క్రితం వరకు వేరు.. ఒక్క వర్షంతో ఒక్కటయ్యారు. వాటే సీన్‌! | Police Students Under One Umbrella During Ranchi Protest | Sakshi
Sakshi News home page

క్రితం వరకు వేరు.. ఒక్క వర్షంతో ఒక్కటయ్యారు. వాటే సీన్‌!

Aug 11 2026 11:44 AM | Updated on Aug 11 2026 11:47 AM

Police Students Under One Umbrella During Ranchi Protest

కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతుంటాయి.. కాసేపటి క్రితం వరకు ఒకరినొకరు ఎదుర్కొన్నవారే.. ఆ తర్వాత ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. రాంచీలో నిరసనల సందర్భంలో వర్షం కారణంగా కనిపించిన ఈ దృశ్యం కూడా అలాంటి ఆసక్తికర ఘటనే..!

రాంచీలో జేపీఎస్సీ అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జీ, వాటర్‌ క్యానన్లు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు.

అయితే, అదే సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పరిస్థితి అంతా మారిపోయింది. వర్షం నుంచి రక్షించుకునేందుకు విద్యార్థులు గొడుగులు తెరవగా.. వారిని అడ్డుకుంటున్న కొందరు పోలీసు సిబ్బంది కూడా అదే గొడుగుల కిందకు చేరారు.

కాసేపటి క్రితం వరకు లాఠీలు, వాటర్‌ క్యానన్లతో విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు.. ఇప్పుడు అదే విద్యార్థుల గొడుగుల కిందకు చేరి వర్షం నుంచి తలదాచుకోవడం ఆసక్తికరంగా మారింది. పోలీసు, నిరసనకారుల మధ్య కనిపించిన ఈ మానవీయ దృశ్యాలు అక్కడున్న వారిని ఆశ్చర్యంతోపాటు ఎంతో ఆకట్టుకున్నాయి.

ప్రకృతి ముందు అందరూ సమానమేనని చాటిచెప్పిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి. వ్యవస్థపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను వ్యక్తిగత శత్రువులుగా చూడలేదనే విషయాన్ని ఈ దృశ్యాలు చాటిచెప్పాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement