లడ్డూ కల్తీ జరిగింది చంద్రబాబు హయాంలోనే! | Bharat Margani Slams Kutami Leaders Over Running Non Stop Fake Campaign On Tirumala Laddu Controversy, More Details | Sakshi
Sakshi News home page

లడ్డూ కల్తీ జరిగింది చంద్రబాబు హయాంలోనే!

Feb 7 2026 11:26 AM | Updated on Feb 7 2026 4:17 PM

Bharat Margani Slams Kutami Over Non Stop Tirumala Laddu Fake Campaingn

సాక్షి, హైదరాబాద్‌: తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత మార్గాని భరత్‌ అన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కలియుగ దైవం శ్రీవారి మహా ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు వాడారనడానికి నోరెలా వస్తోంది?. లడ్డూలో ఎలాంటి కొవ్వు లేదని ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ నివేదికలు చెప్తున్నాయి. ఇప్పుడేమో లడ్డూ ప్రసాదంలో బాత్రూమ్‌ కెమికల్స్‌ వాడారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’’ అని కూటమి నేతలపై మండిపడ్డారు. 

తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకొని భ్రష్టు పట్టిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని వ్యాఖ్యానిస్తూ అపచారం చేస్తున్నారు. చంద్రబాబూ.. వెంటనే మీ మాటను వెనక్కి తీసుకోండి. బాత్ రూమ్‌ క్లీనర్‌కు వాడే రసాయనాలు వాడారని ఆరోపిస్తున్న మీది నోరా? ఇంకా ఏమైనా ?. 2018లో టీటీడీ హయంలో గీ ఫ్లేవర్ హెన్హన్సర్ ఎందుకు కొన్నారు ? ఆర్టిఫీషియల్ ఎందుకు కొనుగోలు చేశారు ?

ఫ్లేవర్ గీ కోసం అరోమా కలుపడానికి 78 వేల కేజీలు కొనడానికి 2018లో చంద్రబాబు హయంలో టెండర్లు పిలిచారు. ఫ్లేవర్ హెన్హన్సర్ అంటే ఏంటి?. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ దెబ్బ తీసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మనిషి అన్నవారు దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతారా ?. చంద్రబాబు హయాంలో రూ. 3 కోట్లతో  ఫ్లేవర్ గీ కోసం అరోమా కలిపింది వాస్తవం కాదా ?

తిరుమల తిరుపతి దేవస్థానంపై నమ్మకం ఉంది కాబట్టే ప్రతిష్ట దెబ్బ తినకుండా మేం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ శాంపిల్స్ తీసుకుంది. టీడీపీపై దుష్ప్రచారం చేసిన వారు నిందితులు. రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. జంతువుల కొవ్వు కలవలేదు అనేది సుస్పష్టం. తప్పులన్నీ వారు చేసి.. నిందలు మాపై వేస్తున్నారు

అది నోరా..? ఇంకేమైనాన? చెప్పు తీసి కొడతారు జాగ్రత్త

టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,500 దేవాలయాలను జగన్ నిర్మించారు.  చంద్రబాబు హయంలో ఎన్ని దేవాలయాలను కట్టారు?. పుష్కరాల సమయంలో ఆయన 40 దేవాలయాలను కూల్చారు. వాటిని వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే కట్టించారు. హిందూ ధర్మంపై మాకున్న నమ్మకం ఇది. దేవుడు దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు’’ అని మార్గాని భరత్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement