పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు వచ్చాయంటే.. బంగారం కోనేస్తుంటారు. కొన్నేళ్లుగా ఇది ఆనవాయితీగా వస్తోంది. దీంతో పసిడికి డిమాండ్ పెరిగిపోయింది, ధరలు కూడా పెరుగుదల దిశగా పరుగులు పెడుతూ ఉన్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు జీవితకాల గరిష్టాలను చేరుకుని, సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిపోయింది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉండనున్నాయో ఇక్కడ పరిశీలిద్దాం.
2025 డిసెంబర్ 9, 10 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష జరగనుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేటు తగ్గితే.. బంగారం ధర పెరుగుతుంది. ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేకపోతే.. గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉంది.
2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఆగష్టు నుంచి నవంబర్ వరకు బంగారం ధరలు పెరుగుదల దిశగా పరుగులు పెడుతున్నాయి. ఈ నెలలో (డిసెంబర్) పెడ్ వడ్డీ రేట్లు తగ్గి.. బంగారం ధరలు పెరిగితే, 1979 తరువాత గోల్డ్ రేటు పెరుగుదల విషయంలో రికార్డ్ బ్రేక్ చేసినట్లే అవుతుంది. ఇదే జరిగితే 46ఏళ్ల తరువాత సరికొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది.
1979లో బంగారం ధరలు ఎందుకు పెరిగాయంటే?
1979లో అంతర్జాతీయ అనిశ్చితులు, ఆర్థిక అస్థిరత, రాజకీయ సంక్షోభాలు, ద్రవ్యోల్బణ భయం వంటి కారణాల రేటు 120 శాతం కంటే ఎక్కువ పెరిగింది.
1979 తరువాత 2022, 2023లలో 14 శాతం, 2024లో 21 శాతం మేర బంగారం ధరలు పెరిగాయి. 2025లో గోల్డ్ రేటు 60 శాతం పెరుగుదలను అందుకుంది. దీన్నిబట్టి చూస్తే.. 46 సంవత్సరాల తరువాత బంగారం ధరలు పెరిగాయని స్పష్టంగా అర్థమవుతోంది.
నేటి ధరలు ఇలా..
గోల్డ్ రేటు ఈ రోజు (డిసెంబర్ 01) గరిష్టంగా రూ. 980 పెరిగింది(చెన్నైలో). దీంతో బంగారం ధర రూ. 1,30,630 వద్దకు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలలో 24 గ్యారేట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 660 పెరిగి రూ. 1,30,480 వద్ద నిలిచింది. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 600 పరైగింది. దీంతో 10 గ్రాముల 22క్యారెట్ల పసిడి ధర రూ. 1,19,600 వద్దకు చేరుకుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?


