
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఉగ్రరూపం దాల్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బెత్ మూనీ (75 బంతుల్లో 138) విధ్వంకర శతకంతో విరుచుకుపడటంతో 412 పరుగుల రికార్డు స్కోర్ చేయగా.. భారత్ కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంధన 23 బంతుల్లో హాఫ్ సెంచరీ, 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది.
🚨 THE HISTORIC MOMENT 🚨
- Smriti Mandhana becomes the fastest Indian to score Hundred in ODI history, just 50 balls. 🥶 pic.twitter.com/xjTRsoQvgP— Johns. (@CricCrazyJohns) September 20, 2025
భారత్ తరఫున పురుషుల విభాగంలో కాని, మహిళల విభాగంలో కాని మంధనదే ఫాస్టెస్ట్ సెంచరీ. పురుషుల విభాగంలో ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ ఆస్ట్రేలియాపైనే 52 బంతుల్లో శతక్కొట్టాడు. మహిళల క్రికెట్‌లో ఓవరాల్‌గా చూస్తే మంధనది సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. మహిళల ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ రికార్డు ఆసీస్‌కు చెందిన మెగ్ లాన్నింగ్ (45) పేరిట ఉంది. పురుషుల వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ ఏబీ డివిలియర్స్ (31) పేరిట ఉంది.
ఈ సెంచరీకి ముందు కూడా భారత్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మంధన పేరిటే ఉండేది. ఆమె 70 బంతుల్లో ఒకసారి, 77 బంతుల్లో మరోసారి సెంచరీలు చేసింది. ఈ సెంచరీతో మంధన మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా ప్రమోట్ అయ్యింది. ఈ సెంచరీ మంధనకు వన్డేల్లో 13వది కాగా.. సుజీ బేట్స్ కూడా ఇన్నే సెంచరీలతో రెండో స్థానంలో ఉంది. మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు ఆసీస్‌కు చెందిన మెగ్ లాన్నింగ్ (15) పేరిట ఉంది.
మ్యాచ్ విషయానికొస్తే.. 413 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్య ఛేదనలో భారత్ దూసుకుపోతుంది. పోరాడితే పోయేదేముందున్న చందంగా టీమిండియా ఎదురుదాడి చేస్తుంది. 20 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 204/2గా ఉంది. మంధన 120 (60 బంతుల్లో), హర్మన్‌ప్రీత్ (34 బంతుల్లో 52) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 180 బంతుల్లో 209 పరుగులు చేయాలి.