kakani govardhan reddy
-
తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్ల కిడ్నాప్.. కాకాణి రియాక్షన్
-
మా పార్టీ తరుపున గెలిచిన వాళ్లకు టీడీపీ బీ-ఫారం... డిప్యూటీ మేయర్ ఎన్నికపై కాకాణి కామెంట్స్
-
కార్యకర్తల పార్టీ మార్పులపై కాకాణి కౌంటర్..
-
అరచేతిలో వైకుంఠం.. హామీలతో కనికట్టు.. చంద్రబాబుపై కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు జిల్లా: ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి, హామీలతో కనికట్టు చేసిన దీ గ్రేట్ మోసగాడు నారా చంద్రబాబు ఎట్టకేలకు తన ముసుగు మొత్తం తీసేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం సాక్షిగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కుదరదు అంటూ చాలా స్పష్టంగా చంద్రబాబు తేల్చి చెప్పేశారని అన్నారు. ఎలాంటి సంకోచం, భయం లేకుండా ప్రజలను మోసం చేయగల ఘనుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..సంపద సృష్టించిన తరువాతే హామీల అమలు అని తేల్చేశారుచంద్రబాబు అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్లీ లేపినట్టేనని, పులినోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు మరోసారి నిజం అని చంద్రబాబు నిరూపించుకున్నాడు. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబును, మాట మీద నిలబడ్డ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. జగన్ గారి విశ్వసనీయతను, ఆయన చిత్తశుద్ధి, సంకల్పం ఎంత గొప్పవో మరోసారి ఈ సందర్భంగా అందరూ పోల్చి చూస్తున్నారు. చంద్రబాబు అధికారం నుంచి దిగిబోయే సమయం ఖజానాలో మిగిల్చింది కేవలం రూ.100 కోట్లు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి ఖజానాలో ఉన్న మొత్తం రూ.5000 కోట్లు.అటువంటి నేపథ్యంలో వాస్తవాలను దాచిపెట్టి ప్రజలకు అబద్దాలను నిస్సిగ్గుగా మాట్లాడారు. నిన్న చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను ఒక్కసారి చూస్తే… ‘‘అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మళ్లీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోరో మనీ ఉంటే మోరో క్యాపిటల్ వ్యయం ఖర్చు పెడతాం. మోర్ గ్రోత్ రేట్ వస్తుంది. మోర్ రెవెన్యూ వస్తుంది. సస్టైనబులిటీ వస్తుంది. ఆ సస్టైనబులిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేం చెప్పిన సూపర్ సిక్స్ఇస్తాం. ఇంకా బెటర్‌గా ఇస్తాం. పీ4 తీసుకొస్తాం.’’ ఇదీ నీతి ఆయోగ్ నివేదిక పై ప్రజెంటేషన్‌లో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు.9 నెలల్లో రూ.1.19 కోట్లు అప్పులుప్రభుత్వం ఏర్పాటై దాదాపు 9 నెలలు కావొస్తోంది. ఈ 9 నెలలకాలంలో దాదాపుగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. మరి అప్పులతో ఎక్కడ సంపద సృష్టించారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీకు ఆర్థికంగా ఎక్కడ కలిసి వస్తుందో అవి మాత్రమే చేస్తున్నారన్నది నిజం కాదా? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలను తీసేసి… వారిని రోడ్డు మీదకు పెడుతున్నారన్నది నిజం కాదా? వాలంటీర్లను, గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టులు కుదించడం దగ్గర నుంచి, బెవరేజెస్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ కార్పొరేషన్, ఏపీఎండీసీ, పీల్డ్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ ఇలా ఆయా విభాగాల్లో లక్షలమంది ఉద్యోగులను తొలగిస్తున్నది వాస్తవం కాదా? పైగా జగన్ ఒక ముందుచూపుతో, విజన్ తో సముద్ర తీరం ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ రంగంలోకి మూడు పెద్ద పోర్టులు, హార్బర్లు నిర్మిస్తుంటే.. వాటిని మీ వాళ్లకు తెగనమ్మాలనుకున్నది వాస్తవం కాదా?ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుగా కొన్ని మెడికల్ కాలేజీలను కట్టడంతోపాటు, మరికొన్ని మెడికల్ కాలేజీలను శరవేగంగా నిర్మిస్తుంటే మొత్తంగా జగన్ గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ఇప్పుడు మీ మనుషులకు తెగనమ్మే ప్రయత్నంచేస్తున్న మాట వాస్తవం కాదా? ఇక సంపద సృష్టి ఎక్కడ జరుగుతోంది. సంపదలు ఏమైనా సృష్టిస్తున్నారంటే అది మీకోసం తప్ప, మీ నాయకులకుకోసం, చంద్రబాబునాయుడుగారి మనుషులకోసం తప్ప మరెవ్వరికీ కాదు. ఇసుక, మద్యం మాఫియాలు నడిపి మీ కార్యకర్తల జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, ఫ్లైయాష్ ఇలా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారు.నియోజకవర్గాల్లో ప్రతి పనికీ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే.. ఈరకంగా సంపద సృష్టి మీ వాళ్లకు జరుగుతోంది తప్ప.. పేదలకు, సామాన్యులకు సంపద సృష్టి దక్కడం లేదు. మీ పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ తో రెండు మూడు సినిమాలు తీస్తే.. వారికి వందల ఎకరాలు దోచి పెడుతున్నారు. సంపద సృష్టి అలాంటి వారికి జరగుతోంది తప్ప, రాష్ట్రానికీ, ప్రజలకూ కాదు. అందుకే చంద్రబాబుగారు… సంపద సృష్టి అన్నది వట్టిమాటలేనని చెప్పకనే చెప్పారు. తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనని ముసుగు తీసేసి చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు నెమ్మదిగా, స్లోగా ఎక్కించే ప్రయత్నంచేస్తున్నారు. దాంట్లో భాగమే ఈ కొత్త నివేదికలు.హామీల అమలుకు చంద్రబాబుకు మనసు రావడం లేదుతాను చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వాగ్దానాలను అమలు చేయలేక, ప్రజలకు ఇవ్వడానికి మనసు రాక, వారికి ఇచ్చేలా తగిన రీతిలో పరిపాలన చేయలేక, చేతగాని తనంతో, అసమర్థతతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు, ఆ నేరాన్ని జగన్ గారి మీద నెట్టేయడానికి ఇప్పటికీ కుట్రలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేవేసిన, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభంలో ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడుకున్న ప్రభుత్వం మీద నిందలు వేసి తప్పించుకోవడానికి యత్నిస్తున్నారు. దాంట్లో భాగమే తాజా ఆయన చెప్తున్న నీతి ఆయోగ్ నివేదిక. అసలు నీతి ఆయోగ్ పేరుమీద చంద్రబాబు విడుదలచేసిన రిపోర్టును చూస్తుంటే.. చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.ఒక రాష్ట్రం ఆర్థిక పనితీరు చెప్పాలంటే, ఒక ఏడాదికి, తర్వాత ఏడాదికి పోల్చి చూడ్డం సహజం. అంతే కాకుండా గత పదేళ్లకాలంలో ప్రగతి ఎలా ఉంది? అన్నది ఇయర్ బై ఇయర్ కూడా చూస్తారు. లేదంటో గత ఐదేళ్లతో, తర్వాత ఐదేళ్లతో పోల్చి చూస్తారు. సహజంగా ఎవరైనా చేసే పని ఇది. అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఆయన నేతృత్వంలో పనిచేసిన ప్రభుత్వ పనితీరును ఆయన పనిచేసిన ఐదేళ్లకాలానికి, అంతకుముందు నాయకుడు పనిచేసిన ఐదేళ్లకాలానికి పోల్చిచూస్తారు. ఇద్దరి నాయకుల మధ్య తేడా ఏంటి? ఎవరి పనితీరు ఎలా ఉందో చూస్తారు. పోల్చే విషయంలో సహజంగా పాటించే విధానం ఇది. కాని చంద్రబాబు నాయుడు చూపుతున్న నీతి ఆయోగ్ నివేదికలో చంద్రబాబు దిగిపోయిన 2018-19 ఆర్థిక సంవత్సరంతో, వైయస్ జగన్ గారు పరిపాలించిన ఐదేళ్లకాలంలోని 2022-23 సంవత్సరంతో పోల్చి చూస్తున్నారు. రెండు పరిపాలనా కాలంలో ఎంపికచేసుకున్న రెండు సంవత్సరాల మధ్య పోలిక చూడటం అనే కొత్త పద్దతిని చంద్రబాబు మాత్రమే సిగ్గు లేకుండా ప్రవేశపెట్టారు.మూలధన వ్యయంపైనా అవాస్తవాలుచంద్రబాబు గత పరిపాలనా కాలం అంటే 2014-19 మధ్య కోవిడ్ లాంటి సంక్షోభం ఏమీ లేదు. కాని జగన్మోహన్ రెడ్డిగారి హయాంలో రెండున్నరేళ్లపాటు కోవిడ్ ప్రపంచంమీద దాడిచేసింది. మన దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంక్షోభాన్ని తీసుకు వచ్చింది. ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఉత్పత్తి లేదు, చేసిన వాటిని ఎగుమతి చేసే వీలులేదు, పంపిణీ వ్యవస్థలు లేవు. 2020లో మొదటి వేవ్, 2021లో రెండో వేవ్, 2023లో మూడో వేవ్ ఇలా ఆ రెండున్నర సంవత్సరాలు కూడా కోవిడ్ ప్రపంచంమీద దాడి చేసింది. ఇంతటి సంక్షోభం ఉన్నా దాన్ని ఎదుర్కొంటూ జగన్ మెరుగైన పనితీరు చూపించారు.వాస్తవంగా నీతి ఆయోగ్ రిపోర్టును చూస్తే కేవలం జగన్ గారి హయాంలో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ బాగోలేదని, 13వ స్థానానికి దిగిపోయామని చెప్పారు. అదే నీతి ఆయోగ్ రిపోర్టులో కూడా కోవిడ్ లేని సమయంలో చంద్రబాబు హయాంలో కూడా రాష్ట్రం ర్యాంకు 13 కాగా, ఆ తర్వాత కోవిడ్ లాంటి సంక్షోభం ఎదుర్కొన్న జగన్ ప్రభుత్వంలో కూడా రాష్ట్రం ర్యాంకు 13వ స్థానమే. చంద్రబాబు మూలధన వ్యవయం మీద కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. 2014-19 మధ్య కాలంలో, చంద్రబాబుగారి గడచిన ఐదేళ్లలో మూల ధన వ్యయం కింద సగటున ఏడాది రూ.13,860 కోట్లు ఖర్చుపెడితే, జగన్ గారి హయాంలో కోవిడ్ లాంటి విపత్తు ఉన్నా సరే 2019-24 మధ్య సగటున ఏడాదికి రూ. 15,632 కోట్లు ఖర్చు చేశారు. ఇవి కాగ్ ఇచ్చిన లెక్కులు. మరి ఎవరు ఆర్థిక అరాచకవాదో ప్రజలు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు హయాంలో క్షీణించిన రుణాల లభ్యతలో స్థిరత్వం2024-25 అంటే నడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలలకాలంలో తెచ్చిన అప్పులు వారి లెక్కల ప్రకారమే రూ.73,635కోట్లు కాగా, అందులో మూలధన వ్యయం కింద పెట్టిన ఖర్చు కేవలం రూ.8894.98 కోట్లు మాత్రమే. కోవిడ్ లాంటి విపత్తు ఉన్నప్పుడు జగన్ హయాంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో అంటే 12 నెలల కాలంలో రూ.67,985 కోట్లు అప్పులు తెస్తే, అందులో సుమారుగా రూ.7300 కోట్లు మూలధన వ్యయం చేశారు. ఒక విపత్తు నడుస్తున్న సమయంలో, ఏ పనులు కూడా నడవని సమయంలో చేసిన ఖర్చు ఇది. మరి ఎవరు ఆర్థిక అరాచకవాది?ఒక రాష్ట్రం తానుచేసిన అప్పులు మీద చెల్లించే వడ్డీల వృద్ధిరేటు, జీఎస్డీపీ వృద్ధిరేటు కన్నా అధికంగా ఉంటే రుణాల లభ్యతలో స్థిరత్వం పూర్తిగా క్షీణించినట్టేనని గొప్ప ఆర్థిక నిపుణుడుగా, విజనరీగా తనను తాను ప్రకటించుకునే చంద్రబాబు కొత్త నిర్వచనం చెప్పారు. 2013-14లో విభజిత రాష్ట్రం జీఎస్డీపీ రూ.4,64,272 కోట్లు అయితే, వడ్డీ చెల్లింపులు రూ.7,488 కోట్లు. అదే 2018-19లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.8,73,721 కోట్లు అయితే, వడ్డీల కింద చెల్లింపులు రూ.15,342 కోట్లు. అప్పులపై కట్టే వడ్డీ వృద్ధిరేటు 15.42% కాగా, GSDP వృద్ధిరేటు 13.48%. అంటే చంద్రబాబు తాజాగా చెప్పిన నిర్వచనం ప్రకారం చేస్తే మీ పాలనలోనే రుణాల లభ్యతలో స్థిరత్వం పూర్తిగా క్షీణించిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంత దారుణమైన పాలన అందించిన చంద్రబాబును ఆర్థిక అరాచకవాది అనడం తప్పవుతుందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూటకో మాటఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అప్పులుమీద కూడా చంద్రబాబు చేస్తున్న డ్రామాలు, గిమ్మిక్కులు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం అప్పులు మీద ఇలాంటి ప్రచారం చేశాడు. కాని అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయాడు. 05.04.2022న రాష్ట్రం శ్రీలంక అవుతోందంటూ చంద్రబాబు ప్రకటన చేశారు.17.05.2022న శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో’.. అని చంద్రబాబు పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. 07.04.2024న రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు అని చంద్రబాబు గారి వదినమ్మ పురంధీశ్వరి గారు ప్రకటించారు. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. 21.04.2024న ఎన్నికలకు కొన్నాళ్ల ముందు చంద్రబాబుకు వంతపాడే ఈనాడు దినపత్రిక ఒకాయనను పట్టుకొచ్చి, ఆయన ఆర్థిక నిపుణుడు అని ప్రకటించి ఆయనతో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని చెప్పించారు.అప్పుల లెక్కలపై తన మాటలపైనే చంద్రబాబుకు నిలకడలేదురాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన, అప్పుల పైన ఇంత దారుణంగా ప్రచారంచేసిన చంద్రబాబు మే 29, 2023న రాజమండ్రిలో సూపర్ సిక్స్ అంటూ హామీలను ప్రకటించారు. తర్వాత అధికారంలోకి వచ్చాక తానిచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను మోసం చేయడానికి డబ్బుల్లేవు, కొండల్లా అప్పులున్నాయి, చూస్తే భయమేస్తోందని కథలు చెప్పడం ప్రారంభించాడు. జూలై 10, 2024న ఆర్థికశాఖ పై రివ్యూ చేస్తూ.. రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని లీక్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ తొలి సమావేశాల ప్రారంభం సందర్భంగా జూలై 22, 2024న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ అప్పులు ఉన్నాయని చెప్పించారు.అదే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదలచేస్తూ రాష్ట్రం అప్పులు రూ.12,93,261 కోట్లు ఇది ఆర్ధిక విధ్వంసం అంటూ కొత్త లెక్కలు చెప్పారు. చివరకు అప్పులు మీద తాను చెప్పిన అంకెలు నిజం అని నిరూపించేందుకు చివరకు బడ్జెట్‌ను కూడా వాయిదా వేశాడు. నవంబర్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం అప్పులు రూ.4,91,734 కోట్లు అనిమాత్రమే చూపించాడు.ప్రభుత్వ గ్యారెంటీలకు చెందిన అప్పులు రూ.1,54,797 కోట్లు అంటే ఇవి రెండూ కలిపితే రూ.6,46,531 కోట్లు. అంటే చంద్రబాబు గతంలో అప్పులపై చేసిన ప్రకటనలు అన్నీ అబద్దాలే అని స్పష్టం అయ్యింది.బడ్జెట్ సాక్షిగా చెప్పిన లెక్కలను కూడా కాదంటూ ఇప్పుడు చంద్రబాబు నేటి వరకు మొత్తం అప్పులు రూ.9.75 లక్షల కోట్లు మరో కొత్త లెక్క చెబుతున్నాడు. ఒక్క మాట మీదైనా చంద్రబాబుకు నిలకడ ఉందా? పోనీ చంద్రబాబు అప్పులు తీసుకు రావడంలేదా? అంటే ప్రతి మంగళవారం ఆర్బీఐ తలుపు కొడుతూనే ఉన్నాడు. ఈ తొమ్మిది నెలల కాలంలో అన్నిరకాల అప్పులు కలిపి సుమారు రూ.1.19 లక్షల కోట్లు తెచ్చాడు. వాస్తవం ఏంటంటే.. అప్పులు ఎంత కావాలంటే, అంత తీసుకోవడానికి అనుమతి ఉండదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా అప్పులు తేవాలంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే. చట్టం అనుమతించిన ప్రకారం ఆ రాష్ట్ర జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతం వరకూ మాత్రమే అప్పులు తేవడానికి ఆస్కారం ఉంటుంది. కాని చంద్రబాబు గిమ్మిక్కులు చేసి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు. ఆర్థిక పరిస్థితిపై అబద్దాలు చెప్పి హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. -
‘ వివాదాస్పదంగా జిల్లా కలెక్టర్ నిర్ణయాలు’
నెల్లూరు: జిల్లా కలెక్టర్ ఆనంద్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) ధ్వజమెత్తారు. రెడ్ క్రాస్ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ఆదేశాలను కలెక్టర్ పాటిస్తున్నారని విమర్శించారు.రెడ్ క్రాస్(Red Cross) ప్రాథమిక సభ్యత్వం నుంచి వైఎస్సార్సీపీ(YSRCP) సానుభూతి పరులను తొలగించే అధికారం కలెక్టర్‌కి లేదని స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడిన కాకాణి.. కలెక్టర్ హోదాలో కూర్చొనే అర్హత ఆనంద్ కి ఉందో లేదో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ జాతీయ చైర్మన్ గా బీజేపీ(BJP) ఎంపీనే ఉన్నారని, రాజకీయ నేతలు ఉండకూడదనే నిబంధన ఎక్కడా లేదన్నారు కాకాణి.ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, రెడ్‌క్రాస్ వివాదాస్పదం కాకూడదనే చైర్మన్ పదవికి చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారని, రెడ్ క్రాస్ విలువ పెంచేలా ఆయన వ్యవహరించారన్నారు.‘రెడ్ క్రాస్ హాస్పిటల్ అభివృద్ధి చెందడానికి కారకులు mlc చంద్రశేఖర్ రెడ్డి అని, ఉచితంగా సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ని మంత్రి నారాయణ వాడుకుని సొమ్ము చేసుకోవాలని ూచూస్తున్నారు. మంత్రి నారాయణకి అడ్డుగా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని కావాలనే తొలగించారు. రెడ్ క్రాస్ విషయంలో గత కలెక్టర్లకు రాని ఇబ్బంది, ఇప్పుడు కలెక్టర్‌కి ఏమొచ్చిందో అర్థం కావడం లేదు. రెడ్ క్రాస్ ద్వారా టీడీపీ నేతలే సేవల చెయ్యాలనే ఆలోచనలో కలెక్టర్ ఆనంద్ ఉన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల సభ్యత్వాన్ని రద్దు చేయడంపై న్యాయపోరాటం చేస్తాం’ అని ఆయన తెలిపారు.వైఎస్సార్సీపీ వారి సభ్యత్వమే రద్దు చేయడం దారుణంరెడ్ ్క్రాస్ సంస్థలో వైఎస్సార్సీపీ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తప్పుబట్టారు. నెల్లూరు రెడ్ క్రాస్‌లో ఐదు వేల మంది సభ్యత్వం ఉంటే వాటిలో 90 శాతం మంది పొలిటికల్ ాపార్టీ వారే ఉన్నారని, కానీ వైఎస్సార్సీపీ వారికి మాత్రమే సభ్యత్వం రద్దు చేయడం ాదారుణమన్నారు. మంత్రి నారాయణకు రెడ్ క్రాస్ మీద అవగాహన లేదని, కాబట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.ఆయన కనీసం ఇందులో సభ్యత్వం కూడా తీసుకోలేదన్నారు. నారాయణ మెడికల్ కాలేజ్ లోకీలకంగా ఉండే విజయ్ కుమార్ అనే వ్యక్తిని రెడ్ క్రాస్ లోమెంబర్గా చేర్చి, దాన్ని నాశనం చేయాలని మంత్రి చూస్తున్నారన్నారు. మంత్రి నారాయణ అనుచరులతో కొత్త బాడీని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆనంద్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రశేఖర్‌రెడ్డి. -
కలెక్టర్ పై కాకాణి సంచలన కామెంట్స్
-
ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు: కూటమి సర్కార్‌పై కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ క్యాడర్‌పై కూటమి దాడులు చేస్తున్నారని.. పరామర్శకు వెళ్లిన తనపై అక్రమ కేసు పెట్టడం దారుణమన్నారు.అక్రమ కేసులు, అరెస్టులతో మా గొంతును నొక్కలేరు. టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులపై చర్యలు తప్పవు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాం. నా పై మరిన్ని కేసులు పెట్టడానికి సీఐడీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కేసులు, అరెస్ట్‌లతో వైఎస్ జగన్ హార్డ్ కోర్ అభిమానులను ఆపలేరు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేదాకా పోరాడుతా’’ అని కాకాణి చెప్పారు.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు! -
చంద్రబాబుపై కాకాని గోవెర్దన్ రెడ్డి కామెంట్స్
-
ఎక్కడికెళ్లినా భజన చేసుకోవడం చంద్రబాబుకు అలవాటే: Kakani
-
రంగురంగుల మేనిఫెస్టోలతో చంద్రబాబు జనాన్ని మభ్యపెడతారు: కాకాణీ
-
విజన్ 2047 పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు: Kakani
-
చంద్రబాబు అంకెల గారడీ: కాకాణి
సాక్షి, తాడేపల్లి: విజన్-2047 పేరుతో చంద్రబాబు(Chandrababu) డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకి ఇలాంటి తొండాట ఆడటం కొత్తేమీకాదన్నారు. ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తాడు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను పక్కన పెట్టేస్తాడు’’ అని మండిపడ్డారు.‘‘రంగురంగుల మేనిఫెస్టోలు, కలర్ పేజీల డాక్యుమెంట్లతో జనాన్ని మభ్యపెట్టటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఏమీ చేయకపోయినా చేసినట్టు ఎల్లోమీడియాలో బాకాలు ఊదుకుంటారు. ఐదేళ్ల అబద్దాలను నిన్న ఒక్కరోజే చంద్రబాబు చెప్పారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి, వృద్దిరేటు గురించి ఏమాత్రం మాట్లాడలేదు. మాటల గారడీ చేసే చంద్రబాబు ఈసారి అంకెల గారడీ కూడా చేశారు’’ అంటూ కాకాణి దుయ్యబట్టారు.‘‘రాష్ట్ర ఆదాయం ఏమాత్రం పెరగకుండా జీఎస్డీపీ ఎలా పెరిగిందో చంద్రబాబుకే తెలియాలి. ప్రభుత్వ ఆదాయం 1.15 శాతం తగ్గితే మరి జీఎస్డీపీ ఎలా పెరిగింది?. తాను ఏం చెప్పినా జనం నమ్ముతారనుకోవటం చంద్రబాబు భ్రమ. వాస్తవాలను దాచి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు పెరగాలని చంద్రబాబు అంటున్నారు. ఈ స్థాయిలో వృద్దిరేటు ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. బిల్‌క్లింటన్ వచ్చినప్పుడు బిచ్చగాళ్లని తీసుకుని వెళ్ళి ఎక్కడో వదిలేశారు. తద్వారా తమ రాష్ట్రంలో పేదరికం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు...చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలోనే వృద్దిరేటు పెరిగిందని కేంద్ర సంస్థలే చెప్పాయి. పారిశ్రామిక నికర ఉత్పత్తి 11వ స్థానంలో ఉంటే జగన్ హయాంలో 9వ స్థానానికి వచ్చింది. అంటే జగన్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి పెరిగింది. తలసరి ఆదాయాల విషయంలో కూడా చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. ఇంటర్మీడియట్ తప్పిన చంద్రబాబు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబులాగా మాట్లాడితే మా దేశంలో జైలులో పెడతారని గతంలోనే స్విట్జర్లాండ్ మంత్రి అన్నారు..చంద్రబాబు హయాంలో అతివృష్టి, అనావృష్టితో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మేనిఫెస్టో హామీలను అమలు చేయకుండా జనాన్ని ఊరిస్తూనే ఉన్నారు. చెప్పినవి చేయకుండా జనాన్ని నిలువునా మోసం చేశారు. గతంలో జగన్ పేదలకు ఇచ్చిన స్థలాలను తీసుకుని తన మనుషులకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని మరొకటి లేదు’’ అని కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం -
పోలీసుల తీరుపై కాకాణి గోవర్ధన్ సెటైర్లు
-
అరెస్ట్‌పై ప్రశ్నిస్తే కేసులా?.. ఎవర్నీ వదలేది లేదు: కాకాణి హెచ్చరిక
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రిమాండ్ రిపోర్టులో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు పెడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులే(AP Police) నేరస్థులుగా మారుతున్నారని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి కాకాణి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘జిల్లాలో పోలీసులే నేరస్థులుగా మారి వెంకట శేషయ్యపై తప్పుడు కేసు పెట్టారు. తనకు సంబంధం లేనట్టు.. జిల్లాకి తాను ఎస్పీ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రిమాండ్ రిపోర్టులో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు చేర్చారు. నేరస్థులను వదిలి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం జరుగుతోంది. దీనికి వెంకట శేషయ్య వ్యవహారమే ఉదాహరణ.శేషయ్య అరెస్ట్ వ్యవహారంలో పోలీస్ వ్యవస్థ న్యాయవ్యవస్థను తప్పుదారిలోకి మళ్లించింది. శేషయ్య కేసులో ఎంత ఉప్పు తిన్నారో.. అన్ని నీళ్లు తాగిస్తా.. పోలీసులకు, కూటమి నాయకులకు ఇదే నా హెచ్చరిక. ఈ కేసులో జరిగిన తప్పిదాలను సమాజం ముందు ఉంచుతాం. జిల్లా అధికారులు ఈ కేసులో న్యాయం చేస్తారని మేము భావించడం లేదు. కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఎస్పీ విచారణకు ఆదేశించాలి. నా కళ్ల ముందు జరిగిన వ్యవహారం ఇది. ఇందులో ఎవరినీ వదలం పెట్టేది లేదు. కోవూరులో కొత్త స్టాంపులకు పాత తేదీలు వేశారు. తప్పు చేసిన వారు ఎక్కడున్నా వదలిపెట్టం. శేషయ్య కేసులో జరిగిన లోపాలపై పూర్తి ఆధారాలతో హైకోర్టులోనూ ఫైల్ చేస్తాం. ఇక్కడ పోలీసులపై ప్రైవేట్ కేసు కూడా వేస్తాం అని హెచ్చరించారు. -
రైతులను నమ్మించి వంచించడం చంద్రబాబు నైజం: కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో వ్యవసాయ రంగం(Agricultural sector) సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆవేదన చెందారు.ఇప్పటివరకు 95 మంది రైతులు(Farmers) ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా చెబుతున్నా, అనధికారికంగా ఆ సంఖ్య 150కి పైగానే ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి గుర్తు చేశారు.కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:సంక్షోభంలో వ్యవసాయ రంగం:ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతుల సమస్యలు పరిష్కరించకపోగా, ఎప్పటికప్పడు డైవర్షన్ పాలిటిక్స్‌తోనే సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం. ఒక పక్క భారీ వర్షాలు, వరదలు. మరోవైపు కరవు పరిస్థితి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.రైతుల ఆత్మహత్యలు బాధాకరం:తాజాగా వైయస్సార్ జిల్లాలో కన్నబిడ్డలతో సహా నాగేంద్ర, వాణి అనే రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతో కలిచి వేసింది. ఇది ప్రభుత్వ అసమర్థతను, వ్యవసాయ రంగం పట్ల వారి ఉదాసీనతను తెలియజేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారిక లెక్కల ప్రకారం 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అనధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య 150కి పైగానే అని సమాచారం.రైతు ఆత్మహత్యలపై కూటమి పార్టీ నాయకులు దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆత్మహత్యలు ఎక్కువ చూపిస్తే చంద్రబాబు అసమర్థ పాలనపై ప్రజల్లో ఆగ్రహం వెల్లుబుకుతుందని వారి భయం. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం దండగ అని గతంలో ఒకసారి చంద్రబాబు అనడం అందరికీ గుర్తుంది.పరిహార చెల్లింపులోనూ బాబు వంచన:రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటుంటే వారి కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాల్సిన సీఎం చంద్రబాబు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఆయనది అదే ధోరణి. లక్ష రూపాయల పరిహారం కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారిని కించపర్చేలా మాట్లాడిన చంద్రబాబు, నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2003 నాటికి ఆ పరిహారం కూడా ఆపేశారు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన తర్వాత కూడా 2015, ఫిబ్రవరి 18 వరకు ఆ పరిహారం రూ.1.50 లక్షలు మాత్రమే ఇచ్చారు. దాన్ని రూ.5 లక్షలకు పెంచుతామని చెప్పి, ఆ డబ్బును నేరుగా బాధిత కుటుంబానికి కూడా అందజేయకుండా వంచించారు.లక్షన్నర బ్యాంకు రుణాల కోసం కేటాయించి, మిగతా మూడున్నర లక్షలు కూడా వారికి ఇవ్వకుండా బ్యాంకుల్లో జమ చేసి వడ్డీతోనే జీవించాలనేలా చేసి మోసగించాడు. 2014– 19 మధ్య చూస్తే దాదాపు 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ప్రభుత్వం గుర్తించింది కేవలం 1223 మందిని మాత్రమే. ఆ మొత్తం కుటుంబాలకు కాకుండా, కేవలం 450 కుటుంబాలకు మాత్రమే రూ.20.12 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిహారం:2019లో జగన్‌గారు సీఎం అయ్యాక, రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని ఒకేసారి రూ.7 లక్షలకు పెంచడంతో పాటు, చంద్రబాబు పాలనా కాలంలో ఆత్మహత్యల పరిహారం అందని కుటుంబాలకు కూడా న్యాయం చేశారు. ఆ విధంగా 474 మంది రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1794 కుటుంబాలకు రూ.116.10 కోట్ల పరిహారం అందించగా, వారిలో 495 కుటుంబాలు కౌలు రైతులవి.రైతులకు చంద్రబాబు మోసం:నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తే.. 2014 అధికారంలోకి రావడం కోసం రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్న చంద్రబాబు, వారిని దారుణంగా మోసగించారు. మళ్లీ మొన్న ఎన్నికల్లో రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తానని చెప్పి, దాన్ని కూడా అమలు చేయకుండా మరోసారి మోసం చేశారు. రైతు భరోసా కింద వైయస్సార్సీపీ ప్రభుత్వం 53.58 లక్షల కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం చేసింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వారికి రూ.20 వేలు ఇవ్వాలంటే, ఈ ఏడాది రూ.10,718 కోట్లు కావాలి. కానీ, బడ్జెట్లో ఆ కేటాయింపు చేయకుండా మరోసారి చంద్రబాబు రైతులను వంచించారు.ఎన్నికల కోడ్ వల్ల గత ప్రభుత్వం చెల్లించలేకపోయిన రూ.930 కోట్ల రైతుల ప్రీమియం, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చెల్లించని కారణంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు దక్కాల్సిన రూ.1385 కోట్ల బీమా దూరమైంది. ఉచిత పంటల బీమా పథకానికి కూడా కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. మా ప్రభుత్వ హయాంలో యూనివర్సలైజేషన్ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేకుండా నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు, రైతులు చెల్లించాల్సిన ప్రీమియం, కేంద్ర ప్రీమియం కూడా చెల్లించడం జరిగింది. ఇదీ చదవండి: చంద్రబాబూ.. విజన్ అంటే అప్పులేనా?: బుగ్గనరైతులకు బాబు బకాయి రూ.12,563 కోట్లు:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఏమేం ఎగ్గొట్టిందనేది చూస్తే.. ఆ విలువ ఏకంగా రూ.12,563 కోట్లు. 2023–24 రబీ సీజన్లో దాదాపు 3.91 లక్షల మంది రైతులకు చెందాల్సిన కరువు సాయం రూ.328 కోట్లు. సున్నావడ్డీ రాయితీ కింద 2023 సీజన్‌కి సంబంధించి 6.31 లక్షల మంది రైతులకు రూ.132 కోట్లు. పెట్టుబడి సాయం. సున్నా వడ్డీ పంట రుణాలు. కరవు సాయం.. ఇలా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు హామీ ఇచ్చి చంద్రబాబు ఎగ్గొట్టిన మొత్తం సాయం దాదాపు రూ.12,563 కోట్లు. వెంటనే ప్రభుత్వం వాటన్నింటినీ అందించాలి.కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలు:రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ సీఎంగా ఉండగా 54.55 లక్షల మంది రైతులకు రూ.7802 కోట్లు బీమా పరిహారం చెల్లించడం జరిగింది. ఇంకా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తూ 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పుడు కూటమి పాలనలో ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైంది.ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగడం లేదు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సరిపడా ఎరువులు అందడం లేదు. రైతులే బహిరంగంగా కూటమి పాలనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్తా యూరియాపై రూ.100 అదనంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. కొన్నిచోట్ల కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేస్తే తప్ప యూరియా దొరకని దుస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ధాన్యం కొనుగోళ్లలో దళారుల రాజ్యం నడుస్తోంది. వాట్సాప్‌లో హాయ్ అని పెడితే కొంటానని చెబుతాడే తప్ప ఎక్కడా మద్దతు ధరకు కొనుగోలు చేసిన పరిస్థితులు కనిపించడం లేదు.ఇవీ మా డిమాండ్స్:ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేల చొప్పున అందించాలి. ప్రతి పంటకు ఈ–క్రాపింగ్ చేసి ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి. ఆర్బీకే వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలి. రైతులకు బోనస్‌తో కలిపి మద్ధతు ధర చెల్లించాలి. ప్రభుత్వం ఇంకా రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే, వారి పక్షాన నిలబడి పోరాడుతామని కాకాణి గోవర్థన్‌రెడ్డి వెల్లడించారు. -
YSRCP నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు: కాకాణి
-
కూటమి ఆరు నెలల అరాచకాలు చూసిన ప్రజలు సరిదిద్దుకోలేని తప్పు చేశామంటున్నారు
-
వైయస్ఆర్ సీపీ ప్రభంజనం ఇక్కడి నుండే మొదలు
-
చంద్రబాబు అక్రమాలపై విచారణ చేపట్టాలి
-
‘చంద్రబాబు అక్రమాలపై విచారణ జరగాలి’
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు అక్రమాలపై విచారణ చేపట్టాలని మాజీ మంత్రి కాకాని గోవర్థనరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకాని గోవర్థనరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘అక్రమాలు చేసి అడ్డంగా దొరికిన దొంగలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారు. రాజధాని భూముల నుండి స్కిల్ స్కామ్ వరకు అక్రమాలు చేశారు. సీఐడీ అధికారులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించారని వారిపై కక్ష కట్టారు. సీనియర్ ఆఫీసర్లను చంద్రబాబు వేధిస్తున్నారు. ఆయనపై కేసులు ఉన్న శాఖల్లో తన గుప్పిట్లో ఉండే ఆఫీసర్లను నియమించుకున్నారు. అప్పటి కేసులను నిర్వీర్యం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. కేసుల నుండి తప్పించుకోవటానికి ప్లాన్ వేశారుఅందుకోసమే ఢిల్లీ నుండి న్యాయవాదులను రప్పించి అధికారులకు సూచనలు ఇప్పటిస్తున్నారు. చంద్రబాబు జైలు నుండి విడుదల అయ్యే సమయంలో కోర్టుకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులపై ఛార్జిషీట్లను కూడా వేయటం లేదు. సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించినా కూడా ప్రభుత్వ న్యాయవాది వాయిదాలు కోరుతున్నారు.చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బెయిల్ షరతులను కూడా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. చంద్రబాబుకు డబ్బులు సరఫరా చేసిన పెండ్యాల శ్రీనివాసరావు అప్పట్లో అమెరికా పారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ను పిలిపించి కీలక బాధ్యతలు అప్పగించారు.స్కిల్ కేసులో పూణే, ముంబాయి, ఢిల్లీలో ఈడీ సోదాలు చేసి ఆధారాలు సేకరించింది.షెల్ కంపెనీల ద్వారా రూ.332 కోట్లు చంద్రబాబుకు చేరాయి. అధికారులు అనేక రకాలుగా అభ్యంతరాలు చెప్పినా చంద్రబాబు ఒత్తిడి చేశారు. తనకు చెందిన షెల్ కంపెనీలకు ఆ నిధులు వచ్చేలా చూసుకున్నారు.ఫైబర్ నెట్ ఫ్రాడ్‌ను కూడా అలాగే కుట్ర పూరితంగా చేశారు. వేమూరి హరికృష్ణకు కాంట్రాక్టు ఇవ్వాలని ముందుగానే నిర్ణయించారుఅమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో భారీగా భూదోపిడీ చేశారు.చంద్రబాబు, నారాయణ ఇందులో కీలక నిందితులు. కానీ ఆ కేసును మూయించటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులపై ఏపీలో విచారణ జరిగితే న్యాయం జరగదు. రాష్ట్రం బయటే ఈ కేసుల విచారణ జరగాలి’అని డిమాండ్ చేశారు. -
నీటిసంఘాల ఎన్నికల్లో కూటమి నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు
-
సొమ్మిరెడ్డికి కాకాణి స్ట్రాంగ్ కౌంటర్
-
అక్కడికి వచ్చే దమ్ముందా?.. సోమిరెడ్డికి కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో ఎవరూ పట్టించుకోవడం లేదని అసెంబ్లీకి వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టిన వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇదే సమయంలో సోమిరెడ్డి లాంటి వ్యక్తి.. విజయ సాయిరెడ్డికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘సోమిరెడ్డి గురించి అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో అరబిందో కంపెనీకి సోమిరెడ్డి ఫోన్ చేసి 5 కోట్లు డబ్బులు అడిగిన మాట వాస్తవం కాదా?. డబ్బులు ఇవ్వలేదనే అరవిందో మీద ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారు. అరబిందో కంపెనీ దగ్గర డబ్బులు తీసుకోలేదని కాణిపాకంలో సోమిరెడ్డి ప్రమాణం చేయగలడా?.సోమిరెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. తేదీ, సమయం చెబితే.. విజయ సాయిరెడ్డి, నేను వస్తాం.. ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా?. విజయ సాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డికి లేదు. నెల్లూరులో పట్టించుకోలేదని.. అసెంబ్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి సోమిరెడ్డి. హిందీ, ఇంగ్లీష్ వచ్చుంటే ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టేవాడేమో?. పొదలకూరులోని లే అవుట్స్ మీద విచారణ ఎందుకు ఆపేశావ్?. సోమిరెడ్డి కొడుక్కి డబ్బులు ముట్టాయ్ కాబట్టే.. విచారణ ఆగిపోయింది’ అంటూ ఆరోపణలు చేశారు. -
ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం
నెల్లూరు (బారకాసు): ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని సీఎం చంద్రబాబు చెబితే... ఈ రోజు కొన్ని పత్రికలు మాత్రం మాట మార్చి ‘అవకతవకలు, తప్పులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ, అవి గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల..’ అంటూ వారి చేతకానితనాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా రూ.13,500కు బదులు రూ.20 వేలు ఇస్తామన్న హామీ ఇప్పటివరకు అమలు చేయలేదు. వారు చెప్పిన అన్నదాత సుఖీభవ అనేది చివరికి చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా మారింది. మద్దతు ధర దక్కకపోవడానికి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పిన మీ మాటలే నిజమైతే... ఈ ఆరు నెలలు ప్రక్షాళన చేయకుండా గాడిదలు కాస్తున్నారా? రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకి లేకపోవడం వల్లే సమస్యలు పునరావృతం అవుతున్నాయి. ఆ నెపాన్ని గత ప్రభుత్వం, అధికారులపై నెట్టివేసి పబ్బం గడుపుతున్నారు.వైఎస్ జగన్ హయాంలోనే రైతులకు గిట్టుబాటు ధర లభించిందని టీడీపీ సానుభూతిపరులు కూడా అంగీకరించారు. అప్పట్లో ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయని వారు చెప్పారు. రైతుల ఇబ్బందులపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించారు. చిత్తశుద్ధితో పని చేసిన సీఎం జగన్ అయితే... ప్రెస్మీట్లు పెట్టి ఏమీ చేయకుండానే ఆహా.. ఓహో.. అని తన భుజాలను తానే తట్టుకునే సీఎం చంద్రబాబు’ అని కాకాణి అన్నారు.ఇవిగో వాస్తవ గణాంకాలు...‘జగన్మోహన్రెడ్డి హయాంలో 2019–24 మధ్య ధాన్యం కొనుగోళ్లు 18 లక్షల టన్నులు తగ్గిందని చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారు. కానీ, వాస్తవాలు చూస్తే ధాన్యం సేకరణ నుంచి అమ్మకం వరకు అన్ని విభాగాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెరుగ్గా పని చేసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 17.94 లక్షల మంది రైతుల నుంచి 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, వారికి రూ.40,236 కోట్లు చెల్లించారు.అదే 2019–23 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 37.70 లక్షల మంది రైతుల నుంచి 3,40,24,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.65,255 కోట్లు చెల్లించాం.’ అని కాకాణి వివరించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల వాస్తవ పరిస్థితిని గుర్తించి, సజావుగా జరిగేలా చూడాలి. రైతులకు తప్పనిసరిగా కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేసి అన్ని జిల్లాల కలెక్టరేట్లకు వెళ్లి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. -
వైఎస్ జగన్ రైతులకు అన్ని విధాలా అండగా నిలిచారు