నేను ఆత్మహత్య చేసుకుంటున్నా | VOA Selfie Video Before He Ends His Life In Nellore, Police Intervene And Launch Investigation | Sakshi
Sakshi News home page

నేను ఆత్మహత్య చేసుకుంటున్నా

Oct 20 2025 11:33 AM | Updated on Oct 20 2025 1:39 PM

VOA selfie video Life Ends incident In Nellore

వాట్సాప్‌ గ్రూపులో పెట్టిన వీఓఏ 

వెంటనే స్పందించిన పోలీసులు  

నెల్లూరు: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ వెలుగు వీఓఏ వాట్సాప్‌ గ్రూపులో సెల్ఫీ వీడియో పెట్టింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెతో మాట్లాడారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నందిపాడులో వెలుగు వీఓఏగా రజియా పనిచేస్తోంది. ఆమె ఆదివారం ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ వాట్సాప్‌ గ్రూపుల్లో సెల్ఫీ వీడియో పెట్టింది. సీసీ తనను విధుల నుంచి తప్పించి మరొకరిని పెట్టుకోవాలని చూస్తున్నారని అందులో ఆరోపించింది. 

కొందరు పొదుపు మహిళలు, మరో వ్యక్తి వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్సై ఆదిలక్ష్మి సకాలంలో స్పందించి రజియాతో మాట్లాడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ వెలుగు అధికారులు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విచారించి తగిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement