breaking news
case
-
సందేశ్‌ఖాలీ కేసు: కీలక సాక్షిపైదాడి,కుమారుడు, డ్రైవర్ మృతి
కోల్‌కతా, సాక్షి : పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన సందేశ్‌ఖలి వివాదానికి సంబంధించిన కేసుల్లో కీలక సాక్షిపై దాడి జరిగింది. ఈ ప్రమాదంలో భోలానాథ్ ఘోష్ తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా, అతని చిన్న కుమారుడు , కారు డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఈకేసుకు సంబంధించి బుధవారం కోర్టుకు వెళుతుండగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బోయ్‌ఖలి పెట్రోల్ పంప్ సమీపంలో ఒక ట్రక్కు అమిత వేగంతో వచ్చి అతని వాహనాన్ని ఢీకొట్టింది. ట్రక్కు కారును ఢీకొట్టి, ఈడ్చుకెళ్లి, సమీపంలోని నీళ్లలోకి నెట్టివేసింది. వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘోష్ చిన్న కుమారుడు సత్యజిత్ ఘోష్ (32), కారు డ్రైవర్ సహనూర్ మొల్లా (27) స్పాట్లోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన భోలానాథ్‌ను మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తరలించారు.సందేశ్‌ఖాలి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ తనపై దాఖలు చేసిన అనేక కేసుల్లో ఒకదానికి సంబంధించి బసిర్హాట్ సబ్-డివిజనల్ కోర్టుకు హాజరు కావడానికి ఘోష్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: మొటిమల చికిత్స కోసం వెళితే, దారుణం: రూ. 31 లక్షల దావాహత్యకు కుట్రఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన దాడి అని, తన తండ్రిని హత్య చేసేందుకు పన్నిన పన్నాగమని ఘోష్ పెద్ద కుమారుడు బిశ్వజిత్ ఆరోపించారు. షాజహాన్ జైలు నుండే ఈ పథకం వేశాడన్నారు. 2024 జనవరిలో సందేశ్‌ఖాలిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జరిగిన దాడిలో, అలాగే షాజహాన్‌కు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చిన సంబంధిత సిబిఐ దర్యాప్తులో ఘోష్ ప్రధాన సాక్షులలో ఒకరిగా ఉన్నారు.ఏంటీ సందేశ్‌ఖాలీ కేసుపశ్చిమ బెంగాల్‌లోని ఉత్తే 24 పరగణాల జిల్లాలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, లైంగిక వేధింపులు, భూకబ్జాలకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. మహిళలను బంధించి లైంగికంగా హింసించారని ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసు యంత్రాంగం స్పందించలేదని బాధితులు తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ అంశాన్ని కోల్‌కతా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఉత్తర 24 పరగణాల జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. రేషన్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు తనిఖీల నిమిత్తం వెళ్లినపుడు షాజహాన్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన అనంతరం షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.షాజహాన్ అనేక కేసులకు సంబంధించి గతంలో అరెస్టు , కస్టడీలో ఉన్నాడు. మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ED ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, భూకబ్జాలు, అక్రమ చేపల పెంపకం మరియు వ్యాపారం, ఇటుక బట్టీలను స్వాధీనం చేసుకోవడం, కాంట్రాక్టుల కార్టలైజేషన్, అక్రమ పన్నులు ,లెవీల వసూలు మరియు భూమి ఒప్పందాలపై కమీషన్లపై కేంద్రీకృతమై ఉన్న నేర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో వివరించింది. ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో -
పెళ్లి చేసుకోమని వేధిస్తోంది
ఛత్తీస్‌గఢ్‌లో ఒక మహిళా డీఎస్పీపై కేసు నమోదయ్యింది. కల్పనాఅనే మహిళా డీఎస్పీ తన వద్ద నుంచి రూ.రెండు కోట్ల రుపాయలు కాజేసిందని దీపక్ థండన్ అనే వ్యాపార వేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా తన భార్యకు విడాలకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు.ఛత్తీస్‌గఢ్ రాయిపూర్‌కు చెందిన దీపక్ థండన్ అనే వ్యాపారవేత్త, కల్పనా అనే మహిళా డీఎస్పీపై సంచలన ఆరోపణలు చేశారు. కల్పనా తనను తీవ్రంగా వేధిస్తుందని తెలిపారు. 2021లో తామిద్దరం తొలిసారిగా కలుసుకున్నామని కొద్దిరోజులకే ఇద్దరం సన్నిహితంగా మెదిలామన్నారు. ఆ తర్వాత నుంచి కల్పనా తన వద్ద నుంచి పెద్ద మెుత్తంలో డబ్బు గుంజసాగిందన్నారు. తనకు రూ.12 లక్షల విలువ గల డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చానని, రాయ్‌పూర్‌లో ఉన్న ఒక హోటల్ తన సోదరుడి పేరు మీదకు మార్చేలా ఒత్తిడి తెచ్చిందని తెలిపారు.ఆ తర్వాత కొంతకాలానికే కల్పనా రూ.30 లక్షలు విలువజేసే మరో ప్రాపర్టీ తన పేరు మీదకు మార్చాలనడంతో ఆ విధంగా చేశానన్నారు. అంతేకాకుండా తనకు రూ. 22లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చానని ఆ వాహనం తన భార్య పేరు మీద తీసుకున్నానని తెలిపారు. కాగా ఇప్పుడు తన భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లిచేసుకోవాలని వేధిస్తోందని తెలిపారు. తమ సంబంధం విషయం తన భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయని దీపక్ అన్నారు.ఈ నేపథ్యంలో డీఎస్పీ వేధింపులు తట్టుకోలేక తన భార్యతో కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను డీఎస్పీ కల్పనా కొట్టిపడేసింది. ఆ వ్యాఖ్యలన్ని నిరాధారమైనవని తెలిపింది. -
మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు
వింటర్ చైల్డ్, పర్వత మనిషి తనకు తాను గర్వంగా అభివర్ణించుకున్న ఒక పర్వాతారోహకురాలు అనూహ్య పరిస్థితుల్లో కన్ను మూసింది. ఈ ఘటన పర్వతారోహకుల ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ విషాదానికి ఆమె ప్రియుడే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఏం జరిగిందంటే..కెరిస్టీన్ గుర్ట్నర్ అనే33 ఏళ్ల ఆస్ట్రియన్ మహిళ 39 ఏళ్ల ప్రియుడు థామస్ ప్లాంబర్గర్తో ఎత్తైన శిఖరం గ్రాస్గ్లాక్నర్ను అధిరోహించారు. థామస్ అనుభవజ్ఞుడైన గైడ్ కూడా. ఈ జంట అనుకున్న దానికంటే రెండు గంటలు ఆలస్యంగా ఆ అవరోహణను ప్రారంభించారు. -20°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు హరికేన్-పవర్ విండ్స్ లాంటి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. గుర్ట్నర్ అలసిపోయిన గుర్ట్నర్ 150 అడుగుల దిగువన దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే ఆమెను గైడ్ చేసి సాయం చేయాల్సిన ప్లాంబర్గర్ నిర్లక్ష్యంగా వదిలేశాడు. అత్యవసర దుప్పట్లు లేదా బివౌక్ సంచిని ఉపయోగించలేదని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కొన్ని గంటల తరువాత గానీ రెస్క్యూ సర్వీసులను సంప్రదించలేదు. పైగా మొదటి కాల్ తర్వాత తన ఫోన్‌ను సైలెంట్లో పెట్టుకున్నాడు. దూర నుంచి ఒక హెడ్టార్చ్తప్ప ఇంకేమీ వెబ్ క్యామ్‌లో కనిపించలేదు.మరోవైపు తీవ్రమైన గాలుల కారణంగా మరుసటి రోజు ఉదయం దాకా రెస్క్యూ బృందాలు గుర్ట్నర్ను చేరుకోలేకపోయాయి. అప్పటికే ఆమె చనిపోయిందని గుర్తించారు. దీంతో ప్లాంబర్గర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.స్నేహితురాలిలా కాకుండా, ఆల్పైన్ హై-ఎలిట్యూడ్ టూర్లతో ఇప్పటికే చాలా అనుభవమున్న వ్యక్తిగా, టూర్‌ను ప్లాన్ చేశాడు కాబట్టి,బాధ్యతాయుతమైన గైడ్‌గా వ్యవహరించాలని ఇన్స్బ్రక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. తీవ్ర నిర్లక్ష్యంతో నరహత్యకు పాల్పడ్డాడని, దోషిగా తేలితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దురదృష్టవశాత్తూ జరిగినవిషాదకరమైన ప్రమాదమని ప్లాంబర్గర్ న్యాయవాది వాదిస్తున్నాడు. ఈ కేసును 2026, ఫిబ్రవరి 19న, ఇన్స్బ్రక్ ప్రాంతీయ కోర్టులో విచారించ నున్నారు. గుర్ట్నర్ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆన్లైన్ స్మారక పేజీని ఏర్పాటు చేశారు. అద్భుతమైన మహిళ అంటూ కెర్స్టిన్ గుర్ట్నర్కు అనేకమంది నివాళులర్పించారు. పలు సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. -
ఆశారాం బాపుకు ఝలక్ ?
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బాధితురాలి తరపు లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాడని కోర్టుకు తెలిపారు. ఆశారాం బాపుకు అనారోగ్య కారణాలతో అక్డోబర్ లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.వివాదాస్పద మత గురువు ఆశారం బాపు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. తనకు వయసు రీత్యా తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయని కనుక మెరుగైన చికిత్స కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆశారం బాపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అంతే కాకుండా ప్రస్తుతం ఆయన వయస్సు 86 సంవత్సరాలని వయస్సు రీత్యా వచ్చే సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. వీటిని విచారించిన కోర్టు ఆయనకు అక్డోబర్ లో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.అయితే బాధితురాలి తరపు న్యాయవాది ప్రస్తుతం ఆశారాం బాపు ఆరోగ్యంగానే ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఆశారం బాపు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన అహ్మదాబాద్, ఇండోర్, జోధ్‌పూర్ నగరాలు ప్రయాణం చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అలా దేశవ్యాప్త పర్యటనలు చేయలేరని పేర్కొన్నారు. దీనిని పరిగణలోకి తీసుకొని కోర్టు ఆశారం బాపుకిచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు.ఆశారం బాపుపై కేసు ఏమిటి2013 ఆగస్టు 15న ఆశారం బాపు దగ్గర్లోని తన ఆశ్రమంలో తనపై ఆత్యాచారం చేశారని 16 ఏళ్ల బాలిక దీంతో ఆశారం బాపుని అరెస్టు చేసి జోద్ పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. రెండు నెలల తరువాత గుజరాత్ లోని సూరత్ ఆశ్రమంలో ఆశారాం బాపు తన కుమారుడు తమపై అత్యాచారం చేసారని ఇద్దరు అక్కాచెల్లెల్లు కేసు నమోదు చేశారు. వీటిపై విచారణ జరిపిన జోద్ పూర్ కోర్టు 2018 ఏప్రిల్ 25న ఆశారాం బాపుకు జీవిత ఖైధు విధించింది. ఈ నేపథ్యంలో 12 సంవత్సరాల తరువాత తొలిసారిగా గత అక్టోబర్ లో ఆశారాం బాపుకు తొలిసారిగా ఈ ఏడాది ప్రారంభంలో బెయిల్ వచ్చింది. -
మహిళా వ్యాపారవేత్తపై ఫార్మా బాస్ నిర్వాకం : తుపాకీతో బెదిరించి, న్యూడ్ వీడియోలు
ముంబైలో జరిగిన అమానవీయ ఘటన కలకలం రేపింది. మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, వివస్త్రను చేసి వీడియోల రికార్డ్ చేశారు కొంతమంది దుండగులు. ఎదురు తిరిగి మాట్లాడితే, ఫోటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించిన వైనం సభ్య సమాజాన్ని నివ్వెర పర్చింది.మేనేజింగ్ డైరెక్టర్ , వ్యవస్థాపక సభ్యుడు అయిన జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్ సహా ఒక ప్రైవేట్ కంపెనీ సీనియర్ అధికారులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమావేశం నెపంతో ఫ్రాంకో-ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ (FIPPL) కార్యాలయానికి ఆహ్వానించారు. అనంతరం ఆమెను వేధించి, తుపాకీతో బెదిరించి ఆమె నగ్నంగా మారాలని బలవంతం చేశారు. మహిళపై దుర్భాషలాడి, ఆమె నగ్న వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేసి, దాని గురించి ఎవరికైనా తెలియజేస్తే వాటిని బహిరంగంగా వెల్లడిస్తానని బెదిరించారని ఆరోపించారు. దీనికి సంబంధించి 51 ఏళ్ల బాధిత మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులపై లైంగిక వేధింపులు, దాడి మరియు క్రిమినల్ బెదిరింపుల కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. -
పెంచలయ్య హత్య కేసులో పురోగతి
సాక్షి, నెల్లూరు జిల్లా: ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య కుట్రదారు ఆరని కామాక్షిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. బోణిగానితోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఏ1 నిందితుడు జేమ్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు. జేమ్స్ కాలుకి బుల్లెట్ తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.పెంచలయ్య హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ‘‘పెంచలయ్య గంజాయి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేస్తుండేవాడు. అదే కాలనీకి చెందిన గంజాయి వ్యాపారి ఆరవ కామాక్షి పెంచలయ్యపై కక్ష పెంచుకొంది. తన వ్యాపారానికి అడ్డం వస్తున్నాడని హతమార్చడానికి కుట్ర పన్నింది. స్కూల్ నుంచి బిడ్డను తీసుకొస్తున్న క్రమంలో పెంచలయ్యపై దాడి చేశారు..పది మంది పాశవికంగా పొడిచి చంపారు. A1 జేమ్స్ ను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. నేడు కామాక్షిని గంజాయి పట్టుబడ్డ కేసులో అరెస్టు చేశారు. పీటీ వారెంట్ కింద ఈ కేసులో కామాక్షిని అదుపులోకి తీసుకుంటాం. ఈ హత్య కేసులో మొత్తం 14 మంది వున్నారు. 9 మందిని అరెస్ట్ చేశాం. మిగతా ఐదుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు.ప్రజానాట్య మండలి, డీవైఎఫ్ఐ ఆగ్రహంకామ్రేడ్ పెంచలయ్యను గంజాయి గూండాలు హత్య చేయడంపై ప్రజానాట్య మండలి, డీవైఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. కామ్రేడ్ పెంచలయ్య హత్యకు గురికావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో గంజాయి గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయని డీవైఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం గంజాయి గ్యాంగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. -
వివేకా హత్య కేసు.. అంతా కూతురు సునీతే చేశారు!
-
ఐబొమ్మ రవిని నిర్దోషిగా బయటకు తెస్తా
హైదరాబాద్: మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పెటేటి రాజారావు అన్నారు. గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానంలో ఇమ్మడి రవి కేసు విషయంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి, త్వరలోనే జైలు నుండి బెయిల్‌పై విడుదల చేయిస్తానని అన్నారు. పోలీసులు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లే అని తెలిపారు. SHORTSNow playingAP High Court Advocate Peteti Raja Rao Intresting Comments on IBOMMA Ravi CaseSHORTSNow playingAP High Court Advocate Peteti Raja Rao Intresting Comments on IBOMMA Ravi Case -
సృష్టి ఫెర్టిలిటీ కేసులో నమ్రతకు బెయిల్
సాక్షి హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో అరెస్టైన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతా బెయిల్ పై విడుదలయ్యారు. సరోగసీ పేరుతో అక్రమాలు, పిల్లల విక్రయం వంటి పలు అభియోగాలు ఆమెపై నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో సరోగసీ పేరుతో 'సృష్టి' ఫెర్టిలిటీ సెంటర్ చాలా మోసాలు చేస్తోందని గతంలో కేసులు నమోదయ్యాయి. ఐవీఎఫ్(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీనికోసం ఏపీలో కొంత మంది ఏఎన్ఎం(ANM)ల సహాయం కూడా తీసుకున్నారని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రతను జులై 27న పోలీసులు అరెస్టు చేశారు. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఐవీఎఫ్(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని. తదితర ఆరోపణలతో డాక్టర్ నమ్రతపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా డాక్టర్ నమ్రతతో కలిసి 1988లో ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యవిద్యను చదివిన ముగ్గురు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలు నమ్రతా బెయిల్ పై విడుదలయ్యారు. -
బాబు సర్కార్ కు బిగ్ షాక్.. మద్యం కేసులో ఆ ముగ్గురికి ఊరట
-
సునీత పిటిషన్లన్నీ రాజకీయ ప్రేరేపితమే..
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత పిటిషన్లన్నీ రాజకీయ ప్రేరేపితమని ప్రతివాదులు సీబీఐ కోర్టుకు విన్నవించారు. వివేకా హత్యను కూడా గత ఎన్నికల సమయంలో ప్రచారాస్త్రంగా ప్రత్యర్థులు వినియోగించుకునే యత్నం చేశారని, సాక్ష్యాలు, ఆధారాలు లేకున్నా ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా పనిచేశారని కోర్టుకు తెలియజేశారు. ఆమె వెనుక ఉన్న కొన్ని రాజకీయ శక్తుల వల్ల ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేస్తూ.. అసలు దోషులు బయట తిరిగేందుకు తోడ్పడుతున్నారని వివరించారు.ఇప్పుడు అదే శక్తులు వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణ పూర్తి కాకూడదని కుయుక్తులు పన్నుతున్నారని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఇందులో భాగంగానే సునీత తాజా పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో సునీత పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురామ్ సోమవారం ప్రతివాదుల వాదనలు విన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.అంతకుముందు శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది సాయి ఉమామహేశ్వర్రావు వాదనలు వినిపించారు. వాదనల్లో ముఖ్యాంశాలు.. ‘అన్ని అంశాలు పరిశీలించాం, వందల మందిని విచారించాం, కాల్ రికార్డులు, వీడియోలు.. ఇలా అన్నింటిపై దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ చెబుతోంది. అయినా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగించాలని కోరడం సరికాదు. ఇది కేసు విచారణను ఆలస్యం చేయడమే. దాదాపు నాలుగేళ్ల పాటు దర్యాప్తు కొనసాగించినంత కాలం సీబీఐ విచారణపై సునీత నోరు మెదపలేదు.నిరాధారంగా కొందరిని నిందితులుగా చేర్చడాన్ని ఆమె ‘ఎంజాయ్’చేశారు. చార్జ్‌షీట్, అదనపు చార్జ్‌షీట్ దాఖలు చేసినప్పుడూ తను అనుకున్నట్లే దర్యాప్తు సాగుతోందని మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మరికొందరిని చేర్చాలన్న ఉద్దేశంతో పిటిషన్ వేశారు. కళ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి హత్య చేసింది ఎవరో చెప్పిన తర్వాతా నిందితులకు తోడ్పడేలా ఆమె పిటిషన్లు వేశారు. షేక్ దస్తగిరి (ఏ–4) తానే గొడ్డలితో నరికానని నేరుగా సీబీఐ కార్యాలయానికి వెళ్లి చెప్పినా అరెస్టు చేయలేదు.క్రిమినల్ కేసుల దర్యాప్తు చరిత్రలో ఓ కరుడుగట్టిన హంతకుడు నేరం ఒప్పుకున్నా అరెస్టు చేయకపోవడం ఇదే తొలిసారి. అతన్ని సమరి్థస్తూ సునీత పలు పిటిషన్లు వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దస్తగిరి యథేచ్ఛగా బయట తిరుగుతున్నా బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయని సునీత ఎలాంటి ఆధారాలు లేకుండా నిందితులుగా చేర్చిన వారి బెయిల్ రద్దుకు పిటిషన్లు వేయడం విస్తుగొలిపే విషయం. సునీత పిటిషన్ సమర్థనీయం కాదు. కొట్టివేయండి’ అని న్యాయవాదులు వాదనలు వినిపించారు. -
ఐ బొమ్మ రవికి ఏమి శిక్ష పడబోతుందో తెలుసా? షాక్ అయ్యే విషయాలు!
-
అబద్ధాలు సరికాదన్నందుకు ఊస్టింగే బహుమానం
సాక్షి ప్రతినిధి కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లు సీఎం స్థాయిలో చంద్రబాబు తననుద్దేశించి అసెంబ్లీలో మాట్లాడటం తీవ్రంగా బాధించిందన్న సీఐ శంకరయ్యను ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించడం రాష్ట్రంలో అరాచక పాలనకు అద్దం పడుతోంది. తనపై అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదన్నందుకు ఊస్టింగే బహుమానంగా దక్కింది. తనకు ప్రమోషన్ రాకపోయినా, వచ్చినట్లు ప్రచారం చేయడం అబద్ధం అని చెప్పినందుకు సర్కారు కక్షగట్టిందని ఇట్టే స్పష్టమవుతోంది. తమను ఎవ్వరూ ప్రశ్నించకూడదన్న నిరంకుశ ప్రభుత్వ దమననీతికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సీఐ జె.శంకరయ్యను బాబు సర్కార్ శుక్రవారం ఉద్యోగం నుంచి తొలగించింది. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. అబద్ధాలొద్దన్నందుకు కక్షగట్టారు2019 మార్చి 15వ తేదీన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అప్పట్లో పులివెందులలో సీఐగా పనిచేసిన శంకరయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో పోలీసు అధికారులు ఇటీవల సస్పెండ్ చేశారు. మళ్లీ విధుల్లో చేరిన శంకరయ్య అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తూ కడప వీఆర్‌కు వచ్చారు. వైఎస్ వివేకా హత్యకు సంబం«ధించి అనుసరించిన వైఖరి ఫలితంగానే సీఐగా ఉన్న శంకరయ్యకు డీఎస్పీగా పదోన్నతి లభించిందని సీఎం చంద్రబాబు పదేపదే అసెంబ్లీలో ప్రస్తావించారు. బాబు మాటలపై శంకరయ్య తీవ్రంగా కలత చెందారు. చేయని తప్పునకు అవమానాలపాలు కావాల్సి వస్తోందని మదనపడ్డారు. ఈ నేపథ్యంలో తన పరువుకు తీవ్ర నష్టం వాటిల్లిందని తన న్యాయవాది ద్వారా సీఎంకి నోటీసులు పంపారు. తనకు పదోన్నతి కల్పించకపోయినా కల్పించినట్లు పదేపదే అబద్ధాలు చెప్పడం సరికాదని నోటీసుల్లో ప్రస్తావించారు. తనను మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలన్నారు. గుడ్లురిమిన పెద్దలు.. ఉద్యోగం ఉఫ్..తనకు పదవులు దక్కకపోయినా దక్కినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని సీఐ శంకరయ్య ప్రశ్నించినందుకు ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. శంకరయ్య వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లెతోపాటు పలు ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేశారు. ఆ తర్వాత సీఐగా కర్నూలు జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, కడప వీఆర్, అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో పని చేశారు. విధి నిర్వహణలో రాజీ పడకుండా నిజాయితీగా పనిచేసే వ్యక్తిగా పోలీసు శాఖలో గుర్తింపు పొందారు. సీఐ డిస్మిస్ వ్యవహారం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంత ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని పోలీసులు విస్తుపోతున్నారు. -
నేడు CBI కోర్టుకు YS జగన్.. కేసుల నుంచి తప్పించుకునేందుకు బాబు తప్పుడు ప్రచారం
-
తప్పుడు వార్తలకు చెంపదెబ్బ.. ఎల్లో ఉగ్రవాదుల తాట తీసిన ఈశ్వర్
-
తిక్క కుదిరిందా..! ఇకనైనా మారు బాబు
-
ఫ్లాట్ నంబర్ 1903.. ఐబొమ్మ రవి కేసులో మరిన్ని షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’సహా పదుల సంఖ్యలో పైరసీ వెబ్సైట్లు నిర్వహించి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులకు చిక్కిన ఇమ్మడి రవి పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ మేరకు నాంపల్లి న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని దర్యాప్తు అధికారులు గురువారం కస్టడీలోకి తీసుకుని ఐదు రోజులపాటు విచారించనున్నారు.ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు అతడి నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టారు. పైరసీ సర్వర్లు ఎక్కడెక్కడ ఉంచాడు? ఆయా వ్యవహారాల్లో సహకరించింది ఎవరు.. ఇతర సాంకేతిక అంశాలపై ప్రశ్నించనున్నారు. మరోపక్క ఆరేళ్లలో 21 వేల చిత్రాలను పైరసీ చేసిన, బెట్టింగ్/గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇమ్మడి రవి ఆర్థికాంశాలపైనా అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న కొన్ని స్థిరాస్తుల్ని గుర్తించారు. అతడు పౌరసత్వం తీసుకున్న కరేబియన్ దీవుల్లోని దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవీస్లోనూ కొన్ని ఆస్తులు ఖరీదు చేసినట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలోనూ విచారించనున్నారు.ఏడాదిలోనే హోంలోన్ క్లోజ్... పైరసీ, బెట్టింగ్ దందా ద్వారా రవి భారీ మొత్తం ఆర్జించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబీకులకు దూరంగా ఉంటున్న రవి ఓ సమీప బంధువుతో మాత్రం సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. వివిధ సందర్భాల్లో ఆ బంధువు రవి ఖాతాకు రూ.కోటి బదిలీ చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 2018 నుంచి పైరసీ వెబ్సైట్లు నిర్వహిస్తున్న రవి మూసాపేట్‌లోని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్లోని ఎ–బ్లాక్‌లోని 1903 ఫ్లాట్‌ను 2019లో ఖరీదు చేశాడు.ఆ సమయంలో కేవలం కొంత మొత్తం చెల్లించిన అతడు.. మిగిలింది హోంలోన్ తీసుకున్నాడు. అయితే కేవలం ఏడాదిలోనే ఆ లోన్‌ను రవి క్లియర్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇప్పటివరకు రవికి సంబంధించిన ఆరు బ్యాంకు ఖాతాలను విశ్లేషించిన పోలీసులు వాటిలో రూ.28 కోట్ల లావాదేవీలు గుర్తించారు. దాదాపు మరో 25 బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. బిట్ కాయిన్ల రూపంలోనూ భారీ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు కస్టడీలో భాగంగా పోలీసులు రవికి సంబంధించిన క్రిప్టో కరెన్సీ వాలెట్స్ వివరాలు సేకరించనున్నారు. -
రవి బొమ్మ కనబడిందా? తవ్వే కొద్దీ షాకింగ్ నిజాలు
-
హన్మకొండ జిల్లా: వీడిన ‘నాటు కోళ్ల’ మిస్టరీ
సాక్షి, హన్మకొండ జిల్లా: నాటుకోళ్ల కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఇన్సూరెన్స్ కోసమే ఓ రైతు.. కోళ్లను పొలంలో వదిలేసినట్లు పోలీసులు తేల్చారు. వరదలో రెడ్డిపురం ఫామ్‌లోని కోళ్లు కొట్టుకుపోయాయి. దీంతో మిగిలిన కోళ్లను రైతు పొలాల్లో వదిలేశారు.ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన గత శనివారం రెండు వేలకు పైగా నాటుకోళ్లను వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఎల్కతుర్తివాసులు మొత్తం.. పత్తి చేలలో పరుగెత్తారు. దొరికిన కాడికి కోళ్లను పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. గంట వ్యవధిలో కోళ్ల అరుపులతో ఊరు ఊరంతా దద్దరిల్లింది. కొంతమంది వెంటనే నాటు కోడి పులుసు చేసుకుని సంతోషంగా విందు చేసుకున్నారు.సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. మరో వైపు, కోళ్లలో వ్యాధి ఉందనే వదంతులు చక్క ర్లు కొట్టాయి. ఎల్కతుర్తి పశువైద్యాధికారి కూడా వందతులను ఖండించారు. కోళ్లలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని, శాంపిల్స్‌ను వరంగల్ ల్యాబ్‌కు పంపి పరీక్షించగా ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించారు. కోళ్లు వదిలివెళ్లడం వెనుక ఉన్న మిస్టరీని తేల్చేందుకు విచారణ చేపట్టిన పోలీసులు.. చివరికి ఇన్సూరెన్స్ కోసమే ఓ రైతు.. కోళ్లను పొలాల్లో వదిలేసినట్లు స్పష్టం చేశారు. -
Air India Crash: ‘పైలట్‌ను నిందించొద్దు’: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గత జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన కేసులో కేంద్ర ప్రభుత్వానికి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీసీసీఏ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ కోరుతూ ఎయిర్ ఇండియా పైలట్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందిస్తూ, సుప్రీం కోర్టు ఈ నోటీసు జారీ చేసింది. పైలట్ తండ్రి.. ఈ ఘటనకు సరైన కారణాన్ని గుర్తించేందుకు, జవాబుదారీతనం నిర్ధారించేందుకు స్వతంత్ర దర్యాప్తును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చి , జె సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం.. విమాన ప్రమాదంపై తప్పుడు నివేదికలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషాద సంఘటనకు పైలట్‌ను బాధ్యుడిని చేస్తూ, నిందించకూడదని ధర్మాసనం పేర్కొంది. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి బాధ్యుడంటూ పైలట్‌ను నిందించకూడదు. ఇది ఒక విషాద ఘటన. ప్రాథమిక నివేదికలో పైలట్ వైపు నుండి ఎటువంటి తప్పు లేదని తేలింది. ఇటువంటి తప్పుడు నివేదికలు రూపొందించకూడదు. ఇటువంటి ఘటనలపై పరిశోధించేందుకు నిర్థిష్ట నిబంధనలున్నాయని జస్టిస్ బాగ్చి అన్నారు. దివంగత పైలట్ తండ్రి, పిటిషనర్ వ్యక్తం చేసిన బాధను, న్యాయమైన దర్యాప్తు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ మాట్లాడుతూ, ‘నియమం 11 అనేది ప్రమాదాలకు సంబంధించినది. నిబంధన తొమ్మిది ప్రకారం ప్రాథమిక దర్యాప్తు మాత్రమే నిర్వహించారు. మేము స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నాం. ఈ విమాన ప్రమాదంపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిగేలా చూడాలని’ కోర్టును కోరారు.2025, జూన్ 12న మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171 టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు సహా మొత్తం 265 మంది మృతి చెందారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కన్నుమూశారు.ఇది కూడా చదవండి: వీధి కుక్కల కేసు: ‘సుప్రీం’ కీలక ఆదేశాలు -
వీధి కుక్కల కేసు: ‘సుప్రీం’ కీలక ఆదేశాలు
ఢిల్లీ: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, రోడ్లు, ఎక్స్‌ప్రెస్ వేలపై పైకి వీధి కుక్కలు, పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపింది.ఈ ఆదేశాల అమలుపై ఎనిమిది వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని సుప్రీంకోర్టు కోరింది. పాఠశాలలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆస్పత్రులలోకి వీధి కుక్కలు రాకుండా ఎనిమిది వారాల్లోగా తగిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రెండు వారాల్లోగా మున్సిపల్ సిబ్బంది వీధికుక్కలు ఉండే స్థలాలను, భవనాలను గుర్తించాలని, ఈ ప్రాంతాల్లో తిరిగే వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసి, రీ లొకేషన్ చేయాలని కోరింది. వీధి కుక్కలను వాటిని పట్టుకున్న ప్రాంతాలలో తిరిగి వదిలిపెట్టకూడదని, ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కలు తిరిగే ప్రాంతాలలో తనిఖీ చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. పబ్లిక్ ఏరియాలలో వీధి కుక్కలు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. ఈ నివేదిక అమలుపైన అఫిడవిట్ దాఖలు చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. -
బాలిక అబద్ధం.. ‘పోక్సో’కు అమాయకుడు బలి
ప్రేమ, నమ్మకం, ద్రోహం... ఈ మూడింటి మధ్య నలిగిపోయిన ఒక యువకుని దీనగాథ ఇది. అబద్ధపు ఆరోపణల కారణంగా ఏడాదిపాటు జైలు జీవితం గడిపిన ఆ యువకుడి కేసు.. 'పోక్సో (POCSO) చట్టం' దుర్వినియోగానికి ఒక ఉదాహరణగా నిలిచింది. తన స్నేహితురాలిని ఆమె ప్రియుడు తప్పుదారి పట్టిస్తున్నాడని భావించి, అతనితో స్నేహం మానుకోవాలని చెప్పినందుకు ఆ యువకుడు ఏకంగా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు.ఈ కేసులో బాధితుడు అయిన యువకుడు తన స్నేహితురాలి ప్రియుడి ప్రవర్తన సరిగా లేదని గుర్తించాడు. అతనితో తిరగడం ప్రమాదకరమని భావించి, ఆ మైనర్ బాలికను పలుమార్లు హెచ్చరించాడు. అతనికి దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. అయితే అప్పటికే అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న ఆ బాలికకు ఈ సలహా నచ్చలేదు. సరిగ్గా ఇదే సమయంలో, ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు ఆమె ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో ఆమె తన ప్రియుడిని రక్షించేందుకు, చట్టపరమైన సమస్యల నుంచి తన ప్రియుడిని తప్పించేందుకు అతి దారుణమైన నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడి స్థానంలో తనకు సలహా ఇచ్చిన నిర్దోషి అయిన స్నేహితుడిపైనే తప్పుడు పాక్సో(POCSO) కేసు పెట్టింది. ఆ బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అబద్ధపు సాక్ష్యం కారణంగా ఆ యువకుడు ఏకంగా ఒక సంవత్సరం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ లభించడం కూడా కష్టమైంది.ఏడాది తర్వాత నిర్దోషిగా విడుదలఒక ఏడాది పాటు చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, ఈ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. కోర్టు విచారణలో, సాక్ష్యాధారాలు, బాలిక వాంగ్మూలంలోని పరస్పర విరుద్ధ అంశాలను న్యాయవాది నిరూపించగలిగారు. చివరకు నిజం బట్టబయలైంది: బాలిక తన ప్రియుడిని రక్షించేందుకు, తనపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు కుట్రకు పాల్పడిందని రుజువైంది. దాంతో కోర్టు ఆ నిర్దోషి అయిన యువకుడిని తక్షణమే విడుదల చేసింది. అయితే ఆ యువకుడు అంతవరకూ కోల్పోయిన కాలాన్ని, సామాజిక గౌరవాన్ని తిరిగి ఎవరూ ఇవ్వలేరు. మరోవైను ఈ ఘటన అతని భవిష్యత్తుకు అడ్డుగోడగా మారింది.న్యాయవ్యవస్థ ముందు ప్రశ్నలు Innocent Minor boy spent 1 YEAR in Jail in false POCSO case filed by his friend because he used to ask her to avoid her boyfriend who was of wrong behaviour Minor girl had sex with BF but implicated friend when family came to know of her affairpic.twitter.com/I6Yj3xbfN0— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 4, 2025 ప్రేమ కోసం అబద్ధపు సాక్ష్యం చెప్పి, ఒక నిర్దోషి జీవితాన్ని నాశనం చేసిన ఆ బాలికకు ఎందుకు శిక్ష పడలేదు? అలాగే ఆ బాలిక ఇటువంటి కుట్రకు పాల్పడేందుకు ఆమె ప్రియుడు సహకరించివుంటే అతనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అమాయక యువకుడిపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు, చట్టం రక్షణగా ఉండాల్సింది పోయి, ఏడాదిపాటు శిక్షకు కారణంగా నిలిచింది. ఈ ఘటన పాక్సో(POCSO) లాంటి కఠిన చట్టాల దుర్వినియోగం ఎలా జరుగుతుందో తెలియజేస్తుంది. మైనర్ల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలు, ఈ విధంగా దుర్వినియోగం కావడం సమాజానికి మంచిది కాదని పలువురు అంటున్నారు. ఈ తరహా తప్పుడు కేసుల వల్ల నిజమైన బాధితులు అవమానానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా తప్పుడు ఫిర్యాదులు చేసే మైనర్లను, వారి వెనుక ఉన్నవారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పాక్సో (POCSO) చట్టంలో తగిన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. హర్యానాలోని పానిపత్‌లో జరిగిన ఒక ఉదంతం ఆధారంగా ఈ కథనం రాయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ట్విట్టర్లో దీపికా నారాయణ్ భరద్వాజ్ పేరుతో షేర్ అయిన సోస్టు జత చేయడం జరిగింది. దీనిలో న్యాయవాది తమన్నా కాదియాన్ ఈ అంశంపై మాట్లాడటాన్ని చూడవచ్చు.ఇది కూడా చదవండి: భారత్ అణు పరీక్షలు?.. పాక్‌కు దబిడి దిబిడే! -
‘ఫిజిక్స్‌వాలా’పై ఎఫ్ఐఆర్.. కారణం ఇదే..
న్యూఢిల్లీ: ఎడ్టెక్ కంపెనీ ‘ఫిజిక్స్‌వాలా’ చిక్కుల్లో పడింది. ఈ కంపెనీ రూపొందించిన ఒక ప్రకటన.. కశ్మీర్‌లోని పర్యావరణాన్న దెబ్బతీసేవిధంగా ఉందనే ఆరోపణలు వచ్చాయి. బారాముల్లాలోని గుల్మార్గ్ సమీపంలోని బాదర్కోట్ అడవుల గుండా ‘‘ఫిజిక్స్‌వాలా’ అధ్యాపకులు స్కార్పియో వాహనాల్లో వెళుతున్నట్లు చూపిన ఈ ప్రకటన పోలీసు దర్యాప్తుకు దారితీసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుల్మార్గ్ ఇఫ్తిఖర్ అహ్మద్ ఖాద్రీ ఫిర్యాదు మేరకు టాంగ్మార్గ్ పోలీస్ స్టేషన్లో ‘ఫిజిక్స్‌వాలా’పై ఎఫ్ఐఆర్ దాఖలైంది.రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేని ఆరు నల్ల స్కార్పియో వాహనాల్లో ‘ఫిజిక్స్‌వాలా’ అధ్యాపకులు అక్రమంగా అడవిలోకి ప్రవేశిస్తున్నట్లు చూపించే ఈ యూట్యూబ్ వీడియోపై ఫిర్యాదు నమోదయ్యింది. 9 నుండి 12 తరగతుల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఫిజిక్స్‌వాలా ఈ ఫుటేజ్ ఉపయోగించింది. ఈ చర్య భారత అటవీ చట్టం 1927, అటవీ సంరక్షణ చట్టం 1980కు విఘాతం కలిగించేలా ఉంది. ‘ఫిజిక్స్‌వాలా’ పై అటవీ అధికారి చేసిన ఫిర్యాదులో ఆ వాహనాలను పచ్చని పచ్చిక బయళ్లపై నడిపి, మూలికలు, వృక్షజాలానికి నష్టం కలిగించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద.. ‘ఫిజిక్స్‌వాలా’ ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందంటూ కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసినందుకు పలువురు యూట్యూబర్లపై కేసు నమోదయ్యింది. వారు పచ్చిక బయళ్ల గుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దీంతో డిప్యూటీ కమిషనర్ బిలాల్ మోహిదిన వారిపై ఎఫ్ఐఆర్కు ఆదేశించారు. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌పై ఈడీ చర్య
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై మనీలాండరింగ్ ఆరోపణల దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగవంతం చేసింది. సుమారు రూ.3,084 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్లు తాజాగా తెలిపింది. అక్టోబర్ 31న జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.జప్తు చేసిన ఆస్తుల వివరాలుమనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో ముంబైలోని పాలి హిల్‌లో ఉన్న అనిల్ అంబానీ కుటుంబ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్ ఆస్తులు ఉన్నాయి. మొత్తం ఎనిమిది నగరాల్లోని ఆస్తులు జప్తు అయ్యాయి. సుమారు రూ. 3,084 కోట్లు విలువ చేసే ఆ ఆస్తులు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో నివాస భవనాలు, కార్యాలయ ప్రాంగణాలు, భూములున్నాయి.అసలు కేసు ఏంటి?అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ యెస్ బ్యాంక్ నుంచి సమీకరించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర మార్గాలకు మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) సేకరించిన నిధుల మళ్లింపుపై దర్యాప్తు జరుగుతోంది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ RHFLకు రూ.2,965 కోట్లు, RCFLకు రూ.2,045 కోట్లు ఇచ్చింది. అయితే వీటిని తిరిగి చెల్లించడంలో అనిల్ అంబానీ, తన ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థలు విఫలమయ్యాయి.ఈడీ దర్యాప్తులో అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్ లింక్డ్ సంస్థలకు పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, రుణాల మంజూరు జరిగినట్లు తేలింది. ఈ వ్యవహారాన్ని ఈడీ ఉద్దేశపూర్వక, స్థిరమైన నియంత్రణ వైఫల్యాలుగా అభివర్ణించింది. కొన్ని కంపెనీలు దరఖాస్తు చేసిన అదే రోజున రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపింది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు సమర్పించడానికి ముందే రుణాలు అడ్వాన్స్ చేసినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: ఆల్ఫాబెట్, అమెజాన్‌ల పంట పండించిన స్టార్టప్ -
Sabarimala Theft Case.. మాజీ అధికారి అరెస్ట్
తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం చోరీ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీష్ కుమార్‌ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)అధికారులు.. సుధీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, విచారించిన దరిమిలా ఈ అరెస్ట్ జరిగింది.ఆలయ ద్వారం వద్దనున్న శిల్పాలకు పూత పూసిన పొరలు బంగారంతో తయారు చేసినవని తెలిసినప్పటికీ, సుధీష్ కుమార్ అధికారిక పత్రాలలో వాటిని రాగి పొరలుగా తప్పుగా నమోదు చేసినట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి మహసర్ (అధికారిక రికార్డు)ను ట్యాంపరింగ్ చేసి, బంగారాన్ని దొంగిలించేందుకు సుధీష్ కుమార్ సహాయం చేశాడని సిట్ నిర్ధారించింది. 2019లో శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన సుధీష్ నాడు ఉన్నికృష్ణన్ పొట్టిని దాతగా ఆమోదించారు. దీనికితోడు దేవస్వం బోర్డు ఆ బంగారు పొరలను రాగి పలకలుగా చెప్పాలంటూ ఉన్నికృష్ణన్ పొట్టిని కోరిందని సిట్ గుర్తించింది. అధికారులు శిల్పాలను ట్యాంపరింగ్ చేసినప్పుడు కూడా, సుధీష్ వాటిని రికార్డులలో రాగి పొరలుగా పేర్కొన్నారు.అయితే పొట్టికి ఆ షీట్లు అందకపోయినా, సుధీష్ అతని పేరును రికార్డులలో రాశారని చూపించే ఆధారాలను సిట్ స్వాధీనం చేసుకుంది. సుధీష్ మరో నిందితుడు మురారి బాబుకు ఈ బంగారం చోరీలో సహాయం చేశాడని కూడా దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సుధీష్ కుమార్‌ను అధికారులు (ఈరోజు) శనివారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం అతనిని తిరిగి కస్టడీకి కోరే అవకాశం ఉందని సమాచారం. -
మేయర్ దంపతుల కేసులో సంచలనం.. ఐదుగురికి ఉరిశిక్ష
-
చిత్తూరు కోర్టు సంచలన తీర్పు.. ఐదుగురికి మరణ శిక్ష
-
కాసేపట్లో చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో తీర్పు
-
Zakir Naik: హసీనా బహిష్కరిస్తే.. యూనస్ ఆహ్వానించారు!
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల క్రితం అప్పటి హసీనా సర్కారు ఇస్లామిక్ ప్రచారకుడు జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్‌లోకి ఎప్పటికీ ప్రవేశం లభించదని ప్రకటించగా దీనికి భిన్నంగా యూనస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 28-29 తేదీలలో ఢాకాలో జరిగే ఛారిటీ కార్యక్రమానికి జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానం పలికింది.బంగ్లాదేశ్ వివాదాస్పద నిర్ణయంవివాదాస్పద ఇస్లామిక్ ప్రచారకర్త జకీర్ నాయక్‌పై భారతదేశంలో మనీలాండరింగ్‌తో పాటు పలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదేవిధంగా జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్‌లోకి ప్రవేశం లేదని ప్రకటించిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఏడేళ్ల తర్వాత తన నిర్ణయం మార్చుకోవడం వివాదాస్పదంగా మారింది. 2016, జూలైలో రాజధాని ఢాకాలోని ‘హోలీ ఆర్టిసన్ బేకరీ కేఫ్’ పై దాడి వెనుక జకీర్ నాయక్ ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు.. జకీర్ నాయక్ బోధనలతో ప్రేరణ పొందారనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలోనే అప్పటి ప్రభుత్వం జకీర్ నాయక్‌ను బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించకుండా నిషేధించింది.2016లో జకీర్ నాయక్‌పై ఎన్ఐఏ కేసుభారతదేశంలోని జాతీయ దర్యాప్తు సంస్థ కూడా అతనిపై ఉగ్రవాదం, మనీలాండరింగ్ తదితర ఆరోపణల కింద దర్యాప్తు చేస్తోంది. ఢాకాలో ఉగ్రవాద దాడి తర్వాత అతను ఆ దేశం నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం మలేషియాలో తలదాచుకున్న జకీర్ నాయక్ స్పార్క్ ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహించే ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నవంబర్ 28-29 తేదీలలో బంగ్లాదేశ్‌కు రానున్నారు. ఈ కార్యక్రమం ఢాకాలోని అగర్గావ్ ప్రాంతంలో జరగనుంది. వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలతో 2016లో ఎన్ఐఏ తొలిసారిగా ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జకీర్ నాయక్‌పై కేసు నమోదు చేసింది.జకీర్ అప్పగింతకు మలేషియా సహకారం?60 ఏళ్ల జకీర్ నాయక్ 2016లో భారతదేశం నుండి మలేషియాకు వెళ్లి, అక్కడ శాశ్వత నివాస హోదాను పొందాడు.తనపై సాగుతున్నఅన్యాయమైన విచారణ నుండి సురక్షితంగా బయటపడేవరకూ తాను భారతదేశానికి తిరిగి రానని జకీర్ నాయక్ గతంలో వెల్లడించారు. కాగా తమ దేశంలో సమస్యలు సృష్టించనంత వరకు జకీర్ నాయక్‌ను బహిష్కరించలేమని, భారత్‌కు పంపే ప్రసక్తే లేదని మలేషియా ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ ఏడాది మొదట్లో భారతదేశంలోని మలేషియా హైకమిషనర్ దాతో ముజాఫర్ షా ముస్తఫా మాట్లాడుతూ జకీర్ నాయక్ అప్పగింతకు సంబంధించి భారతదేశానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: Delhi: గొంతు కోసి.. సిలిండర్ పేల్చి.. యువతి చేతిలో ‘పార్ట్నర్’ హతం -
మద్యం కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
ములకలచెరువు: నకిలీ మద్యం కేసులో ఇద్దరు నిందితులను అన్నమయ్య జిల్లా ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం పెద్దపాళ్యం క్రాస్ వద్ద తనిఖీల సందర్భంగా రెండు కార్లలో వేగంగా వెళుతున్న ఏ 15 బాలాజీ, ఏ 20 సుదర్శన్‌ను ఎక్సైజ్ పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు. తండ్రి, కుమారులైన వీరినుంచి 8స్మార్ట్ ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితుడైన జనార్దన్‌రావు అతని స్నేహితులు ములకలచెరువులో మద్యం దుకాణాలు నడుపుతున్నారని, అక్కడ అక్రమ మద్యం తయారు చేయాలని 2025 ఏప్రిల్‌లో కోరినట్లు విచారణలో బాలాజీ వెల్లడించాడు. -
ఏ తప్పూ చేయకుండా జైల్లో మగ్గుతున్నారు
విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో ఏ తప్పూ చేయకుండా నిందితులు సుదీర్ఘకాలం జైళ్లలో మగ్గుతున్నారని డిఫెన్స్ న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో విచారణ పూర్తయ్యిందని, ఇందుకు అనుగుణంగా చార్జ్షీట్లు కూడా దాఖలయ్యాయని పేర్కొంటూ రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. నిందితులకు బెయిల్ మంజూరుచేస్తే, విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎటువంటి షరతులకైనా సిద్ధమని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో జైలులో ఉన్న రాజ్ కేసిరెడ్డి, చెరుకూరి వెంకటేష్‌నాయుడు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. నిందితుల తరపున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రగిరి విష్ణువర్థన్, నాగేంద్రరెడ్డి, ఎం వాణి, నగేష్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆన్లైన్లో హాజరై వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును కోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఎటువంటి ఆధారాలూ చూపలేకపోయిన సిట్: పొన్నవోలురాజ్ కేసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘కేసుకు సంబంధించి నిందితులపై సిట్ విచారణ పూర్తిచేసి, చార్జ్‌షీటు కూడా దాఖలుచేసింది. ఈ కేసులో 409 మంది సాక్షులను విచారించింది. గత ప్రభుత్వ లిక్కర్ పాలసీలో రాజ్ కేసిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసులో సిట్ ఎటువంటి ఆధారాలు చూపలేకపోయింది. సిట్ అధికారులు సెల్‌టవర్ లొకేషన్ ఆధారంగా రాజ్ కేసిరెడ్డిని ముద్దాయిగా నిర్ధారిస్తూ రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొనడం తగదు. వాస్తవానికి ఒక్కో టవర్ లొకేషన్ 3 నుండి 5 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. ఆ పరిధిలో ఎంతో మంది సెల్ఫోన్లు వాడతారు. అంతమాత్రాన ఈ కేసుతో వారందరికీ నిందితులతో సంబంధం ఉందని ఎలా నిర్ధారిస్తారు? సిట్ అధికారులు నిందితుడి కార్యాలయం కూడా జూబ్లిహిల్స్ పరిధిలో ఉందని చెబుతున్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి లొకేషన్ కూడా అదే పరిధిలో ఉంది. అంతమాత్రాన ఆయనకు కేసుతో సంబంధం ఉందని భావించాలా?. రాజ్ కేసిరెడ్డిని కావాలనే 188 రోజులుగా జైలులో ఉంచారు. అరవింద్ కేజ్రివాల్ వర్సెస్ సీబీఐ, కల్వకుంట్ల కవితకు సంబంధించిన కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అనుగుణంగా రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు చేయవలసినదిగా కోరుతున్నాను’ అని అన్నారు. 24వరకు రిమాండ్ పొడిగింపురాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేష్ నాయుడు ,చాణక్య, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలకు ఈనెల 24వరకు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో శుక్రవారం వారిని కోర్టులో హాజరు పరిచారు.సాగదీత ధోరణి మార్చుకోని లూథ్రాప్రాసిక్యూషన్ తరఫున తొలుత వాదనలను వినిపించిన లూథ్రా గురువారం తరహాలోనే కేసు కౌంటర్, రిమాండ్ రిపోర్టులు సుదీర్ఘంగా చదువుతూ, ‘అదే వాదన’ అన్న ధోరణిని ప్రదర్శించారు. ఈ సందర్భంలో డిఫెన్స్ తరపున న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గంటలు గంటలు కౌంటర్, రిమాండ్ రిపోర్టులు చదువుతూ పోతే వాదనలు ఎప్పుడు వినిపిస్తారని ప్రశ్నించారు. కోర్టు విలువైన సమయాన్ని లూథ్రా వృథా చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి అమెరికా వెళ్లేందుకు అనుమతిరాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఈ నెల 27 నుంచి 31 వరకు న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరయ్యేందుకు అనుమతిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 23 నుంచి నవంబరు 4వ తేదీ వరకు ఆయనకు అనుమతి మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పి. భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. రూ. 50వేలు చొప్పున ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆమెరికా పర్యటన ముగించుకొని తిరిగి రాగానే పాస్ పోర్టు తిరిగి కోర్టుకు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెవిరెడ్డిపై కేసు అంతా కుట్ర కోణమే: న్యాయవాది వాణిరెడ్డి చెవిరెడ్డి భాస్కరరెడ్డి తరపు న్యాయవాది వాణిరెడ్డి వాదనలు వినిపిస్తూ...ఆయన ప్రజలలో నుండి వచ్చారని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడని అన్నారు. ఈ కేసుతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. వాదనల్లో మరికొన్ని అంశాలు.. » గన్‌మెన్ గిరిబాబు సాక్ష్యం ఆధారంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై ఈ అక్రమ కేసు నమోదుచేశారు. » సిట్ అధికారులు గిరిబాబును 2025 జూన్ 1న విచారణ జరిపారు. » ఆ మర్నాడు జూన్ 2న అతనికి ప్రమోషన్ కల్పించి భారీ వేతనం పెంపుతో ఆక్టోపస్‌లోకి తీసుకున్నారు. » కేసు వెనుక ప్రలోభాల పర్వం ఎంత దారుణంగా ఉందో ఈ ఒక్క విషయం అద్దం పడుతోంది. » బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణ ఇరువురు చిరు ఉద్యోగులు. » వారిని కూడా సంబంధం లేని మద్యం కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. » నిందితులకు సంబంధించిన పాస్‌పోర్టులను సీజ్‌చేశారు. » లుక్అవుట్ నోటీసులు కూడా జారీచేశారు. » ఇటువంటి పరిస్థితులలో నిందితులు ఎక్కడికి పారిపోయే పరిస్థితి లేదు. » రాజ్యాంగంలోని 21వ అధికరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నాము. -
తెలుగు హీరోయిన్ మిస్సింగ్.. అసలు స్టోరీ ఇదే
చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో మెప్పించిన వాసంతిక మిస్సింగ్ అంటూ రెండురోజులుగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. చాలామందికి అసలు విషయం ఏంటి అనేది తెలియలేదు. ఒక హాస్టల్ నుంచి వెళ్తున్న సీసీటీవి ఫుటేజ్ కూడా విడుదల చేయడంతో చాలామంది నిజమేనని అనుకున్నారు. అయితే, అసలు విషయం తను నటిస్తున్న కొత్త సినిమా గురించి. ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ వాసంతిక ఇచ్చింది. ఇప్పటికే 90's - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ చిత్రంలో దివ్య అనే పాత్రతో మెప్పించన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలD/o ప్రసాద్‌రావు కనబడుటలేదు అనే సినిమాలో వాసంతిక ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ టైటిల్‌ను చూస్తే అర్థం అయింది కదా. ఒక యువతి మిస్సింగ్ స్టోరీతో మూవీని తెరెక్కించారు. అందుకే సినిమా ప్రమోషన్ కోసం ఇలా హీరోయిన్ మిస్సింగ్ అంటూ ఒక వీడియోను వైరల్ చేశారు. ఈ చిత్రం డైరెక్ట్‌గా జీ5లో విడుదల కానుంది. అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో ఉధయబాను, రాజీవ్ కనకాల కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు.నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వాసంతిక మెప్పించింది. సలార్‌లో కూడా ఆమె నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె కీలక పాత్రలో నటించిన సినిమా ఓటీటీలో విడుదల కానుంది. Swathi is missing.Family is in panic, the world is spinning.What next?Start tuned to know what happened to Swathi, D/o Prasadrao#SriRamVenkat #SouthIndianScrenss #ZEE5 #DaughterOfPrasadRaoKanabadutaledhu #ZEE5Telugu #RaajeevKanakala #UdayaBhanu #VasanthikaMacha pic.twitter.com/ZlpUnZWTrb— ZEE5 Telugu (@ZEE5Telugu) October 15, 2025 -
పక్కావ్యూహం ప్రకారమే..!
రాష్ట్రంలో నకిలీ మద్యం దందా తీగ లాగుతుంటే ఉండవల్లి కరకట్ట బంగ్లాలో డొంక కదులుతోంది. నకిలీ మద్యం వ్యవస్థీకృత దోపిడీకి కర్త, కర్మ, క్రియ ముఖ్య నేతేనని నిగ్గు తేలుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ టికెట్ జయచంద్రారెడ్డికి ఇవ్వడం దగ్గర మొదలైన ఈ వ్యవహారం... అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మద్యం దుకాణాల రద్దు... బెల్టుషాపులకు పచ్చ జెండా... పర్మిట్ రూమ్‌లకు గేట్లెత్తి వ్యవస్థను నియంత్రణలోకి తెచ్చుకుని... నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు నెలకొల్పి షాప్‌లకు సరఫరా చేయడం వరకు అంతా పక్కా వ్యూహంతో సాగిందని స్పష్టమవుతోంది.నాణ్యమైన మద్యం అందిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీ వెనుక విస్తుపోయే ‘ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం డీల్’ వంటి భారీ కుట్ర ఉందని క్రమంగా అర్థమవుతోంది. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం నిషా ఎక్కించి రూ.వేల కోట్లు కొల్లగొట్టే కుంభకోణం వెలుగుచూస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణ వెనుక పన్నాగం ఉందని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న నకిలీ మద్యం దందాకు నిరుటి ఎన్నికలకు ముందే కుట్ర పన్నారు. అధికారంలోకి రాగానే దోపిడీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే ‘‘ఆఫ్రికా మోడల్’’ నకిలీ సరుకు దందాను ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టి ముఖ్యనేత దోపిడీకి సహకరిస్తానని జయచంద్రారెడ్డి ఎన్నికలకు ముందే ఆఫర్ ఇచ్చారు. పెదబాబు, చినబాబు వెంటనే ఈ డీల్‌కు పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శంకర్యాదవ్లను సైతం పక్కనపెట్టారు. ఖర్చంతా తానే భరిస్తానని శంకర్‌యాదవ్ చెప్పినా టీడీపీ అధినాయకత్వం వినిపించుకోలేదు. ఆయనకు టికెటివ్వాలని కార్యకర్తలు కరకట్ట నివాసం వద్ద ధర్నాలు చేసినా ఒప్పుకోలేదు. క్యాడర్ వ్యతిరేకించినా జయచంద్రారెడ్డికే తంబళ్లపల్లె టికెట్ ఇచ్చారు. దీనివెనుక ఉద్దేశం... ‘‘ఒక సీటు పోయినా ఫర్వాలేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాతో భారీ దోపిడీకి పాత్రధారిగా జయచంద్రారెడ్డి ఉంటారు’’ అనే ఆలోచనేనని స్పష్టమవుతోంది. ఇక తాజాగా పెద్ద ఎత్తున బయటపడిన నకిలీ మద్యం ఉదంతంలో జయచంద్రారెడ్డి పాత్ర ఉందని స్పష్టమైనా.. ఆయనను తూతూమంత్రంగా టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతవరకు అరెస్టు చేయలేదు. దీన్నిబట్టే నకిలీ మద్యం దందాలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం స్థాయిలో ఉందే నిర్ధారణ అవుతోంది. అంతా గుప్పిట పట్టి.. భారీ స్కెచ్.. నాణ్యమైన మద్యం ఎంత అమ్మినా.. ఆ డబ్బు రాష్ట్ర ఖజానాకే పోతుంది. మన జేబులు నిండేదెలా? అని ముఖ్య నేత భావించారు. అందుకే నకిలీ మద్యాన్నే అధికారికంగా విక్రయించే కుట్రకు కూటమి ప్రభుత్వం రాగానే తెరతీశారు. మద్యం వినియోగం తగ్గించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి, పారదర్శకంగా అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించారు. వాటి స్థానంలో టీడీపీ సిండికేట్ ద్వారా 3,736 ప్రైవేటు దుకాణాలను ఏర్పాటు చేయించారు. అనుబంధంగా మరో 3,736 పర్మిట్ రూమ్‌లకు అనుమతిచ్చారు. టీడీపీ సిండికేట్ అనధికారికంగా ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను తెరిచింది. తాజాగా 540 బార్లనూ (త్వరలో మరో 300 కూడా) ఈ సిండికేట్‌కే కట్టబెట్టింది. మరోవైపు రాష్ట్రంలోని 20 మద్యం డిస్టిలరీలు దశాబ్దాలుగా టీడీపీ సీనియర్ నేతల కుటుంబాల ఆ«దీనంలోనే ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరింటికి అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. 20 డిస్టిలరీలనూ ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం ఎంప్యానెల్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతివ్వలేదు. ఈ విధంగా తయారీ నుంచి విక్రయాల వరకు నెట్వర్క్ అంతటినీ ముఖ్యనేత టీడీపీ మద్యం మాఫియా గుప్పిట్లో పెట్టారు. పచ్చ సీసాలో నకిలీ మద్యం కూటమి అధికారంలోకి రాగానే అత్యంత ప్రాధాన్యతతో కొత్త మద్యం విధానం ఎందుకు అమలు చేశారో లోగుట్టు బయటపడుతోంది. మొత్తం మద్యం నెట్వర్క్ తమ చేతుల్లోకి రావడంతో ముఖ్య నేత రెండో దశ కుట్రను అమలు చేశారు. జయచంద్రారెడ్డితో చినబాబు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాకు తెరతీశారు. మొత్తం నకిలీ ముఠాకు తనకు అత్యంత సన్నిహితుడైన అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతను చినబాబు సమన్వయకర్తగా పెట్టారు. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా టీడీపీ నేతలకు నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు కట్టబెట్టారు. నర్నీపటా్ననికి చెందిన సీనియర్ నేత కుటుంబానికి ఉత్తరాంధ్ర, ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ప్రజాప్రతినిధికి ఉమ్మడి ఉభయ గోదావరి, బాపట్ల జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ కీలక నేతకు రాయలసీమలో నకిలీ మద్యం దందా బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే ఆఫ్రికా దేశాల్లో నకిలీ మద్యం తయారుచేసే విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్రవ్యాప్తంగా యూనిట్లను నెలకొల్పారు. కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)ల రీతిలో జిల్లాలు, మండల స్థాయిలో నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం గమనార్హం. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్‌రావు, కట్టా సురేంద్రనాయుడు ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇప్పించారు. ముఖ్య నేత సన్నిహితులైన టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీల ద్వారా అక్రమంగా ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీగా కొని ఆ యూనిట్లకు తరలించారు. రాష్ట్రమంతా ముఖ్యనేత ప్రవేశపెట్టిన నకిలీ బ్రాండ్లు కేరళ మాల్ట్, బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్... ఇవీ ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా అమ్మకాలు సాగుతున్న మద్యం బ్రాండ్లు. ఎప్పుడూ వినని ఈ బ్రాండ్లు ఎక్కడివి అనే కదా మీ అనుమానం...? ఇవి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రవేశపెట్టిన ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం బ్రాండ్లు. వారి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్‌రావు, సురేంద్రనాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్న నకిలీ బ్రాండ్లే. అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం... ఇలా తనిఖీలు చేసిన ప్రతిచోటా పట్టుబడినది టీడీపీ సిండికేట్ ప్లాంట్లలో తయారవుతున్న నకిలీ మద్యమే. గుట్టలుగుట్టలుగా నిల్వ చేసిన నకిలీ మద్యం బ్రాండ్ల సరుకు దొరకడం అధికారులనే విస్మయపరుస్తోంది. దీన్నిబట్టే ఎంత పక్కాగా, యథేచ్ఛగా ముఖ్య నేత ఆఫ్రికా మోడల్ నకిలీ దందాను నడిపిస్తున్నారో స్పష్టమవుతోంది. మోగుతున్న మరణమృదంగం... టీడీపీ కూటమి ప్రభుత్వం... బ్రాండెడ్ ముసుగులో విచ్చలబిడిగా విక్రయిస్తున్న నకిలీ మద్యం రాష్ట్రంలో మరణ మృదంగం మోగిస్తోంది. 60 నుంచి 75 శాతం వరకు ఆల్కహాల్ ఉండే నకిలీ మద్యం తాగడంతో గుండె, ఊపిరితిత్తులు, ఉదరం, మూత్ర పిండాలు వేగంగా దెబ్బతింటున్నాయి. నాడీ వ్యవస్థపై దుష్ప్రభావంతో చిత్తచాంచల్యం ఆవహిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారు వేగంగా తీవ్ర అనారోగ్యానికి గురై కొద్ది రోజుల్లోనే మృత్యువాత పడుతున్నారు. అంతుబట్టని మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ఏలూరు జిల్లాల్లో వరుస హఠాన్మరణాలకు నకిలీ మద్యమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఎక్సైజ్ శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. పరిస్థితి ఇలానే కొనసాగితే తమ మెడకు చుట్టుకుటుందని భావించారు. భవిష్యత్‌లో ఇబ్బంది రాకుండా ఎక్సై్సజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తనిఖీలు, దాడులు చేసింది. ఏదో కిందిస్థాయి ముఠా దొరికితే కేసులు నమోదు చేసి ట్రాక్ రికార్డు కాపాడుకోవాలనుకుంది. కానీ, వారు ఊహించని రీతిలో నకిలీ మద్యం వెనుక ఉన్న వ్యవస్థీకృత మాఫియా బండారం బయటపడింది. ఈ మాఫియా డాన్ ముఖ్యనేతేనని తేలడంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు నోట మాట రాలేదు. ప్రభుత్వ ముఖ్య నేత ఆదేశంతో నకిలీ మద్యం మాఫియా తీవ్రతను కప్పిపుచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, నకిలీ మద్యం దారుణాలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుండటంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తొలి ఏడాది రూ.5,280 కోట్ల దోపిడీ రాష్ట్రంలో అమ్ముడవుతున్న మద్యంలో మూడో వంతు నకిలీ అని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేయడం గమనార్హం. ఈ లెక్కన టీడీపీ కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాది రూ.5,280 కోట్ల నకిలీ మద్యం అమ్మకాలు సాగాయి. మొత్తం మద్యం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50 శాతం దాటించాలన్నది టీడీపీ సిండికేట్ లక్ష్యం. అంటే, రానున్న నాలుగేళ్లలో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టడానికి పన్నాగం పన్నింది. ఇందులో నకిలీ మద్యం దందాకు మూల విరాట్ అయిన ముఖ్యనేత కరకట్ట బంగ్లాకు 30 శాతం వాటాగా లెక్కతేల్చారు. మొత్తంమీద రూ.15 వేల కోట్లు కరకట్ట బంగ్లాకు కమీషన్‌గా చేరనుంది. ప్రాంతాలవారీగా పర్యవేక్షిస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు 50 శాతం, మద్యం దుకాణాలు, బార్లు నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్‌కు 20 శాతం వాటా. ఇంత భారీ దోపిడీ కాబట్టే పెదబాబు, చినబాబు ఈ దందాను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అప్పట్లో దుష్ప్రచారం ... రాద్ధాంతం... ఇప్పుడు అంతటా మౌనం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తేనే టీడీపీ కూటమి, ఎల్లో మీడియా రాద్ధాంతం చేసింది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్, అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు తదితరులు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. మద్యం నాణ్యమైనది కాదని చెన్నైకు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని రఘురామ తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. అసలు తాము అటువంటి నివేదిక ఇవ్వలేదని ఆ ల్యాబ్ ప్రకటించంతో వారి కుట్ర బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యమైనదేనని ప్రకటించింది. అప్పట్లో రాద్ధాంతం చేసిన చంద్రబాబు, ఆయన గ్యాంగ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు క్రమంగా బయటపడుతున్నా కిమ్మనడం లేదు. కఠిన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతను ర్యాండమ్‌గా పరీక్షించాలని కూడా భావించడం లేదు. ఇదంతా చూస్తుంటే నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వ పెద్దల దన్ను ఉందన్నదే స్పష్టమవుతోంది. స్పిరిట్ .. మనుషులకు ప్రాణాంతకం!వాస్తవానికి ఈ స్పిరిట్‌లో 100 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరం. పరిశ్రమలు తమ ఉత్పత్తుల (ఆహార సంబంధిత కాదు) తయారీకి ఈ స్పిరిట్‌ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాయి. ఇక బ్రాండెడ్ మద్యం కంపెనీల పరిశ్రమల్లో ఉండే అధునాతన, భారీ యంత్ర పరికరాలతో స్పిరిట్‌ను బాగా పలుచన (డైల్యూట్) చేసి ఆల్కహాల్‌ను 42 శాతానికి తగ్గిస్తాయి. తర్వాతే మద్యం తయారీకి ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ఎందకంటే ఆల్కహాల్ 42 శాతం కంటే ఎక్కువ ఉండడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. కాగా, ఏడాదిగా టీడీపీ కూటమి పెద్దలు అక్రమంగా నెలకొల్పిన నకిలీ మద్యం యూనిట్లు ప్రమాణాలు ఏమీ పాటించలేదు. వీటిలోని చిన్నచిన్న యంత్రాలకు స్పిరిట్‌ను ప్రాసెస్ చేసే సామర్థ్యం లేదు. స్పిరిట్లోని ప్రమాదకర కారమిల్ ద్రావణం, రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు బ్రాండెడ్ కంపెనీల మద్యం సీసాలు, మూతలు కూడా తయారు చేస్తున్నారు. నకిలీ మద్యంలో ఆల్కహాల్ 75 శాతం వరకు ఉంటోందని ఎక్సైజ్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అది ఎంత ప్రమాదకరమో ఊహకే అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీసాల్లో నకిలీ మద్యం నింపి మూతలు బిగించి టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉన్న 3,736 ప్రైవేట్ దుకాణాలు, 3,736 పర్మిట్ రూమ్‌లు, 75 వేల బెల్ట్ దుకాణాలు, ఇప్పటికి 540 బార్లలో (త్వరలో మరో 300 కూడా) యథేచ్ఛగా అమ్ముతున్నారు. -
మహిళలను గౌరవించాలి
కర్ణాటక: యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితునికి హైకోర్టు బెయిలును నిరాకరించింది. వివరాలు.. కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాకు చెందిన సయ్యద్ పర్వేజ్ నిందితుడు. ఈ ఏడాది ఏప్రిల్ 1న బిహార్ కూలీ యువతి (19) కేరళ నుంచి సొంతూరికి వెళ్లాలని బయల్దేరింది. బెంగళూరు కేఆర్ పురం రైల్వేస్టేషన్లో దిగింది. మరుసటి రోజు అర్ధరాత్రి యువతి తెలిసిన వ్యక్తితో భోజనం చేయాలని హోటల్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ సమయంలో అక్కడే ఉన్న నిందితుడు పర్వేజ్, మరొక నిందితుడు వారిపై దాడి చేశారు. యువతిని లాక్కెళ్లి అఘాయిత్యం చేశారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి పరప్పన జైలుకు తరలించారు. బెయిలు ఇవ్వాలని నిందితుడు పర్వేజ్ హైకోర్టును ఆశ్రయించాడు. మహిళలను గౌరవించాలని మన పురాణాలు ఘోషిస్తున్నాయి, అర్ధరాత్రి మహిళలు నిర్భయంగా నడిచి వెళ్లినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు మహాత్మాగాంధీ చెప్పారు, ఈ నేరంలో బెయిలు ఇవ్వలేము అని జడ్జి ఎస్.రాచయ్య తీర్పు చెప్పారు. -
సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం
-
సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: సవీంద్ర(Savindra) కేసును సీబీఐ(CBI)కి అప్పగించటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్‌తో ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి నిదర్శనమన్న వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదన్నారు.‘‘ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.I welcome the Hon’ble High Court’s suo moto direction to hand over the case of social media activist Kunchala Savindra Reddy to the CBI. This decision reveals the alarming state of affairs in Andhra Pradesh, where the police under the @ncbn–led government have been crushing…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2025ఇదీ చదవండి: చంద్రబాబు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి! -
మోదీపై వీడియో.. పన్నూకు బిగ్ షాక్
ఖలిస్థానీ ఉగ్రవాది, 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)కు మరో షాక్ తగిలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఉపా చట్టం (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం) కింద అతనిపై తాజాగా ఓ కేసు నమోదు చేసింది. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పన్నూ చేసిన వీడియో ప్రకటనే ఇందుకు కారణంగా తెలుస్తోంది.పంద్రాగస్టు సందర్భంగా.. ఎర్రకోటలో దేశ ప్రధాని జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వేడుకల్లో మోదీని జెండా ఎగరేయకుండా అడ్డుకున్న వాళ్లకు భారీ నజరానా ప్రకటించాడు సిక్స్ ఫర్ జస్టిస్ ప్రధాన న్యాయ సలహాదారు గురుపత్వంత్ సింగ్. ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్ఐఏ.. UAPA (Unlawful Activities Prevention Act) కింద కేసు నమోదు చేసింది.ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేసిన ఆ వీడియోలో.. సిక్కు సైనికుల్లో ఎవరైనా సరే ప్రధాని మోదీని జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండా అడ్డుకోవాలని, అలా చేస్తే రూ.11 కోట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. అంతటి ఆగకుండా.. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలిపి "కొత్త ఖలిస్తాన్" అనే పటాన్ని కూడా విడుదల చేశాడు.ఈ చర్యలను భారత దేశ భద్రత, భౌగోళిక సమగ్రతను భంగపరిచే ప్రయత్నంగా భావిస్తూ.. ఎన్ఐఏ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. సిక్కు సమాజంలో అసంతృప్తిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, తీవ్ర వాద భావజాలాన్ని వ్యాప్తి చెందిస్తున్నాడని ఇదివరకే అతనిపై అభియోగాల కింద పలు కేసులు నమోదు అయ్యాయి. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను 2007లో స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకడు. ఈ సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. పన్నూకు అగ్రరాజ్యంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది.ఇదీ చదవండి: బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యమంటున్న భీమవారం వాసి! -
చర్లపల్లి: సంచిలో మృతదేహం కేసు.. ఆ మహిళ ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి సంచిలో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చనిపోయిన మహిళ బెంగాల్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. పది సంవత్సరాల నుంచి భర్తతో దూరంగా ఉంటున్న ప్రమీల.. మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల బెంగాలీ యువకుడితో ప్రమీలకు పరిచయం కాగా, కొండాపూర్ ప్రాంతంలో అతనితో కలిసి ఉంటుంది.ప్రమీలను హత్యను చేసిన ఆ యువకుడు గోనె సంచిలో వేసుకొని చర్లపల్లి స్టేషన్‌కు వచ్చాడు. ఆటోలో మృతదేహాన్ని 37 కిలోమీటర్లు తీసుకొచ్చిన ఆ వ్యక్తి.. చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పెట్టి వెళ్లిపోయాడు. రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని అస్సాం వెళ్లే ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు. హత్యకు సంబంధించి సీసీ ఫుటేజ్ లభ్యమైంది.కాగా, చర్లపల్లి రైల్వేస్టేషన్ గోడ వద్ద సంచిలో మహిళ మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటల సమయంలో మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టు స్థానిక ఆటో డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
మద్యం డాన్.. మరో డ్రామా!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు సర్కారు బరితెగించి వ్యవహరిస్తోంది. టీడీపీ వీర విధేయ అధికారులతో కూడిన సిట్‌తో ఈ పన్నాగాన్ని అమలు చేస్తోంది. అందుకోసం సాక్షులను, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసింది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. వాటి ఆధారంగానే గత ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు డైరెక్షన్లో సిట్ ఎప్పటికప్పుడు వివిధ పాత్రలను తెరపైకి తెస్తూ నిరాధార అభియోగాలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోంది. మొదట రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను అక్రమంగా అరెస్టు చేసి బురద జల్లారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి దు్రష్పచారం చేశారు. టీడీపీ అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అంతటితో చంద్రబాబు కుట్రలు ఆగలేదు... ఈ రెడ్‌బుక్ కుట్ర కేసులో రెండో అంకంగా.... నర్రెడ్డి సునీల్‌రెడ్డి నివాసంలో సోదాలతో మరో కట్టుకథ వినిపించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి పేర్లను తెరపైకి తెచ్చారు. తాజాగా వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. చెన్నై, హైదరాబాద్‌లలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు శుక్రవారం సోదాలకు దిగారు. చెన్నైకు చెందిన వ్యాపారవేత్త వైఎస్ అనిల్‌రెడ్డి ఏనాడూ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లోగానీ ఇతర అంశాల్లో గానీ ఆయన ఏనాడూ కల్పించుకోలేదు. కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు వైఎస్ అనిల్‌రెడ్డి నివాసంలో సోదాలు చేయాల్సిందేనని సిట్‌ను ఆదేశించింది. ఇదే అదనుగా ఎల్లో మీడియా ద్వారా వైఎస్ కుటుంబంపై బురద జల్లాలన్నదే అసలు లక్ష్యం. రానున్న రోజుల్లో సిట్ ద్వారా రెడ్‌బుక్ కుట్రలకు మరింత పదును పెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది.మద్యం కుట్రదారు చంద్రబాబే..ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్న బాబు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి ఈ కుట్రకు ఎందుకు పాల్పడుతోంది అంటే... అసలు మద్యం విధానం ముసుగులో దోపిడీకి పాల్పడింది టీడీపీ ప్రభుత్వమే అన్నది వాస్తవం. రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. 2014–19లో టీడీపీ హయాంలో తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. 4,834 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును అడ్డగోలుగా తొలగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో దోపిడీకి తెరతీశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200 కోట్లు గండి కొట్టారు. దీనిపై రాజ్యాంగబద్ధ సంస్థ ‘కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. ఇక ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి టీడీపీ హయాంలో ఏకంగా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు బృందం బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి సీఎం చంద్రబాబు తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్నారన్నది అసలు నిజం. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే గతానికి మించిన స్థాయిలో మద్యం దోపిడీకి తెగబడుతున్నారు. మద్యం విధానం ద్వారా తమ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి సిట్ ద్వారా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది.రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కుట్రరెడ్బుక్ కుట్ర కేసు కోసం చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో వ్యవహరించింది. ఈ కేసుకు కేంద్ర బిందువుగా రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కూటమి సర్కారు కుతంత్రం దాగుంది. ఆయన చెప్పని విషయాలను సైతం చెప్పినట్టుగా సిట్ తప్పుడు వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అసలు ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేయలేదని సిట్ అధికారులే ఆ రిమాండ్ నివేదికలో వెల్లడించారు. లేదంటే రాజ్ కేసిరెడ్డి తాను ఆ వాంగ్మూలం ఇవ్వలేదని న్యాయస్థానానికి చెబితే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయంతోనే సిట్ ఆ విషయాన్ని నివేదికలో పేర్కొంది. ఇక అసలు విషయం ఏమిటంటే... రాజ్ కేసిరెడ్డి ఎవరో కాదు... ఆయన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కూడా. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘డే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతే కాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అన్నది బహిరంగ రహస్యమే. అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేశారు. ఇక కేశినేని చిన్ని బినామీ కంపెనీ ‘ఉర్సా ఐటీ సొల్యూషన్స్’కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టే కుట్రలకు తెర తీశారు. కేశినేని చిన్ని ముసుగులో ప్రభుత్వ పెద్దలు దోపిడీకి పాల్పడుతున్నారు. మరి రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన ఎంపీ కేశినేని చిన్నిపై సిట్ ఎందుకు కేసు నమోదు చేయడం లేదన్నది కీలకం. అంటే ఇదంతా చంద్రబాబు రెడ్‌బుక్ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతోంది. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని రూపొందించిన ఫైల్‌పై చంద్రబాబు, కొల్లు రవీంద్ర చేసిన డిజిటల్ సంతకాలు మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్రపై 2023 అక్టోబర్ 28నసీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ -
వివేకా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్.. సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అని ఏఎస్జీ తెలిపారు.‘‘దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు బస్ మిస్సయ్యారు.. ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా?. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలన్నీ ట్రయల్ కోర్టులో ఎందుకు చెప్పలేదు?. ఇలాగే పిటిషన్లు వేస్తూ వెళ్తే ట్రయల్ రన్ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుంది. ఈ దశలో మేం చేసేది ఏం లేదు’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, గత నెలలో వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టు5న మరోసారి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది.ఇవాళ(మంగళవారం) ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని.. తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. -
Dharmasthala case: మృతదేహాల పారవేతపై ‘సిట్’కు 30 ఫిర్యాదులు
మంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో సిట్ అధికారుల విచారణ మరో మలుపు తిరిగింది. ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుని ఆరోపణల మేరకు పలు ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు జరపగా, అనుమానాస్పద మృతదేహాలకు సంబంధించిన ఖచ్చితమైన ఆనవాళ్లు లభించలేదు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)నకు తాజాగా స్థానికంగా చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు, తప్పిపోయిన వ్యక్తులు, మృతదేహాలను అనధికారికంగా పారవేయడానికి సంబంధించి 30కి పైగా ఫిర్యాదులు అందాయి.‘మృతదేహాలను పారవేశారు’ధర్మస్థళ ఆలయానికున్న మతపరమైన పవిత్రతను కించపరచడానికే ఈ వివాదం సృష్టించారని కూడా వాదనలు వినిపిస్తున్న తరుణంలో, స్థానిక గ్రామ పంచాయతీ , పోలీసుల ప్రమేయంతో అనధికారికంగా ఇక్కడ మృతదేహాలను పారవేశారని సిట్ అధికారులకు అందిన ఫిర్యాదులలో ఆరోపణలున్నాయి. అలాగే ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో భారీ కుట్ర జరిగిందని కొంతమంది ఫిర్యాదుదారులు సిట్ అధికారులకు తెలిపారు.సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి సమావేశందర్యాప్తు పురోగతిని సమీక్షించేందుకు, ఫిర్యాదుల విశ్వసనీయతను నిర్ణయించడానికి సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో ఆయనతో పాటు పోలీసు సూపరింటెండెంట్లు జితేంద్ర కుమార్ దయామా, సీఏ సైమన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ‘మాకు 30 కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. అవన్నీ పరిశీలనలో ఉన్నాయి. అవి నిరాధారమైనవని తేలితే, వాటిని పరిగణలోకి తీసుకోం. అయితే పలువురు ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు కోరుతున్నాయి. ఇందుకు మరింత సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది’ అని ఒక సీనియర్ అధికారి అన్నారు.అడవుల్లో అస్థిపంజర అవశేషాలుమరోవైపు ఇటీవల ఒక కీలక సాక్షి, 2012లో అత్యాచారం, హత్యకు గురైన సౌజన్య మామ విట్టల్ గౌడ సిట్ అధికారులను బంగ్లెగుడ్డె అడవులకు తీసుకువెళ్లి, మానవ అస్థిపంజర అవశేషాలను చూపించాడు. ఈ ప్రాంతం చుట్టుపక్కల పరిశీలించగా, మరిన్ని మానవ అవశేషాలు కనుగొన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫోరెన్సిక్ దర్యాప్తుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారని సమాచారం. అయితే దీనిపై చట్టపరమైన అభిప్రాయం కోరనున్నట్లు సిట్ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా సిట్‌కు అందిన ఫిర్యాదులను ముందుగా స్థానిక పోలీసులకు అప్పగిస్తామని అన్నారు. అలాగే బంగ్లెగుడ్డె అడవుల్లో తవ్వకాలు జరపాలంటే అటవీ శాఖకు సమాచారం అందించాల్సి ఉంటుందని సిట్ అధికారులు తెలిపారు. -
చార్లీ కిర్క్ ను హతమార్చిన నిందితుడిని పట్టిస్తే.. లక్ష డాలర్లు..!
-
నాపై అలాంటి కేసు.. చాలా బాధాకరం: శ్వేతా మీనన్
ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవలే మలయాళ సినీ నటుల సంఘం (AMMA) అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్వేత మీనన్ తనపై నమోదైన కేసుపై స్పందించింది. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమె.. 12 ఏళ్ల క్రితం తాను నటించిన చిత్రంపై కేసు నమోదు చేయడం బాధాకరమైన సంఘటన అని తెలిపింది. కేవలం డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో తాను సినిమాలు చేయడం లేదన్నారు. తనకు శత్రువులు ఎక్కువయ్యే కొద్ది.. మరింత రాణిస్తానని శ్వేతా మీనన్ అన్నారు.శ్వేతా మీనన్ మాట్లాడుతూ.. "శత్రువులు ఎక్కువైతే నేను మరింత ఎక్కువగా రాణిస్తా. ఒక వ్యక్తిగా నాపై కేసు పెట్టడం చాలా బాధాకరం. 12 సంవత్సరాల క్రితం వచ్చిన నా చిత్రాల గురించి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆ సినిమాలు నాకు రాష్ట్ర అవార్డును తెచ్చిపెట్టాయి. ఇలాంటి కేసును ఎవరూ ఎదుర్కోలేదు. ఆ సమయంలో అమ్మా ఎన్నికల నుంచి వెనక్కి తగ్గాలా అనే అయోమయంలో పడ్డా. కానీ నా కుటుంబం మద్దతు నన్ను ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు మీ ముందు దెబ్బతిన్న ఆడపులిగా నిలబడ్డా' అని పంచుకుంది.కాగా.. అధికంగా డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌తో కూడిన సినిమాల్లో నటించారని ఆరోపిస్తూ శ్వేతా మీనన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలయాళ మూవీ ఆర్టిస్టుల సంఘం (AMMA) ఎన్నికలకు పోటీ చేస్తున్న సమయంలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త మార్టిన్ మెనాచేరి మీనన్‌పై కంప్లైంట్ చేశారు. అయినప్పటీకీ అమ్మా మొదటి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అంతేకాకుడా శ్వేతా మీనన్‌కు గతంలో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో రెండుసార్లు ఉత్తమ నటిగా గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ 1994 కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. -
KSR Live Show; లిక్కర్ స్కాం కేసులో బెడిసికొట్టిన టీడీపీ ప్లాన్
-
వివాదంలో కొత్త లోకా మూవీ.. దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ క్షమాపణలు!
మలయాళ చిత్రాలకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంటోంది. కంటెంట్ బాగుంటే మనవాళ్ల థియేటర్లకు ఎగబడుతున్నారు. ఇటీవల రిలీజైన మరో మలయాళ చిత్రం కొత్త లోక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా నికర వసూళ్లను సాధించింది. ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్, శాండీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమాలోని ఓ సీన్ వివాదానికి దారితీసింది. బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందంటూ విమర్శలొచ్చాయి. దీంతో దుల్కర్ సల్మాన్‌కు చెందిన నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఆ సన్నివేశాన్ని తొలగిస్తామని ట్వీట్ చేసింది. కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. ఈ విషయంలో తమను క్షమించాలని కోరుతూ వేఫరర్ ఫిల్మ్స్ లేఖను పోస్ట్ చేశారు.ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ నాచియప్ప గౌడ (కొరియోగ్రాఫర్ శాండీ పోషించిన పాత్ర) బెంగళూరుకు చెందిన మహిళలను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని.. వారు క్యారెక్టర్ లెస్ అంటూ మాట్లాడారు. ఈ సీన్ బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కన్నడ డైరెక్టర్ మన్సూర్ సైతం ఈ సినిమాపై విమర్శలు చేశారు. కన్నడ భీమ, మలయాళ చిత్రాలు ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ఆవేశం, ఇప్పుడు కొత్త లోకా లాంటి సినిమాలతో బెంగళూరును మాదకద్రవ్యాలు, నేరాలకు రాజధానిగా చిత్రీకరించారని అన్నారు. ఒకప్పుడు, సినిమాల్లో అందమైన పట్టణంగా చూపించిన బెంగళూరు.. నియంత్రణ లేని వలసల కారణంగా ఇలాంటి స్థితికి చేరుకుందని ట్వీట్లో రాసుకొచ్చారు.#Lokah pic.twitter.com/q18SX8dh7G— Wayfarer Films (@DQsWayfarerFilm) September 2, 2025According to movies like Kannada Bhima, Malayalam films Officer on Duty, Avesham, and now Lokah,Bengaluru is being portrayed as the capital of drugs and crime.Once upon a time,it was represented in movies as a beautiful town,has come to such a state due to uncontrolled migration.— ಮಂಸೋರೆ/ManSoRe (@mansore25) September 1, 2025 -
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడు అరెస్ట్
సాక్షి, ఢిల్లీ: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆరిఫ్ హుస్సేన్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రేపు(శుక్రవారం) విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుస్సేన్‌ను హాజరుపర్చనున్నారు.వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను సమకూర్చుతున్న ఆరిఫ్.. దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎన్ఐఏ గుర్తించింది. సిరాజ్, సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇవాళ(గురువారం) ఆరిఫ్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఉగ్ర వాదులు సిరాజ్, సమీర్లతో కలిసి పని చేసిన ఆరిఫ్.. ఐడీల ద్వారా ఉగ్రదాడులు చేసేందుకు కెమికల్స్‌ను తీసుకెళ్తుండగా సమీర్, సిరాజులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
పుర్రె రహస్యం గుట్టురట్టు?
కర్ణాటక: ధర్మస్థలలో వందలాది శవాలను పూడ్చిపెట్టినట్లు చెప్పిన ముసుగు మనిషి చిన్నయ్య నుంచి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నాయి. అతడు మొదట్లో తీసుకువచ్చిన పుర్రె ఎక్కడిది అనే ప్రశ్నకు సమాధానం లభించింది. చిన్నయ్యను సిట్ అధికారులు విచారణ కోసం 10 రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. శనివారం నుంచి ప్రశ్నలతో సతమతం చేస్తున్నారు. పుర్రెను ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్లు చెప్పాడని తెలిసింది. కుట్ర చేసిన ముఠా తనను ఢిల్లీకి తీసుకువెళ్లి అక్కడ ప్రముఖ వ్యక్తులను కలిసి పుర్రె ఇచ్చారన్నాడు. పుర్రెను ముందు పెట్టుకుని కోర్టు నుంచి భద్రత తీసుకున్నానని చెప్పాడని సమాచారం. పుర్రె దొరికినది ధర్మస్థలలో తవ్వకాలు జరిగిన చోట కాదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. పుర్రెలో ఉన్న మట్టిని బట్టి ఆ అంచనాకు వచ్చారు. ఆపై చిన్నయ్యను గట్టిగా ప్రశ్నించగా పుర్రె ను వేరే చోట నుంచి తీసుకువచ్చినట్లు తెలిపాడు. ఇతరులు చెప్పినట్లు నేను చేశానని, కానీ సూత్రధారి వేరేవారని నోరువిప్పాడు. సదరు ముఠా నుంచి నుంచి రూ.2 లక్షలు నగదు తీసుకుని నాటకమాడినట్లు చెప్పాడు. 2023 డిసెంబరులో ఆ గ్యాంగ్ తనను సంప్రదించి ఈ వ్యవహారం నడపాలని కోరింది. ఈ అసత్య ప్రచారం చేసే గ్యాంగ్‌లో మహేశ్‌శెట్టి తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్లు ఉన్నట్లు తెలిపాడు. చిన్నయ్య మరింత విచారించి సమాచారం సేకరించడంలో తలమునకలయ్యారు.సుజాతభట్ ను ఇంట్లోనే విచారణ! కూతురు అనన్య భట్ అదృశ్యమైందని, ఆమె ఆచూకీ కనిపెట్టాలని, వీలు కాకపోతే కనీసం అస్థికలనైనా ఇవ్వాలని ధర్మస్థలలో రభస చేసిన వృద్ధురాలు సుజాత భట్‌ను ఇంట్లోనే త్వరలో విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. బెంగళూరు బనశంకరిలో ఆమె నివాసానికి గట్టి పోలీస్ భద్రత కలి్పంచారు. ఒకటి రెండు రోజుల్లో ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తారు. ఆమె చెప్పేది నిజమా, అబద్దమా తదితరాలను ఆరా తీస్తారు. మాస్కుమ్యాన్ చూపించిన 17 ప్రదేశాల్లో తన కుమార్తె అనన్యభట్ ను పూడ్చిన స్థలం ఉందని సుజాత భట్ ఆరోపించింది. గతంలో మిస్సింగ్ ఫిర్యాదు ఇస్తే ధర్మస్థల పోలీసులు అస్సలు పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేయడం చాలా ప్రచారమైంది. ఈమె వ్యాఖ్యలతో ధర్మస్థల కేసు బలపడుతుందనే సమయంలో ఆమెకు పిల్లలు లేరని తేలింది. ఈ విషయమై ప్రశ్నించగా.. మణిపాల్‌లో తన తాత ఆస్తి ఉండేది. ఆ ఆస్తిని తమ కుటుంబసభ్యులు ధర్మస్థల ధర్మాధికారులకు ఇచ్చారని, దీంతో నేను ఈ విధంగా అబద్ధం చెప్పానన్నారు. తరువాత ఆ మాటలు తనవి కాదని ప్రకటించింది. ఇలా నిత్యం విరుద్ధ ప్రకటనలు ఆమె ఎందుకు చేస్తోందో పోలీసులకు అంతుబట్టడం లేదు. పూర్తి వివరాలు కావాలని, విచారణకు రావాలని సిట్ నోటీసులు పంపగా ఆమె విచారణకు రాలేదు. రెండు మూడు రోజుల్లో ఇంటికెళ్లి విచారించాలని తీర్మానించారు.యూట్యూబర్ సమీర్ విచారణశివాజీనగర: ధర్మస్థల మీద అభూత కల్పనలతో వీడియోలు చేశాడనే కేసులో బళ్లారి యుట్యూబర్ సమీర్ ఆదివారం బెళ్తంగడి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యాడు. ఉదయం 10–30 గంటలకు వస్తానని చెప్పి, మధ్యాహ్నం 1 గంటకు న్యాయవాదితో కలిసి వచ్చాడు. ధర్మస్థల దేవాలయం విరుద్ధంగా అప ప్రచారం చేసినందుకు, పలు వర్గాలను రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో కోర్టులో ముందస్తు బెయిలు తెచ్చుకున్నాడు. ధర్మస్థలలో తనకు ప్రాణ బెదిరింపు ఉందని సమీర్ చెప్పుకొన్నాడు. సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. -
'ధర్మస్థల' కేసులో మరో భారీ ట్విస్ట్
-
‘నాఫ్తలీన్’తో కప్పెట్టి.. పటకారుతో మోది.. దడపుట్టిస్తున్న రెండు ఘటనలు
వార్ధా: మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన భార్య అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరించేందుకు అతనిని ఫోన్లో సంప్రదించారు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో పోలీసులు నేరుగా వార్ధాలోని హింగాన్ఘాట్లోని వారి ఇంటికి వెళ్లినప్పుడు అసలు విషయం బయటపడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వార్ధాలోని హింగాన్ఘాట్కు చెందిన ఒక వ్యక్తి కొన్ని రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో తన భార్య అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదును చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా అతని ఇంటికి వెళ్లిన పోలీసులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ ఇంటి సమీపంలో ఘాటైన వాసనను పోలీసులు గమనించారు.అది నాఫ్తలీన్ బాల్స్ వాసనగా వారు గుర్తించారు. అలాగే అక్కడ గుంత తవ్విన ఆనవాళ్లు వారికి కనిపించాయి. అక్కడ తవ్వి చూడగా, వారికి మహిళ మృతదేహం కనిపించింది. నాఫ్తలీన్ బాల్స్ ఘాటైన వాసన పోలీసుల దర్యాప్తులో కీలకంగా ఉపయోగపడింది. ఈ హత్య ఎలా జరిగిందనే వివరాలు ఇంకా వెల్లడికావలసి ఉంది. ఈ కేసులో అదృశ్యమైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.పటకారుతో దాడి చేసి..హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇటువంటి ఉదంతమే వెలుగు చూసింది. భార్యను అత్యంత దారుణంగా చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మనేసర్ ప్రాంతంలోని నహర్పూర్ కసన్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌కు చెందిన నిషా బిష్ట్ రాజేంద్రలకు 2024, డిసెంబర్లో వివాహం జరిగింది. గురుగ్రామ్‌లో ఉంటున్న వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా మరోమారు నిషా, రాజేంద్ర గొడవపడ్డారు. ఈ సమయంలో రాజేంద్ర వంటగదిలోని పటకారుతో ఆమెపై దాడి చేశాడు. తరువాత రోకలిబండతో మోదాడు.ఆమె అపస్మారక స్థితిలోకి చేరాక, చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. పోలీసులు శుక్రవారం ఉదయం నిషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు. రాజేంద్రను అరెస్టు చేశారు. అతను నేరం అంగీకరించాడు. పోలీసులు ప్రస్తుతం అతనిని విచారిస్తున్నారు. -
కూకట్పల్లి సహస్ర కేసు.. వెలుగులోకి నమ్మలేని నిజాలు
సాక్షి, హైదరాబాద్: ఐదు రోజులుగా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన కూకట్పల్లి సహస్ర హత్య కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్ల క్రితమే సహస్ర ఇంటి పక్కన ప్లాట్‌లోకి వచ్చిన బాలుడు కుటుంబ సభ్యులు.. ఇదే ప్రాంతంలో కిరాణా షాప్ నడుపుతున్నారు. బాలుడు స్వస్థలం ఒంగోలు జిల్లా. కొద్దిరోజుల క్రితమే సహస్ర పుట్టిన రోజు వేడుకలు జరగ్గా.. ఆమె బర్త్ డే వేడుకలకు బాలుడు హాజరయ్యాడు. సహస్రకి కేక్ కూడా తినిపించి విషెస్ చెప్పాడు. అయితే, టెన్త్ క్లాస్ విద్యార్థి ఇంత కిరాతకానికి ఎలా తెగించాడు? అనే దానిపై పోలీసులు కూడా షాక్‌కు గురవుతున్నారు.బాలికను హత్య చేసిన బాలుడు సైకో అవతారం ఎత్తాడు. యూట్యూబ్ వీడియోలు చూడటం, క్రైమ్ సీన్స్ చూసి హత్యకు పాల్పడ్డాడు. పక్క పథకం ప్రకారం క్రైమ్ సీన్ రచించిన బాలుడు.. 10వ తరగతి దశలోనే క్రైం చేయడం నేర్చుకున్న బాలుడు.. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం ఎలాగో నేర్చుకున్నాడు. బాలుడిని పదుల సంఖ్యలో పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటిలెజెంట్‌గా బాలుడు వ్యవహరించాడు.బాలుడు రెగ్యులర్‌గా కత్తి పట్టుకుని తిరుగుతాడని పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తండ్రి తాగుబోతు, తల్లి ఓ ప్రైవేట్ ఉద్యోగి.. కుమారుడిని సరైన మార్గంలో పెంచలేకపోయారు. కొడుకును పట్టించుకోకపోవడంతో ఆ బాలుడు క్రైమ్ సీన్లకు అలవాటుపడ్డాడు. బాలుడి తల్లిదండ్రులను డీసీపీ విచారిస్తున్నారు. ఓటీటీ, యూట్యూబ్ వీడియోలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనడానికి ఇదో ఉదాహరణ.. ఓటీటీలో క్రైం సీరియల్స్ చూసి దొంగతనానికి ప్లాన్ చేశాడు. హత్యకు రెండు రోజుల ముందే పేపర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాలుడు రాసుకున్నాడు.హత్య జరిగిన రోజున కూడా పోలీసులను బాలుడు తప్పుదోవ పట్టించాడు. సహస్ర ఇంట్లోంచి గట్టిగా అరుపులు వినిపించాయంటూ.. ఏమీ ఎరగనట్లు హత్య జరిగిన రోజున పోలీసులకు చెప్పాడు. బాలుడి మాటలతో ఇతరులు చంపి ఉంటారన్న అనుమానంతో ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను చంపేసాక ఆ బాలుడు గ్యాస్ లీక్ చేయాలనుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. -
కూకట్పల్లి బాలిక సహస్ర కేసు.. టెన్త్ విద్యార్థే హంతకుడు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహస్రను పదో తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్‌లోనే బాలుడు ఉంటున్నాడు. బాలుడిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి చొరబడిన బాలుడు.. చోరీ చేశాడు. దొంగతనానికి వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్న బాలుడు.. ఆ కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా పొడిచి ప్రాణాలు తీశాడు. దొంగతనం ఎప్పుడు? ఎక్కడ ఎలా చేయాలి?. చేసే సమయంలో ఏదైనా ఆపద వస్తే ఏ విధంగా తప్పించుకోవాలో పక్కాగా ప్లాన్ చేసిన బాలుడు.. బాలిక ఇంట్లో చొరబడి రూ. 80 వేలు దొంగతనం చేశాడు. ఇంకా డబ్బులు కాజేసేందుకు ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బాలుడిని చూసి సహస్ర కేకలు వేయడంతో ఆమెపై దాడి చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని సహస్రపై విచ్చలవిడిగా కత్తిపోట్లు పొడిచాడు.హత్య చేసిన తర్వాత పక్క బిల్డింగ్‌లో 15 నిమిషాల పాటు బాలుడు దాక్కున్నాడు. ఈ సమాచారాన్ని స్థానికంగా ఉండే ఓ ఐటీ ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఐటీ ఉద్యోగి సమాచారం ఆధారంగా బాలుడిని పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో బాలుడూ ఎంతకీ నోరు విప్పకపోవడంతో అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాలుడు చదువుకుంటున్న స్కూల్‌కు వెళ్లి కూడా ఎస్వోటీ పోలీసులు విచారించారు.ఇక బాలిక కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్థానికుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. తనీఖీల్లో బాలుడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బాలుడి ఇంట్లో జరిపిన సోదాల్లో సహస్రను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. వచ్చీరాని ఇంగ్లీష్‌లో దొంగతనం ఎలా చేయాలో బాలుడు నేర్చుకున్నాడు. హౌటూ ఓపెన్ డోర్, హౌటూ ఓపెన్ గాడ్ హుండీ ఇలా నెట్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఓ పేపర్ మీద రాసుకున్నాడు. ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
జీవిత ఖైదు శ్రీకాంత్ కేసులో చిన్న స్థాయి ఉద్యోగులు సస్పెండ్
-
కూకట్పల్లి బాలిక కేసు: ముగ్గురు అనుమానితుల విచారణ
కూకట్పల్లి: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకున్న బాలిక సహస్రిని హత్య కేసులో దర్యాప్తు వేగవంతమయ్యింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాలిక మర్డర్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని, అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను విచారిస్తున్నామని, టెక్నికల్ యాంగిల్స్ లో కూడా కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని డీసీపీ సురేశ్ తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో భాగంగా క్లూస్ టీం ఫింగర్ ఫ్రింట్‌లాంటి ఆధారాలు సేకరించింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా గాంధీ ఆసుపత్రిలో బాలికకు పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం బాలిక స్వస్థలమైన సంగారెడ్డి జిల్లాలోని మక్త క్యాసారంనకు డెడ్‌బాడీని తరలించారు. ఇక పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.పోలీసులుతో బిల్డింగ్ ఓనర్ రమేష్.. తన మనుమరాలి చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపాడు. కూకట్‌పల్లిలోని దయార్గూడలో 11 ఏళ్ల బాలిక సహస్రిని ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో గొంతుకోసి, కడుపులో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. హత్య జరిగిన అదే భవనంలో ఉంటున్న ఓ యువకుడు అక్కడక్కడే సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పీహెచ్డీ చేయాలనుకున్నాడు.. కటకటాలపాలయ్యాడు
నారాయణపేట: అసలు వారణాసిలో ఏమి జరిగిందంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) మరోసారి వెలుగులోకి వచ్చింది. తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ సీఎస్ రామచంద్రమూర్తిపై గత నెలలో జరిగిన దాడి కేసును వారణాసి పోలీసులు సీరియస్‌గా తీసుకొని .. 15 రోజుల్లోనే చేధించారు. ఈ నేపథ్యంలో అసలు ఏమి జరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు కథ ... అంతర్గత వివాదమే దాడికి దారి ప్రొఫెసర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు మధ్య జరిగిన వివాదమే దాడికి దారి తీసిందనేది వారణాసి పోలీసుల విచారణలో వెల్లడైంది. కలత చెందిన మాజీ విభాగాధిపతి తెలంగాణకు చెందిన తన ఇద్దరు పూర్వ పరిశోధన విద్యార్థులు భాస్కర్, మోడ్గు కాసిం బాబుకు హెచ్ఓడీ తనను వేధిస్తున్నాడని, తనను పని చేయనివ్వడం లేదని తన బాధను వెలిబుచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో వారు ప్రయాగ్‌రాజ్‌లోని మహమ్మద్ కాసీం అనే పరిచయస్తుడిని సంప్రదించారు. ఈ ముగ్గురు కలిసి జూలై 25న వారణాసికి చేరుకొని కాంట్రాక్ట్ నేరస్తులను నియమించుకున్న గణేష్‌పాసిని కలిశారు. బీహెచ్‌యూ క్యాంపస్ వెలుపల ప్రొఫెసర్ మూర్తిపై దాడి చేయడమే అసలు పథకం. ముందుగా క్యాంపస్ లోపల దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కుదరకపోవడంతో.. కట్‌చేస్తే ఫ్రొఫెసర్‌పై దాడి జరిగిందిలా.. జూలై 28న సాయంత్రం 6:30 గంటకు ప్రొఫెసర్ మూర్తి క్యాంపస్ నుంచి బ్రిజ్‌ఏన్‌క్లేవ్ కాలనీలోని ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బిర్లా హాస్టల్ క్రాసింగ్ వద్ద ప్రొఫెసర్‌పై కడ్డీలతో దాడి చేశారు. దాడిలో ప్రొఫెసర్ రెండు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. దాడి అనంతరం దుండగులు హైవేపై పారిపోయారు. స్థానికులు గాయపడిన ప్రొఫెసర్‌ను చికిత్స నిమిత్తం బీహెచ్‌యూ ట్రామా సెంటర్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకోవడానికి మూడు బృందాలను ఏర్పాటు చేశారు. కటకటాల పాలయ్యాడు చిన్నప్పుడే భాస్కర్ తల్లిదండ్రులను కోల్పోయాడు. పెద్దనాన్న కిష్టప్ప పోషణలో పెరిగాడు. పీజీ వరకు టాప్ ర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. పీహెచ్డీ ఎంట్రెన్స్‌లో సైతం ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. పీహెచ్డీ పూర్తి చేయాలనుకున్న భాస్కర్ విధి రాత.. ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు పెట్టిన ఆశతో కటకటాల వైపు తీసుకెళ్లినట్లు అవుసలోనిపల్లి గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
సృష్టి కేసులో నేరం ఒప్పు కున్న డాక్టర్ నమ్రత
-
క్లినికల్ ట్రయల్స్..ఎగ్ డొనేషన్స్!
సాక్షి, హైదరాబాద్: సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఏజెంట్ల నెట్‌వర్క్‌ను నార్త్‌జోన్ పోలీసులు ఛేదించారు. ఈ నెట్‌వర్క్‌కు క్లినికల్ ట్రయల్స్ చేసే క్యాంపులతోపాటు అండాన్ని డొనేట్ చేసే మహిళలే మూలమని గుర్తించారు. డాక్టర్ నమ్రతపై గతంలో 15 కేసులు ఉండగా, తాజాగా 9 కేసులు నమోదైనట్లు డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ప్రకటించారు. ఈ కేసుల్లో ఇప్పటివరకు 25 మంది నిందితులను అరెస్టు చేశామని, వీరిలో డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఏసీపీ పి.సుబ్బయ్యతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్, కొండాపూర్‌లతో పాటు విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, భువనేశ్వర్, కోల్‌కతాలో సెంటర్లు నిర్వహిస్తున్న నమ్రత.. దేశవ్యాప్తంగా ఏజెంట్ల నెట్వర్క్ ఏర్పాటు చేసుకుందని తెలిపారు. ఆ క్యాంపుల్లో ఏర్పడిన పరిచయాలతోనే...వివిధ ఔషధాలు, నూతన వైద్య విధానాలపై అధికా రికంగానే క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంటాయి. ఇలాంటి క్యాంపులకు వెళ్లే నమ్రత లేదా ఆమె ఉద్యోగులు పురుష వలంటీర్లను ట్రాప్ చేసి ఏజెంట్లుగా మార్చుకున్నారు. అలాగే ఐవీఎఫ్ కేంద్రాల్లో అండం (ఎగ్) డొనేషన్ కోసం వచ్చిన మహిళల్ని తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. వీరిని ఏజెంట్లు గా చేసుకుంటున్నారు. నమ్రతకు ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరించిన ధనశ్రీ సంతోషి వివిధ ప్రాంతాల్లో సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. వీరి ద్వారానే పేద గర్భిణులను గుర్తించి నమ్రత వాడుకుంది. నకిలీ డీఎన్ఏ రిపోర్టులు సృష్టించి... ఐవీఎఫ్ కోసం సికింద్రాబా ద్‌లోని సృష్టి సెంటర్‌కు వచ్చే దంపతుల్లో ఖర్చు పెట్టగలిగేవారిని సరో గసీ వైపు మళ్లించే నమ్రత..వారిని విశాఖపట్నం పంపించి పరీక్షలు చేయించేది. వారి అండం, వీర్యంతోనే సరోగసీ జరుగుతున్నట్లు నమ్మించి.. డెలివరీ సమయానికి ఒప్పందం చేసుకున్న పేద గర్భిణులను తీసుకువచ్చి డెలివరీ చేయించి, ఆ శిశువు సరోగసీ ఒప్పందం చేసుకున్న దంపతులకే పుట్టినట్లు నమ్మించి అప్పగించేది. కన్న తల్లిదండ్రులకు నామమాత్రపు మొత్తం చెల్లిస్తూ శిశువును దత్తత ఇస్తున్నట్లు చెప్పేది. ఇందుకోసం నకిలీ డీఎన్ఏ రిపోర్టులు సృష్టించేది. ఈ శిశువుల జనన రిజిస్ట్రేషన్ తదితరాలన్నీ విశాఖలోనే నిర్వహించేవారు. బాధితుల నుంచి నమ్రత రూ.1.6 కోట్లు వసూలు చేసిందని పోలీసులు గుర్తించారు. సరోగసీ పేరుతో ముగ్గురు శిశువుల్ని విక్రయించిన నమ్రత.. మరో కేసులో మాత్రం డెలివరీ సమయంలో శిశువు చనిపోయినట్లు నమ్మించి ఏమాత్రం సంబంధం లేని మృత శిశువును చూపించింది. మరోసారి సరోగసీ చేయాలంటే అదనంగా రూ.15 లక్షలు డిమాండ్ చేసింది. ఈ కేసులో మొత్తం 25 మంది అరెస్టు చేశారు. వీరిలో వైద్యులైన నమ్రత, సదానందం, విద్యుల్లత, ఉషా దేవి, రవిపై ఉన్న 9 కేసుల దర్యాప్తును సీసీఎస్ అధీనంలోని సిట్ బదిలీ చేశారు. -
తురకా కిషోర్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు
-
రాజన్న నటిపై విచిత్ర ఆరోపణలు.. కేసు నమోదు..!
ప్రముఖ నటి శ్వేతా మీనన్ ఊహించని వివాదంలో చిక్కుఉంది. అశ్లీల కంటెంట్‌లో నటించిందనే ఆరోపణలతో కేరళ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటింటిన శ్వేతా మీనన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త మార్టిన్ మేనచేరి ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని మార్టిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఆమె మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లే ఫిర్యాదు చేయడానికి కారణమన్నారు. డబ్బు కోసం తాను ఇలాంటి సినిమాలు చేయడానికి సిద్ధమేనని ఆమె చెప్పారని మార్టిన్ ఆరోపించారు. అడల్ట్ సినిమాల ద్వారా డబ్బులు సంపాదించడం ఐటీ చట్టం ప్రకారం తప్పు అని ఆయన పోలీసులను ఆశ్రయించారు. అయితే మొదట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి శ్వేత మీనన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా.. శ్వేతా మీనన్.. 1991లో మలయాళ చిత్రం అనస్వరంతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు పలు బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్లో నాగార్జున నటించిన రాజన్న చిత్రంలో కనిపించింది. బాలీవుడ్లో అశోక, బంధన్, హంగామా, రన్, కార్పొరేట్, శాండ్విచ్, కిస్సే ప్యార్ కరూన్ లాంటి సినిమాల్లో నటించింది. ఆమె చివరిగా 2024లో విడుదలైన మలయాళ చిత్రం జాంగర్, వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్‌లో మెప్పించింది. ఇటీవలే ఎంకిలే ఎన్నోడు పారా అనే మలయాళ షోను కూడా శ్వేత హోస్ట్ చేసింది. మలయాళంలో రతినిర్వేదం, పలేరి మాణిక్యం, కలిమన్ను వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలతో పాటు ఆమె పలు వాణిజ్య ప్రకటనలు చేసింది. -
ధర్మస్థల కేసులో కీలక మలుపు..
-
అడ్డంగా దొరికిపోయి ACB కోర్టు నుంచి పారిపోయిన SIT అధికారులు
-
Big Question: మద్యం కేసులో రెండో వీడియో.. 11 కోట్ల మతలబు
-
SIT సీన్ రివర్స్.. కోర్టు నుంచి పరార్.. అబ్బా కథ అడ్డం తిరిగిందే
-
Editor Comment: అడ్డగోలు బరితెగింపు.. ఆ నోట్ల కట్టలు నోళ్లు తెలిస్తే..
-
ధర్మస్థల రహస్యం.. వందల శవాలను నేనే పూడ్చాను..
-
జీవితకాలం జైల్లోనే.. కోర్టులో ఏడ్చేసిన ప్రజ్వల్
-
అడ్డంగా దొరికిపోయిన సిట్.. రద్దయిన 2000 నోట్లు ఎలా వచ్చాయి.?
-
Srusti Case: చైల్డ్ ట్రాఫికింగ్ పై అడిగిన ప్రశ్నలకు నోరుమెదపని డాక్టర్ నమ్రత
-
సృష్టి కేసు నిందితురాలు డాక్టర్ అత్తులూరి నమ్రత కీలక వ్యాఖ్యలు
-
'సృష్టి' కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలకాంశాలు
-
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు
-
ధర్మస్థళ కేసు: 15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు!
ధర్మస్థళ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. దేవాలయ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు తాను ధర్మస్థళ పరిసరాల్లో వందలాది శవాల అంత్యక్రియలు నిర్వహించానని, ఈ నెల నాలుగున ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం (ఎస్ఐటీ)ని ఏర్పాటు చేసింది కూడా. ఈ నేపథ్యంలో.. ఫిర్యాదుదారు తాజాగా తాను శవాలను కాల్చిన, పూడ్చిన 15 ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు. వీటిల్లో ఒకటి హైవే పక్కనే ఉండగా మిగిలినవన్నీ నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇతర కార్యకలాపాలు జరక్కుండా సిట్ అధికారులు వాటికి జియో ట్యాగింగ్ చేశారు. అంతేకాకుండా ఫొటోలు తీసి కాపలా కోసం సాయుధ పోలీసులను ఏర్పాటు చేశారు. 1998 -2014 మధ్య కాలంలో తాను కొందరి ఒత్తిడి కారణంగా వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని, వీరిలో చాలామంది మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసింది. జూలై నాలుగున ఫిర్యాదు ఇచ్చిన సందర్భంగా అతడు ఒక పుర్రెను సాక్ష్యంగా అందించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం జూలై 19న డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ఒక ఎస్ఐటీని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు తరువాత ఫిర్యాదుదారుణ్ణి రెండు రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామా ఆ వివరాలను రికార్డు చేశారు. ఆ తరువాత సోమవారం ఫిర్యాదుదారుడితో కలిసి ఆన్సైట్ పరిశీలనలను జరిపింది. మొత్తం 15 అనుమానిత ప్రాంతాలను గుర్తించింది. ఈ కార్యకలాపాల్లో ఫోరెన్సిక్స్, ఆంత్రోపాలజీ, రెవెన్యూ విభాగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో త్వరలో తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరోవైపు ఈ దర్యాప్తును ధర్మస్థళ మంజునాథేశ్వర ఆలయం స్వాగతించింది. విచారణ పారదర్శకంగా జరగాలని కోరింది. ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కొందరు ఎస్ఐటీ విచారణపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ అవసరమని కోరారు. అలాగే నిస్పక్షికత కోసం ఫోరెన్సిక్స్ సాయం తీసుకోవాలని సూచించారు. -
ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని..
సూర్యాపేటటౌన్: సూర్యాపేటలోని సాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఈనెల 21న జరిగిన బంగారం దోపిడీ కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు గతంలో ఖమ్మంలో చోరీ చేసి పట్టుబడ్డాడు. దీంతో ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని గ్రహించి సూర్యాపేటలో దొంగతనానికి స్కెచ్ వేశాడు. చోరీ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ నరసింహ 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసింది నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాగా గుర్తించారు. ప్రత్యక్షంగా ఐదుగురు నిందితు లు దొంగతనంలో పాల్గొనగా వారికి సహకరించింది మరో ఇద్దరని గుర్తించారు. దొంగతనంలో సహకరించిన యశోదను అరెస్ట్ చేశా రు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆదివారం సూర్యాపేట హైటెక్ బస్టాండ్ సమీపంలో పోలీసులు ఫింగర్ ప్రింట్స్ తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఖమ్మంలోని నాయుడుపేటకు చెందిన మేకల యశోద బ్యాగును పరిశీలించగా శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో చోరీకి గురైన కొన్ని ఆభరణాలు లభ్యమయ్యాయి. ఖమ్మం పట్టణంలో నేపాల్‌కు చెందిన ఏ–6 నిందితుడైన అమర్‌బట్ గూర్ఖాగా పనిచేస్తుండేవాడు. ఈ కేసులో ఏ–1 నిందితుడు, నేపాల్‌కు చెందిన ప్రకాష్‌అనిల్‌కుమార్.. ఖమ్మంలో ఉంటున్న అమర్‌బట్ వద్దకు వచ్చి గూర్ఖాగా పనిచేస్తూ యశోదతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని, సూ ర్యాపేట పట్టణాన్ని ఎంచుకున్నారు. ప్రకాష్ అనిల్‌కుమార్‌కు తెలిసిన మరో వ్యక్తి నేపాల్‌కు చెందిన కడాక్ సింగ్‌తోపాటు, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో ముగ్గురిని పిలిపించుకుని చోరీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మేకల యశోదతో కలిసి సూర్యాపేట ఎంజీ రోడ్డులోని బంగారం షాపు వెనుక ప్రాంతంలో యజమాని లేని ఇంట్లో ఒక రూంను అద్దెకు తీసుకుని, రెక్కీ చేసి, శ్రీసాయి సంతోషి జ్యువెలరీలో షాపులో చోరీ చేశారు. తర్వాత బంగారం ఇక్కడ అమ్మితే అనుమానం వస్తుందని నేపాల్‌కు తీసుకెళ్లి అమ్ముదామని ఐదుగురు నిందితులు నిర్ణయించారు. నిందితురాలు ఇచి్చన సమాచారం మేరకు ప్రత్యక్ష్యంగా చోరీకి పాల్పడిన నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఐదుగురిని గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఏ–1 నిందితుడైన ప్రకాష్ అనిల్‌కుమార్‌పై గతంలో ఖమ్మం జిల్లాలో మూడు దొంగతనం కేసులు ఉన్నాయని, మిగిలిన నిందితులపై ఉన్న పాత కేసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితురాలి నుంచి 14 తులాల బంగారాన్ని స్వా«దీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. -
సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Meghalaya Honeymoon Case: సోనమ్ మారలేదు.. జైల్లో ఉన్నా నో ఛేంజ్
-
ధర్మస్థల కేసులో కొత్త ట్విస్ట్..!
-
‘లిక్కర్ కేసులో ఈనాడు అసత్య ప్రచారం బట్టబయలు’
సాక్షి, తాడేపల్లి: అసలు లేని, జరగని లిక్కర్ స్కామ్‌పై రోజుకో కథనాన్ని వండి వారుస్తున్న ఈనాడు.. వైఎస్సార్సీపీని అప్రతిష్టపాల్జేయడానికి అత్యంత హేయంగా వ్యవహరించిందని పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.ఏపీ బీసీఎల్ (రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) సర్వర్లు, డేటా సిస్టమ్స్ నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో, 2019–24 మధ్య లిక్కర్ కుంభకోణానికి సంబంధించి 3.58 లక్షల జీబీ డేటాను డిలీట్ చేశారంటూ ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలిపారు. ప్రెస్మీట్లో ఎం.మనోహర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..ఏపీ బీసీఎల్ ఏం చెప్పిందంటే..:రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీ బీసీఎల్) సర్వర్లు, డేటా సిస్టమ్స్ నుంచి 371 కోట్ల పేజీలకు సంబంధించిన 3.58 లక్షల జీబీ డేటా డిలీట్ చేశారంటూ, ఈనాడు రాసిన వార్త నిజమేనా అని సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త ప్రశాంత్ రెడ్డి అడిగిన ప్రశ్నపై ఆ సంస్థ సమాధానం చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో తమ వద్ద ఎలాంటి డేటా డిలీట్ కాలేదని, అసలు అలాంటిదేమీ జరగలేదని ఏపీ బీసీఎల్ వెల్లడించింది.వాస్తవం ఇలా ఉంటే.. ‘వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి’ అంటూ ఈనాడు నిస్సిగ్గుగా కథనాన్ని వండి వార్చింది. దాని ఆధారంగా ఈటీవీలో కూడా ఏకంగా 8 నిమిషాల కథనాన్ని ప్రసారం చేశారు. అంటే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద చల్లడం, వైఎస్సార్సీపీని అప్రతిష్టపాల్జేయడమే లక్ష్యంగా ఈనాడు ఏ స్థాయికి దిగజారి వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.వైఎస్సార్సీపీకి క్షమాపణ చెప్పాలి:ఒక నీచమైన దుర్భుద్ధి, కుట్ర, కుతంత్రంతో వ్యవహరిస్తూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిత్యం బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్న ఈనాడు యాజమాన్యం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఈనాడు చేస్తున్న దుష్ప్రచారం, ఆ పత్రిక చేస్తున్న కుట్ర, కుతంత్రాలపై పూర్తి సమాచారం, వివరాలతో ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తాం. ఏ మాత్రం విచక్షణ ఉన్నా.. ఇప్పటికైనా ఈనాడు, ఈటీవీ యాజమాన్యం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, జర్నలిస్టు విలువలను పాటించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.అంతా ఒక వ్యూహం:‘సిట్’ దర్యాప్తు తీరు, ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించిన అంశాలు చూస్తే.. ఎల్లో మీడియాలో గాలి వార్తలన్నీ పోగేసి రాస్తున్న కథనాలను ప్రతిబింబిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతులేని ప్రజాభిమానం కలిగిన జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయనను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న దురుద్దేశంతో, తనకు సన్నిహితంగా ఉండి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు, వ్యక్తుల మీద తప్పుడు కథనాలు రాసి వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.ఇక ప్రభుత్వం తాము టార్గెట్‌గా పెట్టుకున్న వారిని అరెస్టు చేసేందుకు.. తొలుత వారిపై తమ అనుకూల ఎల్లో మీడియాలో కథనాలు రాయించడం, ఆ తర్వాత ఎవరితోనో ఫిర్యాదు చేయించడం, వాటి ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకుని వేధించి, భయపెట్టి తమ టార్గెట్ లిస్ట్‌లో ఉన్న వారి పేర్లు చెప్పించి, స్టేట్మెంట్ రికార్డు చేయడం, దాని తర్వాత తప్పుడు కేసు పెట్టి, అక్రమ అరెస్టు చేయడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. ఆ ప్రక్రియలో భాగంగానే.. ఈ కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి వివరించారు. -
‘ధర్మస్థళ’పై ఉష్ గప్‌చుప్!
ధర్మస్థళ వివాదం ముదిరి పాకాన పడుతోంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రం ధర్మస్థళ పరిసర ప్రాంతాల్లో 20 ఏళ్ల అవధిలో తాను వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని, కొందరి బలవంతం వల్ల తాను అలా చేయాల్సి వచ్చిందని మంజునాథ దేవస్థానపు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు చేసిన ప్రకటనతో వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వివాదం కాస్తా మంగళవారం మరో మలుపు తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ధర్మస్థళ మారణహోమం కేసుపై బెంగళూరు కోర్టు మంగళవారం గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. శ్రీ మంజునాథ ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్ డి. దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా న్యాయస్థానం ఈ ఆదేశాలను ఇచ్చింది.వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ధర్మస్థళ ఉదంతానికి సంబంధించి ఉన్న 8,842 లింక్‌లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. మా పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలకు సంబం«ధించిన కవరేజీకి సంబంధించిన లింకులు తొలగించాలని, డీ–ఇండెక్స్ చేయాలని కోరిన హర్షేంద్ర తన పిటిషన్లో ‘ఎక్స్’, ఫేస్బుక్ పోస్టులు, థ్రెడ్లను ప్రస్తావించారు. ఈ వివాదంపై యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాల్లో ప్రచురించడం, ప్రసారం చేయడం, ఫార్వార్డ్ చేయడం, అప్లోడ్ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.బెంగళూరులోని పదో అదనపు సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో హర్షేంద్ర దాఖలు చేసిన పిటిషన్లో గ్యాగ్ ఆర్డర్‌తో పాటు జాన్ డో ఆర్డర్‌ను పొందారు. హర్షేంద్ర తన పిటిషన్లో 338 సంస్థలు, వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చారు. 4,140 యూట్యూబ్ వీడియోలు, 932 ఫేస్బుక్ పోస్ట్‌లు, 3,584 ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్‌లు, 108 న్యూస్ లింక్‌లు, 37 రెడ్డిట్ పోస్ట్‌లతో పాటు 41 ’ఎక్స్’ పోస్టులతో కలిసి 8,842 లింక్‌లను తన పిటిషన్లో పొందుపరిచారు.వీటిలో ’లెట్ మీ ఎక్స్ప్లెయిన్’ ఎపిసోడ్లు, ది న్యూస్ మినిట్‌లోని వీడియోలు ఉన్నాయి. ప్రతివాదులుగా జాబితా వార్తలు, కంటెంట్, వీడియోలు ఉంచిన థర్డ్ ఐ, ధూత, సమీర్, ది న్యూస్ మినిట్, డెక్కన్ హెరాల్డ్, ది హిందూ, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ప్రజావాణి, కన్నడ ప్రభ, హోస దిగంత, బెంగుళూరు మిర్రర్, ఉదయవాణి, దినమణి, దిన తంతి, దినకరన్, సంయుక్త కర్ణాటక, విజయవాణి, విశ్వవాణి, కేరళ, న్యూస్ కా18 తదతరాలను చేర్చారు.గ్యాగ్ ఆర్డర్ కేవలం పిటిషన్లో ప్రస్తావించిన వాటిని మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హర్షేంద్ర జాన్ డో ఆర్డర్ కోసం న్యాయమూర్తికి విన్నవించారు. ఈ మేరకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో పిటిషన్లో పేరు లేని సంస్థలు, వ్యక్తులు, పార్టీలను ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఈ ఆదేశాల జారీ సందర్భంగా న్యాయమూర్తి విజయ కుమార్ రాయ్ ‘ప్రతి పౌరుడికి ప్రతిష్ట అనే చాలా ముఖ్యమైంది. సంస్థ, దేవాలయంపై ఆరోపణ వచ్చినప్పుడు అవి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. పరువు నష్టం కలిగించే ఒక ప్రచురణ కూడా సంస్థల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వు తమ భావప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని, దానిని రద్దు చేయాలని కోరుతూ యూట్యూబ్ పోర్టల్ థర్డ్ ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. – శ్రీరంగం కామేష్ -
భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏంటంటే?
సాక్షి,బెంగళూరు: భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య మైనర్ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్‌కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మతో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్‌పై వడిగేరికి వెళ్లి ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గం మధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్‌ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది.నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచ్చిన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది.ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్‌ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు.అయితే, ఇదే కేసులో భార్య మైనర్ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భర్తను నదిలోకి తోసేసినట్లు భార్య పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. చట్టపరంగా భర్తపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఉపక్రమించారు. In #Karnataka's Yadagiri, a wife pushed her husband into the river on the pretext of taking a selfie.The couple got married 2 months ago, the husband had gone to his mother's house to pick up his wife, while returning,1/2 pic.twitter.com/u0N8xK8QLI— Siraj Noorani (@sirajnoorani) July 16, 2025 -
రాయుడు హత్య కేసులో పవన్ మౌనం వెనుక..
-
పవన్ కి అన్నీ తెలుసు అందుకే దాక్కున్నాడు..
-
ఎన్నదగిన తీర్పు
తబ్లీగీ జమాత్‌తో సంబంధాలుండి, కరోనా మహమ్మారి వ్యాపించిన కాలంలో అక్రమంగా 190 మంది విదేశీయులకు వివిధ మసీదుల్లో ఆశ్రయం కల్పించిన కేసుల్లో మన పౌరులు 70 మందిపై దాఖలైన ఎఫ్ఐఆర్లనూ, తదుపరి విచారణలనూ, వివిధ కేసుల కింద వారిపై దాఖలైన చార్జి షీట్లనూ కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం వెల్లడించిన తీర్పు అనేక విధాల ఎన్నదగినది. 2020 మార్చిలో 24 తేదీ నుంచి 30 వరకూ 195 మంది విదేశీయులకు ఆశ్రయమిచ్చారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ. వాస్తవానికి విదేశీయుల్ని కూడా ఎఫ్ఐఆర్లలో ప్రస్తావించినా చార్జిషీట్లు దాఖ లైన సమయానికి వారి పేర్లు తొలగించారు. ఒక నేరానికి రెండుసార్లు శిక్షించరాదన్న సూత్రాన్ని ఆధారం చేసుకుని కొందరిపై చార్జిషీట్ల దాఖలు సమయంలోనే మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో వేలాది మందితో మార్చి మొదటివారంలో నిర్వహించిన మతపరమైన కార్యక్రమం సందర్భంగా ఈ కేసులు దాఖలయ్యాయి. అప్పుడున్న ప్రత్యేక పరిస్థితి వేరు. అది కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న సమయం. అందువల్ల వేలమంది కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఒకచోట గుమిగూడారన్నది ఆందోళనకరమే. చట్టవిరుద్ధమైనప్పుడు ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ అదేమీ రహస్య సమావేశం కాదు. ఆ కార్యక్రమానికి ప్రభుత్వ విభా గాల నుంచి నిర్వాహకులు ముందస్తు అనుమతులు పొందారు. మార్చి 24న రాత్రి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించగా, అంతకుముందు మార్చి 13న దేశవ్యాప్తంగా అంటురోగాల చట్టం అమలవు తుందని ప్రకటించారు. అప్పటికి కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కరోనా వైరస్‌ను ‘ఆరోగ్యపర మైన ఆత్యయిక స్థితి’గా ఇంకా పరిగణించటం మొదలుపెట్టలేదు. అంతక్రితం అనుమతులిచ్చినా వాటిని రద్దుచేయకపోవటానికి ప్రభుత్వ విభాగాల్లో వ్యాధి తీవ్రత, పెనువేగంతో వ్యాపించే దాని తీరుతెన్నులపై అవగాహన లేకపోవటమే కారణం. తబ్లీగీ నిర్వాహకులు చెబుతున్న కారణాలు కూడా వున్నాయి. వ్యాధి తీవ్రత అర్థమైన తర్వాత అందరినీ స్వస్థలాలకు పంపించాలని నిర్ణయించినా లాక్డౌన్ వల్ల సాధ్యపడక వివిధ మసీదుల్లో ఆశ్రయమివ్వక తప్పలేదని వారి సంజాయిషీ. కానీ ఈ కార్యక్రమాన్ని ప్రధాన స్రవంతి మీడియాతోపాటు సామాజిక మాధ్యమాలు ఒక భూతంలా చిత్రించాయి. కరోనా మహమ్మారిని వ్యాప్తి చేయటం కోసం కుట్రపూరితంగా ఈ కార్య క్రమాన్ని నిర్వహించారన్న అపవాదు వేశారు. తబ్లీగీ ఒక ‘సూపర్ స్ప్రెడర్’ అనీ, దానివల్ల 4,000 మంది కరోనా బారిన పడ్డారని ప్రచారం సాగించారు. వారు సక్రమంగా వీసాలు తీసుకుని వచ్చిన విదేశీయులనీ, ఆ కార్యక్రమానికి అన్ని అనుమతులూ ఉన్నాయనీ తెలియనట్టు నటించారు. వచ్చిన వారంతా నిబంధనల ప్రకారం తమ తమ దేశాల్లో, భారత్ గడ్డపై అడుగుపెట్టాక ఇక్కడ కరోనా పరీక్షలు జరిపించుకుని, ఆ వైరస్ లేదని నిర్ధారణ అయినవారు. కరోనా తీవ్రత దాఖలా కనబడ్డాక నిర్వాహకుల వద్దకెళ్లి వెంటనే నిలిపేయాలని ఉత్తర్వులిస్తే తప్పు బట్టాల్సిన పని లేదు. అది చేయ కుండా, విదేశాల నుంచి వచ్చినవారికి ప్రత్యామ్నాయ సదుపాయాలేమీ కల్పించకుండా మసీదుల్లో రహస్యంగా ఆశ్రయం పొందినట్టు చూపటం ద్వారా సాధించిందేమిటి? ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అది పూర్తయ్యాక ప్రచారం నిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు.అలాంటి వారిపై తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో సైతం కేసులు నమోదయ్యాయి. తబ్లీగీ కార్యక్రమాలు మన దేశానికి కొత్తగాదు. ప్రతి యేటా జరుగుతుంటాయి. ఢిల్లీకి సమీపంలోని మేవాత్‌లో మౌలానా మహమ్మద్ ఇలియాసి అనే ఆధ్యాత్మికవేత్త ముస్లిం మతానుయాయుల్లో ఆధ్యాత్మికత సన్నగిల్లుతున్నదని, స్వార్థం పెరిగి స్వప్రయోజనాలే పరమావధి అవుతున్నదని భావించి వారిలో కరుణ, దయ, నిరాడంబరత, ఆధ్యాత్మికత పెంపొందించటానికి తబ్లీగీని ప్రారంభించారు. దీనికి విదేశాల్లో సైతం ఆదరణ లభించటం, అక్కడినుంచి ఏటా వందల సంఖ్యలో హాజరై మతపరమైన మౌలిక విలువలు గ్రహించి, అటు తర్వాత ఆ మతస్థుల్లో వాటిని ప్రచారం చేయటం రివాజుగా వస్తోంది. తబ్లీగీ ప్రధాన కార్యాలయం మర్కజ్ మసీదులోనే వుంటుంది.బొంబాయి హైకోర్టు తబ్లీగీ అనుయాయుల విషయంలో పోలీసుల వైఖరిని 2021లో తీవ్రంగా తప్పు బట్టింది. మతపరమైన ఆదర్శాన్నీ, సంస్కరణనూ బోధించే యువకులను కోవిడ్ వ్యాప్తిచెందిన సమయంలో ఆదుకోవాల్సింది పోయి, వారిని జైలుపాలు చేయటం, అక్కడ దుర్భర పరిస్థితుల మధ్య వారు గడపాల్సి రావటం విచారకరమని వారిని విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పులో న్యాయ మూర్తులు వ్యాఖ్యానించటం గమనార్హం. మద్రాసు, కర్ణాటక హైకోర్టులు సైతం తబ్లీగీలపై కేసులు బనాయించటం, వారిని నిర్బంధించటం అహేతుకం, అన్యాయం అని దుయ్యబట్టాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు 70 మంది పౌరులను వివిధ కేసుల నుంచీ, ఎఫ్ఐఆర్ల నుంచీ, విచా రణల నుంచీ విముక్తుల్ని చేయటం హర్షించదగ్గది. తప్పుడు ప్రచారాలకు దిగి, విద్వేషాలను రెచ్చ గొట్టి తాత్కాలికంగా లబ్ధిపొందేవారు ఈ దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ వున్నదని, కొంత ఆలస్యం జరిగినా అంతిమంగా న్యాయం లభించటం ఖాయమని గుర్తించటం లేదు. సామాజిక మాధ్యమాల మాటెలా వున్నా, ప్రధాన స్రవంతి మీడియా సైతం వార్తలకు మతం రంగు పులిమి అపచారం చేస్తున్నదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు 2021 సెప్టెంబర్‌లో వ్యాఖ్యానించింది. తాజా తీర్పయినా అటువంటివారి కళ్లు తెరిపించాలి. బాధ్యతాయుత ప్రవర్తనా శైలినీ, జవాబుదారీ తనాన్నీ వారిలో పెంపొందించాలి. -
మరణశిక్షలు న్యాయమేనా? మీకు తెలియని నిమిష ప్రియ కథ
-
కేరళ నర్స్ కేసులో బిగ్ ట్విస్ట్
-
గండికోట బాలిక కేసులో మరో కొత్త మలుపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గండికోటలో బాలిక హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ప్రియుడు లోకేష్.. బాలికను హత్య చేయలేదని కర్నూలు రేంజ్ డీఐజీ తేల్చి చెప్పారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. మరో వైపు బాలిక సోదరుడే హత్య చేశాడంటూ చేస్తున్న ప్రచారం దారుణమని తల్లిదండ్రులు అన్నారు. ఎవరైనా చెల్లిని వివస్త్రను చేసి హత్య చేస్తాడా అంటూ ప్రశ్నించారు. బాలిక సోదరుడు సురేంద్ర పరువు కోసం హత్య చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సురేంద్ర పాత్రను తల్లిదండ్రులు కొట్టి పారేస్తున్నారు.లోకేష్‌ని ఎన్కౌంటర్ చేయాలి: వైష్ణవి తల్లితన బిడ్డను హత్య చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలంటూ వైష్ణవి తల్లి పసుపులేటి దస్తగిరమ్మ అన్నారు. నా బిడ్డను కోల్పోయిన బాధలో నేనున్నా.. కొన్ని మీడియా ఛానళ్లు మా పై పనిగట్టుకొని వార్తలు రాస్తున్నాయి. మేమి చెప్పినవి వేయడం లేదు. ఇష్టం వచ్చినట్లు మాపై నిందలు వేస్తున్నారు. పాప కనిపించడం లేదని తెలిస్తే వెతుకులాడటం మేము చేసిన తప్పా.సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? మరీ ఇంత క్రూరంగా వివస్త్రను చేసి చంపుకుంటామా...? అత్యాచారం జరగలేదంటే పాప ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయి.?పోలీసులు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలి. నిజానిజాలు తెలియపరచాలి. మాకు న్యాయం జరగాలి. అనుమానితున్ని తెలియపరిచాం. లోకేషే నా బిడ్డను చంపాడు. మాకు న్యాయం జరగాలంటే లోకేష్‌ని ఎన్కౌంటర్ చేయాలి. నాకు జరిగిన అన్యాయం ఇంకో తల్లికి జరగకూడదు’’ అంటూ వైష్ణవి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.కర్నూల్ రేంజీ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న గండికోటలో విద్యార్థి వైష్ణవి హత్య కేసులో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని.. బాలికపై ఎటువంటి హత్యాచారం జరగలేదన్నారు. మాకు ఇవాళ కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభించాయి. రాత్రి 9.00 గంటలకు జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీ పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తారు’’ అని ఆయన తెలిపారు. -
చివరి నిమిషంలో ఆగిన ఉరి.. నెక్స్ట్ ఏంటి?
-
మూవీ సెట్లో స్టంట్‌మ్యాన్ మృతి.. డైరెక్టర్‌పై కేసు నమోదు!
కోలీవుడ్ మూవీ 'వెట్టువం' సెట్లో స్టంట్‌మ్యాన్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది. మోహన్ రాజ్ మృతి పలువురు సినీతారలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశాల్, మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నారు.అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డైరెక్టర్ పా రంజిత్‌తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్శకుడితో పాటు స్టంట్ నటుడు వినోద్, నీలం ప్రొడక్షన్స్‌కు చెందిన రాజ్‌కమల్, కారు యజమాని ప్రభాకరన్‌పై కేసు నమోదైంది. ఈ సంఘటన సమయంలో సినిమా సెట్లో భద్రతపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. స్టంట్‌మ్యాన్ రాజు సినిమా సెట్లో కారుతో స్టంట్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ మృతిచెందారు. కాగా.. జూలై 13న ఈ ప్రమాదం జరిగింది. -
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, జోగుళాంబ గద్వాల జిల్లా: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరుమలరావు ఏ–1, కుమ్మరి నాగేష్ ఏ–3, చాకలి పరశురాముడు ఏ–4, చాకలి రాజు ఏ–5లను ఈ నెల 10న విచారణాధికారి శ్రీను.. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని వివరాలు సేకరించారు.వాయిస్ మెసెంజర్‌తో గొంతు మార్చి మాట్లాడినట్లు ఇది వరకే బయటపడగా.. తాజాగా మరో ట్విస్ట్ బయటపడింది. తేజేశ్వర్-సహస్రల మధ్య ఎలాంటి కలయిక ఉండరాదనే ఉద్దేశంతో స్పై కెమెరాను కొనుగోలు చేసి తేజేశ్వర్ బెడ్రూంలో ఏర్పాటు చేశారు.తిరుమలరావు నిత్యం వారి కదలికలను కెమెరా ద్వారా గమనించాడు. కొత్త ట్విస్టు వెలుగులోకి రావడంతో.. సహస్రను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పీటీ వా రెంట్‌ను కోర్టుకు సమర్పించారు. ఏ–2 సహస్రను కస్టడీలోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయని గద్వాల సీఐ శ్రీను వెల్లడించారు. -
జైల్లో జనసేన వీరమహిళ! మర్డర్ మిస్టరీ..
-
నేను మీ జోలికి రాను.. నా బిడ్డను ఏమీ చేయవద్దు..!
మైసూరు: పెళ్లయి కోటి ఆశలతో మెట్టినింటికి వెళ్లింది, కానీ రెండు నెలలకే అత్తింట్లో యువ వైద్యురాలు నరకాన్ని చూసింది. ఆమెకు వేధింపులకు గురి చేసి బలవంతంగా గర్భస్రావం చేయించిన భర్త, అత్తమామలతో పాటు ఐదుగురిపై మైసూరులోని సరస్వతీపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రూ.80 లక్షలతో పెళ్లి వేడుక వివరాలు.. మండ్య జిల్లా కేఆర్ పేటె ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి వైద్యురాలు నవ్య, ఆమె తండ్రి మహాదేవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవ్య భర్త అభిõÙక్, మామ గోవిందరాజు, అత్త లత, జ్ఞానశేఖర్, వైద్యురాలు లత అనేవారిపై కేసు నమోదైంది. నవ్యకు మైసూరులోని బిళికెరె నివాసి, బంగారు వ్యాపారి గోవిందరాజు కుమారుడు అభిõÙక్తో వివాహమైంది. మహాదేవ సుమారు రూ.80 లక్షలు ఖర్చు చేసి కుమార్తెకు ఘనంగా వివాహం చేశారు. నీకు పిల్లలెందుకు అని శుక్రవారం రాత్రి నవ్య మీడియాతో మాట్లాడుతూ వివాహమైన రెండు నెలల్లోనే నన్ను చిత్రవధ చేసిన భర్త, అతని కుటుంబ సభ్యుల నిజస్వరూపం ఏంటో చూశాను. డబ్బు కోసం తీవ్రంగా వేధించారు. తిరుపతికి వెళ్లాలి, సుదూర ప్రయాణం చేయాలంటూ అబద్ధం చెప్పి డబ్బులు తేవాలనేవారు. రూ.5 లక్షల వరకట్నం కూడా తేలేదు, నీకు పిల్లలెందుకు అని అబార్షన్ చేయించారు అని విలపించింది. మంగళసూత్రం, కాళ్ల ఉంగరాలు అన్నింటినీ తీసుకుని తనను నడివీధిలో వదిలేశారన్నారు. పెళ్లికి ముందు వైద్యురాలిగా ఉద్యోగానికి వెళ్లేదాన్నని, పెళ్లైన నాటి నుంచి ఉద్యోగాన్ని మాన్పించారు. ఒక వారం రోజులే తనను బాగా చూసుకున్నారని, తర్వాత రోజుకొక రకంగా హింసించారని రోదించింది. వదిలేయండి అని వేడుకున్నా.. బలవంతపు అబార్షన్‌కు ఓ ఆస్పత్రి వైద్యులు జ్ఞానశేఖర్, లత సహకరించారని ఆరోపించారు. మీరు వేరే పెళ్లి చేసుకోండి, నేను మీ జోలికి రాను, విడాకులు ఇస్తాను, కడుపులోని నా బిడ్డకు ఏమీ చేయవద్దని భర్తను వేడుకున్నా వినలేదు. నా ప్రైవేట్ వీడియో అడ్డు పెట్టుకుని బలవంతం చేశారు, నాకు న్యాయం కావాలని, తన భర్త కుటుంబాన్ని శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేశారు. -
వినుత పన్నాగం!
చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాడు. ఎవరూ లేని అనాథగా మిగిలాడు. తన అమ్మమ్మ వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు. కొన్నేళ్ల తర్వాత తన అభిమాన హీరో పవన్‌కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరాడు. ఆపై పార్టీ శ్రీకాళహస్తి ఇన్చార్జ్ వినుత వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా.. డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. చిన్నప్పటి నుంచి నమ్మినబంటుగా మెలిగాడు. ఏమైందో ఏమోగానీ ఇటీవల అతనిపై అనుమానం పెంచుకున్నారు. విధుల నుంచి సైతం తొలగించేశారు. వ్యక్తిగత రహస్యాలు, పార్టీ కార్యకలాపాలు బయటపెడుతున్నాడన్న కక్షతో అతికిరాతకంగా చంపేశారు. మృతదేహాన్ని చెన్నైకి తీసుకెళ్లి ఓ నదిలో పడేసి చేతులు దులుపుకోవాలని చూశారు. అయితే అక్కడి పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది.ఏర్పేడు : చిన్న వయస్సులోనే పెద్ద పదవి వరించింది.. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుని ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేస్తూ.. పబ్లిసిటీ స్టంట్తో నెట్టుకొచ్చిన కోట వినుత అసలు బండారం బట్టబయలైంది. అంతర్గత వ్యవహారాల సమాచారాన్ని శ్రీకాళహస్తిలోని ఓ కీలక నాయకుడికి చేరవేస్తున్నాడని భావించింది. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాసులు అలియాస్ రాయుడు(22)ను కిరాతకంగా చంపించి చెన్నైలోని ఓ నదిలో పడవేసినట్టు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, మరో ముగ్గురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్ర స్థాయిలో విచారిస్తుండడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. సాధారణ యువతి నుంచి.. రేణిగుంటకు చెందిన నగరం వినుత తండ్రి నగరం భాస్కర్ స్థానికంగా మెడికల్ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నాడు. నగరం వినుత తండ్రికి సహాయపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే తన కళాశాలలో పరిచయమైన చిత్తూరు జిల్లా, బంగారుపాళెంకు చెందిన కోట చంద్రశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పవన్ కల్యాణ్ జనసేన పారీ్టలో చేరడం, ఆమెకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జిగా పదవి దక్కడం.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 5 వేల ఓట్లు పడడంతో డిపాజిట్ కోల్పోయింది. ఎలాగైన వార్తల్లో ఉండాలని నిత్యం అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చేది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆమెపై పారీ్టలోని ఓ వర్గం వ్యతిరేకంగా ఉండడం, ఆశించిన ఆదరణ లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి వినుతను పట్టించుకోవడం మానేశారు.హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్లు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీరి్ణంచుకోలేని కోట చంద్రశేఖర్‌నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్ ప్రకారం పారీ్టలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు.ఎవరీ శ్రీనివాసులు ? శ్రీకాళహస్తి మండలం, బొక్కసంపాళెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు ఏడేళ్ల వయస్సులోనే అతడి తల్లిదండ్రులు వెంకటరాయుడు, గీత చనిపోయారు. వీరి స్వగ్రామం వెంకటగిరి సమీపంలోని తోలుమిట్ట. అయితే శ్రీనివాసులు, అతడి సోదరిని అమ్మమ్మ రాజేశ్వరి శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెంకు తీసుకొచ్చి పెంచి పోషించింది. శ్రీనివాసులుకు పవన్‌కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో జనసేన పారీ్టలో కార్యకర్తగా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన కోట వినుతకు దగ్గరయ్యాడు. 15 ఏళ్లుగా వారికి నమ్మిన బంటుగా ఉండడంతో ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా, కారు డ్రైవర్‌గా చేరాడు. ప్రతి కార్యక్రమంలోనూ వారిని వెంటబెట్టుకుని ఉంటూ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు.నిందితులను పట్టించిన పచ్చబొట్టుచెన్నై నగరం, నార్త్ జోన్ సెవన్ వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీ కాల్వలో యువకుడి మృతదేహాన్ని ఈనెల 8వ తేదీన గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు, వినుత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజ్ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్చార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, హత్యకు సహకరించిన రేణిగుంటకు చెందిన దస్తా సాహెబ్, శ్రీకాళహస్తికి చెందిన కె.శివకుమార్, తొట్టంబేడు మండలానికి చెందిన ఎస్.గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు. జనసేన నుంచి కోట వినుత బహిష్కరణ తిరుపతి అన్నమయ్య సర్కిల్ : శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుతను జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తెలిపారు. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు వినుత దూరంగా ఉన్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఆ వివరాలు వెల్లడించారు. చెన్నైలో వినుతపై హత్యా నేర అభియోగం నమోదు కావడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు వారు చెప్పారు. -
కాకాణిపై పీటీ వారెంట్.. హైకోర్టు షాక్
-
పూర్ణ భార్య సంచలన వీడియో విడుదల
-
కోల్‌కతా కేసు: మెడ, ఇతర భాగాలపై కమిలిన గాయాలు.. మెడికల్ రిపోర్టులో వెల్లడి
కోల్‌కతా: కోల్‌కతాలోని లా కాలేజీలో జూన్ 25న అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లా విద్యార్థిని(24)కి నిర్వహించిన వైద్య పరీక్షలో ఆమెపై శారీరక దాడి జరిగినట్లు స్పష్టమయ్యింది. బాధితురాలి మెడ, ఛాతీపై కమిలిపోయిన గుర్తులను మెడికల్ రిపోర్టు వెల్లడించింది. బాహ్య జననేంద్రియం లేదా నోటిపై ఎటువంటి గాయాలు కనిపించనప్పటికీ, ఫోరెన్సిక్ నిర్ధారణ మేరకు లైంగిక దాడిని వైద్యులు తోసిపుచ్చలేదు.26న రాత్రి 10 గంటలకు కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో బాధితురాలికి వైద్యపరీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియలో మూడు స్వాబ్‌లను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. దీనిలో మూత్ర గర్భ పరీక్ష ప్రతికూలంగా వచ్చింది. అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లా విద్యార్థిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్నదని ఒక అధికారి తెలిపారు.ఈ కేసులో కోల్‌కతా పోలీసులు తాజాగా నాల్గవ వ్యక్తి, సౌత్ కలకత్తా లా కాలేజీ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విచారణ సమయంలో గార్డు సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ అరెస్టుతో ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య నాలుగుకు చేరింది. గార్డు గదిలో ఈ లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో తృణమూల్ ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) సమావేశం తర్వాత తనపై లైంగిక దాడి జరిగిందని తెలిపింది. ఈ సమయంలో తన తలపై హాకీ స్టిక్‌తో కొట్టారని, రాత్రి 10:50 గంటల ప్రాంతంలో నిందితులు తనను విడిచిపెట్టారని తెలిపింది. ఇది కూడా చదవండి: 20 ఏళ్ల తర్వాత థాక్రే బద్రర్స్ రీయూనియన్.. దేనికి సంకేతం? -
ఫరీదాబాద్ కేసు: చేసిందంతా మామనే.. ఎంత దారుణం
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో రెండు నెలలుగా కనిపించకుండా పోయిన మహిళ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఆ మహిళ మృతదేహాన్ని ఆమె అత్తమామలే స్వయంగా తమ ఇంటి ముందు పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో మామనే ఆమైపై అత్యాచారం చేసి, హత్య చేశారని వెల్లడయ్యింది. ఇందుకు మృతురాలి అత్త, భర్త కూడా సహకరించారని తెలుస్తోంది.మృతురాలు తన్ను ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహాబాద్‌కు చెందినది. ఆమెకు రెండేళ్ల క్రితం అరుణ్ సింగ్‌తో వివాహమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మామ భూప్ సింగ్, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. తన్ను భర్త అరుణ్ పరారీలో ఉన్నాడు. తమ కోడలు తన్ను అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ విషయం బయటకు పొక్కకుండా అత్తామామలు జాగ్రత్తపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 21న రాత్రి అరుణ్ తన భార్య తన్ను తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. అర్థరాత్రి తన్ను గదిలోకి ప్రవేశించిన మామ అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణం తర్వాత అతను తన కుమారుడు అరుణ్‌ను పిలిచాడు. వారిద్దరూ కలిసి తన్ను మృతదేహాన్ని.. అప్పటికే వీధిలో తవ్విన గొయ్యిలో పడవేసి, దానిపై ఇటుకలు, మట్టిని పోశారు. ఆ గొయ్యి మురుగునీటి కోసం తవ్వినదని భూప్ సింగ్ చుట్టుపక్కలవారికి తెలిపాడు. దీనిపై అనుమానించిన స్థానికులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ గొయ్యిని తవ్వించగా, తన్ను మృతదేహం బయటపడింది. ఈ ఘటనలో పోలీసులు మామ భూప్ సింగ్, అతని భార్య సోనియా, కుమారుడు అరుణ్ సింగ్ కుమార్తె కాజల్‌పై కేసు నమోదు చేశారు. కాగా తమకుమార్తె తన్నును కట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని, వివాహం తర్వాత కూడా తమ కుమార్తె ఏడాదిపాటు తమ ఇంటిలోనే ఉన్నదని ఆమె తండ్రి రోదిస్తూ మీడియాకు తెలిపాడు.ఇది కూడా చదవండి:‘మధ్యవర్తిత్వం’ చట్టవిరుద్ధం.. పాక్‌కు భారత్ మరో షాక్ -
యాంకర్ స్వేచ్ఛ కేసులో ట్విస్ట్
తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: పలు టీవీ ఛానెల్స్‌లో పని చేసిన స్వేచ్ఛకు.. గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయాక పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటోంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు సైతం స్వేచ్ఛా పూర్ణ చందర్‌గా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్యా విభేదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా.. అందుకు పూర్ణ చంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనంటూ ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాంకర్‌గా, న్యూస్ప్రజెంటర్గా పలు చానెల్స్‌లో పని చేసిన స్వేచ్ఛ.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గానూ గుర్తింపు దక్కించుకున్నారు. శుక్రవారం గాంధీనగర్ జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె నేత్రాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
కాళ్లు, చేతులు కట్టేసి.. డ్రమ్ములో కుక్కేసి..
మరో ఘోర ఉదంతం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. బ్లూ కలర్ డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహాం బయటపడింది. దీంతో యూపీ మీరట్ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. మీరట్‌లో ఓ మహిళ గంజాయి మత్తులో తూలుతూ.. ప్రియుడి సాయంతో తన భర్తను చంపి మృతదేహాన్ని డ్రమ్ములో దాచిపెట్టిన సంగతి తెలిసిందే.ఛండీగఢ్: మీరట్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. పంజాబ్‌లోని లూధియానాలో ఓ డ్రమ్ములో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మెడ, కాళ్లను తాడుతో కట్టి.. డ్రమ్ములోకి కుక్కిన వైనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూన్ 25వ తేదీన.. ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి చెత్త ఏరుకుంటుండగా దుర్వాసన వస్తుండడం చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించాడు. వాళ్ల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు డ్రమ్ము నుంచి మృతదేహాన్ని స్వాధీనపర్చుకున్నారు. డ్రమ్ములో ఓ బెడ్‌షీట్‌లో మృతదేహం చుట్టి ఉంది. చనిపోయిన వ్యక్తికి 40 ఏళ్ల వయసు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఒంటిపై గాయాలు లేవని.. పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు. లోతైన దర్యాప్తు.. డ్రమ్ము కొత్తగా ఉండడంతో.. లూథియానాలో 42 డ్రమ్ము తయారీ యూనిట్లకు, దుకాణాలకు వెళ్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసుకుని.. ఈ మధ్యకాలంలో కనిపించకుండా పోయిన వ్యక్తల జాబితాతో మృతుడి వివరాలు సరిపోల్చుకుంటున్నారు. మీరట్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసు ఇలా.. ఫిబ్రవరి 24, 2025:మర్చంట్ నేవీ ఉద్యోగి సౌరభ్ రాజ్‌పుత్ లండన్ నుంచి తన కుమార్తె పుట్టినరోజు కోసం భారత్‌కు వచ్చారు. ఫిబ్రవరి 25, 2025:భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి హత్యకు ప్రయత్నించారు. కానీ ఆ రోజు ప్రయత్నం విఫలమైంది. మార్చి 3, 2025:సౌరభ్‌ను కత్తితో పొడిచి హత్య చేశారుశరీరాన్ని ముక్కలు చేసి, తల, చేతులను వేరు చేశారుశరీర భాగాలను మిక్సర్ గ్రైండర్లో వేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు మార్చి 4-5, 2025సిమెంట్, డ్రమ్ములు కొనుగోలు చేసి శరీర భాగాలను డ్రమ్ములో వేసి సిమెంట్ పోసారుడ్రమ్మును ఇంట్లో దాచారుమార్చి 10, 2025 (సుమారు):డ్రమ్ము నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ అనుమానం వ్యక్తం చేశాడుసౌరభ్ కూతురు ‘‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’’ అని చెప్పినా, మొదట ఎవ్వరూ పట్టించుకోలేదు మార్చి 20–25, 2025:పోలీసులు డ్రమ్మును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారుఫోరెన్సిక్ బృందం బెడ్షీట్లు, బాత్రూమ్ టైల్స్‌పై రక్తపు మరకలు గుర్తించిందిసూట్కేస్లో కూడా రక్తపు ఆనవాళ్లు లభించాయి మార్చి 26–27, 2025:ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లా అరెస్టయ్యారుఇద్దరూ నేరాన్ని అంగీకరించారుముస్కాన్కు 2019 నుంచి సాహిల్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు వెల్లడించారు ప్రస్తుతం నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా జైలులో ఉన్నారు. ముస్కాన్ ఆరు నెలల గర్భవతి కావడంతో ఆమెను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. ఆమె జైలులో లా చదివే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్‌లు అప్పటికే..
గౌహతి: మేఘాలయ హనీమూన్ కేసులో లెక్కలేనన్ని ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. భర్త రాజారఘువంశీ హత్యకు కుట్ర పన్నిన సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు పోలీసుల ముందు మరో నిజాన్ని వెల్లడించారు. ఎప్పటి నుంచో తమ మధ్య సంబంధం ఉన్నదని వారు పోలీసుల సమక్షంలో అంగీకరించారని మేఘాలయ పోలీసులు తెలిపారు.తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ మీడియాతో మాట్లాడుతూ తమ దర్యాప్తులో రాజ్, సోనమ్‌లు రిలేషన్షిప్లో ఉన్నట్లు అంగీకరించారని తెలిపారు. వారిద్దిరూ ఇప్పటికే నేరాన్ని అంగీకరించారని, తాము సీన్ రీకన్స్ట్రక్షన్ చేయగా, దానికి వారు సహకరిస్తూ, అన్ని ఆధారాలు చూపించారన్నారు. అందుకే సోనమ్‌కు ఇప్పుడు నార్కో టెస్టులు అవసరం లేదని భావిస్తున్నామని అన్నారు.సాధారణంగా ఎటువంటి ఆధారాలు లభ్యం కానప్పుడే నార్కో పరీక్ష జరుగుతుందని, వాస్తవానికి సుప్రీంకోర్టు నార్కో విశ్లేషణను నిషేధించిందని వివేక్ సయీమ్ తెలిపారు. కేవలం వారి ఒప్పుకోలును మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, బలమైన సాక్ష్యాధారాలను సేకరించామన్నారు. చార్జిషీట్‌ను వీలైనంత త్వరగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రఘువంశీ హత్యకు డబ్బు ప్రధాన కారణం కాదని, వారి సంబంధానికి అతను అడ్డుకాకూడదని వారు భావించివుండవచ్చునన్నారు.మేఘాలయ పోలీసులు తాజాగా ఇండోర్‌లోని ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్‌ను విచారణ కోసం రప్పిస్తున్నారు. సోనమ్‌ను అరెస్టు చేయడానికి ముందు ఆమె భర్తతో పాటు అతని ప్లాట్‌లో కొంతకాలం ఉన్నారు. కాగా సోనమ్ బ్యాగ్‌లో ఒక దేశీయ పిస్టల్, ఫోన్, రాజా రఘువంశీకి చెందిన నగలు, రూ ఐదు లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవి విచారణలో కీలకంగా మారనున్నాయని అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అది నాకు దక్కిన గౌరవం’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
జీడిమెట్ల కేసులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘మా అక్కే మా అమ్మను చంపింది’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది. ‘‘ట్యూషన్ నుంచి వస్తుంటే నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది.. పదా వెళ్దామంటూ నన్ను తీసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. అప్పటికే కిచెన్‌లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను లేపే ప్రయత్నం చేశా....అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లు అంటూ అక్క చెప్పింది. చుట్టూ పక్కల ఎవరికీ చెప్పవద్దని చెప్పింది.. కానీ అక్క మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అని అక్క చెప్పింది. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకుని.. శివకు ఫోన్ చేసింది. మళ్లీ శివ, యశ్వంత్ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టాడు’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది.ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని పదో తరగతి చదువుతున్న కుమార్తె తేజశ్రీ.. ప్రియుడితో కలిసి హతమార్చిన సంగతి తెలిసిందే. బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయం కాగా.. అతడితో ప్రేమ వ్యవహారం నడిచింది. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి పోవడంతో తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ బాలిక మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది.ఇదిలా ఉండగా.. తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్‌షీట్‌తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. -
మేఘాలయ హనీమూన్ కేసులో విస్తుపోయే నిజాలు
-
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్‌వర్మ మరెవరో కాదు..
మీరట్: మధ్యప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌లు వివాహమయ్యాక హనీమూన్ కోసం మేఘాలకు వెళ్లారు. అక్కడ వారిద్దరూ అదృశ్యమయ్యారు. కొద్దిరోజులకు ఒక లోయలో రఘువంశీ మృతదేహం లభ్యమయ్యింది. ఇంతలో సోనమ్ తాను భర్తను హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయింది. పోలీసుల దర్యాప్తులో సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా హస్తం ఈ హత్య కేసులో ఉందని తేలింది. కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.సోనమ్ తన వివాహానికి ముందు, ఆ తరువాత సంజయ్ వర్మ అనే వ్యక్తికి 200 కి పైగా కాల్స్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో సోనమ్‌కు సంజయ్ వర్మతోనూ సంబంధం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న మేఘాలయ పోలీసులు.. సంజయ్ వర్మ మరెవరో కాదని, సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహానే అని తేల్చారు. సోనమ్.. రాజ్ నంబర్‌ను ‘సంజయ్ వర్మ’ పేరుతో సేవ్ చేసింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు అలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. సోనమ్, సంజయ్‌ల మధ్య 39 రోజుల వ్యవధిలో 239 కాల్స్ నడిచాయి. అయితే సంజయ్ మొబైల్ నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్‌లో ఉందని పోలీసులు చెబుతున్నారు. తాజాగా సోనమ్ సోదరుడు గోవింద్ తనకు సంజయ్ అనే వ్యక్తితో పరిచయం లేదన్నారు. మేఘాలయ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్ విద్యార్థుల ఆగ్రహం -
పెళ్లైన 20 ఏళ్లకు.. మా ఆవిడ బెదిరిస్తోంది : కేసు అవుతుందా?
నాకు పెళ్లయి 20 ఏళ్లవుతోంది. ఒక పాప..16 ఏళ్లు. బాబు..14 ఏళ్లు. పెళ్లి నాటికి నాకు ఇరవై ఏళ్లు. నా భార్యకు పదహారేళ్లు. గత కొన్నేళ్లుగా మా ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. విడాకులు ఇచ్చి నాకున్న ఏకైక ఇంటిని తన పేర రాసివ్వాలని, లేకపోతే తన మైనార్టీ తీరకముందే లైంగికంగా లొంగదీసుకుని, బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు కేసు పెడతానంటూ బెదిరిస్తోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఏం చేయమంటారు? – శ్రీహరి, కర్నూలుబాల్యవివాహాల నిరోధక చట్టం, 2006 ప్రకారం ఒక మేజర్ పురుషుడు ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లి చేసుకున్న పురుషుడికి అలాగే ఆ పెళ్లి జరిపించిన పెద్దలకు, ఆ పెళ్లి జరగాలని ్ర΄ోత్సహించిన వారికి కూడా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష. లక్ష రూ΄ాయల వరకు జరిమానా ఉంది. ఈ చట్టం ప్రకారం పెళ్లికి పురుషులకైతే చట్టబద్ధమైన వయసు 21, స్త్రీలకు 18 సంవత్సరాలు. అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ వివాహ చట్టం ప్రకారమైనా, బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారమైనా.. బాల్య వివాహం జరిగితే సదరు అమ్మాయి తనకు ఇరవై ఏళ్లు నిండేలోపు కోర్టును ఆశ్రయించి తన వివాహం చెల్లదని దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మైనర్‌గా ఉన్నప్పుడు కూడా ఒక ప్రతినిధి ద్వారా, మిత్రుల సహాయంతో, బాల్యవివాహాల నిరోధక అధికారి ద్వారా కూడా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా? 20 ఏళ్లు నిండిన తర్వాత వివాహ రద్దుకు ప్రస్తుత చట్టం అంగీకరించదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వైవాహిక సంబంధం కొనసాగించిందని చట్టం భావిస్తుంది. ఇరవై ఏళ్ల వైవాహిక బంధం, సంతానం కూడా కలిగిన తర్వాత మీపై పోక్సో కేసు వేసే ఆస్కారం లేదు! వివాహం కాకుండా ఉండి ఉంటే అది వేరే సంగతి! బలవంతపు పెళ్లి చేశారనే ఆస్కారం కూడా లేదిప్పుడు. ఎందుకంటే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 12 (2) ప్రకారం కూడా బలవంతపు పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామితో వైవాహిక సంబంధం కొనసాగిస్తే ఆ బలవంతం/మోసపూరితమైన అంగీకారం అనే కారణాలపై వివాహాన్ని రద్దు చేయడం కుదరదు. మీరిద్దరూ కలిసి ఒక మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ని కలవండి. సమస్యలు పరిష్కారం కాకపోతే సామరస్యంగా విడిపోయే ప్రయత్నం చేయండి. లాయర్‌ను సంప్రదించి మీకున్న అవకాశాలు, హక్కులను తెలుసుకోవడం కూడా మంచిదే! – శ్రీకాంత్ చింతల,హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. -
‘హనీమూన్’ కేసు దర్యాప్తు: మేఘాలయకు సోనమ్‌తో పాటు ప్రియుడు..
షిల్లాంగ్: మధ్యప్రదేశ్‌కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్‌ల హనీమూన్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సోనమ్‌ను, అమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ఇతర నిందితులను మేఘాలయ పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకువచ్చారు. నాడు నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ (Scene Reconstruction) చేశారు.సోనమ్, రాజా రఘువంశీలు హనీమూన్‌లో ఉండగా, ఒక పథకం ప్రకారం రాజా రఘువంశీ హత్య జరిగింది. రాజా మృతదేహం దొరికిన ఆరు రోజులకు సోనమ్ యూపీలోని ఘాజీపూర్‌లో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విచారణలో సోనమ్ తన భర్త హత్యలో తన పాత్రను అంగీకరించింది. అయితే ఆమెపై ఉన్న అభియోగాలను నిరూపించే ఆధారాలను పోలీసులు కోర్టుకు అందించాలి. ఇందుకోసం వారు సోనమ్‌ను మేఘాలయ తీసుకువచ్చారు.మేఘాలయలోని సోహ్రాలో నేరాల రేటు అతి తక్కువ. గత కొన్ని దశాబ్దాలుగా ఈ పర్యాటక ప్రదేశంలో ఎటువంటి హత్య జరగలేదని పోలీసులు తెలిపారు. అందుకే వారు ఈ కేసు దర్యాప్తుపై మరింత దృష్టి సారించారు. నిందితులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మేఘాలయ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇదాషిషా నోంగ్రాంగ్ అన్నారు. అందుకే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి, వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విచారణ కోసం సోనమ్ కస్టడీని పొడిగించాలని కోర్టును కోరనున్నామన్నారు.ఇది కూడా చదవండి: అంబులెన్స్‌లో కేదార్నాథ్.. బెడిసికొట్టిన ‘ప్లాన్’ -
హనీమూన్ కేసు: సోనమ్‌ను సిట్ అడగబోయే 20 ప్రశ్నలివే..
న్యూఢిల్లీ: మేఘాలయ ‘హనీమూన్’ కేసులో భర్త రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ హత్య చేయించిదని వెల్లడయ్యింది. సోనమ్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను గురువారం ఇండోర్ నుంచి మేఘాలయకు తీసుకువచ్చారు. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వారిని షిల్లాంగ్‌లో విచారించనుంది.సోనమ్ (25),రాజా (29)లకు మే 11న ఇండోర్‌లో వివాహం జరిగింది. వారు హనీమూన్ కోసం మే 20న అస్సాంలోని గౌహతి మీదుగా మేఘాలయకు చేరుకున్నారు. మే 23న సోహ్రాలోని నోంగ్రియాట్ గ్రామంలో అదృశ్యమయ్యారు. జూన్ 2న వీసావ్‌డాంగ్ జలపాతం సమీపంలోని ఒక లోయలో రాజా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. జూన్ 9న తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లో సోనమ్ పోలీసుల సమక్షంలో లొంగిపోయింది. తరువాత ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు రాజాను హత్య చేసిన ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.ఈ వివాహానికి ముందే రాజాను చంపడానికి సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో సోనమ్ తాను, తన ప్రియుడు రాజ్‌తో కలిసి ఉండేందుకు భర్తను హత్య చేసినట్లు సోనమ్ అంగీకరించింది. భర్తను దారుణంగా హత్య చేసిన కేసులో సోనమ్‌ను విచారించేందుకు ‘సిట్’ 20 ప్రశ్నల జాబితాను సిద్ధం చేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రశ్నలివే..1. మేఘాలయలో మీరు, రాజా హనీమూన్‌ను ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు?2. రిటర్న్ టిక్కెట్లు ఎందుకు బుక్ చేసుకోలేదు? అది కూడా ప్రణాళికలో భాగమేనా?3. వివాహానికి ముందు మీకు రాజ్ కుష్వాహా తెలుసా? మీ ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్లు పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి.4. యాప్ చాట్‌లో హనీమూన్ సమయంలో మీరు రాజ్ కుష్వాహాతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. మీరిద్దరూ దేని గురించి చర్చించుకున్నారు?5. నిందితునికి మీ లైవ్ లొకేషన్‌ను ఎందుకు పంపించారు?6. మే 23న మీరు ముగ్గురు వ్యక్తులతో మావ్లింగ్ఖైట్లో కనిపించారు. వారి గురించి మాకు ఏమి చెబుతారు?7. మే 22న స్థానిక గైడ్ ఆల్బర్ట్ సర్వీస్‌ను ఎందుకుతిరస్కరించారు? 8. రాజా హత్య కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తులను గైడ్ ఆల్బర్ట్ గుర్తించాడు. వారిని మీరు, రాజ్ కుష్వాహా నియమించుకున్నారా?9. రాజా రఘువంశీని హత్య చేయడానికి హంతకులను ఎవరు సంప్రదించారు?10. రాజా రఘువంశీ హత్య కోసం హంతకులకు ఎంత డబ్బు చెల్లించారు? దానిని ఎవరు చెల్లించారు? అది నగదు రూపంలో లేదా ఆన్లైన్ లావాదేవీల ద్వారా చెల్లించారా?11. రాజా హత్యకు మేఘాలయను మీరు, రాజ్ కుష్వాహా ఎందుకు ఎంచుకున్నారు? మరెక్కడికైనా వెళ్లాలనే ప్లాన్ మీకు ఉందా? 12. హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగితే, రాజ్ కుష్వాహా మీతో మేఘాలయకు ఎందుకు రాలేదు?13. హత్య తర్వాత మీరు 17 రోజులు ఎక్కడికి వెళ్లారు? పోలీసుల నుంచి దాక్కునేందుకు మీకు ఎవరు సహాయం చేసారు?14. రాజా రఘువంశీ హత్య తర్వాత పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఏమి ప్లాన్ చేశారు?15. రాజాకు చెందిన స్మార్ట్ వాచ్, ఫోనును పోలీసులు కనుగొన్నారు. అయితే రాజాకు చెందిన దాదాపు రూ. 10 లక్షల విలువైన బంగారం కనిపించకుండా పోయింది. దీని గురించి మీరేమి చెబుతారు?16 రాజాను చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని మీరు ఎక్కడ కొన్నారు? ఎంతకు కొన్నారు?17 రాజా తల్లి మీరు మేఘాలయకు వెళ్లడానికి ఇష్టపడలేదని, మీ పట్టుదల కారణంగానే అంగీకరించారని చెబుతున్నారు. మీరు రాజాను బలవంతంగా తీసుకువెళ్లారా?18. వివాహ వేడుకల సమయంలో సంతోషంగా లేనట్లు వీడియోలలో కనిపిస్తోంది. కారణమేమిటి?19 మీరు రాజా రఘువంశీని వివాహం చేసుకోకూడదనుకుంటే, ముందుగా మీ కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు?20. రాజ్ కుష్వాహాతో కలిసి రాజా హత్యకు మీరు ప్లాన్ చేశారా?ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి.. -
‘హనీమూన్’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్ పరారైందిలా..
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన కొత్త జంట రాజారఘువంశీ, సోనమ్‌లు హనీమూన్‌కు వెళ్లి, అదృశ్యమయ్యాక ఈ ఉదంతం పలు మలుపులు తిరుగుతూ, సినిమా కథను తలపిస్తోంది. ఈ ఘటనలో రాజా రఘువంశీ మే 23న హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం జూన్ 2న లభ్యమయ్యింది. అతని భార్య సోనమ్ ఎక్కడుందో తెలియలేదు. భర్త హత్య దరిమిలా సోనమ్‌పై కూడా దాడి జరిగివుంటుందని, లేదా కిడ్నాప్ చేసివుంటారనే ఊహాగానాలు తొలుత వినిపించాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో సోనమ్ జాడ కనుగొన్నాక మేఘాలయ పోలీసులు.. భర్తను హత్య చేసిన సోనమ్ ఎలా తప్పించుకునేందుకు ప్రయత్నించిందనే వివరాలు సేకరించారు.ప్రియునితో జతకట్టి..సోనమ్, రఘువంశీలకు మే 11న వివాహం జరిగింది. ఆ తర్వాత వారు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లేందుకు మే 21న షిల్లాంగ్ చేరుకున్నారు. ఆ తర్వాత వారు తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని చిరపుంజిలోని సోహ్రాకు వెళ్లారు. అయితే సోనమ్ తమ కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారంలో ఉద్యోగి అయిన రాజ్ కుష్వాహాను ప్రేమిస్తోంది. తల్లిదండ్రుల ఒత్తిడితో రాజా రఘువంశీని వివాహం చేసుకుంది. పెళ్లాయ్యాక ప్రియుని సాయంతో భర్తను అడ్డు తప్పించుకోవాలనుకుంది. ఈ నేపధ్యంలో ప్రియుడు రాజ్ కుష్వాహా తన ముగ్గురు స్నేహితులతో రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేశాడు. సోనమ్ వారికి రూ. 20 లక్షలు చెల్లిస్తానని హామీ ఇచ్చిందని పోలీసులు చెబుతున్నారు.కొత్త జంటను అనుసరించిన నిందితులుమే 23న, సోనమ్, రాజా రఘువంశీలు మావ్లాఖియాత్‌లోని ఒక కొండ పైకి చేరుకుని, జలపాతాన్ని చూడాలనే ఆలోచనతో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఇదే సమయంలో నిందితులు వారిని వెంబడించారు. ఈ దంపతులు నిర్జన ప్రదేశానికి చేరుకోగానే, రాజా రఘువంశీని అంతమొందించాలని సోనమ్ ఆ ముగ్గురు నిందితులను కోరిందని, ఆ తరువాత భర్త మృతదేహాన్ని లోయలో విసిరేయాలని వారికి చెప్పిందని పోలీసులు చెబుతున్నారు. భర్త హత్య తర్వాత సోనమ్.. మావ్‌కాడోక్ నుండి షిల్లాంగ్‌కు టాక్సీలో వెళ్లింది. అనంతరం ఆమె టూరిస్ట్ టాక్సీలో గౌహతికి చేరుకుందని, అక్కడి నుంచి రైలులో ప్రయాణించిందని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు.హత్య జరిగిన రోజు..ఆమె పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం గౌహతి నుంచి రైలులో ఇండోర్‌కు చేరుకుంది. రాజ్ కుష్వాహా కుష్వాహా స్నేహితులైన ముగ్గురు నిందితులు సోహ్రా నుండి గౌహతికి టాక్సీలో వచ్చారు. ఆ తరువాత వారు రైలులో ఇండోర్‌కు వచ్చారు. రాజా రఘువంశీ హత్య తరువాత సోనమ్‌తో పాటు నిందితులు కేసు నుంచి తప్పించుకునేందుకు పలు ప్రణాళికలు వేసుకున్నారని కేసు దర్యాప్తు చేస్తున్నమేఘాలయ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. హత్య జరిగిన రోజు ఆమె రాజ్ కుష్వాహాతో టచ్‌లో ఉందని, అతను ఆ ముగ్గురు నిందితులతో సంభాషించాడని పోలీసులు నిర్ధారించారని ఎస్పీ వివేక్ సయీమ్ పేర్కొన్నారు. అయితే సోనమ్, రఘువంశీలు ఇంతకు ముందు మేఘాలయకు వెళ్లి, హత్యకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకున్నారా లేదా అనేది పోలీసులు ఇంకా నిర్థారించలేదు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని, ఆ తర్వాత దర్యాప్తు కోసం పోలీసు రిమాండ్‌కు తీసుకువెళతామని ఎస్పీ తెలిపారు.ఇది కూడా చదవండి: శుభాన్షు అంతరిక్ష ప్రయాణం మళ్లీ వాయిదా -
‘హనీమూన్’ కేసు.. ప్రియుడి ‘ప్లాన్’తో భర్తను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్‌లు మేఘాలయలో అదృశ్యమైన తరువాత ఈ ఉదంతం పలు మలుపులు తిరిగింది. ఈ ఘటనలో రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ఇందుకోసం సోనమ్ తన ప్రేమికునితోపాటు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను సంప్రదించిందని తెలియవచ్చింది. పోలీసుల విచారణలో ఈ నిందితులు సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహా స్నేహితులని వెల్లడయ్యింది.ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ, ఆమె ప్రేమికుడు కుష్వాహా అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సోనమ్ పోలీసుల ముందు లొంగిపోయింది. విచారణ అనంతరం పోలీసులు మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను ఆనంద్ కుమ్రీ, ఆకాష్ రాజ్‌పుత్ విక్కీ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారని అధికారులు తెలిపారు.ఉత్తరప్రదేశ్‌లోని బినా జిల్లాలో ఆనంద్ కుమ్రీ (23ని అరెస్టు చేయగా, లలిత్పూర్ జిల్లాలో ఆకాష్ రాజ్‌పుత్ (19)ను అరెస్టు చేశారు. విక్కీ ఠాకూర్ (22)ను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అరెస్టు చేశారు. రాజా , సోనమ్‌లకు మే 11న ఇండోర్‌లో వివాహం జరిగిన తర్వాత వారు మే 20న మేఘాలయకు బయలుదేరారు. ఒక పర్యాటక ప్రదేశానికి వెళుతుండగా అదృశ్యమయ్యారు.మే 16న రాజ్ కుష్వాహా.. రాజా రఘువంశీని హత్య చేసేందుకు తన చిన్ననాటి స్నేహితులను ఇండోర్‌లోని ఒక కేఫ్‌లో కలిశాడని పోలీసు అధికారులు తెలిపారు. మే 20న సోనమ్, ఆమె భర్త హనీమూన్‌కు వెళ్లగా, రాజ్ తన ముగ్గురు స్నేహితులను మేఘాలయకు పంపాడు. హత్య జరిగిన రోజున సోనమ్ తన భర్తను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ ఆ ముగ్గురు నిందితులు రాజా రఘువంశీపై దాడి చేశారు. పది రోజుల తర్వాత, పోలీసులకు ఒక లోయలో రాజా మృతదేహం లభ్యమయ్యింది. ఆ సమయంలో ఒక కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో అతనిపై రెండుసార్లు దాడి జరిగిందని తేలింది. అదే సమయంలో సోనమ్ కనిపించకుండా తప్పించుకుంది. దీంతో ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా శనివారం రాత్రి ఘాజీపూర్‌లోని ఒక ధాబాలో సోనమ్ అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను చికిత్స కోసం ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. పోలీసుల విచారణలో ఈ కేసులోని పూర్వాపరాలన్నీ బయటపడ్డాయి. ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్ -
రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ గులం సుల్తాన్ అహ్మద్‌ను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్లో పోలీసులు తనిఖీల్లో గంజాయితో ఓ యువకుడు పట్టుబట్టాడు. అతని వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తనకు గంజాయి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇచ్చినట్టు ఆ యువకుడు తెలిపాడు. ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన గంజాయిని ఆ యువకుడికి సుల్తాన్ ఇచ్చాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సుల్తాన్ అహ్మద్, యువకుడు అంజాద్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. -
అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య
యలమంచిలి రూరల్(అనకాపల్లి): రెండేళ్ల క్రితం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బీపీసీఎల్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన యువతి ఎల్లబిల్లి దివ్య(20) హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో 25 నెలలుగా నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెండింగ్ కేసుల దర్యాప్తుపై దృష్టి సారించిన యలమంచిలి సర్కిల్ పోలీసులు చాకచక్యంగా పలు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకోగలిగారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ హత్య కేసును ఛేదించిన యలమంచిలి సీఐ ధనుంజయరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి పట్టణం, మునగపాక ఎస్ఐలు కె.సావిత్రి, పి.ప్రసాదరావులను పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ అభినందించారు. ఈ సందర్భంగా యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన ఎల్లబిల్లి దివ్య(20) 2023 ఫిబ్రవరి 22న యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరం సమీపంలో దారుణ హత్యకు గురైంది. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఎర్రవరం వీఆర్వో చేవేటి అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో ఆమె ఎవరనేది, ఎవరు హత్య చేశారో కూడా గుర్తించలేని పరిస్థితి ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగాను, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కేసు నమోదు చేశారు. హత్యకు గురైన మహిళను తొలుత ట్రాన్స్‌జెండర్‌గా కూడా భావించారు. ఆ తర్వాత హత్యకు గురైంది పూడిమడకకు చెందిన ఎల్లబిల్లి దివ్యగా తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హతురాలు యలమంచిలిలో పలువురు యువకులతో ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో ఆమెతో పరిచయం ఉన్న చాలా మంది యువకులపై అనుమానంతో పోలీసులు విచారించారు. అయినా సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఇటీవల ఈ కేసు దర్యాప్తుపై దృష్టి సారించిన పోలీసులు పలు సాంకేతిక ఆధారాలతో యలమంచిలి ధర్మవరం సీపీ పేటకు చెందిన ప్రగడ రవితేజ(30), సెలంశెట్టి సాయికృష్ణ(20), కాకివాని వీధికి చెందిన బంగారి శివ(23)లను నిందితులుగా నిర్ధారణకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నేరాన్ని అంగీకరించారు.వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే.. దివ్యకు కేసులో ప్రధాన నిందితుడు ప్రగడ రవితేజకు రిలేషన్షిప్ ఉండేది. రవితేజ మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెతో వివాహం కూడా నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య.. తనను వివాహం చేసుకోవాలని రవితేజను కోరింది. లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తానని బెదిరించింది. దివ్యను వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని రవితేజ ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. ఇందుకు స్నేహితులైన సెలంశెట్టి సాయికృష్ణ, బంగారి శివల సహాయం కోరాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దివ్యను పిడిగుద్దులు గుద్ది, చాకుతో పొడిచి చంపారు.అక్కడితో ఆగకుండా మృతురాలి ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితుల్లో ప్రగడ రవితేజ, సెలంశెట్టి సాయి కృష్ణలు యలమంచిలి రూరల్ పీఎస్‌లో గంజాయి చోరీ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. మూడో నిందితుడు బంగారిశివపై కొట్లాట కేసు ఉంది. అంతేకాకుండా నిందితులు ముగ్గురూ గంజాయికి అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకెవరూ నిందితులు లేరని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ముగ్గుర్నీ శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు. -
దేశాలు చూపిస్తానంటూ.. దేశ ద్రోహం
-
విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. ఆ 20 మంది ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఐదో రోజు పోలీస్ కస్టడీలో సిరాజ్, సమీర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. మరో 20 మంది సభ్యులు ఉన్నట్టు ధ్రువీకరించిన సిరాజ్, సమీర్.. ఆ 20 మంది పేర్లు తెలిసినా.. వారు ఎక్కడున్నారనేది చెప్పడం లేదు. ఆ 20 మంది కోసం తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టారు. సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్‌లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ వారం రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.గత మూడురోజులుగా నోరు విప్పని సమీర్.. సోమవారం పలు విషయాలు బహిర్గతం చేసినట్టు సమాచారం. పేలుళ్లకు పథక రచన చేసింది సిరాజేనని చెప్పినట్టు తెలిసింది. అహీం గ్రూప్‌నకు అడ్మిన్ కూడా సిరాజ్ అని, అతనితోపాటు మరో 20 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని చెప్పినట్టు సమాచారం. సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్‌లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్‌కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్‌తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్‌కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. -
ఉగ్ర కుట్ర కేసు.. వెలుగులోకి విస్తుపోయే కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: సిరాజ్ ఉగ్ర కదలికలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఏడేళ్లుగా హైదరాబాద్‌లో మకాం వేసిన సిరాజ్.. సమీర్ కలిసి ఐదు చోట్ల రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వరంగల్‌కు చెందిన ఫర్హాన్ మోయినుద్దీన్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. యూపీకి చెందిన బాదర్‌తో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ కాంటాక్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల వారితో జరిగిన సమావేశాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా.. సిరాజ్ కౌంటర్‌ను మెచ్చుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్‌కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి, సిరాజ్‌కు నాలుగు రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా చాటింగ్స్ కొనసాగినట్లు పోలీసులు నిర్థారించారు.రాజాసింగ్‌తో పాటు పలువురికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఆదేశాలిచ్చిన.. ఆ గుర్తు తెలియని వ్యక్తి.. తనకు తాను విశాఖ రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారానే సిరాజ్‌తో టచ్‌లో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిరాజ్‌ను కాంటాక్ట్ చేసిన అకౌంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. -
గ్యాంగ్‌రేప్ నిందితులకు బెయిల్.. కార్లు, బైకులతో విజయోత్సవ ర్యాలీ
సాక్షి,బెంగళూరు: ఓ మహిళపై సామూహిక అత్యాచారం. ఆపై జైలు శిక్ష, బెయిల్‌పై విడుదల. ఈ తరహా దారుణాల నిందితులు చేసిన తప్పుకు పశ్చాతాపానికి గురవుతుంటారు. సమాజంలో తిరగలేక సిగ్గుతో తలదించుకుంటుంటారు. కానీ కర్ణాటక కేసు నిందితులు అందుకు భిన్నంగా వ్యవహించారు. బెయిల్ రావడంతో బైక్, కార్లలో తిరుగుతూ విజయోత్సవ ర్యాలీలు జరిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల,గ్యాంగ్ రేప్ కేసులో ఏడుగురు ప్రధాన నిందితులు అఫ్తాబ్, మదర్ సాబ్, సమీవుల్లా, మొహమ్మద్ సాదిక్, తౌసీఫ్, రియాజ్, షోయిబ్‌లకు కర్ణాటక హవేరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం, చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి సంబరాలు చేసుకున్నారు. వీధుల్లో కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. SHOCKING 🚨 7 Gang rape accused take out road show after securing BAIL in Karnataka's Haveri. Names — Mohammad Sadiq Agasimani, Shoib Mulla, Tausip Choti, Samiwulla Lalanavar, Aptab Chandanakatti, Madar Saab Mandakki, and Riyaz Savikeri. pic.twitter.com/pNMF21YXJy— Times Algebra (@TimesAlgebraIND) May 23, 2025కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. 2024 జనవరి 8న కర్ణాటకలోని హవేరీ జిల్లాలో హనగర్‌కు చెందిన ఓ హోటల్ గదిలో దారుణం జరిగింది. నిందితులు హోటల్ గదిలోకి చొరబడి ఓ జంటపై దాడి చేశారు. అనంతరం బాధితురాల్ని స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తాజాగా, ఆ కేసులో ఏడుగురు ప్రధాన నిందితలు బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ రావడంపై నిందితులు హవేరి జిల్లా అక్కి అలూరు పట్టణంలో పెద్ద ఎత్తున మోటార్ బైక్‌లు, కార్లు, డీజే మ్యూజిక్‌తో కూడిన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చిరునవ్వుతో చేతులు ఊపుతూ, విజయోత్సవ సంకేతాలిచ్చిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. బాధితురాలు ఓ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారు. ఆమె కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమె, తన ప్రియుడితో కలిసి 2024 జనవరి 8న హనగల్‌కు చెందిన ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారు. బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. అయితే జనవరి 11న న్యాయమూర్తి ఎదుట బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో ఈ కేసులో పోలీసులు మొత్తం 19 మందిని అరెస్ట్ అయ్యారు. వీరిలో 12 మందిని దాదాపు 10 నెలల క్రితమే బెయిల్‌పై విడుదల చేశారు. కానీ, ఏడుగురు ప్రధాన నిందితులు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదే కేసులో ఆ ఏడుగురికి న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో నిందితులు బైక్‌లు,కార్లలో ర్యాలీతో సంబరాలు చేసుకున్నారు.ఈ ఘటనపై నెటిజన్లు, స్థానికులు.. న్యాయం గెలవాలన్న ఆశతో బాధితురాలు ఎదురుచూస్తున్న సమయంలో నిందితులు చేసిన విజయోత్సవాల ర్యాలీ బాధితురాలిని మరింత మానసికంగా దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు. -
తెలంగాణ రాజ్‌భవన్ హార్డ్ డిస్క్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సస్పెండైన ఉద్యోగి శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌భవన్ చోరీ కేసు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేయగా.. ఆ కేసులో మొదటిసారి అరెస్ట్ చేశారు. కాగా.. హార్డ్ డిస్క్‌ల చోరీ కేసులో రెండోసారి చేశారు. ఆ ఉద్యోగి వారంలో రెండుసార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. సస్పెండ్ అయినా కానీ.. సెక్యూరిటీని మాయ చేసి రాత్రి సమయంలో రాజ్‌భవన్‌లోకి ప్రవేశించాడు. రాజ్ భవన్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో శ్రీనివాస్.. ఓ మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫొటోలను చూపించాడు. ఎవరో తనకు ఈ ఫోటోలు పంపిస్తున్నారు జాగ్రత్త అంటూ భయపెట్టాడు. దీంతో కలవరపాటుకు గురైన ఆ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మార్ఫింగ్ ఫోటోలను సృష్టించింది.. శ్రీనివాసేనని తేల్చారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. రాజభవన్ అధికారులు శ్రీనివాస్ సస్పెండ్ చేశారు.జైలకు వెళ్లిన శ్రీనివాస్.. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్ళాడు. తన కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్‌ను చోరీ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై రాజభవన్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి.. హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడాడ్డని తెలిసింది. -
గోవిందప్పతో పోలీసుల బలవంతపు సంతకాలు
-
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, అరెస్ట్
-
వల్లభనేని వంశీ కేసు కోసం ఢిల్లీ బాబాయ్ కి 2 కోట్లు ఖర్చుపెట్టారు..
-
Magazine Story: నాడైనా, నేడైనా నేనే లిక్కర్ బాద్ షా..!
-
బాబు కుట్రను ఆధారాలతో బయటపెట్టిన బోండా ఉమా
-
విచారణ పేరుతో సిట్ వేధింపులు
-
రాంగ్ రూట్ కేసు.. విచారణకు హాజరైన బెల్లంకొండ శ్రీనివాస్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆయనపై కేసు నమోదు కావడంతో జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు వచ్చారు. తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో కారు నడపడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అవసరమైతే మరోసారి కోర్టు విచారణకు రావాలని ఆయనకు పోలీసులు సూచించారు. ఇప్పటికే హీరో కారును సీజ్ చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు.(ఇది చదవండి: దురుసు ప్రవర్తన.. టాలీవుడ్ హీరోపై కేసు నమోదు!)అసలేం జరిగిందంటే..జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్న బెల్లకొండ శ్రీనివాస్ ఇంటికి వెళ్తున్న సమయంలో రాంగ్ రూట్లో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. తనని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసుతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం భైరవం మూవీలో నటిస్తున్నారు. -
పోలీసులకు నటి ఫిర్యాదు.. పరారీలో నటుడు అజాజ్ ఖాన్!
ఇటీవల హౌస్ అరెస్ట్ షో వివాదం తర్వాత అజాజ్ ఖాన్ పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ షోలో అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేయడం వివాదంగా మారింది. దీంతో ఆ షోను ప్రసారం చేస్తున్న ఓటీటీ సంస్థ కూడా బ్యాన్ విధించింది. ఆ తర్వాత ఓ నటి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అజాజ్ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అజాజ్ ఖాన్ తన ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారైనట్లు తెలుస్తోంది.తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఒక నటి ముంబయిలోని చార్కోప్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అజాజ్ ఖాన్‌ను సంప్రదించేందుకు పోలీసులు యత్నించగా.. ఇంటి వద్ద అందుబాటులో లేడని తెలిపారు. అంతేకాకుండా ఫోన్ నంబర్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో పరారైనట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. 'హౌస్ అరెస్ట్' షోలో పాత్రను ఆఫర్ చేశాడని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని నటి ఆరోపించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే 'హౌస్ అరెస్ట్' అనే షోలో అనుచిత కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు మరో కేసులో కూడా పోలీసులు అతనికి సమన్లు జారీ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రోత్సహించినందుకు అతనితో పాటు, ఉల్లు ఓటీటీ యజమానులపై ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ షోను వెంటనే నిషేధించాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'పెళ్లి చేసుకుంటానని వాడుకున్నాడు'.. అజాజ్ ఖాన్‌పై నటి తీవ్ర ఆరోపణలు!
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. అతను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న హౌస్ అరెస్ట్ అనే షోలో విపరీతమైన, అసభ్యకరమైన కంటెంట్‌తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోను ఇప్పటికే సదరు ఓటీటీ సంస్థ బ్యాన్ చేసింది. ఈ అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేస్తోన్న అజాజ్ ఖాన్‌పై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వివాదంలో నడుస్తుండగానే అజాజ్ ఖాన్‌పై ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అజాజ్ ఖాన్‌పై చార్కోప్ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అతనిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.అజాజ్ ఖాన్ తన ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో తనకు ఓ పాత్ర ఆఫర్ చేశాడని ఆమె తెలిపింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తనకు లవ్ ప్రపోజ్ చేశాడని నటి ఆరోపించింది. మార్చి 25న తన నివాసంలోనే నాపై అత్యాచారం చేశాడని.. రెండు సార్లు తనను పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చాడని చార్కోప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మాకు నాలుగు వివాహాలకు అనుమతి ఉందని తనకు చెప్పాడని నటి ప్రస్తావించింది. ఆమె ఆరోపణలతో కేసు నమోదు చేసిన చార్కోప్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో మహిళలను అసభ్యకరంగా చూపించినందుకు అజాజ్ ఖాన్‌పై అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు
హైదరాబాద్, క్రైమ్: ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ (Na Anvesh)పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం.ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్ చేసేస్తూ.. ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బూలు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే.. తాజాగా బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో.. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్‌రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారట. అయితే అన్వేష్ అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటో(Suo moto)గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని సైబర్‌క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
భీమిలి వివాహిత కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరు బృందాలు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ శివారు 26వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫార్చ్యూన్ హిల్స్ వుడా లేఅవుట్లో నిన్న(శుక్రవారం) ఉదయం సగం కాలిన మహిళ మృతదేహాన్ని భీమిలి పోలీసులు గుర్తించారు.ఆ మహిళను హంతకులు గొంతు కోసి తరువాత పెట్రోల్‌తో దహనం చేసినట్టు గుర్తించారు. మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో మృతురాలు వివాహితగా గుర్తించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్‌తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.క్రాంతి కుమార్‌కు ఇద్దరు భార్యలు ఉండగా, అతడు రెండో భార్యతో మృతురాలి ఇంటి పక్కన ఉండేవాడు. క్రాంతికుమార్, మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది. అతనికి వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రెండో భార్యను వేరే బ్లాక్‌కు మార్చాడు. అయినా వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.ఈ విషయంలో మొదటి భార్య, రెండో భార్యతో తరచు గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు వెంకటలక్ష్మి.. తనతోనే ఎక్కువసేపు గడపాలని తనతోనే ఉండాలంటూ క్రాంతికుమార్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని.. ప్లాన్ చేశాడు. వెంకటలక్ష్మిని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐస్‌క్రీమ్ తిన్నారు. అనంతరం బైక్‌లో పెట్రోల్ కొట్టించి.. బాటిల్లో కూడా కొట్టించాడు. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని.. అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానంటూ వెంకటలక్ష్మితో చెప్పాడు.శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి లేవట్‌కి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని.. తరువాత పెట్రోల్ పోసి తగలుపెట్టాడు. కేసు విచారణలో మొదట వెంకటలక్ష్మిని గుర్తించాము. తర్వాత కాంత్రితో వెళ్తున్నట్లు తన తల్లి చెప్పిందని కొడుకు పోలీసులకు చెప్పారు. ఆ కోణంలో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. -
పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. కాగా, అనారోగ్య కారణాలు చూపెట్టడంతో షకీల్‌కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో.. సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే అభియోగాలు ప్రధానంగా ఉన్నాయి.2023 డిసెంబర్ 23వ తేదీ రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన కారు అక్కడి ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలో అసలు సంగతి బయటపడింది.బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారును నడపగా.. అతన్ని తప్పించేందుకు షకీల్ తన ఇంటి పని మనిషి ఆసిఫ్‌పై కేసు నమోదు చేయించారు. దీంతో సాహిల్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు మార్చారు. అటుపై పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు పై సస్పెన్షన్ వేటు పడింది కూడా. -
పక్కా ప్లాన్ తోనే అరెస్ట్.. బట్టబయలైన కూటమి సర్కార్ కుట్ర
-
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
వరంగల్ క్రైం : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోపాటు తనను గతంలో సస్పెండ్ చేయించాడనే కోపంతో సామాజిక కార్యకర్త ఛిడం సాయి ప్రకాశ్‌ను హత్య చేసిన కేసులో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాçపురం(ఎం) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్ గతంలో వెంకటాçపురం(కె) పోలీస్ స్టేషన్లో విధులు నిర్వరిస్తున్న క్రమంలో ఓ భూమి విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చింతం నిర్మలతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై నిర్మల భర్తతో కలిసి మృతుడు సాయి ప్రకాశ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ను సస్పెన్షన్ చేశారు. ఫోన్ సమాచారంతో కిడ్నాప్.. హత్యఈనెల 15వ తేదీన నిందితురాలు నిర్మల, ఆమె భర్తతో కలిసి మృతుడు సాయిప్రకాశ్ తన కారులో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయన్ని నిర్మల.. నిందితుడు శ్రీనివాస్‌కు ఫోన్లో తెలియజేయడంతో ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి రాత్రి 11.30 గంటల సమయంలో గోపాల్‌పూర్‌లోని బేబిసైనిక్ స్కూల్ వద్ద కారును ఆటోతో ఢీకొట్టించాడు. అనంతరం సాయి ప్రకాశ్‌ను కారులోనే కిడ్నాప్ చేసి హసన్‌పర్తి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి శాలువతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్ పీఎస్ పరిదిలోని జిల్లేడగడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావి లో పడేశారు. అనంతరం వేలేరు మండలం మీదుగా హనుమకొండ ఏషియాన్ మాల్ దగ్గర కారు నిలిపి వేసి వెళ్లారు. నిందితుల అరెస్ట్..ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్‌తో పాటు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన డేవిలిసాయి, హనుమకొండకు చెందిన అలోతు అరుణ్‌కుమార్ అలియాస్ పండు, బాదావత్ అఖిల్ నాయక్, బాదావత్ రాజు, వాజేడు వెంకటాపూర్‌కు చెందిన చింతం నిర్మలను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఓ కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, పిస్టోల్‌ను స్వా«ధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. అధికారులకు అభినందనలు..సామాజిక కార్యకర్త సాయి ప్రకాశ్ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి, హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు. -
పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్: ఏలూరు డీఐజీ
ఏలూరు, సాక్షి: పాస్టర్ ప్రవీణ్ పగడాల(Pastor Praveen Pagadala) మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్‌స్టాప్ పెట్టారు. మద్యం మత్తులో బైక్ నడిపి కింద పడిపోవడం వల్లే ప్రవీణ్ ప్రాణాలు పొగొట్టుకున్నారని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్(Ashok Kumar) వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాకు వివరించారు.హైదరాబాద్ నుంచి పాస్టర్ బైక్ మీద బయల్దేరారు. ఆయన ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ వివరాలు అన్నీ సేకరించాం. ఒక్క రామవరప్పాడు జంక్షన్ వద్ద సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. పాస్టర్ ఆరోజు ఎవరెవరితో మాట్లాడారో గుర్తించాం. పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా విచారించాం. ఆయన్ని హత్య చేశారని, అనుమానాస్పద మృతి అని రకరకాల ప్రచారాలు చేశారు. సోషల్ మీడియాలో అలా దుష్ర్పచారం చేసినవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం.అరోజు ప్రవీణ్ కుమార్ వస్తున్నారని కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. మార్గమధ్యలో ఆరుగురితో పాస్టర్ ప్రవీణ్ మాట్లాడారు. మూడు చోట్ల లిక్కర్ కొనుగోలు చేశారు. మద్యం, పెట్రోల్ బంకులలో యూపీఐ పేమెంట్స్ జరిపినట్లు ఆధారాలున్నాయి. మార్గం మధ్యలో ఓ పోలీస్ అధికారి ప్రవీణ్‌తో మాట్లాడారు. మద్యం సేవించడంతో డ్రైవ్ చేయొద్దని వారించారు. అయినా కూడా ఆయన వినకుండా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో మూడు చోట్ల ఆయనకు యాక్సిడెంట్లు అయ్యాయి. ప్రమాదంలో హెడ్ లైట్ డ్యామేజ్ అయ్యిది. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారు.పోస్ట్ మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో (ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్)లో ఆయన మద్యం సేవించినట్లు తేలింది. మరో వాహనంతో ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్‌పై పడింది. తలకు బలమైన గాయమై చనిపోయారని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అని ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ ప్రకటించారు.పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా, క్షుణ్ణంగా పరిశోధించామని ఆయన తెలిపారు. కంకర వల్ల బైక్ స్లిప్ అయి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరే వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టలేదని స్పష్టంగా తేలిందన్నారు. పాస్టర్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాద స్థలం వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే వివరాలు పరిశోధించి తెలుసుకున్నామని ఆయన వివరించారు. -
పాస్టర్ ప్రవీణ్ ఘటనపై ఐజీ సంచలన ప్రెస్ మీట్
-
పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు: ఎస్పీ
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంకా రాలేదని.. అది వచ్చిన తర్వాతే పీఎం రిపోర్టు వస్తుందని ఆయన తెలిపారు. విచారణలో భాగంగా సేకరించిన వీడియో ఫుటేజ్ విశ్లేషణ జరుగుతుందన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వారి కుటుంబ సభ్యులకి ఎవరికీ ఇవ్వలేదని.. అలాంటి ప్రచారాలను నమ్మొద్దన్నారు.పాస్టర్ ప్రవీణ్ మృతి దర్యాప్తుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా సమగ్రంగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు నిర్వహిస్తోందన్నారు. క్రికెట్ బెట్టింగ్‌పై రాజమండ్రిలో ఒక కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశామని.. విచారణ కొనసాగుతోందన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లో ఎవరు కూడా ఇరుక్కోవద్దని ఎస్పీ నర్సింహ కిషోర్ అన్నారు. -
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
చెన్నైకి చెందిన టెక్ బిలియనీర్, రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్(Prasanna Sankar) దంపతులు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తోందని ప్రసన్న శంకర్.. తన భర్తే పెద్ద కా*పిశాచి అని దివ్యా శశిథర్(Dhivya Sashidhar) పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో విడాకులు, భరణం, కొడుకు కస్టడీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ప్రసన్న శంకర్, దివ్య తొలిసారిగా 2007లో కలుసుకున్నారు. 2013లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రసన్న శంకర్, దివ్యల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. భరణం కింద తనకు నెలకు రూ. 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని దివ్య డిమాండ్స్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ప్రసన్నపై దివ్య సంచలన ఆరోపణలకు దిగింది. ది శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్‌కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త కేవలం తనను సెక్స్ కోసమే అన్నట్లు చూసేవాడని తెలిపింది. ‘‘కోరిక తీర్చకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ప్రసవ సమయంలో నొప్పి అనుభవిస్తున్నప్పుడు కూడా నాతో బలవంతంగా సెక్స్ చేశాడు. అతడు వేశ్యలతో సంబంధాలు పెట్టుకునేవాడు. బాత్రూంలో కెమెరాలతో నిఘా పెట్టేవాడు. రోజూవారీ కార్యకలాపాల సమయంలో చిత్రీకరించేవాడు. సంపదపై పన్నులు పడొద్దని నన్ను, నా కొడుకును మరో దేశానికి ఈడ్చుకెళ్లాడు. .. ఒక వేళ నాతో శృంగారంలో పాల్గొనకుంటే, బయటకు వెళ్లి దానిని పొందాలనుకుంటున్నట్లు చెప్పేవాడు. తన స్నేహితులతోనూ పడుకోవాలని ఒత్తిడి చేసేవాడు. అనూప్‌తో తనకు ఉన్న సంబంధం గురించి ప్రసన్న చెప్పేవి అన్ని కల్పితమైనవే. అతడితో నా సంబంధం లైంగికమైనది కాదు. భావోద్వేగమైనది మాత్రమే’’ అని ఆ ఇంటర్వూ్యలో తెలిపారామె. అయితే భర్త ప్రసన్న శంకర్ ఆమెవన్నీ ఆరోపణలే అని ఖండించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీరి కేసు కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది. -
Visakha: ఎట్టకేలకు టీడీపీ మహిళా నేతపై కేసు నమోదు
విశాఖ: ఓ వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో విశాఖ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి గత నెలలో దాడి చేస్తే.. ఇప్పటికి కేసు నమోదైంది. గత నెలలో సర్వసిద్ధి అనంతలక్ష్మి.. ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టింది. అది కూడా పోలీస్ స్టేషన్ లో ఆ వ్యక్తి ఉండగా దాడికి దిగింది టీడీపీ మహిళా నేత అనంతలక్ష్మి. అనకాపల్లికి చెందిన కొత్తూరు నరేంద్రను గాజువాక పోలీస్ స్టేషన్ లో నే చెప్పుతో కొట్టింది. అంతే కాదు.. తనపై కేసు పెడితే బదిలీ చేయిస్తానని అనంతలక్ష్మి బెదిరించింది. అధికారంలో ఉన్నామనే గర్వంతో పోలీసుల్నే భయపెట్టింది. ఇది జరిగి సుమారు నెల అయ్యింది. అయితే దీనిపై ఎట్టకేలకు కేసు నమోదైంది. బీఎన్ఎస్ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు గాజువాక సీఐ పార్థసారధి. ఇంత ఆలస్యం ఎందుకో..?అయితే టీడీపీ నేత కాబట్టి కేసు నమోదు చేయడానికి పోలీసులు అలక్ష్యం ప్రదర్శించారు. కేసును ఏదో రకంగా పక్కదారి పట్టించే యత్నం చేశారు. కాకపోతే అనంతలక్ష్మిపై కేసు ఏమైందని పలువురు పదే పదే ప్రశ్నించడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదైతే చేశారు కానీ, దాన్ని ఎంతవరకూ ముందుకు తీసుకెళతారో అనేది చూడాలి. కాలయాపన చేసి కేసును మాయం చేస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. అదే ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతల విషయానికి వచ్చే సరికి కళ్లముందు తప్పుకనిపిస్తున్నా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు.. ఆ నేతలు ఏం చేస్తున్నా చూస్తూ మిన్నుకుండిపోతున్నారు. అనంతలక్ష్మిపై కేసు నమోదు చేయడానికి సుమారు నెల రోజులు సమయం తీసుకోవడమే ఇందుకు ఉదాహరణ. కేసు అయితే పెట్టాం కదా అని చెప్పుకోవడానికే ఈ తతంగం నడుపుతున్నారా.. లేక నిజంగానే ఆమెపై చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. -
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో చిన్నారుల మృతి కేసులో పురోగతి
-
మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
కృష్ణరాజపురం/ బనశంకరి: బెంగళూరులో ఓ పారిశ్రామికవేత్తను హనీట్రాప్ చేసి ముప్పుతిప్పలు పెట్టి దోచుకున్న ముఠా ఉదంతమిది. కిలాడీ మహిళ ఒక ముద్దుకు రూ.50 వేల చొప్పున వసూలు చేయడం గమనార్హం. ముఠా బెదిరింపులను తట్టుకోలేక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కిలాడీ శ్రీదేవి రుడగి (25), ఆమె ప్రియుడు సాగర్ మోరే (28), రౌడీషీటర్ గణేష్ కాలే (38) లను నగర సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... మహాలక్ష్మి లేఔట్లో ప్రీ స్కూల్ నిర్వహిస్తున్న శ్రీదేవి అసలు నిందితురాలు. ఆమె ప్రీస్కూల్‌కు రాకేష్ వైష్ణవ్ (34) అనే వ్యాపారవేత్త తన పిల్లలను పంపించేవాడు. అలా అతనితో పరిచయం పెంచుకుని స్కూలు నిర్వహణ కోసమని రూ.4 లక్షలను అప్పుగా తీసుకుంది. డబ్బు వాపసు ఇవ్వాలని అడగగా ప్రీ స్కూల్ పార్టనర్ కావాలని కోరింది. చనువు పెంచుకుని కలిసి తిరిగేవారు. కొత్త ఫోను, సిమ్ శ్రీదేవితో మాట్లాడేందుకు కొత్త సిమ్, ఫోన్‌ను రాకేష్ కొనిచ్చాడు. శ్రీదేవి అతనికి ముద్దు పెట్టి రూ.50 వేలు చొప్పున తీసుకుంది. నీతోనే రిలేషన్షిప్లో ఉంటానని చెప్పి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తరచూ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో రాకేష్‌కు విసుగొచ్చి ఆమె సిమ్‌ను విరగ్గొట్టి పారేశాడు. టీసీ ఇస్తామని పిలిచి కిడ్నాప్ రాకేష్ ఆమె సూచన మేరకు మార్చి 12న పిల్లలకు టీసీని తీసుకునేందుకు ప్రీ స్కూల్‌కు వచ్చాడు. అప్పుడు శ్రీదేవితో పాటు నిందితులు సాగర్ మోరే, గణేష్ కాలే ఉన్నారు. వారు రాకేష్ పై దాడి చేసి, సాగర్‌తో శ్రీదేవికి నిశ్చితార్థం అయ్యింది. నువ్వు ఆమెతో మజా చేస్తున్నావా? ఈ సంగతిని శ్రీదేవి తండ్రికి, నీ భార్యకు చెబుతానంటూ రాకేష్‌ను బ్లాక్మెయిల్ చేశారు. పోలీసు స్టేషన్‌కు వెళ్దాం పద అంటూ రాకే‹Ùను ఎక్స్‌యూవీ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఇంతటితో వదిలేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని రాకే‹Ùను ఒత్తిడి చేశారు. చివర రూ.20 లక్షలు ఇస్తే చాలని డిమాండ్ చేశారు. ఆఖరికి రూ.1.90 లక్షలు తీసుకుని వదిలేశారు. నిందితులు బిజాపురవాసులు శ్రీదేవి విద్యార్థుల తండ్రులను తీయని మాటలతో మోసపుచ్చి వలలో వేసుకునేదని, ముద్దు ఇస్తే రూ.50 వేలు ఇవ్వాలనే షరతుతో సల్లాపాలు నడిపేదని వెలుగులోకి వచ్చింది. నిందితులు ముగ్గురూ విజయపుర (బిజాపుర) జిల్లా నివాసులు. ఉపాధి కోసం బెంగళూరుకు వలసవచ్చి చాతుర్యాన్ని ప్రదర్శించారు. రౌడీ గణేశ్ కాలేపై బెదిరింపులు, దోపిడీ, హత్యాయత్నం వంటి 9 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కిలాడీలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి పోలీస్‌కస్టడీకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. దర్యాప్తులో మరిన్ని హనీట్రాప్ బాగోతాలు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. నగరంలో ఈ హనీట్రాప్ దందా సంచలనం కలిగిస్తోంది. ఈమె బారిన మరికొందరు పడి ఉంటారని అనుమానాలున్నాయి.మళ్లీ బ్లాక్‌మెయిలింగ్ మార్చి 17న మళ్లీ రాకేష్ కు శ్రీదేవి ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇవ్వాలని, అప్పుడే మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు, చాటింగ్‌ను డిలిట్ చేస్తాను, లేకుంటే నీ భార్యకు చూపించి నీ సంసారాన్ని పాడు చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో విసిగిపోయిన రాకేష్ చివరకు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీదేవి, గణేష్, సాగర్లను అరెస్టు చేసి మరింత విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకున్నారు. -
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. నాకు వచ్చిన ఆఫర్స్ మరెవరికీ రావు: బిగ్‌బాస్ ఆదిరెడ్డి
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.అయితే ఇటీవల టాలీవుడ్లో ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బుల్లితెర నటీనటులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు పోలీసుల ఎదుట హాజరై వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి సైతం పోలీసులను ఆశ్రయించారు.నా పేరుతో టెలీగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఆదిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రూపుతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అందుకే ఎస్పీని కలిసి పీఎస్‌లో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తనకు వచ్చిన బెట్టింగ్ యాప్ ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించినట్లు ఆదిరెడ్డి వివరించారు. ఎవరూ కూడా దయచేసి బెట్టింగ్ ఆడొద్దని తన ఫాలోవర్స్‌కు సూచించారు.అయితే గతంలో తాను చేసిన ఫాంటసీ యాప్స్ మన ఇండియాలో లీగల్‌గానే చేశారని తెలిపారు. ఫాంటసీ యాప్స్ కుడా ఆంధ్రా, తెలంగాణలో ఓపెన్ చేయొచ్చు.. కానీ కేవలం ఫ్రీ లీగ్స్ మాత్రమే అడేందుకు మాత్రమే వీలవుతుందని వెల్లడించారు. అయితే ఇండియా మొత్తంలో లీగల్ ఫాంటసీ యాప్‌ను కూడా 9 నెలల క్రితమే ఆపేశానని ఆదిరెడ్డి వివరించారు . బెట్టింగ్ చేయాలి అనుకుంటే.. నాకు వచ్చిన అన్నీ ఆఫర్స్ ఎవరికి రావు అని అన్నారు. అవకాశం ఉన్నప్పటికీ తాను ఆ పని చేయలేదని పేర్కొన్నారు. 2020 తర్వాత నేను ఫాంటసీ యాప్స్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు.. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెట్టుబడి పెట్టమని ఎవ్వరికీ చెప్పలేదని వెల్లడించారు. అయితే ఆంధ్ర, తెలంగాణలో ఫాంటసీ యాప్‌లలో కేవలం ఉచిత లీగ్‌లు మాత్రమే ఆడగలరు.. కానీ ఇతర రాష్ట్ర ప్రజలు ఫాంటసీ లీగ్స్ ఆడే అనుమతులు ఉన్నాయని బిగ్‌బాస్ ఆదిరెడ్డి పేర్కొన్నారు. -
ఇదేం గ్యాంగ్ రేప్ కేసు కాదు.. ఆర్జీకర్ ఘటనపై సీబీఐ
కోల్‌కతా: సంచలన ఆర్జీకర్ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కోల్‌కతా హైకోర్టుకు తన నివేదిక సమర్పించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెబుతూనే.. సామూహిక హత్యాచారం జరిగిందన్న వాదనను తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో యువ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని తాజాగా సీబీఐ ధృవీకరించింది. -
పార్లమెంట్లో చంద్రబాబు ఐటీ నోటీసుల కేసు ప్రస్తావన
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై గతంలో దాఖలైన ఐటీ నోటీసుల కేసు(IT Notices Case) ప్రస్తావన ఇవాళ పార్లమెంట్లో వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు ఎంత దాకా వచ్చిందని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక శాఖను గురువారం ఆరా తీశారు. ఫైనాన్స్ బిల్లు పై చర్చ సందర్భంగా ఆయన ఈ కేసుకు సంబంధించిన కీలక పాయింట్లను ప్రస్తావించారు. చంద్రబాబు(Chandrababu) పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి బోగస్ కాంట్రాక్టుల రాకెట్ నడిపారు. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఇన్వాయిస్లు సృష్టించారు. బోగస్ ఇన్వాయిస్ల ద్వారా రూ.2,000 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీం ప్రాజెక్టుల నుంచి కొల్లగొట్టిన డబ్బును చంద్రబాబుకు అందజేశారని ఐటీ సోదాలలో మనోజ్ వాస్తవ అనే వ్యక్తి అంగీకరించాడు. ఈ డబ్బును పీఎస్ సాయి శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా అందించినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత అతను అమెరికాకు పారిపోయాడు. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి వచ్చాడు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. మరి ఆ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది?. ఈ కేసుపై కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి చర్యలు తీసుకుందో వెల్లడించాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) కేంద్రాన్ని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంటోంది. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు. వైఎస్సార్ దీనికి శంకుస్థాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల.. స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తగిన నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) పునరుద్ధరణకు అవసరమైన నిధులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాట్ ను పరిరక్షించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి అని వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. -
ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట
సాక్షి,విజయవాడ: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. మద్యం కేసులో తొందరపాటు చర్యలొద్దని సూచించింది. ఏప్రిల్ 3 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. -
వెంటాడి వేటాడి..తండ్రిని చంపించిన కన్న కూతురు
సూర్యాపేటటౌన్: గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించాడు సొంత అల్లుడు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో 13 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్ల డించారు. చక్రయ్యగౌడ్ ఆధిపత్యం సహించలేక..మెంచు చక్రయ్యగౌడ్ గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశాడు. అతడికి ఐదుగురు కుమార్తెలు సంతానం. తన మూడో కుమార్తె కనకటి సునీతను కూడా సర్పంచ్‌గా, మూడో అల్లుడు కనకటి వెంకన్నను పీఏఏసీఎస్ చైర్మన్‌గా చేశాడు. అల్లుడు కనకటి వెంకన్న పీఏసీఎస్ చైర్మన్ అయిన్నప్పటి నుంచి నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం ఉండటం వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. చక్రయ్యగౌడ్కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023లో చక్రయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో కనకటి వెంకన్న కూడా కాంగ్రెస్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఎలాగైనా మామ చక్రయ్యగౌడ్ను అడ్డు తొలగించుకోవాలని కనకటి వెంకన్న నిర్ణయించుకున్నాడు.బొడ్రాయి మహోత్సవంలో హత్యకు పథకం.. ఈ నెల 13న మిర్యాల గ్రామంలో బొడ్రాయి మహోత్సవం జరిగింది. గతంలో కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగేవి, చక్రయ్యగౌడ్ ఈసారి ఉత్సవాలను తన ఆధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా చక్రయ్యగౌడ్ను హత్య చేయాలని తన వర్గీయులను కొంతమందిని వెంకన్న పురమాయించాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం చక్రయ్యగౌడ్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదో అల్లుడు కనకటి లింగయ్యతో పాటు వెంకన్న అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ అడ్డగించి మారణాయుధాలు, వెదురు కరల్రతో చక్రయ్యగౌడ్పై దాడి చేసి హత్య చేశారు. ఇదంతా దూరంగా నుంచి గమనిస్తున్న వెంకన్న చక్రయ్యగౌడ్పై దాడి జరిగగానే అతడు చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ హత్యపై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడో అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదో కుమార్తె కనకటి కల్యాణితో పాటు దిండిగల నగేశ్, జక్కి పరమేష్, మన్నెం రమేశ్, కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్న, కనకటి శ్రావ్య, కనకటి/వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, భారీ సతీష్ రెండు కార్లలో వెళ్తుండగా పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. చక్రయ్యగౌడ్ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక కర్ర, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 42 మందిపై కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితుల్లో కనకటి ఉప్పలయ్య మినహా మిగతా ఆరుగురు గతంలోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.కస్టడీ పిటీషన్ వేసి దర్యాప్తు చేస్తాంఈ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టకుండా కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు పారదర్శకంగా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ కేసు ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ డి. శ్రీను, ఎస్ఐలు మహేంద్రనాథ్, ఎం. వీరయ్య, ఆర్. క్రాంతికుమార్‌ను ఎస్పీ అభినందించారు. -
అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో మంగళవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారని.. ఆ 10 మందిపై అనర్హత వేటు విషయంలో తెలంగాణ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, కాబట్టి అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్(BRS) తరఫున ఈ జనవరిలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటోంది. మంగళవారం వాదనలు మొదలవ్వగానే.. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ సంగతిని స్పీకర్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో స్పీకర్‌ను ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందా? లేదంటే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? అని కోరారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫిర్యాదులపై ఏం చేస్తారో.. 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా పార్టీ మారిన వారికి స్పీకర్ నోటీసులు ఇవ్వలేదు. ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారు. 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని.. ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికి 3 వారాలైంది.. నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదు. మేము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదు’’ అని సుందరం వాదించారు. బీఆర్ఎస్ వాదనలు.. కీ పాయింట్స్ 2024 మార్చి 18న మొదట ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్ ఫిర్యాదు చేశాంమొదటి ఫిర్యాదు చేసినా నోటీసులు ఇవ్వలేదుహైకోర్టుకు వెళ్లేంత వరకు కూడా నోటీసులు ఇవ్వలేదురీజనబుల్ టైంలోనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పిందిహైకోర్టు చెప్పినా ఎలాంటి చర్యలు లేవుదానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసినా.. ఆయనకు నోటీసులు ఇవ్వలేదుదానం ఎంపీగా పోటీ చేసినా చర్యల్లేవ్‌కడియంకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా.. చర్యలు లేవ్‌అనర్హత పిటిషన్ విచారణపై షెడ్యూల్ చేయాలని.. హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చిందిస్పీకర్ 7 రోజుల సమయం ఇస్తూ నోటీసులు ఇచ్చారుముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేరకంగా సమాధానం ఇచ్చారుపార్టీ మారినవాళ్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారుముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ప్రచారం చేశారునోటీసులు ఇచ్చామని స్పీకర్ అంటున్నారు.. కానీ, ఆ కాపీలు మాకు అందజేయలేదుస్పీకర్ అధికారాలు సైతం న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటాయిన్యాయ సమీక్షకు స్పీకర్ అతీతులు కాదుఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయంపై నిర్దిష్టమైన గడువు విధించాలినాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలిఈక్రమంలో స్పందించిన జస్టిస్ గవాయ్.. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులు ఉన్నప్పటికీ.. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంపైనే స్పష్టత కొరవడిందని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది.ధర్మాసనం ఇంకా ఏమందంటే..ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది?: ధర్మాసనంఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దుఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు వచ్చి ఎంతకాలమైంది?రీజనబుల్ టైం అంటే గడువు ముగిసేవరకా?మొదటి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత టైం గడిచింది.నాలుగు వారాలైనా షెడ్యూల్ ఫిక్స్ చేయలేదా?అదృష్టవశాత్తూ.. ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదుమూడు వారాల సమయం విషయంలో మాత్రం స్పీకర్ రీజనబుల్‌గా ఉన్నారుతెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పులో డివిజన్ బెంచ్ జోక్యం సరైందో కాదో చూస్తాం?కౌంటర్ దాఖలుకు ప్రతివాదులు మరింత సమయం కోరగా.. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలి బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు.. స్పీకర్ తరఫున సోమవారం(మార్చి 24వ తేదీన) అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్లో.. ‘‘రీజనబుల్ టైం అంటే గరిష్టంగా మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. .. అనర్హత పిటిషన్ లను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్ కే ఉంది. గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే....పిటీషనర్లే దురుద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. కాబట్టి ఈ పిటిషన్లను డిస్మిస్ చేయాలి’’ అని కోరారు. 👉కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు(Supreme Court). కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే.. 👉ఈ పిటిషన్లకు సంబంధించి.. కొద్దిరోజుల క్రితం మహిపాల్‌రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్కు తాము రాజీనామా చేయలేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరలేదని.. మీడియాలో వచ్చిన వార్తలలో నిజం లేదని.. కాబట్టి ఈ అనర్హత పిటీషన్లకు విచారణ అర్హత లేదని వాటిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉన్న ఫొటోలు, పోస్టర్లను, తమ ఫొటోలతో కూడిన పార్టీ ఫ్లెక్సీల ఫొటోలనూ అఫిడవిట్లో జత చేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో తెలంగాణ స్పీకర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. గత విచారణలో.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదన్న పేర్కొంది. -
‘రెండు కిలోల వెల్లుల్లి, రూ. 500 తెస్తేనే కేసు దర్యాప్తు’
ముజఫర్‌పూర్: అవినీతికి పాల్పడుతున్న పోలీసులకు సంబంధించిన ఉదంతాలను మనం అప్పుడప్పుడూ వింటుంటాం. ఇటువంటి ఘటనలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందిస్తూ, అవినీతికి పాల్పడిన పోలీసులను సస్సెండ్ చేస్తుంటారు. అయితే బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పోలీసుల అవినీతి బాగోతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముజఫర్‌పూర్ పరిధిలోని మీనాపూర్ పోలీస్ స్టేషన్(Meenapur Police Station)కు వచ్చిన వృద్ధ దంపతులకు చేదు అనుభవం ఎదురయ్యింది. తమ కుమారుడు తప్పిపోయాడని, అతనిని వెదికిపెట్టాలంటూ వచ్చిన ఆ వృద్ధ తల్లిదండ్రుల విషయంలో పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తమ కుమారుడిని వెదికి పెట్టాలంటే రెండు కిలోల వెల్లుల్లి, ఐదు వందల రూపాయలు ఇవ్వాలని స్టేషన్ ఇన్స్పెక్టర్ డిమాండ్ చేస్తున్నారని ఆ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. కేసు ఇన్ఫార్మర్ యోగేంద్ర భగత్ మీడియాతో మాట్లాడుతూ ఆ దంపతుల ఏకైక కుమారుడు అజిత్ కుమార్ సిటీకి వెళ్లిన తరువాత అదృశ్యమయ్యాడన్నారు. మీనాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, కానీ ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదన్నారు.బాధిత దంపతులు మీడియాతో మాట్లాడుతూ తాము స్టేషన్‌కు వెళ్ళినప్పుడల్లా పోలీసు అధికారులు(Police officers) తమను దూషిస్తూ, అక్కడి నుండి తరిమివేస్తుంటారని చెప్పారు. పోలీస్ ఇన్స్పెక్టర్ రెండు కిలోల వెల్లుల్లి, రూ.500 ఇస్తే కేసు దర్యాప్తు చేస్తామని చెబుతున్నారన్నారు. మా ఇంట్లో 50 గ్రాముల వెల్లుల్లి కూడా లేదని, అలాంటప్పుడు తాము రెండు కిలోల వెల్లుల్లిని ఎలా ఇవ్వగలమని బాధిత తండ్రి వాపోయాడు. తాజాగా బాధిత కుటుంబం బీహార్ మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేసింది. ఈ సందర్భంగా మానవ హక్కుల న్యాయవాది మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును పరిష్కరించడానికి బదులుగా, మరింత క్లిష్టతరం చేస్తున్నారని అన్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. పోలీసులు ఈ కేసును దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే సీఐడీ దర్యాప్తు ఖచ్చితంగా అవసరమని అన్నారు.ఇది కూడా చదవండి: ‘డాన్స్ కోసం పుట్టి.. ప్రొఫెసర్ అయ్యారు’ -
‘వంద కేసులను, వెయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొంటా’
సాక్షి,అమరావతి : వంద కేసులను, వేయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ మాజీ మంత్రి విడదల రజిని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో.. ‘మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు. వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు. ఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధం.నా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా.నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి’ అని పేర్కొన్నారు. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలువ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులుఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధంనా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం నేను ఎదురు…— Rajini Vidadala (@VidadalaRajini) March 23, 2025 -
HYD: గురుశిష్యులు అరెస్ట్.. యాసిడ్ దాడి కేసులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: ఐఎస్ సదన్‌లో కలకలం సృష్టించిన ఆలయంలో ఉద్యోగిపై యాసిడ్ దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. యాసిడ్ దాడి కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించారు.గురువును వేధిస్తున్నాడనే కారణంగా శిష్యుడు యాసిడ్‌తో దాడి చేశారు. సైదాబాద్ ఆలయంలో ప్రధాన పూజారిగా ఉన్న రాజశేఖర్ శర్మను అకౌంటెంట్ నర్సింగరావు వేధిస్తున్నాడని జాబ్లీహిల్స్ టీటీడీ ఆలయ పూజారి హరనాథ్ శర్మ.. యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. గురుశిష్యులు హరనాథ్ శర్మ, రాజశేఖర్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారుశుక్రవారం ఆలయంలో విధుల్లో ఉన్న ఎకౌంటెంట్ నర్సింగరావుపై యాసిడ్ దాడి జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై సీసీ టీవీ పుటేజ్ ద్వారా విచారణ చేపట్టారు. బాధితుడు నర్సింగరావుతో కొంత కాలంగా ఆలయ పూజారితో విభేదాలు ఉన్నాయని సమాచారం. -
Ranya Rao : మరో బిగ్ షాక్.. రన్యారావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
బెంగళూరు : కన్నడ నటి రన్యారావు (Ranya Rao) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో అక్రమంగా బంగారం (Gold) తరలిస్తూ పట్టుబడిన రన్యా రావుకు బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టు (Court for Economic Offences) ఆమెకు బెయిల్ తిరస్కరించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావు బెంగళూరు ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె వెనక గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ ఉందనే అనుమానం వ్యక్తం చేసింది. .డీఆర్ఐ అధికారుల విచారణ ముమ్మరంఇటీవల బెంగళూరు ఎయిర్ పోర్టులో రూ.12.56కోట్లు విలువైన గోల్డు బార్స్‌ని స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడిన కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI)దర్యాప్తు అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రన్యారావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2.06కోట్లు విలువ చేసే బంగారం, రూ.2.67కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. రన్యారావు కేసులో భర్త?ఈ క్రమంలో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సైతం కేసు విచారణ చేపట్టారు. రన్యా రావు తన భర్త జతిన్ హుక్కేరి క్రెడిట్ కార్డును ఉపయోగించి బెంగళూరు నుండి దుబాయ్‌కు రౌండ్ ట్రిప్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అతని పాత్ర ఎంత? అనే దిశగా విచారణ ప్రారంభించారు. రన్యారావు భర్తకు తాత్కాలిక ఊరటడైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) బెంగళూరులోని హుక్కేరికి చెందిన పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఇదే కేసులో డీఆర్ఐ అధికారులు తనని అరెస్ట్ చేయకుండా ఉండేలా ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం హుక్కేరీని అరెస్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.రన్యారావుకు ఫోన్ చేసింది ఎవరు?డీఆర్ఐ విచారణలో రాన్యా రావుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. సదరు అగంతకులు రన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని ఆదేశించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రన్యారావును విచారించగా.. యూట్యూబ్‌లో చూసి బంగారం అక్రమంగా ఎలా తరలించాలో నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఇక ఆమెను దుబాయ్ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ 3 aగేటు సమీపంలో ఓ వ్యక్తి వద్ద గోల్డ్‌ను తీసుకున్నానని, అంతకుముందు గోల్డ్ స్మగ్లింగ్ చేయలేదని చెప్పినట్లు సమాచారం. -
Amrutha Pranay case : చివరికి మిగిలిందేమిటి?
రామ నామ జపముచే మున్ను వాల్మీకి, / బోయడయ్యు బాపడయ్యే! / కులము ఘనము కాదు గుణమే ఘనమ్మురా / విశ్వదాభిరామ వినురవేమ! అని వేమన వందల సంవత్సరాల క్రితమే చెప్పినప్పటికీ ఈనాటికీ ఆ పద్య భావం పెడచెవిన పెట్టబడుతోంది. వేమన, కులం కాదు ‘గుణమే’ ముఖ్యమన్నాడు. ‘మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను‘ అని గురజాడ అన్నారు. ఇవేమీ పట్టించుకోని మిర్యాలగూడకు చెందిన అమృత తండ్రి మారుతీరావు 2018లో దళితుడైన ఆమె భర్త ప్రణయ్ (Pranay Perumalla)ను పాశవికంగా పరువు పేరుతో హత్య చేయించాడు. ఇలాంటివారు దేశమంతా ఎందరో ఉన్నారు. ఆరేళ్ల తర్వాత నల్లగొండ జిల్లా సెషన్స్ కోర్ట్ ఇచ్చిన తీర్పు... మనిషి కంటే కులమే గొప్పదని నమ్మే హైందవ నాగరాజులకు చెంప దెబ్బనే చెప్పాలి. ఈ అంశం సమాజానికి ఎన్నో విషయాలను మరోసారి బహిర్గతం చేసింది. మరీ ముఖ్యంగా తల్లి దండ్రులు–పిల్లల బాంధవ్యాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేదాన్ని సుస్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో రచయిత డా‘‘ స్టీఫెన్ ఆర్... ఒక పనిని ప్రారంభించే ముందు, దాని ముగింపును దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. అమృత తండ్రి మారుతీరావులో మొదలైన అల్లుణ్ణి హత్య చేయించాలనే ఆలోచన నేడు కొన్ని కుటుంబాల శోకానికి కారణమైంది. కన్న కూతురిపై అపారమైన ప్రేమను పెంచు కున్న మారుతీ రావు జీవితాన్ని కోల్పోయాడు. అతని భార్య భర్తను కోల్పోయింది. అతని కూతురు తండ్రిని కోల్పోయింది. ఇటు అమృత భర్తను కోల్పోయింది. ఆమెకు పుట్టిన బిడ్డకు కన్నతండ్రి లేకుండా పోయాడు. మొదటి ముద్దాయికి ఉరిశిక్ష ఖరారుఅయింది. మిగిలిన వారికి జీవిత ఖైదు విధించబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ శూన్యమే మిగిలింది. చదవండి : Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్‌లో హరేన్ పాండ్యా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అస్గర్ అలీ ఈ కేసులో కూడా నిందితుడు కావడం సామాన్య మనిషికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి వ్యక్తులకు అసలు బెయిల్ మంజూరు కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ‘పరువా, కులమా... మీ చిరునామా ఎక్కడ’ అంటూ వెతికితే... దానికి సాహిత్యకారుల రచనల్లో సమాధానం దొరుకుతుంది. ‘ఎంచి చూడగా మనుజులందున మంచి– చెడులు అను రెండే కులములు’ అన్నాడు మహాకవి. సాటి మనిషిని మనిషిగా చూడలేని మనిషి మనోమందిరాలు ‘అపరిశుభ్ర విసర్జన శాలలుగానే’ మిగిలిపోతాయి. దీని ప్రక్షాళనకై అంతరంగ పారిశుద్ధ్య కార్మికులు కావాలి.– డా. ఉడుము ఝాన్సీ తెలుగు అధ్యాపకురాలు, ఆర్జీయూకేటీ, నూజివీడు -
స్మగ్లింగ్ ఇదే మొదటిసారి!
బనశంకరి: బంగారం తీసుకు రావడం ఇదే మొదటిసారి.. అని విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన రన్య రావు(Ranya Rao) డీఆర్ఐ అధికారుల విచారణలో చెప్పింది. మార్చి 1వ తేదీన నాకు విదేశీ ఫోన్ నంబరు నుంచి కాల్ వచ్చింది. రెండు వారాలుగా గుర్తుతెలియని విదేశీ నంబర్ల నుంచి అనేక కాల్స్ వస్తున్నాయి. దుబాయ్ విమానాశ్రయం టెర్మినల్ మూడోగేట్–ఏ కు వెళ్లాలని సూచించారు. అక్కడ బంగారం తీసుకుని బెంగళూరుకు తీసుకెళ్లాని చెప్పారు. మార్చి 3వ తేదీన దుబాయ్‌లో తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తి 17 బంగారు బిస్కెట్లు ఉన్న బాక్సు ఇచ్చాడు. బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లిన తరువాత టోల్‌గేటు దాటి సర్వీస్ రోడ్డులో ఆటో నిలిచి ఉంటుంది. అందులో ఉండే వ్యక్తికి బంగారం ఇవ్వాలని చెప్పారని ఆమె తెలిపింది. తరువాత టాయ్లెట్లోకి వెళ్లి శరీరమంతా బంగారు బిస్కెట్లు అంటించుకుని టేప్‌తో అతికించుకున్నాను. బెంగళూరుకు చేరుకోగానే పట్టుబడ్డానని తెలిపింది. బంగారాన్ని ఎలా తరలించాలో యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నానని పేర్కొంది. భర్త క్రెడిట్ కార్డుతో టికెట్లు ఫోన్ చేసిన వ్యక్తులు ఆఫ్రికన్, అమెరికన్ భాషల్లో మాట్లాడారని రన్య చెప్పింది. తన భర్త జతిన్ విజయ్‌కుమార్ క్రెడిట్‌కార్డు ద్వారా విమాన టికెట్లు బుక్ చేశానని రన్య చెబుతోంది. ఫోటోగ్రఫీ, రియల్ఎస్టేట్ పనులపై నేను అప్పుడప్పుడు యూరప్, అమెరికా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లానని తెలిపింది. రన్య చెప్పేది నమ్మశక్యంగా లేదని డీఆర్ఐ అనుమానిస్తోంది. ఆమె మొబైల్, ల్యాప్‌టాప్‌లో స్మగ్లింగ్ సంబంధాలు లభించాయని సమాచారం. మరోవైపు తనపై మీడియాలో వ్యతిరేక వార్తలు రాయకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టులో అర్జీ వేశారు.Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్ -
‘స్వార్గేట్’ కేసు : నిందితుడి పోలీసు కస్టడీ పొడిగింపు
‘స్వార్గేట్’అత్యాచారం కేసు నిందితుడికి కోర్టు మార్చి 26 వరకు పోలీసు కస్టడీ విధించింది. 12 రోజుల పోలీసు కస్టడీ అనంతరం గడేను బుధవారం కోర్టులో హాజరు పరిచాం. కస్టడీని పొడిగించాలని కోర్టుకు విన్నవించాం. ఈమేరకు మార్చి 26 వరకూ నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ’అని క్రైంబ్రాంచ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముందే క్రిమినల్ నేపథ్యం ఫిబ్రవరి 25 తెల్లవారుజామున స్వార్గేట్ టెర్మినస్ వద్ద ఎమ్మెస్సార్టీసీ బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దత్తాత్రాయ్ గడే అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. బాధితురాలు ఫిబ్రవరి 25 తెల్లవారుజామున సతారా జిల్లాలోని తన స్వస్థలానికి వెళ్లేందుకు స్వార్గేట్ బస్టాండ్‌లో వేచి ఉండగా బస్కండక్టర్నని చెప్పి గాడే ఆమెను అప్పటికే అక్కడ ఉన్న బస్సులో ఎక్కాల్సిందిగా కోరాడు. ఈమేరకు బాధితురాలు బస్సులోపలికి వెళ్లగా గాడే రెండు తలుపులూ మూసివేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం డ్రోన్లు స్నిఫర్ డాగ్‌ల సహాయంతో శిరూర్ తహసీల్ పరిధిలో తన స్వస్థలం గుణత్ గ్రామానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గడేను పట్టుకున్నారు. అతడిపై ఇప్పటికే అరడజను క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. -
Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!
సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో వెలువడిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ తీర్పు కూడా అంతే పంచలనంగా మారింది. సుదీర్ఘ వాదనల అనంతరం నేడు (మార్చి10) తుది తీర్పు వెలువరించింది. కేసులో A2 నిందితుడిగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. దీనిపై ప్రజా సంఘాలు, నేతలు స్పందించారు. ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృతకు న్యాయం కావాలని పోరాటం చేసిన ప్రజా ఉద్యమకారులు ఈ తీర్పును ఆహ్వనించారు. ముఖ్యంగా ప్రగతిశీల మహిళాసంఘం జాతీయ కన్వీనర్ సంధ్య తాజా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పుపై వీ సంధ్య స్పందిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న కుమార్తె భర్తను కిరాయి హంతకులతో అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఇది అని గుర్తు చేశారు. ఈ కేసులో రెండో ప్రధాన నిందితుడిగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష సరైనదేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ప్రజాఉద్యమాలు, ప్రజా పోరాటాల గెలుపు అని పేర్కొన్నారు. అలాగే అత్యంత క్రూరమైన హత్యలు, దౌర్జన్యాల పట్ల, పోలీసులు కోర్టులు స్పందించాల్సిన ఇలాంటి వైఖరి ఇదేనని ఆమె స్పష్టం చేశారు. పోలీసులు అధికారులు, న్యాయవ్యవస్థ చిత్తశుద్ధిగా పనిచేస్తే వచ్చే ఫలితాలకు, తీర్పులకు ఈ తీర్పు ఒక నిదర్శనమన్నారు. ఈ కేసులో నిర్వహించినట్టుగానే అన్ని కేసుల్లోనూ పకడ్బందీ విచారణలు అవసర మన్నారు. దిశ కేసులో జరిగినట్టుగా ఎలాంటి విచారణలు, సాక్ష్యాలు లేకుండా ఎన్కౌంటర్లు కాదు పరిష్కారం, రుజువులు, సాక్ష్యాలతో టెక్నికల్ ఎవిడెన్స్‌తో జరిగే తీర్పులు ఈ సమాజానికి కావాలని సంధ్య పిలుపునిచ్చారు. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే ఆమె తండ్రి మారుతీ రావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు. అయితే ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడు మారుతీరావు (అమృత తండ్రి) 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. A2 సుభాష్ కుమార్ శర్మ, A3 అస్గర్‌అలీ, A4 బారీ, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలు నిందితులుగా ఉన్నారు. వీరంతా బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే సుభాష్‌శర్మ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. అస్గల్ అలీ మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.కాగా ప్రణయ్ హత్యనాటికి గర్భవతిగా ఉన్న అమృత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో ప్రణయ్ తల్లితండ్రులే కోడల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయితే తండ్రి మరణం తరువాత అమృత క్రమంగా తల్లికి దగ్గరైంది. అట అత్తమామలు, ఇటు తల్లితోనూ సన్నిహితంగా ఉంటోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్‌కు ప్రతిరూపమైన తన కొడుకును అంతే ప్రాణంగా పెంచుకుంటోంది. -
వివేకా కేసులో బాబు డ్రామాలు
-
వైఎస్ వివేకా కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కూటమి సర్కారు కుతంత్రం. రంగన్న మరణాన్నీ వాడేసుకుంటున్న వైనం
-
రన్యారావ్ పాత్రధారి మాత్రమే
బనశంకరి: బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్‌ను డీఆర్ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. ఈమె సీనియర్ పోలీస్ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్‌ను బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు కూడా కుమ్మక్కైనట్లు అనుమానం వ్యక్తమైంది.డీఆర్ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. బంగారం రవాణాలో రన్యారావ్‌కు రూ.4 లక్ష లనుంచి రూ.5 లక్షలు కమీషన్ ఇస్తున్నట్లు తెలిసింది. రన్యారావ్ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ మొబైల్‌ను అదికారులు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వీడియో: కర్ణాటకలో దారుణం.. పెళ్లి పేరుతో మైనర్‌ను బలవంతంగా లాక్కెళ్లి..


