద్వారా విపరీతంగా బరువు తగ్గినట్టు వెల్లడించింది. దీనిని జ్యోతిక కూడా అనుసరించారు. ఆమెలాగానే నటి జ్యోతిక, తన బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించి ఆమె శిక్షకులనే ఎంచుకున్నారు. అచ్చం విద్య మాదిరిగానే తన డైట్ ఫిట్నెస్ మంత్రాన్ని మార్చడం ద్వారా ’ 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినట్లు’ వెల్లడించింది. తన ట్రైనర్ చెన్నైకి చెందిన న్యూట్రీషియన్ గ్రూప్ అమురా హెల్త్ టీమ్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దానితో పాటు , ‘అమురా, కేవలం 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినందుకు నా అంతరంగాన్ని తిరిగి కనుగొనడంలో నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు, అమురా! మీరందరూ ఓ మాయాజాలం అంటూ పొగిడింది. తన ఇంటర్వ్యూల ద్వారా నన్ను అమరా మాయా బృందానికి పరిచయం చేసినందుకు విద్యాబాలన్ కు కృతజ్ఞతలు’’ తెలిపింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika)‘‘‘నేను నా ప్రేగు, జీర్ణక్రియ, వేడిని కలిగించే ఆహారాలు ఆహార సమతుల్యత గురించి తెలుసుకున్నాను. మరీ ముఖ్యంగా, సానుకూల భావాన్ని కలిగించేటప్పుడు నా సంతోషం, మానసిక స్థితిపై ఆహారం ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను. ఫలితంగా, ఈ రోజు ఒక వ్యక్తిగా నేను చాలా శక్తివంతంగా అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’’ అంటూ బరువు తగ్గడం కన్నా మన శరీరంపై మనకు అవగాహన ఏర్పడడం ముఖ్యమని ఆమె వివరించింది. అయితే బరువు తగ్గడంతో పాటే మహిళల ఆరోగ్యానికి వెయిట్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో కూడా జ్యోతిక తెలియజేసింది. ‘ఆరోగ్యకరమైన జీవితం సమతుల్యతతో కూడి ఉంటుంది; బరువు తగ్గడం లో ఆహారపు అలవాట్లు ముఖ్యమైనవి, అలాగని శక్తి అక్కర్లేదని కాదు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలువెయిట్ ట్రైనింగ్ అనేది మహిళల భవిష్యత్తుకు కీలకం, బరువు తగ్గడంతో పాటు శక్తి కోల్పోకుండా ఉండడం కూడా ముఖ్యమైన విషయం. ఇది నేర్పినందుకు వయస్సు కేవలం ఒక సంఖ్య అని నిరూపించినందుకు శిక్షకుడు మహేష్‌కు ధ్యాంక్స్ చెప్పాలి. ‘నా శరీరం దాని పనితీరును అర్థం చేసుకోవడం దానితో వ్యాయామాలను కలపడం నా అనుభవంపై గరిష్ట ప్రభావాన్ని చూపింది అంటూ ఇదే సందర్భంగా పోషకాహార నిపుణులు ఫిట్నెస్ నిపుణుల బృందానికి తనను పరిచయం చేసినందుకు విద్యకు ధన్యవాదాలు తెలిపింది.చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్ -
నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
అధిక బరువును తగ్గించుకోవాలంటే..భారీ కసరత్తే చేయాలి. చెమట చిందిస్తేనే అదనపు కొవ్వు కరుగుతుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. పట్టుదల, కృషి ఉండాలి. అలాగే ఏదో యూట్యూబ్‌లోనో, ఇంకెవరోచెప్పారని కాకుండా, శరీరంపై మనంతీసుకుంటున్న ఆహారంపైనా అవగాహన పెంచుకుని, శ్రద్ధపెట్టి, నిపుణుల సలహా తీసుకని ఈ ప్రక్రియను మొదలు పెట్టాలి. విజయం సాధించాలి. అలా కేవలం ఆరు రోజుల్లో నాలుగు కిలోల బరువు తగ్గించుకుందో మోడల్. ఆ తరువాత తన సక్సెస్ గురించి ఇన్‌స్టాలో షేర్ చేసింది.సియోల్‌లో ఉంటున్న ఫ్రీలాన్స్ మోడల్' షెర్రీ తరచుగా ఫిట్నెస్ రహస్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. కండరాల నష్టం లేకుండా 6 రోజుల్లో 4 కిలోల బరువు తగ్గిన విధానాన్ని తన అభిమానులతో పంచుకుంది. దీన్ని కొరియన్ 'స్విచ్ ఆన్' డైట్ అంటారట. ఆహారం, ఉపవాసం, అధిక ప్రోటీన్ భోజనం ఈ మూడు పద్దతులను అనుసరించినట్టు తెలిపింది. View this post on Instagram A post shared by Sherrie 셰리 🌸 | 외국인 모델 (@shukiiii)ఆహారం జీవనశైలి మార్పుల వివరాలనుఇలా పంచుకుంది..“నేను ఎలాంటి ఆహారం/జీవనశైలి మార్పులు చేసుకోవాలి లాంటి సలహా ఇవ్వడం లేదు. అంత ఎక్స్‌పర్ట్‌ని కూడా కాదు. కేవలం నా సొంత అనుభవం. కాబట్టి దీన్ని దయచేసి నా అనుభవంలాగే తీసుకోండి అంటూ తన అనుభవాన్ని షేర్ చేసింది.చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?షెర్రీ వెయిట్ లాస్ జర్నీఆరు రోజుల్లో 4 కిలోలు తగ్గాను , ఎలా చేశానంటే.. తొలుత 'స్విచ్ ఆన్ (డైట్)' గురించి చెప్తా. ఇది చాలా కాలం పాటు బరువును నిలుపుకోవడంలో నాకు సహాయపడుతుంది. ఇది ఒక కొరియన్ వైద్యుడు అభివృద్ధి చేసిన 4 వారాల కార్యక్రమం. ఇది కండరాల నష్టాన్ని నివారించడంతో పాటు కొవ్వు జీవక్రియను సక్రియం చేయడంలో , ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలోసహాయపడుతుంది. ప్రాథమికంగా ఇది ఎలా పనిచేస్తుంది...”కండరాల శక్తి కోల్పోకుండా బరువుతగ్గాలంటే సరైన పోషకాహారం అవసరం. తగినంత ప్రోటీన్ తినేలా చూసుకుంది. అలాగే కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లేకుండా జాగ్రత్త పడింది. ఉపవాసాలను కూడా తన డైట్ ప్లాన్‌లో చేర్చుకుంది.ఇంకా ఇలా చెప్పింది:మొదటి వారం: ప్రోటీన్ షేక్స్, కూరగాయలు , అధిక ప్రోటీన్ భోజనం తీసుకుంది. తద్వారా శరీరం నుంచి మలినాలు బైటికిపోతాయి. గట్ ఆరోగ్యం బలపడుతుంది. రెండో వారం అధిక మజిల్ రికవరీ కోసం ప్రోటీన్ భోజనం , ఉపవాసాలు చేసింది. మూడో వారంలో ఎక్కువ ఫాస్టింగ్ని ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కొవ్వు కరిగేలా జాగ్రత్త పడింది. ఏమి తినాలి ? ఏమి తినకూడదు?షెర్రీ స్విచ్ డైట్ ప్లాన్ ప్రకారం మూడు రోజుల్లో తొలి రోజు అల్పాహారం, భోజనం, స్నాక్స్ , రాత్రి భోజనం అన్నీ ప్రోటీన్ షేక్ మీల్స్ మాత్రమే. ఇక మిగిలిన రెండు రోజుల్లో ప్రోటీన్ షేక్స్ 'కార్బ్-లెస్' మిశ్రమం, ఇంకా మల్టీ-గ్రెయిన్ రైస్, ఉడికించిన కొవ్వు లేని చికెన్, చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, గుడ్లు, బెర్రీలు, అరటిపండు, చిలగడదుంపలు వంటి ఆహారాలతో కూడిన సాధారణ భోజనం.ఈ డైట్ ప్రోగ్రామ్‌లో కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లాంటి పూర్తిగా నిషిద్ధం.స్విచ్ ఆన్ డైట్ కండరాలను కాపాడుతూ, ప్రస్తుత శక్తికోసం బాడీలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. గత ఏడాది కొవ్వు శాతాన్ని తగ్గించడంలో డైట్ సహాయపడింది. శీతాకాలంలో ఎక్కువ మొబిలిటీ లేక హార్మోన్లను ప్రభావితం చేయడంతో పాటు పేగు ఆరోగ్య సమస్యలకు దారితీసిందని అలాగే తన శరీరం నీరు పడుతుందని చెప్పుకొచ్చింది. అందుకే మళ్లీ ఈ డైట్ ప్రారంభించే ముందు 3 రోజుల ఉపవాసంతో ప్రతిదీ రీసెట్ చేసాననీ తెలిపింది. అలాగే ఈసారి పాల ఉత్పత్తులు లేకుండా కొన్ని మార్పులు చేసాను. తద్వారా తన డైట్‌ను యాంటీ ఇన్ఫ్లమేటరీగా మార్చి, ఫైబర్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు చెప్పింది. స్విచ్ ఆన్ డైట్ అంటే ఏమిటి?శాస్త్రీయంగా, బరువు తగ్గడం, గట్ హెల్త్ కోసం దక్షిణ కొరియాలో ట్రెండింగ్‌లో ఉన్నవిధానమే స్విచ్ ఆన్ డైట్. ఇది మజిల్స్‌కు నష్టం లేకుండా కొవ్వు కరిగించుకునేలా 4 వారాల జీవక్రియ రీసెట్ ప్రోగ్రామ్. డాక్టర్ పార్క్ యోంగ్-వూ దీన్ని రూపొందించారు. భారీ కేలరీలను తగ్గించడం, క్రాష్ డైటింగ్ లాంటి విధానం గాకుండా అడపాదడపా ఉపవాసం, శుభ్రంగా తినడం, జీవక్రియను సమతుల్యం చేయడంపై దృష్టి పెడుతుంది, అదే సమయంలో గట్ ఆరోగ్యానికి కాపాడుకునేలా జాగ్రత్త పడటం. నోట్: ఇది షెర్రీ వ్యక్తిగత అనుభవం మాత్రం అని గమనించగలరు. అధిక బరువును తగ్గించు కోవాలనుకుంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
Rani Mukerji: టోన్డ్ బాడీ సీక్రెట్..! వంద సూర్య నమస్కారాలు ఇంకా..!
బాలీవుడ్లో అత్యంత ప్రసిద్ధ తారల్లో రాణి ముఖర్జీ ఒకరు. బెంగాలీ చిత్రంలో సహాయ నటి పాత్రతో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజా కీ ఆయేగీ బారాత్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారామె. ఈ రోజు ఆమె 46వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2013లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించిన అయ్యా మూవీ కోసం ఎంతలా కష్టపడి స్లిమ్‌గా మారిందో తెలుసుకుందామా. ఆ మూవీలో సన్నజాజి తీగలాంటి దేహాకృతితో హీరో పృథ్వీరాజ్‌తో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకుల మదిని దోచుకోవడమే గాక ఇప్పటకీ హైలెట్‌గా ఉంటుంది. ఆ సినిమాలో రాణి ముఖర్జీ టోన్డ్ బాడీతో మెస్మరైజ్ చేస్తుంది. అందుకోసం ఎలాంటి డైట్ ప్లాన్, వర్కౌట్లు ఫాలో అయ్యేదో రాణి ముఖర్జీ ఫిట్నెస్ ట్రైనర్ సత్యజిత్ చౌరాసియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవేంటంటే..ఆ సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ గ్లాస్ ఫిగర్‌ని పొందేందుకు ఎలా కష్టపడిందో వింటే విస్తుపోతారు. తన శరీరాకృతి మెరుపు తీగలా ఉండేందుకు ఎలాంటి డైట్-వర్కౌట్ ప్లాన్‌ని అనుసరించిందంటే. రాణి ముఖర్జీ దినచర్య ఎలా ఉండేదంటే...తెల్లవారుజామున 60 మి.లీ కలబంద రసం.ఒక గిన్నె బొప్పాయి, సగం ఆపిల్‌రెండు గంటలు వ్యాయామంఅల్పాహారం: ముయెస్లీ/ఓట్స్ స్కిమ్డ్ మిల్క్ మధ్యాహ్నం: రెండు మల్టీగ్రెయిన్ ఆట రోటీలు, పప్పు.సాయంత్రం: మొలకలు, రెండు గుడ్డులోని తెల్లసొన, మల్టీ-గ్రెయిన్ బ్రెడ్ .రాత్రి భోజనం: 1 రోటీ, కాల్చిన కూరగాయలు, 150 గ్రాముల తందూరీ చేపలు.100 సూర్య నమస్కారాలు, మైదా కార్బోహైడ్రేట్లు లేవుచివరగా టైనర్ సత్యజిత్ చౌరాసియా మాట్లాడుతూ..ఈ మూవీ ప్రారంభించడానికి రెండు వారాల ముందు తనను సంప్రదించి విల్లలాంటి శరీరాకృతి కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలకు పొట్ట భాగాన్ని, వెనుక భాగాన్ని వొంపైన తీరులో చూపించాల్సి ఉంటుందని చెప్పిందన్నారు. సులభంగా బాడీ కదలికలు కూడా ఉండాలని తెలిపిందన్నారు. కాబట్టి ఆమెను టోన్గా కనిపించేలా చేసేందుకు యోగా, చక్కటి డైట్ ప్లాన్‌ని ఆమెకి ఇచ్చినట్లు తెలిపారు. నటి రాణి కూడా తాను సూచించినట్లుగానే దాదాపు 50 నుంచి 100 సూర్యనమస్కారాలు చేసేది. అలాగే ప్రతి రెండు మూడు గంటలకొకసారి తినేదన్నారు. వీటి తోపాటు రెండు మూడు లీటర్ల నీరు తాగాలని, కార్బోహైడ్రేట్లు, మైదాను పూర్తిగా తొలగించాలని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆహారంలో ఒక చెంచాకు మించి నూనె ఉండకుండా కేర్ తీసుకున్నట్లు తెలిపారు. అయితే అప్పడప్పుడు చాక్లెట్ పేస్ట్రీల వంటివి తీసుకునేదన్నారు. ఇక్కడ రాణి కూడా అలాంటి దేహాకృతి కోసం చాలా అంకితభావంతో కష్టపడిందని చెప్పుకొచ్చారు. (చదవండి: 'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!) -
60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్
బరువు తగ్గడం అనేది పెద్ద టాస్కే. అదీ 50 దాటిన తరువాత అధిక బరువును తగ్గించు కోవడానికి చాలా కృషి, పట్టుదల, ప్రేరణ కావాలి. ఇతర ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని వెయిట్ లాస్ జర్నీని ప్లాన్ చేసుకోవాలి. అలా ప్రముఖ నిర్మాత,సల్మాన్ ఖాన్ స్నేహితుడు, సాజిద్ నదియాడ్ వాలా బరువును తగ్గించుకుని ఫిట్‌గా మారిన తీరు అభిమానులను ఆశ్చర్యపర్చింది. అతని బాడీలోని భారీ పరివర్తన, బాగా బరువు తగ్గి స్మార్ట్‌గా తయారైన అతడి ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి..బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'సికందర్' చిత్రానికి సాజిద్ నిర్మాత. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సాజిద్ ఫేస్ ఆఫ్ ది ఇంటర్నెట్గా మారిపోయాడు. అతని భార్య వార్దా ఖాన్ బాగా సన్నగా ఉన్న భర్త సాజిద్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. రిప్డ్ జీన్స్, డెనిమ్ జాకెట్, బటన్స్ లేని షర్ట్‌లో అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సాజిద్‌ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా 59 ఏళ్ల వయసులో, ఆరోగ్యంగా, సంతోషంగా, ఫిట్‌గా కనిపిస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాడు. అభిమానులు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.“ఎంత సెక్సీ లుక్… అబ్ తో ఫిల్మ్ మే హీరో బన్నే కా సమయ్ ఆ గయా హై” (సెక్సీగా ఉన్నారు.. ఇక సినిమాల్లో హీరో ఐపోయే సమయం వచ్చింది.)"అప్నా అస్లీ సికందర్ యే హై (మా నిజమైన సికందర్)" , ‘‘యువ హీరోలకు కఠినమైన పోటీ...” ,“21 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు! జవానీ కా రాజ్ క్యా హై?” ( ఈ యంగ్ లుక్ వెనుక రహస్యం ఏమిటి?), తదితర వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.కాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నిర్మించిన ‘సికందర్’ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈద్‌కు విడుదల కానున్న ఈ మూవీలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, ప్రతీక్ బబ్బర్, సత్యరాజ్ , శర్మన్ జోషి ప్రధాన పాత్రలు పోషించారు.50ల తరువాత బరువు తగ్గడం, జాగ్రత్తలు శరీరం వయస్సు పెరిగే కొద్దీ, కండరాలు, అవయవాలు, ఎముకలు ధృడత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. 50 ఏళ్లు దాటాకి ఇది మరీ పెరుగుతుంది. అందుకే ఆహారం, వ్యాయామం , జీవనశైలిపై దృష్టి పెట్టడం చాలా అవసరం అవుతుంది. ఈక్రమంలో పురుషులు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను పరిశీలిద్దాంహైడ్రేషన్: 60కి సమీపిస్తున్న తరుణంలో వెయట్ లాస్ అంటే చాలా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి.ముఖ్యంగా హైడ్రేషన్ అనే గోల్డెన్ టిప్‌ను అస్సలు మిస్ చేయకూడదు. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచి, మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది, టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.ఆహారం: కండరాల బలం కోసం చికెన్, గుడ్డు, పనీర్, కాయధాన్యాలు వంటి ప్రోటీన్లున్న ఫుడ్ తీసుకోవాలి. జీర్ణక్రియకోసం తృణధాన్యాలు, కరిగే ఫైబర్, పండ్లు , కూరగాయలపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యకరమైన మెటబాలిజం రేటుపై శ్రద్ధపెట్టాలి. .తీపి పదార్థాలకు దూరంగా : తీపి పానీయాలు, చక్కెర కలిగిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. లేదంటే అరుగుదల సమస్యలు, కొవ్వు పేరుకు పోవడం లాంటి సమస్యలొస్తాయి.వ్యాయామం: ప్రతి వ్యక్తికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. బాడీలో అన్ని ఎ ముకలు, కీళ్ల కీళ్ల స్వేచ్ఛా కదలికల నిమిత్తం క్రమం తప్పకుండా వ్యాయామం చాలా అవసరం. ఇది మొత్తం కండరాల, ఎముక బలానికి కూడా సహాయపడుతుంది.నిద్రకు ప్రాధాన్యత: సరియైన నిద్ర అనేది మరో ప్రధాన మైన నియమం. నాణ్యమైన 8-9 గంటల నిద్ర చాలా ముఖ్యం. ఇది శరీరం కోలుకోవడానికి,విశ్రాంతికి సహాయపడుతుంది. -
వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..
మగవాళ్లకు కుదిరినట్లుగా మహిళలకు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడం సాధ్యం కాదనేది చాలామంది వర్కింగ్ మహిళల వాదన. ఎందుకంటే, పొద్దున లేచినప్పటి నుంచి పిల్లలు, కుటుంబ బాధ్యతలే సరిపోతాయి. ఇంకెక్కడ టైం ఉంటుంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి..?. అలాంటి బిజీ వర్కింగ్ విమెన్స్ ఫిట్నెస్ కోచ్ అకన్నీ సలాకో సింపుల్ టిప్స్ ఫాలోఅయ్యి, ఈజీగా బరువు తగ్గండి. మరి ఇంకెందుకు ఆలస్యం హెల్ప్ అయ్యే ఆ చిట్కాలేంటో చూసేద్దామా..!.అత్యంత బిజీగా ఉండే మహిళలు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేలా ప్లాన్ చేసుకోవాలో వెయిట్ లాస్ కోచ్ డాక్టర్ అకన్నీ సలాకో ఇన్‌స్టా వేదికగా వీడియోలో వెల్లడించారు. పనులు వేగవంతంగా చేయాలన్న ధ్యాసలో ఆకలి ఆటోమేటిగ్గా ఎక్కువ అవుతుంది. దాంతో తెలియకుండానే స్వీట్స్, జంక్ఫుడ్స్ స్పీడ్‌గా లాగించేస్తుంటారని చెబుతున్నాడు అకన్నీ. అందుకే వ్యాయమాలు చేయడం కష్టం అనుకున్న మహిళలు వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ దరిచేరనీయకూడదు. సౌకర్యమంతమైన ఆరోగ్యదాయకమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వమని సూచించారు. పోనీ ఇది కష్టం అనుకుంటే ఓ రెండు రోజులు స్వీట్లు ముట్టనని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వండిచాలు అంటున్నారు అకన్నీ. దీంతోపాటు ఏదోలా చిన్నపాటి వ్యాయామాలు చేసుకునేలా ప్లాన్ చేయాలి. ఇక్కడ ఉద్యోగం, పిల్లలు కుటుంబం తోపాటు ఆరోగ్యం కూడా ప్రధానమే అన్న విషయం గుర్తించండి. ముందు మీరు బాగుంటేనే కదా ఈ పనులన్నీ సవ్యంగా పూర్తి చేయగలరు. కాబట్టి ఎలాగైన చిన్న చిన్న వ్యాయామాలు చేద్దాం. పోనీ అలా కాదు నో ఛాన్స్ అంటే.. వారంలో రెండు లేదా మూడు రోజులు కనీసం 30 నిమిషాలు వ్యాయామాలకి కేటాయించండి చాలు. అప్పుడు ఆటోమేటిగ్గా నెమ్మదిగా మనంతట మనమే రోజులు పెంచుకునే ఛాన్స్ ఉంటుందని అన్నారు. భోజనం విషయంలో సమయాపాలన పాటించండి. పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండని చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకి మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్. అలాగే సాయంత్రం 6 గంటకి, మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్లతో పూర్తి చేయండి. స్నాక్స్ జోలికిపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రోటీన్, కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్ వంటి సమతుల్య భోజనానికి ప్రాధాన్యత ఇస్తే ఆకలి నియంత్రణలో ఉంటుంది, అలాగే బరువు పెరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ అకన్నీ. అలాగే ఇది పోషకాహారం, ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చే సమసర్థవంతమైన డైట్‌ప్లాన్ అని అన్నారు ఫిట్నెస్ నిపుడు అకన్నీ.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr. Akanni Salako | Women’s Weight Loss Coach (@dr.salako) (చదవండి: పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..? అధ్యయనంలో అవాక్కయ్యే విషయాలు..) -
సమ్మర్లో స్లిమ్‌గా మారడం ఈజీ..! ఎలాగంటే..
వ్యాయామంతో బరువు తగ్గించుకునేందుకు ఇదే అనువైన సమయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ వేసవిలో స్లిమ్‌గా మారొచ్చంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటికే వేసవి ప్రారంభమైంది. జిమ్ చేయడానికి సిద్ధమవుదాం. నడక ఎంతో ప్రయోజనం ప్రస్తుత యాంత్రిక జీవనంలో అనేక రకాల పనుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. దీన్ని నడకతో అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. సాయంత్రం కంటే మార్నింగ్ వాక్ చాలా మంచిది. ఉదయం స్వచ్ఛమైన వాతావరణంతో పాటు, ఆక్సిజన్ స్థాయి అధికంగా ఉంటుంది. సున్నితంగా సూర్యకిరణాలు పడుతుంటే మనసుకు హాయినిస్తుంది. అయితే జాగింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవంటున్నారు. నీరసం వచ్చే వరకూ జాగింగ్ చేయడం ప్రమాదకరమే. దాహం వేస్తే అందుబాటులో తాగునీటిని ఉంచుకోవాలి. శీతల ప్రాణాయామం శీతల ప్రాణాయామం చేస్తే కొంత వరకూ ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందడంతోపాటు, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి ముక్కుద్వారా వదిలే ప్రక్రియే శీతల ప్రాణా యామం. ఉదయం 7 గంటల లోపు 5 నిమిషాలు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారం మేలు పుచ్చ, కీర, కర్బూజా, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటితో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. శీతల పానీయాలు, షుగర్ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి. వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. డైట్ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలను తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. ఇవి పాటిస్తే.. బరువు తగ్గాలనుకునే వారికి స్విమ్మింగ్ మంచి వ్యాయామం ఎంతటి భోజన ప్రియులైన వేసవిలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని వివిధ రూపాల్గో తీసుకుంటే బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం. జాగ్రత్తలు తీసుకోవాలి వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేసే సమయంలో నీరసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా వాకింగ్ చేయకూడదు. ఎండలో వాకింగ్ చేయడం మంచిది కాదు. వేసవిలో శరీరంలో నీరు త్వరగా ఆవిరై డీ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ టీవీ మురళీకృష్ణ, జనరల్ ఫిజీషియన్ఆహార నియమాలు పాటించాలి వేసవిలో ఆహార నియమాలు పాటించాలి. వేపుళ్లు, నూనె ఎక్కువుగా ఉన్న వంటకాలు తీసుకోకుండా ఉండటం మంచిది. తాజా ఆకుకూరలు, పళ్లు తీసుకోవాలి. నీరుశాతం ఎక్కువగా ఉంటే పుచ్చ, కర్బూజ, వంటి పళ్లు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేస్తే స్లిమ్‌గా మారొచ్చు. – గర్రే హరిత, ఆహార నిపుణులు -
రెండే రెండు చిట్కాలతో ఏకంగా 90 కిలోలు తగ్గింది.. వావ్ అనాల్సిందే!
బరువు తగ్గాలంటే అంత ఈజీ కాదు గురూ! ఇది ఒకరి మాట..మనసు పెట్టాలే గానీ అదెంత పనీ అనేది సక్సెస్ అయిన వారి మాట. విజయవంతంగా తాము అనుకున్నది చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతోమంది వెయిట్‌లాస్ జర్నీల గురించి తెలుసుకున్నాం. తాజాగా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ దాదాపు 90 కిలోలు తగ్గింది. అధిక బరువుతో బాధపడే ఆమె జీవనశైలి మార్పులతో జాగ్రత్తగా తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇంతకీ ఎవరామె? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? తెలుసుకుందాం పదండి.వాస్తవానికి బరువు తగ్గడం అనేక సవాళ్లతో కూడుకున్నది. డైటింగ్ చేసి కష్టపడి బరువు తగ్గినా, దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. దీనికి మన శరీర తత్వంపై, మనం తింటున్న ఆహారంపై, మన జీవన శైలిపై అవగాహన ఉండాలి. వైద్య నిపుణుల సలహా మేరకు, ప్రణాళికా బద్దంగా ప్రయత్నించి ఒక్కో మైలురాయిని అధిగమించాలి. ఫలితంగా అధిక బరువు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించడమేకాదు కొన్ని కిలోలు తగ్గి స్లిమ్‌గా ఆరోగ్యంగా కనిపించడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేం.న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే అదే చేసింది. తద్వారా 150కిలోల బరువునుంచి 66 కిలోలకు విజయవంతంగా బరువును తగ్గించుకుంది. కేవలం రెండేళ్లలో ఈ విజయాన్ని సాధించింది. అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఉంచి ఆమె ప్రయాణం మొదలైంది. రోజువారీ శారీరక శ్రమ,ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించింది. దీనికి సంబంధించి ఎలా బరువు తగ్గిందీ ఇన్‌స్టాలో వివరించింది. తన అభిమానులు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. బరువు తగ్గడం ఎవరికైనా సాధ్యమేనని రుజువు చేసింది.తన కృషి , అంకితభావాన్నిఇలా చెప్పింది.‘‘బరువున్నా.. బాగానే ఉన్నాను కదా అనుకునేదాన్ని..అంతేకాదు అసలు నేను సన్నగా మారతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎలాగైతేనేం డబుల్ డిజిట్‌కి చేరాను. దీని కోసం చాలా కష్టపడ్డాను. ఎంతో చెమట చిందించాను. కన్నీళ్లు కార్చాను. చివరికి ఇన్నేళ్లకు 150 కిలోల నుండి 66 కిలోలకు చేరాను’’ అని తెలిపింది.ప్రాంజల్ అనుసరించిన పద్దతులుబరువు తగ్గడానికి డైటింగ్, ఎక్స్‌ర్‌సైజ్ కంటే.. జీవనశైలిమార్పులే ముఖ్యం అంటుంది ప్రాంజల్.ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీరు త్రాగడం ప్రోటీన్ ఫుడ్ బాగా తినడం, చేపలు, పౌల్ట్రీ, రొయ్యలు ,గుడ్లు, అలాగే మొక్కల ప్రోటీన్,పనీర్, టోఫు, గ్రీకు యోగర్ట్, సోయాలాంటివి ఆహారంలో చేర్చుకోవడం.భోజనానికి ముందు సలాడ్ తీసుకోవడం ముఖ్యంగాక్యారెట్లు , కీరలాంటివాటితోసూక్ష్మపోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం తృణధాన్యాలు, పండ్లు , కూరగాయలు తినడం. ప్రతిరోజూ నాలుగు లీటర్ల నీరు త్రాగడం.వ్యాయామంప్రతి భోజనంలో ప్రోటీన్‌కు ప్రాధాన్యత. ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు రోజువారీ నడక. వాకింగ్ కుదరకపోతే భోజనం తర్వాత చురుకుగా ఉండటానికి 10-15 స్క్వాట్లు , పడుకునే ముందు 2-3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయడం. జిమ్‌కు వెళ్లడం, పైలేట్స్ , వాకింగ్ లేదా జాగింగ్ నోట్: బరువు తగ్గడం, దానిని నిర్వహించడం అనేది పూర్తి జీవనశైలి మార్పు ద్వారా సాధ్యం అనేది ప్రాంజల్ అనుభవం. ఇది అందరికీ ఒకేలా ఉండకపోయినా.. దాదాపు అందరికీ వర్తిస్తుంది. అంకితభావం , ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎవరైనా తమ లక్ష్యాలను సాధించవచ్చు. -
అతడి వెయిట్‌లాస్ జర్నీకి నటుడు హృతిక్ రోషన్ ఫిదా..!
ఎందరో తమ వెయిట్ లాస్ జర్నీతో స్ఫూర్తిని రగులుస్తున్నారు. బరువు తగ్గడం ఏమి భారం కాదని చేతలతో నిరూపిసతున్నారు. అంతేగాదు కొందరూ అచంచలమైన దీక్షతో బరువు తగ్గి ఊహించని రీతీలో స్మార్ట్‌గా మారి సెలబ్రిటీల చేత గ్రేట్ చేత ప్రశంసలందుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఫిట్నెస్ ఇన్‌ప్లుయెన్సర్ ఫుర్కాన్ ఖాన్. అతడు అంతలా ఓపికతో వ్యహరించి మరీ బరువు తగ్గిన తీరు నెటిజన్లందరినే గాక బాలీవుడ్ ప్రసిద్ధ నటుడుని సైతం ఇంప్రెస్ చేసింది. 23 ఏళ్ల ఫుర్కాన్ ఖాన్ తన ఫిట్నెస్ జర్నీని డాక్యుమెంట్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోకి 'ఓపికతో కసరత్తులు చేస్తూనే ఉండండి' అనే క్యాప్షన్‌తో తన వెయిట్ లాస్ జర్నీ వీడియోలు షేర్ చేసేవాడు. ఆ వీడియోలో పుర్కాన్ జనవరి 19 2024 జిమ్‌లో చేరిన 9 రోజుల తర్వాత అనే క్లిప్‌తో ప్రారంభమవుతుంది. ఒక ఏడాది క్రితం తాను ఎలా ఉన్నాడో చూపిస్తూ తన ఫిట్నెస్ జర్నీని గురించి వివరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే అంతలా జిమ్‌లో వర్కౌట్లు చేసినా ఫలితం మాత్రం త్వరగా రాదు. అయినా స్కిప్ చేయకుండా కష్టపడుతున్న తీరు వీడియోలో కనిపిస్తుంటుంది. మొదటి మూడు నుంచి నాలుగు నెలల్లో పెద్ద మార్పు కనిపించదు. శరీరాన్ని ఫిట్‌గా నిర్మించుకోవడానికి సంవత్సరాలు పట్టినా సరే.. మనం మాత్రం మన వర్కౌట్లు స్కిప్ చేయకూడదని చెబుతుంటాడు. ఓపిక అనేది అత్యంత ముఖ్యమని నొక్కి చెబుతుంటాడు. అయితే అలా చేయగా చేయగా.. ఫుర్కాన్ శరీరంలో చక్కటి మార్పు కనిపిస్తూ ఉంటుంది. చివరగా ఏది ఒక్క రోజులో జరగదనేది బాగా గుర్తించుకోండి అంటూ ముగిస్తాడు వీడియోలో. అతడి విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీకి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావడమే గాక స్వయంగా హృతిక్ రోషన్ నుంచే మన్ననలను అందుకోవడం విశేషం. హృతిక్ సదరు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఫుర్కాన్ని "మీరు బాగా చేశారు" అంటూ సోషల్ మీడియాలో ప్రశంసించారు. దీంతో నెటిజన్లు బ్రో గ్రీకు దేవుడు హృతిక్ నుంచే ప్రశంసలు అందుకున్నావు కదా..! నువ్వు గ్రేట్ అంటూ మెచ్చుకోగా, మరొకరు స్థిరత్వం, క్రమశిక్షణ ఎంత గొప్పవనేది తెల్తుస్తుందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Furkan Khan (@flexwithfurru) (చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్‌లు..) -
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!
బరువు తగ్గడం అనేది అనుకున్నంత సులువు కాదు. అలాగని అంత కష్టమూ కాదు. కావాల్సిందల్లా పట్టుదల. దృఢమైన నిశ్చయం ఉంటే ఈజీగా బరువు తగ్గవచ్చు. అయితే దీనికి ముందు బరువు పెరగడానికి గల కారణాలను విశ్లేషించు కోవాలి. బీఎంస్ ఇండెక్స్ ఆధారంగా ఎంత బరువున్నదీ లెక్కించు కోవాలి. దాని ప్రకారం ఎంత తగ్గాలి నిర్ణయించు కుని, జీవనశైలి మార్పులను చేసుకొని ప్రణాళికా బద్ధంగా ప్రయత్నిస్తే ఫలితం దక్కుతుంది.బరువు తగ్గాలనుకునేవారు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. పౌష్టికాహారం, వ్యాయామం, నిద్ర, తగినన్ని నీళ్లు లాంటివి చాలా అవసరం. కొన్ని ఆహార నియమాలుకీరదోసకాయ, బీర, సొరలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువున్న కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కొంచెం తిన్నా, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. పైగా వేసవిలో శరీరాన్నిహైడ్రేటెడ్గా ఉంచుతాయి కూడా.తాజా ఆకు కూరల్లోని విటమిన్ సీ, విటమిన్ కే ఉంటాయి. బరువు తగ్గడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. కొత్తిమీర, పుదీనా కూడాచాలామంచిది.తక్కువ కేలరీలు ఉండే బీట్రూట్, కేరట్లలో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ వ్యవస్థ సైతం మెరుగుపడుతుంది. వేగంగా బరువు తగ్గుతారు. (వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్‌లు)లో కేలరీ పండ్లల్లో యాపిల్ చాలా ముఖ్యమైనది. ఇందులోని ఫైబర్, వాటర్ కంటెంట్ బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చ, పైనాపిల్, స్ట్రాబెర్రీ, ద్రాక్షతో పాటు జామ పండ్లను కూడా తీసుకోవచ్చు.రోజుకు 800 కేలరీల తక్కువ తింటే వారానికి 1.5-2 కేజీల వరకు బరువు తగ్గవచ్చు. సాధారణ భోజనానికి ప్రత్యామ్నాయంగా సూప్‌లు, షేక్‌లు, బార్లు వంటివి ఉపయోగపడతాయి. రోజుకు అవసరమైన అన్ని పోషకాలను పొందేలా చూసుకోవాలి.సాధారణంగా మహిళలకు రోజుకు 1,200 నుండి 1,500 కేలరీలు ,పురుషులకు 1,500 నుండి 1,800 కేలరీలు తీసుకోవచ్చు. మిల్లెట్స్, ఓట్స్, మొలకలొచ్చిన గింజలు, నూనెకు బదులుగా నెయ్యి, బాదం, అవకాడో లాంటివి కూడా చాలా మంచిది. ఇదీ చదవండి : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?అడపాదడపా ఉపవాసంఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రోజులో 16 గంటల పాటు లేదా వారంలో 24 గంటలు ఏమీ తినకుండా ఉండటం. అంటే రాత్రి 9 నుంచి పగలు ఒంటిగంట వరకూ లేదా వారికి వీలైన 16 గంటల సమయంలో ఏమీ తినకూడదు. వీలును బట్టి ఈ 16 గంటలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బరువు ఎంత తగ్గాము అనేదిచూసుకుంటూ ఉంటే ఇంకొంచెం ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామం వేగంగా బరువు తగ్గడం అంటే వ్యాయామం ద్వారా ఎక్కువ తగ్గించుకోవడమే. ఏ రకమైన డైట్ పాటించినా, వ్యాయామం మాత్రం తప్పనిసరి. అరగంట నుంచి గంటదాకా నడక, యోగా లాంటివి తప్పకుండా చేయాలి. నోట్: అయితే కొన్ని జెనెటిక్ కారణాలు, అనారోగ్య పరిస్థితులుంటే వైద్యులను సంప్రదించి తగిన సూచనలు సలహాలు పాటించాలి. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు వైద్యుల సలహా తీసుకోవాలి. కొంతమంది స్వయంగా వేగంగా బరువు తగ్గడం సురక్షితం కాకపోవచ్చు అని గమనించుకోవాలి. అలాగే తీవ్రమైన ఆహార మార్పులు, శారీరక శ్రమ ద్వారా నెమ్మదిగా బరువు తగ్గే వ్యక్తుల కంటే చాలా త్వరగా బరువు తగ్గే వ్యక్తులు కాలక్రమేణా బరువును తిరిగి పొందే అవకాశం చాలా ఎక్కువ. -
జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..
అవమానాలు చీత్కారాల కారణంగా కొందరూ బరువు తగ్గి స్లిమ్‌గా మారిన స్ఫూర్తిదాయకమైన కథలను చూశాం. అలా కాకుండా కలవారపాటుకు గురిచేసిన అనారోగ్య సమస్య ఆరోగ్యంపై బాధ్యతగా వ్యవహరించేలా చేసి బరువు తగ్గేందుకు కారణమైంది. ఆ స్ప్రుహే ఆ మహిళను 133 కిలోల నుంచి కనివిని ఎరుగని రీతిలో బరువు తగ్గేందుకు ప్రేరేపించింది. అలా ఆమె ఒక్క ఏడాదికే దాదాపు 40 కిలోల మేరు బరువు కోల్పోయి..గుర్తుపట్టలేనంతగా నాజుగ్గా మారిపోయింది. తనలాంటి బాధపడుతున్న వ్యక్తుల్లో స్ఫూర్తిని నింపేలా తన వెయిట్ లాస్ జర్నీ, డైట్ సీక్రెట్ల గురించి నెట్టింట షేర్ చేసుకుంది. అవేంటంటే..టొరంటోలో నివసించే గురిష్క్ కౌర్ అనే బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఫిబ్రవరి 2024లో 133 కిలోలు మేర అధిక బరువు ఉండేది. అసాదారణమైన వెయిట్‌లాస్ జర్నీతో ఏకంగా 40 కిలోల మేర బరువు కోల్పోయి అందర్నీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ఈ ఏడాది జనవరి కల్లా 86.5 కిలోలకు చేరుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తన వెయిట్ లాస్ జర్నీ గురించి వెల్లడించి ఇతరులు కూడా బరువు తగ్గేలా ప్రోత్సహిస్తోంది. ఆమె ఫిమేల్ ప్యాటర్న్గా పిలిచే ఆండ్రోజెనిక్ అలోపేసియా బారిన పడటంతో ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. ఆ డెసిషన్ ఆమెను బరువు తగ్గే దిశగా నడిపించింది. బరువుగా ఉన్నప్పుడూ..తాను ఎలా ఒత్తిడి, బలహీనమైన ఆత్మవిశ్వాసంతో బాధపడిందో కూడా వెల్లడించింది. కేవలం శారీరకంగా స్లిమ్‌గా మారడమే కాకుండా స్ట్రాంగ్‌గా తయారవ్వాలని నిర్ణయించుకున్నానని అందువల్లే ఇంతలా బరువు తగ్గినట్లు తెలిపారు కౌర్. అలాగే తన డైట్ సీక్రెట్ ఏంటో కూడా బయటపెట్టింది. బరువు తగ్గేలా చేసిన డైట్ ట్రిక్..ముందుగా పోషకాహారంపై సరైన అవగాహన ఉండాలి. లీన్ ప్రోటీన్ - గుడ్లు, చికెన్, తెల్ల చేప, టోఫు, టెంపే వంటి వాటిని తీసుకునేందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. నట్స్, గుమ్మడి, పుచ్చకాయ, అవిశె గింజలు, సలాడ్లు, వేయించిన కూరగాయలు తినండిచిలగడదుంపలు, రై బ్రెడ్, మల్టీగ్రెయిన్ రైస్ తీసుకోవాలిదీంతోపాటు ముఖ్యంగా 80/20 రూల్‌ని పాటించాలి80/20 రూల్ అంటే..?: 80 శాతం ఆరోగ్యకరమైనది, 20 శాతం నచ్చిన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవాలి డైట్‌ని. డైట్ మంత్ర: ఆకలి నియంత్రణలో ఉండేలా డైట్ ప్లాన్ ఉండాలి. ప్రధానంగా సమతుల్యమైన ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చేలా ఫుడ్ తీసుకుంటే ఎవ్వరైనా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గగలుగుతారని చెబుతున్నారు గురిష్క్ కౌర్. అన్ని కిలోలు ఉన్న ఆమె అంతలా బరువు తగ్గగలిగిందంటే..ఓ మోస్తారు అటు ఇటుగా ఉన్న మనందంరం మరింత సులభంగా బరువు తగ్గిపోగలం అనడంలో సందేహమే లేదు కదూ..!. View this post on Instagram A post shared by Gurishq Kaur (@gurishqkaur) (చదవండి: నోరూరించే పాప్‌కార్న్ డ్రెస్‌లో నటి ఎమ్మా స్టోన్..!) -
నటి షెహ్నాజ్ గిల్ డైట్ ప్లాన్ ఇదే..! ఆరు నెలల్లో 55 కిలోలు..
బాలీవుడ్ నటి షెహ్నాజ్ గిల్ మోడల్, గాయని కూడా. ఆమె పలు మ్యూజిక్ వీడియోస్, టెవిజన్ షోస్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. షెహ్నాజ్ కౌర్‌గా కూడా పిలిచే ఆమె పంజాబీ, హిందీ టెలివిజన్ చిత్రాలలో నటిస్తుంది. అంతేగాదు ఆమె సోషల్ మీడియా సెన్సెషన్ కూడా. ఇటీవల బాలీవుడ్ టీవీ షో మిర్చి ప్లస్‌లో శిల్పా శెట్టి కుంద్రాతో జరిగిన సంభాషణలో తన డైట్ ప్లాన్ గురించి షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.ఆమె దాదాపు 55 కిలోలు బరువు తగ్గారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందరూ ఆమె ఫిట్నెస్ సీక్రెంటో ఏంటని ఆరా తీయడం ప్రారంభించారు. అందరి కుతుహలానికి తెరపడేలా ఆమె తన డైట్ సీక్రెట్ ఏంటో బయటపెట్టింది. ఆమె ఏం చెప్పారంటే..డైట్ ప్లాన్..తాను సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరునెలల్లోనే ఇంతలా స్లిమ్‌గా మారిపోయానని చెప్పారు. తన రోజుని పసుపుతో ప్రారంభిస్తానని అంటోంది. పసుపు ఆరోగ్య నిర్వహణకు మంచిదే అయినప్పటికి సరైన మార్గంలో ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు పొందొగలమని అంటోంది. తాను హైడ్రేషన్‌గా ఉండేలా తగినంత నీరు తాగిన తర్వాత పెసరట్టు లేదా మెంతీ పరాఠాలతో కూడిన అల్పహారాన్ని ఎంచుకుంటానని తెలిపారు. చాలావరకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ పరిమాణంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటానని అన్నారు. ఒక్కోసారి అల్పాహారంగా పోహా కూడా తీసుకుంటానని అంటోంది. ఇక తాను కూరగాయల రెసిపీనే ఎక్కువగా తీసుకుంటానని అన్నారు. అలాగే వాటిలో తప్పనిసరిగా జీలకర్ర, ఆవాలు ఉండాల్సిందేనట. ఎక్కువగా మాత్రం బ్రకోలి, క్యారెట్, బెల్ పిప్పర్ వంటివి తీసుకుంటానని చెప్పింది. భోజనంలో ఎప్పుడు ఆరోగ్యకరమైన పోషకాలు ఉండేలా మొలకలు, టోపు స్క్రాంబుల్, నెయ్యి, రోటీతో కూడిన పప్పు, సలాడ్లు ఉంటాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ సమతుల్యత ఉండేలా చూసుకుంటానని వెల్లడించింది. అలాగే పార్టీ టైంలో డైట్ ప్లాన్ బ్రేక్ చేయకుండా ఎలా ఫుడ్ తీసుకుంటున్నామనే దానిపైనే బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుందని నొక్కి చెబుతుంది. ఇదేగాక డిన్నర్ టైంలో మఖానా తీసుకుంటానని అన్నారు. ఇది ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. పైగా ఇది బరువు తగ్గడం, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మద్దితిస్తుందని చెబుతోంది షెహ్నాజ్. చాలావరకు తేలిక పాటి విందునే స్వీకరించడం ఉత్తమం అని అంటోంది. దీని వల్ల జీర్ణక్రియ, నిద్ర నాణ్యత తోపాటు, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తందని చెప్పుకొచ్చింది. ఇలా ఆరోగ్యకరమైన రీతీలో డైట్ ప్లాన్ తోపాటు స్ట్రిట్‌గా పాటించే గట్స్ ఉంటే ఈజీ బరువు తగ్గగలరని చెబుతోంది.(చదవండి: తలకు మర్దనా చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి..! ) -
విమానంలో సీటు సరిపోలే...దెబ్బకి 82 కిలోల బరువు తగ్గాడు
అధికబరువు బాధపడేవారికి కష్టాలు మామూలుగా ఉండవు. ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కోలా ఉంటాయి. పదిమంది చూపులు, కొంటెచూపులు వారిని తొలిచేస్తే ఉంటాయి. కొంతమంది అవమానకరమైన మాటలు కూడా వారిలో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. మరికొన్ని ఘటనలు వారిలో పంతాన్ని పట్టుదలను పెంచుతాయి. అలా విమానంలో సీటు చాలకపోవడంతో అవమానంగా భావించిన యువకుడు దృఢ సంకల్పంతో బరువు తగ్గాడు. ఇంతకీ ఆ యువకుడు ఎంత బరువు ఉండేవాడు? బరువును ఎలా తగ్గించుకున్నాడు? తెలుసుకుందామా!గతంలో విమానంలో సీటు చాలట్లేదని ఏకంగా విమానాన్నే కొనేసింది ఒక మహిళ. కానీ అర్రాన్ యువకుడిది మరో గాథ. విమానం కొనే స్థోమత లేదుగనుక, తన బాడీని మార్చుకునేందుకు సిద్ధపడ్డాడు. స్కాట్లాండ్లోని తూర్పు ఐర్‌షైర్‌లోని ఆచిన్లెక్లోఎయిర్క్రాఫ్ట్ ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు అర్రాన్ చిడ్విక్. నిండా 30 ఏళ్లు కూడా లేకుండానే వందకు దాటి బరువుండేవాడు. 24 ఏళ్ల వయసులో అతని బరువు 175 కిలోలు అంటే అతని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by Arran Chidwick (@arranchidwick)కబాబ్‌లు, బర్గర్లు, చైనీస్ ఫుడ్ , చిప్స్ బ్యాగులు వంటి పెద్ద మొత్తంలో జంక్ ఫుడ్ తినేవాడు. వారాంతంలో అయితే అతని తిండికి హద్దే ఉండేది కాదు. దీంతో షూలేస్‌లు కట్టుకోవడం , బట్టలు వేసుకోవడం లాంటి రోజువారీ పనులకు చాలా ఇబ్బందులు పడేవాడు. ఒకసారి విమానంలో సీటు సరిపోకపోవడంతో చాలా అవమాన పడ్డాడు. అప్పుడు నిర్ణయించుకున్నాడు. కఠినమైన మార్పులు చేయకపోతే తన మనుగడే కష్టమని గుర్తించాడు. బరువు తగ్గకపోతే ఇక నెక్ట్స్ పుట్టిన రోజు ఉండదని ఫిక్సై పోయాడు. అందుకే పట్టుబట్టి మరీ, ఆరోగ్యకరమైన ఎంపికల ద్వారా ఒక ఏడాదిలో 80 రెండున్నర కిలోలు తగ్గాడు. బరువు తగ్గించే ఇంజెక్షన్లు లేదా ఫ్యాషన్ డైట్లను ఇలాంటి వాటి జోలికి పోకుండా, హెల్దీగా తన బరువును నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. తనని చూసి ఒకరు జాలిపడేవారు. మరొకరు అవమానించేవారు. దీంతో బాగా ఆందోళన చెందేవాడు. నిరాశకు గురయ్యేవాడు. ఈ బాధతో మరింత ఎక్కువగా తినడం, తాగడం చేసేవాడినని స్వయంగా చెప్పాడు అర్రాన్. కానీ ఇంత లావుగా ఉంటే తనకిక వేరే ఉద్యోగాలు రావడం కూడా కష్టమని గ్రహించాడు. అంతేకాదు 30 పుట్టిన రోజు చూడటం అనుమానమే అని భావించాడు. అంతే బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించాడు. జీవనశైలి మార్పులు, ఆహార మార్పులు, వ్యాయామంతో గణనీయంగా బరువు తగ్గాడు. ఎవ్వరూ ఊహించని విధంగా స్మార్ట్ అండ్ స్లిమ్‌గా మారిపోయాడు. అంతేకాదు హాఫ్ మారథాన్ రన్నింగ్‌కి సిద్ధంగా ఉన్నాడు. బరువు తగ్గిన తరువాత చాలా ఆనందంగాఉందని చెబుతున్నాడు. అంకితభావం,నిబద్ధతతో నలుగురికీ స్ఫూర్తినిస్తూన్నాడు.ఇదీ చదవండి: MahaKumbh Mela : సింపుల్‌గా, హుందాగా రాధిక-అనంత్ అంబానీ జంటజంక్ ఫుడ్ పూర్తిగా మానేశాడు.పండ్లు, కూరగాయలు , ప్రోటీన్ ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకునేవాడు. జిమ్‌లో గంటల కొద్దీ వ్యాయామం చేశాడు. అయితే మొదట్లో తన ఆకారంతో జిమ్కెళ్లడానికి సిగ్గుపడేవాడట. అందుకే ఎవ్వరూ ఉండరని సమయంలో ఎక్కువగా జిమ్ చేసేవాడు. దీంతో మూడు నెలల్లోనే మంచి మార్పుకనిపించింది. మంచి ఫలితం కనిపించడంతో మరింత ఉత్సాహంగా తన వెయిట్ లాస్ జర్నీని కొనసాగించాడు. ‘‘మీ పట్ల జాలిపడకుండా ,అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారని అనుకోకుండా ఉండటం ముఖ్యం - మిమ్మల్ని మీరు మార్చుకోగలిగే ఏకైక వ్యక్తి మీరే" అంటాడు ఉత్సాహంగా. -
ఆరోగ్యకరమైన ఆహారమే అయినా బరువు తగ్గడం లేదు ఎందుకు..?
కొందరికి బరువు తగ్గడం అత్యంత క్రిటికల్‌గా మారిపోతుంటుంది. ఎంతలా ప్రయత్నించిన చక్కటి ఫలితం మాత్రం దక్కదు. ఆఖరికి ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఎందువల్ల బరువు తగ్గలేకపోతున్నామనేది అర్థంకానీ చిక్కుప్రశ్నలా వేధిస్తుంటుది. అందుకు గల ముఖ్యమైన ఆటంకాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ(Anjali Mukerjee) సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. కొందరు బరువు తగ్గడానికి చాలా కష్టపడుతుంటారని, వాళ్లంతా చేసే తప్పులు ఇవే అంటూ వివరించారు. అవేంటంటే..పోషకాహారమే తీసుకుంటున్నాం(Eating Healthy) అయినా సరే బరువు తగ్గడం భారంగా మారిపోతోందన్నారు. అలాంటివాళ్లను తాను స్వయంగా చూశానన్నారు. ఇన్‌స్టాలో “ఆరోగ్యంగా తిన్నప్పటికీ బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? అనే క్యాప్షన్‌తో అందుకు గల కారణాలను వివరించారు ముఖర్జీ. కొన్నిసార్లు మీరు ఏం తింటున్నారనేది ప్రధానం కాదు, శరీరం దానికి తగిన విధంగా ప్రాసెస్ చేస్తుందా లేదా అనేది కూడా గమనించాలని అన్నారు. అసలు బరువు తగ్గాలనుకున్నవాళ్లు చేసే తప్పులు ఏంటంటే..పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం చేసే తప్పులుబరువు తగ్గించే జర్నీలో డైట్ అనేది ఎంత ముఖ్యమే సమతుల్యంగా తీసుకుంటున్నామో లేదా అన్నిది కూడా అంతే ప్రధానం అని చెబుతున్నారు అంజలి.అలాగే ఆహరం పరిమాణ, కేలరీలను గమనించండి. ఎందుకంటే బాదం, నెయ్యి ఆరోగ్యానికి మంచివే గానీ ఆ రోజు నువ్వు తీసుకునే కేలరీల ఆధారంగా తీసుకోవాలా లేదా నిర్ణయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను అతిగా తినడం: అంటే మంచిది కదా అని అవకాడో, వాల్నట్లు, జీడిపప్పు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష మరియు డార్క్ చాక్లెట్లను ఎక్కువగా తినేస్తుంటారు. దీని వల్ల కూడా బరువు తగ్గడం సాధ్యం కాదని అన్నారు. హార్మోన్ ఆరోగ్యాన్ని అంచనా వేయండి: అంటే ఒక్కోసారి థైరాయిడ్ అనేది రక్తపరీక్షల్లో కూడా బయటపడకపోవచ్చు. దీనివల్ల కూడా బరువు తగ్గించే ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంటుందట. దీర్ఘకాలిక ఒత్తిడి: ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలలో పెరుగుదలకు దారితీస్తుంది. ఇది క్రమంగా బొడ్డు కొవ్వుకు దారితీస్తుంది. అంటే ఇక్కడ ఒత్తిడిని నిర్వహించడం అనేది అత్యంత ప్రధానం. అదే బరువు తగ్గడానికి సహయపడుతుందట. పేగు ఆరోగ్యాన్ని నిర్వహించడం: పైన పేర్కొన్న అంశాలతో పాటు, పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని అంజలి చెప్పారు. అడపాదడపా ఉపవాసం వంటి వాటిని ప్రయత్నించి సరైన విధంగా ఆహారం తీసుకుంటేనే చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అలాగే అనుసరించే డైట్‌కి శరీరం స్పందించే విధానాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటే మరిన్ని చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారని చెప్పారు ముఖర్జీ.(చదవండి: యంగ్ లుక్ మంచిదే!) -
Ram Kapoor: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా .!
వెయిట్‌లాస్ జర్నీలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. కొందరు బరవు తగ్గినట్లు తగ్గి మళ్లీ యథావిధి బరువుకి వచ్చేస్తుంటారు. అందరి శరీరతత్వం ఒకలా ఉండదు. ఒకరికి సాధ్యమైనట్లు మరొకరి బాడీకి సాధ్యం కాకపోవచ్చు. అలానే ప్రయత్నం మానకుండా బరువు తగ్గాలని బలంగా అనుకున్నవారే విజయవంతమవుతారు. అలాంటి కోవకు చెందినవారే బాలీవుడ్ నటుడు రామ్ కపూర్. ఆయన 140 కిలోల బరువతో ఊబకాయంతో నానా ఇబ్బందులు పడ్డారు. తగ్గే ప్రయత్నం చేసిన ప్రతిసారి..తగ్గినట్లుగా అనిపించేలోపే మళ్లీ యథావిధిగా అదే బరువుకి వచ్చేసేవారు. అయినా విసుగు చెందకుండా విజయవంతంగా బరువు తగ్గి స్లమ్‌గా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మరీ ఆయన ఫిట్నెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందామా..!నటుడు రామ్ కపూర్(Ram Kapoor) తన అధిక బరువు గురించి తనభార్య గౌతమి(Gautami) ఎన్నడూ ఏమి అనలేదు గానీ తన ఆరోగ్యం గురించి కలత చెందేదని అన్నారు. ఎందుకంటే.. అధిక బరువు కారణంగా ఒబెసిటీ, టైప్2 డయాబెటిస్(type 2 diabetes) వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవాడినని చెప్పారు. వాటికి చెక్ పెట్టాలంటే బరువు తగ్గక తప్పదని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చాలా ఆస్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. గత 15 ఏళ్లుగా అధిక బరువుతో నిరాటంకంగా పనిచేశాను. కానీ కనీసం ఇప్పుడైనా ఆరోగ్యం కోసం తన ఒంటిపై దృష్టి పెట్టాలని గట్టిగా అనుకున్నట్లు తెలిపారు. అందుకోసం తాను రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యానని అన్నారు. తాను రెండు సార్లు 30 కిలోలు వరకు తగ్గి మళ్లీ నార్మల్ బరువుకి తిరిగి వచ్చేసిట్లు చెప్పారు. అయితే ఎప్పుడు డైట్‌తో బరువు తగ్గుతారని అనుకోవడం సరైనది కాదని అంటున్నారు.ఇక్కడ కేవలం మన సంకల్ప శక్తి(willpower.), సానుకూల మనస్తత్వం వల్లే బరువు తగ్గడం అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. తాను రోజుకు రెండు పూటలా భోజనం చేసేవాడినని అన్నారు. ఒకటి ఉదయం 10.30 గంటలకు, మరొకటి సాయంత్రం 6.30 గంటలకని చెప్పారు. మధ్యలో నీళ్లు, కాఫీ లేదా టీ తాగేవాడినని అన్నారు. అయితే సాయంత్రం మాత్రం 6.30 గంటల కల్లా భోజనం చేసేస్తానని చెప్పారు. అస్సలు అల్పాహారం తినని అన్నారు. సూర్యాస్తమయం తర్వాత అస్సలు తినని చెప్పారు. దీన్ని కరెక్ట్‌గా చేసేలా మన మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండేలా చూడాలని చెప్పారు. డైట్లు, ఆహారపు అలవాట్ల కంటే..మనసుని నియంత్రించగలిగే శక్తే బరువు తగ్గడానికి అత్యంత కీలకమైనదని అన్నారు. వాటివల్ల తాను 55 కిలోల మేర బరువు తగ్గడమే కాకుండా ఆ బరువునే మెయింటైన్ చేయగలిగానని అన్నారు. నిపుణుల ఏమంటున్నారంటే..నిపుణులు సానుకూల మనస్తత్వంతోనే బరువు తగ్గడం అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపడుకోవడానికి అంకితభావంతో కూడిన మనస్తత్వం అవసరమని చెప్పారు. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు తగ్గించి ట్రాన్స్ఫ్యాట్లను నివారించాలన్నారు. ఇక్కడ వ్యాయామాన్ని శిక్షగా కాకుండా ఇష్టంతో చేయాలని చెప్పారు. ఒక్కోసారి చీట్ మీల్స్ ఉండొచ్చు. అయినా దాన్ని బర్న్ చేసేలా శారీరక శ్రమ చేయడం ముఖ్యం అని చెబుతున్నారు. మనసు మన మాట వినేలా ఎంత బలంగా చేసుకోగలిగితే అంతలా డైట్‌ని నియమబద్ధంగా ఫాలో అవ్వడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీంతోపాటు సరిగా నిద్రపోవడం, తగినంత నీరు తాగడం తదితర జీవనశైలి చర్యలు ఉంటే అనుకున్న రీతిలో బరువు తగ్గగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!) -
బరువు తగ్గడానికి 12-12 రూల్ ..!
బరువు తగ్గడానికి అడపదడపా ఉపవాసం ఒక ప్రసిద్ధమైన పద్ధతిగా మారింది. దీంతో అయితేనే ఈజీగా బరువు తగ్గుతామని చాలామంది ఈ పద్ధతి వైపుకే మొగ్గు చూపుతున్నారు. అయితే తాజాగా హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ చెందిన ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరబ్ సేథి ఈ అడదడప ఉపవాసం ది బెస్ట్ అని కితాబిచ్చారు. ఇది బరువు నిర్వహణ తోపాటు మొత్త ఆరోగ్యానికే మంచి ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు. ముఖ్యంగా కొవ్వుని కరిగించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. దీన్ని గనుక ఈ సింపుల్ టెక్నిక్‌లలో చేస్తే తక్షణమే ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అదెలాగో చేసేద్దామా..!.డాక్టర్ సేథి బరువు తగ్గడం కోసం మూడు కీలక చిట్కాలను ఫాలోమని చెప్పారు. అవేంటంటే..నిర్మాణాత్మక ఉపవాస షెడ్యూల్, మంచి డిటాక్స్ పానీయాలు, సమతుల్య ఆహారం తదితరాలు. ఈ మూడింటిని ఎలా చేయాలో డాక్టర్ సేథి చాలా వివరంగా చెప్పారు. 12:12 ఉపవాస షెడ్యూల్:డాక్టర్ సేథి 12:12 అడపాదడపా ఉపవాస షెడ్యూల్‌నే నిర్మాణాత్మక ఉపవాసమని అన్నారు. ఇది అత్యంత తేలికగా నిర్వహించదగిన ప్రక్రియని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా 12 గంటలు ఉపవాసం ఉంటారు, మిగతా 12 గంటలు తినడం వంటివి చేస్తారు. ఈ విధానం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల నిద్రలేమి తాలుక సమస్యలు దూరం అవుతాయని అన్నారు. ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నివారస్తుందని చెప్పారు. అలాగే ఇంత విరామం కారణంగా జీర్ణక్రియ పునరుద్ధరించడానికి తగినంత సమయం ఉంటుంది. ఉపవాస సమయంలో తీసుకోవాల్సినవి..ఈ పన్నెండు గంటల ఉపవాస సమయంలో కొవ్వుని కరిగించే జ్యూస్‌లు వంటివి తీసుకోవాలి. అంతేతప్ప కూల్‌డ్రింక్‌లు, ఫ్యాట్‌తో కూడిన జ్యూస్‌ల జోలికి వెళ్లకూడదని చెప్పారు. ముఖ్యంగా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ నీరు, ఫెన్నెల్ లేదా తులసి నీరు, చమోమిలే టీ లేదా అల్లం టీ వంటివి తీసుకోవడం మంచిదని చెప్పారు సేథి. ఇవి ఆకలిని అరికట్టడంలో సహాయపడటమే కాకుండా జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. వివిధ మార్గాల్లో శరీరానికి మద్దుతుని ఇస్తాయి.మిగతా 12 గంటలు తినే భోజనం ఎలా ఉండాలంటే..ఈ సమయంలో సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొవ్వు తగ్గేందుకు ప్రోత్సహించేలా అధిక ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టిపెట్టాలి. పనీర్, టోపు, చిక్పీస్, చికెన్, టర్కీ, చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయాలు తీసుకోవడం మంచిదని సూచించారు. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడం తోపాటు అతిగా తినకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ప్రోటీన్, ఫైబర్ కలయిక కొవ్వుని తగ్గించడానికి మద్దతు ఇవ్వడమే కాకుండా శరీరానికి ఇంధనంగా మంచి పోషకాలను అందిస్తుంది. చివరగా బరువు తగ్గడంలో ఈ అడపాదడపా ఉపవాసం ప్రభావంతంగా ఉంటుందని క్లినికల్‌గా నిరూపితమైందని నొక్కి చెప్పారు. అయితే ఇక్కడ సరైన విధంగా చేయడంపైనే ఫలితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం(చదవండి: కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!) -
సెలబ్రిటీ సీక్రెట్: అద్భుతమైన వెయిట్ లాస్ డ్రింక్!
పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ జ్యూస్‌ను తీసుకుంటే బరువు తగ్గడమే కాదు బాడీ మొత్తం డిటాక్స్ కూడా అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ఆ జ్యూస్ ఏంటీ..? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి..? వంటి విషయాలపై ఓ లుక్కేసేద్దామా..ముందుగా ఒక క్యారెట్, ఒక కీర దోసలను తీసుకోవాలి. వాటికి చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పియర్ పండును కూడా తీసుకుని ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కీరదోస ముక్కలు, పియర్ పండు ముక్కలు, గింజ తొలగించిన మూడు ఖర్జూరాలు, చిటికెడు పింక్ సాల్ట్, చిటికెడు దాల్చిన చెక్క ΄÷డి, ఒకటిన్నర గ్లాసుల నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అంతే! రుచికరమైన, ఆరోగ్యకరమైన క్యారెట్–కీర–పియర్ జ్యూస్ సిద్ధమైనట్లే. ఈ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే తీసుకోవడం వల్ల అందులో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర ΄ోషకాలు శరీరంలోని వ్యర్థాలను తొలగించి బాడీని డిటాక్స్ చేస్తాయి. అలాగే అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. అతి ఆకలి సమస్యను దూరం చేస్తాయి. కాబట్టి, ఎవరైతే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారో.. వారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకునేందుకు ప్రయత్నించండి. ఇదీ చదవండి: చిన్నపుడే పెళ్లి, ఎన్నో కష్టాలు, కట్ చేస్తే.. నిర్మలా సీతారామన్‌కు చేనేత పట్టుచీర Union Budget 2025 మఖానా ట్రెండింగ్ : తడాఖా తెలిస్తే అస్సలు వదలరు! -
స్వీట్లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గింది..!
బరువు తగ్గడం అనగానే నచ్చిన ఆహారాన్ని త్యాగం చేయడమే. ఒకవేళ నచ్చింది తినాలనిపించినా.. మనస్పూర్తిగా తినలేక డైట్‌ని మధ్యలోనే వదిలేయలేక ఎంతలా తిప్పలు పడతారో చెప్పాల్సిన పనిలేదు. కొందరైతే వెయిట్ లాస్ జర్నీలో నోరుని కట్టేసుకుని మరీ కఠినమైన డైట్లు, వర్కైట్లపై దృష్టిసారిస్తారు. అధికంగా వ్యాయమాలు చేసి తీపి పదార్థాలు దరిచేరనివ్వకుండా ఉంటేనే బరువు తగ్గుతారనేది చాలమంది అభిప్రాయం. అయితే వాటన్నింటిని కొట్టిపారేసేలా ఈ మహిళ వెయిట్ లాస్ జర్నీ ఉంది. పైగా తీపి పదార్థాలు తింటూనే బరువు తగ్గిందంట. అది నిజమేనా..? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆమె చెబుతున్న వెయిట్ లాస్ టిప్స్ వింటే నమ్మకుండా ఉండలేరు.ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కార్లా విసెంటిన్ వెయిట్ లాస్ జర్నీ చాలా విభిన్నంగా కొత్తగా ఉంది. బరువు తగ్గడం అంటే ఇష్టమైన ఆహారాన్ని దూరం చేసుకోవడం కాదని అంటోంది క్లారా. తన విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ..తాను ప్రతిరోజు ఇష్టమైన స్వీట్స్‌ని తింటూనే బరువు తగ్గానని నమ్మకంగా చెబుతోంది. అలా స్వీట్లు తింటూనే తన బరువు వ్యూహాలను ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. తనకు వెయిట్‌లాస్ జర్నీలో హెల్ప్ అయిన చిట్కాలను కూడా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..వ్యాయామం ఒక్కటే బరువు తగ్గడానికి సరిపోదని అంటోంది క్లారా. కేలరీలను తగ్గించే డైట్ తోపాటు మంచి కదిలకలతో కూడిన శారీరక శ్రమతోనే బరువు తగ్గుతారని అంటోంది. దాహం ఆకలి మారువేషంలో ఉంటుంది. అలాంటప్పుడు ఆకలితో ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి తరుచుగా నీరు తాగుతూ ఉండండి. ప్రతిరోజు ఒకే ఆహారం తినడం వల్ల కేలరీలు తీసుకోవడం, ట్రాక్ చేయడం సులభం అవుతుంది. అదీగాక భోజనం త్వరగా సిద్ధం చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. చిన్న ప్లేటుల్లో తింటే..ఎక్కువ తీసుకున్న అనుభూతి కలుగుతుంది. అలాగే నెమ్మదిగా తినడం తెలియకుండానే వస్తుందట. వ్యాయామం చేసే ముందు మంచి డిటాక్స్ వాటర్‌ని తీసుకుంటే జిమ్‌కి వెళ్లేలా బాడీ సిన్నద్ధం అవుతుందట. అంతేగాదు ఉత్సాహంగా వ్యాయమాలు చేయగలుగుతారు. నచ్చిన ఆహారం వదులుకోకుండా హాయిగా తినాలంటే..కేలరీలను తగ్గించుకునే యత్నం చేయాలి. ఇక్కడ క్లారాకి ప్రతిరోజు ఏదో ఒక స్వీట్ తప్పనిసరిగా తినే అలవాటు ఉందట. అందుకుని తనకు నచ్చిన స్వీట్‌ని హాయిగా తినేసి అదనపు కేలరీలు తీసుకోకుండా చూసుకుంటుందట. ఇలా చేస్తే తినాలనే పిచ్చికోరిక అదుపులో ఉంటుందని చెబుతుంది. స్వీట్స్ అధికంగా తినాలనిపించినా లేదా ఆకలిగా అనిపించినప్పుడల్లా చక్కెర లేని గమ్ నమలాలని సూచిస్తోంది.అలాగే మనల్ని మనం ఇష్టపడితేనే తొందరగా బరువు తగ్గకలుగుతామని అంటోంది.చివరగా అన్నింటికి సానుకూల దృక్పథంతో ఉండాలి అప్పుడే చక్కటి మార్పులు సాధ్యమవుతాయని నమ్మకంగా చెబుతోంది క్లారా.ఇక్కడ పాజిటివ్ ఆటిట్యూడ్ తోపాటు మనల్ని మనం ప్రేమించుకుంటేనే చక్కటి రూపం సొంత చేసుకోగలమని క్లారా కథే చెబుతోంది కదూ..!. View this post on Instagram A post shared by Carla Visentin (@carlavisentin_)(చదవండి: 'ఇది కాస్మెటిక్ సర్జరీనే కానీ కళ్లకు'..శాశ్వతంగా కంటి రంగు మారిపోతుంది..!) -
ఫ్యామిలీ మ్యాన్ 3 విలన్ జైదీప్ అహ్లవత్ : 110 నుంచి 83 కిలోలకు ఎలా?
ది ఫ్యామిలీ మ్యాన్-3లో విలనిజం పండిచబోతున్న నటుడు జైదీప్ అహ్లవత్ ఇపుడు ట్రెండింగ్‌లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా భారీ బరువు నుంచి బరువును తగ్గించుకుని కండలు తిరిగిన దేహంతో స్మార్టగా తయారైనాడు. ఐదు నెలల్లో 27 కిలోలు తగ్గాడు. దీని కోసం భారీ కసరత్తులే చేశాడు.ఫలితంగా 109.7 కిలోల నుండి 83 కిలోలకు చేరుకున్నాడు. ఈజీ చిట్కాలు, ట్రెండీ డైట్ లాంటివి కాకుండా 27 కిలోల బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నాడు? అహ్లవత్ వెయిట్‌లాస్ జర్నీని క్రమంలో తెలుసుకుందామా?బాలీవుడ్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన నటుడు జైదీప్ అహ్లవత్. ముఖ్యంగా పాతాళ్ లోక్‌లో హతీ రామ్ చౌదరి పాత్ర ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. అలాగే విలన్‌గా గాకుండా రొమాంటిక్ మూవీలు చేయాలని ఉందనే కోరికనుకూడా వ్యక్తం చేశాడు. సినిమాల్లో మరింత రాణించాలనే పట్టుదలతో తనబాడీని అద్భుతంగా తీర్చుదిద్దుకున్నాడు. ఈ వెయిట్ టాస్ జర్నీ అచంచలమైన క్రమశిక్షణ, ఫిట్నెస్ పట్ల అంకితభావం , కఠినమైన ఆహార నియమావళికి నిదర్శనంగా నిలుస్తోంది.ఇందుకోసం అహ్లవత్ తీవ్రమైన వ్యాయామాల ద్వారా తన బాడీని మల్చుకున్నాడు. చీట్ మీల్స్ , చిన్ని చిన్ని వ్యాయామలు లాంటి సాకులు లేకుండా పూర్తి నిబద్ధతతో తనలక్ష్యంవైపు గురిపెట్టాడు. ఇది తీవ్రమైన బరువు తగ్గడానికి కేలరీలను తగ్గించుకోవడం చాలా అవసరం. లాక్డౌన్ తర్వాత నే దాదాపు ఒక సంవత్సరం పాటు వ్యాయామం చేయకపోవడంతో చాలా బరువు పెరిపోయానని, మళ్లీ టోన్డ్ బాడీకోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని ఒకసందర్బంలో తెలిపాడు . తన ట్రైనర్ ప్రజ్వల్ దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా ప్రోత్సాహంతో బరువు తగ్గినట్టు చెప్పాడు. ఈ విశేషాలు ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌తో షేర్ చేశాడు. 2024లో సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వంలో వచ్చిన మూవీ మహారాజ్ పాత్రకోసం ఈ జర్నీని షురూ చేశాడు.అహ్లవత్ పాటించిన నియమాలు, స్పష్టమైన లక్ష్యాలుబరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, స్పష్టమైన,సాధించగల లక్ష్యాలపై స్పష్టత ఉండాలి. సులువుగా, త్వరగా బరువు తగ్గడం ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కాని వారానికి 0.5 నుండి 1 కిలోలు తగ్గాలనేది గోల్ పెట్టుకోవడం ఉత్తమం. ఇది ఎక్కువ కాలం ఈ జర్నీని కొనసాగించేలా ప్రేరేపిస్తుంది.కేలరీల లెక్కింపు కంటే పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వండిసరైన పోషకాహారం లేకుండా కేలరీలను తీవ్రంగా తగ్గించడం వల్ల కండరాల నష్టం, పోషక లోపాలు, జీవక్రియ మందగమనం లాంటివి రావచ్చు.కేలరీలను లెక్కించడానికి బదులుగా, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ , సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తినాలి.చాలామంది బరువు తగ్గడానికి కార్డియోపై మాత్రమేదృష్టి పెడతారు. బరువులు ఎత్తడం కండరాలు, ఎముకలు బలోపేతానికిసహాయపడుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. కోల్పోయిన బరువులో ఎక్కువ భాగం కండరాలు నష్టపోకుండా కొవ్వు కరిగేలా చేస్తుంది. ఫ్యాడ్ డైట్లు త్వరగా బరువు తగ్గడానికి దారితీయవచ్చు కానీ , పాటించడం కష్టం, ఆరోగ్య సమస్యలొస్తాయి. దీనికి బదులుగా, స్థిరమైన, సమతుల్యమైన ఆహార ప్రణాళికను స్వీకరించాలి. క్రమంగా జీవనశైలి మార్పులు దీర్ఘకాలిక విజయానికి దారితీస్తాయి.హైడ్రేటెడ్‌గా ఉంటూ, ఎలక్ట్రోలైట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరానికి తగినన్నినీళ్లు అందించడం వల్ల జీర్ణక్రియకు సహాయ పడుతుంది, ఆకలి అదుపులో ఉంటుంది, మొత్తం జీవక్రియకు సాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువగా బరువుగా తగ్గినపుడు శరీరం ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది, ఇది అలసట, కండరాల తిమ్మిరి, తలనొప్పికి దారితీస్తుంది. కనుక శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి.నిద్ర లేమి, అధిక ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారాలపై కోరికలను పెంచుతాయి. ఆకలి, జీవక్రియను నియంత్రించే హార్మోన్లను అంతరాయం కలిగించడం ద్వారా బరువు తగ్గించే ప్రయత్నాలను దెబ్బతీస్తాయి. సో..కనీసం 7–9 గంటల నాణ్యమైన నిద్ర ఉండాలి.ఎప్పటికపుడు ఎంత బరువు తగ్గుతున్నాం, బాడీ కొలతలు, ఫోటోలు, బట్టలు ఇలాంటి పారామీటర్లను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి విజయానికి ముఖ్యమైన గుర్తులు. ఒక వేళ అనుకున్నఫలితం రాకపోయినా నిరాశ పడకుండా వ్యాయామ తీవ్రతను సర్దుబాటు చేయడం, ప్రోటీన్ ఇన్‌టేక్ పెంచడం, లేదా ఇంటర్మిటెంట్ ఉపవాసంపై శ్రద్ధపెట్టాలి. ఇలా కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, గణనీయమైన బరువును తగ్గించుకోవడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. -
61 ఏళ్ల వయసులో బరువు తగ్గిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. జస్ట్ ఐదు నెలల్లోనే..
భారత మాజీ క్రికెటర్(former cricketer), రాజకీయ నాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత(Television presenter) నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navjot Singh Sidhu) బరువు తగ్గినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. అలాగే అంతకుమునుపు, బరువు తగ్గాక తన ఫోటోలను కూడా షేర్ చేశారు. తానెలా తక్కువ సమయంలో బరువు తగ్గి స్మార్ట్‌గా మారారో, అందుకు ఉపకరించినవి ఏంటో సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.బరువు తగ్గడం అనేది సంకల్ప శక్తి, ధృఢసంకల్పం, క్రమశిక్షిణతో కూడిన ప్రక్రియ. ఆరోగ్యకరమైన జీవనశైలి మొత్తం బరువుని అదుపులో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తనకు ఈ ఫిట్నెస్ లక్ష్యాన్ని సాధించడంలో ఆహారం, ప్రాణాయామం, వాకింగ్ ఎలా ఉపయోగపడ్డాయో తెలిపారు.సిద్ధూ దినచర్యలో..ప్రాణాయామం(pranayam,)..ప్రాణాయామం అనేది శ్వాస నియంత్రణ సాధన. దీనిలో ఉద్దేశపూర్వకంగా గాలి పీల్చడం, వదలడం వల్ల శ్వాసను ఒక నిర్దిష్ట క్రమంలో పెట్టుకోగలుగుతాం. యోగా అభ్యాసకుల ప్రకారం.. ప్రాణాయామ అనేది శరీరం, మనస్సు రెండింటినీ అనుసంధానించే ప్రక్రియ. ఇది ఇతర శారీరక భంగిమలు, ధ్యానం వంటి ఇతర అభ్యాసాలతో చేస్తారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడే జీవక్రియను కూడా పెంచుతుందంటున్నారు నిపుణులు.వెయిట్ ట్రైనింగ్(Weight training)..ఇది బలమైన కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి, పగుళ్ల ప్రమాదాన్ని నివారిస్తుంది. చాలామంది పెద్దలు 35 ఏళ్ల తర్వాత నుంచి ప్రతి ఏడాది దాదాపు అర పౌండ్ల కండరాలను కోల్పోతారు. ఎందుకంటే చిన్నతనంలో ఉన్నంత చురుకుగా శరీరం ఉండదు. జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. పైగా కండరాలు కోల్పోవడం, బరువు పెగరడానికి దాంతోపాటు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే వయసు కూడా ఇదే. కాబట్టి ఇది ఈ వెయిట్ ట్రైనింగ్ కేలరీలను బర్న్ చేయడానికి, హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమర్థవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.నడక(Walking)..క్రమం తప్పకుండా నడవడం వల్ల అదనపు కేలరీలు బర్న్ అవుతాయి, కండరాలు పెరుగుతాయి. పైగా బొడ్డు కొవ్వు గణనీయంగా తగ్గుతుంది. కొండలు లేదా స్వల్ప వంపులు ఉన్న మార్గాల్లో నడవడానికి ప్రయత్నిస్తే మరింత ఫలితం ఉంటుందన్నారు నిపుణులు.ఆరోగ్యకరమైన ఆహారం(Healthy Diet)ఇతర ఏ డైట్ల కంటే కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే మంచివి. ముఖ్యంగా బరువుని అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్లో చేర్చుకోవడం మంచిది. జంతు ఆహారాల కంటే మొక్కల ఆధారిత ఆహారాలైన..పండ్లు, కూరగాయాలు తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు సిద్ధూ. అలాగే చక్కెర, ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు. నిపుణులు కూడా ఆలివ్ నూన్, ఇతర మొక్కల నుంచి తీసిన నూనెలకు ప్రాధాన్యత ఇవ్వాలని వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని నొక్కి చెబుతున్నారు. Before and after … have lost 33 kilograms in less than 5 months since August last year … it was all about willpower, discipline, process and a strict diet facilitated by pranayama ( breath control ) weight training and walking ….. impossible is nothing people … ‘ pehla sukh… pic.twitter.com/nCNYN57kLW— Navjot Singh Sidhu (@sherryontopp) January 29, 2025(చదవండి: మహా కుంభమేళాలో పాల్గొన్న ఇండిగో సీఈవో..మాటల్లో చెప్పలేని శాంతి..!) -
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రాజీ పడకూడదనుకుంది..కట్‌చేస్తే..!
చుట్టుముట్టే ఆరోగ్య సమస్యలు మనకు పరోక్షంగా మంచి జీవనశైలి అవలంభించమని సంకేతమిస్తుంటాయి. మన శరీరం చెప్పే మాట వింటే ఆరోగ్యం, బరువు మన చేతిలో ఉంటుంది. లేదంటే అధిక బరువుతో లేనిపోని అనారోగ్య సమస్యలతో సతమతమవ్వక తప్పదు. కనీసం అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడే మేల్కొని మంచి ఆహారపు అలవాట్లతో బరువు తగ్గేందుకు ఉపక్రమించి ఎందరికో స్ఫూరిగా నిలుస్తున్నారు కొందరు. అచ్చం అలానే బరువు తగ్గి ఆరోగ్యంలో రాజీ ఉండకూడదని చాటి చెప్పి శెభాష్ అనిపించుకుంది ఈ మహిళ. ఆ మహిళ పేరు రాజీ ఘంఘాస్. ఆమె జనవరి 2024లో సుమారు 155 కిలోల బరువుతో పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుండేది. భారీకాయం వల్ల కొద్ది దూరం నడకకే ఆయాస పడిపోతుండేది. అలాగే ఈ అధిక బరువు కారణంగా ఆమె రూపం అసహ్యంగా మారడమే గాక ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. అధిక బరువు, హర్మోన్ల అసమతుల్యత, క్రమరహిత రుతుక్రమం, ప్రీ డయాబెటిక్ వంటి సమస్యలను ఎదుర్కొంది. ఆమెను చూస్తే పెద్దన్నాళ్లు ఈ బరువుతో బతకదేమో అనేంతలా ఇబ్బందులుపడింది. అప్పుడే రాజీ అనుకుంది భగవంతుడి ఇచ్చిన రూపం మార్చలేను, కానీ అనారోగ్యాన్ని భరిస్తూ మాత్రం చావలేను అని గట్టిగా నిర్ణయించుకుంది. ముందు అందం కంటే ఆరోగ్యంగా ఉండటమే ప్రధానం, పైగా అది తన చేతిలో ఉన్న అవకాశం అని గ్రహించింది రాజీ. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మంచి ఆహారపు అలవాట్లను అనుసరించింది. ముఖ్యంగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చింది. "రోజుని మెంతులు, యాలకులతో ఉడికించిన గోరువెచ్చని డిటాక్స్ వాటర్‌తో ప్రారంభించేది. అల్పహారంగా కూరగాయలతో నిండిన పోహా వంటివి తీసుకునేది. మధ్యాహ్నం చియా గింజల నీరు, ఓట్స్ తీసుకునేది. సాయంత్రం: గ్రీన్ టీ, మొక్కజొన్న చాట్. ఇక రాత్రికి కూరగాయలతో చేసిన శాండ్విచ్లు, డిటాక్స్ నీరు తీసుకునేది. క్రమం తప్పకుండా ఈ డైట్‌ని అనుసరించింది. తన అధిక బరువుతో ఎదురవ్వుతున్న ఆరోగ్య సమస్యలు గుర్తొచ్చి చీట్మీల్కి చోటివ్వకుండా నిబద్ధతతో ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించింది రాజీ". అలా ఒక్క ఏడాదికే 60 కిలోలు తగ్గి 95కిలోల బరువుకి చేరింది. అయితే వెయిట్ లాస్ జర్నీ మగియలేదని అంతలా 155 కిలోల బరువు ఉన్న తాను ఇంతలా బరువు తగ్గుతానని కలలో కూడా ఊహించలేదని ఆనందంగా చెబుతోంది రాజీ. ఆరోగ్యకరమైన బరువు చేరుకునేవరకు తన వెయిట్ లాస్ జర్నీ ఆగదని సోషల్ మీడియా వేదికగా తన అనుభవాల్ని షేర్ చేసుకుంది. View this post on Instagram A post shared by Rajii Ghanghas (@rajiighanghas) (చదవండి: సింగిల్ పేరెంటింగ్ సవాలుని సులభంగా అధిగమించండిలా..!) -
అప్‌స్టాక్ సీఈవో వెయిట్ లాస్ జర్నీ: పదివేల అడుగులతో పది కిలోల బరువు..!
బరువు తగ్గేందుకు ఏదో ఒక రీజన్ ఉంటుంది. కొందరికి ఎదుర్కొన్న బాడీ షేమింగ్ అవమానాలు, అనారోగ్యాలు తదితర కారణాలతో బరువు తగ్గడం జరుగుతుంది. మరికొందరూ సెలబ్రిటీలు, ప్రముఖులు స్ఫూర్తితో బరువు తగ్గించుకునే యత్నం చేస్తుంటారు. అయితే ఈ అప్‌స్టాక్(Upstox) సీఈవో వెయిట్ లాస్ జర్నీ మాత్రం కాస్త విభిన్నం. ఎందుకంటే తండ్రి అవ్వాలన్నా ఆలోచనే.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేసి, ఇలా స్మార్ట్‌గా మారేందుకు కారణమైంది అని అంటారాయన. మరీ ఆయన ఎలాంటి డైట్, వర్కౌట్లు ఫాలో అయ్యారో చూద్దామా..!.అప్‌స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు(UpStox Co-founder) శ్రీని విశ్వనాథ్(Shrini Viswanath,) తాను తండ్రి అవ్వాలనే కోరిక తన ఫిట్నెస్, ఆరోగ్యంపై దృష్టిసారించేలా చేసిందట. ఆ కొత్త బాధ్యతను తీసుకునేటప్పడు తాను మరింత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటేమ కాకుండా తన బిడ్డకు గ్రేట్‌గా కనిపించాలనే పిచ్చి కోరిక వల్లే కిలోలు కొద్దీ బరువు తగ్గానంటారు. ప్రస్తుతం తన భార్య ప్రెగ్నెంట్ అని ఆమె కూడా తన ఈ వెయిట్ లాస్(weight loss) జర్నీలో ఎంతో తోడ్పాటును అందించిందని అన్నారు. ఆయన 68 కిలోలు బరువు ఉండేవారట. ఈ వెయిట్ లాస్ జర్నీకి కీలకమైంది అంకితభావం అని అంటారు విశ్వనాథ్. సరైన డైట్, వ్యాయమం క్రమంతప్పకుండా చేస్తే కచ్చితం వందరోజుల్లో పది కిలోలు బరువు తగ్గిపోతారంటున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, బయటి ఫుడ్ఆర్డర్ పెట్టుకోవడం తగ్గిస్తే బరువు అదుపులోనే ఉంటుందట. అలాగే షుగర్‌కి సంబంధించిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. వాటికి బదులు యాపిల్స్, బేరి, పీచెస్, డ్రైప్రూట్స్ వంటి తీసుకునేవాడినన్నారు. విశ్వనాథ్ ఇష్టమైన కర్రీలను తీసుకున్నాను కానీ వాటిలో వెన్న లేదా నెయ్యి లేకుండా చూసుకున్నానని అన్నారు. భారతీయ ఆహరం సుగంధద్రవ్యాలతో అత్యంత రుచికరంగా ఉంటుంది. ఆ రుచిని ఆరోగ్యప్రదంగా తీసుకుంటే చాలు అని చెబుతున్నారు విశ్వనాథ్. అలాగే తన బరువు గణనీయంగా తగ్గడానికి బాగా ఉపయోగపడింది ఎనమిది వేల నుంచి పది వేల అడుగుల వాకింగ్ అని చెప్పారు. చాలామంది మాత్రం బరువు తగ్గడానికి విపరీతమైన వ్యాయామాలు, గంటలు కొద్ది జిమ్‌లో గడిపితే చాలనుకుంటారు. కానీ అది సరైంది కాదట. ఆహారపు అలవాట్లలో మంచి స్థిరమైన మార్పులే గణనీయంగా బరువు తగ్గేందుకు తోడ్పడతాయట.వర్క్‌లైఫ్ బ్యాలెన్స్, ఫిట్నెస్..జీవితం అనేది వ్యక్తిగత శ్రేయస్సు. దీన్ని వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే బ్యాలెన్సు చేయాలి. వ్యాపారం లేదా ఉద్యోగం, కుటుంబం, ఫిట్నెస్ - ఇలా ప్రతిదానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. కానీ ఏ పనిపై ఉంటే దానిపై మొత్తం దృష్టిని కేంద్రీకరించాలి. ప్రస్తుతం డెస్క్ఉద్యోగాల వల్ల గంటలకొద్దీ కూర్చోవడం ఎక్కువైపుతోంది. అందువల్లే ఆరోగ్య సమస్యలు, అధిక బరువు వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. చిన్న సర్దుబాటుతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని అంటున్నారు విశ్వనాథ్. (చదవండి: అంతరిక్షంలోనే ఏడు నెలలు..నడక మర్చిపోయా..!) -
మూడే మూడు చిట్కాలతో మిరాకిల్ : దెబ్బకు 8 కిలోలు తగ్గింది!
అసాధ్యం అనుకున్నదాన్ని సాధ్యం చేసిన చూపించిన వాళ్లే స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. చదువులో ర్యాంకు సంపాదించాలన్నా, మంచి ఉద్యోగం సాధించాలన్నా లక్ష్యం వైపు మన గురి, ఓపికతో మనం చేసిన ప్రయత్నాలే కీలకం. అలా పట్టుదల,ఓపిక తన డ్రీమ్‌ను సాకారం చేసుకున్న షీ’రో గురించి ఇపుడుతెలుసుకుందామా..!దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మహిళ రవిషా చిన్నప్ప అనూహ్యంగా బరువు తగ్గి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. కేవలం 34 రోజుల వ్యవధిలో 8 కిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా విజయరహస్యాన్ని వెల్లడించింది. మంచి ఆహారం, స్థిరమైన వ్యాయామం ద్వారానే ఇది సాధించానని తెలిపింది. Ravisha Chinappa ('IVF Momma') ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన కథనం ప్రకారం తొలుత ఆమె 55 కిలోల బరువునుండి 47 కిలోలకు తగ్గింది. ఈ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. ఒక పాపకు తల్లి అయిన రవీషా తాను గర్భం దాల్చిన తర్వాత అప్పుడు పెరిగిన బరువు, గత ఏడాది కాలంగా తగ్గడం లేదు. దీంతో మూడు సీక్రెట్స్‌ను పాటించాను. అవే తన బరువు తగ్గడానికి చాలా దోహదపడ్డాయని వెల్లడించింది. అంతేకాదు ఇంతకు ముందు తాను చాలా ప్రయత్నించినా విజయం సాధించలేదనీ, కానీ ఈ మూడు మార్గాలను స్వీకరించిన తర్వాత వేగంగా 8 కిలోల బరువు తగ్గానని తెలిపింది.మూడు చిట్కాలుజీవనశైలి,ఆహార మార్పులు : జీవనశైలి, శారీరక సామర్థ్యం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సానుకూలంగా, తన ఫిట్నెస్ లక్ష్యాలను దృశ్యమానం చేసుకుంది.ఆహారం,వ్యాయామ దినచర్య, ప్రతీ గంటన్నకు ఒకసారి నీళ్లు ఇవే ఆమె మార్గాలు. రోజువారీ 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంది ఎక్కువ ప్రోటీన్, తక్కువ కార్బ్ ఆహారం నియమాన్ని పాటించింది. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, సలాడ్లను ఎక్కువగా తీసుకుంది. తద్వారా చక్కెర, జంక్ ఫుడ్‌ను నివారించింది.కొంచెం బలమైన కార్డియో, యోగా చేసింది. ప్రతిరోజూ 45 నిమిషాల నుండి 1 గంట వ్యాయామం చేసింది. ఇందులో పరుగు, ప్లాంక్స్, వెయిట్ లిఫ్టింగ్ ఉన్నాయి.నీళ్లు : అలారం సెట్ చేసుకుని మరీ ప్రతిరోజూ 3-4 లీటర్ల చొప్పున నీళ్లు తాగింది. నీళ్ళు కొవ్వును కరిగిస్తాయి,మంచి అందాన్నిస్తాయని ఆమె అనుభవం. ఆకలి ఎక్కువగా అనిపిస్తే.. తక్కువ మోతాదులో రోజుకు 5-6సార్లు తినవచ్చట. View this post on Instagram A post shared by IVF momma 🌈🍍 (@ravisha.chinnappa)మానసిక ఆరోగ్యంపై దృష్టిఒత్తిడిని తగ్గించుకునేందుకు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ ధ్యానం సాధన చేసింది. అంకితభావం, సరైన ఆహారం, వ్యాయామం ,మానసిక శ్రేయస్సు , జీవనశైలిమార్పులు తమ వెయిట్ లాస్ జర్నీకి కీలకంగా పనిచేసాయని తెలిపింది. ఇదీ చదవండి : మీరందరూ తప్పకుండా ఇలా చేయాలనేదే నా కోరిక: సమంతాఅతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో! -
పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్ సింగర్
ఒక మనిషి లావుగా ఉండటానికి, సన్నగా ఉండటానికి వివిధ అంశాలు ప్రభావితం చేస్తాయి. జన్యువులు చేసే మ్యాజిక్, ఆహారం, జీవనశైలి, ఇతర అలవాట్లు లాంటివాటి మీద ఇది ఆధారపడి ఉంటుంది. అందుకే కొంతమంది బరువు తగ్గేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ ఉంటారు. మరికొంతమంది చాలా సులువైన పద్దతుల ద్వారా తమ బరువును నియంత్రణలో ఉంచుకుంటారు. అది బహుమతిగా కూడా ఉంటుంది. బరువు తగ్గడం అనేది కొంతమందికి నెలలు పట్టవచ్చు. మరికొంతమందికి సంవత్సరాలు పట్టవచ్చు. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నపుడు మాత్రం ఆ ఆనందం చెప్పనలవికాదు. యూఎస్ పాపులర్ సింగర్ ఈ ఆనందంలో మునిగితేలుతోంది. ఇంతకూ ఈ సింగర్ ఎవరు? తెలుసుకుందా పదండి! అమెరికన్ గాయని, ర్యాపర్ లిజ్జో ప్రపంచ సంగీత ప్రియులకు సుపరిచితమైన పేరు. చాలా కష్టపడి ఎట్టకేలకు తన బరువును తగ్గించుకుంది. 2014 నుండి కష్టపడి ఇప్పటికి తన లక్ష్యాన్ని చేరుకుంది. పదేళ్ల తరువాత తన బరువును చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. దృఢ సంకల్పం , పట్టుదల, సానుకూల దృక్పథం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు లిజ్జో ఉదాహరణ.తన సంతోషాన్ని గర్వంగా సోషల్‌మీడియాలో షేర్ చేసింది. తన ఫిగర్ ఫోటోను పోస్ట్ చేసింది. వెయిట్-ట్రాకింగ్ యాప్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకుంది. ‘‘ఈరోజు నేను నా బరువు తగ్గించుకునే లక్ష్యాన్ని చేరుకున్నాను. 2014 నుండి ఈ నెంబర్లు సంఖ్యను చూడలేదు!’’అని తెలిపింది. అలాగే అనుకున్న లక్ష్యం చేరేందుకు పట్టుదల ముఖ్యఅని గుర్తు పెట్టుకోండి అంటూ అభిమానులను ఉత్సాహపరుస్తూనే తన కొత్త లక్ష్యాలకు టైమ్ వచ్చింది అంటూ బరువు తగ్గే విషయంలో కొత్త టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పకనే చెప్పింది. ఈమె స్టోరీ ఇపుడు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అద్భుతం అభినందనలు అంటూ ఫాలోయర్లు తెగ పొగిడేస్తున్నారు. (రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో) View this post on Instagram A post shared by Lizzo (@lizzobeeating) లిజ్జో వివరాలను పోస్ట్ చేసింది. బరువు తగ్గించుకునే ప్రయాణాన్ని ప్రారంభించినప్పటినుంచి లిజ్జో బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ని 10.5 తగ్గించుకోగలిగింది. బాడీలో ఫ్యాట్ 16శాతం తగ్గడం విశేషం.2024,సెప్టెంబరులో ఈ ప్రయాణం గురించి టిక్ టాక్ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. ఎవరెన్ని కమెంట్స్ చేసినా తాను మాత్రం లక్ష్యంపై దృష్టి సారించానని ఆమె వెల్లడించింది. అప్పటినుంచి అనేక అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. అలాగే టైప్-2 డయాబెటిస్‌కు ఓజెంపిక్ వాడుతోందన్న ఆరోపణలను కూడా తోసిపుచ్చింది. కాగా యుఎస్ పాప్ స్టార్ లిజ్జోపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. తమను వేధిస్తోందని, ముగ్గురు మాజీ డ్యాన్సర్ల ఆరోపించారు. అయితే వీటిని తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టిపారేసింది కూడా. -
ఆమె ఈమెనా...! ఏకంగా 150నుంచి 68 కిలోలు..
బరువు తగ్గడం అనేది అంత సులభమైన పని కాదు. అందులోనూ మూడంకెల రేంజ్లో బరువు ఉంటే నో ఛాన్స్ అనేస్తారు. కేవలం ఫ్యాట్ తగ్గించుకునే ఆపరేషన్లతోనే సాధ్యమవుతుంది. కానీ ఈ మహిళ అంత భయనాక స్థాయిలో ఉన్న తన శరీర బరువుని విజయవంతంగా తగ్గించుకుని నాజుగ్గా మారిపోయింది. ఆమె పాత ఫోటోలు చూస్తే "ఆమె ఈమెనా.."అని ఆశ్చర్యపోవాల్సిందే అంతలా ఆమె బాడీ రూపురేఖలు మారిపోయాయి. సన్నబడితే ఇంత అందంగా ఉంటుందా అని అంతా కళ్లప్పగించి చూసేలా స్లిమ్‌గా అందంగా మారిపోయింది. ఏదో మాయ చేసినట్లుగా బరువు తగ్గి, అందరిచేత శెభాష్ అనిపించుకుంది. ఇది సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే(Pranjal Pandey) వెయిట్ స్టోరీ. బరువు తగ్గడం అనేది ఎంత క్లిష్టమైన ప్రక్రియ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ప్రాంజల్ పాండే అలా ఇలా కాదు..ఏకంగా 150 కిలోలు బరువు ఉండేది. ఈమె బరువు తగ్గాలనుకున్నా(Weight Loss) తగ్గుతుందా అనేంతగా భారీగా ఉండేది ఆమె శరీరం. కానీ ఆమె మాత్రం సాధ్యమే అంటూ ఎవ్వరూ ఊహించని రీతీలో బరువు తగ్గి గుర్తపట్టేలేనంత అందంగా మారిపోయింది. ఎవరీ అమ్మాయి అనుకునేలా ప్రాంజల్ పాండే తన బాడీ రూపరేఖలను మార్చుకుంది. కానీ తాను కూడా ఈ రేంజ్లో బరువు తగ్గగలనని అస్సలు ఊహించలేదని అంటోంది. అయితే ప్రాంజల్ పాండే డైట్(Diet), వర్కౌట్లు(work out) అంటూ నెటింట వైరల్ అవుతున్న కొత్తకొత్త వాటిని వేటిని ఫాలో కాలేదు. కేవలం తన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. అదే తనకు 'పెద్ద గేమ్ చేంజర్'లా పనిచేసి కిలోలు కొద్దీ బరువు తగ్గేందుకు ఉపకరించిందని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో తోపాటు తన జీవనశైలిలో జతచేసిన అలవాట్లను గురించి ఇన్స్టాగ్రాం వేదికగా షేర్ చేసుకుంది. అవేంటంటే..ఆరోగ్యకరమైన జీవనశైలి..ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కూడిన గోరు వెచ్చని నీరు తీసుకోవడం. ఇది పొట్ట ఉబ్బరాన్ని నివారిస్తుంది, కాలేయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.ప్రతి భోజనానికి ముందు ఫైబర్. ఫైబర్ ఉండే సలాడ్లు లేదా పళ్లు, నట్స్ వంటివి తినడం. దీంతో పొట్ట నిండి ఉంటుంది కాబట్టి భోజనం మితంగా తింటారు. పైగా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉండదు.ప్రోటీన్ లేదా కొవ్వుతో ఉండే పండ్లు తినడం. ఇలా అందరికీ వర్తించదు. ఇక్కడ న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండేకి పీసీఓసీ సమస్య ఉంది. అందువల్ల బాదంతో కలిపి ఆపిల్ తినడం, వెన్నతో కూడిన పెరుగుతో స్ట్రాబెర్రీలు తీసుకునేదట.ప్రతిరోజూ 4 లీటర్ల నీరు త్రాగడం. దీనివల్ల మూత్రం ద్వారా అదనపు కొవ్వు తొలగిపోతుందిఅలాగే భోజనం అనంతరం కనీసం 10 నిమిషాలు నడవడం, 10-15 స్క్వాట్లు చేయడం వంటివి చేయాలి. పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందు చివరి భోజనం చేయడం.భోజనంలో ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కడుపు నిండుగా తిన్న అనుభూతి దక్కుతుంది. కొద్దిపాటి సింపుల్ వ్యాయామాలు శరీరాన్ని ఫ్రీగా కదిలించడానికి, రిఫ్రెషింగ్కి ఉపయోగపడతాయి. ఇలాంటి అలవాట్లతో కొండలాంటి శరీరాన్ని నాజుగ్గా మార్చేయవచ్చని ప్రూవ్ చేసింది న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే. ఎలాంటి డైట్లు అవసరం లేదు జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుని, జస్ట్ తీసుకునే ఫుడ్‌పై ఫోకస్ పెట్టండి అంటోంది. View this post on Instagram A post shared by Pranjal Pandey (@transformwithpranjal) (చదవండి: నిఖిల్ కామత్ సూపర్ ఫుడ్ ఇదే..! దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందా..?) -
తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?
చలికాలం మొదలు కాగానే మార్కెట్టులో విరివిగా కనిపించే వాటిలో తేగలు ఒకటి. వీటిని కొన్ని ప్రాంతాలలో గేగులు అని అంటారు. వీటిని తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా వున్నాయి. అవేంటో తెలుసుకుంటే ఇప్పుడైనా వీటిని తినేందుకు త్వరపడతారు. తేగల్లో పొటాషియం, విటమిన్ బి1, బి2, బి3, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి పోషకాల లోపాన్నీ తగ్గిస్తాయి. తేగలతో ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా? తేగలను ఉడికించి మిరియాలు, ఉప్పు అద్దుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. తేగలు తింటే బరువు తగ్గడంతోపాటు కాన్సర్ కూడా దూరం అవుతుంది. అలాగే తేగలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండి కొట్టి, కొబ్బరి పాలు, బెల్లం, ఏలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది.తేగలపిండితో రొట్టెలు చేసుకుని తినొచ్చు. ఇందులోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది. పెద్ద పేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులోని కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో తెల్ల కణాలను వృద్ధి చేస్తుంది. శరీరానికి చలువనిచ్చి, నోటిపూతను తగ్గిస్తుంది. తేగలను పాలలో ఉడికించి ఆ పాలను చర్మానికి పూతలా రాసుకుంటే చర్మం మిలమిల లాడుతంంది.తేగలు దొరికే రోజుల్లో పిల్లలకు రెగ్యులర్‌గా వీటిని పెడితే ఎముకల ఎదుగుదలకు దోహద పడుతుంది. తాటి తేగలను మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించి మధుమేహాన్ని అదుపు చేస్తుంది. రక్తం తక్కువగా ఉండి అనీమియాతో బాధపడుతున్నవారు ఈ సీజన్లో వచ్చే తేగలను తింటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. తాటి చెట్ల ద్వారా... తేగలకు మూలం తాటిచెట్టే. వేసవిలో తాటికాయల కాపు మొదలవుతుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో తాటి ముంజులు మార్కెట్లోకి వస్తాయి. అవి ముదిరి తాటికాయలుగా తయారై పండ్లుగా మారతాయి. అలా రాలిన తాటి పండ్ల గుజ్జును వినియోగించి పిండి వంటలు తయారు చేస్తారు. ముఖ్యంగా తాటి తాండ్ర, తాటి రొట్టెలు మొదలైనవి. ఈ తాటి కాయల టెంకలతో పాటు,కాయలను కూడా ప్రత్యేక ప్రాంతాల్లో రైతులు వ్యాపారులు తేగల పాతరలు వేస్తారు. వీటికి ఎటువంటి ఎరువులు అవసరం లేదు. భూమి ఇసుక పొరలలో దృఢంగా పెరుగుతాయి. డిసెంబర్ నాటికి ఇవి తేగలుగా తయారవుతాయి. వీటిని మొలకలు రాకముందే తీసి, కుండల్లో ప్రత్యేకంగా అమర్చి నిప్పుల్లో కాల్చతారు. ఇవి తినడానికి కమ్మగా ఉంటాయి. వీటి మార్కెట్లో విక్రయంచి రైతులు ఉపాధి పొందుతారు.ఆహా ఆరోగ్యం.. తేగలు గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెడతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి. నోటి సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. డయాబెటిస్తో బాధపడే వారు వీటిని తింటే డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా తాటి తేగలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను కలిగించే తాటి తేగలను ప్రతిరోజు క్రమం తప్పకుండా దొరికినప్పుడు ఒకటి చొప్పున తీసుకుంటే చాలా మంచిది. ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పెరిగే ఈ తాటి తేగలు మంచి పోషకాహారంగా మనం చెప్పవచ్చు. వీటిల్లో ఉండే పీచు పదార్థం మన జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది. మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి తాటి తేగలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఇవి మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తెల్లరక్త కణాలను పెంచి, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.ఇవీ చదవండి :ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!అపుడు వాచ్‌మెన్‌గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీ నోట్: మంచిది కదా అని అతిగా తింటే మాత్రం చెరుపు చేస్తుంది. -
బరువు తగ్గాలనుకుంటున్నారా..? హెల్ప్ అయ్యే టిప్స్ ఇవిగో..
బరువు తగ్గాలని(Losing weight) చాలామంది అనుకుంటారు. అయితే కొత్తగా ప్రారంభించేవారికి ఏది మంచిది, ఎలాంటి డైట్ బెటర్ అనే గందరగోళానికి గురవ్వతుంటారు. అందుకు తగ్గట్టుగానే విభిన్నమైన డైట్లు సోషల్ మీడియాల్లో ఊదరగొట్టేలా వైరల్ అవుతున్నాయి. దీంతో సవ్యంగా సరైనది ఎంచుకోలేక తంటాలు పడుతున్నారు. అలాంటి వాళ్లు ఇన్స్టాగ్రామ్ యూజర్ భవ్య చెప్పే డైట్ అండ్ ఫిట్నెస్ హెల్ప్ అవుతాయి. అందుకు ఆమె అనుభవమే ఓ ఉదాహరణ. ముఖ్యంగా కొత్తగా వెయిట్ లాస్ జర్నీ(Weight loss journey)కి ఉపక్రమించేవాళ్లకు మరింత ఉపయోగపడతాయని నమ్మకంగా చెబుతోంది భవ్య. అవేంటో చూద్దామా..!.భవ్య కూడా దగ్గర దగ్గర 75 కేజీల బరువు ఉండేదట. తాను ఎలాగైన బరువు తగ్గాలని శ్రద్ధగా తీసుకున్న బేసిక్ డైట్, వర్క్ట్లు ప్రభావవంతంగా పనిచేశాయట. దీంతో ఆమె ప్రస్తుతం 60 కేజీల బరువుతో ఫిట్‌గా కనిపిస్తోంది. తాను ఎలాంటి డైట్, ఫిట్నెస్ వర్కౌట్లు ఫాలో అయ్యిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. వెయిట్ లాస్ జర్నీకి ఉపకరించే బేసిక్స్..డైట్ ఎలా ఉండాలంటే..కలర్‌ఫుల్ ఫ్రూట్స్, కూరగాయాలను తప్పనిసరిగా ప్రతీ భోజనంలో ఉండేలా చూసుకోవడం. లీన్ ప్రోటీన్ కోసం చికెన్, చేప, టోఫు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ప్రోటీన్లు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.బియ్యం, క్విననో, ఓట్స్ వంటి వాటిని తీసుకోవాలి. వర్కౌట్లు..వామ్ అప్ వ్యాయామాలతో ప్రారంభించి, ఐదు నుంచి పదినిమిషాలు కార్డియో ఎక్సర్సైజులు చేయాలి. ముప్పై నుంచి నలభై నిమిషాలుపుష్అప్, స్క్వాట్స్, లేదా శక్తిమంతమైన వ్యాయామాలు చేయాలి. ఈ వర్కౌట్లు పూర్తి అవ్వగానే బాడీ ఫ్లెక్సిబిలిటీ, మానసిక ప్రశాంతత కోసం యోగా వంటివి చేస్తే బెటర్ అని చెబుతోంది భవ్య.వీటన్నింటి తోపాటు బాడీ హైడ్రేటెడ్‌గా ఉండేలా రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తీసుకోవాలి. అలాగే తక్కువ క్వాండిటీలో ఎక్కువ సార్లు తీసుకుంటే అలసటకు గురవ్వమని చెబుతోంది భవ్య. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవతోంది. View this post on Instagram A post shared by Bhavya .ೃ࿔ ✈︎ *:・ (@avgeek.bhavya) (చదవండి: ఆ డాక్టర్ డేరింగ్‌కి మతిపోవాల్సిందే..! వామ్మో మరీ ఇలానా..) -
ఒకే ఒక్క మాటతో 94 నుంచి 71 కిలోలకు : ఏం చేసిందో తెలిస్తే ఫిదానే!
బరువు తగ్గే క్రమంలో ఒక్కొక్కరి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ వెయిట్ లాస్ జర్నీలో కేవలం స్లిమ్‌గా కనిపించడం కోసం మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్ష కూడ ఉంటుంది. అలాగఎలాగైనా బరువు తగ్గాలనే లక్ష్యంతో పట్టుదలగా, అంకితభావంతో వారు చేసే కృషి చాలా ప్రేరణగా ఉంటుంది. అలా తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతోపాటు, కుమార్తెకు రోల్ మోడల్‌గా ఉండేందుకు ఒక తల్లి చేసిన ప్రయత్నం, ఆమె సాధించిన విజయం తెలుసుకుంటే మీరు ఫిదా అవుతారు.ఐటీ ప్రొఫెషనల్, ఐదేళ్ల కుమార్తెకు తల్లి శుభశ్రీ రౌతరాయ్ పట్టుబట్టి 20 కిలోలకు పైగా బరువు తగ్గింది. ఆత్మవిశ్వాసం ,శక్తిని తిరిగి పొందింది. అయితే ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏమంటే.. చాలా అమాయకంగా, మామూలుగా కూతురు అన్న మాట తల్లిలో ఆలోచన రగిలించింది. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ, “అమ్మా, నేను పెద్దయ్యాక నువ్వు నా అక్కలా కనిపించాలి కాబట్టి మనం ఒకరి డ్రెస్‌లు వేసుకోవచ్చు.” అని ఆశగా చెప్పింది ఆమె కూతురు. ఈ మాటే ఆమెకు మేల్కొలుపులా పనిచేసింది. తన రూపాన్ని చూసుకుంది.. ఇంత చిన్న వయసులో ఆరోగ్యం కూడా గాడి తప్పినట్టు అర్థం చేసుకుంది. ఇంట్లో వండిన భోజనం, నడక, ఇంటి వ్యాయామాలుతో తన శరీర బరువును తగ్గించుకుంది. 2023, డిసెంబరులో శుభశ్రీ బరువు 94 కిలోలకు పైమాటే. ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటూ కుమార్తెకు రోల్ మోడల్‌గా, తనను తాను ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని భావించింది. ఇందుకోసం ఆరంభంలో జిమ్‌లో తెగ కసరత్తులు చేసింది. క్రాష్ డైట్ ఫాలో అయింది. అయినా ఫలితం లేదు. ఇక లాభం లేదనుకుని వేరే మార్గాన్ని ఎంచుకోవాలని గత ఏడాది జనవరిలో భావించింది. ఇంట్లో వండిన ఆహారం, క్రమం తపక్పకుండా, నిబద్ధతతో 30 నిమిషాల నడక , మరో 15 నిమిషాల ఇంట్లో వ్యాయామాలను ఎంచుకుంది. View this post on Instagram A post shared by 🅢🅤🅑🅗🅐🅢🅗🅡🅔🅔 (@subhashreefantasyworld)ఆమె పాటించిన కీలకమైన పద్దతులుగతంలో వచ్చిన అనుభవంతో జిమ్ జోలికిపోలేదుచిన్న మార్పులపై దృష్టి పెట్టింది.సమతుల్య, ఇంట్లో వండిన భోజనం, తక్కువ తినడం, తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రొటీన్ప్రాసెస్ చేసిన ఆహారాలను మానేసింది.ప్రోటీన్ ,ఫైబర్ అధికంగా ఉండే భోజనాలకు ప్రాధాన్యత చక్కటి ఆహారం , చాలినంత నీళ్లుఇలా 2024 జూలై నాటికి కొద్దిగా బరువు తగ్గింది. ఆ తరువాత ఆమె జిమ్‌లో బలమైన వ్యాయమాలు చేసింది. దీంతో ఫలితాలు నెమ్మదిగా కనిపించినా, మూడు నెలల్లో అద్భుత విజయం సాధించింది. 94 కిలోల నుండి 71 కిలోలకు చేరింది. తన దుస్తులు XXXL నుండి లార్జ్/మీడియం (బ్రాండ్‌ను బట్టి)కి చేరడం ద్వారా తనకల నిజమైందని అంటుంది భావోద్వేగంతో శుభశ్రీ “ఇది కేవలం అందంగా కనిపించడం కోసం మాత్రమే కాదు. ఆరోగ్య సమస్యలను నివారించడం, కుటుంబానికి ఆదర్శంగా ఉండటం’’ అంటుంది శుభశ్రీ. ఈ ప్రయణంలో తాను కోల్పోయిన ప్రతి కిలో తనకు మరింత ఉత్సాహాన్నిచ్చింది అని చెబుతుంది. నిరాశ పడ కుండా పట్టుదలగా సాగడమే తన ఆయుధమని చెప్పింది. అంతేకాదు ఎత్తుకు తగిన బరువును సాధించాలనే ఆమె లక్ష్యం. ఈ జర్నీలో బరువు తగ్గడంతోపాటు, కండరాలను ఎముకలను బలోపేతం చేసుకోవడం దృష్టి పెట్టింది. తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా తనలాంటి స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో తన కథను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనలాగా ఆత్మవిశ్వాసంతో లక్ష్యాల వైపు తొలి అడుగు వేయాలని, తమ కలలను సాకారం చేసుకోవాలని సూచిస్తోంది. పెళ్లి, పిల్లలు తరువాత బరువు తగ్గడం కష్టం అని ఎంతమాత్రం అనుకోకండి.. కష్టపడితే సాధ్యమే అంటూ తనలాంటి తల్లులకు సలహా ఇస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ విందులో నీతా స్పెషల్ లుక్.. ఈ చీరకు 1900 గంటలు పట్టిందట! -
మాములు వెయిట్ లాస్ జర్నీ కాదు..! కనీసం తండ్రి శవాన్ని..!
బరువు తగ్గడం అతి పెద్ద టాస్క్‌లా ఉంది. ఎందుకంటే డెస్క్ జాబ్‌లు కావడంతో నూటికి తొంభైతొమ్మిది మంది అధిక బరువు సమస్యతో అల్లాడిపోతున్నారు. తినేది ఏం లేకపోయిన అధిక బరువు భారంగా మారి ఇబ్బంది పెడుతోంది. అయితే దీన్ని మంచి ఆహారపు అలవాట్లతో సరైన విధంగా చెక్‌పెట్టొచ్చని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఆ విధంగా చేసి కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. తాజాగా అలాంటి కోవలోకి ఓ ఫిట్నెస్ ఔత్సాహికుడు చేరిపోయాడు. అతడి వెయిట్ లాస్ జర్నీ చూస్తే నోటమాటరాదు. ఇంత అధిక బరువుని ఎలా తగ్గించుకున్నాడ్రా బాబు అని ఆశ్చర్యపోతారు. మరి అదెలాగో చూద్దామా..ఇన్స్టాగ్రామ్ యూజర్ అజార్ హసన్ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీతో నెట్టింట వైరల్‌గా మారాడు. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్ ఎంటీవీ రోడిస్ సీజన్20లో కనిపించిన ఈ ఫిట్నెస్ ఔత్సాహికుడు తన వెయిట్ లాస్ జర్నీ గురించి వీడియో రూపంలో షేర్ చేయండంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడిస్టోరీ సోషల్ మీడియాలో లక్షలాది మందికి స్ఫూర్తిని రగిలించింది. ఏకంగా అన్ని కిలోలు బరువుని తగ్గించుకోవాలంటే ఎంతో నిబద్ధత అవరం అంటూ అతడిపై ప్రశంసలతో మంచెత్తారు నెటిజన్లు. ఆ వీడియోలో హసన్ తాను ఒకప్పుడు 145 కిలోల అధిక బరువుతో ఎలా ఉండేవాడో చూపించారు. తన శరీర కొవ్వు శాతం సుమారు 55% ఉండేదని చెప్పారు. తన వెయిట్‌లాస్ జర్నీతో దాన్ని దాదాపు 9% వరకు తగ్గించుకోగలిగానని అన్నారు. ఇప్పుడు 75 కిలోలు బరువు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తన బరువు తగ్గించే ఈ జర్నీలో తండ్రే తనకు స్ఫూర్తినిచ్చారని చెప్పుకొచ్చారు. తన తండ్రితో ఎలాగైన బరువు తగ్గుతానని ఛాలెంజ్ చేసినట్లు చెప్పారు. అలా తాను ఏడు నెలల్లో మొత్తం కొవ్వుని కోల్పోయి..దాదాపు 55 కిలోల వరకు బరువు తగ్గినట్లు తెలిపారు. అయితే తన విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీని చూడకమునుపే తండ్రి మరణించినట్లు వెల్లడించారు. అంతేగాదు తన తండ్రి శవాన్ని ఖననం చేసే నిమిత్తం సమాధిలోకి దించలేకపోయినట్లు వివరించారు. అప్పుడే తనకు ఈ అధిక బరువుతో చాలా ఇబ్బందులు తప్పవని తెలిసిందన్నారు. ఆ నేపథ్యంలోనే ఇంతలా తాను బరువు తగ్గి స్లిమ్‌గా మారినట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Azhar hassan (@fitflashh) (చదవండి: నాజూకు నడుము కోసం ఏకంగా పక్కటెముకలనే..!) -
ఏకంగా 28 కేజీలు తగ్గింది : ఎలా ఉండేది..ఎలా అయ్యింది?!
అందరికీ తెలుసు బరువు తగ్గడం అంత ఈజీకాదు అని. కానీ ఆచరించడంలో విఫలమవుతూంటారు. అనుకున్నది సాధించాలంటే తగిన కృషి ఉండాలి. ఆ కృషిని కష్టంగా కన్నా ఇష్టంగా, పట్టుదలగా చేయడం ముఖ్యం. అలా దీక్షగా ప్రయత్నించిన పోషకాహార నిపుణురాలు దీక్ష బరువు తగ్గింది. నమ్మలేక పోతున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.వృత్తిపరంగా పోషకాహార నిపుణురాలు అయిన దీక్షఏకంగా 28 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సందర్బంగా తీసుకున్న జాగ్రత్తలు, ఆహార నియమాలతో తన వెయిట్‌లాస్ జర్నీని ప్రభావితం చేసిన అంశాలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది.“మీరు ఇంటర్నెట్లో చూసే ప్రతిదాన్ని నమ్మొద్దు; మీరు ఈ దినచర్యను అనుసరించడం ప్రారంభిస్తే బరువు తగ్గడం మొదలవుతుంది. నేను 28 కిలోల బరువు తగ్గాను, నేను మళ్ళీ చేయాల్సి వస్తే, నేను ఇలాగే చేస్తాను,” అంటూ ఒక రీల్లో వివరాలను తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన జర్నీని స్నిప్పెట్లను పంచుకోవడం దీక్షకు అలవాటు.ఇదీ చదవండి: కుమారుడి ఒకే ఒక్క మాటకోసం : ఏకంగా 22 కిలోలు తగ్గాడు! అయిదు సూత్రాలువేగంగా బరువు తగ్గాలని ప్రయత్నించకండి. నెమ్మదిగా, స్థిరంగా తగ్గితేనే ఆ బరువు మెయింటైన్ అవుతుంది. లేదంటే ఎంత తొందరగా తగ్గితే.. అంత వేగంగా మళ్లీ బరువు పెరుగుతారు.బ్యాలెన్స్ డైట్ ముఖ్యం. మధ్య మధ్యలో ఇష్టమైనవి తింటూనే, సుగర్ని దూరం పెట్టండి. రాత్రి పూట తొందరగా భోజనం ముగించండి.కచ్చితంగా ఉండాలి. బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించేటప్పుడు ఇది అవసరం. ఆహారం, వాకింగ్, వ్యాయామం, నీరు తీసుకోవడం, నిద్ర అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక వేళ కొంచెం ఎక్కువ ఫుడ్ తింటే ఎక్కువ వ్యాయామం చేయాలని నిబంధనను మనకు మనం విధించుకోవాలి. View this post on Instagram A post shared by Diksha - Certified Nutritionist | Integrative Health Coach | (@a.l.i.g.n_) దీక్ష -ఆహారంఉదయం పానీయం: ధనియాలు, సెలెరీ గింజలు ,అల్లం, జీరాతో చేసిన వాటర్ అల్పాహారం: 2 గుడ్లు , కొన్ని ఉడికించిన పుట్టగొడుగులు, కూరగాయలు , పుదీనా చట్నీతో పెసరట్టుటిఫిన్కి, భోజనానికి మధ్య : బాదం పాలు కాఫీ. కొబ్బరి నీళ్లు ఇది కూడా ఆప్షనల్.లంచ్: చికెన్ , హమ్మస్ (ఉడికించిన బఠానీవెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం , ఉప్పు కలిపిన మిశ్రమంపై కొద్దిగా ఆలివ్ ఆయిల్ చల్లాలి) సలాడ్.సాయంత్రం స్నాక్: అవసరం అనుకుండే గుప్పెడు వేయించిన శనగలు, ఏదైనా పండు, అయిదారు నట్స్డిన్నర్ : బాగా ఉడికిన చికెన్ . పాలకూర సూప్, 1/2 కప్పు ఉడికించిన మొలకలుబరువు తగ్గడాన్ని ప్రభావితం చేసే విషయాల్లో ఆహారం ఒక్కటేకాదు. ఇతర అంశాలు కూడా ఉన్నాయంటూ దీక్ష చెప్పుకొచ్చింది. బరువు తగ్గే క్రమంలో ఆహారం ఒక భాగం. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, సరైన నిద్ర చాలా అవసరం. వారానికి 4-5 రోజులు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయండి.రోజుకు 10 వేల అడుగులు నడవాలి. ప్రతిరోజూ 3 లీటర్ల దాకా కు నీరు త్రాగాలి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. ముఖ్యమైనవి, పెద్దగా పట్టించుకోనివి నిద్ర ,ఒత్తిడి. నిజానికి ఇవి గేమ్ ఛేంజర్లు అంటుంది దీక్ష. -
కుమారుడి ఒకే ఒక్క మాటకోసం : ఏకంగా 22 కిలోలు తగ్గాడు!
పిల్లలకోసం, పిల్లల కోరికమేరకు కొండ మీది కోతిని తెమ్మన్నా తేవడానికి సిద్ధంగా ఉంటారు తల్లిదండ్రులు. పిల్లల సంతోషం కోసం ఎంత కష్టమైనా భరించడానికి సన్నద్దమవుతారు. అలా 40 ఏళ్ల తండ్రి చేసిన సాహసం గురించి వింటే ఔరా అంటారు. నిబద్దతతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా అంతటి ఆశ్చర్యకరమైన స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి మరి..సుమిత్ దబాస్ (40) రీటైల్ మేనేజర్‌గా పనిచ్తేస్తున్నారు. తన ఆరోగ్యం గురించి లేదా శరీరం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అప్పటికి అతను బరువు 90 కిలోలు. గతంలో ఉన్నంత బలం లేదు. అయితే ఏడేళ్ల కుమారుడి కోరిక మేరకు 40 ఏళ్ల వయసులో సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గి సిక్స్‌ప్యాక్ బాడీ సాధించాడు అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా ఏమీ సాగలేదు. క్రమశిక్షణతో ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని, వ్యాయామం సాయంతో అనుకున్నది సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతకీ కొడుకు కోరిక ఏమిటంటేకానీ అతని కొడుకు నివాన్ ఒక రోజు తండ్రిని చూసి "నాన్న, మీ బలమైన శరీరాన్ని ఎప్పుడూ చూడలేదు. మీరు మళ్ళీ ఫిట్ బాడీని పొందగలరానా స్నేహితులకు చూపించాలని ఉంది’’ అన్నాడు. అంతే ఎలి అయినా సిక్స్ ప్యాక్‌తో ఫిట్ బాడీ సాధించాలనుకున్నాడు.సుమిత్‌కు క్రికెట్ అతనికి ఇష్టమైన ఆట. కానీ అంత పెద్ద భారీ కాయంతో క్రికెట్ ఆడే ఓపిక లేదు. ప్రొఫెషనల్ పర్సనల్ ట్రైనర్ అయిన సుమిత్, తన బరువు తగ్గే ప్రయాణంలో, మనస్తత్వాన్ని మార్చుకోవడం ముఖ్యమని కూడా అర్థమైంది. View this post on Instagram A post shared by Sumit Dabas (@sumitdabas2020)తొలి అడుగుతొలి ఆరు నెలలు విపరీతంగా కష్టపడ్డాడు. కానీ చాలా అర్థమైంది. జీవనశైలి మార్పులుతో 15 కిలోల బరువు తగ్గి 90 కాస్త 75కి వచ్చింది. కానీ ఇంకా తగ్గాలి. కండలు రావాలి. సిక్స్ ప్యాక్ బాడీ రావాలంటే, ప్రొఫెషనల్ ట్రైనర్ అవసరమని గ్రహించాడు.హేమంత్ అనే ఫిట్నెస్ కోచ్ ఆధ్వర్యంలో ట్రాక్‌లోకి వచ్చింది. అధిక ప్రోటీన్, తక్కువ కేలరీల ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఇక వ్యాయామం విషయానికి వస్తే, సుమిత్ హెవీ ఎక్సర్సైజ్ల మక్కువ పెంచుకున్నాడు. ఇదే కండల నిర్మాణంలోనూ మొత్తం శారీరక రూపాన్ని అందంగా మార్చడంలో తోడ్పడింది అంటాడు కండలు తిరిగిన దేహంతో సుమిత్.మొత్తానికి ఏడాది కష్టం తరువాత ఇపుడు సుమిత్ బరువు 68 కిలోలు. తన కొడుకుకు గర్వకారణమైన తండ్రిగా నిలిచాడు. తన పిల్లలతో ఆడుకోవడమైనా, తనకు ఇష్టమైన క్రీడ క్రికెట్ ఆడటమైనా, గతంలో కష్టంగా కాకుండా, ఇష్టంగా,హాయిగా ఆడుతున్నాడు. ఈ వెయిట్ లాస్ జర్నీలో సహకరించిన కుటుంబానికి, కోచ్‌కీ సుమిత్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతి దశలోనూ తన భార్య , కుమార్తె ప్రోత్సహించారని, నివాన్ ఉత్సాహం తన బరువు తగ్గే ప్రయాణాన్ని సులభతరం చేసిందని సుమిత్ చెప్పాడు.బరువు తగ్గాలనుకునే వారికి సుమిత్ ఇచ్చే చిట్కాలు ఏమిటి?చీట్ మీల్ తీసుకున్నా లేదా అప్పుడప్పుడు వ్యాయామం దాటవేసినా పెద్దగా బాధపడకండి. చేయాల్సిన దానిపై దృష్టిపెట్టి, ముందుకు సాగండి. పట్టుదలగా లక్ష్యం వైపు సాగండికుటుంబం, స్నేహితులు , కోచ్ సహాయం తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది...బరువు తగ్గడం అనేది రాత్రికి రాత్రే అయ్యే పనికాదు. సుదీర్ఘకాలంపాటు పట్టుదలగా క్రమశిక్షణతో చేయాలి.ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి, ఏ దశలోనూ ప్రయత్నాన్ని వదులుకోవద్దు. -
37 కిలోలు తగ్గి, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన గృహిణి
వెయిట్ లాస్ జర్నీ అంత ఈజీగా సాగదు. మరీ ముఖ్యంగా పెళ్లి, పిల్లలు తరువాత విపరీతంగా పెరిగిన బరువును తగ్గించుకోవడం మహిళలకు కత్తిమీద సామే. ఎంతో పట్టుదల కావాలి. అలా 37 కిలోల బరువును తగ్గించుకొని ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా అవతరించిందో గృహిణి. అసాధ్యం కాదు అనుకున్న దాన్ని సాధ్యం చేయడంలో ఉన్న కిక్కే వేరు అంటున్న ఆ గృహిణి గురించి తెలుసుకుందామా...!బరువు తగ్గే క్రమంలో 36 ఏళ్ల తనుశ్రీ అనే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది. అంకితభావం , పట్టుదలతో ఆమె సాధించిన విజయంపై ప్రశంసలు లభించాయి. View this post on Instagram A post shared by Tanusree Srcd (@livefitwithtanu) బాల్యం నుంచీ బొద్దుగానే ఉం డే తనుశ్రీ తన ఇరవైలలో,ముఖ్యంగా గర్భం దాల్చిన తర్వాత బాగా బరువు పెరిగిపోయింది. దీంతో పెరిగిన తన శరీరాన్ని చూసుకొని ఆశ్చర్యపోయింది. దీంతో తన కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిపోతున్నాయని గమనించింది. తన ఆరోగ్యం, విశ్వాసాన్ని తిరిగి పొందాలని నిశ్చయించుకుని రంగంలోకి దిగింది. View this post on Instagram A post shared by Tanusree Srcd (@livefitwithtanu) తల్లిగా, గృహిణిగా ఇంటి బాధ్యతలను మోస్తూనే గత ఆరేళ్లకుపైగా పట్టుదలగా ఆహార నియమాలు, ఇంట్లోనే సులువైన వ్యాయాయాలు ఆచరించింది. తాను అనుకున్నది సాధించింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే వెనక్కి తగ్గలేదు. ఒక ప్రణాళికగాబద్దంగా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటూ, గృహోపకరణాలతోనే క్రియేటివ్‌గా వ్యాయామాలను చేసింది. జీవనశైలి మార్పులతో పాటు స్వీయ సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చింది. తను అనుకున్న ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకుంది.ఈ వీడియో చేసిన నెటిజన్లు ఆమెను కొనియాడారు. భలే చేంజ్ కనిపించింది. శారీరకంగా , మానసికంగా తన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే, ప్రేమించే వ్యక్తి కంటే అందమైనది ఇంకేముంటుంది. మంచి పనిచేస్తున్నారు..ఇలాగే ముందుకెళ్లండి అంటూ ఆమె ఫాలోయర్లు ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. ‘‘ఇంతకు ముందులా గృహస్థంగా, అమాయకంగా కాకుండా, ఇపుడు నమ్మకంగా, బలంగా, అందంగా కనిపిస్తున్నారు.కష్టే ఫలి అంటే ఇది కొందరు వ్యాఖ్యానించారు. "అద్భుతం, మీలోని మార్పు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ స్ఫూర్తి చాలా ప్రశంసనీయం నా భార్య కూడా 2018 సంవత్సరంలో అచ్చం ఇలాంటి విజయాన్నే సాధించిందని మరో యూజర్ కామెంట్ చేశారు. -
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
మనిషి కాస్త లావుగా ఉంటే.. బాడీ షేమింగ్ చేస్తూ హేళన చేసే సమాజం ఇది. అయితే తమ కొవ్వును కరిగించుకుని.. తమలాంటి మరెందరో భారీకాయులకు స్ఫూర్తిని కలిగించిన వాళ్లు మన చుట్టూరానే కనిపిస్తుంటారు. వాళ్లలో గాబ్రియల్ ఫెయిటస్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ జర్నీ ఇప్పుడు అర్థాంతరంగా ముగిసింది.ఈ లడ్డూ బాబు(Laddu Babu) ఏకంగా 174 కేజీల బరువు తగ్గి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. బ్రెజిల్‌కు చెందిన గాబ్రియల్ ఫెయిటస్. ఓ టీవీ షో ద్వారా అతని వెయిట్‌లాస్ జర్నీ పాపులర్ అయ్యింది. బరువు తగ్గాలనుకువాళ్లెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ‘‘హాయ్.. నాపేరు గాబ్రియల్(Gabrial). వయసు 29 ఏళ్లు. ఒకప్పుడు నేను 320 కేజీల బరువు ఉండేవాడిని. ఎలాంటి సర్జరీలు లేకుండా, మందులు వాడకుండా బరువు తగ్గేందుకు నేను ప్రయత్నించా. ఆ ప్రయాణం మీరు చూడడండి..’’ అంటూ ఎనిమిదేళ్ల కిందట అతను పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. 2017లో ‘ప్రోగ్రామ డు గుగు’లో విరౌ ఔట్రా పెస్సావో(మరో వ్యక్తిగా మారడం) సెగ్మెంట్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడితను. అంతేకాదు.. బరువు తగ్గాలనుకునే ఎందరికో అతని పాఠాలు స్ఫూర్తిగా నిలిచాయి కూడా. View this post on Instagram A post shared by Gabriel Freitas (MUP) (@mupgabriel)అయితే ఆ తర్వాత ఆ ఫేమ్ ఎంతో కాలం నిలవలేదు. తండ్రిని, సోదరుడిని కోల్పోయాక మానసికంగా కుంగిపోయాడు. ఆ బాధలో లడ్డూ బాబు మునుపటి అంతలా కాకపోయినా కాస్త బరువు పెరిగాడు. చివరకు డిసెంబర్ 30వ తేదీన నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని అతని స్నేహితుడు ప్రకటించారు. ‘‘మా వాడి మనసు బంగారం. ఎందరికో వాడి ప్రయాణం ఇన్స్పిరేషన్. అలాంటోడు ఏ నొప్పి లేకుండా ప్రశాంతంగా నిద్రలోనే కన్నుమూశాడు’’ అని చెబుతున్నాడను. VIDEO CREDITS: Headline Stream -
ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..
బరువు తగ్గేందుకు ప్రస్తుతం రకరకాల డైట్లు ట్రెండ్ అవుతున్నాయి. కొందరు మాకు ఆ డైట్ పనిచేసింది, తొందరగా బరువు తగ్గామని చెప్పేస్తుంటే.. ఏది ఫాలో కావాలో తెలియని గందరగోళం ఎదురవ్వుతోంది. పోనీ అవి ఫాలో అయినా.. బరువు తగ్గలేదని కొందరు వాపోతుంటే..ఇదేంట్రా దేవుడా అనిపిస్తుంటుంది. ఇలాంటి అనుభవం చాలామందికి పరిచయమే. అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నప్పటికీ.. మొక్కవోని దీక్షతో బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అవేమీ వద్దు ఈ డైట్ ఫాలోకండి అంటూ కనివినీ ఎరుగని విధమైన ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకొచ్చాడు. తెలిస్తే మాత్రం ఇదా..! అతడి సీక్రెట్ అని విస్తుపోవడం ఖాయం. అమెరికాకు చెందిన నిక్ జియోప్పో జస్ట్ ఒక్క ఏడాదిలో 48 కిలోలు బరువు తగ్గి అందరూ ఆశ్చర్యపోయే రీతీలో స్లిమ్‌గా తయారయ్యాడు. అంతేగాదు వెయిట్ లాస్ జర్నీలో స్ఫూర్తిగా నిలిచాడు. బరువు తగ్గడం అనేది క్రమానుగుణంగా జరిగితేనే సత్ఫలితాలిస్తుందని చెబుతున్నాడు నిక్. అతను సోషల్ మీడియాలో చెప్పే చిట్కాలు, ప్రముఖలు చెప్పే ప్రతి డైట్‌ని ఫాలో అయ్యేవాడనని, ఐతే మొదట్లో బరువు తగ్గినా.. సరైన లక్ష్యం మాత్రం చేరుకోలేకపోయినట్లు తెలిపాడు. ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న ప్రతీ డైట్‌ని ఫాలో అయినట్లు చెప్పాడు. ఐతే అవేమీ తనకు మంచి ఫలితాన్ని అందివ్వకపోగా, ఆహారంపై నియంత్రణ లేకపోవడం, తినలేకపోతున్న బాధ ఇంకా ఎక్కువయ్యాయని వెల్లడించారు. తనకు ఈ ప్రయత్నాల వల్ల తెలిసిందేంటంటే..ఎవ్వరు బరువు తగ్గాలన్నా.. ముందుగా మానసికంగా మైండ్‌ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత తినడంలో కామెన్ సెన్స్‌తో వ్యవహరించాలి. అప్పుడే మనం ఎలాంటి డైట్‌ని అనుసరించినా.. మంచి రిజల్ట్ వస్తుందని చెబుతున్నాడు. తాను మాత్రం కామెన్ సెన్స్ డైట్‌ని ఫాలో అయ్యి తొందరగా బరువు తగ్గినట్లు తెలిపాడు నిక్కీ.కామెన్ సెన్స్ డైట్ అంటే..ఏం తింటున్నామో.. దానిపై ధ్యాస ఉండాలి. తగ్గాలి కాబట్టి తక్కువగా తినాలనుకోవద్దు. ఆరోగ్యం కోసం మితంగా తింటున్నా అనే భావనతో మొదలుపెట్టాలి. నోరు ఎండబెట్టేసుకునేలా కఠిన పత్యం వద్దు. ఇష్టమైన వాటిని హాయిగా తినేసి..మరుసటి రోజు అందుకు తగ్గట్టు వర్కౌట్లు లేదా కాస్త డైట్ ఎక్కువగా పాటించాలి. అలా అని శృతిమించేలా తినొద్దు. కేవలం నచ్చిన పదార్థాలు దూరం చేసుకోకండా ఆరోగ్యంగా తినేలా ప్రాధాన్యత వహించండి. తింటున్నప్పుడు కాస్త కామెన్ సెన్స్‌తో వ్యహరించండి చాలు. ఇలా చేస్తే..బరువు తగ్గడం ఏమంత కష్టం కాదని నమ్మకంగా చెబుతున్నాడు నిక్. ఇది తన అనుభవాల ద్వారా తెలుసుకున్న సత్యం అని అంటున్నాడు. పెద్దలు అన్నట్లు అనుభవపూర్వకంగా నేర్చుకున్న జ్ఞానానికి మించి ఏదీ లేదన్నట్లుగా..స్వతహాగా శరీరానికి సరిపడే విధంగా అనుసరించే డైటే మేలు అని చాటిచెప్పాడు కదూ..!. View this post on Instagram A post shared by Nick Geoppo • Weight Loss Coach (@nickgeoppo)గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం. (చదవండి: అంతర్జాతీయ మోడల్ హఠాన్మరణం.) -
నాలుగు చిట్కాలతో 18 కిలోలు : ఇన్ఫ్లూయెన్సర్ వెయిట్ లాస్ జర్నీ
అధిక బరువు తగ్గించుకోవాలని, స్లిమ్‌గా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ప్రణాళికా బద్ధంగా ప్రయత్నించి సక్సెస్ సాధిస్తారు. ఇందులో ఒక్కొక్కరి సక్సెస్ ఒక్కోలా ఉంటుంది. అలా పట్టుదలగా సాధన చేసిన ఇన్ఫ్లూయెన్సర్ తన బరువును తగ్గించుకొని, ఆరోగ్యంగా మారింది. ఎలా? తెలుసుకుందాం...రండి!అనేక రకాల ఆహార, వ్యాయామ నియమాలు ప్రచారంలోఉన్నాయి. వీటిల్లో ఏది పాటించాలో తెలియక, చాలామంది గందరగోళంలో పడి పోతారు. ఇవన్నీ చూశాక బరువు తగ్గడం కష్టం రా బాబూ అని ఊరుకుంటారు. మరికొంత మంది బరువు తగ్గించుకునే క్రమంలో విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు మాడీసే అనే మహిళ. తన విజయాన్ని సోషల్ మీడియాలో పంచుకొని మరో నలుగురికి ప్రేరణగా నిలిచింది. View this post on Instagram A post shared by @madyy_tseyఇన్‌స్టాలో తన వెయిట్ లాస్ జర్నీని షేర్ చేసింది. మేడీ. 4 దశల ఫార్ములా, వర్కౌట్స్, ఆహార నియమాలతో 18 కిలోల బరువు తగ్గించుకున్నట్టు తెలిపింది. అనుకున్న ఫలితం పొందాలంటే.. దీర్ఘకాలిక ఆచరణ, కచ్చితమైన యాక్షన్ ప్లాన్ ఉండాలని చెప్పింది. ఫిట్నెస్ , వెల్నెస్ రెండింటి మేళవింపుతో బరువు తగ్గించుకోవాలని సూచించింది. మాడీ సే పాటించిన నాలుగు సూత్రాలుకంబైన్డ్ స్ట్రెంత్ ట్రైనింగ్ & కార్డియో (వారానికి 4-6 సార్లు)కండరాలు బలంగా ఉండేందుకు జీవక్రియను పెంచుకునేందుకు కార్డియోతో పాటు పవర్ ట్రైనింగ్ఈ కాంబో కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది, మొత్తం ఫిట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది.రోజుకి 2-3లీటర్లు నీళ్లు తాగడంపుష్కలంగా నీరు తాగడ వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఎనర్జీ వస్తుంది. విష పదార్థాలు తొలగిపోతాయిజీర్ణక్రియకు మద్దతు ఇస్తుందిసమతుల్య ఆహారం80 శాతం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, 20 శాతంమాత్రమే ఇష్టమైన అనుకూలమైన ఫుడ్ తీసుకోవాలి. ఫలితంగా అవసరమైన విటమిన్లు , మినరల్స్ శరీరానికి అందుతాయి, అదే సమయంలో స్వల్ప పరిధిలో మిగిలిన ఆహారం, ట్రీట్స్ ఎంజాయ్ చేయొచ్చు.ప్రతి 10 రోజులకు ఫోటోలుసాధారణ ఫోటోలు తీసుకుని చూసుకుంటూ ఉంటే అసలు విషయం తెలుస్తుంది. ఉత్సాహం వస్తుంది. కండరాల బలం, హార్మోన్ల మార్పులను పరిశీలించుకోవాలి. అలాగే కామెంట్లు కూడా చాలా ముఖ్యం.శరీర ఆకృతి, మార్పులను చూసుకోండం తనను సరియైన్ దారిలో నడవటానికి ఉపయోగపడింది అని చెప్పింది. అలాగే ఈ వెయిట్ లాస్ జర్నీలో కఠినంగా ఉండాలని ఓపిగ్గా ఫలితాల కోసం ఎదురు చూడాలని కూడా ఆమె వెల్లడించింది. View this post on Instagram A post shared by @madyy_tsey -
చిట్టి లవంగం : గట్టి లాభాలు, బరువు కూడా తగ్గొచ్చు!
లవంగం అనగానేపురాతన కాలం నుంచి వంటలలో వాడే మసాలాగా మాత్రమే గుర్తొస్తుంది. అలాగే పంటినొప్పులకు వాడే లవంగ తైలం గురొస్తుంది. వాస్తవానికి మసాలా దినుసు లవంగాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఔషధ గుణాలున్న లవంగ మొగ్గను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చలి విపరీతంగా ఉన్న ప్రస్తుతం తరుణంలో లవంగాలు చాలా కీలకంగా పనిచేస్తాయి.ఆహారానికి మంచి రుచి, వాసన ఇచ్చే లవంగాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అనేక రోగాల బారి నుండి కాపాడుకునేందుకు లవంగాలు ఉపయోపడతాయి. ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తాయి. లవంగాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. రోజుకి రెండు లవంగాలను నమలడం వల్ల బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు.ప్రధాన ప్రయోజనాలు లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువముఖ్యమైన పోషకాలూ లభిస్తాయికడుపులోని అల్సర్లను తగ్గిస్తుంది.కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.చెడు బ్యాక్టీరియాను మన దరి చేరకుండా కాపాడుతుంది.రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.శీతాకాలంలో లవంగాలలో ఉండే విటమిన్ ‘సి’ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను లవంగం దూరం చేస్తుంది. శీతాకాలంలో లవంగాల తయారు చేసిన టీ తాగితే జలుబు, గొంతునొప్పి, శ్వాసకోస సమస్యలు, దగ్గ లాంటివాటికి ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు దరి చేర నీయవు. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు పొడిదగ్గు, కఫంతో బాధపడే వారికి చాలామంచిది. కఫం సమస్య బాగా తగ్గుతుంది. ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.లవంగాలలో యుజైనాల్ అనే మూలకం యాంటీసెప్టిక్ లా పనిచేస్తుంది. పళ్ళ చిగుళ్ళను కాపాడుతుంది, పంటి సమస్యల నివారణలో పనిచేస్తుంది. లవంగాలను నమలడం వల్ల పంటినొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది.ఇతర నొప్పుల నివారణలో కూడా ఇది మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్‌గా లవంగాలను వాడడం వల్ల ఉపశమనం కలుగుతుంది. లవంగాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది.చర్మ దురదలను తగ్గించడంలో పెట్రోలియం జెల్లీ, ప్లేసిబో కంటే లవంగం నూనె బాగా పనిచేస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. ఇదీ చదవండి: భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్ -
నటి నిమ్రా ఖాన్ క్రాష్ డైట్: ఇది ఆరోగ్యకరమేనా...?
34 ఏళ్ల పాకిస్తాన్ నటి నిమ్రా ఖాన్ హాస్య ధారావాహిక కిస్ దిన్ మేరా వియా హొవేగాలో చిన్న పాత్రతో యాక్టింగ్ వృత్తిని ప్రారంభించింది. అలా నెమ్మదిగా మెహెర్బాన్, ఉరాన్, ఖూబ్ సీరత్, మే జీనా చాహ్తీ హూన్ వంటి ప్రముఖ టెలివిజన్ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె ఇటీవల చాలా తక్కువ వ్యవధిలో స్లిమ్‌గా మారి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాను ఇంతలా బరువు ఎలా తగ్గిందో కూడా వివరించింది. దీంతో ఒక్కసారిగా అందరిలో ఇలా.. వేగవంతంగా బరువు తగ్గించే పద్ధతులు మంచివేనా..? అనే సందేహం మెదిలింది. అయితే ఈ విధానంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో సవివరంగా చూద్దామా..!.పాక్ నటి ఇమ్రా ఖాన్ తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. తాను క్రాస్డైట్తో కేవలం ఏడు రోజుల్లోనే ఎనిమిది కిలోలు బరువు తగ్గినట్లు తెలిపింది. అలాగే తాను ఈ డైట్‌ని ఎలా ఫాలో అయ్యిందో కూడా వివరించింది. బరువు తగ్గడానికి సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే గాక నిబద్ధతతో డైట్ ఫాలో కావాలని చెప్పుకొచ్చింది. తాను ఆహారంలో కేవలం తెల్లసొన, యాపిల్స్, గ్రీన్ టీ, వెజిటబుల్ జ్యూస్‌లు మాత్రమే తీసుకుని, పూర్తిగా కార్బోహైడ్రేట్లను నివారించానని తెలిపింది. ఇలా.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇదే దినచర్య అని పేర్కొంది. అందువల్లే కేవలం ఏడు రోజుల్లోనే ఎనిమిది కిలోలు బరువు తగ్గినట్లు వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే తేనె, నిమ్మకాయ, చియా గింజలు కలిపిన గోరువెచ్చని నీటితో ప్రతిరోజూ ప్రారంభించాలని చెప్పింది. అయితే ఇది ఏడు రోజుల డైట్ ప్లాన్ అని..చాలావరకు అందరూ మూడు రోజులు స్ట్రిట్‌గా ఫాలోఅయ్యి, ఆ తర్వాత మధ్యలోనే స్కిప్ చేసేస్తుంటడంతో మంచి ఫలితాలు పొందలేకపోతుంటారని చెప్పుకొచ్చింది. బరువు తగ్గడానికి ఇది సరైనదేనా..?నటి నిమ్రా డైట్ ప్లాన్ త్వరితగతిన ఫలితాలు ఇచ్చినప్పటికీ.. బరువు నిర్వహణకు ఇది సరైన ఆరోగ్య విధానం కాదని చెబుతున్నారు నిపుణుల. ఇలాంటి క్రాష్ డైట్లు తరుచుగా కొవ్వు తగ్గడం కంటే..శరీరంలోని నీటి శాతాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దీంతో హర్మోన్ల అసమతుల్యత, జుట్టు రాలడం, చర్మ సమస్యలు వంటి దుష్ప్రభావాలనకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.అలాగే ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్ ఆహారంలో చేర్చే ప్రయత్నం చేస్తే.. విపరీతమైన బరువు పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరించారు. ముఖ్యంగా హర్మోన్ల మార్పులు, పిత్తాశయ రాళ్లు, మానసిక కల్లోలం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. మంచి ఫలితాల కోసం నిధానంగా బరువు తగ్గించే ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ డైట్లు మంచివని అన్నారు. వీటితో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడమే గాక ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండేలా రోగ నిరోధకశక్తి వృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు.(చదవండి: బ్రెస్ట్ కేన్సర్: తొలిదశ గుర్తింపే అతిపెద్ద సవాలుగా..!) -
‘సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్'తో అంతలా బరువు తగ్గొచ్చా..!
వెయిట్ లాస్ జర్నీలకు సంబంధించి ఎన్నో స్టోరీలు చూశాం. వాళ్లంతా ఆయా ఫిట్నెస్ కోచ్‌ల సూచనల మేరకు రకరకాల డైట్లు ఫాలో అయ్యారు. కానీ ఈ వ్యక్తి మాత్రం మన సౌత్ ఇండియన్ డైట్‌తో అలా ఇలా కాదు ఏకంగా 35 కేజీల వరకు బరువు తగ్గి శెభాష్ అనిపించుకున్నారు. ఈ డైట్ వల్లే తన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోగలిగారట. అంతలా బరువు తగ్గిపోయేలా చేసిన ఈ డైట్ ప్రత్యేకతలేంటీ? ఎలాంటి ఆహారాలు తీసుకుంటారు తదితరాల గురించి చూద్దామా..!.జితిన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రాం వేదికగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేశారు. ఒక్కసారిగా ఈ పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆయన ఆ పోస్ట్‌లో సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్‌తోనే బరువు తగ్గినట్లు చెప్పడమే కారణం. అది కూడా 105 కేజీల ఉన్న వ్యక్తి జస్ట్ ఈ డైట్‌తో ఏకంగా 70 కిలోల వరకు తగ్గడంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. జితిన్ తన పోస్ట్‌లో ఆ డైట్ ప్లాన్‌కి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకునేవారో కూడా సవివరంగా వెల్లడించారు. డైట్ ప్లాన్:జిత్న దినచర్య ఉదయం 6.30తో గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లతో మొదలయ్యింది. బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు గుడ్లు, రెండు సాంబార్ ఇడ్లీలు లేదా మొలకెత్తిన పెసలు, ఒక దోసె తీసుకునేవాడు. మధ్యమధ్యలో అంతగా తినాలనిపిస్తే.. కప్పు మజ్జిగ, వేరుశెనగప్ప్పలు తినేవాడినని చెప్పారు జితిన్. ఇక భోజనంలో బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్. దానిలోకి పప్పు, కొబ్బరి వేసిన కూరగాయలు. వందగ్రాముల చికెన్ లేదా చేపలు తీసుకునేవానని అన్నారు. ఇక సాయంత్రం స్నాక్స్‌గా గ్రీన్ టీ, ఉడికించి గుడ్డులోని తెల్లసొన లేదా కాల్చిన చిక్పీస్(బఠానీలు) తినేవాడినని చెప్పుకొచ్చారు. ఇక డిన్నర్లో మిల్లెట్ దోస లేదా గోధుమ దోస, బచ్చలి కూర లేదా మునగ సూప్. అది కాకుంటే.. కాల్చిన చేప లేదా చికెన్ లేదా రాజ్మ కూర విత్ రోటీలతో పూర్తి చేసేవాడినని తెలిపారు. అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చిన పసుపు పాలల్లో ఒక టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్ కలిపి తీసుకునే వాడనని తన వెయిట్ లాస్ జర్నీ గురించి సవివరంగా ఇన్‌స్టాలో వెల్లడించారు.గుర్తించుకోవాల్సినవి:ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడూ డీప్ ఫ్రై లేదా హై క్యాలరీ ఫుడ్ ఐటెమ్స్‌ని ఏ మాత్రం దరిచేరనీయకూడదు. అలాగే కూరల్లో వంటనూనెని కూడా తగ్గించాలి. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటానికి, మంచి జీర్ణక్రియ కోసం ప్రతి పది నుంచి 15 నిమిషాలు నడవాలని చెప్పారు జితిన్. దీనివల్ల బరువు కూడా అదుపులో ఉంటుందన్నారు. (చదవండి: భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!) -
స్లిమ్ సెట్.. డైట్ మస్ట్
ఆధునిక జీవన శైలిలో నగరవాసుల ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. యువత నుంచి మొదలైతే వయోవృద్ధుల వరకు స్లిమ్‌తో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధిక బరువు నుంచి ఉపశమనం పొందాలని, శరీరంలోని అనవసరమైన కొవ్వులు కరిగించాలని తినే ఆహారం తగ్గిస్తున్నారు. మరో వైపు వ్యాయామంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో నీరసించిపోవడం, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నిత్యం మనతోనే ఉండే వారు లావుగా ఉన్నావని ఎత్తిపొడుపు మాటలకు బాధపడి కొంతమంది.. అధిక బరువు ఉన్నారని పెళ్లికి నిరాకరించడం, కాలేజీ, ఉద్యోగ ప్రాంగణంలో ఆకర్షణీయంగా కనిపించాలని మరికొంత మంది.. ఇలా ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి. అవే స్లిమ్ సెట్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. నగరంలో సుమారు 60 శాతం మంది 30 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారే నాజూగ్గా కనిపించాలని ఆరాటపడుతున్నారంటే ఆశ్చర్యం లేదు. మరో 20 శాతం నుంచి 30 శాతం మంది 14 నుంచి 29 ఏళ్ల వయస్కులు ఉండగా, సుమారు 10 శాతం మంది 50 ఏళ్లు దాటిన వారు ఈ తరహా స్లిమ్ సెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కావాలనుకునేవారు పౌష్టికాహారం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మంచిదే.. అయితే.. ఎవరైనా సరే నిపుణుల సూచనలు ఆచరణాత్మకంగా పాటిస్తారో అక్కడే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మితంగా తింటున్నారు.. నాజూగ్గా కనిపించాలని చాలా మంది యువత తిండి తగ్గించేస్తున్నారు. దీనికి తోడు ప్రొసెసింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. శరీరంలో ఉన్న ఫ్యాట్ తగ్గించడానికి డైట్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలి. కొంత మంది ప్రత్యేకంగా నడుము, పొట్ట, చేతులు వంటి ఒక పార్ట్నే లక్ష్యంగా స్లిమ్ చేయాలనుకుంటున్నారు. వారంలో 750 గ్రాముల నుంచి ఒక కేజీ వరకు బరువు తగ్గితే ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం సాధారణ పనులు చేసుకోవడానికి నిత్యం శరీరానికి శక్తి అవసరం. దానికి అవసరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం తగ్గిస్తే దాని ప్రభావం కండలు (మజిల్)పై కనిపిస్తుంది. నీరసం వస్తుంది. ఏ పని చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. వివిధ సంస్థలు ఒక కేజీ బరువు తగ్గడానికి సుమారుగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తీసుకుంటున్నాయి. ప్రొటీన్ పౌడర్ వాడేస్తున్నారు.. చాలా మంది ఈ మధ్య కాలంలో భోజనానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్ పౌడర్ తీసుకుంటున్నారు. ప్రొటీన్ డబ్బా బయట మార్కెట్లో రూ.650 నుంచి రూ.1,500 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆ వ్యక్తి లైఫ్ స్టైయిల్, బాడీ ప్యాటర్న్ బట్టి ప్రొటీన్ పౌడర్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. మూడు పూటలా మీల్ రీప్లేస్మెంట్ ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం మొలకెత్తిన గింజలు, రాగి జావ, తృణధాన్యాలు, ఫైబర్ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అయితే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రం నిపుణుల సూచనల మేరకు తీసుకోవడం మంచిది. ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పోతాయి. ఆ ఆలోచన చేయవద్దు డైట్ నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఒక్కసారి స్లిమ్ అయిపోవాలి.. వేగంగా బరువు తగ్గిపోవాలనే ఆలోచన చేయవద్దు. అది ఒక్క రోజులో వచ్చే ఫ్యాట్ కాదు. మూడు నెలల పాటు హెల్దీ లైఫ్ స్టైల్‌కు అలవాటు పడాలి. వ్యక్తి శరీరానికి ప్రధానంగా ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవసరం. ఉదయం బాడీ డిటాక్సేషన్ కోసం నిమ్మరసం, జీరా నీరు, మెంతుల నీరు, దనియాలు, జీలకర్ర, కాంబినేషన్లో సూచిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రత్యేక మెనూ ఉంటుంది. – బి.కవిత, పౌష్టికాహార నిపుణురాలు, హైదరాబాద్సుమారు 30 కేజీలు బరువు తగ్గాను అధిక బరువుతో ఇబ్బందిగా ఉండేది. వెయిట్ లాస్ కోసం 2023 నుంచి న్యూట్రిషన్ సూచనలు ఫాలో అవుతున్నాను. ఇప్పటి వరకు సుమారు 30 కేజీలు తగ్గాను. అప్పటి ఇప్పటికి చూస్తే మనకి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. బరువుతో బాధపడే సమయంలో నెమ్మదిగా ఉండేది. ఇప్పుడు పిల్లలతో చురుగ్గా పనులు చేసుకోగలుగుతున్నాను. లుక్ వైజ్‌గా చాలా తేడా వచి్చంది. ఫీల్ గుడ్. – వై.నిషిత, కూకట్పల్లి -
కేవలం ఇంటి ఫుడ్‌తో 40 కిలోలు బరువు తగ్గి, అందాల రాశిగా!
స్లిమ్‌గా, అందంగా ఉండాలని అన్ని వయసుల వారు కోరుకుంటారు. అందుకు డైటింగ్ నుంచి జిమ్‌లో కసరత్తులు చేయడం వరకు రకరకాల పాట్లు పడుతుంటారు. ముఖ్యంగా తల్లి అయిన స్త్రీలు ఎదుర్కొనే ఈ సమస్యను చాందినీ సాధించి చూపింది. 39 ఏళ్ల వయసులో ఏకంగా 40 కిలోల బరువు తగ్గి అందాల కిరీటమూ సొంతం చేసుకుంది. ఎవరీ చాందినీ.. ఏమా కథ అనేవారికి బరువు తగ్గించే ఉపాయాలను మూటగట్టి మరీ మనముందుంచుతోంది.అధిక బరువు తగ్గడం కంటే ఈ క్రమంలో చేసే ప్రయాణం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఆరోగ్య సమస్యలను జయించేలా చేస్తుంది, ప్రసవానంతర ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇందుకోసం చేసిన కృషి పట్టుదలను, అంతులేని స్ఫూర్తిని కలిగిస్తుంది. అమెరికాలో ఉంటున్న చాందినీ సింగ్‌కు 39 ఏళ్లు. పిల్లల పాదరక్షల కంపెనీకి కో ఫౌండర్. అంతేకాదు భార్య, తల్లి అయిన చాందినీ ఇటీవలే మిసెస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ యుఎస్ఎ– 2024 అందాల ΄ోటీని గెలుచుకుంది. 5 అడుగుల 8 అంగుళాల పొడవుండే చాందినీ 118 కిలోల బరువుండేది. గర్భవతిగా ఉన్నప్పుడు పెరిగిన బరువు ప్రసవానంతరమూ అలాగే ఉండిపోయింది. డబుల్ ఎక్సెల్ నుంచి ట్రిపుల్ ఎక్సెల్ దుస్తులు ధరించడం వరకు శరీరం పరిమాణం పెరిగింది. ఇంట్లో వండిన ఆహారం, రోజూ చేసే వాకింగ్ అందాల కిరీటం దక్కేలా చేశాయని చాందినీ చెప్పిన విషయాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి.భయాన్ని జయిస్తూ...‘‘విపరీతమైన బరువుతో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో తీవ్రమైన ఆరోగ్య భయాన్ని ఎదుర్కొన్నాను. గర్భవతిగా ఉన్నప్పుడు ఆరు నెలల పాటు వైద్యుల సలహా మేరకు బెడ్‌రెస్ట్‌లో ఉండక తప్పలేదు. దీంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను. ఫలితంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌తో పాటు ప్రీ–డయాబెటిక్ నిర్ధారణ అయ్యింది. దీంతో నియంత్రణ చర్యలు తీసుకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించాను. ఈ వ్యాధి నిర్ధారణ నా ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా చేసింది.బరువుతో పాటు అందానికీ ప్రాధాన్యతబరువు తగ్గడమే కాదు, అందంగానూ కనిపించాలి. దీంతో నా దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించడం మొదలపెట్టాను. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడింది. ఆరోగ్యంగా ఉండటం నా కుటుంబంపై కూడా మంచి ప్రభావం చూపింది. ముఖ్యంగా నా కూతురిని ఆరోగ్యంగా పెంచాలనుకున్నాను. అందుకు నన్ను నేను సెట్ చేసుకోవాలనుకున్నాను. నా కూతురిని జాగ్రత్తగా చూసుకుంటూ, నా ప్రాముఖ్యతను ఆమెకు చూపించాలని కోరుకున్నాను. నా ఆరోగ్యంలో ప్రతి చిన్న మెరుగుదల ఫిట్‌గా, చురుకుగా ఉండాలనే నా అభిరుచిని పెంచింది. పోషకాహారంపై విస్తృతమైన పరిశోధన చేశాక, నా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో స్థిరమైన, దీర్ఘకాలిక మార్పులు చేయడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను.ఫలితంపై కన్నా ప్రక్రియపైనే దృష్టి పొత్తికడుపు కొవ్వును తగ్గించడానికి వ్యాయామాన్ని దినచర్యగా చేసుకున్నాను. ఇందుకు తక్కువ–తీవ్రత, అధిక తీవ్రత గల వ్యాయామాల మిశ్రమాన్ని పాటించాను. వ్యాయామానికి వారంలో 3–4 సార్లు కేటాయించాను. కార్డియో కోసం వాకింగ్, జాగింగ్‌ని కలిపి వెయిట్ ట్రైనింగ్ తీసుకున్నాను. సెలవులు, గాయం, అనారోగ్యం కారణాలతో ఒక వారం, రెండు వారాల పాటు వర్కవుట్లకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. కానీ అది నా కృషిపై ప్రభావం చూపకుండా చూసుకున్నాను. వీలైనంత త్వరగా తిరిగి ట్రాక్‌లోకి వచ్చాను. ఫలితాల కంటే ప్రక్రియపై ఎక్కువ దృష్టి పెట్టాను, ఇది నాకు స్ఫూర్తిగా మారింది. స్థిరంగా ఉండటానికి సహాయపడింది. మొదటి రెండు నెలలు బరువు తగ్గక పోయినప్పటికీ, నా పనిని ఎప్పుడూ వదులుకోలేదు. వెయిటింగ్ స్కేల్లోని నంబర్లు నన్ను డిమోటివేట్ చేయడానికి ఒప్పుకోలేదు. ఫలితం మీద కాకుండా రెగ్యులర్‌గా చేసే నా పనిపైనే దృష్టిపెట్టాను. సవాళ్లను ఎంచుకున్నానుబరువు తగ్గిన తర్వాత శారీరకంగా, బలంగా, మరింత శక్తిమంతంగా బలోపేతమైనట్లు భావించాను. రక్త΄ోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ స్థాయులు బ్యాలెన్స్‌లో ఉన్నాయి. మిసెస్ గ్రాండ్ ఇండియా యుఎస్ఎ– 2024 గురించి తెలిసి, అప్లై చేసుకున్నాను. ఈ అందాల ΄ోటీలో ΄ాల్గొనడం, గెలవడం వంటి కొత్త సవాళ్లను స్వీకరించేలా నన్ను నేను మార్చుకున్నాను. బరువు తగ్గడం నా జీవితంలోని ప్రతి అంశాన్ని – నా ఆరోగ్యం, విశ్వాసం, మనస్తత్వాన్ని మార్చింది. బరువు తగ్గడంలో చేసే ప్రక్రియలు, ఫలితాలు వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంటాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు తమ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా కృషి మొదలుపెట్టాలి. ఫలితం రాలేదని ఎక్కడా వెనకడుగు వేయద్దు. ప్రయత్నాన్ని వదలద్దు’ అని చాందినీ సింగ్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా తన వెయిట్‌లాస్ జర్నీ విశేషాలు పంచుకున్నారు.ఇంటి భోజనమే ఔషధంక్రాష్ డైట్లను అనుసరించడం ద్వారా వేగంగా బరువు తగ్గగలనని తెలుసు. కానీ, దానిని ఎంచుకోలేదు. ఎందుకంటే ఈ డైట్ ద్వారా ఎంత వేగంగా బరువు తగ్గుతున్నానో, అంత త్వరగా తిరిగి బరువు పెరుగుతున్నాను. ఆ అనుభవం నాకు పెద్ద పాఠం. అందుకే క్రాష్ డైటింగ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన, ఇంట్లో వండిన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చాను, అన్నం, రోటీ, పనీర్, చికెన్ కర్రీ వంటి నాకు ఇష్టమైన భారతీయ వంటకాలన్నీ తినడం కొనసాగించాను. ఆహార నియంత్రణ పాటించాను. నా భోజనంలో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్‌ని చేర్చడం ద్వారా క్యాలరీ లోటును కొనసాగించాను. రెస్టారెంట్లలో ప్రత్యేక సందర్భాలలో తినడానికి మాత్రమే పరిమితం చేశాను. వీలైనంత వరకు జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కట్ చేశాను. దీని వల్ల ఆహార ఎంపికల గురించి. బ్యాలెచేసుకోవడం.. బాగా అబ్బింది. (చదవండి: కంటి ఉప్పెనను నవ్వుతో కప్పేసి...) -
‘ఫాస్ట్’గా స్లిమ్ కాకండి!
చాలామంది టీనేజర్లు స్లిమ్‌గా ఉండాలని అనుకుంటారు. అయితే అందుకోసం తమలోని కొవ్వులను దహింపజేసుకోకుండా... కడుపు మాడ్చుకుని తమ కండరాలను (మజిల్ మాస్‌ను) కోల్పోతారు. ఇలా ఫ్యాట్‌ను కోల్పోకుండా మజిల్ మాస్‌ను కోల్పోవడం వల్ల చూడ్డానికి సన్నగా, స్లిమ్‌గా అనిపించినప్పటికీ, ఆరోగ్యపరంగా చేస్తే అది మంచి పరిణామం కాదు. అలా జరగకుండా ఉండాలంటే ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. స్లిమ్‌గా మారి ఆరోగ్యకరమైన సన్నటి దేహాకృతిని పొందాలనుకునేవారు తాము రోజూ తీసుకునే క్యాలరీలను బాగా తగ్గించుకుంటారు. ఇందుకోసం వాటర్థెరపీ, ఫ్రూట్థెరపీ, క్యారట్ థెరపీ, జీఎమ్ డైట్ వంటి అనేక ప్రక్రియలను ఫాలో అవుతుంటారు. ఈ డైట్ రెజీమ్‌లతో తమ ఆహారంలో తీసుకోవాల్సిన పిండిపదార్థాలను బాగా తగ్గించుకుంటారు. దీనివల్ల తాము బాగా బరువు తగ్గుతున్నామని అనుకుంటుంటారుగానీ... తాము తమ కండరాల పరిమాణాన్నీ (మజిల్ మాస్)ను / కండరాల శక్తినీ కూడా కోల్పోతున్నామని గుర్తించరు. కండరాలను కోల్పోతుంటే, దాంతోపాటు ఎముక సాంద్రత (బోన్ డెన్సిటీ) ని కూడా కోల్పోతున్నారని కూడా అర్థం. ఇదెంతో ప్రమాదం. ఆరోగ్యంగా సన్నబడాలంటే... మంచి సౌష్ఠవంతో కూడిన శరీరాకృతిని పొందాలంటే దహించాల్సినది కొవ్వులను మాత్రమే. మన దేహపు అవసరాలకు పనికి వచ్చాక మన పొట్ట చుట్టూ పేరుకుపోయి ‘సెంట్రల్ ఒబేసిటీ’ని కలిగించే కొవ్వులను మాత్రమే. తక్కువ పోషకాలతోనే మెటబాలిజమ్ జరిగేలా దేహానికి అలవాటు చేయడమూ సరికాదు... కొన్నిసార్లు సన్నబడాలనే తీవ్రమైన కోరికతో చాలా తక్కువ క్యాలరీలతోనే జీవక్రియలు కొనసాగేలా దేహానికి అలవాటు చేస్తే... అప్పుడు ఆ కొద్దిపాటి ఆహారంతోనే మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ నిర్వహించుకునే సామర్థ్యాన్ని దేహం పొందుతుంది. ఏళ్ల తరబడి అలా చేశాక కొద్దిపాటి అదనపు ఆహారం తీసుకున్నా అది శరీర బరువును విపరీతంగా పెంచేస్తుంటుంది. దీన్నే ‘రెసిస్టెంట్ ఒబేసిటీ’ అని అంటారు. ఈ రెసిస్టెంట్ ఒబేసిటీ వల్ల దీర్ఘకాలం పాటు చాలా చాలా అందంగా కనిపించిన హీరో, హీరోయిన్లు... కెరియర్‌కు దూరంగా ఉన్నప్పుడు కొద్ది వ్యవధిలోనే ఒకేసారి లావెక్కిపోయినట్లుగా కనిపించడం చాలామంది సెలబ్రిటీల్లో కనిపిస్తుంటుంది. కండరాలను కోల్పోకుండానే కొవ్వులను దహించడం ఎలా? సన్నబడి మంచి శరీరాకృతి (స్లిమ్ బాడీ) పొందాలంటే ప్రణాళికాబద్ధంగా కండరాలను (మజిల్ మాస్‌ను) కోల్పోకుండా, అదనపు కొవ్వులను మాత్రమే దహించే విధంగా, ఆరోగ్యకరంగా సన్నబడాలి. స్లిమ్‌గా ఉండాలంటూ భోజనాన్ని మానేస్తే ఒక్కోసారి అనొరెక్సియా నర్వోజా, బులీమియా లాంటి మానసిక సమస్యలూ రావచ్చు. అందుకే బాగా తింటూనే మంచి ఆరోగ్యం కోసం దేహానికి కాస్త కష్టం కలిగించే వ్యాయామాలు చేస్తుండాలి. అయితే అంతగా మంచి ఫిట్నెస్ లేనివారు మాత్రం దేహానికి విపరీతమైన శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామం చేస్తూ... క్రమంగా ఫిట్నెస్ను సాధించాలి. ఆ తర్వాత స్టామినాను క్రమంగా పెంచుకుంటూపోవాలి. (చదవండి: పిల్లోలు.. పరుపు ఎలా ఉండాలంటే...) -
నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!
చాలామంది బానపొట్టతో ఇబ్బంది పడుతుంటారు. ఏ డ్రెస్ వేసుకోవాలన్న ఇబ్బెట్టుగా ఈ పొట్ట కనిపిస్తుంది. దీన్ని తగ్గించుకోవడం కూడా అంత ఈజీ కాదు. కాస్త శారీరక శ్రమతో పట్టుదలతో కష్టపడితే బెల్లీఫ్యాట్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు జస్ట్ ఈ టీతో నిద్రపోతున్నప్పుడే ఈ ఫ్యాట్‌ని కరిగించేసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ఖ్యాతీ రూపానీ. రాత్రిపూట చిరుతిళ్లకు బదులుగా ఈ బొడ్డు బస్టింగ్ టీని సేవించడం మేలని అన్నారు. ఇంతకీ ఏంటా 'టీ'? అదెలా తయారు చేస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ టీ కోసం..వాము, సొంపు గింజలు: వాము శరీంలోని అధిక నీటి శాతాన్ని తగ్గించి, పొట్ట ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. ఇక సొంపు జీర్ణక్రియకు, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.పసుపు: ఇది ప్రసిద్ధ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్‌హౌస్. ఇది శరీర కొవ్వుని నియంత్రించడంలో సమర్ధవంతంగా ఉంటుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. పైగా పరోక్షంగా బరువుని కూడా తగ్గిస్తుంది. ధనియాలు: ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతాయి. ఇది కూడా బరువు నిర్వహణకు ఉపయోగపడుతుంది. తయారీ విధానం: టేబుల్ స్పూన్ వాము, సొంపు తీసుకోవాలి. దీనికి 1/4 టీస్పూన్ తాజా పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర గింజలను జోడించాలి.ఆ తర్వాత 500-600 ml నీరు పోసి స్టవ్‌పై బాగా మరిగించాలి. 15 నిమిషాల తర్వాత వడకట్టి వేడివేడిగా ఆస్వాదించాలి. ప్రయోజనాలు..హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా PCOS, అడెనోమయోసిస్ సమస్యలకు చెక్ పెడుతుంది. జీవక్రియ, ఇన్సులిన్ పనితీరును మెరుగ్గా ఉంచుతుందిబరువు నిర్వహణకు ఉపయోగపడుతుందిమంచి నిద్రను ప్రోత్సహిస్తుందినిద్రవేళల్లో ఈ టీని ఆరోగ్యకరంగా తయారుచేసుకుని తాగితే బెల్లీఫ్యాట్ కరగడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని పోషకాహారనిపుణురాలు ఖ్యాతీ రూపానీ చెబుతున్నారు.(చదవండి: అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..!) -
అద్భుతమైన ‘5’ టిప్స్‌తో 72 కిలోలు బరువు తగ్గింది!
బరువు తగ్గడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అలాగని అంత కష్టమూ కాదు. బాడీ తత్వాన్ని తెలుసుకుని సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో మనం కోరుకున్న బరువు లక్ష్యాన్ని చేరు కోవచ్చు. ఈ విషయాన్ని అంబర్ క్లెమెన్స్ మరోసారి నిరూపించారు. పట్టుదలగా, నిబద్దతగా కొన్ని రకాల నియమాలను పాటించి రెండేళ్లలో ఏకంగా 160 పౌండ్లు (72 కిలోలు) బరువును తగ్గించుకుంది. అంతేకాదు తగ్గిన బరువును స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ ప్రయాణంలో తాను అనుసరించిన ముఖ్యమైన సూత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Amber Clemens (@amber_c_fitness)విజయవంతంగా బరువు తగ్గడం అనేది అలవాట్లను మార్చుకోవడంతో మొదలవుతుంది అంటుంది అంబర్. అంతకుముందు పిచ్చి పిచ్చిగా డైటింగ్ చేశానని, ఆ తరువాత తాను అనుసరించిన పద్దతి, ఆహార నియమాల మూలంగా చక్కటి ఫలితం సాధించానని తెలిపింది. ముఖ్యంగా ప్రతిరోజూ చేసే ఐదు విషయాలను పంచుకుంది. ప్రతి భోజనంతో కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. అలాగే స్నాక్స్‌గా ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. అలా ఆమె రోజువారీ తీసుకోవాల్సిన ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఎక్కువ నీళ్లు తాగడం చేయడం వలన మంచి ఫలితం సాధించానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన 5 టిప్స్రోజుకి 7-10 వేల అడుగులు నడవడం: చిన్న అడుగులు పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి. రోజూ నడవడం అలవాటుగా చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చు. తన రోజుకి మరింత శారీరక శ్రమ కలిగేలా ఎక్కువగా నడవడం,లిఫ్ట్ లేదా ఎలివేటర్‌కు బదులుగా నడుచుకుంటూ వెళ్లానని అంబర్ చెప్పింది.3 లీటర్ల నీరు తాగడం: హైడ్రేషన్ కీలకం, కనీసం మూడు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంటుందని చెబుతోంది అంబర్.25-30 గ్రాముల ప్రోటీన్: ప్రతి భోజనంతో, అంబర్ కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. స్నాక్స్ కోసం, ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. ఇది ఆమె రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడిందట.ముందస్తు ప్లాన్ : రోజు రాత్రి ఆహారాన్ని ముందస్తుగా తినడం లాంటివి చేసింది. రేపు ఏం తినాలి అనేది ముందుగానే నిర్ణయించుకొని సిద్ధం చేసుకోవడం కూడా ఇందులో భాగంగా పాటించింది.కొద్దిగా స్వీట్: అలాగే స్వీట్స్ తినాలనే తన కోరిక మేరకు రాత్రి డెజర్ట్ లేదా టిఫిన్‌లో కొద్దిగా ఏదైనా తీపిని జోడించినట్టు తెలిపింది. అలాగే వ్యాయామాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేయాలనీ, రోజుకి కనీసం 30 నిమిషాలు, వారానికి నాలుగు సార్లు చేయాలి. దీంతోపాటు మంచి నిద్ర ఉంటే చాలు బరువు తగ్గడం ఈజీ అంటోంది ఈ ఫిట్నెస్ కోచ్. -
స్లిమ్‌గా నటి హిమాన్షి ఖురానా.. పరాఠాలు మాత్రం తప్పనిసరి!
చాలామంది వెయిట్ లాస్ జర్నీలో అంత ఈజీగా విజయవంతం కాలేరు. ఎన్నో డైట్లు, వర్కౌట్ల అనంతరం స్లిమ్‌గా మారతారు. అయితే కొందరు మాత్రం ఏదో మాయ చేసినట్లుగా తక్కువ వ్యవధిలోనే స్లిమ్‌గా అయ్యిపోతారు. అంత సింపుల్‌గా ఎలా బరువు తగ్గించుకున్నారా అని అందరూ ఆశ్చర్యపోతుంటే..వాళ్లు మాత్రం తాము ఏం చేయలేదని ఇంట్లో వండిన భోజనమే తిన్నమని సింపుల్‌గా చెబుతారు. అలాంటి కోవకు చెందిందే ఈ పంజాబీ నటి, మోడల్, గాయని అయిన హిమాన్షి ఖురానా. ఆమె వెయిట్‌లాస్ స్టోరీ తెలిస్తే కంగుతింటారు. ఆమె ఏం చేసిందంటే..హిమాన్షి ఖురానా ఒక హెల్త్ ప్రోగ్రామ్‌లో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. మానసిక ఆర్యోగానికి ప్రాధాన్యత ఇస్తేనే సత్ఫలితాలను పొందగలమని నమ్మకంగా చెబుతుంది. అయితే తాను బరువు తగ్గడం కోసం ఎలాంటి జిమ్‌కి వెళ్లలేదని తెలిపింది. వారానికి రెండు సార్లు మాత్రం పైలేట్స్ వర్కౌట్లు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. సాధారణ ఆహారంతోనే తాను 11 కేజీల వరకు బరువు తగ్గినట్లు వెల్లడించింది. అలాగే ఇష్టమైన ఆహారాన్ని ఎప్పటికీ వదులుకోనని చెబుతోంది. ఇంట్లో వండేవన్నీ తింటుందట. ముఖ్యంగా పరాఠాలంటే మహా ఇష్టమట. ప్రతిరోజు అవి తినకుండా రోజు ప్రారంభమవ్వదని అంటోంది. అయితే ఇటీవల బరువు తగ్గడం అనేది ఓ ట్రెండ్‌గా మారిందని అందుకోసం అనారోగ్యకరమైన మార్గాల్లో ప్రయత్నిస్తున్నారంటూ మండిపడింది. ఇది అస్సలు సరైనది కాదని అంటోంది. బరువు తగ్గడం కంటే ముఖ్యం ఆరోగ్యంగా ఉండటం ప్రధానం అని నొక్కి చెప్పింది. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహిస్తే ఆటోమేటిగ్గా బరువు తగ్గడం జరుగుతుందని అంటోంది. అలాగే ఒత్తిడి, ఆందోళన ఎలా శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో కూడా వివరించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలో పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలకు దారితీసేలా ఒత్తిడికి గురవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. అందువల్ల మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తే.. మొత్తం ఆరోగ్యం తోపాటు అధిక బరువు సమస్యకు కూడా సులభంగా చెక్ పెట్టొచ్చని చాలా సింపుల్‌గా చెప్పేసింది నటి, మోడల్ హిమాన్షి ఖురానా. View this post on Instagram A post shared by 𝓗𝓲𝓶𝓪𝓷𝓼𝓱𝓲 𝓴𝓱𝓾𝓻𝓪𝓷𝓪 (@himanshian_) (చదవండి: నీతా అంబానీకి అత్యంత ఇష్టమైన చీర! ఏకంగా 900 ఏళ్ల నాటి..!) -
క్రికెటర్ రిషబ్ పంత్ వెయిట్ లాస్ సీక్రెట్: ఆ టిప్స్‌తో ఏకంగా 16 కిలోలు..
ఢిల్లీ ఫ్రాంఛైజీతో ఉన్న సుదీర్ఘ అనుబంధానికి వీడ్కోలు పలకనున్నాడు స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల వచ్చే ఏడాది పంత్ లక్నోకు ఆడబోతున్నాడు. రిషబ్ పంత్‌కు వందకు పైగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం ఉంది. పైగా వేలాది పరుగులు కూడా సాధించాడు. ఇక యాక్సిడెంట్ తర్వాత కూడా అందే దూకుడుతో మైదానంలో విధ్వసం సృష్టించాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్‌గా పంత్ నిలిచారు. అలాంటి అద్భుత ఆటగాడి డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందామా..!ఈ భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్ జట్టుకు సిద్ధమవుతున్న సమయంలో కేవలం నాలుగు నెలల్లో 16 కిలోలు బరువు తగ్గాడు. ఇంతలా బరువుని అదుపులో ఉంచుకునేందుకు ఆయన ఫాలో అయ్యే సింపుల్ డైట్ టిప్స్ ఏంటో చూద్దామా..!.కేలరీలు తక్కువగా ఉన్న ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. దీనివల్ల అతని శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వును ఉపయోగిస్తుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉంటుంది.అలాగే ఇంట్లో వండిన బోజనానికే ప్రాధాన్యత. బయట ఫుడ్ జోలికి వెళ్లడు. ముఖ్యంగా రెస్టారెంట్ లేదా హోటల్ ఫుడ్స్ వైపుకి వెళ్లడు. దీనివల్ల ఇంట్లో వండే పద్ధతుల రీత్యా మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవడమే గాక అనారోగ్య సమస్యల బారిన పడకుండా సురక్షితంగా ఉంచుతుంది. ఆయిల్ పరిమితంగా ఉన్న ఆహారమే ఎంపిక చేసుకుంటాడు పంత్అలాగే రాస్మలై వంటి స్వీట్లు, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ వంటి అధిక క్యాలరీల ఆహారానికి పూర్తిగా దూరం. బరువు అదుపులో ఉండేలా వేయించిన పదార్థాలు, చక్కెర సంబంధిత పదార్థాలను తీసుకోరట పంత్. తగిన సమయానికి నిద్ర పోవడం కూడా తన బరువుని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలుస్తోందిగోవాన్ భిండి(ఓక్రా) పట్ల తనకున్న మక్కువ, మసాల దినుసుల తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలా పంత్‌లా ఆగ్యకరమైన డైట్‌కి ప్రాధాన్యత ఇస్తే బరువు తగ్గడం అత్యంత ఈజీ. అందుకు కాస్త శ్రద్ధ, నిబద్ధత అవసరం అంతే..!.(చదవండి: ఆర్బీఐ గవర్నర్‌కి ఛాతినొప్పి: ఎసిడిటీ వల్ల కూడా ఇలా జరుగుతుందా?) -
బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!
ఇంతవరకు ఎన్నో వెయిట్‌లాస్ స్టోరీలు చదివాం. వాళ్లంతా బరువు తగ్గి.. ఎలా స్లిమ్‌గా మారి శెభాష్ అనిపించుకున్నారో చూశాం. కానీ ఇలాంటి అందమైన వెయిట్‌లాస్ స్టోరీని మాత్రం చదివి ఉండరు. ఈ మహిళ అధిక బరువుకి చెక్‌పెట్టి అందాల రాణిగా గెలుపు సాధించింది అందర్నీ ఆశ్చర్యపరిచింది పైగా "గెలుపు" అంటే ఇది అని చాటిచెప్పింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అమెరికాలోని సీటెల్‌లో నివశిస్తున్న 39 ఏళ్ల భారత సంతతి మహిళ చాందినీ సింగ్ యూఎస్ఏ ఆధారిత పిల్లల పాదరక్ష కంపెనీ సహ వ్యవస్థాపకురాలు. ఆమె పీసీఓఎస్ సమస్యలతో గర్భం దాల్చడంలో పలు కాంప్లీకేషన్స్ని ఎదుర్కొంది. ఏదోలా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక ఒక్కసారిగా ఆరోగ్య సమస్యలు చుట్టిముట్టాయి. మూడోనెల నుంచి బెడ్‌రెస్ట్ పేరుతో మంచానికే పరిమితమైపోయింది. దీంతో ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది. ఆ తర్వాత అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ తోసహ ప్రీ డయాబెటిక్ వంటి సమస్యలను ఫేస్ చేసింది. చివరికి డెలివరి అయ్యి.. కోలుకునేందుకు చాలా సమయమే పట్టింది. కానీ దీని కారణంగా అధిక బరువుతో పాటు ఆయా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇలానే ఉంటే భవిష్యత్తులో తన ఆరోగ్యం మరింత దారణంగా దిగజారిపోతుందేమోనన్న భయం మొదలైంది చాందినీలో. ఇక అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది ఎలాగైన బరువు తగ్గాలని. తన ఫిట్నెస్ లక్ష్యాలు చేరుకునేలా క్రమ తప్పకుండా వ్యాయామాలు, ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అయ్యింది చాందినీ. అయితే మొదటి రెండు నెలల్లో తన బరువులో పెద్ద మార్పులు కనిపించకపోయినా..బరువు తగ్గాలనే ఆలోచనకు మాత్రం బ్రేక్ వేయలేదు. డైట్‌ని, వర్కౌట్లని కొనసాగిస్తూ ఉండేది. మరికొన్ని వర్కౌట్ల సెషన్లను పెంచుకునేది. ఒకవేళ రెండు నుంచి ఐదు రోజులు వ్యాయామాలు స్కిప్ అయినా కేలరీలు ఏదో రకంగా ఖర్చు అయ్యేలా చూసుకుంది. అలా సుమారు 48 కిలోల మేర తెలియకుండా బరువు కోల్పోయింది. ప్రస్తుతం ఆమె 70 కిలోల బరువుతో ఉంది. అలాగే ఆమె ఇంతకు ముందు ఫేస్ చేసిన అనారోగ్య సమస్యలన్ని తగ్గుముఖం పట్టాయి. పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉంది. అయితే చాందీని వేగంగా బరువు తగ్గడం కంటే నిదానంగా బరవు తగ్గితేనే ఆరోగ్యకరం అంటోంది. తాను ఇంట్లో వండే భారతీయ భోజనానికే ప్రాధాన్యత ఇచ్చానని, జంక్ ఫుడ్‌ని పూర్తిగా దూరం పెట్టానని చెప్పారు. ముఖ్యంగా రెస్టారెంట్లలో తినడం తగ్గించినట్లు చెప్పుకొచ్చింది. ఇక్కడితో ఆమె వెయిట్ లాస్జర్నీ పూర్తి కాలేదు. ఆమె స్లిమ్‌గా మారి.. యూఎస్ఏ 2024 అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. బరువు తగ్గి ఆరోగ్యాన్ని కాపడుకోవడమే గాక అందలా రాణిగా మెరవచ్చు అని చాటి చెప్పింది. ఇక్కడ బరువు తగ్గడం అనేది అందం, ఆరోగ్యం అని చెప్పకనే చెప్పింది చాందినీ. (చదవండి: హాట్‌టాపిక్‌గా టెక్ మిలియనీర్ డైట్ ! కేవలం భారతీయ వంటకాలే..) -
6-6-6 వాకింగ్ రూల్ పాటిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!
ప్రస్తుతం బిజీ లైఫ్‌లో శారీరక శ్రమ అనేది కాస్త కష్టమైపోయింది. ఏదో ఒక టెన్షన్‌తో రోజు గడిచిపోతుంది. ఇక వ్యాయామాలు చేసే టైమ్ ఏది. కనీసం నాలుగు అడుగులు వేసి వాకింగ్ చేద్దామన్నా.. కుదరని పరిస్థితి. అలాంటి వారు ఈ సింపుల్ 6-6-6 వాకింగ్ రూల్ ఫాలో అయితే చాలు.. సులభంగా వాకింగ్, వ్యాయామాలు చేసేయొచ్చు. మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అత్యంత బిజీగా ఉండే వ్యక్తులకు ఈ రూల్ చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంతకీ అదెలాగంటే..రోజువారీ శారీరక శ్రమను పెంచేలా చిన్న చిన్న.. సెషన్లుగా విభజించే వాకింగ్ రూల్ ఇది. ఏం లేదు..జస్ట్ రోజు ఆరు నిమషాలు ఆరు సార్లు చొప్పున వారానికి ఆరు రోజులు చేయాలి. ఆరు నిమిషాలు చొప్పున నడక కేటాయించండి ఎక్కడ ఉన్నా.. ఇలా రోజంతా ఆరు నిమిషాల నడక..ఆరుసార్లు నడిచేలా ప్లాన్ చేసుకుండి. ఇలా వారానికి ఆరురోజులు చేయండి. ఈ విధంగా నడకను తమ దినచర్యలో భాగమయ్యేలా చేసేందుకు వీలుగా ఈ నియమాన్ని రూపొందించారు. ఆయా వ్యక్తులు తమ సౌలభ్యానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేసుకుంటే చాలు.. సులభంగా వాకింగ్ చేసి..మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రయోజనాలు..హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందిరక్తపోటుని తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెరుగైన మాసిక ఆరోగ్యం సొంతంఈ చిన్న చిన్న వాకింగ్ సెషన్లు ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కీళ్ల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. చాలా చిన్నసెషన్ల నడక అయినప్పటికీ..క్రమం తప్పకుండా వారమంతా చేయడం వల్ల చక్కగా కేలరీలు బర్న్ అయ్యి జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఈ నియమం హృదయ సంబంధ ఫిట్నెస్, మానిసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే అత్యంత ప్రభావవంతంగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంపందించడం మంచిది. (చదవండి: ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!) -
హృతిక్ రోషన్ సోదరి సునైనా వెయిట్ లాస్ స్టోరీ: ఏకంగా 50 కిలోలు..!
చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు స్లిమ్‌గా మారి ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. అలాగే ఆరోగ్యంపై సరైన అవగాన కల్పిస్తున్నారు కూడా. కొంతమంది వారిని ఆదర్శంగా తీసుకుని బరువు తగ్గుతున్నారు కూడా. ఇప్పుడు తాజాగా అదే కోవలోకి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా కూడా చేరిపోయారు. కిలోల కొద్దీ బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సునైనా వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే..బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ కుమార్తె సునైనా బొద్దుగా అందంగా ఉండేది. చాలమందికి తెలుసు ఆమె చాలా లావుగా ఉంటుందని. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతలా స్లిమ్‌గా మారిపోయింది. దాదాపు 50 కిలోలు బరువు తగ్గినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఆమెకు కామెర్లు వంటి ఆరోగ్య సమస్యలున్నప్పటికీ విజయవంతంగా బరువు తగ్గినట్లు వెల్లడించిది. నిజానికి ఆమె గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్‌తో పోరాడుతోంది. ఆమె ఇన్ని అనారోగ్య సమస్యలను అధిగమించి మరీ..బరువు తగ్గేందుకు ఉపక్రమించడం విశేషం. తన అనారోగ్య భయమే తనను సరైన ఆహారం తీసుకునేలా చేసిందంటోంది సునైనా. తాను పూర్తిగా జంక్ ఫుడ్‌కి దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. "సరైన జీవనశైలితో కూడిన ఆహారం కామెర్లు సమస్యను తగ్గుముఖం పట్టేలా చేసింది. అలాగే ఫ్యాటీ లివర్ సమస్య కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యింది. తన తదుపరి లక్ష్యం పూర్తి స్థాయిలో ఫ్యాటీలివర్ని తగ్గిచడమే". అని ధీమాగా చెబుతోంది సునైనా View this post on Instagram A post shared by Sunaina Roshan (@roshansunaina) ఫ్యాటీ లివర్‌తో బరువు తగ్గడం కష్టమా..?ఫ్యాటీ లివర్ అనేది ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఆ సమస్యతో ఉండే వ్యక్తులు బరువు తగ్గడం అనేది అంత ఈజీ కాదు. ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది జీవక్రియ చర్యలకు అంతరాయం కలిగించి బరువు పెరిగేలా చేస్తుంది. పైగా దీర్ఘకాలిక మంట, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీసి కండరాల పనితీరుని, శరీరంలోని శక్తి స్థాయిలను తగ్గించేస్తుంది. ఫలితంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: ఆ కుటుంబంలో 140 మందికి పైగా డాక్టర్లు! ఐదు తరాలుగా..) -
తేలిగ్గా బరువు తగ్గించే దానిమ్మ!
దానిమ్మ గుండెజబ్బులను నివారిస్తుందన్నది చాలామందికి తెలిసిందే. అయితే అది బరువు పెరగకుండా చూడటం వల్ల ఒబేసిటీ కారణంగా వచ్చే అనేక ఆరోగ్య అనర్థాలను కూడా నివారిస్తుంది. దానిమ్మతో బరువు తగ్గడానికి కారణమూ ఉంది. అదేమిటంటే... ఇందులో 7 గ్రాముల పీచు ఉండటం వల్ల అది కడుపు (స్టమక్) ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుతుంది. అంతేకాదు దానిమ్మపండులో 3 గ్రాముల ప్రోటీన్, విటమిన్ సీ, విటమిన్ కె అనే ప్రధాన విటమిన్లతోపాటు పొటాషియమ్ వంటి హైబీపీని నియంత్రించేందుకు సహాయపడే లవణాలూ ఉన్నాయి. తక్కువ చక్కెర, ఎక్కువ పీచు ఉన్నందున బరువు తగ్గించడానికి దానిమ్మపండు బాగా ఉపయోగపడుతుంది.(చదవండి: 'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్నెస్ మంత్ర..!) -
స్ట్రిక్ట్ డైట్ పాటించకుండానే బరువు తగ్గొచ్చు..!
బరువు తగ్గడం అంటే.. స్ట్రిక్ట్ డైట్, వ్యాయామాలు అనే అనుకుంటాం. అందుకే చాలామంది బరువు తగ్గడం విషయమై చాలా భయపడుతుంటారు. కొందరూ ప్రయత్నించి మధ్యలోనే అమ్మో..! అని చేతులెత్తేస్తారు. సెలబ్రిటీలు, ప్రముఖులు, మంచి ఫిట్నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో వెయిట్ లాస్ అవ్వగలరు కానీ సామాన్యులకు సాధ్యం కాదనే భావన ఉంటుంది చాలామందికి. కానీ ఇక ఆ భయాలేమి వద్దంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్, ఫోర్త్ లెవెల్ 4 సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ సుప్రతిమ్ చౌదరి. ఎలాంటి కఠిన ఆహార నియమాలు పాటించాల్సిన పని లేకుండానే తొందగా బరువు తగ్గొచ్చని నమ్మకంగా చెబుతున్నారు. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..!.ఫిట్నెస్ ట్రైనర్ సుప్రతిమ్కు ఇన్‌స్టాలో 10 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేసుకోవడమే గాక తన ఫాలోవర్లకు ఈజీగా బరువు తగ్గే చిట్కాలను గురించి చెబుతుంటారు. View this post on Instagram A post shared by supratim chowdhury (@thesupratim_official) ఇటీవలే తన వెయిట్ లాస్ జర్నీలో దాదాపు 20 కిలోల బరువు వరకు ఎలా తగ్గాననేది కూడా హైలెట్ చేశారు. ఆయన అందుకోసం స్ట్రిక్ట్ డైట్ అవసరం లేదని ఈ అమూల్యమైన ఐదు రూల్స్‌ని పాటిస్తే చాలు తొందరగా బరవు తగ్గిపోతారని అన్నారు. ముందుగా తాను ఎలాంటి నియమాలు పాటించారో వివరించారు. ఆ తర్వాల ఎలాంటి డైట్ లేకుండా ఎలా బరువు తగ్గొచ్చొ వివరించారు. View this post on Instagram A post shared by supratim chowdhury (@thesupratim_official) మొదటిది: రాత్రి ఏడు గంటల్లోపు డిన్నర్ ముగించటం.. రెండు: ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు త్రాగాలి.మూడు: ప్రతిరోజూ 50 శాతం తక్కువగా తినడానికి ప్రయత్నించండి నాలుగు: ప్రతిరోజూ 30-40 నిమిషాలు చాలా సాధారణ వ్యాయామలు ఐదు: ఒత్తడి లేకుండా ఉండటంఈ నియమాలను అనుసరించే తాను బరువు తగ్గగలిగానని సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. అలాగే మరొక వీడియోలో ఎలాంటి కఠిన ఆహార నియమాలు లేకుండా ఎలా బరువు తగ్గొచ్చొ తెలిపారు. దానికి కూడా ఐదు రూల్స్‌ని తప్పనిసరిగా పాటించాలన్నారు. అవేంటంటే.. ఎలాంటి డైట్ లేకుండా.. మొదటిది: ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి.రెండు: భోజన సమయాలను సరి చేయండిమూడు: భోజనంలో అన్ని రకాల మాక్రోన్యూట్రియెంట్లను జోడించాలి(ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, గ్రీన్ సలాడ్లు ఉండాలి)నాలుగు: ఒక్కసారే వడ్డించుకోండి మరోసారి తీసుకునే యత్నం చెయ్యొద్దుఐదు: తినే సమయంలో ఎలాంటి పరికరాలు ఉపయోగించవద్దుఅలాగే ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా చిప్స్, కుకీలు, ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉండమని సూచించారు ఫిట్నెస్ ట్రైనర్ సుప్రతిమ్.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. (చదవండి: ఏం ట్విస్ట్..?: కన్నతల్లి పక్కనే ఉన్నా..! పాపం ఆ కొడుకు..) -
జొన్నలతో అధిక బరువుకు చెక్ : ఇలా ఒకసారి ట్రై చేయండి!
జొన్నలు అనగానే గుర్తొచ్చేది జొన్న సంగటి, జొన్న రొట్టెలు, జొన్న అన్నం. కానీ జొన్నలతో జావకూడా తయారు చేసు కోవచ్చు. జొన్నలను మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. మరి ఈజీగా జొన్న, ఉప్మా, కిచిడీ, జావను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.ఫైబర్-రిచ్ మిల్లెట్ జొన్నల్ని భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా - ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా,మధ్య అమెరికాలో సాగు చేస్తారు. దాదాపు వేల ఏళ్లుగా పేద, గ్రామీణ ప్రజల సాధారణ భోజనంగా ఉండేది. అయితే జొన్నలు పోషకాహారం మాత్రమే కాదు, అధికబరువుతో బాధపడేవారికి మేలు చేస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ బరువు తగ్గడంలో,గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో పనిచేస్తాయి.హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తాయి.శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను ,ఇన్సులిన్ సెన్సిటివిటీని నియంత్రించి డయాబెటిస్ నియంత్రణలో సహాయపపడతాయి వీటితో పాటు, ఫైబర్, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్ జోవర్ అధికంగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ చెప్పవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జొన్నల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది.జొన్నలతో జావజొన్న పిండిని అరకప్పు తీసుకోవాలి, మజ్జిగ ఒక కప్పు, ఉప్పు తగినంత తీసుకోవాలి. జొన్న పిండిలో నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలపాలి. వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగిన తరువాత ముందుగానే కలిపి ఉంచుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని కలపాలి. తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు ఉండలు రాకుండా, కలుపుకుంటూ ఉడికించాలి. సరిపడా ఉప్పు, పలుచని మజ్జిగ కలిపి తాగాలి. నచ్చినవాళ్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు అల్లం, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. (మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా! )జొన్న ఉప్మాఒక కప్పు జొన్నలు లేదా రవ్వను సుమారు 8-12 గంటలు లేదా రాత్రిపూట నానబెట్టాలి.కుక్కర్లో మంచినీళ్లు, చిటికెడు పసుపు వేసి మూడు, నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.ఇపుడు ఉప్మా పోపు కోసం పాన్ వేడి చేసి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, ఆవాలు , జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇష్టమున్నవారు పచ్చి బఠానీ, క్యారట్, బంగాళాదుంపు, బీన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా వేగాక ఉడికిని జొన్న రవ్వను కలుపుకోవాలి. టేస్ట్ కోసం రెండు టీస్పూన్ల మాగీ మసాలా ధనియాల పొడి కలుపుకోవచ్చు. ఐదు నుండి ఎనిమిది నిమిషాలు నెమ్మదిగా మంట ఉడకనిస్తే చాలు.జోవర్ ఖిచ్డీఅరకప్పు జొన్నల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒక బాండ్లీలో క్యాప్సికమ్, టమాటా,పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు గుమ్మడికాయ (ఐచ్ఛికం) ముక్కలు, ఎండుమిర్చి జీలకర్ర, ఇంగువ, ఇతర పోపు గింజలువేసి వేయించుకోవాలి. బాగా వేగాక నాన బెట్టిన జొన్నలు, సరిపడినన్ని నీళ్లు, అరకప్పు పాలు యాడ్ చేసి కుక్కర్లో మూడు విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. తినేమందు తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీన్ని అల్లం లేదా కొబ్బరి చట్నీతోగానీ, పుట్నాల చట్నీతోగానీ తింటే భలే రుచిగా ఉంటుంది. (డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో) -
బరువు తగ్గించే ఔషధాలతో కండరాల క్షీణత
బరువు తగ్గేందుకు వినియోగించే ఔషధాల వల్ల కండరాల ద్రవ్యరాశి క్షీణించే ప్రమాదం ఉన్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. మధుమేహం, రక్తపోటు లాంటి జీవన శైలి వ్యాధులకు దారి తీసే ఊబకాయాన్ని నియంత్రించడంలో ఈ మందులు సమర్థంగా పని చేస్తున్నప్పటికీ బరువు కోల్పోయే ప్రక్రియలో కండరాలు క్షీణతకు గురయ్యే ముప్పు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.బరువు కోల్పోవడం కారణంగా కండరాలు క్షీణతకు గురైనప్పుడు వార్దక్య లక్షణాలు, హృద్రోగ జబ్బుల ముప్పు పెరుగుతాయి. ఈమేరకు పెన్నింగ్టన్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ (అమెరికా), ఆల్బర్టా, మెక్ మాస్టర్ వర్సిటీ (కెనడా)కి చెందిన పరిశోధకులు రూపొందించిన పత్రాలు లాన్సెట్ జనరల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్కండరాలు ఎందుకు అవసరం?⇒ దేహానికి పటుత్వం చేకూర్చి శరీరాన్ని దృఢంగా ఉంచడంతోపాటు జీవ క్రియలు, వ్యాధి నిరోధక వ్యవస్థను నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి.⇒ శరీర కదలికలు, ఆకృతికి కండర కణజాలం అవసరం.ఏం చేయాలి?⇒ బరువు కోల్పోయేందుకు తీసుకునే మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.⇒ ఆహారం తక్కువ తీసుకుంటే విటమిన్లు, ఖనిజాలు తగిన మోతాదులో అందకపోయే ప్రమాదం ఉంది.⇒ తగినంత ప్రోటీన్లు తీసుకోవడంతోపాటు వ్యాయామాలు లాంటి ఆరోగ్యకరమైన విధానాలను పాటించాలి.బరువు తగ్గించే మందులు ఏం చేస్తాయి?డయాబెటిక్ బాధితులు, బరువు కోల్పోయేందుకు తీసుకునే ఓజెమ్పిక్, వెగావై, మౌన్జరో, జెప్‌బౌండ్ లాంటి మందుల్లో జీఎల్పీ – 1 రిసెప్టార్ఎగోనిస్ట్లు ఉంటాయి. ఒక రకమైన ప్రోటీన్లు లాంటి ఈ రిసెప్టార్లు రక్తంలో చక్కెర స్థాయిలు, జీవ క్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెంచే గ్లూకగాన్ హార్మోన్ విడుదలను అడ్డుకుంటాయి. ఆహారం తీసుకున్న తరువాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఇది దోహదం చేస్తుంది.ఆకలిని కూడా ఇవే రిసెప్టార్లు నియంత్రిస్తాయి. కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా బరువును నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి. ఈ రిసెప్టార్లను అనుకరిస్తూ టైప్ 2 డయాబెటిస్, ఊబకాయాన్ని నియత్రించే ఔషధాలు తయారయ్యాయి. మధుమేహ నియంత్రణలో వాడే మరికొన్ని మందులు మూత్రం ద్వారా గ్లూకోజ్‌ను బయటకు పంపి శరీర బరువును సమతూకంలో ఉంచేలా దోహదం చేస్తాయి. ప్రధానంగా మెదడులోని కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆకలిని అణచివేసి తక్కువ తీసుకునేలా ప్రోత్సహిస్తాయి. -
డొనాల్డ్ ట్రంప్ బరువు తగ్గడం: ఒత్తిడి కారణంగా బరువు కోల్పోతారా..?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నా ట్రంప్ చాలా బరువు కోల్పోయినట్లుగా కనిపిస్తున్నారు. మునుపటి ట్రంప్‌లా కాకుండా చాలా స్లిమ్‌గా ఉన్నారు. ఆయన బరువు తగ్గేందుకు ఏవేవో వాడుతున్నారంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కానీ అందులో ఏ మాత్రం నిజంలేదు. ఓ ఇంటర్వ్యూలో తానెందుకు బరువు తగ్గారో స్వయంగా వివరించారు ట్రంప్. ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉండటం వల్లే హాయిగా తినే సమయం లేకపోయిందని అందువల్లే బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఆహారంపై శ్రద్ధ చూపకుండా పనిలో బిజీగా ఉంటే బరువు తగ్గిపోతామా..?. ఇలా అందరికీ సాధ్యమేనా..?.అధ్యక్ష్య ఎన్నికల కారణంగా వచ్చే ఒక విధమైన ఒత్తిడి, బిజీ షెడ్యూల్ తదితరాలు ట్రంప్ బరువు కోల్పోయేందుకు దారితీశాయి. ఇక్కడ ట్రంప్ నిరవధిక ప్రచార ర్యాలీల కారణంగా సరిగా భోజనం చేయలేకపోయానని చెప్పారు. ఓ పక్క వేళకు తిండి తిప్పలు లేకపోవడం, మరోవైపు ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న ఆందోళన తదితరాలే ఆయన బరువు తగ్గేందుకు ప్రధాన కారణాలు. మొత్తంగా దీని ప్రభావం వల్ల ట్రంప్ దాదాపు 9 కిలోలు తగ్గిపోయారు. నిజానికి ఒత్తిడి కారణంగా బరువు పెరగాలి కానీ ట్రంప్ విషయంలో అందుకు విరుద్ధంగా ఉంది. ఇదెలా అంటే..మానిసిక ఆరోగ్య నిపుణులు బరువు తగ్గడం అనేది మనస్సు, శరీరానికి సంబంధించినదని చెబుతున్నారు. ఇక్కడ శారీరక ఆరోగ్యాన్ని ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది అని చెప్పేందుకు స్వయంగా ట్రంప్ ఒక ఉదాహరణ అని అన్నారు. ఎప్పుడైనా ఒత్తిడికి లోనైతే శరీరంలో కార్డిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అందుకు అనుగుణంగా శరీరం ప్రతిస్పందిస్తుంది. దీంతో రక్తప్రవాహంలో కార్టిసాల్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగి విపరీతమైన ఆకలి లేదా ఆకలి లేకపోవడం వంటి మార్పులకు లోనవుతుంది. ప్రతిఒక్కరిలో ఈ ఒత్తిడి ఒక్కో విధంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కొందరు దీని కారణంగా బరువు తగ్గొచ్చు, మరికొందరూ పెరగొచ్చు అని అన్నారు. అంతేగాదు కొందరిలో ఈ ఒత్తిడి బ్రెయిన్‌ని ఆడ్రినల్ హార్మోన్ విడుదలచేసేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా తినాలనే కోరిక ఆటోమేటిగ్గా తగ్గిపోవడం మొదలవుతుంది. అలాగే జీర్ణాశయంపై కూడా తీవ్ర ప్రభావం చూపి కేలరీలు బర్న్ అయ్యేలా చేసి బరువు కోల్పోయేందుకు దారితీస్తుంది. మరికొందరికి మాత్రం.. ఒత్తిడిలోనైతే ఇదే కార్డిసాల్ అధిక కేలరీలు కలిగిన చక్కెరతో కూడిన పదార్థాలను తినేలా ప్రేరేపిస్తుంది. దీని వల్ల చాలామందికి పొత్తికడుపు పెద్దగా లావుగా ఉండటం లేదా బానపొట్ట తదితరాలకు కారణమని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వ్యక్తులు కనీస శారీరక శ్రమ చెయ్యనట్లయితే ఒబెసిటికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. (చదవండి: అందాల రాణి ఐశ్వర్య రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!
ఈజీగా బరువు తగ్గడం అనేది లేటెస్ట్ హాట్ టాపిక్. అందుకే ఇన్‌ప్లూయెన్సర్లు, సెలబ్రిటీలు తమ వెయిట్ లాస్ జర్నీలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూఉంటారు. తాజాగా ఫిట్నెస్ ఇన్‌ప్లూయెన్సర్ రిధిశర్మ ఎలాంటి కఠినమైన డైట్ పాటించకుండానే విజయ వంతంగా 20 కిలోల బరువును తగ్గించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.రిధి శర్మ అందించిన వివరాల ప్రకారం పీసీఓఏస్ సమస్యతో బాధపడుతున్నప్పటికీ, జిమ్‌కు వెళ్లకుండా, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ తనబరువును గణనీయంగా తగ్గించుకుంది. రిధి శర్మ పాటించిన నిబంధనల్లో మరో ముఖ్యమైన అంశం ఇంట్లో తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం. నో ఫాస్ట్‌ఫుడ్, ఇంటి ఫుడ్డే ముద్దుచక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంది. రోజూ నడవడం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి చక్కటి జీవనశైలి మార్పులపై దృష్టి పెట్టడం ద్వారా ఆమె దీనిని సాధించింది. అనవసరమైన క్యాలరీలు తీసుకోకుండా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారమే తీసుకుంది. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే టోఫు, పన్నీర్, సోయా, చిక్కుళ్ళు , గింజధాన్యాలు, తింటే శక్తిని పెంచుకోవడంతో కడుపు నిండిన భావన కలుగు తుందని రిధి శర్మ వివరించారు. View this post on Instagram A post shared by Ridhi Sharma | Fitness & Lifestyle (@getfitwithrid)>ఇంట్లోనే వ్యాయామంజిమ్ మెంబర్షిప్ కోసం ఖర్చు చేయడం మానేసిన శర్మ, వారాంతంలో మినహా ప్రతి రోజూ 30-40 నిమిషాల ఇంట్లోనే వ్యాయామాలు చేసింది. యోగా మ్యాట్, రెండు డంబెల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్‌తో దీన్ని సాధించానని చెప్పారు. తన వ్యాయామంలో పైలేట్స్ (కండరాలకుబలంచేకూర్చే ఆసనాలు) స్ట్రెంత్ ట్రైనింగ్, పైలేట్స్ కూడా ఉండేవని తెలిపారు.కంటినిడా నిద్రప్రతీ రోజు 7 నుంచి 8 గంటలు చక్కటి నిద్ర ఉండేలా జాగ్రత్త పడిందట. ఇదే బరువు తగ్గే తన ప్రయాణంలో, రికవరీలో ఇది కీలకమైన పాత్ర పోషించిందని తెలిపింది. వాకింగ్ తన జర్నీలో పెద్ద గేమ్ ఛేంజర్ అని, రోజుకు 7 వేల నుంచి 10 వేల అడుగులు నడిచానని రిధి తెలిపింది. కేవలం కడుపు మాడ్చుకోవడం కాకుండా, శ్రద్ధగా వ్యాయామం చేసి ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటూ 20 కేజీల బరువు తగ్గినట్టు చెప్పింది రిధి.నోట్: బరువు తగ్గడం అనేది శరీర పరిస్థితులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఉపవాసం ఉండటం ఒఒక్కటే పరిష్కారం కాదు. కచ్చితంగా ఏదో ఒక వ్యాయామం చేయాలి. అందుకే బరువు తగ్గాలనుకుంటే, ఎందుకు బరువు పెరుగుతోందనే కారణాలను విశ్లేషించుకొని, నిపుణుల సలహా తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా బరువు తగ్గే ప్లాన్ చేసుకోవాలి. -
జిమ్‌కి వెళ్లకుండానే 16 కిలోలు తగ్గింది, ఎలా?
బరువు తగ్గే ప్రక్రియ అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి బరువు తగ్గడం అంటే అదొక యజ్ఞం. కొందరు జిమ్‌కు వెళ్లి వర్కౌట్స్ చేస్తారు. మరికొంతమంది యోగాసనాలతో ఈజీగా బరువు తగ్గుతారు. మరికొంతమంది వాకింగ్, జాగింగ్ ద్వారా తమ అధిక బరువును తగ్గించు కుంటారు. మరికొందరు ఇవన్నీ చేస్తారు. జిమ్‌కు వెళ్లకుండానే సాహిబా ఏకంగా 16 కిలోల బరువు తగ్గింది. తన వెయిట్ లాస్ జర్నీని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. సాహిబా మొదట్లో 104 కిలోల బరువు ఉండేది. దీంతో ఎలాగైన బరువు తగ్గించుకోవాలని నిశ్చయించుకుంది. దీనికి రోజూ 10-20 వేల అడుగులు నడిచేది. అంతేకాదు ఎన్ని కేలరీల ఫుడ్ తింటున్నదీ నిత్యం పరిశీలించుకుంటూ ఉండేది. ఆహార నియమాలను పాటించి భారీగా బరువు తగ్గింది. ప్రస్తుతం 87.85 కిలోల బరువుకు చేరింది. ఇంట్లోనే కొంత కార్డియో చేసానని ,స్కిప్పింగ్ వ్యాయామం కూడా చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కొన్ని చిట్కాలను కూడా తన ఫాలోవర్స్‌కు అందించింది. అధిక బరువు ఉన్నవారు అరగంట నడకతో ప్రారంభించి, వారి వారి కంఫర్ట్ జోన్‌కు అనుగుణంగా ఈ సమయాన్నిపెంచుకోవాలని సూచించింది.16 కిలోల బరువు తగ్గడానికి స్టెప్స్ సాహిబా మాటల్లోపూర్తిగా ఉపవాసం కాకుండా మితంగా తిన్నాను. కోరుకున్నది తిన్నారు. తగ్గించి తింటూ కేలరీలను ట్రాక్ చేసుకున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 12:12 (12గం ఉపవాసం 12గం తినడం)శరీరం దీనికి సహకరిస్తే ఈ ఉపవాసాన్ని పెంచుకోవచ్చు.డయాబెటిక్ లేదా కొన్ని మందులు తీసుకుంటే ఉపవాసం వద్దు. 16:8 ఉపవాస పద్ధతిలో రోజుకు 16 గంటల పాటు ఉపవాసం. ప్రోటీన్ , ఫైబర్ ఎక్కువ, పిండి పదార్థాలు , కొవ్వు తక్కువ ఉన్న ఆహారందేన్ని ఎలా తినాలి అనేది లెక్క వేసుకోవాలి.నీటిని తాగుతూ హైడ్రేట్ గా ఉంచుకున్నారు. జిమ్‌కు వెళ్లకూడదని కాదు!అయితే జిమ్‌కి వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పింది. అయితే, అందరికీ ఆర్థిక స్థోమత ఉండదు కాబట్టి, తానూ కూడా ఆర్థిక భారం లేకుండా ఈ పద్ధతిని ఎంచుకున్నట్టు వెల్లడించింది. View this post on Instagram A post shared by Sahiba a.k.a Savleen | Vocals & Self-Care 🩷 (@sahibavox) నోట్: మనం ముందే అనుకున్నట్టుగా వెయిట్ లాస్ జర్నీ అనేది అందరికీ ఒకేలా ఉండదు. వారి వారి వ్యక్తిగత ఆరోగ్యం , పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి శరీర తత్వానికి తగ్గట్టు, మన బాడీ అందించే సంకేతాలను గుర్తించాలనే గమనించాలి. ఇటీవల విద్యాబాలన్ చెప్పినట్టు మన బరువు గుట్టు ఏంటి అనేది తెలుసుకుని రంగంలోకి దిగాలి.ఇదీ చదవండి : డైట్ చేస్తున్నారా? బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రాగుల ఉప్మా -
'తల్లులు' డోంట్ వర్రీ!..ప్రసవానంతరం జస్ట్ 34 రోజుల్లోనే..!
మహిళలు ప్రసవానంతరం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. బిడ్డను కన్న తర్వాత శరీరంలో వచ్చే మార్పులు కారణంగా బరువు తగ్గించుకోవడం అత్యంత సవాలుగా ఉంటుంది. ఇది చాలామంది తల్లులకు ఎదురయ్యే కఠిన సమస్య. అయితే దక్షిణాప్రికాకు చెందిన భారత సంతతి మహిళ మాత్రం ఈ సమస్యను అధిగమించి విజయవంతంగా బరువు తగ్గింది. అదికూడా 34 రోజుల వ్యవధిలోనే కేజీల కొద్దీ బరువు కోల్పోవడం విశేషం. ఆమె వెయిట్‌లాస్ జర్నీ ఎలా సాగిందంటే..దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి మహిళ రవిషా చిన్నప్ప వెయిట్ లాస్ జర్నీ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయిన రవిషా ప్రసవానంతరం అధిక బరువు సమస్యతో ఒక ఏడాదిపాటు చాలా ఇబ్బందులు పడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక డైట్లో సమర్థవంతమైన మార్పులు తీసుకొస్తేనే బెటర్ అని భావించింది. అందుకోసం ఓ 'త్రీ ట్రిక్స్'ని క్రమంతప్పకుండా అనుసరించింది. అవే ఆమె బరువును వేగంగా తగ్గించేలా చేయడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి. అవేంటంటే..మొదటిది..శరీరం హైడ్రేటెడ్ ఉంచుకునేలా చూడటం..రవిషా తల్లిగా బిజీ అయిపోవడంతో హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడంపై దృష్టిసారించలేకపోయినట్లు పేర్కొంది. నిజానికి కొవ్వుని కరిగించే మార్గాలలో హైడ్రేషన్ ఒకటి. అందుకోసం రవిషా తన ఫోన్ టైమర్ సహాయంతో హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకునేది. నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి 90 నిమిషాలకు ఒకసారి టైమర్ ఆన్ అయ్యేలా సెట్ చేసింది వెంటనే 20 సిప్ల నీరు తాగేలా చూసేకునేది రవిషా. మన శరీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగేలా ప్రయత్నిస్తే అది జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడమే గాకుండా బరువు తగ్గించే ప్రయాణంలో కీలకంగా ఉంటుంది. రెండొవది ..ఆహారంలో మార్పులు..జీవనశైలిలో ఆహారాన్ని తీసుకునే విధానంలో కొద్దిపాటి మార్పులు చేసింది. ఎక్కువ ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంతో తియ్యటి పదార్థాలను తినాలనే కోరికను నియంత్రించుకుంది రవిషా. ప్రతిరోజూ కనీసం వంద గ్రాముల ప్రోటీన్‌ని ఉండేలా చూసుకునేది. ఇది దాదాపు 400 కేలరీలకు సమానం. ఒకరకంగా ఇది అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు తినాలనే కోరికలను గణనీయంగా తగ్గించేలా చేయడమే గాక పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిసారించేలా చేస్తుందని చెబుతోంది రవిషా. మూడొవది..క్రమం తప్పకుండా తన బరువుని చెక్‌చేసుకోవడం సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం వంటివి చేయాలి. ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనలకి తావివ్వకుండా బరువు తగ్గేలా ఇంకేం చేయగలమో అనే దానిపై దృష్టిపెట్టడం, పాజిటివ్ మైండ్‌తో ఉండడం వంటివి చేయాలి. ముఖ్యంగా ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటోంది రవిషా. ఇక్కడ రవిషా బరువు తగ్గాలనే సంకల్పం తోపాటు ఎలాంటివి ఆహారాలు తీసుకుంటే శరీరానికి మంచిది అనేది తెలుసుకుని మరీ ఆచరణలో పెట్టింది. చివరగా పాజిటివ్ ఆటిట్యూడ్‌కి పెద్దపీట వేసింది. ఇవే ఆమెను ప్రసావానంతరం విజయవంతంగా బరువు తగ్గేలా చేశాయి.(చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?) -
విద్యాబాలన్ వెయిట్ లాస్ సీక్రెట్..కానీ వర్కౌట్లు మాత్రం..!
బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే గాక విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. కానీ ఫిట్నెస్ పరంగా విద్యా చాలా ఇబ్బందులు పడింది. ఒక్కోసారి చాలా స్లిమ్‌గా, మరోసారి లావుగా కనిపిస్తూ ఉండేది. అయితే ఇటీవల ఆమె చాలా స్లిమ్‌గా మారడమే గాక బాడీని అదే ఫిట్నెస్తో మెయింటైన్ చేయడంలో విజయవంతమయ్యింది. అందుకోసం తాను ఏం చేసిందో ఓ ఇంటర్యూలో వివరంగా వెల్లడించింది కూడా. ఇంతకీ విద్యా బాలన్ వెయిట్ లాస్ సీక్రెట్ ఏంటంటే..విద్యాబాలన్ తను స్లిమ్‌గా మారేందుకు ఎంతలా కష్టపడిందో చెప్పుకొచ్చింది. తాను నాజుగ్గా ఉండాలని చాలా పిచ్చిగా వర్కౌట్లు చేసినట్లు వెల్లడించింది. అయితే అంతలా చేసినా.. తన బరువులో పెద్ద మార్పు కనిపించక చాలా విసిగిపోయినట్లు తెలిపింది. దాంతో తాను చెన్నైలోని 'అమురా' అనే న్యూట్రిషన్ బృందాన్ని కలిసినట్లు పేర్కొంది. అయితే వాళ్లు నిజంగా ఇది లావు కాదని తేల్చి చెప్పారు. బరువు తగ్గడంలో మంచి మార్పు కనిపించాలంటే సరైన డైట్ పాటించాలని అన్నారు. అలాగే ముందుగా తనని ఇలా విపరీతమైన వ్యాయామాలు చేయడం మానేయమని చెప్పారు నిపుణులు. అలాగే ముందుగా ఇన్ఫ్లమేషన్ని వదిలించుకునేలా ఆహారం తీసుకోవాల్సిందిగా న్యూట్రిషన్లు సూచించారు. అంటే ఇక్కడ శరీరానికి సరిపడని ఆహారాన్ని తొలగించడమే ఇన్ఫ్లమేషన్ డైట్. అయితే ఇదేలా పనిచేస్తుందంటే.. 'ఇన్ఫ్లమేషన్ ఎలిమినేషన్' డైట్ అంటే..ఇది యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారం. పోషకాలతో నిండిన ఆహారం. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి.. వాపుని, మంటని అరికట్టే మంచి ఆహారం. ఇవి తప్పక డైట్లో చేర్చుకోవాల్సిని మంచి ఫుడ్స్‌గా పేర్కొనవచ్చు.కూరగాయలు..బ్రోకలీ, కాలే, బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను తప్పక డైట్లో ఉండేలా చూసుకోవాలి.పండ్లు..బ్లూబెర్రీస్, దానిమ్మపండ్లు, ద్రాక్ష, చెర్రీస్ వంటి పండ్లను తీసుకోవాలి.ఆరోగ్యకరమైన కొవ్వులుఅవకాడోస్, ఆలివ్ వంటి అధిక కొవ్వు ఉండే వాటిని చేర్చుకోవాలి. మంచి కొవ్వులు ఉండే చేపలుమాంసాహారులు మంచి పోషకాల కోసం సాల్మన్, సార్డినెస్, ఇంగువ వంటి రకాల చేపలను తీసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు, నట్స్బాదం, పిస్తా వంటి వాల్నట్ల తోపాటు పసుపు, మెంతులు దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. (చదవండి: సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!) -
ఊపిరితిత్తులకు ఊతం, వెయిట్ లాస్ కూడా...
పొత్తి కడుపు కొవ్వును తగ్గించి, ఛాతీ, ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరచడానికి మత్సా్యసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో కఠినమైన విధానం కూడా ఉంది. కానీ, సులువుగానూ ఈ పోజ్‌ను సాధన చేయవచ్చు. త్వరగా శారీరక, మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. ఈ ఆసనాన్ని సాధన ఎలా అంటేమ్యాట్పైన వెల్లకిలా పడుకోవాలి.అరచేతులను నేలపైన బోర్లా ఉంచాలి. కాళ్లను నిటారుగా ఉంచి, పాదాలను స్ట్రెచ్ చేస్తూ సాధ్యమైనంత వరకు వంచాలి. తుంటి భాగాన్ని కొద్దిగా ఎత్తి, పిరుదుల కింద చేతులను ఉంచాలి. తల వెనుక మెడ భాగాన్ని సాగదీస్తూ, నేలపైకి వంచాలి. బరువు ఎక్కువ లేకుండా భంగిమను సరిచూసుకోవాలి. అదే విధంగా వెన్ను భాగాన్ని కూడా కొంత పైకి ఎత్తాలి. ఈ భంగిమ చేప మాదిరి ఉంటుంది కాబట్టి దీనిని ఫిష్ పోజ్ అంటారు. నిదానంగా 5 శ్వాసలు తీసుకుంటూ, వదలాలి. తర్వాత తలను యధాస్థానంలో ఉంచి, వెన్నెముకను చాప మీద నిదానంగా ఉంచాలి. ఆ తర్వాత పాదాలను యధాస్థానంలోకి తీసుకొని, చేతులను తుంటి నుంచి బయటకు తీసి, విశ్రాంతి తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల.... ∙ఈ ఆసనం వల్ల మెడకు, ఊపిరితిత్తులకు, పొట్టలోని అవయవాలకు చాలా మేలు కలుగుతుంది. ఊపిరితిత్తులు సాధ్యమైనంతవరకు ప్రాణ వాయువును పీల్చి, కొంత సమయం ఉంచగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. వెన్ను, మెడ భాగాలు స్ట్రెచ్ అవడం వల్ల వాటి బలం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నవారు నిపుణుల సాయం తీసుకోవడం మేలు. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడానికి..-జి.అనూష,యోగా గురు -
నాజూగ్గా ప్రియాంక చోప్రా, స్టైయిలిష్ లుకికి ఫ్యాన్స్ ఫిదా (ఫొటోలు)
-
చేపలు మాత్రమే తింటు..ఏకంగా 15 కిలోల బరువు తగ్గిన మహిళ..!
చేపలు ఆరోగ్యానికి మంచిదే గానీ అతిగా తింటే మాత్రం ప్రమాదమే. అలా తినమని సాధారణంగా వైద్యులు కూడా సూచించరు. కానీ ఈ మహిళ మూడు నెలల పాటు చేపలు మాత్రమే తిని ఏకంగా 15 కిలోల బరువు తగ్గింది. అది చూసి వైద్యులే కంగుతిన్నారు. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకి చెందిన 62 ఏళ్ల జేన్ క్రమ్మెట్ బరువు 109 కిలోలు ఉండేది. నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై ఉంది. వైద్యులు బరువు తగ్గేలా ఆహారాలు, పానీయాలపై పలు నిబంధనలు పాటించాలని సూచించారు. కానీ అలా చేసినా ఆమె బరువు పరంగా ఎలాంటి మార్పు కనిపించలేదు.పైగా అలా మంచపైనే ఉండటంతో కాళ్లు బాగా వాచిపోయి, విపరీతమైన ఆకలితో బాధపడేది. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసిన లాభం లేదని భావంచి స్నేహితుల సూచన మేరుకు వైద్యుడు బోజ్ని సంప్రదించింది. ఆయన ఆమెకు 'ఫిష్ ఫాస్ట్'ని సూచించారు. మూడు నెలల పాటు సార్డినెస్ అనే చేపలను మాత్రమే తినమని సూచించారు. ఇలా చేస్తే బరువు తగ్గుతారని అనడంతో జేన్ విస్తుపోయింది. ఏదో వింతగా ఉన్న ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఏమో..చూడాలని ట్రై చేసి చూసింది. ఆయన చెప్పినట్లుగా మూడు నెలల పాటు సార్డిన్ చేపలు మాత్రమే తినడం ప్రారంభించింది. ఇలా చేసిన రెండు నెలల్లోనే మంచి మార్పు కనిపించింది. ఏకంగా ఆరు కిలోలు వరకు తగ్గింది. ఇక మూడు నెలలు పూర్తి అయ్యేటప్పటికీ ఏకంగా 15 కిలోల వరకు తగ్గిపోయింది. జోన్ ఇంత స్పీడ్‌గా బరువు తగ్గడం చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఇది ఒక రకమైన జిడ్డుకరమైన చేప. పైగా ఇందులో మంచి పోషక విలువలు ఉంటాయి. అనారోగ్యంతో ఉన్నవారిని దీన్ని తినమని వైద్యులు సూచిస్తారు. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, విటమిన్ డి, క్యాల్షియం ఉంటాయి. ఇలా చేపలతో బరువు తగ్గడం అత్యంత అరుదు కదూ..!.(చదవండి: వెన్ను నొప్పి కేన్సర్‌కు దారితీస్తుందా..?) -
పచ్చి కరివేపాకు నములుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి?
సోషల్ మీడియాలో రెసిపీలు, చిట్కాలకు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతూ ఉంటాయి. కానీ నిజానిజాలు తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉండాలి.ఇటీవలి కాలంలో పచ్చి కరివేపాకు ఆకులను నమలడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని బాగుపడుతుందనే వార్త హల్చల్ చేస్తుంది. దీంట్లోని నిజానిజాలేంటో చూద్దాం రండి.కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కరివేపాకులో విటమిన్లు ఎ, బి, సి , డి వంటి ముఖ్యమైన పోషకాలు, అలాగే కాల్షియం, ఐరన్ ,ఫాస్పరస్ వంటి కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.అందుకే రోజువారీ కూరల్లో ప్రతీ దాంట్లోనూ కరివేపాకును విధిగా వాడుతూ ఉంటాం. దీంతో వంటకాలకు మంచి వాసన రావడం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కరివేపాకులో అవసరమైన పోషకాలతో పాటు కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి కరివేపాకును నమలడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ ఆకులు వెంట్రుకలకు పోషణ , జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కానీ దుష్ప్రభావాలు కూడా ఉంటాయినేది గమనించాలి.బరువును నియంత్రిస్తుంది, చుట్టు మెరిసేలా చేస్తుందిచెడు కొలస్ట్రాల్‌కు చెక్ చెప్పాలన్నా కరివేపాకు బాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు, ఎక్కువ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు రోజూ కరివేపాకును అనేక రూపాల్లో తింటూ ఉండాలి బ్లడ్ లోని షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. రోజూ కరివేపాకు తీసుకునే వారికి షుగర్ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ కరివేపాకులో ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కంటిచూపు మెరుగుపడుతుంది. కొల్లాజెన్‌ను పెంచడానికి తోడ్పడుతుంది. చుండ్రు, జుట్టు రాలిపోవడంలాంటి సమస్యలను అధిగమించొచ్చు. ఇందులో లభించే కెరోటిన్‌తో జుట్టు నిగనిగలాడుతూ బాగా పెరుగుతుంది. జుట్టు తెల్లగా అవ్వకుండా కాపాడుతుంది. మూత్రంలో మంట, మూత్రం సరిగ్గా రాకపోవడంలాంటి సమస్యలు ఏమీ కూడా ఉండవు. కిడ్నీల్లో రాళ్లతో బాధపడేవారు కరివేపాకులను ఎక్కువగా తీసుకోవాలి. అజీర్తిని తగ్గించి, ఆకలిని పెంచుతుంది కరివేపాకు ఆకలిని బాగా పెంచుతుంది. అందుకే జబ్బు పడిన వారికి, జ్వరం వచ్చితగ్గిన వారికి ధనియాలు, కరివేపాకుతో చేసిన కారప్పొడిని తినిపిస్తారు. విరేచనాలు విరేచనాలతో బాధపడేవారు కరివేపాకును బాగా ఎండబెట్టి దాన్ని పొడిగా చేసుకుని కాస్త తేనె కలుపుకుని తాగుతారు.రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులనుతినవచ్చు. అయితే దానిమీద పురుగుమందుల అవశేషాలు లేకుండా జాగ్రత్తపడాలి. శుభ్రంగా కడిగి తింటే చాలా రకాల అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. మరీ అతిగా తీసుకోకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు పచ్చివి తినకుండా ఉంటే మంచిది. ఎలా తినాలి?కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి, అన్ని రకాల కూరల్లో వాడటం ద్వారా దీని ప్రయోజనాలు పొందవచ్చు. -
అలాంటి జన్యువులు ఉంటే బరువు తగ్గడం ఈజీ..!
14 'స్కిన్నీ జన్యువులు'(సన్నగా ఉండే జన్యువులు) బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తాయని అధ్యయనం పేర్కొంది. ఇలాంటి జన్యువులు లేని వారితో పోలిస్తే..ఈ 14 'స్కిన్నీ జన్యువులు వ్యాయమం చేసిన వాళ్లే వేగంగా బరువు తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నారు. వీళ్లు జస్ట్ ఎనిమిది వారాల పరుగుకే దాదాపు 11 పౌండ్లు కోల్పోతారట. ఈ పరిశోధన బరువుకి సంబంధించిన కీలక జన్యువుల గురించి వెల్లడించింది. ఈ జన్యవులు వ్యాయామం, జీవనశైలి మార్పులకు అనుగుణంగానే సక్రియం చేయబడి, బరువు తగ్గడం జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్, రిహాబిలిటేషన్ ఉపాధ్యాయుడు హెన్నీ చుంగ్ అన్నారు. అయితే యూకేలోని కొన్ని పరిశోధనలు మాత్రం వ్యాయామం జోక్యం లేకుండా జన్యువులు తమ నిజమమైన సామర్ధ్యాన్ని చూపించవని చెబుతోంది. అంటే ఇక్కడ తగిన వ్యాయామం, సరైన జన్యువులతోనే మనిషిలో ఎలాంటి జన్యువులు ఉన్నాయనేది చెప్పగలరు వైద్యులు. అందుకోసం 20 నుంచి 40 ఏళ్ల వయస్సు గల దాదాపు 38 మందిపై పరిశోధన చేశారు. వారిలో సగం మందికి సాధారణ ఆహారం, అలవాట్లను మార్చకుండా.. వారానికి మూడుసార్లు 20 నుంచి 30 నిమిషాలు పరుగెత్తమని సూచించారు. మిగిలిన సగం మంది నియమనిబంధనలతో కూడిన ఆహారం, జీవనశైలి ఫాలో అయ్యారు. అయితే పరిశోధనలో 62% బరువు తగ్గడంలో జన్యు శాస్త్రమే కీలకమని అధ్యయనం పేర్కొనగా.. 37% మాత్రం వ్యాయామం, జీవనశైలి కారకాలతో ముడిపడి ఉందని తేలింది. ఈ పరిశోధన జన్యు ప్రొఫెల్‌ని అర్థం చేసుకోవడంలో వ్యాయామం, చక్కటి డైట్ ఉపకరిస్తుందని నిర్ధారణ అయ్యింది. అయితే ప్రతి ఒక్కరూ జన్యుపరమైన వాటితో సంబంధం లేకుండా వ్యాయమంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందడం ముఖ్యమని చెప్పారు పరిశోధకులు. ఇది హృదయ ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి తద్వారా బరువుని అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వర్కౌట్లు చేయాలని సూచించారు. ఈ అధ్యయనం జర్నల్ రీసెర్చ్ క్వార్టర్లీ ఫర్ ఎక్సర్సైజ్ అండ్ స్పోర్ట్‌లో ప్రచురితమయ్యింది. (చదవండి: ఖఫ్లీ గోధుమలు గురించి తెలుసా..! ఎందుకు తినాలంటే..!) -
సొరకాయతో లాభాలెన్నో, బరువు కూడా తగ్గొచ్చు
మనం తినే ఆహారంలో తీగజాతి, దుంప ఇలా అన్ని రకాల కూరలు, ఆకుకూరలను చేర్చుకోవాలి. ముఖ్యంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో కూరగాయల తోటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. బీర, సొరకాయలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఈరోజు సొరకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సొరకాయతో శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.సొరకాయలో విటమిన్ బీ, విటమిన్ సీ, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో నీరు ,కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో అయితే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి సొరకాయ ఎంతగానో సహాయపడుతు సొరకాయతో పప్పు చట్నీ, సాంబార్, కర్రీ, ఇలా ఎన్నో వంటలను చేసి తినొచ్చు. ఇంకా సూప్‌లు లేదా స్మూతీ వంటి ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు. సొరకాయ జ్యూస్ న్యాచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది.సొరకాయతో ప్రయోజనాలురక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సొరకాయలో మెండుగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.సొరకాయతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. సొరకాయలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. మెగ్నీషియంతో కండరాలు బలపడతాయి. కాల్షియం కూడా మెండుగా ఉంటుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సొరకాయ సహాయపడుతుంది. సొరకాయలో కూడా విటమిన్ సీి మెండుగా ఉంటుంది. ఎన్నో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతర రోగాలను అడ్డుకుంటుంది. -
వెయిట్ లాస్ స్టోరీ: ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు..!
నిజ జీవితంలో బరువు తగ్గి చూపించిన వ్యక్తుల స్టోరీలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అబ్బా ఎంతలా అంకుంఠిత దీక్షతో బరువు తగ్గారు అనే ఫీల్ వస్తుంది. గ్రేట్ అనిపిస్తుంది కూడా. బరువు తగ్గాలనేకునే వాళ్లు ముఖ్యంగా డైట్లో షుగర్‌కి సంబంధించిన వాటికి దూరంగా ఉంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు తగ్గాడు. అదెలా అనే కదా..!. అలా ఎలా సాధ్యమయ్యింది? నిజంగానే ఐస్‌క్రీం తింటూనే బరువు తగ్గాడా అంటే..?.ఒక్కొక్కరు ఒక్కో విధమైన డైటింగ్ స్లైల్ ఉంటుంది. ఇక్కడ మిట్ సునాయ్ అనే 28 ఏళ్ల వ్యక్తి ఫిబ్రవరిలో తాను అధిక బరువు ఉన్నట్ల గుర్తించినట్లు తెలిపాడు. అలాగే వైద్యపరీక్షల్లో కొలస్ట్రాల్ స్థాయిలు కూడా అధికంగా ఉన్నాయని తెలియడంతో ఫిట్‌నెస్‌పై దృష్టిసారించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకోసం సరైన జీవనశైలిని పాటిచడం తోపాటు సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పాడు. రెగ్యులర్‌గా వ్యాయామం, అన్ని రకాల పదార్థాలను మితంగా తీసుకునేలా మనసును సిద్ధం చేసుకుని డైట్ ప్రారంభించినట్లు తెలిపాడు. అయితే తన బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడింది నడక అని చెబుతున్నాడు. తాను రోజూ పదివేల అడుగులు వేసేలా చూసుకునే వాడట. అలా అన్ని స్టెప్లు నడిస్తేనే.. ఐస్‌క్రీం తినాలనే లక్ష్యం ఏర్పరుచుకున్నట్లు వివరించారు. అలా అందుకోసమైన ఏ రోజు స్కిప్ చేయకుండా చేయగలిగానని చెబుతున్నాడు సునాయ్. ఆ విధంగా దాదాపు 150 రోజుల్లో అంటే.. ఐదు నెలల్లో సుమారు 16 కిలోలు పైనే బరువు తగ్గగలిగానంటూ తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. అలాగే డైట్లో ముఖ్యంగా తాను ఇష్టపడే దాల్, రోటీ, అన్నం, పండ్లు, పిజ్జా, పాస్తా, పనీర్ కర్రీ, పనీర్ టిక్కా, శాండ్విచ్లు, స్మూతీస్ వంటివి అన్ని మితంగా తీసుకునేవాడనని అన్నాడు. ఇక్కడ మనకిష్టమైన ఫుడ్‌ని దూరం చేయకుండానే అవి తింటునే వర్కౌట్లతో కెలరీలు తగ్గించుకుంటూ బరువు తగ్గొచ్చని చెబుతున్నాడు మిట్ సినాయ్. బరువు తగ్గడం అంటే నోరు కట్టేసుకోవాల్సిందే అని భయపడే వాళ్లకు సునాయ్ వెయిట్ లాస్ స్టోరీ ఓ ఉదహరణ.(చదవండి: కాస్మటిక్స్తో అర్లీ ప్యూబర్టీ ..! బాల్యపు ఛాయ వీడక ముందే ఇలా..!) -
యూట్యూబర్ వెయిట్ లాస్ జర్నీ: జస్ట్ రెండేళ్లలో ఏకంగా వంద కిలోలు..!
బరువు తగ్గడం అంత ఈజీకాదు. అలాగని అసాధ్యం కూడా కాదు. స్మార్ట్‌గా ఉండాలనే బలమైన కోరిక బరవు తగ్గించుకునేలా చేస్తుంది. అయితే కొందరూ ఆ క్రమంలో విజయం సాధిస్తే, చాలమంది మాత్రం మధ్యలోనే డైట్‌ని వదిలేసి బరువు తగ్గలేకపోతున్నాను అని బాధపడతుంటారు. కానీ ఇక్కడొక యూట్యూబర్ అందరికీ తాను జంక్ ఫుడ్ తినే వ్యక్తిగా ఫోజులిస్తూ..సడెన్‌గా తన వ్యూవర్స్‌కి గట్టి షాక్ ఇచ్చాడు. అప్పటి వరకు ఫుడ్ బాగా లాగిస్తూ లావుగా కనిపించిన వ్యక్తి సడెన్‌గా ఇంతలా సన్నగా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఏంటా వెయట్ లాస్ సీక్రెట్ అని అందరూ చర్చించుకుంటున్నారు కూడా. అయితే మనోడు సీక్రెట్ వింటే కంగుతింటారు. అదేక్రమంలో అతని డెడికేషన్‌కి ఫిదా అవ్వుతారు కూడా.యూట్యూబర్ నికోలస్ పెర్రీ నికోకాడో అవకాడోగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. అప్పడి వరకు అతడి పాలోవర్లు వీడియోల్లో భారీ స్థూలకాయుడిగా చూశారు. పైగా ఆయా వీడియోల్లో జంక్ ఫుడ్‌ని ఇష్టంగా లాగిస్తున్నట్లు ఉంటాయి. అలాంటిది ఒకరోజు సడెన్‌గా పెర్రీ తన ఛానెల్లో టూ స్టెప్స్ ఎహెడ్ పేరుతో ఓ వీడియో వదిలాడు. అందులో తాను 185 కిలోలు బరవు ఉండేవాడనని, ఈ రెండేళ్లలో దాదాపు 250 పౌండ్లు(అంటే 113 కిలోలు) తగ్గినట్లు వెల్లడించాడు. అదెలా నిన్న మొన్నటి వీడియోల్లో మనోడు లావుగానే కనిపించాడు సడెన్‌గా ఇలా స్మార్ట్‌గా గుర్తుపట్టని విధంగా ఎలా మారిపోయాడంటూ ఆశ్చర్యపోయారు ఫాలోవర్లు. అయితే ఈ యూట్యూబర్ తన ఫిట్స్‌పై పూర్తి ఫోకస్ పెట్టేందుకు రెండేళ్ల క్రితమే రికార్డు చేసిన వీడియోలను కొద్ది మార్పులతో షేర్ చేసేవాడనని అన్నాడు. అలా తన డైట్, బాడీపై దృష్టిపెట్టి బరువు తగ్గే వ్యాయామాలు, వర్కౌట్లు చేసినట్లు చెప్పుకొచ్చాడు. బరువు తగ్గడం కోసం రెండేళ్ల నుంచి కంటెంట్ రూపొందించకుండా దూరంగా ఉన్నట్లు తెలిపాడు. తాను తినే ఫుడ్ నుంచి చేసే వర్కౌట్ల వరకు ప్రతి దానిపై పూర్తి శ్రద్ధపెట్టానని చెప్పుకొచ్చాడు పెర్రీ. ఆ క్రమంలో ప్రజలు నన్ను బహిరంగంగా గుర్తుపట్టకుండా ఉండేలా గుండు గీయించుకుని జాగ్రత్త పడినట్లు తెలిపాడు. అందుకు తన తోటి యూట్యూబర్లకు సాయం చేశారని చెప్పుకొచ్చాడు. అయితే ఆయా వీడియోల్లో ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నట్లు కనిపించినా..తాను మాత్రం కంట్రోల్లోనే ఆహారం తీసుకున్నట్లు వివరించాడు. ఇక్కడ యూట్యూబర్ జంక్ ఫుడ్ తినే వ్యక్తిగా చూపిస్తూ..ప్రేక్షకులను బురిడికొట్టించినా..తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి అంతలా అన్ని కిలోలు తగ్గడం మాత్రం అందరికీ ప్రేరణ అనే చెప్పొచ్చు. అలాగే యూట్యూబ్ వీడియోల్లో చెప్పే ప్రతి విషయం ఎంత వరకు నిజం అనేది ప్రజలు గ్రహించాలనే విషయం..ఈ యూట్యూబర్ ఉదంతమే చెబుతోంది కదూ..! (చదవండి: ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే? విద్యా బాలన్ నుంచి సన్యా మల్హోత్రా వరకు...) -
మూడు నెలల్లోనే 23 కిలోలు తగ్గిన నటుడు! కానీ..
ప్రముఖులు, సెలబ్రిటీల వెయిట్ లాస్ జర్నీలను స్ఫూర్తిగా తీసుకుని అనుసరిస్తూ ఉంటాం. అయితే వాళ్లలో చాలామంది నిధానంగా ఓ క్రమ పద్ధతిలో బరువు తగ్గితే కొందరూ తమ సినిమాలో పాత్రకు తగ్గటు సన్నగా ఉండేందుకు త్వరితగతిన బరువు తగ్గుతుంటారు. జస్ట్ రెండు లేదా మూడు నెలలకే కిలోల కొద్ది బరువు తగ్గడం ఆశ్యర్యం తోపాటు మనం కూడా అలాగే తగ్గాలనే ఆత్రుత పెరిగిపోతుంది. వాళ్లు అంత తక్కువ వ్యవధితో బరువు తగ్గేందుకు ఏం చేశారు?, ఎలా కష్టపడ్డారు తదితరాల గురించి తెలుసుకుని మరీ ఫాలో అయిపోతారు. కానీ పాపం వాళ్లు సినిమా కోసం అని తగ్గడం వల్ల ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారనేది చాలామందికి తెలియదు. అవగాహన కూడా ఉండదు. ఇక్కడొక హాలీవుడ్ నటుడు కూడా అలానే ఓ సినిమా షూట్ కోసం తక్కువ టైంలోనే కిలోలకొద్ది బరవు తగ్గి ఎలాంటి సమస్యలు ఫేస్ చేశాడో షేర్ చేసుకున్నాడు. ఎవరా హీరో అంటే..హాలీవుడ్‌కి చెందిన ఓర్లాండ్ బ్లూమ్ ఇటీవల తన చిత్రం ది కట్ కోసం పడిన కష్టం గురించి షేర్ చేసుకున్నారు. ఈ చిత్రంలో తాను బాక్సర్ పాత్ర పోషించినట్లు తెలిపారు. ఆ పాత్ర కోసం తాను మూడు నెలలకే ఏకంగా 52 పౌండ్లు(23 కిలోలు) బరువు కోల్పోయినట్లు వెల్లడించాడు. అందుకోసం ఎంతలా స్ట్రిక్ట్‌గా కఠినమైన డైట్‌ని ఫాలో అవ్వాల్సి వచ్చిందో వివరించారు. తాను డైట్ ప్రారంభించేటప్పుడూ 85 కిలోలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం చాలా బరువు తగ్గానని అన్నారు. దీని కారణంగా తాను మానసికంగా, శారీరకంగా చాలా సవాళ్లును ఎదుర్కొన్నానని అన్నారు. ఈ వెయిట లాస్ జర్నీ భయంకరమైనదని భయపెట్టడం కాదు గానీ ఈ క్రమంలో కొన్ని సమస్యలను ఫేస్ చేయక తప్పదని అన్నారు. కేలరీలు తగ్గుతున్నందుకు బాధలేదు కానీ ఆ క్రమంలో నిద్రలేమి వంటి సమస్యలు ఫేస్ చేస్తున్నప్పుడూ శరీరంలో సంభవించే ప్రతి మార్పు తనను ఆశ్యర్యానికిలోను చేసిందన్నారు. ఇక బ్లూమ్ తన సినిమాలో పాత్ర ప్రకారం బరువు పెరిగేందుకు కష్టపడుతున్న బాక్సర్‌గా కనిపించేందుకు ఇంతలా బరువు కోల్పోవడం జరిగింది. ఆ క్రమంలో తన మెదడు ప్రాథమిక కేలరీల కొరతతో ఉంది కాబట్టి పని చేయడం సాధ్యం కాదు. అందువల్ల తాను రెస్ట్ తీసుకుంటూ ఫిట్నెస్ నిపుణులు సమక్షంలో ఇలా త్వరిగతిన బరువు తగ్గినట్లు తెలిపారు. ఇలా తమ రోజువారీ కార్యక్రమాలు తామే చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న సామాన్యులు ఈ డైట్‌ని అనుసరించడం అత్యంత ప్రమాదకరమని కూడా చెప్పారు. ఇలా స్పీడ్‌గా బరువు తగ్గే క్రమంలో ఆకలిని బాగా నియంత్రించేలా మనసుని మానసికంగా సిద్ధ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తీసుకునే ఆహారం పరిమితి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మెదడుని, శరీరాన్ని కష్టపెట్టడం చాలా కష్టం అని చెప్పారు. నిపుణులు కూడా ఇలా తక్కువ టైంలో కిలోలకొద్ది బరువు తగ్గడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే అవకాశాలు ఎక్కువని పదేపదే హెచ్చరిస్తుంటారు. అదే విషయాన్ని ఇక్కడ ఈ బాలీవుడ్ హీరో ధైర్యంగా బహిర్గతం చేశారు. చాలామంది ఇలా చెప్పకపోవడం లేదా సమస్యలు వస్తాయనే అవగాహన లేక గుడ్డిగా అనుసరించి ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకుంటున్నారని అన్నారు నిపుణులు.(చదవండి: తన తాతను గుర్తుచేసుకున్న కమలా హారిస్ ! నెటిజన్లు ఫైర్) -
బరువు తగ్గాలనుకుంటున్నారా? మీరు ఊహించని, బ్రహ్మాండమైన చిట్కా!
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇలా ఏదైనా సరే.. చకా చకా పది నిమిషాల్లో పూర్తి చేసేయడం మీకు అలవాటా? నిదానంగా, నెమ్మదిగా తినే టైం లేదంటూ ఏ పూటకాపూట భోజనాన్ని హడావిడిగా లాగించేస్తుంటారా? అయితే మీరీ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. పని ఒత్తిడి, సమయం లేకపోవడమో, కారణంగా ఏదైనా గానీ వేగంగా ఆహారం తింటే బరువు పెరగడంతోపాటు, అనేక ఇతర సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. మనం తినే ఆహారంలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందాలన్నా, చక్కగా జీర్ణం కావాలన్నా ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం నమల కుండా మింగటం వల్ల ఆహారం జీర్ణం కాక జీర్ణక్రియ సమస్యలు, మలబద్దక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు తొందర, తొందరగా భోజనం చేసే వారిలో షుగర్ లెవెల్స్ పెరిగి, మధుమేహం, ఊబకాయం సమస్య వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. నెమ్మదిగా తినడం మీరు ఊహంచలేని ఎక్కువ ప్రయోజనాలనే అందిస్తుంది. అధిక బరువు, దాని వల్ల వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. జీర్ణ రసాలు సరిగ్గా విడుదలయ్యేందుకు సాయ పడుతుంది. ఆహారంలోని అన్ని పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది. ఫలితంగా, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాడీ మన సొంతమతుందిబరువు తగ్గడం: బరువు తగ్గించుకునే క్రమంలో డైటింగ్, వ్యాయామం మాత్రమే కాదు. మనం పెద్దగా పట్టించుకోని అంశం ఏమిటంటే ఆహారాన్ని సరిగ్గా నమలడం. దీంతో మన లక్ష్యంలో మరి కొన్ని కేజీల బరువు తగ్గవచ్చు. అవును, మీరు చదివింది నిజమే.నెమ్మదిగా తినడం అంటే క్యాలరీల వినియోగాన్ని నియంత్రించడమే. దీని వలన జీర్ణక్రియ మెరుగుపడి పోషకాల శోషణను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.బరువు తగ్గడంలో నమలడం ఎలా సహాయపడుతుంది?ఆహారాన్ని సరిగ్గా నమలడం జీర్ణక్రియ సక్రమంగా జరగడం మమాత్రమే కాదు , డా మెదడుకు ఆకలి , సంపూర్ణతను ప్రభావితం చేసే సంకేతాలను పంపుతుంది. నిదానంగా , పూర్తిగా నమిలే వ్యక్తులు తక్కువ తినడానికి ఇష్టపడతారని అధ్యయనాలు నిరూపించాయి. ఇది కాలక్రమేణా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అపెటైట్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతీ ముద్దను 40 సార్లు నమిలిన పాల్గొనేవారు 15 సార్లు మాత్రమే నమిలే వారితో పోలిస్తే 12 శాతం తక్కువ కేలరీలు వినియోగిస్తారు. ఆకలిని నియంత్రించే గ్రెలిన్ అనే హార్మోన్, సంతృప్తిని నియంత్రించే లెప్టిన్ హార్మోన్. ఎంత ఎక్కువ నమలితే, అంత అతిగా తినడాన్ని అడ్డుకుంటాయి. ఫలితంగా కడుపు నిండిన భావన తొందరగా కలుగుతుంది.మైండ్‌ఫుల్ ఈటింగ్ అకాడెమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ జర్నల్‌లో ప్రచురించినదాని ప్రకారం శ్రద్ధగా ఆహారాన్ని నమలడం, ఇష్టపూర్వకంగా ఆస్వాదించడం చాలా అవసరం. ఉరుగుల ప్రపంచంలో స్థిమితంగా కూచొని నాలుగుముద్దలు తినే పరిస్థితి కరువవుతోంది. అందుకే చాలా మంది గబా గబా ఇంత లాగించేసి ఆఫీసులకు పరుగులుతీస్తారు. మరికొంతమంది ప్రయాణంలోనో, టీవీ చూస్తూనో, ఫోన్, కంప్యూటర్ చూస్తూనో తింటే, పరధ్యానంలో నియంత్రణ లేకుండానే ఎక్కువ తినేస్తారు. ఇలా చేయడం వల్ల అజీర్ణం, అసౌకర్యం, ఉబ్బరం లాంటి సమస్యలొస్తాయి. నమిలి తినడం వల్ల బరువు తగ్గే క్రమంలో తీసుకునే ఆహారం, కేలరీల మీద శ్రద్ద పెరుగుతుంది. దీంతో మనం అనుకున్నదాని ప్రకారం బరువు తగ్గడం, స్లిమ్‌గా మారడం మరింత సులవవుతుంది. మరో ప్రయోజనం ఒత్తిడి తగ్గుతుంది. ఆహారాన్ని జాగ్రత్తగా నమలడం వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. -
ప్లేట్ మీల్స్ ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు..!
బరువు తగ్గడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. వ్యాయమాలు, డైట్లని ఒకటి కాదు. ఎక్కడ ఏ తేడా కొడుతోందో గానీ బరవు తగ్గక భారంగా నిట్టూర్చుతాం. అయితే ఇలాంటి విషయంలో పోషకాహర నిపుణులు సహాయం తప్పనిసరి. అందుకోసం ఎలాంటి టెక్నిక్ ఫాలో అవ్వాలో సోషల్ మీడియాలో ఓ ప్రముఖ పోషకాహర నిపుణురాలు దీప్సిఖా జైన్ వివరించారు. మనం తీసుకునే ప్లేట్ మీల్స్‌లో అన్ని పోషకాలు ఉండేలా బ్యాలెన్సింగ్‌గా తీసుకుంటే చాలని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ బ్యాలెన్సింగ్ ప్లేట్ మీల్స్ టెక్నిక్..!.మనం తీసుకునే ప్లేట్ మీల్స్‌లో ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారమే తీసుకుంటాం. ఐతే ఇలా ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని చెబుతున్నారు పోషకాహార నిపుణులు దీప్సిఖా జైన్. ముఖ్యంగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారం, ప్రాసెస్ చేసిన ఫుడ్ తగ్గిస్తే ఎక్కువ సానూకూల మార్పులు చూడగలమని అన్నారు. అందుకోసం ప్లేట్ భోజనంలో కొద్ది మార్పులు చేయమని సూచిస్తున్నారు. ఇంట్లో వండిన రోటీలు, అన్నం అయితే అతిగా తినేస్తాం. అలాగే బరువు కూడా పెరిగిపోతారు. కాబట్టి సమతుల్యంగా ప్లేట్ మీల్స్ ఉండేలా చూడాలి. అంటే.. స్థూల, సూక్ష్మ పోషకాలను చేర్చడం తోపాటు మనసు పెట్టి తినడం వంటివి కూడా చేయాలని చెప్పారు. బరువు తగ్గేందుకు మన భోజనం ప్లేట్లో నాలుగు రకాలుగా ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.మొదటిది సలాడ్‌తో ప్రారంభించాలి, పచ్చికూరగాయలతో చేసిన ఓ కప్పు సలాడ్‌తో ప్రారంభించాలి. ఇది మంచి బ్లడుషగర్కి దోహదపడుతుంది. రెండోది ప్రోటీన్‌తో భర్తీ చేయాలి అంటే పప్పు, పనీర్ సబ్దీ లేదా నచ్చనీ ప్రోటీన్ మూలం తప్పనిసరిమూడోది ప్రోబయోటిక్స్ లేదా ప్రీబయోటిక్స్ మూలంతో నింపాలి. అంటే రైతా లేదా పెరుగుతో తీసుకోవచ్చు. ఇది జీర్ణ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నాలుగు కార్బోహైడ్రేట్ల కోసం చివరగా మల్టీగ్రెయిన్ రోటీని ఎంచుకోవాలి. ఇలా తీసుకుంటే కార్బోహైడ్రేట్లపై నియంత్రణ ఉంటుంది.ఈ నాలుగింటిని తప్పనిసరిగా ప్లేటు భోజనంలో ఉండేలా చూసుకుంటే అన్ని రకాల పోషకాలు విటమిన్లు శరీరానిక అందడమే కాకుండా బుద్దిపూర్వకంగా తింటారు. పైగా అధికా కేలరీలను తీసుకోకుండా నియంత్రించగలుగుతాం. ఇది ఒక రకరంగా ఆరోగ్యకరమైన రీతీలో భోజనం తీసుకునేందుకు సహాయపడుతుంది కూడా అని చెబతున్నారు పోషకాహార నిపుణురాలు దీప్సిఖా జైన్. View this post on Instagram A post shared by Deepsikha Jain (@fries.to.fit) (చదవండి: ఆ తల్లి గొప్ప యోధురాలు': 55 ఏళ్ల వయసులో..!) -
బరువు తగ్గడంలో 'పంచకర్మ' ది బెస్ట్..!
బుల్లితెర నటుడు రోహిత్ రాయ్ అన్‌స్టాపబుల్ పోడ్కాస్ట్లో రోహిత్ బోస్ రాయ్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తనకు మంచి పిట్నెస్ మెయింటెయిన్ చేయడంలో పంచకర్మ ఎలా ఉపయోగపడిందో వెల్లడించారు. పంచకర్మ బరువు తగ్గడంలోనే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎలా సహాయపడుతుందో వివరించాడు. ఆయుర్వేదం పద్ధతులన్నీ ఆర్యోప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. ఆయుర్వేద పంచకర్మ అనేది ప్రాచీన భారతదేశం నుంచి వచ్చిన సాంప్రదాయ నిర్విషీకరణ, పునరుజ్జీవన చికిత్స. ఇది బరువుని తగ్గించడంలో ఎలా సహాయపడుతుందంటే..రోహిత్ బోస్ రాయ్ 2021లోనే తనకు ఆయుర్వేదం గురించి తెలిసిందన్నారు. తాను కేరళకి వెళ్లినప్పుడే ఆయుర్వేదానికి సంబంధించిన పంచకర్మ గురించి తెలుసుకున్నట్లు వివరించారు. ఆయన జీర్ణ సమస్యలతో కేరళకి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ శరీరాన్ని శుభ్రపరచడంతో ఈ పంచకర్మ చికిత్స ప్రారంభమవుతుందని అన్నారు. కేవలం 14 రోజుల్లోనే ఆరు కిలోల బరువుని తేలిగ్గా తగ్గానని అన్నారు. పూర్తిగా నీటి బరువు లేకుండా పునరుజ్జీవనం పొందానన్నారు. అక్కడ తనకు అలారం లేకుండా ఉదయం ఆరుగంటల కల్లా మేల్కోవడం అలవాటయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ఈ పంచకర్మ తనకు వార్షిక కర్మగా మారిందని పేర్కొన్నారు. ఏడాదికి రెండుసార్లు లేదా షెడ్యూల్‌ని అనుసరించి పదిరోజుల పాటు చేస్తానని అన్నారు. ఇక్కడ పంచకర్మ అనేది ఐదు చికిత్సలని అర్థం. ముందుగా వామన(వాంతులు), విరేచన(ప్రక్షాళన), బస్తీ(ఎనిమా), నాస్య(నాసికా క్తీనింగ్), రక్తమోక్షణ(రక్తాన్ని శుద్ధిచేయడం). ఇక్కడ ప్రతి ప్రక్రియ నిర్విషీకరణ అంశాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది శరీర వాత, పిత్త,కఫా దోషాలను నివారించి సమతుల్యతను ప్రోత్సహిస్తుంది.బరువు ఎలా తగ్గుతారంటే..శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగించి జీవక్రియ ప్రక్రియలను మెరుగ్గా ఉంచుతుంది. ఇది బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంఇందులో వాంతులు, విరేచనాలతో శరీరాన్ని శుభ్రపరచడం మొదలుపెడతామో అప్పుడు జీర్ణక్రియ మెరుగ్గా ఉండి పోషకాల శోషణ సామర్థ్యం పెరుగుతుంది. అంతేగాదు అతిగా తినడాన్ని నివారిస్తుంది. జీవక్రియను సమతుల్యం చేస్తుందిపంచకర్మ శరీర దోషాలను సమన్వయం చేసి జీవక్రియ చర్యలను మెరుగ్గా ఉంచుతుంది.. ఉదాహరణకు, కఫా దోషంలో అసమతుల్యత తరచుగా నిదానమైన జీవక్రియ, బరువు పెరిగేందుకు కారణమవుతుంది. దీనిలోని బస్తీ, నాసికా చికిత్సలు కఫ దోషాలను నివారిస్తాయి. పోషకాల శోషణను మెరుగవుతుంది..జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేసి, శరీరం ఆహారం నుంచి పోషకాలను సులభంగా గ్రహించేలా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మెరుగైన పోషక శోషణ శక్తి స్థాయిలను నిర్వహించడంలో ఉపయోగపడుతుంది. ఇది అలసటను తగ్గించడంలోనూ, ఆరోగ్యకరమైన ఆకలిని ప్రోత్సహించడంలోనూ సహాయపడుతుంది.జీవనశైలి మార్పులుచికిత్సతో పాటు జీవనశైలి, ఆహారంలో మార్పులు తప్పనిసరి. పంచకర్మ సమయంలో, ప్రజలు తరచుగా నిర్విషీకరణకు మద్దతిచ్చే ఆహారాన్ని అనుసరించమని సలహా ఇస్తారు. అంటే.. జీర్ణమయ్యే ఆహారాలు, సూప్‌లు, ఉడకబెట్టిన పులుసులు, ఆవిరితో ఉడికించిన కూరగాయలు వంటివి తీసుకోవాలి. ఈ ఆహార మార్పులు తక్కువ కేలరీలు తీసుకునేలా చేసి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది. ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది. సున్నితమైన వ్యాయామాలు, యోగా అభ్యాసాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, జీవక్రియ రేటును పెంచుతాయి. రెగ్యులర్ శారీరక శ్రమ కూడా పంచకర్మలానే బరువు తగ్గడంలో సహాయపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఫ్యాటీ లివర్ ఉంటే గుండెపోటు వస్తుందా?) -
ఆరునెలల్లోనే 610 కిలోల నుంచి 63 కిలోలకు తగ్గాడు..ఏం చేశాడంటే..?
ప్రపంచంలోనే అత్యంత బరువుగా ఉన్న రెండో వ్యక్తిగా ఖలీద్ బిన్ మొహసేన్ షరీ అనుహ్యంగా కిలోల కొద్ది బరువు తగ్గాడు. అదికూడా స్వలం కాలంలోనే అన్ని కిలోలు బరువు తగ్గి ఆశ్యర్యపరిచాడు. అంతలా బరువు తగ్గినందుకు గానూ ఖలీద్ సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేసి తన బరువుని తగ్గించుకున్నాడు. అందుకు సౌదీ అరేబియా రాజు ఎలాంటి సాయం అందించాడు తదితరాల గురించి సవివరంగా చూద్దాం. ఒకప్పుడూ సజీవంగా ఉన్న అత్యంత బరువైన రెండో వ్యక్తిగా పేరుగాంచిన ఖలీద్ సుమారు 546 కిలోల బరువు తగ్గాడు. 2013 వరకు ఖలీద్ బరువు 610 కేజీలు ఉండేవాడు. ప్రాథమిక అవసరాలకు కూడా స్నేహితులు, కుటుంబసభ్యులపై ఆధారపడే స్థాయికి అతని పరిస్థితి దిగజారింది. ఖలీద్ దుస్థితిని చూసి చలించిపోయిన సౌదీ రాజు అబ్దుల్లా అతని ప్రాణాలు కాపాడేందుకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉన్నత స్థాయి వైద్యం అందేలా ఏర్పాటు చేశాడు. ముందుగా ఖలీద్‌ను జజాన్‌లోని అతని ఇంటి నుంచి ఫోర్క్లిఫ్ట్ సాయంతో ప్రత్యేకంగా రూపొందించిన బెడ్ని ఉపయోగించి రియాద్‌లోని షహద్ మెడికల్ సిటీకి తీసుకొచ్చారు.కఠినమైనమైన ఆహార నియమావళితో చికిత్సను ప్రారంభించారు. దీన్ని అమలు చేసేలా సుమారు 30 మంది వైద్య నిపుణుల బృందాన్ని నియమించారు. అంతేగాదు ఖలీద్ చికిత్సలో భాగంగా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, కస్టమైజ్డ్ డైట్, ఎక్సర్సైజ్ ప్లాన్, ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ సెషన్లు వంటివి అందించారు. ప్రముఖ నిపుణులు సాయంతో ఖలీద్ బరువు తగ్గడంలో అద్భుతమైన ఫలితాలు చూశాడు. అంతేగాదు ఖలీద్ కేవలం ఆరు నెలల్లోనే దాదాపు సగం బరువును కోల్పోయాడు. చెప్పాలంటే 2023 నాటికి 542 కేజీలు తగ్గి ఆరోగ్యకరంగా 63.5 కిలోలకు తగ్గాడు. ఇక్కడ ఖలీద్ అనేక అదనపు చర్మ తొలగింపు శస్త్ర చికిత్సలు అవసరం అవుతుంది. ఎందుకంటే కొత్త శరీర ఆకృతికి అనుగుణంగా చర్మం ఉండదు. అంతేగాదు ఖలీద్‌ని వైద్యులు "ది స్మైలింగ్ మ్యాన్" అని ముద్దుగా పిలుచుకుంటారు.(చదవండి: ఫుడ్ మెమొరీస్.. విభజన టైంలో ఈ వృద్ధుల ‘చేదు’ అనుభవాలు!) -
సారా అలీఖాన్ వెయిట్ లాస్ జర్నీ..
-
నాలా ఎవరూ చేయకండి.. చాలా ప్రమాదం: హీరో రామ్
సినిమాల కోసం హీరోహీరోయిన్లు చాలా కష్టపడుతుంటారు. రిలీజ్ టైంలో ఇచ్చే ఇంటర్వ్యూల్లో ఈ విషయాల్ని బయటపెడుతుంటారు. యంగ్ హీరో రామ్ కూడా తన ఒక్క నెలలలో 18 కిలోలు ఎలా తగ్గానో చెప్పుకొచ్చాడు. అయితే తనలా ఎవరూ ప్రయత్నించొద్దని మాత్రం హెచ్చరిస్తున్నాడు. ఇంతకీ రామ్ ఏం చెప్పాడంటే?(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)''డబుల్ ఇస్మార్ట్' కోసం పూరీ జగన్నాథ్ చెప్పిన క్లైమాక్స్ కిక్ ఇచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్'లానే ఇందులోనూ షర్ట్ లేకుండా క్లైమాక్స్ చేయాలనుకున్నాం. ఆ పార్ట్ అంతా నవంబరులోనే షూట్ చేయాలి. స్కంద రిలీజైన తర్వాత నాకు 2 నెలలు మాత్రమే సమయముంది. దాంతో వెంటనే బాలిలో ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడే నెలరోజులు ఉండి ఫుల్లుగా వర్కౌట్ చేసి బరువు తగ్గాను. ఇలా తక్కువ టైంలో బరువు తగ్గడం ఆరోగ్యానికి ప్రమాదం. నేను చేసినట్లు ఎవరూ ప్రయత్నించొద్దు' అని రామ్ చెప్పుకొచ్చాడు.రామ్ కాబట్టి హెల్తీ డైట్ ఫాలో అవుతూ నెలలో 18 కిలోలు అంటే.. 86 నుంచి 68 కిలోలకు వచ్చాడు. సాధారణంగా ఇలా ఒకేసారి తగ్గితే మాత్రం శరీరంలో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదముంది. రామ్-పూరీ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. పెద్దగా బజ్ అయితే లేదు. చూడాలి ఎలాంటి ఫలితం అందుకుంటుందో?(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!) View this post on Instagram A post shared by RAm POthineni (@ram_pothineni) -
సారా అలీఖాన్ వెయిట్ లాస్ జర్నీ..96 కిలోల నుంచి..!
అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం పరంగా సారాకి నూటికి నూరు మార్కులు పడతాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. అలాగే ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ జాబితాలో చోటు కూడా దక్కించుకుంది. అలాంటి సారా సినీ ఇండస్ట్రీలోకి రాక మునుపు ఏకంగా 96 కిలోలు ఉండేది. ఆ తర్వాత సముతుల్య ఆహారం, వ్యాయామ దినచర్యలతో దాదాపు 40కి పైగా కిలోలు తగ్గిం 45 కిలోల బరువుకి చేరుకుంది. అంతేగాదు తాను యుక్తవయసులో ఊబకాయం, పీసీఓడీ సమస్యలతో పోరాడనని కూడా పేర్కొంది. అయితే పీసీఓడికి ఎలాంటి నివారణ లేదు. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ దినచర్య ద్వారానే సాధ్యం. అందుకోసం అని సారా సమతుల్య జీవనశైలికి కట్టుబడి ఉండటంతో బరువు తగ్గడమే గాక పీసీఓడీని నిర్వహించడంలో సహాయపడింది. ఇక్కడ సారా ఎలాంటి డైట్, వ్యాయామాలు ఫాలో అయ్యింది. అవి తనకు ఏవిధంగా సహాయపడ్డాయో చూద్దామా..!సారా అలీ ఖాన్ బరువు తగ్గించే ప్రయాణంలో తక్కువ కార్బ్, అధిక ప్రోటీన్ ప్లాన్‌పై దృష్టి సారించి విజయవంతమయ్యింది. ఆమె రోజులో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం ఒక భోజనానికే పరిమితం చేసింది. శరీరానికి శక్తినిచ్చేలా కొత్తిమీర, జీలకర్ర లేదా పండ్లు, కూరగాయాలతో చేసే స్మూతీ వంటి వాటిని, అలాగే ఇంట్లో తయారు చేసే పానీయాలను తీసుకునేది. రోజుని గ్రీన్ లేదా నిమ్మ తేనెతో ప్రారంభించేది. ఇక్కడ సారా శరీర బరువుని తగ్గించడంలో సహాయపడింది కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు, టోన్డ్ బాడీని పొందేలా వర్కౌట్లు చేసేది. ప్రారంభంలో తనకు ఇవన్నీ కష్టంగా అనిపించేవని తెలిపింది కూడా. ఐతే ఎంత ఇబ్బందిగా ఉన్నా..క్రమతప్పకుండా చేయడమే గాక కార్డియో వ్యాయామాలు చేసినట్లు తెలిపింది. అంతేగాదు అదనపు కిలోలు తగ్గించుకునేలా యోగా, పైలేట్స్, వంటివి కూడా చేసింది. ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామాలతో బరువుని అదుపులో ఉంచడమే గాక ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందింది. జీవనశైలిని మార్చుకుని, నిబద్దతతో వర్కౌట్లు చేస్తే ఎవ్వరైన బరవు తగ్గించొచ్చని చాటి చెప్పింది. చాలామంది స్ఫూర్తిగా నిలిచింది సారా.(చదవండి: సౌందర్యం సాధనంగా వెదురు..బోలెడన్ని లాభాలు..!) -
బరువు తగ్గేందుకు కీటో డైట్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
కీటోజెనిక్ లేదా కీటో డైట్‌ని మొట్టమొదటగా 1921లో మూర్చ వ్యాధికి ఉపయోగించేవారు. ఈ డైట్లో అధిక కొవ్వు, తగినంత ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం ఉంటాయి. ఇటీవల అంతా బరవు తగ్గడం కోసి రకరకాల డైట్లు ఫాలో అవుతున్నారు. అందులో ఇది కూడా ఒకటి. ఈ డైట్‌తో బరువు తగ్గడం జరుగుతుంది కానీ పరిశోధనలో ఈ డైట్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, గట్ బ్యాక్టీరియాను తగ్గిస్తాయని తేలింది. ఇది అంత ఆరోగ్యకరమైనది కాదని వెల్లడయ్యిందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్యంగా ఉండటానికి సమహయపడే డైట్‌ని అనుసరించడం ముఖ్యమని చెబుతున్నారు. అసలు ఈ డైట్ ఎలా మంచిది కాదో సవివరంగా చూద్దాం. కీటో డైట్ ఆరోగ్యానికి సురక్షితమైనదేనా కాదా? అని సుమారు 53 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై అధ్యయనం నిర్వహించారు పరిశోధకులు. వారికి తక్కువ చక్కెరతో కూడిన ఆహారం, తక్కువ కార్బోహైడ్రేట్లు, ఇవ్వగా వారి శరీరం కార్బోహైడ్రేట్ల నుంచి వచ్చే గ్లూకోజ్‌కి బదులుగా కాలేయం నిల్వ చేసిన కొవ్వులను ఇంధనంగా ఉపయోగించుకోవడాన్ని గుర్తించారు. దీన్ని కీటోన్ బాడీల ద్వారా కొవ్వులను కాల్చడం అని అంటారు. ఈ డైట్ ప్రకారం వారంతా 20 నుంచి 50 గ్రాముల కంటే తక్కువ పిండిపదార్థాలు తీసుకోవాలి. ఇలా కీటోసిస్ స్థితికి చేరడానికి కొన్ని రోజుల పడుతుంది. ఇందుకోసం అదిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అనేది హానికరమేనని చెబుతున్నారు. ఇక్కడ కీటోడైట్‌లో తీసుకునే ఆహారాల్లో కొబ్బరి నూనె, వెన్న, చికెన్, గుడ్లు, అని కూరగాయలు, కాయధాన్యాలు, పిండి, వోట్స్, చిక్కుళ్ళు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, గింజలు, కాటేజ్ చీజ్, మేక, ఫెటా చీజ్ తదితరాలు ఉంటాయి. అలాగే ఈ డైట్ కోసం వోట్స్, కేకులు శుద్ధి చేసిన పిండితో చేసిన డెజర్ట్‌లు, అధిక కార్బ్ ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ కీటో డైట్‌ని అనుసరిచిన 12 వారాల తర్వాత సగటున శరీరంలో 2.9 కిలోల మేర కొవ్వు తగ్గుతుందన పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ చక్కెర నిరోధిత ఆహారం కారణంగా 2.1 కిలోల బరువు కోల్పోయేలా చేస్తుంది. అందువల్లే చాలామంది ఈ డైట్‌ని అనుసరించేందుకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ డైట్ వల్ల కొన్ని ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో వెల్లడించారు పరిశోధకులు. ఎదురయ్యే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు..ఈ కీటో డైట్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇది ధమనులలో ఫలకం ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ డైట్‌ని అనుసరించే వారి రక్తంలో అననూకూల స్థాయిలో కొవ్వులు పెరిగినట్లు గుర్తించామన్నారు. ఇలా ఏళ్ల తరబడి ఈ డైట్‌ని ఫాలో అయితే దీర్ఘకాలికా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, స్ట్రోక్‌కు దారీతీసే ప్రమాదం ఉంటుందని చెప్పారు. మరోవైపు ఈ తక్కువ చక్కెర ఆహారం చెడు కొలస్ట్రాల్‌ని గణనీయంగా తగ్గించింది కూడా అని చెప్పారు.కీటో డైట్ గట్ మైక్రోబయోమ్ కూర్పును మార్చింది. ముఖ్యంగా బిఫిడోబాక్టీరియాను తగ్గిస్తుంది. ప్రోబయోటిక్స్‌లో తరచుగా కనిపించే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఇది. ఇది 'బీ' విటమిన్లను ఉత్పత్తి చేస్తుంది. వ్యాధికారక హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇలా గట్ బ్యాక్టీరియా తగ్గిపోతే ప్రకోప ప్రేగు వ్యాధి వంటి జీర్ణ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధకత తగ్గి దీర్ఘకాలికి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు పరిశోధకులు.కీటో డైట్ గ్లూకోస్ టాలరెన్స్‌ని తగ్గించింది. అంటే..శరీరం కార్బోహైడ్రేట్లను నిర్వహించడంలో తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని అర్థం. ఎప్పుడైన అధిక కార్బోహైడ్రేట్ తీసుకుంటే మాత్రం దీర్ఘకాలంలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణలు. ఇక్కడ బరువు తగ్గాలనుకుంటే తక్కువ చక్కెర ఉన్న ఆహారాలు మంచివే కానీ ఫైబర్‌తో కూడిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు నిపుణులు.(చదవండి: ఓ సంపన్న కుటుంబం దాష్టికం..ఏకంగా 26 ఏళ్ల పాటు..!) -
వెయిట్ లాస్ స్టోరీ: జస్ట్ 90 రోజుల్లోనే ఏకంగా 14 కిలోలు..!
వెయిట్ లాస్ జర్నీ అనేది ఎప్పటికీ ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే బరువు పెరగడం ఈజీగానీ తగ్గడమే బహు కష్టం. పోనీ వర్కౌట్లు, డైటింగ్లు చేసి బరువు తగ్గించుకోగలమా అంటే.. అంత ఈజీ కాదు. కొన్ని రోజుల చేశాక వామ్మో..! అని స్కిప్ చేసేస్తాం. కానీ ఈ వ్యక్తి మాత్రం జస్ట్ 90 రోజుల్లో ఏకంగా 14 కిలోల బరువు తగ్గి చూపించాడు. ఇంతకీ అతడు అన్ని కిలోల బరువు ఎలా తగ్గాడు? ఏంటీ అతడి ఫిట్నెస్ సీక్రెట్ అంటే..పులక్ బాజ్‌పాయ్ జస్ట్ రెండు నెలల్లోనే 14 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆరోగ్యకరమైన డైట్ ఫాలోవుతూ బరువు తగ్గడం విశేషం. అతడి వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే..ప్రతిరోజూ ఆరోగ్యకరమైన డైట్ తీసుకునేవాడట. రాత్రి పదిగంటలకు తేలికపాటి ఆహారాన్ని తీసుకునేవాడనని చెబుతున్నాడు పులక్. చక్కెరకు, అందుకు సంబంధించిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పాడు. అలాగే బయటి ఆహారం, జంక్‌ఫుడ్ కూడా తీసుకోలేదని తెలిపాడు. పండ్లు, బంగాళదుంపలు, బియ్యం వంటి వాటిని మాత్రం తీసుకున్నట్లు వివరించాడు. ఐతే వారంలో ఒక రోజు మాత్రం ఈ కఠిన డైట్‌కి విరామం ఇచ్చి వెజ్ శాండ్విచ్, తేలికపాటి చక్కెరతో కూడిన కోల్డ్ కాఫీ మాత్రం తీసుకునేలా డైట్ ప్లాన్ చేసుకున్నాడు పులక్. దీంతోపాటు సాధారణ వ్యాయామం, సైక్లింగ్ తప్పనిసరిగా చేసేవాడు. రెగ్యులర్ వ్యాయామం, సైక్లింగ్ ఆహార నియంత్రణ, కేలరీలను బర్న్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగిపడిందని అంటున్నాడు పులక్. చివరిగా పులక్.. "నిలకడగా బరువు తగ్గాలనే నిర్ణయంపై స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే ఆహార నియంత్రణ తోపాటు తీసుకునే విషయంలో శ్రద్ధ వహించడం వంటివి చేస్తే ప్రభావవంతంగా బరువు తగ్గుతాం". అని చెబుతున్నాడు. అంతేగాదు సదా మసులో తాను బరువు తగ్గుతున్నాను, బరువు తగ్గాలి వంటి పాజిట్ ఆటిట్యూడ్‌ని డెవలప్ చేసుకుంటే ఆటోమెటిక్‌గా మన బ్రెయిన్ దాని గురించి ఆలోచిచడం మొదలు పెట్టి డైట్‌ని స్కిప్ చేయాలనే ఆలోచన రానివ్వదని చెప్పుకొచ్చాడు పులక్.(చదవండి: ఆమె స్థైర్యం ముందు..విధే చిన్నబోయింది..! ఆస్తమాతో పోరాడుతూ..) -
12-3-30 ట్రెడ్మిల్ వర్కౌట్, దెబ్బకు ఊబకాయం పరార్! ఇంట్రస్టింగ్ స్టోరీ
బరువు తగ్గడం అనేది చిటికెలోనో, చిట్కాలతోనో జరిగేది కాదు. దీనికోసం సమతుల ఆహారం, నిరంతర వ్యాయామం కావాలి. వీటన్నింటికీ మించి పట్టుదల, చిత్తశుద్ధి, నిరంతర సాధన ఉండాలి. ఈ విషయాన్నే అక్షరాలా నిజం చేసి చూపించింది ఇంగ్లాండ్‌లోని నార్త్ ఆప్టన్షైర్కు చెందిన 20 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మిల్లీ స్లేటర్. చిన్న జిమ్ చిట్కాతో ఏడాది పాటు శ్రమించి బరువు ఎలా తగ్గిందో తెలుసుకుందాం రండి!మిల్లీ స్లేటర్ 2023లో 115 కేజీల బరువుండేది. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. జిమ్ చేసి ఒక్క ఏడాదిలో48 కిలోల బరువు తగ్గింది. ఇపుడు టోన్డ్ ఫిజిక్‌తో నాజూగ్గా తయారైంది. ఇపుడు ఆమె బరువు 67 కిలోలు. తన వెయిట్ లాస్ జర్నీని టిక్‌టాక్‌లో(టిక్‌టాక్‌పై ఇండియాలో నిషేధం) పంచుకుంది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.న్యూస్‌వీక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ట్రెడ్‌మిల్‌పై వెయిట్ ట్రైనింగ్, ట్రెడ్మిల్ ఇంక్లైన్ వాకింగ్ ద్వారా తన జిమ్ అనుభవాన్ని గణనీయంగా పెంచిందని స్లేటర్ వెల్లడించింది. ఫిట్నెస్కి పోషకాహారం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో వివరించింది. జిమ్‌లో సాధనతోపాటు, తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ల ఆహారంపై దృష్టి సారించాలని పేర్కొంది. వ్యాయామం అనేది ఆహ్లాదకరంగా ఉండాలని సూచించింది. 30 నిమిషాల పాటు గంటకు 3 మైళ్ల వేగంతో 12 శాతం గ్రేడ్‌తో ట్రెడ్మిల్ వర్కౌట్ చేస్తానని తెలిపింది. ఇది లారెన్ గిరాల్డో చెప్పిన 12-3-30 ట్రెడ్మిల్ వర్కౌట్ లా ఉంటుందని స్లేటర్ తెలిపింది. మరోవైపు బయోమెకానిక్స్ జర్నల్ ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం చదునైన నేల మీద నడిచిన దానితో పోలిస్తే ట్రెడ్మిల్ మీద 5 శాతం ఇంక్లైన్లో నడిస్తే 17 శాతం, 10 శాతం ఇంక్లైన్లో నడిస్తే 32 శాతం అదనంగా కేలరీలు ఖర్చు అవుతాయట. మరోవైపు 12-3-30 వర్కవుట్‌తో కేవలం 30 నిమిషాల్లో 150 పౌండ్ల బరువున్నవ్యక్తి దాదాపు 300 కేలరీలు ఖర్చు చేయగలడని హెల్త్ సెంట్రల్ చెబుతోంది. -
జిమ్ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్
‘‘వ్యాయామం చేయలేదు. రన్నింగ్ చేయలేదు. సర్జరీ అసలే లేదు. మెడికేషన్ పాటించలేదు... కానీ 21 రోజుల్లోనే పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను. బాగా బరువు తగ్గిపోయాను’’... ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలో తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి మాధవన్ చెప్పిన మాటలు ఇవి. ఈ ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవన్ వెల్లడించగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాధవన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన బయోగ్రాఫికల్ డ్రామా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా మాధవన్ ఈ సినిమాను తెరకెక్కించి, టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రంలో మాధవన్ వివిధ వయస్సుల్లో కనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లో బాగా బరువు పెరిగి, పొట్ట ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. ఈ లుక్ నుంచి మాధవన్ మళ్లీ తన సాధారణ లుక్కు మారేందుకు కేవలం 21 రోజులు మాత్రమే పట్టిందట. ఆ మార్పు గురించి మాధవన్ మాట్లాడుతూ– ‘‘నేనొక డాక్టర్లా మాట్లాడుతున్నానని అనుకోవచ్చు. నా శరీరానికి ఏది మంచి ఆహారమని భావించానో దాన్నే తిన్నాను. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’కి దర్శకత్వం వహిస్తున్నప్పుడు కాస్త పొట్టతో కనిపించేవాడిని. ఆ తర్వాత 21 రోజులకు నార్మల్‌గా మారిపోయాను. ఇదంతా నేను తీసుకున్న ఆహారం వల్లే జరిగిందని అనుకుంటున్నాను. చెప్పాలంటే నా జీవితంలోనే సైన్స్ ఓ భాగమైపోయిందని అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా ‘ఎక్స్’ వేదికగా ఈ విషయంపై మాధవన్ స్పందిస్తూ– ‘‘అప్పుడప్పుడూ ఉపవాసం ఉన్నాను. ఆహారాన్ని 45 నుంచి 60 సార్లు బాగా నమిలాను (మీ ఆహారాన్ని తాగండి... నీటిని నమలండి). సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకే రోజులోని నా చివరి భోజనం పూర్తయ్యేది. జ్యూస్‌లు ఎక్కువగా తాగాను. ఆకుపచ్చ కూరగాయలు తిన్నాను. ఉదయాన్నే సుదీర్ఘంగా నడిచేవాడ్ని. నిద్రపోవడానికి 90 నిమిషాల ముందు ఏ స్క్రీనూ చూడలేదు. రాత్రివేళ గాఢంగా నిద్రపోతాను. నా శరీరానికి, నా ఆరోగ్యానికి, నా జీవన శైలికి, జీవక్రియకు తగ్గట్లుగా ఆహారాన్ని తీసుకున్నాను. దాంతో క్రమ క్రమంగా మార్పు వచ్చింది’’ అన్నారు. No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan (@aadaavaan) July 17, 2024 -
స్లిమ్‌గా మారిన భూమి పడ్నేకర్!.. జస్ట్ నాలుగు నెలల్లో ఏకంగా..!
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఎంత లావుగా ఉండేదో అందరకీ తెలిసిందే. ఆమె తన తొలి చిత్రం దమ్ లగా కే హైషా కోసం 32 కిలోలు పెరిగి ట్రోలింగ్కి గురయ్యింది. ఆ మూవీలో ఆమె అధిక బరువుతో ఉండే భార్య పాత్రను పోషించింది. అయితే ఆమె సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే బరువు తగ్గే ఫిట్నెస్ ప్రయాణంపై దృష్టిసారించింది. అయితే అనేహ్యంగా జస్ట్ 4 నెలల్లోనే మంచిగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు అందుకు తనకు ఉపకరించిన డైట్ ప్లాన్లు, ఫిట్నెస్ చిట్కాలను కూడా చెప్పుకొచ్చింది. అవేంటంటే..భూమి ఫడ్నేకర్ ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గే క్రమాన్ని ఎంచుకుంది. తనకు ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేయలేదట. నచ్చినవన్నీ మితంగా తీసుకుంటూ ఉండేది. ప్రధానంగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది. ఎక్కువగా గుడ్లు, మిస్సీ రోటీ, ఉప్మా, పోహా, గ్రిల్డ్ చికెన్, మల్టీ-గ్రెయిన్ రోటీలు, రాజ్గిరా వంటి ఫుడ్స్ తీసుకునేది. ఉదయ స్కిమ్డ్ పాల తోపాటు ముసేలి తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. మధ్యాహ్న భోజనంలో పప్పుతో కూడిన ఆహారం తప్పక తీసుకున్నట్లు పేర్కొంది. ఇక సాయంత్రం స్నాక్స్, కప్పు గ్రీన్ టీ తోపాటు పండ్లు ఉండాల్సిందే. అలాగే బాదం, వాల్నట్లను తినేందుకు ఇష్టపడేది. రాత్రి 8.30 గంటలకు డిన్నర్ చేయడానికి ఇష్టపడేది. అయితే భోజనంలో కాల్చిన చేపలు, చికెన్, పనీర్, టోపు, ఉడికించిన కూరగాయలను తీసుకున్నట్లు వివరించింది భూమి. వర్కౌట్లు..భూమి హై ఇంటెన్సిటీ కసరత్తుల జోలికి పోలేదు. కానీ పరిగెత్తడం, ఫంక్షనల్ శిక్షణ, స్విమ్మింగ్, డ్యాన్స్, ఏరోబిక్స్, వంటి వ్యాయామాలు చేసింది. బరువు తగ్గిన తర్వాత కూడా ఫిట్‌గా ఉండేలా కార్డియో, వెయిట్ లిఫ్టింగ్, పైలేట్స్, స్ట్రెచింగ్లను వంటివి చేస్తూనే ఉంది. అయితే షుగర్‌కి మాత్రం దూరంగానే ఉంది. తొందరగా బరువు తగ్గేలా అన్ని రకాల స్వీట్స్‌కి దూరంగా ఉన్నట్లు తెలిపింది భూమి. అలాగే రాత్రిపూట పిండిపదార్థాలు తీసుకోవడం తగ్గించింది. ఇక ప్రతిరోజూ కనీసం ఆరు నుంచి ఏడు లీటర్ల నీటిని కచ్చితంగా తాగేది. ఈ విధమైన డైట్ ప్లాన్ల తోపాటు మంచి ఆహారపు అలవాట్లతో అభిమానులే గుర్తుపట్లలేనంత స్లిమ్‌గా అందంగా మారిపోయింది భూమి. (చదవండి: ముత్యాలతో చేసిన చీరలో షానాయ కపూర్..! ఏకంగా 'లక్ష'..!) -
నేహా ధూపియా వెయిట్ లాస్ జర్నీ!..ఏకంగా 14 గంటలు..!
మహిళలు ప్రసావానంతరం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు తల్లికి మహాకష్టం. వారు తమ పనులు తాము చేసుకునే స్థాయికి చేరుకునేంత వరకు కూడా పిలల సంరక్షణ తల్లిదే భాద్యత. అందువల్ల ఏ మహిళైన తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారిండం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయినా కొందరూ తగ్గగలుగుతారు. అదేమంతా అసాధ్యమైన విషయం కాదని బరువు తగ్గి మరి చూపించింది బాలీవుడ్ నటి నేహా ధూపియా. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె ప్రసవానంతరం విపరీతమైన బరువు పెరిగిపోయింది. అయితే జస్ట్ ఒక్క ఏడాదిలోనే తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి మరీ కిలోలు కొద్ది బరువు తగ్గింది. అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందో కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంది.బరువు తగ్గడం అనేది అంత సులభమైనది కాదు. అందులోనూ ప్రసవానంతర బరువు తగ్గడం అంటే ఇంకా కష్టం. కానీ నేహా తన సంకలప్పంతో బరువు తగ్గి మరీ చూపించింది. అలా ఆమె ఏకంగా 23 కిలోల వరకు బరువు తగ్గిపోయింది. 43 ఏళ్ల ధూపియా ఇదంతా అంత సులభమైనది కాదంటూ తన వెయిట్ లాస్జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ముందుగా బరువు తగ్గేందుకు చేసిన వర్కౌట్లు వంటి వాటితో విపరీతమైన అలసట, వొళ్లు నొప్పులు వచ్చేసేవి. ఆ తర్వాత తీసుకునే డైట్‌పై ఫోకస్ పెట్టానంటు చెప్పుకొచ్చింది. తీసుకునే ఆహారంలో గ్లూటెన్ లేకుండా జాగ్రత్త పడింది. దాదాపు 14 గంటలు ఉపవాసం వంటివి చేసి 23 కిలోలు మేర బరువు తగ్గినట్లు తెలిపింది. అయితే ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామం,డైట్ విషయంలో నియమాలు పాటించినట్లు వివరించింది. అందువల్ల సులభంగా బరువు తగ్గి, మంచి ఫిట్‌గా ఉండగలిగానని చెప్పింది నేహా. ఇక్కడ ఒక్కోసారి డైట్ లేదా వ్యాయామాలు స్కిప్ అయిన నిరాశపడొపోకుండా..తర్వాత రోజు నుంచి కొనసాగించడమే గాకుండా బరువు తగ్గుతాను అనే పాజిటివ్ ఆటిట్యూడ్‌ని డెవలప్ చేసుకుంటుంటే ఆటోమేటిగ్గా చక్కగా బరువు తగ్గిపోతారని చెబుతోంది నెహా ధూపియా. అంతేగాదు వాకింగ్, జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గాలనుకుంటే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వమంటూ పలు ఆసక్తికర విషయాలు ూడా చెప్పుకొచ్చింది.అవేంటంటే..సమతుల్య ఆహారం తీసుకోండిఅతిగా తినకుండా కొలత ప్రకారం తీసుకునేలా మైండ్ సిద్ధం చేసుకోండిలీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వండినీరు బాగా త్రాగండిచక్కెర పానీయాలు నివారించండిజంపింగ్, రన్నింగ్ లేదా డ్యాన్స్ వంటివి చేయండిపుష్ అప్స్, స్క్వాట్ల, ప్లాంక్‌లు వంటి వ్యాయామాలు చేయండికాస్త విరామం ఇచ్చి ఇంటి పనుల్లో నిమగ్నం అవ్వండి. మైండ్‌ఫుల్ ఈటింగ్ వంటి టెక్నీక్లతో ఆకలిని నియంత్రించండి. తగినంత నిద్రపోండి.ఇవన్నీ క్రమం తప్పకుండా ఫాలో అయితే ఇంట్లోనే సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోంది నేహా ధూపియా.(చదవండి: వర్షాకాలం..వ్యాధుల కాలం..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!)