వైఎస్సార్ జిల్లా: భారతి సిమెంట్స్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. హైకోర్టును ఆశ్రయించినప్పటికీ టీడీపీ మూకలు వెనక్కి తగ్గట్లేదు. స్థానిక టీడీపీ నేతల ప్రోద్బలంతో ఇప్పటికీ మైనింగ్ పనుల అడ్డగింత కొనసాగుతోంది. వాహనాలను మైనింగ్‌లోకి వెళ్లకుండా టీడీపీ మూకలు అడ్డుకుంటున్నాయి.
అంతా సవ్యంగానే ఉందని, మైనింగ్ జరుగుతుందంటూ మభ్య పెడుతున్నారు పోలీసులు. అధికార పార్టీ ఆదేశాల ప్రకారం భారతి సిమెంట్స్ సజావుగా జరుగుతుందంటూ నివేదికలు ఇస్తున్నారు. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో టీడీపీ మూకల గూండాయిజం కొనసాగుతోంది. భారతి సిమెంట్స్ లో ఉత్పత్తి నిలిచిపోయినా యంత్రాంగం స్పందించడం లేదు.
వారం రోజులుగా భారతి సిమెంట్స్ పై పచ్చ మూకలు దండయాత్ర చేస్తున్నా చర్యలు శూన్యంగా ఉన్నాయి. అధికార పార్టీ ప్రోద్బలంతో భారతి సిమెంట్స్ ను దెబ్బతీసేందుకు భారీ కుట్ర పన్నారు. ఎన్నిసార్లు విన్నవించినా స్థానిక పోలీసులు స్పందించడం లేదు. యథాతథంగా టీడీపీ మూకల గూండాగిరి కొనసాగుతోంది.


