breaking news
incident
-
ఉమెన్స్ హస్టల్ నిర్వాహకుడిపై మహిళల దాడి
మాదాపూర్ : మాదాపూర్‌లో ఉమెన్స్ హస్టల్ నిర్వాహకుడిపై మహిళలు దాడి చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన మేరకు.. షేక్‌పేటలో ఉంటున్న తల్లిదండ్రులు తన కూతురిని నీట్ ఎగ్జామ్ కౌచింగ్ కోసం జులై 13 నుంచి హస్టల్లో ఉంచారు. 10 రోజుల క్రితం నిర్వాహకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలపడంతో బంధువులు, తల్లిదండ్రులు వచ్చి నిర్వాహకుడిపై దాడి చేశారు. మాదాపూర్ ఇమేజ్గార్డెన్ రోడ్డులో ఉన్న అర్ణవ్ ప్లాజాలో ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హస్టల్లో 16 సంవత్సరాల బాలిక ఉంటుంది. బాలికపై హాస్టల్ నిర్వాహకుడు సత్యప్రకాశ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. పూలకుండీలను ధ్వంసం చేసి దాడికి దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.అనంతరం సత్యప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లుడితో అత్త వివాహేతర సంబంధం..!
విజయనగరం: మండలంలోని కెరటం గ్రామంలో ఈ నెల 9వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన నిడిగేట్టి కృష్ణ మృతికి గల కారణం ఆయన భార్యకు మేనల్లుడు సాయితో ఉన్న వివాహేతర సంబంధమేనని గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు. ఇదే కేసు వివరాలను బొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం వెల్లడించారు. మృతుడు నీడిగేటి కృష్ణను నారపాటి సాయి ఈ నెల 9న మద్యం తాగుదామని పిలిచి గ్రామం బయటకు తీసుకుని వెళ్లి అక్కడ అతడి పీక నులిమి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సాయి కాగా మృతుడి భార్య రాజు రెండవ నిందితురాలని, మృతుని కొడుకు మైనర్ కూడా హత్యలో పాల్గొన్నట్లు తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు సాయిని బిళ్లలవలస వద్ద గురువారం సాయంత్రం పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో ఎస్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రియుడితో సుఖం కోసం భర్తను దారుణంగా..
శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజు (34) మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు, మరొకరి సాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మొండిగలవీధికి చెందిన నల్లి రాజుకు మౌనికతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మౌనికకు పాతపట్నం మాదిగవీధికి చెందిన గుండు ఉదయ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజును హత్య చేయాలని మౌనిక.. తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉదయ్‌కుమార్ నిర్ణయించుకున్నారు. తర్వాత ఎక్కడికై నా పారిపోయి వివాహం చేసుకోవాలని భావించారు.పక్కా పథకం ప్రకారం..మౌనిక, ఉదయ్‌కుమార్ కలిసి రాజు హత్యకు పథకం వేశారు. కొత్త ఫోన్ నంబరుతో అమ్మాయిలా చాటింగ్ చేసి ఉదయ్‌కుమార్‌ను ఎక్కడికైనా రప్పించి చంపాలని నిర్ణయించుకున్నా సాధ్యం కాలేదు. దీంతో నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని కుట్ర పన్నారు. ఇందుకు ఉదయ్‌కుమార్ తన బావ మాదిగవీధికి చెందిన చౌదరి మల్లికార్జున్ అలియాస్ మల్లికార్జునరావు సహాయం కోరాడు. కుట్రలో భాగంగా ఉదయ్‌కుమార్ పర్లాకిమిడిలో ఆర్ఎంపీ వైద్యుడి వద్ద పది నిద్రమాత్రలు కొని మౌనికకు ఇచ్చాడు. మౌనిక ఈ నెల 5న రాత్రి భోజనంలో నాలుగు నిద్రమాత్రలు కలిపి పెట్టింది. భర్త వెంటనే నిద్రలోకి వెళ్లడం గమనించి చంపవచ్చని నిర్ధారణకొచ్చింది. ఈ నెల 6న రాత్రి భోజనంలో ఆరు మాత్రలను కలపడంతో రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. మౌనిక వెంటనే ప్రియుడు ఉదయ్‌కుమార్, చౌదరి మల్లికార్జునరావులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. రాత్రి 11.30 సమయంలో ఇద్దరూ వీధి లైట్లు ఆపేసి మౌనిక ఇంటికి వెళ్లారు. రాజు కాళ్లు, చేతులను మౌనిక, మల్లికార్జునరావు పట్టుకోగా.. ఛాతి పై ఉదయ్‌కుమార్ కూర్చుని తలగడతో ఊపిరి ఆడకుండా చంపేశారు. అనంతరం రాజు మృతదేహంతో పాటు బైక్, చెప్పులు, మద్యం బాటిల్‌ను హరిజనవీధికి దిగువన పడేసి వెళ్లిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మౌనిక తన భర్త ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మౌనిక ఏడుస్తున్నట్లు నటిస్తూ భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ నిందితులుగా గుర్తించారు. దీంతో మౌనిక, ఉదయ్‌కుమార్, మల్లికార్జునరావులు రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపా రు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సీఐ వి. రామారావు, ఎస్ఐ బి.లావణ్య, పీసీలు బి.జీవరత్నం, డి.గౌరీశంకర్రావు, పరమేష్‌లను అభినందించి, రివార్డులను అందజేశారు. -
భార్యను మోసం చేసిన వ్యక్తి అరెస్టు
బంజారాహిల్స్/లంగర్‌హౌస్: భార్యను మోసం చేస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని లంగర్‌హౌస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఫరీసా షాహీన్ 1990లో సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ పాకిస్థానీ జాతీయుడు సాహెద్ అఖిల్‌ను వివాహం చేసుకున్నారు. .వీరికి 1991లో ఫహద్ అఖీల్ గోందల్ జన్మించాడు. భర్త చనిపోయిన తర్వాత ఫరీసా 1998లో నగరానికి వచ్చి స్థిరపడ్డారు. నగరంలోని విద్యనభ్యసించిన ఫహద్ ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ సంస్థలో అసోసియేట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గతంలో ఉప్పల్‌లోని సంస్థలో పని చేసినప్పుడు అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన మహిళను వివాహం చేసుకుని లంగర్‌హౌస్ నేతాజీనగర్‌లో నివసిస్తున్నారు. ఫహద్‌కు ఏడాది క్రితం మరో మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దాని తీసింది. వీళ్లిద్దరూ బంజారాహిల్స్‌లోని ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఫహద్ భార్య తొమ్మిది నెలలుగా దూరంగా ఉంటోంది. గురువారం రాత్రి ఫహద్ ఆ మహిళతో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఫహద్‌ను లంగర్‌హౌస్ ఠాణాకు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు ఫహద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. -
అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్
సమాజ్‌వాదీ పార్టీ , రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్పై హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన బీజేపీ ఎంపి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని బచ్చన్ తోసేస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కంగనా ఆమెపై తీవ్ర విమర్శలు చేసింది.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో జయాబచ్చన్ వీడియోను షేర్ చేస్తూ ఇలా కాబెంట్ చేసింది. “అత్యంత చెడిపోయిన, విశేషాధికారం కలిగిన మహిళ” అని అంటూ విమర్శలు గుప్పించింది. అంతేకాదు భర్త అమితాబ్ బచ్చన్ మర్యాదను మంట గలుపుతోందంటూ వ్యాఖ్యానించింది.“ఆమె అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను/అర్ధంలేని తనాన్ని సహించారు. సమాజ్‌వాదీ పార్టి కోడిపుంజులా పందెంకోడిలా, ప్రవర్తింస్తోందంటూ ఎద్దేవా చేస్తే, ఎంత అవమానం, సిగ్గుచేటు” అని కంగనా మండిపడింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యాలు నెట్టింట చర్చకు దారి తీశాయి. గతంలో జయాబచ్చన ఇలాంటి విమర్శలొచ్చిన సందర్భంలో కంగనా వెనకేసుకొచ్చింది. నిజం చెప్పాలంటే..ఆమె కోపిష్టిమనిషే కానీ అదే సమయంలో ఆమె గొప్ప వ్యక్తి అంటూ జయాను తెగ పొగిడేసింది. 1970లలో ఆమె సినీరంగంలో రాణించారని, సినీ పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన మహిళల్లో ఒకరు అంటూ జయను కంగనా ప్రశంసించింది. (జయా బచ్చన్‌కు మళ్లీ కోపమొచ్చింది...సెల్ఫీ తీసుకోబోతే)సెల్ఫీ కోసం ఆశతో వచ్చిన అభిమానిని తోసేసి ఏం చేస్తున్నావ్ (క్యా కర్ రహే హై ఆప్?) అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి పక్కకు నెట్టేశారు.దీంతో సదరు వ్యక్తి సారీ చేప్పారు. ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్నవారంతా హతాశులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ హల్చల్ చేసింది. సింపుల్‌గా సెల్ఫీ వద్దు అంటే సరిపోయేది.. కానీ అతణ్ణి చేత్తో నెట్టివేయడం దారుణం అంటున్నారు. కొంతమంది యాటిట్యూడ్ అంటూ జయాబచ్చన్‌ను విమర్శించగా, మరి కొందరు జయ ప్రవర్తనను సమర్థించారు కూడా. -
మీడియా కంటపడకుండా వినుత తంటాలు
తిరుపతి జిల్లా: తన డ్రైవర్ హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్చార్జి వినుత కోటకు చెన్నై సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో శనివారం ఆమె చెన్నైలోని సీ3 సెవెన్‌వెల్స్ పోలీస్‌స్టేషన్‌కు ద్విచక్ర వాహనంపై వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయారు. మీడియా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖానికి మాస్్క, తలకు టోపీ ధరించి..పోలీస్‌స్టేషన్ లోపలికి వెళ్లి సంతకం పెట్టారు. అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా మీడియా ప్రతినిధులు ఆమెను కేసు, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించగా.. ఆమె లాయర్ చెయ్యి అడ్డుపెట్టి ఆపారు. బండిని ఆపకుండా వినూత అక్కడినుంచి వేగంగా వెళ్లిపోయారు. మరోవైపు..ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న కోట చంద్రబాబు, షేక్ తాసర్, శివకుమార్, గోపిలకు కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించింది. -
విడాకులు తీసుకున్న భార్యను హత్య చేసిన భర్త
చెన్నై: కాంచీపురం జిల్లాలోని సుంగువార్ చత్రం సోగండికి చెందిన మదన్ (42). తాగునీటి డబ్బాలు పంపిణీ చేసే వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడు. ఇతని భార్య లైలా కుమారి (36). వీరిద్దరూ 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దంపతుల మధ్య విభేదాల కారణంగా, వారు విడాకులు తీసుకుని విడివిడిగా జీవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మదన్ 2 సంవత్సరాల క్రితం సుకన్యను రెండవ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత, మదన్ తన విడాకులు తీసుకున్న మొదటి భార్య లైలాతో తిరిగి కలిశాడు. ఈ విషయం సుకన్య కు తెలిసింది. ఇద్దరికీ కుటుంబ సమస్య ఏర్పడింది. దీని కారణంగా, మదన్ తన రెండవ భార్య ప్రోద్బలంతో తన మొదటి భార్య లైలా కుమారిని చంపాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతలో లైలా తల్లి వసంత సుంగువారిచత్రం పోలీసులకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో మొదటి భార్య లైలా కుమారిని హత్య చేసినట్లు మదన్ శుక్రవారం సుంగువారి చత్రం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తన మొదటి భార్య లైలా కుమారిని సోగండిగాయ్కు తీసుకువచ్చి, ఆమెను హత్య చేసి తిరువళ్లూరు జిల్లాలోని తిరుపాండియూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ తోటలో పాతిపెట్టాడని కూడా వెల్లడైంది. హత్య చేసి పాతిపెట్టిన లైలా మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు పోలీసులు శనివారం మదన్ ను తిరు పాండియూర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. తరువాత లైలా కుమారి మృతదేహాన్ని తిరువళ్లూరు ఆర్టీఓ సమక్షంలో బయటకు తీసి, అక్కడ శవపరీక్ష నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హరిత నన్ను క్షమించు..
అనంతపురం: ‘హరిత నన్ను క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి’ అంటూ లేఖ రాసి ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి..వాటిని తీర్చేమార్గం కానరాక బ్యాంకు బాత్రూంలో ఉరేసుకుని తనువు చాలించాడు. వివరాలు..కర్నూలు నగరంలోని సీ క్యాంప్‌కు చెందిన సంకుల రవికుమార్ (40) గత 12 ఏళ్లుగా సెంట్రల్ బ్యాంకులో అటెండరుగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు అనంతపురంలో నివాసం ఉంటున్న ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లారు. 9.45 గంటలకు భార్య హరితకు ఫోన్ చేసి మనసు బాగోలేదని చెప్పారు. 10.20 గంటలకు బ్యాంకు ఉద్యోగి పద్మజ ..అటెండర్ రవికుమార్ భార్యకు ఫోన్ చేశారు. బాత్రూంలోకి వెళ్లి లోపల లాక్ చేసుకున్నాడని, పిలిస్తే పలకడం లేదని, మీరు వెంటనే బ్యాంకుకు రావాలని చెప్పారు. 20 నిమిషాల్లో ఆమె అక్కడికి చేరుకుంది. కార్పెంటర్ సాయంతో బాత్రూం తలుపు పగులగొట్టారు. అప్పటికే బాత్రూం కిటికీ ఇనుప కడ్డీకి నైలాన్ తాడుతో ఉరివేసుకున్న రవికుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. అప్పులు అధికం కావడంతో మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతుడి భార్య హరిత స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు సూర్యతేజ, కుమార్తెలు ఎస్.దీక్షిత, ఎస్.వీక్షిత ఉన్నారు.అప్పులే శాపంగా మారాయి..రవికుమార్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో ఏముందంటే... ‘హరిత క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి. నేను ఎలాంటి జూదాలూ ఆడలేదు. అధిక వడ్డీలు కట్టలేక..వడ్డీలకు తిరిగి అప్పు చేసి అలా ఒకదానికి ఒకటి తోడయ్యాయి. కరణ్ నన్ను క్షమించరా.. నిన్ను మోసం చేశాను. అమ్మా.. నువ్వు జాగ్రత్త.. పిల్లలు జాగ్రత్త. నా టైం ఇక్కడితో అయిపోయింది. హుస్సేన్.. నేను ఎవరినీ మోసం చేయలేదు. ఎవరినైనా అప్పు అడుగుదామనుకుంటే నా పరిస్థితి బాగోలేదు. హుస్సేన్ నాకో హెల్ప్ చెయ్.. నా తర్వాత హరితకు బ్యాంకుకు సంబంధించి ఏదైనా సహాయం చేస్తావని నమ్ముతున్నాను. గుజ్జల రాముడు అనే వ్యక్తి దగ్గర రూ.50 వేలు అప్పు చేస్తే రూ.15 వేలు పట్టుకుని రూ.35 వేలు ఇచ్చాడు. ప్రతి నెలా రూ.15,000 వడ్డీ కడుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు రూ.1,20,000 కట్టాను. ఇక నా వల్ల కాదు. హరీష్ సారీ రా..నీవు చాలా సార్లు హెల్ప్ చేశావు. నా కోసం చీటీ కూడా ఎత్తేసి డబ్బిచ్చావు. నువ్వు చాలా చాలా హెల్ప్ చేసినా.. నేను నీకోసం ఏమీ చేయలేని పరిస్థితి. కిశోర్ ఇకనైనా లోన్ కట్టుకోరా.. చాలా సార్లు హెల్ప్ చేశాను. కానీ నువ్వు చాలా మోసం చేశావు. హరిత పిల్లలు జాగ్రత్త.. శ్రావణి పిల్లలు జాగ్రత్త..వదిన చిన్నారిని నువ్వే చూసుకో’ అని పేర్కొన్నారు. -
అమ్మా.. కుండ పగిలింది ఇంటికి పోదాం
హైదరాబాద్: తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పసితనం.. తానేం చేస్తున్నాడో తెలియని అమాయకత్వం.. ఆత్మహత్య చేసు కున్న కన్నతల్లికి అమ్మమ్మతో కలిసి తలకొరివి పెడుతూ నాలుగేళ్ల బాలుడు పలికిన మాటలు అక్కడున్నవారి గుండెలను మెలి పెట్టాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో శ్రావ్య (27) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు బుధవారం జరిగాయి. తల్లి చితికి కుమారుడు శ్రేయాన్స్ నందన్ (4) తన అమ్మమ్మతో కలిసి నిప్పు పెట్టాడు. చితి చుట్టూ తిరుగుతున్న క్రమంలో నీటి కుండను పగులగొట్టారు. రెండోసారి కుండకు రంధ్రం చేస్తున్న సమయంలో అమ్మమ్మతో ‘అమ్మా.. కుండ పగిలింది ఇంటికి పోదాం’అని బాలుడు చెప్పిన మాటలు అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని కన్నీరు పెట్టించాయి. శ్రావ్య ఆత్మహత్యకు భర్త ధర్మతేజ్ పరోక్షంగా కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మతేజ్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. -
ఎస్ఐ తల నరికి చంపేశారు!
సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను ఓ ముఠా నరికి చంపేసింది. 100కు వచ్చిన కాల్ మేరకు విచారణకు వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ దారుణ హత్య సమాచారం పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. నిందితుల కోసం ఆరు బృందాలు తీవ్ర వేటలో నిమగ్నమయ్యాయి. బాధిత కుటుంబానికి సీఎం స్టాలిన్ రూ. కోటి ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. వివరాలు.. తిరుప్పూర్ జిల్లా తారాపురం సమీపంలోని అలంగియం పట్టికి చెందిన షణ్ముగ వేల్ కుడిమంగళం పోలీసు స్టేషన్లో స్పెషల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఆయన విధులలో ఉండగా 100కు వచ్చిన కాల్‌తో విచారణ నిమిత్తం అదేగ్రామంలోని ఓ ఎస్టేట్ తోటకు వెళ్లారు. విచారణకు వెళ్లిన షణ్ముగ వేల్ దారుణ హత్యకు గురైన సమాచారం బుధవారం ఉదయాన్నే పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. తిరుప్పూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అందరూ రంగంలోకి దిగారు. ఆరు ప్రత్యేక బృందాలను విచారణకు నియమించారు. విచారణలో సంబంధిత ఎస్టేట్ మడత్తుకుళం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్‌కు చెందినదిగా తేలింది. భద్రత కోసం వచ్చి హతమయ్యాడు.. ఈ ఎస్టేట్‌లో దిండిగల్‌కు చెందిన మూర్తి (65), ఆయన కుమారులు తంగపాండి, మణిగండన్ పనిచేస్తుండడం, వారు అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు నెలకొన్నాయి. విచారణలో ఈ తండ్రి కొడుకులు మద్యం మత్తులో తరచూ గొడవ పడుతున్నట్టు, మంగళవారం రాత్రి కూడా ఘర్షణకు దిగినట్టు వెలుగు చూసింది. ఒకర్ని మరొకరు కర్రలతో కొట్టుకుంటుండటంతో 100కు ఫోన్ వెళ్లింది. దీంతో షణ్ముగ వేల్ భద్రత నిమిత్తం అక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నట్టు తేలింది. ఈ సమయంలో మణి గండన్ కొడవలితో షణ్ముగ వేల్పై దాడి చేసి నరికి పడేశాడు. తప్పించుకునేందుకు షణ్ముగ వేల్ యతి్నంచినా వదలకుండా హత్యకు పాల్పడ్డాడు. దీనిని షణ్ముగ వేల్తో పాటూ వాహనంలో వెళ్లిన డ్రైవర్ గజరాజు చూడడంతో అతడి మీద కూడా దాడికి యతి్నంచారు. అక్కడి నుంచి తప్పించుకుని పోలీసు స్టేషన్లో డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. అర్ధరాత్రి వేళ పోలీసులు ఆ ఎస్టేట్‌లోకి పరుగులుతీశారు. షణ్ముగవేల్ మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేకబృందాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తును పోలీసు ఉన్నతాధికారులు వేగవంతం చేయించారు. ఈ సమాచారంతో ఎమ్మెల్యే మహేంద్రన్ ఎస్ఐ కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతి తెలియజేశారు. ఇక సీఎం స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేíÙయో ప్రకటించారు. బుధవారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం షణ్ముగ వేల్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆయన భౌతిక కాయం వద్ద డీజీపీ శంకర్‌జివాల్‌తో పాటూ ఉన్నతాధికారులు నివాళులరి్పంచారు. కాగా, పోలీసులకే రాష్ట్రంలో భద్రత కరువైందంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో పాటూ ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డారు. -
గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
చేతులు, కాళ్లను చున్నీతో కట్టి.. మరో చున్నీతో మెడ బిగించి..
ఖిలా వరంగల్ : ప్రేమించి పెళ్లి చేసున్నాం.. అన్ని మర్చిపోయి సంతోషంగా జీవిద్దామని భార్యను ప్రాధేయపడినా.. మనసు మార్చుకోకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్‌లోని కమ్మల గుడి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రితేష్ సింగ్ ఠాకూర్ అలియాస్ పడ్డు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్ వచ్చి కమ్మల గుడి వద్ద నివాసముంటూ ఐస్‌క్రీమ్ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం రితేష్ సింగ్ ఠాకూర్‌ను ఏనుమాముల రోడ్డులోని లక్ష్మీ గణపతి కాలనీకి చెందిన ఎండి. మహబూబ్ కుమార్తె రేష్మా సుల్తానా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సురాజ్, సరస్వతి ఉన్నారు. దంపతులు ఐస్ క్రీమ్ వ్యాపారం నిర్వహించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం రేష్మా సుల్తానాకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సన్నీతో పరిచయం ఏర్పడింది. సన్నీ, రితేష్ సింగ్ ఇద్దరు ఉత్తర్ ప్రదేశ్ వాసులు కావడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సన్నీ తరచూ ఇంటికి రావడంతో రేష్మా సుల్తానా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రితేష్ సింగ్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. తర్వాత తమ నివాసాన్ని శాంతినగర్‌కు మార్చాడు. మూడు రోజుల క్రితం రేష్మా సుల్తానా బాలాజీ నగర్‌లోని తల్లి ఇంటికి వచ్చింది. ఆ వెంటనే భర్త రితేష్ సింగ్ కూడా వచ్చి సన్నీని మర్చిపో.. సంతోషంగా జీవిద్దామని రేష్మా సుల్తానాకు సర్ది చెప్పాడు. అనంతరం జూలై 30న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయగా.. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. అనంతరం జూలై 31న రాత్రి 8 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంట్లో లేని సమయంలో రితేష్ సింగ్.. భార్యతో గొడవ పడి ఆమె చేతులు, కాళ్లను చున్నీతో కట్టి, మరో చున్నీతో మెడకు బిగించి ఉరివేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న ఏనుమాముల ఇన్స్పెక్టర్ సురేశ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు యాకూబ్‌పాషా ‡ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జే.సురేశ్ తెలిపారు. -
ఏడేళ్ల చిన్నారిపై సామూహిక లైంగిక దాడి
మహబూబ్ నగర్ జిల్లా: అభం శుభం తెలియని చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన సంఘటన జడ్చర్లలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జడ్చర్లలోని 167 నంబర్ జాతీయ రహదారిని ఆనుకునిఉన్న ఓ కాలనీలో నివాసం ఉంటున్న ఏడేళ్ల చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో చిన్నారి సొంత అన్న కూడా ఉన్నాడు. మూడు రోజుల క్రితం (ఆదివారం) పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిపై చుట్టుపక్కల ఇళ్లకు చెందిన ఐదుగురు బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు, మరో నలుగురు ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు. అత్యాచారం జరిగిన తరువాత చిన్నారితో సహా అందరూ ఏమీ తెలియనట్లు ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఆరోజు నుంచి బాలికకు కడుపునొప్పి రావడంతో పాటు అనారోగ్యానికి గురికావడంతో బుధవారం సాయంత్రం చిన్నారి తల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్ పరిశీలించి లైంగిక దాడి జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని విచారించగా.. తాను పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో తన సొంత అన్న, స్నేహితులు కలిసి తనకు తెలియకుండానే ఏదో చేశారని చిన్నారి పోలీసుల ముందు అమాయకంగా చెప్పింది. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి పంపారు. మైనర్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రియుడిని ఇంటికి పిలిచి ..?
నెల్లూరు జిల్లా: వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది దంపతులు. ఈ వివాహేతర సంబంధలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా నెల్లూరులో మరో దారుణం చోటు చేసుకోంది. ప్రియుడిని ఇంటికి పిలిచి మరీ హత్య చేసింది ప్రియురాలు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళికతో పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తరుణ్‌కు మాధవి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడగా అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.ప్రవళిక సంచలన ఆరోపణలుఅయితే ఎప్పటిలాగే మాధవి ప్రియుడు తరుణ్ తేజ్‌ని ఇంటికి పిలిచింది. కానీ అదే ఇంట్లో తరుణ్ తేజ్ హత్యకు గురయ్యాడు. మార్చురీ వద్ద ప్రవళ్లిక మీడియాతో మాట్లాడుతూ తరుణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. అతడిని స్నేహితురాలే హత్య చేసి కప్పిపుచ్చేందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
దొంగ.. దొంగది.! అర్ధరాత్రి ఇంట్లోకి దూరి
పటమట(విజయవాడతూర్పు): ఇంటిలోకి చొరబడి నగలు చోరీ చేసిన కేసులో ప్రేమికులను అదుపులోకి తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ తెలిపారు. పటమట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. భవానీపురానికి చెందిన బాలిక(16), మొగల్రాజపురానికి చెందిన మీసాల అజయ్(19) గతంలో వాసవీ కాలనీలో ఉండేవారు. వన్‌టౌన్ కోమలా విలాస్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నిర్వహించే చిరుమామిళ్ల గిరిజా శంకర్ ఇదే కాలనీకి గతంలో అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రి గిరిజా శంకర్ ఇంటిలో నిద్రిస్తుండగా వీరిరువురూ ఇంటిలోకి చొరబడి విద్యుత్ సరఫరాను ఆపేసి ఇంటిలోని 365 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతమైన తనిఖీలు చేయటంతో నిందితులు పట్టుబడ్డారన్నారు.పలు కేసుల్లో నిందితులు..నేరంలో భాగమైన బాలిక, అజయ్ ప్రేమికులు. వీరువురూ ఈ చోరీకి ముందు ఇదే ప్రాంతంలోని ఓ పెంపుడు కుక్కను కూడా చోరీ చేశారు. గిరిజా శంకర్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి చోరీ చేశారు. శంకర్ ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత చాకచక్యంగా ఇంటిలోకి చొరబడ్డారు. అజయ్ ఇంటిలోకి వెళ్లగా బాలిక బయట స్కూటర్‌పై కాపలా ఉండి, అజయ్ ఇంటి నుంచి రాగానే బండిపై అక్కడి నుంచి ఉడాయించారు. భవానీపురంలోని బాలిక బంధువుల వద్ద చోరీ సొత్తును దాచిపెట్టారు. వీరిపై నిఘా పెట్టడంతో బాలిక, అజయ్ గుణదల ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద పట్టుబడ్డారు. బాలికను జూవైనల్ హోంకు పంపామని, అజయ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచామని తెలిపారు. బాలిక, అజయ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, తన కూతురును అజయ్ వేధింపులకు గురిచేస్తున్నారని బాలిక తల్లిదండ్రులు గతంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అజయ్‌పై పోక్సో కేసు నమోదు చేయగా పెద్దల సమక్షంలో రాజీ కుదిరిందన్నారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సమావేశంలో సీఐ పవన్ కిషోర్, ఎస్.ఐలు డి.హరికృష్ణ, ఆర్ఎస్ కృష్ణ వర్మ, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
కొద్ది రోజులు ప్రియుడు.. కొద్ది రోజులు భర్త..!
వికారాబాద్: తనను వివాహం చేసుకుంటానని భర్త నుంచి దూరం చేసిన ప్రియుడు ఆ తర్వాత మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. ఈ విషయమై మంగళవారం తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తనకు న్యాయం చేయాలని కోరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఇదే ఊరికి చెందిన మరో యువకుడు ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ ఇష్టంలేని యువతి తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం ఆమెను కర్ణాటకకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లయిన నెల రోజుల తర్వాత సదరు యువతి భర్తకు ఫోన్ చేసిన ప్రియుడు తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పాడు. దీంతో యువతిని ఆమె భర్త వదిలేశాడు. అనంతరం తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన సదరు వ్యక్తి, కాలయాపన చేస్తూ మోసం చేశాడని యువతి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. ఇదిలా ఉండగా యువతి పీఎస్‌కు వచి్చన మాట వాస్తవమేనని పోలీసులు తెలిపారు. బుధవారం వచ్చి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వెళ్లిపోయారని చెప్పారు. -
బాగా చంపి ఫేమస్ అయ్యేదా!
హైదరాబాద్: తన అక్క ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడుతోందనే కారణంతో ఆమెను హత్య చేసిన నిందితుడు.. పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన రుచిత (21)ను సోమవారం ఆమె తమ్ముడు రోహిత్ (18) గొంతు నులిమి చంపగా పోలీసులు అతన్ని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. స్వగ్రామానికి చెందిన యువకుడితో అక్క ఫోన్లో మాట్లాడుతుండటంతో స్నేహితుల వద్ద పరువు పోతోందని రోహిత్ భావించాడు. దీంతో ఆమెను చంపాలనుకున్నట్లు సమాచారం. అంతకుముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా?’అనే సినీ డైలాగ్‌కు తాను చేసిన రీల్‌ను షేర్ చేశాడు. -
భార్యను వదిలేసి.. ట్రాన్స్‌జెండర్ దీపుతో కాపురం
జగిత్యాల జిల్లా: జగిత్యాలలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి పెళ్లై 10 ఏళ్లు గడిచింది. భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆ భర్త.. భార్యా, పిల్లలను వదిలేసి ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్‌కు, పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఇటీవలి కాలంలో రాజశేఖర్, హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పర్చుకున్నాడు.ఈ క్రమంలోనే భార్య లాస్యను వదిలి, దీపుతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన భార్య లాస్య, మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ హాస్పిటల్ కు రాకపోవడంతో ఆందోళన కు గురైన అత్తమామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. తన ఇంట్లోనే ట్రాన్స్ జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు కుటుంబ సభ్యులు. రూమ్ కు తాళం వేసి తదనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రాజశేఖర్ దీపు లను స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన పలువురు వీడెక్కడి మొగుడండీ బాబు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
పెళ్లి అయిన రెండు నెలలకే జీవితం తలకిందులు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నెల క్రితం సిగాచీ పరిశ్రమ పేలుడు దుర్ఘటనలో మరణించిన కారి్మకుల కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కుటుంబాన్ని పోషించేవారిని కోల్పోయిన ఈ బాధితులకు ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా పరిహారం అందలేదు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జూన్ 30న జరిగిన ఘోర ప్రమాదంలో 54 మంది మరణించారు. ఇందులో ఎనిమిది మంది మృతదేహాలు కూడా లభించలేదు. పేలుడు ధాటికి వారి శవాలు కాలిబూడిదైపోయి ఉంటాయని అధికారులు నిర్ధారించి, వారిని కూడా మృతుల జాబితాలో చేర్చారు. 46 మంది మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని నాడు ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల్లో ఈ మొత్తాన్ని అందజేస్తామని సిగాచీ పరిశ్రమ యాజమాన్యం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నామమాత్రం పరిహారంతో సరి.. ఆచూకీ లభించని 8 మంది కుటుంబాలకు ఈ నెల 9న రూ.15 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. మరణించిన 46 మందిలో 15 మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. మిగిలినవారికి ఇంతవరకు పరిహారం అందించలేదు. ప్రమాదం జరిగి రేపటికి నెల అవుతుంది. ఇప్పటికీ మృతులకు పూర్తి స్థాయిలో మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయలేదు. మృతదేహాలు లభించిన 46 మందిలో 38 మందికే డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆచూకీ లభించకుండా పోయిన వారికి డెత్ సరి్టఫికేట్ జారీ చేయడంలో నిబంధనలు అడ్డు వస్తున్నాయి. మరోవైపు కొందరు బాధితులకు పోలీసు పంచనామా కాపీలు కూడా రాకపోవడంతో ఇన్సూరెన్స్ వంటివి క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలలకే జీవితం తలకిందులు.. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాకు చెందిన ఈ మహిళ పేరు సంజూదేవి. ఈమె భర్త చోటేలాల్ సిగాచీ దుర్ఘటనలో మరణించాడు. రెండు నెలల క్రితమే పెళ్లి అయిన సంజూదేవి భర్తను కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నెల రోజులైనా తనకు ఎక్స్‌గ్రేషియా డబ్బులు అందకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొడుకు లేడు.. పరిహారం లేదు ఈ వ్యక్తి పేరు రాందాస్. ఆయన కుమారుడు జస్టిన్ సిగాచీ పేలుడు ఘటనలో కనిపించకుండా పోయా డు. జస్టిన్‌కు ఒక చెల్లి, ఒక అక్క ఉన్నారు. జస్టిన్ పనిచేస్తేనే ఈ కుటుంబానికి ఇల్లు గడిచేది. ఇప్పుడు జస్టిన్ లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించి తమను ఆదుకోవాలని రాందాస్ కన్నీరు మున్నీరవుతున్నాడు. ఉద్యోగమైనా ఇప్పించండి.. నా భార్య రుక్సానాఖతుం సిగాచీ పేలుడులో మృతి చెందింది. ఆర్థిక సహాయం రూ.పది లక్షల చెక్కును అందించారు. మిగతాది ఇప్పటికీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. వెంటనే పరిహారం చెల్లించాలి. ఉద్యోగ అవకాశమైనా కలి్పంచాలి. – మెనుద్దీన్‌ఖాన్, బిహార్ రెండురోజుల్లో మళ్లీ పరిహారం పంపిణీ చేస్తాం.. 15 కుటుంబాలకు ఇప్పటికే రూ.పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేశాం. మిగిలిన వారికి కూడా రెండు రోజుల్లో ఇస్తాం. ఈ వారంలోగా ఒక్కొక్కరికి మొత్తం రూ.25 లక్షల వరకు అందేలా చూస్తాం. 46 మందిలో 38 మందికి డెత్ సర్టిఫికెట్లు ఇచ్చాం. ఎనిమిది మందికి పెండింగ్‌లో ఉన్నాయి. – బి.చంద్రశేఖర్, అదనపు కలెక్టర్, సంగారెడ్డి. -
కోనసీమ: మాచవరంలో దారుణం.. ప్రిన్సిపాల్ కాదు.. కీచకుడు
అంబేద్కర్ కోనసీమ: జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే.. బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించాడు. భయపడి బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ బాలిక పదోవ తరగతి చదువుతుంది. మూడు నెలలుగా పిరియడ్స్ రావడంలేదని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళితే గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారు. దీనితో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. నిందితుడైన ప్రిన్సిపాల్ జయరాజ్ పై రాయవరం పోలీసు స్టేషన్లో బాధితురాలు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయవరం పోలీసులు. ఈ మేరకు ప్రిన్సిపాల్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కాగా, పాఠశాలకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువు చెప్పేందుకు అనుమతి ఉంది. అయితే పాఠశాల కరస్పాండెంట్ అనుమతి లేకుండా 10వ తరగతి వరకు విద్యార్థులకు తన పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. పాఠశాలకు 7వ తరగతి వరకు అనుమతి ఉంటే.. పదవ తరగతి బాలికలు ఏ విధంగా చదువుతున్నారన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. బాలికలను వేరే పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చి, అనధికారికంగా ఈ పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏ పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చారన్నది తేలాల్సి ఉంది. దీనిపై రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబును వివరణ కోరగా, ఫిర్యాదు వచ్చిన విషయం వాస్తవమేనని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. -
పల్నాట నెత్తుటి తూటా
ఒకప్పుడు కక్షలతో రగిలిన పల్నాడు గడ్డపై గత ఐదేళ్లలో శాంతి, సామరస్యం వెల్లివిరిశాయి. సంక్షేమ పథకాలు చేతికంది, పిల్లలు ఉన్నత చదువులవైపు మళ్లడంతో అక్షర చైతన్యం పెరిగింది. పల్లె సీమలలో ఆరోగ్యకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హత్యా రాజకీయాలు పురివిప్పాయి. తాజాగా రియల్టర్ల మర్డర్లతో కిడ్నాపింగ్, రివాల్వర్ సంస్కృతి ప్రవేశించింది. పల్నాడును భయం గుప్పెట్లోకి నెట్టేసింది. జంట హత్యల కేసులో పోలీసుల తీరు అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తడంతో తమకు న్యాయం జరిగేనా అంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు.నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగిన జంట హత్యల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో జరిగిన ఈ హత్యల వెనుక కూటమి ప్రజాప్రతినిధుల సహకారం ఉన్నట్టు స్పష్టమవుతోంది. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కే వీరాస్వామిరెడ్డి, కేవీ ప్రశాంత్‌రెడ్డి తండ్రీకొడుకులు. గత బుధవారం చెల్లని చెక్కు కేసులో నరసరావుపేట కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన వారిని కోర్టు ఎదుట కిడ్నాప్ చేసి బాపట్ల జిల్లా పాతమాగులూరు వద్ద హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితులు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో కిడ్నాప్ చేసేందుకు సాహసించిన తీరు, హత్యలు చేసిన వైనాన్ని పరిశీలిస్తే ప్రభుత్వంలోని పెద్దల అండ చూసుకొని బరితెగించినట్టు తెలుస్తోంది. కేసు నమోదులో కూడా పోలీసుల నిర్లక్ష్యం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. నరసరావుపేటలో కిడ్నాప్ చేసిన దుండగులు 20 నిమిషాల వ్యవధిలోనే ఇద్దర్నీ హత్య చేశారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మృతుల తరఫు న్యాయవాది నాగభూషణ్ ఇచ్చిన ఫిర్యాదుతో నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మృతదేహాలు పాతమాగులూరులో లభ్యమైన కారణంగా సంతమాగులూరు పోలీసులు అక్కడ మర్డర్ కేసు నమోదు చేశారు.సాధారణంగా కంటిన్యూషన్ అఫెన్స్ జరిగినప్పుడు సంఘటన ప్రారంభమైన స్టేషన్ పరిధిలో నమోదైన కిడ్నాప్ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు చేయాలి. కానీ జంట హత్యల కేసులో మాత్రం గత కేసులకు భిన్నంగా రెండు జిల్లాల పరిధిలోని పోలీసులు ఆయా స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఇద్దరు స్టేషన్ అధికారుల మధ్య సమన్వయం లోపిస్తే కేసు నీరుగారే ప్రమాదం ఉంది. జంట హత్యల కేసులో ప్రభుత్వం ప్రారంభంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మృతుల తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసుల తప్పిదాన్ని ఎత్తిచూపుతూ కేసు దర్యాప్తును సీబీఐకు బదిలీ చేయాలని హైకోర్టును ఆశ్రయించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మాధవరెడ్డి టీడీపీ నాయకుడే.. పట్టపగలు కోర్టు ప్రాంగణం ఎదుట ఇద్దర్ని అందరూ చూస్తుండగా కిడ్నాప్ చేసి అతి దారుణంగా హతమార్చడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై వస్తున్న విమర్శలను మరుగునపెట్టి.. ఎప్పటిలాగే ఈ ఘటనను కూడా వైఎస్సార్సీపీ నెత్తిన రుద్దేందుకు కుట్ర జరుగుతోంది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాదం మాధవరెడ్డి గతంలో కొంత కాలం వైఎస్సార్సీపీలో ఉన్న విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. అయితే మాధవరెడ్డి ప్రస్తుతం ఏ పారీ్టలో ఉన్నాడు? గత సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ కోసం పని చేశాడు? ఎవరి అండదండలతో ఇంత దారుణానికి ఒడిగట్టాడనే అంశాలను పరిశీలిస్తే అన్ని వేళ్లూ కూటమి ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందు 2023 సెపె్టంబర్ 10వ తేదీన అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబును కలసి మద్దతిచ్చిన ఫొటోలను ప్రధాన నిందితుడు మాధవరెడ్డి తన సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.దీంతోపాటు యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ కు స్వాగతం పలుకుతూ మాధవరెడ్డి ఫొటోలతో అతని అనుచరులు వేసిన ఫ్లెక్సీలు ఏ పార్టీ వాడో చెప్పకనే చెబుతున్నాయి. ఈ వాస్తవాలను మరుగున పరిచేందుకు కొన్ని పచ్చ పత్రికలు పదేళ్ల క్రితం మాధవరెడ్డి ఉన్న పార్టీ ప్రస్తావన తీసుకువచ్చి ప్రభుత్వానికి మచ్చ లేకుండా చేసేందుకు తెగ ప్రయతి్నస్తున్నాయి. టీడీపీ నేతల అండ చూసుకుని మాధవరెడ్డే స్వయంగా కిడ్నాప్, హత్యల ఘటనలో పాల్గొన్నట్టు అర్థమవుతోంది. తండ్రీకొడుకులను మాధవరెడ్డి బలవంతంగా కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలలో నిక్షిప్తమయ్యాయి.టీడీపీ నేతలతో సంబంధాలు.. నరసరావుపేటలో కిడ్నాప్ చేసిన తండ్రీకొడుకులను బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు పరి«ధిలో హత్య చేయడం వెనుక ముందస్తు వ్యుహం ఉందన్న ప్రచారం జరుగుతోంది. సంతమాగులూరు గ్రామానికి చెందిన నిందితుడు బాదం మాధవరెడ్డికి బాపట్ల, ప్రకాశం జిల్లాలలో అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. పల్నాడు జిల్లా పరిధి దాటగానే బాపట్ల జిల్లా ప్రారంభమైన 200 మీటర్ల దూరంలో రియల్ ఎస్టేట్ వెంచర్లో హత్యలు చేశారు. ముందస్తు పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడి నుంచి పరారయ్యారు. -
మానసిక ఉన్మాది రక్తదాహం
కర్ణాటక: ఓ మానసిక ఉన్మాది రక్తపాతాన్ని సృష్టించాడు. సొంత అన్న పిల్లలను తమ్ముడు క్రూరంగా హత్యచేసిన ఘటన బెంగళూరు హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఖాసీం (35) అనే సైకో దాడిలో మహమ్మద్ ఇషాక్ (9), మహ్మద్ జునైద్ (7), మృత్యువాత పడ్డారు. ఐదేళ్ల మహమ్మద్ రోహన్ ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్నాడు. చిన్నారులపై ఉగ్రరూపం నగర జాయింట్ పోలీస్ కమిషనర్ రమేశ్ బానోత్ వివరాలను వెల్లడించారు. పిల్లల తండ్రి చాంద్ బాషా ఐదేళ్ల కింద యాదగిరి నుంచి బెంగళూరులోని హెబ్బగోడికి వచ్చి భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి, తమ్ముడు ఖాసీంతో జీవిస్తున్నాడు. చాంద్ బాషా గార పనిచేస్తుండగా భార్య గార్మెంట్స్‌కు వెళ్తోంది. ఖాసీం ఇంట్లోనే ఉండేవాడు, అతడు మానసిక అస్వస్థుడు కాగా, నెలరోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గాలించి ఇంటికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆవేశంతో వింతగా ప్రవర్తించసాగాడు. ముగ్గురు పిల్లల మర్మాంగం పై ఇనుప రాడ్, రాయితో దాడికి పాల్పడ్డాడు. పిల్లలు రక్తపుమడుగులో పడిపోయారు. ఆ సమయంలో అవ్వ కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లింది. సమాచారం తెలిసి హెబ్బగోడి పోలీసులు చేరుకుని చూడగా ఇద్దరు చనిపోయి, ఒకరు తీవ్రగాయాలతో ఉన్నారు. ఆస్పత్రికి తరలించి హంతకున్ని అరెస్టు చేశారు. -
ముప్పుతిప్పలు పెట్టిన చిన్నారి పెళ్లి కూతురు!
చిత్తూరు: ఓ మహిళా పోలీసును చిన్నారి పెళ్లికూతురు ముప్పుతిప్పలు పెట్టించిన ఘటన చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. కార్వేటినగరం మండలానికి చెందిన బాలిక (16)కు తల్లిదండ్రులు లేరు. తిరుపతి జిల్లాలోని సంరక్షణ కేంద్రంలో ఉంటోంది. అప్పుడప్పుడూడు చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేటలో ఉన్న అక్క దగ్గరకు వచ్చి వెళుతుంటోంది. ఈ క్రమంలో బీఎన్‌ఆర్‌పేట సర్కిల్లో షాపు నిర్వహిస్తున్న యాదమరి మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం వారు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సంరక్షణ కేంద్ర సిబ్బంది బీఎన్‌ఆర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు ఆ మైనర్ బాలికను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మెడికల్ రిపోర్ట్, ఇతరాత్ర అవసరాల నిమిత్తం మహిళా పోలీసు వంగి సంతకం పెట్టే లోపు.. బాలిక మాయమైంది. దీంతో ఆ మహిళా పోలీసు తెగ టెన్షన్ పడిపోయింది. బస్టాండు మొత్తం గాలించారు. చివరకు బెంగళూరులో ఆ బాలికను గుర్తించి.. మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. -
సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య
కర్ణాటక: చెన్నపట్టణ తాలూకా కృష్ణాపురదొడ్డి గ్రామపంచాయతీ సభ్యురాలు చంద్రకళ భర్త లోకేష్ ఆత్మహత్య చేసుకున్న కేసు మలుపు తిరిగింది. భార్యే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతనెల 24న లోకేశ్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రకళ పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు వెళ్లి పరిశీలించగా మృతదేహం పక్కనే విషం బాటిల్ లభించింది. ఇతనిది ఆత్మహత్యే అని గ్రామస్తులతోపాటు పోలీసులు కూడా నమ్మారు. డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు చంద్రకళ తన భర్త మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మరీ గగ్గోలు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న ఎంకే దొడ్డి పోలీసులు చంద్రకళ ప్రవర్తనపై అనుమానంతో కాల్ రికార్డ్స్ పరిశీలించారు. చంద్రకళకు యోగేశ్ అనే వ్యక్తితో అక్రమసంబంధం ఉన్నట్టు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా తన ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భావించి బెంగళూరుకు చెందిన నలుగురికి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు చంద్రకళ నోరు విప్పినట్లు పోలీసులు తెలిపారు. చంద్రకళను అరెస్టు చేసి మిగతా హంతకుల కోసం గాలిస్తున్నారు. -
మా బిడ్డను చంపేశాడు
విశాఖపట్నం: వివాహం చేసుకుంటానని తమ కుమార్తెను వంచించి వేరే వ్యక్తితో సంబంధం ఉందంటూ యశ్వంత్ అనే యువకుడు చంపేశాడని ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి ప్రాంతానికి చెందిన కార్తీక రామారావు, కార్తీక రామలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. కార్తీక నవ్యశ్రీ (25)ని ప్రేమికుడు యశ్వంత్ తామెవరం ఇంట్లో లేని సమయంలో ఈ నెల 2వ తేదీన చంపేశాడని తెలిపారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు కార్తీక నవ్యశ్రీ తల్లిదండ్రులు రామారావు, రామలక్ష్మి తెలిపిన వివరాలివి. 35 ఏళ్ల కిందట బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నామని వారు చెప్పారు. తమ కుమార్తె కార్తీక నవ్యశ్రీ, యశ్వంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. వారి పెళ్లికి రెండు కుటుంబాలు సమ్మతించాయన్నారు. ఈ నేపథ్యంలో కావ్యశ్రీకి హైదరాబద్‌లో ఉద్యోగం దొరకడంతో వెళ్లి ఉద్యోగం చేసుకోమని యశ్వంత్ ఆమెతో చెప్పాడని పేర్కొన్నారు. అక్కడి నుంచే వేధింపులు ప్రారంభం.. కావ్యశ్రీ హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటుండగా అనుమానం పెంచుకున్న యశ్వంత్ నీవు ఎవరితోనో తిరుగుతున్నావని తరచూ వేధించేవాడని, కావ్యశ్రీని వైజాగ్ వచ్చేయమని చెప్పడంతో ఆమె మూడు నెలల కిందట వచ్చి వర్క్ ఫ్రం హోం చేస్తుందని తెలిపారు. మేము లేనప్పుడు.. గత నెల 29న ఇంటి పని కోసం కొత్తూరు వెళ్లామని, కావ్యశ్రీ నుంచి ఫోన్ వచ్చిందని, యశ్వంత్ తనను వేధిస్తున్నాడని చెప్పిందన్నారు. మూడు రోజుల పాటు యశ్వంత్ కావ్యశ్రీతోనే ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (2వ తేదీ వేకువ జాము) యశ్వంత్ నుంచి తమకు ఫోన్ వచ్చిందని, కావ్యశ్రీ ఉరి పోసుకున్నట్టు తెలిపాడన్నారు. ఉదయం వచ్చి చూసే సరికి తమ కుమార్తె చనిపోయి ఉందన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇంట్లో ఉన్న హుక్ కూడా ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకునేంతగా ఉండదని, యశ్వంతే తమ కుమార్తెను చంపేసి ఉండాడని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికులు, కావ్యశ్రీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి యశ్వంత్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్‌లో ఉన్నాడు. -
అన్నా చెల్లెళ్ల ‘లవ్ స్టోరీ’ అలా ముగిసింది!
తమిళనాడు: తిరుపోరూర్ పక్కన ఉన్న తండలం పంచాయతీకి చెందిన సెల్వరాజ్ కుమారుడు సురేంద్రన్ (28). అతనూ షోలింగనల్లూర్‌లో నివసించే బంధువు ప్రియాంక (25) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇంజినీర్ అయిన ప్రియాంక, పోరూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. సురేంద్రన్ తల్లి, ప్రియాంక తల్లి అక్కాచెల్లెళ్లు. దీంతో ఆ కుటుంబాల్లో ఎవరూ సురేంద్రన్, ప్రియాంక స్నేహాన్ని పెద్ద విషయంగా తీసుకోలేదు. వారి స్నేహం చివరికి ప్రేమగా మారింది. ఈ విషయం వారికి తెలియగానే రెండు కుటుంబాలూ తీవ్రంగా వ్యతిరేకించాయి. వారి మధ్య ప్రేమ ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని హెచ్చరించాయి. అయితే అప్పటికే ప్రియాంక గర్భవతి అయింది. దీంతో తమ వివాహానికి సమ్మతి తెలపాలని ప్రేమికులిద్దరూ కుటుంబ సభ్యులను కోరారు. కానీ రెండు కుటుంబాలు దీనిని వ్యతిరేకించాయి. అంతేకాకుండా ప్రియాంక 8 నెలల గర్భవతి కావడంతో గర్భాన్ని తొలగించడం అసాధ్యంగా మారింది. దీని కారణంగా, ప్రేమికులిద్దరూ ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఇదే సమయంలో ఎంతకూ తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో సురేంద్రన్, ప్రియాంక మనస్తాపంతో మంగళవారం రాత్రి తండలం ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. బయటకు వెళ్లిన సురేంద్రన్ తిరిగి రాకపోయేసరికి, అతని బంధువులకు అనుమానం వచ్చి అతని కోసం వెతకడానికి వెళ్లారు. స్థానికంగా ఉండే పంపు సెట్ రూంలో సురేంద్రన్, ప్రియాంక మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. ఈ సంఘటన గురించి తిరుపోరూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య!
నంద్యాల: భర్తను తమ్ముడితో కలిసి చంపేసి.. ఆపై మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి నంద్యాలలోని భర్త ఇంటి వద్ద విడిచిపెట్టింది ఓ మహిళ. నంద్యాల టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. నంద్యాలలోని నూనెపల్లెకు చెందిన రమణయ్య (50)కు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్యోతి, చందన, సాయి సంతానం. దంపతుల మధ్య మనస్పర్ధల కారణంగా భార్య కొంతకాలంగా పుట్టిల్లు అయిన పిడుగురాళ్లలో ఉంటోంది. ఈ క్రమంలో భార్యతో మాట్లాడి ఇంటికి తీసుకొని రావడానికి రమణయ్య పిడుగురాళ్లకు సోమవారం రాత్రి వెళ్లాడు. అక్కడ భార్య బంధువులు, రమణయ్య మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమణమ్మ, ఆమె తమ్ముడు రామయ్య కలిసి, రమణయ్య కంట్లో కారం చల్లి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తమ్ముడితో కలిసి భర్త మృతదేహాన్ని కారులో నంద్యాలలోని ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చి, అక్కడ పడేసి పరారయ్యారు. మృతుడి ముఖంపై కారంపొడి ఉండటం..తల, వీపుపై గాయాలు ఉండటంతో రమణయ్య కుమార్తెలు జ్యోతి, చందన నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ పోలీసులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ చదవొద్దన్నందుకు భర్తపై కేసు
నంద్యాల: బీటెక్ చదవొద్దన్న భర్తపై భార్య పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై ఆదోని త్రీటౌన్ ఎస్ఐ రామస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో ఎంఐజీ కాలనీకి చెందిన వర్షితకు మేనత్త కొడుకు అయిన బనగానపల్లికి చెందిన ఓంప్రకాష్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. సంతానం లేదు. వర్షిత హైదరాబాదులో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. వర్షితను చదువు మాన్పించేందుకు భర్త ఒత్తిడి తెచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన వర్షిత ఆదోనిలోని పుట్టింటికి చేరుకుంది. ఘటనపై బుధవారం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె భర్తను పిలిపించి ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చినా కూడా భార్యను చదివించేందుకు ఓంప్రకాష్ ఒప్పుకోలేదు. దీంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ఓంప్రకా‹Ùపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రాత్రి 11కి ఎవరితో మాట్లాడుతున్నావ్..!
వికారాబాద్: ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా వని ప్రశ్నించినందుకు భర్తను గొంతు నులిమి చంపేసిందో భార్య. కూతురుకు మంచీచెడు చెప్పాల్సిన తండ్రి ఇందుకు సహకరించడం గమనార్హం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ నగేశ్, స్థానికుల వివరాల ప్రకారం.. మల్కాపూర్‌కు చెందిన రెడ్డిపల్లి వెంకటేశ్ (33)కు ఇదే మండలం కోత్లాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఈశ్వర్ ప్రసాద్ (10), సుకుమార్ (7) కుమారులు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సంసారంలో ఓ ఫోన్ కాల్ చిచ్చురేపింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో నాలుగేళ్లు దూరంగా ఉన్నారు. ఇటీవలే నచ్చజెప్పిన ఇరుకుటుంబాల వారు దంపతులిద్దరినీ కలిపారు. జయశ్రీ తండ్రి పండరి సైతం వీరితో పాటే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం బోనాల పండుగ నేపథ్యంలో రాత్రి 11గంటల వరకు వెంకటేశ్ బయటే గడిపాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లగా భార్య ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం వెంకటేశ్ నిద్రపోయాడు. పక్క వీధిలో ఉండే మృతుడి సోదరులు శ్రీనివాస్, కృష్ణ సోమవారం ఉదయాన్నే వచ్చి తమ్ముడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా చలనం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేశ్, ఎస్ఐలు రాథోడ్ వినోద్, సాజిద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ నాన్నను అమ్మ, తాత కలిసి గొంతు నులిమి చంపేశారని మృతుడి కుమారులు డీఎస్పీకి చెప్పారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. -
భర్త బర్త్ డే విషెస్ చెప్పలేదని టీచర్..!!
ఏలూరు: అనుమానాస్పద స్ధితిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక (38) తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది. నూజివీడు సమీపంలో బత్తులవారిగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మందాడ లక్ష్మయ్య, ప్రభావతి కుమార్తె దేవికను పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామానికి చెందిన చిన్ని సురేంద్రకిచ్చి 20 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి పవన్ తేజ, గౌతమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవిక ఉంగుటూరు మండలం నల్లమాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సురేంద్ర ఉంగుటూరు మండలం రాచూరు పాఠశాలలో హెచ్ఎంగా ఉన్నారు. చొదిమెళ్ళ శ్రీవల్లి అపార్ట్‌మెంట్స్‌లో ఐదేళ్ల కిందట అపార్ట్మెంట్ కొన్నారు. ఉద్యోగాల నిమిత్తం ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఉంటున్నారు. శని, ఆదివారాలు ఏలూరు అపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటారు. శనివారం సాయంత్రం 5 గంటలకు సురేంద్ర వచ్చేసరికి ఉరి వేసుకుని భార్య దేవిక మృతి చెంది ఉంది. మనస్తాపంతో కాళ్లు, చేతులపై అతను తీవ్రంగా కోసుకున్నాడు. దేవిక పుట్టిన రోజు సందర్భంగా కుమారులు శుభాకాంక్షలు చెప్పేందుకు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వారు లిఫ్ట్ చేయకపోవడంతో ఏలూరులోనే ఉంటున్న పెదనాన్నకు చెప్పడంతో అతను అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా రక్తమడుగులో ఉన్న తమ్ముడు కనిపించాడు. వెంటనే పోలీసులకు, సురేంద్ర మామ లక్ష్మయ్యకు విషయం తెలియచేసి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అపార్ట్‌మెంట్‌ను పరిశీలించారు. మృతిపై అనుమానాలు: మృతురాలి తండ్రి తన కూతురు దేవిక మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలు తండ్రి లక్ష్మయ్య తెలిపారు. పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని కోరారు. టీచర్ మృతి చెందిన అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పనిచేయటం లేదని సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరి సెల్‌ఫోన్ డేటా కీలకం కానుంది. పుట్టినరోజు నాడే తన కుమార్తె దేవిక మృతి చెందటం తట్టుకోలేకపోతున్నానని తండ్రి లక్ష్మయ్య కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న కూతురుగా గారాబంగా పెంచమని ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు. -
భార్యను చంపి.. భర్త ఆత్మహత్య
చంద్రగిరి: భార్య మీద అనుమానంతో ఓ భర్త ఆమె గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం.. చిత్తూరు సమీపంలోని ఠాణాకు చెందిన లోకేశ్వర్(45)కు, మంగళం సమీపంలోని తిరుమల నగర్‌కు చెందిన ఉష(34)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 14 ఏళ్ల బాబు, 11 ఏళ్ల పాప ఉన్నారు. వీరిద్దరూ కోళ్లఫారం కాలనీలో నివాసం ఉంటున్నారు. లోకేశ్వర్ బీఎస్ఎన్ఎల్లో టెక్నీషియన్ కాగా, ఉష స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనిచేస్తోంది. భార్య ఉషపై లోకేశ్వర్‌కు అనుమానం ఉండటంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గత నెల 30న భార్యభర్తల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో ఉష.. కాలనీ సమీపంలోని తిరుమలనగర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇదిలా ఉండగా, ఉద్యోగానికి వెళ్లేందుకు శనివారం ఉదయం 5 గంటలకు ఉష తన అమ్మ ఇంటి నుంచి బయల్దేరింది. భార్య కోసం బొమ్మల క్వార్టర్స్ వద్ద లోకేశ్వర్ కాపు కాశాడు. బస్సు కోసం బొమ్మల క్వార్టర్స్ వద్దకు వచి్చన ఉషపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి.. ఆమె గొంతు కోశాడు. దీంతో ఘటనా స్థలంలోనే ఉష ప్రాణాలు విడిచింది. ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, సీఐ సునీల్‌కుమార్‌లు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. లోకేశ్వర్ కోసం అతని ఇంటికి వెళ్లగా.. అప్పటికే ఇంట్లో లోకేశ్వర్ ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. -
కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ కారు ధ్వంసంపై కేసు ఏది?
చిలకలపూడి(మచిలీపట్నం): ఈనెల 12న కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన ఘటనలో జిల్లా పరిషత్ అధికారులు ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. గుడివాడలో జరుగుతున్న వైఎస్సార్సీపీ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన జెడ్పీ చైర్పర్సన్ కారుపై టీడీపీ గూండాలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన వాహనం. ఈ ఘటన జరిగి ఐదు రోజులు కావస్తున్నా జిల్లా పరిషత్ అధికారులు ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేసిన వారిపై ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి నేతల ఒత్తిళ్లకు అధికారులు లోనయ్యారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా పరిషత్ సీఈవో కె.కన్నమనాయుడును ‘సాక్షి’ వివరణ కోరగా చైర్పర్సన్ ఉప్పాల హారిక సూచనల మేరకు కారులో ప్రయాణిస్తున్న తమ కార్యాలయ డ్రైవర్, అటెండర్ల రాతపూర్వక స్టేట్మెంట్లను తీసుకుని అప్పుడు ఫిర్యాదు చేస్తామని చెప్పటం గమనార్హం. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దాడి ఘటన గురించి ఇంతవరకు జెడ్పీ సీఈవో అడగటం గాని, గాయపడిన చైర్పర్సన్ ఉప్పాల హారికను పరామర్శించటం గాని జరగలేదంటే ఆయన కూటమి నాయకుల చెప్పుచేతల్లో ఉన్నారనే విషయం అర్థమవుతోందని బాహాటంగానే విమర్శిస్తున్నారు. -
‘అయ్యోపాపం.. గణేశ్ ప్రాణం గాలిలో కలిసి పోయిందా?’
పెద్దపల్లిరూరల్: ‘అయ్యోపాపం.. అన్నెంపున్నెం ఎరగని గాండ్ల గణేశ్(37) ప్రాణం గాలిలో కలిసి పోయిందా?’ అని రాఘవాపూర్ గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు, గ్రామ స్తుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలో స్క్రాప్ వ్యాపారం చేసే పస్తం జంపయ్య వద్ద గాండ్ల గణే శ్ పదేళ్లకుపైగా సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జంపయ్య కుటుంబంలోనూ ఆ యన ఒకడిగా ఉంటున్నాడు. మంగళవారం జంపయ్య సోదరి లక్ష్మి, బావ మారయ్య పంచాయితీకి ఇతను కూడా సుగ్లాంపల్లి గ్రామ సమీపంలోకి వెళ్లాడు. గతంలో మాదిరిగానే ఇదికూడా సా ధారణ పంచాయితీగానే ఉంటుందని భావించా డు. అనూహ్యంగా జరిగిన కత్తుల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.జీతమే ఆధారం..నిరుపేద కుటుంబీకుడైన గాండ్ల గణేశ్ రాఘవాపూర్ గ్రామంలో అందరితో మర్యాదగా ఉంటాడు. యజమాని ఇచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. భార్య రజిత, కూతురు రిత్విక(4) ఉన్నారు. స్క్రాప్ వ్యాపారం సాగించే పస్తం జంపయ్య వద్ద సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తుంటాడు.మాకు దిక్కెవరు?‘అయ్యో.. వివాదంతో ఏసంబంధం లేనితన భర్త ను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు.. ఇక మాకు దిక్కెవర’ని మృతుడు గణేశ్ భార్య రజిత రోదించిన తీరు కలచివేసింది. నాలుగేళ్ల పాపతో ‘నువు లేకుండా ఎలా బతికేద’ని విలపిస్తున్న తీరు స్థానికులను చలింపజేసింది.పరిహారం చెల్లింపు!జీతంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గాండ్ల గణేశ్ మృతి చెందడంతో ఆ కుటుంబానికి ఏ ఆధారం లేకుండా పోయిందని, మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని గ్రామపెద్దలు, బంధువులు డిమాండ్ చేశారు. ఇరువర్గాల మధ్య జరిపిన చర్చల్లో అంత్యక్రియల కోసం రూ.లక్షతో పాటు కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం.పెగడపల్లిలో విషాదంకాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సుగ్లాంపల్లిలో జరిగి న భార్యాభర్తల పంచాయితీ ఘర్షణలో మోటం మల్లేశం మృతి చెందడంతో పెగడపల్లి గ్రామంలో విషాదం అలముకుంది. మల్లేశం బతుకుదెరువు కోసం సుమారు 15 ఏళ్ల క్రితం పెగడపల్లి గ్రామానికి వలస వచ్చాడు. బోళ్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, ముత్తారం మండలాల్లో వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం చేపట్టిన సొంతింటి నిర్మాణం చివరి దశలో ఉంది. గృహప్రవేశం చేయాల్సి ఉంది. ఇంతలోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు హతాశులయ్యారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, మాజీ సర్పంచ్ సుజాత, కాంగ్రెస్ నాయకులు మియాపురం సతీశ్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
బామ్మర్ది భార్యతో బావ వివాహేతర సంబంధం..!
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: భర్త వేధింపులతో విసిగిపోయిన మహిళ తన సోదరుడు, ప్రియుడితో కలిసి అతడిని కారుతో ఢీకొట్టించి చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు ఈ ఘటనపై అనుమానంతో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ ఆకాం„Š యాదవ్ మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. అసలు జరిగింది ఇదీ..ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36)కి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పొట్టెపాక మహేశ్ సోదరి స్వాతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్వామి భువనగిరిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్‌గా పనిచేసేవాడు. స్వామి భార్య స్వాతి కూడా భువనగిరి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఎస్ఎన్ మోటార్స్‌లో పనిచేసేది. ఆ పక్కనే మార్బుల్ దుకాణంలో పనిచేసే తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుంటిపల్లి సాయికుమార్‌తో స్వాతికి పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత స్వాతి పనిచేసే ఎస్ఎన్ మోటార్స్ మూతపడింది. ఈ క్రమంలో స్వాతి పల్లెర్ల గ్రామానికి వచ్చి ఇంటికే పరిమితమైంది. కొన్ని రోజుల తర్వాత స్వామికి భువనగిరి నుంచి మోత్కూరుకు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో స్వామి తన భార్య స్వాతిని తాను పనిచేసే ట్రాక్టర్ షోరూంలోనే ఉద్యోగంలో చేర్పించాడు. గొడవలు ఇలా..స్వాతి సోదరుడు మహేశ్‌కు ఇద్దరు భార్యలు. మహేష్ మొదటి భార్యతో స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మహేష్‌కు తెలియడంతో తన బావ స్వామిపై కోపం పెంచుకున్నాడు. స్వామికి వరుసకు సోదరి అయిన తన భార్యతో సంబంధం పెట్టుకున్న విషయాన్ని మహేష్ స్వాతితో చెప్పాడు. దీంతో స్వాతి తన భర్త స్వామిని నిలదీసింది. నన్నే నిలదీస్తావా అంటూ స్వామి స్వాతిని మానసికంగా, శారీరకంగా వేధించడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో స్వామి, స్వాతి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే గతేడాది ఫిబ్రవరిలో పని నిమిత్తం మోత్కూరుకు వెళ్లిన సాయికుమార్‌కు అక్కడ స్వాతి కలిసింది. తన భర్త వేధిస్తున్న విషయాన్ని స్వాతి సాయికుమార్‌కు వివరించింది. సాయికుమార్ స్వాతిని ఓదార్చాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అక్క స్వాతి, సాయికుమార్ వివాహేతర సంబంధానికి మహేష్ కూడా సహకరించాడు. తమను వేధిస్తున్న స్వామిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని స్వాతి, మహేష్ నిర్ణయించుకున్నారు. వాట్సాప్ గ్రూపు ఏర్పాటుస్వామిని హత్య చేయడానికి సాయికుమార్, స్వాతి, మహేష్ ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలలుగా వాట్సాప్ గ్రూపులోనే మాట్లాడుకుని తర్వాత కాల్స్ డిలీట్ చేసేవారు. స్వాతి తన ప్రియుడు సాయికుమార్ నంబర్‌ను కూడా సెల్ఫోన్లో ఫీడ్ చేసుకోలేదు. కారు అద్దెకు తీసుకుని..ఈ నెల 13న తన భర్త స్వామి భువనగిరికి పనిమీద వస్తున్న విషయాన్ని స్వాతి.. సాయికుమార్, మహేష్‌కు చెప్పింది. దీంతో వారు స్వామి కదలికలపై భువనగిరిలో నిఘా పెట్టారు. స్వామిని హత్య చేయడానికి పథకం ప్రకారం సాయికుమార్.. తన స్నేహితుడైన భువనగిరి పట్టణంలోని తాతానగర్‌కు చెందిన చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో కారును సెల్ప్ డ్రైవింగ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. స్వామి భువనగిరిలో పని ముగించుకుని రాత్రి వేళ తన స్నేహితుడు మద్దికుంట వీరబాబుతో కలిసి బైక్‌పై పల్లెర్ల గ్రామానికి బయల్దేరాడు. స్వామిని సాయికుమార్ కారులో వెంబడించాడు. రాత్రి 11.15 గంటల సమయంలో మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ శివారులోకి రాగానే కారుతో బైక్‌ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయారు. రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొట్డడంతో స్వామి అక్కడిక్కడే మృతిచెందగా.. బైక్‌పై వెనుక కూర్చున్న వీరబాబుకు గాయాలయ్యాయి. కారు అతివేగంగా వెళ్లి బైక్‌ను ఢీకొట్టిన అనంతరం కంట్రోల్ కాలేదు. రోడ్డు కిందకు 50 మీటర్ల వరకు దూసుకుపోయింది. అక్కడ ఫెన్సింగ్ కడీలకు తగిలి ముందుకు కదలకుండా ఆగిపోయింది. సాయికుమార్‌కు çస్వల్పంగా గాయాలయ్యాయి. స్వామిని హత్య చేసేందుకు ప్లాన్ అమలు చేస్తున్న సమయంలో మహేష్, స్వాతి, సాయికుమార్ వాట్సాప్ గ్రూప్ కాల్లో మాట్లాడుకున్నారు. వాట్సాప్ కాల్లో స్వామిని కారుతో ఢీకొట్టి చంపేశామన్న విషయం సాయికుమార్ ద్వారా తెలుసుకున్న స్వాతి తమ్ముడు మహేశ్ ద్విచక్ర వాహనంపై ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న సాయికుమార్, రామలింగస్వామిని బైక్‌పై ఎక్కించుకుని భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వదిలేశాడు. ఆస్పత్రికి వచ్చిన భార్య, బావమరిది ఘటనా స్థలంలో స్వామి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌లో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ద్వారా ఫోన్లో విషయం తెలుసుకున్న స్వాతి, మహేష్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏడుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు.నిందితుల అరెస్ట్గుంటి సాయికుమార్, స్వాతి, పొట్టెపాక మహేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు భునగిరి డీసీపీ ఆకాం„Š యాదవ్ తెలిపారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ శంకర్‌గౌడ్, మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్‌యాదవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.కారుతో.. కదిలిన డొంకరోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్‌యాదవ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు పక్కన ఆగిపోయిన కారును చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారులో ముందు భాగం దెబ్బతినడంతో కారు నంబర్ ఆధారంగా కారు యజమానికి ఫోన్ చేసి విచారించగా.. సాయికుమార్ సెల్ప్ డ్రైవింగ్ కోసం కారు అద్దెకు తీసుకెళ్లాడని సమాచారం ఇచ్చాడు. దీంతో సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. సాయికుమార్ సెల్‌ఫోన్ చెక్ చేయగా స్వాతి నంబర్ కనిపించింది. దీంతో స్వాతిని తీసుకొచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే నిందితులు స్వామి కాళ్లు, చేతులు విరిచి దివ్యాంగుడిని చేయాలనుకున్నారని తెలిసింది. అయితే అదికాస్త వికటించి అతడు మృతిచెందాడు. -
గండికోట: వైష్ణవిది హత్యా? పరువు హత్యా?
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి(17) సోమవారం కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి విగతజీవిగా కనిపిచింది. ఇప్పటిదాకా తేలిన వివరాల ప్రకారం.. ఉదయం 8గంటలకు తన ప్రియుడు లోకేశ్‌తో బైక్‌పై గండికోటకు బయలుదేరింది. వీరు మధ్యలో పాలకోవ సెంటర్ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోల్ గేట్‌కు చేరుకున్నట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అక్కడ 2 గంటల పాటు తిరిగి 10:47 నిమిషాలకు బైక్‌పై లోకేశ్ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది.వైష్ణవి కాలేజీకి రాలేదని యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని, తాము కాలేజీకి వెళ్లి ఆరా తీస్తే వైష్ణవి గండికోటకు వెళుతున్నానని తన స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని మృతురాలి సోదరుడు సురేంద్ర పోలీసులకు చెప్పాడు. దీంతో తాము గండికోటకు వెళ్లి గాలించగా.. మంగళవారం ఉదయం తన సోదరి మృతదేహం కనిపించిందని పేర్కొన్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు లోకేష్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.హత్యా? పరువు హత్యా.?సోమవారం ఉదయం 10:28 నిమిషాల వరకు వైష్ణవి, లోకేశ్ కలిసే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోమవారం ఉదయమే వైష్టవిని హత్య చేసి ఉంటే శరీరం డీకంపోజ్ అయ్యేదని, మృతదేహం చూస్తే రాత్రి చంపినట్లు ఉందని పోలీసులు గుర్తించారు. నిర్జన ప్రాంతంలో బాలిక బంధువులు మృతదేహం ఉందని గుర్తించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీంతో నిజంగా ఇది హత్యా లేక పరువు హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పర స్త్రీ, పురుష వ్యామోహంలో పడిన ఆలుమగలు పెళ్లి అనే పవిత్ర బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన దంపతులు అర్ధంతరంగా విడిపోతున్నారు. మరికొందరు నిండు జీవితాన్ని ఫణంగా పెట్టి లోకం విడిచివెళ్తున్నారు.వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు ఘటనలు పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా చేశాయి. ఓ డాక్టర్.. రీల్స్ చేసే యువతితో ప్రేమాయణం సాగించగా, తట్టుకోలేక వైద్యురాలైన భార్య తనువు చాలించింది. వరంగల్: ఓ డాక్టర్ కుటుంబంలో రీల్స్ గర్ల్ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది. ‘బుట్టబొమ్మ’ ఐడీతో ఇన్‌స్టా, ఫేస్బుక్ వేదికగా రీల్స్ చేసే ఆ యువతి పట్ల డాక్టర్ ఆకర్షితుడయ్యాడు. చివరికి ఇరువురు పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. దీంతో ఆ డాక్టర్ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి డాక్టర్ భార్య, డెంటల్ వైద్యురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరఫున వారు చెబుతుండగా, తన కూతురుని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి పద్మావతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్ నగరంలోని వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.అత్తామామలకు చెప్పినప్పటికీ..డాక్టర్ సృజన్, రీల్స్ గర్ల్ మధ్య సంబంధంపై ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో డాక్టర్ సృజన్ తన భార్య ప్రత్యూషను శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తామామలు పుణ్యవతి–మధుసూదన్‌కు చెప్పింది. అయినప్పటికీ వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరికి వారి బంధం పెళ్లిదాకా వచ్చింది. ఇంట్లో గొడవలు సాగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్యూష నగరంలోని ఎన్ఎస్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి పద్మావతికి సృజన్ ఫోన్ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. వెంటనే పద్మావతి ఆస్పత్రికి వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించింది. కాగా, డాక్టర్ సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ఎంజీఎం : డాక్టర్ ప్రత్యూష మృతదేహానికి సోమవారం ఎంజీఎం మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈసందర్భంగా బంధువులతోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున మార్చురీకి తరలివచ్చారు. ప్రత్యూష కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీఎన్జీఓస్ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఓ యూట్యూబర్, రీల్స్ చేసే యువతి మాయలో పడి యువ వైద్యురాలు ప్రత్యూష మృతికి కారణమైన డాక్టర్ సృజన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, మార్చురీ వద్ద పోలీసులు మృతురాలి తల్లి పద్మావతితో మాట్లాడి వివరాలు సేకరించారు.రీల్స్ గర్ల్ ఎంట్రీ ఇలా..డాక్టర్ సృజన్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కార్డియాలజీ వైద్యుడు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఓ యువతి ప్రమోషన్ వర్క్ కోసం అక్కడికి వచ్చింది. అక్కడున్న వైద్యులతో ముఖాముఖి నిర్వహించింది. ఆ సమయంలో ఆ యువతి పట్ల డాక్టర్ సృజన్ ఆకర్షితుడయ్యాడు. ఈసందర్భంగా ఇరువురు పరిచయం పెంచుకున్నారు. ఆమె వివిధ భంగిమల్లో చేసే రీల్స్ చూసి మరింత దగ్గరయ్యాడు. ఆ యువతి తన రీల్స్‌లో తాను గుండె ఆపరేషన్‌ను లైవ్‌గా చూసినట్లు పోస్టులు కూడా పెట్టింది. అంటే సృజన్ ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకెళ్లినట్లు స్పష్టమవుతోంది. సృజన్ కారును కూడా పూర్తిగా ఆమె వాడేదని సమాచారం. ఇటీవల ప్రత్యూష రెండో కాన్పు సమయంలో తల్లిగారింటికి వెళ్లినప్పుడు ఆ యువతి విల్లాకు వచ్చిందని, అంతగా వారి ప్రేమబంధం బలపడిందని స్థానికులు చెబుతున్నారు. -
ప్రేమించుకున్న అన్నాచెల్లెళ్లు.. గ్రామానికే అరిష్టమని..!
ఒడిశా: ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ప్రేమికులను నాగలికి కట్టి ఊరేగించిన ఘటన సంచలనం రేకెత్తించింది. జిల్లాలోని నారాయణ పట్న సమితి, బొరికి గ్రామ పంచాయతీ పెద్ద ఇటికి గ్రామంలో ఒకే వంశానికి చెందిన ఇద్దరు గిరిజనులు ప్రేమించుకున్నారు. ఈ విషయం రథయాత్ర సమయంలో వెలుగులోకి రావడంతో పెద్దలు కఠిన శిక్ష విధిస్తారనే భయంతో వీరు ఆంధ్రాకు పారిపోయారు. కానీ, వారి ఆచూకీని ఇరు కుటుంబాల వారు పసిగట్టి గ్రామ పెద్దలకు నివేదించారు.ఒకే వంశానికి చెందిన వీరిద్దరూ అన్నాచెల్లెళ్లు అవుతారు. వీరిద్దరూ ప్రేమించుకోవడం గ్రామానికే అరిష్టమని, పంటలు పండవని, పాపశుద్ధి జరగాలని పేర్కొంటూ వీరిని ఆదివారం ఊరికి రప్పించారు. అయితే ప్రేమికులు తాము ఎలాంటి శిక్షనైనా భరిస్తాం గానీ విడిపోయి ఉండలేమని తేల్చి చెప్పారు. దీంతో వారిని గ్రామం నడిబొడ్డున నాగలికి కట్టి ఊరేగించి శుద్ధిజలం చల్లారు. శిక్ష అమలు తర్వాత ఇద్దరూ కలిసి ఉండొచ్చని పెద్దలు నచ్చజెప్పి తీసుకురావడం గమనార్హం. -
కాలేజీకి వెళ్లే కూతుళ్లు ఉన్నా, జల్సాలకు మరిగిన భార్య..!
యశవంతపుర: భర్త అనే గౌరవంలేదు. పార్టీ, పబ్ అంటూ తిరగటం, తన విలాసవంతమైన జీవనం కోసం ఆరాటం, అందుకే హత్యాయత్నం చేశానని కన్నడ బుల్లితెర నటి మంజుళ శ్రుతి (38) భర్త అమరేశ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇటీవల బెంగళూరు హనుమంతనగర పోలీసుస్టేషన్ పరిధిలోని మునేశ్వర బ్లాక్‌లో ఇంట్లో ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేయడం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఫిర్యాదు మేరకు భర్త అమరేశ్‌ను అరెస్టు చేశారు. ఇందుకు భార్య ధోరణే కారణమని చెప్పాడు. ఆమెకు ఏమాత్రం మానవత్వం లేదు, పిల్లలను ఇంటిలో పెట్టి పబ్, పార్టీలంటూ తిరుగుతుంది. అర్ధరాత్రి ఇంటికొచ్చేది. ఒక్కోసారి ఇళ్లు వదిలితే 15 రోజులైనా కనబడదు. కుంభమేళా అంటూ 15 రోజులు అడ్రస్ లేదు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాలేజీకీ వెళ్లే ఇద్దరు కూతుళ్లు ఉండగా, నేను రూ.25 లక్షలతో ఒక అపార్ట్మెంట్ ఫ్లాటును కొనాలనుకున్నా. కానీ ఆ డబ్బు తీసుకుని పారిపోవాలని ప్లాన్ వేసుకొంది. విపరీతంగా వేధిస్తూ ఉండడంతో కత్తితో దాడి చేశాను అని విచారణలో తెలిపాడు. కాగా బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
అన్నను అతికిరాతకంగా చంపిన తమ్ముడు
మెదక్: సొంత అన్ననే తమ్ము డు కిరాతకంగా హతమార్చిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... వసురాంతండాకు చెందిన రామావత్ మంత్యా (48)కు తండా పక్కనే పొలం ఉంది. ఇతని సొంత తమ్ముడు మోహన్ కూడా ఇదే తండాలో నివాసం ఉంటున్నాడు. గత యాసంగి సీజన్లో మోహన్ ట్రాక్టర్‌తో మంత్యా తన పొలాన్ని దున్నించాడు. కిరాయి డబ్బు చెల్లించలేదు. ఈ విషయమై అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోహన్ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతుండటం, నెల క్రితం అతడి మనవరాలు అనారోగ్యంతో చనిపోయింది. అన్న మంత్యా మంత్రాలు చేయడం కారణంగానే ఇలా జరిగిందని భావించాడు. రెండు రోజుల క్రితం పొలం దున్నడానికి అదే తండాకు చెందిన భిక్షపతి ట్రాక్టర్‌ను మంత్యా మాట్లాడాడు. విషయం తెలుసుకున్న మోహన్ తన డబ్బులు ఇవ్వకుండా ఎవరూ పొలం దున్నేది లేదంటూ గొడవపడ్డాడు. ఉద యం కల్లు దుకాణంలో మోహన్, భిక్షపతి కల్లు తాగారు. దున్నకం విషయమై మాట్లాడాలంటూ భిక్షపతి మంత్యాకు ఫోన్ చేయగా అక్కడకు వచ్చాడు. డబ్బుల విషయమై అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మోహన్ పక్కనే ఉన్న కల్లు సీసాను పగలగొట్టి మంత్యా గొంతులో ఇతర శరీర భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. ఆపై బండరాయితో తలపై, మర్మాంగాలపై మోదాడు. చేతి రుమాలుతో మెడకు బిగించి నేలపై తలను కొట్టి, కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. విషయం తెలుసుకున్న మంత్యా భార్య లక్ష్మి , కుమారుడు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న మంత్యాను కొల్చారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు తెలిపారు. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటన మొత్తాన్ని కల్లు దుకాణంలో ఉన్న కొందరు ఫోన్లో చిత్రీకరిస్తూ నిలుచున్నారే తప్ప ఘోరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఆ గుండె ఆగి ఉంటే..
‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు’ అనేది నానుడి. ‘రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు తప్ప’ అనే మరో నానుడి ఉంది. ఈ రోజుకు మిత్రుడు, మరొక రోజుకు ప్రత్యర్థి అవుతాడు. ఇది రాజకీయ జీవిత సత్యం. అయితే దశాబ్దాల రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో మహామహులు ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాష్ట్ర, దేశ స్థాయిలో అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించారు. కొందరు మంత్రులుగా, మరికొందరు ముఖ్యమంత్రి స్థాయిలో సేవలందించి, రాష్ట్రానికి కీర్తి కిరీటాన్ని అందించారు. కానీ కూటమి పాలనలో రాజకీయాలకు అర్థాలే మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీ నేతలపై విచక్షణ మరిచి విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అదే ప్రతిపక్షం ప్రతి విమర్శలు చేస్తే భౌతిక దాడులు పాల్పడుతూ బిహార్ సంస్కృతికి తెర లేపుతున్నారు. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో జరిగిన విధ్వంసం కూటమి దాష్టీక పాలనకు అద్దం పడుతోంది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో ప్రతి పక్షం ప్రశ్నించడమే పాపం.. విమర్శించడమే నేరమైపోయింది. ఏడాది పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను, స్థానిక నేతల అవినీతి, అక్రమాలను రాజకీయ వేదికలపై నిర్దిష్టమైన ఆధారాలతో విమర్శిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి నుంచి రౌడీమూకలతో విధ్వంసానికి తెగించారు. ప్రశాంతతకు, రాజకీయ ప్రతిష్టకు మారు పేరైన నెల్లూరులో వేమిరెడ్డి దంపతులు బిహార్ సంస్కృతికి తెర తీశారు. రాజకీయ విలువలకు పాత రేసి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. మాజీ మంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో బీభత్సం వెనుక టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల కుట్రతోనే జరిగిందని చెప్పకనే చెప్పారు. రౌడీమూకల విధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు చెబుతూనే తనపై ప్రసన్న చేసిన వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో కోపాన్ని ప్రదర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ‘నిజం’ చెప్పేశారు. టీడీపీ కార్యకర్తలను అయితే ఆపగలిగాము కానీ అభిమానులను ఆపలేకపోయామంటూ నిజం కక్కేసి పెద్ద మనుషుల ముసుగును తొలగించారు.వేమిరెడ్డి ఇంటి నుంచే విధ్వంస రచన? మాజీమంత్రి పసన్నకుమార్రెడ్డిని పక్కాగా హత మార్చేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచే విధ్వంస రచన జరిగిందనేది స్వయంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను బట్టి అర్థం అవుతోంది. ఓ ఎల్లో మీడియా చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆ ఘటనకు మాకు సంబంధం లేదంటూనే.. కార్యకర్తలను అయితే ఆపగలిగాము కానీ అభిమానులను ఆపలేకపోయామని, వెళ్లిన వారిని వెనక్కి రమ్మని చెప్పడం చూస్తే వారి ఇంటి నుంచే పక్కా ప్లాన్ రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది. సింహపురి రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చోటు చేసుకోలేదు. ప్రజా జీవితంలో ఉన్న వారిపై ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. వాటికి కౌంటర్ ఇవ్వడం, అవసరమయితే న్యాయపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మాత్రం హత్యలకు ప్రేరేపిత హింసను ప్రోత్సహిస్తున్నారని, ఆస్తుల విధ్వంసానికి పురిగొల్పుతున్న ఘటనలను జిల్లా ప్రజలు హర్షించడం లేదు. ఈ తరహా ఘటనలు ఇంత వరకు బిహర్ రాష్ట్రంలోనే జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తుంటాం. బిహర్ తరహా హింసను నెల్లూరులో పరిచయం చేయడం భవిష్యత్ పరిణామాలను చూస్తే ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఆ గుండె ఆగి ఉంటే..ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో పనివారితోపాటు ఆయన తల్లి 85 ఏళ్ల వృద్ధురాలు శ్రీలక్ష్మమ్మ ఉంది. దాదాపు ఆరు దశాబ్దాలకుపైగా రాజకీయ కుటుంబంలో మసలిన ఆమెకు ఇలాంటి ఘటనలు ఎన్నడూ ఎదురుకాలేదు. వందలాది మంది టీడీపీ రౌడీ మూకలు ఒక్కసారిగా రెండు వైపు ద్వారాల నుంచి ఇంట్లోకి ప్రవేశించి దాదాపు అర్ధగంట పాటు సాగించిన విధ్వంసానికి భయంతో ఆ పెద్దావిడ గుండె ఆగి ఉంటే పరిస్థితి ఏమిటనే జిల్లా ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. టీడీపీ గూండాలు సాగించిన బీభత్సానికి భీతిల్లిపోయిన ఆమె ప్రాణభయంతో బాత్రూమ్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పగిలిన కిటికీ అద్దాల్లో నుంచి భయంతో దైన్యంగా చూస్తున్న ఆమె చూపులు పలువురి గుండెలు తరుక్కుపోతున్నాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలకు దాడులు జవాబు కాదని వేమిరెడ్డి దంపతులు తెలుసుకోవాలని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.ప్రతి విమర్శలను తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే వేమిరెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అవినీతి చేశారంటూ, పర్సంటేజీల ప్రసన్న అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆమెను ఉద్దేశించి చేసిన ప్రతి విమర్శలు చేయడంతో తట్టుకోలేకపోయింది. ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన కూటమి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ ఉద్యమానికి ఊహించని స్థాయిలో ప్రజా స్పందన పెల్లుబుకింది. తాజాగా సోమవారం నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజాక్షేత్రంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రభ మనసక బారుతుండడంతో జీరి్ణంచుకోలేకపోయిన ఆమె తన అనుచర వర్గాన్ని ప్రసన్నపైకి ఉసిగొలి్పంది. ఆమె కీలక అనుచరులు గంట వ్యవధిలోనే వందల మందిని రౌడీమూకలను సమీకరించి ప్రసన్న ఇంట్లో విధ్వంసానికి ఒడిగట్టారు. ముందస్తు పథకం ప్రకారం ప్లాన్ అమలు జరిగినట్లు స్పష్టమవుతోంది. ముందుగా సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. పోలీసులు సైతం రౌడీ మూకలను చెదరగొట్టారే కానీ, అదుపులోకి తీసుకోలేదు. దీన్ని బట్టి పోలీసులకు సైతం సమాచారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కల్తీ కల్లు కల్లోలం!
సాక్షి, మేడ్చల్ జిల్లా: రాజధాని నగరంలో కల్తీ కల్లు కల్లోలం రేపింది. ఆరుగురి అమాయకుల ప్రాణాలను బలిగొంది. మోతాదుకు మించిన రసాయనాలు కలిపి తయారు చేసిన కల్లు తాగి నిరుపేదలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మంగళవారం నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న కల్లు కాంపౌండ్లలో హైదర్‌నగర్, సాయిచరణ్ కాలనీలకు చెందిన పలువురు కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వివిధ ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించగా.. బుధవారం వరకు ఆరుగురు మృతి చెందారు. మరో 32 మంది నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తనిఖీలు నామమాత్రం.. నగరం సహా శివారులోని పలు కాంపౌండ్లలో కల్లు అమ్మకాలపై తనిఖీలు చేయాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో కల్తీ కల్లు విక్రయాలకు అడ్డే లేకుండా పోయింది. ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు కల్లు కాంపౌండ్లపై నిఘా ఉంచకపోవడంతోనే వాటి యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. మోతాదుకు మించి రసాయనాలు కలిపి కల్తీ కల్లును తయారు చేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన ఎక్సైజ్‌శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వల్లే కూకట్పల్లి విషాదాంతం జరిగినట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా కల్లు కాంపౌండ్లు.. ప్రకృతి సిద్ధమైన తాటి, ఈత చెట్ల నుంచి తీసిన కల్లు ఆరోగ్యకరమైంది. స్వచ్ఛమైన ఈ కల్లును తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తొలగుతాయి. సాధారణంగా చెట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల కల్తీ కల్లు ఉండదని చెప్పవచ్చు. డిమాండ్ మేరకు కల్లు ఉత్పత్తి లేకపోవడం, అప్పటి వరకు ఈ వృత్తిపై ఆధారపడిన గీత కార్మికులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఫలితంగా కల్లుకు కొరత ఏర్పడింది. మద్యం ధరలు భారీగా ఉండటంతో రోజువారీ కూలీలు కృత్రిమంగా లభించే కల్లుతో సేదతీరుతున్నారు. వీరి బలహీనతను కొంత మంది కల్లు వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్ఫాజోలమ్ వంటి ప్రమాదకర రసాయపాలను వినియోగించి కల్లు తయారు చేస్తున్నారు. తయారీలో మోతాదుకు మించి రసాయనాలను వినియోగిస్తుండటంతో.. ఈ కల్లు తాగినవారు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గ్రేటర్‌తో సహా శివారుల్లోని పలు ప్రాంతాలు, బస్తీలు, పురపాలక సంఘాల్లో కల్తీ కల్లు విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కల్లు కాంపౌండ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, నమూనాలు సేకరించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమీ çపట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కల్తీ జరుగుతోందనే ఆరోపణలుతున్నాయి. ఒకే లైసెన్స్‌తో.. ఎన్నో కాంపౌండ్లు.. నగరంతో సహా పలు చోట్ల ఒకే కల్లు దుకాణం లైసెన్సు పొంది ఎక్కువ దుకాణాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఒక లైసెన్స్ ఒకటే దుకాణం నడిపించాల్సి ఉంటుంది. అయినా వ్యాపారులు మాత్రం ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వీరిపై ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంగానే మారుతోంది. నాడీ వ్యవస్థపై ప్రభావం.. డైజోఫాం ఇతర రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లు తాగిన వారిలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒంటి నొప్పులతో పాటు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని, మానసిక విచక్షణ కోల్పోయి పిచి్చగా ప్రవర్తిస్తుంటారని చెబుతున్నారు. ఈ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్షతగాత్రులకు సర్జరీల సమయంలో నొప్పి నివారణ కోసం ఇచ్చే మత్తు ఇంజక్షన్లు కూడా పని చేయవని, మోతాదుకు మించిన డోసు ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. సాధ్యమైనంత వరకు ఈ కల్లు తాగకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. -
తండ్రిని చంపేసి.. సెకండ్ షో సినిమాకు వెళ్లి..
మల్కాజ్గిరి జిల్లా: భర్త దగ్గరికి వెళ్లాలని మందలించాడని, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత తన తండ్రినే హత్య చేయించింది. తల్లి, ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా నమ్మించాలని యతి్నంచి కటకటాలపాలైంది. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరి«ధిలో జరిగింది. హత్య వివరాలను బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలి్పన మేరకు..ముషిరాబాద్ పరిధిలోని ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతులు. లింగం సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుండగా, శారద జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికురాలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ నెల 6న లింగం విధులు నిర్వహించడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించగా ఆ రోజు విధులకు రాలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న మధ్యాహ్నం పెద్ద కుమార్తె మనీషాకు పోలీసులు వాట్సాప్‌లో ఓ ఫోటో పంపి గుర్తించాలని కోరారు. మృతుడ్ని తండ్రిగా గుర్తించి..తల్లి శారదతో కలిసి ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్దకు వెళ్లారు. లింగం శవాన్ని చూసి బోరున విలపించారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతకోసి చంపారని శారద పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ముగ్గురూ కలిసి ... లింగం పెద్ద కూతురు మనీషా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో వీరి ఇంటి సమీపంలో ఉంటుంది. మహ్మద్ జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై లింగం కోపగించి..అతనితో సంబంధం మానేయాలని హెచ్చరించాడు. భర్త దగ్గరకు కాపురానికి వెళ్లిపోవాలని మనీషాను ఒత్తిడిచేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా తండ్రిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె తల్లి శారద, మహ్మద్ జావీద్ సహకరించారు. ఈమేరకు హత్య చేసిన తర్వాత శవాన్ని ఎక్కడ వేయాలో అని చర్చించి 15 రోజుల క్రితమే ఏదులాబాద్ చెరువును పరిశీలించి వెళ్లారు.కల్లులో నిద్ర మాత్రలు కలిపి... లింగంకు కల్లు తాగే అలవాటు ఉండడంతో అందులో నిద్రమాత్రలు కలపాలని జావీద్ ఈ నెల 5న శారదకు టాబ్లెట్లు అందించాడు. లింగం కల్లు తాగి ఇంట్లో పడుకోగా.. విషయాన్ని శారద..కుమార్తె మనీషా, జావీద్‌లకు సమాచారం ఇచి్చంది. మనీషా సమీపంలోని వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి వచి్చ..మరోసారి లింగంకు తాగించారు. అనంతరం శారద, మనీషాల సహకారంతో లింగం కాళ్లు చేతులు కట్టేసిన జావీద్..అతడి ముఖంపై దిండుతో అదిమి..పిడికిలితో గుండెపై మోది, గొంతు కోసి చంపేశారు. శవాన్ని ఇంట్లో వేలాడదీశారు. సినిమాకు వెళ్లి..క్యాబ్‌లో శవాన్ని తరలించి.. హత్య అనంతరం ముగ్గురు జావీద్ ఉండే ఇంటికి బైక్‌పై వెళ్లి.. అటునుంచి సెకెండ్ షో సినిమాకు వెళ్లారు. తిరిగొచ్చి శవాన్ని ఎదులాబాద్ చెరువులో పడేయడానికి క్యాబ్ బుక్ చేసుకున్నారు. లింగం అపస్మారక స్థితిలో ఉండడంతో డ్రైవర్ అనుమానించి కారు బుకింగ్ రద్దు చేసుకున్నాడు. మద్యం సేవించాడని, ఎదులాబాద్‌లో కుటుంబ సభ్యులకు అప్పగించాలని డ్రైవర్‌కు నచ్చజెప్పి ఒప్పించారు. కారులో శవంతో మనీషా, శారద ఉండగా..జావీద్ బైక్‌పై వెనుక అనుసరించి.. శవాన్ని చెరువు కట్టపై దించారు. క్యాబ్ వెళ్లగానే శవాన్ని చెరువులో పడేసి ముగ్గురు బైక్‌పై ఇంటికి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కుటుంబ సభ్యుల పైనే అనుమానం కలగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచి్చంది. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ సంతోషం..!
జనగామ జిల్లా: అతనికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ తోబుట్టువులే. తమ తల్లిని చంపాడన్న పగతో ఉన్న ఆ ఇద్దరూ భర్తను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం పిట్టలోనిగూడెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలోనిగూడేనికి చెందిన కాలియా కనకయ్యకు చొక్కమ్మ, గౌరమ్మలిద్దరూ భార్యలు. మే 18న కనకయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో అత్త జున్నుబాయిని (చొక్కమ్మ, గౌరమ్మల తల్లి) మామిడి తోటలో ఉండగా తాగిన మైకంలో గొడ్డలితో నరికి చంపాడు. మరో గ్రామంలో మామిడితోటలో ఉన్న తన ఇద్దరు భార్యలకు విషయం చెప్పకుండా వారిని తీసుకొని సిద్దిపేటకు పారిపోయాడు. తెల్లవారుజామున విషయం పోలీసులకు తెలిసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కనకయ్య సిద్దిపేటలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి పట్టుకునేలోపు పారిపోయాడు. ఈ విషయం చొక్కమ్మ, గౌరమ్మలకు తెలియడంతో పిట్టలోనిగూడేనికి తిరిగివచ్చారు. అప్పటినుంచి కనకయ్య పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పిట్టలోనిగూడెం వచి్చన కనకయ్య భార్యలతో గొడవ పడ్డాడు. దీంతో గూడెంలోని ప్రజలంతా నిద్రలేచి అక్కడకు వచ్చారు. గొడవ తీవ్రంగా జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన చొక్కమ్మ, గౌరమ్మలు.. వరుసకు సోదరులైన జనార్దన్, శ్రీనివాసులుతో కలిసి గొడ్డలితో కనకయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని గ్రామంలో నుంచి కొద్ది దూరం తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశారు. కనకయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ చెప్పారు. పీడ విరగడైంది..: నేర చరిత్ర కలిగిన కనకయ్య తాగిన మైకంలో ఏం చేస్తాడో తెలియదని, క్రూరమృగంలా ప్రవర్తించి.. మహిళలతో వావివరుసలు లేకుండా వ్యవహరిస్తాడని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. మహిళలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. అతని చేష్టలపై గతంలో పంచాయితీలు పెట్టి పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు చెప్పారు. -
సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఘటన.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
రౌడీషిటర్‌తో కౌన్సిలర్ వివాహేతర సంబంధం
తమిళనాడు: వీసీకే మహిళా కౌన్సిలర్ దారుణ హత్యకు గురైంది. రౌడీషిటర్‌తో ఇన్‌స్ట్రాగామ్‌లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడంతో భర్త, పిల్లలను వదిలి రౌడీషిటర్‌తో సహజీవనం కొనసాగించడానికి సిద్ధమైన మహిళా కౌన్సిలర్‌ను భర్త దారుణంగా హతమా ర్చాడు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ పెద్దకాలనీకి చెందిన కోమది(28) తిరునిండ్రవూర్ 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేస్తున్నారు. ఈమె భర్త స్టీఫెన్‌రాజ్(38) తిరునిండ్రవూర్ పట్టణ వీసీకే కార్యదర్శిగా కొనసాగు తున్నారు. వీరిద్దరు 2015లో ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. కాగా స్టీఫెన్‌రాజ్, భార్య కోమది, అతని సోదరుడు అజిత్, తల్లిదండ్రులు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కోమదికి తిరునిండ్రవూర్ రామదాస్పురం ప్రాంతానికి చెందిన రౌడీషిటర్ మోసస్దేవతో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రెండు నెలల క్రితం మోసస్‌దేవాతో కోమది సన్నిహితంగా ఉన్న ఫొటోలను అజిత్ సెల్‌ఫోన్‌కు పంపినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యా యి. ఈ విషయమై కోమదిని భర్త స్టీఫెన్‌రాజ్ ప లుమార్లు మందలించినా మరింత సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి ఆటోలో కోమ ది బయలుదేరింది. అజిత్, స్టీఫెన్‌రాజ్ ఆమెను వెంబడించారు. కోమది ఆవడి సమీపంలోని నడుకుత్తగై ప్రాంతంలో మోసస్‌దేవాతో సన్నిహితంగా ఉన్నట్టు స్టీఫెన్‌రాజ్ గుర్తించి ఆగ్రహించి కత్తితో కోమదిని దారుణంగా నరికి పరారయ్యారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసి రౌడీ షీటర్ పరారయ్యాడు. విషయం తెలిసి అసిస్టెంట్ కమిషనర్ గిరి, పోలీసులు మృతదేహాన్ని ప్రభు త్వాస్పత్రికి తరలించారు. స్టీఫెన్‌రాజ్, అజిత్, తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. -
సీన్లోకి సిగాచి.. ఎట్టకేలకు పరిహారం ప్రకటన
పాశమైలారం ఘటన తర్వాత సిగాచి కంపెనీపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆ కంపెనీ నుంచి కనీస స్పందన కూడా కరువైందని తెలంగాణ ప్రభుత్వం కూడా సిగాచి తీరుపై సీరియస్‌గా ఉంది. ఈ తరుణంలో ఎట్టకేలకు ఆ సంస్థ స్పందించింది.సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు పాశమైలారం ప్రమాదంలో ఎట్టకేలకు మేనేజ్మెంట్ అయిన సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్పందించింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని చెబుతూ బుధవారం ఒక ప్రకటన చేసింది. ‘‘మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇస్తాం. ప్రమాదంలో 40 మంది మరణించారు. మరో 33 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు పూర్తి వైద్య సాయం అందిస్తాం’’ అని తెలిపింది. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని.. కారణాలు తెలియరావాల్సి ఉందని అంటోంది. అలాగే ప్రమాద తీవ్ర దృష్ట్యా 90 రోజులపాటు కంపెనీ మూసివేతకు నిర్ణయించింది. ప్రమాదంపై నేషనల్ స్టాక్ ఎక్సేంజికి ఓ లేఖ ద్వారా సిగాచి సమాచారం అందించినట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఇటు పటాన్చెరు ఏరియా ఆస్పత్రి వద్ద ఇవాళ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధితుల పరామర్శకు వెళ్లిన కంపెనీ వైస్ చైర్మన్ చిదంబర్తో కార్మికుల కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా చిదంబర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘30 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద సమయంలో లోపల 60 మంది ఉన్నారు. ఘటన తర్వాత కార్మికుల యోగక్షేమాలను కంపెనీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. నిన్నటి సీఎం పర్యటనలో సంస్థ ప్రతినిధులు ఉన్నారు. మా పరిశ్రమవాళ్లు లేరని సీఎం ఎందుకు అన్నారో నాకు తెలియదు. నా అనారోగ్యం వల్ల రాలేకపోయాను. అయినా కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ, తదితర అధికారులతో టచ్‌లోనే ఉన్నారు’’ అని సిగాచి వైస్ చైర్మన్ చిదంబర్ అన్నారు. సిగాచి ప్రమాద స్థలిని మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ సమయంలో అక్కడ నిర్వహించిన సమీక్షలోనూ సిగాచి ప్రతినిధులపై సీఎం రేవంత్ అరా తీశారు. ఫ్యాక్టరీ తరఫున ఎవరూ లేకపోవడంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు కూడా. ఇదిలా ఉంటే.. పాశమైలారం ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ.. కంపెనీ నుంచి వసూలు చేసి ఇప్పిస్తామని, ఇందుకు మంత్రులతో అవసరమైతే చర్చలు జరిపిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే.. తక్షణ సాయం కింద ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు లక్ష, గాయపడినవాళ్లకు రూ.50 వేలు ప్రకటించారాయన. అలాగే బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సాయం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపడతామని, కమిటీ నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ ప్రకటించారు. -
ప్రేమ చిగురించిన చోటే.. ప్రాణమూ పోయింది
ముద్దనూరు/పుట్రేల(విస్సన్నపేట): ఆ రెండు మనసులను పనిచేసే ప్రాంతమే పరిచయం చేసింది.. ప్రేమను చిగురించేలా చేసింది. పెళ్లిపీటల కోసం సిద్ధ పరచింది. మరో రెండు నెలల్లో ఒక్కటి చేయాలని చూసింది. కానీ ఇంతలోనే మృత్యువు ఆ ఇద్దరినీ కబళించింది. ఆ పనిచేసే ప్రాంతంలోనే పాశాన్ని విసిరింది. అనుకోని విపత్తు వారి ఆశలను ఆహుతి చేసింది. ఎన్నో ఆకాంక్షలతో కొత్త జీవితాన్ని ఆరంభించాలకున్న ఆ జంట.. ఇంట పెను విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫార్మా పరిశ్రమలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన యువతీ, యువకులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్‌రెడ్డి(25), ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేలకు చెందిన రామాల. శ్రీరమ్య ఫార్మా పరిశ్రమలో ఉద్యోగులు. ఇక్కడే వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఇరువురూ తమ పెద్దలను ఒప్పించారు. మరో రెండునెలల్లోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన తరుణంలో విషాదం వెంటాడింది. సోమవారం ఇద్దరూ పరిశ్రమలో విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వారిద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో పెనికలపాడు, పుట్రేల గ్రామాల్లో మంగళవారం తీవ్ర విషాదం అలముకుంది.రెండునెలల్లో పెళ్లి చేద్దామనుకున్నాం...రామాల నారయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె జ్యోత్స్న బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. చిన్న కుమార్తె శ్రీరమ్య తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసి ఆరు నెలల క్రితమే సిగాచి ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఇంతలో ఘోర విపత్తులో చిన్న కుమార్తె ప్రాణాలు కోల్పోవడాన్ని తలచుకుంటూ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. నిఖిల్ రెడ్డి కుటుంబంతో మాట్లాడి ఆషాఢం వెళ్లిన తర్వాత పెళ్లి చేద్దామనుకున్నామని తీరా ఈ విషాద సంఘటనలో ఇరువురు చనిపోయారని మృతురాలి తల్లి పద్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. -
రైల్వే ఎస్సై భార్య బలవన్మరణం
జూలూరుపాడు/ఖమ్మం క్రైం: భర్త పోలీసు శాఖలో ఎస్సై, బావ కూడా అదే ఉద్యోగం.. మామ సైతం రిటైర్డ్ పోలీసు అధికారి. సమాజంలో ప్రజల కష్టాలు తీర్చే ఉద్యోగుల ఇంటికి కుమార్తెను ఇస్తే బిడ్డ జీవితం బాగుంటుందని భావిస్తే వివాహేతర సంబంధాల పేరిటే కాక రకరకాల కారణాలతో వేధిస్తుండడంతో ఆమె తనువు చాలించింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాములుతండాకు చెందిన బానోతు రాణాప్రతాప్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన రాజేశ్వరి(34)కి 2018లో వివాహం జరిగింది. ఆ సమయాన రూ.40 లక్షలతో పాటు, 35 తులాల బంగారం, మరో రూ.4లక్షల విలువైన కానుకలను ఆమె తల్లిదండ్రులు ముట్టజెప్పారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉండగా.. కొన్నాళ్ల నుంచి భర్తతో పాటు అత్తామామలు పుష్పరాణి – చంద్రం, బావ మహేష్ (ఎస్సై, మహబూబాబాద్ వీఆర్) రాజేశ్వరికి వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తున్నట్లు సమాచారం. కాగా, రాణాప్రతాప్‌కు ఖమ్మం జీఆర్పీ ఎస్సైగా పోస్టింగ్ రావడంతో భార్యాపిల్లలను జూలూరుపాడులోనే ఉంచి రాకపోకలు సాగిస్తున్నాడు. అయితే, కుటుంబీకుల వేధింపులు తాళలేక రాజేశ్వరి జూలూరుపాడులోని అద్దె ఇంట్లో జూన్ 25న పురుగుల మందు తాగగా ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం, ఆపై హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందింది.మామపై దాడి..హైదరాబాద్ నుంచి రాజేశ్వరి మృతదేహాన్ని సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈక్రమాన రాణాప్రతాప్ తండ్రి చంద్రయ్య మార్చురీ వద్దకు రావడంతో తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపిస్తూ రాజేశ్వరి కుటుంబీకులు దాడి చేశారు. దీంతో జూలూరుపాడు, ఖమ్మం టూటౌన్ పోలీసులు అడ్డుకుని ఆయనను టూటౌన్‌కు తరలించారు. ఘటనపై మృతురాలు తండ్రి సోమ్లా ఫిర్యాదుతో రాణాప్రతాప్, పుష్పరాణి, చంద్రం, మహేష్‌పై కేసు నమోదు చేసినట్లు జూలూరుపాడు ఎస్ఐ రవి తెలిపారు. కాగా, రాణాప్రతాప్, ఆయన సోదరుడు మహేష్ మొదటి నుంచీ వివాదాస్పదులుగానే ఉన్నారు. ఖమ్మం పాత బస్టాండ్ సమీపాన ఓ చెప్పుల షాపు యజమానిపై కొన్నాళ్ల క్రితం అకారణంగా దాడి చేసిన రాణాప్రతాప్ తుపాకీతో బెదిరించాడు. ప్రస్తుతం ఆయన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
నెల్లూరులో అత్తమామలను నరికి చంపిన అల్లుడు
భార్యపై అనుమానమే పెనుభూతమైంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసింది. అడ్డుకోబోయిన అత్త, మామల ప్రాణాలు తీసింది. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో దుత్తలూరు ఒక్కసారిగా ఉలికి పడింది. పల్లెల్లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలే ఈ ఘటనకు కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: దుత్తలూరు ఏసీ కాలనీ ఆదివారం అర్ధరాత్రి హత్యల కలకలంతో ఉలికి పడింది. మద్యం మత్తులో భార్యపై అనుమానంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి సాగించిన మారణకాండ ఇది. కాలనీలో నివాసముంటున్న ఏలూరు వెంగయ్య మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యపై పెంచుకున్న అనుమానం అతనిలో మనిషిని మృగాన్ని చేసింది. భార్యను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఉన్న వెంగయ్య ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పూటుగా మద్యం తాగి ఇంటికెళ్లాడు. అప్పటికే భార్య వెంకాయమ్మ సమీపంలోని పుట్టింటికెళ్లింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన వెంగయ్య కట్టెలు కొట్టడానికి ఉపయోగించే పదునైన మచ్చుకత్తి వెంట తీసుకొని అత్తామామల ఇంటికి వెళ్లాడు. తన భార్యను చంపేస్తానంటూ వీరంగం చేశాడు. దీంతో అడ్డుకోబోయిన అత్తామామలు చలంచర్ల జయమ్మ (60) కల్లయ్య (65)లను కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఆగకుండా భార్య వెంకాయమ్మపై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో గాయాలతో బయటపడి కింద పడిపోయింది. పెద్ద కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గట్టిగా నియంత్రించడంతో వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కత్తితో పరారయ్యాడు. గాయపడిన వెంకాయమ్మను ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్సైలు ఆదిలక్ష్మి, రఘునాథ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్‌టీం ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితుడు వెంగయ్య కోసం స్థానికంగా, సాంకేతకంగా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎప్పుడుపడితే అప్పుడు పల్లెల్లో మద్యం దొరకడం వల్లే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. -
పాశమైలారంలో ఇది మూడో ఘటన: హరీష్‌రావు
పాశమైలారం ఘటన ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బాధితులకు భారీగా పరిహారం అందించాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారాయన. సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పాశమైలారంలో ఈ మధ్యకాలంలో జరిగిన ఇది మూడో ఘటన. అయినా కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలి. ఎంత మంది చనిపోయారో కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి. గాయపడిన వాళ్లకు రూ. 50 లక్షలు అందించాలి’’ అని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. గాయపడ్డ 26 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. వాళ్లకు మెరుగైన వైద్యం అందాలి. అవసరమైతే కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించాలి అని హరీష్ రావు కోరారు. సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సహా చాలా ప్రాంతం కుప్పకూలిపోగా.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
పద్మ చావుకు కారణమెవరు?
పాపన్నపేట(మెదక్): ‘వీఓఏ ఉద్యోగం చివరకు నా ప్రాణం మీదకు తెచ్చింది. బ్యాంకు, సెర్ప్ అధికారులు, తోటి ఉద్యోగులు కలిసి నా చావుకు కారణమయ్యారు. నా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని, నా ద్వారా డబ్బులు తీసుకున్నారు. చివరకు నన్ను దోషిగా నిలబెట్టారు. ఇంత జరిగినా ఇంకా చచ్చిపోలేదా? అన్నట్లు కొందరు నిలదీస్తుంటే ఎలా బతకాలి. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నా. కలెక్టర్ గారు నా చావుకు కారణమైన వారిని మాత్రం వదలొద్దు. విచారణ జరిపి, నిందితులను గుర్తించి, నా ఆత్మకు శాంతి కలిగించండి’ అంటూ చివరిసారి లేఖ రాసి..ఉరి తాడుకు వేలాడింది.. పొడిచన్పల్లి వీఓఏ పద్మ. కానరాని అధికారులు పొడిచన్పల్లి వీఓఏ పద్మ ఆర్థిక నిందలు భరించలేక ఆత్యహత్య చేసుకొని 5 రోజులైంది. తనపై వచి్చన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని చివరి కోరిక కోరుతూ.. లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఇంత వరకు ఒక్క అధికారి కూడా కనీసం వారి ఇంటికి వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. 18 ఏళ్లు సేవ చేసినా కనీసం సానుభూతి కరువైంది. చివరకు వాట్సాప్ గ్రూపుల్లో సైతం ఆమె పేరును తొలగించి, జ్ఞాపకాలు సైతం చెరిపేశారని కొందరు తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిధుల గోల్‌మాల్‌లో పాత్రదారులెవరు! పొడిచన్పల్లి గ్రామ సమాఖ్య పరిధిలో కొంత కాలం నుంచి జరిగిన సుమారు రూ.85 లక్షల కుంభకోణం రెండు నెలల క్రితం బయట పడింది. ఇందులో వీఓఏ పద్మతో పాటు బ్యాంకు అధికారులు, సెర్ఫ్ ఉద్యోగులు, సహచరుల పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. కాగా తూతూ మంత్రంగా విచారణ జరిపిన అ«ధికారులు సీసీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వస్తున్నా యి. అయితే స్త్రీనిధి నుంచి నెలనెలా వస్తున్న రుణ రికవరీల డబ్బును కొంత మంది బ్యాంకు, సెర్ఫ్ అధికారులు వాడుకొని.. వాటిని చెల్లించడానికి డ్వాక్రా సంఘాల పేరిట సభ్యులకు తెలియకుండా రుణాలు తీసుకున్నారు. వాటిని పద్మ ద్వారా మళ్లించి, స్త్రీనిధికి జమ చేశారని పద్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నుంచి కూడా 18 చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేయించి పద్మను బలిచేశారని వాపోతున్నారు. అసలు డ్వాక్రా రుణాలు మొదట గ్రూపు ఖాతాలోకి, తర్వాత సభ్యుల బ్యాంకు ఖాతాలోకి వెళ్లాల్సి ఉండగా, అధికారుల ప్రమేయం లేకుండా పద్మ ఎలా కాజేస్తుందని ప్రశి్నస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నిధులు సైతం అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి సంతకాలు లేకుండా ఆమె ఎలా మళ్లించుకుంటుందని అడుగుతున్నారు. పద్మ మరణానికి కారకులెవరు? డ్వాక్రా సంఘాల నిధుల గోల్‌మాల్‌లో ‘తిలా పాపం తలా పిడికెడు’అన్న చందంగా బ్యాంకు, సెర్ప్, తోటి ఉద్యోగుల పాత్ర ఉందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిధుల గోల్మాల్ బయట పడగానే అధికారులంతా పద్మను బాధ్యురాలిని చేస్తూ నిధుల రికవరీ కోసం ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. మరో వైపు కొంత మంది గ్రామస్తుల అవమానకర మాటలు, సంఘ సభ్యుల శాపనార్థాలు ఆమెను కుంగదీశాయని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర లేని డబ్బులు ఎలా చెల్లించాలనే ఆందోళన ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాయని అంటున్నారు.బాధ్యులను గుర్తించి శిక్షించాలిఅమ్మ చివరి కోరిక మేరకు డ్వాక్రా రుణాల గోల్‌మాల్‌పై పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరపండి. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోండి. మాకు అప్పులు తప్ప ఆస్తులు లేవు. మా అమ్మ అన్ని డబ్బులు తీసుకుంటే మా భూములు ఎందుకు అమ్ముకుంటాం. పెంకుటింట్లో ఎందుకు నివసిస్తాం. మేము చదివింది సర్కార్ బడిలోనే. మా అమ్మ చనిపోయి 5 రోజులు అయ్యింది. కనీసం చివరి కోరికకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. పోయిన మా అమ్మను తెచ్చి ఇవ్వకున్నా, పోయిన పరువును కూడగట్టుకోవాలని పరితపిస్తున్నాం. – నవీన్ రెడ్డి (మృతురాలి కొడుకు) -
అపార్టుమెంటులో యువతి క్షుద్ర పూజలు
బనశంకరి(కర్ణాటక): క్షుద్ర పూజల కోసం ఓ మహిళ పెంపుడు శునకాలను హత్యచేసిన ఘటన వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళ బెంగళూరు మహదేవపుర చిన్నప్పలేఔట్‌లోని అపార్టుమెంట్లో ఉంటోంది. త్రిపర్ణ పైక్ అనే మహిళ 4 లేబ్రడార్ పెంపుడు కుక్కలను నాలుగురోజులు క్రితం గొంతుకోసి హతమార్చింది.ఆమె ఫ్లాటులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారు. మహదేవపుర పోలీసులు, బీబీఎంపీ సిబ్బంది చేరుకుని చూడగా కుక్కల కళేబరాలు కనిపించాయి. మొదట వారు ఇంట్లోకి రావడానికి ఆ మహిళ అంగీకరించలేదు. ఆత్మహత్య చేసుకుంటానని నానా యాగీ చేసింది. చివరకు లోపలకు వెళ్లి చూడగా దారుణమైన దృశ్యాలు కనిపించాయి. చచ్చిపోయిన కుక్కలు, రకరకాల పూజల దృశ్యాలు చూసి హడలిపోయారు. కళేబరాలను శవ పరీక్షల కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు. వాటిని చాకుతో కోసి చంపారని నివేదికల్లో వచ్చింది. సదరు మహిళ చేతబడి కోసం కుక్కలను చంపి వాటి రక్తంతో పూజలు చేసి ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. మరో 2 కుక్కలను కాపాడి తరలించారు. మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. -
వివాహితపై అమానవీయ దాడి ఘటన.. పోలీసుల అదుపులో నిందితులు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఓ వివాహితను వివస్త్రను చేసి అమానవీయంగా దాడి చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనపై ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనా ని కి జిల్లా యంత్రాంగం స్పందించింది. న్యా యసేవా అధికార సంస్థ హనుమకొండ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండేతోపాటు మరో జడ్జి శ్రావణ స్వాతి, వివిధ శాఖల అధికారులు, పోలీసులు హుటాహుటిన తాటికాయల గ్రామానికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. ఏదైనా సమస్య వచి్చనప్పుడు ప్రజలు పోలీసులను లేదా కోర్టును ఆశ్రయించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని జడ్జీలు హెచ్చరించారు. జిల్లాలో న్యాయసేవా అధికార సంస్థను ఏర్పాటు చేశామని.. దీనిద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందుతాయన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనిఇలాంటి ఘటనలకు పాల్పడితే వారిని కూడా నేరస్తులుగా పరిగణించి శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. అశ్లీల వీడియోలు షేర్ చేయడం నేరం ఈ అంశంపై కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై వివరాలు సేకరించగా దాడి జరిగింది నిజమేనని తేలిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోందని.. బాధితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఒకరు తప్పు చేశారని, మరొకరు ఇంకో తప్పు చేస్తే పెద్దశిక్షలు పడతాయని చెప్పారు. నిందితులు తమ అదుపులోనే ఉన్నారని, వారిని విచారించి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. జుగుప్సాకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం నేరమని.. అశ్లీల కంటెంట్‌ను షేర్ చేస్తే సెక్షన్ 67 కింద కనీసం 5 ఏళ్ల జైలుశిక్ష, రూ. 10 లక్షల జరిమామా పడుతుందన్నారు. -
కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్‌కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్‌కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.2 వేలు, డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్‌లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ శనివారం తెలిపారు. -
రైల్వే ట్రాక్‌పై 7 కిలో మీటర్లు కారు నడిపి.. ఇంతకీ ఎవరీ యువతి?
సాక్షి, హైదరాబాద్: పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, రైల్వే చరిత్రలో ఇలాంటి ఘటన మొదటిసారి అంటూ రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ వద్ద రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతిని వోమిక సోనీగా గుర్తించారు. చేవెళ్లలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొండకల్ నుంచి చిన్న శంకర్పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై ఆమె కారు నడిపింది. దీంతో గంట 20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6.20 నిమిషాల నుంచి 7:40 వరకు ట్రాక్ పైనే వోమిక సోనీ కారును నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారును శంకర్పల్లి రైల్వే స్టేషన్‌కు తరలించారు.కారును సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పరిశీలించారు. అందులో డాగ్ బిస్కెట్లు, అగ్గిపెట్టె, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నాన్ చాక్‌తో స్థానికులపై వోమిక సోనీ దురుసుగా ప్రవర్తించింది. ఆమె మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మతిస్థిమితం, డ్రగ్స్ తీసుకున్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.🚨 Shocking in Shankarpalli, Vikarabad A woman was spotted driving her car on a railway track towards Hyderabad! Railway staff halted trains, including one from Bengaluru to Hyderabad. Despite efforts to stop her, the woman kept driving on the tracks. Authorities are… pic.twitter.com/BK1MfZDHb8— Sowmith Yakkati (@YakkatiSowmith) June 26, 2025కాగా, వోమిక సోనీ.. గత కొన్నిరోజులగా తల్లిదండ్రులు, భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పొగొట్టుకున్న సోని డ్రిపెషన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లక్నోకి చెందిన సోనీ స్థానికంగా పుప్పాల గూడలో నివాసం ఉంటుంది. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. కారు నుంచి బయటికి రాకపోవడంతో కారు డోర్స్ బ్రేక్ చేసి మరి.. స్థానికులు, అధికారులు బయటికి దింపారు. స్థానికులు, అధికారులపైకి నాన్ చాక్‌తో దాడికి దిగింది. -
అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి
జీడిమెట్ల(హైదరాబాద్): ప్రియుడు, అతని సోదరుడితో కలిసి పదో తరగతి బాలిక కన్నతల్లిని చంపించిన కేసులో పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. బుధవారం షాపూర్‌నగర్‌లో బాలానగర్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ నరే‹Ùరెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేష్ డీఐ కనకయ్యలతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39) తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారిణి. అంజలి తన ఇద్దరు కుమార్తెలు (16), (12)లతో కలిసి షాపూర్‌నగర్‌లోని హెచ్ఎంటీ సొసైటీలో నివసిస్తోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఎనిమిది నెలల క్రితం నల్లగొండ జిల్లా కట్టంగూర్కు చెందిన శివ (18)తో ఇన్‌స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి ప్రేమను బాలిక తల్లి అంజలి తొలుత అంగీకరించినా.. ఆ తర్వాత వ్యతిరేకించసాగింది. బాగా చదువుకోవాలని కుమార్తెకు చెబుతూనే ప్రేమ విషయంలో మందలించేది. తల్లి మందలించడంతో ప్రియుడి చెంతకు.. ఈ క్రమంలో ఈ నెల 8న బాలిక తన సోదరిని తీసుకుని కట్టంగూర్కు వెళ్లి నాలుగు రోజులు ఉండి వచి్చంది. ఇది నచ్చని తల్లి కుమార్తెను తీవ్రంగా మందలించింది. తనను మందలించడంతో తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ఈ నెల 19న కట్టంగూర్‌లోని ప్రియుడు శివ వద్దకు వెళ్లిపోయింది. మరునాడు బాలిక తల్లి అంజలి తన కూతురుని శివ కిడ్నాప్ చేశాడంటూ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శివపై కేసు నమోదు చేసి బాలికను తల్లి అంజలికి అప్పగించారు. అంజలికి అదే శాపమైంది.. ఈ నెల 22న తన చెంతకు చేరిన కుమార్తెను తల్లి అంజలి గట్టిగా మందలించడంతో పాటు చేయి చేసుకుంది. శివను జైలుకు పంపిస్తానని భయపెట్టింది. దీంతో తన ఇష్టానికి అడ్డుగా వస్తున్న తల్లిని ఎలాగైనా చంపాలని బాలిక గట్టిగా నిర్ణయించుకుంది. 23న సాయంత్రం శివను షాపూర్‌నగర్ వచ్చి తన తల్లిని హత్య చేయాలని కోరింది. దీనికి శివ అభ్యంతరం చెప్పడంతో.. అయితే తానే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో శివ... పదో తరగతి చదువుతున్న తన తమ్ముడి (16)ని తీసుకుని గత సోమవారం సాయంత్రం షాపూర్‌నగర్ వచ్చాడు. బాలిక ఇంటి బయట కాపలా కాయగా.. శివ, అతని సోదరుడు లోపలికి వెళ్లి అంజలి మెడకు చున్నీతో గట్టిగా ఉరి బిగించి హత్య చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో మంగళవారం తెల్లవారుజామున శివను కట్టంగూర్‌లో, అతని సోదరుడిని, బాలికను నగరంలో అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అంజలిని తామే చంపినట్లు ఒప్పుకొన్నారు. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. మొదటి నుంచీ తల్లి అంటే కుమార్తెకు గిట్టేది కాదు.. నిందితురాలు బాలిక (16)కు తల్లి అంజలి అంటే గిట్టేది కాదు. 7వ తరగతిలోనే తల్లి వద్ద ఉండను అంటూ అప్పట్లోనే పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో అంజలి తన కూతురును రెండేళ్ల పాటు గుండ్లపోచంపల్లిలోని సోదరి ఇంట్లో ఉంచింది. మూడు నెలల క్రితమే బాలిక తల్లి వద్దకు వచి్చనట్లు తెలుస్తోంది. బాలికకు మొదటి నుంచీ తల్లితో శత్రుత్వమే అని.. తరచూ తల్లి తరచూ తనపై చేయి చేసుకొంటోందని బాలిక తన గోడును స్నేహితులతో వెళ్లబోసుకునేదని తెలిసింది. కేసును కొన్ని గంటల్లోనే ఛేదించిన జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లే‹Ù, డీఐ కనకయ్య, సిబ్బందిని డీసీపీ అభినందించారు.అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి జీడిమెట్లలో అంజలి హత్యోదంతం కేసులో నిందితుడు శివ తల్లి ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలిక తల్లి అంజలిని తన కుమారులు హత్య చేయడాన్ని ఆమె సమరి్థంచుకుంది. మొదట్లో శివ ప్రేమకు అంగీకారం తెలిపిన అంజలి.. ఆ తర్వాత ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను తన కొడుకులు హత్య చేశారని చెప్పుకొచి్చంది. తల్లికి తలకొరివి పెట్టిన చిన్నకూతురు కేసముద్రం: జీడిమెట్లలో హత్యకు గురైన అంజలి అంత్యక్రియలు బుధవారం ఆమె స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో జరిగాయి. ఆమె మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌తో పాటు, వివిధ పారీ్టలు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు సందర్శించి నివాళులరి్పంచారు. అనంతరం తల్లి మృతదేహానికి చిన్న కుమార్తె మనస్విని తలకొరివి పెట్టింది. -
‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’
తెనాలి: ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధ మహిళలను హత్య చేసి బంగారు నగలను అపహరించిన కేసులో మారీసుపేటకు చెందిన అత్తోట కుసుమ అనే మహిళ ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారణ కొచ్చారు. ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. విచారణలో మరో వృద్ధురాలి హత్యతో పాటు, ఇంకొకరి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు తెలిసీ, ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. దీనితో మారీసుపేట, మల్లెపాడు గ్రామంలో కలకలం రేగింది.ఇన్స్యూరెన్స్ ఏజెంటుగా వివరాల సేకరణతెనాలి పట్టణం మారీసుపేటలో కుసుమ నివాసం. ఆమె భర్త 15 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. ఇద్దరు సంతానం. కాలేజీకి వెళుతున్నారు. గతంలో ‘మెప్మా’ విభాగంలో తాత్కాలికంగా పని చేసింది. ప్రస్తుతం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా పని చేస్తోంది. పాలసీల పేరుతో అందరినీ కలుస్తూ వారి వివరాల ఆధారంగా నేరాలకు ప్రణాళికను రచిస్తోంది. తన సహాయకులతో పక్కాగా అమలు చేస్తోంది. తెనాలి నుంచి చినపరిమి వెళ్లే రోడ్డులో మూతపడిన అప్పడాల కంపెనీ పైభాగంలో వితంతువులైన వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పిట్టా అంజమ్మ (70) నివసిస్తున్నారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఆ ఇద్దరు హత్యకు గురయ్యారు. వీరి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ కేసులో కుసుమ సహా ఆటోడ్రైవర్, మరొక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హత్యకు ప్లాన్ ఇలా..హత్యకు గురైన వృద్ధుల ఇంటికి ఆ రోజు ఒక ఆటోలో కుసుమ సహా మరో ఇద్దరు యువకులు వచ్చారు. ‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’ అని కుసుమ పిలవడంతో ఒక వృద్ధురాలు కిందకు వచ్చారు. కిందకు వెళ్లినామె ఎంతకీ పైకి రాకపోవటతో ఇంకో వృద్ధురాలు, ‘ఇంకా రాలేదేంటి...పైకి రా!’ అని వియ్యపురాలిని కేకేసింది. దీనితో మళ్లీ కుసుమ, ఆమెను కూడా ‘కిందకు రండి...పిలుస్తున్నారు !’ అనడంతో ఆమె కూడా దిగివచ్చింది. తర్వాత ఆ ముగ్గురూ అదే ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ఇదంతా ఇంటిముందున్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కుసుమతో సహా ఆ ఇద్దరు యువకులను తేలిగ్గా పట్టుకోగలిగారు. విచారణలో వారు కూడా విస్తుపోయే మరికొన్ని నిజాలు తెలిసినట్టు విశ్వసనీయ సమాచారం. -
దారుణం.. భార్యపై అనుమానంతో పిల్లలను చంపిన తండ్రి
మైలవరం(కృష్ణా): భార్యపై అనుమానంతో అభం శుభం తెలియని చిన్నారులను పొట్టనబెట్టుకున్న తండ్రి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ నెల 12న వెలుగులోకి వచ్చిన ఇద్దరు చిన్నారుల మృతి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సాంకేతిక పరిజ్ఞానంతో నింది తుడిని పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మైలవరంలోని మారుతీనగర్‌లో నివసించే వేములవాడ రవిశంకర్, చంద్రిక దంపతులకు కుమార్తె లక్ష్మీహిరణ్య(9), కుమారుడు లీలాసాయి నృసింహ (7) ఉన్నారు. వారిద్దరూ జి.కొండూరులోని ఓ వసతి గృహంలో ఉంటూ ఐదు, మూడో తరగతులు చదువుతున్నారు. రవిశంకర్, చంద్రక నిత్యం గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో చంద్రిక ఉపాధి నిమిత్తం ఇటీవల బహ్రెయిన్ వెళ్లింది. మొదటి నుంచి భార్య తీరుపై రవిశంకర్‌కు అనుమానం ఉంది. భార్య బహ్రెయిన్ వెళ్లినప్పటి నుంచి పిల్లలను చంపేందుకు రవిశంకర్ పథకం రచించాడు. ఈ క్రమంలో ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్ పుట్టిన రోజున పిల్లలు ఇద్దరిని హత్య చేసేందుకు నిర్ణయించాడు. పథకం ప్రకారం ‘నీకు చాలా అన్యాయం చేశాను చంద్రిక’ అంటూ పిల్లలు ఇద్దరినీ చంపి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాశాడు. అనంతరం పిల్లలు ఇద్దరినీ హత్య చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ నెల 12న రవిశంకర్ తండ్రి ఇంటికి వచ్చి చూడగా మనవడు, మనవరాలు బెడ్‌పై విగతజీవుల్లా కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు రవిశంకర్ ఇంట్లో అతను చంద్రికకు రాసిన లేఖ దొరికింది. దీంతో రవిశంకర్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావించారు. రవిశంకర్ ఫోన్ సిగ్నల్ చివరిగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద లభించడంతో రెండు రోజులపాటు రవిశంకర్ ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కృష్ణానదిలో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ రవిశంకర్ ఆచూకీ లభించకపోవడంతో బతికే ఉంటాడని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.ఫోన్ సిగ్నల్ ఆధారంగా..ఇద్దరు బిడ్డలను హత్య చేసిన అనంతరం రవిశంకర్ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్దకు చేరుకొని అక్కడి సిమ్‌తో పాటు సెల్‌ఫోన్‌ను పడేసి పరారయ్యాడు. ఈ క్రమంలో కొత్తగా కొనుగోలు చేసిన సెల్ నుంచి మైలవరంలో ఒకరికి ఇటీవల ఫోన్ చేయడాన్ని పోలీసులు గుర్తించి, ఫోన్ సిగ్నల్‌ను ట్రాక్‌చేసి రవిశంకర్ ఆచూకీని కనిపెట్టారు. సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో తలదాచుకున్న నిందితుడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని మైలవరం తరలించి విచారణ చేపట్టారు. ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు మధ్యాహ్నం బిర్యానీ తీసుకొచ్చి దానిలో పురుగుమందు కలిపి ఇద్దరు బిడ్డలకు బలవంతంగా తినిపించి, వారిద్దరూ స్పృహ కోల్పోయే వరకు అక్కడే ఉండి ఆ తరువాత ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలిందని సమా చారం. నిందితుడిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది. -
కూతురి వెర్రి పని... సూపర్ డాడీ సాహసం, వైరల్ వీడియో
రైల్వేస్టేషన్లో అప్రమత్తంగా ఉండాలని అటురైల్వే అధికారులు,ఇతరులు చెబుతూనే ఉంటారు. రైలు రన్నింగ్ లో ఉండగానే దిగేందుకు ఎక్కేందుకు ప్రయత్నించవద్దని, రైలు వస్తున్నపుడు ప్లాట్‌ఫాం కు దూరంగా ఉండాలనే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. చాలా మంది అప్రమత్తంగానే ఉంటారు. కానీ. ఒక్కోసారి ఊహించని పరిణామాలు మనల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. అలాంటి ఘటన ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అత్యంత సాహసంతో కన్నబిడ్డను కాపాడి సూపర్ హీరో అయిపోయాడో తండ్రి. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈ వైరల్ వీడియోను చూడాల్సిందే. ఈ కథనం కూడా పూర్తిగా చదవాల్సిందే.రైల్వే స్టేషన్ అనగానే కొంతమందికి గాభరా. కొంతమందేమో చాలా లైట్ తీసుకుంటారు. అలా రైలు పట్టాల మీద ఉన్న కూడా ఒక ప్లాట్ ఫామ్ మీద మరోప్లాట్ ఫామ్ మీదకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఏ మాత్రం ప్రాణ భయం లేకుండా ఒక యువతి ఒక ప్లాట్ ఫామ్ మీద నుంచి మరోక చోటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే అటువైపు వేగంగా రైలు దూసుకొచ్చింది. కళ్లు మూసి తెరిచే లోపే ఆమె పట్టాలు, రైలుకి మధ్యలో ఇరుక్కపోయింది. దీన్ని గమనించిన ఆమె తండ్రి అంతే వేగంగా కదిలాడు. వెంటనే పట్టాల మీదకు దూకి ప్లాట్ ఫామ్ వైపు కిందికి దూకి కూతుర్ని గట్టిగా హత్తుకున్నాడు. ఈ సమయంలో ట్రైన్ కూడా వేగంగా ముందుకు వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ వారుకి ఎలాంటి గాయాలు కాకుండా భారీ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. కొంతమంది భావోద్వేగానికి గురై దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా లిప్త పాటులో ప్రాణాలు పోయేవే. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్ వైరల్‌గా మారింది. లక్షల మంది షేర్ చేశారు. దాదాపు కోటి (9.7 మిలియన్లు) వ్యూస్ దక్కించుకుంది.Dad shields his daughter with his body after she stepped into a train’s pathpic.twitter.com/Blqs1UISc8— Interesting things (@awkwardgoogle) June 16, 2025కన్నబిడ్డకోసం తండ్రి చేసిన సాహసం, తండ్రి చూపిన ప్రేమను చూసి సూపర్ డాడ్ అంటూ పొగిడేస్తున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రుల అసామాన్య త్యాగాలు అంటూ ఎమోషనల్ అవుతున్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు, "ఈ వీడియో చూసిన తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లాయని మరొకరు కామెంట్ చేశారు. "మరికొందరు మాత్రం ఇది అవసరమా, ఏదైనా తేడా వస్తే పరిస్థితి ఏంటి? అంటూ మండిపడుతున్నారు.ఇదీ చదవండి: Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడుఅసలు విషయం ఏమిటంటే..అయితే, ఈ సంఘటన జనవరి 27, 2020న ఈజిప్టులోని ఇస్మాయిలియాలో జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగినా రైల్వే ప్రయాణాల్లో మాత్రం అప్రమత్తత అవసరం అని ఈ సంఘటన రుజువు చేస్తోంది. -
సొంతూరు వెళ్లొస్తానని.. కారులో శవమై..
జి.కొండూరు(ఎన్టీఆర్): సొంతూరు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి కారులో శవమై కనిపించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల పరిధి వెలగలేరు వద్ద ఓ హోటల్ ఎదురుగా శుక్రవారం సాయంత్రం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రెడ్డిగూడెం మండల పరిధి మొద్దులపర్వ నివాసి అన్నెబోయిన నాగరాజు(38). జి.కొండూరు మండల పరిధి వెలగలేరు గ్రామానికి చెందిన అక్క కూతురు శివపార్వతితో అతనికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు గిరికుమార్, కూతురు రేష్మ ఉన్నారు. నాగరాజు వెలగలేరులోనే నివసిస్తూ జేసీబీ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. మొద్దులపర్వ వెళ్తున్నానని చెప్పి.. ఈ క్రమంలో గురువారం విజయవాడ వెళ్లి కారును అద్దెకు తీసుకున్న నాగరాజు, ఇంటికొచ్చి సొంత గ్రామం మొద్దులపర్వ వెళ్తున్నానని భార్యకు చెప్పి సాయంత్రం వేళ వెళ్లాడు. మరుసటిరోజు శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో భార్య శివపార్వతికి నాగరాజు ఫోన్ చేశాడు. మొద్దుల పర్వలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలం అమ్ముతున్నట్లు, ఇక అప్పులు అన్నీ తీరిపోతాయని, చార్జింగ్ లేదని చెప్పి ఫోన్ పెట్టేసినట్లు అతని భార్య చెబుతున్నారు. ఆ తర్వాత ఉదయం 11 నుంచి వెలగలేరు వద్ద ఓ హోటల్ ఎదురుగా కారు ఆగి ఉండడాన్ని స్థానికులు గమనించారు. దానిలో శవం ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారుని పరిశీలించగా కారులో నాగరాజు శవమై కనిపించాడు. మైలవరం ఏసీపీ ప్రసాదరావు, సీఐ దాడి చంద్రశేఖర్, జి.కొండూరు ఎస్ఐ సతీష్ కుమార్‌లు సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేపట్టారు. స్థలం రిజిస్ట్రేషన్ చేయాలంటూ బెదిరింపు!కారులో శవమై కనిపించిన నాగరాజు భార్య శివపార్వతితో ‘సాక్షి’ నేరుగా మాట్లాడింది. ఈ క్రమంలో శివపార్వతి.. వెలగలేరులో ఇంటి నిర్మాణం నిమిత్తం విస్సన్నపేటకు చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద తన భర్త నాగరాజు మొద్దుల పర్వలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలం తనఖా పెట్టి అప్పు తీసుకున్నట్లు తెలిపారు. దీనికి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. 15రోజుల క్రితం సదరు వడ్డీ వ్యాపారి కుటుంబ సభ్యులతో వెలగలేరు వచ్చి అప్పు వెంటనే చెల్లించడం లేదా మొద్దులపర్వలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలాన్ని జూన్ నెల 13వ తేదీ లోపు తన పేరుతో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయాలని కోరారని చెప్పింది. చెప్పినట్లు చేయకపోతే తడాఖా చూపిస్తానంటూ సదరు వడ్డీ వ్యాపారి బెదిరించినట్లు ‘సాక్షి’కి వివరించారు. ఇంతలోనే భర్త శవమై కనిపించడంపై శివపార్వతి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో ఒక్కడే వచ్చాడా? కారులో శవమై కనిపించిన నాగరాజు శుక్రవారం ఉదయం ఒక్కడే కారులో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉదయం 11గంటల సమయంలో వెలగలేరు వద్ద హోటల్ ఎదురుగా కారు ఆపిన నాగరాజు పక్కనే ఉన్న బడ్డీ కొట్టు వద్ద కిందకు దిగి తూలుతూ ఉన్నట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్న నాగరాజు బడ్డీ కొట్టు వద్ద పడుకోబోతున్న క్రమంలో అతని నుంచి విపరీతమైన వాసన వస్తుండటంతో అక్కడి నుంచి వెళ్లాలని ఆ పక్కనే నివసిస్తున్నవారు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న మరో వ్యక్తి సాయంతో నాగరాజు కారులో ఎక్కి కూర్చున్నట్లు సమాచారం. కొద్ది గంటలు గడిచాక నాగరాజు కారులో నుంచి దిగకపోవడంతో స్థానికులకు ఆనుమానం వచ్చి డోరు తెరిచి చూడగా నాగరాజు శవమై కనిపించాడు. అతను తూలుతూ కనిపించడంతో పాటు గొంతు వద్ద కాలినట్లు తోలు లేచిపోయి ఉండటంతో నాగరాజు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు నాగరాజుది హత్యా లేక ఆత్మహత్యా అనేది తేల్చేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. క్లూస్ టీంను రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు. కారు ఆగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు సైతం నాగరాజు ఒక్కడే కారులో వచ్చినట్లు గుర్తించారని తెలుస్తుంది. అయితే అతనికి కారులో ఊపిరాడక మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..
ఖిలా వరంగల్: చేసిన అప్పులు తీర్చేందుకు, ప్రియురాలితో కలిసి జల్సాలు చేసేందుకు ఏకంగా తన సొంత ఇంటికే కన్నం వేసిన ఓ ప్రబుద్ధుడు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని నుంచి 11.116 తులాల బంగారం, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరామ్‌నాయక్.. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సై శ్రీకాంత్, సురేష్‌లతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు.ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన గుర్రపు రామకృష్ణ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య సవితా రాణి, ఒక కుమార్తె శ్రీనిధి, కుమారుడు గుర్రపు జయంత్ ఉన్నారు. జయంత్ హనుమకొండలోని ఓ కళాశాలలో బీబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో అతడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో కలిసి జల్సాలు చేసేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం చూస్తున్న అతను రామకృష్ణ.. తన తమ్ముడి (జయంత్‌కు బాబాయి) మనుమరాలు పుట్టినరోజు వేడుకల నిమిత్తం ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్‌కు భార్య, కుమార్తెతో కలిసి వెళ్లారు. కానీ, జయంత్ ఇక్కడే ఉన్నాడు. అదేరోజు రాత్రి రామకృష్ణ ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండగా.. అందులోని ఆరున్నర తులాల పెద్ద హారం, ఐదున్నర తులాల చిన్నహారం, రెండు తులాల రెండు బంగారు గొలుసులు, రెండు తులాల నెక్లెస్, మొత్తం 16 తులాల ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గ్రహించి మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా బేగం ఆదేశాలతో వరంగల్ ఏసీపీ నందిరామ్‌నాయక్ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్ దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం 9గంటల సమయంలో ఫోర్ట్‌రోడ్డు జంక్షన్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..గుర్రపు జయంత్ పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద 11.16 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.అప్పులు తీర్చి.. మిగతా డబ్బులతో జల్సా..జయంత్ బీబీఏ ఫైనలియర్ చదువుతూనే హైదరాబాద్‌లో ‘స్టార్ట్స్ ఓన్ వీల్స్’ పేరుతో ఒక ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నాడు. వ్యాపారం కలిసిరాక అప్పులపాలయ్యాడు. జయంత్‌కు కాలేజీలో ఓ గర్్లఫ్రెండ్ ఉంది. చేసిన అప్పులు తీరాలన్నా.. గర్్లఫ్రెండ్తో జల్సాలు చేయాలన్నా డబ్బు కావాలనుకున్న జయంత్.. తన కుటుంబ సభ్యులు ఆదివారం హైదరాబాద్‌కు వెళ్లగానే ఇంట్లోని బంగారం ఆభరణాలు దొంగిలించాడు. ఆభరణాల్లో కొంత బంగారం కరిగించి అమ్ముదామని వెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. అతడినుంచి 5.645 తులాల బంగారు హారం, 5.471 తులాల కరిగించిన బంగారం.. మొత్తం 11.116 తులాల బంగారం, బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వా«ధీనం పర్చుకున్నారు. 24గంటల్లో కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్, సిబ్బంది ప్రవీణ్‌రెడ్డి, వాజీద్ పాషా, నరేందర్, హోంగార్డ్ రఫీలను ఏసీపీ నందిరామ్‌నాయక్ అభినందించారు. -
లే నాన్నా.. అమ్మ, తమ్ముడు వచ్చాం
జయశంకర్: నాన్న లే ఒకసారి.. అమ్మ, తమ్ముడు వచ్చాం అంటూ.. తండ్రి మృతదేహన్ని చూసి కూతురు విలవిల్లాడింది. రేపాకలో ట్రాక్టర్‌తో సçహబావిలో పడి చనిపోయిన యువరైతు బోయిని తిరుపతి రాజ్ (30) మృతదేహం వద్ద అతడి కుమార్తె విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూ పాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన బోయిని తిరుపతి రాజ్ తన వ్యవసాయ భూమిలో రోటవేటర్‌తో దున్నేందుకు ఉద యం ట్రాక్టర్‌పై వెళ్లాడు. దున్నే క్రమంలో ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సమీపంలోని వ్యవసాయ బావిలో పడ్డాడు. బావిలో నీరు లేకపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. తిరుపతి రాజ్ మృతదేహం మీద పడి భార్య, కూతురు, కుమారుడు గుండెలవిసేలా రోదించారు. నాన్న లే .. నాన్న లే అంటూ దిక్కులు పిక్కటిలేలా కూతురు, కుమారుడు విలపించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బోయిని రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు. మృతుడికి భార్య సంధ్య, కూతురు, కొడుకు ఉన్నారు. -
నీకు రెండో పెళ్లి నేను చేస్తా!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భర్త రహస్యంగా రెండో వివాహం చేసుకుంటున్నట్లు తెలుసుకున్న భార్య.. నేరుగా కల్యాణమండపం చేరుకొని అతన్ని బయటకు ఈడ్చుకు వచ్చి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. ఈ ఘటన చిత్రదుర్గ లో ఆదివారం చోటుచేసుకుంది. చిక్కమగళూరు జిల్లా అరసీకెరె తాలూకా తిప్పఘట్టకు చెందిన కార్తీక్ నాయక్‌కు నాలుగేళ్ల క్రితం దావణగెరె జిల్లా న్యామతి తాలూకా ముశేనాళ గ్రామానికి చెందిన తనూజాతో వివాహం జరిగింది. అయితే భార్యకు తెలియకుండా రెండో వివాహానికి సిద్ధపడ్డాడు. చిత్రదుర్గలోని గాయత్రి కల్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తనూజాకు తెలియడంతో ముహూర్తం సమయానికి వెళి కార్తీక్‌ను పెళ్లి పీటల మీద నుంచి ఈడ్చుకు వచ్చి చెప్పుతో చితకబాదింది. ఈ హఠాత్ పరిణామంతో పెళ్లికి వచ్చిన వారు కంగుతిన్నారు. సంఘటనకు సంబంధించి చిత్రదుర్గ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పోలీసులు నడిరోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శించవచ్చా?
సాక్షి, అమరావతి: తెనాలి పోలీసులు యువకులను నడిరోడ్డు మీద బూటుకాలితో తొక్కిపెట్టి లాఠీలతో కొట్టిన ఘటనపై సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్ ఎక్స్‌లో బుధవారం స్పందించారు. పోలీసులు నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. దీన్ని హోంమంత్రి అనిత సమర్థించడాన్ని ఆయన ఆక్షేపించారు. ‘అరికాళ్ల మీద లాఠీలు, మోకాళ్ల మీద తొక్కుడు కాళ్లు అనుభవించిన ఆ యువకులకు కులం లేదు.. లాఠీల తొక్కుడుకాళ్ల భటులకు కులం లేదు, ఒప్పకుందాం. వాళ్లు ఎస్కోబార్ అంతటి నార్కో డాన్స్, అదీ ఒప్పుకుందాం.. ఏపీ హోం మంత్రికి, ముఖ్యమంత్రి కులం లేదు అదీ ఒప్పుకుందాం’.. కానీ పోలీసులు అట్లా నడిరోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శన చేయవచ్చా? దాన్ని హోంమంత్రి సమరి్థస్తూ మాట్లాడవచ్చా, ముఖ్యమంత్రి కూడా నర్మగర్భంగా సపోర్ట్ చేయవచ్చా? అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్, రఘురామరాజు విషయంలో ఏం మాట్లాడారో మరచిపోవచ్చా అని పేర్కొన్నారు. కులం మరచి, దెబ్బలతో మైమరచి, కేరింతలు కొట్టండి అంటూ ప్రభుత్వానికి చురకలు వేశారు. -
అన్నా వర్సిటీ అత్యాచారం కేసులో సంచలన తీర్పు
చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన అన్నా వర్సిటీ విద్యార్థిని అత్యాచార కేసులో(Anna University Sexual Assault Case) సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు జ్ఞానశేఖరన్‌ను దోషిగా ప్రకటించిన చెన్నై మహిళా కోర్టు.. సోమవారం జీవితఖైదును ఖరారు చేసింది. దోషి మీద న్యాయస్థానం ఎలాంటి కనికరం చూపించబోదని.. కనీసం 30 సంవత్సరాలైనా అతను జైలు శిక్ష అనుభవించాల్సిందే అని శిక్ష సందర్భంగా జడ్జి ఎం రాజలక్ష్మి వ్యాఖ్యానించారు.కిందటి వారమే 11 అభియోగాల మీద అతన్ని కోర్టు దోషిగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జ్ఞానశేఖరన్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.90 వేల జరిమానా కూడా విధించింది కోర్టు. ఈ క్రమంలో.. తనకు జబ్బుపడిన తల్లి, 8 ఏళ్ల కూతురు ఉన్నారని.. కాబట్టి తనకు తక్కువ శిక్ష విధించాలని జ్ఞానశేఖరన్ చేసిన అభ్యర్థనను చెన్నై మహిళా కోర్టు(Chennai Mahila Court) తిరస్కరించింది. తల్లి, బిడ్డ ఉన్నారని నేరం చేసే టైంలో గుర్తుకు రాలేదా? అని జ్ఞానశేఖరన్‌ను జడ్జి సూటిగా ప్రశ్నించారు. దీంతో కోర్టులో అతను మౌనంగా తలదించుకున్నాడు.👉కిందటి ఏడాది డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో విద్యార్థిని(19) తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. అతనిపై దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనతో విద్యార్థులు భగ్గుమన్నారు. క్యాంపస్‌లోకి చొచ్చుకెళ్లి తీవ్ర నిరసనలు తెలిపారు. విద్యార్థుల ఆగ్రహం, రాజకీయ విమర్శల నేపథ్యంలో కేసును సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని మద్రాస్ హైకోర్టు(madras High Court on Anna University Incident) ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు..👉ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే స్థానికంగా బిర్యానీ అమ్ముకునే వ్యాపారి జ్ఞానశేఖరన్(Gnanasekaran)ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడికి గాయాలు కూడా అయ్యాయి. అయితే యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా.. వీడియో తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించాడని విచారణలో తేలింది. విచారణలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు కూడా తేలింది. అతని నుంచి 100 సవర్ల బంగారం, ఓ లగ్జరీ ఎస్‌యూవీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 👉ఇంకోవైపు.. ఈ ఘటన రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. నిందితుడు అధికార డీఎంకే పార్టీ సభ్యుడని, ఇంకొంతమంది నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలతో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను వ్యక్తంచేశాయి. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు డీఎంకే నేతలతో జ్ఞానేశ్వర్ దిగిన ఫొటోలను వైరల్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.👉అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ అడుగు ముందుకు వేసి ఘటనకు నిరసనగా కొరడాతో బాదుకున్నారు. ప్రభుత్వం ఈ కేసులో ముందుకు కదిలేవరకు చెప్పులు వేసుకోనంటూ ప్రతిన బూనారు. మరోవైపు టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ కూడా కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. ఈలోపు.. ఈ కేసుపై మద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని తెలిపింది. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.👉మరోవైపు నిందితుడు అధికార పార్టీ సభ్యుడనే ప్రతిపక్షాల విమర్శలను ప్రభుత్వం తిప్పికొట్టింది. నిందితుడు డీఎంకే మద్దతుదారుడే తప్ప.. పార్టీ సభ్యుడు కాదంటూ స్వయానా సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటించారు. కేసు తీవ్రత దృష్ట్యా కేవలం ఐదు నెలల్లోనే విచారణ ముగిసింది. ఈ కేసులో పోలీసులు 100 పేజీల ఛార్జీషీట్‌ను దాఖలు చేశారు. మొత్తం 29 మంది సాక్షులను మహిళా కోర్టు విచారించి శిక్ష విధించింది. అయితే.. కోర్టు తీర్పుపై రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రతిపక్ష నేత పళనిస్వామి.. ‘సర్’ అంటూ జ్ఞానశేఖరన్ గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కేసు నుంచి ఇంకా ఎవరినో రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ పోలీసుపైనా ఆరోపణలకు దిగారాయన. ఈ కేసులో మరో వివాదం.. బాధితురాలి పేరు, వివరాలు బయటకు రావడం. ఏకంగా ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడంతో అంతా కంగుతున్నారు. అయితే అది కేంద్రం పర్యవేక్షణలో ఉన్న వెబ్సైట్ ద్వారా బయటకువచ్చిందని తమిళనాడు పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు.ఇదీ చదవండి: బ్రిటన్ గాట్ టాలెంట్‌లో మన చిన్నారి ప్రతిభ -
గొంతు కోసిన కత్తి ఏమైంది?
నాయుడుపేట టౌన్(తిరుపతి): నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న లాడ్జీలో జంట ఆత్మహత్య ఘటన మిస్టరీగా మారింది. లాడ్జీలో కొన్ని గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, మృతుడి గొంతు కోసిన కత్తి కనిపించకపోవడం.. మృతుల సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో తెలియక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వారి కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం, ఏకొల్లు పంచాయతీ, కుప్పారెడ్డిపాళెం గ్రామానికి చెందిన జమ్మల సుబ్రహ్మణ్యం, అలీయాస్ మణి, అదే గ్రామానికి చెందిన బొడిపెద్ద శీరిష వివాహేతర సంబంధం పెట్టుకుని ఇద్దరూ నాయుడుపేట పట్టణంలోని ఓలాడ్జీలో గురువారం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనపై మణి తల్లి జమ్మల లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బాబి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మణి గొంతుపై కత్తితో కోసిన గాట్లు ఉండడం, అతని మృతదేహంపై నుంచే కుర్చీ వేసుకుని చున్నీతో శీరిష ఉరేసుకుని మృతి చెంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా గొంతు కొసుకునేందుకు వినియోగించిన కత్తి లాడ్జీ గదిలో ఎక్కడా లభించలేదు. మృతు లు మణి, శీరిష సెల్ ఫోన్లు సైతం లేకపోవడం మిస్టరీగా మారింది. మణి, శీరిష మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శీరిష పథకం ప్రకారమే మణికి అతిగా మద్యం తాగించి కత్తితో గొంతు కొసి హతమార్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తర్వాత ఆమె కూడా గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతేకాకుండా లాడ్జీ సిబ్బంది వ్యవహర శైలిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. లాడ్జీలో సీసీ కెమెరాలు కొన్ని గంటల పాటు పనిచేయకపోవడంపై విచారిస్తున్నారు. మృతులు ఇద్దరూ నాయుడుపేట లాడ్జీలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు పలుమార్లు రిసెప్షన్ వద్దకు రావడం గుర్తించారు. శిరీష లాడ్జీ కిందకు వచ్చి పలువురితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు మణి, శిరీష మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.ప్రేమ జంట ఆత్మహత్య -
జూబ్లీహిల్స్ బేబీలాన్ పబ్‌లో దారుణం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని బేబీలాన్ పబ్‌లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో లైట్లు ఆర్పి తన తల్లి, చెల్లిపై దాడి చేశారని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీనల్ మీను ఆరోపిస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మీనల్మీను మంగళవారం రాత్రి తన తల్లి, చెల్లితో కలిసి జూబ్లీహిల్స్‌లోని బేబీలాన్ పబ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా తాము తాగని డ్రింక్స్‌కు కూడా బిల్లు వేసినట్లు గుర్తించిన ఆమె పబ్ సిబ్బందిని ప్రశి్నంచింది. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన పబ్ నిర్వాహకులు సిబ్బందితో కలిసి పబ్‌లో లైట్లు ఆపేసి ఆమె తల్లి, చెల్లిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై ఆమె సోషల్ మీడియా వేదికగా వివరించింది. తాము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్ వేశారని అడిగినందుకు కొట్టారని, వీడియో తీస్తుంటే బెదిరించి లైట్లు ఆర్పేసి దాడి చేశారని పేర్కొంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు సిబ్బందిని విచారించారు. దాడికి పాల్పడింది బౌన్సర్లా..? సిబ్బందా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. View this post on Instagram A post shared by Meenal Meenu (@itsmemeenal_) -
చివరకు.. లవర్‌తోనే పెళ్లి
యశవంతపుర(కర్ణాటక): తాళి కట్టే సమయంలో, ఈ పెళ్లి వద్దని రచ్చచేసిన పల్లవి అనే వధువు.. చివరకు పంతం నెగ్గించుకుంది. శుక్రవారం హాసన్‌లో ఆదిచుంచనగిరి కళ్యాణ మండపంలో వరుడు వేణుగోపాల్ తాళి కట్టే సమయంలో వధువు వద్దని చెప్పడంతో రభస జరిగింది. తాను రఘు అనే యువకున్ని ప్రేమించానని, అతనినే పెళ్లాడతానని పల్లవి తెగేసి చెప్పింది. ఎంతమంది నచ్చజెప్పినా వినలేదు. పెద్ద గొడవే చెలరేగింది. దీంతో వరుడు, బంధుమిత్రులు అందరూ ఉసూరంటూ వెళ్లిపోయారు. ఆమె ప్రియుడు రఘుకు కాల్ చేసి పిలిపించింది. కుటుంబసభ్యుల సమక్షంలో పల్లవి తాళి కట్టించుకుంది. అదే మండపంలో సాదాసీదాగా ఈ తంతు జరిగింది. సినిమా కథను తలదన్నే ఈ వివాహం హాసన్‌లో హాట్ టాపిక్ అయ్యింది. -
దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
సాక్షి, అమరావతి: తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ.దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండాపోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.పోలీస్స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు... ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
భార్య వివాహేతర సంబంధం.. పిల్లలకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య
కొండాపూర్ (సంగారెడ్డి): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అవమానంగా భావించిన భర్త, తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, అనంతరం తానూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచి్చన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, ఇద్దరు పిల్లలతోపాటు తండ్రి విగతజీవిగా కనిపించాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకటేశ్ కథనం ప్రకారం... కొండాపూర్ మండలం గారకుర్తికి చెందిన సుభాష్.. భార్య మంజుల, కుమారుడు మరియన్ (13), కూతురు ఆరాధ్య (9)తో కలిసి మల్కాపూర్‌లోని సా యినగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సుభాష్ సదాశివపేట మండలం ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా భార్య మంజుల ప్రవర్తనలో మార్పు రావడంతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంజుల 5 రోజుల కిందట ఎవరికీ చెప్ప కుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని భావించిన సుభాష్ అవమానభారం భరించలేకపోయాడని, దీంతో పిల్లకు ఉరి వేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు. సుమారు 5 రోజుల కిందటే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ఘటనా స్థలం వద్ద 4 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు తెలిపారు. -
బాలుడిపై లైంగిక దాడి కేసులో యువతి రిమాండ్
బంజారాహిల్స్(హైదరాబాద్): ఆ బాలుడికి 16 ఏళ్లు. అతడి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌లోని ఓ బడా పారిశ్రామికవేత్త ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉన్న సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. సదరు బాలుడు పదో తరగతి పరీక్షల కోసం గత జనవరిలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అదే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మరో యువతి (28) వారు ఉంటున్న క్వార్టర్ పక్కనే మరో క్వార్టర్లో ఉంటోంది. ఆ బాలుడితో పరిచయం పెంచుకున్న ఆమె తరచూ అతడిని తన క్వార్టర్లోకి పిలిపించుకుని అతడిపై లైంగిక దాడికి పాల్పడేది. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల్లి మీద దొంగతనం కేసు పెట్టించి ఉద్యోగం నుంచి తీసివేయిస్తానని బాలుడిని బెదిరించేది. తన తల్లి ఉద్యోగం పోతుందనే భయంతోనే అతను ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. ఐదు రోజుల క్రితం సదరు యువతి గదిలో తన కుమారుడు ఉండడాన్ని గుర్తించిన అతడి తల్లి అక్కడికి వెళ్లి చూడగా సదరు యువతి తన కొడుకును బలవంతంగా ముద్దు పెట్టుకుంటుండగా చూసింది.ఈ విషయమై తన కుమారుడిని నిలదీయగా అతను తల్లికి పూర్తి వివరాలు చెప్పాడు. దీంతో బాధితుడి తల్లి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
సింహాచలం ఘటన: ముగిసిన త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ
విశాఖ :సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటనలో త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ ముగిసింది. దీనిపై ప్రభుత్వానికి రేపు(శనివారం) నివేదిక ఇవ్వనుంది త్రీమెన్ కమిటీ. దీనివలో భాగంగా త్రీమెన్ కమిటీ చైర్మన్, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ ‘ సింహాచలం దుర్ఘటనపై రేపు ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ప్రమాదానికి కారణమైన గోడను నోటి మాటతో కట్టేశారు. గోడ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవు.విచారణలో భాగంగా వివిధ శాఖల వారిని విచారించాం. వైదిక నియమాలను ఉల్లంఘించినట్లు ఆలయ అర్చకులు చెప్పారు. ఆగమ శాస్త్రపరమైన సలహాలు లేకుండానే గోడ నిర్మించారని వైదికులు మా దృష్టికి తీసుకొచ్చారు. మాస్టర్ ప్లాన్ ఉల్లంఘనలు కనిపించాయి. ఎవరి అనుమతిలో మాస్టర్ ప్లాన్ పై నిర్ణయాలు తీసుకున్నారో తేలాలి. ప్రసాద్ స్కీం పనులు గత ఏడాది ఆగస్టులో పూర్తి కావాల్సి ఉంది. ఆలస్యానికి కారణం ఏంటని అడిగితే భిన్నమైన సమాధానాలు వచ్చాయి. అధికారుల మధ్య సమన్వయంపై ఉన్నతాధికారులతో మాట్లాడాలి’ అని స్పష్టం చేశారు.కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. -
ఇది మోదీ సర్కార్.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదలం: అమిత్ షా
న్యూఢిల్లీ, సాక్షి: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదిలే ప్రసక్తే లేదని అన్నారాయన. గురువారం న్యూఢిల్లీలో బోడో సామాజిక వేత్త ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ప్రసంగిస్తూ.. కొందరు దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటే. ఇది మోదీ సర్కార్. మోదీ సర్కార్ ఎవరినీ వదిలి పెట్టదు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయం. ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రవాద చర్యలకు గట్టి సమాధానం ఇస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. పహల్గాం అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే మా ప్రభుత్వ సంకల్పమని, దానిని సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారాయన. -
సింహాచలంలో మాటలకందని విషాదం.. (ఫోటోలు)
-
వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం పొలం కుమార్‌ను హతమార్చిన కేసులో నిందితులు వేల్పుల సంతోష్, వేల్పుల శైలజను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. కొన్నిరోజులుగా కుమార్‌తో శైలజ సన్నిహితంగా ఉండడాన్ని చూసి వివాహేతర ఉందని సంతోష్ అనుమానించాడు. పద్ధతి మార్చుకోవాలని శైలజను మందలించాడు. అయితే తన వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె చెప్పడంతో కుమార్‌పై సంతోష్ కోపం పెంచుకున్నాడు. అయితే బంధువుల వద్ద శైలజతో సంబంధం ఉందని కుమార్ చెబుతున్నాడు. శైలజకు కూడా ఫోన్లు చేస్తుండడంతో కుమార్‌ను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈక్రమంలో సోమవారం మాట్లాడుకుందాం రమ్మని కుమార్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వ్యవసాయమార్కెట్‌కు కారులో చేరుకున్నాడు. ఈలోగా పెద్దపల్లికి వచ్చిన సంతోష్.. జెండా వద్ద ఓ కత్తిని కొనుగోలు చేసి భార్య శైలజకు కుమార్‌ను చంపుదామనే విషయాన్ని చెప్పాడు. శైలజ దొంగతుర్తి నుంచి బస్సులో పెద్దపల్లికి చేరుకోగా.. ఆమెను బైక్‌పై తీసుకుని మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు కుమార్, సంతోష్ గొడవపడ్డారు. ఆ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తి తీసి మెడ, చాతి, ముఖంపై పొడిచి చంపారు. కుమార్ చనిపోయాడని నిర్ధారించుకుని నిందితులు పరారయ్యారు. ఈమేరకు నిందితులైన భార్యాభర్తలు సంతోష్, శైలజు దొంగతుర్తిలో ఉన్నారనే సమాచారంతో అక్కడకు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశ్ పాల్గొన్నారు.వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..! -
పార్టీ లైన్ దాటొద్దు.. కాంగ్రెస్ నేతలకు అధిష్టానం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం దాడులపై పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని స్పష్టం చేసింది. తాజాగా కొందరు కాంగ్రెస్ నేతలు దాడులపై చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేవి ఉన్నాయని పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నాం 2.30గం. ప్రాంతంలో సైన్యం దుస్తుల్లో వచ్చిన ఐదారుగురు ఉగ్రవాదులు.. పహల్గాం బైసరన్లోయ పిక్నిక్ స్పాట్లో పర్యాటకుల్ని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఒక స్థానికుడితో సహా 25 మంది టూరిస్టులు కన్నుమూశారు. అయితే ఈ దాడిని పార్టీలకతీతంగా రాజకీయ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదమే చోటు చేసుకుంది. పహల్గాం దాడి వెనుక నిఘా వర్గాల వైఫల్యం ఉండొచ్చని, ఏ దేశం కూడా వంద శాతం ఇలా దాడులను పసిగట్టకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ శశిథరూర్‌పై తీవ్రంగా స్పందించారు. థరూర్ కాంగ్రెస్‌లో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘సూపర్ బీజేపీ మ్యాన్’గా మారేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే..ఈ పరిణామాలను అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇతర నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఇద్దరు నేతలను మందలించినట్లు కూడా ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. -
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
కొన్ని క్షణాలకు ముందు పక్కనే భర్త.. ఆడుకుంటూ బిడ్డలు.. సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది.నీళ్లలో ఆడుకుంటున్న చిన్నారులు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయతి్నంచిన భర్త కళ్ల ముందు కడతేరిపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. సరదాలతో నిండిన ఆ కుటుంబంలో ఇప్పుడు ఆమె ఒక్కతే మిగిలింది. ఇక ఒంటరిగానే బతకాలి. చిన్నారులు దేవుడితో సమానం అంటారు. ఆ దేవునికి అభం శుభం తెలియని పసిబిడ్డలపై జాలి కూడా కలగలేదేమో. వారితోపాటు తండ్రిని తీసుకెళ్లిపోయిన విషాద ఘటన మాటల్లో చెప్పలేనిది. బిడ్డల్లారా అప్పుడే నూరేళ్లు నిండాయా..దేవుడా ఏమిటీ ఘోరం అంటూ స్థానికుల కంటతడి పెట్టించిన విషాదకర ఘటన ఇది.ములకలచెరువు: బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్తున్న తల్లిని చూసి అమ్మా మేము వస్తామంటూ ఇద్దరు పిల్లలు వెంట వెళ్లారు. వీళ్లతో పాటు పొరుగింటి చిన్నారి కూడా వెళ్లింది. వీరు ముగ్గురు చెరువు నీటిలో ఆడుకుంటూ మునిగిపోతుంటే చూసిన తండ్రి కాపాడేందుకు నీళ్లలోకి దిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలోని పెద్దచెరువులో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే... జగనన్న కాలనీలో ఈశ్వరమ్మ(34), మల్లే‹Ù(38) నివాసం ఉంటున్నారు. వీరికి లావణ్య(12) నందకిషోర్(09) సంతానం. వీరి ఇంటి పక్కనే నందిత(11) అనే బాలిక ఉంటోంది. వీరు ముగ్గురు సమీపంలోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతుక్కుంటున్న ఈశ్వరమ్మ, మల్లే‹Ùలు పిల్లలు ఆడుకుంటున్నారని వారి పనిలో నిమగ్నమయ్యారు. చెరువు కుంటలో ఆడుకుంటూ పిల్లలు మునిగిపోయారు. వీరి అరుపులు వినిపించకపోవడంతో పిల్లల కోసం మల్లేష్ కుంటలోకి దూకాడు.వారిని కాపాడే ప్రయత్నంలో అతను కూడా నీటిలో మునిగిపోయాడు. ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో ములకలచెరువులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లేదుటే పిల్లలు, భర్త మునిగి చనిపోతుంటే వారిని కాపాడేవారి కోసం ఈశ్వరమ్మ గట్టిగా కేకలు వేసింది.అయితే సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో పక్కనే ఉన్న రాజీవ్నగర్లోకి పరుగెత్తుకెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వెంటనే స్థానికులు చెరువు వద్దకు పరుగుతీసి కాపాడేందుకు ప్రయతి్నంచారు. అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. ఒంటరిగా మిగిలి... ఈశ్వరమ్మ, మల్లేష్ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి పిల్లలు లావణ్య ఆరోతరగతి, నందకిషోర్ ఐదోతరగతి చదువుతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లే పిల్లలు సెలవులు కావడంతో బట్టలు ఉతికేందుకు వెళ్లిన తల్లి వెంట వచ్చారు. చెరువులో నీటిని చూసి మురిసిపోయిన చిన్నారులు ఆడుకుంటూ మడుగులో పడి ఊపిరాడక చనిపోయారు. కాపాడేందుకు వెళ్లిన మల్లేష్ సైతం మునిగి చనిపోయాడు. భర్త పిల్లలు దూరం కావడంతో ఈశ్వరమ్మ ఒంటరిగా మిగిలిపోయింది. కళ్లెదుటే భర్త పిల్లలు చనిపోవడంతో అమె బోరున విలపించడం చూసి చూపరులు కంటతడిపెట్టారు.తోడుగా వెళ్లి... జగనన్న కాలనీలో ఉంటున్న మల్లే‹Ù, ఈశ్వరమ్మ ఇంటి పక్కనే మంజుల, వెంకటరమణలు ఉంటున్నారు. వీరికి నందిత అనే కుమార్తె ఉంది. ఇరుగు పొరుగు కావడంతో సఖ్యతతో ఉండేవారు.ముగ్గురు చిన్నారులు కలిసి ఆడుకునేవారు. శనివారం లావణ్య, నందకిషోర్ ఈశ్వరమ్మ వెంట వెళుతుండగా నేను వస్తానని నందిత వెళ్లింది. చెరువులో ఆడుకుంటూ ముగ్గురు మునిగి చనిపోయారు. ఒక్కగానొక్క కుమారై మృతి చెందడంతో అయ్యో దేవుడా మేమేం పాపం చేశాం అంటూ మంజుల, వెంకటరమణలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టాపర్ కాస్త హంతకుడిగా..
చదివిన ప్రతి తరగతిలోనూ అత్యధిక మార్కులతో పాసైన ఓ కుర్రాడు బెట్టింగ్ అలవాటు మానుకోలేక చదువుకు దూరమై హొటల్లో సర్వర్‌గా మారి ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు. చెడు సాంగత్యాన్ని మొదటిలోనే తుంచలేక ఓ వివాహిత చేతులారా బంగారం లాంటి బతుకును బుగ్గిపాలు చేసుకుంది. పైడి భీమవరంనడిబొడ్డున జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలు తెలిసే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రణస్థలం: పైడిభీమవరంలో ఊరి నడిబొడ్డున ఈ నెల 19న జరిగిన అవాల భవానీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని జేఆర్ పురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో సీఐ ఎం. అవతారం గురువారం వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. అవాల భవానీ పైడిభీమవరంలోని ఓ హొటల్లో పనిచేసేది. అక్కడే సర్వర్‌గా పనిచేస్తున్న కొండక వీర్రాజు అనే వ్యక్తితో నాలుగు నెలల కిందట ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం హోటల్ యజమానికి తెలియడంతో వీర్రాజు ను పనిలో నుంచి మానిపించేశారు. ఆ తర్వాత భవానీ ఈ విషయం తమ ఇంటిలో తెలిసిపోతుందని వీర్రాజును దూరం పెట్టింది. ఫోన్ చేసినా మాట్లాడకపోవడంతో వీర్రాజు ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. మరొకరితో అక్రమ సంబంధం ఉండడం వల్లనే తనను దూరం పెడుతోందని భావించి ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 19న పైడిభీమవరంలోని ఒక దుకాణంలో చాకు కొను క్కుని తన దగ్గర ఉంచుకున్నాడు. పైడిభీమవరం నడిబొడ్డున ఉన్న గుర్రమ్మ గుడి వెనుక ఉన్న కాజావారి కోనేరుగట్టు వద్ద అవాల భవాని రావడం గమనించి ఆమెను పిలిచి కొంత సమయం గొడవ పడ్డాడు. అయితే ఆమె అతడితో మాట్లాడేందుకు నిరాకరించింది. దీంతో తనతో తెచ్చుకున్న చాకుతో భవాని గొంతును రెండు సార్లు బలంగా కోసినట్లు పోలీసులు తెలిపారు.తర్వాత అక్కడ నుంచి పారిపోయిన వీర్రాజు విజయవాడలోని ఇంటికి చేరుకుని ఎవరూ గుర్తు పట్టకుండా గుండు గీసుకుని తిరుపతి వెళ్లిపోయాడు. తిరిగి వస్తుండగా పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు రణస్థలం మండలంలోని కమ్మసిగడాం వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరగా ఛేదించి జేఆర్ పురం సీఐ అవతారం, ఎస్ఐ ఎస్.చిరంజీవి, సిబ్బంది పి.హేమంత్ కుమార్, కేకే సింగ్, సీహెచ్ సురేష్ ను జిల్లా ఉన్నతాధికారులు ప్రశంసించారు.అన్నింటింలోనూ టాపరే..ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కొండక వీర్రాజు స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో గల నడిపల్లి గ్రామం. కుటుంబ సభ్యులతో చిన్నతనం నుంచి విజయవాడ వలస వెళ్లి అక్కడే ఉండేవాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాడు. పదిలో పదికి పది, ఇంటర్లో 965 మార్కులు, డిగ్రీ రెండేళ్లలోనూ 90శాతం మార్కులు సాధించాడు. డిగ్రీ చివరి ఏడాదిలో బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు అప్పు చేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో అన్నదమ్ములు నాలుగు నెలలు క్రితం స్వగ్రా మం నడిపిల్లి పంపించేశారు. తదుపరి నడిపిల్లి వచ్చిన అతను పైడిభీమవరంలోని ఒక హోటల్లో సర్వర్‌గా పనిలో జాయినయ్యాడు. అంత తెలివైన విద్యార్థి బెట్టింగ్ మానుకోలేక ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు.వివాహిత దారుణహత్య -
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
జగిత్యాల క్రైం: ‘అమ్మా, నాన్నా.. నా కొడుకును మీరే పెంచండి. భర్త, అత్తమామల వేధింపులు భరించలేకపోతున్నా. నా భర్త మారతాడని అనుకున్న. నా ఆశ నిరాశే అయ్యింది. కొడుకు అందంగా పుట్టాడన్న అనుమానంతో నిత్యం వేధిస్తున్నాడు. కట్నం వేధింపులు కూడా ఎక్కువయ్యా యి’.. అని సూసైడ్ నోట్ రాసి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన ప్రసన్నలక్ష్మి (26)ని రెండేళ్ల క్రితం వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.55 లక్షల కట్నం ఇస్తామని ఒప్పుకుని.. రూ.10 లక్షలు ముట్టజెప్పారు. దంపతులిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రసన్నలక్ష్మికి బాబు జన్మించాడు. అప్పటి నుంచి ఆమె ఇంటివద్దే ఉంటోంది. ప్రసన్నలక్ష్మి, తిరుపతి ఇద్దరూ చామన ఛాయలో ఉండగా.. బాబు తెల్లగా, అందంగా పుట్టాడన్న అనుమానం తిరుపతి మనసులో మొలకెత్తింది. అప్పటి నుంచి తరచూ ప్రసన్నలక్ష్మిని వేధిస్తున్నాడు. మిగతా కట్నం డబ్బు కావాలని ఒత్తిడి పెంచాడు. భర్త తిరుపతి, అత్త, మామ, ఆడబిడ్డలు వేధిస్తుండటంతో ఐదురోజుల క్రితం ప్రసన్నలక్ష్మి బెంగళూరు నుంచి జగిత్యాలలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఇంట్లో ఉన్న అద్దంపై ‘అమ్మా నాన్న నాకు బతకాలని లేదు. నా కొడుకు జాగ్రత్త. ప్లీజ్ వాళ్లకు మాత్రం నా బాబును ఇవ్వకండి’అని రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రసన్నలక్ష్మి భర్త, అత్త మామలపై చర్యలు తీసుకోవాలని గురువారం ఉదయం ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ వేణుగోపాల్ మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతురాలి తండ్రి ఉప్పునీటి గంగాధర్ ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలు, ఆడబిడ్డలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మేమేం పాపం చేశామమ్మా..
(హైదరాబాద్) జీడిమెట్ల: ఎందుకమ్మా.. ఇంత దారుణానికి ఒడిగట్టావు. గోరుముద్దలు తినిపించి.. అల్లారుముద్దుగా పెంచి.. అనురాగాన్ని పంచి నీ ప్రాణానికి ప్రాణంగా చూశావు. కానీ.. ఇంతలోనే మా ప్రాణాలు తీసి నీవూ చనిపోయావెందుకమ్మా! కష్టమొస్తే నాన్నకు చెబితే తీర్చేవాడు కదా. మాకు ఆరోగ్య సంబంధ సమస్యలు, నీకూ అనారోగ్యం.. వీటిని తట్టుకోలేక నీ ఇద్దరు పిల్లల ఊపిరి తీశావు. మేమేం పాపం చేశామమ్మా.. అంటూ ఆ ఇద్దరు చిన్నారి బాలురు తమ హృదయావేదనను ఇలాగే వెలిబుచ్చేవారేమో! గురువారం జీడిమెట్ల పీఎస్ పరిధిలోని బాలాజీ లే అవుట్లో తల్లి తేజస్విని తన ఇద్దరు కుమారులు ఆశిష్‌రెడ్డి (7), హర్షిత్‌రెడ్డి (5)లను వేట కొడవలితో నరికి.. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందికి దూకి తానూ ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ విషాదాంత ఘటనతో స్థానికులను కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు ఈ దారుణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలే కనిపించాయి. ఆ కుటుంబంలో తీరని శోకమే నిండుకుంది. మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతోనే తేజస్విని ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు. మాతృమూర్తి ఆదిలోనే ఇలా తమ ప్రాణాలను తీస్తుందని ఊహించే స్థితిలో లేని ఆ ముక్కుపచ్చలారని ఆమె ఇద్దరు కుమారులు ఆఖరి ఘడియల్లో ఎంతటి క్షోభ అనుభవించారో.. పాపం పసి పిల్లలు! -
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్ కనిపించడం లేదంటూ అతని భార్య, బంధువులు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో మిస్ అయిన కానిస్టేబుల్ నంద్యాల–కడప ఘాట్రోడ్లో శుక్రవారం శవమై కనిపించాడు. సేకరించిన వివరాల మేరకు నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం, తోటకందుకూరు గ్రామానికి చెందిన ఫారుక్ (30) ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలంగా మంగళగిరి ఆక్టోపస్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మంగళగిరి పట్టణంలోనే ఉంటున్నాడు. ఏప్రిల్ 8న ట్రైనింగ్ ఉందంటూ వెళ్లిన ఫారుక్ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో 12న భార్య బషీరున్ తన బంధువులతో కలిసి ఆక్టోపస్ కార్యాలయానికి వెళ్లింది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు ఫారుక్ సెలవు పెట్టాడని అక్కడి అధికారులు చెప్పడంతో మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదంటూ ఈనెల 14న ఫిర్యాదు చేశారు. మంగళగిరి పట్టణ పోలీసులు మిస్సింగ్‌గా కేసు నమోదు చేశారు. విచారణలో వెలుగు చూసిన నిజాలు ఫారుక్ ఫోన్ స్విచ్చాఫ్‌గా ఉండడంతో ఆక్టోపస్ అధికారుల ఆదేశాల మేరకు అతని కాల్ డేటాను పోలీసులు సేకరించారు. అందులో ఉన్న కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఫారుక్ ఫోన్ లొకేషన్ నంద్యాలలో ఉన్నట్లు తేలడంతో చివరగా ఫోన్ చేసిన వారిని నంద్యాల జిల్లా పోలీసులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాలకు చెందిన అనీషను కూడా విచారణ చేశారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఫారుక్‌కు పెళ్లికాక ముందు నుంచి అనీషతో పరిచయముంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో అనీష కుమార్తెతో కూడా ఫారుక్ సన్నిహితంగా ఉండడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఈ విషయమై ఫారుక్‌తో తరచూ గొడవ పడేది. ఫారుక్ నంద్యాలలోని తెలిసిన వ్యక్తి ద్వారా అనీషకు డబ్బులు పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి సన్నిహితంగా ఉండడంతో అనీష కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఫారుక్‌ను అడ్డు తొలగిస్తేనే పెళ్లికి అంగీకరిస్తానని అనీష చెప్పింది. పథకం ప్రకారం.. ఫారుక్‌ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం పన్నారు. అతనికి ఫోన్ చేసి కొన్ని రోజులు సెలవు పెట్టుకుని రావాలని అనీష కోరింది. ఫారుక్ మంగళగిరి నుంచి నంద్యాలకు ఏప్రిల్ 8న సాయంత్రం బయలు దేరాడు. 9న అక్కడకు చేరుకున్న ఫారుక్ తనకు పరిచయమున్న వ్యక్తిని కలిశాడు. అక్కడి నుంచి బయటకు వెళ్దామంటూ ఆ వ్యక్తి మరో ఇద్దరిని తీసుకుని ఫారుక్‌తో కారులో బయలుదేరారు. మద్యం సేవించిన అనంతరం నంద్యాలలో కారులో వెళుతుండగా ఎదురు సీట్లో కూర్చున్న ఫారుక్‌ను వెనుక ఉన్న వ్యక్తి ఓ వైర్‌తో మెడకు గట్టిగా బిగించాడు. దీంతో ఊపిరి ఆడక ఫారుక్ అక్కడికక్కడే మరణించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వీరు మృతదేహాన్ని ఒక కవర్లో చుట్టి నంద్యాల శివారు ప్రాంతంలో ఉన్న ఓ చెరువులో పడవేశారు. కొంత సమయం తరువాత వచ్చి చూడడంతో మృతదేహాన్ని కవర్‌తో చుట్టడం వల్ల చెరువులో తేలుతూ కనబడింది. మరుసటి రోజు ఎవరూ లేని సమయంలో వచ్చి ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి నంద్యాల – కడప ఘాట్రోడ్లో ఫారెస్ట్ ప్రాంతంలో పైనుంచి కిందకు పడవేశారు. నంద్యాల సీసీఎస్ పోలీసులు అనీషను, మరో ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకోగా, మరో యువకుడు పరారయ్యాడు. ఆ ముగ్గురిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నిందితులు తెలిపిన వివరాలతో ఫారుక్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫారుక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
ఖమ్మం: వేసవి సెలవులు వచ్చేశాయి.. ఒకటి, రెండు రోజుల్లో వెళ్లి మనవళ్లను తీసుకురావాలి.. నెలపాటు వారితో ఇంట్లో సందడిగా ఉంటుంది.. అని భావించిన ఆ తాత హతాశుడయ్యే సమాచారం అందింది. మనవళ్లు ఇద్దరిని కుమార్తె హత్య చేసి ఆమె సైతం బలవన్మరణానికి పాల్పడిందని తెలియడంతో కన్నీరమున్నీరయ్యాడు. మనవళ్లు గత ఏడాది వచ్చినప్పుడు అడిగినట్లుగా కొన్న సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి అంటూ ఆయన రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పెనుబల్లి మండలం తాళ్లపెంటకు చెందిన గువ్వల వెంకటరెడ్డి సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం సత్తుపల్లిలోని బైపాస్‌రోడ్ టీచర్స్ కాలనీలో ఇల్లు కట్టుకుని నివస్తుండగా ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె తేజస్వినిరెడ్డి(35) వివాహం 13ఏళ్ల క్రితం సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన గండ్ర వెంకటేశ్వరరెడ్డితో జరగగా వారికి కుమారులు హర్షిత్‌రెడ్డి(11), అశిష్‌రెడ్డి(7) ఉన్నారు. కుటుంబమంతా హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తుండగా గురువారం వెంకటేశ్వరరెడ్డి విధులకు వెళ్లొచ్చేలోగా కుమారులిద్దరిని చంపిన తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, వెంకటరెడ్డి కుమారుడు, తేజస్విని తమ్ముడు సైతం 14ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కుమారుడు, ఇప్పుడు కుమార్తె, మనవళ్ల మృతితో వెంకటరెడ్డి కుటుంబీకుల రోదనలను ఆపడం ఎవరి వల్లా కాలేదు. ఘటనా సమాచారం తెలియగానే కుటుంబమంతా హైదరాబాద్ వెళ్లగా ముగ్గురి మృతదేహాలకు హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. -
Delhi: ఎవరీ లేడీ డాన్?.. ఆ సంచలన కేసుతో లింకేంటి?
ఢిల్లీ: నగరంలో 17ఏళ్ల బాలుడు కునాల్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు సీలంపూర్‌లో ఓ లేడీ డాన్ చుట్టూ తిరుగుతోంది. బాలుడి హత్య వెనుక లేడీ గ్యాంగ్ స్టర్ జిక్రా ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిఖ్రా తన కుమారుడిని చాలాసార్లు బెదిరించిందని.. ఆమె తుపాకీతో తిరుగుతూ ఉండేదన్నారు. అవకాశం దొరికితే నా కొడుకును చంపేస్తానని చెప్పేదని బాలుడి తండ్రి అన్నారు. జిక్రా గన్‌తో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలు కూడా ఉండగా, సీలంపూర్‌లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.జిక్రాకు పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబాతో ప్రేమ సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు అండర్ వరల్డ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయని సమాచారం. గతంలో ఢిల్లీలో బడా క్రిమినల్ అయిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా భార్య జోయా ఆమెను బౌన్సర్‌గా నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం 10-15 మందితో జిక్రా తన సొంత ముఠాను నడిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది.పాలస్తీనియన్ జెండా ప్రొఫైల్ ఫోటో ఉన్న జిక్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 15,300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇటీవలి పోస్ట్‌లలో చాలా వరకు ఆమె వివిధ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తాయి. గన్‌తో ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేసేంది. తుపాకులతో రీల్స్ చేసినందుకు ఆయుధ చట్టం కింద జిక్రాపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. ఆమె పోలీసు కస్టడీలోనూ వీడియోలు తీసి ఆన్లైన్లో పోస్ట్ చేసేంది. కునాల్ వర్గానికి చెందిన వ్యక్తులు గతంలో జిక్రా సోదరుడు సాహిల్‌పై దాడి చేయగా, దానికి ప్రతీకారంగానే కునాల్‌ను హత్య చేసి ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. -
అపార్ట్మెంట్లో అక్కా చెల్లెళ్లు మృతి
హైదరాబాద్: మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు అక్కచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక మనోవికాస్ నగర్ శ్రీనిధి ఆపార్ట్‌మెంట్‌లో మీనా చంద్రన్ (59 ), వీణా చంద్రన్ (60) అనే అక్కా చెల్లెళ్లు నివాసం ఉంటున్నారు. వీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటమేగాక మానసిక స్థితి సరిగా లేదు. ఈనెల 11న ఇంట్లో తలుపులు వేసుకుని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గది నుంచి దుర్వాసన æవస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు 13 సాయంత్రం కార్ఖాన పోలీసులకు, మారేడుపల్లిలో ఉంటున్న మరో సోదరి సాధనకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి తండ్రి చంద్రన్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా అతను మృతి చెందడంతో గత కొన్నేళ్లుగా అతని పెన్షన్ డబ్బులతో వీరు జీవనం సాగిస్తున్నారని వీరి సోదరుడు దుబాయ్‌లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మానసిక స్థితి సరిగా లేని వీరు వింతగా ప్రవర్తిస్తూ ఆపార్ట్మెంట్ వాసులను ఇబ్బందులకు గురిచేసే వారని పలుమార్లు వీరిపై పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. సీఐ రామకృష్ణ నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అనూష గర్భంలో ఆడబిడ్డ
మధురవాడ: భర్త చేతిలో హత్యకు గురైన గర్భిణి అనూష మృతదేహానికి కేజీహెచ్‌లో వైద్యులు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆమె నిండు గర్భిణి కావడంతో కడుపులోని శిశువు కూడా మరణించింది. గర్భం నుంచి ఆడ మృత శిశువును బయటకు తీశారు. ఇరువురినీ చూసి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అమ్మ తోటే వెళ్లిపోతున్నావా తల్లీ అంటూ గుండెలవిసేలా రోదించారు. అనూష తండ్రి ఇది వరకే చనిపోగా.. తల్లి అంధురాలు కావడం మరింత ఆవేదనకు గురి చేసింది. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు గెద్దాడ జ్ఞానేశ్వర్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అనూష అంత్యక్రియలను దువ్వాడలో పూర్తి చేశారు. కాగా.. దువ్వాడకు చెందిన జ్ఞానేశ్వర్ నర్సీపట్నం రోడ్డులోని అడ్డురోడ్డు తిమ్మాపురానికి చెందిన కేదారిశెట్టి అనూష (27)ని ప్రేమించాడు. 2023లో సింహాచలంలో పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలు ఏడాది నుంచి మధురవాడ మిథిలాపురి వుడాకాలనీ ఆర్టీసీ డిపో సమీపం లలితా విహార్ అపార్ట్మెంట్లోని 303వ నంబర్ ప్లాట్‌లో నివాసం ఉంటున్నారు. మనస్పర్థలు కారణంగా వారి మధ్య గొడవలు జరుగుతు న్నాయి. ఏడాది కాలంగా ఆమె అడ్డు తొలగించుకునేందుకు రకరకాలుగా ప్రయతి్నస్తున్నాడు. పిల్లలు పుడితే ఆమెను వదిలించుకోవడం మరింత కష్టమని భావించి.. హత్యకు పథకం వేశాడు. సోమవారం తెల్లవారుజామున ఆమె పీక నులిమి కిరాతకంగా చంపేశాడు. భార్యతో పాటు కడుపులో ఉన్న బిడ్డను కూడా హత్య చేసినందుకు పోలీసులు జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నిందితుడిని భీమిలి కోర్టులో హాజరు పరచగా.. మెజి్రస్టేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితుడిని సెంట్రల్ జైలుకు తరలించినట్టు సీఐ బాలకృష్ణ తెలిపారు. -
ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
నిడమనూరు: నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి కోదాడ–జడ్చర్ల రహదారిపై బొక్కమంతలపహాడ్ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి హైదరాబాద్‌లోనే సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హాస్టల్లో ఉంటూ నిమ్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి కుక్కల జాన్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లోనే రీహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. జాన్‌రెడ్డి ఇటీవల మరో యువతిని వివాహం చేసుకోవడంతో అది భరించలేక మల్లేశ్వరి ఆదివారం హాస్టల్లో విషపూరితమైన ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేశ్వరి మృతదేహాన్ని బొక్కమంతలపహాడ్ గ్రామానికి తమకు న్యాయం చేయాలని జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారిపై రాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు. -
గోశాల ఘటనపై టీటీడీ ఛైర్మన్ చులకన వ్యాఖ్యలు!
సాక్షి, తిరుపతి: టీటీడీ గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. గోశాలలో గోవుల మృతిని టీటీడీ చైర్మన్ అంగీకరించారు. టీటీడీ గోశాలలో ఇప్పటివరకు 22 గోవులు చనిపోయాయాన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఇంట్లో మనుషులు చనిపోరా అంటూ చులకనగా వ్యాఖ్యానించారు. మరో వైపు, గోశాలలో 40 ఆవులు చనిపోయాయని ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. గోవుల మరణాలపై కూటమి నేతల తలోమాట మాట్లాడుతున్నారు.గోశాలలో గోవుల మరణాలపై మాట్లాడిన వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ బీఆర్ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు. అన్నిచోట్ల కేసులు నమోదు చేయిస్తాం.. ఇప్పటికే కొందరు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారంటూ పరోక్షంగా పోసాని కృష్ణమురళి ఉద్దేశించి టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించారు. గోశాలలో డాక్టర్లు తక్కువగా ఉన్నారంటున్న టీటీడీ ఛైర్మన్.. అదనపు వైద్యులను నియమిస్తామని తెలిపారు. -
తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్
సాక్షి, తిరుపతి: తిరుమల గోశాలలో గోవుల మృతి ఘటనపై మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల వ్యవధిలో పలు గోవులు చనిపోవడం తీవ్రంగా కలిచివేసిందని ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గోవుల మృతి విషయం టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ద్వారా తెలిసింది. దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గోసంరక్షణ ప్రభుత్వ బాధ్యత. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తాను’’ అని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.Fmr TTD Chair Karunakar Reddy has alleged that in the past 3 months, several sacred indigenous cows have died due to illness and lack of proper feed at TTD Goshala. I am gathering more information, Art 48 of the Indian Constitution, its State’s duty to protect them. PIL underway.— Subramanian Swamy (@Swamy39) April 12, 2025టీటీడీ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవుల మృతిపై వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న(శుక్రవారం) సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘టీటీడీ గోశాలలో దేశవాలి అవులు వందకు పైగా మృత్యువాత పడ్డాయి. నిర్వాహకులు ఈ విషయం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆవులు ఎలా చనిపోయాయో తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించలేదు. డీఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్ చార్జిగా నియమించారు. ఆయనకు గోపరిరక్షణకు ఎటువంటి సంబంధం లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. -
‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
కల్వకుర్తిటౌన్: బాధితురాలి కదలికలను గుర్తించే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన ఆ ఘటన వివరాలను బుధవారం కల్వకుర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు. జడ్చర్లకు చెందిన ఓ వివాహిత తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మార్చి 29న (శనివారం) మధ్యాహ్నం ఊర్కొండపేటకు వచ్చి దైవదర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేశారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో మరో బంధువు అక్కడకు రాగా.. ఆయనతో మాట్లాడుతూ 150 మీటర్ల దూరంలో ఆలయానికి ముందు భాగంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. ఈ క్రమంలో నిందితులు అక్కడకు వెళ్లి బా ధితులను బెదిరించి, ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో మార్పాకుల ఆంజనేయులు, సిద్ధిఖ్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తీక్ మొదట అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ నలుగురు.. మట్ట మహేష్‌గౌడ్, హరీశ్‌గౌడ్, మట్ట ఆంజనేయులును ఘటనా ప్రాంతానికి పిలిపించగా, మద్యం తాగి వారు సైతం అత్యాచారం చేశారు. బాధిత మహిళ తాగడానికి నీరు అడగ్గా, కార్తీక్ బాటిల్లో మూత్రం పోసి ఇచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులంతా 28 ఏళ్లలోపు వారేనని, మహిళపై రాత్రి 12 గంటల వరకు అత్యాచారం చేశారని, ఈ విషయాన్ని బయటకు చెబితే మీరు కలిసి ఉన్న ఫొటోలను పబ్లిక్ చేస్తామని హరీశ్‌గౌడ్ బెదిరించారని చెప్పారు. మార్చి 30న (ఆదివారం) తెల్లవారుజామున బాధితురాలు తన బంధువుతో కలిసి వెళ్తుండగా విషయాన్ని బయటకు చెప్పకుండా వారిని బెదిరించి ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మహేశ్‌గౌడ్ వారి వద్ద రూ.6 వేలు డిమాండ్ చేసి వసూలు చేశాడు. బాధితురాలు తన ఊరికి వెళ్లి, తిరిగి సోమవారం ఊర్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అత్యాచార ఘటనలో నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచామని, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో బాధితురాలి నుంచి నిందితులు బంగారం, నగదు తీసుకున్నారని చెప్పినా.. అందుకు సంబంధించిన రికవరీని పోలీసులు చూపించలేదు. ఈ సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, కురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
రంగారెడ్డి జిల్లా : సంచలనం సృష్టించిన విదేశీ యువతిపై అత్యాచార ఘటనలో రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన నిందితుడు మహ్మద్ అస్లాంను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. కేవలం గంట రెండుగంటల వ్యవధిలోనే నిందితుడు యువతితో పాటు ఆమె స్నేహితుడిని అంతగా ఎలా నమ్మించాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన నిందితుడికి ఆంగ్లంపై పట్టుండటంతో చలాకీగా మాట్లాడి ఆకర్షించాడా.. వేరే కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్న నిందితుడు.. గతంలో కూడా ఇదే తరహా ఏవైనా నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పవిత్రమైన రంజాన్ పర్వదినం రోజున అస్లాం ఇలాంటి ఘటనకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, విజిటింగ్ వీసాపై జర్మనీ నుంచి వచ్చిన యువతిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు భారత్‌లోని జర్మన్ కాన్సులేట్‌కు నివేదికను పంపనున్నారు. ఇదిలా ఉండగా, మీర్‌పేట మిథులానగర్లోని స్నేహితుడి ఇంట్లో ఉంటున్న ఆ యువతి గురువారం అర్ధరాత్రి తిరిగి స్వదేశానికి వెళ్లనుంది. -
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరం ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు ఈ రోజు నన్ను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుత పరిస్థితిని నాకు వివరించారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘‘బాధ్యులకు శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. విద్యార్థిని పరిస్థితి ఆ తల్లిదండ్రులు వివరిస్తుంటే బాధనిపించింది. ఈ ప్రభుత్వం ఆడబిడ్డల భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమైంది. ఫార్మసీ విద్యార్థిని కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం జరిగేలా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగ అంజలి తల్లిదండ్రులు ఈ రోజు నన్ను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుత పరిస్థితిని నాకు వివరించారు. బాధ్యులకు శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు… pic.twitter.com/NLm75iVpc5— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2025 -
నాగర్‌కర్నూల్ ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, నాగర్ కర్నూల్: ఊర్కొండపేటలో మహిళపై లైంగిక దాడి కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు ఇవాళ ఆరెస్టు చేశారు. గత శనివారం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన మహిళపై అదే గ్రామానికి చెందిన ఏడుగురు నిందితులు పాశవికంగా ప్రవర్తించి సామూహిక లైంగిక దాడి చేశారని నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాద్ తెలిపారు.తన బంధువుతో కలిసి ఆలయానికి సమీపంలో ఉండగా నిందితులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేశారని తెలిపారు. ఆమెతో ఉన్న వ్యక్తిని చెట్టుకు కట్టేశారని వివరించారు. మొదట వారిద్దరి ఫోటోలు తీసి బెదిరించారని విషయం బయటికి చెబితే ఫోటోలో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని తెలిపారు. వారిపై దాడి చేసి రూ.6 వేలు లాక్కున్నారని చెప్పారు. బీఎన్ఎస్ సెక్షన్ 70, సెక్షన్ 351, సెక్షన్ 310, కింద నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.నిందితులు ఊర్కొండ పేటకు చెందిన మరి పాకుల ఆంజనేయులు, సిద్ధిక్ బాబా, మొగుల్దాస్ మనీ అలియాస్ మణికంఠ, కార్తీక్, మట్టా మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్ట ఆంజనేయులుగా గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. దాహం వేసి నీళ్లు అడిగితే ఓ నిందితుడు మూత్ర విసర్జన చేశాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని.. మళ్లీ నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని ఎస్పీ తెలిపారు. -
భార్యను కాపురానికి పంపలేదని అత్తకు శ్రద్ధాంజలి పోస్టర్
వేలూరు: తిరుపత్తూరు సమీపంలోని తన భార్యను కాపురానికి పంపలేదని అత్తపై ఆగ్రహించిన అల్లుడు అత్త మృతి చెందినట్లుగా శ్రద్ధాంజలి పోస్టర్‌ను ముద్రించి వాటిని అన్ని ప్రాంతాల్లో కరిపించడంతో పాటూ బంధువులకు వాట్సాప్ ద్వారా పంపిన ఘటన సంచలనం రేపింది. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని నిమ్మయంబట్టు గ్రామానికి చెందిన వెంకటేశన్ ఇతని భార్య వినోదిని దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. వెంకటేశన్ బ్యాంకులో లోన్ తీసుకొని పాడి పశువును కొనుగోలు చేసి బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించలేదు. దీంతో దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భార్య వినోదిని ఇలక్కినాయకన్‌పట్టి గ్రామంలో ఉన్న అమ్మగారింటికి రెండు నెలల క్రితం వెళ్లింది. అక్కడ నుంచే వినోదిని వేరే దుకాణంలో పనిచేస్తోంది. ఇదిలా ఉండగా అత్త మాదు తన భార్యను కాపురానికి పంపకుండా అడ్డుకుంటుందని ఆగ్రహించిన వెంకటేశన్ అత్త ప్రాణాలతో ఉన్నప్పటికీ ఆమె మృతి చెందినట్లు శ్రద్ధాంజలి బ్యానర్, పోస్టర్లు వేసుకొని చుట్టు పక్కల కరిపించడంతో పాటూ భార్య వినోదిని బంధువులకు వాట్సాప్ పంపాడు. ఈ విషయాన్ని బంధువులు వినోదినికి పోన్ చేసి విషయాన్ని తెలిపారు. దీంతో వినోదిని తన భర్త వెంకటేష్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకటేష్ ను అరెస్ట్ చేశారు. -
అత్యాచారం చేసి.. నోట్లో మూత్రం పోసి..
సాక్షి, నాగర్‌కర్నూల్: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో మహిళపై ఏడుగురు కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. దాడి చేసి.. చెట్టుకు కట్టేసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మహిళపై కామాంధులు దాడికి తెగబడ్డారు. శనివారం సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆమె తల్లిదండ్రు లు, పిల్లలు ఆలయ పరిసరాల్లో పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లింది. అక్కడ కనిపించిన బంధువుతో మాట్లాడుతుండగా, అక్కడే కాచుకుని ఉన్న ఏడుగురు కామాంధులు వారిపై దాడిచేసి, ఆమె బంధువును చెట్టుకు కట్టేశారు. మహిళపై అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ ఏడుగురు కలిసి సా మూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కనీసం తాగేందుకు నీళ్లు ఇవ్వమని వేడుకున్నా కనికరించలేదు. పైగా నోట్లో మూత్రం పోసి అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ వెనకడుగు వేసినట్టు తెలిసింది. తర్వాత కుటుంబ సభ్యుల భరోసా మేరకు ఎట్టకేలకు సోమ వా రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంజాయి, మద్యం మత్తులో.. జిల్లాలో పలుచోట్ల గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, బహిరంగంగా మద్యం తాగుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ మత్తులో విచక్షణ కోల్పోయి ఇష్టారీతిగా అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఊర్కొండపేట ఆలయ పరిసరాలతోపాటు జిల్లాలో పలుచోట్ల ఇతర దర్శనీయ ప్రదేశాల్లో బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగంపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నా, పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. పలుచోట్ల ఫిర్యాదు చేసినా, తరచుగా ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా ఆయా చోట్ల పో లీసుల నిఘా ఉండటం లేదు. తాజాగా మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో గంజా యి, మ ద్యం మత్తులో నిత్యం జోగుతున్న స్థానిక యువకులు, పలువురు ఆటోడ్రైవర్ల పాత్ర ఉందని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఏడు గురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా.. ఇంకా ఎవరికైనా ఈ ఘటనతో సంబంధం ఉందా.. అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. వేగంగా విచారణ చేస్తున్నాం.. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ, సీఐ అధికారులు స్పందించి కేసు నమోదు చేశారని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. కేసుపై వేగంగా విచారణ కొనసాగుతోందన్నారు. ఏడుగురు నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాధితురాలిపై నిందితులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు.నిందితులు ఎవరైనా వదిలిపెట్టం జడ్చర్ల టౌన్: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పారీ్టకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని నాగర్‌కర్నూల్ ఎస్పీని కోరానని వెల్లడించారు. ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారు ఓ పారీ్టకి చెందిన నాయకులు అని తన దృష్టికి వచ్చిందని, అయితే ఈ ఘటనలో తాను రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని, యువతికి అండగా ఉంటామన్నారు. అలాగే ఊర్కొండ పోలీసులతో మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కలి్పంచాలని కోరానన్నారు. -
ఏలూరు జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జైలులో ఒక రిమాండ్ మహిళా ఖైదీ ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల కిందటే జైలుకు వచ్చిన ఆమె ఆదివారం ఉదయం చున్నీతో బ్యారక్‌లోని కిటికీకి ఉరి వేసుకుని మృతిచెందడం కలకలం సృష్టించింది. వివరాలు... ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసు (31)తో తెలంగాణలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శాంతికుమారి(29)కి 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. బోసుపై మార్చి 18న గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు.ఖమ్మం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 19న మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. శాంతికుమారి తన ప్రియుడు సొంగా గోపాల్‌తో కలిసి భర్త బోస్ హత్యకు కుట్ర చేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమెను మార్చి 24న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, జడ్జి రిమాండ్ విధించారు. మరోవైపు తన భర్తను చంపేస్తామని కొంతమంది రాజకీయ నాయకులు హెచ్చరించారని, ఆయనపై దాడి జరిగిన రోజే శాంతికుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త మృతికి, తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా పోలీసులు తనను కేసులో ఇరికించారని శాంతికుమారి బాధపడుతున్నట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జైలు బ్యారక్‌లో కిటికీకి తన చున్నీతో ఉరి వేసుకుంది. వెంటనే జైలు సిబ్బంది ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించగా, వైద్యులు మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌లోని మార్చురీలో ఉంచారు. ఏలూరు జిల్లా జైలు అధికారుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, శాంతికుమారి ఆత్మహత్య నేపథ్యంలో మహిళా బ్యారెక్ వద్ద విధులు నిర్వహించిన హెడ్ వార్డర్ ఎల్.వరలక్ష్మి, వార్డర్ నాగమణిలను సస్పెండ్ చేస్తూ జైలు సూపరింటెండెంట్ సీహెచ్ఆర్వీ స్వామి ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. -
రాజమండ్రి ఫార్మసిస్ట్ ఘటన.. సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి: మార్గాని
సాక్షి, తూర్పుగోదావరి: ఆత్మహత్యా యత్నం చేసిన ఫార్మసిస్ట్కి న్యాయం జరిగేదాకా పోరాడుతామని, ఆమె కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రకటించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపైనా వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫార్మసిస్ట్ కేసులో నిందితుడు దీపక్ టీడీపీ క్రియాశీల కార్యకర్త అని, ఆయన మామ రాజమహేంద్రవరం టీడీపీలో ముఖ్య నేత అని మాజీ ఎంపీ గుర్తు చేశారు. దీపక్ పని చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ కోరారు.మార్గాని భరత్ ఇంకా ఏం మాట్లాడారంటే..:బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో ఏజీఎంగా పని చేస్తున్న దీపక్ అనే వ్యక్తి కారణంగానే తాను ఆత్మహత్యా యత్నం చేస్తున్నట్లు ఫార్మసిస్ట్ సుదీర్ఘ లేఖలో రాసుకొచ్చారు. ఆమెను దీపక్ శారీరకంగా, మానసికంగా హింసించాడు. అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. అంజలి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలి. లేకపోతే అవన్నీ బయట పెడతాం. దీపక్ వ్యక్తిత్వం మంచిది కాదని అందరూ చెబుతున్నారు. గత మూడు నాలుగు రోజులుగా బాధితురాలి తల్లిదండ్రులు అనుభవిస్తున్న బాధ వర్ణణాతీతం. ప్రభుత్వం మీద నమ్మకం లేక న్యాయం చేయమని వారు నన్ను ఆశ్రయించారు. ప్రభుత్వం సరిగ్గా స్పందించి ఉంటే వారు నా దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంటుంది?పక్కదారి పట్టించే ప్రయత్నం:ఆస్పత్రి యాజమాన్యం కూడా మొదటిరోజు ఈ ఘటనను పక్కదారి పట్టించేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. ఫార్మసిస్ట్ సహచర విద్యార్థులు రోడ్డుమీదకొచ్చి ధర్నా చేస్తే కానీ ప్రభుత్వం, ఆస్పత్రి యాజమాన్యం దిగి రాలేదు. మూడు రోజుల తర్వాత కానీ ఆమె ఆత్మహత్యకు యత్నించిన ఇంజెక్షన్ గురించి ఆస్పత్రి యాజమాన్యం నోరు విప్పలేదు. ఫార్మసిస్ట్ సూసైడ్ నోట్ దొరకనంత వరకు ఈ కేసును నీరు గార్చడానికి దీపక్ చేయని ప్రయత్నం లేదు. మా నాయకుడికి ఈ విషయం తెలియజేయడంతో ఫార్మసిస్ట్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా అండగా ఉండాలని ఆదేశించారు. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతుంది. నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త:నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త అని తెలిసింది. ఆయనకు పిల్లనిచ్చిన మామ కూడా రాజమండ్రిలో టీడీపీ నాయకుడని సమాచారం. కాబట్టే ఈ కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు ఫార్మసిస్ట్ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 10 నెలల్లో మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. కానీ ఎక్కడా నిందితులకు శిక్ష పడిన దాఖలాలు లేవు.సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి:సీసీ టీవీ ఫుటేజ్‌ను ఆస్పత్రి యాజమాన్యం వెంటనే బయట పెట్టాలి. రూమ్ నెం.801లో ఆమే స్వయంగా ఇంజక్షన్ చేసుకుందా? లేక ఎవరైనా బలవంతంగా ఎక్కించారా అనేది నిర్ధారణ కావాలి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు దీపక్ నుంచి సేకరించిన వివరాలు ఫార్మసిస్ట్ తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఈనెల 23న దీపక్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే మాత్రం 24వ తేదీ కనిపిస్తోంది. అలాగే ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారా? లేదా? అన్నది కూడా పోలీసులు చెప్పాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివరాలు వెల్లడించాలి:పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయి ఐదు రోజులు గడిచినా ఆయనది హత్యా? లేక రోడ్డు ప్రమాదమా? అనేది ఇంతవరకు పోలీసులు నిర్ధారించలేకపోవడం దారుణం. ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ప్రవీణ్ పగడాల మృతి విషయంలో నారా లోకేష్ ట్వీట్ పలు అనుమానాలకు తావిస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు రాకుండానే హత్యా? యాక్సిడెంటా? అనేది నిర్ధారణ కాకుండానే ప్రమాదవశాత్తు చనిపోయారని ఆయన ఎలా ప్రకటిస్తారు?. అందుకే పాస్టర్ ప్రవీణ్ మృతిపై పూర్తి వివరాలు చెప్పాలని మార్గాని భరత్ కోరారు.కాగా, ఫార్మసిస్ట్ తల్లిదండ్రులు కూడా మీడియాతో మాట్లాడుతూ..సరైన సమాచారం ఇవ్వలేదు:మా పాప వికాస్ కాలేజీలో చదువుతూ బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తోంది. మా పాప కళ్లు తిరిగిపడిపోయిందని ఈనెల 23న సా. 4 గం.కు ఆస్పత్రి నుంచి మాకు ఫొనొచ్చింది. మేము అక్కడికి వెళ్లేసరికి రాత్రి 8 గం. అయింది. అప్పటికే ఆమెను వెంటిలేటర్ మీద ఉంచారు. మేం వెళ్లాక ఐసీయూకు మార్చారు. వైద్యం చేస్తున్నామని చెబుతున్నారే కానీ దేనికి అనేది చెప్పలేదు. స్లో పాయిజన్ అయి ఉంటుందని మర్నాడు ఒక డాక్టర్ చెప్పారు. మా పాపకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. ఈ పరిస్థితి మరే ఇతర అమ్మాయికి రాకూడదు. మా పాప ఆస్పత్రికి ఎలా వచ్చిందో అలాగే తిరిగి ఇంటికి రావాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి.ఆస్పత్రికి కనీసం బాధ్యత ఉండదా?:డ్యూటీలో ఉన్న అమ్మాయి పడిపోతే ఆస్పత్రికి బాధ్యత తీసుకోదా? అందుకే ఈ ఘటనలో ఆస్పత్రి యాజమాన్యం పాత్ర కూడా ఉందనే అనుమానం వస్తోంది. ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటి వరకు మాతో మాట్లాడలేదు. మాజీ ఎంపీ భరత్ జోక్యం చేసుకున్నాకే వారిలో మార్పు కనిపిస్తోందని ఫార్మసిస్ట్ తల్లిదండ్రులు వెల్లడించారు. -
పిల్లల కోసం వస్తే.. పిల్లలతో పాటు భార్యా దక్కలేదని..
డాబాగార్డెన్స్: పిల్లల కోసం కలలు కన్న ఒక నిరుపేద దంపతులకు ఫెర్టిలిటీ సెంటర్ తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇందుకోసం తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోగా.. కడుపులో పెరుగుతున్న కవలలతో సహా తల్లి కూడా మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆ ముగ్గురు ప్రాణాల విలువను రూ.4 లక్షలుగా వెలకట్టి ఆస్పత్రి యాజమాన్యం చేతులు దులుపుకుంది. బాధితుడు తెలిపిన వివరాలివి..అనకాపల్లి జిల్లా మాకవరపాలెం ఎస్సీ కాలనీకి చెందిన గెంజి వరహాలు బాబు ఓ కంపెనీలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఎనిమిదేళ్ల కిందట లక్ష్మితో అతనికి వివాహం జరిగింది. పిల్లలు లేకపోవడంతో బాధపడుతున్న వరహాలు బాబుకు.. అదే కంపెనీలోని ఒక సహోద్యోగి రామ్‌నగర్‌లోని ఆరాధ్య ఆస్పత్రి గురించి చెప్పాడు. అక్కడ చికిత్స తీసుకుంటే పిల్లలు పుడతారని చెప్పడంతో.. వరహాలు బాబు, లక్ష్మి దంపతులు ఎనిమిది నెలల కిందట ఆరాధ్య ఆస్పత్రిని సంప్రదించారు. ప్రారంభంలో ఆస్పత్రి యాజమాన్యం రూ.2,25,000 ఖర్చు అవుతుందని చెప్పగా.. తమ ఆర్థిక పరిస్థితిని వివరించడంతో రూ.2,10,000కు అంగీకరించింది. వరహాలు బాబు పరీక్షల కోసం మరో రూ.12 వేలు చెల్లించాడు. పరీక్షలు పూర్తయ్యాయి. లక్ష్మికి రూ.12 రోజుల పాటు రోజుకు ఒక ఇంజక్షన్ చొప్పున 12 ఇంజక్షన్లు వేశారు. అప్పటి నుంచి ప్రతి నెలా పరీక్షల కోసం మాకవరపాలెం నుంచి నగరానికి వెళ్లొస్తూ ఉండేవారు. ప్రయాణాలు, వైద్య ఖర్చులు, మందులు, స్కానింగ్‌ల కోసం నెలకు దాదాపు రూ. 20 వేల వరకు ఖర్చు చేసేవారు. నాలుగో నెలలో లక్ష్మి గర్భంలో ముగ్గురు పిల్లలు ఉన్నారని వైద్యులు చెప్పడంతో సంతోషించిన ఆ దంపతులు.. ఇద్దరు పిల్లలు చాలని కోరారు. దీంతో వైద్యులు ఒక పిండాన్ని తొలగించారు. ఆ తర్వాత ఆరు నెలల వరకు తల్లి, పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు. 7వ నెలలో నిర్వహించిన పరీక్షల్లో లక్ష్మికి మధుమేహం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలు పాటించినప్పటికీ.. సరైన పోషకాహారం లేక పిల్లల ఎదుగుదల సరిగా లేకపోయింది. దీంతో ఆస్పత్రి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.ముందే చెప్పి ఉంటే..కాగా.. గత ఆదివారం రాత్రి లక్ష్మికి తీవ్రమైన విరేచనాలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం వరకు అవి ఆగకపోవడంతో ఆందోళన చెందిన వరహాలు ఆస్పత్రికి ఫోన్ చేసినా స్పందన రాలేదు. ఉదయం 8 గంటల తర్వాత స్పందించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తీసుకురావాలని సూచించారు. మధ్యాహ్నానికి ఆస్పత్రికి చేరుకున్న లక్ష్మిని మొదట 6వ అంతస్తులో, తర్వాత 3వ అంతస్తుకు మార్చారు. పరిస్థితి విషమించడంతో స్కానింగ్ చేయగా కడుపులో ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పిల్లలు చనిపోయినా భార్యను కాపాడమని వేడుకున్న వరహాలు బాబుకు చెప్పకుండానే అదే రోజు రాత్రి లక్ష్మిని అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం లక్ష్మి తుదిశ్వాస విడిచింది. భార్యను, కడుపులోని ఇద్దరు పిల్లలను కోల్పోయిన వరహాలు బాబు కన్నీరుమున్నీరుగా విలపించాడు. పిల్లల కోసం వస్తే.. పిల్లలతో పాటు భార్యా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆవేదననను చూసి కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీస్తే.. ముగ్గురి ప్రాణాలకు కలిపి రూ.4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించాడు. ప్రతి నెలా పరీక్షలు చేస్తూ లక్షలు వసూలు చేసిన యాజమాన్యం.. చివరికి తల్లి శరీరం సహకరించడం లేదని చెప్పడం దారుణమని వరహాలు బాబు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ముందే చెప్పి ఉంటే ఈ ప్రయత్నమే చేసేవాళ్లం కాదని, ముగ్గురు ప్రాణాలను రూ.4 లక్షలకు వెలకట్టడం దారుణమని ఆమె రోదించింది. -
నిందితుడిని పట్టించిన ఫోన్ కాల్
బనశంకరి: భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా కత్తరించి సూట్‌కేసులో పెట్టి ఉడాయించిన టెక్కీ రాకేశ్ రాజేంద్ర ఖడేకర్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. మిత్రుడికి చేసిన ఫోన్ కాల్ అతన్ని పోలీసులకు పట్టించింది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా కత్తిరించి సూట్‌కేస్‌లో పెట్టి బాత్రూమ్లో దాచి మహారాష్ట్రకు వెళ్తూ మార్గమధ్యంలో భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. మీ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి కాల్ కట్ చేశారు. అదే సమయంలో ఇతను నివాసం ఉండే అద్దె ఇంటి కింద ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి తన భార్యను హత్యచేసినట్లు తెలిపాడు. స్నేహితుడి మొబైల్‌కు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పుణె మార్గమధ్యంలో సంచరిస్తున్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం చేరవేశారు. పుణె చేరుకోగానే రాకేశ్ కారు రోడ్డు పక్కన నిలిపి దుకాణంలో ఫినాయిల్‌ను కొనుగోలు చేసి తాగి ఆత్మహత్యకు ప్రయతి్నంచాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పుణె పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. పుణెకు చేరిన హుళిమావు పోలీసులు పుణే వైపు వెళుతున్నట్లు సమాచారం అందుకున్న హుళిమావు పోలీసుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాకేశ్ కోలుకోగానే అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకు వస్తారు. టెక్కీ రాకేశ్ భార్యను హత్య చేయడానికి కచ్చితమైన కారణం తెలియరాలేదు. కుటుంబ కలహాల కారణంతో హత్య చేసినట్లు సమాచారం ఉందని కమిషనర్ దయానంద్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అతడి ఆరోగ్యం స్దిరంగా ఉందని డాక్టర్లు తెలిపిన అనంతరం బెంగళూరుకు తీసుకువచ్చి విచారణ చేపడతామన్నారు. విచారణ అనంతరం భార్య హత్యకు కారణాలు ఏమిటో తెలియనుంది. మృతురాలు గౌరీ కుటుంబ సభ్యులు నగరానికి చేరుకోగా వారి నుంచి కూడా సమాచారం సేకరించామన్నారు. -
నంద్యాలలో కొట్టుకున్న హిజ్రాలు
నంద్యాల జిల్లా: నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. హిజ్రాలే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. బిక్షాటన విషయంలో.. హిజ్రాల వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలలో బిక్షాటన విషయంలో రూరల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ముందే.. హిజ్రాలు తన్నుకున్నారు. రాళ్లు అలాగే కారంపొడి చల్లుకొని మరి... రెచ్చిపోయారు హిజ్రాలు. ఒకరిపై ఒకరు దాడి చేసుకొని వీరంగం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిక్షాటన విషయంలో పాణ్యం , అలాగే నంద్యాలకు చెందిన రెండు హిజ్రాల వర్గాల మధ్య కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. నంద్యాలలో భిక్షాటన చేయడానికి పాణ్యం వర్గం ప్రయత్నిస్తోంది. అయితే దీన్ని నంద్యాల వర్గం అడ్డుకుంటుంది. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇవాళ రూరల్ పోలీస్ స్టేషన్ ముందు రెండు వర్గాలు ఎదురుపడ్డాయి. ఇంకేముంది.. వివాదం కాస్త గొడవ దాకా వెళ్ళింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకొని కొట్టుకున్నారు . దీంతో టూ టౌన్ రూరల్ పోలీసులు పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారుబిక్షాటన విషయంలో పాణ్యం, నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గాల మధ్య… pic.twitter.com/VoEanzJjFY— Telugu Scribe (@TeluguScribe) March 28, 2025 -
పిల్లలు ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా..
జయశంకర్: రెక్కాడితే గాని డొక్కాడని రెండు నిరుపేద కుటుంబాలను మృత్యువు వెంటాడింది. ఉదయం కూలీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. ఖాళీగా ఉంటే ఏముంటుంది..? అదనపు కూలీకి వెళ్తే పూట అయినా గడుస్తుంది కదా అనే ఆశతో సాయంత్రం కూడా వెళ్లారు. అయితే ఈ కూలే వారికి చివరిది అవుతుందని అనుకోలేదు. పాపం.. పని వెళ్లకున్నా బతికేవారేమో. మృత్యువు లారీ రూపంలో ఇద్దరు మహిళా కూలీలను కబలించింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకిష్టాపూర్(టి)లో మంగళవారం చోటు చేసుకుంది. ప్రత్యక్షుల కథనం ప్రకారం.. రామకిష్టాపూర్(టి) గ్రామానికి చెందిన మోకిడి పూలమ్మ(45), మోకిడి సంధ్య(30)తోపాటు మరో ఆరుగురు కూలీలు ఉదయం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. సాయంత్రం వేళలో కూడా మళ్లీ అదే గ్రామానికి చెందిన సల్పాల బుచ్చయ్య అనే రైతు పొలంలోని పని చేయడానికి వెళ్తున్నారు. సరిగా పొలం వద్దకు చేరుకునే సమయానికి చిట్యాల మండలం శాంతినగర్ శివారు కాటన్ మిల్లు నుంచి అతివేగంగా పత్తి గింజల లోడ్‌తో మూలమలుపు వద్ద నుంచి వస్తున్న లారీని గమనించిన కూలీలు కొంత దూరం పరుగులు తీశారు. ఇందులో ముగ్గురు పొలంలోకి వెళ్లడంతో అక్కడే లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పత్తి గింజల బస్తాలు పడడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తృటిలో తప్పించుకుంది. తోటి మహిళా కూలీలు భయంతో కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఏఎస్సై అమరేందర్‌రెడ్డి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సాయంతో లారీని లేపారు. మృతదేహాలను పత్తి గింజల బస్తాల కింద నుంచి బయటకు తీసి 108లో చిట్యాల సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అప్పటి వరకు అందరి మధ్యలో ఉన్న ఇద్దరు విగత జీవులుగా మారడంతో తోటి మహిళా కూలీల రోదనలు మిన్నంటాయి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారైనట్లు మహిళా కూలీలు తెలిపారు.పిల్లలు ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా..మన పిల్లలు ఇక నుంచి ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా.. ఒక్కసారి చూడు సంధ్యా.. నా ప్రాణం పోయేలా ఉంది.. అయ్యో దేవుడా ఒక్కసారి బతికించమంటూ సంధ్య భర్త రాజు రోదించిన తీరు చిట్యాల సివిల్ ఆస్పత్రిలో ప్రతీ ఒక్కరిని కంట తడి పెట్టించింది. అమ్మా లే.. అమ్మా లే.. అంటూ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పూలమ్మ భర్త, కూతురు సైతం కన్నీరుమున్నీరయ్యారు. సంధ్య, పూలమ్మ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున చిట్యాల సివిల్ ఆస్పత్రికి చేరుకుని వారి మృతదేహాల మీద పడి గుండెలవిసేలా రోదించారు. -
Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లలో భరోసా లేని భద్రత
సాక్షి.హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైళ్లు, స్టేషన్లలో మహిళా ప్రయాణికుల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్‌లోని మహిళా కోచ్‌లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి ప్రయాణికురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడడం, అతడి నుంచి తప్పించుకొనేందుకు ఆమె కదులుతున్న రైలులోంచి దూకి తీవ్ర గాయాలపాలు కావడంతో ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు నడుస్తున్న కొన్ని రైళ్లలో ఆరీ్పఎఫ్ శక్తి బృందాలు, జీఆర్పీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ డివిజన్ పరిధిలో ఎంఎంటీఎస్లలో మహిళలకే కాకుండా సాధారణ ప్రయాణికుల భద్రతపైన కూడా ఆందోళన నెలకొంది. తరచూ ఏదో ఒక స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి దాడులకు పాల్పడుతున్నారు. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్, మేడ్చల్, నాంపల్లి, తదితర మార్గాల్లో నడిచే రైళ్లపైన ఎలాంటి నిఘా వ్యవస్థలు పని చేయడం లేదు. ఆర్పీఎఫ్, జీఆర్పీ భద్రత కూడా లేదు. నగరంలో సుమారు 30 ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా కేవలం 10 స్టేషన్ల మాత్రమే ఆరీ్పఎఫ్ విధులు నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ డివిజన్లో ఒక ఎస్ఐతోపాటు 16 మంది మహిళా కానిస్టేబుళ్లతో శక్తి టీమ్‌ను ఏర్పాటు చేశారు. కానీ ఈ బృందాల పనితీరు కొన్ని స్టేషన్లకు పరిమితం. అలాంటి నిఘా, భద్రతా బృందాలు హైదరాబాద్ డివిజన్లో లేకపోవడం గమనార్హం. సీసీ కెమెరాల నిఘా లేదు... ప్రస్తుతం లింగంపల్లి–ఫలక్‌నుమా, మేడ్చల్–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్–మేడ్చల్, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో ప్రతి రోజు సుమారు 75 సరీ్వసులు నడుస్తున్నాయి. ఈ సరీ్వసుల సమయ పాలన, నిర్వహణ, భద్రతను అధికారులు కొంతకాలంగా గాలికి వదిలేశారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఏ రైలుఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి ట్రైన్లో మహిళల కోసం ప్రత్యేకంగా కోచ్‌ను ఏర్పాటు చేసినా ఆయా బోగీల్లోకి పురుషులు యథేచ్చగా రాకపోకలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. మహిళలు అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోకుండా కొందరు ఆకతాయిలు ఇష్టారాజ్యంగా ఒక స్టేషన్లో ఎక్కి మరో స్టేషన్లో దిగిపోతూ మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. మగ ప్రయాణికులు ఈ బోగీల్లోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ప్రతి బోగీలో ఆరీ్పఎఫ్ మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. మరోవైపు అన్ని బోగీల్లోనూ సీసీకెమెరాలను ఏర్పాటు చేసి ఆరీ్పఎఫ్ డివిజన్ కార్యాలయాలతో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, బేగంపేట్, హైటెక్‌సిటీ, లింగంపల్లి, మల్కాజిగిరి, చర్లపల్లి, ఘట్కేసర్ వంటి ప్రధానమైన స్టేషన్లలో మినహా మిగతా స్టేషన్లలో కూడా సీసీ కెమెరాలు సరిగ్గా పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ప్రస్తుతం దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో మాత్రమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది. ఆ దిశగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.’అని ఆరీ్పఎఫ్ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. సిబ్బంది కొరత దృష్ట్యా అన్ని చోట్ల ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చునని, సీసీకెమెరాలు ఉంటే పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా నిరోధించవచ్చునని పేర్కొన్నారు.భద్రతా విభాగాల మధ్య సమన్వయం కరువు మరోవైపు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా నేరాల నియంత్రణ సవాల్‌గా మారిందనే అభిప్రాయం కూడా ఉంది. ప్రయాణికుల భద్రత తమ పరిధిలోని అంశం కాదన్నట్లుగా, రైల్వే ఆస్తుల రక్షణ మాత్రమే తమ బాధ్యత అన్నట్లుగా ఆర్పీఎఫ్ వ్యవహరిస్తుందని జీఆర్పీ పోలీసులు ఆరోపిస్తున్నారు. కానీ జీఆర్పీ నిర్వర్తించాల్సిన విధులను తామే నిర్వహిస్తున్నామని, జీఆర్పీ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆర్పీఎఫ్ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇలా ఇరువర్గాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా నేరస్తులకు అవకాశంగా మారుతోంది. -
తిరుపతమ్మని ఎవరు చంపి ఉండొచ్చు?
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనుకొండలో సాయిబాబా గుడి వెనుక కృష్ణాకెనాల్‌కు వచ్చే జంక్షన్లో జనవరి 31న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు మార్చురీకి తరలించారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. తాజాగా ఆదివారం రాత్రి కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసులోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. రాత్రి 9 గంటలకు వచ్చిన పోలీసులు 11 గంటలకల్లా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలం వద్దకు డాగ్ స్క్వాడ్‌ను తీసుకు రావడంలో పోలీసులు విఫలమయ్యారు. తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు డాగ్‌స్కా్వడ్ వచ్చింది. అప్పటికే ఘటనా స్దలం వద్ద ఉన్న సిమెంటుతో కూడిన చెప్పులు, కండోమ్స్, హ్యాండ్‌బ్యాగ్, అమెరికన్ క్లబ్ సిగరెట్ పెట్టెలను తీసివేయడంతో డాగ్ స్క్వాడ్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఎస్పీ సతీష్‌కుమార్ వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని ఉంచకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి సమీపంలో వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైనా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎవరు చంపి ఉండొచ్చు? జెస్సీ, నజీరాతోపాటు లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం రాత్రి కూడా కొలనుకొండ జాతీయ రహదారి వద్దకు వచ్చింది. జెస్సీ విటులను పిలిచి లక్ష్మీతిరుపతమ్మతో పంపేది. ఆదివారం రాత్రి కూడా తొలుత ఇద్దరు విటులు వెళ్లారు. అనంతరం చేతిలో ఒక సంచి పట్టుకుని హిందీలో మాట్లాడే పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి లక్ష్మీ తిరుపతమ్మ వద్దకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తరువాత ముళ్ల పొదలలో నుంచి తిరుపతమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జెస్సి, నజీరా లోపలకు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి వున్న తిరుపతమ్మ కనిపించింది. దీంతో భయపడిన వారిద్దరూ పెద్దగా కేకలు వేశారు. 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది రావడంతో లక్ష్మీ తిరుపతమ్మ మృతి చెందిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే తాడేపల్లి పోలీసులు రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో తిరుపతమ్మ మాజీ ప్రియుడు చింటూ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా తిరుపతమ్మ తనను దూరం పెడుతుందని చింటూ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనాథలుగా పిల్లలు లక్ష్మీతిరుపతమ్మ మృతి వార్త తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని రోధించారు. పిల్లలను ప్రభుత్వం సంరక్షించాలని విన్నవించారు.హతురాలు పామర్రు వాసి.. తాడేపల్లి రూరల్: డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం జరిగిన హత్యాచారం కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీ‹Ùకుమార్ విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీ‹Ùకుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. దీంతోపాటు విజయవాడకు చెందిన సీసీఎస్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పామర్రు స్వగ్రామం.. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన సజ్జ లక్ష్మీ తిరుపతమ్మ (32)గా పోలీసులు గుర్తించారు. ఈమె భర్త అయిన నవీన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శీలం ఝాన్సీ వద్ద పిల్లలిద్దరినీ ఉంచింది. విజయవాడలో వంటపని చేస్తున్నానని ఆమెకు చెబుతూ వస్తోంది. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటోంది. ఏడాది క్రితం ట్రాన్స్‌జెండర్ జెస్సీ పరిచయమైంది. ఆమె లక్ష్మీతిరుపతమ్మను వ్యభిచార వృత్తిలోకి దించినట్టు సమాచారం. ఆ తర్వాత మరో ట్రాన్స్‌జెండర్ నజీరాతోనూ తిరుపతమ్మకు పరిచయం అయింది. వీరిద్వారా తిరుపతమ్మ మాజీ ప్రియుడు రాధారంగా నగర్‌కు చెందిన చింటూ గురించి పోలీసులు తెలుసుకున్నారు. అతడినీ అదుపులోకి తీసుకుని ప్రశి్నస్తున్నట్టు సమాచారం. తిరుపతమ్మ తన ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం కోసమే ఈ వృత్తి చేపట్టినట్లు తెలుస్తోంది.వీడియోలు, రీల్స్.. హత్య జరిగిన ప్రాంతంలో ఎన్నాళ్లగానో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలూ విస్తృతంగా జరుగుతున్నట్టు సమాచారం. మూడునెలలుగా ఇక్కడే లక్ష్మీ తిరుపతమ్మ, మరికొంతమంది మహిళలు రీల్స్, ఇంస్టాగ్రామ్ లో పాటలు పాడుతూ సెల్ఫీ వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. తిరుపతమ్మ, ఆమె ప్రియుడు చింటూ, జెస్సీ కొలనుకొండ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉన్న ఇతరులను రానీయకుండా విటులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటారని, ఇక్కడ వీరి ఆధిపత్యం ఏమిటనే భావనతో ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది. -
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం
సాక్షి, హైదరాబాద్/ గాంధీఆస్పత్రి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటనలో ఓ యువతి తీవ్ర గాయాలపాలవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసేలా ఆదేశించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్లే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన మొత్తం తెలంగాణ సమాజాన్ని కలిచివేసేదిలా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.హోంశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో ఈ తరహా దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో కవిత ఫోన్లో మాట్లాడి యువతిపై అత్యాచారయత్నం ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కరువైంది: సబిత, శ్రీనివాస్గౌడ్నడుస్తున్న రైలులో అత్యాచారయత్నం రాష్ట్రానికే సిగ్గుచేటని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరువైంద ని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసగౌడ్ ఆవే దన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను వారు సోమవారం పరామ ర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో షీ టీమ్ పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. -
లైంగిక దాడికి యత్నం.. రైలు నుంచి దూకిన యువతి
సికింద్రాబాద్/గాంధీ ఆస్పత్రి: ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకటంతో తీవ్రంగా గాయపడింది. ఈ నెల 22న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో కోలుకుంటోంది. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ జి.సాయీశ్వర్‌గౌడ్ తెలిపారు.బోగీలో ఒంటరిగా ఉండటంతో..అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది.ఆమె ఎక్కిన లేడీస్ కోచ్‌లో ఉన్న మరో ఇద్దరు మహిళలు రాత్రి 8 గంటల సమయంలో అల్వాల్ స్టేషన్లో దిగిపోవటంతో బోగీలో బాధితురాలు ఒక్కరే మిగిలింది. అది గమనించిన ఒక ఆగంతకుడు బోగీలోకి ప్రవేశించి బాధి తురాలిపై అఘాయిత్యం చేయబోయాడు. భయాందోళనకు గురైన ఆమె కొంపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో నడుస్తున్న రైలు నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితికి చేరిన యువతిని గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు స్టేట్మెంట్లుగాంధీ ఆస్పత్రిలో అదే రోజు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అయితే, తాను ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడ్డట్లు ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే పోలీసులు రికార్డు చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి వచ్చిన తన కుటుంబ సభ్యులకు తనపై అత్యాచార యత్నం జరిగిందన్న విషయాన్ని బాధితురాలు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోమారు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్న పోలీసులు అత్యాచార యత్నం కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నాలుగు బృందాలతో గాలింపుబాధితురాలిని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ఎస్పీ చందనదీప్తి సోమవారం పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. రెండు బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణలో ఉన్నాయని వివరించారు. నిందితుడిని గుర్తించడంలో పురోగతి సాధించామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.మెరుగైన వైద్యం అందించాంబాధితురాలిని 22న రాత్రి 11.30 గంటలకు గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ తెలిపారు. ఆ సమయంలో ఆమె స్పృహలోనే ఉన్నప్పటికీ మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించిందని చెప్పారు. ఆమె చేయి మణికట్టు వద్ద విరిగిందని, శరీరంపై గాయాలున్నాయని వివరించారు. బాధితురాలికి వెంటనే ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు తగిన వైద్యసేవలు అందించారని, సీటీ స్కానింగ్ చేయించామని వెల్లడించారు.కాగా, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సూచన మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. మంత్రుల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. లెఫ్ట్ ఎగనెస్ట్ మెడికల్ ఎడ్వైజ్ (లామా) ద్వారా బాధితురాలు గాంధీ ఆస్పత్రి నుంచి వెల్లిపోయినట్లు ప్రొఫెసర్ సునీల్ కుమార్ ఆ తర్వాత వెల్లడించారు. -
Transgender Dipu: ఎనిమిదేళ్ల క్రితం వివాహం
అనకాపల్లి టౌన్/కశింకోట/మునగపాక: బయ్యవరం వద్ద లభించిన శరీర భాగాలతో వెలుగు చూసిన వ్యక్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. బుధవారం మరో రెండు చోట్ల మిగతా శరీర భాగాలు లభ్యం కావడంతో హత్యకు గురైన వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించారు. బయ్యవరం వద్ద జాతీయ రహదారి వంతెన కింద మంగళవారం ఒక చేయితోపాటు నడుం కింద శరీర భాగాలతో ఉన్న మూట దొరకడంతో గుర్తు తెలియని మహిళ హత్యగా భావించిన పోలీసులు వాటిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి భద్రపరిచిన సంగతి తెలిసిందే. ఏడు ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాలు మృతదేహం మిగిలిన భాగాల కోసం గాలింపు చేపట్టాయి. అనకాపల్లిలో డైట్ కళాశాల వద్ద జాతీయ రహదారి పక్కన జలగల మదుం వద్ద కాలువలో హతురాలి తల భాగం, ఎడమ చేయి లభ్యమయ్యాయి. మండలంలోని తాళ్లపాలెం జాతీయ రహదారి వంతెన దిగువన మొండెం భాగం సంచిలో లభ్యమైంది. వీటిని పరిశీలించి హత్యకు గురైన వ్యక్తిని అనకాపల్లి గవరపాలెం ముత్రాసు కాలనీకి చెందిన మైపల దిలీప్ శివశంకర్ అలియాస్ దీపు (40)గా గుర్తించారు. ప్రత్యేక బృందాలు విచారిస్తున్నట్లు స్థానిక సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. హత్యకు కారకునిగా భావిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన నిందితుడ్ని అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నట్లు సమాచారం.ఎనిమిదేళ్ల క్రితం వివాహంపశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తితో 8 సంవత్సరాల క్రితం దీపు వివాహం చేసుకొని మునగపాక మండలం నాగులాపల్లి వద్ద నివాసముంటున్నారు. ఆనవాళ్లను బట్టి పోలీసులు మృతదేహాన్ని గుర్తించి నాగులాపల్లిలోని దీపు ఇంటికి క్లూస్ టీమ్‌ను తీసుకొని వెళ్లారు. గదిలో ఎటువంటి ఆనవాళ్లు లేకుండా నిందితుడు జాగ్రత్త పడినట్టు తెలిసింది. పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బుధవారం అనకాపల్లికి చెందిన హిజ్రాలందరూ తమ వర్గానికి చెందిన వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తించి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. నిందితులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని, లేనిపక్షంలో తమ సంఘానికి అప్పగించాలని ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి ర్యాలీగా నెహ్రుచౌక్కు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిజ్రాలు కొండబాబు, భారతమ్మలు మాట్లాడుతూ నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి, దీపు గత కొంతకాలంగా కలిసి ఉంటున్నారన్నారు. హత్య జరిగిన ముందు రోజు కూడా కలిసే ఉన్నారని తెలిపారు. గతంలో హిజ్రాలపై హత్యలు జరిగినప్పటికీ నేటి వరకూ పోలీసులు పట్టించుకోలేదని రోజురోజుకు హిజ్రాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. అనంతరం నెహ్రుచౌక్ నుంచి ర్యాలీగా వచ్చి డీఎస్పీ శ్రావణితో హిజ్రాలు మాట్లాడారు. -
లవ్వర్ పిలుస్తోందంటూ.. యువకుని హత్య
నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ చింటూ హత్య కేసులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, స్థానిక ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డితో కలిసి హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను వెల్లడించారు. పాత వేదాయపాళేనికి చెందిన అరవభూమి సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటూ (28) రౌడీషీటర్. అతడిపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. చింటూకు ఇందిరాగాంధీనగర్‌కు చెందిన కృష్ణసాయి అలియాస్ కిట్టు స్నేహితుడు. వీరి మధ్య విభేదాలున్నాయి. చింటూ గతంలో కిట్టు ఇంటికి వెళ్లి గొడవపడి చంపుతానని అందరిముందు బెదిరించాడు. అవమానంగా భావించిన కిట్టు ఈ విషయాన్ని తన స్నేహితులైన కొత్తూరు రామకోటయ్యనగర్‌కు చెందిన కరిముల్లా, ఇందిరాగాంధీనగర్‌కు చెందిన షేక్ మహ్మద్‌బాబా, వెంగళరావ్‌నగర్‌కు చెందిన జి.పవన్, ఫ్రాన్సిన్ అనిక్రాజ్ అలియాస్ అనిక్రాజ్, మనుబోలు మండలం కోదండరామపురానికి చెందిన కె.సాయితేజకు జరిగిన విషయాన్ని చెప్పాడు. అందరూ కలిసి చింటూ హత్యకు పథక రచన చేశారు.మాట్లాడాలని పిలిచి..చింటూ ఇందిరాగాంధీనగర్లోని ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమెను కొందరు ఇబ్బందులు పెడుతుండగా ఆ విషయమై మాట్లాడదామని కిట్టు ఈనెల 14వ తేదీ రాత్రి చింటూను ఇందిరాగాంధీనగర్ రెండో వీధికి పిలిచాడు. అక్కడే కాపుకాసిన నిందితులు చింటూ రాగానే కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్య చేసి పరారయ్యారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం వెంగళరావ్‌నగర్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై త్వరలో రౌడీషీట్లు తెరుస్తామని డీఎస్పీ చెప్పారు. -
Anakapalle: క్వారీ లారీ ఢీకొని రైల్వే ట్రాక్ ధ్వంసం
-
Hyderabad: పిల్లల్ని చంపి దంపతుల బలవన్మరణం
-
రాజలింగమూర్తి హత్య కేసులో నిందితులు ఎందరు..?
భూపాలపల్లి : దారుణ హత్యకు గురైన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. హత్యకు పాల్పడింది ప్రత్యక్షంగా నలుగురే అయినప్పటికి ఆర్థికంగా, పరోక్షంగా పలువురు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చెందిన రాజలింగమూర్తి బుధవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానిక భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు వెల్లడైంది. స్థానిక పోలీసులు తొలుత ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో ఏ–1 రేణుకుంట్ల సంజీవ్, ఏ–2 పింగిలి శ్రీమాంత్(బబ్లూ)లను హత్య జరిగిన రోజే అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఏ–3 మోరె కుమార్, ఏ–4 కొత్తూరి కుమార్ పట్టుకున్నారు. ఏ–5 రేణుకుంట్ల కొమురయ్యతోపాటు నిందితులకు కారు ఏర్పాటు చేసి, డ్రైవింగ్ చేసిన పట్టణంలోని సుభాష్‌కాలనీకి చెందిన ఓ డ్రైవర్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. అంతేకాక నిందితుల ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా, అనుమానితులైన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హరిబాబు హస్తం ఉందా..? రాజలింగమూర్తి హత్య కేసులో భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజలింగమూర్తిని హత్య చేసిన అనంతరం నిందితులు.. ఓ వ్యక్తిని ఫోన్ అడిగి తీసుకొని హరిబాబుకు కాల్ చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ మేరకు హరిబాబును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి రెడ్డికాలనీలోని ఆయన ఇంటికి వెళ్లగా అందుబాటులో లేనట్లుగా తెలిసింది. మరో వ్యక్తి ఆర్థిక సహకారం.. రాజలింగమూర్తి హత్యకు మరో వ్యక్తి ఆర్థికంగా సహకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూమి తనదేనంటూ కోర్టుకు వెళ్లిన ఒకరు ఆర్థికంగా నిందితులకు సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇతను కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి అరెస్ట్..రాజలింగమూర్తి హత్య కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిందితులు ఎంతమంది ఉన్నారన్నది గుర్తించాక, ఆధారాలతో రేపు(ఆదివారం), లేదా సోమవారం అరెస్ట్ చూపించనున్నట్లు తెలుస్తోంది. -
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలితీసుకున్న వివాహేతర సంబంధం
విజయనగరం క్రైమ్: తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన ఇంజినీరు కోనారి ప్రసాద్ (28) హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ నెల 10న హత్యకు పాల్పడిన అన్నదమ్ములైన ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. హత్య వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి సీఐ నారాయణరావు, తెర్లాం ఎస్ఐ సాగర్‌బాబుతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మృతుడు కోనారి ప్రసాద్‌కు నెమలాం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్‌లను భర్త అచ్యుతరావు గమనించాడు. విషయాన్ని తమ్ముడు శివకృష్ణకు చెప్పాడు. ఇద్దరూ కలిసి ప్రసాద్‌ను అంతమొందించాలని నిర్ణయించారు. బెంగళూరులో పనిచేస్తున్న ప్రసాద్ గ్రామానికి రావడంతో హత్యపథకం అమలుచేయాలని నిశ్చయానికి వచ్చారు. ఆయనతో ముందురోజు మాట్లాడారు. విజయరాంపురంలోని అమ్మమ్మవారి ఇంటికి వెళ్తున్న విషయం, తిరిగి ఏ సమయానికి వస్తాడన్న విషయం తెలుసుకున్నారు. మాట్లాడదామని నెమలాం సమీపంలోని వారి పొలాల వద్దకు పిలిచారు. ప్రసాద్‌తో శివకృష్ణ మాట్లాడుతుండగా వెనుకనుంచి తలపై కర్రతో అచ్యుతరావు బలంగా మోదాడు. తర్వాత ఇద్దరూ కలిసి కర్రలతో దాడిచేశారు. పారిపోయే ప్రయత్నంలో ప్రసాద్ కాలుజారి పిల్లకాలువలోని రాయిపై పడిపోవడంతో అక్కడకు వెళ్లి మరోసారి దాడిచేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృత దేహాన్ని రోడ్డుపై తెచ్చి పడేశారు. అనంతరం బైక్‌ను కూడా కర్రలతో ధ్వంసం చేసి రోడ్డుపై పడేసి ఇంటికి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తొలుత ప్రమాదంగా అనుమానించారు. ఘటనా స్థలాన్ని చూసి హత్యగా అనుమానించి దర్యాప్తు చేశారు. సీఐ నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. కేసును వేగవంతంగా ఛేదించిన బొబ్బిలి డీఎస్పీ, సీఐ, తెర్లాం ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. -
కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు: వరుదు కళ్యాణి
సాక్షి,విశాఖపట్నం:యువతిపై ప్రేమోన్మాది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఈ మేరకు కళ్యాణి శుక్రవారం(ఫిబ్రవరి14) మీడియాతో మాట్లాడారు. ‘కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. యువతిపై యాసిడ్ దాడి చాలా దారుణం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.యాసిడ్ బాధిత మహిళకు ప్రభుత్వం అండగా నిలబడాలి.యువతకు మెరుగైన వైద్యం అందించాలి.రాష్ట్రంలో మహిళల భద్రతను గాలికి వదిలేశారు.జనసేన నేత కిరణ్ రాయల్ వలన మహిళకు అన్యాయం జరిగితే తిరిగి అదే మహిళ మీద కేసు పెట్టారు’అని కళ్యాణి గుర్తుచేశారు. -
చెల్లింపుతో చిక్కాడు
రాచకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని మీర్‌పేటలో వెలుగులోకి వచ్చిన ‘చంపేసి.. ఉడకబెట్టిన’ కేసు సంచలనం సృష్టించింది. ఇంత దారుణంగా కాకున్నా, హైదరాబాద్‌లో దాదాపు ఏడాదిన్నర క్రితం అనురాధ అనే నర్సు హత్యకు గురైంది. ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన నిందితుడు చంద్రమోహన్ ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. మూసీ నది సమీపంలో దొరికిన హతురాలి తలతో మొదలైన ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రావడానికి ఓ యూపీఐ పేమెంట్ కీలక ఆధారమైంది. చైతన్యపురి ప్రాంతంలో నివసించే బి.చంద్రమోహన్ అవివాహితుడు. వడ్డీ వ్యాపారంతో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుండేవాడు. తల్లితో కలిసి సొంత ఇంటి మొదటి అంతస్తులో నివసించేవాడు. ఇతడి తండ్రికి 2007లో ఒక ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. అప్పట్లో ఆస్పత్రి తరఫున సేవలు చేయడానికి హెడ్ నర్సు వై. అనురాధారెడ్డి ఇంటికి వచ్చేది. చంద్రమోహన్‌కు ఆమెతో పరిచయం ఏర్పడింది. తండ్రి 2009లో చనిపోయినప్పటికీ వీరి పరిచయం కొనసాగి, సన్నిహితంగా మారారు. చంద్రమోహన్ 2021లో అనురాధను తన ఇంటి కింద ఉన్న ఒక పోర్షన్లోకి తీసుకువచ్చాడు. అనురాధ, చంద్రమోహన్ 15 ఏళ్లు సన్నిహితంగా మెలిగారు. అతగాడు ఆమె నుంచి దాదాపు 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు తీసుకున్నాడు. కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న అనురాధ రెండో వివాహం చేసుకోవాలని 2023లో భావించింది. దీంతో తన వద్ద తీసుకున్న బంగారం, నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా చంద్ర మోహన్‌పై ఒత్తిడి చేసింది. ఆమె వివాహ ప్రయత్నాలు తెలుసుకున్న చంద్రమోహన్, అదే జరిగితే అనురాధ తనకు దూరం అవుతుందని, అప్పటికే ఆమె వద్ద తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని భావించాడు. దీంతో అనురాధను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 2023 మే నెలలో వేసవి సెలవుల నేపథ్యంలో చంద్రమోహన్ ఇంటి కింది భాగంలో ఉన్న మరో పోర్షన్లో ఉండే కుటుంబం ఊరికి వెళ్లింది. అక్కడే ఉన్న మరో పోర్షన్లో నివసించే అనురాధను హత్య చేయడానికి అదే సరైన సమయమని చంద్రమోహన్ భావించాడు. ఆ నెల 12న మధ్యాహ్నం ఆమె వద్దకు వెళ్లి, గొడవకు దిగాడు. ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, ఎలా మాయం చేయాలనే అంశంపై తన స్మార్ట్‌ఫోన్ ద్వారా యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. మృతదేహం వాసన బయటకు రాకుండా ఏం చేయాలనేది వెతికాడు. అందులో చూపించిన వీడియోలను ఆధారంగా చేసుకుని, అప్పటికప్పుడు రెండు చిన్న సైజు స్టోన్ కట్టర్లు, నాలుగు మటన్ కత్తులు, దాదాపు 40 వరకు ఫినాయిల్, డెట్టాల్, వివిధ కెమికల్స్ బాటిళ్లు, అగరుబత్తీలు, అత్తర్లు, కర్పూరం తదితరాలు కొనుక్కుని వచ్చాడు. కట్టర్లతో మొండెం నుంచి తల, కాళ్లు, చేతులు వేరు చేస్తూ అనురాధ శరీరాన్ని ఆరు ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల ఫ్రిజ్‌లో, మొండాన్ని ఓ పెట్టెలో పెట్టి మూడు రోజులు గదిలోనే ఉంచాడు. హతురాలి సెల్‌ఫోన్‌ను తన వద్దే ఉంచుకున్న చంద్రమోహన్ దాంతో ఆస్ట్రేలియాలో ఉండే ఆమె కుమార్తెతో అనురాధ మాదిరిగా చాటింగ్ చేస్తూ వచ్చాడు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తన ఇంటి నుంచి కింద ఉన్న అనురాధ పోర్షన్లోకి వస్తున్న చంద్రమోహన్ మృతదేహం ముక్కల మీద ఫినాయిల్, డెట్టాల్, కర్పూరం తదితరాలు చల్లి వెళ్లేవాడు. ఇంట్లో రక్తం వాసన తెలియకుండా అగరుబత్తీలు, అత్తర్లు వినియోగించాడు. ఇలా దాదాపు 13 రోజుల పాటు వాసన ఆ గది కూడా దాటకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ మృతదేహం విషయం పక్కింటి వాళ్లకు, పైనే ఉన్న చంద్రమోహన్ తల్లికీ తెలియలేదు. ఓ దశలో చంద్రమోహన్ దఫదఫాలుగా మృతదేహం భాగాలను బయట పారేయాలని భావించాడు. అనూరాధ తలను చెత్త కవర్లో పెట్టుకుని వెళ్లి, 2023 మే 15 రాత్రి మూసీ సమీపంలో పడేశాడు. పారిశుద్ధ్య కార్మికులు మే 17న ఉదయం దీనిని గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల దొరికిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ప్రాంతానికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న దానిపై ఆధారపడ్డారు. 2023 మే 16వ తేదీ ఫీడ్ పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో 15వ తేదీకి సంబంధించింది చూస్తుండగా, ఓ వ్యక్తి ఆటోలో వచ్చి కవర్‌ను ఆ ప్రాంతంలో పారేస్తున్నట్లు కనిపించింది. అక్కడ నుంచి ఒక్కో కెమెరాలో అతడి కదలికలు గమనిస్తూ పోయారు. తల దొరికిన ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటరు ప్రయాణించిన చంద్రమోహన్ అక్కడి ఓ బేకరీ వద్ద ఆగాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పారేయడంతో రిలాక్స్ అయ్యాడు. అక్కడే ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగాడు. వాటర్ బాటిల్‌కు తన ఫోన్లోని యూపీఐ యాప్ ద్వారా డబ్బు చెల్లించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని చూసిన పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణం ఆ బేకరీ వద్దకు చేరుకుని ఆ రోజు జరిగిన యూపీఐ లావాదేవీల డేటా సేకరించారు. సీసీ కెమెరాల్లో ఉన్న టైమ్ ఆధారంగా వాటర్ బాటిల్ ఖరీదు చేసిన వ్యక్తి చెల్లించిన లావాదేవీని గుర్తించారు. ఆ యూపీఐ యాప్‌తో అనుసంధానించి ఉన్న ఫోన్ నంబర్ తెలుసుకున్న దర్యాప్తు అధికారులు దాని ఆధారంగా చంద్రమోహన్‌ను గుర్తించి 2023 మే 24న అరెస్టు చేశారు. ఆపై కేసును హత్య జరిగిన ప్రాంతం జ్యురీస్‌డిక్షన్ ఆధారంగా చైతన్యపురి ఠాణాకు బదిలీ చేశారు. -
Mettuguda Incident: అంతా కట్టుకథేనా!
చిలకలగూడ,హైదరాబాద్: చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి పొడిచింది కట్టుకథేనని పోలీసులు తేల్చేశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో కుమారుడు యశ్వంత్ కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుండగా.. వద్దని వారించేందుకు అడ్డొచ్చిన తల్లిని పొడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగులకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించకపోవడం, స్థానికులు అందించిన కీలక సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఇది వేరే వారి పని కాదని, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలే కారణమని నిర్ణయించి అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన తల్లి రేణుక తన ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఆరుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేయగా, తల్లి రేణుక, పెద్ద కుమారుడు యశ్వంత్లకు తీవ్ర గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుమారు 150 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా దుండగులకు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లు లేవని స్థానికులు స్పష్టం చేశారు. గట్టిగా కేకలు వినిపించడంతో వెళ్లిచూడగా లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉందని, కొన్ని క్షణాల తర్వాత తలుపులు తెరుచుకోగా రేణుక, యశ్వంత్ ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని, అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. వినియోగించిన చాకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వివాహం కాకపోవడం తదితర సమస్యలో తల్లి రేణుక కుమారుడు యశ్వంత్‌ల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని తెలిసింది. మూడు నెలలుగా యశ్వంత్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన అతను.. కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యకు యతి్నంచగా, అడ్డుకున్న తల్లిని కూడా పొడిచినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ ఘటనలో వినియోగించిన చాకును పోలీసులు స్వా«దీనం చేసుకుని ఫింగర్‌ప్రింట్స్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. బాధితుడే.. నిందితుడు... ఈ ఘటనలో బాధితుడే నిందితుడు కావడం గమనార్హం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యశ్వంత్‌ను బాధితుడిగా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు నిందితుడిగా చేర్చనున్నారు. ఆత్మహత్యా యత్నంతో పాటు తల్లిని చాకుతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినందుకు యశ్వంత్‌పై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసును తప్పుదారి పట్టించేలా వ్యవహరించిన యశ్వంత్ సోదరులు యశ్పాల్, వినయ్‌లపై కూడా కేసులు నమోదు చేసేందుకు న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నట్లు తెలిసింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేణుక, యశ్వంత్‌లు కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వీరు పూర్తిగా కోలుకున్న తర్వాత వాంగూల్మం నమోదు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. -
Afzalgunj Incident: చెన్నైకి చెక్కేశారు!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బీదర్‌తో పాటు నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన బీహార్ నేరగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అధికారులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీళ్లు రోషన్ ట్రావెల్స్ వద్ద కాల్పుల తర్వాత తిరుమలగిరి నుంచి ఉత్తరాదికి పారిపోయి ఉంటారని అధికారులు భావించారు. అయితే పోలీసుల్ని తప్పుదోవపట్టిస్తూ చెన్నైకి పారిపోయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పట్టుకుంటామని, ప్రత్యేక బృందాలు ఆ కోణంలోనే ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. బీహార్‌లోని హాజీపూర్ జిల్లాకు చెందిన ఇరువురు దుండగులు అక్కడ నుంచే ద్విచక్ర వాహనం తీసుకుని నగరానికి చేరుకున్నారు. ఇక్కడే ఓ లాడ్జిలో బస చేసి బీదర్‌లో రెక్కీ నిర్వహించి మరీ పంజా విసిరింది. ఆపై నగదుతో సహా నగరానికి చేరుకున్న ఇరువురూ బైక్‌ను ఎంజీబీఎస్ పార్కింగ్‌లో పెట్టారు. ఆటోలో బయలుదేరి అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్‌కు టిక్కెట్ బుక్ చేసుకున్న తదనంతర పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌ను కాల్చడం, పారిపోవడం జరిగాయి. దర్యాప్తు అధికారులు నిందితుల రాకపోకలు కనిపెట్టడానికి వందల సంఖ్యలో సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్‌కు వెళ్లిన ద్వయం..అక్కడి నుంచి మరో ఆటోలో గజ్వేల్ వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ఆటోడ్రైవర్ వ్యవహార శైలితో అనుమానించి తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడే నగదును మరో బ్యాగ్‌లోకి మార్చడంతో పాటు తాము ధరించిన వ్రస్తాలను మార్చుకున్నారు. అక్కడ నుంచి బోయిన్పల్లి వరకు వచ్చిన ఇద్దరు దుండగులూ..మరో ఆటోలో కూకట్పల్లి మీదుగా మియాపూర్ చేరుకున్నారు. అర్ధరాత్రి మియాపూర్‌లో ఆంధ్రప్రదేశ్ ఆరీ్టసీకి చెందిన తిరుపతి వెళ్లే బస్సు ఎక్కారు. టిక్కెట్ సైతం తిరుపతి వరకు తీసుకున్న ఈ ద్వయం.. కడప బైపాస్ రోడ్డులో దిగిపోయారు. ఆ సమయంలో డ్రైవర్ ఇక్కడ ఎందుకు దిగుతున్నారని ప్రశి్నంచగా..పని ఉందంటూ సమాధానం ఇచ్చారు. కడప నుంచి మరో బస్సులో నెల్లూరు, అక్కడ నుంచి ప్రైవేట్ బస్సులో చెన్నై చేరుకున్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. చెన్నై చేరుకున్న నగర పోలీసు బృందాలు అక్కడ నుంచి ఈ ఇద్దరూ ఎక్కడకు వెళ్లారనే కోణంలో ఆరా తీస్తున్నాయి. ఈ ఇద్దరిలో కీలకమైన ప్రధాన నిందితుడు ఏడాదిన్నర క్రితం ఉత్తరప్రదేశ్‌లోనూ ఓ భారీ నేరం చేశాడు. అప్పటి నుంచి ఇతడి కోసం గాలిస్తున్న అక్కడి స్పెషల్ టాస్‌్కఫోర్స్ అధికారులు ఆచూకీ చెప్పిన వారికి రూ.4 లక్షల పారితోíÙకం కూడా ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ దుండగుల కోసం తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ పోలీసులు సమన్వయంతో గాలిస్తున్నారు. -
హుస్సేన్ సాగర్‌లో బోటు ప్రమాదం
-
సార్.. నా కొడుకు బతికున్నాడా.?
రాంగోపాల్‌పేట్: హుస్సేన్ సాగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక యువకుడు అదృశ్యమయ్యాడు. భారతమాతకు మహా హారతి కార్యక్రమం సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో బోటు నుంచి బాణసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, కుషాయిగూడ నాగారానికి చెందిన సిల్వేరు అజయ్ (21) అనే బీటెక్ విద్యార్థి రాత్రి నుంచి అదృశ్యం అయ్యారు. ఉదయం నుంచి ఆ యువకుడి కోసం లేక్ పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా ఆచూకీ మాత్రం దొరక లేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి అనే వ్యక్తి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయన పరిస్థితి విషమంగా ఉండగా..ప్రణీత్‌కుమార్, సునీల్ అదే ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా డిశ్చార్జ్ చేశారు. స్నేహితుడితో కలిసి వచ్చిన... కుషాయిగూడ నాగారానికి చెందిన ఆటో డ్రైవర్ జానకిరాం, నాగలక్ష్మి దంపతుల కుమారుడు అజయ్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్‌తో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అజయ్ స్నేహితుడు రాఘవేంద్రకు టపాకాయల వ్యాపారి మణికంఠ డబ్బులు ఇచ్చేది ఉంది. ఆదివారం సాయంత్రం మణికంఠకు రాఘవేంద్ర ఫోన్ చేయగా తాను ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్నానని, ఇక్కడికి వస్తే డబ్బు ఇస్తానని చెప్పాడు. దీంతో మరో స్నేహితుడు సాయిసందీప్తో కలిసి ఆదివారం రాత్రి 7.30 గంటలకు ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత మణికంఠకు ఫోన్ చేయగా బోటులో సాగర్ లోపల నుంచి ఒడ్డుకు వచ్చి వారికి డబ్బులు చెల్లించాడు. తాము బోటులో లోపలికి వస్తామని చెప్పడంతో అందరూ కలిసి బాణసంచా కాల్చే దగ్గరకు వెళ్లగా అదే సమయంలో అగి్నప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో బోటు సిబ్బందితో పాటు మరికొంత మంది బోటు సిబ్బంది అక్కడ ఉన్నారు. బాణసంచాను కచాప్లో ఉంచగా దానికి అనుసంధానంగా మెకనైజ్డ్ బోటు, మరో స్పీడ్ బోటు ఉన్నాయి. మెకనైజ్డ్ బోటుకు కూడా మంటలు అంటుకోవడంతో అందరూ అందులో నుంచి కిందకు నీళ్లలోకి దూకేశారు. అక్కడే ఉన్న బోటు సిబ్బంది నీళ్లలోకి దూకి కొందర్ని రక్షించగా..అజయ్ మాత్రం గల్లంతయ్యారు. అజయ్‌తో పాటు వచి్చన రాఘవేంద్ర, సాయి సందీప్‌లకు ఈత రావడంతో కొద్ది దూరం ఈదుకుంటూ రాగా అక్కడికి వచి్చన స్పీడ్ బోట్ సిబ్బంది వారిని రక్షించి బయటకు తీసుకు వచ్చారు. తెల్లవారు జామున గుర్తించిన స్నేహితులు గాయపడిన వారిని మొదట పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ తెల్లవారు జామున 2 గంటలకు రాఘవేంద్ర, సాయిసందీప్లు కలుసుకుని అజయ్ గురించి ఆరాతీశారు. అయితే అప్పుడు అజయ్‌కి ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ ఉంది. అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేశారు. కుటుంబ సభ్యుల ఆందోళన.. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తెల్లవారు జామున హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుని అజయ్ కోసం ఆరా తీశారు. తమ కుమారుడు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. కాగా అజయ్ కోసం లేక్ పోలీసులు, డీఆర్‌ఎఫ్‌లకు చెందిన 5 బృందాలు సోమవారం ఉదయం నుంచి హుస్సేన్ సాగర్‌లో గాలింపు చేపట్టాయి. ఉదయం నుంచి బోట్లు, గజ ఈత గాళ్ల సహాయంతో సాగర్ మొత్తం సాయంత్రం 6.30 గంటల వరకు గాలించినా యవకుడి ఆచూకీ మాత్రం కనిపించ లేదు. మంగళవారం మరో మారు గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా..సోమవారం అజయ్ కుటుంబ సభ్యులు ఇచి్చన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హన్మంతు తెలిపారు. లేటుగా వస్తానని చెప్పి.. రాత్రి 8.30కి ఫోన్ చేస్తే ట్యాంక్‌బండ్‌పై ఉన్నా..కొద్దిగా లేటుగా వస్తాను అని చివరి మాటలు చెప్పాడంటూ అజయ్ తల్లి నాగలక్ష్మి, తండ్రి జానకిరాం కన్నీరుమున్నీరుగా రోదించారు. -
శ్రీకాకుళం కళావతి కేసులో సంచలన విషయాలు..
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పొందూరు (Ponduru) మండలం మొదలవలస (Modalavalasa) గ్రామానికి చెందిన పూజారి కళావతి (53) ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే నగరానికి చెందిన అండలూరి శరత్‌కుమార్ (31) పథకం ప్రకారం హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. శనివారం (Saturday) మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.వి.రమణ, టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానందలు వివరాలు వెల్లడించారు.నిండా అప్పులు.. ఆపై వ్యసనాలుశ్రీకాకుళానికి చెందిన అండలూరి శరత్‌కుమార్ (31) తల్లిదండ్రులతో తగువులాడుకుని ఇంటి నుంచి బయటకొచ్చేశాడు. సరస్వతీ మహల్ ఎదురుగా ఏవీఆర్ జనరేటర్ రిపేర్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తూ.. న్యూకాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. వ్యసనాలకు తోడు జల్సాలు ఎక్కువగా చేసేవాడు.పథక రచన చేశాడిలా..నగరంలోని డీసీసీబీ కాలనీలో సూరిబాబు సుందర సత్సంగానికి పొందూరు నుంచి కళావతి భజనలు, కీర్తనలు వినడానికి వచ్చేవారు. ఏడాది కిందట శరత్‌కుమార్‌కు కళావతి పరిచయమైంది. సత్సంగానికి ఎప్పుడొచ్చినా ఒంటి నిండా బంగారు ఆభరణాలతో కళావతి కనిపించేవారు. దీంతో తన అప్పులు తీర్చేందుకు ఆమెను హతమార్చి బంగారాన్ని కాజేయాలని శరత్‌కుమార్ పథక రచన చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 18న కళావతి రూమ్‌కి వస్తున్నట్లు శరత్‌కుమార్‌కు ఫోన్ చేయడంతో హత్య చేయడానికి సరైన సమయమిదేనని భావించాడు.కళావతి మధ్యాహ్నం మూడు గంటలకు గదికి వచ్చారు. ఇదివరకు శరత్‌కుమార్ ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కానీ అతడు రూ.500 మాత్రమే ఇవ్వడంతో మిగతా రూ.500 కోసం వాదులాడుకున్నారు. ఈ క్రమంలో కళావతి శరత్‌కుమార్ తల్లినుద్దేశించి అనరాని మాట అనడంతో కోపోద్రిక్తుడైన శరత్‌కుమార్ వైరుతో ఆమె గొంతు బిగించి తలగడతో గట్టిగా ముఖాన్ని అదిమి చంపేశాడు. వెంటనే ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు రెండు, పుస్తెలతాడు, నాలుగు ఉంగరాలు, ఓ చెవిదిద్దు, సెల్ఫోన్లు రెండు తీసుకున్నాడు. శవాన్ని పక్కనే ఉన్న బాత్రూమ్లోకి ఈడ్చుకువెళ్లి అక్కడ పడేశాడు. గాజులు రెండూ తన వద్ద ఉంచుకుని మిగతా వస్తువులను ఒక పాలిథీన్ కవర్లో కట్టి ఇంటి మెట్ల కింద పెట్టి రూమ్‌కి తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.తన స్నేహితుడి ఇంటిలో ఓ రాత్రి, ఆదిత్య పార్క్‌లో రెండు రాత్రులు గడిపాడు. సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసి అక్కడే ఆగి ఉన్న లారీపైకి విసిరేశాడు. తానే చంపానని బయటకు తెలిసిపోవడంతో 24న బాకర్ సాహెబ్‌పేట వీఆర్వో స్పందన అనూష వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పి ఆమె సమక్షంలో పోలీసులకు లొంగిపోయాడు. వేరే వ్యక్తికి అమ్మజూపిన రెండు గాజులనే కాక మెట్లపై దాచి ఉన్న మిగతా బంగారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.చదవండి: శరత్ అనే వ్యక్తితో కళావతి సన్నిహితంగా..! -
మీరు గెలిచింది దీనికోసమేనా? ఫీల్డ్ అసిస్టెంట్ హత్యపై విరూపాక్షి స్ట్రాంగ్ రియాక్షన్
-
25 ఏళ్ల యువతి దారుణ హత్య
-
మీర్పేట్ మర్డర్ మిస్టరీ కొత్త టెక్నాలజీతో కేసు విచారణ
-
రషీద్ సోదరుడిపై కేసు నమోదు చేయటం దారుణం: అడ్వొకేట్ రోళ్ల మాధవి
-
డాక్టర్ అవతారమెత్తి.. చైన్ కొట్టేసి!
తిరుపతి తుడా : పేద రోగులే టార్గెట్‌గా రుయాలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు... రోగుల సహాయకులుగా తరచూ పేషంట్ వార్డుల్లో తిరుగుతూ సెల్ఫోన్లు, పర్సులు దొంగతనం చేసే ముఠా ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ఏకంగా తెల్ల కోటు ధరించి డాక్టర్ వేషం ధరించి చోరీలకు పాల్పడడం కలకలం రేపుతోంది. రుయా ఆస్పత్రిలో తరచూ మొబైల్ ఫోన్లు, పర్సులు, ఏటీఎం కార్డులు, బైక్ దొంగతనాలు జరగడం సర్వసాధారణమైంది . ఈ క్రమంలోనే తెల్ల కోటుతో వచ్చి రోగులను బురిడీ కొట్టించి ఐదు సవర్ల బంగారు చైను చోరీ చేసిన యువతిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం రుయాలో చోటుచేసుకుంది... వైఎస్సార్ జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి అనే యువతి అనస్తీషియా టెక్నీషియన్ అని రోగులకు చెప్పుకుంటూ అత్యవసర విభాగంలో తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో అప్పుడే రేణిగుంట నుంచి గాయాలతో వైద్యం కోసం వచ్చిన వెస్లీ అనే మహిళను గుర్తించి పరిచయం చేసుకుంది. అనంతరం స్కానింగ్ కోసం తీసుకెళ్లి ఒంటిపై నగలు తీసేయాలని సూచించింది. వెస్లీ తన ఒంటిపై ఉన్న రెండు బంగారు చైన్లు, రెండు బంగారు గాజులను తీసి ఆ యువతి చేతికి ఇచ్చి బయట తన భర్తకు ఇవ్వాలని చెప్పింది. అయితే శ్రీవాణి చేతివాటం ప్రదర్శించి ఐదు సవర్ల బంగారు గొలుసును తన బ్యాగులో వేసుకొని మిగిలిన వస్తువులను వెస్లీ భర్త చేతికి ఇచ్చింది. ఇందులో మరో చైన్ ఉండాలని వెస్లీ భర్త విక్టరీ అడగడంతో మాకేం తెలుసు అంటూ ఆ యువతి అక్కడినుంచి వెళ్లిపోయింది. స్కానింగ్ నుంచి బయటికి వచ్చిన వెస్లీ నగలు చూసి అందులో ఒక చైన్ లేకపోవడాన్ని గుర్తించి వెంటనే సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమై గాలింపు చేపట్టారు. అక్కడే ఉన్న యువతిని గుర్తించి ఆమె బ్యాగులో బంగారు చైన్‌ను గుర్తించారు. వెస్ట్ పోలీసులకు యువతిని అప్పగించారు. -
వివాహేతర సంబంధమే ప్రాణాలు తీసిందా?
మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో జంట హత్యల ఘటన కలకలం రేపింది. వివాహితను, ఆమె ప్రియుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం గాలిపటాలు ఎగురవేసేందుకు పద్మనాభస్వామి గుట్టల వైపు వెళ్లిన యువకులకు అక్కడ రెండు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించడంతో జంట హత్యల ఘటన వెలుగులోకి వచి్చంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బేమెతరా జిల్లా నమాగఢ్కు చెందిన బిందు బింజారె (27)కు, ఇదే రాష్ట్రం ముంగిలి జిల్లా బయక్కాంప గ్రామానికి చెందిన వ్యక్తితో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. బిందు కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని ఓ విల్లా ప్రాజెక్ట్‌లో మేస్త్రీ, కూలీలుగా భార్యాభర్తలు కొంత కాలం పని చేశారు. అనంతరం వనస్థలిపురం వచ్చారు. ప్రియుడి మోజులో పడి.. కుటుంబాన్ని వదిలి.. గతంలో శంకర్పల్లి సైట్లో పని చేసినప్పుడు బిందుకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ సాకేత్ (27)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ప్రియుడి మోజులో పడిన బిందు తన కుటుంబాన్ని వదిలేసి ఈ నెల 4న అంకిత్ సాకేత్ ఉంటున్న నానక్‌రాంగూడకు వచ్చేసింది. తన వద్దకు వచ్చిన బిందును సాకేత్ తన స్నేహితుల గదిలో ఉంచాడు. ఈ క్రమంలో తన భార్య బిందు కనిపించడం లేదంటూ భర్త ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అదే రోజు పిల్లలను తీసుకుని స్వస్థలానికి వెళ్లిపోయాడు. నిర్మానుష్య ప్రదేశంలో శవాలుగా బిందు, అంకిత్ సాకేత్.. నానక్‌రాంగూడలో ఉంటున్న అంకిత్ సాకేత్ కనిపించటం లేదని ఆయన తమ్ముడు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 8న ఫిర్యాదు చేశాడు. కాగా.. పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలోని నిర్మానుష్య ప్రదేశమైన పద్మనాభస్వామి ఆలయ పరిసరాల్లోని గుట్టల్లో బిందు, సాకేత్ మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని కత్తులతో పొడిచి, ముఖాలు గుర్తించకుండా బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. జంట హత్యలు ఈ నెల 11, 12 తేదీల్లో జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. భిన్న కోణాల్లో విచారణ ముమ్మరం.. జంట హత్యల ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డిలు మంగళవారం పరిశీలించారు. క్లూస్, డాగ్ స్క్వాడ్లతో వివరాలు సేకరించారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. బిందు, అంకిత్ సాకేత్‌లతో పాటు మరో ముగ్గురు అటుగా వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బిందును గదిలో ఉంచిన సాకేత్ మిత్రులా? లేదా గతంలో శంకర్‌పల్లిలో పని చేసిన సమయంలో బిందుతో పాటు పనిచేసిన వారా? లేక ఇతరులెవరైనా వారిని అక్కడ చూసి అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి శరీరంపై దుస్తులు లేకపోవటంతో అత్యాచారం చేసి హతమార్చారా? బిందు, సాకేత్ ఏకాంతంగా ఉన్న సమయంలో హత్య చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం సమీపంలో సుమారు 10 ఖాళీ బీరు సీసాలు ఉన్నాయి. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. -
మీరు డాక్టరా.. లేకుంటే ఇంజినీరా..
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రతిమారాజ్ కొనసాగిన సమయంలో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జీజీహెచ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సైతం సమీక్ష సమావేశంలో మండిపడ్డారు. ఈ క్రమంలో గత శుక్రవారం ఫిట్స్‌తో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన మహిళను, కుటుంబ సభ్యులను సిబ్బంది పట్టించుకోని తీరు వివాదాస్పదంగా మారింది. ఆస్పత్రి సిబ్బంది రోగికి స్కానింగ్ చేయకుండా, ప్రైవేట్‌కు వెళ్లమని సూచించారు.చివరికి ఆస్పత్రి నుంచి గెంటి వేయడంతో మహిళా రోగితో పాటు ఆమె భర్త, పిల్లలు సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకు ఆస్పత్రి ప్రధాన గేట్ బయట చలిలో గడపడం.. తదితర అంశాలు ఆస్పత్రి నిర్వహణ తీరుపై అందరిలో ఆగ్రహం తెప్పించాయి. ఆస్పత్రిలో ఇలా రోగులు ఇబ్బంది పడుతుండగా.. మరోవైపు సూపరింటెండెంట్ తన చాంబర్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులకు గురవుతున్న తీరు.. సిబ్బంది పట్టింపులేని తనంపై మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో డాక్టర్ ప్రతిమారాజ్‌ను ఇన్చార్జి సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్థూ ఆదేశాలతో డీహెచ్ తొలగించారు. అంతేగాకుండా అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు.ఆరోపణలు ఇవే..రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను బయట మార్కెట్లో అమ్ముకున్నారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్టీఐ కింద సమాచారం అడిగిన వారు పోలీసు కేసు పెట్టించారు. గత వైద్యారోగ్యశాఖమంత్రి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు లేకుండా రూ. 28 లక్షలతో షెడ్డుతో పాటు, లిఫ్టు మరమ్మతులు, ఇతర పనులకు రూ. కోటికి పైగా వెచ్చించారు. దీంతో జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సీరియస్‌గా స్పందించి మీరు డాక్టరా.. లేకుంటే ఇంజినీరా.. అని మండిపడడంతోనే ఇంజినీర్ పనుల్లో జోక్యం ఆగింది.సుమారు నాలుగేళ్ల పాటు డిపార్ట్మెంట్ ఇచ్చిన ఫోన్‌ను సొంతంగా వినియోగించకుండా సూపరింటెండెంట్ తన పీఏకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా అధికారులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్యులు ఎవరు ఫోన్ చేసినా పీఏనే ఫోన్ ఎత్తి మాట్లాడేవారు, సమాధానాలు చెప్పేవారు. వైద్యుల అటెండెన్సులు వేస్తూ ప్రతి నెల కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేసేవారని ఆరోపణలు ఉన్నాయి.విచారణకు ఆదేశాలు..జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రతిమారాజ్ కొనసాగిన సమయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేయనున్నారు. సుమారు ఐదేళ్ల పాటు జరిగిన లావాదేవీలు, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లలో జరిగిన అవకతవలు, ఆరోగ్య శ్రీ నిధులు రూ.10 కోట్ల దుర్వినియోగం, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ)కు సంబంధం లేకుండా నాసిరకంగా చేపట్టిన పనులు, మందుల కొనుగోళ్లపై క్షుణ్ణంగా విచారణ చేపట్టనున్నారు. అతి త్వరలోనే విచారణ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. -
కొడుకా.. అంతలోనే వెళ్లిపోతివా..!
బన్సీలాల్‌పేట్: కొండపోచమ్మ డ్యామ్‌లో మునిగిపోయి మృతిచెందిన దినేశ్వర్ అంత్యక్రియలు ఆదివారం బన్సీలాల్‌పేట్ శ్మశానవాటికలో నిర్వహించారు. దీంతో చాచానెహ్రునగర్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి.స్థానికులు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు తరలి వచ్చి దినేశ్వర్ భౌతికకాయంపై పుష్పగుచ్చాలుంచి నివాళులరి్పంచారు. కుమారుడి పారి్థవదేహంపై పడి తల్లి సుమలత విలపించిన తీరు చూపరుల కంటతడి పెట్టించింది. బాగా చదువుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటావనుకుంటే కొడుకా.. అంతలోనే అందని లోకాలకు వెళ్లావంటూ తల్లి విలపించిన తీరు అక్కడున్న వారి హృదయాలను కదిలించింది. దినేశ్వర్ అంతిమయాత్ర చాచానెహ్రునగర్ నుంచి బయలుదేరి వివిధ ప్రాంతాల గుండా బన్సీలాల్‌పేట్ శ్మశానవాటికకు చేరుకుంది. ప్రముఖుల పరామర్శ..బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచానెహ్రునగర్‌లో ఉంచిన దినేశ్వర్ భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులరి్పంచారు. స్ధానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ కె. హేమలత, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీపతి, జి. పవన్‌కుమార్ గౌడ్, ఏసూరి మహేష్, వెంకటేశన్ రాజు తదితరులు కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. -
దొంగలను పట్టించిన డాగ్ వాక్
2024 డిసెంబర్ 12 తెల్లవారుజాము దాదాపు 4 గంటల సమయం– హైదరాబాద్, దోమలగూడ అర్వింద్నగర్లోని ఘొరాయ్ కుటుంబీకుల ఇంట్లోకి ఆరుగురు ముసుగు దొంగలు చొరబడి, మారణాయుధాలతో బెదిరించి, రెండు కేజీల బంగారం సహా దాదాపు రూ.2 కోట్ల విలువైన సొత్తు దోచుకున్నారు. 2024 డిసెంబర్ 22 మధ్యాహ్నం దాదాపు 2 గంటల మధ్య సమయం–బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఘొరాయ్ కుటుంబీకుడు సహా 12 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆధారాలు దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం చేసిన ఈ బందిపోటు దొంగతనం ఒక పెంపుడు జాగిలం ద్వారా కొలిక్కి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అన్నదమ్ములు రంజిత్ ఘొరాయ్, ఇంద్రజిత్ ఘొరాయ్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వలసవచ్చారు. తమ కుటుంబాలతో దోమలగూడ అర్వింద్నగర్లో స్థిరపడ్డారు. ఇద్దరూ వేర్వేరుగా నగల తయారీ వ్యాపారం ప్రారంభించారు. రంజిత్ యాభైమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అతడి తమ్ముడు ఇంద్రజిత్ వ్యసనాలకు బానిసై, ఆర్థికంగా చితికిపోయాడు. తమ్ముడి పరిస్థితి చూసిన అన్న రంజిత్ తనతో కలిసి ఒకే ఇంట్లో వేరే పోర్షన్లో ఉండే ఏర్పాటు చేశాడు. రంజిత్ వ్యాపారం బాగా సాగుతుండటంతో ఇంద్రజిత్ కొన్నాళ్లుగా ఈర్ష్యతో రగిలిపోతున్నాడు. ఇటీవల రంజిత్ తన భార్య పేరుతో దోమలగూడలో రెండు ఇళ్లు కొన్నాడు. ఈ విషయం తెలిశాక ఇంద్రజిత్ మరింతగా రగిలిపోయాడు. రంజిత్ వద్ద ఉండే బంగారం వివరాలను గమనిస్తూ వచ్చిన ఇంద్రజిత్– నకిలీ ఆదాయపు పన్ను దాడి చేయించడానికి ఆరు నెలల కిందట కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించినా, ఆ పథకం పారలేదు. దీంతో అన్న వద్ద ఉండే బంగారం దోచుకోవాలని ఇంద్రజిత్ భావించాడు. ప్రతి రోజూ తనతో కలిసి మార్నింగ్ వాక్ చేసే అల్తాఫ్ మహ్మద్ ఖాన్, సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్‌లతో ఇంద్రజిత్‌కు స్నేహం ఏర్పడింది. రంజిత్ ఇంట్లో భారీగా బంగారం ఉండే సమయం చెప్తానని, అప్పుడు దోపిడీ చేయిస్తే, అందరం వాటాలు పంచుకుందామని చెప్పాడు. దీనికి అంగీకరించిన అల్తాఫ్, ఇర్ఫాన్, ఈ విషయాన్ని బాలాపూర్‌కు చెందిన రౌడీషీటర్ హబీబ్ హుస్సేన్ ద్వారా మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షేక్ షబ్బీర్‌కు చెప్పారు. ఈ దోపిడీకి తనకంటే మైలార్‌దేవ్‌పల్లి రౌడీషీటర్ మహ్మద్ అర్బాజ్ సమర్థుడని చెప్పిన షబ్బీర్, అతడిని పరిచయం చేశాడు. వీరంతా పలుమార్లు వివిధ హోటళ్లలో కూర్చుని, దోపిడీకి పథకం వేశారు. అర్బాజ్ తన అనుచరులతో కలిసి బందిపోటు దొంగతనానికి రంగంలోకి దిగాడు. ఇంద్రజిత్తో చర్చించి, ఒక వాహనాన్ని కూడా కొన్నాడు. తన అనుచరులతో రంజిత్ ఇంటి వద్ద రెక్కీ చేయించాడు. ఇంట్లో పెంపుడు శునకం, చుట్టూ ప్రహరీ, భారీ గేటు, గ్రిల్స్‌తో కట్టుదిట్టంగా ఉండటంతో బయటి వాళ్లు ప్రవేశించడం దుస్సాధ్యమని గుర్తించి, ఇంద్రజిత్‌కు చెప్పాడు. దీంతో అంతా కలిసి బహదూర్‌పురాకు చెందిన న్యాయవాది మహ్మద్ నూరుల్లా సహాయం కోరారు. ఘొరాయ్ ఇంట్లోని పెంపుడు శునకాన్ని ఇంద్రజిత్ రోజూ ఉదయం బయటకు తీసుకువెళుతుంటాడు. దాని కాలకృత్యాలు పూర్తయ్యాక తీసుకువచ్చి, ఇంటి ఆవరణలో వదిలేస్తాడు. దొంగతనం చేసే రోజు మాత్రం తెల్లవారుజామున పెంపుడు శునకాన్ని కాస్త తొందరగా బయటకు తీసుకుని వెళ్లాలని, తిరిగి వస్తూ ప్రధాన గేటుకు గడియపెట్టకుండా వదిలేయాలని నూరుల్లా సలహా ఇచ్చాడు. దీంతో అర్బాజ్ 2024 డిసెంబర్ 12 రాత్రి తన గ్యాంగ్‌తో రంగంలోకి దిగాడు. అర్బాజ్ నేతృత్వంలో అతడి అనుచరులు షబ్బీర్ ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ నుంచి షబ్బీర్ మినహా మిగిలిన వాళ్లు బయలుదేరి, రంజిత్ ఇంటికి చేరారు. తన అన్న కుటుంబీకులను కేవలం బెదిరించాలని ఇంద్రజిత్ పదేపదే చెప్పినా అర్బాజ్ పట్టించుకోలేదు. రంజిత్ కుటుంబాన్ని బంధించి, తన అనుచరులతో వారి పిల్లల మెడపై కత్తులు పెట్టించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన రంజిత్ చేతిని కత్తితో నరికించాడు. తర్వాత ఇంట్లోని రెండు కేజీల బంగారం, 616 గ్రాముల వెండి, పూజ గదిలోని రెండు కేజీల ఇత్తడి సామాను దోచుకుని పారిపోయారు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా, రహదారుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. కాసేపటికి రంజిత్ షాక్ నుంచి తేరుకున్నాడు. ఇంద్రజిత్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా నేతృత్వంలో ఎస్సైలు నవీన్‌కుమార్, నాగేష్, శ్రీకాంత్ తమ బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఘొరాయ్ కుటుంబం దినచర్యపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే నేరం జరిగిన రోజు ఇంద్రజిత్ తెల్లవారుజామున 3.00 గంటలకే పెంపుడు శునకాన్ని మార్నింగ్ వాక్కు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. అతడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అతడు నోరు విప్పాడు. ఆరు నెలల కిందటి ‘ఐటీ స్కెచ్’ నుంచి తాజా బందిపోటు దొంగతనంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న పదిహేను మంది వివరాలను బయటపెట్టాడు. దీంతో అధికారులు షహబాజ్, నజీర్, జహీర్ మినహా మిగిలిన పన్నెండు మందిని పట్టుకుని, వీరి నుంచి రూ.2.9 లక్షల నగదు, కారు, ఆయుధాలతో పాటు 1228 గ్రాముల బంగారం, 616 గ్రాముల వెండి, రెండు కేజీల ఇత్తడి వస్తువులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
వెంకన్న సన్నిధిలో విషాదం.. టీటీడీ చరిత్రలో కనివినీ ఎరుగని నిర్లక్ష్యం
చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల-తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఏడుగురు భక్తుల ప్రాణాలను హరించింది. ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసింది. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారు. -
Year Ender 2024: ఎన్నటికీ మరువలేని రెండు దుర్ఘటనలు
మరికొద్ది గంటల్లో 2024 ముగియబోతోంది. 2025ను స్వాగతించేందుకు ప్రపంచమంతా సిద్ధమయ్యింది. 2024లో దేశంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో కొన్ని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. యూపీలో జరిగిన రెండు ఘటనలైతే ఎన్నటికీ మరువలేని విషాదాన్ని మిగిల్చాయి. వాటిని తలచుకుంటే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.హత్రాస్ తొక్కిసలాట2024, జులై 2న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోరాన్ని ఎవరూ మరచిపోలేరు. ఆ రోజు మంగళవారం.. హత్రాస్(Hathras) పరిధిలోని పుల్రాయి గ్రామంలో నారాయణ్ సకర్ హరి అలియాస్ భోలే బాబా సత్సంగం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది తరలివచ్చారు. సత్సంగం ముగిసిన అనంతరం భోలే బాబా పాదాలను తాకేందుకు ఆయన దగ్గరకు ఒక్క ఉదుటున జనం పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పడిపోయారు. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంతమందికి గాయాలయ్యాయి.ఈ ఘటన దరిమిలా భోలే బాబా పరారయ్యాడు. ఈ ఉదంతం ప్రభుత్వ యంత్రాంగంలో కలకలం రేపింది. యూపీ పోలీసులు భోలే బాబా కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సత్సంగ్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాడు సీఎం యోగి స్పందిస్తూ, ఈ ఘటనకు కారకులైనవారినెవరినీ, వదిలిపెట్టబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 91 రోజుల పాటు పోలీసులు కేసు దర్యాప్తు చేసి, మొత్తం 11 మందిని నిందితులుగా తేల్చారు. అయితే ఈ చార్జిషీటులో నారాయణ్ సకర్ హరి అలియాస్ సూరజ్‌పాల్ బాబా(Surajpal Baba) పేరు లేకపోవడం విశేషం. ఈ కేసులో పోలీసులు 3,200 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు.ఝాన్సీ అగ్ని ప్రమాదం2024, నవంబర్ 15న యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ(Maharani Lakshmibai Medical College)లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చైల్డ్ వార్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎన్ఐసీయూ వార్డులో 54 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది, చిన్నారుల బంధువులు చైల్డ్ వార్డు కిటికీ పగులగొట్టి, పలువురు చిన్నారులను రక్షించారు. ఈ ఘటనలో 15 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. యావత్‌దేశం ఈ ఉదంతంపై కంటతడి పెట్టుకుంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఐదు ఘటనలు.. రాజధానిలో సంచలనం -
సంధ్య ధియేటర్ ఘటనలో పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ వివాదం
-
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్
-
మదనపల్లె తహసీల్దార్ ఆఫీసులో మాజీ సైనికుడి ఆత్మహత్యాయత్నం
-
రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్
-
రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్
-
ముచ్చుమర్రి ఘటన: ‘వాళ్లు మా కళ్ల ముందే తిరుగుతున్నారు’
నంద్యాల, సాక్షి: ప్రతీకార రాజకీయంతో దాడులు, ఆడపడుచులపై అఘాయిత్యాలు.. చిన్నారులను చిదిమేస్తున్న మానవ మృగాలు.. ఏపీలో నాలుగు నెలలుగా అసలేం జరుగుతోంది?. పైగా బాధితులకు న్యాయం జరగకపోగా.. నిందితులు యధేచ్ఛగా బయట తిరుగుతున్నారు. సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక హత్యచార ఘటన కేసులో న్యాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నిందితులకు బెయిల్ లభించడంతో వాళ్లు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ పరిణామంతో.. ఆ బాలిక తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు.‘‘121 రోజులైంది. మాపాప ఆచూకీ ఇంత వరకు దొరకకపోవడం ఏమిటి?. అసలేం జరుగుతోంది. నిందితులు బెయిల్ వచ్చి స్వేచ్చగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని మేం బిడ్డను దూరం చేసుకుని శిక్ష అనుభవించాలా?. వాళ్లకు బహిరంగంగా ఉరిశిక్ష వేస్తేనే మా కూతురి విషయం న్యాయం జరిగినట్లు’’ అని ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కేసు నేపథ్యం ఇలా..నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికను జూలై 7న అదేగ్రామానికి చెందిన 15, 14, 9 వయసున్న ముగ్గురు మైనర్ బాలురు హత్యాచారానికి పాల్పడ్డారు. అయితే వాళ్లకు సహకరించిన మరో ముగ్గురు పెద్దలను సైతం పోలీసులు ఈ కేసులో చేర్చారు. దీంతో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లయ్యింది.అయితే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, నిందితులు వెల్లడించిన వివరాలు అన్నీ అనుమానాస్పదంగా ఉన్నవే. నేరం జరిగి 90 రోజులు గడవడంతో పోలీసులు ప్రిలిమనరీ చార్జిషీట్ ఫైల్ చేశారు. క్రైం నంబర్ 69/2024లో నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాదనలు విన్న కర్నూలు పోక్సో కోర్టు ఏ4 కాటం యోహాన్, ఏ5 బొల్లెద్దుల సద్గురు అలియాస్ సద్గురుడు, ఏ6 అంబటి ప్రబేష్కు అక్టోబర్ 24వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అలాగే.. కేసులో కొద్ది రోజుల క్రితం ముగ్గురు మైనర్ నిందితుల్లో ఇద్దరికి జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. చైల్డ్ ఇన్ కాంఫ్లిట్ విత్ లా(సీసీఎల్2)14 ఏళ్ల బాలుడు, సీసీఎల్3 అయిన తొమ్మిదేళ్ల బాలుడికి బెయిల్ మంజూరైంది. అయితే.. సీసీఎల్1 అయిన పదిహేనేళ్ల బాలుడు మాత్రం ప్రస్తుతం జువైనల్ జస్టిస్ హోంలో ఉన్నాడు.ఇదెక్కడి న్యాయం?ఈ కేసులో పోలీసుల అలసత్వంపై మొదటి నుంచి విమర్శలున్నాయి. తల్లిదండ్రులు బాలిక కనిపించకుండా పోయిన రోజున ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ప్రజా సంఘాల ఒత్తిడితో రెండు రోజుల తర్వాత నుంచి విచారణ ప్రారంభించారు. జులై 10న నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే చిన్నారిని రేప్ చేసి చంపేసినట్లు నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులు బాలిక శవాన్ని మాయం చేయడంతో గుర్తించడంలో పోలీసులు పూర్తి వైఫల్యం చెందారని బాధితులు చెబుతున్నారు. అలాగే.. ప్రభుత్వం స్పందించిన తీరుపైనా ఆ టైంలో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. తమకు న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆ తల్లిదండ్రులు పలు ఇంటర్వ్యూల ద్వారా విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అటుపై ఈ కేసును ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారు. సుమారు 121 రోజులు గడుస్తున్న ఇంకా పాప ఆచూకీ దొరకలేదన్న బాధలో ఉన్న ఆ తల్లిదండ్రులు.. ఇప్పుడు న్యాయం అందకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. -
ఆ రోడ్డు.. 20 గ్రామాల సమస్య!
టంగుటూరు: ఓ 2 కిలోమీటర్ల రహదారి 20 గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మర్లపాడు గ్రామంలో బస్టాండ్ నుంచి కొండల మీదుగా ఒంగోలుకు వెళ్లే సుమారు రెండు కిలోమీటర్ల వరకు పంచాయతీరాజ్ పరిధిలోని మట్టిరోడ్డులో రాళ్లు పైకి లేచి గుంతలమయంగా మారింది. ఈ రోడ్డులో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణం సాగిస్తుంటాయి.అయితే ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రోడ్డు చిన్నపాటి వర్షానికే పూర్తిగా బురద నీళ్లతో నిండి అధ్వారంగా తయారవుతోంది. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనచోదకులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం ఈ రోడ్డు నుంచే స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు ప్రయాణం సాగిస్తుంటాయి. అంతేకాకుండా మర్రిపూడి జువ్విగుంట, కొండపి, తంగెళ్ల, జాళ్లపాలెం దూరప్రాంతాల ప్రజలు తక్కువ సమయంలో ఒంగోలు వెళ్లేందుకు ఈ మార్గం ఎంతో అనువుగా ఉంటుంది.ఇలాంటి పరిస్థితుల్లో సుమారు రెండు కిలోమీటర్ల మట్టి రోడ్డు ఇలా గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ 2 కిలోమీటర్ల రోడ్డును తారురోడ్డుగా మారితే ఒంగోలుకు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సురక్షితంగా దూరం తగ్గడంతో పాటు తక్కువ సమయం పడుతుందని ప్రయాణిలకంటున్నారు. అధికారులు రోడ్డుపై దృష్టి సారించి తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.ఇవి చదవండి: ఆ రెండు రోజులు వైన్స్ బంద్ : పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ -
MGM ఆస్పత్రిలో రౌడీ రాణి రాజమ్మ అరెస్ట్
రామన్నపేట: ఎంజీఎంలో విధులకు వెళ్తున్న ఉద్యోగిని అడ్డగించి బెదిరించి దాడికి పాల్పడిన మహిళను అరెస్ట్ చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ టి.గోపి మంగళవారం తెలిపారు. ఇన్స్పెక్టర్ గోపి కథనం ప్రకారం.. బిల్ల సుమలత 15 సంవత్సరాల నుంచి ఎంజీఎంలో ఔట్సోరి్సంగ్గా, రెండు సంవత్సరాల నుంచి పేషెంట్ కేర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈనెల 9న మధ్యాహ్నం షిఫ్ట్ విధుల్లో భాగంగా ఎంజీఎంలోని బయోమెట్రిక్ మెషీన్ వద్దకు వచ్చి హాజరు వేస్తుండగా ఆలకుంట రాజమ్మ.. సుమలతను అడ్డుకుంది. ‘నీ నియామకానికి జీఓ తెచ్చింది నేనే.. అందుకే రూ.2 లక్షలు లంచం ఇస్తావా లేదా..లేకుంటే నిన్ను చంపేస్తా’ అంటూ బెదిరిస్తూ చైన్‌తో విచక్షణరహితంగా సుమలతను కొడుతూ తన వద్ద ఉన్న పదివేల రూపాయలు లాక్కొని, ఆమె మొబైల్ ను కింద కొట్టిందని బాధిత మహిళ బిళ్ళ సుమలత ఫిర్యాదు చేసిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మంగళవారం ఉదయం నిందితురాలైన ఆలకుంట రాజమ్మను అరెస్టు చేసి, ఆమె వద్ద ఉన్న వెయ్యి రూపాయల నగదు, దాడికి ఉపయోగించిన ఇనుప చైన్ ను స్వాధీనపరచుకొని రాజమ్మను రిమాండ్ కు తరలించినట్లు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మట్టేవాడ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి, ఎస్సై విటల్ పాల్గొన్నారు. ఎంజీఎం ఘటనపై దోషులను శిక్షించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డివరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఉద్యోగి సుమలతపై దాడికి పాల్పడిన దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించారు. సుమలతపై దాడికి పాల్పడిన రాజమ్మ గతంలో ఎంజీఎంలో విధులు నిర్వర్తించినప్పటికీ తనపై ఉన్న అభియోగాల నేపథ్యంలో విధుల నుంచి తొలగించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను ఊపేక్షించేది లేదని, నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వైద్యులు, సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్ప డితే రౌడీషీట్ ఓపెన్ చేసి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
జైనూర్ ఘటన.. మానవ హక్కుల కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ, సాక్షి: మహిళపై అత్యాచారయత్నం, ఆపై హత్యాయత్నం ఘటనలతో రెండు వర్గాలు పరస్పర దాడులతో రణరంగంగా మారిన జైనూర్ ప్రస్తుతం కొద్దిగా కోలుకుంటోంది. మరోవైపు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం తెలంగాణ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ మొదటివారంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఘటన.. ఆపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తీవ్రంగా పరిగణించింది ఎన్హెచ్ఆర్సీ. మీడియా ఆధారంగా వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఆ కథనాల్లో పేర్కొందే గనుక వాస్తవమైతే.. మానవ హక్కులకు తీవ్ర ఉల్లంఘన జరిగినట్లేనని అభిప్రాయపడింది. రెండువారాల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు పంపించింది.ఆ నివేదికలో.. ఎఫ్ఐఆర్తో పాటు బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, ఆమెకు అందించిన కౌన్సెలింగ్.. ప్రభుత్వం తరఫున అందించిన పరిహార వివరాలను కూడా పొందుపర్చాలని సీఎస్, డీజీపీలకు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: నిమజ్జన టైంలో కోరడం సరికాదు: తెలంగాణ హైకోర్టు -
రైలు పట్టాలపై సిలిండర్.. ఉగ్రవాదుల పనేనా?
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలపై కుట్ర కోణం దాగింవుందనే చర్చ జరుగుతోంది. యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైల్వే మార్గంలో భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ పట్టాలపై సిలిండర్ ఉంచిన ఉదంతాన్ని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో రైలు వేగం ఎక్కువగా ఉంది. డ్రైవర్ రైలును ఆపినప్పటికీ, అది సిలిండర్‌ను ఢీకొంది. దీంతో పెద్ధ శబ్ధం వచ్చింది. ప్రయాణికులు భయకంపితులయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది.ఈ కేసును ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, యూపీ ఏటీఎస్‌సహా అన్ని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తును ఇప్పటికే ప్రారంభించాయి. దీనివెనుక ఐఎస్ఐఎస్ కుట్ర ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఉగ్రవాది ఫర్తుల్లా ఘోరీ ఒక ఆడియోను విడుదల చేశాడు. దానిలో రైలును బోల్తా కొట్టించాలంటూ దేశంలోని స్లీపర్ సెల్‌లను ఆదేశించినట్లు ఉంది. దీంతో దర్యాప్తు సంస్థల అధికారులు ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలను కూడా ఈ కోణంలోనే పరిశీలిస్తున్నారు. ఈమధ్య ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీకి చెందిన 14 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు.తాజాగా కాన్పూర్‌లోని రైల్వే ట్రాక్‌పై సిలిండర్ లభ్యమైన ప్రదేశంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. కుట్ర పన్నారనే అనుమానంతో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కాన్పూర్ డీసీపీ వెస్ట్ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దర్యాప్తు సంస్థలన్నీ తమ తమ స్థాయిలలో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నారో త్వరలోనే వెల్లడిస్తామని ఆయా సంస్థల అధికారులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తునకు డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు. ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ కేసుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ధ్వంసమయ్యాయి. దర్యాప్తునకు ఇది ఆటంకం కలిగించే అంశంగా మారింది. కాగా ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బాటిల్లో మండే పదార్థాన్ని పోలీసు అధికారులు గుర్తించారు. -
అమెరికాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు
లండన్(యూఎస్ఏ): అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న కాల్పుల ఘటన నిందితుడి కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. ఇంటర్ స్టేట్–75పై లండన్ నగరానికి 9 మైళ్ల దూరంలోని లారెల్ కౌంటీలో రోడ్డు ప్రమాదం, అనంతరం జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణమైన జోసెఫ్ ఎ కౌచ్(32) అనే శ్వేతజాతీయుడు అప్పటి నుంచి ఉన్నాడని పోలీసులు వివరించారు. తీవ్రంగా గాలిస్తోంది. అతడున్న ప్రాంతం తెలిసిందని అధికారులు తెలిపారు. వాహనదారులు ఇంటర్ స్టేట్–75, యూఎస్ 25పైకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు..అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రంలో పాశవిక ప్రభుత్వం రాజ్యమేలుతోంది
గాం«దీ ఆస్పత్రి (హైదరాబాద్): రాష్ట్రంలో పాశవిక ప్రభుత్వం రాజ్యమేలుతోందని, రాష్ట్రం రావణకాష్టం కాకముందే ప్రజలంతా మేల్కొనాలని పలువురు బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. జైనూరు ఘటనలో గాయపడి.. సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ, అమె కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జైనూరులో ఆదివాసీ మహిళపై జరిగిన ఘటన అత్యంత దారుణమని, అత్యాచారం చేసి రాయితో ముఖంపై దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని, నాగర్‌కర్నూలు, జైనూరు, హైదరాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ తదితర ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు మచ్చుకైనా కనిపించడం లేదని అన్నారు.తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో 1,900 అత్యాచారాలు, 2,600 హత్యలు, 230 ఆయుధాల కేసులు నమోదు అయ్యాయని ఆయన గణాంకాలతో వివరించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం రక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందంటూ కేంద్ర హోంశాఖ అధికారులు, దేశ భద్రతా సలహాదారు మెచ్చుకున్నారని, పోలీస్ గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ భద్రతకు మారుపేరు అని కితాబు ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన డీజీపీ బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే నిర్మల్, సనత్‌నగర్, గోషామహల్, జైనూరులో మత కలహాలు చెలరేగాయన్నారు. మెదక్ మతకల్లోలాన్ని అదుపు చేయడంలో విఫలమైన ఎస్పీని హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీగా నియమించారని ఆక్షేపించారు. డయల్ 100 పనిచేయడంలేదని, మహిళల భద్రతపై జాతీయ మహిళా కమిషన్ స్పందించాలని, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నిరంగాల్లో పూర్తిస్థాయిలో విఫలం అయ్యారని విమర్శించారు. ఆదివాసీ మహిళ దారుణ అత్యాచారానికి గురై చావుబ్రతుకుల్లో ఉంటే పరామర్శించే మానవత్వం లేదా అంటు రేవంత్‌రెడ్డిని ప్రశ్శించారు. జైనూరు ఘటనలో బాధిత మహిళలకు తక్షణ న్యాయం జరగాలని, రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాగా, జైనూరు ఘటనలో నిందితుడికి వత్తాసు పలుకున్న వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ముఠాగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గుడ్లవల్లేరు విద్యార్థులను బెదిరించిన ఎస్ఐ శిరీష బదిలీ
-
మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించని ప్రభుత్వం
-
బతికున్నోళ్లనే చంపేశారు.. ఈ ప్రభుత్వానికి ఓ దండం..
-
చంద్రబాబే ఒక విపత్తు
-
క్షతగాత్రులకు అందని పరిహారం.. చంద్రబాబు సర్కార్ వైఫల్యం
సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం ప్రమాద ఘటనలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నష్ట పరిహారం అందించడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యం చెందింది. ఇద్దరు క్షతగాత్రులకు నష్టపరిహారం అందలేదు. ప్రమాదంలో కెమిస్ట్ తేజేశ్వరరావు కంటి చూపు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ నరేష్ కూడా పరిహారం అందలేదు. ప్రస్తుతం ఆయన ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మరో ఘటనలో పరవాడ సినర్జీస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇండస్ ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతుండగా.. జార్ఖండ్‌కు చెందిన రొయ్య అంగీర మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీ్హెచ్ మార్చూరీకి తరలించారు.కాగా, ‘అచ్యుతాపురం–పరవాడ’ సెజ్‌లో వరుస ప్రమాదాలు కార్మికులు, వారి కుటుంబాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో జరిగిన ఏడు ప్రమాదాల్లో 22 మంది మృతిచెందారు. రెండు రోజుల కిందట అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో 17 మంది మరణించిన దుర్ఘటన మరువక ముందే... పరవాడ సెజ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.పరవాడ సమీపంలోని జేఎన్ ఫార్మాసిటీలో సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్–3 యూనిట్లో గురువారం అర్ధరాత్రి రియాక్టరు నుంచి రసాయనాలు వెలువడి పొగతో కూడిన మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు, విజయనగరం జిల్లాకు చెందిన ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన విశాఖపట్నంలోని ఇండస్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
KSR Live Show: అంబులెన్సులు లేవు.. బయటపడ్డ ప్రభుత్వ వైఫల్యం..
-
పరిహారంపై క్లారిటీ లేదు.. ఇది చంద్రబాబు ప్రభుత్వం తీరు
-
అచ్యుతాపురం ఘటన: మళ్లీ మొదటికొచ్చిన రూ.కోటి పరిహారం వ్యవహారం
సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్నుసూపరింటెండెంట్ మృతుల బంధువులు నిలదీశారు. నష్టపరిహారం ఇచ్చేవరకు మృతదేహాలను తీసుకువెళ్లేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరీ వీడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఇదిలా ఉంటే.. కోటి రూపాయల పరిహారం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే రూ. కోటి చెక్కు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. అయితే, చంద్రబాబు వెళ్లిన తర్వాత అధికారులు మాట మర్చారు. డెడ్‌బాడీలను ఇంటికి తీసుకెళ్లే సమయంలో దారి ఖర్చులకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తామని అధికారులు అంటున్నారు. రూ కోటి పరిహారం ఇస్తేనేగాని ఇంటికి తీసుకెళ్లమంటున్న బంధువులు.. రూ.10 వేల కోసం కుక్కర్తి పడేవాళ్లలా కనిపిస్తున్నామా అంటూ నిలదీశారు.మరీ ఇంత నిర్లక్ష్యమా!?కాగా, ఎక్కడో మదనపల్లిలో ఓ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కొన్ని ఫైళ్లు దగ్ధమైతేనే ఏదో భారీ ఉపద్రవం ముంచుకొచ్చినట్లు హడావిడి చేసి, ఆగమేఘాల మీద హెలికాఫ్టర్‌లో డీజీపీని పంపి సీఎం చంద్రబాబు హడావుడి చేశారు. విశాఖలో ఇంత పెద్ద ప్రమాదం సంభవిస్తే, ఇంత మంది ప్రాణాలు పోతే స్పందించకుండా తాపీగా ప్రభుత్వ శాఖలపై సమీక్ష చేస్తూ కూర్చోవడం విమర్శలకు తావిస్తోంది.40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ, తనను మించిన విజనరీ, సమర్థుడు ఈ దేశంలోనే లేడని తనకు తానే డబ్బా కొట్టుకునే చంద్రబాబు.. రియాక్టర్ ప్రమాద ఘటనలో మాత్రం చతికిలబడ్డారు. చంద్రబాబు పరిపాలనలో బేలతనం ఈ దుర్ఘటనతో స్పష్టంగా బయటపడింది.మధ్యాహ్నం 2 గంటల సమయంలో రియాక్టర్ పేలింది. అదే సమయంలో హోం శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలోనే హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసి కూడా సహాయక చర్యలపై వారితో సీఎం చంద్రబాబు సమీక్షించలేదని తెలిసింది. చంద్రబాబు సీఎం సమీక్ష అనంతరం కూడా సచివాలయంలోనే ఉన్న హోం మంత్రి అనిత.. సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు.అచ్యుతాపురం ఘటనపై ఆమె కనీసం స్పందించ లేదు. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ ప్రెస్ మీట్ పెట్టి ప్రమాదంలో మృతుల వివరాలు కూడా పూర్తిగా చెప్పలేకపోయారు. అంతెందుకు రాత్రి 7 గంటల వరకు అనకాపల్లి కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడలేదు. సచివాలయంలోనే ఉన్నా, హోం మంత్రి, డీజీపీలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అర్ధరాత్రయినా ప్రమాద స్థలానికి మంత్రులుగానీ, ఉన్నతాధికారులుగానీ చేరుకోలేదు. ప్రెస్ నోట్లు, మీడియాలో దిగ్భ్రాంతులకే పాలనా యంత్రాంగం పరిమితమైంది. -
అచ్యుతాపురం ఘటన బాధితుల కన్నీళ్లు.. చలించిపోయిన బొత్స
-
అచ్యుతాపురం ఘటనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు