జీవితంలో ఏదో ఒక దశలో ఒంటిరిగా జీవించక తప్పని పరిస్థితి ఎదురవుతుంటుంది. దాంతో చాలామంది బెంగగా ఫీలవ్వతూ బతకేందుకు ఆందోళన చెందుతుంటారు. కొందరు మాత్రం ఒకరికీ భారంగా కాకుండా హుషారుగా, మంచి అభిరుచిని ఏర్పరుచుకుని సాగిపోతుంటారు. ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ 75 ఏళ్ల అమ్మమ్మ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ బామ్మ 'పరివృత్త జాను శిరాసన', 'ఉత్థిత పద్మాసనం', 'బైసెప్ కర్ల్స్', 'సీటెడ్ ఫార్వర్డ్ బెండ్' వంటి యోగాసనాలను ఎంతో సునాయాసంగా వేసేస్తుంటుంది. అంతేగాదు ఆమె బరువు కూడా ఆరోగ్యకరమైన స్థిరమైన బరువుని మెయింటైన్ చేయడం విశేషం. చాలామంది ఇదెలా మీకు సాధ్యం అని అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఆమెకు ఫిట్‌నెస్ గురించి ఆలోచించడానికి సమయమే దొరికేది కాదు. ఎందుకంటే 15 ఏళ్లకే పెళ్లై, ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టింది.
ఉదయం 5 గంటలకు ప్రార్థనలతో మొదలై, ఆరు గంటలకల్లా సందడిగా మాపోయేది. వంట చేయడం నుంచి చేతితో బట్టలు ఉతడకం, పిల్లలను పెంచడం, ప్రతిరోజు అతిథులు రావడం తదితర పనులతో గడిచిపోయేది. ఆమె అందరినీ చూసుకోవడంలో పడి, తనని తాను చూసుకోవడం మర్చిపోయానని చెప్పుకొచ్చింది. తన జీవితంలో క్లిష్ట దశ ఒకటి ఉందంటూ..ఆ దురదృష్టకరమైన పరిస్థితిని గుర్తుతెచ్చుకొన్నారు. పదేళ్ల క్రితం భర్త చనిపోవడం మొత్తం పరిస్థితి మారిపోయిందని చెప్పుకొచ్చింది.
ఎందుకంటే ఒక్కసారిగా ఇల్లంతా నిశబ్దంగా మారిపోయింది. ఒంటరితనం ఆవహించేస్తున్నా..దాన్ని అదిగమించేలా మేడమీదకు వెళ్లి స్ట్రెచింగ్ చేయడం మొదలుపెట్టింది. టీవీలో యోగాసనాలను చూడటం లేదా దగ్గర్లో ఎవరైనా సాధన చేస్తుంటే గమనించడం చేస్తుండేది..అలా ఆమె జీవితంలో యోగా ఒక దినచర్యగా మారిపోయింది. అంతేగాదు ఆమె రోజు.. ఉదయం నాలుగు గంటలకు మొదలవుతుంది. వాకింగ్ , యోగా, పుస్తకాలు చదవడం, ఇల్లంతా శుభ్రం చేయడం వంటి పనులతో ముగుస్తుంది.
తన ముగ్గురు కుమార్తెలు, కుమారుడు వేర్వేరు ప్రదేశాల్లో నివశిస్తున్నారని, కొందరు విదేశాల్లో ఉన్నారని, వాళ్లంతా తన గురించి ఆందోళన చెందకుండా ఉండేలా బతుకుతున్నానని అన్నారు. అలాగే పొరుగువారికి పాపడ్‌లు వంటి ఇతర పనుల్లో సహాయం చేస్తుంటానని అన్నారు. బహుశా అందుకేనేమో 75 ఏళ్ల వయసులో కూడా జీవితం నెమ్మదించిందని అనిపించదు.
ఇప్పటికీ ప్రతి ఉదయం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనే ఉత్సాహంతో నిద్రలేస్తాను అలా ఒంటిరితనాన్ని జయించి, అర్థవంతంగా మార్చుకున్నానని చెప్పుకొచ్చింది. అందువల్లే స్థిరమైన ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నట్లు తెలిపారు. ఎలాంటి జిమ్, సప్లిమెంట్లు మాత్రం లేవు అని చమత్కరిస్తూ రాసుకొచ్చారు పోస్ట్‌లో.
(చదవండి: సహారా ఎడారి అడుగున దాగున్న అద్భుతాలు.. కాలగర్భంలో కలిసిపోయిన రహస్యాలు ఇవే!)


