బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి తనకు జరిగిన అవమానం, వేధింపులపై పోరాడిన తీరు విశేషంగా నిలిచింది. హౌసింగ్ సొసైటీ బోర్డు సభ్యులపై వేధింపులు, అతిక్రమణ , బెదిరింపులను సహిస్తూ మౌనంగా ఉండిపోలేదు ఆమె. వారిపై చట్టపరమైన చర్యలకు దిగి హౌసింగ్ సొసైటీపై రూ.62 లక్షలు దావా వేసింది. సొసైటీలో ఫిర్యాదు చేసి విజయాన్ని సాధించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలందుకుంది. స్టోరీ ఏంటీ అంటే..
బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి తనకు జరిగిన అవమానం, వేధింపులపై పోరాడిన తీరు విశేషంగా నిలిచింది. హౌసింగ్ సొసైటీ బోర్డు సభ్యులపై వేధింపులు, అతిక్రమణ , బెదిరింపులను సహిస్తూ మౌనంగా ఉండిపోలేదు ఆమె. వారిపై చట్టపరమైన చర్యలకు దిగి హౌసింగ్ సొసైటీపై రూ.62 లక్షలు దావా వేసింది. సొసైటీలో ఫిర్యాదు చేసి విజయాన్ని సాధించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలందుకుంది. స్టోరీ ఏంటీ అంటే..
బాధిత యువతి రెడ్డిట్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం అపార్ట్‌మెంట్‌లో తన స్నేహితులతో ఏర్పాటు చేస్తున్న మీట్ ఘర్షణ దారితీసింది. అది చివరికి రూ.62 లక్షల సివిల్ దావా, నిందితులైన బోర్డు సభ్యులకు 20వేల జరిమానా, తొలగింపుతో ముగిసింది. తన ఐదుగురు స్నేహితులు ఆమె ఇంటికి వచ్చినప్పుడు వివాదం మొదలైంది. వారు తన ఫ్లాట్‌కి వచ్చినపుడు, ఎలాంటి సంగీత ధ్వనులు లేకుండా, గోల, గందరగోళం లేకుండా, చాలా కామ్‌గా తమ ఇంట్లో ఆమె వంట చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇంతలో ఆ అపార్ట్‌మెంట్ సొసైటీ సభ్యుడు ఆమె ఫ్లాట్‌కి వచ్చి "బ్యాచిలర్లకు అనుమతి లేదు" అని చెప్పి, ఫ్లాట్ యజమానికి ఫోన్ చేయమని కోరడంతో సమస్య మొదలైంది. తాను తన ఓనర్‌తో మాట్లాడానని, మీ సమస్య ఏంటి అని ప్రశ్నించింది. ఆ తరువాత కొద్దిసేపటికే, నలుగురైదుగురు పురుషులు ఆమె గదిలోకి బలవంతంగా ఎంట్రీ ఇచ్చారు. మద్యం, గంజాయి తాగుతున్నారని ఆరోపిస్తూ నానా యాగీ చేశారు. అంతటితో ఆగిపోలేదు. మరుసటి రోజు ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయాలంటూ మళ్లీ గొడవకు దిగారు. దీంతో ఆమె ఫ్రెండ్స్‌లోని జెంట్స్ వారిని బైటికి నెట్టారు. రెచ్చిపోతున్న ఒక సభ్యుడిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో సొసైటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసు అధికారులు వచ్చి ఆమెను యాజమాన్యాన్ని నిరూపించమని అడిగారు. అయితే తాను ఎవరికి ఎలాంటి ఇబ్బందికి కలిగించలేదంటూ అందుకు నిరాకరించింది. అలాగే లివింగ్-రూమ్ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్‌ను చూపించింది.అలాగే ఆమె CCTV ఆధారాలను బిల్డర్చ సొసైటీ ఛైర్మన్‌కు సమర్పించినప్పుడు, నిందితులైన సభ్యులను వెంటనే తొలగించారు ఒక్కొక్కరికి రూ. 20,000 జరిమానా విధించారని మరో పోస్ట్‌లో వెల్లడించింది.
మరోవైపు వేధింపులు, అతిక్రమణ, దాడి ఆరోపణలతో హౌసింగ్ సొసైటీ, బోర్డు సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రూ. 62 లక్షల పరిహారం చెల్లించాలంటే దావా వేసింది. అలాగే పురుషులు మళ్ళీ తన ఫ్లాట్‌లోకి రాకుండా ఉండేలా శాశ్వత నిషేధాన్ని కూడా ఆమె కోరింది.
సోషల్ మీడియా ప్రశంసలు
ఆమె పోస్ట్‌లు వైరల్ గామారాయి. ఆమె ధైర్యాన్ని , సంకల్పాన్ని నెటిజన్లు కొనియాడారు. ఆ కేసుతో ముందుకు సాగండి—ఎవరూ ఒకరి ఇంట్లోకి చొరబడలేరు” అని ఒకరు ధైర్యం చెప్పారు.


