‘జీవోలు మార్చడం వల్ల ఏం ప్రయోజనం చేకూరింది చంద్రబాబూ..’ | Vaddi Raghuram Fires On Chandrababu Sarkar Issues Facing Aqua Farmers | Sakshi
Sakshi News home page

‘జీవోలు మార్చడం వల్ల ఏం ప్రయోజనం చేకూరింది చంద్రబాబూ..’

Aug 11 2026 5:24 PM | Updated on Aug 11 2026 5:29 PM

Vaddi Raghuram Fires On Chandrababu Sarkar Issues Facing Aqua Farmers

తాడేపల్లి: ఆక్వా రైతుల పట్ల చంద్రబాబుకు కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి లేదని  వైఎస్సార్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త, అప్స‌డా మాజీ వైస్ చైర్మ‌న్ వ‌డ్డి ర‌ఘురాం ధ్వజమెత్తారు. ఆక్వా రైతులకు పవర్ సబ్సిడీ పై గతంలో ఇచ్చిన జీవోనే సవరించి మళ్లీ ఇచ్చారని. జీవో నంబర్‌ 169లో ఏముందో.. ప్రస్తుతం ఇచ్చిన జీవో నంబర్‌ 57లో కూడా అదే ఉందన్నారు. ఆ జీవోలు మార్చడం వల్ల ఆక్వా రైతులకు ఏం ప్రయోజనం చేకూరిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

0.9 నుంచి 0.95 పవర్ ఫ్యాక్టర్ 2027 వరకూ మెయింటినెన్స్ చేస్తేనే సబ్సిడీ ఇస్తామని చెప్పారు. జగన్ రావడం వల్ల తమకు మంచి జరుగుతుందనే ఆలోచనలో ఆక్వా రైతులు ఉన్నారు. రైతులను డైవర్ట్ చేయడం కోసమే జీవో నెంబర్ 57ను విడుదల చేశారు. పవర్ ఫ్యాక్టర్ 50HP మెయింటినెన్స్ చేయాలి. రైతులు 50HP కెపాసిటర్లను పెట్టుకోవడం వల్ల ఓ పెద్ద కంపెనీకి వెయ్యికోట్లు లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారు. ఈ వెయ్యికోట్లలో చంద్రబాబు ,లోకేష్ ,పవన్ ట్యాక్స్ (CLP Tax)ఎంతో సమాధానం చెప్పాలి. ఎన్ని ఎకరాలున్నా రూపాయిన్నర సబ్సిడీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. 

వైఎస్‌ జగన్ హయాంలో 50800 వేల కనెక్షన్లను ఆక్వాజోన్ పరిధిలోకి తెచ్చి రూపాయిన్నర సబ్సిడీ ఇచ్చారు. ఫీడ్ రేట్లు తగ్గించాలని రైతులు కోరినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు.  ఢిల్లీ వెళ్లి ఆక్వా రైతులకు ఏం ఊడబొడిచారు. జగన్ భీమవరం వెళ్లడం వల్లే రొయ్యల కౌంట్ ధరలు పెరిగాయి. ఆక్వా రైతులకు రూపాయిన్నర సబ్సిడీ ఎప్పట్నుంచి ఇస్తారో సమాధానం చెప్పాలి. ఆక్వా రైతుల తరపున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 

పొగాకు రైతులకు సంఘీభావంగా జగన్ దేవరపల్లిలో పర్యటించారు. ప్రజాధరణ పొందిన జగన్‌కు ప్రభుత్వం భద్రత కల్పించలేదు. జగన్‌కు వస్తున్న జనాన్ని చూసి చంద్రబాబు, టిడిపి నేతలకు బీపీ పెరిగిపోతుంది. జగన్ సంఘీభావం తెలిపిన తర్వాత పొగాకు ధర 260 రూపాయల నుంచి 300 రూపాయలకు పెరిగింది’ అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement