రూ.2 వేల ప్రొజెక్టర్‌ : అమెజాన్‌కు రూ. 35వేల షాక్‌ | Tiruchi court fines Amazon delivering t-shirts instead of ordered projector | Sakshi
Sakshi News home page

రూ.2 వేల ప్రొజెక్టర్‌ : అమెజాన్‌కు రూ. 35వేల షాక్‌

Dec 3 2025 5:56 PM | Updated on Dec 3 2025 6:24 PM

Tiruchi court fines Amazon delivering t-shirts instead of ordered projector

చెన్నై,సాక్షి : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది.  ఆర్డర్‌ చేసిన వస్తువు కాకుండా మరో తప్పుడు వస్తువు డెలివరీ చేసినందుకుగాను కోర్టు జరిమానా విధించింది. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.

తమిళనాడులోకి తిరుచ్చకి చెందిన  ఐజాక్‌ న్యూటన్‌  జులై 9న ఒక  మినీ ప్రొజెక్టర్‌ ఆమెజాన్‌ ద్వారా ఆర్డర్‌ చేశారు. కానీ  జూలై 14న వచ్చిన పార్సిల్‌ చూసి ఐజాక్‌ నివ్వెరపోయాడు.  రూ.2,707 ధర గల మినీ ప్రొజెక్టర్‌కి బదులుగా టీ-షర్టులు కనిపించాయి. అయితే, న్యూటన్ ఉత్పత్తిని మార్చాడని ఆరోపిస్తూ అమెజాన్ డబ్బును తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. అమెజాన్ చర్యతో నిరాశ చెందిన ఐజాక్‌ కంపెనీకి లీగల్ నోటీసు పంపాడు. అసలు మొత్తాన్ని తిరిగి ఇచ్చింది. అయినా చెప్పిన సమయానికిఈ-కామర్స్ సంస్థ డబ్బులు చెల్లించక పోవడంతో న్యాయపోరాటానికి దిగాడు. 

ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతో

తనకు జరిగిన మోసం, మానసిక వేదనకు పరిహారం చెల్లించాల్సిందిగా ఐజాక్ న్యూటన్ త్రిరుచ్చి జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. రూ. 5 లక్షల పరిహారం కోరుతూ కేసు దాఖలు చేశాడు. కేసును విచారించిన కోర్టు అమెజాన్ ,డెలివరీ ఏజెంట్ తప్పు చేసినట్లు గుర్తించింది.  నవంబర్ 28న కోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది, అమెజాన్ ఐజాక్ న్యూటన్‌కు రూ.25,000 పరిహారంగా  రూ.10 వేల కోర్టు ఖర్చులకు చెల్లించాలని ఆదేశించింది.  ఐజాక్‌కు  మొత్తంగా రూ.35,000  చెల్లించాలని తీర్పు  చెప్పింది.

చదవండి: మాస్క్‌తో పలాష్‌ : ప్రేమానంద్‌ మహారాజ్‌ని ఎందుకు కలిశాడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement