ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుండి దాదాపు 400 వర్గాల ఉత్పత్తులకు జీఎస్‌టీ టాక్స్‌ను తగ్గించింది. ఈ టాక్స్ తగ్గింపు పుణ్యమా అని మనోళ్లు తెగ షాపింగ్ చేసేశారుట. పైగా ఫెస్టివ్ సీజన్ కావడంతో ఈ అవకాశాన్ని వినియోగదారులుబాగా వాడుకున్నారు. కార్ల నుండి వంట సామాగ్రి వరకు వస్తువులపై విచ్చలవిడిగా డబ్బులు వెచ్చించారు. ఫలితంగా అమెరికా ట్రంప్ ప్రభుత్వం విధించిన 50 శాతం దిగుమతి సుంకం ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది అంటున్నారు ఆర్థిక నిపుణులు.
రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ బిజోమ్ బ్లూమ్‌బెర్గ్ న్యూస్‌తో పంచుకున్న డేటా ప్రకారం వరుసగా దసరా, దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా 6 లక్షల కోట్లు( 67.6 బిలియన్ డాలర్లు) అమ్మకాలు నమోదైనాయి. ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫర్నిషింగ్ మరియు స్వీట్లు వంటి వస్తువులకు అత్యధిక డిమాండ్ ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు బి.సి. భార్టియా ఒక ప్రకటనలో తెలిపారు.
సెప్టెంబర్ 22- అక్టోబర్ 21 మధ్య వచ్చిన నవరాత్రి, దీపావళి మధ్య కాలంలో గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 8.5శాతం పెరిగాయి. పండుగ షాపింగ్ సమయంలో ప్రెషర్ కుక్కర్లు వంటి ఉత్పత్తులు పన్ను తగ్గింపు వల్ల ప్రయోజనం పొందాయట. మరో విషయం ఏమిటంటే జీఎస్‌టీ తగ్గింపు వార్తలతో ఆగస్టు మధ్యకాలం నుండి సెప్టెంబర్ చివరి దాకా కొనుగోలుదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారట.
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీదారులు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మరియు మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ . నెలవారీ అమ్మకాలు పెరిగాయి, దాదాపు దశాబ్దంలో తొలిసారిగా పన్ను తగ్గింపు కారణంగా కార్ల ధరలు దిగివచ్చాయి. ఇది ఆయాకంపెనీలకు బాగా లాభించాయి.
గత సంవత్సరంతో పోలిస్తే బంగారంతో సహా పెద్ద టికెట్ వస్తువులను షాపింగ్ చేయడానికి శుభ దినమైన ధన్తేరాస్ రోజున అమ్మకాలు పుంజుకున్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గత సంవత్సరంతో పోలిస్తే ధన్తేరస్ రోజున అమ్మకాలు 20 శాతం పెరిగాయి. టాటా మోటార్స్ నవరాత్రి , ధన్తేరాస్ మధ్య లక్ష కంటే ఎక్కువ కార్లను డెలివరీ చేసింది.
హెల్మెట్లు లెక్కలేకపోయారట
మహాంద్రా ట్రాక్టర్ అమ్మకాలలో 27శాతం పుంజుకున్నాయిమంచి రుతుపవనాలు గ్రామీణ ఆదాయాలను పెంచాయి, దీనికి తోడు పన్ను తగ్గింపు మహీంద్రా ఉత్పత్తుల కొనుగోళ్లకు ఊతమిచ్చాయి. మహీంద్రా ఉత్పత్తి బృందం ఆదివారాల్లో బుకింగ్‌ల పెరుగుదలను నిర్వహించడానికి పని చేస్తోందని మార్కెటింగ్ , అమ్మకాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ గత వారం పోస్ట్-ఎర్నింగ్స్ కాల్‌లో తెలిపారు. ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, సెలెరియో వంటి ఎంట్రీ-లెవల్ మోడళ్లకు డిమాండ్ ఎంతగా ఉందంటే, మారుతి డీలర్లు ఇప్పుడు ద్విచక్ర వాహనదారులు కార్లకు అప్‌గ్రేడ్ అవుతున్నప్పుడు తమ షోరూమ్‌లలో వదిలిపెట్టిన హెల్మెట్‌లను లెక్కిస్తున్నారని బెనర్జీ చమత్కరించారు.
మరోవైపు పన్ను మార్పులు కొన్ని భారతీయ వ్యాపారాల సప్లయ్ చైన్ కూడా దెబ్బతీసాయని, పాత ధరలకు వస్తువులను ఆఫ్‌లోడ్ చేయడానికి తొందరపడటంతో అమ్మకాలను దెబ్బతీశాయంటున్నారు మార్కెట్ నిపుణులు. అక్టోబర్ 27నాటి నోట్‌లో అమ్మకాల పెరుగుదలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అన్నారునోమురా ఆర్థికవేత్తలు సోనాల్ వర్మ , ఆరోదీప్ నంది. ఎందుకంటే దానిలో కొంత భాగం సాధారణం కంటే ఎక్కువగా ఉన్న డిమాండ్ కారణంగా ఉంటుందన్నారు.


