‘సోమిరెడ్డి.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా?’ | YSRCP Leader Kakani slams MLA Somireddy Chandramohan Reddy | Sakshi
Sakshi News home page

‘సోమిరెడ్డి.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా?’

Feb 7 2026 1:14 PM | Updated on Feb 7 2026 3:28 PM

YSRCP Leader Kakani slams MLA Somireddy Chandramohan Reddy

నెల్లూరు:  జిల్లాలో ఇరిగేషన్‌ శాఖ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయిందని వైఎస్సార్‌సీపీ నేత కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు.  ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతుల పేరిట, రైతులను అడ్డం పెట్టుకుని దొంగ బిల్లులు పెట్టుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశానని, కానీ ఎక్కడా స్పందన లేదన్నారు. మళ్లీ ఇంకోసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తాన్నన్నారు. 

‘సోమిరెడ్డికి సవాలు విసురుతున్నా.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా?, రైట్ ఇన్ఫర్మేషన్ కింద వివరాలు అడిగితే సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఇరిగేషన్ లో జరుగుతున్న అక్రమాల్ పై మాట్లాడితే మాపై దాడులు చేస్తున్నారు.  గంగాధర్ అనే ఉద్యోగి అక్రమంగా రైతులు నుండి ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకున్నారు.. ఈ ఉద్యోగిపై  చర్యలు తీసుకోకుండా కొన్ని రోజులు తప్పించి మళ్ళీ ఇప్పుడు తీసుకు వచ్చారు. 

గంగాధర్ కొడుకు ఆయన కుటుంబ సభ్యుల ఖాతాల్లో అక్రమంగా డబ్బులు జమ చేసినట్టు పూర్తి ఆధారాలు వున్నా విచారణ లేదు, చర్యలు లేవు. విజిలెన్స్ విచారణ కానీ ఇతర అధికారులు కానీ అవినీతి చేస్తున్న వారి పై చర్యలు శూన్యం.  ఒకప్పుడు సోమిరెడ్డి ఆర్ట్ ఆఫ్ కరెప్షన్.. ఇప్పుడు కింగ్ ఆఫ్ కరెప్షన్ గా మారాడు’ అంటూ ధ్వజమెత్తారు కాకాణి.

సోమిరెడ్డి కింగ్ ఆఫ్ కరప్పన్.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా

Advertisement
 
Advertisement
Advertisement