సాక్షి నెల్లూరు : కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమెదు చేసింది. ఇటీవల కోవూరు, గుమ్మళ్లదిబ్బలో ఓక మైనర్ బాలిక మృతి చెందింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు మాజీ మంత్రి వెంటనే స్పందించారు.
బాధిత కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించారు. దీంతో మంత్రిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసుల నమోదు చేసి తీవ్ర వేదింపులకు గురిచేస్తున్నారు.


