
నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినపుడు బొద్దుగా ముద్దుగా ఉన్న కీర్తి సురేష్ ఉన్నట్టుండి సన్నగా మారి అభిమానులను అశ్చర్యపర్చింది. అరంగేట్రంలోనే అదరగొట్టిన ఈ మలయాళ కుట్టి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించు కుంది. ఇక ఆ తర్వాత మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది.
2018లో మహానటి సావిత్రిలాగా కాస్త బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్ ఆ తరువాతమహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కారి వారి పాట చిత్రంలో స్లిమ్‌గా కనిపించింది. 2018-19లో వేగంగా బరువు తగ్గింది. దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని విశేషాలను షేర్ చేసింది.
అప్పట్లో కేవలం షూటింగ్‌కి వెళ్లి వచ్చి తినేసి నిద్రపోయేదాన్ని, అందుకే మరీలావుగా కాకపోయినా కొద్దిగాబొద్దుగా కనిపించానని చెప్పుకొచ్చింది. కానీ తరువాత ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టానని ఈక్రమంలో కేవలం 9 నెలల్లో 8 నుంచి 9 కిలోలు బరువు తగ్గానని వెల్లడించింది. కేవలం కార్డియో ద్వారా తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అయ్యానని గుర్తు చేసుకుంది. రోజుకు కనీసం గంట సేపు కార్డియో వ్యాయామాలు చేసేదట. కార్డియోలో చేసినపుడు మజిల్ లాస్ ఉంటుంది. ఎలాంటి స్ట్రెంత్ ట్రైనింగ్ లేకుండానే కార్డియో చేసా త్వరగా బరువు తగ్గాను అని చెప్పింది. దీంతోపాటు, సింపుల్ డైట్ ఫాలో అయ్యానని తద్వారా తొమ్మిది కిలోల బరువు తగ్గానని తెలిపింది. అయితే తన ఇన్‌స్టాలో యెగా,ధ్యానం చేస్తున్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది కీర్తి సురేష్.

నిపుణులేమంటున్నారంటే..
అయితే నిపుణులు ఏమంటారంటే కార్డియో కేలరీలను బర్న్ చేయడంలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, దానిపై మాత్రమే ఆధారపడటం వల్ల కాలక్రమేణా కండరాల నష్టానికి దారితీస్తుంది. స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకోకపోతే కండరాలు బలహీనపడవచ్చు , దీర్ఘకాలంలో మొత్తం ఫిట్‌నెస్ తగ్గవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే స్థిరంగా బరువు తగ్గడ , మెరుగైన ఫిట్‌నెస్ సాధించడాని రెండు కీలక అంశాలపై దృష్టి పెట్టాలి.
ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
మొదటిది ఎంత, ఏమితింటున్నారో పరిగణనలోకి తీసుకోవాలి. కేలరీలపై జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. రెండవది వ్యాయామం.కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ ఈ రెండింటి కలయిక ఆరోగ్యకరమైంది, మెరుగైన ఫలితాలను నిర్ధారిస్తుంది. ఇది కండర ద్రవ్యరాశిని నిర్మించడమే కాకుండా జీవక్రియను మెరుగుపరుస్తుంది. బాడీ షేప్‌నకు, దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుందనేది నిపుణుల మాట.