breaking news
Smriti Mandhana
-
త్వరలోనే నా కుమారుడి పెళ్లి: పలాష్ ముచ్చల్ తల్లి
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి (Smriti Mandhana) గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఆమెను మోసం చేసిన కారణంగానే వివాహం నిరవధికంగా వాయిదా పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు తోడు పలాష్‌తో చాట్ చేసింది తానేనంటూ ఓ అమ్మాయి గురువారం ధ్రువీకరించింది.స్మృతి తన ఆరాధ్య క్రికెటర్ అని, అలాంటి అమ్మాయికి పలాష్ నిజస్వరూపం తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశానని సదరు యువతి పేర్కొంది. అయితే, పలాష్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ చాట్స్ కూడా చాన్నాళ్ల క్రితం నాటివంటూ ట్విస్టు ఇచ్చింది.మరోవైపు.. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి ఎలాంటి స్పందన రాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్ ముచ్చల్ (Palash Mucchal) తల్లి అమిత మరోసారి మీడియా ముందుకు వచ్చారు.మానసిక వేదన వర్ణనాతీతంహిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘పెళ్లి జరగాల్సిన రోజు ఎదురైన పరిణామాలతో ఇద్దరూ తీవ్రమైన బాధలో కూరుకుపోయారు. ఇద్దరి మానసిక వేదన వర్ణనాతీతం. తన వధువు (భార్య)తో ఇంట్లో అడుగుపెట్టాలని పలాష్ కలలు కన్నాడు.తొందర్లోనే పెళ్లి!నేను కూడా కోడలికి ఘనంగా స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేసుకున్నాను. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. తొందర్లోనే పెళ్లి జరుగుతుంది’’ అని అమిత ముచ్చల్ (Amita Mucchal) పేర్కొన్నారు. అయితే, మంధాన కుటుంబం మాత్రం స్మృతి- పలాష్‌ల పెళ్లి విషయమై స్పందించలేదు.ఘనంగా వేడుకలుకాగా 2019 ప్రేమలో ఉన్న స్మృతి- పలాష్.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. స్మృతి స్వస్థలం సాంగ్లీలో నవంబరు 23న వివాహ వేడుకకు ముహూర్తం ఖరారు కాగా.. హల్దీ, సంగీత్, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.అయితే, ఊహించని రీతిలో పెళ్లికి గంటల ముందు కార్యక్రమం వాయిదా పడింది. స్మృతి తండ్రి గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. ఆ తర్వాత పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. పలాష్ స్మృతిని మోసం చేశాడని.. అతడితో గొడవ పడే క్రమంలోనే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లారు.ఆ వీడియోలు డిలీట్ చేసిన స్మృతిఈ నేపథ్యంలో పలాష్ తల్లి అమిత ముచ్చల్ స్పందిస్తూ.. స్మృతి తండ్రి అంటే తన కుమారుడికి ఎంతో ఇష్టమని.. ఆయన అనారోగ్యం పాలు కావడం తట్టుకోలేక అతడూ ఆస్పత్రి పాలయ్యాడని తెలిపారు. స్మృతి కంటే ముందు పలాషే వివాహాన్ని వాయిదా వేద్దామని చెప్పారు. తాజాగా ఆమె మరోసారి పైవిధంగా స్పందించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. స్మృతి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలన్నీ డిలీట్ చేయడం గమనార్హం.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్‌వర్త్ ఎంత? -
చాట్లను బయటపెట్టింది నేనే..
టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి ఆగిపోవడానికి తానే కారణమని ఓ యువతి అంగీకరించింది. స్మృతి మంచి కోరే ఇదంతా చేశానని, తనకు మరో ఉద్దేశం ఏదీ లేదని వెల్లడించింది. పలాష్ ముచ్చల్‌తో జరిగిన చాటింగ్ మెసేజ్ స్క్రీన్షాట్లను బయటపెట్టింది తానేనని తెలిపింది. పలాష్ ఎలాంటి వాడో తెలియాలన్న భావనతోనే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే పలాష్‌తో 4 నెలల క్రితం చాటింగ్ చేశానని, అతడి పెళ్లి ఆగిపోవడానికి వీటికి సంబంధం లేదని తెలిపింది. అందరూ అనుకుంటున్నట్టుగా తాను కొరియోగ్రాఫర్ కాదని క్లారిటీ ఇచ్చింది. తాను వెలుగులోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని అంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.''స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి ఆగిపోవడానికి కారణమైన చాట్లను పోస్ట్ చేసిన వ్యక్తి నేనే. నా గుర్తింపును నేను ఎప్పుడూ వెల్లడించాలనుకోలేదు. పలాష్‌తో నేను ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు. మా మధ్య చాట్లు మే-జూలై 2025 వరకు జరిగాయి. ఒక నెల మాత్రమే కొనసాగాయి. అతడిని నేను ఎప్పుడూ కలవలేదు. అతనితో ఎలాంటి రిలేషన్‌లోనూ లేను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్మృతి మంధానను ఆరాధిస్తాను. ప్రజలు తెలుసుకోవాలని భావించాను కాబట్టే నేను అతడి (పలాష్ ముచ్చల్) గురించి బహిర్గతం చేశాను.నేను కొరియోగ్రాఫర్‌ను కాదు. అతడు మోసం చేసిన వ్యక్తిని కూడా కాదు. పలాష్‌తో చేసిన చాట్‌ను బయటపెట్టినందుకు ఊహించని విధంగా నాపై వ్యతిరేకత రావడంతో నా సోషల్ మీడియా ఖాతాను (Social Media Account) ప్రైవేట్ మోడ్‌లో పెట్టాల్సివచ్చింది. పలాష్‌తో జరిపిన చాట్లను గమనిస్తే.. నేను తప్పు చేయలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏ మహిళకు అన్యాయం నేను చేయలేదు. దయచేసి నన్ను టార్గెట్ చేయవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను'' అంటూ వేడుకుంది.చదవండి: ఆగిన స్మృతి.. జెమీమా రోడ్రిగ్స్ సంచలన నిర్ణయంకాగా, స్మృతి, పలాష్ పెళ్లి ఆగిపోయిన నేపథ్యంలో మేరీ డికోస్టా అనే యువతి పేరుతో అనధికారిక చాటింగ్ స్క్రీన్షాట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆన్లైన్లో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. ఫలితంగా సోషల్ మీడియా ఖాతాను ప్రైవేట్ మోడ్‌లోకి మార్చేసింది. అయితే ఈ వివాదంపై స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ (Palash Muchhal) కుటుంబాలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్
సాక్షి, ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) కు సంబంధించి మరో వార్త వైరల్‌గా మారింది. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ-17) స్పెషల్ ఎడిసోడ్‌కు రాకపోవడం వార్తల్లో నిలిచింది. ఇది ఆమె అభిమానులను మరింత ఆందోళన పరుస్తోంది.భారత ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) ప్రత్యేక కార్యక్రమాన్ని, కొంతమంది మహిళా క్రికటర్లు, మరికొంతమంది అభిమానుల మధ్య చిత్రీకరించారు. కానీ స్మృతి రాకపోవడం అభిమానులను నిరాశపర్చింది. అయితే సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఆమె గైర్హాజరీ సోషల్ మీడియాలో సంచలనం రేపింది.నవంబర్ 26 బుధవారం సాయంత్రం షూట్ కోసం మంధాన తన సహచరులతో పాటు రావాల్సి ఉంది, కానీ వ్యక్తిగత కారణాలను చూపుతూ చివరి క్షణంలో వైదొలిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. మంధాన లేనప్పటికీ, ప్రపంచ కప్ విజేత జట్టు నుండి స్టార్-స్టడ్డ్ బృందం కేబీసీ షూట్లో కనిపించింది.पिता की तबीयत और शादी की उलझन के बीच, क्रिकेट स्टार Smriti Mandhana ने KBC 17 में नहीं दिखीं, स्मृति के पिता को आया था हार्ट अटैक। #SmritiMandhana #KBC #Mumbai #Viralvideo #SocialMedia #SmritiMandhanaFans #heartattack pic.twitter.com/o4VcAINz3E— Nedrick News Punjab (@NedrickP) November 27, 2025కేబీసీలో భారత మహిళా క్రికెట్ జట్టుఈ ఎపిసోడ్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బ్యాట్స్‌మన్ హర్లీన్ డియోల్, వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్, ఓపెనర్ షఫాలీ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ, ఆల్ రౌండర్ స్నేహ్ రాణా, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు. మహిళల క్రికెట్లో భారతదేశం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటైన ఈ విజయానికి గుర్తుగా దీన్ని రూపొందించారు. మంధాన వచ్చి ఉంటే అమితాబ్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షోలో మూడో సారి కనిపించినట్టు అయ్యేది. భారత మహిళా క్రికెట్ జట్టు కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) యొక్క 'ప్రత్యేక' ఎపిసోడ్లో కనిపించింది ప్రసార తేదీపై ఇంకా తెలియదు.ఇదీ చదవండి: స్మృతి పెళ్లి వివాదంలో కొత్త ట్విస్ట్ : పలాష్ మాజీ ప్రేయసి ప్రపోజల్ వైరల్‌కాగా సంగీత్, మెహందీ, హల్దీ వేడుకలు జోరుగా సాగుతున్న తరుణంలో స్మృతి-పలాష్ వివాహ వేడుకలు అకస్మాత్తుగా నిలిచిపోవడం సంచలనం రేపింది. తొలిత తండ్రి శ్రీనివాస్ మంధానకు అనారోగ్యం అని చెప్పినప్పటికి, తరువాత జరిగిన పరిణామాలు, పలాష్ ముచ్చల్ మోసం చేశాడన్న ఆరోపణలు, స్మృతి తన వివాహానికి ముందు ఉన్న అన్ని చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించడం, చాలామంది పలాష్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం లాంటి విషయాలు అనేక పుకార్లకు తెరలేపాయి. ఇదీ చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా -
ఆగిన స్మృతి పెళ్లి.. జెమీమా రోడ్రిగ్స్ సంచలన నిర్ణయం
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)ది కీలక పాత్ర. లీగ్ దశలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ ముంబైకర్ సెమీస్‌లో మాత్రం అదరగొట్టింది. పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించి ఫైనల్‌కు చేర్చింది.చాంపియన్ జట్టు ఆసీస్ విధించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే తడబడగా.. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా జట్టును ఆదుకుంది. అజేయ శతకం (134 బంతుల్లో 127)తో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇలా ఆటతోనే విమర్శకులకు సమాధానం చెప్పిన జెమీమా.. వ్యక్తిగత జీవితంలోనూ తనకు తానే సాటి అని చాటుకుంది.అక్కాచెల్లెళ్ల మాదిరిభారత జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) జెమీమాకు ప్రాణ స్నేహితురాలన్న విషయం తెలిసిందే. అక్కాచెల్లెళ్ల మాదిరి వీళ్లిద్దరు కలిసి ఉంటారు. తనకు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి కుదిరిన వెంటనే.. ఎంగేజ్మెంట్ విషయాన్ని జెమీమా సోషల్ మీడియా అకౌంట్ ద్వారానే స్మృతి వెల్లడించింది.ఆ తర్వాత స్మృతి- పలాష్ హల్దీ, సంగీత్ వేడుకల్లో జెమీమా తోటి క్రికెటర్లు అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్‌లతో కలిసి ఆడిపాడింది. కానీ అనూహ్య రీతిలో స్మృతి పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. తొలుత స్మృతి తండ్రి ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరడం.. ఆ తర్వాత పలాష్ కూడా ఆస్పత్రిపాలు కావడం.. ఆ తర్వాత అతడు వేరే అమ్మాయితో చేసినట్లుగా ఉన్న చాట్స్ లీక్ కావడం సందేహాలకు తావిచ్చాయి.ఆగిన వివాహంమరోవైపు.. స్మృతి తండ్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి మంధాన కుటుంబం స్పందించలేదు. ఈ నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కష్టకాలంలో స్మృతికి తోడుగా ఉండేందుకు మహిళల బిగ్ బాష్ టీ20 లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరమైంది.స్మృతి కోసం సంచలన నిర్ణయండబ్ల్యూబీబీఎల్లో జెమీమా ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి.. ‘‘దురదృష్టవశాత్తూ జెమీ ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉండనుంది. తను భారత్‌లోనే ఉండిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం.హోబర్ట్ జట్టు జెమీ, స్మృతి మంధాన కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటుంది. నిజానికి తాను తిరిగి రావాలనుకున్నా.. పరిస్థితుల దృష్ట్యా రాలేకపోతున్నానని జెమీ మాకు చెప్పింది. మా ప్లేయర్లతో ఆమె టచ్‌లోనే ఉంది. జట్టు గెలవాలని ఆమె కోరుకుంటోంది’’ అని ఫ్రాంఛైజీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా ఈ సీజన్లో హీట్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన జెమీమా 37 పరుగులు చేసింది. హోబర్ట్ హ్యారికేన్స్‌తో మ్యాచ్ తర్వాత స్మృతి పెళ్లి కోసం స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే, స్నేహానికి ప్రాణమిచ్చే తనకు కెరీర్ కంటే.. క్లిష్ట పరిస్థితుల్లో స్మృతి వెంట ఉండటమే సరైందనే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సీజన్లో భారత్ తరఫున డబ్ల్యూబీబీఎల్ ఆడిన ఏకైక ప్లేయర్ జెమీమా కావడం విశేషం.చదవండి: ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా! -
ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!
జాతి గర్వించదగ్గ క్రికెటర్లలో స్మృతి మంధాన (Smriti Mandhana) ఒకరు. భారత జట్టు ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా మహిళా క్రికెట్‌పై ఆమె ముద్ర ప్రత్యేకం. మహారాష్ట్రలోని సాంగ్లీ అనే చిన్న పట్టణంలో 1996, జూలై 18న జన్మించింది స్మృతి.ఆమె తల్లిదండ్రులు స్మిత మంధాన, శ్రీనివాస్ మంధాన. తండ్రి, అన్నని చూసి క్రికెటర్ కావాలన్న కోరిక చిన్న వయసులోనే స్మృతి మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే తండ్రి ప్రోత్సాహంతో ఆశయం దిశగా అడుగులు వేసింది.తొమ్మిదేళ్ల వయసులోఈ క్రమంలో తొమ్మిదేళ్ల వయసులో స్మృతి మంధాన మహారాష్ట్ర అండర్-15 జట్టుకు ఎంపికైంది. పదకొండేళ్లకు అండర్-19 టీమ్ స్థాయికి చేరుకుంది. అత్యంత పిన్న వయసులోనే అంటే.. పదహారేళ్లకే 2013లో స్మృతి భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని సంకల్పంతో ఓపెనర్‌గా రికార్డులు కొల్లగొడుతూ స్మృతి అగ్ర పథంలో దూసుకుపోతోంది. అత్యుత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా అవార్డు అందుకుంది.వరల్డ్‌కప్ చాంపియన్గాభారత జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి చేరుకున్న 29 ఏళ్ల స్మృతి.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలవడంలో తన వంతు పాత్ర పోసించి.. వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిచింది. అయితే, క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో స్మృతికి, ఆమె తల్లిదండ్రులకు అవహేళనలే ఎదురయ్యాయి.సగటు భారతీయ తండ్రిఈ విషయం గురించి స్మృతి మంధాన 2023లో కౌన్ బనేగా కరోడ్‌పతి 15 షోలో స్పందించింది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అవును సర్.. నాకు, మా అన్నయ్యకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాన్న కూడా క్రికెటర్ కావాలని అనుకున్నాడు. కానీ ఆయన కుటుంబం అందుకు అవకాశం ఇవ్వలేదు. క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన పక్కనపెట్టమని చెప్పారు.అందుకే నాన్న తన కల మా ద్వారా నెరవేరితే బాగుండని కోరుకున్నారు. సగటు భారతీయ తండ్రిగా ఆయన కోరిక అది. నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన ఈ కల కన్నారు. మా అన్నతో కలిసి నేను క్రికెట్ ఆడేదాన్ని.అన్న నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నపుడు అతడి బ్యాటింగ్ శైలిని పరిశీలించేదాన్ని. నిజానికి నేను రైటీని (కుడిచేతి వాటం). మా అన్న లెఫ్టీ. అన్నను చూసే బ్యాటింగ్ చేస్తూ లెఫ్టాండర్‌గా మారిపోయా.అందరు ఆడపిల్లల తల్లిదండ్రుల్లాగే మా వాళ్లకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. స్పోర్ట్స్ పర్సన్ జీవితం అంత సాఫీగా ఉండదని మా వాళ్లను చాలా మంది నిరుత్సాహపరిచారు. ఒక రకంగా మా వాళ్లను వేధించారు కూడా!తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు?ఎండలో ఆడితే ఆమె ముఖం కందిపోతుంది. నల్లబడుతుంది. అలాంటపుడు తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ భయపెట్టారు. అయినా సరే నా తల్లిదండ్రులు నన్ను వెనక్కి లాగలేదు. క్రికెట్ ఆడేలా ప్రోత్సహించారు’’ అని స్మృతి మంధాన గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.తన, తండ్రి ఆశయానికి తగ్గట్టుగా క్రికెటర్‌గా ఎదిగిన స్మృతి.. అత్యుత్తమ వన్డే మహిళా క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పటి వరకు భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 629, 117 వన్డేల్లో 5322, 153 టీ20లలో 3982 పరుగులు సాధించింది. అండర్-19 స్థాయిలో లిస్ట్-ఎ మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్ స్మృతి.ఉన్నత శిఖరాలకుఇక మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న స్మృతి.. వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.మనసిచ్చిన ప్రియుడు పలాష్ ముచ్చల్‌తో ఏడడుగులు వేసే క్రమంలో హల్దీ, సంగీత్ వేడుకల్లో ఆడిపాడింది. కానీ ఆఖరి నిమిషంలో తండ్రి అస్వస్థతకు గురికావడంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పలాష్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. చంచల మనసు గల అతడు స్మృతిని మోసం చేశాడని.. అది తెలిసే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందనే వదంతులు వస్తున్నాయి.ఊహించని విధంగా.. ఇప్పుడిలాఏదేమైనా క్రికెటర్ అయితే.. పెళ్లి కాదంటూ స్మృతిని వెక్కిరించిన వాళ్లకు ఆటతోనే ఆమె సమాధానం ఇచ్చింది. దేశాన్ని గర్వపడేలా చేసి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇలా ఊహించని చేదు అనుభవాన్ని చవిచూసింది. అంతా సజావుగా సాగి స్మృతి వివాహ బంధంలో అడుగుపెడితే చూడాలని ఆమె సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్‌వర్త్ ఎంత? -
స్మృతి వర్సెస్ పలాష్: ఎవరి నెట్‌వర్త్ ఎంత?
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి అనూహ్య పరిస్థితుల్లో వాయిదా పడింది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన తరుణంలో అకస్మాత్తుగా స్మృతి తండ్రి ఆరోగ్యం చెడిపోయింది. ఈ నేపథ్యంలో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి తన మేనేజర్‌తో మీడియాకు చెప్పించింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనేక సందేహాలకు తావిచ్చాయి. స్మృతి తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రిలో చేరిన తర్వాత పలాష్ కూడా ఆస్పత్రి పాలు కావడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత పలాష్ పేరిట ఓ అకౌంట్ నుంచి మేరీ డికోస్టా అనే అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్‌లు వెళ్లాయనేలా స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి.మోసం చేశాడా?అందులో స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా మాట్లాడిన పలాష్.. డికోస్టాతో డేటింగ్ చేయడానికి ఉవ్విళ్లూరినట్లుగా అనిపించింది. అంతేకాదు.. స్మృతితో తనకు ‘లాంగ్ డిస్టేన్స్’ ఉందంటూ పలాష్.. సదరు అమ్మాయిని తనతో ఎంజాయ్ చేయాలని కోరినట్లుగా ఉన్న మెసేజ్‌లు వైరల్‌గా మారాయి.ఈ నేపథ్యంలో పలాష్ తన మాజీ ప్రేయసి బిర్వా షాకు ప్రపోజ్ చేసిన పాత రొమాంటిక్ వీడియోలు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్.. స్మృతిని మోసం చేశాడని.. ఇది గుర్తించిన ఆమె తండ్రి అతడితో గొడవ పడే క్రమంలోనే అస్వస్థతకు గురయ్యాడనే వదంతులు వ్యాపించాయి. అయితే, సోషల్ మీడియాలో స్మృతి- పలాష్ గురించి ఇంత రచ్చ జరుగుతున్నా ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందనా లేదు.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. అయినాఅంతేకాదు.. తాజా సమాచారం ప్రకారం స్మృతి తండ్రి సాంగ్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయినప్పటికీ పెళ్లి గురించి మంధాన కుటుంబం గురించి ఎటువంటి స్పందన రాకపోవడం అనుమానాలు బలపడేలా చేసింది. ఇద్దరిలో ఎవరు ధనవంతులు?ఈ నేపథ్యంలో పలాష్.. అందం, కీర్తి ప్రతిష్టలు, డబ్బు ఉన్న స్మృతిని ప్రేమ అనే మత్తులో ఉంచి ద్రోహానికి పాల్పడ్డాడంటూ అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి నెట్‌వర్త్ ఎంత?.. ఇద్దరిలో ఎవరు ధనవంతులు? అన్న చర్చ నడుస్తోంది.టాప్ క్రికెట్ స్టార్ స్మృతిభారత మహిళా జట్టు వైస్ కెప్టెన్‌గా, మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తొలి టైటిల్ అందించిన సారథిగా మంధానకు పేరుంది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలవడంలోనూ ఆమెది కీలక పాత్ర. వెరసి స్మృతి బ్రాండ్ వాల్యూ మునుపటి కంటే భారీ స్థాయిలో పెరిగింది.భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాంట్రాక్టులో ద్వారా ఆమెకు ఏటా రూ. 50 లక్షల వేతనం వస్తుంది. అదే విధంగా ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అదనంగా లభిస్తాయి.ఆమె నికర ఆస్తుల విలువ ఎంతంటే?ఇందుకు తోడు ఆర్సీబీ ప్రధాన ప్లేయర్‌గా, కెప్టెన్‌గా స్మృతికి రూ. 3.4 కోట్లు దక్కుతాయి. మహిళా క్రికెటర్లలో ఈ మేరకు అత్యధిక ధరకు ఒప్పందం కుదుర్చుకున్న అమ్మాయి మంధాననే. వీటితో పాటు బ్రాండ్ ప్రమోషన్స్, ప్రచారం ద్వారా కూడా స్మృతి రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో 2025 నాటికి స్మృతి మంధాన నికర ఆస్తుల విలువ రూ. 32- 34 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా అంచనా. పలాష్ నెట్‌వర్త్ ఎంత?ఇక పలాష్ విషయానికొస్తే.. మ్యూజిక్ కంపోజర్‌గా, ఆల్బమ్స్ రూపకర్తగా అతడికి ఆదాయం వస్తోంది. అంతేకాదు.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలాష్ అదనపు ఆదాయం గడిస్తున్నాడు. వీటితో పాటు లైవ్ షోలు, రాయల్టీల ద్వారా పలాష్‌కు భారీ మొత్తమే అందుతోంది. వెరసి 2025 నాటికి అతడి నెట్‌వర్త్ రూ. 20- 41 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా 2019 నుంచి స్మృతి- పలాష్ రిలేషన్లో ఉండగా.. గతేడాది తమ ప్రేమను ధ్రువీకరించారు. ఈ జంట నవంబరు 23న పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా అంతా గందరగోళంగా మారిపోయింది.చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి -
స్మృతి మందాన పెళ్లి రద్దు? వేరే అమ్మాయితో పలాస్ డేటింగ్!
-
స్మృతి పెళ్లి వివాదం : పలాష్ మాజీ ప్రేయసి ప్రపోజల్ వైరల్
టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతిమంధాన పెళ్లి చేసుకోవాలనుకున్న సంగీత దర్శకుడు , చిత్రనిర్మాత పలాష్ ముచ్చల్‌కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. పలాష్ స్మృతిని మోసం చేసిన కారణంగానే పెళ్లి ఆగిపోయిందనే పుకార్లుబాగా వినిపిస్తున్నాయి. ఈ పుకారపై గురించి ప్రస్తుతానికి ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ పలాష్ మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫోటో, బిర్వా షాకి ప్రపోజ్ చేసిన వడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017 నాటి పోస్ట్‌లో మోకాళ్లపై వంగి అత్యంత రొమాంటిక్ వాతావరణంలో పలాష్ ఆమెకు ప్రపోజ్ చేస్తూ ఉన్నట్లు మనం చూడవచ్చు.Palash Muchhal and his ex Birva Shah👀 pic.twitter.com/0nVRaia3CQ https://t.co/T8kNaz2REU— Mention Cricket (@MentionCricket) November 25, 2025 స్మృతిమంధానకు సోషల్ మీడియాలో సపోర్ట్మరికొన్ని గంటల్లో తనను ప్రేమించిన వాడితో ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతిమంధాన వివాహం రద్దు కావడంతో అటు అభిమానులు, ఇటు సామాన్యం జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. పలాష్ ముచ్చల్ దారుణంగా ఆమెను మోసం చేశాడంటూ సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. మరోవైపు ధైర్యంగా ఉండు, స్మృతి.. మంచే జరిగింది. ఆ మోసగాడి గురించి ముందే తెలిసింది అంటూ ఎక్స్ ద్వారా ఆమెకు మద్దతుగా నిలిచారు. దీనికి సంబందించి మెన్షన్ క్రికెట్ అనే ట్విటర్ హ్యాండిల్లో అనేక పోస్టులు, వీడియోలు వైరల్‌గా మారాయి. పుకార్లు నిజమే, పలాష్ నిజానికి స్మృతిని మోసం చేశాడన్న పోస్ట్‌కు భారీ స్పందన లభిస్తోంది.ఇదీ చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా >In 2019, Palash broke with his fiance. >Started dating to Smriti Mandhana,>Relationship with her for 6 years,>Got the fame,>Decided to marry for money,>Cheated on her just before wedding night.I wonder what smriti saw in him. pic.twitter.com/KCkTsk0x3v— `S.🚀 (@ThodaSaSanskari) November 25, 2025పాపం పాలక్మరోవైపు పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ పట్ల సానుభూతి వ్యక్తమౌతోంది. ఈ పుకార్లు నిజమైతే సొంత సోదరుడి వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందంటూ మరికొంతమంది కామెంట్స్ చేశారు. ఇండియాలో ఉత్తమ మహిళా నేపథ్య గాయకులలో ఒకరామె. పైగా పేద పిల్లల గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చడానికి ఒక NGOను నడుతున్న మంచిమనసున్న అద్భుతమైన వ్యక్తి అంటూ పేర్కొనడం విశేషం.See this 👀👇🏻https://t.co/H5kpT5LcaV— Mention Cricket (@MentionCricket) November 25, 2025 -
స్మృతిని మోసం చేసిన పలాష్?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి...
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana)కు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ (Palash Mucchal)పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. అతడు స్మృతిని మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు వచ్చాయి. పెళ్లికి ముందు రాత్రే స్మృతికి ఈ విషయం తెలిసిందని.. వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయడానికి ఇదే కారణమనే వదంతులు వ్యాపిస్తున్నాయి.ఇండోర్ కోడలు కాబోతోంది అంటూకాగా మహారాష్ట్రకు చెందిన స్మృతి మంధాన.. ఇండోర్ మూలాలున్న పలాష్ ముచ్చల్‌తో 2019 నుంచి డేటింగ్లో ఉంది. కొన్నాళ్ల క్రితం వీరిద్దరు తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు. స్మృతి భారత క్రికెట్ జట్టు ఓపెనర్, వైస్ కెప్టెన్‌గా రాణిస్తుండగా.. పలాష్ బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఇదిలా ఉంటే.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్మృతి పెళ్లి వార్త తెరమీదకు వచ్చింది. పలాష్ సైతం.. ‘త్వరలోనే స్మృతి ఇండోర్ కోడలు కాబోతోంది’ అంటూ సంకేతాలు ఇచ్చాడు. ఇక ఇటీవల స్నేహితులతో కలిసి నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. తనకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని స్మృతి ధ్రువీకరించింది.తండ్రికి గుండెపోటు!ఆ తర్వాత పలాష్.. స్మృతి వరల్డ్‌కప్ గెలిచిన డీవై పాటిల్ స్టేడియంలోనే ఆమెకు ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేశాడు. అనంతరం హల్దీ, సంగీత్ వేడుకల్లో జంటగా సందడి చేశారు. నవంబరు 23న వివాహానికి కొన్ని గంటల ముందు వీరి పెళ్లి వాయిదా పడిందనే వార్త బయటకు వచ్చింది.తండ్రికి గుండెపోటు వచ్చిన కారణంగా ఆస్పత్రిలో చేరడంతో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి చెప్పినట్లు ఆమె మేనేజర్ వెల్లడించాడు. ఆ తర్వాత అనూహ్యంగా పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు సంచలన విషయాలు తెరమీదకు తెచ్చారు.‘బంధం’ పాతబడిందని..కొరిగ్రాఫర్ అని చెప్పుకొనే మేరీ డికోస్టా పేరుతో.. పలాష్ తనతో చాట్ చేసినట్లుగా స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. ఇందులో పలాష్.. స్మృతి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనతో ‘బంధం’ పాతబడిందని.. మేరీని తనతో డేటింగ్‌కు రావాల్సిందిగా, ఎంజాయ్ చేద్దామంటూ ‘పర్సనల్’ చాట్ చేసినట్లు వైరల్ అవుతోంది.నిజమేనా?ఈ విషయాన్ని గుర్తించిన స్మృతి తండ్రి.. పలాష్‌ను నిలదీయడంతో గొడవకు దారి తీసిందని.. అప్పుడే ఆయనకు గుండెపోటు వచ్చిందని గాసిప్‌రాయుళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేసినప్పటికీ.. పలాష్‌తో గతంలో దిగిన ఫొటోలన్నీ స్మృతి అలాగే ఉంచింది. ఈ నేపథ్యంలో స్మృతి- పలాష్ బంధం గిట్టని వాళ్లే ఇలా చేస్తున్నారని.. స్మృతి తండ్రి కోలుకోగానే.. వీరి పెళ్లి జరుగుతుందంటూ అభిమానులు అండగా నిలుస్తున్నారు.అయితే, నెట్టింట ఇంత రచ్చ జరుగుతున్నా ఇరు కుటుంబాల నుంచి నేరుగా ఎటువంటి స్పందనా రాలేదు. పలాష్ అక్క, బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ మాత్రం.. ‘‘స్మృతి తండ్రి అనారోగ్యం వల్లే పెళ్లిని ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ సమయంలో మా గోప్యతకు భంగం కలిగించకండి’’ అని ఇన్‌స్టా వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి -
స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా
Smriti Mandhana-Palash Muchhal wedding controversy మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలతో సందడి సందడిగా ఉన్న పెళ్లి మండపం ఒక్కసారిగా స్థంభించిపోయింది. పెళ్లి కుమార్తె తండ్రికి గుండెపోటు అంటూ పెళ్లి వేడుకలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఆ తరువాత వరుడు కూడా ఆసుపత్రిలో చేరినట్లు కూడా వెల్లడైంది. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. అవును.. టీమిండియా మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి వాయిదా గురించే. తన జీవితంలో బిగ్ డే కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తోంది స్మృతి. సన్నిహితులు, క్రికెట్ సహచరులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నవంబరు 23న మహారాష్ట్రలోని సాంగ్లిలో పలాష్ ముచ్చల్‌తో ఆమె పెళ్లి వేడుక ముగియాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడమే పెద్ద చర్చగా మారింది. ఆమె వెళ్లి వాయిదాతో నెటిజన్లు షాక్ అయ్యారు. దీనికి తోడు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో ఇండియా భారీ విజయానికి దోహదపడిన క్రికెటర్ స్మృతి, పలాష్ ముచ్చల్(Palash Muchhal)తో ఉన్న తన ఫోటోలన్నింటినీ సోషల్ మీడియా నుండి తొలగించడం నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. అది పాత కథ.. నీతో పిల్లల్ని కంటా.. తొలుత స్మృతి తండ్రి అనారోగ్యమే ఇందుకు కారణమని అందరూ భావించినా, క్రమంగా పలాష్ ముచ్చల్ కొరియాగ్రాఫర్తో డర్టీ మెసేజెస్ వెలుగులోకి వచ్చాయి. వీటిని స్వరయంగా మేరీ డి'కోస్టా షేర్ చేసింది. తనతో పలాష్ ముచ్చల్‌తో చాట్ల యొక్క అనేక స్క్రీన్షాట్లను పంచుకుంది. ఈ స్క్రీన్షాట్లు నిజమైనవో కాదో ఇంకా నిర్ధారణ కానప్పటికీ, పలాష్ పేరు, ఐడీ ఉన్నాయి గమనార్హం. ఈ చాట్ ప్రకారం తనను కలమని మేరీని అడిగాడు. మరి స్మృతి రిలేషన్ గురించి ఆమె ప్రశ్నించగా, అదొక పాత బంధం అని తేలిగ్గా కొట్టి పారేశాడు. పదే పదే స్మృతి ‘డెడ్’ అని సంబోధించడం, ఆమెను కలవని ఒత్తిడి చేయడం ఈ చాట్‌లో చూడవచ్చు. ఈమె వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్ అని తెలుస్తోంది. పలాష్ - స్మృతి వివాహానికి కొరియోగ్రఫీకి ఒప్పుకుందట.దీంతోపాటు రెడ్డిట్‌లో, పలాష్ ఒక అమ్మాయికి దగ్గరగా కనిపించాడని చాలా మంది యూజర్స్ పేర్కొన్నారు. వివాహానికి ముందు జరిగిన కార్యక్రమంలో జరిగిన ద్రోహాన్ని తొలుత స్మృతి తండ్రే గుర్తించారట. దీంతో ఇద్దరి మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ కారణంగానే, అతనికి గుండెపోటు వచ్చిందనేది ప్రముఖంగా వినిపిస్తోంది.అయితే ఈ పుకార్లపై ఇరు వర్గాలు అధికారికంగా దృవీకరించనూలేదు, ఖండించనూ లేదు. అయితే పలాష్ స్మృతిని మోసం చేశాడనే ధృవీకరించని ఊహాగానాల మధ్య పలాష్ ముచ్చల్‌తో ఉన్న తన ఫోటోలన్నింటినీ తన సోషల్ మీడియా నుండి తొలగించడం ఈ అనుమానాలకు మరింత బలం పెరిగింది. పలాష్ ముచ్చల్ స్మృతి మంధానస్మృతి - పలాష్ తమ పరస్పర స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారి 2019నుంచీ డేటింగ్ ప్రారంభించారు. క్రికెట్, సంగీతంపై వారి ఉమ్మడి ఆసక్తి వీరి మనసులు కలిసేలా చేసింది. 2024లో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించగా, పలాష్ తన చేతికి స్మృతి జెర్సీ నంబర్ 'SM18' టాటూ వేయించుకున్నాడు. మరి అంత ప్రేమ కురిపించిన పలాష్, తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్మృతిని ఇంత దారుణంగా మెసం చేస్తాడా? మేరీ కాకుండా ఇంకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ప్రస్తుతం కోట్లాది మంది స్మృతి అభిమానుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు. ఈ ఊహాగానాలకు తెరపడాలంటే అధికారిక వివరణ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే.చదవండి : వామ్మో..తృటిలో తప్పించుకున్నాడు, లేదంటే! -
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం ఊహించని పరిణామంతో వాయిదా పడింది. ప్రియుడు, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన వేళ.. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యం పాలయ్యారు. గుండెపోటు లక్షణాలతో సాంగ్లీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.స్మృతి- పలాష్ పెళ్లి నిరవధికంగా వాయిదాఈ నేపథ్యంలో తండ్రి చూడని వేడుక తనకు వద్దంటూ స్మృతి.. పలాష్‌తో పెళ్లిని వాయిదా వేసుకుందని ఆమె మేనేజర్ మీడియాకు చెప్పారు. ఓవైపు తండ్రి విషయంలో స్మృతి ఆందోళన చెందుతుండగా.. మరోవైపు.. ఆమెకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రిపాలయ్యాడు. వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్ ఆస్పత్రిలో చేరాడు.వరుస మ్యూజిక్ కన్సర్టులు, పెళ్లి పనుల కారణంగానే పలాష్ ముచ్చల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని.. అందుకే అతడి ఆరోగ్యం చెడిపోయిందని ఎన్డీటీవీకి అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, స్మృతి- పలాష్ పెళ్లి నిరవధికంగా వాయిదా పడటంపై సోషల్ మీడియాలో ఊహించని విధంగా వదంతులు పుట్టుకువచ్చాయి. ఇరు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందా అనేలా గాసిప్‌రాయుళ్లు పుకార్లు పుట్టిస్తున్నారు.స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడుఈ నేపథ్యంలో పలాష్ ముచ్చల్ తల్లి అమిత.. ట్రోల్స్‌కు దిమ్మతిగిరేలా కౌంటర్ ఇచ్చారు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘స్మృతి తండ్రి అంటే పలాష్‌కు ఎంతో ఇష్టం. స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరే పలాష్‌కు సాన్నిహిత్యం ఎక్కువ.ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే.. స్మృతి కంటే ముందు పలాష్ స్పందించాడు. తనే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. స్మృతి తండ్రి కోలుకునేంత వరకు వివాహ వేడుకను వాయిదా వేయాలని చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడిహల్దీ తర్వాత పలాష్‌ను బయటకు ఎక్కడికీ పంపలేదు. స్మృతి తండ్రికి ఛాతీ నొప్పి వచ్చిందని తెలియగానే పలాష్ చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అతడి ఆరోగ్యం కూడా పాడైంది. ఆస్పత్రిలోనే నాలుగు గంటల సేపు ఉంచారు. ఐవీ డ్రిప్ పెట్టారు. ఈసీజీ తీశారు. ఇతరత్రా పరీక్షలు కూడా చేశారు. అన్ని రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయి.అయితే, ఇప్పటికీ ఒత్తిడి నుంచి బయటపడలేకపోతున్నాడు’’ అని పలాష్ ముచ్చల్ తల్లి అమితా ముచ్చల్ తెలిపారు. కాగా పలాష్ అక్క, బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా తన సోదరుడి వివాహం గురించి స్పందించారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లి వాయిదా పడిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు. చదవండి: పీవీ సింధు ఫిట్‌నెస్‌పై సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు -
పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేసిన మంధాన
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పేరు గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. వన్డే ప్రపంచకప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో బ్యాటర్‌గా, వైస్ కెప్టెన్‌గా తన వంతు పాత్ర పోషించిన ఈ మహారాష్ట్ర అమ్మాయి.. ఆ వెనువెంటనే మరో శుభవార్త పంచుకుంది.నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ..తన చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే స్మృతి మంధాన ధ్రువీకరించింది. నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. సహచర ఆటగాళ్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యదవ్‌లతో కలిసి తన ఎంగేజ్మెంట్ విషయాన్ని రీల్ ద్వారా రివీల్ చేసింది.అనంతరం పలాష్.. భారత్ విశ్వవిజేతగా నిలిచిన డీవై పాటిల్ స్టేడియంలో మోకాళ్లపై కూర్చుని స్మృతికి ప్రపోజ్ చేశాడు. ఈ రెండు వీడియోలను తన సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసి మురిసిపోయింది మంధాన. అయితే, ప్రస్తుతం వాటిని స్మృతి మంధాన తన అకౌంట్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో..కాగా స్మృతి- పలాష్ పెళ్లి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ జంట ఉత్సాహంగా గడిపింది. అయితే, ఆదివారం వీరి వివాహం జరగడానికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు లక్షణాలు ఉండటంతో వైద్యులు ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు.ఆ వీడియోలన్నీ డిలీట్ చేసిన మంధానఆ వెంటనే పలాష్ ముచ్చల్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో ఆస్పత్రిలో చేరాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తన ప్రీవెడ్డింగ్ మూమెంట్స్‌ను స్మృతి మంధాన సోషల్ మీడియా నుంచి తీసివేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మంధాన తండ్రి ఇంకా ఆస్పత్రిలోనే ఉండగా.. పలాష్ మాత్రం డిశ్చార్జ్ అయ్యాడు.కాగా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత స్మృతి మళ్లీ తన ఎంగేజ్మెంట్ రివీల్, ప్రపోజల్ వీడియోలు షేర్ చేస్తుందని అభిమానులు అంటున్నారు. తండ్రి ఆరోగ్యం దృష్ట్యానే వాటిని తాత్కాలికంగా హైడ్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. స్మృతి- పలాష్ లాంటి చూడచక్కని జంటకు ఎవరి దిష్టి తగలవద్దని.. త్వరలోనే వారు పెళ్లి పీటలు ఎక్కాలని ఆకాంక్షిస్తున్నారు.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
ఆ లక్షణాలు గుండెపోటుకి సంకేతమా..? యాంజియోప్లాస్టీ ఎందుకు?
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రికి అస్వస్థతగా ఉండటంతో ఉన్నపళంగా పెళ్లిని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వైద్యులు ఆమె తండ్రి శ్రీనివాస్ మంధానాకు గుండెపోటుని పోలిన లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఎడమ వైపు ఛాతీ నొప్పి, రక్త పోటుపెరగడం వంటివి గుండెపోటుకి సంకేతమని, తక్షణమే యాంజియోగ్రఫీ అవసరమని వైద్యులు భావిస్తున్నారు. అసలు ఇలా ఆకస్మికంగా ఈ లక్షణాలు ఎలా వస్తాయి, ఎందువల్ల ఇలా జరుగుతుంది, యాంజియోగ్రఫీ అంటే..వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకు ఎడమవైపు ఛాతినొప్పి వచ్చిన తర్వాత ఉదయం 11.30 గంటల ప్రాంతంలో గుండెపోటు లక్షణాలు కనిపించాయి. వెంటనే కుటుంబసభ్యులు సాంగ్లిలోని సరవిత్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ శ్రీనివాస్‌కి కార్డియాక్ ఎంజైమ్‌లు కొద్దిగా పెరిగినప్పటికీ పూర్తి వైద్య బృందం పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొన్నారు వైద్యులు. ఆయనకు రక్తపోటు పెరుగుతోందని, అందువల్ల నిరంతన ఈసీజీ పర్యవేక్షణ తోపాటు యాంజియోగ్రపీ కూడా అవసరం అవ్వొచ్చని చెప్పారు. ఇది శారీరక లేదా మానసిక ఒత్తిడి వల్ల కావొచ్చని అన్నారు. అందులోనే వివాహం అనగానే ఒకవిధమైన ఆందోళన సహజంగా ఉంటుంది కాబట్టి అది కూడా ఓ కారణం కావోచ్చని అన్నారు.అధిక రక్తపోటు అంటే..ధమని గోడలపై రక్తం నెట్టడం వల్ల కలిగే శక్తి స్థిరంగా చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి. దీనిని 130/80 mm Hg లేదా అంతకంటే ఎక్కువ స్థిరంగా చూపించడంగా పేర్కొనవచ్చు. ఈ పరిస్థితి వల్ల గుండె రక్తాన్ని పంప్ చేసేందుకు కష్టపడాల్సి వస్తుంటుంది. తగిన సమయంలో చికిత్స అందించకపోతే గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా అధిక రక్తపోటుకు ఎలాంటి లక్షణాలు ఉండవట. అందువల్లే చాలామంది వ్యక్తులు ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ఏళ్ల తరబడి దాంతో గడిపేస్తుంటారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. 46 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలకు తమకు అధిక రక్తపోటు ఉందని కూడా తెలియదని చెబుతున్నారు నిపుణులు. బీపీ ఎక్కువగా ఉంటే ఈ లక్షణాలు తప్పనిసరి..మానసిక పనితీరులో మార్పులుఛాతీ నొప్పిమైకముశరీరంలో ఎడెమా లేదా వాపుగుండె దడసాధారణం కంటే తక్కువ మూత్ర విసర్జనమూర్ఛలుతీవ్రమైన తలనొప్పిఆకస్మికంగా ముఖం వంగిపోవడం, అస్పష్టమైన ప్రసంగం లేదా చేయి లేదా కాలులో స్ట్రోక్ సంకేతాలుకంటి నొప్పి, దృష్టి కోల్పోవడం లేదా ఆకస్మిక అస్పష్టమైన దృష్టి లోపంకారణాలు..అందరికీ అధిక రక్తపోటుకు ఇందువల్లే రాగలదని ఒకే కారణాన్ని చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. దీనికి అనేక రకాల అంశాలు కారణమవుతాయని, వాటివల్లే ఈ పరిస్థితికి దారితీస్తుందని చెబుతున్నారు. వాటిలో కొన్ని:55 ఏళ్లు పైబడిన వారుకుటుంబంలో చరిత్రలో ఎవరికైన ఈ పరిస్థితి ఉంటేధూమపానం లేదా పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడంఅధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండటంసోడియం అధికంగా ఉన్న ఆహారాన్ని తినడంతగినంత శారీరక శ్రమ లేకపోవడం.అధికంగా మద్యం సేవించడంచాలా సందర్భాలలో అధిక రక్తపోటుకు ఎందువల్ల వచ్చిందనేది గుర్తించగలరట. ఇందులో అంతర్లీన పరిస్థితి, మందులు లేదా పదార్ధం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, మూత్రపిండ ధమని స్టెనోసిస్, ప్రాథమిక ఆల్డోస్టెరోనిజం, థైరాయిడ్ వ్యాధి వంటి వాటి వల్ల కూడా కావొచ్చట.యాంజియోప్లాస్టీ ఎందుకు చేస్తారు?ఇరుకైన లేదా మూసుకుపోయిన ధమనిలో రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి వైద్యులు యాంజియోప్లాస్టీ చేస్తారు. ముఖ్యంగా గుండెపోటు సమయంలో లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధి (కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ధమనులు ఇరుకుగా మారడం) వల్ల వచ్చే తీవ్రమైన ఛాతీ నొప్పి (ఆంజినా) వంటి పరిస్థితులలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ధమనిని తెరిచి, గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరిస్తారు. దీన్ని మెడ, కాళ్ళు లేదా మూత్రపిండాలు వంటి శరీరంలోని ఇతర భాగాలలోని ధమనులపై కూడా ఆయా ప్రాంతాలలో అడ్డంకులను చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. అంతేగాదు హృదయ ధమనిలో అకస్మాత్తుగా అడ్డంకులు ఏర్పడటం వల్ల కూడా గుండెపోటు రావచ్చు. కాబట్టి, ధమనిని త్వరగా తెరవడానికి, రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి, గుండె కండరాలకు నష్టం జరగకుండా నిరోధించడానికి యాంజియోప్లాస్టీని అత్యవసర ప్రక్రియగా చేస్తారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Farah Khan: వెయిట్ లాస్ జర్నీ కోసం ఫరా ఖాన్ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..) -
ఆస్పత్రి పాలైన పలాష్ ముచ్చల్!.. స్మృతి తండ్రి హెల్త్ అప్డేట్ ఇదే!
ఆనందోత్సవాల నడుమ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పలాష్ ముచ్చల్‌తో కలిసి స్మృతి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైన వేళ... ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన ఉన్నపళంగా అస్వస్థతకు గురయ్యారు.తప్పనిసరి పరిస్థితుల్లో..ఊహించని ఈ పరిణామంతో స్మృతి- పలాష్ పెళ్లితంతును నిరవధికంగా వాయిదా (Smriti Mandhana- Palash Muchhal Wedding Postponed) వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ‘ఆదివారం ఉదయం శ్రీనివాస్ అల్పాహారం తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ పెళ్లి సమయం కల్లా కోలుకుంటారనే ఇరు కుటుంబసభ్యులు ఎదురుచూశారు.నాన్న చూడని వేడుక నాకొద్దుకానీ ఆశించినట్లుగా ఆరోగ్యం ఏమాత్రం మెరుగవలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది’ అని స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా వెల్లడించారు. నాన్న గారాల పట్టి స్మృతి. అందుకే నాన్న చూడని తన కల్యాణ వేడుక నాకొద్దని స్మృతి కరాకండీగా చెప్పినట్లు తెలిసింది. తన తండ్రి ఆరోగ్యంగా తిరిగొచ్చాకే వివాహ వేడుక ఉంటుందని స్పష్టం చేసింది.ఆస్పత్రి పాలైన పలాష్ ముచ్చల్!కాగా ముందే నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం ఆదివారం స్మృతి, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం జరగాల్సింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తండ్రి అనారోగ్యం కారణంగా ఆందోళనలో మునిగిపోయిన స్మృతి మంధానకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. స్మృతికి కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రి పాలైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఎన్డీటీవీ అందించిన వివరాల ప్రకారం.. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా పలాష్ ముచ్చల్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఎసిడిటీ ఎక్కువ కావడంతో అతడు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, పలాష్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. మెరుగైన చికిత్స కోసం మాత్రమే అతడు ఆస్పత్రికి వెళ్లాడని సమాచారం.స్మృతి తండ్రి హెల్త్ అప్డేట్ ఇదే!ఇక స్మృతి తండ్రి శ్రీనివాస్‌ను పరీక్షించిన వైద్యుడు డాక్టర్ నమన్ షా పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో శ్రీనివాస్ మంధాన ఛాతీలో ఎడమవైపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన కుమారుడు నాకు కాల్ చేసి పరిస్థితి గురించి చెప్పగానే అంబులెన్స్ పంపించాము.వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చి.. చికిత్స మొదలుపెట్టాము. కార్డియాక్ ఎంజైమ్స్ పెరిగిపోయాయి. బీపీ కూడా ఎక్కువగా ఉంది. పరిస్థితిని బట్టి ఆంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. స్మృతి, ఆమె కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు మాతో కాంటాక్టులో ఉండి.. అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు’’ అని తెలిపారు. వారం రోజులుగా వేడుకలుకాగా స్మృతి స్వస్థలం సాంగ్లీలో వారం రోజులుగా ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. భారత జట్టు క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ తదితరులు హల్దీ, సంగీత్ వేడుకలో ఉత్సాహంతో పాల్గొన్నారు. వధూవరులు స్మృతి- పలాష్ కూడా డాన్సులతో వేదికను హోరెత్తించారు. ఇక మూడు ముళ్లు పడటమే తరువాయి అనే తరుణంలో ఇలా స్మృతి తండ్రి అనారోగ్యం పాలుకావడంతో వాతావరణమంతా ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని.. స్మృతి- పలాష్‌ల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగిపోవాలని స్మృతి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. భారత బ్యాటర్లు అట్టర్ ప్లాప్ -
మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా
-
స్మృతి మంధాన తండ్రికి హార్ట్ ఎటాక్
ఇంకా పెళ్లి పీటలు ఎక్కడానికి కొన్ని గంటల ముందే భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఆ తతాంగాన్ని వాయిదా వేసుకుంది. స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ అస్వస్థతగా కనిపించారు. అయితే మహారాష్ట్రలోని సంగ్లీలో పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైన వేళ.. మంధాన తండ్రి శ్రీనివాసన్ గుండె పోటుకు గురైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా సైతం ధ్రువీకరించాడు. "ఈ పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంంధాన తెల్చి చెప్పేసింది.తన తండ్రి పూర్తిగా కోలుకునే వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి నిర్ణయించుకుందని" తుహిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్ సంగ్లీ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా మంధాన వివాహం సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆదివారం(నవంబర్ 23) జరగాల్సి ఉంది. గత రెండు రోజులగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. హాల్డీ, మెహందీ, సంగీత్ కార్యకమాల్లో స్మృతితో పాటు సహచర భారత క్రికెటర్లు సందడి చేశారు. కానీ అంతలోనే ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. -
మంధాన పెళ్లి షురూ.. సంగీత్‌లో వరల్డ్ కప్ స్టార్స్ డాన్స్ (ఫోటోలు)
-
డ్యాన్స్‌తో అదరగొట్టిన స్మృతి మంధాన
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమైంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం ఆదివారం(నవంబర్ 23) ఇండోర్‌లో జరగనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్‌లో మంధాన-ముచ్చల్ జంట డ్యాన్స్‌తో అదరగొట్టారు.తొలుత పలాష్ మెడలో స్మృతి దండ వేయగా.. అతడు స్టార్ ఓపెనింగ్ బ్యాటర్‌కు వినయంగా వంగి నమస్కరించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి 'తేను లేకే మైన్ జావంగా' వంటి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా ఈ కార్యక్రమానికి స్మృతి సహచర క్రికెటర్లు హాజరై సందడి చేశారు. జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తమ డ్యాన్స్‌లతో దుమ్ములేపారు. వారి వివాహ వేడుకల్లో భాగంగా, 'టీమ్ బ్రైడ్' (వధువు జట్టు), 'టీమ్ గ్రూమ్' (వరుడి జట్టు) మధ్య ఒక సరదా క్రికెట్ మ్యాచ్ కూడా జరిగింది. స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించిన 'టీమ్ బ్రైడ్' ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. అంతకుముందు శుక్రవారం జరిగిన స్మృతి హల్దీ వేడుకలో భారత మహిళా క్రికెటర్లు తమ ఆటపాటలతో అలరించారు. కాగా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న స్మృతి-పలాశ్ జంట.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే పలాశ్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతికి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశారు. అనంతరం తన ఎంగేజ్మెంట్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్మృతి అభిమానులతో పంచుకుంది.చదవండి: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. అధికారిక ప్రకటనoh my god smriti's girl gang performed for her 🥹💕 pic.twitter.com/1MzVGpycCD— IWCT WORLD CHAMPIONS🎊 (@mandyyc0re) November 22, 2025 Smriti Mandhana and Palash muchhal dancing together ❤️ pic.twitter.com/cIFvv3WkCl— JosD92 (@JosD92official) November 22, 2025 -
స్మృతి WEDS పలాశ్
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ తొలిసారి విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మనసిచ్చిన వాడితో రేపు మనువాడబోతోంది. ఇన్నేళ్లుగా ఒకలా రేపటి రోజు ఒకలా స్మృతి కనిపించబోతోంది. జట్టు జెర్సీతో మైదానంలో ప్యాడ్లు, గ్లౌజ్‌లు, క్యాప్‌తో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చే ఆమె... రేపు మాత్రం అరుదైన డిజైనర్ లెహెంగా, నుదుటన పాపిట బిళ్ల, బుగ్గన చుక్క, మోచేతుల దాకా గాజులు, అరచేతి నిండా పండిన గోరింటాకు, కాళ్లకు పారాణితో వధువులా ముస్తాబై కమనీయ కళ్యాణ వేదికకు రానుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సంగీత దర్శకుడు, డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో స్మృతి కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. వీరిద్దరు త్వరలోనే ఒక్కటవుతారనే వార్తలు నెట్టింట తెగ షికార్లు చేశాయి. ప్రపంచకప్ తర్వాత ముహూర్తం ఖాయమనే ముచ్చట్లూ వినిపించాయి. చివరకు అన్నట్లే ప్రపంచకప్ ముగిసిన వెంటనే స్మృతి ఇంట పెళ్లి బాజా మోగనుంది. తన హోటల్ ‘ఎస్ఎం 18’ (స్మృతి మంధాన 18 జెర్సీ నంబర్)లో భారత జట్టు సహచరుల సందడితో పెళ్లి కోలాహలం ఎప్పుడో మొదలైంది. హల్దీ, మెహందీ వేడుకల్లో సహచరుల చిందులు, చిలిపి అల్లర్లు నెట్టింట కనువిందు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలతో పాటు డీవై పాటిల్ స్టేడియం మధ్యలో స్మృతి కళ్లకు గంతలు కట్టి పలాశ్ పిచ్ వద్దకు తొడ్కొని రావడంతోపాటు మోకాళ్లపై కూర్చోని ఆమెకు చేసిన పెళ్లి ప్రతిపాదన వీడియో కూడా నెట్టింట క్రికెట్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏకంగా 19 లక్షలు లైక్‌లు, 12 వేలపైచిలుకు కామెంట్లు, లెక్కలేనన్ని శుభాకాంక్షలు ఇన్‌స్టాలో వెల్లువెత్తాయి. ‘ఎక్స్’లో ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే జంట స్మృతి మంధాన, పలాశ్‌లకు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. -
లేడీ క్రికెటర్ స్మృతి మంధాన హల్దీ సెలబ్రేషన్ (ఫొటోలు)
-
స్మృతి మంధానకు కాబోయే భర్త సర్ప్రైజ్.. వీడియో వైరల్
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Muchhal)తో ఏడడుగులు వేయనుంది. చాన్నాళ్ల క్రితమే తమ బంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపిన స్మృతి- పలాష్ జంట.. తమ ప్రేమను వైవాహిక బంధంతో నవంబరు 23న పదిలం చేసుకోనున్నారు.జగజ్జేతగా భారత్ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు పెళ్లి వేడుకలు మొదలుకాగా.. పలాష్ తన రొమాంటిక్ ప్రపోజల్‌తో స్మృతిని సర్ప్రైజ్ చేశాడు. కాగా భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2025 టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్ ప్రపంచకప్ గెలవాలన్న మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వంటి దిగ్గజ ఆటగాళ్ల కలను హర్మన్ సేన సొంతగడ్డపై నెరవేర్చింది.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. మహిళల వన్డే క్రికెట్లో తొలిసారి భారత్ జగజ్జేతగా నిలిచింది. నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. ఇంతటి ప్రత్యేకమైన ఈ మైదానంలోనే స్మృతికి పలాష్ అదిరిపోయే బహుమతి ఇచ్చాడు.నన్ను పెళ్లి చేసుకుంటావా?కళ్లకు గంతలు కట్టి మరీ స్మృతిని డీవై పాటిల్ స్టేడియానికి తీసుకువెళ్లిన పలాష్.. మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు ఆమె నవ్వుతూ అంగీకరించింది. పలాష్ తన వేలికి ఉంగరం తొడగడంతో సిగ్గులమొగ్గయిన స్మృతి.. ఆ తర్వాత తాను కూడా పలాష్ వేలికి ఉంగరం తొడిగింది.ఇందుకు సంబంధించిన వీడియోను పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ఆమె సరేనంది’’ అంటూ తమ జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. కాగా తమ్ముడు పలాష్‌తో పాటు బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా స్టేడియానికి వచ్చి మరదల్ని సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత అంతా కలిసి నవ్వులు చిందిస్తూ స్టెప్పులు వేశారు. కాగా మహారాష్ట్రకు చెందిన 29 ఏళ్ల స్మృతి మంధాన క్రికెటర్‌గా సత్తా చాటుతుండగా.. ఇండోర్‌కు చెందిన 30 ఏళ్ల పలాష్ ముచ్చల్ బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇరుకుటుంబాల సమ్మతితో స్మృతి- పలాష్ ఆదివారం (నవంబరు 23) పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నారు.చదవండి: ఐపీఎల్ ఆడటం మానెయ్: గిల్‌కు గంభీర్ సలహా ఇదే View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal) -
ముచ్చల్‌తో నిశ్చితార్థాన్ని ధ్రువీకరించిన మంధన
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్, టీమిండియా 'క్వీన్' స్మృతి మంధన (Smriti Mandhana) త్వరలో పెళ్లి పీఠలెక్కబోతుందన్న ప్రచారం నిజమైంది. సంగీత దర్శకుడు, సింగర్ పాలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) నిశ్చితార్థాన్ని మంధన స్వయంగా ధ్రువీకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సహచరి జెమిమా రోడ్రిగ్స్ షేర్ చేసిన వీడియోలో మంధన తన చేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్‌ను చూపిస్తూ మున్నా భాయ్ MBBS సినిమాలోని "సమ్జో హో హీ గయా" పాటకు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను మంధన స్వయంగా రీపోస్ట్ చేస్తూ, ముచ్చల్‌తో తన నిశ్చితార్థాన్ని అఫీషియల్ చేసింది. మంధన-ముచ్చల్ 2019లో స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. సంగీతం, క్రీడలపై ఆసక్తి వారిని దగ్గర చేసింది. ఐదు సంవత్సరాల డేటింగ్ అనంతరం 2024లో వీరు తమ అనుబంధాన్ని బహిర్గతం చేశారు. ముచ్చల్ తరచూ మంధన ఆడే మ్యాచ్‌లలో కనిపిస్తూ ఆమెకు మద్దతు పలుకుతుంటాడు. మంధన-ముచ్చల్ వివాహా తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సోషల్‌మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆహ్వాన పత్రిక వైరలవుతుంది. దీని ప్రకారం వీరి పెళ్లి మరికొద్ది రోజుల్లో (నవంబర్ 23న) జరగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, సాంగ్లీల్లో జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సన్నాహకాలు కూడా పూర్తయ్యాయని సమాచారం. మంధన ఇటీవలే భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంతో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. జగజ్జేతగా నిలిచిన కొద్ది రోజుల్లోనే మంధన జీవితంలో మరో పెద్ద విజయోత్సవం జరగడం ఖాయమైంది. మంధన-ముచ్చల్ వివాహాం క్రికెట్‌తో పాటు సంగీత అభిమానుల్లోనే ఆనందాన్ని నింపనుంది. చదవండి: కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ పేరు ప్రకటన -
ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్
దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును దక్కించుకుంది. 2025, అక్టోబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును (ICC Player of the Month) కైవసం చేసుకుంది.అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనలకు గానూ లారాకు ఈ అవార్డు దక్కింది. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్-2025లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన ఆమె.. అక్టోబర్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 470 పరుగులు చేసింది. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారీ సెంచరీ (169) చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చింది. ఈ నెలలో భారత్‌తో జరిగిన ఫైనల్లోనూ సెంచరీ చేసింది. లారా సెంచరీతో మెరిసినా సౌతాఫ్రికా ఫైనల్లో భారత్ చేతిలో ఓటమిపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తర్వాత లారా మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. ప్రపంచకప్ టైటిల్ గెలవలేకపోయినా, మా పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అంది. ఈ అవార్డు కోసం భారత స్టార్ బ్యాటర్, ప్రపంచకప్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ స్మృతి మంధన, ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ పోటీపడినప్పటికీ.. లారానే అదృష్టం వరించింది.పురుషుల విభాగంలో ముత్తుసామిఅక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు పురుషుల విభాగంలోనూ సౌతాఫ్రికన్నే వరించింది. ఆ జట్టు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో అతను విశేషంగా రాణించాడు. తొలి టెస్ట్‌లో 11 వికెట్లు, రెండో టెస్ట్‌లో 89 పరుగులు చేశాడు. ఈ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ అవార్డు కోసం ముత్తసామితో పాటు పాకిస్తాన్ స్పిన్నర్ నౌమన్ అలీ, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పోటీపడ్డారు.ఐసీసీ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన అభిమానులు, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధుల ఓట్ల ఆధారంగా ఈ అవార్డులు ప్రకటించబడతాయి.చదవండి: ధృవ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సిగ్గులేని వాళ్లుంటారు: వరల్డ్‌కప్ విజేతలకు గావస్కర్ వార్నింగ్
నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే వన్డే ప్రపంచకప్ (ICC Women's ODI World Cup) విజేతగా నిలిచింది. సొంతగడ్డపై ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు మొదలు అభిమానుల దాకా.. యావత్ భారతావని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.భారీ నజరానాఢిల్లీ నుంచి గల్లీ దాకా హర్మన్ సేన గెలుపును ప్రస్తావిస్తూ మన ఆడబిడ్డలను ఆకాశానికెత్తింది. ఇక వరల్డ్‌కప్ గెలిచిన జట్టులోని సభ్యులైన క్రికెటర్లకు ఐసీసీ అందించే రూ. 40 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించిన రూ. 51 కోట్ల నజరానా దక్కనుంది.క్యాష్ రివార్డులు అంతేకాదు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం భారీ ఎత్తున రివార్డులు ప్రకటించాయి. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ప్లేయర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్‌లకు ఇప్పటికే ప్రభుత్వం తలా రూ.2.25 కోట్ల మేర చెక్కులు అందించింది. భారత జట్టులోని ఇతర సభ్యులు క్రాంతి గౌడ్ (మధ్యప్రదేశ్), అమన్‌జోత్ కౌర్, హర్లీన్ డియోల్ (పంజాబ్), రిచా ఘోష్ (బెంగాల్), అరుంధతి రెడ్డి (తెలంగాణ)లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఘన స్వాగతం పలికాయి.ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగంతో పాటు.. రూ. 2.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. సొంత ఊరిలో ఇంటి స్థలం కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ విజేతలను ఉద్దేశించి టీమిండియా దిగ్గజ0, 1983 వరల్డ్‌కప్ విన్నర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.అమ్మాయిలు జాగ్రత్తమిడ్-డేకు రాసిన కాలమ్‌లో.. ‘‘అమ్మాయిలు కాస్త జాగ్రత్త. మీకోసమే ఈ మాటలు.. అందరూ మాట ఇచ్చినట్లుగా మీకు అవార్డులు, రివార్డులు దక్కకపోతే అస్సలు బాధపడొద్దు. మన దేశంలో అడ్వర్టైజర్లు, బ్రాండ్లు, కొంతమంది వ్యక్తులు ఉచిత ప్రచారం కోసం విజేతలను తమ భుజాలపై మోస్తారు.జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్‌పేజీ యాడ్లు, హోర్డింగ్‌లు పెట్టిస్తారు. జట్టు యాజమాన్యం, స్పాన్సర్లు తప్ప మిగతా వారంతా ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తారు. నిజానికి వారి ద్వారా భారత క్రికెట్‌కు ఒరిగేది ఏమీ ఉండదు.1983లో భారత్‌కు తొట్టతొలి వరల్డ్‌కప్ అందించిన విజేతలకు కూడా చాలా ప్రామిస్‌లు చేశారు. వీటి గురించి మీడియలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయంలో మీడియాను తప్పుబట్టాల్సిన పనిలేదు.సిగ్గులేని వాళ్లుంటారువిజేతలకు వచ్చిన నజరానాల గురించి వారు పెద్ద పెద్ద హెడింగ్‌లు పెడతారంతే!.. అయితే, విజేతలతో పాటు మీడియాను కూడా కొంత మంది సిగ్గులేని వాళ్లు ఉపయోగించుకుంటారని వారికీ తెలిసి ఉండదు. కాబట్టి.. అమ్మాయిలూ.. ఇలాంటి సిగ్గులేని వ్యక్తులను ఉపేక్షించవద్దు.తమ ప్రచారం కోసం మీ పేరును వాడుకుంటారు. 1983 విజేతల తరఫు నుంచి మీకో మాట చెప్పదలచుకున్నా.. భారత క్రికెట్ అభిమానుల ప్రేమే అన్నింటికంటే గొప్ప సంపద. మీకూ ఇది వర్తిస్తుంది. మరోసారి విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశాన్ని గర్వపడేలా చేశారు. జై హింద్’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు.కాగా వరల్డ్‌కప్‌లో భారత్ గెలవగానే గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి.. మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు ఇస్తానని ప్రకటించాడు. మరో కార్ల కంపెనీ ఇంకా లాంచ్ చేయని వర్షన్‌ను విజేతలకు కానుకగా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో గావస్కర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’ -
విజేతలకు స్వాగత సత్కారాలు
ముంబై: తొలిసారి వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్లపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. దేశ రాజధానిలో వరుసగా ప్రధాని, రాష్ట్రపతిలను కలిసిన తర్వాత శుక్రవారం ఈ ప్లేయర్లంతా తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఆయా నగరాల్లో ఘన స్వాగతాలు లభించడంతో పాటు నగదు ప్రోత్సాహకాల అందజేత కొనసాగుతోంది. టీమ్‌లో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ప్లేయర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్ ఉన్నారు. టోర్నీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గురికి మహారాష్ట్ర ప్రభుత్వం తలా రూ.2.25 కోట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్‌లను శుక్రవారమే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ క్రికెటర్లకు అందజేశారు. ప్లేయర్లను చూస్తుంటే తమకు చాలా గర్వంగా ఉందని ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రకే చెందిన భారత హెడ్ కోచ్ అమోల్ మజుందార్‌కు కూడా ప్రభుత్వం రూ.22 లక్షల 50 వేల నగదు పురస్కారాన్ని అందించింది. టీమ్ సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న అనిరుధ దేశ్‌పాండే, అపర్ణ గంభీర్రావు, మిహిర్ ఉపాధ్యాయ్, పూర్వ కాటే, మమత షిరురుల్లాలతో పాటు మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీలకు కూడా తలా రూ.11 లక్షలను సీఎం బహుమతిగా అందించారు. భారత జట్టులోని ఇతర సభ్యులు క్రాంతి గౌడ్ (మధ్యప్రదేశ్), అమన్‌జోత్ కౌర్, హర్లీన్ డియోల్ (పంజాబ్), రిచా ఘోష్ (బెంగాల్), అరుంధతి రెడ్డి (తెలంగాణ)లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఘన స్వాగతం పలికాయి. రిచా స్వస్థలం సిలిగురిలో ఓపెన్ టాప్ జీప్‌లో ఆమె విజయోత్సవ ర్యాలీని నిర్వహించగా... భోపాల్‌లో క్రాంతి గౌడ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్... అరుంధతి రెడ్డిని తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి సత్కరించారు. -
WPL 2026: రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా
మహిళల ప్రీమియర్ లీగ్ -2026 మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే, విడుదల చేసిన ప్లేయర్ల వివరాలు వెల్లడించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకోగా.. ముంబై ఇండియన్స్ కూడా ఐదుగురిని అట్టిపెట్టుకుంది. ఇందులో భారత్‌కు తొలి వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కూడా ఉంది.ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana)తో పాటు మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ఇద్దరిని అట్టిపెట్టుకోగా.. యూపీ వారియర్స్ ఒక్కరిని మాత్రమే రిటైన్ చేసుకుని.. మిగతా అందరినీ విడుదల చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా భారత మహిళల జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేలంలోకి వస్తే హర్మన్, స్మృతి వంటి వారికి భారీ ధర దక్కుతుందనే అంచనాల నడుమ ఆయా జట్లు వీరిని రిటైన్ చేసుకోవడం గమనార్హం. కాగా నవంబరు 27న మెగా వేలం జరుగనుంది.రిటెన్షన్ లిస్టుఢిల్లీ క్యాపిటల్స్ షఫాలీ వర్మ (రూ. 2.20 కోట్లు)జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.20 కోట్లు)మరిజానే కాప్ (రూ. 2.20 కోట్లు)అనాబెల్ సదర్లాండ్ (రూ. 2.20 కోట్లు)నికీ ప్రసాద్ (రూ. 50 లక్షలు)ముంబై ఇండియన్స్నట్ సీవర్- బ్రంట్ (రూ. 3.50 కోట్లు)హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ. 2.50 కోట్లు)హేలీ మాథ్యూస్ (రూ. 1.75 కోట్లు)అమన్‌జోత్ కౌర్ (రూ. 1 కోటి)గుణాలన్ కమిలిని (రూ. 50 లక్షలు)రాయల్ చాలెంజర్స్ బెంగళూరుస్మృతి మంధాన (రూ. 3.50 కోట్లు)రిచా ఘోష్ (రూ. 2.75 కోట్లు)ఎలిస్ పెర్రి (రూ. 2 కోట్లు)శ్రేయాంక పాటిల్ (రూ. 60 లక్షలు)గుజరాత్ జెయింట్స్ఆష్లే గార్డ్నర్ (రూ. 3.50 కోట్లు)బెత్ మూనీ (రూ. 2.50 కోట్లు)యూపీ వారియర్స్శ్వేతా సెహ్రావత్ (రూ. 50 లక్షలు)ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన ప్లేయర్లుతానియా భాటియా, నందిని కశ్యప్, స్నేహ దీప్తి, శిఖా పాండే, మిన్ను మణి, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, శ్రీ చరణి, రాధా యాదవ్, మెగ్ లానింగ్, సారా బ్రైస్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాసెన్.ముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్లుయాస్తికా భాటియా, అమన్‌దీప్ కౌర్, క్లో ట్రయాన్, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, సైకా ఇషాక్, జింటిమణి కలిత, సత్యమూర్తి కీర్తన, అక్షితా మహేశ్వరి, పరుణికా సిసోడియా, పూజా వస్త్రాకర్, అమేలియా కెర్, నదీన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలేసిన ప్లేయర్లుసబ్బినేని మేఘన, నుజాత్ పర్వీన్, కనికా అహుజా, రాఘవి బిస్త్, స్నేహ్ రానా, ఆశా శోభన, ఏక్తా బిష్త్, వీజే జోషిత, జాగ్రవి పవార్, ప్రేమ రావత్, రేణుకా సింగ్, డాని వ్యాట్-హాడ్జ్, చార్లీ డీన్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహమ్ సోఫీ డివైన్, సోఫీ మొలినక్స్, జార్జియా వారేహమ్, కేట్ క్రాస్.గుజరాత్ జెయింట్స్ వదిలేసిన ప్లేయర్లుహర్లీన్ డియోల్, భారతీ ఫుల్మాలి, దయాళన్ హేమలత, సిమ్రాన్ షేక్, మన్నత్ కశ్యప్, సయాలీ సత్ఘరే, కశ్వీ గౌతమ్, తనూజా కన్వర్, మేఘనా సింగ్, ప్రకాశిక నాయక్, ప్రియా మిశ్రా, షబ్నమ్ షకిల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, లారా వోల్వర్ట్, డియోండ్రా డాటిన్, డేనియల్ గిబ్సన్.యూపీ వారియర్స్ఉమా ఛెత్రి ఆరుషి గోయెల్, పూనమ్ ఖెన్మార్, కిరణ్ నవగిరె, దినేశ్ వ్రింద, దీప్తి శర్మ, అంజలి శర్వాణి, క్రాంతి గౌడ్, రాజేశ్వరి గైక్వాడ్, గౌహర్ సుల్తానా, సైమా ఠాకూర్, చినెల్లి హెన్రి, జార్జియా వాల్, అలిసా హేలీ గ్రేస్ హ్యారిస్, అలనా కింగ్, చమరి ఆటపట్టు, తాహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్.చదవండి: క్రీజులోకి వెళ్లు.. నీ తల పగలకొడతా! -
Hanuman Tattoo: ప్రధాని మోదీ ప్రశ్నకు దీప్తి శర్మ జవాబు ఇదే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పట్ల భారత స్టార్ క్రికెటర్, వన్డే వరల్డ్‌కప్ విజేత దీప్తి శర్మ (Deepti Sharma) అభిమానం చాటుకుంది. ఆయనను నేరుగా కలవాలని ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేసింది. కాగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC Women's ODI World Cup)లో విజేతగా నిలిచిన భారత జట్టు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది.సరదాగా ముచ్చటించిన మోదీఈ సందర్భంగా.. విజయవంతమైన ఈ ప్రపంచకప్ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను అధిగమించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టును మోదీ అభినందించారు. ప్రధాని కేవలం ఓ ఫొటో, రెండు ముక్కల ప్రశంసకే పరిమితం కాకుండా ప్లేయర్లందరితో కలిసి కూర్చుని సరదాగా ముచ్చటించారు.ఈ క్రమంలో 2017లో ఫైనల్లో ఓడినపుడు ఉత్త చేతులతో మోదీని కలిసిన తాము ఇప్పుడు ప్రపంచకప్ ట్రోఫీతో కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది. మోదీ అప్పుడు చెప్పిన మాటలు ఈ సారి కప్ గెలిచేందుకు ఎంతగానో దోహదపడ్డాయని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పింది.ఇక ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన దీప్తి శర్మ మాట్లాడుతూ మరోసారి ప్రధానిని కలిసే అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూశామని తాజా కప్‌తో కలుసుకోవడం మరింత తృప్తినిచ్చిందని పేర్కొంది. ఈ సందర్భంగా దీప్తి ఇన్‌స్ట్రాగామ్ బయోలో ఉన్న ‘జై శ్రీరామ్’, ఆమె భుజంపై ఉన్న హనుమాన్ టాటూ విశేషాలను మోదీ అడిగితెలుసుకున్నారు. తన మానసిక, శారీరక బలానికి హనుమాన్ టాటూ ఉత్ప్రేరకమని దీప్తి చెప్పింది.‘‘మిమ్మల్ని కలవాలని ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నా. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. 2017లో మీరు మాతో ఓ మాట చెప్పారు. అవరోధాలను అధిగమించి సవాళ్లను సమర్థవంతంగా పూర్తి చేసినవాళ్లే అసలైన ఆటగాళ్లు అని మీరన్నారు.లార్డ్ హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది?కఠినంగా శ్రమిస్తే తప్పక ఫలితం వస్తుందని చెప్పారు. మీ మాటలు, సలహాలు మాలో స్పూర్తిని నింపాయి’’ అని దీప్తి శర్మ ప్రధాని మోదీతో పేర్కొంది. ఈ క్రమంలో ఆయన.. లార్డ్ హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది? అని దీప్తిని అడుగగా.. ‘‘నా కంటే నేను ఆయన (హనుమాన్)నే ఎక్కువగా నమ్ముతాను. నా ఆట మెరుగుపడటానికి ఆయన మీదున్న నా నమ్మకం, సానుకూల దృక్పథమే కారణం’’ అని దీప్తి శర్మ బదులిచ్చింది.కాగా వరల్డ్‌కప్-2025లో భాగంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో దీప్తి శర్మ 58 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది.‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలోఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో ఫైనల్లో అమన్‌జోత్ క్యాచ్, క్రాంతి గౌడ్ బౌలింగ్ ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలో విశ్వవిజేతలు భాగం కావాలని మోదీ క్రికెటర్లను ఉద్దేశించి అన్నారు. శారీరక ఫిట్నెస్ ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వీలైనపుడు విద్యార్థులను స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఉత్సాహపరచాలని మోదీ సూచించారు. చదవండి: ‘సాకులు చెబుతారు... కానీ ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదు’Player of the Tournament, Deepti Sharma, recalled that in 2017, Prime Minister @narendramodi had advised her to learn from failure and keep working hard. She shared that she had been eagerly looking forward to this meeting. Deepti also explained the significance of the ‘Hanuman’… pic.twitter.com/aUXki9yZz6— DD News (@DDNewslive) November 6, 2025 -
వరల్డ్‌కప్ విజేతలకు ప్రధాని మోదీ ఆతిథ్యం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుని అభినందించారు. తన నివాసంలో హర్మన్ సేనతో ప్రధాని సమావేశమై.. వరల్డ్‌కప్ విశేషాలను చర్చించారు. కాగా నలభై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ భారత మహిళా జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.సొంతగడ్డపై ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టైటిల్‌ను మన అమ్మాయిలు గెలుచుకున్నారు. నవీ ముంబై వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి విశ్వ విజేతగా అవతరించారు. ఈ క్రమంలో హర్మన్ సేనపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. తన కార్యాలయంలో వారితో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని తెలుపుతూ ప్రధాని కార్యాలయం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టు బుధవారం ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకుంది. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ జగజ్జేతలతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వన్డే వరల్డ్‌కప్ విజేతలు.. తమ సంతకాలతో కూడిన ‘నమో’ జెర్సీని ప్రధానికి కానుకగా ఇచ్చారు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమని కొనియాడారు.హ్యాట్రిక్ ఓటముల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చినా.. ఒత్తిడిని అధిగమించారంటూ భారత జట్టును ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని దేశమంతా వ్యాప్తి చేయాలని.. ఈ సందర్భంగా మోదీ హర్మన్ సేనకు పిలుపునిచ్చారు.ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ఫిట్‌గా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం చేయాలని.. పాఠశాలకు వెళ్లి మరీ పిల్లలకు ఇవన్నీ బోధించాలని మోదీ.. భారత జట్టుకు సూచించారు. ఇక ప్రధాని మోదీతో మాట్లాడుతున్న క్రమంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్.. 2017 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిని గుర్తు చేసుకోగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన .. ఆ సమయంలో ప్రధాని మోదీ తమలో స్ఫూర్తి నింపారని తెలిపింది.చదవండి: BCCI: భారత జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరు -
వరల్డ్ కప్ ట్రోఫీతో మంధాన, పలాష్ ముచ్చల్ జంట (ఫోటోలు)
-
క్రికెట్ గాళ్స్ ...స్టైలిష్ స్టార్స్...
భారత మహిళా క్రికెట్ జట్టు విజయాల పరుగును ఆస్వాదిస్తోంది. ఇటీవలి ప్రపంచ కప్ విజయం కేవలం క్రీడా మైలురాయి మాత్రమే కాదు శక్తి సామర్ధ్యాలున్న మహిళల భవితకు స్ఫూర్తి. క్రీడల్లో మాత్రమే కాదు ఈ మహిళలు మైదానంలో వెలుపల కూడా నవ యువతికి ప్రేరణ అందిస్తున్నారు.ఈ ఆధునిక క్రీడాకారులు సంప్రదాయ నియమాలను తిరిగి వ్రాస్తున్నారు: నైపుణ్యానికి అత్యాధునిక జీవనశైలిని జోడిస్తున్నారు. వరల్డ్ కప్ విజయం తర్వాత ఒక్కసారిగా వారి లైఫ్ స్టైల్ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా వారి ఫ్యాషన్ ఎంపికలపై నవయువ తరం దృష్టి సారించింది. అంతేకాదు పలు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ బ్రాండ్స్ సైతం వీరితో ఒప్పందాలకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపధ్యంలో అనుసరించే ఫ్యాషన్స్, స్టైల్స్ ఆధారంగా చూస్తే... స్మృతి మందాన...భారతీయ మహిళా క్రికెట్లో స్మృతి మంధానకు తిరుగులేని గుర్తింపు ఉంది. ఆమె బ్యాటింగ్ స్టైల్ లాగే ఆమె ఫ్యాషన్ ఎంపికలు కూడా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రయాణ రోజులకు రిలాక్సడ్ కుర్తా అయినా లేదా స్నీకర్లతో జత చేసిన భారీ చొక్కా అయినా, తన లుక్‌ను ఎలా చిక్‌గా చూపించాలో స్మృతికి తెలుసు. ఆమె పండుగ సమయంలో పాస్టెల్ షరారాస్ లేదా పూల చీరలలో నిజమైన భారతీయతను ప్రతిబింబిస్తుంది. ప్రసరింపజేస్తుంది. కానీ బిజీ వర్క్ లేని రోజుల్లో ఆమె సాధారణ కో–ఆర్డ్లు, డెనిమ్‌లు, సిల్హౌట్లను ఇష్టపడుతుంది. ఆత్మవిశ్వాసంతో కదిలే ఆమె తీరు ఆమె దుస్తులు ధరించే విధానం బాగా కనిపించడానికి భారీ స్టైలింగ్ అవసరం లేదని రుజువు చేస్తుంది.చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?జెమీమా రోడ్రిగ్స్ప్రశాంతమైన స్మృతికి భిన్నంగా జెమీమా రోడ్రిగ్స్ మెరుపులా ఉంటుంది. ఆమెను ప్రస్తుత భారత జట్టులో జెన్–జెడ్ శక్తిగా పేర్కొంటున్నారు. ఎల్లప్పుడూ తన లుక్‌తో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. స్పోర్టి జాకెట్లు, రంగురంగుల స్నీకర్లు, ప్రింటెడ్ టీస్ స్ట్రీట్‌వేర్ గ్లామ్ టచ్ తో ఆమె వార్డ్రోబ్ నవ యవ్వన ఉత్సాహంతో తొణికిసలాడుతుంటుంది .జెమీమా వ్యక్తిత్వం ఆమె ఫ్యాషన్ ద్వారా ప్రకాశిస్తుంది. ఆమె ట్రెండ్‌తో కంఫర్ట్‌ను కలపడం, రోజువారీ దుస్తులను స్టైల్ స్టేట్మెంట్లుగా మార్చడాన్ని ఇష్టపడుతుంది. డెనిమ్–ఆన్–డెనిమ్ సెట్ల నుంచి స్నీకర్ల, కుర్తాల వరకు, ఆమె ఫ్యాషన్ ఆకట్టుకుంటుంది. కెమెరాల కోసం కాదు, ఆమె తనకోసం తాను దుస్తులు ధరిస్తుంది. అణువణువూ కనిపించే ఆత్మవిశ్వాసమే జెమీమాను ఇన్ స్ట్రాగామ్‌లో నిజ జీవితంలో నిజమైన ట్రెండ్‌సెట్టర్‌గా మార్చింది.హర్మన్ ప్రీత్ కౌర్జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వ లక్షణాల్లానే ఆమె వార్డ్రోబ్ కూడా అదే శక్తిని ప్రతిబింబిస్తుంది. టైలర్డ్ బ్లేజర్ అయినా, స్మార్ట్ ప్యాంట్‌సూట్ అయినా, లేదా మట్టి టోన్లలో సొగసైన కుర్తా అయినా, డ్రెస్సింగ్‌లో ఆమె ఒక మాస్టర్ క్లాస్. హర్మన్ ప్రీత్ లుక్ నాటకీయతను కాకుండా ఆమె బలాన్ని ప్రదర్శిస్తుంది.ఆమె వస్త్రధారణ శైలి ఆధునికంగా అనిపించే భారతీయతను కలిగి ఉంటుంది, తరచుగా లినెన్ లేదా చేనేత పట్టు వంటి ఫ్యాబ్రిక్స్‌లో కనిపిస్తుంది. ఆమె ఎంపికలలో ఒక పరిపక్వత ఉంటుంది, ఆమె ట్రెండ్ల వెంట పడదు.చదవండి: జుకర్‌బర్గ్‌కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకియాస్టికా భాటియాకొత్త తరం క్రికెటర్లలో, యాస్టికా భాటియా సొగసైన సౌందర్యానికి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె లుక్స్ అన్నీ క్లీన్ కట్స్, మ్యూట్ ప్యాలెట్లతో ఉంటాయి. యాస్టికా ఫ్యాషన్ సెన్స్‌లో భారీ ఉపకరణాలు లేదా రంగులు ఉండవు. ఆమె తరచుగా మోనోక్రోమ్ సెట్లు, తెల్ల చొక్కాలు లేత పాస్టెల్ కుర్తాలలో కనిపిస్తుంది, అవి మీరు ఎక్కడైనా ధరించవచ్చు ఓవర్స్టైల్డ్ సెలబ్రిటీ ఫ్యాషన్ యుగంలో ఆమె ఎంపికలో సరళత రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది.హర్లీన్ డియోల్స్పోర్టీ గ్లామర్ల పరిపూర్ణ సమ్మేళనం హర్లీన్ డియోల్ . మైదానంలో అద్భుతమైన క్యాచ్‌లు గొప్ప శక్తి ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన ఆమె తన ఫ్యాషన్ కు అదే స్పార్క్‌ను తెస్తుంది. ఆమె బోల్డ్ లుక్‌లను ఇష్టపడుతుంది – స్టేట్మెంట్ డ్రెస్సులు, సొగసైన పోనీ టెయిల్స్, ట్రెండీ స్నీకర్లు ఆమె అథ్లెటిక్ ఫ్రేమ్‌ను హైలైట్ చేసే బాగా సరిపోయే అథ్లెటిజర్ సెట్లు. జిమ్ గేర్ నుంచి గ్లామర్‌కు సులభంగా మారే కొద్దిమంది క్రీడాకారిణులలో ఒకరు. ఆమె ఒక రోజు చిక్ స్ట్రీట్వేర్తో మరోక రోజు మరో స్టైల్‌తో రోజుకో ప్రయోగం చేస్తుంది. ఉపకరణాల పట్ల ఆమెకున్న ప్రేమ, మేకప్ సమన్వయంతో కూడిన లుక్స్ ఆమెకు బలమైన వ్యక్తిగత బ్రాండ్‌ను సృష్టించాయి.స్టేడియంల నుంచి ఫోటో షూట్ల వరకు వీరి ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరమే. వీరిలో ఎవరూ సెలబ్రిటీ అనే కిరీటంతో తమ స్టైల్స్‌ను పంచుకోవాలని ప్రయత్నించడం లేదు, వారి ఫ్యాషన్ వారి సహజమైన తీరుతెన్నులకు ఒక పొడిగింపుగా మాత్రమే చూస్తున్నారు. అందుకే ఈ అథ్లెట్లు ఇప్పుడు ఫ్యాషన్ ప్రేరణలు, బ్రాండ్ అంబాసిడర్లు మాత్రమే కాదు అత్యున్నతమైన కలలు కనే ధైర్యం ఉన్న భారతీయ యువతులకు రోల్ మోడల్స్ కూడా. -
స్మృతి మంధనకు భారీ షాక్
విశ్వవిజేత భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలైన స్మృతి మంధనకు (Smriti Mandhana) భారీ షాక్ తగిలింది. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్-2025లో విశేషంగా రాణించినా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది.ఇదే ప్రపంచకప్‌లో మంధన కంటే మెరుగ్గా రాణించిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్స్‌లో సెంచరీలతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన లారా కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు (814) సాధించి, అగ్రపీఠాన్ని అధిరోహించింది.గత వారం రెండో స్థానంలో ఉండిన ఆసీస్ స్టార్ బ్యాటర్ ఆష్లే గార్డ్నర్ ఓ స్థానం కోల్పోయి మూడో స్థానానికి పడిపోయింది. ప్రపంచకప్‌లో టాప్-3 రన్ స్కోరర్లుగా నిలిచిన లారా, మంధన, గార్డ్నర్ ఐసీసీ తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లోనూ అదే స్థానాల్లో నిలవడం గమనార్హం. ప్రపంచకప్‌లో లారా 9 మ్యాచ్‌ల్లో 571 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. మంధన 9 మ్యాచ్‌ల్లో 434 పరుగులు, గార్డ్నర్ 7 మ్యాచ్‌ల్లో 328 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో వీరోచిత శతకం సాధించిన టీమిండియా నంబర్-3 బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీగా లబ్ది పొందింది. జెమీమా ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ పెర్రీ 3 స్థానాలు మెరుగుపర్చుకొని సోఫీ డివైన్‌తో కలిసి సంయుక్తంగా ఏడో స్థానాన్ని షేర్ చేసుకుంది.మిగతా భారత ప్లేయర్లలో హర్మన్‌ప్రీత్ 4, దీప్తి శర్మ 3, రిచా ఘోష్ 4 స్థానాలు మెరుగుపర్చుకొని 14, 21, 30 స్థానాలకు ఎగబాకారు. భారత్‌తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీ చేసిన ఆసీస్ ప్లేయర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి చేరింది.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా పేసర్ మారిజాన్ కాప్ 2 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్, ఆష్లే గార్డ్నర్ తలో స్థానం కోల్పోయి 3, స్థానాలకు పడిపోయారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఆష్లే గార్డ్నర్తో పాటు నాలుగో స్థానాన్ని పంచుకుంది. రేణుకా సింగ్ 19వ స్థానంలో కొనసాగుతుండగా.. శ్రీ చరణి 7 స్థానాలు మెరుగుపర్చుకొని 23వ స్థానానికి చేరింది.చదవండి: బిగ్‌బాష్ లీగ్ నుంచి అశ్విన్ ఔట్ -
50 ఏళ్ల శ్రమ ఫలం
అర్ధ శతాబ్దపు స్వప్నం సాకారమై క్రికెట్లో మన నారీమణులు సాధించిన ప్రపంచ కప్ విజయం వెనుక వారు ఎన్నో ఏళ్ళుగా ఎదుర్కొన్న పెను సవాళ్ళు, ఛీత్కారాలు ఉన్నాయి. అమ్మాయిల క్రికెట్ నిన్న మొన్నటి దాకా ఆటలో అరటి పండు లాంటిదే. ‘పురుషుల క్రికెట్లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు?’ అని మిథాలీ రాజ్‌ను ఆ మధ్య ఓ జర్నలిస్ట్ అడిగాడు. ‘ముందు ఆ పురుష పుంగవులను కలిసి వారికిష్టమైన మహిళా క్రికెటర్ ఎవరో అడిగి తెలుసుకుని రండి’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చి పడేశారామె. చులకన భావం ఒక్కటే మన క్రికెట్ వనితల సమస్య కాదు. మన దేశంలో మహిళల క్రికెట్ చాలా కాలం పాటు ఓ మొక్కుబడి వ్యవహారంగానే ఉంటూ వచ్చింది. నిధుల కొరత, అరకొర సదు పాయాల వల్ల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి దేశాల క్రికెట్ ప్రమాణా లను అందుకోవడం మన అమ్మాయిలకు కష్టంగా ఉండేది. మన దేశంలో మగపిల్లలు క్రీడలపై ఆసక్తి చూపిస్తేనే అది తలిదండ్రులకు నచ్చదు. ఇక ఆడపిల్లల్ని ఆటలకు పంపడం గురించి చెప్పేదేముంది! బ్యాట్లయినా లేని రోజుల నుంచి...పురుషులతో పోలిస్తే చాలా ఆలస్యంగా మన మహిళలు అంత ర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. 1976లో మన మహిళా జట్టు మొట్టమొదటి క్రికెట్ టెస్ట్ ఆడింది. కొన్ని సంవత్సరాల తరబడి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని సందర్భాలు 1980, 1990 దశ కాల్లో ఉండేవి. అప్పట్లో నిధుల కొరత వల్ల మన జట్టు ఫంక్షన్ హాళ్ళలో, స్కూలు బిల్డింగుల్లో బస చేసేది. అక్కడ ఎలుకలు, బొద్దింకలతో సహజీవనం చేయాల్సి వచ్చేదని తొలినాళ్ళలో భారత మహిళా జట్టు కెప్టెన్ గా ఉన్న శాంతా రంగస్వామి చెబుతోంది. టీమ్ మొత్తానికి కలిపి రెండు, మూడు బ్యాట్లు మాత్రం ఉండేవట! మిథాలీ రాజ్ ఆడిన రోజుల్లో కూడా సరైన టాయిలెట్ సదుపాయలు లేక పోవడాన్ని ‘శభాష్ మిథు’ బయోపిక్‌లో చూపించారు. ఇన్ని ఇబ్బందులున్నా అప్పట్లో శాంతా రంగస్వామితో పాటు, డయానా ఎడుల్జీ, నీతూ డేవిడ్, మిథాలీ, ఝులన్ గోస్వామి లాంటి మెరిక ల్లాంటి క్రికెటర్లు పుట్టుకొచ్చారు. 2005 ప్రపంచ కప్‌లో మన జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది కూడా!అప్పట్లో రైల్వేస్ వారు మన మహిళా క్రికెటర్లకు ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించేవారు. 2006లో మహిళల క్రికెట్‌ను బి.సి.సి.ఐ. పరిధి లోకి తీసుకొచ్చారు. అయితే మన క్రికెట్ బోర్డు వారు ప్రేమ కొద్దీ చేసిన పని మాత్రం కాదది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐ.సి.సి.) ఆదేశాల మేరకు మహిళల క్రికెట్‌ను బి.సి.సి.ఐ.లో విలీనం చేశారు. ఈ మార్పు తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. కనీసం రిజర్వేషన్ ఉన్న రైల్వే కంపార్ట్మెంట్లలో ప్రయాణం, కొన్నిసార్లు విమానయానం కూడా సాధ్యపడింది. ఆర్థికంగా కూడా మహిళా క్రికెటర్లు కొంత లాభపడ్డారు. ఇందిరా గాంధీతో 1975 నాటి తొలి భారత మహిళా క్రికెట్ జట్టు సీరియస్‌గా తీసుకోవడం మొదలైంది!హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన, దీప్తీ శర్మ, షెఫాలీ వర్మ లాంటి కొత్త తరం రంగంలోకి దిగాక అమ్మాయిల క్రికెట్‌కి కొత్త కళ వచ్చింది. ఈ తరం అమ్మాయిలు ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పాటు, తమ ఆట తీరులో కూడా దూకుడు పెంచారు. 2017 ప్రపంచ కప్ సెమీఫైనల్లో హర్మన్ ప్రీత్ ఆడిన ఇన్నింగ్స్ భారత మహిళల క్రికెట్లో గేమ్ ఛేంజర్. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆమె కేవలం 115 బంతుల్లో అజేయంగా 171 పరుగులు చేసింది. హర్మన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ మొత్తం క్రికెట్ ప్రపంచం విస్తుపోయేలా చేసింది. అప్పటి ఫైనల్లో కూడా మన జట్టు గెల వాల్సింది గానీ తొమ్మిది పరుగుల తేడాతో కప్ పోగొట్టుకుంది. ఆ ప్రపంచ కప్ తర్వాత మన క్రీడాభిమానులు అమ్మాయిల క్రికెట్‌ను కూడా సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఫ్యాన్ ఫాలో యింగ్ బాగా పెరిగింది.2022 నుంచి మహిళా క్రికెటర్లకు పురుషులతో సరిసమానంగా మ్యాచ్ ఫీజ్ ఇవ్వాలని బి.సి.సి.ఐ. నిర్ణయించింది. అలాగే మహిళా ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) కూడా ప్రారంభించడం మరో ముఖ్యమైన పరిణామం. కడప జిల్లాలోని ఓ మారుమూల పల్లెకు చెందిన శ్రీచరణి ఈ డబ్ల్యూపీఎల్ ద్వారానే భారత జట్టులోకి వచ్చింది. శ్రీచరణి లాగానే డబ్ల్యూపీఎల్ వల్ల గ్రామాల నుంచి, దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి కొత్త క్రికెటర్లు వస్తున్నారు. అమన్ జోత్ కౌర్ తండ్రి ఒక వడ్రంగి. తండ్రి తయారు చేసిచ్చిన బ్యాట్‌తోనే ఆమె క్రికెట్లో ఓనమాలు దిద్దుకుంది. షెఫాలీ వర్మ మగవాళ్ల హెయిర్ కట్‌తో కనిపిస్తుంది. అందుకు కారణం ఆమె చిన్నప్పుడు మగపిల్లాడిగా నటిస్తూ మగవాళ్లతో కలిసి ఆడేది. గ్రామీణ వాతా వరణం నుంచి వచ్చిన ఈ కొత్త తరం అమ్మాయిలు కసిగా, నిర్భయంగా ఆడుతున్నారు. మంచి ఫలితాలు తెస్తున్నారు. మగవాళ్లతో పోటీ!2022 కామన్వెల్త్ క్రీడల్లో మన అమ్మాయిలు క్రికెట్లో రజత పతకం గెలుచుకున్నారు. 2023 ఆసియా క్రీడల్లో మన దేశానికి క్రికెట్లో మొట్టమొదటి స్వర్ణ పతకం మన మహిళా జట్టే అందించింది. ఇప్పుడు ప్రపంచ కప్‌లో జయకేతనం ఎగరవేశారు. 1983 విజయం పురుషుల జట్టును అమాంతంగా ఎలా సూపర్ స్టార్స్‌ను చేసిందో, ఈ గెలుపు మహిళల క్రికెట్లో కూడా ఒక సువర్ణాధ్యాయా నికి తెర లేపనుంది అనడంలో సందేహం లేదు. 2017లో హర్మన్ ఆడిన ఇన్నింగ్స్ లాగానే మొన్నటి సెమీ ఫైనల్లో జమీమా రోడ్రిగ్స్ సెంచరీ కూడా భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతుంది. ఇకపై సూపర్ స్టార్డమ్ కేవలం మగ క్రికెటర్లకే పరిమితం కాకపోవచ్చు. వారు అమ్మాయిలతో పోటీ పడాల్సి రావచ్చు. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్!సి. వెంకటేశ్వ్యాసకర్త జర్నలిస్ట్, స్పోర్ట్స్ కామెంటేటర్ -
మహిళల వరల్డ్‌కప్-2025 విజేతగా భారత్
-
విశ్వవిజేతగా భారత్.. ముంబైలో మురిపించిన మహిళల జట్టు (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన
టీమిండియా స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. 2025 వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో (Women's CWC 2025) భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న ఫైనల్లో (India vs South Africa) మంధన ఈ ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలీ రాజ్ పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్‌లో 409 పరుగులు చేయగా.. తాజా ఎడిషన్‌లో మంధన 412 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా, భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధన (39), షఫాలీ వర్మ (48) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 17 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 97/0గా ఉంది.తుది జట్లు..భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్(కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(వికెట్ కీపర్), అన్నరీ డెర్క్సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, మ్లాబాచదవండి: IND Vs AUS: సుందర్ విధ్వంసం.. ఆసీస్‌పై టీమిండియా గెలుపు -
IND vs SA: ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరే
మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 ఫైనల్ సందర్భంగా కొత్త చాంపియన్ అవతరించనుంది. నవీ ముంబై వేదికగా జరిగే టైటిల్ పోరులో గెలవాలని భారత్ పట్టుదలగా ఉండగా.. తమకు వచ్చిన సువర్ణావకాశాన్ని చేజారనీయొద్దని సౌతాఫ్రికా భావిస్తోంది.కాగా సెప్టెంబరు 30న మొదలైన మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సౌతాఫ్రికా.. రెండో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఆతిథ్య భారత్ ఫైనల్‌కు చేరాయి.ఎవరు గెలిచినా చరిత్రేనవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఆదివారం (నవంబరు 2) నాటి టైటిల్ పోరులో భారత్- సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్ సమరంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఖరారు చేసింది.ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరేఈ మెగా ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌కు ఎలోసీ షేరిడాన్, జాక్వెలిన్ విలియమ్స్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది. అదే విధంగా.. సూ రెడ్‌ఫెర్న్ థర్డ్ అంపైర్‌గా.. నిమాలి పెరీరా ఫోర్త్ అంపైర్‌గా పనిచేయనుండగా.. మిచెల్లి పెరీరా మ్యాచ్ రిఫరీగా ఉంటారని ఐసీసీ తెలిపింది.వర్షం పడే అవకాశంకాగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్‌కు తెరలేస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసేందుకు 30- 60 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్ రిపోర్టు తెలిపింది.ఒకవేళ వర్షం కారణంగా ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాగకపోతే.. రిజర్వ్ డేన మ్యాచ్ కొనసాగిస్తారు. అంటే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి ఆటను కొనసాగిస్తారు. ఇక రిజర్వ్ డే కూడా వర్షం వల్ల ఆట సాగకపోతే ఇరుజట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు.వన్డే వరల్డ్‌కప్-2025 ఫైనల్: భారత్- సౌతాఫ్రికా జట్లుభారత్హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, ఉమా ఛెత్రి, షఫాలీ వర్మ.సౌతాఫ్రికాలారా వొల్వర్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాకా, క్లోయీ ట్రైయాన్, నదినె డి క్లెర్క్, మరిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జఫ్టా, నొన్‌కులులెకో మలాబా, అనెరి డెర్క్సెన్, అనెకె బాష్, మసబట క్లాస్, సునే లూస్, కరాబో మెసో, టుమి సెఖుహునే, నొండమిసో షాంగేస్. చదవండి: PKL 12: విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే -
స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్!.. వరుడు ఎవరంటే?
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana Wedding) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. వచ్చే నెలలోనే ఈ స్టైలిష్ ఓపెనర్ వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మహిళా క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి.. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించింది.భారత జట్టు ఓపెనర్‌గా భారత జట్టు ఓపెనర్‌గా ఇప్పటికే వన్డేల్లో 115 మ్యాచ్‌లు ఆడి.. 14 శతకాల సాయంతో 5253 పరుగులు సాధించిన స్మృతి.. ఏడు టెస్టుల్లో 629 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 153 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 3982 పరుగులు సాధించింది. అంతేకాదు.. మహిళల ప్రీమియర్ లీగ్ (WCL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా ఫ్రాంఛైజీకి తొలి టైటిల్ అందించిన ఘనత ఆమెది.ఆరేళ్లుగా ప్రేమప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్-2025తో బిజీగా ఉన్న స్మృతి మంధాన.. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆమె పెళ్లి పనుల్లో తలమునకలు కానున్నట్లు సమాచారం. కాగా స్మృతి చాన్నాళ్లుగా.. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ (Palash Muchhal)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2019 నుంచి డేటింగ్ చేస్తున్న ఈ జంట గతేడాది తమ ఐదో వార్షికోత్సవం అంటూ రిలేషన్షిప్ గురించి అభిమానులతో పంచుకున్నారు.ఇండోర్ కోడలు కాబోతోందిఆ తర్వాత ప్రతి వేడుకలోనూ కలిసి కనిపించారు స్మృతి- పలాష్. స్మృతితో పాటు టీమిండియా టూర్లకు కూడా వెళ్తుంటాడు పలాష్. ఇటీవల.. ‘‘స్మృతి త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’’ అంటూ పలాష్ తమ పెళ్లి గురించి సంకేతాలు ఇచ్చాడు.కాగా 1996లో ముంబైలో జన్మించిన స్మృతి మంధాన.. తనకు రెండేళ్ల వయసు ఉన్నపుడు సాంగ్లీకి వెళ్లింది. మాధవ్‌నగర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. మరోవైపు.. పలాష్ 1995లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మరాఠీ కుటుంబంలో జన్మించాడు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న అతడు.. బాలీవుడ్లో కంపోజర్‌గా సిర్థపడ్డాడు. పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ కూడా బాలీవుడ్ సింగర్. తనకు కూడా స్మృతితో మంచి అనుబంధం ఉందని పాలక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.పెళ్లి డేట్ ఫిక్స్!ఇక స్మృతి స్వస్థలం సాంగ్లీలోనే పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఎంటర్టైన్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 20న స్మృతి- పలాష్ పెళ్లి తంతు జరుగనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ‘అమ్మానాన్నల్ని విడాకులు తీసుకోమని నేనే చెప్పాను’ -
WC 2025 Ind vs Aus: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా చెత్త రికార్డు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 రెండో సెమీ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా (WC Ind vs Aus) తలపడుతున్నాయి. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా టాస్ గెలిచిన ఆసీస్ మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. హర్మన్ సేనను బౌలింగ్‌కు ఆహ్వానించింది.టాస్ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ అలిసా హేలీ మాట్లాడుతూ.. తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపింది. కీలక మ్యాచ్‌లో తాము ఒక మార్పు చేశామని.. జార్జియా వారేహమ్ స్థానంలో సోఫీ మోలినెక్స్ జట్టులోకి వచ్చినట్లు వెల్లడించింది.మరోవైపు.. భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని.. ఫియర్‌లెస్‌గా ఆడతామని తెలిపింది. గాయం వల్ల దురదృష్టవశాత్తూ ప్రతికా రావల్ దూరమైందన్న హర్మన్.. హర్లిన్ డియోల్, ఉమా ఛెత్రిలకు విశ్రాంతినిచ్చామని.. రిచా ఘోష్, షఫాలీ వర్మ తుదిజట్టులోకి వచ్చారని పేర్కొంది.టీమిండియా చెత్త రికార్డుమహిళల వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా భారత్ నిలిచింది. గత పది వన్డేల్లో హర్మన్ ఒకే ఒక్కసారి టాస్ గెలవడం గమనార్హం.మహిళల వరల్డ్‌కప్ టోర్నీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధికసార్లు టాస్ ఓడిన జట్లు👉ఇంగ్లండ్- 1982లో 13 మ్యాచ్‌లలో 9 సార్లు ఓటమి👉భారత్- 1982లో 12 మ్యాచ్‌లలో 8 సార్లు ఓటమి👉శ్రీలంక- 2000లో ఏడింట ఏడుసార్లు ఓటమి👉సౌతాఫ్రికా- 2025లో ఎనిమిదింట ఏడుసార్లు ఓటమి👉భారత్- 2025లో ఎనిమిదింట ఏడుసార్లు ఓటమి.తుదిజట్లు భారత్షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమన్‌జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.ఆస్ట్రేలియాఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిసా హేలీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగన్ షట్.చదవండి: IND vs AUS: అతడి కోసం అర్ష్‌దీప్‌ను బలిచేస్తారా?.. గంభీర్‌పై ఫైర్ -
World Cup 2025: ఆసీస్‌తో సెమీ ఫైనల్.. భారత జట్టులో కీలక మార్పు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI WC)లో సెమీ ఫైనల్ చేరిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ ప్రతికా రావల్ (Pratika Rawal) గాయం వల్ల జట్టుకు దూరమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.ప్రతికా రావల్ స్థానంలో అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ జట్టులోకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయాన్ని సోమవారం ప్రకటించింది. ఇంతకీ ఎవరా ప్లేయర్ అంటే?!...కుడికాలి చీలమండకు గాయంసొంతగడ్డపై న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లో గెలిచి భారత్ సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ సత్తా చాటి గెలుపొందాలని భావించింది. అయితే, నవీ ముంబై వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసి పోయింది.వాన వల్ల 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళా జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. అయితే, ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రతికా రావల్ కుడికాలి చీలమండకు గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతూ ఆమె మైదానం వీడింది. ఆ తర్వాత కూడా బ్యాటింగ్‌కు రాలేదు.మంధానకు జోడీగా అమన్‌జోత్ కౌర్ ప్రతికా రావల్ స్థానంలో స్మృతి మంధాన (34 నాటౌట్)కు ఓపెనింగ్ జోడీగా అమన్‌జోత్ కౌర్ (15 నాటౌట్) వచ్చింది. అయితే, వర్షం ఎక్కువ కావడంతో 8.4 ఓవర్ల వద్ద ఆట నిలిచిపోయింది. అప్పటికి హర్మన్ సేన వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.కాగా ఐసీసీ మహిళల వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. గువాహటిలో అక్టోబరు 29న తొలి సెమీస్ మ్యాచ్ జరుగనుండగా.. ఇందులో ఇంగ్లండ్- సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. మరోవైపు.. భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ (అక్టోబరు 30) జరుగనుండగా.. ఇందుకు నవీ ముంబై వేదిక.లేడీ సెహ్వాగ్ వచ్చేసిందిఅయితే, పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో కీలక సెమీస్‌కు ముందు ఇన్ఫామ్ బ్యాటర్ ప్రతికా సేవలను భారత్ కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. ఆమె స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’గా పేరొందిన షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది.కాగా సెమీస్ మ్యాచ్‌లో జట్టు మార్పు నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈవెంట్ టెక్నికల్ కమిటీ నుంచి బీసీసీఐ అనుమతి తీసుకుంది. ఇక భారత జట్టు ఓపెనర్‌గా కొంతకాలం వెలుగొందిన షఫాలీ వర్మ.. తర్వాత ఫామ్‌లేమితో సతమతమైంది.527 పరుగులు సాధించి..అదే సమయంలో ప్రతికా రావల్ రావడం.. నిలకడగా ఆడటంతో జట్టులో షఫాలీ స్థానం గల్లంతైంది. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్ టోర్నీలోనూ ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. కాగా షఫాలీ చివరగా 2024, అక్టోబరులో భారత్ తరఫున వన్డే ఆడింది.ఇక గతేడాది హర్యానా తరఫున దేశీ వన్డే క్రికెట్లో షఫాలీ మెరుగ్గా రాణించింది. 75.28 సగటుతో 527 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబరులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ప్రతికా రావల్.. 23 ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో వెయ్యి పరుగుల మార్కు అందుకుంది.తద్వారా మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్ 1000 రన్స్ చేసిన క్రికెటర్‌గా నిలిచింది. మంధానతో కలిసి 23 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ వికెట్‌కు ప్రతికా ఏకంగా 1799 పరుగులు జతచేసి రికార్డు సృష్టించడం గమనార్హం. ఏదేమైనా చాంపియన్ జట్టు ఆసీస్‌తో పోరులో ప్రతికా లేని లోటు స్పష్టంగా తెలుస్తుందనడంలో సందేహం లేదు. కాగా సారథిగా షఫాలీ భారత్‌కు అండర్-19 ప్రపంచకప్-2023 అందించిన విషయం తెలిసిందే.చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్తో (Meg Lanning) వరల్డ్ రికార్డును షేర్ చేసుకుంది. ఈ ఇద్దరూ తలో 17 సెంచరీలు చేశారు. లాన్నింగ్ వన్డేల్లో 15, టీ20ల్లో 2 సెంచరీలు చేయగా.. మంధన వన్డేల్లో 14, టెస్ట్‌ల్లో 2, టీ20ల్లో ఓ సెంచరీ చేసింది.మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నిన్న (అక్టోబర్ 23) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన మంధన లాన్నింగ్ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును సమం చేసింది. ఇకపై మంధన ఏ ఫార్మాట్లో అయినా సెంచరీ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాల రికార్డు ఆమె పేరిటే సోలోగా ఉంటుంది.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్లు..స్మృతి మంధన-17 (వన్డేల్లో 14, టెస్ట్‌ల్లో 2, టీ20ల్లో 1)మెగ్ లాన్నింగ్-17 (వన్డేల్లో 15, టీ20ల్లో 2)సూజీ బేట్స్-13 (వన్డేల్లో 13)ట్యామీ బేమౌంట్-12 (వన్డేల్లో 12)నాట్ సీవర్ బ్రంట్-10 (వన్డేల్లో 10)పై జాబితాలో మంధన మినహా మిగతా నలుగురు ఏదైన ఒకటి లేదా రెండు ఫార్మాట్లలో మాత్రమే సెంచరీలు చేశారు. మంధన మాత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనిపించుకుంది.న్యూజిలాండ్‌పై తాజా సెంచరీతో మంధన మరో రికార్డు కూడా సమం చేసింది. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్‌గా తజ్మిన్ బ్రిట్స్‌తో (సౌతాఫ్రికా) పాటు ప్రపంచ రికార్డును పంచుకుంది. తజ్మిన్, మంధన ఇద్దరు ఈ ఏడాది తలో 5 సెంచరీలు చేశారు.ఈ సెంచరీతో మంధన వన్డేల్లో అత్యధిక సెంచరీలు (14) చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో సూజీ బేట్స్‌ను (13) దాటి, అగ్రస్థానంలో ఉన్న మెగ్ లాన్నింగ్‌కు (15) మరింత చేరువయ్యింది.న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా 53 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు ప్రతిక (122), స్మృతి మంధన (109) సెంచరీలతో చెలరేగడంతో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం భారీ లక్ష ఛేదనలో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ హాలీడే (81), ఇసబెల్లా (65 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే. -
‘నాకు కాదు!.. తనకే ఇవ్వాల్సింది.. సెమీస్ చేరడం బిగ్ రిలీఫ్’
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC ODI WC 2025) టోర్నమెంట్లో భారత్ సెమీ ఫైనల్ చేరింది. న్యూజిలాండ్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ఈ మేరకు అద్భుత గెలుపుతో టైటిల్ దిశగా ప్రయాణం మొదలుపెట్టింది.శతకాలతో చెలరేగిన ఓపెనర్లుకాగా కివీస్ జట్టు (IND W vs NZ W)పై భారత్ విజయంలో భారత ఓపెనర్లు ప్రతికా రావల్ (134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు- 122), స్మృతి మంధాన (95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు- 109)లది కీలక పాత్ర. ఇద్దరూ శతకాలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 76 నాటౌట్) కూడా అద్భుత రీతిలో రాణించింది.ఇక ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా.. ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 340 పరుగులు స్కోరు చేయగా.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్దేశించారు.271 పరుగులే చేసి.. కివీస్ అవుట్అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ 271 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా నవీ ముంబైలో హర్మన్‌సేన జయభేరి మోగించి సెమీస్‌లో అడుగుపెట్టింది.సెమీస్ చేరడం బిగ్ రిలీఫ్ఇక ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana)ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం స్మృతి స్పందిస్తూ.. ‘‘నాకౌట్స్‌కు అర్హత సాధించడం ఉపశమనం కలిగించింది. గత మూడు మ్యాచ్‌లలో మేము ఓడిపోయాం. అది గడ్డు దశ. మంచిగానే ఆడినా.. ఆ మ్యాచ్‌లలో మేము పరాజయం పాలయ్యాము.‘నాకు కాదు!.. తనకే ఇవ్వాల్సిందిఅయితే, ఈరోజు మాత్రం అనుకూలా ఫలితాన్ని రాబట్టగలిగాము. అయితే, ఈ అవార్డు నాకు ఇచ్చే కంటే ప్రతికాకు ఇస్తే బాగుండేది. నాతో పాటు ప్రతికా ఇందుకు అర్హురాలు. నిజంగా నేనైతే ఈ విషయంలో ఆశ్చర్యపోయాను. ఆమెకే అవార్డు ఇస్తారనుకున్నా’’ అని తెలిపింది.కాగా స్మృతి- ప్రతికా జోడీ ఈ ఏడాదిలో ఇప్పటికే 1557 పరుగులు సాధించింది. భారత పురుషుల క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్- సునిల్ గావస్కర్ జంట 1998లో 1635 పరుగులు చేయగా.. వారి రికార్డుకు స్మృతి- ప్రతికా ఇప్పుడు చేరువయ్యారు.ఇక భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో నాలుగు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ టాప్-4లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: IND vs AUS: భారత్‌తో టీ20 సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడుSemi-Final Bound! 😍🤩Deepti Sharma wraps it up as #TeamIndia storm into their 5th Women’s Cricket World Cup semi-final! 👍🏻Watch them next #CWC25 👉 #INDvBAN | SUN, 26th OCT, 2 PM pic.twitter.com/F9sKcNx8Lt— Star Sports (@StarSportsIndia) October 23, 2025 -
ICC WC 2025: సత్తా చాటి సెమీఫైనల్‌కు భారత్
వరల్డ్ కప్‌లో వరుసగా మూడు పరాజయాలతో వెనుకబడి విమర్శలు ఎదుర్కొన్న భారత మహిళల జట్టు అసలు పోరులో చెలరేగింది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటి దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. స్మృతి మంధాన, ప్రతీక రావల్ సెంచరీలతో పాటు జెమీమా మెరుపులు తోడవడంతో భారీ స్కోరుతో న్యూజిలాండ్ మహిళలకు సవాల్ విసిరిన టీమిండియా...ఆపై పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కుప్పకూల్చి ఘన విజయాన్ని అందుకుంది. తాజా ఓటమితో మాజీ చాంపియన్ కివీస్ సెమీస్ అవకాశం కోల్పోయింది. ముంబై: స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌కు చేరింది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తర్వాత సెమీస్ చేరిన చివరి జట్టుగా హర్మన్ సేన నిలిచింది. గురువారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. భారత బ్యాటింగ్ చివర్లో వాన కారణంగా ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించగా, టీమిండియా 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రతీక రావల్ (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 33.2 ఓవర్లలో 212 పరుగులు జోడించడం విశేషం. జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా మెరుపు బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించింది. అనంతరం వర్షం మళ్లీ అంతరాయం కలిగించడంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్ణయించారు. కివీస్ 44 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. బ్రూక్ హ్యాలిడే (84 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్), ఇసబెల్లా గేజ్ (51 బంతుల్లో 65 నాటౌట్; 10 ఫోర్లు) రాణించారు. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. నేడు కొలంబోలో జరిగే నామమాత్రమైన మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడుతుంది. రికార్డు భాగస్వామ్యం... ప్రతీక, స్మృతి జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టడంతో తొలి 2 ఓవర్లు మెయిడిన్‌గా ముగియగా, 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 40/0కు చేరింది. ఆ తర్వాత బ్యాటర్లు నిలదొక్కుకొని పరుగులు రాబట్టడంతో తర్వాతి 46 బంతుల్లో 60 పరుగులు రాబట్టిన భారత్ 100 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఇదే క్రమంలో ముందుగా స్మృతి 49 బంతుల్లో, ప్రతీక 75 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సగం ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 147/0 వద్ద నిలిచింది. 77 పరుగుల వద్ద స్మృతికి అదృష్టం కలిసొచ్చింది. అమేలియా బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించగా బంతి ప్యాడ్‌కు తగలడంతో బౌలర్ అప్పీల్ చేసింది. వెంటనే అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో స్మృతి రివ్యూ కోరింది. రీప్లేలో ముందుగా బంతి గమనాన్ని చూపించారు. అందులో బంతి స్టంప్స్‌ను తాకుతున్నట్లు అర్థం కావడంతో స్మృతి పెవిలియన్ వైపు సాగిపోయింది. అయితే ఆ తర్వాత అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు రేఖ కనిపించడంతో ఆమె వెనక్కి వచ్చింది. కొద్ది సేపటికి 88 బంతుల్లో స్మృతి శతకం పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు 34వ ఓవర్లో తొలి వికెట్ (స్మృతి) తీయడంలో కివీస్ సఫలమైంది. 122 బంతుల్లో ప్రతీక సెంచరీ పూర్తి కాగా, మూడో స్థానంలో వచ్చిన జెమీమా ఆరంభంనుంచే దూకుడును ప్రదర్శించింది. కార్స్ ఓవర్లో మూడు ఫోర్లు బాది 38 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేసింది. బ్యాటింగ్ వైఫల్యం... భారీ లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ సుజీ బేట్స్ (1) తన వైఫల్యం కొనసాగించగా...ప్లిమ్మర్ (30; 5 ఫోర్లు, 1 సిక్స్), అమేలియా కెర్ (45; 4 ఫోర్లు) కొద్దిగా ప్రతిఘటించారు. టోర్నీలో జట్టు బెస్ట్ బ్యాటర్, కెప్టెన్ సోఫీ డివైన్ (6)ను రేణుక చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతోనే భారత్‌కు పట్టు చిక్కింది.59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని ఒకవైపు నుంచి హ్యాలిడే పోరాడుతున్నా...మరో వైపు వరుసగా వికెట్లు తీసి భారత్ ఒత్తిడి పెంచింది. చివర్లో ఇసబెల్లా కూడా ప్రయత్నించినా, చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో కివీస్ ఓటమి దిశగా పయనించింది. 340 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ అత్యధిక స్కోరు. ఇదే టోర్నీలో ఆసీస్‌పై సాధించిన 330 పరుగుల స్కోరును జట్టు అధిగమించింది. 212 స్మృతి, ప్రతీక జోడించిన పరుగులు. వరల్డ్ కప్‌లో ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.14 స్మృతి వన్డే కెరీర్లో ఇది 14వ సెంచరీ. అత్యధిక సెంచరీల జాబితాలో మెగ్ లానింగ్ (15) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) (సబ్) రోవ్ (బి) అమేలియా 122; స్మృతి (సి) (సబ్) రోవ్ (బి) బేట్స్ 109; జెమీమా (నాటౌట్) 76; హర్మన్‌ప్రీత్ (సి) కార్సన్ (బి) రోజ్మేరీ 10; రిచా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 340. వికెట్ల పతనం: 1–212, 2–288, 3–336. బౌలింగ్: రోజ్మేరీ 8–1–52–1, జెస్ కెర్ 8–1–51–0, డివైన్ 6–0–34–0, కార్సన్ 6–0–46–0, తహుహు 4–0–37–0, అమేలియా కెర్ 10–0–69–1, బేట్స్ 7–0–40–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: బేట్స్ (సి) ప్రతీక (బి) క్రాంతి 1; ప్లిమ్మర్ (బి) రేణుక 30; అమేలియా కెర్ (సి) స్మృతి (బి) స్నేహ్ 45; డివైన్ (బి) రేణుక 6; హ్యాలిడే (సి) స్నేహ్ (బి) చరణి 81; గ్రీన్ (సి) క్రాంతి (బి) ప్రతీక 18; ఇసబెల్లా (నాటౌట్) 65; జెస్ కెర్ (సి) స్మృతి (బి) క్రాంతి 18; రోజ్మేరీ (సి) స్మృతి (బి) దీప్తి 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (44 ఓవర్లలో 8 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–1, 2–51, 3–59, 4–115, 5–154, 6–226, 7–266, 8–271. బౌలింగ్: రేణుక 6–0–25–2, క్రాంతి గౌడ్ 9–0–48–2, స్నేహ్ రాణా 8–0–60–1, శ్రీచరణి 9–0–58–1, దీప్తి శర్మ 8–0–57–1, ప్రతీక 4–0–19–1. -
ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana) (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రతిక రావల్ (Pratika Rawal) (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో చెలరేగిపోయారు.వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా సునామీ ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ 10, రిచా ఘోష్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోస్‌మేరీ మైర్, అమేలియా కెర్, సూజీ బేట్స్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులు చేయాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో మొదటి మూడు సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.చదవండి: గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు -
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్మృతి మంధన సూపర్ సెంచరీ
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సూపర్ సెంచరీతో కదంతొక్కింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న మ్యాచ్‌లో 88 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసింది. మంధనకు ఈ ఏడాది ఇది ఐదో శతకం. ఓవరాల్‌గా వన్డేల్లో 14వ శతకం. ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన మంధన.. గత రెండు మ్యాచ్‌లుగా సత్తా చాటుతూ వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో మెరిసింది. వాస్తవానికి ఆ రెండు అర్ద సెంచరీలు కూడా సెంచరీల్లోకి మారాల్సింది. అయితే అవి తృటిలో చేజారాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఆది నుంచి నిలకడగా ఆడింది. ఓపెనర్లు మంధన, ప్రతీక రావల్ (77) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అర్ద సెంచరీ తర్వాత మంధన గేర్ మార్చగా.. ప్రతీక రావల్ అదే టెంపోలో బ్యాటింగ్ చేస్తుంది. 31 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 192 పరుగులుగా ఉంది. మంధన 100, ప్రతీక రావల్ 77 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో మొదటి మూడు సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. చదవండి: IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం -
IND vs NZ: సెమీస్ రేసు.. టాస్ ఓడిన భారత్.. తుదిజట్లు ఇవే
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup) టోర్నమెంట్లో ఆఖరి సెమీ ఫైనల్ బెర్తు కోసం భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) ముఖాముఖి తలపడుతున్నాయి. నవీ ముంబై వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో గెలిస్తే హర్మన్ సేన ఎలాంటి సమీకరణలతో పని లేకుండా నేరుగా సెమీ ఫైనల్ చేరుతుంది.టాస్ ఓడిన భారత్మరోవైపు.. న్యూజిలాండ్‌కు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌గా మారింది. ఇందులో గెలిస్తేనే వైట్‌ఫెర్న్స్ సెమీస్ బెర్తు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.టాస్ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ముందుగా మేము బౌలింగ్ చేస్తాం. వికెట్ పాతబడే కొద్దీ మొత్తంగా మారిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో మేము సన్నద్ధమయ్యాము. రెండు అదనపు సెషన్లు ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేశాం.ఈ టోర్నీలో మాకు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అయితే, ఈరోజు ఎలాంటి ఆటంకం (వర్షం) ఉండదనే భావిస్తున్నాం. 100 ఓవర్ల పాటు మ్యాచ్ సాగాలి. ఇలాంటి తీవ్రమైన ఒత్తిడి ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే క్రికెటర్లు తమలోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీయాలి.ఇండియాలో ఇలాంటి పరిస్థితుల్లో గెలిచి సెమీస్ చేరితే అంతకంటే గొప్ప విషయం మాకు మరొకటి ఉండదు. భారత్‌తో మ్యాచ్ సవాలుతో కూడుకున్నదే. గత మ్యాచ్‌లో ఆడిన తుదిజట్టుతోనే ఇక్కడా బరిలోకి దిగుతున్నాం’’ అని పేర్కొంది.మూడు మార్పులుమరోవైపు.. తమ జట్టులో మూడు మార్పులు చేసినట్లు భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. అదనంగా ముగ్గురు బ్యాటర్లను తుదిజట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ భారత జట్టు ఓడినప్పటికీ బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఒకవేళ బంగ్లాను ఓడిస్తే సులువుగానే సెమీస్ చేరుతుంది. అదే సమయంలో న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడాల్సి ఉంటుంది. ఒకవేళ ఫలితం వేరుగా ఉంటే మాత్రం అప్పుడు నెట్ రన్‌రేటు కూడా కీలకం అవుతుంది. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మహిళా జట్లు సెమీ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుభారత్ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.న్యూజిలాండ్సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(వికెట్ కీపర్), జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్.చదవండి: WC 2025 Ind vs NZ: సెమీస్ సమీకరణం ఇదీ... -
‘నా వల్లే జట్టు ఓడింది.. నేను కాస్త తెలివిగా ఆడాల్సింది’
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ODI World Cup 2025)లో భారత జట్టు మరో పరాజయం చవిచూసింది. స్వీయ తప్పిదాల కారణంగా ఇంగ్లండ్ మహిళా జట్టు (IND W vs ENG W)తో గెలవాల్సిన మ్యాచ్‌లో.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. తద్వారా సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.ఈ నేపథ్యంలో ఇండోర్ వేదికగా ఇంగ్లండ్ చేతిలో ఓటమిపై భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) స్పందించింది. తాను కాస్త తెలివిగా ఆడి ఉంటే మ్యాచ్ తప్పక గెలిచేవాళ్లమని పేర్కొంది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటానికి తాను ప్రధాన కారణమంటూ ఓటమికి బాధ్యత వహించింది. 88 పరుగులు చేసి..నిజానికి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్మృతి అదరగొట్టింది. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 94 బంతులు ఎదుర్కొని 88 పరుగులు చేసి.. జట్టును విజయం దిశగా నడిపించింది. చేతిలో ఏడు వికెట్లు.. గెలుపునకు 53 బంతుల్లో 55 పరుగులు అవసరమైన వేళ అనూహ్య రీతిలో స్మృతి అవుటైంది.లిన్సే స్మిత్ బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా షాట్ బాది అలిస్ కాప్సేకి క్యాచ్ ఇచ్చిన స్మృతి మంధాన.. పెవిలియన్‌కు చేరింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అద్బుత అర్ధ శతకం (70)తో రాణించింది. మరోవైపు.. దీప్తి శర్మ 50 పరుగులతో అదరగొట్టింది. కానీ స్మృతి అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.The skipper’s looking solid and locked on to the chase! 🤜🏻🤛🏻Will Harmanpreet Kaur turn this start into a big one and guide #TeamIndia through in this do-or-die clash? 😮💨Catch the LIVE action ➡https://t.co/WF0rXIHjl8#CWC25 👉 #INDvENG | LIVE NOW on Star Sports & JioHotstar pic.twitter.com/vTs7nP01Tb— Star Sports (@StarSportsIndia) October 19, 2025 ఇంగ్లండ్ విధించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 284 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం స్మృతి మంధాన తీవ్ర భావోద్వేగానికి లోనైంది.నా వల్లే జట్టు ఓడింది.. నేను కాస్త తెలివిగా ఆడాల్సింది‘‘అవును.. మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ప్రతి ఒక్కరు ఇది చూసే ఉంటారు. మా షాట్ సెలక్షన్లు మరింత మెరుగ్గా ఉండాల్సింది. ముఖ్యంగా నేను.. ఇంకాస్త తెలివిగా ప్రవర్తించాల్సింది. మా బ్యాటింగ్ ఆర్డర్ పతనం నాతోనే మొదలైంది. ఇందుకు నేను నైతిక బాధ్యత వహిస్తాను.నాదే బాధ్యతమేము ఓవర్‌కు కేవలం ఆరు పరుగులు చేసి ఉంటే గెలిచేవాళ్లం. కానీ పరిస్థితి మరోలా మారిపోయింది. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి నాదే బాధ్యత’’ అని స్మృతి మంధాన పేర్కొంది. కాగా తాజా వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భారత్‌కు ఇది హ్యాట్రిక్ ఓటమి.ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మహిళా జట్లు సెమీ ఫైనల్ చేరగా.. భారత్‌పై గెలుపుతో ఇంగ్లండ్ కూడా సెమీస్‌కు అర్హత సాధించింది. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్‌తో భారత్ పోటీ పడుతోంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
టీమిండియా మహిళ స్టార్ క్రికెటర్‌తో పెళ్లి.. హింట్ ఇచ్చిన దర్శకుడు
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రముఖ దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్‌ను పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై స్మృతి బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన పలాశ్ ముచ్చల్‌కు స్మృతితో పెళ్లి విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ముచ్చల్.. ఆమె త్వరలోనే ఇండోర్‌కు కోడలిగా రానుంది.. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే అంటూ ఆ వార్తలను ధృవీకరించారు.కాగా.. గతంలో స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. స్మృతి బర్త్ డే సందర్భంగా అతను విషెస్ తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. కానీ వీరిద్దరు తమపై వస్ుతన్న ఊహాగానాలపై స్పందించలేదు. కాగా.. పలాష్ ముచ్చల్ ప్రస్తుతం 'రాజు బజేవాలా'మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అవికా గోర్, చందన్ రాయ్ జంటగా నటిస్తున్నారు. ముచ్చల్ తన సోదరి పాలక్ ముచ్చల్‌తో కలిసి అనేక బాలీవుడ్ చిత్రాలకు సంగీతమందించారు.తాజాగా ఇవాళ ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడుతున్న సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు ముచ్చల్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందనకు నా శుభాకాంక్షలు' తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రతి మ్యాచ్‌లో గెలిచి దేశానికి కీర్తి తీసుకురావాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని అన్నారు. -
అటు శర్మ.. ఇటు స్మృతి! ఇద్దరికి తిరుగులేదు
-
World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీస్ చేరాలంటే...
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI WC 2025)లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. విశాఖపట్నం వేదికగా తొలుత సౌతాఫ్రికా వుమెన్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిన హర్మన్‌సేన.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూసింది.ఓపెనర్లు సూపర్హిట్విశాఖలో ఆస్ట్రేలియా మహిళా జట్టు (IND W vs AUS W)తో మ్యాచ్‌లో 330 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఫలితంగా మూడు వికెట్ల తేడాతో పరాభవం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు ప్రతికా రావల్ (75), స్మృతి మంధాన (Smriti Mandhana- 80) గొప్ప ఆరంభం అందించారు.మిగతావారిలో వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 38, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 22, జెమీమా రోడ్రిగెస్ 33, రిచా ఘోష్ 32 పరుగులతో ఓ మోస్తరుగా రాణించారు. అయితే, ఆసీస్ బౌలర్ల ధాటికి లోయర్ ఆర్డర్ వేగంగా పతనమైంది. అమన్‌జోత్ కౌర్ 16 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. దీప్తి శర్మ (1), స్నేహ్ రాణా (8), క్రాంతి గాడ్ (1), శ్రీ చరణి (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది.అనాబెల్ సదర్లాండ్కు ఐదుఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. సోఫీ మొలినక్స్ మూడు వికెట్లు పడగొట్టింది. మిగిలిన వారిలో మేగన్ షట్, ఆష్ల గార్డ్నర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్, కెప్టెన్ అలిసా హేలీ ఆకాశమే హద్దుగా చెలరేగింది.హేలీ విధ్వంసంకేవలం 107 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించింది. 142 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రీచరణి బౌలింగ్‌లో స్నేహ్ రాణాకు క్యాచ్ ఇవ్వడంతో హేలీ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆమెకు తోడుగా మరో ఓపెనర్ ఫోబే లిచ్‌ఫీల్డ్ 40, వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిస్ పెర్రీ 47, ఆష్లే గార్డ్నర్ 45 పరుగులతో రాణించారు. ఆఖర్లో కిమ్ గార్త్ (14) సిక్సర్‌బాది ఆసీస్ విజయాన్ని ఖరారు చేసింది.It took another moment of brilliance to stop Alyssa Healy! 🙌Shree Charani ends her spell with 3 wickets, while Sneh Rana takes a stunner 🔥Will this wicket be the turning point of the match? 👀Catch the LIVE action ➡https://t.co/qAoZd44TEs#CWC25 👉 #INDvAUS | LIVE NOW… pic.twitter.com/NMKHPYlZ8q— Star Sports (@StarSportsIndia) October 12, 2025వరుసగా రెండు ఓటములు..కాగా వన్డే వరల్డ్‌కప్-2025లో భారత జట్టు ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తొలుత శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌సేన.. ఆ తర్వాత దాయాది పాకిస్తాన్‌ను 88 పరుగుల తేడాతో చిత్తు చేసింది.అనంతరం సౌతాఫ్రికా, ఆసీస్ చేతుల్లో వరుస ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌లలో మెరుగైన ఫలితాలు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు విజయాలతో ఉన్న భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి.సెమీస్ చేరాలంటే..ఆస్ట్రేలియా (7), ఇంగ్లండ్ (6) తర్వాత హర్మన్‌సేన పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక భారత్ తదుపరి ఇంగ్లండ్ (అక్టోబరు 19), న్యూజిలాండ్ (23), బంగ్లాదేశ్ (అక్టోబరు 26) జట్లతో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లలో గెలిస్తే నెట్‌రన్‌రేటుతో పనిలేకుండా టాప్-4లో నిలిచి.. నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది హర్మన్‌సేన.ఒకవేళ ఇంగ్లండ్ చేతిలో ఓడితే మాత్రం.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై భారత జట్టు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. తద్వారా మరో నాలుగు పాయింట్లు సాధించి.. మొత్తంగా ఎనిమిది పాయింట్లతో సెమీస్‌కు దూసుకువెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ కంటే నెట్‌రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.చదవండి: ఇది అవుట్ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా -
IND VS AUS: చెలరేగిన మంధన.. టీమిండియా భారీ స్కోర్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో (India vs Australia) టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడింది.96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది. వీరిద్దరు ఔటయ్యాక స్కోర్ కాస్త నెమ్మదించింది. హర్లీన్ డియోల్ (38), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (22), జెమీమా రోడ్రిగెజ్ (33), రిచా ఘోష్ (32), అమన్‌జోత్ కౌర్ (16) అడపాదడపా మెరుపులు మెరిపించారు. టెయిలెండర్లు దారుణంగా విఫలమయ్యారు. వీరు కూడా తలో చేయి వేసి ఉంటే టీమిండియా ఇంకాస్త భారీ స్కోర్ చేసుండేది. 21 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 5 వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ తలా ఒకటి, శ్రీ చరణి డకౌటయ్యారు. స్నేహ్ రాణా 8 పరుగులతో అజేయంగా నిలిచింది.ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 5 వికెట్లతో సత్తా చాటగా.. సోఫీ మోలినెక్స్ 3, మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో మంధన పలు రికార్డులు నెలకొల్పింది. 18 పరుగుల స్కోర్ వద్ద ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆమె.. వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.అలాగే అర్ద సెంచరీ తర్వాత వన్డేల్లో 5000 పూర్తి చేసుకున్న మంధన.. బంతులు, ఇన్నింగ్స్‌ల పరంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్‌లు, 5569 బంతులు అవసరమయ్యాయి. ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29 ఏళ్లు) సొంతం చేసుకున్న ప్లేయర్‌గానూ మంధన రికార్డు నెలకొల్పింది.వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.చదవండి: భారత్‌తో రెండో టెస్ట్.. విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం -
IND VS AUS: అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచ రికార్డు
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది.తొలుత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో (2025) 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన ఆమె.. ఆతర్వాత కొద్ది నిమిషాలకే వన్డేల్లో 5000 పరుగుల అరుదైన మైలురాయిని అందుకుంది. 1000 పరుగుల మార్కును సిక్సర్‌తో తాకిన మంధన.. 5000 పరుగుల మైలురాయిని కూడా సిక్సర్‌తోనే అందుకుంది.బంతులు, ఇన్నింగ్స్‌ల పరంగా మంధన ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్‌లు, 5569 బంతులు అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డులు స్టెఫానీ టేలర్ (129 ఇన్నింగ్స్‌లు), సూజీ బేట్స్ (6182 బంతులు) పేరిట ఉండేవి.ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29) సొంతం చేసుకున్న ప్లేయర్‌గానూ మంధన రికార్డు నెలకొల్పింది.వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.ఈ మ్యాచ్‌లో మంధన 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటైంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో మంధనకు ఇదే తొలి అర్ద సెంచరీ (4 మ్యాచ్‌ల్లో).వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 27 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/1గా ఉంది. మంధన ఔట్ కాగా.. ప్రతిక రావల్ (68), హర్లీన్ డియోల్ (12) క్రీజ్‌లో ఉన్నారు. మంధన వికెట్ సోఫీ మోలినెక్స్కు దక్కింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్‌కప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఎవరూ సాధించని ఈ ఘనతను మంధన భారీ సిక్సర్‌తో చేరుకోవడం మరో విశేషం.వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (2025లో 18 ఇన్నింగ్స్‌ల్లో 1000* పరుగులు) చేసిన బ్యాటర్ల జాబితాలో మంధన తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (1997లో 970 పరుగులు), లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్‌కు చెందిన యామీ సాటర్థ్వైట్ (2016లో 853) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/0గా ఉంది. ఓపెనర్లు మంధన 49, ప్రతిక రావల్ 40 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.మంధన@18మంధన ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగుల మార్కును 18 పరుగుల వద్ద చేరుకుంది. 1000 పరుగుల మార్కును ఆమె 18వ ఇన్నింగ్స్‌లో చేరుకుంది. మంధన జెర్సీ నంబర్ కూడా 18 కావడం విశేషం.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లోనూ భారత్‌కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్‌లో ఆసీస్ పాక్‌పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లో ఉంది.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో గెలవాల్సిన మ్యాచ్‌ను అనూహ్య రీతిలో భారత మహిళా క్రికెట్ జట్టు చేజార్చుకుంది. ఆఖరి వరకు పోరాడినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయింది. సౌతాఫ్రికా బ్యాటర్ నదినె డి క్లెర్క్ (Nadine de Klerk) అద్భుత ఆట తీరుతో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుని.. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే తమ జట్టును విజయతీరాలకు చేర్చింది.ఈ నేపథ్యంలో అనూహ్య ఓటమిపై భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) స్పందించింది. టాపార్డర్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణం అని పేర్కొంది. ఇకపై తమ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉందని.. భారీ స్కోర్లు సాధించడంపై దృష్టి పెడతామని పేర్కొంది.251 పరుగులకు ఆలౌట్ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup) టోర్నీలో భాగంగా భారత్ విశాఖ వేదికగా గురువారం సౌతాఫ్రికాతో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి ఫెయిల్ఓపెనర్లలో ప్రతికా రావల్ (37) ఫర్వాలేదనిపించగా.. స్మృతి మంధాన (23) మరోసారి నిరాశపరిచింది. ఇక వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియెల్ (13)తో పాటు నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ (9) కూడా విఫలమైంది. రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్జెమీమా రోడ్రిగెస్ డకౌట్ కాగా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 13 పరుగులకే వెనుదిరిగింది. ఇలాంటి క్లిష్ట దశలో వికెట్ కీపర్ రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్ (77 బంతుల్లో 94)తో జట్టును ఆదుకోగా.. స్నేహ్ రాణా (24 బంతుల్లో 33) ఆమెకు సహకరించింది.A game-changing fifty by Richa Ghosh, her 7th in ODIs & first in CWC! 🔥Will she & Sneh Rana steer Team India over the 250-run mark?Catch the LIVE action ➡ https://t.co/qUAtuPmsC2#CWC25 👉 #INDvSA | LIVE NOW on Star Sports & JioHotstar! pic.twitter.com/r1SyLR4ieB— Star Sports (@StarSportsIndia) October 9, 202584 పరుగులతో అజేయంగాఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే చుక్కెదురైంది. తజ్మిన్ బ్రిట్స్ డకౌట్ కాగా.. సునే లూస్ 5 పరుగులకే అవుటైంది. మరో ఓపెనర్, కెప్టెన్ వొల్వార్ట్ 70 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ నదినే డి క్లెర్క్ 54 బంతుల్లోనే 84 పరుగులతో అజేయంగా నిలిచి.. హర్మన్‌సేన హార్ట్ బ్రేక్ చేసింది.టాపార్డర్‌లో మేము బాధ్యత తీసుకోలేకపోయాంఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘టాపార్డర్‌లో మేము బాధ్యత తీసుకోలేకపోయాం. వ్యూహాలు మార్చుకోవాలి. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పాలి. ఇదొక సుదీర్ఘ టోర్నమెంట్.ఏదేమైనా ఈ మ్యాచ్ మాకు కఠినంగా తోచింది. ఎన్నో పాఠాలు నేర్పింది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాం. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు గొప్పగా ఆడాయి. మా టాపార్డర్ కుప్పకూలినా 250కి పైగా స్కోరు చేయడం శుభపరిణామమే.అయితే, ఆఖర్లో క్లెర్క్ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమ జట్టు వైపు తిప్పేసింది. విశాఖ పిచ్ బాగుంది. సౌతాఫ్రికా విజయానికి అర్హమైన జట్టే’’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. ఇక రిచా ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అత్యద్భుతంగా ఆడింది. రిచా హిట్టింగ్ ఈ మ్యాచ్‌లో మాకు అతిపెద్ద సానుకూలాంశం. తనిలాగే ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాం’’ అని హర్మన్ పేర్కొంది.చదవండి: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు -
చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) 28 ఏళ్ల కిందటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి, చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో 23 పరుగులు చేసిన మంధన ఈ క్యాలెండర్ ఇయర్లో (2025) పరుగుల సంఖ్యను 982కు (17 ఇన్నింగ్స్‌ల్లో) పెంచుకుంది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (Belinda Clark) పేరిట ఉండేది. క్లార్క్ 1997 క్యాలెండర్ ఇయర్లో 970 పరుగులు చేసింది. ఈ విభాగంలో మంధన, క్లార్క్ తర్వాత సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్‌కు చెందిన యామీ సాటర్థ్వైట్ (2016లో 853) ఉన్నారు. మంధన వన్డేల్లో ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా, అంతకుముందు అద్భుత ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది మంధన ఖాతాలో నాలుగు వన్డే శతకాలు కూడా ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నిన్న (అక్టోబర్ 9) వైజాగ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎనిమిదో నంబర్ ప్లేయర్ నదినే డి క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది.భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 81 పరుగులకే 5 కోల్పోయింది. ఈ దశలో క్లెర్క్, క్లో ట్రయాన్ (49) సహకారంతో మ్యాచ్‌ను గెలిపించింది. చివరి 5 ఓవర్లలో 52 పరుగులు చేయాల్సిన దశలో క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. అంతకుముందు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (70) రాణించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్ కారణంగా 251 పరుగులు చేసింది. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రిచా.. స్నేహ్ రాణా (33) సహకారంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఈ మ్యాచ్‌ను చేజార్చుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన రిచా ఘోష్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా -
World Cup 2025: వారి కోసం వరల్డ్‌కప్ గెలుస్తాం
కొలంబో: భారత్‌లో మహిళల క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన పలువురి కోసం తాము వన్డే ప్రపంచ కప్ (ICC Womens ODI World Cup)ను గెలవాలని కోరుకుంటున్నట్లు భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో బయట జరిగే చర్చ గురించి తాము పట్టించుకోమని, తమ దృష్టి మొత్తం విజయంపైనే ఉందని ఆమె వెల్లడించింది. ఆదివారం పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత జెమీమా తమ ప్రదర్శనపై మాట్లాడింది. సవాళ్ల గురించే చర్చ‘మేం ఒకసారి ఒక మ్యాచ్‌పైనే దృష్టి పెడుతూ ముందుకు వెళుతున్నాం. ప్రపంచ కప్ గురించి బయట ఎంతో చర్చ జరుగుతుందని మాకు తెలుసు. దాని ప్రభావం మాపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా బృందం సమావేశాల్లో కూడా ఆటలో ఎదురయ్యే సవాళ్ల గురించే మాట్లాడుకుంటున్నాం. అప్పుడు మిథాలీ, జులన్.. ఇప్పుడు..ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నాం. నేను జట్టులోకి వచ్చినప్పుడు మిథాలీ, జులన్‌లాంటి సీనియర్లు నడిపించారు. ఇప్పుడు హర్మన్, స్మృతి కలిసి జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. అందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన చూపించే విధంగా వారు తీర్చిదిద్దారు. భారత మహిళల క్రికెట్ స్థాయిని పెంచిన మిథాలీ, జులన్, నీతూ డేవిడ్వంటి ప్లేయర్ల కోసం వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్నాం’ అని జెమీమా పేర్కొంది. గువహటి, కొలంబో పిచ్‌లను బ్యాటర్లకు సవాల్‌గా నిలిచాయని, పరిస్థితులకు తగినట్లుగా తమ ఆటను మలచుకున్నామని ఆమె వివరించింది. చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్.. ప్రపంచంలో తొలి ప్లేయర్
సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ తజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits) మహిళల వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ క్యాలెండర్ ఇయర్లో ఐదు సెంచరీలు బాదిన తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్‌కప్ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్ 6) జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో ఈ ఘనత సాధించింది.తజ్మిన్కు ముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) ఖాతాలో ఉండిది. మంధన 2024, 2025 క్యాలెండర్ ఇయర్స్‌లో నాలుగు సెంచరీలు బాదింది. తాజాగా తజ్మిన్ మంధన రికార్డును బద్దలు కొట్టి, సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ సుదీర్ఘంగా సాగనుండటంతో మంధన తిరిగి తన రికార్డును తజ్మిన్ నుంచి చేజిక్కించుకునే అవకాశాలు లేకపోలేదు. ఇటీవలికాలంలో మంధన కూడా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. అయితే ఈ ప్రపంచకప్‌లో మాత్రం తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైంది.తజ్మిన్ ఖాతాలో మరో భారీ రికార్డుతాజా సెంచరీతో తజ్మిన్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకుంది. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు పూర్తి చేసిన ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్ రికార్డును బ్రేక్ చేసింది. వన్డేల్లో 7 సెంచరీలు పూర్తి చేసేందుకు లాన్నింగ్‌కు 44 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. తజ్మిన్ కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించింది. ప్రపంచంలో తజ్మిన్, లాన్నింగ్ మినహా ఏ ఒక్క మహిళా ప్లేయర్ కూడా కనీసం 50 ఇన్నింగ్స్‌ల్లో 7 వన్డే సెంచరీలు పూర్తి చేయలేకపోయారు.మ్యాచ్ విషయానికొస్తే.. తజ్మిన్ మెరుపు సెంచరీతో (89 బంతుల్లో 101; 15 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తజ్మిన్కు సూన్ లస్ (83 నాటౌట్) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా సునాయాస విజయాన్ని సాధించింది. అంతకుముందు సోఫీ డివైన్ (85) రాణించడంతో న్యూజిలాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ మ్యాచ్ తజ్మిన్తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్స్ సూజీ బేట్స్, సోఫీ డివైన్‌కు కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే బేట్స్ మహిళ క్రికెట్లో 350 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సోఫీ డివైన్‌కు కూడా ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్. అతి తక్కువ మంది మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.వైరలవుతున్న తజ్మిన్ సంబరాలుఈ మ్యాచ్‌లో తజ్మిన్ సెంచరీ తర్వాత చేసుకున్న 'బౌ అండ్ యారో' సంబరాలు వైరలవుతున్నాయి. తజ్మిన్ సెలబ్రేషన్స్‌కు భారత క్రికెట్ అభిమానులు సైతం ముగ్దులవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. The moment Tazmin Brits made it 4️⃣ hundreds in her last 5️⃣ ODIs 🤩Watch #NZvSA LIVE in your region, broadcast details here ➡️ https://t.co/MNSEqhJP29#CWC25 pic.twitter.com/NfSYRjCsOY— ICC Cricket World Cup (@cricketworldcup) October 6, 2025తజ్మిన్ ఇంతకుముందు కూడా ఇలాంటి వినూత్న సంబరాలు చేసుకొని వార్తల్లో నిలిచింది. ఒంటికాలిపై యోగాసనం లాంటివి చేసి బాగా పాపులరైంది.యాదృచ్చికంతజ్మిన్ ఓ క్యాలెండర్ ఇయర్లో 5 సెంచరీలు చేసిన రోజే (అక్టోబర్ 6), సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ గ్యారీ కిర్‌స్టన్ కూడా ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. పురుషుల క్రికెట్లో కిర్‌స్టన్ 1996 క్యాలెండర్ ఇయర్లో ఇదే రోజు తన ఐదో వన్డే సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సౌతాఫ్రికన్‌గా చరిత్ర సృష్టించాడు. ఒకే రోజు ఇద్దరు సౌతాఫ్రికన్లు ఒకే ఫీట్‌ను సాధించడం యాదృచ్చికంగా జరిగింది.5 ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాలుతజ్మిన్ తన వన్డే కెరీర్లో చేసిన 7 సెంచరీల్లో నాలుగింటిని గత 5 ఇన్నింగ్స్‌ల్లోనే చేయడం విశేషం. ఈ సెంచరీకి ముందు ఇంగ్లండ్‌తో వన్డేలో (5) విఫలమైన ఆమె.. అంతకుముందు మూడు వన్డేల్లో పాక్‌పై 2, వెస్టిండీస్‌పై ఓ సెంచరీ సాధించింది.గత 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో తజ్మిన్ స్కోర్లు- 101(91) Vs వెస్టిండీస్- 101*(121) Vs పాక్- 171*(141) Vs పాక్- 5(13) Vs ఇంగ్లండ్- 101(89) Vs న్యూజిలాండ్ (WC)తజ్మిన్ గురించి ఆసక్తికర విషయాలు..ప్రస్తుతం స్టార్ క్రికెటర్‌గా చలామణి అవుతున్న తజ్మిన్ తన కెరీర్‌ను అథ్లెట్‌గా మొదలుపెట్టింది. 2007లో ఆమె వరల్డ్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించింది. 2012 ఒలింపిక్స్‌కు ఎంపిక కావాల్సిన సమయంలో ఆమె రోడ్డు ప్రమాదానికి గురై, రెండు నెలలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. దీంతో అథ్లెట్‌గా ఆమె కెరీర్ అక్కడితో ముగిసింది. ఆతర్వాత 2018లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికైన తజ్మిన్ అప్పటి నుంచి కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తుంది. తజ్మిన్ తన తొలి 40 వన్డేల్లో ఒక్క డకౌట్ కూడా కాకుండా ఆడి అరుదైన ఆటగాళ్ల జాబితాలో నిలిచింది. చదవండి: రిషబ్ పంత్ రీఎంట్రీ..! -
‘టాప్’ ర్యాంక్‌లోనే స్మృతి
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ స్మృతి మంధాన అగ్ర స్థానంలోనే కొనసాగుతోంది. ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో 300 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన స్మృతి మొత్తం 818 ర్యాంకింగ్ పాయింట్లతో తన నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. స్మృతి, రెండో స్థానంలో ఉన్న నాట్ సివర్ బ్రంట్ (ఇంగ్లండ్; 731) మధ్య రేటింగ్ పాయింట్లలో భారీ అంతరం ఉండటం విశేషం.భారత్‌తో మూడో వన్డేలో శతకం బాదిన బెత్ మూనీ (ఆ్రస్టేలియా) రెండు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌కు చేరుకుంది. టాప్–10లో భారత్ నుంచి స్మృతి మినహా ఎవరూ లేకపోగా... కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు స్థానాలు కోల్పోయి 14వ ర్యాంక్‌కు పడిపోయింది. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ దీప్తి శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 5వ ర్యాంక్‌కు చేరుకుంది. భారత్ నుంచి టాప్–10లో మరెవరూ లేకపోగా... స్నేహ్ రాణా 16వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఈ జాబితాలో సోఫియా ఎకెల్‌స్టోన్ (ఇంగ్లండ్), యాష్లే గార్డ్నర్ (ఆ్రస్టేలియా), మేగన్ షుట్ (ఆ్రస్టేలియా) వరుసగా తమ టాప్–3 ర్యాంక్‌లు నిలబెట్టుకున్నారు. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా దీప్తి శర్మ (4వ స్థానం)కు టాప్–10లో చోటు లభించింది. -
క్రికెటర్ స్మృతి మంధానాకు వైఎస్ జగన్ అభినందనలు
-
స్మృతి మంధనాకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధనాకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. వన్డే క్రికెట్లో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. స్మృతి మంధానకు హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్టు చేశారు. Heartiest congratulations to Smriti Mandhana for setting the fastest century record in ODI cricket by any Indian in just 50 balls!@mandhana_smriti pic.twitter.com/BwTdKZG956— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2025భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వన్డే క్రికెట్లో మరో రికార్డు సృష్టించింది. ఈ ఫార్మాట్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ (50 బంతుల్లో) చేసిన క్రికెటర్‌గా ఘనత సాధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో మంధాన (125; 63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) వీరబాదుడుతో ఈ ఫీట్ అందుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆమె 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. దీంతో మహిళల వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన మంధాన 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. ఓవరాల్‌గా ఆసీస్ ప్లేయర్ మెగ్ లానింగ్ (45 బంతుల్లో) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. -
IND VS AUS: మంధన వీరోచిత శతకం వృధా.. పోరాడి ఓడిన టీమిండియా
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆసీస్ గెలువగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. ఇవాళ (సెప్టెంబర్ 20) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్ మరోసారి గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ అతి భారీ స్కోర్ చేసింది. బెత్ మూనీ (75 బంతుల్లో 138; 23 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసి ఆలౌటైంది. మూనీతో పాటు జార్జియా వాల్ (81), ఎల్లిస్ పెర్రీ (68) సత్తా చాటారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ పోరాడి ఓడింది. స్మృతి మంధన (63 బంతుల్లో 125; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత శతకంతో విజృంభించినా, లక్ష్యానికి 44 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మంధనతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (52), దీప్తి శర్మ (72) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ 47 ఓవర్లలో 369 పరుగులు చేసి ఆలౌటైంది. మంధన, హర్మన్ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. వీరిద్దరూ ఔటైన తర్వాత కూడా దీప్తి శర్మ కాసేపు ఆశలు రేకెత్తించింది. అయితే భారత చివరి వరుస బ్యాటర్లు త్వరితగతిన ఔట్ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. -
IND VS AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఉగ్రరూపం దాల్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బెత్ మూనీ (75 బంతుల్లో 138) విధ్వంకర శతకంతో విరుచుకుపడటంతో 412 పరుగుల రికార్డు స్కోర్ చేయగా.. భారత్ కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంధన 23 బంతుల్లో హాఫ్ సెంచరీ, 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది.🚨 THE HISTORIC MOMENT 🚨- Smriti Mandhana becomes the fastest Indian to score Hundred in ODI history, just 50 balls. 🥶 pic.twitter.com/xjTRsoQvgP— Johns. (@CricCrazyJohns) September 20, 2025భారత్ తరఫున పురుషుల విభాగంలో కాని, మహిళల విభాగంలో కాని మంధనదే ఫాస్టెస్ట్ సెంచరీ. పురుషుల విభాగంలో ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ ఆస్ట్రేలియాపైనే 52 బంతుల్లో శతక్కొట్టాడు. మహిళల క్రికెట్లో ఓవరాల్‌గా చూస్తే మంధనది సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. మహిళల ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ రికార్డు ఆసీస్‌కు చెందిన మెగ్ లాన్నింగ్ (45) పేరిట ఉంది. పురుషుల వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ ఏబీ డివిలియర్స్ (31) పేరిట ఉంది.ఈ సెంచరీకి ముందు కూడా భారత్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మంధన పేరిటే ఉండేది. ఆమె 70 బంతుల్లో ఒకసారి, 77 బంతుల్లో మరోసారి సెంచరీలు చేసింది. ఈ సెంచరీతో మంధన మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా ప్రమోట్ అయ్యింది. ఈ సెంచరీ మంధనకు వన్డేల్లో 13వది కాగా.. సుజీ బేట్స్ కూడా ఇన్నే సెంచరీలతో రెండో స్థానంలో ఉంది. మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు ఆసీస్‌కు చెందిన మెగ్ లాన్నింగ్ (15) పేరిట ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. 413 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్య ఛేదనలో భారత్ దూసుకుపోతుంది. పోరాడితే పోయేదేముందున్న చందంగా టీమిండియా ఎదురుదాడి చేస్తుంది. 20 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 204/2గా ఉంది. మంధన 120 (60 బంతుల్లో), హర్మన్‌ప్రీత్ (34 బంతుల్లో 52) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 180 బంతుల్లో 209 పరుగులు చేయాలి. -
IND VS AUS: వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
స్వదేశంలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో హాఫ్ సెంచరీ, రెండో వన్డేలో సెంచరీ చేసిన ఆమె.. ఇవాళ (సెప్టెంబర్ 20) జరుగుతున్న మూడో వన్డేలో మరో హాఫ్ సెంచరీ చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. బెత్ మూనీ (75 బంతుల్లో 138) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 412 పరుగుల రికార్డు స్కోర్ చేయగా.. భారత్ కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంధన 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.మహిళల వన్డే క్రికెట్లో భారత్ తరఫున ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. దీనికి ముందు రిచా ఘోష్ (26 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉండేది. ఓవరాల్‌గా మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో మంధన మెగ్ లాన్నింగ్, ఆష్లే గార్డ్నర్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉంది. లాన్నింగ్, గార్డ్నర్ కూడా 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేశారు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు విండీస్‌కు చెందిన డియాండ్ర డొట్టిన్ (20 బంతుల్లో) పేరిట ఉంది.413 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పోరాడితే పోయేది ఏముందన్న రీతిలో టీమిండియా ఎదురుదాడి చేస్తుంది. 16 ఓవర్ల తర్వాత భారత్ జట్టు స్కోర్ 164/2గా ఉంది. మంధన 92 పరుగుల (46 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ఆమెకు జతగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (24 బంతుల్లో 40; 7 ఫోర్లు) క్రీజ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే ఇంకా 249 పరుగులు చేయాలి. -
మంధన విధ్వంసకర శతకం.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన రెండో వన్డేలో టీమిండియా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది.ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. భారత ఇన్నింగ్స్‌లో మంధన మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29), ప్రతిక రావల్ (25), స్నేహ్ రాణా (24) పర్వాలేదనిపించారు.హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17), రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, తహ్లియా మెక్‌గ్రాత్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్ ఠాకూర్ (6.3-0-28-1), స్నేహ్ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో సదర్‌ల్యాండ్ (45), ఎల్లిస్ పెర్రీ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 20న జరుగనుంది. -
IND VS AUS: మంధన మెరుపు శతకంతో చెలరేగినా..!
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగినా భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో 49.5 ఓవర్లలో 292 పరుగులకే ఆలౌటైంది.ఓ దశలో భారత్ 350కి పైగా స్కోర్ చేస్తుందేమో అనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి తారుమారైంది. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29) కాసేపు పోరాడారు. ఆతర్వాత వచ్చిన రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో స్నేహ్ రాణా (24) బ్యాట్ ఝులిపించిడంతో భారత్ 290 పరుగుల మార్కునైనా తాకగలిగింది.అంతకుముందు టాపార్డర్ బ్యాటర్లు (మంధన మినహా) కూడా తడబడ్డారు. ఓపెనర్ ప్రతిక రావల్‌కు (25) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచలేకపోయింది. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.ఓ పక్క వికెట్లు పడుతున్నా మంధన ఏమాత్రం తగ్గకుండా ధాటిగా ఆడటం కొనసాగించింది. 32.2 ఓవర్లలో 192 పరుగుల వద్ద మంధన ఔట్ కావడంతో భారత్ స్కోర్ నెమ్మదించింది. మంధన ఔటయ్యాక భారత్ చివరి 6 వికెట్లు 53 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. మంధన దెబ్బకు తొలుత లయ కోల్పోయిన ఆసీస్ బౌలర్లు, ఆఖర్లో పుంజుకున్నారు. డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, తహ్లియా మెక్‌గ్రాత్ తలో వికెట్ తీశారు. వీరిలో గార్డ్నర్ (10-1-39-2) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జార్జియా వాల్‌ను రేణుకా సింగ్ డకౌట్ చేసింది. రేణుకా బౌలింగ్‌కు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన వాల్ 5 బంతులు ఎదుర్కొన్న తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యింది. భారత్‌కు ఐదో ఓవర్ ఐదో బంతికి మరో బ్రేక్ లభించింది. మరో ఓపెనర్ అలైస్సా హీలీని (9) క్రాంతి గౌడ్ బోల్తా కొట్టించింది. దీంతో ఆసీస్ 5 ఓవర్లలో 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవాలంటే 45 ఓవర్లలో మరో 281 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో గెలిచి ఆసీస్ 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
IND VS AUS: రికార్డు శతకం.. చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. మంధన మెరుపు శతకంతో చెలరేగింది. కేవలం 77 బంతుల్లోనే శతక్కొట్టి, భారత్ తరఫున వన్డేల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది. భారత్ తరఫున ఫాస్టెస్ట్ రికార్డు కూడా మంధన పేరిటే ఉంది. ఇదే ఏడాది ఐర్లాండ్‌పై ఆమె 70 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది.తాజా సెంచరీ మంధనకు వన్డేల్లో 12వది. ఈ శతకంతో ఆమె ప్రపంచ రికార్డును సమం చేసింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనింగ్ బ్యాటర్‌గా సూజీ బేట్స్ (న్యూజిలాండ్), ట్యామీ బేమౌంట్ (ఇంగ్లండ్) సరసన చేరింది. మంధన, బేట్స్, బేమౌంట్ ఓపెనర్లుగా తలో 12 శతకాలు చేశారు. అయితే బేట్స్, బేమౌంట్ కంటే మంధననే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించింది. బేట్స్‌కు 130, బేమౌంట్‌కు 113 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. మంధన తన 106వ ఇన్నింగ్స్‌లోనే 12 సెంచరీల మార్కును తాకింది.చరిత్ర సృష్టించిన మంధనతాజా సెంచరీ పూర్తి చేసిన తర్వాత మంధన ఓ విభాగంలో చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్‌కు సంబంధించి, ఓ క్యాలెండర్ ఇయర్లో (వన్డేల్లో) అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అవతరించింది. గతంలో ఈ రికార్డు దీప్తి శర్మ పేరిట ఉండేది. దీప్తి 2017లో 19 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 787 పరుగులు చేయగా.. మంధన ఈ ఏడాది 13 ఇన్నింగ్స్ల్లనే 3 శతకాలు, 4 అర్ద శతకాల సాయంతో 803 పరుగులు చేసింది.చరిత్రలో తొలి క్రికెటర్తాజా సెంచరీతో మంధన మరో చారిత్రక రికార్డును కూడా సొంతం చేసుకుంది. మహిళల వన్డేల్లో రెండు వేర్వేరు క్యాలెండర్ ఇయర్స్‌లో 3కు పైగా సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. 2024లో 4 సెంచరీలు చేసిన మంధన.. ఈ ఏడాది ఇప్పటికే 3 సెంచరీలు పూర్తి చేసింది.తాజా శతకంతో మంధన రెండు వేర్వేరు దేశాలపై (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) మూడు వన్డే సెంచరీలు చేసిన తొలి భారత ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించింది. ఈ సెంచరీతో మంధన మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ట్యామీ బేమౌంట్తో పాటు మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మెగ్ లాన్నింగ్ (15) అగ్రస్థానంలో ఉండగా.. సూజీ బేట్స్ (13), బేమౌంట్ (12), మంధన (12) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో మంధన 91 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔటైంది. తొలి అర్ద సెంచరీకి 45 బంతులు తీసుకున్న మంధన, ఆతర్వాత అర్ద సెంచరీని కేవలం 32 బంతుల్లోనే పూర్తి చేసింది. హాఫ్ సెంచరీ మార్కును సిక్సర్‌తో, సెంచరీ మార్కును బౌండరీతో అందుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 38 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. మంధన (117), ప్రతిక రావల్ (25), హర్లీన్ డియోల్ (10), హర్మన్‌ప్రీత్ (17) ఔట్ కాగా.. రిచా ఘోష్ (19), దీప్తి శర్మ (20) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 2, తహ్లియా మెక్‌గ్రాత్ ఓ వికెట్ తీశారు. ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించిన టీమిండియా స్టార్ ప్లేయర్
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధన ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరింది. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండిన మంధన.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాణించి (58 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) 7 అదనపు రేటింగ్ పాయింట్లను సాధించింది. తద్వారా తన పాయింట్ల సంఖ్యను 735కు పెంచుకుని టాప్ ర్యాంక్‌కు చేరింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్‌ను కిందకు దించి, కెరీర్లో నాలుగో సారి అగ్రపీఠాన్ని అధిరోహించింది. 2019లో తొలిసారి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్న మంధన.. ఈ ఏడాది జూన్, జులైల్లో కూడా స్వల్ప కాలం నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా కొనసాగింది. ప్రస్తుతం మంధనకు రెండో స్థానంలో ఉన్న బ్రంట్‌కు కేవలం నాలుగు రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ వారం ఆసీస్‌తో జరుగబోయే మరో రెండు వన్డేల్లో మంధన ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపర్చుకుని అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. మంధన కీలక సమయంలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఈ నెలాఖరు నుంచి (సెప్టెంబర్ 30) భారత్, శ్రీలంకల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకడం ఆమెకు మానసిక స్తైర్యాన్ని ఇస్తుంది. తాజా ర్యాంకింగ్స్‌లో మంధనతో పాటు మరో ఇద్దరు భారత బ్యాటర్లు కూడా లబ్ది పొందారు. ప్రతీక రావల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 42వ స్థానానికి.. హర్లీన్ డియోల్ 5 స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి ఎగబాకారు. మిగతా భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ 12వ స్ధానంలో.. జెమీమా రోడిగ్రెజ్ 15 స్థానంలో, దీప్తి శర్మ 24వ స్థానంలో, రిచా ఘోష్ 37 స్థానంలో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. భారత స్పిన్నర్ స్నేహ్ రాణా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి ఎగబాకింది. మరో భారత బౌలర్ దీప్తి శర్మ 3 స్థానాలు దిగజారి 7వ ర్యాంక్‌ను పడిపోయింది. మిగతా భారత బౌలర్లలో రేణక సింగ్ ఠాకూర్ 26, క్రాంతి గౌడ్ 62, అరుంధతి రెడ్డి 65, పూజా వస్త్రాకర్ 77, శ్రీ చరణి 83, ప్రియా మిశ్రా 85, టైటాస్ సాధు 91, సైమా ఠాకోర్ 96 స్థానాల్లో ఉన్నారు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డ్నర్ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోగా.. హేలీ మాథ్యూస్, మారిజన్ కాప్ టాప్-3లో ఉన్నారు. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 4వ స్థానంలో ఉంది. -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడి
ఆస్ట్రేలియాతో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన (Smriti Mandhana)- ప్రతీకా రావల్ (Pratika Rawal) అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇద్దరూ అర్ధ శతకాలతో చెలరేగి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలోనే పాతికేళ్లుగా బెలిండా క్లార్క్- లిసా కైట్లీ పేరిట ఉన్న వన్డే ప్రపంచ రికార్డును స్మృతి- ప్రతీకా బద్దలు కొట్టారు.టాపార్డర్ హాఫ్ సెంచరీలుకాగా మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC ODI WC 2025) సన్నాహకాల్లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఆదివారం నాటి తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్లు ప్రతీకా రావల్ (96 బంతుల్లో 64), స్మృతి మంధాన (63 బంతుల్లో 58) అర్ధ శతకాలతో అదరగొట్టగా.. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (57 బంతుల్లో 54) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. అయితే, మిగతా వారంతా తేలిపోయారు.A half-century filled with stylish stroke play!4th ODI Fifty for Harleen Deol 👏👏#TeamIndia inching closer to the 200-run markUpdates ▶️ https://t.co/LS3igwDIqz#INDvAUS | @IDFCFirstBank | @imharleenDeol pic.twitter.com/49Wxr8LF6f— BCCI Women (@BCCIWomen) September 14, 2025281 పరుగులుకెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 11, జెమీమా రోడ్రిగ్స్ 18 పరుగులు మాత్రమే చేయగా.. రిచా ఘోష్ 25, దీప్తి శర్మ 20 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు. రాధా యాదవ్ 19 పరుగులు చేసింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.ఆసీస్ బౌలర్లలో మేగన్ షట్ రెండు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్లాండ్, అలనా కింగ్, తాహిలా మెగ్రాత్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడిగతేడాది నుంచి భారత జట్టు ఓపెనర్లుగా వస్తున్న స్మృతి మంధాన- ప్రతీకా రావల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇప్పటికే మహిళల వన్డే క్రికెట్లో అత్యుత్తమంగా 84.66 సగటుతో వెయ్యి పరుగులు చేసిన తొలి జంటగా వీరు చరిత్రకెక్కారు.తాజాగా మరో వరల్డ్ రికార్డును స్మృతి- ప్రతీకా తమ పేరిట లిఖించుకున్నారు. ఓ క్యాలెండర్ ఇయర్లో ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఆసీస్‌తో తొలి వన్డే సందర్భంగా స్మృతి- ప్రతీకా ఈ రికార్డు నమోదు చేశారు.కాగా 2025లో ఇప్పటి వరకు స్మృతి- ప్రతీకా కలిసి 958 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు.. 2000 సంవత్సరంలో బెలిండా క్లార్క్- లీసా కేట్లీ (ఆసీస్) 905 పరుగుల పార్ట్నర్షిప్ సాధించగా.. స్మృతి- ప్రతీకా తాజాగా వారిని అధిగమించారు.అంతేకాకుండా.. భారత మహిళా వన్డే క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఎక్కువసార్లు 100 ప్లస్ ఓపెనింగ్ గణాంకాలు నమోదు చేసిన క్రికెటర్లుగా స్మృతి- ప్రతీకా చరిత్రకెక్కారు. జయా శర్మ- కరుణా జైన్ 25 ఇన్నింగ్స్‌లో ఐదుసార్లు వందకు పైగా భాగస్వామ్యం సాధించగా.. స్మృతి- ప్రతీకా 15 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకున్నారు.చదవండి: PKL 12: తమిళ్ తలైవాస్ సంచలన నిర్ణయం!.. జన్మలో కబడ్డీ ఆడనంటూ.. -
విరాట్- అనుష్క.. మమ్మల్ని కూడా బయటకు పొమ్మన్నారు!
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ రన్‌మెషీన్.. వర్ధమాన క్రికెటర్లకు ఆదర్శప్రాయం. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడొక రోల్‌మోడల్.కోహ్లిని నేరుగా కలిసి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకోవాలని తహతహలాడే వారెందరో!.. తాము కూడా ఆ కోవకే చెందుతామని చెబుతోంది భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues). అయితే, తాను, స్మృతి మంధాన (Smriti Mandhana) చేసిన పని వల్ల విరాట్ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ కాస్త అసౌకర్యానికి గురికావాల్సి వచ్చిందని తాజాగా వెల్లడించింది.ఒకే హోటల్లో బస.. అనుష్క కూడా అక్కడే‘‘అప్పుడు భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాయి. ఇరుజట్లకు ఒకే హోటల్లో బస ఏర్పాటు చేశారు. అప్పుడు స్మృతి, నేను కలిసి విరాట్‌ను కలవాలి అనుకున్నాం.మీతో మాట్లాడాలనుకుంటున్నాము అనగానే.. ‘ఓహ్.. ప్లీజ్.. మేము ఇక్కడే కేఫ్‌లో ఉన్నాము వచ్చేయండి’ అని కోహ్లి చెప్పాడు. అప్పుడు అనుష్క శర్మ కూడా అక్కడే ఉంది.మొదటి అర్ధగంట సేపు క్రికెట్ గురించి మాట్లాడాము. ఈ క్రమంలో .. నేను, స్మృతి భారత మహిళా క్రికెట్లో కీలక ప్లేయర్లుగా ఉండిపోతామని కోహ్లి అన్నాడు. మేమిద్దరం గొప్ప పేరు తెచ్చుకుంటామని అన్నాడు.ఇక చాలు.. బయటకు వెళ్లండిఆ తర్వాత బ్యాటింగ్ గురించి మాకు కొన్ని టిప్స్ ఇచ్చాడు. మా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుకున్నాము. ఏదో.. పాత స్నేహితులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లుగా మా సంభాషణలు కొనసాగాయి.అప్పటికి నాలుగు గంటలు గడిచిపోయింది. అప్పుడు కేఫ్ నిర్వాహకులు వచ్చి.. ‘సమయం దాటిపోయింది.. ఇక వెళ్లండి’ అని చెప్పేంత వరకు అక్కడే కూర్చున్నాము. సుమారుగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మేము అక్కడి నుంచి వెళ్లిపోయాము’’ అని జెమీమా రోడ్రిగ్స్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.లండన్‌లోనే నివాసంకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. లండన్‌లో అకాయ్‌కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క కోహ్లితో కలిసి అక్కడే ఎక్కువగా ఉంటోంది. మ్యాచ్‌లు ఉన్నపుడు మాత్రమే కోహ్లి భారత్‌కు వస్తున్నాడు. ఇక పెళ్లికి ముందు నుంచే కోహ్లితో పాటు అనుష్క కూడా టీమిండియా వెళ్లే పర్యటనల్లో భాగమయ్యేదన్న విషయం తెలిసిందే.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
‘ఆఖరి అడ్డంకిని అధిగమిస్తాం’
ముంబై: మహిళల క్రికెట్లో భారత జట్టు గత కొన్నేళ్లుగా నిలకడైన ప్రదర్శనతో మంచి విజయాలు సాధిస్తోంది. అయితే ఇప్పటికీ వరల్డ్ కప్ మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. అటు టి20ల్లోనూ, ఇటు వన్డేల్లోనూ మన జట్టు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2005, 2017 వన్డే వరల్డ్ కప్‌లలో రన్నరప్‌గా నిలిచిన మన జట్టు... 2022లో సెమీఫైనల్‌కే పరిమితమైంది. అయితే ఈసారి గెలుపు గీత దాటుతామని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విశ్వాసం వ్యక్తం చేసింది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో తమకు పలు సానుకూలతలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. టోర్నమెంట్ మరో 50 రోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో హర్మన్‌తో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఐసీసీ చైర్మన్ జై షా, సీఈఓ సంజోగ్ గుప్తా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాతో పాటు 2011 పురుషుల వన్డే వరల్డ్ కప్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ యువరాజ్ సింగ్ పాల్గొన్నారు. ఫామ్‌ను కొనసాగిస్తాం... ఈ సందర్భంగా మాట్లాడుతూ హర్మన్ తమ ఆలోచనలను వెల్లడించింది. ‘సొంత అభిమానుల సమక్షంలో మ్యాచ్‌లు ఆడబోతున్నాం. ఇది ఎప్పుడైనా ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి 100 శాతం మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి విజేతగా నిలిచేందుకు ప్రయతి్నస్తాం. చాలా కాలంగా దీని కోసం ఎదురు చూస్తున్న భారత అభిమానుల కోరిక తీరుస్తాం’ అని హర్మన్ వ్యాఖ్యానించింది. 2025లో 11 వన్డేలు ఆడిన భారత జట్టు 9 మ్యాచ్‌లు గెలిచింది. ఇందులో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లపై సిరీస్ విజయాలతో పాటు శ్రీలంకలో జరిగిన ముక్కోణపు టోర్నీని కూడా జట్టు సొంతం చేసుకుంది. ‘వరుస విజయాలతో నిజంగానే మా జట్టులో ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. అందరూ ఎలాగైనా గెలవగలమనే పట్టుదల, ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. గత రెండేళ్లుగా మేం చూపించిన నిలకడను మున్ముందు కొనసాగిస్తే చాలు. ముఖ్యంగా జట్టు ఎలాంటి బెదురు లేకుండా నిర్భీతిగా ఆడటమే కొత్తగా వచి్చన మార్పు. దాని వల్లే ఈ విజయాలు దక్కాయి’ అని హర్మన్ వివరించింది. వరల్డ్ కప్ ముందు ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ నెగ్గడం జట్టు ఫామ్‌ను చూపిస్తోంది. ‘ఇంగ్లండ్‌లో ఫలితాలు మాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే మా సన్నద్ధత అంత బాగుంది. దీని కోసం మేం చాలా కష్టపడుతున్నాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటం వల్లే ఏ సిరీస్ అయినా టోర్నీ అయినా గెలవగలమనే నమ్మకం మాలో పెరిగింది. ఇప్పటి వరకు సాధించిన విజయాలతో మేమేమీ అద్భుతం చేసినట్లుగా భావించడం లేదు. విజయాలను మేం అలవాటుగా మార్చుకున్నాం. ఇంకా ఎంతో మెరుగుపడేందుకు అవకాశం కూడా ఉంది’ అని భారత కెప్టెన్ విశ్లేషించింది. వరల్డ్ కప్‌కు ముందు భారత్ స్వదేశంలోనే ఆ్రస్టేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆసీస్‌తో మ్యాచ్ అంటే ఎప్పుడైనా గట్టి సవాల్ ఎదురవుతుందని... ఈసారి వారిని ఓడించటంతో పాటు మెగా టోర్నీకి ముందు సరైన సన్నాహకంగా ఉపయోగపడుతుందని హర్మన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇదో గొప్ప అవకాశం... సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించేందుకు భారత జట్టుకు ఇదో సువర్ణావకాశమని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. తమ ఆటపై నమ్మకంతో బరిలోకి దిగితే మంచి ఫలితాలు లభిస్తాయని అతను మార్గనిర్దేశనం చేశాడు. ‘వరల్డ్ కప్ గెలిచేందుకు ఇది మంచి అవకాశం. కానీ మ్యాచ్ మొదలు కాగానే గెలుపు గురించి ఆలోచించవద్దు. ముందే ఇలాగే ఆడాలని లెక్కలు పెట్టుకోకుండా పరిస్థితిని బట్టి ఆడాల్సి ఉంటుంది. అన్నింటికంటే ఒత్తిడిని అధిగమించడం ముఖ్యం. అనుభవం, మనపై నమ్మకంతో అలాంటి స్థితిని అధిగమించాలి. జట్టులో ప్రతీ ఒక్కరు నేనే మ్యాచ్ గెలిపించగలనని నమ్మాలి. అప్పుడే విజయం దక్కుతుంది’ అని యువీ ఉద్బోధ చేశాడు. 2017 వన్డే వరల్డ్‌కప్ భారత క్రికెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్లో కీలక మలుపు అని మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా ఇంకా ఊపందుకోని ఆ రోజుల్లో ఐసీసీ చాలా పెద్ద స్థాయిలో టోర్నీకి ప్రచారం కల్పించడం ఎంతో మేలు చేసిందని ఆమె అభిప్రాయపడింది. -
టీమిండియా స్టార్‌ను కిందకు దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన ఇంగ్లండ్ కెప్టెన్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ అగ్రస్థానానికి ఎగబాకింది. గత వారం ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న బ్రంట్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్ ప్లేస్‌కు చేరింది. ఈ క్రమంలో టాప్ ర్యాంక్‌లో ఉండిన టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధనను కిందకు దించింది.గతంలో చాలాసార్లు నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచిన బ్రంట్.. ఈ ఏడాది తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించింది. తాజాగా భారత్‌తో ముగిసిన సిరీస్‌లో రాణించడంతో బ్రంట్ అత్యున్నత స్థానానికి చేరింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ భారత్ చేతిలో 1-2 తేడాతో ఓడినా, బ్రంట్ 3 మ్యాచ్‌ల్లో 53.33 సగటున 160 పరుగులు చేసి సత్తా చాటింది. మూడో వన్డేలో బ్రంట్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్ ఆమెకు టాప్ ర్యాంక్‌ను కట్టబెట్టింది.మరోవైపు భారత స్టార్ స్మృతి మంధన కూడా ఈ సిరీస్‌లో పర్వాలేదనిపించింది. అయితే బ్రంట్ కంటే మెరుగ్గా రాణించకపోవడంతో టాప్ ప్లేస్‌ను కోల్పోయింది. మంధన ఈ సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌ల్లో 115 పరుగులకే పరిమితమై, రెండో స్థానానికి పడిపోయింది.భారీ జంప్ కొట్టిన టీమిండియా కెప్టెన్తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భారీ జంప్ కొట్టింది. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో రికార్డు సెంచరీ బాదిన ఆమె ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 11వ స్థానానికి ఎగబాకింది. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగెజ్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి చేరింది.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లకు సానుకూల ఫలితాలు రాలేదు. స్పిన్నర్ దీప్తి శర్మ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా.. ఆమె తర్వాత స్నేహ్ రాణా మెరుగైన స్థానంలో (21) ఉంది. ఈ వారం టాప్-3 బౌలర్లుగా సోఫీ ఎక్లెస్టోన్, యాష్ గార్డ్నర్, మెగన్ షట్ కొనసాగుతున్నారు. -
ఇంగ్లండ్ టూర్లో ప్రియుడు కూడా.. స్మృతి మంధాన ఫొటోలు వైరల్ (ఫోటోలు)
-
వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. భారీగా లబ్ది పొందిన టీమిండియా ఆల్‌రౌండర్
ఐసీసీ ఇవాళ (జులై 22) అప్డేటెడ్ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో (బ్యాటింగ్) టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మంధన 727 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. గత వారం రోజుల్లో మంధన ఇంగ్లండ్‌పై తొలి రెండు వన్డేల్లో (28, 42) కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది. తద్వారా ఆమె తన టాప్ ర్యాంక్‌ను పదిలంగా కాపాడుకుంది. మంధన దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ట్ కంటే కేవలం రెండు పాయింట్లు అధిక్యంలో ఉంది. మంధన, వోల్వార్డ్ట్ తర్వాత నాట్ సీవర్ బ్రంట్, ఎల్లిస్ పెర్రీ, అమీ జోన్స్, అలైసా హీలీ, హేలీ మాథ్యూస్, చమారీ ఆటపట్టు, బెత్ మూనీ, యాష్ గార్డ్నర్ టాప్-10 బ్యాటర్ల జాబితాలో ఉన్నారు. భారత్ నుంచి మంధన మినహా టాప్-10లో ఎవరూ లేరు. జెమీమా రోడ్రిగెజ్ 15వ స్థానాన్ని నిలబెట్టుకోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదు స్థానాలు కోల్పోయి 21వ స్థానానికి పడిపోయింది. ఈ వారం ర్యాంకింగ్స్‌లో గణనీయంగా లబ్ది పొందిన బ్యాటర్లలో దీప్తి శర్మ, సోఫీ డంక్లీ ముందువరుసలో ఉన్నారు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ చేసిన దీప్తి.. ఆతర్వాత జరిగిన రెండో వన్డేలోనూ ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో (30 నాటౌట్) ఆకట్టుకుంది. ఫలితంగా ఆమె 10 స్థానాలు ఎగబాకి 23 స్థానానికి చేరుకుంది. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో 83 పరుగులు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ డంక్లీ 24 స్థానాలు మెరుగుపర్చుకొని 52వ స్థానానికి ఎగబాకింది.భారత్‌తో జరిగిన తొలి వన్డేలో 53 పరుగులతో రాణించిన మరో ఇంగ్లీష్ బ్యాటర్ అలైస్ డేవిడ్సన్ రిచర్డ్స్ 40 స్థానాలు మెరుగుపర్చుకొని 118 స్థానానికి చేరింది.బౌలింగ్ విభాగానికొస్తే.. ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకోగా.. యాష్ గార్డ్నర్, మెగాన్ షట్, దీప్తి శర్మ, కిమ్ గార్త్ టాప్-5 బౌలర్లుగా కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్-10లోకి (9వ స్థానం) చేరింది. విండీస్ ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 8వ స్థానానికి ఎగబాకింది.ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో అద్భుతంగా రాణించిన భారత వెటరన్ స్పిన్నర్ స్నేహ్ రాణా 12 స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ అత్యుత్తమ ర్యాంకింగ్ అయిన 21వ స్థానానికి చేరింది. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఆష్లే గార్డ్నర్, హేలీ మాథ్యూస్, మారిజన్ కాప్ టాప్-3లో కొనసాగుతున్నారు. -
‘మా అంచనా తప్పింది’
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో పరిస్థితులను సరిగా అంచనా వేయడంలో విఫలమయ్యాయని, అందుకే పరాజయం ఎదురైందని భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెపె్టన్ స్మృతి మంధాన అభిప్రాయపడింది. శనివారం లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ పోరులో భారత్‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్ మహిళల జట్టు సిరీస్‌ను 1–1తో సమం చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో కుదించిన ఈ మ్యాచ్‌లో మన బ్యాటర్లు విఫలం కాగా, స్మృతి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ‘పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మా బ్యాటింగ్ బృందం విఫలమైంది. కొన్ని అనవసరపు షాట్లకు ప్రయతి్నంచడంతో తప్పిదం జరిగింది. లార్డ్స్ మైదానంలో అలాంటి షాట్లు ఆడటం సరైంది కాదు. ముఖ్యంగా వర్షం కూడా లయ తప్పడానికి ఒక కారణం. ఇలాంటి మ్యాచ్‌లలో పదే పదే విరామాలతో ఏకాగ్రత కోల్పోతాం. టాస్ ఓడిపోవడం కూడా ప్రతికూలంగా మారుతుంది. అయినా సరే మేం మరికొంత మెరుగ్గా ఆడాల్సింది. జట్టులో చాలా మందికి ఈ మైదానంలో ఇదే తొలి మ్యాచ్. వారంతా ఉత్సాహంగా బరిలోకి దిగారు. కొన్ని జ్ఞాపకాలతో పాటు మరికొన్ని విషయాలు వారు ఇక్కడే నేర్చుకున్నారు’ అని స్మృతి వ్యాఖ్యానించింది. 2017లో లార్డ్స్ మైదానంలోనే జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 9 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎంతో ఎదిగిన భారత జట్టు గత ఎనిమిదేళ్లలో తమ స్థాయిని పెంచుకుందని భారత ఓపెనర్ గుర్తు చేసుకుంది. ‘ఫైనల్లో ఓడి నిరాశ చెందినా స్వదేశానికి తిరిగి వచ్చాక లభించిన ఆదరణ చూస్తే మహిళల క్రికెట్‌కు దక్కుతున్న గుర్తింపు ఏమిటో అర్థమైంది. గత ఎనిమిదేళ్లలో మేం ఏ దేశానికి వెళ్లి ఆడినా పెద్ద సంఖ్యలో అభిమానులు మ్యాచ్‌లు చూసేందుకు వస్తున్నారు. ఎన్నో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. ఏదైనా సరే మన మహిళల క్రికెట్‌కు లభించిన గుర్తింపుగా దీనిని చూడవచ్చు. ఇది ఎంతో మంచి విషయం’ అని స్మృతి పేర్కొంది. -
భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన (Smriti Mandhana)- ప్రతీకా రావల్ (Pratika Rawal) సరికొత్త చరిత్ర సృష్టించారు. మహిళల వన్డే క్రికెట్లో అత్యుత్తమ సగటుతో వెయ్యి పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఓపెనింగ్ జోడీగా నిలిచారు. ఇంత వరకు ఏ జంటకు సాధ్యం కాని విధంగా 84.66 సగటుతో 1000 రన్స్ రాబట్టిన జోడీగా ప్రపంచ రికార్డు సాధించారు.భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ (IND vs ENG ODI's)లు ఆడుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన హర్మన్ సేన.. తాజాగా వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.తొలి వన్డేలో భారత్ విజయంసౌతాంప్టన్ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ మహిళా జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. 1-0తో ముందంజ వేసింది. ది రోజ్ బౌల్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.ఇంగ్లండ్ బ్యాటర్లలో సోఫియా డంక్లీ (83), అలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్ (53) అర్ధ శతకాలతో రాణించగా.. ఎమ్మా లాంబ్ (39), కెప్టెన్ నాట్ సీవర్- బ్రంట్ (41) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా రెండేసి వికెట్లు కూల్చగా.. అమన్‌జోత్ కౌర్, శ్రీ చరణి ఒక్కో వికెట్ పడగొట్టారు.దీప్తి శర్మ అజేయ అర్ధ శతకంఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 48.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 262 పరుగులు సాధించి జయభేరి మోగించింది. ఓపెనర్లు ప్రతికా రావల్ (36), స్మృతి మంధాన (28) ఓ మోస్తరుగా రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ (48) ఆకట్టుకుంది. ఇక ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అజేయ అర్ధ శతకం (62)తో చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చింది.మంధాన- రావల్ సరికొత్త చరిత్రఇదిలా ఉంటే.. గతేడాది నుంచి స్మృతి మంధాన- ప్రతీకా రావల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరు కలిసి ఇప్పటికి నాలుగుసార్లు శతక, ఐదుసార్లు అర్ధ శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఇందులో వీరి హయ్యస్ట్ పార్ట్నర్షిప్ 233. తాజాగా ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మంధాన- రావల్ జోడీ.. వన్డే క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే అత్యుత్తమ సగటుతో ఈ మైలురాయిని చేరుకున్న ఓపెనింగ్ జోడీగా వరల్డ్ రికార్డు సాధించింది.మహిళల వన్డే క్రికెట్లో అత్యుత్తమ సగటుతో కనీసం వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనింగ్ జోడీలు ఇవే..🏏స్మృతి మంధాన- ప్రతీకా రావల్ (ఇండియా): 84.66 సగటుతో 1016 పరుగులు🏏కారోలిన్ అట్కిన్స్- సారా టేలర్ (ఇంగ్లండ్): 68.83 సగటుతో 1239 పరుగులు🏏రేచల్ హెయిన్స్- అలీసా హేలీ (ఆస్ట్రేలియా): 63.41 సగటుతో 1839 పరుగులు.చదవండి: Ravindra Jadeja: పోరాటయోధుడు.. అసలు సిసలు ఆల్‌రౌండర్‌కు ప్రతిరూపం -
బ్రిటన్ కింగ్ చార్లెస్-3ను కలిసిన టీమిండియా (ఫొటోలు)
-
రోహిత్ శర్మ సరసన మంధాన.. భారత మూడో ప్లేయర్‌గా ఘనత
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత ప్లేయర్ల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సరసన చేరింది.ఇంగ్లండ్ మహిళా జట్టు (England Women vs India Women)తో రెండో టీ20 సందర్భంగా స్మృతి మంధాన ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. మొదటి మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.150వ టీ20 మ్యాచ్ఇక బ్రిస్టల్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ ఆతిథ్య ఇంగ్లండ్‌పై.. భారత్ 24 రన్స్ తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ముందంజలో నిలిచింది. ఇక స్మృతి మంధానకు ఇది అంతర్జాతీయ స్థాయిలో 150వ టీ20.రోహిత్, హర్మన్ సరసనఇప్పటి వరకు భారత్ తరఫున టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (159), మహిళా జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (179) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. తాజాగా స్మృతి మంధాన కూడా ఈ లిస్టులో చేరిపోయింది. కాగా 149 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో కలిపి స్మృతి మంధాన 124కు పైగా స్ట్రైక్‌రేటుతో 3873 పరుగులు సాధించింది.తద్వారా మహిళల టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా స్మృతి కొనసాగుతోంది. అంతేకాదు.. అంతర్జాతీయ టీ20లలో నాలుగు వేల మైలురాయికి కూడా స్మృతి చేరువైంది. పురుషుల క్రికెట్లో ఇప్పటి వరకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మాత్రమే ఈ ఘనత సాధ్యమైంది. ఇక భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో శతకం బాదిన తొలి మహిళా క్రికెటర్‌గానూ స్మృతి చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.రెండో టీ20లో విఫలంఇదిలా ఉంటే... తన 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో స్మృతి మంధాన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో శతకంతో చెలరేగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తాజాగా రెండో టీ20లో 13 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్రిస్టల్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 157 పరుగులకే పరిమితమైంది. దీంతో 24 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అమన్‌జోత్ కౌర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 40 బంతుల్లోనే 63 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు.. ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్-బ్రంట్ (13) రూపంలో కీలక వికెట్ తీసింది పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అమన్‌జోత్.అగ్ర స్థానానికి చేరువైన స్మృతిభారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో సెంచరీతో విజృంభించిన స్మృతి... మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 771 పాయింట్లతో నాలుగు నుంచి మూడో ర్యాంక్‌ను అందుకుంది. మంధాన కెరీర్లో ఇవే అత్యధిక రేటింగ్ పాయింట్లు కావడం విశేషం.హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గానూ వ్యవహరించిన మంధాన... ఈ ఫార్మాట్లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. తద్వారా మూడు ఫార్మాట్ల (టెస్టు, వన్డే, టి20)లో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న స్మృతి... టీ20ల్లో సైతం ఆ దిశగా ఆడుగులు వేస్తోంది.టీ20 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మూనీ (794 పాయింట్లు), వెస్టిండీస్ ప్లేయర్ హీలీ మాథ్యూస్ (774 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ (12వ ర్యాంక్), షఫాలీ వర్మ (13వ ర్యాంక్), జెమీమా రోడ్రిగ్స్ (15వ ర్యాంక్) టాప్–20లో చోటు దక్కించుకున్నారు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి దీప్తి శర్మ (735 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉండగా... రేణుక సింగ్ (721 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు -
విధ్వంసకర శతకం.. అగ్రపీఠం దిశగా దూసుకొస్తున్న మంధాన
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన భారీగా లబ్ది పొందింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో రికార్డు శతకం బాదిన మంధాన.. కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు (771) సాధించడమే కాకుండా ఓ స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి ఎగబాకింది. మంధానకు కెరీర్లో ఇదే అత్యుత్తమ టీ20 ర్యాంకింగ్. ప్రస్తుతం మంధానకు టాప్ ర్యాంకర్ బెత్ మూనీకి (794) మధ్య కేవలం 23 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.రెండో స్థానంలో ఉన్న హేలీ మాథ్యూస్‌కు (774) మంధానకు మధ్య కేవలం మూడు పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇప్పటికే వన్డేల్లో టాప్ ర్యాంక్ బ్యాటర్‌గా కొనసాగుతున్న మంధాన.. తన ఫామ్‌ను ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్ మొత్తంలో కొనసాగిస్తే టీ20ల్లో కూడా నంబర్ వన్ స్థానానికి చేరుతుంది. టాప్-10 టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మంధాన మినహా మరే ఇతర బ్యాటర్ లేరు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్, షఫాలీ వర్మ 12, 13 స్థానాల్లో ఉండగా.. జెమీమా రోడ్రిగెజ్ 15వ స్థానంలో ఉంది. రిచా ఘోష్ 25, దీప్తి శర్మ 31వ స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో మెరుపు ఇన్నింగ్స్ (43) ఆడిన హర్లీన్ డియోల్ టీ20 ర్యాంకింగ్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ర్యాంకింగ్స్‌లో ఆమె 86వ స్థానం దక్కింది.కాగా, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జూన్ 28న నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మంధాన 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసింది. టీ20ల్లో మంధానకు ఇదే తొలి సెంచరీ. ఈ సెంచరీతో ఆమె మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో 14 సెంచరీలు చేసిన మంధాన టెస్ట్‌ల్లో 2, వన్డేల్లో 11, టీ20ల్లో ఓ సెంచరీ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో మంధాన చేసిన స్కోర్ టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా (112) కూడా రికార్డైంది. గతంలో ఈ రికార్డు హర్మన్‌ప్రీత్ (103) పేరిట ఉండేది.ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 ఇవాళ (జులై 1) జరుగనుంది. బ్రిస్టల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. -
టీమిండియా చేతిలో దారుణ ఓటమి.. ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్
నాటింగ్హమ్ వేదికగా నిన్న (జూన్ 28) జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధన విధ్వంసకర శతకం (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు) సాధించి టీమిండియాను గెలిపించింది. ఈ సెంచరీతో మంధన మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మంధన కేవలం 51 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకుంది. తద్వారా మహిళల టీ20ల్లో ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని, భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీని (హర్మన్-49 బంతుల్లో) నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మంధన శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణీ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ సీవర్ బ్రంట్(66) టాప్ స్కోరర్‌గా నిలిచింది.ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో షాక్ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం జరిమానాగా విధించబడింది. నిర్ణీత సమయంలోగా ఇంగ్లండ్ రెండు ఓవర్లు వెనుకపడింది. ఓవర్‌కు 5 శాతం చొప్పున ఐసీసీ 10 శాతం మ్యాచ్ ఫీజ్‌ను జరిమానాగా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుంది. ఐసీసీ జరిమానాను ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ స్వీకరించింది. ఇంగ్లండ్ జట్టులోకి సభ్యులందరికీ ఈ జరిమానా వర్తిస్తుంది.కాగా, ఇంగ్లండ్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓటమి. టీ20ల్లో ఇంగ్లండ్‌పై 200 ప్లస్ స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. రెండో టీ20 బ్రిస్టల్ వేదికగా జులై 1న జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి భారత ప్లేయర్‌గా
ఇంగ్లండ్ పర్యటనను భారత మహిళల జట్టు ఘనంగా ఆరంభించింది. శనివారం నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను 97 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఉమెన్ ఇన్ బ్లూ ఆధిక్యంలో దూసుకెళ్లింది.211 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అమ్మాయిలు చేధించలేకపోయారు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్ కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణీ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ స్కివర్ బ్రంట్(66) టాప్ స్కోరర్‌గా నిలిచింది.చరిత్ర సృష్టించిన మంధానఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. ఆది నుంచి దూకుడుగా ఆడిన మంధాన.. కేవలం 51 బంతుల్లోనే తన తొలి టీ20 సెంచరీ మార్క్‌ను అందుకుంది. స్మృతి మొత్తంగా 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంధాన పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా స్మృతి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఇండియా ఉమెన్ ప్లేయర్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.అదేవిధంగా ఇంగ్లండ్‌పై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మహిళ క్రికెటర్‌గా ఆసీస్ సూపర్ స్టార్ బెత్ మూనీ రికార్డును మంధాన సమం చేసింది. ఆల్ఫార్మాట్లో మంధాన ఇప్పటివరకు 8 సార్లు ఏభైకి పైగా పరుగులు చేయగా.. మూనీ కూడా సరిగ్గా 8 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్ సాధించింది.ఇంగ్లండ్‌పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు:స్మృతి మంధాన: 8బెత్ మూనీ: 8మెగ్ లానింగ్: 5డియాండ్రా డాటిన్: 3హేలీ మాథ్యూస్: 3డేన్ వాన్ నీక్: 3చదవండి: అరంగేట్రంలోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా టీనేజర్ -
స్మృతి సెంచరీ ధమాకా.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. టాప్ బ్యాటర్ స్మృతి మంధాన టి20ల్లో తొలి శతకంతో చెలరేగడంతో ఈ ఫార్మాట్లో రెండో అత్యధిక స్కోరు చేసిన టీమిండియా... అనంతరం బౌలింగ్‌లోనూ ఇంగ్లండ్‌ను కట్టిపడేసి సిరీస్ ఆరంభ పోరులో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీచరణి అరంగేట్రం టి20లోనే నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (62 బంతుల్లో 112; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో విజృంభించింది. టి20ల్లో స్మృతికి ఇదే తొలి శతకం కాగా... హర్లీన్ డియోల్ (23 బంతుల్లో 43; 7 ఫోర్లు) రాణించింది. చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచి్చన ఓపెనర్ షఫాలీ వర్మ (20) ఫర్వాలేదనిపించగా... రిచా ఘోష్ (12), జెమీమా రోడ్రిగ్స్ (0) విఫలమయ్యారు. తొలి వికెట్‌కు షఫాలీతో కలిసి 77 పరుగులు జోడించిన స్మృతి... రెండో వికెట్‌కు హర్లీన్‌తో 94 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లౌరెన్ బెల్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1–0తో ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు టి20ల్లో పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు ఇదే అతిపెద్ద పరాజయం. నటాలియా సీవర్ బ్రంట్ (42 బంతుల్లో 66; 10 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా... టామీ బ్యూమౌంట్ (10), ఎమ్ అర్లాట్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. డానీ వ్యాట్ (0), డాంక్లీ (7), అమీ జోన్స్ (1), కాప్సీ (5), ఎకెల్‌స్టోన్ (1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీ చరణి 4 వికెట్లతో అదరగొట్టింది. ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు ఆడిన శ్రీచరణి... అరంగేట్ర టి20లోనే తన స్పిన్‌తో ప్రత్యరి్థని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం బ్రిస్టల్ వేదికగా రెండో టి20 జరగనుంది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) ఎకిల్‌స్టోన్ (బి) అర్లాట్ 20; స్మృతి (సి) సీవర్ బ్రంట్ (బి) ఎకెల్‌స్టోన్ 112; హర్లీన్ (సి) అర్లాట్ (బి) బెల్ 43; రిచా (సి) డాంక్లీ (బి) బెల్ 12; జెమీమా (సి) సీవర్ బ్రంట్ (బి) బెల్ 0; అమన్‌జ్యోత్ (నాటౌట్) 3; దీప్తి శర్మ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–77, 2–171, 3–186, 4–190, 5–202. బౌలింగ్: లౌరెన్ బెల్ 4–0–27–3; అర్లాట్ 4–0–38–1; లౌరెన్ ఫిలెర్ 4–0–35–0; లిన్సీ స్మిత్ 3–0–41–0; సోఫీ ఎకెల్‌స్టోన్ 3–0–43–1; కాప్సీ 2–0–21–0. ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: డాంక్లీ (సి) రిచా (బి) అమన్‌జ్యోత్ 7; డానీ వ్యాట్ (సి) హర్లీన్ (బి) దీప్తి 0; నటాలియా సీవర్ బ్రంట్ (సి) రిచా (బి) శ్రీచరణి 66; బ్యూమౌంట్ (బి) దీప్తి 10; అమీ జోన్స్ (స్టంప్డ్) రిచా (బి) రాధ 1; కాప్సీ (సి) అరుంధతి (బి) శ్రీచరణి 5; అర్లాట్ (సి) స్మృతి (బి) రాధ 12; ఎకెల్‌స్టోన్ (సి) జెమీమా (బి) శ్రీచరణి 1; లౌరెన్ ఫిలెర్ (సి) రిచా (బి) అరుంధతి 2; లిన్సీ స్మిత్ (నాటౌట్) 0; లౌరెన్ బెల్ (సి) జెమీమా (బి) శ్రీచరణి 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (14.5 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–58, 4–62, 5–70, 6–88, 7–102, 8–111, 9–111, 10–113. బౌలింగ్: అమన్‌జ్యోత్ కౌర్ 2–0–22–1; దీప్తి శర్మ 3–0–32–2; శ్రీచరణి 3.5–0–12–4; అరుంధతి రెడ్డి 2–0–18–1; రాధా యాదవ్ 2–0–15–2; స్నేహ్ రాణా 2–0–13–0. 1 టి20ల్లో స్మృతి మంధానకు ఇదే తొలి సెంచరీ కాగా... మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా స్మృతి చరిత్ర సృష్టించింది.2 టి20 ఫార్మాట్లో టీమిండియాకు ఇది (210/5) రెండో అత్యధిక స్కోరు. గతేడాది వెస్టిండీస్‌పై 217/4 స్కోరు సాధించింది. -
ఇంగ్లండ్ గడ్డపై స్మృతి మంధాన విధ్వంసకర శతకం
ఇంగ్లండ్‌తో తొలి టీ20లో భారత మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్భుత శతకంతో మెరిసింది. ఆది నుంచి నిలకడగా ఆడిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ యాభై ఒక్క బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. కాగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో స్మృతికి ఇదే తొలి శతకం కావడం విశేషం. దీంతో ఆనందంలో మునిగిపోయిన స్మృతి హెల్మెట్ తీసి.. బ్యాట్ చూపిస్తూ నవ్వులు చిందిస్తూ సెలబ్రేట్ చేసుకుంది.ఇంగ్లండ్ పర్యటనలో..కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగనుండగా.. శనివారం నాటి తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (20) స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ స్మృతి మంధాన.. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది.51 బంతుల్లో సెంచరీఈ క్రమంలో స్మృతి మంధాన 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. హర్లీన్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ (8) త్వరగానే పెవిలియన్ చేరగా.. జెమీమా రోడ్రిగెస్ డకౌట్ అయింది. ఇక స్మృతి మొత్తంగా 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి.. సోఫీ ఎక్లిస్టోన్ బౌలింగ్‌లో నాట్ సీవర్- బ్రంట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైంది.ఇంగ్లండ్‌క్ష్యం 211అమన్‌జోత్ కౌర్ 3, దీప్తి శర్మ ఏడు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక స్మృతి అద్భుత శతకం ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యం విధించింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. ఎమ్ ఆర్లోట్, సోఫీ ఎక్లిస్టోన్ ఒక్కో వికెట్ తీశారు. కాగా టీ20లలో భారత మహిళా జట్టుకు ఇది రెండో అత్యుత్తమ స్కోరు. ఇంతకు ముందు ముంబై వేదికగా వెస్టిండీస్‌పై భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.ఇంగ్లండ్ వుమెన్ వర్సెస్ ఇండియా వుమెన్ తుదిజట్లుఇండియాస్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగెస్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి.ఇంగ్లండ్సోఫియా డంక్లీ, డానియెల్ వ్యాట్-హాడ్జ్, నాట్ సీవర్-బ్రంట్ (కెప్టెన్), టామీ బౌమౌంట్, ఎమీ జోన్స్ (వికెట్ కీపర్), అలిస్ కాప్సీ, సోఫీ ఎక్లిస్టోన్, ఎమ్ ఆర్లోట్, లారెన్ ఫిలర్, లిన్సీ స్మిత్, లారెన్ బెల్.చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు! -
వరల్డ్ నెం1 బ్యాటర్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్
ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సత్తాచాటింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్లో మంధాన తన ఆరేళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. అగ్రస్ధానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో అద్బుతప్రదర్శన కనబరచడంతో మంధాన తిరిగి తన టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.మంధాన ప్రస్తుతం 727 రేటింగ్ పాయింట్లతో నెం1 ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్, ఇంగ్లండ్ సారథి నాట్ స్కైవర్-బ్రంట్ 719 రేటింగ్ పాయింట్లతో రెండో స్దానంలో సంయుక్తంగా ఉన్నారు.స్మృతి విషయానికి వస్తే గతేడాది అసాధరణ ప్రదర్శన కనబరిచింది. 2024 ఏడాదికి గానూ ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్‌గా మంధాన నిలిచింది. గతేడాదిలో 13 మ్యాచ్‌లలో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.వన్డేల్లో ఒకే క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్‌గా మంధాన రికార్డులకెక్కింది. ఈ స్టార్ ఓపెనర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నదమవుతోంది. వన్డే వరల్డ్‌కప్-2025 సన్నహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.ఇంగ్లండ్ పర్యటనకు భారత మహిళా జట్టు..భారత మహిళల వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా, తేజల్ హస్బానిస్, దీప్తి శర్మ, స్నేహి రాణా, శ్రీ చరణి, శ్రీ చరణి, స్నేహి రాణా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రానా, రాధా యాదవ్, , అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.చదవండి: WI vs AUS: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు -
ప్రియుడి బర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)
-
రెండో స్థానానికి ఎగబాకిన టీమిండియా వైస్ కెప్టెన్
ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై నేషన్ సిరీస్‌లో సత్తా చాటిన మంధన.. తాజాగా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నీలో సెంచరీ (ఫైనల్లో), అర్ద సెంచరీ సాయంతో 264 పరుగులు చేసిన మంధన.. తన రేటింగ్ పాయింట్లను 727కు పెంచుకుని ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్‌ను మూడో స్థానానికి పడేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మంధనకు లారాకు మధ్య కేవలం 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. భారత్ తరఫున టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మంధన ఒక్కరే ఉన్నారు. హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), ఎల్లిస్ పెర్రీ (ఆస్ట్రేలియా), అలైసా హీలీ (ఆస్ట్రేలియా), చమారీ ఆటపట్టు (శ్రీలంక), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), ఆష్లే గార్డ్నర్ (ఆస్ట్రేలియా), ఆమీ జోన్స్ (ఇంగ్లండ్) వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. ట్రై నేషన్ సిరీస్‌లో రాణించిన చమారీ ఆటపట్టు రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకింది. భారత ప్లేయర్లలో జెమీమా రోడ్రిగెజ్ 15, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 16, దీప్తి శర్మ 32, రిచా ఘోష్ 42, ప్రతిక రావల్ 45, హర్లీన్ డియోల్ 52, యస్తికా భాటియా 67, పూజా వస్త్రాకర్ 70, షఫాలీ వర్మ 86, స్థానాల్లో ఉన్నారు. ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికాపై సెంచరీతో రాణించిన జెమీమా 5 స్థానాలు మెరుగుపర్చుకోగా.. ఇదే టోర్నీలో సత్తా చాటిన దీప్తి శర్మ 13 స్థానాలు మెరుగుపర్చుకుంది.బౌలింగ్ విభాగానికొస్తే.. భారత్ తరఫున దీప్తి శర్మ (4) ఒక్కరే టాప్-10లో ఉన్నారు. సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. ఆష్లే గార్డ్నర్, మెగాన్ షట్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ట్రై సిరీస్‌లో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన స్నేహ్ రాణా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ 34వ స్థానానికి ఎగబాకింది. రాణా దాదాపు 16 నెల తర్వాత టీమిండియా తరఫున రీఎంట్రీ ఇచ్చింది.కాగా, భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా పాల్గొన్న ట్రై నేషన్ సిరీస్‌లో భారత్ విజేతగా నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మంధన సెంచరీతో కదంతొక్కడంతో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ ప్రదర్శనకు గానూ మంధనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. -
ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 97 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ సాధించింది.భారత బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. మంధాన క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించింది. మొత్తంగా 101 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించింది. ఆమెతో పాటు హర్లీన్ డియోల్(47), రోడ్రిగ్స్(44), హర్మన్ ప్రీత్ కౌర్(41) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లంక బౌలర్లలో మల్కీ మదార, విహంగా, కుమారి తలా వికెట్ సాధించారు.అమన్ అదుర్స్.. నాలుగేసిన రాణాఅనంతరం 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక అమ్మాయిల జట్టు భారత బౌలర్ల దాటికి 48.2 ఓవర్లలో 245 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమీరా ఆతపట్టు(51), నీలాక్షి డి సిల్వా(48), విష్మి గుణరత్నే(36) రాణించారు. మిగితా బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అమన్‌జోత్ కౌర్ మూడు వికెట్లు సాధించారు. కాగా భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన హర్మన్ సేన... 6 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలిచింది. -
IND vs SL: ఫైనల్లో శతకంతో చెలరేగిన స్మృతి.. సరికొత్త చరిత్ర
శ్రీలంకతో ఫైనల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) సంచలన శతకంతో మెరిసింది. కేవలం 92 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తన కెరీర్లో పదకొండవ వన్డే సెంచరీ నమోదు చేసింది.శ్రీలంక- భారత్- సౌతాఫ్రికా మధ్యతద్వారా మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. కాగా శ్రీలంక- భారత్- సౌతాఫ్రికా మహిళా జట్ల మధ్య త్రైపాక్షిక వన్డే సిరీస్‌కు లంక ఆతిథ్యమిస్తోంది. ఏప్రిల్ 27న శ్రీలంక- భారత్ మధ్య మ్యాచ్‌తో మొదలైన ఈ సిరీస్‌లో .. హర్మన్ సేన వరుస విజయాలు సాధించింది.తొలుత ఆతిథ్య లంకను, తర్వాత సౌతాఫ్రికాను ఓడించింది. మరుసటి మ్యాచ్‌లో లంక చేతిలో ఓడిన భారత జట్టు.. తర్వాత సౌతాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. మరోవైపు రెండు విజయాలతో శ్రీలంక కూడా తుదిపోరుకు అర్హత సాధించింది.101 బంతులు ఎదుర్కొనిఈ క్రమంలో ఇరుజట్ల (IND vs SL) మధ్య కొలంబో వేదికగా ఆదివారం (మే 11) ఫైనల్లో టాస్ గెలిచిన భారత్.. లంకను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ప్రతికా రావల్ (30), స్మృతి మంధాన శుభారంభం అందించారు. ప్రతికా కాసేపటికే పెవిలియన్ చేరినా.. స్మృతి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది.మొత్తంగా 101 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించింది. లంక కెప్టెన్ చమరి ఆటపట్టు బౌలింగ్‌లో వరుసగా నాలుగు బౌండరీలు బాది సెంచరీ మార్కును అందుకుని.. చక్కటి షాట్లతో అలరించింది.సరికొత్త చరిత్రఈ క్రమంలో స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా అవతరించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (52 సిక్సర్లు) వెనక్కి నెట్టి.. మొత్తంగా 54 సిక్సర్లతో ఈ ఫీట్ నమోదు చేసింది.అదే విధంగా.. మహిళల వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా- 15), సుజీ బేట్స్ (న్యూజిలాండ్- 13) తర్వాతి స్థానాల్లో నిలిచింది. ఇక మొత్తంగా ఇప్పటికి 102 వన్డేలు పూర్తి చేసుకున్న స్మృతి మంధాన ఖాతాలో 4473 పరుగులు ఉన్నాయి.ఫైనల్ క్వీన్సిరీస్ ఏదైనా ఫైనల్ అంటే ఆటగాళ్లపై సహజంగానే ఒత్తిడి ఒకింత ఎక్కువవుతుంది. అయితే, మంధాన మాత్రం ఒత్తిడిలోనే తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది. గత ఐదు ఫైనల్స్‌లో ఆమె ఆట తీరే ఇందుకు నిదర్శనం. ఒక్కసారి డకౌట్ కావడం మినహా మిగతా నాలుగు సందర్బాల్లో స్మృతి నమోదు చేసిన గణాంకాలు 51 నాటౌట్, 46, 60, 116.ఇక ఏదేని ఫైనల్లో ఇంత వరకు సెంచరీ బాదిన భారత ఏకైక మహిళా క్రికెటర్‌గా కొనసాగుతున్న మాజీ బ్యాటర్ మిథాలీ రాజ్ రికార్డును స్మృతి.. తాజాగా సమం చేసింది.భారత్ తరఫున గత ఐదు ఫైనల్స్‌లో స్మృతి మంధాన గణాంకాలు👉శ్రీలంక మీద- ట్రై సిరీస్ ఫైనల్లో 101 బంతుల్లో 116, మే, 2025👉శ్రీలంక మీద- ఆసియా కప్ ఫైనల్లో 47 బంతుల్లో 60, జూలై 2024👉శ్రీలంక మీద- ఆసియా క్రీడల ఫైనల్లో 45 బంతుల్లో 46, సెప్టెంబరు 2023👉సౌతాఫ్రికాతో- ట్రై సిరీస్ ఫైనల్లో 0, ఫిబ్రవరి 2023👉శ్రీలంక మీద- ఆసియా కప్ ఫైనల్లో 25 బంతుల్లో 51, అక్టోబరు 2022.ఇక తాజాగా శ్రీలంక- సౌతాఫ్రికాలతో త్రైపాక్షిక సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లలో కలిపి స్మృతి మంధాన 264 పరుగులు సాధించింది. లంకతో ఫైనల్లో డెమీ విహంగ బౌలింగ్‌లో హర్షిత మాదవికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది.చదవండి: BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు! -
సెంచరీ పూర్తి చేసిన స్మృతి మంధన
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన వన్డేల్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (మే 4) జరుగుతున్న మ్యాచ్‌తో ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. మంధన భారత్ తరఫున 100 వన్డేలు పూర్తి చేసుకున్న ఏడో ప్లేయర్‌గా నిలిచింది. ఆమెకు ముందు మిథాలీ రాజ్ (232), జులన్ గోస్వామి (204), హర్మన్‌ప్రీత్ కౌర్ (144), అంజుమ్ చోప్రా (127), అమిత శర్మ (116), దీప్తి శర్మ (104) ఈ ఘనత సాధించారు.మంధన భారత్ తరఫున 100 ఇన్నింగ్స్‌ల్లో 45.81 సగటున 10 సెంచరీలు, 30 అర్ద సెంచరీల సాయంతో 4306 పరుగులు చేసింది. మహిళల క్రికెట్లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత మూడో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మంధన రికార్డుల్లో ఉంది. వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో బెలిండ క్లార్క్ (4556), మెగ్ లాన్నింగ్ (4463) మంధన కంటే ముందు ఉన్నారు.శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో మంధన 28 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసి ఔటైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 31 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మంధన 18, ప్రతిక రావల్ 35, హర్లీన్ డియోల్ 29, హర్మన్‌ప్రీత్ 30 పరుగులు చేసి ఔట్ కాగా.. జెమీమా రోడ్రిగెజ్ 28, రిచా ఘోష్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. లంక బౌలర్లలో సుగంధిక కుమారి, దేవ్మీ విహంగ, ఇనోకా రణవీర తలో వికెట్ తీశారు.శ్రీలంక, సౌతాఫ్రికా పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆతర్వాతి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. మే 2న జరిగిన మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై శ్రీలంక 5 వికెట్ల తేడాతో నెగ్గింది. -
INDw Vs SLw: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా..
శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన శ్రీలంక 38.1 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఇండియన్ స్పిన్నర్ స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, నల్లపు రెడ్డి చరణి తలా రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో హసనీ పెరీరా(30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కవిషా దిల్హారి(25), సంజీవనీ(22) రాణించారు. కెప్టెన్ ఆతపట్టు(7)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 29.4 ఓవర్లలో చేధించింది.భారత బ్యాటర్లలో ప్రతీక రావల్(50 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరవగా.. మంధాన(43), డియోల్(48 నాటౌట్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో రణవీర ఒక్క వికెట్ సాధించారు. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 29న కొలంబో వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.చదవండి: IPL 2025: ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ -
జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన చోటు
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి గానూ విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డుకు ఎంపికయ్యాడు. గతేడాది ఫార్మాట్లకతీతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ బుమ్రాకు ఈ గౌరవం దక్కింది. 2024లో బుమ్రా మూడు ఫార్మాట్లలో 86 వికెట్లు (21 మ్యాచ్‌ల్లో 13 సగటున) తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. గతేడాది బుమ్రా టెస్ట్‌ల్లో విశేషంగా రాణించి అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫలితంగా అతను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, బీసీసీఐ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు గెలుచుకున్నాడు.గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా భారత్‌కు టైటిల్‌ను అందించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుతో పాటు రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.దిగ్గజాల సరసన చోటుతాజాగా విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు గెలవడంతో బుమ్రా భారత దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. గతంలో విరాట్ కోహ్లి, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ అవార్డును గెలుచుకున్నారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 3 సార్లు ఈ అవార్డును గెలువగా.. సెహ్వాగ్ 2, సచిన్ ఓసారి ఈ అవార్డును దక్కించుకున్నారు.విజ్డెన్ వుమెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు విషయానికొస్తే.. 2024 సంవత్సరానికి గానూ ఈ అవార్డును భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన దక్కించకుంది. మంధన గతేడాది మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణించి, రికార్డు స్థాయిలో 1659 పరుగులు చేసింది. మహిళల క్రికెట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. గతేడాది మంధన నాలుగు వన్డే శతకాలు, ఓ టెస్ట్ సెంచరీ సాధించింది.పూరన్‌కు లీడింగ్ టీ20 ప్లేయర్ అవార్డుపొట్టి క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్‌కు విజ్డెన్ మెన్స్ లీడింగ్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు లభించింది. పూరన్ గతేడాది పొట్టి ఫార్మాట్లో 21 మ్యాచ్‌లు ఆడి 142.22 స్ట్రయిక్‌రేట్‌తో 464 పరుగులు చేశాడు. -
శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన
శ్రీలంకలో పర్యటించనున్న మహిళా క్రికెట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. శ్రీలంక- సౌతాఫ్రికాలతో జరుగనున్న త్రైపాక్షిక వన్డే సిరీస్‌కు పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును వుమెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు మంగళవారం వెల్లడించింది.హర్మన్‌ప్రీత్ పునరాగమనంఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) భారత జట్టును ముందుకు నడిపించనుండగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా కొనసాగనుంది. ఇక ఈ జట్టులో హైదరాబాదీ అమ్మాయి అరుంధతి రెడ్డి, ఆంధ్ర క్రికెటర్, అన్క్యాప్డ్ ప్లేయర్ నల్లపురెడ్డి శ్రీచరణి కూడా చోటు దక్కించుకున్నారు.అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుఅంతేకాదు.. శ్రీచరణితో పాటు మరో ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు కశ్వీ గౌతమ్ (Kashvi Gautam), శుచీ ఉపాధ్యాయ్‌కు కూడా సెలక్టర్లు చోటివ్వడం విశేషం. మరోవైపు.. గాయాల కారణంగా రేణుకా సింగ్ ఠాకూర్, టైటస్ సాధు ఈ వన్డే సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.చివరగా మంధాన సారథ్యంలోకాగా జనవరిలో ఐర్లాండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. హర్మన్‌కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు ఆమె స్థానంలో మంధానకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో జనవరి 10- 15 వరకు జరిగిన ఈ సిరీస్‌లో మంధాన సేన ఐర్లాండ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో మంధానకు దీప్తి శర్మ డిప్యూటీగా వ్యవహరించింది.అన్నీ ఒకే స్టేడియంలోఇక ఏప్రిల్ 27 నుంచి శ్రీలంక- భారత్- సౌతాఫ్రికా మధ్య ట్రై సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా నాలుగు మ్యాచ్‌లకూ శ్రీలంకలోని కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ సిరీస్‌లో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్‌కు భారత జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, కశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, అరుంధతీ రెడ్డి, తేజల్ హసాబ్నిస్, శ్రీచరణి, శుచీ ఉపాధ్యాయ్.ట్రై సిరీస్‌లో భారత్ షెడ్యూల్ ఇదేఏప్రిల్ 27, ఆదివారం- ఇండియా వర్సెస్ శ్రీలంకఏప్రిల్ 29, మంగళవారం- ఇండియా వర్సెస్ సౌతాఫ్రికామే 4, ఆదివారం- ఇండియా వర్సెస్ శ్రీలంకమే 7, బుధవారం- ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్ -
BCCI: వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ.. వాళ్లపై వేటు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లకు సంబంధించి వార్షిక కాంట్రాక్టుల జాబితా విడుదల చేసింది. 2024-25 ఏడాదికి గానూ గ్రేడ్-ఎ, బి, సిలలో చోటు దక్కించుకున్న ప్లేయర్ల పేర్లను సోమవారం వెల్లడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ గ్రేడ్-‘ఎ’లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.మరోవైపు.. రేణుకా ఠాకూర్ (Renuka Thakur), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ గ్రేడ్-‘బి’లో స్థానం పదిలం చేసుకున్నారు. అయితే, బౌలర్ రాజేశ్వర్ గైక్వాడ్‌కు మాత్రం ఈసారి ఈ జాబితాలో చోటు దక్కలేదు.వాళ్లపై వేటు.. వీరికి తొలిసారి చోటుఇక గ్రేడ్-‘సి’లో ఉన్న హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, దేవికా వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణిలపై బీసీసీఐ ఈసారి వేటు వేసింది. వర్ధమాన స్టార్లు శ్రేయాంక పాటిల్, టైటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జ్యోత్ కౌర్, ఉమా ఛెత్రిలకు తొలిసారిగా, గ్రేడ్-‘సి’లో చోటు ఇచ్చింది.ఈ మేరకు.. ‘‘టీమిండియా సీనియర్ వుమెన్ జట్టుకు సంబంధించి బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది. 2024-2025 సీజన్ (అక్టోబరు 1, 2024-సెప్టెంబరు 30, 2025)గానూ వివరాలు వెల్లడించడమైనది’’ అని బీసీసీఐ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. సమీప భవిష్యత్తులో ప్రకటించంఅయితే, పురుషుల సీనియర్ జట్టుకు సంబంధించి సమీప భవిష్యత్తులో వార్షిక కాంట్రాక్టుల జాబితా ప్రకటించబోమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గురువారం స్పోర్ట్స్ స్టార్‌కు వెల్లడించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులకు సంబంధించి మూడు గ్రేడ్ల ప్లేయర్ల జీతాలు వేరుగా ఉంటాయి. అయితే, ఆ మొత్తం ఎంత అన్నది మాత్రం బీసీసీఐ ఈసారి వెల్లడించలేదు. ఆఖరిసారిగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. గ్రేడ్-‘ఎ’లో ఉన్న ప్లేయర్లకు రూ. 50 లక్షలు, గ్రేడ్-‘బి’లో ఉన్న క్రికెటర్లకు రూ. 30 లక్షలు, గ్రేడ్-‘సి’లో ఉన్న ప్లేయర్లకు రూ. 10 లక్షల చొప్పున వార్షిక వేతనం చెల్లిస్తారు.అయితే, పురుష క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే మొత్తం అసలు ఏమాత్రం లెక్కకాదు. పురుష క్రికెటర్లలో A+ గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 7 కోట్లు, A గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. కోటి చొప్పున బీసీసీఐ చెల్లిస్తోంది.బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు(2024-25)గ్రేడ్-ఎ: హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మగ్రేడ్-బి : రేణుకా సింగ్ ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మగ్రేడ్-సి : యస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టైటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్.చదవండి: కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా! -
బెంగళూరు గెలిచింది
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ చేరాలనుకున్న ముంబై ఆశలపై డిఫెండింగ్ చాంప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నీళ్లు చల్లింది. డబ్ల్యూపీఎల్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. దీంతో రెండో స్థానంతోనే సరిపెట్టుకున్న హర్మన్‌ప్రీత్ సేన ఫైనల్‌కు అర్హత సాధించేందుకు రేపు గుజరాత్ జెయింట్స్‌తో ‘ప్లేఆఫ్’ మ్యాచ్ ఆడనుంది. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం సాధించడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో సీజన్లోనూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై చెరో 10 పాయింట్లతో సమంగా నిలిచినా ... రన్‌రేట్‌తో క్యాపిటల్స్ ముందంజ వేసింది. 2023, 2024లలో కూడా ఢిల్లీ ఫైనల్ చేరినా... రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. మంగళవారం జరిగిన పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (37 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలీస్ పెరీ (38 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి పోరాడి ఓడింది. నాట్ సివర్ బ్రంట్ (35 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించింది. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్నేహ్ రాణా (3/26) మూడు... కిమ్ గార్త్, పెరీ చెరో రెండు వికెట్లు తీశారు. అందరూ ధాటిగా... బెంగళూరు జట్టులో క్రీజులోకి దిగినవారంతా ధాటిగా పరుగులు సాధించారు. సబ్బినేని మేఘన (13 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్స్మృతి ఓపెనింగ్ వికెట్‌కు 22 బంతుల్లో 41 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్ మంధానకు జతయిన ఎలీస్ పెరీ కూడా వేగంగా ఆడటంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. స్మృతి నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ (22 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) తనదైన శైలిలో దూకుడు కనబరిచింది. రిచా, పెరీలిద్దరూ జట్టు స్కోరును 150 పరుగులు దాటించారు. అనంతరం రిచా జోరుకు హేలీ అడ్డుకట్ట వేసింది. అయితే జార్జియా వేర్హామ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) డెత్ ఓవర్లలో చెలరేగడంతో ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాణించిన నాట్ సివర్ ముంబై ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (19), అమెలియా కెర్ (9) భారీ లక్ష్యానికి అనువైన శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. నాట్ సివర్ బ్రంట్ చక్కగా పోరాడినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు వికెట్లు పారేసుకోవడంతో ముంబై జట్టు లక్ష్యానికి దూరమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (20; 2 ఫోర్లు), అమన్‌జోత్ (17) ప్రభావం చూపలేకపోగా... ఆఖరి ఓవర్లో సజీవన్ సజన (12 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) భారీ షాట్లతో వణికించింది. 3 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో ఆమె కూడా అవుట్ కావడంతో ముంబైకి ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: మేఘన (సి) పారుణిక (బి) హేలీ మాథ్యూస్ 26; స్మృతి (సి) షబి్నమ్ (బి) అమెలియా 53; ఎలీస్ పెరీ నాటౌట్ 49; రిచా ఘోష్ (సి) నాట్ సివర్ (బి) హేలీ మాథ్యూస్ 36; జార్జియా నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–41, 2–100, 3–153. బౌలింగ్: షబ్నిమ్ ఇస్మాయిల్ 4–0–41–0, నాట్ సివర్ 2–0–16–0, హేలీ మాథ్యూస్ 4–0–37–2, అమన్‌జోత్ 4–0–27–0, అమెలియా కెర్ 3–0–47–1, సంస్కృతి గుప్తా 1–0–6–0, పారుణిక సిసోడియా 2–0–24–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) గ్రాహమ్ (బి) స్నేహ్ రాణా 19; అమెలియా (సి) మంధాన (బి) స్నేహ్ రాణా 9; నాట్ సీవర్ (సి అండ్ బి) పెరీ 69; హర్మన్‌ప్రీత్ (సి) రిచా ఘోష్ (బి) కిమ్ గార్త్ 20; అమన్‌జోత్ (బి) గ్రాహమ్ 17; యస్తిక భాటియా (సి అండ్ బి) స్నేహ్ రాణా 4; సజన (సి) మేఘన (బి) పెరీ 23; కమలిని (సి) పెరీ (బి) జార్జియా 6; సంస్కృతి (సి) జోషిత (బి) కిమ్ గార్త్ 10; షబ్నిమ్ నాటౌట్ 4; పారుణిక నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–27, 2–38, 3–78, 4–129, 5–134, 6–140, 7–152, 8–167, 9–188. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–33–2, ఎలీస్ పెరీ 4–0–53–2, స్నేహ్ రాణా 4–0–26–3, హిథెర్ గ్రాహమ్ 4–0–47–1, జార్జియా వేర్హామ్ 4–0–29–1. -
WPL 2025: స్మృతి మంధాన విఫలం.. దంచికొట్టిన ఎలిస్ పెర్రీ.. కానీ!
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల(RCBW) జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్(WPL)-2025లో ఆరంభంలో అదరగొట్టిన ఆర్సీబీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.గత మూడు మ్యాచ్‌లలో స్మృతి మంధాన(Smriti Mandhana) సేన చేదు అనుభవాలు చవిచూసింది. ముంబై ఇండియన్స్ వుమెన్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ.. ఆ తర్వాత యూపీ వారియర్స్‌తో మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా తెచ్చుకుని టై చేసుకుంది. అనంతరం గుజరాత్ జెయింట్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన బెంగళూరు జట్టు.. శనివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టింది.సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(8) దారుణంగా విఫలం కాగా.. మరో ఓపెనర్ డానియెల్ వ్యాట్- హాడ్జ్(18 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ, రాఘ్వి బిస్త్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది.పెర్రీ 47 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 60 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మరోవైపు.. రాఘ్వి 32 బంతుల్లో 33 పరుగులు చేయగలిగింది. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్(5), కనిక అహుజా(2) చేతులెత్తేయగా.. జార్జియా వారెహాం 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఫలితంగా ఆర్సీబీ 147 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి రెండేసి వికెట్లు కూల్చగా.. మరిజానే కాప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.డబ్ల్యూపీఎల్-2025: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ వుమెన్ తుదిజట్లుఢిల్లీ క్యాపిటల్స్మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మరిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికీ ప్రసాద్, శిఖా పాండే, మిన్ను మణి, నల్లపురెడ్డి చరణి.ఆర్సీబీ వుమెన్స్మృతి మంధాన (కెప్టెన్), డానియల్ వ్యాట్-హాడ్జ్, ఎలిస్ పెర్రీ, రాఘ్వి బిస్త్, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జార్జియా వారెహాం, కిమ్ గార్త్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్, ఏక్తా బిష్త్.చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
సూపర్ ఓవర్లో ఓటమి.. పెర్రీకి సారీ చెప్పిన మంధన
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్ ఓవర్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే తొలి సూపర్ ఓవర్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఎల్లిస్ పెర్రీ (56 బంతుల్లో 90 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. పెర్రీతో పాటు డానీ వ్యాట్ హాడ్జ్ (57) కూడా రాణించడంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేయగలిగింది.ఛేదనలో సోఫీ ఎక్లెస్టోన్ (19 బంతుల్లో 33; ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగడంతో (ఇన్నింగ్స్ చివర్లో) ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఫలితంగా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్జ్ 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. కిమ్ గార్త్ అద్బుతంగా బౌలింగ్ చేసి వారియర్జ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. కేవలం 4 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. రెగ్యులర్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సత్తా చాటిన ఎక్లెస్టోన్ సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని కట్టడి చేసింది. అద్భుతమైన టచ్‌లో ఉన్న పెర్రీని సూపర్ ఓవర్లో బరిలోకి దించకుండా స్మృతి మంధన పెద్ద తప్పు చేసింది. పెర్రీకి బదులు తనే బరిలోకి దిగడంతో సొంత అభిమానుల నుంచే ట్రోలింగ్‌ను ఎదుర్కొంది.ఓటమి అనంతరం మంధన పెర్రీకి క్షమాపణలు చెప్పింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన పెర్రీ కోసం మ్యాచ్ గెలవలేకపోయినందుకు బాధగా ఉందని అంది. జట్టు మొత్తం పెర్రీకి సారీ చెప్పాలని పేర్కొంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించినప్పటికి ఇలాంటి ఫలితం రావడంతో బాధాకరమని చెప్పుకొచ్చింది. కాగా, ఈ మ్యాచ్‌లో పెర్రీ ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ఒంటిచేత్తో నిర్మించింది. గాయంతో బాధపడుతూనే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. బౌలింగ్‌లోనూ రాణించి ఓ వికెట్ తీసింది. పెర్రీ అద్భుత ప్రదర్శన కనబర్చినా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడటం నిజంగానే బాధాకరం. ఇదే మ్యాచ్‌లో పెర్రీ డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్ స్కోరర్‌గా అవతరించింది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ.. జట్టు నుంచి సహకారం లేకపోతే ఫలితాలు ఇలానే వస్తాయని అభిమానులు అంటున్నారు.ఇదిలా ఉంటే, ఈ సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ అద్భుతంగా ప్రారంభించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మాంచి జోరును ప్రదర్శించింది. అయితే ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ నుంచి పెర్రీ అద్బుతంగా రాణిస్తుంది. ప్రస్తుతం ఆమెనే లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతుంది. పెర్రీ అద్భుత ప్రదర్శనల కారణంగానే ఈ సీజన్లో ఆర్సీబీ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. మంధన విఫలమవుతున్నా పెర్రీ ఆర్సీబీ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచింది. -
టీమిండియా వైస్ కెప్టెన్‌కు షాక్
టీమిండియా వైస్ కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధనకు (Smriti Mandhana) హండ్రెడ్ లీగ్ (The Hundred League) ఫ్రాంచైజీ సథరన్ బ్రేవ్ (Southern Brave) షాకిచ్చింది. గత కొంతకాలంగా తమకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంధనను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. గత సీజన్లో మంధన విఫలం కావడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. మంధన గత సీజన్లో 5 మ్యాచ్‌ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే సాధించింది. గత సీజన్లో విఫలమైనా మంధనకు హండ్రెడ్ లీగ్‌లో మంచి రికార్డు ఉంది. 2022, 2023 సీజన్లలో ఆమె మంచి స్ట్రయిక్ రేట్‌తో వరుసగా 211, 238 పరుగులు చేసింది.ఆసక్తికరంగా మంధన ఆర్సీబీ టీమ్ మేట్ అయిన డానీ వ్యాట్‌ను (ఇంగ్లండ్ ఓపెనర్) సథరన్ బ్రేవ్ తొలి రీటెన్షన్గా దక్కించుకుంది. వ్యాట్‌తో పాటు లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మయా బౌచియర్, ఫ్రేయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కార్టీన్ కోల్మన్, రిహన్నా సౌత్బైలను కూడా రీటైన్ చేసుకుంది. రిటెన్షన్ జాబితాను సథరన్ బ్రేవ్ ఇవాళ ప్రకటించింది.మంధన ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో బిజీగా ఉంది. ఈ సీజన్లో ఆమె 4 మ్యాచ్‌ల్లో 122 పరుగులు చేసింది. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. మంధన ఈ సీజన్లో తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. ఫలితంగా భారం మొత్తం ఎల్లిస్ పెర్రీపై పడుతుంది. పెర్రీ ఈ సీజన్లో విశేషంగా రాణిస్తుంది. నిన్న యూపీతో జరిగిన మ్యాచ్‌లో పెర్రీ అజేయమైన 90 పరుగులు చేసినా ఆర్సీబీ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్లో యూపీ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ ఓటమిపాలైంది.డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్, ఢిల్లీపై విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉన్నట్లు కనిపించింది. అయితే ఆతర్వాతి మ్యాచ్‌ల్లో వరుసగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ చేతుల్లో ఓడింది. అయినా ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ముంబై, యూపీ, ఢిల్లీ, గుజరాత్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 25) జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ, గుజరాత్ తలపడనున్నాయి. -
టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, మహిళల ఐపీఎల్లో (WPL) ముంబై ఇండియన్స్ సారధి అయిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) పొట్టి క్రికెట్లో (T20 Cricket) అరుదైన మైలురాయిని తాకింది. హర్మన్.. భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ సారధి అయిన స్మృతి మంధన తర్వాత టీ20ల్లో 8000 పరుగుల మైలురాయిని తాకిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 15) జరిగిన ఉత్కంఠ పోరులో హర్మన్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు 8000 పరుగులు పూర్తి చేసేందుకు హర్మన్‌కు 37 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో హర్మన్ 8000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసింది.అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు వివిధ టీ20 లీగ్‌ల్లో హర్మన్ చేసిన పరుగులుడబ్ల్యూపీఎల్- 591 పరుగులుమహిళల బిగ్‌బాష్ లీగ్- 1440 పరుగులుహండ్రెడ్ వుమెన్స్ లీగ్- 176 పరుగులుఅంతర్జాతీయ క్రికెట్- 3589 పరుగులు- వీటితో పాటు హర్మన్ దేశవాలీ టీ20 టోర్నీల్లో పంజాబ్ తరఫున మరిన్ని పరుగులు సాధించింది.టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్లు..స్మృతి మంధన- 8349హర్మన్‌ప్రీత్ కౌర్- 8005జెమీమా రోడ్రిగెజ్- 5826షఫాలీ వర్మ- 4542మిథాలీ రాజ్- 4329దీప్తి శర్మ- 3889ముంబై, ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ గెలుపుకు చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. అరుంధతి రెడ్డి చాలా ప్రయాసపడి రెండు పరుగులు పూర్తి చేసింది. తొలి పరుగును సునాయాసంగా పూర్తి చేసిన అరుంధతి.. రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా... కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్‌కు నివేదించగా... రీప్లేలో అరుంధతి బ్యాట్ క్రీజ్‌ను దాటినట్లు తేలింది. దీంతో రెండో పరుగొచ్చింది. ఫలితంగా ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతిదాకా చెమటోడ్చిన ముంబై ఇండియన్స్‌కు పరాభవం తప్పలేదు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) చెలరేగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ (18 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) ఢిల్లీ గెలుపుకు అవసరమైన పరుగుల్ని జతచేసింది. -
RCB సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా అరుదైన ఘనత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల(Royal Challengers Bengaluru Women) జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదనను పూర్తి చేసి.. అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. కాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)-2025 సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 14) మొదలైంది.డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ- గుజరాత్ జెయింట్స్ వుమెన్(Gujarat Giants Women) మధ్య మ్యాచ్‌తో వడోదర వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేచింది. కోటాంబి స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 201 పరుగులు చేసింది.ఆష్లే గార్డ్నర్ సునామీ ఇన్నింగ్స్ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ(42 బంతుల్లో 56) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 37 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మిగతా వాళ్లలో డియాండ్రా డాటిన్(13 బంతుల్లో 25), సిమ్రన్ షేక్(5 బంతుల్లో 11) ధనాధన్ దంచికొట్టారు. దీంతో గుజరాత్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.అయితే, లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధాన(9), డానియెల్ వ్యాట్- హాడ్జ్(4)లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్‌కు చేర్చింది ఆష్లే గార్డ్నర్. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ(34 బంతుల్లో 57) అర్ధ శతకంతో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. రాఘ్వి బిస్త్(25) ఆమెకు సహకారం అందించింది.రిచా విధ్వంసకర ఇన్నింగ్స్అయితే, వికెట్ కీపర్ రిచా ఘోష్ క్రీజులోకి రాగానే మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన రిచా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడింది. కేవలం 27 బంతుల్లోనే 64 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక రిచాకు తోడుగా కనికా అహుజా(13 బంతుల్లో 30) బ్యాట్ ఝులిపించింది. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.ఈ క్రమంలో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ వుమెన్ వరల్డ్ రికార్డు సాధించింది. మహిళల డొమెస్టిక్, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసిన జట్టుగా నిలిచింది. ఇక అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన రిచా ఘోష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.మహిళల డొమెస్టిక్ లేదంటే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన1. ఆర్సీబీ వుమెన్- వడోదరలో 2025లో గుజరాత్ జెయింట్స్‌పై- 202/4(WPL)2. ముంబై ఇండియన్స్- ఢిల్లీలో 2024లో గుజరాత్ జెయింట్స్‌పై- 191/3(WPL)3. ఆర్సీబీ వుమెన్- ముంబైలో 2023లో గుజరాత్ జెయింట్స్- 189/2(WPL)4. మెల్బోర్న్ రెనెగేడ్స్- అడిలైడ్‌లో 2024లో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై 186/1(WBBL)5. సదరన్ వైపర్స్- 2019లో యార్క్‌లో యార్క్‌షైర్ డైమండ్‌పై 185/4(WCSL).డబ్ల్యూపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ స్కోర్లు👉గుజరాత్ జెయింట్స్- 201/5 (20)👉ఆర్సీబీ వుమెన్- 202/4 (18.3)👉ఫలితం: గుజరాత్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ వుమెన్.చదవండి: అద్భుత ఫామ్.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే! -
నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విషయం చెప్పలేను: రోహిత్ శర్మ
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు మతిమరుపు ఎక్కువన్నసంగతి తెలిసిందే. తన విలువైన వస్తువుల్ని రోహిత్ తరచుగా మర్చిపోతుంటాడని గతంలో సహచర ఆటగాడు విరాట్ కోహ్లి సైతం ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. తాజాగా ముంబైలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ విషయం సంబంధించి పలు ప్రశ్నలు రోహిత్‌కు ఎదురయ్యాయి.ఈ ఈవెంట్లో భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన(Smriti Mandhana)తో హిట్‌మ్యాన్ ఇంట్రాక్టయ్యాడు. ఇటీవల మీ సహచరులు మిమ్మల్ని మీ హాబీల్లో దేనిపై ఆటపట్టించారు అని మంధాన నుంచి రోహిత్‌కు ప్రశ్న ఎదురైంది."నా టీమ్మేట్స్ మతిమరుపుపై ఎక్కువగా టీజ్ చేస్తుంటారు. కానీ అది నా హాబీ కాదు. ఇటీవలే నా వ్యాలెట్, పాస్‌పోర్ట్ మర్చిపోయానన్న వార్తల్లో నిజం లేదు. అది ఎప్పుడో పదేళ్ల కిందట జరిగింది అని రోహిత్ నవ్వుతూ బదులిచ్చాడు. దీంతో ఈ ఈవెంట్లో పాల్గోన్న మిగితా ఆటగాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.అదేవిధంగా ఇప్పటివరకు మీ జీవితంలో మర్చిపోయిన పెద్ద విషయం ఏమైనా ఉందా? అని రోహిత్‌ను ఆమె ప్రశ్నించింది. "నేను అది చెప్పలేను. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని నా భార్య లైవ్‌లో చూస్తుంటుంది. అందుకే ఆ విషయాన్ని నా మనసులోనే ఉంచుకుంటానని" హిట్మ్యాట్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఉత్తమ ప్లేయర్లగా బుమ్రా, మంధాన..ఇక నమన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్‌కు దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్, రవి శాస్రితో సహా భారత క్రికెటర్లు హాజరయ్యారు. 2023–24 సంవత్సరంలో ప్రదర్శనకుగానూ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌కు అందించే ‘పాలీ ఉమ్రీగర్ అవార్డు’ పురుషుల విభాగంలో మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వరించగా... మహిళల విభాగంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ పురస్కారం దక్కించుకుంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో 664 మ్యాచ్‌లాడి లెక్కకు మిక్కిలి అవార్డులు తన పేరిట లిఖించుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ ‘జీవన సాఫల్య’ పురస్కారం అందించింది. శనివారం ముంబైలో నిర్వహించిన వార్షిక అవార్డుల కార్యక్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు జై షా చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న బుమ్రాకు ‘పాలీ ఉమ్రీగర్ అవార్డు’ దక్కగా... మహిళల విభాగంలో స్మృతి మంధాన నాలుగోసారి ఈ అవార్డుకు ఎంపికైంది. 2017–18, 2020–21, 2021–22లోనూ స్మృతికి పాలీ ఉమ్రీగర్ పురస్కారం లభించింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్‌కు బోర్డు ప్రత్యేక పురస్కారం అందజేసింది. అత్యుత్తమ అంతర్జాతీయ అరంగేట్రం ఆటగాడి పురస్కారం సర్ఫరాజ్ ఖాన్ గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో ఈ పురస్కారం ఆశా శోభనకు దక్కింది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల అవార్డు కూడా స్మృతి మంధానకే దక్కింది. అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా దీప్తి శర్మ పురస్కారం గెలుచుకుంది. రంజీ ట్రోఫీలో ఉత్తమ ప్రదర్శన చేసిన ఆల్‌రౌండర్‌కు అందించే లాలా అమర్నాథ్ అవార్డు ముంబై ప్లేయర్ తనుశ్ కొటియాన్‌కు దక్కింది. దేశవాళీ టోరీ్నల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్టుగా ముంబై నిలిచింది. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌కు అందించే మాధవ్‌రావు సింధియా అవార్డుకు తెలంగాణ ప్లేయర్ తనయ్ త్యాగరాజన్ దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ పురస్కారం గెలుచుకున్నాడు. ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లు ఆడుతుండటంతో శనివారం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు. వారి స్థానంలో ఆయా రాష్ట్ర సంఘాల ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీలో వారిద్దరిదే కీలక పాత్ర: గౌతం గంభీర్ Don't 𝒇𝒐𝒓𝒈𝒆𝒕 to watch this 😎 Smriti Mandhana tries to find out the one hobby that Rohit Sharma has picked up recently, which his teammates tease him about 😃#NamanAwards | @ImRo45 | @mandhana_smriti pic.twitter.com/9xZomhnJjy— BCCI (@BCCI) February 1, 2025 -
BCCI Naman Awards 2025: అవార్డుల ప్రదానోత్సం.. విజేతల పూర్తి జాబితా
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నమన్ అవార్డుల(BCCI Naman Awards 2025) వేడుక శనివారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అదే విధంగా.. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు ఈ సందర్భంగా పురస్కారాలు అందజేశారు. పురుషుల ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ విభాగంలో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు అవార్డు దక్కింది. అన్ని ఫార్మాట్లలోనూ గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రాకు బీసీసీఐ ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డు అందజేసింది.అదే విధంగా.. మహిళల క్రికెట్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' దక్కింది. ఇక భారత లెజెండరీ స్పిన్నర్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్‌ను ప్రత్యేక పురస్కారంతో బీసీసీఐ సత్కరించింది. మూడు ఫార్మాట్లలో కలిపి 765 వికెట్లు తీసిన అశూ సేవలకు గుర్తింపుగా అవార్డు అందజేసింది.ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా 26 మంది క్రికెటర్లు పురస్కారాలు అందుకున్నారు.బీసీసీఐ నమన్ అవార్డులు-2025: విజేతల పూర్తి జాబితా1. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (జూనియర్ డొమెస్టిక్) [పతకం] - ఈశ్వరి అవసరే2. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (సీనియర్ డొమెస్టిక్) (సీనియర్ మహిళల వన్డే) [పతకం] - ప్రియా మిశ్రా3. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (అండర్-16) [పతకం] - హేమచుదేశన్ జగన్నాథన్4. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు (U-16) [పతకం] - లక్ష్య రాయచందనీ5. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్(U-19) [పతకం] - విష్ణు భరద్వాజ్6. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ (U-19) [పతకం] - కావ్య టియోటియా7. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - నీజెఖో రూపేయో8. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - పి. విద్యుత్9. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - హేమ్ చెత్రి10. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - అనీష్ కేవీ11. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ప్లేట్ గ్రూప్ [పతకం] - మోహిత్ జంగ్రా12. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ఎలైట్ గ్రూప్ [పతకం] - తనయ్ త్యాగరాజన్13. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ప్లేట్ గ్రూప్ [పతకం] - అగ్ని చోప్రా14. మాధవరావు సింధియా అవార్డ్: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ఎలైట్ గ్రూప్ [పతకం] - రికీ భుయ్15. దేశీయ పరిమిత ఓవర్ల పోటీలలో ఉత్తమ ఆల్ రౌండర్‌గా లాలా అమర్నాథ్ అవార్డు, 2023-24 [పతకం] - శశాంక్ సింగ్16. రంజీ ట్రోఫీ 2023-24 లో ఉత్తమ ఆల్ రౌండర్‌గా లాలా అమర్నాథ్ అవార్డు [పతకం]- తనుష్ కోటియన్17. దేశీయ క్రికెట్లో ఉత్తమ అంపైర్, 2023-24 [ట్రోఫీ] - అక్షయ్ టోట్రే18. 2023-24 బీసీసీఐ దేశీయ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన - ముంబై క్రికెట్ అసోసియేషన్19. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ [పతకం] - దీప్తి శర్మ20. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ [పతకం] - స్మృతి మంధాన21. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - మహిళలు [ట్రోఫీ] - ఆశా శోభన22. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - పురుషులు [ట్రోఫీ] - సర్ఫరాజ్ ఖాన్23. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - మహిళలు [ట్రోఫీ] - స్మృతి మంధాన24. పాలీ ఉమ్రిగర్ అవార్డు: ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - పురుషులు [ట్రోఫీ] - జస్ప్రీత్ బుమ్రా25. బీసీసీఐ ప్రత్యేక అవార్డు [షీల్డ్] - రవిచంద్రన్ అశ్విన్26. కల్నల్ CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు [షీల్డ్] - సచిన్ టెండూల్కర్. -
సచిన్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు'.. బెస్ట్ ప్లేయర్లగా బుమ్రా, మంధాన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘జీవిత సాఫల్య’ పురస్కారం అందజేయనుంది. క్రికెట్లో దేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు పేరుమీదుగా 1994 నుంచి ఈ ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డును బోర్డు వార్షిక పురస్కారాల్లో ప్రదానం చేస్తున్నారు. నేడు బోర్డు నిర్వహించే కార్యక్రమంలో 51 ఏళ్ల సచిన్‌కు ఈ అవార్డు బహూకరిస్తారు. రెండు దశాబ్దాల పైచిలుకు భారత క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన బ్యాటింగ్ తురుపుముక్క సచిన్ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో 664 మ్యాచ్‌లాడాడు. 200 టెస్టుల్లో 15, 291 పరుగులు, 51 శతకాలు... 463 వన్డేల్లో 18,426 పరుగులు, 49 సెంచరీలు సాధించాడు. ఈ రెండు ఫార్మాట్లో కలిపి 100 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా క్రికెట్ పుటల్లోకెక్కాడు.బుమ్రాకు పాలీ ఉమ్రిగర్..అదేవిధంగా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. 2024 ఏడాదిలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బుమ్రా అదరగొట్టాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అయితే బుమ్రా దుమ్ములేపాడు.గతేడాది 13 టెస్టుల్లో ఆడిన బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు టెస్టుల సిరీస్‌లో భారత స్పీడ్ స్టార్ 32 వికెట్లతో సత్తాచాటాడు. అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర.మొత్తంగా 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. 2024కు గాను ఐసీసీ బెస్ట్ క్రికెటర్ అవార్డుకు బుమ్రా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్‌ది ఈయర్ అవార్డు కూడా బుమ్రా సొంతం చేసుకున్నాడు.మరోవైపు మహిళల్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' అవార్డు వరించింది. గతేడాది 50 ఓవర్ల ఫార్మాట్లో 743 పరుగులు చేసింది. 2024లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మకు అవార్డును ఆమె అందుకోనుంది. ఈ అవార్డులను బీసీసీఐ శనివారం ప్రధానం చేయనుంది.చదవండి: పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం -
ICC: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్.. తొలి ప్లేయర్‌గా
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్(Amelia Kerr) సరికొత్త చరిత్ర సృష్టించింది. ‘ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్(ICC Women's Cricketer Of The Year)’ అవార్డు గెలుచుకున్న తొలి కివీ ప్లేయర్‌గా నిలిచింది.సౌతాఫ్రికాకు చెందిన లారా వొల్వర్ట్(Laura Wolvaardt), శ్రీలంక స్టార్ చమరి ఆటపట్టు, ఆస్ట్రేలియా క్రికెటర్ అనాబెల్ సదర్లాండ్లను వెనక్కి నెట్టి ‘ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- 2024 అవార్డును సొంతం చేసుకుంది. తద్వారా ప్రతిష్టాత్మక రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని ముద్దాడనుంది.మోస్ట్ డేంజరస్ప్లేయర్కాగా 24 ఏళ్ల అమేలియా కెర్ వరల్డ్‌క్లాస్ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే అమేలియా.. ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాలు కనబరిచే అమేలియా.. ఎన్నో సార్లు ‘వైట్ ఫెర్న్స్’(న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు)ను ఒంటిచేత్తో గెలిపించింది.టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిఇక గతేడాది జరిగిన ఐసీసీ మహిళ టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో కెర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. న్యూజిలాండ్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఆమె.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకుంది. సౌతాఫ్రికాతో ఫైనల్లో కేవలం 24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడంతో పాటు.. 43 పరుగులు చేసింది. ఈ టోర్నీలో మొత్తంగా 15 వికెట్లు పడగొట్టింది. ఇక మొత్తంగా 2024లో 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన అమేలియా కెర్.. 387 పరుగులు చేయడంతో పాటు.. 29 వికెట్లు పడగొట్టింది. ఆమె జ్ఞాపకార్థంఅదే విధంగా.. గతేడాది తొమ్మిది వన్డేల్లో కలిపి 264 పరుగులు చేసిన అమేలియా కెర్.. పద్నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక గతేడాదికిగానూ ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్‌గా అవార్డును అమేలియా సొంతం చేసుకంది. కాగా మహిళల క్రికెట్‌కు మార్గదర్శకులుగా నిలిచారు ఇంగ్లండ్ క్రికెటర్ రేచల్ హేహో ఫ్లింట్. ఆమె జ్ఞాపకార్థం 2017 నుంచి ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన వారికి రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని అందిస్తున్నారు. 2017 నుంచి భారత క్రికెటర్ స్మృతి మంధాన, ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలిస్సా పెర్రీ రెండేసిసార్లు ఈ ట్రోఫీని అందుకోగా.. ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సీవర్- బ్రంట్ కూడా రెండుసార్లు (2022, 2023)ఈ అవార్డును ముద్దాడింది. ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ స్మృతిగత సంవత్సరం స్మృతి మంధాన అద్భుత ఆటతీరు కనబరిచింది. 2024లో స్మృతి 13 వన్డేలు ఆడి 747 పరుగులు సాధించింది. ఇందులో 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. గతేడాది స్మృతి మొత్తం 95 ఫోర్లు, 6 సిక్స్‌లు కొట్టింది. ఆస్ట్రేలియాతో 4 వన్డేలు ఆడి 151 పరుగులు చేసిన స్మృతి... న్యూజిలాండ్‌పై 105 పరుగులు (3 వన్డేల్లో), దక్షిణాఫ్రికాపై 343 పరుగులు (3 వన్డేల్లో), వెస్టిండీస్‌పై 148 పరుగులు (3 వన్డేల్లో) సాధించింది.ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లపై ఒక్కో శతకం సాధించిన స్మృతి దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు నమోదు చేసింది. ఐసీసీ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు గెల్చుకోవడం స్మృతి మంధానకిది రెండోసారి. 2018లోనూ ఆమెకు ఈ పురస్కారం లభించింది. భారత్ నుంచి ఈ అవార్డు సాధించిన ఏకైక మహిళా క్రికెటర్ కూడా స్మృతినే కావడం విశేషం. చదవండి: T20 WC 2025: భారత్‌తో పాటు సెమీస్ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్ వివరాలు -
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుచుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్
భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు గెలుచుకుంది. గతేడాది వన్డేల్లో విశేషంగా రాణించినందుకు గానూ మంధనను ఈ అవార్డు వరించింది.గతేడాది మొత్తం 13 వన్డేలు ఆడిన మంధన, నాలుగు సెంచరీల సాయంతో 57.86 సగటున, 95.15 స్ట్రయిక్‌రేట్‌తో 747 పరుగులు చేసింది. తద్వారా గతేడాది లీడింగ్ రన్ స్కోరర్‌గానూ నిలిచింది. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మంధన.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై తలో సెంచరీ చేసింది.ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు. అయితే చివరికి ఈ అవార్డు మంధననే వరించింది. ఈ అవార్డు సాధించడానికి ముందు మంధన ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్, ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్‌లలో చోటు దక్కించుకుంది. వన్డే టీమ్‌కు మంధనతో పాటు భారత్ నుంచి దీప్తి శర్మ ఎంపిక కాగా.. టీ20 టీమ్‌లో మంధన, దీప్తి శర్మతో పాటు భారత్ నుంచి రిచా ఘోష్ కూడా చోటు దక్కించుకుంది.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్.వ్యక్తిగత విభాగంలో ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- స్మృతి మంధన ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ -
ఐసీసీ మహిళల వన్డే జట్టులో స్మృతి, దీప్తి
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్’ జట్టులో ఇద్దరు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన, స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఈ టీమ్‌లో స్థానం సంపాదించారు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గాకాగా స్మృతి మంధాన 2024లో 13 వన్డేలు ఆడి 747 పరుగులు చేసింది. తద్వారా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుసగా రెండు శతకాలు బాదిన ఆమె న్యూజిలాండ్‌పై కూడా ఒక సెంచరీ చేసింది.24 వికెట్లు పడగొట్టిఇక 2024లో 13 వన్డేలాడిన దీప్తి శర్మ 186 పరుగులు చేయడంతో పాటు... 24 వికెట్లు పడగొట్టి ఈ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ జట్టుకు దక్షిణాఫ్రికా స్టార్ లౌరా వాల్వర్ట్ సారథిగా ఎంపికైంది.మరోవైపు.. ఇంగ్లండ్ నుంచి అమీ జోన్స్, సోఫీ ఎకెల్‌స్టోన్, కేట్ క్రాస్ రూపంలో ముగ్గురు ప్లేయర్లు, ఆస్ట్రేలియా నుంచి ఆష్లే గార్డ్నర్, అనాబెల్ సథర్లాండ్ చోటు దక్కించుకున్నారు. సఫారీ ప్లేయర్ మరీనే కాప్‌తో పాటు శ్రీలంక నుంచి చమరి ఆటపట్టు, వెస్టిండీస్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ కూడా ఈ టీమ్‌కు ఎంపికయ్యారు.ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024స్మృతి మంధాన, లారా వాల్వర్ట్(కెప్టెన్), చమరి ఆటపట్టు, హేలీ మాథ్యూస్, మరీనే కాప్, ఆష్లే గార్డ్నర్, అనాబెల్ సథర్లాండ్, అమీ జోన్స్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లిస్టోన్, కేట్ క్రాస్. మరిన్ని క్రీడా వార్తలుఫైనల్లో సూర్మా క్లబ్ రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్ తొలి టోర్నమెంట్లో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సూర్మా క్లబ్ జట్టు 4–2 గోల్స్ తేడాతో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టును ఓడించింది. సూర్మా క్లబ్ తరఫున ఎంగెల్బెర్ట్ (1, 17వ, 47వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేయగా... హినా బానో (9వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది.బెంగాల్ టైగర్స్ తరఫున కెప్టెన్ వందన కటారియా (48వ నిమిషంలో), శిల్పి దబాస్ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నాలుగు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక సూర్మా క్లబ్ 13 పాయింట్లతో... ఒడిశా వారియర్స్ జట్టు 11 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈనెల 26న జరిగే ఫైనల్లో సూర్మా క్లబ్, ఒడిశా వారియర్స్ టైటిల్ కోసం తలపడతాయి. శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు నాలుగో ఓటమిసాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు నాలుగో ఓటమి ఎదురైంది. బెంగళూరులో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి జట్టు 0–1 గోల్ తేడాతో స్పోర్టింగ్ క్లబ్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిపోయింది.ఆట 34వ నిమిషంలో ఆసిఫ్ గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన స్పోర్టింగ్ జట్టు ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్‌లో శ్రీనిధి జట్టు 9 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 3 మ్యాచ్‌ల్లో గెలిచి, 2 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, 4 మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీనిధి జట్టు 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 28న హైదరాబాద్‌లో జరిగే తదుపరి మ్యాచ్ లో నాంధారి జట్టుతో శ్రీనిధి జట్టు ఆడుతుంది. -
వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్
సైకాలజీ స్టూడెంట్ ఇప్పుడు టీమిండియా తరఫున సత్తా చాటుతోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆరో ఇన్నింగ్స్‌లోనే ఏకంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. భారత మహిళా క్రికెట్ జట్టులోకి దూసుకువచ్చిన ఆ యువ కెరటం మరెవరో కాదు.. ప్రతీకా రావల్(Pratika Rawal).యువ ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma) వరుస వైఫల్యాల నేపథ్యంలో సెలక్టర్లు ప్రతీకా రావల్‌కు పిలుపునిచ్చారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న 24 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసింది. ఈ క్రమంలో ఆడిన తొలి నాలుగు వన్డేల్లోనే రెండు అర్ధ శతకాలతో మెరిసింది.వరల్డ్ రికార్డు బద్దలుతాజాగా ఐర్లాండ్‌తో వన్డే సిరీస్(India Women Vs Ireland Women) జట్టులోనూ చోటు దక్కించుకున్న ప్రతీకా రావల్.. మూడు మ్యాచ్‌లలోనూ అదరగొట్టింది. తొలి వన్డేలో 89, రెండో వన్డేలో 67 పరుగులు సాధించిన ప్రతీకా.. బుధవారం నాటి మూడో వన్డేలో భారీ శతకంతో అదరగొట్టింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 154 పరుగులు సాధించింది.ఈ క్రమంలో ప్రతీకా రావల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. ప్రతీకా రావల్ భారత్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (154)ను సాధించింది. దీప్తి శర్మ (188), హర్మన్‌ప్రీత్ (171 నాటౌట్) ఆమెకంటే ముందున్నారు. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు👉ప్రతీకా రావల్(ఇండియా)- 444 పరుగులు👉చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్)- 434 పరుగులు👉నథాకన్ చాంథమ్(థాయ్‌లాండ్)- 322 పరుగులు👉ఎనిడ్ బేక్వెల్(ఇంగ్లండ్)- 316 పరుగులు👉నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)- 307 పరుగులు.అతిపెద్ద వన్డే విజయంరాజ్కోట్ వేదికగా ఐర్లాండ్‌తో మూడో వన్డేలో భారత ఓపెనర్లు ప్రతీక రావల్(154), స్మృతి మంధాన(135) శతకాలతో చెలరేగారు. వీరిద్దరికి తోడు రిచా ఘోష్ హాఫ్ సెంచరీ(59)తో రాణించింది. ఈ క్రమంలో భారత జట్టు 435 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది. పురుషులు, మహిళల వన్డే క్రికెట్లో భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు. ఓవరాల్‌గా మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. టాప్–3 అత్యధిక స్కోర్లు న్యూజిలాండ్ (491/4; 2018లో ఐర్లాండ్‌పై; 455/5; 1997లో పాక్‌పై; 440/3; 2018లో ఐర్లాండ్‌పై) పేరిటే ఉండటం విశేషం.ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 304 పరుగులతో ఐర్లాండ్‌పై టీమిండియా జయభేరి మోగించింది. పరుగుల తేడా పరంగా భారత మహిళా జట్టుకిదే అతిపెద్ద విజయం. 2017లో భారత్ 249 పరుగుల తేడాతో ఐర్లాండ్‌నే ఓడించింది. ఇక ఈ గెలుపుతో 3–0తో వన్డే సిరీస్‌ను స్మృతి బృందం క్లీన్‌స్వీప్ చేసింది. అదే విధంగా.. భారత జట్టు ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేయడం ఇది 13వసారి. అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన రికార్డు ఆస్ట్రేలియా (33 సార్లు) పేరిట ఉంది. ఇక.. ఐర్లాండ్‌తో ఇప్పటి వరకు ఆడిన 15 వన్డేల్లోనూ భారత జట్టే గెలవడం మరో విశేషం.చదవండి: ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్A post-series chat with the record-breaking opening duo! 😎From Maiden ODI century to Fastest ODI Hundred for India in women's cricket 💯Captain Smriti Mandhana and Pratika Rawal 𝙚𝙡𝙖𝙗𝙤𝙧𝙖𝙩𝙚 it all 😃👌 - By @mihirlee_58 #TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/7c0xsYGaIo— BCCI Women (@BCCIWomen) January 16, 2025 -
భారత్ ఖాతాలో అతిపెద్ద వన్డే విజయం
ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు(India Women vs Ireland Women)తో మూడో వన్డేలో స్మృతి సేన ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా భారత మహిళా క్రికెట్ వన్డే చరిత్రలో అతి భారీ గెలుపు(Largest Margin Win)ను నమోదు చేసింది. అంతేకాదు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.కాగా ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా భారత్- ఐర్లాండ్ మధ్య మూడు వన్డేలు జరిగాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ సిరీస్‌కు దూరం కాగా.. ఆమె స్థానంలో స్మృతి మంధాన తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇక శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఐర్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. ఆదివారం నాటి మ్యాచ్‌లో 116 పరుగుల తేడాతో ఐరిష్ జట్టును చిత్తు చేసింది.శతకాలతో చెలరేగిన స్మృతి, ప్రతికాఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి.. రికార్డు స్కోరును సాధించింది. ఓపెనర్లు ప్రతికా రావల్(Prathika Rawal 129 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్- 154), స్మృతి మంధాన(80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగగా.. వికెట్ కీపర్ రిచా ఘోష్ అర్ధ శతకం(42 బంతుల్లో 59) రాణించింది.మిగిలిన వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్(15), జెమీమా రోడ్రిగ్స్(4*), దీప్తి శర్మ(11*) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. ఈ నేపథ్యంలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. మెన్స్, వుమెన్స్ వన్డే క్రికెట్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఆది నుంచే ఐర్లాండ్ తడ‘బ్యా’టుఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లలో కెప్టెన్ గాబీ లూయీస్(Gaby Lewis- 1) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కౌల్టర్ రెలీ(0) డకౌట్‌గా వెనుదిరిగింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్(41)తో కలిసి ఓర్లా ప్రెరెండెర్గాస్ట్(36) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.చెలరేగిన భారత బౌలర్లుఅయితే, భారత బౌలర్ల ధాటికి ఈ ఇద్దరు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. సారా, ఓర్లా అవుటైన తర్వాత ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. లారా డెలానీ(10), లీ పాల్(15), అర్లెనె కెలీ(2), అవా కానింగ్(2), జార్జియానా డెంప్సీ(0), అలనా డాల్జెల్(5*), ఫ్రేయా సార్జెంట్(1) త్వరత్వరగా పెవిలియన్ చేరారు. ఫలితంగా ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులు చేసి.. ఆలౌట్ అయింది. దీంతో భారత్ 304 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇక భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లతో చెలరేగగా.. తనూజ కన్వార్ రెండు వికెట్లు పడగొట్టింది. మరోవైపు.. టైటస్ సాధు, సయాలీ సట్ఘరే, మిన్ను మణి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సెంచరీతో రాణించిన ప్రతికా రావల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మహిళల వన్డే క్రికెట్లో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలు👉ఐర్లాండ్‌పై రాజ్‌కోట్ వేదికగా 2025లో 304 పరుగుల తేడాతో గెలుపు👉ఐర్లాండ్‌పై పోచెఫ్‌స్ట్రూమ్ వేదికగా 2017లో 249 పరుగుల తేడాతో గెలుపు👉వెస్టిండీస్‌పై వడోదర వేదికగా 2024లో 211 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్‌పై డంబుల్లా వేదికగా 2008లో 207 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్‌పై కరాచీ వేదికగా 2005లో 193 పరుగుల తేడాతో గెలుపు.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
టీమిండియా సరికొత్త చరిత్ర.. వన్డేల్లో అత్యధిక స్కోరు
ఐర్లాండ్‌తో మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన విధ్వంసానికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా రాణించడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత యాభై ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయిన స్మృతి సేన ఏకంగా 435 పరుగులు సాధించింది. నాటి రికార్డు బ్రేక్తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు(Highest ODI total) సాధించిన భారత జట్టుగా నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు భారత పురుషుల క్రికెట్ జట్టు పేరిట ఉండేది. ఇండోర్ వేదికగా 2011లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. తాజాగా స్మృతి సేన ఆ రికార్డును బద్దలు కొట్టి.. ఈ మేర సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది.ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సొంతగడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు ఐర్లాండ్(India Women Vs Ireland Women)తో తలపడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే.. రాజ్‌కోట్ వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు గెలిచిన భారత్.. సిరీస్‌ను 2-0తో గెలిచింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డేలోనూ స్మృతి సేన ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ల ధనాధన్ శతకాలుటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి, ప్రతికా రావల్(Pratika Rawal) శతక్కొట్టి అదిరిపోయే ఆరంభం అందించారు. స్మృతి 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు సాధించగా.. ప్రతికా భారీ సెంచరీతో దుమ్ములేపింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని ఇరవై ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఏకంగా 154 పరుగులు రాబట్టింది.హాఫ్ సెంచరీతో మెరిసిన రిచాఇక వన్‌డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. 42 బంతులు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(25 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్ 15 రన్స్ చేసింది. జెమీమా రోడ్రిగెస్ 4, దీప్తి శర్మ 11 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా రికార్డు స్థాయిలో 435 పరుగులు స్కోరు చేసింది. ఐరిష్ బౌలర్లలో ఓర్లా ప్రెండెర్గాస్ట్కు రెండు వికెట్లు దక్కగా.. అర్లెనీ కెల్లీ, ఫ్రెయా సార్జెంట్, జార్జియానా డెంప్సీ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఐర్లాండ్‌తో మూడో వన్డే సందర్భంగా స్మృతి సేన సాధించిన రికార్డులువుమెన్స్ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు బాదిన జట్లలో మూడో స్థానం1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 712. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 593. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్‌కోట్- 57వుమెన్స్ వన్డేల్లో 400కిపైగా స్కోర్లు సాధించిన జట్లలో నాలుగో స్థానం1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 491/42. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్- 1997- క్రైస్ట్‌చర్చ్- 455/53. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 440/34. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్‌కోట్- 435/5.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. ‘తొలి ప్లేయర్’గా స్మృతి మంధాన చరిత్ర
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో తక్కువ బంతుల్లోనే శతకం బాదిన(Women's ODI Fastest Century) భారత తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సాధించింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా స్మృతి మంధాన ఈ ఘనత సాధించింది. అంతేకాదు.. మహిళల వన్డే క్రికెట్లో పది సెంచరీలు పూర్తి చేసుకుని మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.కెప్టెన్‌గా, బ్యాటర్‌గా స్మృతి అదుర్స్ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు.. భారత్(India Women Vs Ireland Women)లో పర్యటిస్తోంది. ఈ మూడు వన్డేల సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ దూరం కాగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ స్మృతి అద్బుత ప్రదర్శన కనబరుస్తోంది.రాజ్‌కోట్ వేదికగా సాగుతున్న ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లలో స్మృతి వరుసగా 41, 73 పరుగులు సాధించి.. గెలుపులో తన వంతు పాత్ర పోషించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం జరుగుతున్న మూడో వన్డేలోనూ స్మృతి సూపర్ ఫామ్‌ను కొనసాగించింది.వుమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన శతక్కొట్టారు. స్మృతి 70 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. వుమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన తొలి ఇండియన్‌గా నిలిచింది. అంతేకాదు.. వన్డేల్లో పది సెంచరీలు సాధించిన భారత తొలి మహిళా క్రికెటర్‌గా, ఓవరాల్‌గా నాలుగో ప్లేయర్‌గా చరిత్రకెక్కింది.Led from the front and how 👏👏What a knock THAT 🙌Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/4dQVq6JTRm— BCCI Women (@BCCIWomen) January 15, 2025 ఇక స్మృతి మొత్తంగా ఈ మ్యాచ్‌లో 80 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్ ఓర్లా ప్రెండెర్‌గాస్ట్ బౌలింగ్‌లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. అవా కానింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరుఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో మూడో వన్డేలో మరో ఓపెనర్ ప్రతికా రావల్ భారీ శతకంతో మెరిసింది. 129 బంతులు ఎదుర్కొని 154 పరుగులు సాధించింది. ప్రతికా ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. మిగతా వాళ్లలో రిచా ఘోష్ 59 పరుగులతో రాణించగా.. తేజల్ హెసాబ్నిస్ 28, హర్లీన్ డియోల్ 14 రన్స్ చేశారు. ఇక జెమీమా 4, దీప్తి శర్మ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 435 పరుగులు స్కోరు చేసింది. భారత్ తరఫున మహిళా, పురుష క్రికెట్లో వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.మహిళల వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత ప్లేయర్లు1. స్మృతి మంధాన- ఐర్లాండ్ వుమెన్స్‌పై- రాజ్‌కోట్(2025)లో- 70 బంతుల్లో శతకం2.హర్మన్‌ప్రీత్ కౌర్- సౌతాఫ్రికా వుమెన్స్‌పై- బెంగళూరు(2024)లో- 87 బంతుల్లో శతకం3. హర్మన్‌ప్రీత్ కౌర్- ఆస్ట్రేలియా వుమెన్స్‌పై- డెర్బీ(2017)లో- 90 బంతుల్లో శతకం4. జెమీమా రోడ్రిగ్స్- ఐర్లాండ్ వుమెన్స్‌పై- రాజ్‌కోట్(2025)లో- 90 బంతుల్లో శతకం5. హర్లీన్ డియోల్- వెస్టిండీస్ వుమెన్స్‌పై- వడోదర(2024)లో- 98 బంతుల్లో శతకం.మహిళల వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లుమెగ్ లానింగ్- 15సుజీ బేట్స్- 13టామీ బీమౌంట్- 10స్మృతి మంధాన- 10చమరి ఆటపట్టు- 9చార్లెట్ ఎడ్వర్డ్స్- 9నాట్ సీవర్ బ్రంట్- 9.MAXIMUM x 2⃣Captain Smriti Mandhana's elegance on display here in Rajkot!Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/wMlnuoUWIr— BCCI Women (@BCCIWomen) January 15, 2025 చదవండి: పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం -
టాప్ ఫోర్... వైల్డ్ ఫైర్
భారత మహిళల జట్టు సొంతగడ్డలో ఐర్లాండ్‌పై ‘వైల్డ్ ఫైర్’ అయ్యింది. టాప్–4 బ్యాటర్లు గర్జించడంతో మన జట్టు వన్డేల్లో తమ అత్యధిక రికార్డు స్కోరును నమోదు చేసింది. ఓవరాల్‌గా అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో మూడో అత్యధిక స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ శతకంతో... ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్, వన్‌డౌన్‌లో హర్లీన్ డియోల్ ‘ఫిఫ్టీ’లతో చెలరేగారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ, ప్రియా మిశ్రాలు ఐర్లాండ్ బ్యాటర్ల పని పట్టారు. దీంతో రెండో వన్డేలో స్మృతి మంధాన బృందం భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు వన్డేల్లో గెలుపుతో ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు ఈనెల 15న జరిగే చివరిదైన మూడో వన్డేలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాజ్‌కోట్: భారత టాపార్డర్ టాప్ లేపే ప్రదర్శనతో ఐర్లాండ్ మహిళల్ని చితగ్గొట్టింది. రెండో వన్డేలో ఓపెనింగ్ జోడీ సహా తర్వాత వచ్చిన మూడు, నాలుగో వరుస బ్యాటర్లూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజ్‌కోట్ వేదిక పరుగుల ‘పొంగల్’ చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 116 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) తన కెరీర్లో తొలి శతకం సాధించగా... హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు), కెప్టెన్ స్మృతి మంధాన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రతీక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీస్కోరు చేసింది. గతంలో భారత జట్టు ‘బెస్ట్’ స్కోరు 358. 2017లో ఐర్లాండ్‌పై 358/2 చేసిన అమ్మాయిల జట్టు గత నెల విండీస్‌పై కూడా 358/5తో ఆ ‘బెస్ట్’ను సమం చేసింది. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులకు పరిమితమైంది. క్రిస్టీనా కూల్టర్ (113 బంతుల్లో 80; 10 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు. తొలి వన్డే గెలిచిన స్మృతి సేన తాజా విజయంతో 2–0తో సిరీస్ వశం చేసుకుంది. 15న చివరి వన్డే జరగనుంది. స్మృతి, ప్రతీక ఫైర్ బ్యాటింగ్‌కు దిగగానే ఓపెనర్లు స్మృతి, ప్రతీక ఐర్లాండ్ బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ భారీస్కోరుకు గట్టి పునాది వేశారు. దీంతో 7.2 ఓవర్లలో 50 స్కోరు చేసిన భారత్ 100కు (13 ఓవర్లలో) చేరేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్మృతి 35 బంతుల్లో, ప్రతీక 53 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇలా ఓపెనర్లిద్దరే తొలి 19 ఓవర్లలో 156 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అదే స్కోరు వద్ద వరుస బంతుల్లో ఇద్దరు నిష్క్రమించారు. ఇక్కడ ముగిసింది సినిమాల్లోలాగా ఫస్టాఫే! అంటే విశ్రాంతి. తర్వాత శుభం కార్డు జెమీమా, హర్లీన్‌ల జోరు చూపించింది. దీంతో 28 ఓవర్ల పాటు (19.1 నుంచి 47.1 ఓవర్ వరకు) వాళ్లిద్దరు మూడో వికెట్‌కు జతచేసిన 183 పరుగుల భాగస్వామ్యం స్కోరును కొండంతయ్యేలా చేసింది. హర్లీన్ 58 బంతుల్లో ఫిఫ్టీ కొడితే... జెమీమా 62 బంతుల్లో 50... 90 బంతుల్లో సెంచరీ సాధించింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) జార్జినా (బి) ప్రెండెర్‌గాస్ట్ 73; ప్రతీక (ఎల్బీడబ్ల్యూ) (బి) జార్జినా 67; హర్లీన్ (సి) లౌరా (బి) కెల్లీ 89; జెమీమా (బి) కెల్లీ 102; రిచా ఘోష్ (సి) ఫ్రెయా (బి) ప్రెండర్‌గాస్ట్ 10; తేజల్ (నాటౌట్) 2; సయాలీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 370. వికెట్ల పతనం: 1–156, 2–156, 3–339, 4–358, 5–368. బౌలింగ్: వోర్లా ప్రెండర్‌గాస్ట్ 8–0–75–2, అవా క్యానింగ్ 10–0–51–0, అర్లెన్ కెల్లీ 10–0–82–2, ఫ్రెయా సర్జెంట్ 9–0–77–0, అలానా డాల్జెల్ 5–0–41–0, జార్జినా 8–0–42–1. ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా (బి) దీప్తి 38; గాబీ లూయిస్ (సి) రిచా (బి) సయాలీ 12; క్రిస్టీనా (బి) టిటాస్ సాధు 80; వోర్లా (సి) సయాలీ (బి) ప్రియా 3; లౌరా (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 37; లీ పాల్ (నాటౌట్) 27; కెల్లీ (బి) దీప్తి 19; అవ క్యానింగ్ (బి) ప్రియా 11; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–32, 2–87, 3–101, 4–184, 5–188, 6–218, 7–234. బౌలింగ్: టిటాస్ సాధు 10–0–48–1, సయాలీ 9–1–40–1, సైమా ఠాకూర్ 9–0–50–0, ప్రియా మిశ్రా 10–0–53–2, దీప్తి శర్మ 10–0–37–3, ప్రతీక 2–0–12–0. -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఐర్లాండ్ మహిళా జట్టుతో తొలి వన్డేలోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. కేవలం 29 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు సాధించింది.ఈ క్రమంలో స్మతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల మార్కు అందుకున్న తొలి మహిళా ప్లేయర్‌గా నిలిచింది. కాగా ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు వన్డేలు ఆడేందుకు ఐర్లాండ్ భారత్ పర్యటన(India Women vs Ireland Women)కు వచ్చింది.కెప్టెన్‌గా స్మృతిఈ సిరీస్‌కు భారత మహిళా జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూరం కాగా స్మృతి సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా వన్డే సిరీస్ ఆరంభమైంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్ గాబీ లూయిస్ అద్భుత అర్ధ శతకం(92)తో చెలరేగగా.. మిడిలార్డర్లో లీ పాల్(59) కూడా హాఫ్ సెంచరీ సాధించింది. వీరిద్దరికి తోడు లోయర్ ఆర్డర్లో అర్లెనె కెలీ 28 పరుగులతో రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. టైటస్ సాధు, దీప్ది శర్మ, సయాలీ సట్ఘరే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు వేల పరుగుల పూర్తిఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్(Pratika Rawal) శుభారంభం అందించారు. మంధాన 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్రేయా సార్జెంట్ బౌలింగ్‌లో ఓర్లా ప్రెండర్‌గాస్ట్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుటైంది. అయితే, ఈ క్రమంలోనే స్మృతి వన్డేల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించింది.ఇంతకు ముందు భారత్ తరఫున మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించగా.. స్మృతి తాజాగా ఈ ఫీట్ నమోదు చేసింది. అయితే, మిథాలీ రాజ్ నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకోవడానికి 112 వన్డే ఇన్నింగ్స్ ఆడగా.. స్మృతి కేవలం 95 వన్డే ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించింది. తద్వారా అత్యంత వేగంగా 4 వేల వన్డే పరుగుల క్లబ్లో చేరిన భారత తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.వన్డేల్లో వేగంగా నాలుగు వేల పరుగుల మైలురాయికి చేరుకున్న మహిళా క్రికెటర్లు👉బెలిండా క్లార్క్- ఆస్ట్రేలియా- 86 ఇన్నింగ్స్👉మెగ్ లానింగ్- ఆస్ట్రేలియా- 87 ఇన్నింగ్స్👉స్మృతి మంధాన- ఇండియా- 95 ఇన్నింగ్స్👉లారా వొల్వర్ట్- సౌతాఫ్రికా- 96 ఇన్నింగ్స్👉కరేన్ రాల్టన్- ఆస్ట్రేలియా- 103 ఇన్నింగ్స్👉సుజీ బేట్స్- న్యూజిలాండ్- 105 ఇన్నింగ్స్👉స్టెఫానీ టేలర్- వెస్టిండీస్- 107 ఇన్నింగ్స్👉టస్మిన్ బీమౌంట్- ఇంగ్లండ్- 110 ఇన్నింగ్స్👉మిథాలీ రాజ్- ఇండియా- 112 ఇన్నింగ్స్👉డేబీ హాక్లీ- న్యూజిలాండ్- 112 ఇన్నింగ్స్‌ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతికా రావల్ 89 పరుగులతో చెలరేగగా.. తేజస్ హసాబ్నిస్ 53 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి అద్బుత ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొలి వన్డేలో ఐర్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. -
స్మృతి సారథ్యంలో...
న్యూఢిల్లీ: ఐర్లాండ్‌తో స్వదేశంలో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ టీమ్‌కు స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టి20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు స్మృతినే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. విండీస్‌తో వన్డే పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పేస్ బౌలర్ రేణుకా సింగ్‌కు కూడా విరామం ఇచ్చారు. విండీస్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసిన ప్రతీక, తనూజ తమ స్థానాలను నిలబెట్టుకోగా... రాఘ్వీ బిస్త్‌కు తొలిసారి వన్డే టీమ్ పిలుపు దక్కింది. భారత వన్డే టీమ్‌లోకి ఎంపికైనా మ్యాచ్ ఆడని సయాలీ సత్ఘరేకు మరో అవకాశం దక్కింది. మరోవైపు ఇప్పటికే స్థానం కోల్పోయిన షఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌లపై మాత్రం సెలక్టర్లు ఇంకా విశ్వాసం ఉంచలేదు. రాజ్‌కోట్‌లో ఈ నెల 10, 12, 15 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇప్పటి వరకు భారత్, ఐర్లాండ్ మధ్య 12 వన్డేలు జరగ్గా...అన్నీ భారత్ గెలిచింది. జట్టు వివరాలు: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్‌కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా ఛెత్రి, రిచా ఘోష్, తేజల్ హసబ్నిస్, రాఘ్వీ బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజ కన్వర్, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, సయాలీ సత్ఘరే. -
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్
వెస్టిండీస్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు మరో స్వదేశీ పోరుకు సిద్దమైంది.ఐర్లాండ్ మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడేందుకు భారత్ సిద్దమైంది. జనవరి 10న రాజ్‌కోట్ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఐరీష్‌తో వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్‌గా ఎంపికైంది. అదే విధంగా మరో సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ కూడా ఈ వన్డే సిరీస్‌కు దూరమైంది.కాగా మరోసారి స్టార్ ప్లేయర్ షెఫాలీ వర్మకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. షెఫాలీ వర్మ ప్రస్తుతం దేశీవాళీ క్రికెట్లో దుమ్ము లేపుతున్నప్పటికి సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. కాగా విండీస్‌తో సిరీస్‌లో ఆడిన ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్‌లు.. ఐరీష్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కూడా చోటు దక్కించుకున్నారు.ఐర్లాండ్ సిరీస్‌కు భారత మహిళల జట్టు ఇదే: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, రాఘవి బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్, సయాలీ సత్ఘరే -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న మంధన.. టీమిండియా భారీ స్కోర్
వడోదరా వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (డిసెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన (91) తృటిలో సెంచరీ చేజార్చుకుంది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (40), హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగెజ్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో భారత టెయిలెండర్లు తడబడ్డారు. లేకపోతే టీమిండియా ఇంకా భారీ స్కోర్ చేసుండేది. విండీస్ స్పిన్నర్ జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది. హేలీ మాథ్యూస్ 2, డియోండ్రా డొట్టిన్ ఓ వికెట్ పడగొట్టింది. కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకోగా.. ప్రస్తుతం వన్డే సిరీస్ సాగుతుంది. డిసెంబర్ 24, 27 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. -
స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్‌గా
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన మంధాన.. స్వదేశంలో వెస్టిండీస్ మహిళల జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ అదే దూకుడు కనబరిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో మెరిసిన మంధాన.. గురువారం జరిగిన ఆఖరి టీ20లోనూ తన బ్యాట్‌కు పనిచెప్పింది. ఈ మ్యాచ్‌లో స్మృతి విధ్వంసం సృష్టించింది. కేవలం 47 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 77 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంధాన పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకుంది.మంధాన సాధించిన రికార్డులు ఇవే..👉మహిళా క్రికెట్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా మంధాన చరిత్ర సృష్టించింది. మంధాన ఇప్పటివరకు తన టీ20 కెరీర్లో 30 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ వెటరన్ సుజీ బేట్స్(29) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బేట్స్ ఆల్‌టైమ్ రికార్డును మంధాన బ్రేక్ చేసింది.అత్యధిక పిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్లు వీరే..స్మృతి మంధాన (భారత్) -30సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 29బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 25స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్)- 22సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 22👉అదే విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన క్రికెటర్‌గా సైతం మంధాన రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది 21 టీ20 ఇన్నింగ్స్‌లలో స్మృతి 763 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్లు (720 పరుగులు) పేరిట ఉండేది. -
విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం
భారత క్రికెటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది. తద్వారా ప్రపంచ రికార్డును రిచా సమం చేసింది. కాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు వెస్టిండీస్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.నవీ ముంబైలోఈ క్రమంలో నవీ ముంబై వేదికగా టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆదివారం నాటి తొలి మ్యాచ్‌లో భారత్, రెండో టీ20లో విండీస్ జట్లు గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. గురువారం నాటి మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక కీలక మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.స్మృతి ధనాధన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి రికార్డు స్థాయిలో 217 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 77, 13 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ అర్ధ శతకంతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్(31), రాఘవి బిస్త్(31*) ఫర్వాలేదనిపించారు.రిచా ర్యాంపేజ్.. వరల్డ్ రికార్డు సమంఅయితే, ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ రాగానే.. ఒక్కసారిగా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న రిచా.. మహిళల టీ20 క్రికెట్లో ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వరల్డ్ రికార్డును సమం చేసింది. అంతకు ముందు సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ ఈ ఘనత సాధించగా.. రిచా వారి వరల్డ్ రికార్డును సమం చేసింది. అయితే, అలియా అలెన్ బౌలింగ్‌లో చినెల్లె హెన్రీకి క్యాచ్ ఇవ్వడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు)కు తెరపడింది.రాధా యాదవ్ దూకుడుఇక లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌కు భారత బౌలర్లుకు చుక్కలు చూపించారు. రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రేణుకా సింగ్, టిటస్ సాధు, దీప్తి శర్మ, సజీవన్ సజన ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.వీరంతా కలిసి తమ అద్భుత బౌలింగ్‌తో వెస్టిండీస్‌ను 157 పరుగులకే కట్టడి చేయడంతో.. భారత మహిళా జట్టు 60 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రిచా ఘోష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ A 60-run victory in the Third and Final T20I! 🥳#TeamIndia win the decider in style and complete a 2⃣-1⃣ series victory 👏👏Scorecard ▶️ https://t.co/Fuqs85UJ9W#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/SOPTWMPB3E— BCCI Women (@BCCIWomen) December 19, 2024 -
భారత మహిళల ‘రికార్డు’ విజయం
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు ప్రదర్శనతో వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌లో, ఆపై బౌలింగ్‌లో చెలరేగిన భారత్ 60 పరుగుల తేడాతో విండీస్ మహిళల జట్టుపై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన (47 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ రిచా ఘోష్ (21 బంతుల్లో 54; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగగా... జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (22 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది. చినెల్ హెన్రీ (16 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాధ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం వడోదరలో తొలి వన్డే జరుగుతుంది. మెరుపు బ్యాటింగ్... తొలి ఓవర్లోనే ఉమా ఛెత్రి (0) అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది. అయితే ఆ తర్వాత స్మృతి, జెమీమా కలిసి విండీస్ బౌలర్లపై చెలరేగారు. హెన్రీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన స్మృతి... డాటిన్ వేసిన తర్వాతి ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. కరిష్మా ఓవర్లో జెమీమా 3 ఫోర్లు సాధించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. 27 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. రెండో వికెట్‌కు జెమీమాతో 98 పరుగులు (55 బంతుల్లో), మూడో వికెట్‌కు రాఘ్వీతో 44 పరుగులు (27 బంతుల్లో) జోడించిన తర్వాత స్మృతి వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత వచి్చన రిచా విరుచుకుపడింది. తన తొలి మూడు బంతులనే 6, 4, 4గా మలచిన ఆమె హేలీ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు బాదింది. అలీన్ బౌలింగ్‌లో మరో భారీ సిక్స్‌తో 18 బంతుల్లో రిచా రికార్డు హాఫ్ సెంచరీని అందుకుంది. ఛేదనలో విండీస్ బ్యాటర్లంతా తడబడ్డారు. అసాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. హెన్రీ కొద్దిగా పోరాడటం మినహా మిగతా వారంతా విఫలం కావడంతో విజయానికి జట్టు చాలా దూరంలో నిలిచిపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) హెన్రీ (బి) డాటిన్ 77; ఉమా ఛెత్రి (సి) జోసెఫ్ (బి) హెన్రీ 0; జెమీమా (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 39; రాఘ్వీ బిస్త్ (నాటౌట్) 31; రిచా ఘోష్ (సి) హెన్రీ (బి) అలీన్ 54; సజన (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–1, 2–99, 3–143, 4–213. బౌలింగ్: చినెల్ హెన్రీ 2–0–14–1, డాటిన్ 4–0–54–1, హేలీ మాథ్యూస్ 4–0–34–0, కరిష్మా 3–0–44–0, అలీన్ 4–0–45–1, ఫ్లెచర్ 3–0–24–1. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సజన (బి) రాధ 22; ఖియానా జోసెఫ్ (సి) టిటాస్ సాధు (బి) సజన 11; డాటిన్ (సి) రాధ (బి) టిటాస్ సాధు 25; క్యాంప్‌బెల్ (సి) స్మృతి (బి) దీప్తి 17; చినెల్ హెన్రీ (సి) రాఘ్వీ (బి) రేణుక 43; క్రాఫ్టన్ (రనౌట్) 9; అలీన్ (బి) రాధ 6; షబిక (సి) సజన (బి) రాధ 3; జైదా (సి) రిచా (బి) రాధ 7; ఫ్లెచర్ (నాటౌట్) 5; కరిష్మా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–20, 2–57, 3–62, 4–96, 5–129, 6–136, 7–137, 8–142, 9–147. బౌలింగ్: రేణుకా సింగ్ 3–0–16–1, సజీవన్ సజన 2–0–16–1, సైమా ఠాకూర్ 4–0–33–0, టిటాస్ సాధు 3–0–31–1, రాధ యాదవ్ 4–0–29–4, దీప్తి శర్మ 4–0–31–1. 217/4 అంతర్జాతీయ టి20ల్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఇదే ఏడాది యూఏఈపై సాధించిన 201/5 స్కోరును భారత్ అధిగమించింది. 18 హాఫ్ సెంచరీకి రిచా తీసుకున్న బంతులు. సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ పేరిట వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డును రిచా సమం చేసింది. 30 స్మృతి మంధాన అర్ధ సెంచరీల సంఖ్య. సుజీ బేట్స్ (29)ను అధిగమించి అగ్ర స్థానానికి చేరింది.763 ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో స్మృతి చేసిన పరుగులు. క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చమరి అటపట్టు (720) రికార్డును స్మృతి సవరించింది. -
మంధన మెరుపు అర్ద శతకం.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధన 41 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ రిచా ఘోష్ 17 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసింది. దీప్తి శర్మ (15 బంతుల్లో 17; 2 ఫోర్లు), జెమీమా రోడ్రిగెజ్ (15 బంతుల్లో 13; 2 ఫోర్లు) రెండంకెల స్కోర్లు చేశారు. మంధన క్రీజ్‌లో ఉండగా భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. మధ్యలో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. భారత ఇన్నింగ్స్‌లో ఉమా ఛెత్రి 4, రాఘ్వి బిస్త్ 5, సంజీవన్ సజనా 2, రాధా యాదవ్ 7, సైమా ఠాకోర్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. టిటాస్ సాధు 1, రేణుకా ఠాకూర్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, చిన్నెల్ హెన్రీ, డియాండ్రా డొట్టిన్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీ కాగా, స్మృతి మంధన టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. స్మృతి మంధన తొలి మ్యాచ్‌లో కూడా అర్ద సెంచరీతో (54) మెరిసింది. -
టాప్-3లోకి టీమిండియా వైస్ కెప్టెన్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మంధన టాప్-3లోకి ప్రవేశించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరిన మంధన.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరింది.ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సిరీస్‌ల్లో ప్రదర్శనల ఆధారంగా మంధన ర్యాంక్‌లు మెరుగుపడ్డాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మంధన సూపర్ సెంచరీ (105) చేసింది. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో మెరుపు అర్ద సెంచరీ (54) సాధించింది.మరోవైపు వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ట్యామీ బేమౌంట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరగా.. భారత బ్యాటర్ హర్లీన్ డియోల్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 64వ స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శ్రీలంక బ్యాటర్ చమారీ ఆటపట్టు, ఇంగ్లండ్ బ్యాటర్ నతాలీ సీవర్ బ్రంట్, ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు స్థానాలు కోల్పోయి 13వ స్థానానికి పడిపోయింది.టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ స్థానం మెరుగపర్చుకుని 11వ స్థానానికి చేరగా.. భారత్‌కే చెందిన జెమీమా రోడ్రిగెజ్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు బెత్ మూనీ, తహిళ మెక్‌గ్రాత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్‌కు చెందిన దీప్తి శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. -
Ind vs WI: సిరీస్ విజయంపై కన్నేసిన భారత్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు.. రెండో గెలుపుపై కన్నేసింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగే రెండో టీ20లో గెలిస్తే ఈ సిరీస్ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఖాతాలో చేరుతుంది. మరోవైపు గత మ్యాచ్‌లో ఓటమి నుంచి కోలుకొని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని విండీస్ మహిళలు భావిస్తున్నారు.ఇక ముంబై వేదికగా తొలి టీ20లో భారత బ్యాటర్లంతా రాణించడం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. ఓపెనర్ స్మృతి మంధాన దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో చిత్తుగా ఓడిన తర్వాత స్వదేశంలో దక్కిన ఈ విజయం జట్టులో ఉత్సాహాన్ని పెంచింది. అయితే ఫీల్డింగ్‌లో టీమ్ కాస్త పేలవ ప్రదర్శన కనబర్చింది.తొలి మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు మూడు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ చక్కటి బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేయగా... టిటాస్ సాధు వికెట్లు పడగొట్టింది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ కూడా సత్తా చాటాల్సి ఉంది. స్వల్ప లోపాలు ఉన్నా... బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో చెలరేగితే మరో విజయం కష్టం కాబోదు.మరోవైపు వెస్టిండీస్ కూడా బ్యాటింగ్‌లో బలంగానే ఉంది. ముఖ్యంగా డియాండ్రా డాటిన్ గత మ్యాచ్ తరహాలోనే ధాటిగా ఆడగల సమర్థురాలు. ఖియానా జోసెఫ్ కూడా తొలి టీ20లో రాణించింది. వీరితో పాటు కెప్టెన్, ఓపెనర్ హేలీ మాథ్యూస్ కూడా తన స్థాయికి తగినట్లు ఆడితే విండీస్ బలం పెరుగుతుంది. -
మెరిసిన జెమీమా, స్మృతి
నవీ ముంబై: భారత మహిళల జట్టు చాన్నాళ్ల తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేయగా, బౌలింగ్‌లో టిటాస్ సాధు (3/37), దీప్తి శర్మ (2/21), రాధా యాదవ్ (2/28) కరీబియన్ జట్టును దెబ్బతీశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఉమా ఛెత్రి (26 బంతుల్లో 24; 4 ఫోర్లు), రిచా ఘోష్ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కరిష్మా రమ్హార్యాక్ 2, డియాండ్ర డాటిన్ 1 వికెట్ తీశారు. అనంతరం వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసి ఓడింది. ఓపెనర్ కియానా జోసెఫ్ (33 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డియాండ్ర డాటిన్ (28 బంతుల్లో 52; 4 ఫోరు, 3 సిక్స్‌లు) రాణించారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం ఇదే వేదికపై రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి (సి) కియానా (బి) కరిష్మా 54; ఉమా ఛెత్రి (బి) కరిష్మా 24; జెమీమా రోడ్రిగ్స్ (రనౌట్) 73; రిచా ఘోష్ (సి) మంగ్రూ (బి) డియాండ్ర 20; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 13; సజన (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–50, 2–131, 3–155, 4–190. బౌలింగ్: చినెలీ హెన్రీ 2–0–17–0, జైదా జేమ్స్ 1–0–13–0, హేలీ 3–0–38–0, కరిష్మా 4–0–18–2, అఫీ ఫ్లెచర్ 3–0–39–0, డియాండ్ర 4–0–37–1, షమిలియా 1–0–11–0, కియానా జోసెఫ్ 2–0–22–0. వెస్టిండీస్ మహిళల ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సబ్–మిన్నుమణి (బి) టిటాస్ 1; కియానా (సి) సైమా (బి) టిటాస్ 49; షెమైన్ (బి) దీప్తి శర్మ 13; డియాండ్ర (సి) రాధ (బి) టిటాస్ 52; చినెలీ హెన్రీ (సి) సబ్–మిన్నుమణి (బి) రాధ 7; షబిక (నాటౌట్) 15; అఫీ ఫ్లెచర్ (బి) దీప్తి శర్మ 0; జైదా (సి) ఉమా ఛెత్రి (బి) రాధ 5; మంగ్రూ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–2, 2–36, 3–80, 4–108, 5–126, 6–127, 7–140. బౌలింగ్: రేణుక 4–0– 25–0, టిటాస్ సాధు 4–0–37–3, దీప్తిశర్మ 4–0– 21–2, సైమా 4–0–35–0, రాధ 4–0–28–2.3622 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా స్మృతి మంధాన గుర్తింపు పొందింది. ఇన్నాళ్లు హర్మన్‌ప్రీత్ (3589 పరుగులు) పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది. 117 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ డియాండ్రా డాటిన్ (117) ఘనత సాధించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ (114) పేరిట ఉన్న రికార్డును డియాండ్రా బద్దలు కొట్టింది. -
IND VS WI 1st T20: చెలరేగిపోయిన జెమీమా.. రాణించిన మంధన
నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. స్మృతి మంధన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెజ్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఉమా ఛెత్రి 24, రిచా ఘోష్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (13), సంజీవన్ సజనా (1) అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో కరిష్మ రామ్హరాక్ రెండు వికెట్లు పడగొట్టగా.. డియాండ్రా డొట్టిన్ ఓ వికెట్ దక్కించుకుంది.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో టీ20 మ్యాచ్‌లు డిసెంబర్ 15, 17, 19 తేదీల్లో జరుగనుండగా.. వన్డేలు 22, 24, 27 తేదీల్లో జరుగనున్నాయి. టీ20 మ్యాచ్‌లన్నీ నవీ ముంబైలో జరుగనుండగా.. మూడు వన్డే మ్యాచ్‌లకు వడోదర వేదిక కానుంది.ఇదిలా ఉంటే, భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత్ మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో, మూడో వన్డేలో 83 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
Ind vs WI: భారత టీ20, వన్డే జట్ల ప్రకటన.. స్టార్ పేసర్‌పై వేటు
వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఎంపికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న హైదరాబాద్ పేసర్ అరుంధతీ రెడ్డిపై సెలక్షన్ కమిటీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.అరుంధతీ రెడ్డిపై వేటు.. కారణం?కాగా సొంతగడ్డపై భారత్ వెస్టిండీస్ మహిళల జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడనున్న తరుణంలో అనుభవజ్ఞురాలైన అరుంధతీ రెడ్డిని తప్పించారు. రెండు ఫార్మాట్లలోనూ ఆమెకు ఉద్వాసన పలకడం గమనార్హం. నిజానికి జట్టులో చోటు కోల్పోయేంత పేలవంగా ఆమె ప్రదర్శన అయితే లేదు. కుదురుగా బౌలింగ్ చేస్తున్న ఆమె వికెట్లు లేదంటే పరుగుల కట్టడితో ఆకట్టుకుంటోంది. అయినప్పటికీ వేటు వేయడం గమనార్హం.వారిద్దరికి తొలిసారి చోటుఇక విండీస్ సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురు కొత్త ముఖాలకు చోటిచ్చారు. ప్రతిక రావల్, తనూజ కన్వర్లను తొలిసారి వన్డే జట్టులోకి తీసుకోగా... నందిని కశ్యప్, రాఘవి బిస్త్‌లను తొలిసారి టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. ఈ రెండు జట్లకు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌరే సారథ్యం వహించనుంది.టీ20 సిరీస్‌తో ఆరంభంముందుగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ నెల 15, 17, 19 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అనంతరం వడోదరలో ఈ నెల 22, 24, 27 తేదీల్లో మూడే వన్డేల సిరీస్ జరుగుతుంది.ఇక ఈ రెండు సిరీస్‌లకు షఫాలీ వర్మను కూడా ఎంపిక చేయలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌కు ఫామ్‌లో లేని షఫాలీకి ఉద్వాసన పలికారు. గాయాల కారణంగా యస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, ప్రియా పూనియాలను సెలక్షన్‌కు పరిగణించలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, సజన సజీవన్, రాఘవి బిస్త్, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్.వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, తేజల్ హసబ్నిస్, ప్రతిక రావల్, తనూజ కన్వర్. చదవండి: భారత్‌తో టీ20, వన్డే సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ మిస్ -
ఆసీస్‌తో వన్డే సిరీస్.. భారత క్రికెట్ జట్టుకు మరో షాక్
భారత మహిళల క్రికెట్ జట్టుకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన హర్మన్ సేనకు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గట్టి షాకిచ్చింది. ఆసీస్‌తో బ్రిస్బేన్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడటంతో ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో కోత పడింది. నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువ వేయడంతో ఓవర్‌కు 5 చొప్పున... భారత ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు రెఫరీ డేవిడ్ గిల్బర్ట్ వెల్లడించాడు.విచారణ లేకుండా నేరుగాఐసీసీ నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం జరిమానా విధించినట్లు పేర్కొన్నాడు. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పు అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండా నేరుగా కోత విధించినట్లు తెలిపాడు. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ 3-0తో క్వీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే.మూడో వన్డేలో స్మృతి ‘శత’క్కొట్టినా...పెర్త్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆసీస్ ప్లేయర్లలో అనాబెల్ సదర్లాండ్ (95 బంతుల్లో 110; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా... కెప్టెన్ తాలియా మెక్‌గ్రాత్ (56 నాటౌట్; 5 ఫోర్లు), ఆష్లే గార్డ్నర్ (50; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు.ఒకదశలో 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను అనాబెల్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకుంది. మొదట గార్డ్నర్తో ఐదో వికెట్‌కు 96 పరుగులు జోడించిన అనాబెల్... ఆ తర్వాత తాలియాతో ఆరో వికెట్‌కు 95 బంతుల్లో 122 పరుగులు జతచేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీయగా... దీప్తి శర్మ ఒక వికెట్ దక్కించుకుంది.ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (109 బంతుల్లో 105; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు నుంచి ఆమెకు ఎటువంటి సరైన సహకారం లభించలేదు. ఒక్క హర్లీన్ డియోల్ (39; 4 ఫోర్లు) మినహా మిగతా వాళ్లు విఫలమయ్యారు.అండగా హర్లీన్ డియోల్స్మృతి–హర్లీన్ రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేసినా... తర్వాత వచ్చిన వాళ్లు అదే జోరును కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (12), రిచా ఘోష్ (2), జెమీమా రోడ్రిగ్స్ (16), దీప్తి శర్మ (0), మిన్ను మణి (8) విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా 45.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ కాగా.. కంగారూ జట్టు 83 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 5 వికెట్లు తీయగా... మేగన్ షుట్, అలానా కింగ్ రెండేసి వికెట్లు తీశారు. ఇక ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన అనాబెల్ సదర్లాండ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్ -
టీమిండియా వైస్ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సూపర్ సెంచరీతో మెరిసిన మంధన, ఓ క్యాలెండర్ ఇయర్లో నాలుగు వన్డే సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ ఘనత సాధించే క్రమంలో మంధన మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో 8000 పరుగులు పూర్తి చేసుకున్న అతి పిన్న వయస్కురాలుగా (28 ఏళ్ల 146 రోజుల్లో) రికార్డు నెలకొల్పింది. మంధన వన్డేల్లో 3812 పరుగులు.. టీ20ల్లో 3568, టీ20ల్లో 629 పరుగులు చేసింది.ఆసీస్‌తో మూడో వన్డే విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో మంధన సెంచరీతో (109 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 105 పరుగులు) కదంతొక్కినప్పటికీ టీమిండియా 83 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (110) మెరుపు సెంచరీతో సత్తా చాటగా.. ఆష్లే గార్డ్నర్ (50), తహిళ మెక్‌గ్రాత్ (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (10-2-26-4) అద్భుతంగా బౌలింగ్ చేయగా. దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 45.1 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. స్మృతి మంధన సూపర్ సెంచరీతో అదరగొట్టినప్పటికీ.. ఆమెకు మరో ఎండ్ నుంచి ఎవరూ సహకరించలేదు. మంధనతో పాటు హర్లీన్ డియోల్ (39) కాసేపు క్రీజ్‌లో గడిపింది. భారత ఇన్నింగ్స్‌లో మంధన, హర్లీన్‌తో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (12), జెమీమా రోడ్రిగెజ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ (10-1-30-5) టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టింది. అలానా కింగ్, మెగాన్ షట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ఓ వికెట్ దక్కించుకుంది. ఈ ఓటమితో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయింది. -
పుష్ప సాంగ్‌తో స్మృతి మంధాన సెంచరీ సెలబ్రేట్ చేసిన ప్రియుడు(ఫొటోలు)
-
IND VS AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా వైస్ కెప్టెన్
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ క్యాలెండర్ ఇయర్లో నాలుగు వన్డే సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు మంధనతో పాటు బెలిండ క్లార్క్ (1997), మెగ్ లాన్నింగ్ (2016), ఆమీ సాటర్త్‌వైట్ (2016), సోఫీ డివైన్ (2018), సిద్రా అమీన్ (2022), నాట్ సీవర్ బ్రంట్ (2023), లారా వోల్వార్డ్ట్ (2024) పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా ఓ క్యాలెండర్ ఇయర్లో తలో మూడు వన్డే సెంచరీలు చేశారు.తాజాగా మంధన తన తోటి వారందరినీ అధిగమించి ఈ ఏడాది నాలుగో వన్డే సెంచరీ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో మంధన ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది మంధన సౌతాఫ్రికాపై రెండు (117, 136), న్యూజిలాండ్ (100), ఆస్ట్రేలియాపై (105) తలో సెంచరీ చేసింది. మంధన ఈ ఏడాది చేసిన సెంచరీల్లో మూడు స్వదేశంలో సాధించినవి కాగా.. ఒకటి ఆస్ట్రేలియాలో చేసింది.ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో మంధన 109 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 105 పరుగులు చేసింది. ఈ సెంచరీ మంధనకు వన్డేల్లో తొమ్మిదవది. ఆసీస్‌తో మ్యాచ్‌లో మంధన సెంచరీతో కదంతొక్కినా టీమిండియా ఓటమిపాలైంది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. మంధన ఔట్ కాగానే చకచకా వికెట్లు కోల్పోయింది. 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 215 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్ 0-3 తేడాతో కోల్పోయింది. -
మంధన సూపర్ సెంచరీ వృధా.. మూడో వన్డేలోనూ టీమిండియా పరాజయం
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (110) మెరుపు సెంచరీతో సత్తా చాటగా.. ఆష్లే గార్డ్నర్ (50), తహిళ మెక్‌గ్రాత్ (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (10-2-26-4) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ (4) సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమైంది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 45.1 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. స్మృతి మంధన (105) సూపర్ సెంచరీతో అదరగొట్టినప్పటికీ.. ఆమెకు మరో ఎండ్ నుంచి ఎవరూ సహకరించలేదు. మంధన ఔటైన అనంతరం భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మంధనతో పాటు హర్లీన్ డియోల్ (39) కాసేపు క్రీజ్‌లో గడిపింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్‌లో మంధన, హర్లీన్‌తో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (12), జెమీమా రోడ్రిగెజ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ (10-1-30-5) టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టింది. అలానా కింగ్, మెగాన్ షట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ఓ వికెట్ దక్కించుకుంది. -
సూపర్ ఫామ్‌లో భారత ఓపెనర్.. ఆల్‌టైమ్ రికార్డుకు గురి
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ వన్డేలో సెంచరీతో చెలరేగిన ఈ ముంబై బ్యాటర్.. మహిళల బిగ్‌బాష్ లీగ్-2024లోనూ ఫామ్‌ను కొనసాగించింది. ఈ ఆస్ట్రేలియా టీ20 లీగ్‌లో మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో కలిపి 142కు పైగా స్ట్రైక్‌రేటుతో 144 పరుగులు సాధించింది.ఇక స్మృతి మంధాన తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో బిజీ కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. ఆసీస్‌తో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మృతి గనుక 310 పరుగులు సాధిస్తే.. వన్డేల్లో 4000 పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ల క్లబ్లో చేరుతుంది. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డుఅంతేకాదు భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలుస్తుంది. కాగా ఇంతకు ముందు దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్... 112 మ్యాచ్‌లలో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకుంది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో 2011నాటి వన్డేలో ఈ ఘనత సాధించింది.ఇక స్మృతి మంధాన ఇప్పటి వరకు 88 వన్డేలు ఆడి 3690 పరుగులు సాధించింది. ఇందులో ఎనిమిది శతకాలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో స్మృతి ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా 310 రన్స్ చేస్తే.. మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలుకొట్టగలుగుతుంది. టాప్‌లో ఉన్నది వీరేకాగా ఓవరాల్‌గా మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల క్లబ్లో చేరిన క్రికెటర్లలో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ ముందు వరుసలో ఉంది. ఆమె 86 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేసింది. బెలిండా తర్వాతి స్థానాల్లో... మెగ్ లానింగ్(89 ఇన్నింగ్స్), లారా వొల్వర్ట్(96 ఇన్నింగ్స్), కరేన్ రాల్టన్(103 ఇన్నింగ్స్), సుజీ బేట్స్(105 ఇన్నింగ్స్), స్టెఫానీ టేలర్(107 ఇన్నింగ్స్), టామీ బీమౌంట్(110 ఇన్నింగ్స్) ఈ జాబితాలో ఉన్నారు.ఇదిలా ఉంటే.. భారత మహిళా జట్టు మూడు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. డిసెంబరు 5న బ్రిస్బేన్‌లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్‌లో ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న మంధన
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన కళ్లు చెదిరే రన్నింగ్ క్యాచ్ పట్టుకుంది. డబ్ల్యూబీబీఎల్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్‌కు ఆడే మంధన పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో మంధన అమండ జేడ్ బౌలింగ్‌లో కార్లీ లీసన్ క్యాచ్‌ను పట్టుకుంది. స్కార్చర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ తొలి బంతికి లీసన్ కవర్స్ దిశగా షాట్ ఆడగా.. మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మంధన వెనక్కు పరిగెడుతూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరవతువుంది.WHAT A STUNNING CATCH BY SMRITI MANDHANA IN WBBL 🤯🔥 pic.twitter.com/byoJRzx69i— Johns. (@CricCrazyJohns) November 19, 2024మూడు క్యాచ్‌లు పట్టుకున్న మంధన ఈ మ్యాచ్‌లో మంధన మొత్తం మూడు క్యాచ్‌లు పట్టుకుంది. ఈ మూడు అద్భుతమైన క్యాచ్‌లే. మైదానంలో పాదరసంలా కదిలిన మంధన బ్యాట్‌తోనూ రాణించింది. 29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసింది. మంధన బ్యాట్‌తో, ఫీల్డ్‌లో రాణించడంతో అడిలైడ్ స్ట్రయికర్స్ 30 పరుగులు తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. మంధన (41), కేటీ మ్యాక్(41), లారా వోల్వార్డ్ట్ (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. స్కార్చర్స్ బౌలర్లలో అలానా కింగ్ 3, కెప్టెన్ సోఫీ డివైన్ 2, క్లో ఐన్స్‌వర్త్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కార్చర్స్.. మెగాన్ షట్ (3/19), ముషాంగ్వే (2/35), అమండ జేడ్ వెల్లింగ్టన్ (2/26), తహిల మెక్‌గ్రాత్ (1/27) ధాటికి నిర్ణీత ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ హ్యాలీడే (47), సోఫీ డివైన్ (35), అలానా కింగ్ (29 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
మట్టికుండ చేసిన స్మృతి మంధాన.. ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్ (ఫొటోలు)
-
టాప్-10లోకి హర్మన్.. సెంచరీ చేసినా మంధనకు నిరాశే..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భారీగా లబ్ది పొందింది. గత వారం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన హర్మన్.. మూడు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరింది. న్యూజిలాండ్ సిరీస్ చివరి రెండు ఇన్నింగ్స్‌ల్లో హర్మన్ 83 పరుగులు చేసింది. ఇందులో సిరీస్ డిసైడర్‌లో చేసిన ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఈ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.సెంచరీ చేసినా మంధనకు నిరాశే..!తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధనకు ఎలాంటి లబ్ది చేకూరలేదు. న్యూజిలాండ్ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో సెంచరీ చేసినా మంధన ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఆమె తన ర్యాంకింగ్ పాయింట్లను గణనీయంగా మెరుగుపర్చుకుంది. ఈ వారం ర్యాంకింగ్ పాయింట్స్‌లో మంధన 703 నుంచి 728 పాయింట్లకు ఎగబాకింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న మంధనకు మూడో ప్లేస్‌లో ఉన్న చమారీ ఆటపట్టుకు కేవలం ఐదు పాయింట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది.ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన నాట్ సీవర్ బ్రంట్ టాప్‌లో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ రెండో స్థానంలో ఉంది. భారత ప్లేయర్లలో దీప్తి శర్మ 20వ స్థానంలో ఉండగా.. జెమీమా రోడ్రిగెజ్ 30వ స్థానంలో ఉంది.బౌలింగ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌ల్లో ఆరు వికెట్లు తీసిన దీప్తి శర్మ రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్‌లో తన హావా కొనసాగిస్తుంది. దీప్తికి సోఫీకి మధ్య 67 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఈ వారం ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ రేణుక సింగ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి ఎగబాకగా.. మరో ఇద్దరు భారత బౌలర్లు ప్రియా మిశ్రా, సోయ్మా ఠాకోర్ టాప్-100లోకి ఎంటర్ అయ్యారు. -
Diwali 2024: ఆర్సీబీ ‘క్వీన్’ అలా.. అందమైన అలంకరణతో స్మృతి ఇలా(ఫొటోలు)
-
స్మతి మంధాన రికార్డు సెంచరీ.. ప్రియుడి పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డేల్లో దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. కాగా భారత మహిళా జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడింది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన గెలవగా.. రెండో వన్డేలో సోఫీ డివైన్ బృందం ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది.భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేసి.. 76 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మాబాద్‌లో మంగళవారం సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. 86 పరుగులతో బ్రూక్ హాలీడే కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది.వన్డేల్లో ఎనిమిదో సెంచరీఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ స్మృతి మంధాన శతకంతో మెరిసింది. తొలి రెండు వన్డేల్లో(5, 0) నిరాశపరిచిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. నరేంద్ర మోదీ స్టేడియంలో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. కాగా వన్డేల్లో స్మృతికి ఇది ఎనిమిదో సెంచరీ.ఈ క్రమంలో మిథాలీ రాజ్ రికార్డును స్మృతి బ్రేక్ చేసింది. వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన భారత మహిళా బ్యాటర్‌గా అవతరించింది. కాగా గతంలో మిథాలీ రాజ్ 211 వన్డే ఇన్నింగ్స్ ఆడి ఏడు శతకాలు బాదగా.. స్మృతి తన 88వ మ్యాచ్‌లోనే ఎనిమిదో సెంచరీ చేసింది. ఇక ఈ జాబితాలో భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరు శతకాలతో మూడో స్థానంలో ఉంది.2-1తో సిరీస్ కైవసంఇక మ్యాచ్ విషయానికొస్తే.. స్మృతితో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్(59 నాటౌట్) మెరిసింది. ఫలితంగా భారత్ న్యూజిలాండ్ విధించిన లక్ష్యాన్ని 44.2 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై కివీస్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలో సెంచరీ బాదిన స్మృతికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ మ్యాచ్‌లో 100 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. కివీస్ పేసర్ హన్నా రోవ్ బౌలింగ్‌లో స్మృతి బౌల్డ్ అయింది.వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత మహిళా క్రికెటర్లుస్మృతి మంధాన- 8*మిథాలీ రాజ్- 7హర్మన్‌ప్రీత్ కౌర్- 6*చదవండి: IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకునేది వీరినే!That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
స్మృతి సెంచరీ.. కివీస్‌ను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సొంతం
న్యూజిలాండ్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. వైట్ ఫెర్న్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఆఖరి వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత శతకంతో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించింది.మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ వుమెన్ టీమ్ భారత్‌కు వచ్చింది. తొలి వన్డేలో బౌలింగ్ ప్రదర్శనతో పర్యాటక జట్టును 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన.. రెండో వన్డేలో మాత్రం దారుణంగా విఫలమైంది. బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. రాణించిన బ్రూక్ హాలీడేఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్ వేదికగా ఇరుజట్లు మూడో వన్డేలో పోటీపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్ సుజీ బేట్స్(4), వన్‌డౌన్ బ్యాటర్ లారెన్ డౌన్(1) విఫలం కాగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లెమ్మర్ 39 రన్స్ చేసింది.దీప్తి శర్మకు మూడు వికెట్లుకెప్టెన్ సోఫీ డివైన్(9) నిరాశపరచగా.. ఐదో నంబర్ బ్యాటర్ బ్రూక్ హాలీడే 96 బంతుల్లో 86 రన్స్‌తో అదరగొట్టింది. మిగతా వాళ్లలో ఇసబెల్లా గేజ్(25), లీ తుహుము(24 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో న్యూజిలాండ్ 232 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు కూల్చగా.. రేణుకా సింగ్, సైమా ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. మిగతా నాలుగు వికెట్లు రనౌట్ల ద్వారా వచ్చినవే.సెంచరీతో చెలరేగిన స్మృతిఇక వైట్ ఫెర్న్స్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (12)ను కివీస్ పేసర్ హన్నా రోవ్ అవుట్ చేసింది. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా(35)తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. గత రెండు మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమైన(5, 0) ఆమె ఈసారి మాత్రం బ్యాట్ ఝులిపించింది. మొత్తంగా 122 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సరిగ్గా వంద పరుగులు చేసింది. స్మృతి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. హర్మన్ అర్ధ శతకంఇక కెప్టెన్ హర్మన్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. స్మృతి మంధానతో కలిసి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఫోర్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ 61 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేసింది.ఇక జెమీమా రోడ్రిగ్స్ సైతం ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 18 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసింది. ఈ క్రమంలో 44.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే స్కోర్లు👉న్యూజిలాండ్- 232 (49.5)👉భారత్- 236/4 (44.2)👉ఫలితం- న్యూజిలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయంచదవండి: Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్ రాణా అరంగేట్రం ఫిక్స్!?That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 20243rd ODI ✅Series ✅#TeamIndia win the third and final #INDvNZ ODI by 6 wickets and complete a 2-1 series win over New Zealand 👏 Scoreboard ▶️ https://t.co/B6n070iLqu@IDFCFIRSTBank pic.twitter.com/grwAuDS6Qe— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకే ఛాన్స్’
Mithali Raj on Women's T20 World Cup debacle: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. లీగ్ దశలోనే నిష్క్రమణకు ప్రధాన కారణం గత మూడేళ్లుగా జట్టులో పురోగతే లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. దుబాయ్‌లో ఉన్న ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలపై, క్రికెటర్లలో కొరవడిన పట్టుదలపై తన అభిప్రాయాలను పంచుకుంది.‘ప్రపంచకప్‌కు సన్నాహంగా ఆడిన ఆసియా కప్‌లో చిన్న జట్లతో ఆడేటప్పుడు రిజర్వ్ బెంచ్‌ను పటిష్టం చేసేందుకు వారికి అవకాశాలివ్వాలి. పురుషుల జట్టు చేస్తోంది అదే. మెగా ఈవెంట్లు, పెద్ద టోర్నీలకు ముందు ఈ కసరత్తు చాలా అవసరం. కానీ మన మహిళల జట్టు విషయంలో అలాంటిదేదీ ఉండదు. రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశాలివ్వరు. ఇది జట్టు నిర్మాణానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది’ అని వివరించింది.పలు ప్రశ్నలకు మిథాలీ ఇచ్చిన సమాధానాలు... టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై మీ విశ్లేషణ? దీనిపై మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియాతో మ్యాచే గురించే! తప్పక గెలవాల్సిన పోరు అది. ఓ దశలో పటిష్ట స్థితిలో కనిపించినా... మళ్లీ కంగారే. మరో పాత కథే! గత రెండు, మూడేళ్లుగా జట్టు సాధించిన పురోగతి నాకైతే కనపించట్లేదు. గట్టి జట్లను ‘ఢీ’కొట్టేముందు చేసే కసరత్తు, ఆటలో ఎత్తుగడలేవీ మెప్పించడం లేదు. అంతర్జాతీయస్థాయిలో కొన్ని జట్లు క్రమంగా పుంజుకున్నాయి. దక్షిణాఫ్రికానే దానికి సరైన ఉదాహరణ.ఆస్ట్రేలియా కంటే కూడా న్యూజిలాండ్‌తో ఎదురైనా పరాజయమే భారత్ నిష్క్రమణకు కారణమని భావిస్తున్నారా? ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మనం పరిస్థితులకు తగ్గట్లుగా వెంటనే మారకపోవడమే ఆ మ్యాచ్ ఓటమికి కారణం. మందకొడి వికెట్‌పై వన్డే ప్రపంచకప్‌లో అయితే ముందు నింపాదిగా ఆడి తర్వాత పుంజుకొని ఆడే సౌలభ్యం వుంటుంది. కానీ టీ20 ఫార్మాట్లో అలాంటి అవకాశం ఉండదు. త్వరితగతిన సందర్భాన్ని బట్టి ఆటతీరు మార్చుకోవాలి. సోఫీ డివైన్ చేసింది అదే. కానీ మనం మాత్రం అలా ఆడలేకపోయాం.తరుచూ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం వల్ల ఆయా స్థానాల్లో స్పష్టత కొరవడిందా? జెమీమా, హర్మన్‌ప్రీత్‌లు తరచూ 3, 4 స్థానాలు మార్చుకోవడం కారణమని నేననుకోను. బ్యాటింగ్‌లో ఓపెనర్ల శుభారంభమే అత్యంత కీలకం. షఫాలీ వర్మ దూకుడుగా ఆడుతుందని అందరికీ తెలుసు కానీ అలా జరగలేదు. ఓపెనర్లిద్దరు బాగా ఆడిఉంటే మిడిల్ ఓవర్లలో యథేచ్ఛగా ఆడే అవకాశముంటుంది. మొదట పవర్ ప్లే, ఆఖర్లో డెత్ ఓవర్లు మంచి స్కోరుకు బాట వేస్తాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ టోర్నీలోని కీలక మ్యాచ్‌ల్లో అలాంటి శుభారంభాలు, చివర్లో దూకుడు కరువయ్యాయి. ఆసియా కప్‌లో కనిపించిన లోపాలపై దృష్టి పెట్టాల్సింది. కానీ అలా ఏమీ జరగలేదు. ప్రపంచకప్ ముంగిట ఫీల్డింగ్ విభాగంపై దృష్టి సారించకపోవడం పెద్ద తప్పిదమని మీరు అంగీకరిస్తారా? ఈ విషయంలో ఆస్ట్రేలితో జరిగిన మ్యాచ్ నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్ తప్ప 11 మందిలో మిగతా వారంతా మైదానంలో చురుగ్గా కనిపించలేదు. కీలకమైన మ్యాచ్‌లో ఇద్దరితో కట్టడి ఎలా సాధ్యమవుతుంది. ఫిట్నెస్ అతిముఖ్యం. దీనిపై మనం ఒక బెంచ్‌మార్క్‌ను పెట్టుకోవాల్సిందే. నిజాయితీగా అడుగుతున్నా ఏడాదంతా ఎంత మంది మన క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతున్నారో చెప్పగలరా! ఆ శ్రద్ధలేకే మైదానంలో ఫీల్డింగ్ విభాగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. హర్మన్‌ప్రీత్ 2018 నుంచి కెప్టెన్ ఉన్నా... ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో సారథ్య మార్పు అవసరమా? ఒకవేళ సెలక్టర్లు కెప్టెన్‌ను మార్చాలనుకుంటే మాత్రం నేను యువ క్రికెటర్‌కు పగ్గాలివ్వాలని కోరుకుంటాను. సారథ్య మార్పునకు ఇదే సరైన సమయం. ఇంకా ఆలస్యం చేస్తే... మనం ఇంకో ప్రపంచకప్‌కూ దూరమవుతాం. చేస్తే ఇప్పుడే కొత్త సారథిని ఎంపిక చేయాలి. మరీ ప్రపంచకప్ సమీపంలో చేస్తే ఒరిగే ప్రయోజనం కూడా ఉండదు.స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే..వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అందుబాటులో ఉన్నప్పటికీ 24 ఏళ్ల జెమీమాకు పగ్గాలిస్తే మంచిదనిపిస్తుంది. ఆమెకు ఎక్కువకాలం సారథిగా కొనసాగే వీలుంటుంది. పైగా మైదానంలో చురుకుదనం, ఫీల్డింగ్‌లో అందరిలో ఉత్తేజం నింపే శక్తి ఆమెకుంది. ఈ టోర్నీ ఆసాంతం ఆమె కనబరిచిన చురుకుదనం నన్ను బాగా ఆకట్టుకుంది. అలాంటి జెమీమాకు పగ్గాలిస్తే జట్టులో కొత్త ఉత్తేజాన్ని నింపినట్లవుతుంది. చదవండి: W T20 WC: ఇంగ్లండ్ ఇంటికి...సెమీఫైనల్లో వెస్టిండీస్ -
T20 WC 2024: శ్రీలంకతో మ్యాచ్.. భారత జట్టుకు గుడ్ న్యూస్
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం దుబాయ్ వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో టీమిండియా తలపడనుంది. తమ సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా విజయం సాధించాలి. భారీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్ధానానికి చేరుకునే అవకాశం ఉంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఈ కీలక పోరుకు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ అందుబాటులో ఉండనుంది. ఆదివారం పాకిస్తాన్ జరిగిన మ్యాచ్‌లో కౌర్ గాయపడింది. మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో హర్మాన్ మెడకు గాయమైంది. దీంతో ఆమె 29 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగింది.ఆ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా భారత సారథి పాల్గోనలేదు. దీంతో హర్మాన్ శ్రీలంకతో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆమె అందుబాటుపై భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది. హర్మాన్ గాయం అంత తీవ్రమైనది కాదని, ఆమె శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు మంధాన తెలిపింది.మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, లంకతో మ్యాచ్‌కూ దూరమయ్యే అవకాశముందని స్మృతి ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొంది. పాక్‌పై ఆడిన భారత జట్టునే లంకతో మ్యాచ్‌కూ కొనసాగించే ఛాన్స్ ఉంది. కాగా పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. భారత్ కంటే ముందు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. -
అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్ అదే: మంధాన
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో భారత్ మట్టికరిపించింది. దీంతో తమ సెమీస్ ఆశలను భారత జట్టు సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం టీమిండియా గ్రూపు-ఎ నుంచి పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. అయితే భారత రన్‌రేట్(-1.217) ఇంకా మైనస్‌లోనే ఉంది. భారత్ కంటే ముందు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి.భారీ విజయం సాధించి ఉంటే?అయితే పాక్‌పై భారత జట్టు భారీ విజయం సాధించి ఉంటే పాయింట్ల పట్టికలో మూడో స్ధానానికి చేరి ఉండేది. కానీ 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు హర్మాన్ సేన తీవ్రంగా చెమటోడ్చింది. ఈ లో టార్గెట్‌ను ఛేజ్ చేసందుకుందు భారత్ ఏకంగా 18.5 ఓవర్లు తీసుకుంది.దీంతో ఉమెన్ ఇన్ బ్లూ ఖాతాలో రెండు పాయింట్లు చేరినప్పటకి.. రన్‌రేట్ మాత్రం పెద్దగా మెరుగు పడలేదు. అయితే పాక్‌పై గెలిచినప్పటకి భారత్ సెమీస్ ఆశలు ఇంకా సంక్లిష్టంగానే ఉన్నాయి. అక్టోబర్ 9న దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా భారీ విజయం సాధించాలి.లంకపై కూడా సాధారణ విజయం సాధిస్తే భారత్ సెమీస్ ఆశలు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు. ఒక వేళ అదే జరిగితే భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో చావో రేవో తెల్చుకోవాల్సిందే. అయితే మంగళవారం ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధిస్తే భారత్‌కు కొంత ఉపశమనం కలుగుతుంది.అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాంఇక పాక్‌పై తమ బ్యాటింగ్ విధాన్ని భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సమర్థించింది. నేను, షఫాలీ బాల్‌ను సరిగ్గా టైం చేయలేకపోయాము. పిచ్ కాస్త స్లోగా ఉంది. మేము ఎక్కువగా వికెట్లు కోల్పోవాలని అనుకోలేదు. అందుకే స్లోగా ఆడాము. నెట్ రన్‌రేట్ కూడా మా ఆలోచనలో ఉంది. తర్వాతి మ్యాచ్‌ల్లో మేము మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాము. సెమీస్‌కు ఆర్హతసాధించడమే మా లక్ష్యం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో మంధాన పేర్కొంది. కాగా ఈ మ్యాచ్‌లో మంధాన కేవలం 7 పరుగులు మాత్రమే చేసింది. -
భారత మహిళ క్రికెటర్లను సర్ప్రైజ్ చేసిన రానా దగ్గుబాటి (ఫొటోలు)
-
BBL: ధరలో స్మృతిని మించిపోయిన జెమీమా, దీప్తి, శిఖా (ఫొటోలు)
-
WBBL: స్మృతి కంటే జెమీమా, దీప్తి, శిఖాలకే ఎక్కువ ధర!
Womens Big Bash League Draft- మెల్బోర్న్: భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సహా ఆరుగురు భారత క్రికెటర్లు మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో మెరిపించనున్నారు. ఓపెనర్ స్మృతి, ఆల్‌రౌండర్ శిఖా పాండే, టాపార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌లు ఇది వరకే ఈ లీగ్‌లో ఆడారు. అయితే కొత్తగా ఆల్‌రౌండర్ దయాళన్ హేమలత, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియాలకు తొలిసారిగా బిగ్‌బాష్ చాన్స్ లభించింది. కానీ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను మాత్రం లీగ్ ఫ్రాంచైజీలు పక్కన బెట్టాయి.‘ప్లాటినమ్’ కేటగిరీలో జెమీమా, దీప్తిగతంలో మెల్బోర్న్ రెనిగేడ్స్, సిడ్నీ థండర్లకు ఆడిన అనుభవమున్న సీనియర్ బ్యాటర్‌పై ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. హిట్టింగ్తో ఆదరగొట్టే బ్యాటర్ జెమీమాకు బ్రిస్బేన్ హీట్ ‘ప్లాటినమ్’ ఎంపిక ద్వారా పెద్దపీట వేసింది. ఐపీఎల్లో టాప్ 1, 2, 3 రిటెన్షన్ పాలసీలా డబ్ల్యూబీబీఎల్‌లో ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కేటగిరీలుంటాయి.మరో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు మెల్బోర్న్ స్టార్స్ ‘ప్లాటినమ్’ కేటగిరీలో ఎంపిక చేసుకుంది. ఈ కేటగిరీలోకి ఎంపికైన క్రికెటర్లకు రూ. 62.41 లక్షలు (లక్షా 10 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు మొత్తంగా లభిస్తుంది. శిఖా పాండేకు రూ. 51 లక్షలు‘గోల్డ్’ కేటగిరీలో బ్రిస్బేన్ హీట్‌కు ఎంపికైన శిఖా పాండేకు రూ. 51 లక్షలు (90 వేల ఆసీస్ డాలర్లు), అడిలైడ్ స్ట్రయికర్స్‌కు స్మృతి మంధాన, పెర్త్ స్కార్చర్స్‌కు హేమలత, మెల్బోర్న్ స్టార్స్‌కు యస్తిక భాటియా సిల్వర్ కేటగిరీలో ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి రూ. 36.88 లక్షలు (65 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు ఫీజుగా లభిస్తుంది. ఈ సీజన్ మహిళల బిగ్‌బాష్ లీగ్ వచ్చే నెల 27న అడిలైడ్‌లో మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అడిలైడ్ స్ట్రయికర్స్‌తో బ్రిస్బేన్ హీట్ జట్టు తలపడుతుంది. -
స్మృతి కోసం చాలా ట్రై చేశాం.. ఎట్టకేలకు మా జట్టులో!(ఫొటోలు)
-
అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జతకట్టిన మంధన.. బిగ్‌బాష్ లీగ్ డ్రాఫ్ట్‌లో 19 మంది భారత ప్లేయర్లు
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మహిళల బిగ్‌బాష్ లీగ్ సీజన్-10లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జతకట్టనుంది. స్మృతి డబ్ల్యూబీబీఎల్ ప్రీ డ్రాఫ్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసిన తొలి ఓవర్సీస్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. మంధన గతంలో బ్రిస్బేన్ హీట్ (2016-17), హోబర్ట్ హరికేన్స్ (2018-19), సిడ్నీ థండర్ (2021) ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించింది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కారణంగా మంధన 2022, 2023 ఎడిషన్లలో పాల్గొనలేదు. అడిలైడ్ స్ట్రయికర్స్లో మంధన ఆర్సీబీ హెడ్ కోచ్ లూక్ విలియమ్స్‌తో కలిసి పని చేయనుంది. లూక్ అడిలైడ్ స్ట్రయికర్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024 ఎడిషన్ అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానుంది.డ్రాఫ్ట్‌లో 19 మంది భారత ప్లేయర్లు..మహిళల బిగ్‌బాష్ లీగ్ ప్లేయర్స్ డ్రాఫ్ట్‌లో 19 మంది భారత క్రికెటర్లు పాల్గొననున్నారు. ప్లేయర్ల డ్రాఫ్ట్ వచ్చే ఆదివారం జరుగనుంది. డ్రాఫ్ట్‌లో పాల్గొంటున్న భారత స్టార్ ప్లేయర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగెజ్, దీప్తి శర్మ ముఖ్యులు. వీరితో పాటు శ్రేయాంక పాటిల్, టైటాస్ సాధు, ఆశా శోభన, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, యస్తికా భాటియా, శిఖా పాండే, స్నేహ్ రాణా, హేమలత దయాలన్, సంజన సంజీవన్, మన్నత్ కశ్యప్, మేఘన సబ్బినేని, వేద కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, మేఘన సింగ్ డ్రాఫ్ట్‌లో పాల్గొంటున్నారు. -
మూడో ర్యాంక్‌లో స్మృతి మంధాన
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తాజా ర్యాంకింగ్స్ లో స్మృతి 738 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరుకుంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 648 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. దీప్తి శర్మ 20వ ర్యాంక్‌లో, జెమీమా 33వ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ సివెర్ బ్రంట్ 783 పాయింట్లతో తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. -
'మెరుపు తీగ' మంధన.. కళ్లు చెదిరే రనౌట్
మహిళల హండ్రెడ్ లీగ్‌లో సథరన్ బ్రేవ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన కళ్లు చెదిరే రీతిలో ఓ అద్భుతమైన రనౌట్ చేసింది. ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్ 10) జరిగిన మ్యాచ్‌లో మంధన.. బ్రైవోని స్మిత్‌ను డైరెక్ట్ త్రోతో పెవిలియన్ బాట పట్టించింది. మంధన మెరుపు విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరవలవుతంది. ఇన్నింగ్స్ తొలి బంతికే మంధన స్మిత్‌ను పెవిలియన్‌కు పంపడం విశేషం.A direct hit by Smriti Mandhana! 🎯pic.twitter.com/FIlRG1Jo4g— CricTracker (@Cricketracker) August 10, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నాట్ సీవర్ బ్రంట్ (60 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రాకెట్స్ ఇన్నింగ్స్‌లో గ్రేస్ స్క్రీవెన్స్ (36) ఓ మోస్తరు పరుగులు చేయగా.. నటాషా (12), గార్డ్నర్ (18), హీథర్ గ్రహం (15) రెండంకెల స్కోర్లు చేశారు. సథరన్ బ్రేవ్ బౌలర్లలో లారెన్ బెల్ 3, లారెన్ చియాటిల్, ఆడమ్స్, క్లో టైరాన్ తలో వికెట్ పడగొట్టారు.156 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్.. నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. స్మృతి మంధన (27 బంతుల్లో 42; 7 ఫోర్లు), క్లో టైరాన్ (31 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ జార్జియా ఆడమ్స్ 29 బంతులు ఎదుర్కొని 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాకెట్స్ బౌలర్లలో స్టోన్‌హౌస్ 2, ఆష్లే గార్డ్నర్, హీథర్ గ్రహం తలో వికెట్ పడగొట్టారు. -
Asia Cup Final: రాణించిన స్మృతి.. చెలరేగిన జెమీమా, రిచా ఘోష్
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడారు. షఫాలీ వర్మ (16), ఉమా చత్రీ (9), హర్మన్‌ప్రీత్ కౌర్ (11) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. పూజా వస్త్రాకర్ 5, రాధా యాదవ్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్ పడగొట్టారు. తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్‌కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
భారీ విజయంతో ఫైనల్లోకి భారత్
దంబుల్లా: బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల సహకారం తోడవడంతో... భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. లీగ్ దశలో సంపూర్ణ ఆధిపత్యంతో నాకౌట్‌కు చేరిన టీమిండియా... శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. మహిళల ఆసియాకప్‌లో భారత జట్టు తుదిపోరుకు చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఐదుసార్లూ ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (32), షోర్ణా అక్తర్ (19 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక, రాధ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్), షఫాలీ వర్మ (26 నాటౌట్) రాణించారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టుతో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. రేణుక అదుర్స్ మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఏదీ కలిసిరాలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ దిలారా అక్తర్ (6)ను అవుట్ చేసిన రేణుక, తన తదుపరి ఓవర్లో ఇస్మా (8)ను పెవిలియన్‌కు పంపించింది. ఆరో ఓవర్లో ముర్షిదా ఖాతూన్ (4) కూడా వెనుదిరిగింది. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి బంగ్లా 25/3తో నిలిచింది. ఈ మూడు వికెట్లు రేణుక ఖాతాలోకే వెళ్లాయి. ఇక అక్కడి నుంచి బంగ్లా మహిళల జట్టు కోలుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరే చేసింది. ఇద్దరే కొట్టేశారు స్వల్ప లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోయారు. స్మృతి, షఫాలీ విజృంభణతో 11 ఓవర్లలోనే భారత జట్టు విజయం సాధించింది. భారత అమ్మాయిలు అదరగొట్టిన చోట బంగ్లా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో స్మృతి ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న మంధాన .. నాకౌట్ మ్యాచ్‌ల్లో నాలుగో హాఫ్ సెంచరీ తన పేరిట లిఖించుకుంది. అలాగే పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల జాబితాలో రెండోస్థానానికి చేరింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: దిలారా అక్తర్ (సి) ఉమ (బి) రేణుక 6; ముర్షిదా ఖాతూన్ (సి) షఫాలీ (బి) రేణుక 4; ఇస్మా తన్జీమ్ (సి) తనూజ (బి) రేణుక 8; నిగార్ సుల్తానా (సి) దీప్తి (బి) రాధ 32; రుమానా (బి) రాధ 1; రాబియా ఖాన్ (సి) షఫాలీ (బి) పూజ 1; రీతు మోనీ (స్టంప్డ్) రిచా (బి) దీప్తి 5; షోర్ణా (నాటౌట్) 19; నహిద (బి) రాధ 0; మారుఫా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–7, 2–17, 3–21, 4–30, 5–33, 6–44, 7–80, 8–80. బౌలింగ్: రేణుక 4–1–10–3, పూజ 4–0–25–1, తనూజ 4–0–16–0, దీప్తి 4–0–14–1, రాధ 4–1–14–3. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (నాటౌట్) 26; స్మృతి (నాటౌట్) 55; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 83. బౌలింగ్: మారుఫా 2–0– 17–0, నహిద 3–0–34–0, జహనారా ఆలమ్ 3–0–17–0, రాబియా ఖాన్ 2–0–10–0, రుమానా అహ్మద్ 1–0–5–0.9 మహిళల ఆసియాకప్‌లో (వన్డే, టి20 ఫార్మాట్ కలిపి) భారత జట్టు ఫైనల్ చేరడం ఇది తొమ్మిదోసారి. ఇందులో ఏడుసార్లు ట్రోఫీ గెలుచుకుంది. 2018లో రన్నరప్‌గా నిలిచింది.1 టి20 క్రికెట్లో రెండుసార్లు 20వ ఓవర్ మెయిడెన్ వేసిన తొలి బౌలర్‌గా రాధ యాదవ్ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా పురుషుల క్రికెట్లో ఎనిమిది మంది, మహిళల క్రికెట్లో తొమ్మిది మంది బౌలర్లు ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను మెయిడెన్ చేశారు.3 టి20ల్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇది మూడోసారి. ఇటీవల దక్షిణాఫ్రికాపై 85 పరుగుల లక్ష్యాన్ని అజేయంగా ఛేదించిన భారత్.. 2019లో వెస్టిండీస్‌పై 104 పరుగుల టార్గెట్‌ను వికెట్ కోల్పోకుండా అధిగమించింది.2 మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధాన (3433) రెండోస్థానానికి దూసుకెళ్లింది. సూజీ బేట్స్ (4348; న్యూజిలాండ్) టాప్ ర్యాంక్‌లో ఉంది. -
ఫైనల్లో టీమిండియా
మహిళల ఆసియా టీ20 కప్-2024లో టీమిండియా హవా కొనసాగుతోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో అజేయంగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. సెమీ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. డంబుల్లా వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. పది వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకువెళ్లింది.వుమెన్స్ ఆసియా కప్-2024 టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా జట్లు పోటీపడ్డాయి. గ్రూప్-ఏ టాపర్‌గా భారత్ నిలవగా.. రెండో స్థానంలో పాకిస్తాన్ ఉంది.గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ తొలి రెండుస్థానాల్లో నిలిచాయి. ఈ క్రమంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల ఆది నుంచే విరుచుకుపడ్డారు.చెలరేగిన భారత బౌలర్లుపేసర్ రేణుకా సింగ్ టాపార్డర్‌ను కకావికలం చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8)కు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేసింది. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ నిగర్ సుల్తానా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించింది. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ నిగర్‌ను బోల్తా కొట్టించడంతో బంగ్లా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. లోయర్ ఆర్డర్లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో కాసేపు పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడు చొప్పున వికెట్లు కూల్చగా.. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఓపెనర్లే పూర్తి చేశారుస్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆడుతూ పాడుతూ పని పూర్తి చేసింది. ఓపెనర్లలో స్మృతి మంధాన అర్ధ శతకంతో చెలరేగగా.. షఫాలీ వర్మ సైతం రాణించింది.స్మృతి 39 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 55 పరుగులు.. షఫాలీ 28 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 11 ఓవర్లలో 83 పరుగులు చేసిన టీమిండియా.. పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక రెండో సెమీ ఫైనల్లోశ్రీలంక- పాకిస్తాన్ తలపడనున్నాయి.చదవండి: IND vs SL: గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్‌గా మారిన హార్దిక్ పాండ్యా -
టీమిండియా కెప్టెన్‌కు విశ్రాంతి.. కారణం?
వుమెన్స్ ఆసియా టీ20 కప్-2024లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో నేపాల్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌కు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టింది. హర్మన్, పూజా స్థానాల్లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఎస్.సజన, ఫాస్ట్ బౌలర్ అరుంధతిరెడ్డి తుదిజట్టులో స్థానం దక్కించుకున్నట్లు తెలిపింది.డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. పవర్ ప్లే ముగిసే సరికి 19 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది.మరో ఓపెనర్ దయాలన్ హేమలత 17 బంతుల్లో 15 రన్స్ చేసింది. ఈ క్రమంలో ఆరు ఓవర్లు(పవర్ ప్లే) పూర్తయ్యేసరికి టీమిండియా హాఫ్ సెంచరీ మార్కు అందుకుంది. యాభై పరుగులు పూర్తి చేసుకుంది.ఇండియా వుమెన్ వర్సెస్ నేపాల్ వుమెన్ తుదిజట్లుభారత్షెఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ఎస్ సజానా, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతి రెడ్డి.నేపాల్సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా (కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రి, పూజా మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ (వికెట్ కీపర్), సబ్నమ్ రాయ్, బిందు రావల్.గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక ఇలాఆసియా కప్-2024లో గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్, యూఏఈలపై గెలిచి టాపర్(నెట్ రన్‌రేటు +3.298)గా ఉంది.ఇక తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. తర్వాత నేపాల్, యూఏఈలపై విజయం సాధించింది. తద్వారా మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది.ఇక శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. శ్రీలంక, థాయ్‌లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.నేపాల్‌తో భారత్ మ్యాచ్ ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారుకానున్నాయి. -
మంచి మనసు చాటుకున్న స్మృతి మంధాన.. వీడియో
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన గొప్ప మనసు చాటుకుంది. తన చిన్నారి అభిమానిని సంతోష పెట్టేందుకు బహుమతినిచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వుమెన్స్ ఆసియా టీ20 కప్ ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకకు వెళ్లిన విషయం తెలిసిందే.శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలి మ్యాచ్‌లోనే గెలుపు నమోదు చేసింది.పాక్‌ను చిత్తు చేసిన భారత్‌పాకిస్తాన్ విధించిన 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ(29 బంతుల్లో 40), స్మృతి మంధాన (31 బంతుల్లో 45) రాణించారు.ఇక పాక్‌ను 108 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత స్పిన్ బౌలర్ దీప్తి శర్మ(3/20)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.స్పెషల్ ఫ్యాన్ఇదిలా ఉంటే.. డంబుల్లా వేదికగా జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ను చూసేందుకు ఓ ‘ప్రత్యేకమైన’ చిన్నారి స్టేడియానికి వచ్చింది. ఆమె పేరు ఆదీషా హెరాత్.ఆదీషాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలాగే భారత క్రికెటర్ స్మృతి మంధాన అంటే మరీ ఇష్టం. అందుకే తన అభిమాన ప్లేయర్‌ను కలుసుకునేందుకు ఆదీషా తల్లి సాయంతో మ్యాచ్ వేదిక వద్దకు వచ్చింది.స్పెషల్ ఏబుల్డ్ చైల్డ్ అయినా ఆదీషాను తన తల్లి వీల్‌చైర్‌లో తీసుకువచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం స్మృతి మంధాన ఆదీషా దగ్గరికి వెళ్లి పలకరించింది. అంతేకాదు తనకు మొబైల్ ఫోన్‌ను బహుమతిగా అందించింది.సంతోషంగా ఉందిఈ విషయంపై స్పందించిన ఆదీషా తల్లి మాట్లాడుతూ.. ‘‘అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. మ్యాచ్ కచ్చితంగా చూడాలంటూ నా కూతురు పట్టుబట్టింది. భారత జట్టు క్రికెటర్ మంధానను కలిశాం.ఆమె నా కూతురికి ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. తనలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి బహుమతి మేము అస్సలు ఊహించలేదు. నిజంగా ఈ విషయంలో నా కూతురు అదృష్టవంతురాలే’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా భారత్ తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో తలపడనుంది.చదవండి: IND Vs SL: సెంచరీలు చేసినా పట్టించుకోరా?.. నాకైతే అర్థం కావడం లేదుAdeesha Herath's love for cricket brought her to the stadium, despite all the challenges. The highlight of her day? A surprise encounter with her favorite cricketer, Smriti Mandhana, who handed her a mobile phone as a token of appreciation 🥺𝐌𝐨𝐦𝐞𝐧𝐭𝐬 𝐥𝐢𝐤𝐞 𝐭𝐡𝐞𝐬𝐞… pic.twitter.com/iqgL2RNE9v— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 20, 2024 -
లేడీ కోహ్లి.. ఆర్సీబీకి టైటిల్ అందించిన క్వీన్ (ఫొటోలు)


