స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ (Palaash Muchhal) వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఇంకా భారీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబరు 7న వీరిద్ధరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వ్యాపించాయి. అలాంటిదేమీ లేదని స్మృతి సోదరుడు శ్రావణ్ మంధాన కొట్టి పారేశారు. ఈ ఊహాగానాల మధ్య పెళ్లిలో అనారోగ్యం, పెళ్లి వాయిదా తరువాత పలాష్ తొలిసారి తన కుటుంబంతో విమానాశ్రయంలో కనిపించాడు.
ఇంతకీఅతను ఎక్కడి వెళ్లాడు అనేది హాట్ టాపిక్‌గా మారింది. విమానాశ్రయంలో తన కుటుంబంతో మొదటిసారి కనిపించిన తర్వాత, పలాష్ ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో శ్రీ హిట్ రాధా కేలి కుంజ్‌లో ప్రేమానంద్ మహారాజ్ (Premanand Maharaj )ను సందర్శించు కున్నారు. తెల్ల చొక్కా, నల్ల జాకెట్ ధరించి, చేతులు ముడుచుకుని ముందు వరుసలో కూర్చుని ఫోటోల వైరల్‌గా మారింది. అంతకుముందు, ముంబై విమానాశ్రయంలో ఆయన అంతే దిగులుగా కనిపించిన పలాష్ ఇక్కడ ముఖానికి మాస్క్‌తో, భక్తితో నమస్కరిస్తూ కనిపించాడు.

చదవండి: జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీ
కాగా మెహిందీ, సంగీత్ వేడుకల మధ్య మహారాష్ట్రలోని సాంగ్లిలో నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సిన స్మృతి-పలాష్ పెళ్లి స్మృతి తండ్రి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత పలాష్ ప్రైవేట్ చాట్స్, స్క్రీన్‌షాట్‌లు అంటూ మరికొన్ని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై ఇరు కుటుంబాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇదీ చదవండి: రిటైర్డ్ డాక్టర్ లక్ష్మీ బాయ్ రూ. 3.4 కోట్ల భారీ విరాళం


