'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు' | Rich Dad Poor Dad Author Robert Kiyosaki Say About Buy Gold Silver Bitcoin and Ethereum | Sakshi
Sakshi News home page

'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు': కియోసాకి

Nov 29 2025 4:15 PM | Updated on Nov 29 2025 4:57 PM

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Say About Buy Gold Silver Bitcoin and Ethereum

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక ట్వీట్ చేసారు. ఇందులో ''ప్రపంచం పేదరికంలో ఉన్నప్పుడు మీరు ధనవంతులు కావచ్చు'' అని వెల్లడించారు.

''జపాన్ క్యారీ ట్రేడ్ ముగిసింది. బబుల్ మార్కెట్లు తగ్గబోతున్నాయి. నా మంత్రానికి కట్టుబడి.. బంగారం, వెండి, బిట్‌కాయిన్ & ఎథెరియం కొనండి. గ్లోబల్ మార్కెట్స్ కుప్పకూలిపోతున్నప్పుడు ఎలా ధనవంతులు కావాలో నేను రాబోయే ట్వీట్‌లలో వెల్లడిస్తాను. అవును: ప్రపంచం పేదరికంలో ఉన్నప్పుడు మీరు ధనవంతులు కావచ్చు. జాగ్రత్త వహించండి.'' అని రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

ఇదీ చదవండి: కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనవంతులయ్యే మార్గాలు

కియోసాకి ప్రకారం.. తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని ప్రపంచ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే.. జపాన్ క్యారీ ట్రేడ్ ఇప్పుడు పనిచేయడం తగ్గిపోతోంది. దీని ప్రభావంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడుతుందని, బంగారం, వెండి వంటివాటితో పెట్టుబడి పెట్టండి. స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం ఏర్పడినా.. ప్రపంచం పేదరికంలో ఉన్నా.., మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు.

Advertisement
 
Advertisement
Advertisement