breaking news
Robert Kiyosaki
-
ఇలా చేశారంటే.. ఒక్క దెబ్బకు సంపద మొత్తం ఆవిరి!
అప్పు తీసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపదను వేగంగా పెంచుకోవచ్చు. అయితే, మార్కెట్ అంచనాలకు విరుద్ధంగా కదిలితే అదే అప్పు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీస్తుందని ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. ముఖ్యంగా సరైన ఆర్థిక అవగాహన లేకుండా అప్పులతో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ పోస్ట్‌లో పరపతి ఆధారిత పెట్టుబడుల (Leverage) రిస్క్‌లను వివరించారు.పెట్టుబడి తుడిచిపెట్టుకుపోవచ్చు!పెట్టుబడుల కోసం అప్పు తీసుకోవడం కంటే, ఆ అప్పును ఎవరు ఎలా వినియోగిస్తున్నారన్నదే కీలకమని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు, ఐదు రెట్ల పరపతితో పెట్టుబడి పెడితే మార్కెట్ 20 శాతం పడిపోయినప్పుడు పెట్టుబడిదారుడి సొంత మూలధనం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని వివరించారు. అయితే, వాస్తవ నష్టం అప్పు నిబంధనలు, నిర్వహణ ఖర్చులు, మార్జిన్ అవసరాలపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.అప్పును ఆయన లోడ్ చేసిన తుపాకీతో పోల్చారు. పరపతి అనేది వేగాన్ని పెంచే యాక్సిలరేటర్ లాంటిదని, పెట్టుబడి సరైన దిశలో సాగితే లాభాలను వేగంగా పెంచుతుందని, అదే ప్రతికూల దిశలో కదిలితే నష్టాలను కూడా అంతే వేగంగా పెంచుతుందని పేర్కొన్నారు.మార్జిన్ ట్రేడింగ్, క్రిప్టో పెట్టుబడుల్లో జాగ్రత్తషేర్ల కొనుగోలుకు బ్రోకర్ నుంచి అప్పు తీసుకునే మార్జిన్ ట్రేడర్లు, క్రిప్టో ఆస్తులను తాకట్టుపెట్టి రుణాలు తీసుకునే ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని కియోసాకి సూచించారు. మార్కెట్ ఒక్కసారిగా పడిపోయినప్పుడు మార్జిన్ నిబంధనల ప్రకారం బ్రోకర్లు పెట్టుబడులను విక్రయించే అవకాశం ఉంటుందని వివరించారు. అలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు తమ ఆస్తులను కాపాడుకునే అవకాశం కూడా పరిమితమవుతుందని పేర్కొన్నారు. అప్పుతో పెట్టుబడులు పెట్టడాన్ని ఆయన జూదంతో పోలుస్తూ, సరైన అవగాహన లేకుండా చేసే ట్రేడింగ్ ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని హెచ్చరించారు.మంచి అప్పు కూడా ప్రమాదకరంగా మారొచ్చుగతంలో తాను 'మంచి అప్పు' గురించి అనేకసార్లు వివరించానని కియోసాకి గుర్తుచేశారు. ఆదాయాన్ని అందించే ఆస్తులను కొనుగోలు చేయడానికి తీసుకునే రుణాలు, వాటి చెల్లింపులకు ఆ ఆస్తుల నుంచే ఆదాయం లభిస్తే ప్రయోజనకరంగా ఉండవచ్చని తెలిపారు. అయితే, సరైన అవగాహన లేని వ్యక్తుల చేతిలో అలాంటి అప్పు కూడా చెడు అప్పుగా మారుతుందని పేర్కొన్నారు.పెట్టుబడులకు ముందు ఆర్థిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత అనుభవాన్ని సంపాదించి, చివరగా అప్పును వినియోగించాలని తన రిచ్ డాడ్ నేర్పిన క్రమాన్ని వివరించారు. చాలామంది మాత్రం మొదట ఆకర్షణీయంగా కనిపించే పెట్టుబడి అవకాశాన్ని చూసి భారీగా అప్పులు తీసుకుంటారని, ఆ తర్వాత నష్టాల ద్వారా పాఠాలు నేర్చుకుంటారని వ్యాఖ్యానించారు.అప్పులకు పూర్తిగా దూరంగా ఉండాలా?అప్పు తీసుకోవద్దని చెప్పడం కూడా సరైన విధానం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. సంపదను పెంచుకోవడంలో పరపతి ఉపయోగపడుతుందని, అయితే దానిని బాధ్యతాయుతంగా వినియోగించడం అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడి పెట్టే ముందు ఆస్తి విలువ తగ్గినా, అద్దె ఆదాయం పడిపోయినా, మార్కెట్లు కుప్పకూలినా రుణాన్ని తిరిగి చెల్లించగలమా అనే అంశాలను పరిశీలించాలని సూచించారు.ఆస్తి భరించగలిగే స్థాయికి మించి అప్పులు తీసుకోకూడదని, పెట్టుబడి లెక్కలను ముందుగానే వివిధ ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా పరీక్షించుకోవాలని తెలిపారు. ఆర్థిక అవగాహనను నిర్లక్ష్యం చేస్తే మార్కెట్ నుంచి నేర్చుకునే పాఠాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని కియోసాకి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. -
వందలో ముగ్గురే రిచ్.. ఎందుకో తెలుసా?
ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరి ఆశ శ్రీమంతులు కావడమే. కానీ, అందులో కేవలం 3 శాతం మంది మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారు. దీనికి కారణం ప్రతిభో, విద్యా అర్హతో, లభించే అవకాశాలో కాదు.. మనం తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం.. మన ఆలోచనా సరళి! ఈ విషయాన్నే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ టి. కియోసాకి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇదికాస్తా వైరల్‌గా మారింది.‘1970ల కాలంలో మా రిచ్ డాడ్ నాకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక చిన్న పాఠం నేర్పారు. జీవితంలో భద్రత, సౌకర్యం, సంపద అనేవి మూడు ముఖ్యమైన ప్రాధాన్యతలు అని చెబుతూ.. వీటిని నన్ను వరుస క్రమంలో అమర్చమన్నారు. సాధారణంగా చాలామంది ఆలోచించకుండా ఎంచుకునే సురక్షితమైన మార్గంభద్రత-- సౌకర్యం-- సంపదకానీ నేను ఎంచుకున్న మార్గం వేరు. అదే..సంపద-- సౌకర్యం-- భద్రతఆ ఒక్క నిర్ణయమే నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పేదవారు ఎల్లప్పుడూ ఉద్యోగ భద్రతనే పట్టుకుని వేలాడతారు. మధ్యతరగతి ప్రజలు తాత్కాలిక సౌకర్యాలకే పరిమితమవుతారు. కానీ శ్రీమంతులు మాత్రం భయం అనిపించినా సరే సంపద సృష్టికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది తాము ధనవంతులం కావాలని కోరుకుంటారు. కానీ ఆ ప్రయాణంలో అసౌకర్యం, అనిశ్చితి, అభద్రతాభావం ఎదురైన మరుక్షణమే వెనకడుగు వేస్తారు. ప్రతిసారీ సౌకర్యాన్ని ఎంచుకోవడం వల్లే ఆర్థికంగా ఎదిగేలేక అక్కడే ఉండిపోతారు.ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే.. జీవితంలో మీ ప్రాధాన్యత ఏంటి? అనిశ్చితిని, అభద్రతను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా లేకపోతే.. జీవితాంతం ‘నేను ధనవంతుడిని ఎందుకు కాలేకపోయాను?’ అని బాధపడాల్సిందే. మీరు భద్రత, సౌకర్యం, సంపద.. ఈ మూడింటినీ పొందవచ్చు. కాకపోతే, మొదట దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారనేదే మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది’ అని రాబర్ట్ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: గోల్డ్ లోన్లలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం! -
బంగారం ధరల నుంచి బ్యాంక్ హాలిడేస్ వరకు!
ఈ రోజు బంగారం ధరలు ఇలా..వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఈ రోజు (ఆదివారం) స్థిరంగా ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో ఎలాంటి మార్పు కనిపించలేదు. వెండి ధరల్లో కూడా ఎలాంటి తేడా లేదు. హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,180 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 వద్ద ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఈ వారం బ్యాంక్ హాలిడేస్..బ్యాంకుకు వెళ్లి మాత్రమే చేయాల్సిన పనులు ఏవైనా ఉంటే.. తప్పకుండా బ్యాంక్ హాలిడేస్ గురించి తెలుసుకోవాలి. బ్యాంకులకు సెలవులు ఎప్పటికప్పుడు.. రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణంగా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో పాటు జాతీయ, రాష్ట్ర పండుగలు, ఇతర ప్రాంతీయ పండుగల రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ప్రతి ఏడాది హైక్ వస్తున్నా.. జీతం తక్కువేనా?ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ జీతం చాలా ముఖ్యం. కానీ కెరీర్ ప్రారంభంలో మనం తీసుకునే జీతం.. తర్వాత మన సంపాదనపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా.. మొదటి ఉద్యోగంలోనే తక్కువ జీతంతో చేరి, ఆ తర్వాత ప్రతిసారీ కంపెనీ మారినప్పుడు పాత జీతంపై కొంత శాతం మాత్రమే పెంచుకుంటూ వెళ్తే.. ఏళ్ల తర్వాత కూడా మన జీతం చాలా తక్కువగా ఉండొచ్చు. ఈ విషయాన్ని వ్యాపారవేత్త వన్యా గోయెల్ వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.డబ్బు విలువ పడిపోతే?.. కియోసాకి హెచ్చరికరిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో డబ్బు విషయంలో ముందుగానే సిద్ధంగా ఉండటం ఎందుకు ముఖ్యమో చాలా సింపుల్ ఉదాహరణతో వివరించారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
డబ్బు విలువ పడిపోతే?.. సిద్ధంగా ఉండాలంటున్న కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో డబ్బు విషయంలో ముందుగానే సిద్ధంగా ఉండటం ఎందుకు ముఖ్యమో చాలా సింపుల్ ఉదాహరణతో వివరించారు.ఒకసారి కొంతమంది ముందు మాట్లాడుతున్నప్పుడు తాను ప్రిప్పర్ అని కియోసాకి చెప్పారు. అంటే.. భవిష్యత్తులో ఏదైనా సమస్య లేదా అత్యవసర పరిస్థితి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధంగా ఉండే వ్యక్తి. అప్పుడు ఒక మహిళ ఆయనను ఒక ప్రశ్న అడిగింది.మహిళ ప్రశ్న.. కియోసాకి సమాధానంమీరు ప్రిప్పర్ అయితే, ఎప్పుడూ ఏదో చెడు జరుగుతుందని ఆలోచిస్తున్నట్టే కదా?, పాజిటివ్‌గా ఆలోచించడం మంచిది కాదా?, అని ఆమె ప్రశ్నించింది.దానికి కియోసాకి కారు ఇన్సూరెన్స్ ఉదాహరణగా చెప్పారు. మీ కారుకు ఇన్సూరెన్స్ ఉందా? అని అడిగారు. ఆమె ఉంది అని చెప్పింది. వెంటనే.. అంటే మీకు యాక్సిడెంట్ జరగాలని కోరుకుంటున్నారా? అని అడిగారు. అందుకు ఆమె.. లేదు. కానీ ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే నష్టాన్ని ఎదుర్కోవడానికి ఇన్సూరెన్స్ తీసుకున్నాను.. అని సమాధానం ఇచ్చింది.ఆర్థిక విషయాల్లో ముందు చూపుఇక్కడే కియోసాకి చెప్పాలనుకున్న అసలు విషయం ఉంది. ముందుజాగ్రత్త తీసుకోవడం అంటే.. చెడు జరగాలని కోరుకోవడం కాదు. చెడు జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం. కారు విషయంలో ఇన్సూరెన్స్ తీసుకున్నట్లే, ఆర్థిక విషయాల్లో కూడా ముందుగానే రక్షణ కలిగి ఉండాలని ఆయన భావిస్తున్నారు.తర్వాత ఆయన బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులు ఉన్నాయా అని ఆ మహిళను అడిగారు. ఆమె దగ్గర అవేవీ లేవని చెబుతుంది. అప్పుడు.. ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో పెద్ద సంక్షోభం వస్తే మీ డబ్బుకు ఏమవుతుందని కియోసాకి ప్రశ్నిస్తారు. ప్రభుత్వం మరింత డబ్బును ముద్రిస్తుందని ఆమె సమాధానం చెబుతుంది.ద్రవ్యోల్బణం వస్తే..అప్పుడు ఆయన డబ్బు కొనుగోలు శక్తి గురించి మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగినప్పుడు అదే మొత్తంలో డబ్బుతో గతంలో కొనగలిగిన వస్తువులను కొనడం కష్టమవుతుంది. దీనినే సాధారణంగా ద్రవ్యోల్బణం అంటారు. ఉదాహరణకు, ఈరోజు రూ.100తో కొనగలిగిన వస్తువు కోసం.. రాబోయే రోజుల్లో రూ.120 లేదా రూ.150 చెల్లించాల్సి వస్తే, మన డబ్బు విలువ సంఖ్యలో అలాగే ఉన్నప్పటికీ దాని కొనుగోలు శక్తి తగ్గినట్టే.ఇదీ చదవండి: AIని అదుపులో ఉంచగలమా.. పెరుగుతున్న ఆందోళన!కియోసాకి అభిప్రాయం ప్రకారం.. అందుకే మన సంపద మొత్తాన్ని ఒకే రకమైన డబ్బు లేదా ఒకే ఆస్తిపై పెట్టుబడిగా పెట్టకూడదు. ప్రభుత్వం సృష్టించగలిగే కరెన్సీతో పాటు ఇతర రకాల ఆస్తులను కూడా కలిగి ఉండాలని ఆయన చెబుతారు. చివరగా మీరు ఆర్థికంగా ముందుచూపుతో ఉండే వ్యక్తేనా? అని ప్రశ్నించారు.WHY I AM A PREPPER Speaking to a group the other day I mentioned I was a prepper. A woman raised her hand and asked “If you are a prepper, aren’t you being pessimistic? Isn’t positive thinking healthier? I replied “Do you have insurance on your car?” She replied “Yes” “Are you hoping for an accident?” “No” she replied shaking her head. I have insurance just incase I’m in an accident.” “Do you own any gold, silver, Bitcoin?” She shook her head “No.” “What will happen to your money when the economy crashes?” I asked. “The government will print more of it.” “And what will happen to the purchasing power of your money?” Nodding her head she replied, “It will go down in purchasing power?” “And that’s called…..?” “Inflation?” She smirked. “The Fed and government’ steal our wealth via our money….legally… because they can print it…legally.” They steal our wealth via taxation and inflation….legally. “I only want money the government cannot print.” “I also own oil wells. Governments are big buyers of oil. Great customers. They give me money” “And that’s why you’re a financial prepper? She said with smile. I just nodded my head. Q: Are you a “financial prepper?” A: And what is YOUR answer? Take care, 👍— Robert Kiyosaki (@theRealKiyosaki) October 3, 2026 -
బంగారం అలారం బెల్.. కియోసాకి హెచ్చరిక!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి.. తాజాగా, ''కరెన్సీ విలువపై ప్రజలకు, ప్రభుత్వాలకు, పెట్టుబడిదారులకు నమ్మకం తగ్గితే ఏం జరుగుతుంది?'', అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఒక ఫేస్బుక్ పోస్ట్ వైరల్ అవుతోంది.బంగారానికి డిమాండ్డబ్బును దాచుకోవడం కంటే.. విలువైన ఆస్తులలో పెట్టుబడులుగా పెట్టడం మంచిదని అంటారు కియోసాకి. సంక్షోభం ఏర్పడినప్పుడు బంగారం మిమ్మల్ని కాపాడుతుంది. ఈ కారణంగానే బంగారాన్ని వేల సంవత్సరాలుగా విలువైన ఆస్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తమ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటే.. మార్కెట్లో గోల్డుకు డిమాండ్ పెరగవచ్చు.అందుకే కియోసాకి బంగారాన్ని అలారం బెల్‌తో పోలుస్తున్నారు. ఎందుకంటే.. ఆర్థిక వ్యవస్థలో ఏదైనా మార్పు వస్తే.. బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.బంగారం తరువాత వెండిబంగారం ధరలు పెరిగినప్పుడు.. పెట్టుబడిదారుల చూపు వెండి వైపు పడుతుంది. వెండికి పారిశ్రామిక రంగంలో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రానిక్స్, సోలార్ టెక్నాలజీ వంటి రంగాల్లో సిల్వర్ ఉపయోగం విరివిగా ఉంటుంది. దీంతో పెట్టుబడి డిమాండ్‌తో పాటు పారిశ్రామిక డిమాండ్ కూడా వెండి ధరపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు.మైనింగ్ కంపెనీలుబంగారం, వెండి ధరలు పెరిగితే.. వాటిని భూమి నుంచి వెలికితీసే కంపెనీలపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుందని కియోసాకి చెబుతారు. ఎందుకంటే లోహాల ధరలు పెరిగినప్పుడు, ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉంటే మైనింగ్ కంపెనీల ఆదాయాలు, లాభాల అవకాశాలు కూడా మెరుగుపడవచ్చు.సాధారణ పెట్టుబడిదారులు మార్కెట్లో మార్పు స్పష్టంగా కనిపించే వరకు వేచి ఉండకూడదని కియోసాకి చెబుతారు. పెట్టుబడుల విషయంలో ఇతరులను చూసి నిర్ణయాలు తీసుకోవడం కంటే.. ఆర్థిక పరిస్థితులను ముందుగానే అర్థం చేసుకోవడం మంచిదని చెబుతారు.ఇదీ చదవండి: గడ్కరీ ఆలోచన: ఇదే జరిగితే.. రోడ్లు అవసరం లేదు! -
రిటైర్ అయ్యేవాళ్లకు కష్టమే: కియోసాకి అలర్ట్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి అమెరికా పదవీ విరమణ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, బాండ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బేబీ బూమర్ (1946 నుంచి 1964 మధ్య జన్మించినవారు) తరానికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. 1970లలో 401(k) వంటి రిటైర్మెంట్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, వాటిపై తగిన ఆర్థిక అవగాహన లేకుండానే ప్రజలు పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని కియోసాకి తన ఎక్స్ పోస్టులో వ్యాఖ్యానించారు.60:40 విధానంపైనా విమర్శలు1960లలో కొత్తగా అభివృద్ధి చెందిన ‘ఫైనాన్షియల్ ప్లానర్’ వృత్తి ద్వారా బేబీ బూమర్లకు 60:40 పెట్టుబడి విధానాన్ని సూచించేవారని కియోసాకి చెప్పారు. అంటే 60 శాతం షేర్లు, 40 శాతం బాండ్లలో పెట్టుబడి పెట్టే విధానమని వివరించారు. ఆ సమయంలో ఆర్థిక విద్యకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయిందని, ఫైనాన్షియల్ ప్లానర్లకు లైసెన్స్ పొందే ప్రక్రియ కూడా చాలా తక్కువ వ్యవధిలో పూర్తయ్యేదని ఆయన పేర్కొన్నారు.బాండ్ల విక్రయాలు.. బంగారంపై దృష్టి2026లో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అమెరికా ప్రభుత్వ బాండ్లను విక్రయించి, భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. బాండ్ల ధరలు పడిపోతే షేర్ మార్కెట్లపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, ఎస్అండ్పీ 500 వంటి ప్రధాన సూచీలు భారీగా పడిపోతే రిటైర్మెంట్ దశలో ఉన్న లక్షలాది మంది బేబీ బూమర్లకు నష్టాలు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు.దీంతో కొంతమంది రిటైర్డ్ వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని పిల్లలు, మనవళ్లపై ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు. అయితే, ఇవి తన అంచనాలని, తాను తప్పు కావాలని కోరుకుంటున్నానని కూడా ఆయన స్పష్టం చేశారు.బంగారం, వెండి, బిట్‌కాయిన్ కొనాలని..2008లో లెహ్మాన్ బ్రదర్స్ సంక్షోభం సమయంలో తాను చేసిన హెచ్చరికలను గుర్తుచేసుకున్న కియోసాకి.. చాలా ఏళ్లుగా ప్రజలకు బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తుల గురించి చెబుతున్నానన్నారు. ప్రస్తుతం అమెరికాలో అద్దె అపార్ట్మెంట్లు, చమురు బావుల్లో పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. తాను ఫైనాన్షియల్ ప్లానర్ కాదని, పెట్టుబడి సూచనల ద్వారా తాను డబ్బు సంపాదించడం లేదని పేర్కొన్నారు.ప్రజలకు ఆర్థిక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తన మాజీ భార్య కిమ్‌తో కలిసి 1996లో ‘క్యాష్‌ఫ్లో’ బోర్డ్ గేమ్‌ను రూపొందించామని, 1997లో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకాన్ని రాశానని కియోసాకి తెలిపారు. పాఠశాలలు, వాల్‌స్ట్రీట్ బోధించని ఆర్థిక అంశాలను ప్రజలు స్వయంగా నేర్చుకునేలా చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు.“ఎంత ఎక్కువ నేర్చుకుంటే.. ఎంత ఎక్కువగా ఇతరులకు నేర్పిస్తే.. అంత ఎక్కువగా సంపన్నులవుతారు” అనే సందేశంతో తన ఎక్స్ పోస్టును ముగించిన కియోసాకి.. ముందుచూపుతో ఆర్థిక విషయాలను నేర్చుకోవాలని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.DID THE BABY BOOMERS get F’d? A: in 1974 the Boomer’s were the first generation to receive ERISA aka the “401k,” without any financial education. ERISA=Employee Retirement Income Security ACT BTW: Anytime the government passes an act…the words mean the opposite. For Example “Social Security?” In 1964, Boomers were being taught by a new profession called “Financial Planners” also without any financial education to pitch the 60/40… 60% stocks 40% bonds. It took only 7 weeks to get a financial planner’s license back then. I could not believe it. I could see this crisis we are in today…coming….the crisis of Boomers getting F’d. Today, in 2026….Central Banks throughout the world are dumping US Bonds to buy gold….by the tons. When bonds go down… the stock market, like the S&P 500 will crash, which will leave millions of boomers out of time and out of money to recover. Millions of Boomers may be homeless or moving in with kids and grandkids. Hope I am wrong, but I do not think I am. My predictions, starting with the crash of Lehmann Brothers on CNN, on Wolf Blitzer’s Situation Room show in 2008, has been on time and target. That is why I have ended my X’s with “Buy gold, silver, and Bitcoin” for years. Nothing has changed, except I do own rental apartments and oil wells in US. I am not a financial planner nor do I make money from my recommendations. That is why my x-wife Kim and I created the Cashflow Boardgame, in 1996, and I wrote Rich Dad Poor Dad in 1997 and many other books. Our mission has been to create products so people could teach people….what our schools and Wall Street will not teach you. Rough times ahead for the unprepared and great times for those that are. Please read, learn, join a Cashflow Club, teach yourself, and others. “The more you learn and the more you teach….the richer you become.” Please take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) September 28, 2026 -
50 ఏళ్లుగా వెండి ధరను అణిచేస్తున్నారా?
వెండి ధరలు, దాని పారిశ్రామిక ప్రాధాన్యంపై ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెండి మార్కెట్‌ను 50 ఏళ్లుగా ఉద్దేశపూర్వకంగా అణిచివేస్తున్నారంటూ కియోసాకి ఆరోపించారు. వెండిని బ్యాంకులు పెద్దఎత్తున నిల్వ చేసుకుంటున్నాయని, మరోవైపు సాధారణ ఇన్వెస్టర్లు మాత్రం కేవలం పేపర్ ఆస్తులపైనే ఆధారపడేలా ఆర్థిక వ్యవస్థను తయారు చేశారని ఆయన తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు.సాధారణ ఇన్వెస్టర్లు మార్కెట్ పతనాలను చూసి భయపడుతుంటే, సంపన్న పెట్టుబడిదారులు మాత్రం వాటిని అవకాశాలుగా చూస్తారని కియోసాకి అన్నారు. మార్కెట్లు కుప్పకూలినప్పుడు వ్యూహాత్మక ఆస్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి సంపదను మరింతగా పెంచుకుంటారని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ డెరివేటివ్స్ మార్కెట్ ఏర్పడటం వల్ల అధిక రిస్క్‌తో కూడిన ఆర్థిక సాధనాలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు.వెండి కేవలం ఆభరణాల తయారీకే పరిమితమైన లోహం కాదని కియోసాకి వివరించారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వెండిని ఉపయోగిస్తున్నారని, సోలార్ ప్యానెళ్లు, సైనిక అవసరాల్లోనూ దీనికి డిమాండ్ ఉందని అన్నారు. ప్రపంచంలో ఇప్పటికే 95 శాతం వెండి వినియోగించేశారన్న ఆయన బంగారంలా వెండిని పెద్దఎత్తున నిల్వ చేయలేమని, అందువల్ల కొన్ని సందర్భాల్లో వెండికి బంగారం కంటే ఎక్కువ విలువ ఉండొచ్చని వ్యాఖ్యానించారు. టోమాహాక్ క్షిపణుల్లోనూ గణనీయమైన మొత్తంలో వెండి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.వెండి మార్కెట్‌ను పెద్ద బ్యాంకులు కృత్రిమంగా నియంత్రించి ధరను తక్కువగా ఉంచుతున్నాయని కియోసాకి ఆరోపించారు. ఈ సందర్భంగా జేపీ మోర్గాన్ గతంలో చెల్లించిన 920 మిలియన్ డాలర్ల జరిమానాను ప్రస్తావించారు.ఇక మ్యూచువల్ ఫండ్లు, 401(k) వంటి పేపర్ ఆస్తులపై మాత్రమే ఆధారపడటం కంటే వాస్తవ ఆస్తులపై దృష్టి పెట్టాలని కియోసాకి సూచించారు. సంపన్నులు ఆస్తులను కొనుగోలు చేస్తే, పేద, మధ్యతరగతి ప్రజలు తరచూ ఆస్తులుగా భావించే బాధ్యతలను (లయబిలిటీస్) కూడబెట్టుకుంటారని తన పాత సిద్ధాంతాన్ని మరోసారి ప్రస్తావించారు. జీతాల కొనుగోలు శక్తి తగ్గుతున్న సమయంలో వ్యూహాత్మక లోహాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆస్తులు ఉచితమే.. అప్పులూ ఉచితమే!! -
రియల్ ఎస్టేట్‌లో ఎదగాలంటే.. కియోసాకి సూచనలు
రియల్ ఎస్టేట్‌లో భారీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, కమర్షియల్ ప్రాపర్టీలు కొనుగోలు చేయాలని చాలామంది కలలు కంటుంటారని, అయితే పెద్ద డీల్ కోసం ఎదురుచూస్తూ ఉండటమే ఆర్థికంగా వెనుకబడటానికి కారణమవుతుందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. చిన్న ప్రాపర్టీతో ప్రారంభించి, దాని ద్వారా అనుభవం సంపాదించుకుంటూ క్రమంగా ఆస్తుల పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాలని సూచించారు.తాజాగా సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్లో కియోసాకి ఈ విషయాలను ప్రస్తావించారు. చాలామంది పెద్ద అపార్ట్మెంట్ భవనాలు, కమర్షియల్ ప్రాపర్టీల గురించి ఆలోచిస్తూ.. పుస్తకాలు చదవడం, వీడియోలు చూడటం, సెమినార్లకు హాజరుకావడం ద్వారా ఏళ్ల తరబడి ‘సిద్ధమవుతూనే’ ఉంటారని ఆయన అన్నారు. అదే సమయంలో మూడేళ్ల క్రితం చిన్న డ్యూప్లెక్స్ ప్రాపర్టీ కొనుగోలు చేసిన వ్యక్తి ఇప్పటికే నాలుగు ప్రాపర్టీలకు యజమాని అయి ఉండొచ్చని పేర్కొన్నారు.మొదటి ఆస్తి.. నేర్చుకోవడం కోసంతొలి ప్రాపర్టీ వెంటనే పెద్ద సంపదను అందించాల్సిన అవసరం లేదని కియోసాకి అన్నారు. అది రియల్ ఎస్టేట్ నిర్వహణపై అవగాహన కల్పించే సాధనంగా ఉపయోగపడాలని వివరించారు. చిన్న ప్రాపర్టీతో ప్రారంభిస్తే పొరపాట్ల వల్ల కలిగే నష్టం కూడా పరిమితంగా ఉంటుందని పేర్కొన్నారు. అద్దెకు ఇచ్చిన ఇంటిని కిరాయిదారు దెబ్బతీస్తే ప్రాపర్టీ మేనేజ్మెంట్ గురించి, ఏసీ వంటి పరికరాలు పాడైతే నిర్వహణ ఖర్చుల కోసం బడ్జెట్ కేటాయింపు గురించి, నగర అధికారులు నిబంధనల ఉల్లంఘనపై నోటీసులు ఇస్తే కొనుగోలుకు ముందు తనిఖీలు, చట్టపరమైన అంశాల పరిశీలన గురించి నేర్చుకోవచ్చని చెప్పారు.అంతేకాకుండా, చిన్న ప్రాపర్టీ నుంచి వచ్చే నగదు ప్రవాహమే ఈ అనుభవాన్ని నేర్చుకునే ఖర్చును భరించగలదని కియోసాకి పేర్కొన్నారు. దీనికి భిన్నంగా మొదటి ప్రయత్నంలోనే భారీ ప్రాపర్టీ కొనుగోలు చేస్తే, ఒక్క పెద్ద తప్పిదం కూడా ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా 20 యూనిట్ల భవనంలో అద్దెదారులకు సంబంధించిన సమస్యలు లేదా కొనుగోలుకు ముందు పరిశీలనలో గుర్తించని కీలక అంశాలు పెద్ద ఆర్థిక భారంగా మారవచ్చని అన్నారు.ఇదీ చదవండి: రూ.26 లక్షలకు కొన్న ఇంటికి రూ.42 లక్షల ఆఫర్! -
ఆస్తులు ఉచితమే.. అప్పులూ ఉచితమే!!
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ పెట్టుబడిదారు రాబర్ట్ కియోసాకి మరోసారి డబ్బు సంపాదన, ఆర్థిక ఆలోచనా విధానంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టులో.. మనం ఉపయోగించే పదాలు, మన ఆలోచనా విధానంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. “మీ అత్యుత్తమ ఆస్తులు ఉచితమే. దురదృష్టవశాత్తూ మీ అత్యంత చెత్త అప్పులు కూడా ఉచితమే” అంటూ తన పోస్టును ప్రారంభించారు.తాను ఆదివారం జరిగే ధార్మిక పాఠశాలలో చదువుకునే సమయంలో “పదం శరీరరూపం దాల్చింది” అనే భావనను నేర్చుకున్నానని కియోసాకి తెలిపారు. తన ఉద్దేశంలో మనం మాట్లాడే మాటలే క్రమంగా మన వ్యక్తిత్వంగా మారతాయని వివరించారు. “నేను భరించలేను”, “ప్రయత్నిస్తాను”, “ధనవంతులు అత్యాశపరులు” వంటి మాటలను ఆర్థికంగా వెనుకబడినవారు ఉపయోగించే పదాలుగా కియోసాకి పేర్కొన్నారు. అందుకే డబ్బుకు సంబంధించిన భాషను నేర్చుకోవాలని సూచించారు.తాను నాలుగో తరం జపాన్-అమెరికన్ అయినప్పటికీ జపనీస్ భాష మాట్లాడలేనని కియోసాకి చెప్పారు. కానీ ఒకవేళ తాను జపాన్‌లో నివసించాలన్నప్పుడు లేదా అక్కడ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆ భాషను నేర్చుకుంటానన్నారు. అదే విధంగా ధనవంతుల ప్రపంచంలో డబ్బుకు సంబంధించిన భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘ఎర్న్డ్ ఇన్కమ్’, ‘పోర్ట్‌ఫోలియో ఇన్కమ్’, ‘పాసివ్ ఇన్కమ్’ అనే మూడు పదాల మధ్య తేడాను అర్థం చేసుకోవాలని సూచించారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం, పేదవారు ప్రధానంగా ఉద్యోగం చేసి జీతం రూపంలో వచ్చే ఆదాయంపై ఆధారపడతారు. దీన్నే ‘ఎర్న్డ్ ఇన్కమ్’గా ఆయన వివరించారు. పైగా ఇలాంటి ఆదాయంపైనే పన్నులు ఎక్కువగా ఉంటాయన్నారు. అదే మధ్యతరగతివాళ్లు ఉద్యోగంతో పాటు 401(k), IRA వంటి పదవీ విరమణ పెట్టుబడి పథకాల ద్వారా ‘పోర్ట్‌ఫోలియో ఇన్కమ్’పై దృష్టి పెడతారని తెలిపారు. ఇక ధనవంతులు తమ వద్ద ఉన్న ఆస్తుల నుంచి పనిచేయకుండానే ‘పాసివ్ ఇన్కమ్’ ఆర్జిస్తారని, దీనిపై పన్నులు కూడా తక్కువని రాసుకొచ్చారు.‘పేద మాటలు మాట్లాడొద్దు.. డబ్బు భాష నేర్చుకోండి.. దీనికి ఖర్చు కూడా చేయనక్కరలేదు. ఎందుకంటే మనం మాట్లాడే మాటలే మన ఆర్థిక భవిష్యత్తును నిర్దేశిస్తాయి’అని రాబర్ట్ కియోసాకి తనను అనుసరించేవారికి సూచించారు.ఇదీ చదవండి: అప్పు.. అప్పుతోనే చెల్లు! ఇదే ‘రిచ్ డాడ్’ సీక్రెట్!! Your BEST ASSETS are FREEUnfortunately so are your WORST LIABILITIES When I was in Sunday School I was taught:“And the word became flesh…. and dwelt amongst us.”In other words your words become YOU.Biggest free liabilities:“I can’t afford it.”“l’ll try.”“The rich…— Robert Kiyosaki (@theRealKiyosaki) September 24, 2026 -
ఇలా చేస్తే.. డబ్బు అదే వస్తుంది: కియోసాకి
''మన జీవితానికి అసలైన లక్ష్యం డబ్బు కాదు. నిజానికి డబ్బు అనేది మనం చేసిన పని ఎంత విలువైనదో కొలిచే ఒక కొలమానం మాత్రమే'' అని అంటారు రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.చాలామంది జీవితంలో ''మంచి ఉద్యోగం రావాలి, మంచి జీతం రావాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి'' అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఒక ఉద్యోగం, ఒక కంపెనీ, ఒక జీతం.. ఇదే వారి ప్రపంచంగా మారిపోతుంది. తమ సమయాన్ని ఒక సంస్థ కోసం వెచ్చిస్తారు. నెలాఖరులో దానికి బదులుగా జీతం తీసుకుంటారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ.. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. మనం కేవలం డబ్బు కోసం పనిచేస్తున్నామా? లేక మనం ఏదైనా విలువను సృష్టిస్తున్నామా?తేనెటీగ ఫార్ములాఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి తేనెటీగ జీవితం సరిగ్గా సరిపోతుంది. తేనెటీగ పువ్వు దగ్గరకు వెళ్లినప్పుడు.. పరాగసంపర్కం చేయాలి అనుకోదు. దానికి కావాల్సింది మకరందం మాత్రమే. దీనికోసం పువ్వు దగ్గరకు వెళ్తుంది. కానీ ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకు వెళ్తున్నప్పుడు, దాని ద్వారా పరాగసంపర్కం జరుగుతుంది. అంటే పరాగసంపర్కం దాని ప్రధాన లక్ష్యం కాదు. కానీ అది చేసే పనికి సహజంగా వచ్చే ఫలితం.డబ్బు విషయంలో తేనెటీగ ఫార్ములాను అప్లై చేసుకోవచ్చు. నువ్వు.. నాకు డబ్బు కావాలి అని మాత్రమే ఆలోచిస్తూ, దాని వెంట పరుగెత్తితే, ప్రపంచంలో ఉన్న అందరితో నువ్వు అదే డబ్బు కోసం పోటీ పడుతున్నట్టే. కానీ.. నేను ఒక నిజమైన సమస్యను పరిష్కరించాలి. అది చాలా మందికి ఉపయోగపడాలి అని ఆలోచిస్తే, నీ దృష్టి డబ్బు నుంచి విలువ వైపు మారుతుంది.ఇలా చేస్తే.. ఆదాయం అదే వస్తుంది!ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక మంచి సాఫ్ట్వేర్ తయారు చేశాడనుకుందాం. అతని మొదటి ఆలోచన.. దీంతో నేను ఎంత డబ్బు సంపాదించగలను?.. అయితే అతని దృష్టి ఆదాయంపైనే ఉంటుంది. కానీ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను నేను ఎలా సులభంగా పరిష్కరించగలను? అని ఆలోచిస్తే, అతను ఒక విలువను సృష్టిస్తున్నాడు.ఆ సాఫ్ట్వేర్ నిజంగా ఉపయోగపడితే, ఎక్కువ మంది దాన్ని ఉపయోగిస్తారు. ఎక్కువ మందికి ఉపయోగపడితే, దాని ద్వారా ఆదాయం వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.డబ్బు అవసరం లేదని దీని అర్థం కాదు. మన జీవితానికి డబ్బు చాలా ముఖ్యం. కానీ డబ్బును జీవితానికి ఒకే ఒక లక్ష్యంగా చేసుకుంటే, మనం సృష్టించగల విలువను మనమే పరిమితం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అసలు ప్రశ్న “నేను ఎంత డబ్బు సంపాదించగలను?” అనేది కాకుండా, నేను ఏ సమస్యను పరిష్కరించగలను?, నా పని ఎంతమందికి ఉపయోగపడగలదు?, నేను ఇతరుల జీవితంలో ఎంత విలువను సృష్టించగలను?, అని ఆలోచించాలి.ఎందుకంటే మనం డబ్బును నేరుగా వెంబడించినప్పుడు, డబ్బే మన గమ్యంగా మారుతుంది. కానీ మనం విలువను సృష్టించడంపై దృష్టి పెట్టినప్పుడు, డబ్బు మన ప్రయాణంలో వచ్చే ఒక ఫలితంగా మారుతుంది.ఇదీ చదవండి: డబ్బు సమస్యలు తగ్గాలంటే?: కియోసాకి చెప్పిన సీక్రెట్ -
అప్పు.. అప్పుతోనే చెల్లు! ఇదే ‘రిచ్ డాడ్’ సీక్రెట్!!
అప్పుల నుంచి బయటపడాలంటే సాధారణంగా వాటిని వీలైనంత త్వరగా తీర్చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చెడ్డ అప్పులను (Bad Debt) తీర్చేందుకు సొంత డబ్బును ఉపయోగించకుండా.. ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తుల కోసం ‘మంచి అప్పు’ (Good Debt) తీసుకుని, ఆ ఆదాయంతో పాత అప్పులను తీర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో చేసిన ఓ పోస్టులో తన అభిప్రాయాలను పంచుకున్నారు.కియోసాకి ప్రకారం.. క్రెడిట్ కార్డు వంటి అధిక వడ్డీ అప్పులను జీతంతో నెలనెలా తీర్చుకుంటూ 20 ఏళ్ల పాటు కొనసాగడం కంటే, నగదు ప్రవాహం (Cash Flow) అందించే ఆస్తులను కొనుగోలు చేయడానికి రుణాన్ని ఉపయోగించుకోవడం ఒక ప్రత్యామ్నాయ మార్గం. ఆ ఆస్తి నుంచి వచ్చే ఆదాయంతో రుణ వాయిదాలను చెల్లిస్తూ, మిగిలిన మొత్తాన్ని చెడ్డ అప్పులను తీర్చడానికి ఉపయోగించుకోవచ్చని ఆయన వివరించారు.తన భార్య కిమ్ మొదటిసారి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన ఉదాహరణను ఈ సందర్భంగా కియోసాకి ప్రస్తావించారు. ఆమె 5,000 డాలర్లు పెట్టుబడిగా పెట్టి, మరో 40,000 డాలర్లను రుణంగా తీసుకున్నారని చెప్పారు. అయితే ఆ రుణాన్ని ఆమె సొంత డబ్బుతో చెల్లించలేదని, ఆ ప్రాపర్టీలోని అద్దెదారుల నుంచి వచ్చిన అద్దె ఆదాయమే రుణ చెల్లింపులకు ఉపయోగపడిందని పేర్కొన్నారు. అద్దె ఆదాయం మార్ట్గేజ్ చెల్లింపులను కవర్ చేయడంతో పాటు కొంత మిగిలేదని వివరించారు.తన ‘రిచ్ డాడ్’ నుంచి నేర్చుకున్న పాఠాన్ని వివరించేందుకు కియోసాకి మోనోపొలీ గేమ్‌ను కూడా ఉదాహరణగా తీసుకున్నారు. రియల్ ఎస్టేట్‌ను రుణంతో కొనుగోలు చేసే విధానాన్ని అర్థం చేసుకునేలా ఈ ఆట ద్వారా నేర్పించారని చెప్పారు. ఒక ప్రాపర్టీపై అద్దె చెల్లించినప్పుడు, ఆ డబ్బులో కొంత భాగం బ్యాంకు రుణాన్ని తీర్చేందుకు వెళ్లేలా ఉండేదని వివరించారు.ఇదీ చదవండి: ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకిఅందువల్ల ఆదాయం తీసుకువచ్చే ఆస్తుల ద్వారా వచ్చే నగదు ప్రవాహాన్ని ఉపయోగించి రుణాన్ని చెల్లించడమే తన ఉద్దేశమని కియోసాకి చెప్పారు. జీతంతో మాత్రమే అప్పులను తీర్చేందుకు శ్రమించే బదులు.. ఇతరుల నుంచి వచ్చే నగదు ప్రవాహం ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు.అయితే రుణంతో ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల వడ్డీ భారం, ఆస్తి విలువ తగ్గడం, అద్దె ఆదాయం రాకపోవడం వంటి ఆర్థిక నష్టాలు కూడా ఉండొచ్చన్న విషయాన్ని కియోసాకి ఈ పోస్టులో ప్రస్తావించలేదు. -
డబ్బు సమస్యలు తగ్గాలంటే?: కియోసాకి చెప్పిన సీక్రెట్
పెట్టుబడుల గురించి చెప్పే రాబర్ట్ కియోసాకి.. డబ్బు వల్ల వచ్చే సమస్యల గురించి వివరించారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.1973లో రిచ్ డాడ్ ఒక ప్రశ్న అడిగారని, దాన్ని తాను ఇప్పటికీ మర్చిపోలేదని చెబుతూ.. 'డబ్బుకు సంబంధించిన సమస్యలు రెండు రకాలు మాత్రమే ఉంటాయి' అని అన్నారు. ఒకటి 'డబ్బు సరిపోకపోవడం', మరొకటి 'డబ్బు మరీ ఎక్కువగా ఉండటం'. నేను రెండింటినీ చూస్తూ పెరిగానని కియోసాకి పేర్కొన్నారు.పూర్ డాడ్ ఎప్పుడూ సరిపడా డబ్బు లేదనే బాధతో ఉండేవారు. రిచ్ డాడ్ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం.చాలామంది జీవితంలో డబ్బు సరిపోకపోవడమే పెద్ద సమస్యగా ఉంటుంది. నెలవారీ ఖర్చులు, అప్పులు, పిల్లల చదువు, వైద్యం, ఇంటి అవసరాలు.. ఇలా ఎన్నో ఖర్చుల మధ్య సంపాదించిన డబ్బు సరిపోదని బాధపడుతుంటారు. కానీ మరోవైపు డబ్బు ఎక్కువగా ఉన్నవారికి దాన్ని ఎలా నిర్వహించాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా మరింత పెంచుకోవాలి అనే సమస్యలు ఉంటాయి. అంటే సమస్య ఇద్దరికీ ఉంది. కానీ సమస్య స్వభావం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.మన ఆలోచనలే ఆర్థిక ప్రపంచం!అయితే కియోసాకి మాత్రమే.. మన ఆలోచనలే మన ఆర్థిక ప్రపంచాన్ని నిర్మిస్తాయని అంటారు. అంటే మనం డబ్బును ఎలా చూస్తామో, దాని ఆధారంగానే మన నిర్ణయాలు మారుతాయి. ఎప్పుడూ నా దగ్గర డబ్బు లేదు, నాకు ఇది సాధ్యం కాదు, నా సంపాదనతో ఇవన్నీ చేయలేను అని ఆలోచించే వ్యక్తి అవకాశాల కంటే సమస్యలనే ఎక్కువగా చూస్తాడు. డబ్బు కొరతే తన జీవితంలో సహజమైన పరిస్థితి అని భావిస్తాడు.అదే వ్యక్తి.. నేను దీన్ని ఎలా సాధించగలను?, ఇంకా ఎక్కువ సంపాదించడానికి ఏం చేయాలి?, నా డబ్బును ఎలా పెంచుకోవాలి? అని ఆలోచించడం ప్రారంభిస్తే.. అతని దృష్టి సమస్య నుంచి పరిష్కారం వైపు మళ్లుతుంది. నాకు సాధ్యం కాదు అనే ఆలోచనకు బదులు ‘ఎలా సాధ్యం?’ అని ఆలోచిస్తే.. సమస్యలు తగ్గుతాయంటారు కియోసాకి.పోటీ ప్రపంచం..మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. మంచి ఉద్యోగం కోసం పోటీ, ప్రమోషన్ కోసం పోటీ, మంచి మార్కుల కోసం పోటీ.. ఇలా ప్రతి దశలోనూ ఇతరులతో పోల్చుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఆలోచన మారాలి. అంటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇతరులు పొందితే మనకు దక్కదని భావించకూడదు. ఒక అవకాశం దక్కకపోతే మరో అవకాశం ఉంటుందని, కొత్త మార్గాలను సృష్టించుకోవచ్చని ఆలోచించాలి.నిజమైన సంపదనిజమైన సంపద అనేది కేవలం బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుతోనే నిర్ణయించబడదు. మనకు వచ్చే ఆదాయాన్ని ఎలా నిర్వహిస్తున్నాం? ఎంత పొదుపు చేస్తున్నాం? ఎలా పెట్టుబడి పెడుతున్నాం? కొత్త ఆదాయ మార్గాలను ఎలా సృష్టించుకుంటున్నాం? వంటి అంశాలు కూడా ముఖ్యమే. అందుకే ఈ మొత్తం ఆలోచనలో ప్రధాన సందేశం.. బయటి ఆర్థిక పరిస్థితులను మార్చాలంటే ముందుగా డబ్బుపై మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. అయితే కేవలం సానుకూలంగా ఆలోచించడం వల్లే సంపద ఏర్పడదు. ఆలోచనతో పాటు ఆర్థిక జ్ఞానం, క్రమశిక్షణ, పొదుపు, సరైన పెట్టుబడులు, రిస్క్‌ను అర్థం చేసుకోవడం, నైపుణ్యాల అభివృద్ధి కూడా అవసరం. -
జాబ్ చేస్తున్నారా.. జాగ్రత్త! కియోసాకి హెచ్చరిక
ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ముఖ్యంగా ఏఐ, ఆటోమిషన్, సాఫ్ట్వేర్ వంటి టెక్నాలజీలు.. కంపెనీలు పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. గతంలో ఒక పని చేయడానికి వందల మంది ఉద్యోగులు అవసరమైతే, ఇప్పుడు అదే పనిని తక్కువ మంది వ్యక్తులతో లేదా కొన్ని సాఫ్ట్వేర్ సిస్టం సహాయంతో చేయగలుగుతున్నారు. ఈ మార్పు కంపెనీలకు ప్రయోజనం కలిగించవచ్చు. కానీ ఇదే సమయంలో ఉద్యోగుల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. ఈ విషయాన్ని కియోసాకి చెబుతున్నారు.కియోసాకి ప్రకారం.. మెటా కంపెనీ 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. కొన్ని రోజులకు సంస్థ స్టాక్ మార్కెట్ విలువ 50 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే ఇక్కడ పెట్టుబడిదారులు లాభపడ్డారు. కంపెనీలో కోసం కష్టపడిన ఎంతోమంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.అదే హెచ్చరించానుతమ రాత్రులు, వారాంతాలు, కుటుంబ సమయాన్ని త్యాగం చేసిన ఉద్యోగులకు ఆటోమేటెడ్ టెర్మినేషన్ ఈమెయిల్ వచ్చింది. ఇదే సమయంలో వాటాదారులు మరింత ధనవంతులయ్యారు. ఇది వ్యవస్థలో లోపం కాదు, వ్యవస్థ రూపొందించిన విధంగానే పనిచేస్తోంది. అందుకే నేను దశాబ్దాలుగా దీని గురించి హెచ్చరిస్తూనే ఉన్నాను. ఉద్యోగుల వర్గం ఎప్పుడూ ఒక ఉచ్చుగానే ఉండేదని కియోసాకి చెప్పారు.చాలామంది ఒక కంపెనీకి నిజాయితీగా పనిచేస్తే, కంపెనీ కూడా మనకు జీవితాంతం భద్రత ఇస్తుందని అనుకుంటారు. అందుకోసమే మంచి పర్ఫామెన్స్ ఇవ్వాలి, ప్రమోషన్స్ పొందాలి, జీతం పెంచుకోవాలి, రిటర్మెంట్ వరకు అదే విధంగా కొనసాగాలి అనేది సాధారణమైన ఆలోచన. కానీ ప్రస్తుత ప్రపంచంలో కంపెనీల అవసరాలు మారుతున్నాయి. మార్కెట్ పరిస్థితులు, ఆటోమిషన్, ఏఐ వంటి కారణాల వల్ల ఒకప్పుడు అవసరమైన ఉద్యోగం భవిష్యత్తులో అవసరం లేకపోవచ్చు.ఉద్యోగం చెడ్డది కాదు, కానీ..ఉద్యోగం చెడ్డది అని కాదు. ఉద్యోగం ఇప్పటికీ చాలా మందికి స్థిరమైన ఆదాయాన్ని, అనుభవాన్ని ఇస్తుంది. కానీ.. మన మొత్తం ఆర్థిక భవిష్యత్తును ఒక్క జీతంపైనే ఆధారపెట్టడం ప్రమాదకరంగా మారవచ్చు. ఉద్యోగంతో పాటు మనకు సొంతంగా ఉండే ఆస్తులు లేదా ఇతర ఆదాయ మార్గాలను కూడా నిర్మించుకోవడం తప్పనిసరి.ఏఐ, ఆటోమిషన్ ఈ మార్పును మరింత వేగవంతం చేస్తున్నాయి. ఒక కంపెనీ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్కువ పనిని తక్కువ ఖర్చుతో చేయగలిగితే, ఆ కంపెనీకి ప్రొడక్టివిటీ పెరగవచ్చు. దాని వల్ల ఏర్పడే అదనపు లాభం ఎక్కడికి వెళ్తుంది? అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. అది షేర్ హోల్డర్లకు వెళ్లవచ్చు, కంపెనీ విస్తరణకు ఉపయోగపడవచ్చు, కొత్త టెక్నాలజీలో పెట్టుబడి కావచ్చు. ఇక్కడ ఉద్యోగులు లాభపడేది ఏముంటుంది?.మీరు ఏ వైపు?రిచ్ డాడ్ పూర్ డాడ్ ప్రకారం.. పూర్ డాడ్ ఉద్యోగం మీద నమ్మకం ఉంచారు. విధేయతతో పనిచేశారు. రిచ్ డాడ్ ఎప్పుడూ వ్యవస్థను నమ్మలేదు. వ్యవస్థ తొలగించలేని ఆస్తులను ఆయన నిర్మించుకున్నాడు. ఉద్యోగం పోయినప్పుడు.. పూర్ డాడ్ ఇబ్బదులు ఎదుర్కొన్నారు. రిచ్ డాడ్ తాను నిర్మించుకున్న ఆస్తులతో ముందుకు సాగారు. మార్పు ఇప్పటికే మొదలైంది. ఇక మిగిలింది మీరు ఏ పక్షాన ఉన్నారనేదే ప్రశ్న అని కియోసాకి వెల్లడించారు.ఇదీ చదవండి: 'చరిత్రలో అతిపెద్ద క్రాష్ మొదలైంది': కియోసాకి హెచ్చరిక! -
ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకి
ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సామాజిక మాధ్యమం ఫేస్బుక్ వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణ ప్రజలు ఆస్తులుగా భావించే ఇల్లు, కార్లు అసలు ఆస్తులే కాదని, అవి జేబుల్లోంచి డబ్బులను గుంజే అప్పుల కుప్పలని ఆయన స్పష్టం చేశారు."మీరు ఉండే ఇల్లు ఆస్తి కాదు అని 1997లోనే నేను రాశాను. ఆ సమయంలో నా మాటలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పదేళ్లపాటు నన్ను తీవ్రంగా విమర్శిస్తూ మెయిల్స్ పంపారు. కానీ 2008 ఆర్థిక మాంద్యం దెబ్బకు లక్షల మంది సర్వస్వం కోల్పోయాక నా మాటల్లోని నిజం ప్రపంచానికి అర్థమైంది""మీ జేబులోకి డబ్బు తెచ్చిపెట్టేది 'ఆస్తి' (Asset). అదే మీ జేబులోంచి డబ్బును బయటకు తీసేది 'అప్పు' (Liability). ఇదే అసలైన సూత్రం. ఈ లెక్కన మీరుండే ఇల్లు, పూర్తిగా ఈఎంఐలు చెల్లించిన కారు కూడా అప్పు కిందకే వస్తాయి. ఎందుకంటే అవి మీ జేబు నుంచి నిర్వహణ ఖర్చులను గుంజుతాయి" కియోసాకి రాసుకొచ్చారు.ప్రతినెలా మీ ఖాతాలోకి నగదు ప్రవాహాన్ని (Cash Flow) తీసుకురానిది ఏదీ నిజమైన సంపద కాదని, అది కేవలం భద్రత అనే భ్రమను మాత్రమే కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం చేస్తూ, ఇల్లు కొనుక్కొని, 45 ఏళ్ల వయస్సులో చేతిలో తగినంత నగదు లేక ఇబ్బంది పడటానికి ఈ తప్పుడు ఆలోచనా విధానమే కారణమన్నారు.'త్రీ పిగ్గీ బ్యాంక్స్' ఫార్ములాతాను, తన భార్య కిమ్ కియోసాకి కలిసి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడానికి 'త్రీ పిగ్గీ బ్యాంక్స్' (Three Piggy Banks) అనే సూత్రాన్ని పాటించామని ఆయన వెల్లడించారు. వచ్చిన ప్రతి రూపాయిలోంచి బిల్లులు చెల్లించడానికి ముందే 10 శాతం పొదుపునకు (Savings), 10 శాతం పెట్టుబడికి (Investing), మరో 10 శాతం విరాళాలకు (Charity) కేటాయించేవాళ్లమని తెలిపారు.ఆ 10 శాతంతో పెట్టిన పెట్టుబడులే తమకు అసలైన ఆస్తులను తెచ్చిపెట్టాయని, ఆ ఆస్తుల ద్వారా వచ్చే రాబడితోనే తాము ఖర్చులు (Liabilities) వెచ్చించేవారమని చెప్పారు. జీతం డబ్బులతో ఖర్చులు పెట్టడానికి, ఆస్తులు తెచ్చిపెట్టే రాబడితో ఖర్చులు చేయడానికి మధ్య ఉన్న ఈ చిన్న తేడాయే చిన్న వయస్సులోనే రిటైర్మెంట్ సాధించడానికి కారణమవుతుందని కియోసాకి వివరించారు. -
పసిడి ధరలు.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక అనూహ్యమైన మార్పు వైపు ప్రయాణిస్తోంది. బంగారానికి ఉన్న డిమాండ్‌ను, ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ టి.కియోసాకి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారం పరుగు ఇంకా పూర్తికాలేదని, అసలు ఘట్టం ఇప్పుడే ప్రారంభమైందని ఆయన స్పష్టం చేస్తున్నారు.మానిటరీ పారిటీ ఫార్ములా విశ్లేషణఆర్థిక నిపుణుడు జిమ్ రిక్కార్డ్స్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ‘మానిటరీ పారిటీ ఫార్ములా’ను వివరిస్తూ.. బంగారం భవిష్యత్తు ధరపై అంచనాలను విశ్లేషించారు. తాను చెప్పిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ఇదివరకెన్నడూ లేని విధంగా తమ మునుపటి రికార్డు కంటే మూడింతల వేగంతో భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. ఆధునిక చరిత్రలో మొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త పసిడి గనులు లేదా నిల్వలు కనుగొనలేదు. ఒకవైపు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంటే సరఫరా మాత్రం స్తంభించిపోయింది.ప్రపంచ ద్రవ్య సరఫరా, వివిధ దేశాల వద్ద ఉన్న భౌతిక పసిడి నిల్వలను లెక్కించి అందులో కనీసం 40 శాతం ద్రవ్యానికి బంగారం మద్దతు ఇస్తే.. గణాంకాల ప్రకారం ఔన్స్(సుమారు 30 గ్రాములు) బంగారం అసలు విలువ రూ.25,89,000 (27,000 డాలర్లు)కు చేరాల్సి ఉంటుందని ఈ ఫార్ములా తేల్చిచెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ధరల సవరణ కేవలం ప్రారంభ దశలోనే ఉందని, క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఇది రెండో ఇన్నింగ్స్ మాత్రమేనని జిమ్ రిక్కార్డ్స్ పేర్కొన్నారు.పెట్టుబడిదారుల అపోహలు.. అవకాశాలుసాధారణ పెట్టుబడిదారులు బంగారం ధరలు తగ్గుతాయని వేచి చూడటం పెద్ద పొరపాటని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2010లో టెస్లా షేర్లు లేదా 2013లో బిట్‌కాయిన్ ధరలు తగ్గుతాయని వేచి చూసిన వారితో ప్రస్తుత పసిడి ఇన్వెస్టర్లను పోలుస్తున్నారు. వేచి చూసే ధోరణితో చివరకు మిగిలిన దాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
'చరిత్రలో అతిపెద్ద క్రాష్ మొదలైంది': కియోసాకి హెచ్చరిక!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చరిత్రలోనే అతిపెద్ద క్రాష్ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇంతకీ కియోసాకి ఈ మాటలు ఎందుకు అన్నారు? నిజంగా.. అతిపెద్ద క్రాష్ వస్తుందా?, అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' అనే పుస్తకంలోనే భవిష్యత్తులో మార్కెట్ క్రాష్ రావచ్చని హెచ్చరించారు. ఆర్థిక సంక్షోభం ఇప్పటికే యూరప్, జపాన్‌లో ప్రారంభమై.. క్రమంగా ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాపిస్తోందని కియోసాకి చెబుతున్నారు.సంక్షోభానికి కారణాలుకియోసాకి ప్రకారం.. ఆర్థిక సంక్షోభం రావడానికి అనేక ఆర్థిక, రాజకీయ సమస్యలు కారణమవుతున్నాయని సమాచారం. ఇందులో ఏఐపై అతిగా ఆధారపడటం, యుద్ధాలు.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అప్పులు, బేబీ బూమర్స్ పదవీ విరమణ ఉన్నాయి.రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నవారికి హెచ్చరికఅమెరికాలో 401(k), ఐఆర్ఏ.. ఆస్ట్రేలియాలో సూపర్‌యాన్యుయేషన్, కెనడాలో ఆర్ఆర్ఎస్పీ వంటి రిటైర్మెంట్ ఖాతాల్లో చాలామంది తమ డబ్బును స్టాక్స్, బాండ్లలో పెట్టుబడి పెడతారు. ఒకవేళ స్టాక్, బాండ్ మార్కెట్లు రెండూ తీవ్ర నష్టాలను చవిచూస్తే.. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వ్యక్తుల సంపదపై తీవ్ర ప్రభావం పడవచ్చని కియోసాకి హెచ్చరించారు.ప్రత్యేకంగా 40 ఏళ్లు దాటిన వారికి ఆయన జాగ్రత్త చెబుతున్నారు. ఎందుకంటే మార్కెట్ భారీగా పడిపోయినప్పుడు యువకులకు తిరిగి కోలుకోవడానికి సమయం ఉంటుంది. కానీ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వ్యక్తులకు సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వయసులో ఇబ్బదులు ఎదుర్కోకుండా ఉండాలని చెబుతున్నారు.గతంలో 25 ఏళ్లుఒక పెద్ద ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తరువాత.. దాని ప్రభావము కొన్ని సంవత్సరాల అలాగే ఉంటుంది. గత ఆర్థిక మాంద్యం 1929 నుంచి 1954 వరకు 25 సంవత్సరాల పాటు కొనసాగిందని కియోసాకి చెప్పారు.కియోసాకి సాధారణంగా తన సంపదను కేవలం నగదు, స్టాక్స్, బాండ్లలో ఉంచడం కంటే ఆదాయం వచ్చే ఆస్తులు కలిగి ఉండాలని చెబుతాడు. తాను వ్యక్తిగత వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, చమురు ఉత్పత్తి చేసే బావులు, బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెడతానికి వెల్లడించారు.సురక్షితమైన ఆస్తులు ఇవే!భవిష్యత్తులో ప్రభుత్వం, కేంద్ర బ్యాంకులు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పెద్ద మొత్తంలో కొత్త డబ్బును సృష్టిస్తే, సాధారణ కరెన్సీ విలువ తగ్గవచ్చు. అలంటి సమయంలో బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ను వంటివి సురక్షితమైన ఆస్తులుగా ఉంటాయని పేర్కొన్నారు.పెట్టుబడుల విషయంలో జాగ్రత్తఇక్కడ పెట్టుబడిదారులు తప్పకుండా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కియోసాకి చెప్పే ప్రతి విషయం ఖచ్చితంగా జరుగుతుందని భావించకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో క్రాష్ వస్తుందని చెప్పలేము. కాబట్టి ఆర్ధిక సంక్షోభం వస్తుందని భయపడి వెంటనే అన్ని పెట్టుబడులను అమ్మేయడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితిని పరిశీలించుకోవాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి.BIGGEST CRASH IN HISTORY has started.In 2002 I released RICH DADS PROPHECY. This book was written to prepare people to profit and not be victims of the biggest stock and bond market crash in history…. a crash that was still coming. In 2026, that crash started, in Europe…— Robert Kiyosaki (@theRealKiyosaki) September 15, 2026 -
బంగారం 80% డిస్కౌంట్‌తో కొనొచ్చా? కియోసాకి ఆసక్తికర పోస్ట్
బంగారం కొనుగోలు విషయంలో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లో ఉన్న ధరనే చెల్లిస్తుంటే.. కొన్ని కంపెనీలు మాత్రం అదే బంగారాన్ని భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేస్తున్నాయని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురూ, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర సుమారు 4,600 డాలర్లుగా ఉంటే.. కొన్ని సంస్థలు కేవలం 920 డాలర్లకే అదే బంగారాన్ని కొనుగోలు చేసే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆయన వెల్లడించారు.ఈ మేరకు రాబర్ట్ కియోసాకి తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. సాధారణ పెట్టుబడిదారులు స్పాట్ ధరకు బంగారం కొనుగోలు చేస్తున్నారని, అయితే మైనింగ్ రంగంలోని కొన్ని ప్రత్యేక కంపెనీలు ముందుగానే ఒప్పందాలు చేసుకుని భవిష్యత్‌లో లభించే బంగారాన్ని చాలా తక్కువ ధరకు పొందుతున్నాయని ఆయన వివరించారు.మైనింగ్ కంపెనీలతో ఒప్పందాలుకియోసాకి వివరించిన విధానం ప్రధానంగా గోల్డ్ స్ట్రీమింగ్ వ్యాపార నమూనాకు సంబంధించినది. ఒక గోల్డ్ మైన్ కొత్త ప్రాజెక్టును నిర్మించడానికి లేదా ఉన్న గనిని విస్తరించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరమైనప్పుడు.. స్ట్రీమింగ్ కంపెనీలు ముందుగానే ఆ మైనింగ్ సంస్థకు నిధులు అందిస్తాయి.దానికి ప్రతిఫలంగా, ఆ గనిలో భవిష్యత్‌లో ఉత్పత్తి అయ్యే బంగారంలో కొంత భాగాన్ని ముందుగా నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసే హక్కును స్ట్రీమింగ్ కంపెనీ పొందుతుంది. ఈ ఒప్పందాలు కొన్ని సందర్భాల్లో అనేక సంవత్సరాలు లేదా దశాబ్దాల పాటు కొనసాగుతాయని కియోసాకి తెలిపారు.అంటే.. బంగారం మార్కెట్ ధర ఎంత పెరిగినా, ఒప్పందంలో నిర్ణయించిన తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఆ కంపెనీకి ఉంటుంది. కియోసాకి ఉదాహరణ ప్రకారం, ఔన్సుకు 4,600 డాలర్ల మార్కెట్ ధర ఉన్నప్పుడు సుమారు 920 డాలర్లకు కొనుగోలు చేసే ఒప్పందం ఉంటే.. అది మార్కెట్ ధరతో పోలిస్తే దాదాపు 80 శాతం తక్కువ అవుతుంది.‘రిచ్ డాడ్’ విధానం ఇదేనా?ఈ విధానాన్ని కియోసాకి తనకు ఇష్టమైన ‘పూర్ డాడ్–రిచ్ డాడ్’ పోలికతో వివరించారు. సాధారణ పెట్టుబడిదారుడు రిటైల్ ధరకు బంగారం కొనుగోలు చేస్తుంటే.. ‘రిచ్ డాడ్’ తరహా పెట్టుబడిదారుడు నేరుగా బంగారం కొనడం కంటే, బంగారం ఉత్పత్తి చేసే సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రయోజనం పొందే విధానాన్ని ఎంచుకుంటారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒకప్పుడు తోపు రిచ్.. ఇప్పుడు టాప్ 10 కూడా దక్కలేదు!ఇది చట్టంలోని లొసుగు కాదని, మైనింగ్ పరిశ్రమలో ఇలాంటి ఒప్పందాలు బహిరంగంగా వెల్లడించే చట్టబద్ధమైన వ్యాపార విధానాలని కియోసాకి అన్నారు. చాలా కాలంగా ఈ విధానం కొనసాగుతున్నప్పటికీ.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మాత్రం వార్తల్లో కనిపించే బంగారం స్పాట్ ధరపైనే దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు. -
బంగారానికి పోటీగా రాగి? మళ్లీ ఆనాటి పరిస్థితులు..
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, రాగి ధరల కదలికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. సాధారణంగా బంగారం, రాగి ధరలు భిన్నమైన ఆర్థిక సంకేతాలను ఇస్తాయని కియోసాకి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పారిశ్రామిక డిమాండ్ కారణంగా రాగి ధర పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థపై నమ్మకం తగ్గినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపుతారని వివరించారు.అయితే ప్రస్తుతం బంగారం, వెండి, రాగి ధరలు ఒకేసారి పెరుగుతుండటం విస్మరించలేని పరిణామమని కియోసాకి అన్నారు. గతంలో 1978, 1998, 2006 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించాయని ఆయన తన పోస్ట్‌లో గుర్తుచేశారు. ఆ తర్వాత 1980 మార్కెట్ కల్లోలం, డాట్‌కామ్ బబుల్ పతనం, 2008 ఆర్థిక సంక్షోభం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం మాత్రమే కాదు.. నమ్మకం కోల్పోతున్నారా?బంగారం, వెండి, రాగి ధరలు ఒకేసారి పెరగడం కేవలం ద్రవ్యోల్బణానికి సంబంధించిన సంకేతం కాకపోవచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ ఆస్తులు, కరెన్సీలపై ప్రజలు గతంలో ఉన్నంత నమ్మకంతో లేకపోవడానికి ఇది సంకేతం కావచ్చని అన్నారు. స్టాక్స్, బాండ్లు, కరెన్సీలు అన్నీ ఒక రకంగా భవిష్యత్తుపై ఆధారపడిన ‘వాగ్దానాలు’ వంటివేనని, నమ్మకం తగ్గినప్పుడు పెట్టుబడులు హార్డ్ అసెట్స్ వైపు మళ్లే అవకాశం ఉందని వివరించారు.ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 2022, 2023 సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు ఒక్కో ఏడాది 1,000 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేశాయని కియోసాకి పేర్కొన్నారు. ఇది చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలు దశల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు.భయపడొద్దు.. సిద్ధంగా ఉండాలిప్రస్తుత పరిణామాలు మార్కెట్లు ‘పానిక్’లో ఉన్నాయని చెప్పడం లేదని, అయితే పెట్టుబడిదారులకు ‘సిద్ధంగా ఉండండి’ అనే సంకేతాన్ని ఇస్తుండవచ్చని కియోసాకి అన్నారు. బంగారానికి ప్రభుత్వ హామీ అవసరం లేదని, వెండికి కూడా ప్రభుత్వ వాగ్దానంపై ఆధారపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాగికి పారిశ్రామికంగా నిరంతర డిమాండ్ ఉందని తెలిపారు.ఈ పరిణామాలను అర్థం చేసుకునే వారు భయపడరని, భవిష్యత్తు కోసం ముందుగానే సిద్ధమవుతారని కియోసాకి చెప్పారు. ఆర్థిక స్థిరత్వాన్ని సహజంగా భావించకుండా, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేలా తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ముఖ్యమని సూచించారు. -
'ప్రాపర్టీ కొంటే చాలు' అనుకుంటున్నారా?.. కియోసాకి హెచ్చరిక ఇదే!
రియల్ ఎస్టేట్ ఎప్పుడూ.. పెడుతూనే ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ, ఇది అన్ని ప్రాంతాలకు వర్తించదని రాబర్ట్ కియోసాకి అంటున్నారు. దీనికి కారణం ఏమిటి?, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.రాబర్ట్ కియోసాకి ప్రకారం.. గతంలో జనాభా పెరుగుదల, తగ్గిన వడ్డీ రేట్లు, తక్కువ ఇన్సూరెన్స్ ఖర్చులు వంటి అంశాలు ప్రాపర్టీ మార్కెట్‌కు అనుకూలంగా ఉండేవి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి ఏ ప్రాపర్టీ కొన్నా భవిష్యత్తులో లాభమే వస్తుందని అనుకోవడం తప్పు.రియల్ ఎస్టేట్.. రెండు రకాలు!ప్రస్తుతం రియల్ ఎస్టేట్‌ను రెండు రకాలుగా చూడాలి. ఉద్యోగాలు, జనాభా, ఆదాయాలు పెరుగుతున్న మంచి ప్రాంతాల్లో ప్రాపర్టీలకు డిమాండ్ కొనసాగుతుంది. మరోవైపు.. జనాభా తగ్గుతున్న ప్రాంతాలు, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాపర్టీ విలువ పెరగకపోవచ్చు. ఇలాంటి ప్రాంతాల్లో ట్యాక్స్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ ఖర్చులు మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది.ప్రాపర్టీ అంటే కేవలం ఆస్తి కాదుఇల్లు లేదా భూమిని కొనుగోలు చేసిన తర్వాత దాని బాధ్యత కూడా మనదే. ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్, రిపేర్లు, మెయింటెనెన్స్ వంటి ఖర్చులను భరించాలి. ప్రాపర్టీ విలువ పెద్దగా పెరగకపోయినా.. ఈ ఖర్చులు పెరుగుతుంటే యజమానికి నెమ్మదిగా నష్టం రావచ్చు. అందుకే ప్రాపర్టీ కొనడం అంటే కేవలం పెట్టుబడి పెట్టడం కాదు.. దాని భవిష్యత్ బాధ్యతను కూడా తీసుకోవడం.పెద్ద ఇన్వెస్టర్లు ఏం చూస్తారు?పెద్ద పెట్టుబడిదారులు ప్రాపర్టీ కొనేటప్పుడు కేవలం 'ధర తక్కువగా ఉందా?' అని చూడరు. రాబోయే పదేళ్లలో ఈ ఆస్తికి డిమాండ్ ఉంటుందా, ఇన్సూరెన్స్ లభిస్తుందా, ట్యాక్స్‌లు ఎంత పెరుగుతాయి, అద్దె ఆదాయం ఎలా ఉంటుంది, అవసరమైనప్పుడు సులభంగా అమ్మగలమా వంటి విషయాలను పరిశీలిస్తారు. అంటే.. లాభం కంటే ముందు రిస్క్‌ను అర్థం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు.రియల్ ఎస్టేట్ ఇప్పటికీ సంపదను సృష్టించగల పెట్టుబడే. కానీ.. ఏ ప్రాపర్టీ అయినా సంపదను పెంచుతుందని నమ్మడం మాత్రం ప్రమాదకరం. సరైన ప్రాంతం, బలమైన డిమాండ్, భవిష్యత్ ఖర్చులు, రిస్క్‌లను అర్థం చేసుకుని పెట్టుబడి పెట్టాలి. -
వేల కోట్ల అప్పుల్లో ‘రిచ్ డాడ్’ రచయిత.. ఏం జరిగింది?
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత ఆర్థిక నిర్వహణపై భారీ ప్రభావం చూపిన రచయిత రాబర్ట్ కియోసాకి పేరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. కారణం.. ఆయన వెల్లడించిన 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,000 కోట్లకు పైగా) అప్పు. అయితే ఈ మొత్తం కియోసాకి వ్యక్తిగతంగా చెల్లించాల్సిన రుణం కాదని, ఆయన భాగస్వాములతో కలిసి నిర్వహిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సంబంధించినదని తాజా వివరాలు స్పష్టం చేస్తున్నాయి.కియోసాకి ఇటీవల ‘గెట్ రిచ్ ఎడ్యుకేషన్’ పోడ్కాస్ట్లో తాను సుమారు 1.2 బిలియన్ డాలర్ల అప్పులో ఉన్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆర్థిక విద్యపై పుస్తకాలు రాసిన వ్యక్తికే ఇంత భారీ అప్పు ఎలా సాధ్యమంటూ చర్చ మొదలైంది. అయితే ఆ మొత్తాన్ని ఆయన వ్యక్తిగత రుణంగా చూడటం తప్పుదారి పట్టించే విషయమని ఆయన మాజీ భార్య, దీర్ఘకాల వ్యాపార భాగస్వామి కిమ్ కియోసాకి వివరించారు.1,500 అపార్ట్మెంట్లకు సంబంధించిన రుణంవానిటీ ఫెయిర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిమ్ కియోసాకి తెలిపిన వివరాల ప్రకారం.. కియోసాకి, ఆయన భాగస్వాములు సుమారు 1,500 అపార్ట్మెంట్ యూనిట్లను కలిగి ఉన్నారు. ఈ ఆస్తులకు సంబంధించిన రుణాల మొత్తం దాదాపు 1.2 బిలియన్ డాలర్లు. అంటే మొత్తం అప్పు రియల్ ఎస్టేట్ ఆస్తులపై తీసుకున్న రుణం. అందులో కియోసాకి వ్యక్తిగత బాధ్యత చాలా తక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. వానిటీ ఫెయిర్ అంచనా ప్రకారం ఆయన వ్యక్తిగత వాటా సుమారు 30 మిలియన్ నుంచి 60 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని తెలిపింది.కియోసాకి ఈ విధానాన్ని తన ‘గుడ్ డెట్’ సిద్ధాంతానికి ఉదాహరణగా చూపిస్తున్నారు. సాధారణంగా అప్పును ఆర్థిక భారంగా భావిస్తే, కియోసాకి మాత్రం ఆదాయం తీసుకొచ్చే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించే రుణాన్ని భిన్నంగా చూస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ విలువ పెరిగినప్పుడు ఆ ఆస్తులపై మరింత రుణం తీసుకుని, వచ్చిన నిధులను ఇతర పెట్టుబడుల్లోకి మళ్లించడం ఆయన వ్యూహంలో కీలక భాగం.ఆస్తి విలువ పెరిగితే.. మళ్లీ అప్పుఉదాహరణకు ఒక రియల్ ఎస్టేట్ ఆస్తి విలువ పెరిగిందనుకుందాం. దాన్ని విక్రయించి లాభం పొందడం బదులు, పెరిగిన ఈక్విటీని ఆధారంగా చేసుకుని రుణం తీసుకోవచ్చు. ఆ డబ్బుతో మరో ఆదాయాన్ని సృష్టించే ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ఇలా ఒక ఆస్తి నుంచి వచ్చే విలువను మరో పెట్టుబడికి ఉపయోగిస్తూ పోర్ట్‌ఫోలియోను విస్తరించడం కియోసాకి మోడల్లో కనిపిస్తుంది. పెట్టుబడులను వేర్వేరు లిమిటెడ్ లయబిలిటీ కంపెనీల (LLC) ద్వారా నిర్మించడం ద్వారా ఒక్క ఆస్తిలో సమస్య ఏర్పడితే అది మిగిలిన పెట్టుబడులపై ప్రభావం చూపకుండా రిస్క్‌ను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తారు.‘నా వ్యూహాన్ని అనుసరించొద్దు’అయితే ఇక్కడే అసలు రిస్క్ కూడా ఉంది. ఆస్తుల ధరలు పెరుగుతున్న సమయంలో అధిక పరపతి (leverage) భారీ సంపదను సృష్టించగలిగినా.. మార్కెట్ పడిపోతే నష్టాలను కూడా అదే స్థాయిలో పెంచుతుంది. ఆస్తి విలువ తగ్గితే రుణం-ఆస్తి నిష్పత్తి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వడ్డీ రేట్లు పెరిగితే రీఫైనాన్సింగ్ ఖర్చులు కూడా భారమవుతాయి.ఈ కారణంగానే కియోసాకి స్వయంగా తన వ్యూహాన్ని అందరూ అనుసరించవద్దని హెచ్చరిస్తున్నారు. రుణాన్ని ఉపయోగించడం గురించి తాను 1974 నుంచే అధ్యయనం చేస్తున్నానని, అప్పును పెట్టుబడి సాధనంగా ఉపయోగించాలంటే సరైన అవగాహన అవసరమని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: ‘బంగారు’ లాభం! ఒక్క లక్ష.. 3.28 లక్షలైంది -
డబ్బు త్వరగా చేతికి రావాలంటే?..కియోసాకి పెట్టుబడి విధానం!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాను మూడు సెకన్లలో డబ్బు సంపాదించానని పేర్కొన్నారు. అదెలాగో కూడా వివరించారు.కియోసాకి ప్రకారం.. ఒక స్టాక్ పొజిషన్‌ను అమ్మి, ఆ నగదును ఖాతాలో జమ చేసుకోవడానికి 3 సెకన్ల సమయం పట్టింది. స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు అంత త్వరగా అందుతుంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే.. ఆస్తి విలువ పెరగడం ద్వారా సంపదను సృష్టించుకోవచ్చు. కానీ.. ఆ ఆస్తిని అమ్మాలంటే కొనుగోలుదారుడు దొరకాలి, బ్యాంక్ లోన్ ప్రక్రియ పూర్తవ్వాలి, ఇన్స్పెక్షన్, డాక్యుమెంటేషన్, క్లోజింగ్ వంటి ఎన్నో దశలు ఉంటాయి. కాబట్టి మన డబ్బు వెంటనే చేతికి రాదు.స్టాక్స్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మార్కెట్లో కొనుగోలు చేయడం, విక్రయించడం చాలా వేగంగా జరుగుతుంది. అందుకే కియోసాకి స్టాక్స్‌ను తన పెట్టుబడి వ్యూహంలో ఒక భాగం అని అన్నారు.స్టాక్స్‌లో పెట్టుబడులకు మూడు ముఖ్యమైన ప్రయోజనాలను కియోసాకి పేర్కొన్నారు.మొదటిది అందుబాటు ధర. రియల్ ఎస్టేట్‌లా భారీ మొత్తంలో డబ్బు అవసరం లేకుండానే.. చిన్న మొత్తంలోనే కొన్ని స్టాక్స్ కొనుగోలు చేసుకోవచ్చన్నమాట.రెండోది లిక్విడిటీ. అవసరమైనప్పుడు స్టాక్‌ను విక్రయించి డబ్బును త్వరగా పొందే అవకాశం ఉంటుంది.మూడోది వేగం. పెట్టుబడుల గురించి నేర్చుకోవడానికి సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదని, కొంతకాలం నేర్చుకున్న తర్వాత చిన్న మొత్తాలతో ప్రారంభించవచ్చు.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నిజమైన డబ్బు పెట్టుబడి పెట్టే ముందు సిమ్యులేటర్‌లో ప్రాక్టీస్ చేయవచ్చని కియోసాకి పేర్కొన్నారు. మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్న తర్వాతే.. అసలు డబ్బుతో ప్రారంభించడం మంచిది. ఉద్యోగంలో ఉంటే జీతం కోసం ఒక నిర్దిష్ట తేదీ వరకు ఎదురుచూడాలి. కానీ పెట్టుబడుల ద్వారా తమ డబ్బును వివిధ మార్గాల్లో పనిచేయించుకోవచ్చని ఆయన అభిప్రాయం. తాను స్టాక్స్ ద్వారా వేగంగా క్యాష్‌ఫ్లో సృష్టించి, ఆ డబ్బును ఇతర పెట్టుబడులు, ఆస్తులను పెంచుకోవడానికి ఉపయోగించానని చెబుతూ.. సరైన సమయం కోసం ఎదురుచూడటం కంటే, పెట్టుబడులపై అవగాహన పెంచుకుని క్రమంగా ముందుకు సాగడం ముఖ్యమని సూచిస్తున్నారు.పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు.. తప్పకుండా కొంత అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ లాభాలు మాత్రమే కాదు, భారీ నష్టాలు కూడా ఉంటాయి. సోషల్ మీడియా కథనాలు లేదా వీడియోలు చూసి.. పెట్టుబడులు పెడితే మాత్రం నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. రూ.4600 పెరిగిన బంగారం! -
రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం!
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ టి.కియోసాకి తన ఫేస్బుక్ ఖాతా వేదికగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై సంచలన విశ్లేషణ చేశారు. ప్రపంచం ఎదుర్కోబోయే తదుపరి ఆర్థిక సంక్షోభం గతంలో చూసిన రూపంలో ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అది నిశ్శబ్దంగా ఆర్థికంగా ప్రజలను నలిపేస్తుందన్నారు.కియోసాకి మాటల్లోనే ఆ విశ్లేషణఅందరూ తదుపరి ఆర్థిక సంక్షోభం 2008 నాటి పరిస్థితుల్లా ఉంటుందని భావిస్తున్నారు. మార్కెట్లలో తీవ్ర భయాందోళనలు, రాత్రికి రాత్రే బ్యాంకులు మూతపడటం వంటివి చూస్తామని అనుకుంటున్నారు. కానీ, ఈ తదుపరి ఆర్థిక సంక్షోభం అలా ఉండదు. ఇది చాలా నిశ్శబ్దంగా వస్తుంది. ఇది ప్రజల్లో ఒక రకమైన తీవ్రమైన అలసటలా అనిపిస్తుంది.ప్రజలు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. కాగితాలపై ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం మరింత వెనుకబడిపోతున్నారు. ఇది సాధారణ విషయం కాదు.. ఇదొక హెచ్చరిక సంకేతం. 60 శాతం మంది అమెరికన్లు ప్రతి నెలా వచ్చే జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం లేదు, అది ఒత్తిడికి గురవుతోంది. ఆ భారాన్ని అప్పుల ద్వారా మోస్తున్నారు. క్రెడిట్ కార్డులు, 'బై నౌ పే లేటర్' ఆఫర్లు, స్టూడెంట్ లోన్లు, మినిమమ్ పేమెంట్లు సమస్యలను పరిష్కరించవు. కేవలం బాధను వాయిదా వేస్తాయి. వాయిదా పడిన బాధ మాయమైపోదు, అది వడ్డీతో సహా పెరుగుతుంది.ఖర్చులకు రుణాలు..అందుకే ఈ సంక్షోభం నాటకీయంగా అనిపించదు. ఇది శాశ్వతమైన ఒత్తిడిలా, ఆర్థికంగా ఎటువంటి మిగులు లేని స్థితిలా మారుతుంది. ప్రజలు భయపడటం లేదు, అలసిపోతున్నారు. ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ప్రజలు భయపడినప్పుడు తిరుగుబాటు చేస్తారు. కానీ అలసిపోయినప్పుడు వ్యవస్థకు లొంగిపోతారు. వారేం చేస్తారు? వేరే దారి లేక మళ్లీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు. పిల్లల ఖర్చుల కోసం రుణాలు తీసుకుంటారు. అద్దె పెరిగినందుకు రెండో షిఫ్ట్ ఉద్యోగం చేస్తారు. ఆ క్రమంలో ఆర్థిక వ్యవస్థ భారీగా కూలిపోనక్కర్లేదు. అది చాలా నిశ్శబ్దంగా, సమర్థవంతంగా మీ శ్రమను పిండేస్తుంది.పొదుపు పెరగదు, అప్పు తగ్గదుఆర్థిక వ్యవస్థ కూలిపోవడానికి అలజడి అక్కర్లేదు. కోలుకునే అవకాశం లేకపోతే చాలు. పొదుపు పెరగదు, అప్పు తగ్గదు. కేవలం మీరు చేసే నిరంతర శ్రమకు ఫలితం తగ్గుతూ వస్తుంది. మీరు అనుభవిస్తున్నది ఇదే. రాబోయే సంక్షోభం సైరన్లతో రాదు, అది ఇప్పటికే మానసిక బర్నౌట్ రూపంలో మన ఇంట్లోకి వచ్చింది. దాన్ని మీరు సరైన సమయంలో గుర్తిస్తారా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న.ఇదీ చదవండి: కుప్పకూలిన బంగారు కొండ! -
రవ్వంత బంగారంతో భారీ ఇల్లు కొన్న కియోసాకి!
ప్రముఖ రచయిత, పెట్టుబడులపై అవగాహన కల్పించే రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం ప్రాధాన్యంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కియోసాకి.. తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన ఓ పోస్టులో తాను బంగారంతో 4.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.40 కోట్లకు పైగా) విలువైన ఇంటిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.ఇంటి ధర 4.5 మిలియన్ డాలర్లు కాగా, దాన్ని సొంతం చేసుకోవడం కోసం తాను వినియోగించిన బంగారాన్ని అప్పట్లో 4.5 లక్షల డాలర్ల కొన్నట్లు రాసుకొచ్చారు. అంటే తాను 4.5 లక్షల డాలర్లకే కొన్న బంగారంతో ఇప్పుడు 45 లక్షల డాలర్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశానన్నది ఆయన భావన. బంగారం విలువ ఎంతలా పెరిగిందో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.ఇది ఎలాంటి ఫోర్క్లోజర్ లేదా ప్రత్యేక డీల్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా తాను బంగారు నాణేలను పొదుపు చేస్తూ వచ్చానని, వాటి విలువ పెరగడంతో చివరకు ఆ బంగారాన్ని ఇంటి కొనుగోలుకు ఉపయోగించానని పేర్కొన్నారు.ప్రస్తుతం వెండి ఔన్సుకు 45 డాలర్లు, బంగారం ఔన్సుకు 3,500 డాలర్ల స్థాయిలో ఉన్నాయని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. అయితే తాను వెండిని ఔన్సుకు కేవలం ఒక డాలర్ ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేసి పొదుపు చేయడం ప్రారంభించానని చెప్పారు. సంప్రదాయ కరెన్సీపై ఆధారపడటానికి బదులుగా బంగారం, వెండి వంటి విలువైన ఆస్తులను కూడబెట్టుకోవడంపై తనకు నమ్మకం ఉందన్నారు.బ్యాంకులో డబ్బు దాచుకోవడం, కష్టపడి పనిచేయడం వంటి సంప్రదాయ ఆర్థిక సలహాలపై కూడా కియోసాకి విమర్శలు చేశారు. ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో కరెన్సీని ముద్రించడం వల్ల దాని విలువ క్రమంగా తగ్గుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగితపు డబ్బు విలువను కోల్పోతున్న సమయంలో బంగారం, వెండి వంటి ‘రియల్ మనీ’, రియల్ అసెట్స్‌లో పొదుపు చేయడం ప్రయోజనకరమని పేర్కొన్నారు.తాను ఏళ్లుగా బంగారాన్ని పొదుపు చేయడం వల్లే దాన్ని ఉపయోగించి భారీ విలువైన ఆస్తిని కొనుగోలు చేయగలిగానని కియోసాకి తెలిపారు. డాలర్లను పొదుపు చేయాలా, లేక బంగారం, వెండి వంటి విలువైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలా అనేది వ్యక్తిగత నిర్ణయమని తన పోస్టులో పేర్కొన్నారు. -
అప్పుల ఊబిలో అమెరికా?.. కియోసాకి చెప్పిన సంచలన నిజం
ప్రముఖ రచయిత, పెట్టుబడుల నిపుణుడు 'రాబర్ట్ కియోసాకి' చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశానికీ అప్పులు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అమెరికా, చైనా, జపాన్, ఫ్రాన్స్, భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా భారీ అప్పులను కలిగి ఉన్నాయి. అయితే.. ఒక దేశం ఎంత అప్పు తీసుకుంది అనేదాని కంటే, ఆ అప్పుపై ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తోంది? దాన్ని భరించే సామర్థ్యం ఎంత ఉంది? అనేదే అసలు విషయమని కియోసాకి చెబుతున్నారు.అమెరికా పరిస్థితి ఎందుకు భిన్నం?అమెరికా ప్రస్తుతం భారీగా అప్పులు కలిగి ఉంది. ఈ అప్పులపై ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన వడ్డీ కూడా భారీగా పెరుగుతోంది. కియోసాకి చెప్పిన లెక్కల ప్రకారం అమెరికా ఏడాదికి సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లను వడ్డీగా చెల్లిస్తోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తగా తీసుకునే అప్పుల ఖర్చు కూడా పెరుగుతుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై మరింత భారం పడుతుంది. అంటే పాత అప్పుల వడ్డీ చెల్లించేందుకే భారీ మొత్తంలో డబ్బు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అప్పు పెరిగితే ఏం జరుగుతుంది?అధిక రేట్లు అంటే అధిక వడ్డీ చెల్లింపులుఅధిక చెల్లింపులు అంటే పెద్ద లోటు అని అర్థంపెద్ద లోటు అంటే ఎక్కువ అప్పు చేయాల్సి రావడంఎక్కువ అప్పు అంటే ఎక్కువ రుణంఎక్కువ అప్పు అంటే ఎక్కువ వడ్డీకియోసాకి ప్రకారం.. ఒక రకమైన అప్పు చక్రంలా మారుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే ప్రభుత్వ వడ్డీ భారం పెరుగుతుంది. వడ్డీ చెల్లింపులు పెరగడంతో బడ్జెట్ లోటు ఎక్కువవుతుంది. ఆ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం మరింత అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కొత్త అప్పు పెరిగితే భవిష్యత్తులో చెల్లించాల్సిన వడ్డీ కూడా పెరుగుతుంది. ఇలా అప్పు.. వడ్డీ.. మరింత అప్పు.. మరింత వడ్డీ అనే చక్రం కొనసాగుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. -
1999 రిపీట్ అవుతుందా?.. మార్కెట్ క్రాష్ తప్పదా?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. ఏఐ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే భారీగా డబ్బు సంపాదించవచ్చని చాలామంది పెట్టుబడిదారులు నమ్ముతున్నారు. అయితే.. ఈ ఉత్సాహాన్ని చూసి రాబర్ట్ కియోసాకి 1999 నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు.అప్పట్లో ఇంటర్నెట్ కంపెనీలపై కూడా ఇలాగే భారీ అంచనాలు ఉండేవి. ఏఓఎల్, నెట్‌స్కేప్, పెట్స్ డాట్ కామ్ వంటి సంస్థలను భవిష్యత్తు కంపెనీలుగా భావించారు. కానీ.. కొంతకాలానికే డాట్‌కామ్ బబుల్ పేలడంతో అనేక కంపెనీల విలువలు కుప్పకూలాయి. పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు.జిమ్ రికార్డ్స్ ఏమంటున్నారు?ఆర్థిక విశ్లేషకుడు, రచయిత జిమ్ రికార్డ్స్ ప్రకారం.. ఏఐ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు, అధిక వాల్యుయేషన్లు ఏర్పడ్డాయని, ఇవి ఒక దశలో తీవ్రమైన దిద్దుబాటుకు దారితీయవచ్చని హెచ్చరించారు. ఏఐ రంగంలో సుమారు 1.4 ట్రిలియన్ డాలర్ల విలువకు ప్రమాదం ఉందని, పరిస్థితి తీవ్రంగా మారితే స్టాక్ మార్కెట్లో భారీ పతనం సంభవించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.ఎన్విడియాపైనా జాగ్రత్త అంటున్నారా?ఏఐ రంగంలో ప్రస్తుతం ఎన్విడియా వంటి కంపెనీలు అత్యంత కీలకంగా మారాయి. ఏఐ మోడళ్లకు అవసరమైన చిప్‌లకు భారీ డిమాండ్ ఉండటంతో కంపెనీపై పెట్టుబడిదారుల ఆసక్తి కూడా పెరిగింది. అయితే.. జిమ్ రికార్డ్స్ మాత్రం ఇలాంటి అధిక అంచనాలున్న కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఏఐ రంగంలో బబుల్ ఏర్పడితే కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అన్నారు. అందుకే మార్కెట్ పడిపోయినా.. తట్టుకోగల పెట్టుబడులపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది.1999తో పోలిక ఎందుకు?ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఏఐ నిజంగా ఉపయోగపడే టెక్నాలజీనా? అనే ప్రశ్న కాదు. అది ఇప్పటికే అనేక రంగాల్లో ఉపయోగపడుతోంది. కానీ ఆ టెక్నాలజీపై ఉన్న అంచనాలు, కంపెనీల షేర్ ధరలు వాటి వాస్తవ వ్యాపార ఫలితాల కంటే చాలా ముందుకు వెళ్లాయా? అన్నదే ప్రశ్న. 1999లో కూడా ఇంటర్నెట్ నిజమైన భవిష్యత్తే. కానీ ఆ పేరుతో వచ్చిన ప్రతి కంపెనీ విజయవంతం కాలేదు. చివరికి బబుల్ పేలినప్పుడు మంచి కంపెనీలు కూడా మార్కెట్ పతనానికి గురయ్యాయి. ఏఐ విషయంలోనూ ఇదే పరిస్థితి వస్తుందేమోనన్న భయమే ఇప్పుడు కొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.పెట్టుబడిదారులు ఏం చేయాలి?మార్కెట్ 80 శాతం పడిపోతుంది, 1.4 ట్రిలియన్ డాలర్లు ఆవిరవుతాయి వంటి అంచనాలను ఖచ్చితంగా జరగబోయే విషయాలుగా చూడాల్సిన అవసరం లేదు. ఇవి ఊహించి చేస్తున్న హెచ్చరికలు మాత్రమే. ఏఐ రంగం భవిష్యత్తులో మరింత పెద్దదయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఏ కంపెనీ షేరు ఎంత విలువకు ట్రేడవుతోంది, ఆ కంపెనీకి నిజంగా ఎంత ఆదాయం వస్తోంది, లాభాలు ఎలా ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి వంటి విషయాలను పరిశీలించడం ముఖ్యం.ఇదీ చదవండి: చాణక్య నీతి: ఈ 5 విషయాల కోసం ఖర్చు చేస్తే.. ఆర్థిక కష్టాలు తప్పవు! -
కియోసాకి హెచ్చరిక.. డాలర్‌పై ఆందోళన!
ప్రముఖ రచయిత, పెట్టుబడులపై అవగాహన కల్పించే రాబర్ట్ కియోసాకి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుండటం, డబ్బు సరఫరా పెరగడం, ద్రవ్యోల్బణం కొనసాగడం వంటి పరిణామాలు భవిష్యత్తులో డాలర్ విలువపై ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వాలు అవసరానికి మించి డబ్బును సృష్టించినప్పుడు.. కాలక్రమంలో ఆ కరెన్సీ కొనుగోలు శక్తి తగ్గుతుందని కియోసాకి అభిప్రాయపడుతున్నారు. గతంలో జర్మనీ, జింబాబ్వే, వెనిజులా వంటి దేశాల్లో చోటుచేసుకున్న తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులను దీనికి ఉదాహరణలుగా చూపిస్తూ.. చరిత్ర అబద్ధం చెప్పదని అన్నారు.డాలర్లు దాచుకుంటే..మన సంపద మొత్తాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవద్దన్నది కియోసాకి చెబుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే బ్యాంకులో ఉన్న డబ్బు సంఖ్య మారకపోయినా.. ఆ డబ్బుతో కొనగల వస్తువుల విలువ తగ్గిపోవచ్చు. అందుకే.. ఆదాయం ఇచ్చే ఆస్తులను కలిగి ఉండటం ముఖ్యమని ఆయన చెబుతున్నారు. అద్దె ఆదాయం వచ్చే ప్రాపర్టీలు, నగదు ప్రవాహం ఉన్న వ్యాపారాలు వంటి వాటిని ఆయన ఉదాహరణలుగా ప్రస్తావిస్తున్నారు.బంగారం, వెండి, బిట్‌కాయిన్ ఎందుకు?కియోసాకి చాలాకాలంగా బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వాలు అవసరమైనంత బంగారం లేదా వెండిని సులభంగా సృష్టించలేవని, అందువల్ల కరెన్సీ విలువ పడిపోయే సమయంలో ఇవి ప్రత్యామ్నాయ ఆస్తులుగా ఉపయోగపడవచ్చని ఆయన భావిస్తున్నారు. బిట్‌కాయిన్‌ను కూడా పరిమిత సరఫరా ఉన్న డిజిటల్ ఆస్తిగా చూస్తున్నారు.అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. బంగారం, వెండి, బిట్‌కాయిన్ లేదా రియల్ ఎస్టేట్ ఎప్పుడూ పెరుగుతాయని చెప్పలేం. వీటి ధరల్లో కూడా భారీ హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కాబట్టి కియోసాకి సూచనలను పెట్టుబడి హామీగా కాకుండా.. వైవిధ్యమైన ఆర్థిక ప్రణాళిక అవసరమనే కోణంలో చూడటం మంచిది.కియోసాకి సందేశంలో అసలు హైలైట్ “Hope is not a strategy” అనే మాట. అంటే భవిష్యత్తులో అంతా బాగానే జరుగుతుందని ఆశిస్తూ కూర్చోవడం కంటే.. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా ముందుగానే సిద్ధంగా ఉండాలని ఆయన చెబుతున్నారు. ఒకే ఉద్యోగం లేదా ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా అదనపు ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని, సంపదను వివిధ రకాల ఆస్తుల్లో విభజించుకోవాలని సూచిస్తున్నారు.డాలర్ నిజంగానే కుప్పకూలుతుందా?ఇక్కడ కాస్త జాగ్రత్తగా చూడాల్సిన అంశం ఉంది. డాలర్ తప్పకుండా కుప్పకూలుతుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అనేది నిర్ధారిత వాస్తవం కాదు. అది కియోసాకి వ్యక్తిగత అంచనా మాత్రమే.అమెరికా ఆర్థిక వ్యవస్థ, డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉన్న స్థానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయడం అంత సులభం కాదు. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాబట్టి సంపాదించడం మాత్రమే కాకుండా, సంపదను ఎలా కాపాడుకోవాలి, ఆదాయానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా సృష్టించుకోవాలి అనే దానిపై కూడా ముందుగానే ఆలోచించాలని కియోసాకి ఉద్దేశం.ఇదీ చదవండి: ట్రంప్ సర్కార్ కొత్త ప్లాన్.. భారతీయులకు భారీ షాక్? -
కేంద్ర బ్యాంకులు భయపడుతున్నాయ్: కియోసాకి
కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్‌లో బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) నివేదికను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేస్తోందని కియోసాకి పేర్కొన్నారు. జూలై 28న BIS విడుదల చేసిన విశ్లేషణలో.. ఏఐ ఒకేసారి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, సరఫరా రెండింటినీ ప్రభావితం చేయడం వల్ల సాధారణ ఆర్థిక సంకేతాలు స్పష్టత కోల్పోతున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నట్లు ఆయన వివరించారు. దీంతో ఆర్థిక వ్యవస్థలో అసలు పరిస్థితులను అంచనా వేయడం, దానికి అనుగుణంగా ద్రవ్య విధానాన్ని నిర్ణయించడం కేంద్ర బ్యాంకులకు కష్టతరమవుతోందని తెలిపారు.దీన్ని కియోసాకి తనదైన శైలిలో విశ్లేషించారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినా, తగ్గించినా వాటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపించడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అయితే ఏఐ వేగవంతమైన మార్పుల కారణంగా ఈ ‘లాగ్’ తగ్గిపోతోందని పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకులు నిర్ణయం తీసుకునేలోపే ఏఐ కారణంగా మార్కెట్లు, వ్యాపార కార్యకలాపాలు వేగంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు.డేటా సెంటర్లు, చిప్‌లపై భారీ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థలో వేడి పెరుగుతోందన్న సంకేతాలుగా కనిపించవచ్చని, అయితే అవి భవిష్యత్ ఉత్పాదకతను పెంచే దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా కావచ్చని కియోసాకి వివరించారు. అదే సమయంలో ఏఐ ద్వారా ఉత్పాదకత పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉన్న డిమాండ్ ఒత్తిళ్లు బయటకు కనిపించకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఫలితంగా ద్రవ్యోల్బణ పరిస్థితులను అంచనా వేయడం మరింత కష్టమవుతుందని పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని కూడా ఏఐ కొంతమేర సమతుల్యం చేస్తోందని కియోసాకి అన్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ, ఏఐ ఆధారిత పెట్టుబడులు, ఉత్పాదకత వంటి అంశాలు ఆ ప్రభావాన్ని కొంతమేర ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.‘పాలసీ మిస్క్యాలిబ్రేషన్’ అంటే విధాన నిర్ణయాలు తప్పుగా ఉండే ప్రమాదం పెరగడమేనని కియోసాకి వ్యాఖ్యానించారు. కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ఉపయోగించే కాలవ్యవధి, ఆలస్యం వంటి అంశాలపై ఏఐ ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.తన ‘రిచ్ డాడ్’ చెప్పిన మాటలను కూడా కియోసాకి ఈ సందర్భంగా గుర్తుచేశారు. డబ్బును నియంత్రించే వ్యక్తులకే అది ఎలా పనిచేస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడినప్పుడే అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక సమయం మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం అలాంటి దశలోనే ఉందేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. -
డాలర్లు వస్తున్నాయ్.. జాగ్రత్త!
అమెరికా మరోసారి క్వాంటిటేటివ్ ఈజింగ్ (QE) పేరుతో డాలర్లను ముద్రించేందుకు సిద్ధమవుతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అమెరికా ట్రెజరీ తీసుకునే ఇలాంటి చర్యలతో డాలర్ కొనుగోలు శక్తిని సూచించే డీఎక్స్‌వై (DXY) సూచీ పడిపోతుందని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.డాలర్లలో పొదుపు చేసుకునే వారే అధికంగా నష్టపోతారని కియోసాకి హెచ్చరించారు. ఆర్థికంగా అవగాహన ఉన్న పెట్టుబడిదారులు విలువ పెరిగే బంగారం, వెండి, బిట్‌కాయిన్, కొంత రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి సంపదను పెంచుకుంటారని చెప్పారు. ఆర్థిక పరిజ్ఞానం లేని వారు విలువ కోల్పోయే ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్‘ఆర్థిక విద్య ఖరీదైనదని మీరు భావిస్తే.. ఆర్థిక అజ్ఞానానికి చెల్లించే మూల్యం ఎంత?’ అని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కియోసాకి గుర్తుచేశారు. ఆర్థిక విద్య కోసం వెచ్చించే సమయం, డబ్బు కంటే.. ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల సంపాదించలేని డబ్బే అతిపెద్ద ఖర్చు అని తన ‘రిచ్ డాడ్’ చెప్పేవారని ఆయన పేర్కొన్నారు.PRINTING MORE FAKE $US Treasury announces another round of QE (Quantatative Easing) aka printing fake $.DXY (index of purchasing power of dollars) CRASHES, which means INFLATION Booms….which means savers of fake $ are the biggest losers.Don’t be a Loser.As stated in my…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 22, 2026 -
బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ భారీగా పుంజుకుని ఔన్సుకు 4,400 డాలర్ల స్థాయిని దాటడంపై ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి స్పందించారు. బంగారంలో పెట్టుబడి పెట్టాలని తాను ఏళ్లుగా చెబుతున్నానని పేర్కొంటూ తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు చేశారు.ప్రస్తుతం బంగారం ధర 4,400 డాలర్ల స్థాయిలో ఉండటాన్ని ప్రస్తావించిన కియోసాకి.. ఈ సంఖ్య వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఇటీవల భారీ పతనం తర్వాత బంగారం మళ్లీ పుంజుకుందని, ఆగస్టులోనే ధర సుమారు 9 శాతం పెరిగిందని రాయిటర్స్ నివేదించింది. ఆగస్టు 19న స్పాట్ గోల్డ్ 4,487.91 డాలర్లకు చేరగా, 20న లాభాల స్వీకరణతో 4,484.95 డాలర్లకు తగ్గింది.యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి కీలకంబంగారం పెరుగుదలకు ప్రధాన కారణాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఒకటని కియోసాకి పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న పరిస్థితులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు వంటి పరిణామాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతున్నాయని తెలిపారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో పెట్టుబడులు సాధారణంగా సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మళ్లుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాయిటర్స్ కూడా ఇరాన్ యుద్ధం, చమురు సరఫరా ఆందోళనలు బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ప్రభావంఅమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని కియోసాకి వివరించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గితే ఫెడ్ వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం తగ్గుతుందన్న అంచనాలు బంగారానికి మద్దతు ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఆగస్టులో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు అనుగుణంగా రావడంతో సెప్టెంబరులో రేట్ల పెంపు అవకాశాలు తగ్గుతాయన్న అంచనాలు పెరిగి బంగారం 4,400 డాలర్లకు పైగా వెళ్లింది.అప్పులు కూడా కారణమే..అమెరికా ప్రభుత్వ రుణభారం, భారీగా పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం కూడా బంగారానికి అనుకూలంగా మారుతున్నాయని కియోసాకి అన్నారు. ప్రభుత్వాలు తమ ఖర్చులను నియంత్రించలేనప్పుడు, కరెన్సీ విలువపై ఆందోళనలు పెరిగినప్పుడు బంగారం ప్రాధాన్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక రుణాల బైబ్యాక్ కార్యక్రమాన్ని పెంచనున్నట్లు ప్రకటించిన తర్వాత బాండ్ ఈల్డ్స్, డాలర్‌పై ప్రభావం పడటంతో బంగారం ధర ఒక్క రోజులో 4 శాతానికి పైగా పెరిగింది.కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లను ప్రస్తావించిన కియోసాకిప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం తన వాదనకు కీలక ఆధారమని కియోసాకి పేర్కొన్నారు. చైనా, భారత్, పోలాండ్, టర్కీ, సింగపూర్ వంటి దేశాలు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని ఆయన తెలిపారు. రాయిటర్స్ ప్రకారం, తాజా దశలో కేంద్ర బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి బంగారంపై డిమాండ్ తిరిగి పెరుగుతోంది.‘బంగారం పెట్టుబడి కాదు.. డబ్బు’తాను ఔన్సు బంగారం 300 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేశానని కియోసాకి తెలిపారు. అలాగే చౌకగా ఉన్నప్పుడు వెండిని, బిట్‌కాయిన్‌ను 6,000 డాలర్ల వద్ద కొనుగోలు చేశానని చెప్పారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి పరిమిత సరఫరా ఉన్న ఆస్తులపై తనకు దీర్ఘకాలిక నమ్మకం ఉందన్నారు.“బంగారం పెట్టుబడి కాదు.. డబ్బు. నిజమైన డబ్బు” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కియోసాకి.. పేపర్ కరెన్సీల విలువ కాలక్రమంలో ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గింపు వంటి కారణాలతో దెబ్బతింటుందని అన్నారు. బంగారం మాత్రం వేల సంవత్సరాలుగా విలువను నిలబెట్టుకుంటూ వస్తోందని పేర్కొన్నారు. -
అందుకే.. అప్పు చేసి ఆస్తులు కొంటున్న కియోసాకి!
డబ్బు సంపాదించడం, దాన్ని పొదుపు చేయడం, ఆ తర్వాత పెట్టుబడి పెట్టడం.. సాధారణంగా మనం సంపదను పెంచుకునే విధానం ఇదే. కానీ ప్రముఖ రచయిత, 'రిచ్ డాడ్, పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మాత్రం డబ్బు, అప్పులు, పెట్టుబడుల విషయంలో కొంచెం భిన్నంగా ఆలోచిస్తారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. అప్పు తీసుకోవడం అనేది అన్ని వేళలా చెడ్డ విషయం కాదు. ఆ అప్పును సరైన విధంగా ఉపయోగించి ఆదాయం తెచ్చే ఆస్తులను కొనుగోలు చేస్తే.. అదే అప్పు సంపదను పెంచే సాధనంగా మారవచ్చని చెబుతున్నారు.అప్పు ఎప్పుడూ చెడ్డది కాదు!సాధారణంగా అప్పు అంటే మనకు ఆర్థిక భారం అనే భావన ఉంటుంది. అయితే.. కియోసాకి మాత్రం అప్పును దేనికోసం ఉపయోగిస్తున్నామనే కోణంలో చూడాలని చెబుతున్నారు. మన దగ్గర నుంచి డబ్బును తీసుకెళ్లే వస్తువుల కోసం తీసుకునే అప్పు ఒక రకం అయితే.. భవిష్యత్తులో ఆదాయం తెచ్చే ఆస్తులను కొనుగోలు చేయడానికి తీసుకునే అప్పు మరో రకం.ఉదాహరణకు అద్దె వంటి ఆదాయం వచ్చే ఒక ప్రాపర్టీని కొనడానికి లోన్ తీసుకున్నామని అనుకుందాం. ఆ ప్రాపర్టీ నుంచి వచ్చే అద్దె ద్వారా కొంతవరకు లోన్ చెల్లించవచ్చు. భవిష్యత్తులో ఆ ప్రాపర్టీ విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పెట్టుబడిని కియోసాకి సంపదను సృష్టించే మార్గంగా చూస్తారు.అదే సమయంలో.. ఆదాయం తీసుకురాని ఖరీదైన వస్తువుల కోసం భారీగా అప్పు చేస్తే, అది మనపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. అందుకే అప్పు తీసుకున్నామా లేదా అన్నదానికంటే, ఆ అప్పును ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేదే ముఖ్యమని కియోసాకి చెబుతారు.ఫెరారీ, రోల్స్ రాయిస్ కూడా లయబిలిటీలేకియోసాకి తన వద్ద ఉన్న ఫెరారీ, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లను ఉదాహరణగా చెబుతారు. అవి పూర్తిగా చెల్లించేసిన వాహనాలే అయినప్పటికీ.. తన దృష్టిలో అవి ఆస్తులు కావని, లయబిలిటీలని ఆయన అంటారు.దీనికి కారణం చాలా సింపుల్. ఒక కారు మనకు ఆదాయం తీసుకురాకపోతే.. దాని కోసం ఇంధనం, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ వంటి ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అంటే.. ఆ కారు మన జేబులోకి డబ్బు తీసుకురావడం కంటే.. మన దగ్గర నుంచి డబ్బును తీసుకుంటుంది. కియోసాకి చెప్పే ఆస్తి, లయబిలిటీ మధ్య తేడా ఇదే.డబ్బుపై కంటే బంగారం, వెండిపై నమ్మకంకియోసాకి అమెరికా డాలర్ విషయంలో కూడా చాలాకాలంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కాలంలో డాలర్‌ను బంగారంతో అనుసంధానించే విధానం ముగిసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తుంటారు.అందుకే.. తన సంపాదనలో కొంత భాగాన్ని నగదుగా ఉంచుకోవడం కంటే బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తానని చెబుతారు. ద్రవ్యోల్బణం కారణంగా కాలక్రమంలో నగదు కొనుగోలు శక్తి తగ్గే అవకాశం ఉందని భావించే కియోసాకి.. బంగారం, వెండిని దీర్ఘకాలిక ఆస్తులుగా చూస్తారు.1.2 బిలియన్ డాలర్ల అప్పు ఎందుకు?కియోసాకి తనపై సుమారు 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11 వేలకోట్లు) అప్పు ఉందని కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఆ అప్పును తాను ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించానని వివరించారు. అంటే ఆయన వ్యూహం ప్రకారం.. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని, ఆ డబ్బుతో ఆదాయం తెచ్చే ఆస్తులను కొనుగోలు చేయాలి. ఆ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం ద్వారా సంపదను పెంచుకోవాలి. ఈ విధానాన్ని ఆయన పెట్టుబడుల్లో 'లీవరేజ్'గా చూస్తారు.అయితే.. ఇలాంటి వ్యూహంలో రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి విలువ తగ్గినా, ఆదాయం అనుకున్నంతగా రాకపోయినా.. అప్పు మాత్రం చెల్లించాల్సిందే. కాబట్టి కియోసాకి విధానం ప్రతి ఒక్కరికీ సరిపోతుందని చెప్పలేం.రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం!కియోసాకి పెట్టుబడి వ్యూహంలో రియల్ ఎస్టేట్‌కు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. మంచి ప్రదేశంలో కొనుగోలు చేసిన ప్రాపర్టీ నుంచి అద్దె రూపంలో నిరంతర ఆదాయం రావడంతో పాటు.. భవిష్యత్తులో దాని విలువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.ఈ రెండు కారణాల వల్ల రియల్ ఎస్టేట్‌ను ఆయన సంపదను నిర్మించే ముఖ్యమైన ఆస్తిగా చూస్తారు. అయితే ప్రాపర్టీ పెట్టుబడుల్లో కూడా లోన్ వడ్డీ, నిర్వహణ ఖర్చులు, పన్నులు, ఖాళీగా ఉండే కాలం, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.బంగారం, వెండి, బిట్‌కాయిన్‌పై ఆసక్తిరియల్ ఎస్టేట్‌తో పాటు కియోసాకి బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ తగ్గే పరిస్థితుల్లో బిట్‌కాయిన్‌ను ప్రత్యామ్నాయ ఆస్తిగా ఆయన చూస్తారు. వెండిని కూడా దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తారు. బంగారంతో పోలిస్తే వెండి ధర తక్కువగా ఉండటంతో పాటు పారిశ్రామిక అవసరాలు కూడా ఉండటం వల్ల భవిష్యత్తులో దానికి డిమాండ్ కొనసాగుతుందని ఆయన అభిప్రాయం.మొత్తం మీద రాబర్ట్ కియోసాకి చెప్పే అంశం ఏమిటంటే.. డబ్బును కేవలం దాచుకోవడం కాకుండా, అది మన కోసం పనిచేసేలా చేయడం. జీతం లేదా వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా.. భవిష్యత్తులో ఆదాయం తెచ్చే ఆస్తులను కొనుగోలు చేయాలని ఆయన సూచిస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అప్పు తీసుకుని పెట్టుబడి పెడితే, లాభాలే కాదు.. నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. అధిక వడ్డీ రేట్లు, మార్కెట్ పతనం లేదా పెట్టుబడి నుంచి ఆదాయం రాకపోవడం వంటి పరిస్థితుల్లో అప్పు పెద్ద భారంగా మారే అవకాశం ఉంది. కియోసాకి ఆలోచనలోని అసలు పాఠం అప్పు చేయడం కాదు.. అప్పును తెలివిగా ఉపయోగించడం, ఆదాయం తెచ్చే ఆస్తులను నిర్మించుకోవడం, రిస్క్‌ను అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టడం. సంపదను నిర్మించుకోవడంలో డబ్బు ఎంత సంపాదిస్తున్నామన్నదే కాకుండా.. సంపాదించిన డబ్బుతో ఎలాంటి ఆస్తులను సృష్టిస్తున్నామన్నదే ముఖ్యం. -
అమెరికా అప్పులు.. కియోసాకి సంచలన వ్యాఖ్యలు!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో డబ్బు విలువ తగ్గే అవకాశం ఉందని, అందుకే బంగారం, వెండి వంటి ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.అమెరికా అప్పులుఅమెరికా అప్పు త్వరలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని కియోసాకి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తే.. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అప్పులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే.. చేతిలో ఉన్న డబ్బు విలువ తగ్గుతుంది. ఇది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.బంగారం, వెండి భారీగా పెరుగుతాయా?కియోసాకి తనకు తెలిసిన ఆర్థిక నిపుణుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు బంగారం, వెండి ధరలపై భారీ అంచనాలు వేస్తున్నారని చెప్పారు. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బంగారం ధర ఔన్సుకు 10,000 డాలర్లకు చేరొచ్చన్న అంచనాలను ఆయన ప్రస్తావించారు. అయితే.. ఇవి ఖచ్చితమైన ధరలు కావు. కొందరు నిపుణులు చేస్తున్న అంచనాలు మాత్రమే. మార్కెట్ పరిస్థితులు మారితే ఈ అంచనాలు కూడా మారవచ్చు.కియోసాకి బంగారం, వెండి రెండింటినీ ప్రస్తావించినప్పటికీ.. 2026 ఆగస్టులో తనకు మాత్రం వెండే మంచి ఎంపికగా కనిపిస్తోందని కియోసాకి చెప్పారు. వెండికి ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం పెట్టుబడి లోహం మాత్రమే కాదు. సౌర విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఇతర పారిశ్రామిక రంగాల్లో కూడా వెండిని ఉపయోగిస్తారు. దీంతో భవిష్యత్తులో పారిశ్రామిక డిమాండ్ పెరిగితే వెండికి అదనపు మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు.$40 TRILLION US NATIONAL soon!!Q: What are you doing about it?Friends who are much smarter than me, such as Jim Rickards are predicting $200 an ounce for silver and $10,000 an ounce gold soon.Of the two…. I think silver is the best choice in August 2026.Q: What do you…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 15, 2026 -
అది పసిడి మెరుపు కాదు.. డాలర్ పతనమే..
అమెరికా డాలర్ విలువ, బంగారం ధరలపై ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు చేసిన ఆయన.. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బంగారం ప్రమాణాన్ని (గోల్డ్ స్టాండర్డ్) నిలిపివేసిన పరిణామాలను ప్రస్తావించారు. అప్పటి నుంచి డాలర్ కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు.1971లో ఒక ఔన్స్ బంగారం విలువ 35 డాలర్లు ఉండేదని, ప్రస్తుతం అది 4,342 డాలర్లకు చేరిందని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. అంటే బంగారం ధర 124 రెట్లు పెరిగిందని చెప్పారు. అయితే ఇది బంగారం విలువ పెరగడం కంటే.. డాలర్ కొనుగోలు శక్తి భారీగా క్షీణించడాన్ని సూచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.‘రిచ్ డాడ్’ తనకు 21 ఏళ్ల వయసులో డాలర్ గురించి చెప్పిన విషయాన్ని కూడా కియోసాకి గుర్తు చేసుకున్నారు. నిక్సన్ ఒక్క రాత్రిలో డాలర్‌ను విలువ తగ్గించలేదని, అప్పటికే దాని విలువ తగ్గిపోయిందనే విషయాన్ని మాత్రమే వెల్లడించారని తన ‘రిచ్ డాడ్’ చెప్పేవారని పేర్కొన్నారు. అప్పట్లో ఈ పరిణామాలను గమనించిన వారు భూములు, చమురు, గనులు వంటి హార్డ్ అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టారని, ఇతరులు బ్యాంకు ఖాతాల్లో పొదుపు చేసి కొనుగోలు శక్తిని కోల్పోయారని వ్యాఖ్యానించారు.బంగారం కొనుగోలు గురించి అందరూ మాట్లాడుతున్నప్పటికీ, వాస్తవంగా కొద్దిమందే పెట్టుబడి పెడుతున్నారని కియోసాకి అన్నారు. నాణేలు లేదా గోల్డ్ ఆధారిత పెట్టుబడి సాధనాల కంటే బంగారం ఉత్పత్తి చేసే గనుల్లో యాజమాన్య వాటా కలిగి ఉండటమే మెరుగైన వ్యూహమని తన ‘రిచ్ డాడ్’ సూచించేవారని చెప్పారు.ఈ నేపథ్యంలో ‘క్యాపిటల్ క్లబ్’ పేరుతో ఒక ప్రైవేట్ పెట్టుబడి వేదిక గురించి కూడా కియోసాకి తన పోస్టులో ప్రస్తావించారు. నాలుగు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బంగారం, వెండి మైనింగ్ కంపెనీలో ప్రీ-పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా పెట్టుబడి అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కొలరాడో, ఘనా, దక్షిణాఫ్రికా, పపువా న్యూ గినియాలో కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ ప్రైవేట్ రౌండ్లో ఇప్పటికే సగానికి పైగా పెట్టుబడులు సమీకరించబడ్డాయని, తదుపరి అవకాశం ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని కియోసాకి తెలిపారు. అయితే ప్రైవేట్ పెట్టుబడులు, మైనింగ్ కంపెనీల్లో వాటాలు వంటి అంశాల్లో అధిక రిస్క్ ఉండొచ్చన్న విషయాన్ని పెట్టుబడిదారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
కియోసాకి ప్రశ్న.. ఘాటుగా స్పందించిన నెటిజన్లు!
తరచుగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి, తాజాగా ఉద్యోగ జీవితం గురించి చెప్పారు. ''జీవితం అంటే కేవలం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పని చేసి, నెలాఖరులో జీతం తీసుకోవడమేనా?'' అని ప్రశ్నించారు.చాలామంది చిన్నప్పటి నుంచి ఒకే విధమైన మార్గంలో వెళ్తుంటారు. చదువు.. ఉద్యోగం.. జీతం.. ఖర్చులు.. మళ్లీ ఉద్యోగం. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. మనం డబ్బు సంపాదిస్తున్నాం, కుటుంబాన్ని చూసుకుంటున్నాం, బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. కానీ ఒక సమయంలో మనల్ని మనమే ''నేను అసలు ఎందుకు ఇలా జీవిస్తున్నాను? నా జీవితానికి అర్థం ఏమిటి?'' అని బహుశా ఆలోచించకపోవచ్చు.ఇదే విషయాన్ని కియోసాకి చెబుతూ.. నేను పని చేస్తున్నానంటే, అది ''కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రం కాదు. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి చేస్తున్నా'' అని పేర్కొన్నారు. అంటే మనం చేసే పని మనకు డబ్బు మాత్రమే కాకుండా, ఒక సంతృప్తిని, ఒక ఉద్దేశ్యాన్ని కూడా ఇవ్వాలని ఆయన ఉద్దేశ్యం.కియోసాకి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. కొందరు ఆయన మాటలతో ఏకీభవించినప్పటికీ.. మరికొందరు వ్యతిరేకించారు.చాలామంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించడం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అని అన్నారు. జీవిత లక్ష్యం అంటే ఏదో పెద్ద విజయం సాధించడంలో దొరకదు. కొన్నిసార్లు, ఒక సాధారణ పనిని నిలకడగా, చక్కగా చేయడంలో కూడా అది లభిస్తుందని ఇంకొందరు అన్నారు.9 to 5 for just $?Found it interesting my last X had so few loves relative to number of views.My previous X was dedicated to working to fulfill your spirit’s mission…your life’s purpose….for the gift of life.Working 9 to 5 just for $…seems to me…. to be an empty life.…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 14, 2026 -
డబ్బు, పేరు కాదు.. అందుకే 'రిచ్ డాడ్' బుక్ రాశా!
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత ''రాబర్ట్ కియోసాకి'' ఒక ట్వీట్లో చాలా సింపుల్‌గా ఒక లోతైన విషయాన్ని చెప్పారు. ఆయన ఒకప్పుడు రాక్ అండ్ రోల్ బిజినెస్‌లో పనిచేస్తూ.. ది పోలీస్, వాన్ హాలెన్, ఐరన్ మైడెన్ వంటి ప్రముఖ బ్యాండ్ల కోసం ఉత్పత్తులు తయారు చేసేవారు. ఆ సమయంలో ఆయనకు మంచి డబ్బు వచ్చేది, ఫేమస్ బ్యాండ్లతో కలిసి ఉండే అవకాశం ఉండేది. జీవితం చాలా సరదాగా, విజయవంతంగా ఉన్నప్పటికీ.. తనలో మాత్రం ఏదో లోటు ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు.ఆ సమయంలోనే ఆయన డాక్టర్ ఆర్. బక్మినిస్టర్ ఫులర్ను కలిశారు. కొంతకాలం పాటు ఆయన దగ్గర చదువుకున్నారు. ఆ సమయంలో తాను చెప్పిన మాటలు కియోసాకిని బాగా ప్రభావితం చేశాయి. మన జీవితం కేవలం మన కోసం, మన డబ్బు కోసం, మన సుఖం కోసం మాత్రమే కాదని అర్థం చేసుకున్నారు.చాలామంది జీవితంలో ఒక దశకు వచ్చిన తర్వాత ''నేను ఇది ఎందుకు చేస్తున్నాను?'', ''నా జీవితానికి అసలు అర్థం ఏంటి?'' అని ఆలోచిస్తారు. కియోసాకి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. డబ్బు ఉన్నా, పేరు ఉన్నా, ఆనందంగా ఉన్నా తనకు ఏదో లోటుగా అనిపించింది. దాంతో ఆయనకు అర్థమైన విషయం ఏమిటంటే.. డబ్బు సంపాదించడం మాత్రమే జీవిత లక్ష్యం కాదు. మన వల్ల ఇతరులకు ఎంత ఉపయోగం జరుగుతోంది అనేదే అసలు విషయం.ఆ ఆలోచనను తన జీవితంలో అమలు చేసిన తర్వాతే కియోసాకి క్యాష్‌ఫ్లో అనే బోర్డ్ గేమ్‌ను రూపొందించారు, అలాగే రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తకాన్ని రాశారు. వీటి ద్వారా ప్రజలకు డబ్బు గురించి, పెట్టుబడుల గురించి, ఆర్థిక స్వేచ్ఛ గురించి కొత్తగా ఆలోచించే అవకాశం కల్పించారు.అంటే.. తనకు తెలిసిన విషయాలను తన దగ్గరే ఉంచుకోకుండా, వాటిని ఇతరులతో పంచుకోవడం ద్వారా తన జీవితానికి ఒక అర్థం దొరికిందని ఆయన చెప్పాలనుకున్నారు.కియోసాకి చెప్పే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మన జీవిత లక్ష్యం ఎప్పుడూ మనకు వెంటనే అర్థం కాదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటాం. కానీ ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తూ ముందుకు వెళ్తే.. మన దారి మనకే క్రమంగా అర్థమవుతుంది. జీవితంలో ఎంత డబ్బు సంపాదించాం అనేదాని కంటే, మన వల్ల ఎంతమంది జీవితాల్లో మంచి మార్పు వచ్చింది అనేది కూడా ముఖ్యమే.చివరికి ''నీ జీవిత లక్ష్యం ఏంటి? దేవుడు నిన్ను ఈ భూమిపైకి ఎందుకు పంపాడు?'' ఇవి ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన విషయాలు అని కియోసాకి తన ట్వీట్ ముగించాడు. మొత్తం మీద జీవితం అంటే కేవలం మన కోసం బతకడం కాదు. మన ప్రతిభ, మన అనుభవం, మన సంపాదన, మన జ్ఞానం ద్వారా ఇతరులకు ఉపయోగపడేలా జీవించినప్పుడే మన జీవితానికి నిజమైన అర్థం వస్తుందని ఆయన స్పష్టం చేశారు.WORDS of TRANSFORMATION💥Years ago, I was making a lot of money in the Rock n Roll business developing products for bands such as the Police, Van Halen, Iron Maiden and more. It was fun because I often got to hangout back stage with the band. As much fun and profitable as…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 13, 2026 -
బంగారం కొనుగోలుపై కియోసాకి కీలక వ్యాఖ్యలు
బంగారం మరోసారి ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకిన నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారాన్ని సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా, అమెరికా డాలర్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నాయని ఆయన తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా డాలర్లకు బదులుగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని ఆయన అన్నారు.1971 ఆగస్టు 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్‌ను బంగారంతో మార్పిడి చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడాన్ని కియోసాకి ప్రస్తావించారు. అప్పట్లో ఇది తాత్కాలిక నిర్ణయమని చెప్పినా, 54 ఏళ్లుగా అది కొనసాగుతోందని అన్నారు. అంతకుముందు డాలర్ విలువకు బంగారం ఆధారం ఉండేదని, ఆ తర్వాత అది ప్రభుత్వంపై, దాని విశ్వసనీయతపై ఆధారపడే కరెన్సీగా మారిందని వివరించారు.అమెరికా అప్పులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ డాలర్ నిల్వలను బంగారంగా మార్చుకునే ధోరణి పెరుగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ‘‘ఎవరైతే హామీలు ఇస్తున్నారో.. వారే ఇప్పుడు ఆ హామీల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అనే అర్థంలో ఆయన వ్యాఖ్యానించారు.తన ‘రిచ్ డాడ్’ నుంచి నేర్చుకున్న పాఠాన్ని ప్రస్తావిస్తూ.. ఇతరుల హామీపై ఆధారపడే డబ్బు, ఎవరి హామీ అవసరం లేని డబ్బు అనే రెండు రకాల సంపద ఉంటాయని కియోసాకి పేర్కొన్నారు. అయితే బంగారాన్ని కేవలం కొనుగోలు చేసి భద్రపరచడం కంటే, బంగారాన్ని ఉత్పత్తి చేసే గనుల్లో పెట్టుబడి పెట్టడమే మెరుగైన వ్యూహమని ఆయన సూచించారు.బంగారు గనుల్లో పెట్టుబడి పెడితే బంగారం విలువతో పాటు గని ద్వారా వచ్చే ఆదాయం, భవిష్యత్తులో ఆ వ్యాపారం పెరిగే కొద్దీ లభించే విలువ కూడా పెట్టుబడిదారుడికి దక్కుతుందని కియోసాకి వివరించారు. ఈ సందర్భంగా ‘ది క్యాపిటల్ క్లబ్’ పేరుతో పెట్టుబడి అవకాశాలను అందించే సంస్థను, దాని ద్వారా బంగారం-వెండి మైనింగ్ ఆపరేషన్‌లో పెట్టుబడి అవకాశాన్ని ఆయన ప్రస్తావించారు. -
అందుకే.. త్వరగా ఫెయిల్ అవ్వు!
జీవితంలో ఫెయిల్యూర్ అంటే చాలామందికి భయం. ఎందుకంటే.. ఏదైనా పని మొదలుపెట్టే ముందు ''ఇది ఫెయిల్ అయితే?'' అనే ఆలోచనే ఎక్కువగా ఉంటుంది. దీంతో రిస్క్ తీసుకోకుండా సేఫ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తారు. కానీ.. నిజానికి ఫెయిల్యూర్ అనేది అంతం కాదు.. మనం చేసిన తప్పుల నుంచి నేర్చుకునే అవకాశం. ఇదే విషయాన్ని రాబర్ట్ కియోసాకి తన జీవితంలో ఎదురైన అనుభవం ద్వారా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు.25 ఏళ్ల వయసులో అతని మొదటి బిజినెస్ పూర్తిగా విఫలమైంది. దీంతో చాలా బాధపడ్డాను. ఎవరైనా తనను ఓదార్చాలని అనుకున్నాను. కానీ అతని రిచ్ డాడ్ మాత్రం ''నువ్వు చాలా త్వరగా ఫెయిల్ కాలేదు.. పనిచేయని బిజినెస్‌ను కాపాడటానికి చాలా కాలం ప్రయత్నించావు. అయితే మరోసారి త్వరగా ఫెయిల్ అవ్వు.. త్వరగా నేర్చుకో.. త్వరగా ముందుకు వెళ్లు'' అని చెప్పారు అని కియోసాకి అన్నారు.ఆ సమయంలో ఆ మాటలు వినడం కష్టంగా అనిపించినా.. తర్వాత అవే తన జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయని కియోసాకి చెప్పారు. మనలో చాలామంది ఫెయిల్యూర్‌ను ఒక తీర్పులా చూస్తాం. ఒకసారి ఓడిపోతే మనలో సామర్థ్యం లేదని భావిస్తాం. అందుకే ..సేఫ్ జాబ్‌లోనే ఉండిపోతాం, కొత్త బిజినెస్ మొదలుపెట్టడానికి భయపడతాం, రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉంటాం.కానీ.. ప్రయత్నించకపోవడం కూడా ఒక రకమైన నష్టమే. ఎందుకంటే ప్రయత్నిస్తే ఫెయిల్ కావచ్చు.. కానీ ప్రయత్నించకపోతే ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా ఉండదు.మొదటి బిజినెస్ ఫెయిల్ అయిన తర్వాత అతను తన తప్పులను ఒక్కొక్కటిగా విశ్లేషించుకున్నన్నాను. డబ్బును సరిగ్గా నిర్వహించకపోవడం, సరైన బిజినెస్ భాగస్వాములను ఎంచుకోకపోవడం, తన ఆలోచనలను రక్షించుకోకపోవడం, కొద్దిమంది కస్టమర్లపైనే ఎక్కువగా ఆధారపడటం వంటి విషయాల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. రెండోసారి కూడా కొన్ని తప్పులు జరిగాయి. కానీ ఈసారి వాటి నుంచి మరిన్ని విషయాలు నేర్చుకున్నాను.ఇక్కడ ''త్వరగా ఫెయిల్ అవ్వాలి'' అంటే కావాలని ఓడిపోవాలని కాదు. ఒక పనిని పట్టుకుని ఎక్కువ సమయం, డబ్బు వృథా చేయకూడదన్నదే అసలు అర్థం. ఒక ఆలోచన పనిచేయడం లేదని అర్థమైతే.. కారణం తెలుసుకుని మార్పులు చేయాలి లేదా మరో దారిలో ప్రయత్నించాలి. చిన్న స్థాయిలో తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకుంటే.. భవిష్యత్తులో పెద్ద నష్టాలను కూడా తప్పించుకోవచ్చు. -
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
వెండి ధరలు రికార్డు స్థాయిల్లో కొనసాగుతున్న వేళ ప్రముఖ ఆర్థిక రచయిత, ఇన్వెస్ట్ గురూ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి వెండిపై తన అంచనాను వెల్లడించారు. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాబర్ట్ కియోసాకి తన ఫేస్బుక్ పోస్టులో వెండి భవిష్యత్ ధరపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఔన్సు వెండి ధర 3 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేశానని, ప్రస్తుతం ధరలు రికార్డు స్థాయిల్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ వెండిని కొనుగోలు చేస్తున్నానని తెలిపారు.కియోసాకి తన పోస్టులో వెండి సరఫరా, డిమాండ్ మధ్య పెరుగుతున్న అంతరాన్ని ప్రస్తావించారు. ప్రపంచ జనాభాలో దాదాపు 40 శాతాన్ని కలిగి ఉన్న మూడు ప్రభుత్వాలు ఒకే లోహాన్ని భారీగా నిల్వ చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది ఆభరణాల కోసం కాకుండా భవిష్యత్ అవసరాలు, భద్రత కోసం నిల్వ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఈ వాదనకు ఆయన పోస్టులో ప్రభుత్వాల పేర్లను వెల్లడించలేదు.బంగారాన్ని ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు నిల్వ చేస్తుంటే.. వెండిలో మాత్రం పారిశ్రామిక వినియోగం భారీగా ఉందని కియోసాకి వివరించారు. స్మార్ట్ఫోన్లు, సోలార్ ప్యానెల్స్, రక్షణ రంగ పరికరాలు సహా అనేక ఉత్పత్తుల్లో వెండి వినియోగమవుతుందని, ఈ వినియోగం కారణంగా అందుబాటులో ఉన్న సరఫరాపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. సరఫరా పరిమితంగా ఉండటం, డిమాండ్ ఏటా పెరుగుతుండటం భవిష్యత్‌లో వెండి ధరలకు మద్దతు ఇవ్వవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.తాను 30 ఏళ్లుగా ఈ ధోరణిని గమనిస్తున్నానని కియోసాకి పేర్కొన్నారు. ఔన్సు వెండి ధర 3 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఆ తర్వాత 13 డాలర్ల వద్ద ఉన్నప్పుడు కూడా తాను వెండిపై అంచనాలు చెప్పానని, అప్పట్లో చాలామంది తనను విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు మూడు ప్రభుత్వాలు వెండిని నిల్వ చేయడం ద్వారా తాను చెబుతున్న ధోరణిని బలపరుస్తున్నాయని ఆయన అన్నారు. ఇక వెండి ధర భవిష్యత్‌లో ఔన్స్‌కు 200 డాలర్లకు చేరుతుందంటూ ఈ పోస్టుకు అనుబంధంగా షేర్ చేసిన వీడియోలో వివరించారు. -
యుద్ధాలతోనే వారికి భారీ లాభాలు: కియోసాకి కామెంట్స్
యుద్ధాలు సామాన్య ప్రజలకు తీవ్ర నష్టాన్ని, ఆర్థిక భారాన్ని మిగిల్చినా.. కొన్ని రంగాల్లోని కంపెనీలు, పెట్టుబడిదారులకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెడతాయని ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆయన ఫేస్బుక్లో చేసిన తాజా పోస్టులో యుద్ధాలు, ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు, రియల్ ఆస్తుల మధ్య సంబంధాన్ని వివరించారు.చరిత్రలో జరిగిన దాదాపు ప్రతి పెద్ద యుద్ధం కొంతమందిని అపారంగా సంపన్నులను చేసిందని కియోసాకి అన్నారు. ప్రస్తుత ఇరాన్ యుద్ధం కూడా ఇందుకు భిన్నంగా లేదని పేర్కొన్నారు. యుద్ధ సమయంలో చమురు, రక్షణ రంగాలకు చెందిన కంపెనీలు భారీగా లాభపడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడటంతో చమురు ధరలు పెరగడం, అదే సమయంలో ఆయుధాల డిమాండ్ పెరగడం వంటి పరిణామాలు ఆయా రంగాల కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో తీవ్ర అంతరాయాలు ఏర్పడటంతో షెల్ వంటి చమురు సంస్థలు భారీ లాభాలను నమోదు చేశాయి. 2026 తొలి త్రైమాసికంలో షెల్ సుమారు 6.9 బిలియన్ డాలర్ల లాభాన్ని ప్రకటించింది. మరోవైపు రక్షణ రంగంలో లాక్‌హీడ్ మార్టిన్, ఆర్టీఎక్స్, బోయింగ్, నార్త్రోప్ గ్రమ్మన్ వంటి సంస్థలు భారీ ఆర్డర్ బ్యాక్‌లాగ్‌లను నమోదు చేశాయి. యుద్ధం కారణంగా ఆయుధ నిల్వలను తిరిగి నింపేందుకు ప్రభుత్వాలు రక్షణ వ్యయాన్ని పెంచుతున్నాయని నివేదికలు వెల్లడించాయి.కియోసాకి తన పోస్టులో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాం యుద్ధం, గల్ఫ్ యుద్ధం, ఇరాక్, ఉక్రెయిన్ వంటి సంఘర్షణలను ప్రస్తావించారు. యుద్ధాల సమయంలో సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం వల్ల చమురు, ఇతర కమోడిటీల ధరలు పెరుగుతాయని.. దీంతో రియల్ ఆస్తులు, కమోడిటీలను కలిగి ఉన్నవారికి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.అయితే ఈ ధరల పెరుగుదల భారాన్ని సాధారణ ప్రజలు భరించాల్సి వస్తుందని కియోసాకి పేర్కొన్నారు. పెట్రోల్, విద్యుత్, ఆహారం, రవాణా వంటి వాటి ధరలు పెరగడం ద్వారా యుద్ధ ప్రభావం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పడుతుందని అన్నారు. మరోవైపు చమురు, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక రాబడులు వచ్చే పరిస్థితి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికాలో ఇంధన ధరలు కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.ప్రతి సంక్షోభంలోనూ లాభపడుతున్నదెవరు?తన ‘రిచ్ డాడ్’ తనకు దశాబ్దాల క్రితమే ఈ విధానాన్ని వివరించారని కియోసాకి తెలిపారు. సంక్షోభ సమయంలో డబ్బు ఏ దిశగా వెళ్తుందో గుర్తించడం కీలకమని పేర్కొన్నారు. ‘‘ప్రతి సంక్షోభంలో ట్రేడ్‌లో సరైన వైపు ఎవరు ఉన్నారో తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఏ వైపు ఉన్నారో ప్రశ్నించుకోండి’’ అనే సందేశాన్ని తన పోస్టులో పంచుకున్నారు. యుద్ధాలు కేవలం భౌగోళిక, రాజకీయ పరిణామాలను మాత్రమే కాకుండా.. చమురు, కమోడిటీలు, సరఫరా వ్యవస్థలు, కరెన్సీలు, ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం చూపుతాయని కియోసాకి తన పోస్టులో వివరించారు. -
‘రిచ్ డాడ్’ చదివినా పేదరికం ఎందుకు?
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రచయిత, ఆర్థిక వ్యాఖ్యాత, ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ఫేస్బుక్ పోస్టులో ఆర్థిక విజయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చాలా మంది ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకాన్ని చదివి, అందులోని విషయాలను అంగీకరించినప్పటికీ.. ఆచరణలో పెట్టకపోవడం వల్లే ఆర్థికంగా ఎదగలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు.తనకు తన ‘రిచ్ డాడ్’ పుస్తకాలు ఇవ్వలేదని, అనుభవాల ద్వారా నేర్పించారని కియోసాకి గుర్తుచేసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులోనే తన స్టోర్‌లో ఉచితంగా పని చేయించారని, సరుకుల లెక్కలు చూసుకోవడం, కస్టమర్లను గమనించడం, డబ్బు ఎలా చేతులు మారుతుందో తెలుసుకోవడం వంటి విషయాలను నేర్పించారని తెలిపారు. నిజ జీవితంలో తప్పులు చేయడం, వాటి నుంచి నేర్చుకోవడం ద్వారా తన ఆలోచనా విధానం మారిందని చెప్పారు.ఆర్థిక విద్యలో ఎక్కువ భాగం పుస్తకాలు, పాడ్‌కాస్ట్‌లు, యూట్యూబ్ వీడియోలు, సెమినార్ల వంటి వాటి ద్వారా సాగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆర్థిక సమాచారాన్ని వినోదంలా నిష్క్రియాత్మకంగా తీసుకుంటున్నారని, కానీ దాన్ని ఆచరణలో పెట్టకపోవడం వల్ల వారి జీవితాల్లో మార్పు రావడం లేదని పేర్కొన్నారు.‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకాన్ని ప్రజలకు అన్ని సమాధానాలు చెప్పేందుకు కాకుండా.. సరైన ప్రశ్నలు ఎలా అడగాలో ఆలోచింపజేసేందుకు రాశానని కియోసాకి తెలిపారు. పుస్తకం కేవలం ప్రారంభం మాత్రమేనని, అసలైన ఆర్థిక విద్య అనుభవాల నుంచే మొదలవుతుందని చెప్పారు. మొదటి ఆస్తిని కొనుగోలు చేసి తప్పు చేయడం, వ్యాపారం ప్రారంభించి ఆదాయం గురించి భయపడటం, బ్యాంకు నుంచి రుణం కోసం ప్రయత్నించి తిరస్కరణ ఎదుర్కోవడం, ఆర్థిక నివేదికను చదవలేకపోవడం వంటి అనుభవాలే ఎక్కువగా నేర్పిస్తాయని వివరించారు.పెట్టుబడుల గురించి కేవలం చదవడం ఆపి.. చిన్న మొత్తాలతో అయినా పెట్టుబడులు ప్రారంభించాలని కియోసాకి సూచించారు. పెద్ద మొత్తాలతో తప్పులు చేసే ముందు చిన్న మొత్తాలతో అనుభవం సంపాదించాలని పేర్కొన్నారు. చదవడం కంటే ఆచరణ ద్వారా నేర్చుకున్న విషయాలే ఎక్కువకాలం గుర్తుంటాయని ఆయన తన పోస్టులో వెల్లడించారు. -
అతిపెద్ద మార్కెట్ క్రాష్ వస్తుందా?.. కియోసాకి చెప్పేది నిజమేనా?
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో చరిత్రలోనే అతిపెద్ద మార్కెట్ క్రాష్ వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దీంతో పెట్టుబడిదారుల్లో మరోసారి చర్చ మొదలైంది.ప్రస్తుతం కియోసాకి హెచ్చరిక కంటే.. ఆయన గతంలో చేసిన అంచనాలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే.. గత కొన్నేళ్లుగా కియోసాకి మార్కెట్ పతనం గురించి పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వాటిలో చాలా వరకు నిజం కాలేదు.ఉదాహరణకు, 2023 నాటికి బిట్‌కాయిన్ 75 వేల డాలర్లకు చేరుతుందని, 2024 ఆగస్టులో 3.5 లక్షల డాలర్లకు వెళ్తుందని, 2025 చివరికి 5 లక్షల డాలర్లను తాకుతుందని ఆయన అంచనా వేశారు. అయితే ఆ గడువుల్లో ఆ లక్ష్యాలు నెరవేరలేదు.స్టాక్ మార్కెట్ విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. 2018లో 'చరిత్రలోనే అతిపెద్ద మార్కెట్ పతనం వస్తోంది' అని చెప్పిన తర్వాత, అమెరికా ఎస్అండ్పీ 500 సూచీ దాదాపు 115 శాతం పెరిగింది. అలాగే.. కరోనా సమయంలో 'ఇప్పుడే అసలు పతనం మొదలైంది' అని వ్యాఖ్యానించినా, ఆ తర్వాత ఏడాది మార్కెట్ 50 శాతానికి పైగా లాభపడింది.2020లో అన్నీ కుప్పకూలిపోతాయి, 2021 అక్టోబర్‌లో భారీ క్రాష్ వస్తుంది, 2022లో ఎవరీథింగ్ బబుల్ ఎవరీథింగ్ క్రాష్‌గా మారుతుంది, 2024లో క్రాష్ ఇప్పటికే ప్రారంభమైంది అంటూ పలుమార్లు కియోసాకి హెచ్చరించారు. కానీ ఆయా.. సందర్భాల్లో మార్కెట్లు పెద్దగా కుప్పకూలకపోగా.. వృద్ధినే నమోదు చేశాయి.గతాన్ని పరిశీలించిన తరువాత, ఇప్పుడు ఆయన చేసిన 2026 క్రాష్ నిజమేనా? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. కొందరు మాత్రం కియోసాకి అంచనాలను పూర్తిగా కొట్టిపారేయలేమని అంటున్నారు. ఎందుకంటే ఆయన తక్షణ మార్కెట్ కదలికల కంటే, అప్పుల భారం, కరెన్సీ విలువ, ఆర్థిక వ్యవస్థలోని దీర్ఘకాలిక సమస్యల గురించి హెచ్చరిస్తుంటారని వారి వాదన. మరోవైపు.. విమర్శకులు మాత్రం గత రికార్డును చూపిస్తూ ఆయన అంచనాలను జాగ్రత్తగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు.నిజానికి.. మార్కెట్ ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు పెరుగుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే.. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, యుద్ధాలు, ప్రభుత్వ విధానాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అనేక అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అందుకే.. ఒక్కరి అంచనాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం కంటే, పూర్తి సమాచారం సేకరించి, దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రూ.28 వేల కోట్ల సబ్సిడీ.. 50 లక్షల కుటుంబాలకు లబ్ది!అందువల్ల, 2026లో నిజంగానే అతిపెద్ద మార్కెట్ క్రాష్ వస్తుందా? అనే ప్రశ్నకు ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం లేదు. ఇది కేవలం కియోసాకి వ్యక్తిగత అంచనా మాత్రమే. గతంలో ఆయన చేసిన అనేక అంచనాలు నిజం కాకపోవడంతో, ఈసారి కూడా పెట్టుబడిదారులు ఆశలు లేదా భయాలతో కాకుండా, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకోవడం అవసరం.Robert Kiyosaki just said the biggest crash is coming this 2026But he has a track record of predictions and every single one of them is wrong- Bitcoin will hit 75k by 2023 (never broke 74k)- Bitcoin will hit 350k by August 2024- Bitcoin will hit 500k by end of 2025-… pic.twitter.com/ynJjUhyTMi— StarPlatinum (@StarPlatinum_) August 3, 2026 -
ఇంటితోనే ఇంకో ఇల్లు కొనచ్చు: కియోసాకి కిటుకు
ఇల్లు అంటే చాలా మందికి జీవితంలో అతిపెద్ద ఆస్తి. అయితే, అదే ఇంటిని తెలివిగా ఉపయోగించుకుంటే అదనపు ఆదాయాన్ని సమకూర్చే సాధనంగా మార్చుకోవచ్చని ప్రముఖ ఇన్వెస్టింగ్ గురూ, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ పోస్ట్‌లో ఇంటిని విక్రయించకుండానే దానిలో ఉన్న ఈక్విటీని ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకునే విధానాన్ని వివరించారు.కియోసాకి వివరించిన విధానం ‘క్యాష్-అవుట్ రీఫైనాన్స్’. ఉదాహరణకు పదేళ్ల క్రితం ఓ వ్యక్తి 3 లక్షల డాలర్లకు ఇల్లు కొనుగోలు చేశాడని, అందులో 60 వేల డాలర్లు డౌన్‌పేమెంట్‌గా చెల్లించి, 2.4 లక్షల డాలర్ల రుణం తీసుకున్నాడని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఇంటి విలువ 5 లక్షల డాలర్లకు చేరి, ఇంటి రుణం 1.8 లక్షల డాలర్లకు తగ్గితే.. యజమానికి 3.2 లక్షల డాలర్ల ఈక్విటీ ఉన్నట్లవుతుందని వివరించారు.ఈక్విటీలో కొంత భాగాన్ని నగదుగా మార్చుకునేందుకు రీఫైనాన్స్ చేసుకోవచ్చని కియోసాకి తెలిపారు. కొత్తగా 3 లక్షల డాలర్ల రుణం తీసుకుంటే పాత 1.8 లక్షల డాలర్ల రుణం చెల్లించిన తర్వాత 1.2 లక్షల డాలర్లు నగదుగా చేతికి వస్తాయని చెప్పారు. ఈ మొత్తాన్ని ఆదాయం అందించే ఆస్తిలో పెట్టుబడిగా పెట్టవచ్చని సూచించారు.ఉదాహరణగా 4 లక్షల డాలర్లకు డ్యూప్లెక్స్ కొనుగోలు చేసి, 1.2 లక్షల డాలర్లను డౌన్‌పేమెంట్‌గా చెల్లిస్తే మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రెండు యూనిట్ల నుంచి నెలకు మొత్తం 3,600 డాలర్ల అద్దె వస్తే, రుణం, పన్నులు, బీమా, నిర్వహణ ఖర్చులు పోగా సుమారు 1,000 డాలర్ల నికర నగదు ప్రవాహం ఉండొచ్చని వివరించారు. అదే సమయంలో ఇంటి రీఫైనాన్స్ వల్ల నెలవారీ చెల్లింపు 800 డాలర్లు పెరిగినా.. అద్దె ఆస్తి నుంచి వచ్చే ఆదాయం దాన్ని అధిగమించవచ్చని తెలిపారు.అద్దెదారులు చెల్లించే అద్దె ద్వారా రుణం కొంతవరకు తీరడం, రెండు ఆస్తుల్లో ఈక్విటీ పెరగడం, ఆస్తుల విలువ కాలక్రమంలో పెరిగే అవకాశం ఉండటం వంటి ప్రయోజనాలు ఉంటాయని కియోసాకి చెప్పారు. అలాగే, అమెరికాలోని పన్ను నిబంధనల ప్రకారం రుణంగా తీసుకున్న నగదుకు సాధారణంగా అమ్మకపు ఆదాయం తరహాలో పన్ను ఉండదని, అయితే పన్ను ప్రయోజనాలు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.అయితే, ఈ వ్యూహంలో రిస్క్‌లు కూడా ఉన్నాయని కియోసాకి హెచ్చరించారు. అద్దెలు తగ్గడం, అద్దెదారులు చెల్లింపులు చేయకపోవడం, ఖాళీగా ఉండే కాలం పెరగడం, అనుకోని మరమ్మతు ఖర్చులు రావడం వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన నగదు నిల్వలు ఉండాలని సూచించారు. రెండు రుణాల చెల్లింపులను కనీసం ఆరు నెలలపాటు భరించే సామర్థ్యం ఉందా అనే విషయాన్ని ముందుగానే పరిశీలించుకోవాలని చెప్పారు.ఇదీ చదవండి: బెంగళూరులో ఇల్లు కొన్నానోచ్.. జెన్‌జీ ఆనందం!ఇంట్లోని ఈక్విటీని అలాగే ఉంచడం కంటే ఆదాయం సృష్టించే ఆస్తుల్లోకి మళ్లించడం ద్వారా సంపదను పెంచుకోవచ్చన్నదే తన సూచన సారాంశమని కియోసాకి తెలిపారు. అయితే, తాను ఇచ్చిన లెక్కలు కేవలం విద్యాపరమైన సరళీకృత ఉదాహరణలు మాత్రమేనని, వాస్తవ రుణ వడ్డీరేట్లు, అద్దె ఆదాయం, నిర్వహణ ఖర్చులు, ఆస్తుల విలువ పెరుగుదల, పన్ను ప్రభావాలు ప్రాంతం, మార్కెట్ పరిస్థితులు, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను బట్టి మారుతాయని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడి నిర్ణయాల ముందు ఆర్థిక సలహాదారు, పన్ను నిపుణులు, రియల్ ఎస్టేట్ నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు. -
బ్యాంకులు మీ డబ్బుతో ఏం చేస్తాయో తెలుసా?
''డబ్బును కేవలం దాచుకోవడం కంటే, అది మన కోసం పనిచేసేలా చేయడం ముఖ్యం'' అని రాబర్ట్ కియోసాకి చెబుతూ.. బ్యాంకులు, రుణ వ్యవస్థ, పెట్టుబడుల ఆలోచనా విధానం గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.మనం బ్యాంకులో డబ్బు జమ చేస్తే.. అది అక్కడే స్థిరంగా ఉండిపోదు. బ్యాంకులు ఆ డిపాజిట్లలో కొంత భాగాన్ని లోన్స్ రూపంలో.. ఇతరులకు ఇస్తాయి. అంటే.. మన డబ్బు బ్యాంకింగ్ వ్యవస్థలో తిరుగుతూ ఉంటుందన్నమాట. అయితే.. ఆ డబ్బు ద్వారా వచ్చే లాభాల్లో ప్రధాన ప్రయోజనం బ్యాంకులకు.. రుణాలు తీసుకుని వాటిని ఉపయోగించే వారికి ఎక్కువగా వెళ్తుందని కియోసాకి చెబుతున్నారు.కియోసాకి.. రిచ్ డాడ్, పూర్ డాడ్ భావనను చెబుతూ.. రెండు రకాల ఆలోచనా విధానాలను వివరించారు. సాధారణంగా పూర్ డాడ్ డబ్బును భద్రంగా దాచుకోవడంపై దృష్టి పెట్టే వ్యక్తి. రిచ్ డాడ్.. డబ్బును ఉపయోగించి మరిన్ని ఆస్తులను సృష్టించుకోవాలని చూసే వ్యక్తి అని ఆయన వివరిస్తారు. ఒకరు బ్యాంకులో డబ్బు ఉంచితే.. మరొకరు డబ్బును ఉపయోగించి వ్యాపారాలు లేదా ఆస్తుల్లో పెట్టుబడులుగా పెడతారని చెబుతున్నారు.ఇక్కడ కియోసాకి చెప్పే విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే.. బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. బ్యాంకులు డిపాజిట్లను ఉపయోగించి లోన్స్ ఇస్తాయి. లోన్స్ ద్వారా వచ్చే వడ్డీతో బ్యాంకులు ఆదాయం పొందుతాయి. అదే సమయంలో డిపాజిటర్లకు కూడా కొంత వడ్డీ చెల్లిస్తాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న సాధారణ బ్యాంకింగ్ విధానం.కియోసాకి ప్రకారం.. ఒక తెలివైన పెట్టుబడిదారు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ ఆస్తి ఆదాయం ఎలా ఇస్తుంది?, దాని విలువకు ఆధారం ఏమిటి?, దానిపై ఎంత అప్పు ఉంది?, తన అంచనా తప్పు అని నిరూపించేది ఏమిటి?, అవసరమైతే బయటకు వచ్చే మార్గం ఏమిటి? వంటి అంశాలను పరిశీలించాలి. కేవలం ఎవరో చెప్పారని లేదా ధర పెరుగుతుందని ఆశతో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని ఆయన చెబుతారు. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి అవగాహన, రిస్క్ అంచనా, సరైన ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: అప్పులే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయ్! -
చెప్పిందే జరుగుతోంది.. కియోసాకి హెచ్చరిక!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితి గురించి తాను చాలా సంవత్సరాల క్రితమే 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' అనే పుస్తకంలో హెచ్చరించానని కియోసాకి పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రస్తుత పరిస్థితిని చూసి ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. పుస్తకంలో ఇచ్చిన సూచనలను పాటించిన వారు ఈరోజు ఆర్థికంగా కొంత భద్రంగా ఉన్నారని కియోసాకి పేర్కొన్నారు.అయితే.. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. సరైన నిర్ణయాలు తీసుకుంటే మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా మన ఆర్థిక ప్రణాళికలను మార్చుకోవడం, ఖర్చులను నియంత్రించడం, తెలివిగా పెట్టుబడులు పెట్టడం వంటి విషయాలపై దృష్టి పెట్టాలని కియోసాకి సూచిస్తున్నారు.ప్రతి ఆర్థిక సంక్షోభం ఒక పరీక్ష లాంటిది. ఇలాంటి సమయాల్లో చాలా మంది తమ సంపదను కోల్పోతారు. కానీ.. కొందరు మాత్రం పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం వల్ల మరింత ధనవంతులుగా మారుతారని కియోసాకి అభిప్రాయపడ్డారు.భయపడకుండా, ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకుని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కియోసాకి చెబుతున్నారు. అయితే ఆర్ధిక విషయాల్లో తప్పకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇప్పటి నుంచే అవసరమైన మార్పులు చేసుకోవాలని కోరుతున్నారు. -
‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’
ప్రపంచ ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చరిత్రలో ప్రతి సామ్రాజ్యం ఒకే చక్రాన్ని అనుసరిస్తుందని, అధికంగా కరెన్సీ ముద్రించడం చివరికి ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆయన తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ కంటే బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే సంపదను కాపాడగలవని ఆయన అభిప్రాయపడ్డారు.రోమన్ సామ్రాజ్యం నుంచి స్పెయిన్, బ్రిటన్ వరకు చరిత్రను పరిశీలిస్తే, కరెన్సీ విలువ తగ్గిన ప్రతిసారి బంగారం తన విలువను నిలబెట్టుకుందని కియోసాకి తెలిపారు. ప్రభుత్వాలు ఎంత డబ్బునైనా ముద్రించగలవని, కానీ బంగారం లేదా వెండిని ముద్రించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. అందుకే ధనవంతులు తమ సంపదను బంగారం, వెండి వంటి పరిమిత లభ్యత కలిగిన ఆస్తుల్లో నిల్వ చేస్తారని వివరించారు.ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తిని క్రమంగా తగ్గిస్తుందని, అలాంటి సమయంలో బంగారం, వెండి కొనుగోలు శక్తిని రక్షించే సాధనాలుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతున్నట్లు కనిపించినా, వాస్తవానికి కరెన్సీ విలువే తగ్గుతోందని ఆయన వ్యాఖ్యానించారు.తాను అమెరికా అంతమవుతుందని చెప్పడం లేదని, అయితే అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గే దిశగా సాగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. చరిత్రలో కరెన్సీ విలువను అధికంగా తగ్గించిన ప్రతి సామ్రాజ్యం చివరకు తన ఆధిపత్యాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు.బంగారం, వెండి ఒక్క రాత్రిలో ధనవంతులను చేసే పెట్టుబడులు కాదని, ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షించే "ఫైనాన్షియల్ లైఫ్బోట్లు" అని ఆయన పేర్కొన్నారు. పరిస్థితులు మరింత క్లిష్టం అయ్యే వరకు వేచి చూడకుండా, చిన్న మొత్తంతో అయినా వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలోని బంగారం కొనుగోలు చేసి నిజమైన సంపదను కూడబెట్టడం ప్రారంభించాలని తన ఫాలోవర్లకు సూచించారు. కాగితపు కరెన్సీలో మాత్రమే పొదుపు చేస్తే కాలక్రమంలో కొనుగోలు శక్తి తగ్గిపోతుందని, బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే దీర్ఘకాలంలో సంపదను రక్షిస్తాయని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు. -
ధనికుల కోసం మొదలై.. మధ్యతరగతిపై ప్రభావం!
డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరి జీవితంలో ట్యాక్స్ ఒక ముఖ్యమైన అంశం. అయితే.. ఆదాయ పన్ను (Income Tax) ఎలా వచ్చింది? ఎవరు ఎక్కువగా చెల్లిస్తున్నారు? అనే విషయాలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. దీని గురించి వివరిస్తూ రాబర్ట్ కియోసాకి సుదీర్ఘ పోస్ట్ చేశారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.అమెరికా ఆదాయ పన్ను చరిత్రను పరిశీలిస్తే.. మొదట ఇది కేవలం ధనికుల నుంచి మాత్రమే పన్ను వసూలు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభమైంది. కానీ.. కాలక్రమేణా ఈ పన్ను విధానం మారుతూ, సాధారణ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలపై కూడా ప్రభావం చూపడం మొదలైంది.ఆదాయ పన్ను విధానం1913కు ముందు అమెరికా ప్రభుత్వం ప్రధానంగా వాణిజ్య సుంకాలు, దిగుమతి పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేది. ఆ సమయంలో సాధారణ ప్రజలు తమ జీతాలపై ఫెడరల్ ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ తరువాత అమెరికా రాజ్యాంగంలోని 16వ సవరణ ద్వారా ఆదాయ పన్ను విధానం అమల్లోకి వచ్చింది.అప్పట్లో.. దీనిని ధనికులపై మాత్రమే విధించే పన్నుగా ప్రజలకు వివరించారు. ప్రారంభ దశలో చాలా ఎక్కువ ఆదాయం ఉన్నవారికే పన్ను వర్తించేది. దీంతో సాధారణ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ధనికులు తమ వాటా చెల్లించడం న్యాయమేనని చాలామంది భావించారు.పన్ను వ్యవస్థలో మార్పులుఅయితే, సంవత్సరాలు గడిచేకొద్దీ పన్ను వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. పన్ను రేట్లు పెరిగాయి, నియమాలు మారాయి, పన్ను చెల్లించే వారి పరిధి కూడా విస్తరించింది. దీంతో ఒకప్పుడు ధనికులపై మాత్రమే ఉన్న పన్ను భారం క్రమంగా.. మధ్యతరగతి ఉద్యోగులపై కూడా పడింది.ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించే విషయం ఏమిటంటే.. ఆదాయం వచ్చే విధానం. సాధారణ ఉద్యోగులు తమ శ్రమకు ప్రతిఫలంగా జీతం పొందుతారు. ఈ జీతంపై నేరుగా పన్ను విధించడం జరుగుతుంది. మరోవైపు.. వ్యాపారాలు, పెట్టుబడులు, ఆస్తుల ద్వారా ఆదాయం పొందేవారికి పన్ను చట్టాల్లో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారాలు చేసే వారు ఖర్చుల తగ్గింపులు, ఆస్తుల విలువ తగ్గింపు వంటి పన్ను ప్రయోజనాలను ఉపయోగించుకోగలరు. అందువల్ల సంపదను సృష్టించే మార్గాలను ఎంచుకున్నవారు పన్ను వ్యవస్థలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటారని ఆర్థిక నిపుణులు చెబుతారు. వారెన్ బఫెట్ ఉదాహరణఈ విషయాన్ని వివరించేందుకు వారెన్ బఫెట్ ఉదాహరణను కూడా ప్రస్తావిస్తారు. తన సెక్రటరీ తనకంటే ఎక్కువ పన్ను రేటు చెల్లించినట్లు ఆయన ఒకసారి చెప్పారు. దీనికి కారణం వారికి ఆదాయం వచ్చే విధానం వేర్వేరుగా ఉండటమే అని వివరించారు.కేవలం ఎక్కువ సంపాదించడం మాత్రమే కాకుండా, డబ్బు ఎలా వస్తోంది, పెట్టుబడులు ఎలా పనిచేస్తాయి, పన్ను వ్యవస్థ ఎలా ఉంటుంది అనే విషయాలపై అవగాహన కలిగి ఉండటం కూడా ముఖ్యం. అయితే.. పన్ను వ్యవస్థలు ప్రతి దేశంలోనూ ఆ దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, ప్రజల అవసరాల ఆధారంగా మారుతూ ఉంటాయి. ఆదాయ పన్ను ద్వారా ప్రభుత్వాలు రోడ్లు, విద్య, వైద్యం, రక్షణ వంటి ప్రజా సేవలకు అవసరమైన నిధులను సమకూర్చుకుంటాయి.ఆదాయ పన్ను చరిత్ర మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఆర్థికంగా ఎదగాలంటే.. సంపాదనతో పాటు ఆర్థిక అవగాహన కూడా అవసరం. జీతంపై ఆధారపడే వ్యక్తి.. వ్యాపారం లేదా పెట్టుబడుల ద్వారా సంపాదించే వ్యక్తి ఒకే పన్ను వ్యవస్థలో ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. అందుకే డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా, దాన్ని నిర్వహించడం, ఆర్థిక నియమాలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.ఇదీ చదవండి: ఇంకా తగ్గనున్న బంగారం ధరలు! -
కియోసాకి వ్యూహం.. రియల్ ఎస్టేట్‌లోకి ఎంట్రీ!
సాధారణంగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఉండాలని చాలామంది భావిస్తారు. అయితే తాను క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.లక్షలు, కోట్లు లేకుండా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టడం సాధ్యం కాదని అనుకుంటారు. కానీ కియోసాకి వంటి పెట్టుబడిదారులు మాత్రం.. డబ్బు కంటే సరైన ఆలోచన, వ్యూహం ఉంటే అవకాశాలను సృష్టించుకోవచ్చని చెబుతున్నారు.కియోసాకి తన మొదటి రెంటల్ ప్రాపర్టీని కేవలం 1800 డాలర్లు, క్రెడిట్ కార్డు సహాయంతో కొనుగోలు చేసిన విషయాన్ని వెల్లడించాడు. ఒక మంచి అవకాశం వచ్చిన వెంటనే.. బ్యాంక్ లోన్ కోసం ఎదురుచూడకుండా.. డీల్ పూర్తి చేశానని పేర్కొన్నారు. దీనికోసం తాను సంవత్సరాల తరబడి పొదుపు చేయలేదని కూడా చెప్పారు.ఆ మొదటి పెట్టుబడి తనకి ఒక పాఠాన్ని నేర్పిందని చెప్పారు. రియల్ ఎస్టేట్‌లో ముందుకు వెళ్లడానికి అసలు సమస్య డబ్బు లేకపోవడం కాదు, సరైన సమాచారం లేకపోవడమే అని అతని అభిప్రాయం. మంచి అవకాశాలను గుర్తించడం, సరైన వ్యూహంతో వాటిని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని వివరించాడు.రిచ్ డాడ్, పూర్ డాడ్ ఉదాహరణతో.. సంపదను నిర్మించే విధానంలో ఉన్న తేడాను వివరించాడు. సాధారణంగా ఉద్యోగం చేసే వ్యక్తి తన జీవితాంతం జీతం కోసం పనిచేస్తాడు. కానీ పెట్టుబడిదారుడు తనకు నిరంతరం ఆదాయం తెచ్చే ఆస్తులను నిర్మించడానికి ప్రయత్నిస్తాడు అని అన్నారు.తన మొదటి చిన్న పెట్టుబడినే ఆధారంగా చేసుకుని.. అదే వ్యూహాన్ని కొనసాగిస్తూ చివరకు వేలాది అద్దె యూనిట్ల వరకు తన వ్యాపారాన్ని విస్తరించానని కియోసాకి పేర్కొన్నాడు. ప్రారంభంలో ఉపయోగించిన ఆలోచన మారలేదని, కేవలం దాన్ని మరింత పెద్ద స్థాయిలో అమలు చేశానని తెలిపాడు.అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. రియల్ ఎస్టేట్‌లో ప్రతి పెట్టుబడికి లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆస్తి విలువ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడిదారులు ఈ విషయాన్ని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. -
‘బంగారం, వెండి.. అందుకే అక్కడ దాచుకుంటున్నా’
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ పెట్టుబడి నిపుణుడు రాబర్ట్ కియోసాకి అమెరికా పెరుగుతున్న ప్రభుత్వ అప్పులపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో చేసిన తాజా పోస్టులో అమెరికా రుణభారం ప్రమాదకర స్థాయికి చేరిందని పేర్కొంటూ, కరెన్సీని పొదుపు చేయడం కంటే వాస్తవ ఆస్తులను (Real Assets) కూడబెట్టడం మంచిదని అభిప్రాయపడ్డారు.కియోసాకి ప్రకారం.. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం (GFC)కు ముందు అమెరికా ప్రభుత్వ రుణం సుమారు 9.5 ట్రిలియన్ డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది 39 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉందన్నారు. ఇదే సమయంలో అమెరికా బాండ్ మార్కెట్ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన పోలికను ప్రస్తావించారు. "మీరు నిమిషానికి ఒక డాలర్ చొప్పున ఖర్చు చేస్తే ఒక ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి 32 వేల సంవత్సరాలు పడుతుంది. కానీ అమెరికా ప్రభుత్వం దాదాపు ప్రతి 90 రోజులకు ఒక ట్రిలియన్ డాలర్ల మేర కొత్త అప్పు సృష్టిస్తోంది" అని పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో ప్రజలు డబ్బును పొదుపు చేయాలా? అని ప్రశ్నిస్తూ, తన పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’లో చెప్పిన మూడు ప్రధాన ఆర్థిక సూత్రాల్లో ఒకటైన "ధనవంతులు నగదును పొదుపు చేయరు" అనే విషయాన్ని గుర్తు చేశారు.తాను 1965 నుంచి వెండి, 1971 నుంచి బంగారం, 2012 నుంచి బిట్‌కాయిన్, 2022 నుంచి ఎథీరియం కూడబెట్టుకుంటున్నానని కియోసాకి వెల్లడించారు. అలాగే తన బంగారం, వెండి నిల్వలను స్విట్జర్లాండ్ వెలుపల ఉన్న స్విస్ వాల్ట్‌లలో భద్రపరుస్తున్నానని చెప్పారు. గతంలో అమెరికా ప్రభుత్వం బంగారం వ్యక్తిగత యాజమాన్యాన్ని నిషేధించి స్వాధీనం చేసుకున్న చరిత్ర ఉందని కూడా ఆయన తన పోస్టులో ప్రస్తావించారు.ప్రపంచం ప్రస్తుతం ఆర్థికంగా అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొంటోందని పేర్కొన్న కియోసాకి, "ఇవి ప్రపంచ చరిత్రలో అత్యంత అనిశ్చిత కాలాలు. జాగ్రత్తగా ఉండండి. నేను చేస్తున్నది ఇదే. మరి మీరు ఏమి చేస్తున్నారు?" అంటూ తన పోస్టును ముగించారు.HOW MUCH DEBT?FYI: In 2008, just before the GFC: (Great Financial Crisis) the US debt was approximately $9.5 trillion.Today, just as US Bonds are crashing, US Debt is approaching $39 trillion.Q: If you spent $1 a minute how long would it take you to spend $1 trillion?…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 25, 2026 -
అప్పులే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయ్!
అప్పు చేసినవాళ్లలో.. చాలా మంది వాటి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుల ఊబి నుంచి బయటకు రావడమే ఆర్థిక స్వేచ్ఛ అని భావిస్తారు. కానీ, కోటీశ్వరులు ఎప్పుడూ అలా ఆలోచించరు. ఈ కారణంగానే సామాన్యులు ఎప్పటికీ ధనవంతులు కాలేకపోతున్నారని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.బ్యాంకులు, ప్రభుత్వాలు, మన విద్యా వ్యవస్థలు ఎప్పుడూ చెప్పని కొన్ని ఆర్థిక రహస్యాలను కియోసాకి వెల్లడించారు. నిజానికి మన ఆర్థిక వ్యవస్థలో డబ్బు అనేది అప్పుల ద్వారానే సృష్టించబడుతుంది. ఒకవేళ ఎవరూ అప్పు చేయకుండా.. పూర్తిగా అప్పు లేని జీవితాన్ని గడపాలని చూస్తే.. వారు ఈ ఆర్థిక వ్యవస్థ వెలుపల బతుకుతున్నట్టే లెక్క.అమెరికా జాతీయ అప్పు నేడు 40 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది. అంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రభుత్వం కూడా అప్పుల మీదే నడుస్తోంది. అప్పుల్లేని వ్యవస్థ ఈ ప్రపంచంలో మనుగడ సాగించలేదు. మరి అలాంటప్పుడు, ప్రపంచంలోని అత్యంత ధనిక ప్రభుత్వమే అప్పులతో నడుస్తున్నప్పుడు.. సామాన్యులైన మనల్ని మాత్రం 'అప్పుల జోలికి వెళ్లొద్దు' అని ఎందుకు భయపెడతారు? ఇక్కడే అసలు రహస్యం ఉంది.ధనవంతులు అప్పును ఎలా వాడుకుంటారు?ఆర్థిక అవగాహన లేని వ్యక్తి అప్పు చేసి కార్లు, విహారయాత్రలు, బట్టలు వంటివి కొనుక్కుంటాడు. దీనివల్ల అతని జీవితం మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి పడిపోతుంది. అదే.. ఆర్థిక పరిజ్ఞానం ఉన్న ధనవంతుడు అప్పును రియల్ ఎస్టేట్, వ్యాపారాలు, లేదా నిలకడగా ఆదాయాన్నిచ్చే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తాడు.ఇక్కడ అసలు మ్యాజిక్ ఏమిటంటే.. అప్పును ధనవంతుడు స్వయంగా కట్టడు. అద్దెలు కట్టే కిరాయిదారులు లేదా వ్యాపారంలో వచ్చే సంపాదన ద్వారా ఆ అప్పు తీరిపోతుంది. ఎప్పుడైతే అప్పు మీ కోసం పనిచేసి, మీకు డబ్బు తెచ్చిపెడుతుందో.. అప్పుడే అది సంపదను సృష్టించే ఒక మిషన్ మాదిరిగా మారుతుందని కియోసాకి చెబుతారు.ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. మనం చేసే అప్పు మీద ఎలాంటి పన్ను ఉండదు. మీరు లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా, కోటి రూపాయలు తీసుకున్నా ఆదాయపు శాఖ దానిపై పన్ను వసూలు చేయలేదు.Loading post...అందుకే ధనవంతులు ''తమ దగ్గరున్న ఆస్తులను (Assets) బ్యాంకులో పెట్టి అప్పు తీసుకుంటారు. ఆ డబ్బుతో మరిన్ని కొత్త ఆస్తులను కొంటారు. ఆ ఆస్తుల ద్వారా వచ్చే అద్దెలు లేదా ఆదాయంతోనే అప్పును కట్టిస్తారు. ఆస్తిని ఎప్పటికీ అమ్మరు (అమ్మితే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి). ఆస్తిని అమ్మకుండా కేవలం దానిపై మళ్లీ మళ్లీ లోన్లు తీసుకుంటూ పన్ను లేని నగదును పొందుతారు''.ధనవంతుల ఆర్థిక రహస్యంచివరికి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు, ఆ ఆస్తులు వారసులకు బదిలీ అవుతాయి. అప్పుడు పన్ను భారం పూర్తిగా తొలగిపోతుంది. ఇది పూర్తిగా చట్టబద్ధమైన, అత్యంత సులభమైన వ్యూహం. ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి ఇదే అసలు రహస్యం.అప్పు తీసుకోవడం అనేది ప్రమాదకరమైన విషయం కాదు. అయితే ఏ విధమైన అప్పు తీసుకుంటున్నామనేదే ముఖ్యం. మీ జేబు నుంచి డబ్బులు తీసి అప్పు కడితే అది 'చెడ్డ అప్పు' (ఉదాహరణకు: క్రెడిట్ కార్డు బిల్లులు, కారు లోన్). అలా కాకుండా.. వేరే వాళ్లు (కిరాయిదారులు లేదా కస్టమర్లు) మీ అప్పును తీరుస్తుంటే అది 'మంచి అప్పు'.అయితే కోటీశ్వరులు అప్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. రిస్క్ తీసుకోకుండా ఎప్పుడూ ఫిక్స్డ్ వడ్డీ రేట్లను మాత్రమే ఎంచుకుంటారు, తగినంత డబ్బును రిజర్వ్‌లో ఉంచుకుంటారు. నిపుణుల సలహాలతో అప్పులను నిర్వహిస్తారు.మొత్తానికి అప్పు అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని సరిగ్గా వాడితే మిమ్మల్ని ధనవంతుణ్ణి చేస్తుంది, లేదంటే ముంచేస్తుంది. కాబట్టి, ఆర్థికంగా ఎదగాలంటే.. అప్పు లేకుండా బతకాలి అనే పాత పద్ధతిని పక్కన పెట్టి, అప్పులను తెలివిగా ఎలా వాడాలో నేర్చుకుంటే ధనవంతులు అవుతారు.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాల్.. సెక్షన్ 301తో దర్యాప్తు! -
‘బంగారం, వెండి కాదు.. భవిష్యత్తు ఆ లోహానిదే’
'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి ఇన్వెస్టర్ల దృష్టిని కమోడిటీ మార్కెట్‌పైకి మళ్లించారు. ఈసారి బంగారం, వెండి కాకుండా రాగి (కాపర్) భవిష్యత్తుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాగి ధరలు గత ఏడాదిలో దాదాపు 50 శాతం పెరిగాయని, అయినప్పటికీ ఈ పెరుగుదల వెనుక ఉన్న అసలు కారణాలను చాలా మంది గుర్తించలేకపోతున్నారని ఆయన ఫేస్బుక్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.కియోసాకి ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లు, విద్యుత్ గ్రిడ్ల విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వేగంగా పెరుగుతుండటంతో రాగికి భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ రంగాలన్నీ విడివిడిగా కాకుండా ఒకేసారి రాగిని అధికంగా వినియోగిస్తున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రపంచ రాగి డిమాండ్ సుమారు 2.8 కోట్ల టన్నులుగా ఉండగా, 2040 నాటికి అది 4.2 కోట్ల టన్నులకు మించి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనాలను ఆయన ప్రస్తావించారు.అయితే మరోవైపు రాగి ఉత్పత్తి అంతే వేగంగా పెరగడం లేదని కియోసాకి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుల్లో ఒకటైన చిలీలో ఈ ఏడాది ఉత్పత్తి 9.5 శాతం తగ్గిందని, వచ్చే ఏడాదిలో కూడా ఉత్పత్తి తగ్గే అవకాశముందని గనుల సంస్థలు హెచ్చరిస్తున్నాయని చెప్పారు. గనుల్లో లభించే ఖనిజ నాణ్యత కూడా గత రెండు దశాబ్దాలుగా క్షీణిస్తుండటంతో, అదే పరిమాణంలో రాగిని పొందేందుకు గతంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ రాళ్లను తవ్వాల్సి వస్తోందని వివరించారు.ఈ పరిస్థితిని కియోసాకి "కాపర్ సిజర్స్"గా అభివర్ణించారు. ఒకవైపు డిమాండ్ పెరుగుతుండగా, మరోవైపు సరఫరా తగ్గిపోతోందని, ఈ రెండు పరిస్థితులు కలిసి ధరలను మరింత పెంచే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.సాంప్రదాయిక పొదుపు పథకాలపై మాత్రమే ఆధారపడే వారు ఈ పరిస్థితిలో నష్టపోయే ప్రమాదం ఉందని, మారుతున్న ఆర్థిక ధోరణులను అర్థం చేసుకుని పెట్టుబడి అవకాశాలను గుర్తించాల్సిన అవసరం ఉందని కియోసాకి సూచించారు. ఏ గనుల కంపెనీ విజయం సాధిస్తుందో ఊహించడం కంటే, ఏ సంస్థలు లేదా రంగాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ లాభపడతాయనే దానిపై దృష్టి పెట్టాలని తన 'రిచ్ డాడ్' తనకు నేర్పిన పాఠమని ఆయన పేర్కొన్నారు. -
‘అదిగో.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది’
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ పెట్టుబడి నిపుణుడు రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం దిశగా సాగుతోందని మరోసారి హెచ్చరించారు. తాను గతంలో రచించిన ‘రిచ్ డాడ్స్ ప్రాఫెసీ’ (Rich Dad's Prophecy) పుస్తకంలోనే ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఆ పుస్తకంలోని సూచనలను అనుసరించిన వారు ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నారని తెలిపారు.ఇప్పటికీ ఆలస్యం కాలేదని, తమ ఆర్థిక నిర్ణయాల్లో అవసరమైన మార్పులు చేసుకోవాలని కియోసాకి తనను అనుసరించేవారికి సూచించారు. ప్రతి ఆర్థిక పతనంలో ఎంతోమంది తమ సంపదను కోల్పోతారని, అదే సమయంలో కొందరు మాత్రం సరైన వ్యూహాలతో మరింత ధనవంతులవుతారని చెప్పారు. అలాంటి వారిలో మీరు కూడా ఒకరుగా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తన ఎక్స్ (X) పోస్టులో పేర్కొన్నారు.తనను ఎక్స్‌లో అనుసరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపిన కియోసాకి, ఆర్థిక పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తన సందేశాన్ని ముగించారు. ఈ పోస్టు మరోసారి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడి వ్యూహాలపై చర్చకు దారితీసింది. గత కొన్నేళ్లుగా కియోసాకి పలుమార్లు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2026–27 కాలంలో ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని కూడా ఇటీవల పేర్కొన్నారు.REPEATING: Global economy is crashing. I predicted this in my book Rich Dad’s Prophecy.Those that followed the guidance in that book are OK today.Please remember, it’s not too late to make changes now.Please remember in every crash many people are wiped out and a few…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 22, 2026 -
స్కూల్లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు!
గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్, బిట్‌కాయిన్ వంటివాటిలో పెట్టుబడుల గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' ఇప్పుడు డబ్బు విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన ఫేస్బుక్ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో..మన జీవితంలో ప్రతి వయసుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా 20, 30, 40 సంవత్సరాల వయసు అనేది మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కీలక దశలు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మన జీవితాంతం ప్రభావం చూపిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ డబ్బు సంపాదించడం, పెట్టుబడులు పెట్టడం, ఆస్తులు సృష్టించడం వంటి విషయాలను మనకు ఎవరూ స్పష్టంగా నేర్పించరు.20 ఏళ్ల వయసులో.. డబ్బు కంటే నేర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమయంలో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కంటే, మనకు ఎక్కువ అనుభవం, కొత్త నైపుణ్యాలు నేర్పించే అవకాశాలను ఎంచుకోవడం మంచిది. సేల్స్ ఎలా చేయాలి, డబ్బు ఎలా తిరుగుతుంది, వ్యాపారం ఎలా నడుస్తుంది, ఆర్థిక విషయాలను ఎలా అర్థం చేసుకోవాలి? వంటి అంశాలు నేర్చుకోవాలి. ఈ వయసులో సంపాదన కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు.. ఎందుకంటే మనం సంపాదించుకునే జ్ఞానం, నైపుణ్యాలు భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలను తీసుకొస్తాయి.30 ఏళ్ల వయసు.. వచ్చేసరికి ఆస్తులు నిర్మించడం ప్రారంభించాలి. అంటే.. కేవలం జీతం మీద ఆధారపడకుండా, భవిష్యత్తులో ఆదాయం వచ్చే మార్గాలను ఏర్పాటు చేసుకోవాలి. చిన్న మొత్తంతో అయినా పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకోవాలి. అది ఒక చిన్న వ్యాపారం కావచ్చు, రియల్ ఎస్టేట్ పెట్టుబడి కావచ్చు లేదా ప్రతి నెల ఆదాయం వచ్చే ఏదైనా మార్గం కావచ్చు. మొత్తం మీద ఈ వయసులో పెట్టుబడులు పెట్టడం గురించి తెలుసుకోవాలి, ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం.ఇక 40 ఏళ్ల వయసులో.. కేవలం జీతం కోసం పనిచేసే పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. ఈ దశలో మన ఆదాయాన్ని ఆస్తులుగా మార్చుకోవాలి. ఎందుకంటే ఒక ఉద్యోగంపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరంగా మారవచ్చు. ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మనం పని చేయకపోయినా ఆదాయం వచ్చే విధంగా పెట్టుబడులు, వ్యాపారాలు లేదా ఇతర ఆదాయ మార్గాలను పెంచుకోవాలి.నిజానికి డబ్బు గురించి చాలా ముఖ్యమైన విషయాలు మనకు పాఠశాలల్లో నేర్పించరు. మంచి ఉద్యోగం సంపాదించడం మాత్రమే కాదు.. సంపాదించిన డబ్బును ఎలా పెంచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనేది కూడా తప్పకుండా తెలుసుకోవాలి. 20ల్లో నేర్చుకోవాలి.. 30ల్లో నిర్మించాలి.. 40ల్లో ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు వేయాలి. ఈ సూత్రాలను ముందుగానే అర్థం చేసుకుంటే, భవిష్యత్తులో డబ్బు కోసం మాత్రమే పనిచేయకుండా, డబ్బు మన కోసం పనిచేసే పరిస్థితిని సృష్టించుకోవచ్చు అని కియోసాకి చెబుతున్నారు.ఇదీ చదవండి: ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ -
కియోసాకికి కోపమొచ్చింది.. ‘పందులకు ఎంత చెప్పినా వేస్టే’
ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి డబ్బు, ఆర్థిక విద్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (X)వేదికగా చేసిన తాజా పోస్టులో, "నేర్చుకోవాలనే ఆసక్తి లేని వారికి బోధించడానికి ప్రయత్నించడం సమయ వృథా" అని పేర్కొన్నారు."పందికి పాటలు నేర్పొద్దు. అది మీ సమయాన్ని వృథా చేయడమే కాకుండా, పందిని కూడా చిరాకు పెడుతుంది" అనే సామెతను ఉదహరిస్తూ, జీవితంలో తాను నేర్చుకున్న అత్యంత కఠినమైన పాఠాల్లో ఇదొకటని కియోసాకి చెప్పారు. తాను ఎక్కువ మందికి డబ్బు గురించి అవగాహన కల్పించి, వారిని ఆర్థికంగా బలంగా, స్వేచ్ఛగా చూడాలనుకున్నప్పటికీ, చాలామంది తన సలహాలను అంగీకరించరని వెల్లడించారు.డబ్బు అనేది వ్యక్తిగతం, భావోద్వేగాలతో కూడుకున్నది, కుటుంబ విలువలు, సంస్కృతితో ముడిపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో పెరిగిన వారిలో డబ్బుపై స్థిరమైన అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సందర్భాల్లో తన సలహాలు వారికి ఇబ్బందిగా అనిపిస్తాయని వ్యాఖ్యానించారు."నేర్చుకోవాలనే ఆసక్తి లేని వారికి బోధించకూడదనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే నా పోస్టులను చదువుతూ, డబ్బు గురించి మరింత తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని కియోసాకి తెలిపారు.అలాగే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు మరింత అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. చైనా ఎదుగుదల, అమెరికా ఆర్థిక పరిస్థితి, కృత్రిమ మేధ (AI) కారణంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో ఆర్థిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే ఆర్థిక విజ్ఞానం పెంపొందించుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో మరింత అవసరమని ఆయన తన పోస్టులో సూచించారు.“Don’t teach pigs to sing. It wastes your time…. and annoys the pig.”I would guess most of us, you, me, we…want to help our fellow human beings….if we could.Yet sometimes our help is rejected because “it annoys the pig.”This lesson has been one of the hardest lessons…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 19, 2026 -
ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ
చాలామంది ధనవంతుడు, సంపన్నుడు పదాలు ఒకే అర్థంలో ఉపయోగిస్తుంటారు. కానీ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉందని రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ధనవంతుడుఒక వ్యక్తి ఏడాదికి లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుంటే.. అతన్ని ధనవంతుడు అని అంటారు. ఉదాహరణకు ఒక డాక్టర్ సంవత్సరానికి రూ. మూడు కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ అతడు జాబ్ మానేస్తే (పని ఆపేస్తే) ఆదాయం కూడా ఆగిపోతుంది. అంటే అతని జీవనశైలి పూర్తిగా అతను చేసే పనిపై ఆధారపడి ఉంటుందన్నమాట.సంపన్నుడుసంపన్నుడు అంటే తన ఆస్తుల ద్వారా నిరంతరం ఆదాయం పొందే వ్యక్తి. అంటే అతను పని చేయకపోయినా, అతని పెట్టుబడులు, వ్యాపారాలు, ఆస్తులు అతనికి ఆదాయాన్ని అందిస్తాయి. అంటే ఆ వ్యక్తి డబ్బు సంపాదించడానికి కేవలం తన సమయాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.అందుకే.. ఆర్థికంగా ఎదగాలంటే కేవలం ఎక్కువ జీతం లేదా ఎక్కువ ఆదాయం సంపాదిస్తే సరిపోదు. ఆ ఆదాయంతో భవిష్యత్తులో ఆదాయం తెచ్చే ఆస్తులను నిర్మించుకోవడం ముఖ్యం. ఇల్లు, వ్యాపారం, పెట్టుబడులు వంటి ఆస్తులు మనకు నిరంతర ఆదాయాన్ని అందిస్తాయి.సాధారణంగా ఒక ధనవంతుడు నేను ఎంత సంపాదిస్తున్నను? అని మాత్రమే ఆలోచిస్తాడు. కానీ సంపన్నుడు నాకు ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులు ఎన్ని ఉన్నాయి అని లెక్క వేసుకుంటాడు. దీన్నిబట్టి చూస్తే.. ఒక్క ఆలోచనా విధానమే వారి ఆర్థిక జీవితాన్ని మార్చేస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది.ఇదీ చదవండి: సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహాఎక్కువ ఆదాయం సంపాదించడం ఒక్కటే నిజమైన సంపదకు గుర్తు కాదు. మన దగ్గర ఉన్న ఆస్తులు మనకు నిరంతరం ఆదాయం తెచ్చిపెడుతున్నాయా లేదా అనేదే అసలు విషయం. కాబట్టి డబ్బుకోసం మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం లేకుండా.. మన డబ్బు మన కోసం పనిచేసే స్థితిని ఏర్పరచుకోవడమే నిజమైన సంపన్నత. -
బంగారంపై మళ్లీ కియోసాకి ‘భారీ’ కామెంట్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండి పెట్టుబడులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పెట్టుబడిదారుడు జిమ్ రోజర్స్ అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, "బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగి 'చంద్రుడి' దాకా వెళ్తాయి" అని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.అయితే ధరలు నేరుగా పెరగవని, మధ్యలో భారీ పతనాలు (రిట్రేస్మెంట్లు) కూడా తప్పవని జిమ్ రోజర్స్ చెప్పిన విషయాన్ని కియోసాకి గుర్తు చేశారు. ఇటీవల బంగారం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా తగ్గిందని, వెండి కూడా భారీ కరెక్షన్ను ఎదుర్కొందని తెలిపారు.చాలా మంది ఇన్వెస్టర్లు ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు కొనుగోలు చేసి, తర్వాత ధరలు పడిపోగానే భయంతో విక్రయిస్తారని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను మాత్రం ఈ ధరల పతనాన్ని అవకాశంగా తీసుకుని మరింత బంగారం, వెండి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.బంగారం, వెండి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఒక స్నేహితుడు అడిగితే, "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్యలను పరిష్కరిస్తాయనే నమ్మకం నాకు లేదు. నిజానికి అప్పులు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు వారే కారణం. ఇవి ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువ" అని తాను సమాధానం ఇచ్చినట్లు కియోసాకి తెలిపారు.చివరగా ఇన్వెస్టర్లను ఉద్దేశించి, "ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, తక్కువ ధరకు అమ్ముతారా? లేక తక్కువ ధర వద్ద కొనుగోలు చేసి సంపదను సృష్టిస్తారా? బంగారం, వెండి ధరలు ఇంకా భారీగా పెరుగుతాయి" అంటూ తన పోస్టును ముగించారు. అయితే ఇవి ఆయన వ్యక్తిగత పెట్టుబడి అభిప్రాయాలేనని, పెట్టుబడులు పెట్టే ముందు సొంతంగా విశ్లేషించుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.“Gold and silver going to the moon.”Legendary investor Jim Rogers.Jim states further, that the prices of gold and silver will go to the moon, yet not without severe retracements. Gold and silver just went through a severe retracements.Recently gold hit a high of…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 17, 2026 -
సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహా
ఒక వ్యక్తి ఎంత చదువుకున్నాడు అనే విషయం మాత్రమే.. అతని ఆర్థిక విజయాన్ని నిర్ణయించదని చెబుతారు రాబర్ట్ కియోసాకి. డబ్బును ఎలా అర్థం చేసుకుంటాడు, దాన్ని ఎలా ఉపయోగిస్తాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేదే అతని ఆర్థిక స్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. చాలా మంది జీవితంలో ఒకే విధంగా కష్టపడుతున్నప్పటికీ, కొందరు సంపదను సృష్టిస్తారు, మరికొందరు డబ్బు సమస్యలతోనే కొనసాగుతారు. దీనికి ప్రధాన కారణం వారి ఆలోచనా విధానం.చదువు మాత్రమే సంపదను ఇవ్వదుకియోసాకి ఈ భావనను 'పూర్ డాడ్' - 'రిచ్ డాడ్' అనే రెండు భిన్నమైన ఆలోచనా విధానాలతో పోల్చారు.పూర్ డాడ్ బాగా చదువుకున్న వ్యక్తి. ఆయనకు ఉన్నత విద్య ఉన్నప్పటికీ, డబ్బు విషయంలో సాధారణంగా చాలామంది ఆలోచించే విధంగానే ఆలోచిస్తారు. ఉద్యోగం, స్థిరమైన ఆదాయం, భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.మరోవైపు రిచ్ డాడ్ పెద్దగా చదువుకోకపోయినా.. డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నారు. ఆయన ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించడం, ఆస్తులను పెంచుకోవడం వంటి విషయాలపై దృష్టి పెడతారు. అంటే దీని అర్థం చదువు అవసరం లేదని కాదు. విద్యతో పాటు ఆర్థిక అవగాహన కూడా చాలా ముఖ్యమని చెప్పడం.పెట్టుబడుల విషయంలో.. ఆలోచనలో తేడా!సాధారణంగా చాలామంది పెట్టుబడి పెట్టేటప్పుడు.. 'ఏ పెట్టుబడి సురక్షితమైనది?' అని అడుగుతారు. ఎందుకంటే నష్టం రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆర్థికంగా విజయవంతమైన వ్యక్తులు.. 'ఏ పెట్టుబడి నాకు ఆదాయం తెస్తుంది? దానిపై నాకు ఎంత నియంత్రణ ఉంటుంది? దాన్ని ఎలా పెంచుకోవచ్చు?' అని ఆలోచిస్తారు. అంటే ముఖ్యమైన విషయం కేవలం ఏ ఆస్తిలో పెట్టుబడి పెడుతున్నామన్నది కాదు. ఆ ఆస్తి గురించి మనకు ఎంత అవగాహన ఉందన్నదే అసలు విషయం.సేఫ్టీ కోసం వెతకడం vs జ్ఞానం సంపాదించడంపూర్ డాడ్.. 'ప్రమాదం వద్దు.. డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలి' అని అనుకుంటారు. కానీ రిచ్ డాడ్ ఆలోచన 'ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ముందుగా ఆ విషయం గురించి నేర్చుకోవాలి'. పెట్టుబడుల్లో రిస్క్ సహజం. కానీ అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం మరింత ప్రమాదకరం. ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టే రంగం గురించి తెలుసుకుంటే, సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. తద్వారా ధనవంతులు అవుతారు. -
‘ఇక చమురు కాదు.. రానున్నది సరికొత్త యుద్ధం’
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టి ప్రస్తుతం బిట్‌కాయిన్, షేర్లు, చమురు, రిటైర్మెంట్ ఫండ్లపై ఉండగా, అసలు భవిష్యత్తును నిర్ణయించేది మాత్రం ‘నీరు (Water Rights)’ అని ప్రముఖ ఆర్థిక రచయిత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత ‘రాబర్ట్ కియోసాకి’ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ పోస్టులో నీటి హక్కుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆసక్తికరమైన విశ్లేషణను పంచుకున్నారు.కియోసాకి ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత తెలివైన పెట్టుబడిదారులు ఇప్పటికే నీటి హక్కులపై దృష్టి పెట్టారని తెలిపారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రముఖ ఇన్వెస్టర్ ‘మైఖేల్ బర్రీ’ ఎన్నో సంవత్సరాలుగా నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని గుర్తుచేశారు. అలాగే అమెరికాలో 2.7 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కలిగి ఉన్న బిల్ గేట్స్ లక్ష్యం కేవలం వ్యవసాయం కాదని, ఆ భూములకు అనుబంధంగా ఉన్న నీటి హక్కులను భద్రపరచుకోవడమేనని పేర్కొన్నారు. అదేవిధంగా ‘చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్’ వాషింగ్టన్ రాష్ట్రంలో వేల ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం కూడా నీటి హక్కులేనని చెప్పారు.నీరు లేని భూమికి విలువే లేదు"నీరు లేని భూమి తక్కువ విలువైనది కాదు... పూర్తిగా విలువలేనిది" అని కియోసాకి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని మంచినీటిలో సుమారు 70 శాతం వ్యవసాయానికే వినియోగిస్తుండగా, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత, పెరుగుతున్న జనాభా, పాతబడిన నీటి సరఫరా వ్యవస్థలు భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరతకు దారితీస్తాయని హెచ్చరించారు. అమెరికాలోని కాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్, కొలరాడో నది పరివాహక ప్రాంతాల్లో ఈ సమస్య ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.నీటినీ ట్రేడ్ చేస్తున్న వాల్ స్ట్రీట్కియోసాకి వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలోని సీఎంఈ గ్రూప్ ఇప్పటికే వాటర్ ఫ్యూచర్స్ మార్కెట్‌ను ప్రారంభించింది. అంటే చమురు మాదిరిగానే నీటిని కూడా ఆర్థిక మార్కెట్లలో ట్రేడ్ చేస్తున్నారని చెప్పారు. కాలిఫోర్నియాలో కొన్ని ప్రాంతాల్లో భూమి కంటే దానికి సంబంధించిన నీటి హక్కులకే ఎక్కువ విలువ ఉందని పేర్కొన్నారు. పెట్టుబడి సంస్థలు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, కొంతకాలం రైతులకు లీజుకు ఇచ్చి, అనంతరం ఆ నీటి హక్కులను నగరాలకు విక్రయించి భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని వివరించారు.ధనవంతుల పెట్టుబడుల వ్యూహం ఇదే!మధ్యతరగతి ప్రజలు మ్యూచువల్ ఫండ్లు, సాధారణ పెట్టుబడుల్లో డబ్బు పెడుతుంటే, ధనవంతులు మాత్రం భూమితో పాటు దానికి సంబంధించిన నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని కియోసాకి అభిప్రాయపడ్డారు. నీటి కొరత పెరిగే కొద్దీ ఆ హక్కుల విలువ మరింత పెరుగుతుందని, తర్వాత వాటిని నగరాలకు విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం ద్వారా భారీ లాభాలు పొందుతున్నారని చెప్పారు.తన 'రిచ్ డాడ్' తనకు నేర్పిన ఒక ముఖ్యమైన సూత్రాన్ని కూడా కియోసాకి గుర్తుచేశారు. "ఏది లేకుండా ప్రపంచం జీవించలేదదో అలాంటి ఆస్తిని కొనుగోలు చేయి" అని తన గురువు చెప్పారని పేర్కొన్నారు. గత 100 సంవత్సరాల్లో ఆ ఆస్తి చమురైతే, రాబోయే 100 సంవత్సరాల్లో అది ‘నీరు’ అవుతుందని తన ఫేస్బుక్ పోస్టులో కియోసాకి అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. -
అమెరికా గడ్డపై అతిపెద్ద 'బంగారు గని' నిజమేనా?
ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇన్వెస్టర్లలో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ భూభాగంలో 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 84 లక్షల కోట్లు) విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపాన్ని వెలికితీసేందుకు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ఆయన పేర్కొన్నారు.తనకు సన్నిహితుడైన ప్రముఖ పసిడి నిపుణుడు జిమ్ రిక్కార్డ్స్ సమాచారం ప్రకారం.. ఈ పథకం ద్వారా రాబోయే కొన్ని నెలల్లోనే 10 రెట్లు లాభాలు వచ్చే అవకాశం ఉందని కియోసాకి చెప్పుకొచ్చారు. అయితే, కియోసాకి పోస్ట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అసలు నిజం ఏంటి?ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ పోస్ట్‌లో పేర్కొన్న "ట్రంప్ గోల్డ్ మైన్" అనేది కొత్తగా కనుగొన్నదేమీ కాదు. అలాస్కా ప్రాంతంలో ఎప్పటి నుంచో వివాదాల్లో ఉన్న 'డాన్లిన్ గోల్డ్' (Donlin Gold) లేదా 'పెబుల్ మైన్' (Pebble Mine) వంటి పాత మైనింగ్ ప్రాజెక్టులను ఉద్దేశించి ఈ ప్రచారం జరుగుతోంది. ఇవి పెద్ద నిక్షేపాలే అయినప్పటికీ, అధ్యక్షుడి ఒక్క ఆదేశంతో రాత్రికి రాత్రే బంగారం బయటకు వచ్చేసే పరిస్థితి లేదు. వీటికి ఎన్నో పర్యావరణ అనుమతులు, చట్టపరమైన చిక్కులు ఉన్నాయి.10 రెట్ల లాభాలు సాధ్యమేనా?కొద్ది నెలల్లోనే 10 రెట్లు లాభాలు వస్తాయనే వాదనను మార్కెట్ నిపుణులు తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. ఇదంతా జిమ్ రిక్కార్డ్స్ నడుపుతున్న ఒక ప్రీమియం ఫైనాన్షియల్ న్యూస్‌లెటర్ సబ్స్క్రిప్షన్లను అమ్ముకోవడానికి చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని కొందరు ఆరోపిస్తున్నారు. బంగారం, మైనింగ్ రంగాలు చాలా అస్థిరంగా ఉంటాయని, తక్కువ సమయంలో ఇలాంటి అసాధారణ లాభాలు రావడం దాదాపు అసాధ్యమని వారు హెచ్చరిస్తున్నారు. -
యువతకు అలర్ట్.. రాబర్ట్ కియోసాకి పోస్ట్!
బంగారం, వెండి, బిట్‌కాయిన్ గురించి చెప్పే 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఏఐ గురించి, ఉద్యోగాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. దాని ప్రభావం ఉద్యోగాలపై కూడా అంతే వేగంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఏఐ టెక్నాలజీని తమ పనుల్లో ఉపయోగించడం మొదలెట్టేశాయి. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని కియోసాకి పేర్కొన్నారు.అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి అభిప్రాయం ప్రకారం.. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువ ఉద్యోగులు రాబోయే కాలంలో ఏఐ ప్రభావానికి గుయారవుతారు. నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, డేటా విశ్లేషణ వంటివన్నీ కూడా ఏఐ చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. అనేక కంపెనీల సీఈఓలు కూడా ఈ మార్పుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.అమెరికా వద్ద ఏఐ అభివృద్ధికి కావలసిన స్పష్టమైన వ్యూహం ఉన్నప్పటికీ.. ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులను ఎలా సిద్ధం చేయాలనే దానికి కావాల్సిన ప్రణాళిక లేదని పేర్కొన్నారు. కాబట్టి యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాలు లేదా ఇతర కంపెనీల మీద ఆధారపడకుండా.. తమ భవిష్యత్తును తామే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.జాబ్ చేస్తున్నవారు సైతం కేవలం ఒక ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఏఐతో ఎలా కలిసి పనిచేయాలి అనే విషయాలను నేర్చుకోవాలి. అవసరమైతే సొంతంగా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడం ముఖ్యమని చెబుతున్నారు. మొత్తం మీద ఏఐ ఉద్యోగాలకు ముప్పు తెస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. -
ఈసారి బంగారం, వెండి కాదు! కియోసాకి కొత్త సూచన
ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆయన ఇన్వెస్టర్లకు బిట్‌కాయిన్, బంగారం లేదా వెండి కొనాలని కాకుండా.. ఒక పుస్తకం తప్పనిసరిగా చదవాలని సూచించడం విశేషం.ఇటీవల సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టులో మిక్కీ ఎం. మైనీ రచించిన 'ది ఎంట్రోపీ ట్రాప్' (The Entropy Trap) పుస్తకాన్ని ప్రస్తుత కాలంలో తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథంగా పేర్కొన్నారు. ఈ పుస్తకానికి ప్రముఖ ఆర్థికవేత్త ‘జిమ్ రికార్డ్స్’ ముందుమాట రాశారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోయే నిర్మాణాత్మక మార్పులను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు.'నమ్మకంపై ఆధారపడిన ఆస్తులకు ప్రమాదం'ఈ పుస్తకం ప్రధానంగా "నమ్మకంపై ఆధారపడిన ఆస్తులు" (Trust-based Assets) భవిష్యత్తులో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలపై చర్చిస్తుందని కియోసాకి తెలిపారు. అమెరికా ప్రభుత్వ బాండ్లు, ఈటీఎఫ్‌లు (ETFs), మ్యూచువల్ ఫండ్లు వంటి పెట్టుబడి సాధనాలు పూర్తిగా వ్యవస్థపై విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయని, ఆ విశ్వాసం దెబ్బతింటే వాటి విలువ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇవి కియోసాకి వ్యక్తిగత అభిప్రాయాలేనని, వాటికి స్వతంత్ర ఆర్థిక ఆధారాలు లేవని గుర్తుంచుకోవాలి.'నేటి ధనవంతులే రేపటి పేదలు కావచ్చు'పాత ఆర్థిక నియమాలను మాత్రమే నమ్ముతూ పెట్టుబడులు పెట్టేవారు భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న మార్పులను ముందుగానే అర్థం చేసుకునే వారే రేపటి సంపన్నులవుతారని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. "సమాచారమే అసలు సంపద" అనే సందేశాన్ని ఆయన మరోసారి నొక్కిచెప్పారు.కొద్ది రోజుల క్రితమే బంగారం ధరలపై తన స్వల్పకాలిక అంచనా తప్పిందని కియోసాకి బహిరంగంగా అంగీకరించారు. బంగారం ఇంకా పడిపోతోందని, మార్కెట్లలో ఇలాంటి హెచ్చుతగ్గులు సహజమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ, వచ్చే ఐదేళ్లలో బంగారం ఔన్స్‌కు 35,000 డాలర్ల స్థాయికి చేరుతుందన్న తన దీర్ఘకాలిక అంచనాను మాత్రం మార్చలేదు.VIB: Very Important BOOK.Best most important new book for this time in history became available on Amazon last week.WHY: is book so important.?A: Because book explains why today’s Rich will become tomorrows poor.WHY: Because the informed will be tommorrow’s ULTRA…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 7, 2026 -
‘రిచ్ డాడ్’ జీవితాన్ని మార్చిన భారతీయ గురువు
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చదివే వర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలలో ఒకటైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన ఆలోచనలతో చర్చనీయాంశంగా మారారు. డబ్బు సంపాదించడమే జీవిత పరమావధి కాదని, ప్రతి వ్యక్తి తన జీవితం అసలు ఉద్దేశాన్ని గుర్తించి దాని కోసం పనిచేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది.కొన్నేళ్ల క్రితం ఓ భారతీయ గురువు చెప్పిన మాట తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని కియోసాకి వెల్లడించారు. "మీ శరీరం లక్ష్యం.. మీ ఆత్మ లక్ష్యాన్ని నెరవేర్చడమే" అనే ఆ బోధ అప్పట్లో తనకు పూర్తిగా అర్థం కాలేదని, ఆ సమయంలో తాను కేవలం డబ్బు సంపాదించడంలోనే నిమగ్నమై ఉన్నానని పేర్కొన్నారు. అయితే కాలక్రమేణా తన నిజమైన లక్ష్యం బోధించడమేనని గ్రహించినట్లు చెప్పారు.విద్యార్థి దశలో చదువులో అంతగా రాణించకపోయినా, సాంప్రదాయ విద్యా విధానం తనకు నచ్చకపోయినా, ప్రజలకు ఆర్థిక విజ్ఞానాన్ని అందించడం తన జీవిత ధ్యేయంగా మారిందని కియోసాకి వివరించారు. పాఠశాలల్లో డబ్బు నిర్వహణ గురించి సరైన అవగాహన కల్పించడం లేదనే నమ్మకంతో ఐదు దశాబ్దాల క్రితమే తయారీ రంగాన్ని విడిచి, తన "రిచ్ డాడ్" నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాలను ప్రజలకు బోధించడం ప్రారంభించానని చెప్పారు. అదే నిర్ణయం తన జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు.చాలామంది జీవితమంతా ఉద్యోగం, సంపాదన, ఆర్థిక ఒత్తిళ్లలోనే గడిపేస్తున్నారని, అందువల్ల తమ అసలు జీవిత లక్ష్యాన్ని గుర్తించలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. "మానవాళికి సేవ చేయడానికి నా హృదయం ఏమి చేయాలనుకుంటోంది?" అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాలని, ఫలితం లేదా డబ్బు గురించి ఆలోచించకుండా ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఆయన ప్రకారం, నిజమైన లక్ష్యంతో చేసే పని చివరికి ఆర్థిక విజయాన్నీ తీసుకువస్తుంది.ప్రారంభంలో తాను ఉచితంగా ఆర్థిక విద్య అందించానని, "పొదుపుదారులు ఓడిపోతారు", "సరైన రుణం సంపదను సృష్టించగలదు" వంటి తన అభిప్రాయాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని కియోసాకి గుర్తు చేశారు. అయినప్పటికీ అదే ప్రయత్నం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్ల డాలర్ల వ్యాపారంగా ఎదిగిందని తెలిపారు.అమెరికా పౌరహక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటలను కూడా కియోసాకి ప్రస్తావించారు. విమర్శలు, వ్యతిరేకత ఎదురైనా తన లక్ష్యాన్ని వదిలిపెట్టని కింగ్‌ను ఉదాహరణగా చూపిస్తూ, చివరగా "మీ ఆత్మ అసలు లక్ష్యం ఏమిటి?" అంటూ తన ఫాలోవర్లకు ప్రశ్న వేశారు.What is your life’s mission?Years ago, I was listening to an Indian Guru who said:“Your body’s mission is to fulfill your spirit’s mission.” His words shook me. At the time my body was busy making money.It took me a long time to figure out what was my spirit’s mission?…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2026 -
నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్!
బంగారం, వెండి ధరలు పెరుగుతాయని సూచించే రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.తాను బంగారం ధరల విషయంలో చేసిన అంచనా తప్పిందని, ధరలు ఇంకా తగ్గిపోతాయని కియోసాకి నిజాయితీగా అంగీకరించారు. అయితే.. మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో కదలవని, పెరుగుదలతో పాటు పతనం కూడా సహజమేనని పేర్కొన్నారు. బంగారం ధరలు వరుసగా తగ్గుతున్న వేళ ఈ ట్వీట్ చేశారు.పెట్టుబడుల్లో అసలు లాభం అమ్మే సమయంలో కాకుండా, సరైన సమయంలో కొనుగోలు చేసినప్పుడే ఏర్పడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, రాబోయే ఐదేళ్లలో అవి 35 వేల డాలర్ల (ఔన్సు) స్థాయికి చేరుతాయని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టే వారే నిజమైన సంపదను సృష్టించగలరని, రోజువారీ ధరల మార్పులను చూసి నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని సూచించారు.అంతే కాకుండా.. తప్పులు చేయడం సహజమని, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే విజయానికి దారి తీస్తుందని చెప్పారు. ఎలాంటి తప్పులు చేయని వారు కొత్త విషయాలు నేర్చుకోలేరని, పెట్టుబడిదారులు ఓర్పు, దీర్ఘకాలిక ఆలోచన, అనుభవాల నుంచి నేర్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.భారతదేశంలో బంగారం ధరలుమన దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (జూన్ 29) కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు వరుసగా రూ.850 (22 క్యారెట్స్), రూ.930 (24 క్యారెట్స్) తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు కొంత పతనమయ్యాయి.I was wrong. Gold still crashing!Thats real life. RD Lesson: Profuts are made when you buy…. Not when you sell.I still believe gold will be $35 k in about 5-years.But that is real life: All markets go up and down.Another RD lesson: The richest investors invest for…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 29, 2026 -
పసిడి పరుగు ఆగేలా లేదు: కియోసాకి
'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారంపై తన బలమైన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. తాను బంగారం కొనుగోలు చేసిన మరుసటి రోజే ఔన్స్‌కు 62 డాలర్లు పెరిగిందని పేర్కొంటూ, ఇది కొత్త బుల్‌రన్‌కు సంకేతం కావచ్చని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తెలిపారు. మార్కెట్ విశ్లేషకుడు జిమ్ రికార్డ్స్ అంచనాను ప్రస్తావిస్తూ, బంగారం ధర ఔన్స్‌కు 35,000 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని తాను కూడా నమ్ముతున్నట్లు వెల్లడించారు.కియోసాకి ప్రకారం.. ఇన్వెస్టర్లు కేవలం వార్తలు లేదా భావోద్వేగాల ఆధారంగా కాకుండా టెక్నికల్ అనాలిసిస్ (TA) నేర్చుకోవడం అత్యంత అవసరం. మార్కెట్లు ఎప్పుడు ఎగుస్తాయి, ఎప్పుడు పడిపోతాయి అన్న సంకేతాలను చార్టుల ద్వారా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటే, మార్కెట్ పెరిగినా, కుప్పకూలినా అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన సూచించారు. అయితే టెక్నికల్ అనాలిసిస్‌ను నేర్చుకోవడానికి తనకు ఎన్నో సంవత్సరాలు పట్టిందని కూడా చెప్పారు.ఇటీవలే బంగారం ధరలు తగ్గుతున్న సమయంలో తాను వెంటనే కొనుగోళ్లు చేయబోనని, ముందు మార్కెట్లో బాటమ్ ఏర్పడిందని చార్టులు నిర్ధారించేవరకు వేచి చూస్తానని కియోసాకి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మలుపు వచ్చినట్లు కనిపిస్తోందని చెబుతూ మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినట్లు వెల్లడించారు.Yay: I may have picked the turnin price of gold.Gold up $62 since I purchased yesterday. Possibly on a bull run to $35k if Jim Rickards is correct…. and I think he is. LESSON: An important study for you to increase your financial education is Technical Analysis,how…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 27, 2026 -
35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్
బంగారం, వెండి ధరలు తారుమారవుతున్న వేళ 'రాబర్ట్ కియోసాకి' ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగారం ఇప్పుడే మలుపు తిరిగింది. నా అంచనా తప్పయినప్పటికీ.. గోల్డ్, సిల్వర్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.పెట్టుబడిదారుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు భవిష్యత్తులో బంగారం ధర 35,000 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా.. గత అనుభవాలను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో ప్రారంభమైన పెద్ద బుల్ రన్ సమయంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అప్పట్లో కొందరు పెట్టుబడిదారులు మంచి లాభాలను పొందారు. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు మళ్లీ ఏర్పడవచ్చని ఆయన పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అప్పుల భారంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ కరెన్సీలపై నమ్మకం తగ్గి, బంగారం వంటి సురక్షితమైన ఆస్తులపై డిమాండ్ పెరుగుతుందని కియోసాకి చెప్పారు.'బంగారం అనేది నిజమైన డబ్బు, మిగతావన్నీ క్రెడిట్ మాత్రమే' అనే జేపీ మోర్గాన్ అభిప్రాయాన్ని కూడా కియోసాకి ఉదహరించారు. దీన్నిబట్టి చూస్తే.. అమెరికన్ డాలర్ కూడా ఒక రకమైన అప్పు ఆధారిత వ్యవస్థగా కనిపిస్తుందని వారు అంటున్నారు. అందువల్ల ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం, వెండి వంటి ఆస్తులు మరింత బలపడతాయని చెబుతున్నారు.అంతే కాకుండా.. ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది భవిష్యత్తులో ఆర్థిక, ఉద్యోగ, పెట్టుబడి రంగాల్లో పెద్ద మార్పులను తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఈ మార్పుల మధ్య పెట్టుబడిదారులు తమ ఆర్థిక నిర్ణయాలను మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది.GOLD just made the turn.I think and I have been wrong, the price of gold and silver are about to rise for a long time. Jim Rickards predicts $35,000 gold in near future.As I stated in my previous X the last big bull run began in 2000 and I bought gold at $300.In 2026 the…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 25, 2026 -
బంగారం మరింత కొనే సమయం వచ్చిందా?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రపంచ ప్రఖ్యాత ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) బంగారం ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతుండటం మంచి వార్తేనని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతం మరింత బంగారం కొనుగోలు చేసే సమయం వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవడానికి సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.ధరలు తగ్గుతున్నాయనే కారణంతోనే పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక ఇంటి ధర తగ్గితే కేవలం తక్కువ ధర చూసి కొనుగోలు చేయరని, ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతోందో కూడా పరిశీలిస్తామని ఉదాహరణగా వివరించారు. అదే విధంగా బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? ఆర్థిక వ్యవస్థలో ఏమి జరుగుతోంది? అనే అంశాలను తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.ఆర్థిక పరిస్థితులు బలహీనపడుతున్నాయని భావిస్తే తాను బంగారం కొనుగోలుకు దూరంగా ఉండవచ్చని, కానీ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల దిశగా సాగుతోందని సంకేతాలు కనిపిస్తే తక్కువ ధరల వద్ద బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న బంగారంలో చాలా భాగాన్ని 2000 ప్రాంతంలో ఔన్స్‌కు సుమారు 300 డాలర్ల ధర వద్ద కొనుగోలు చేశానని కియోసాకి గుర్తుచేశారు.మార్కెట్ ధోరణి (ట్రెండ్)ను గమనించడం పెట్టుబడిదారులకు అత్యంత కీలకమని, ధరల కంటే వాటి వెనుక ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడమే విజయవంతమైన పెట్టుబడులకు మూలమని ఆయన తన పోస్ట్‌లో సూచించారు.GREAT NEWS: Gold continues to drop in price. Watching technical charts to know when to buy more.TREND is your FRIEND!!!!! Repeating past lesson.Price is like knowing the price of a house is going down.What I want to know what is happening in the neighborhood?If…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 24, 2026 -
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ఇద్దరు నాన్నల ఆశీర్వాదం!
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి ఫాదర్స్ డే సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. తాను ఎప్పుడూ తండ్రి కాలేకపోయినా, జీవితంలో ఇద్దరు తండ్రుల ఆశీర్వాదం పొందానని పేర్కొన్నారు. ఒకరు తన "పూర్ డాడ్", మరొకరు "రిచ్ డాడ్" అని తెలిపారు.వారి నుంచి నేర్చుకున్న జీవిత పాఠాలే తన ఆలోచనా విధానాన్ని మార్చాయని, ఆ అనుభవాలను ప్రపంచానికి "రిచ్ డాడ్ పూర్ డాడ్" పుస్తకం ద్వారా అందించగలిగానని కియోసాకి చెప్పారు. ఆ పాఠాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను సుసంపన్నం చేశాయని ఆయన పేర్కొన్నారు."తండ్రిగా ఉండటం జీవితంలో అత్యంత ముఖ్యమైన బాధ్యత. మీరు తండ్రి అయినా కాకపోయినా, ఈ రోజు మీ నాన్నకు కృతజ్ఞతలు చెప్పండి" అని కియోసాకి తన సోషల్ మీడియా పోస్టులో పిలుపునిచ్చారు. కుటుంబ విలువలు, తల్లిదండ్రుల మార్గదర్శకత్వం జీవిత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన సందేశం ద్వారా గుర్తు చేశారు.HAPPY FATHER’S DAY TO ALL FATHERS💥Being a father is your most important job.I have never been a father, yet I was blessed with having two fathers, my poor dad and my rich dad.By telling the story of their lessons to me, millions of lives have been changed….enriched,…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 21, 2026 -
‘బంగారం, వెండి.. పడిపోతున్నాయ్’
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండి, క్రిప్టో ఆస్తులపై ఆశావహ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పడిపోతున్నప్పటికీ తాను విక్రయించడం లేదని, సరైన సమయంలో కొనుగోలు చేసేందుకు వేచి చూస్తున్నానని తెలిపారు. ధరల ఆధారంగా కాకుండా ఆస్తులు ఉన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి, అమెరికాతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను రాజకీయ, బ్యాంకింగ్ నాయకత్వం సమర్థంగా పరిష్కరించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో భవిష్యత్తులో బంగారం, వెండి, బిట్ కాయిన్, ఇథీరియమ్ వంటి ఆస్తుల విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నానని, బంగారం, వెండి ధరలు భారీ ర్యాలీకి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని కియోసాకి చెప్పారు. అయితే తన అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని, ప్రతి ఒక్కరూ స్వయంగా పరిస్థితులను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాబోయే కాలం ఆసక్తికరంగా ఉండబోతోందని, తెలివిగా వ్యవహరించే ఇన్వెస్టర్లు మరింత సంపద సృష్టించుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు.Gold and silver prices are falling. Q: Am I buying or selling?A: One mistake I have made (and I’ve made many) is letting price determine reasons to buy or sell any asset.I have learned to understand the “context” or the environment the asset is in….not the price.For…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 20, 2026 -
సంపదకు అసలైన మార్గం.. కియోసాకి మూడు సూత్రాలు!
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటి 'రిచ్ డాడ్ పూర్ డాడ్'. దీని రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ఆర్థిక ఆలోచనలతో ఎంతో మంది పెట్టుబడిదారులను ప్రభావితం చేశారు. ఆయన చెప్పిన కొన్ని విషయాలు సాధారణంగా ప్రజలు నమ్మే ఆర్థిక సూత్రాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఆయన చెప్పిన మూడు వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి.మీ ఇల్లు ఒక ఆస్తి కాదుసాధారణంగా చాలామంది తమ ఇంటిని జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా భావిస్తారు. కానీ కియోసాకి అభిప్రాయం ప్రకారం.. ఒక ఆస్తి అంటే మీ జేబులోకి డబ్బు తీసుకురావాలి. మీరు నివసిస్తున్న ఇంటి వల్ల ఆదాయం రాకపోగా, హౌస్ లోన్ EMIలు, పన్నులు, నిర్వహణ ఖర్చులు వంటి వ్యయాలు పెరుగుతాయి. అందువల్ల అది నిజమైన ఆస్తి కాదని ఆయన చెబుతారు. అయితే అద్దెకు ఇచ్చి ఆదాయం వచ్చే ఇల్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీ మాత్రం ఆస్తిగా పరిగణించవచ్చని ఆయన అభిప్రాయం.పొదుపు చేసేవారు నష్టపోతారుసాధారణంగా డబ్బు పొదుపు చేయడం మంచి అలవాటుగా భావిస్తారు. కానీ కియోసాకి దృష్టిలో కేవలం బ్యాంకులో డబ్బు నిల్వ ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం కారణంగా దాని కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఉదాహరణకు.. ఈరోజు రూ.100తో కొనగలిగే వస్తువు కొన్నేళ్ల తర్వాత రూ.120 లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు. అందువల్ల డబ్బును కేవలం సేవింగ్స్ ఖాతాలో ఉంచడం కంటే పెట్టుబడుల రూపంలో పెంచుకోవాలని ఆయన సూచిస్తారు.ధనవంతులు డబ్బు కోసం పని చేయరుచాలామంది ఉద్యోగం చేసి జీతం సంపాదించడం ద్వారా ఆర్థిక భద్రత పొందాలని భావిస్తారు. అయితే.. కియోసాకి ప్రకారం ధనవంతులు తమ సమయాన్ని డబ్బుకు అమ్ముకోరు. వారు.. వ్యాపారాలు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ లేదా ఇతర ఆదాయ వనరులను సృష్టించి డబ్బు తమ కోసం పనిచేసేలా చేస్తారు. అంటే, వారు ఒకసారి నిర్మించిన ఆస్తులు నిరంతరం ఆదాయం తెచ్చిపెడతాయి. అందుకే సంపన్నులు సంపాదన కోసం మాత్రమే పనిచేయకుండా, ఆదాయాన్ని సృష్టించే వ్యవస్థలను నిర్మించడంపై దృష్టి పెడతారని ఆయన వివరిస్తారు.నిజానికి రాబర్ట్ కియోసాకి అభిప్రాయాలు అందరూ అంగీకరించకపోయినా, డబ్బు, పెట్టుబడులు, సంపద గురించి కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తాయి. కేవలం సంపాదించడం లేదా పొదుపు చేయడం కాకుండా, ఆదాయాన్ని సృష్టించే ఆస్తులను నిర్మించడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక స్వాతంత్య్రం సాధించవచ్చని ఆయన అభిప్రాయం.Robert Kiyosaki reveals his 3 most controversial statements…-Your house is not an asset-Savers are losers-The rich don't work for money pic.twitter.com/ayJVrWZBwR— The Iced Coffee Hour (@TheICHpodcast) June 19, 2026 -
2026లో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్?: కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) స్టాక్ మార్కెట్స్ గురించి సంచనల ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఏడాది (2026) అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం రాబోతోందని కియోసాకి హెచ్చరించారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్థిక సంక్షోభం దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఆ సమయంలో అమెరికా హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడంతో S&P 500 కూడా దాదాపు 50% వరకు పడిపోయింది. దీనివల్ల అనేక మంది పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సంఘటనను కొందరు 'గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్' అని కూడా పిలుస్తారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా రిస్క్‌లో ఉందని, అప్పులు, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్ సమస్యల కారణంగా మరో పెద్ద క్రాష్ వచ్చే అవకాశం ఉందని కియోసాకి భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ పెట్టుబడులపై మాత్రమే ఆధారపడకుండా.. బంగారం, వెండి లేదా ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని ఆయన సూచిస్తారు.అయితే.. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే?, కియోసాకి చెప్పినది కేవలం ఒక అంచనా మాత్రమే. స్టాక్ మార్కెట్ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రభుత్వ విధానాలు, గ్లోబల్ ఎకానమీ, కంపెనీల పనితీరు, పెట్టుబడిదారుల భావోద్వేగాలు మొదలైనవి ఉంటాయి. కాబట్టి ఎవరు చెప్పినా మార్కెట్ క్రాష్ ఖచ్చితంగా జరుగుతుందని ముందే చెప్పడం సాధ్యం కాదు.మార్కెట్ క్రాష్ అంటే?స్టాక్ మార్కెట్ క్రాష్ అంటే షేర్ల ధరలు చాలా తక్కువ సమయంలో భారీగా పడిపోవడం. ఇది ఆర్థిక మాంద్యం, కంపెనీల లాభాలు తగ్గడం లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభాల వల్ల జరుగుతుంది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో షేర్లు అమ్మేయడం వల్ల మార్కెట్ మరింత పడిపోతుంది.🚨 BREAKING:RICH DAD POOR DAD AUTHOR ROBERT KIYOSAKI SAID:"THE BIGGEST STOCK MARKET CRASH IS COMING IN 2026."HE PREDICTED THE 2008 CRASH, WHEN S&P 500 CRASHED -50%HE BELIEVES SOMETHING BAD IS COMING... pic.twitter.com/a6Gw0qrXxW— ᴛʀᴀᴄᴇʀ (@DeFiTracer) June 17, 2026 -
బంగారాన్ని మించిన ఆస్తులున్నాయ్: కియోసాకి
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అప్పులు, ఫెడరల్ రిజర్వ్ విధానాలపై చర్చలు జరుగుతున్న వేళ, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కియోసాకి అభిప్రాయం ప్రకారం, అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం 37 ట్రిలియన్ డాలర్ల అప్పు భారంతో ఉంది. కొత్త ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ద్రవ్యోల్బణాన్ని మరింత వేడెక్కనివ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో, సాధారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, సీడీలు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే "పూర్ సేవర్స్" తమ డబ్బు విలువను నిశ్శబ్దంగా కోల్పోతారని ఆయన హెచ్చరించారు. "గోల్డ్ ఒక మంచి రక్షణ. 1970లలో అది విలువను నిలబెట్టుకుంది. కానీ అది కేవలం నీటిని నిల్వ చేసే సీసా లాంటిది. లీక్ కాకుండా కాపాడుతుంది. కానీ నిజమైన ధనవంతులు ద్రవ్యోల్బణం వల్ల లాభపడే ఆస్తులను ఎంచుకుంటారు" అని కియోసాకి వ్యాఖ్యానించారు. ఆయన ప్రకారం, గోల్డ్ మాత్రమే కాదు, చరిత్రలో ద్రవ్యోల్బణం వల్ల మరింత పెరిగిన మూడు ప్రత్యేక ఆస్తులు ఉన్నాయని, వాటిని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. -
కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్!
బంగారం ధరలు పెరుగుతాయని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' మరోసారి హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమే అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.మొత్తానికి బంగారం తన కదలికను ప్రారంభించింది. ఒక్క రోజులోనే 100 డాలర్లు దాటింది. మీరు దీనిని గమనించారా?. ఒకవేళా గమనించకపోతే, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పసిడి ధర పెరుగుదల ఇప్పుడే మొదలైంది. ఈ రోజు బంగారం ఔన్సుకు 4300 డాలర్ల వద్ద ఉంది. అయితే 2035 నాటికి ఇది 35,000 డాలర్లకు చేరుకోవచ్చని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుంది. అందుకే "క్యాష్ ఈజ్ ట్రాష్'' అని వ్యాఖ్యానిస్తూ, కేవలం డబ్బును పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. నగదు రూపంలో డబ్బును నిల్వ ఉంచడం కంటే.. విలువను నిలబెట్టుకునే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని అంటున్నారు.బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియం, చమురు వంటి ఆస్తులను కొనుగోలు చేయడం మంచిదని కియోసాకి సలహా ఇస్తున్నారు. తాను కూడా గత కొన్ని సంవత్సరాలుగా నగదును ఈ ఆస్తులుగా మార్చుకుంటూ వచ్చానని, వాటినే 'నిజమైన డబ్బు'గా భావిస్తున్నానని చెప్పారు.అయితే ఇది కియోసాకి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. పెట్టుబడుల విషయంలో మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రిస్క్‌లు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు పూర్తి పరిశీలన చేయడం, ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఈ విషయంలో పెట్టుబడిదారులు తప్పకుండా జాగ్రత్త వహించాలి.GOLD began its move…finally.Over &100 in a day.Did you catch the move?If you did not. Do not worry. The ascent of gold has just begun.Today gold is at $4300 an ounce.I am confident it will be $35,000 an ounce by 2035. Nice dates and numbers that start and end…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 15, 2026 -
భారీగా క్రెడిట్ కార్డు అప్పులు.. కియోసాకి అలర్ట్
ప్రపంచ ప్రసిద్ధ పర్సనల్ పైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికన్ల పెరుగుతున్న క్రెడిట్ కార్డు అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన పోస్టులో వినియోగపు అలవాట్లు ఎలా ఆర్థిక భారంగా మారుతున్నాయో వివరించారు.ప్రస్తుతం అమెరికన్లు క్రెడిట్ కార్డులపై 1.28 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.120 లక్షల కోట్లు) అప్పుల్లో ఉన్నారన్న కియోసాకి, ఈ భారీ అప్పులకు అనవసర ఖర్చులే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.అమెరికన్లు చేసిన ఖర్చుల జాబితాను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఖరీదైన రెస్టారెంట్లలో విందులు, వాడకపోయినా స్ట్రీమింగ్ సర్వీసుల సబ్స్క్రిప్షన్లను కొనసాగించడం, అనవసరంగా దుస్తులు కొనుగోలు చేయడం, విహారయాత్రల కోసం అప్పులు చేయడం, గుర్తింపులేని ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్లు, ఉపయోగించని జిమ్ సభ్యత్వాలు వంటి ఖర్చులు ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.అలాగే కొత్త గ్యాడ్జెట్లు, అప్గ్రేడ్లు, వివిధ సబ్స్క్రిప్షన్లు, సౌకర్యాల కోసం చెల్లించే అదనపు రుసుములు కొనుగోలు సమయంలో అవసరమైనవిగా అనిపించినప్పటికీ, తర్వాత అవే ఆర్థిక భారంగా మారుతాయని కియోసాకి హెచ్చరించారు.తన ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’లో ఉపయోగించిన “డూడాడ్స్ (Doodads)” అనే పదాన్ని గుర్తుచేస్తూ, అవసరం లేని వస్తువులు మనల్ని ధనవంతుల్లా భావింపజేసినా, వాస్తవానికి పేదరికం వైపు నెడతాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సగటు అమెరికన్ వ్యక్తి సుమారు 7,900 డాలర్లు (దాదాపు రూ.6.8 లక్షలు) క్రెడిట్ కార్డు అప్పుతో ఉన్నారని, దానిపై 24 శాతం వడ్డీ చెల్లిస్తూ మినిమమ్ డ్యూలతో నెట్టుకొస్తున్నారని కియోసాకి తెలిపారు. ఇలాంటి అప్పులపై వడ్డీ చక్రవడ్డీలా పెరుగుతూ ఆర్థిక స్వేచ్ఛను దూరం చేస్తుందని ఆయన హెచ్చరించారు.అందరూ తమ ఖర్చుల అలవాట్లను పరిశీలించుకోవాలని, అవసరం లేని వ్యయాలను తగ్గించి నిజమైన సంపద సృష్టి వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రించి ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు తాను ఒక ఉచిత మార్గదర్శకాన్ని సిద్ధం చేశానని తన పోస్టులో పేర్కొన్నారు. -
క్యాష్ ఈజ్ ట్రాష్.. కియోసాకి హెచ్చరిక!
ఎప్పటికప్పుడు ఆర్ధిక పరమైన అంశాలను వెల్లడించే.. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా మరో అంశాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ట్రిలియన్ డాలర్లు అంటే ఎంత? అని ప్రశ్నిస్తూనే.. దీనికి 1 తర్వాత 12 సున్నాలు ఉంటాయని కియోసాకి పేర్కొన్నారు. మీరు నిమిషానికి ఒక డాలర్ చొప్పున ఖర్చు చేస్తే, ఆ మొత్తం ఖర్చు చేయడానికి మీకు 34,000 సంవత్సరాలు పడుతుంది. దీన్నిబట్టి చూస్తే ఇది ఎంత పెద్ద సంఖ్య అనేది స్పష్టమవుతోంది.ఒక సాధారణ మనిషికి ట్రిలియన్ డాలర్లు ఊహించడం కూడా చాలా కష్టం. కానీ ఫెడ్, యూఎస్ ట్రెజరీకి ఒక ట్రిలియన్ డాలర్లను ముద్రించడానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుందని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి ప్రకారం.. డబ్బు భద్రమైన పెట్టుబడి కాదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం సమయంలో దీని విలువ క్రమంగా తగ్గుతుంది. కాబట్టి డాలర్లను పొదుపు చేసేవారు నష్టపోతారు. క్యాష్ ఈజ్ ట్రాష్ అంటూనే.. మీ డబ్బును బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని రిచ్ డాడ్ వివరించారు.అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రతి పెట్టుబడికి లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా ఉంటాయి. బంగారం వంటి సంప్రదాయ ఆస్తులు స్థిరత్వాన్ని ఇస్తే, క్రిప్టోకరెన్సీలు ఎక్కువ మార్పులు కలిగి ఉంటాయి. కాబట్టి ఏ పెట్టుబడి అయినా వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, లక్ష్యాలు, ప్రమాద సహనాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.HOW MUCH is a $ TRILLION?A trillion is a 1 with 12 zeros after it.$1,000,000,000,000If you were to spend $1 a minute it would take you 34,000 years to spend.It takes the Fed and US Treasury less than a minute to print $1 trillion.Get the picture?Savers of dollars are…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 12, 2026 -
నిజమైన వారసత్వం అంటే డబ్బు కాదు!
సాధారణంగా మనం వారసత్వం అంటే డబ్బు, ఇల్లు లేదా భూమి అని భావిస్తాం. కానీ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మాత్రం.. నిజమైన వారసత్వం అనేది డబ్బు కాదు, సంపదను సృష్టించే వ్యవస్థలు అని అభిప్రాయపడుతున్నారు.కియోసాకి ప్రకారం.. పేద కుటుంబాల పిల్లలకు సాధారణంగా జ్ఞాపకాలు, కుటుంబ వస్తువులు, ఆభరణాలు వంటి భావోద్వేగ విలువ కలిగిన వస్తువులు వారసత్వంగా వస్తాయి. మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు మాత్రం ఇళ్లు, విద్యా రుణాలు, పన్ను బాధ్యతలు వంటి ఆర్థిక బాధ్యతలు ఎక్కువగా మిగులుతాయి. ధనిక కుటుంబాల పిల్లలకు మాత్రం.. ట్రస్టులు, కంపెనీలు, వ్యాపారాలు, పెట్టుబడి వ్యవస్థలు వంటి సంపదను నిరంతరం ఉత్పత్తి చేసే నిర్మాణాలు వారసత్వంగా లభిస్తాయి.మధ్యతరగతి ప్రజలు వారసత్వం అంటే డబ్బు అని నమ్ముతారు. కానీ ధనికులు డబ్బు తాత్కాలికమని తెలుసుకుంటారు. చేతిలో ఉన్న డబ్బు క్రమంగా ఖర్చైపోతుంది. అయితే.. మంచి వ్యవస్థలు నిరంతరం ఆదాయాన్ని సృష్టిస్తూనే ఉంటాయి. అందుకే వారు కేవలం డబ్బును కాకుండా, ఆ డబ్బును పెంచే నిర్మాణాలను తదుపరి తరాలకు అందిస్తారు.ట్రస్టులు, కంపెనీలు కేవలం చట్టపరమైన పత్రాలు మాత్రమే కావు. అవి కుటుంబ సంపదను రక్షించే సాధనాలు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆస్తులను కాపాడి, నిర్వహించి, తదుపరి తరాలకు అందించే విధంగా అవి పనిచేస్తాయి. ఈ కారణంగా ధనిక కుటుంబాల సంపద తరతరాలుగా కొనసాగుతుంది.విద్యా వ్యవస్థ.. పిల్లలకు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడం నేర్పుతుంది. కానీ సంపన్న కుటుంబాలు తమ పిల్లలకు ఆస్తులను సంపాదించడం, పెట్టుబడులను ఎలా నిర్వహించాలి, వ్యాపారాలను ఎలా కొనసాగించాలి అనే విషయాలను నేర్పిస్తాయి. అందువల్ల ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ధనిక కుటుంబాల పిల్లలు ఎక్కువగా భయపడరు. ఎందుకంటే వారి ఆదాయం కేవలం జీతంపై ఆధారపడదు. వారసత్వంగా వచ్చిన వ్యాపారాలు, పెట్టుబడులు, ఇతర వ్యవస్థలు వారికి నిరంతర నగదు ప్రవాహాన్ని అందిస్తాయి.మరోవైపు, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు తరచుగా బాధ్యతలను మాత్రమే వారసత్వంగా పొందుతారు. బయటకు విలువైన ఆస్తుల్లా కనిపించే కొన్ని వస్తువులు, వాస్తవానికి అప్పులు, నిర్వహణ ఖర్చులతో కూడి ఉండవచ్చు. అందువల్ల వారికి సంపద కంటే బాధ్యతలు ఎక్కువగా మిగులుతాయి.ఇక్కడ.. జీవితాంతం ఉద్యోగం చేసి, చివరికి అప్పులు లేదా ఆర్థిక బాధ్యతలు మాత్రమే మిగిల్చిన తల్లిదండ్రులు విఫలమయ్యారని కాదు. వారు పెరిగిన ఆర్థిక ఆలోచనా విధానం అలాంటిదని కియోసాకి సూచిస్తున్నారు. ఉద్యోగం మన జీవితం వరకు మాత్రమే కొనసాగుతుంది. కానీ నిర్మించిన వ్యవస్థలు మన తర్వాత కూడా పనిచేస్తూ సంపదను సృష్టిస్తాయని చెబుతున్నారు. -
‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’
ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Robert Kiyosaki) రచయిత, ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ఒక ప్రసిద్ధ పెట్టుబడి సూత్రాన్ని విమర్శించారు. చాలామంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ‘డైవర్సిఫికేషన్’ చేశామని భావిస్తుంటారని, వాస్తవానికి వారు ‘డీ-వర్స్-ఇఫికేషన్’ (పరిస్థితిని మరింత దిగజార్చే ప్రక్రియ) చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, స్టాక్స్, బాండ్లు, రియల్ ఎస్టేట్, చమురు వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ అవన్నీ ఈటీఎఫ్‌లు, ఆర్ఈఐటీలు లేదా ఇతర ఆర్థిక సాధనాల రూపంలో ఉంటే అవి చివరికి ఒకే “పేపర్ అసెట్” వర్గానికి చెందినవేనని అన్నారు. అలాంటి పెట్టుబడులు నిజమైన డైవర్సిఫికేషన్ కాదని, కేవలం తాము పెట్టుబడులను వైవిధ్యీకరించామని ఇన్వెస్టర్లు భావించే పరిస్థితి మాత్రమేనని వివరించారు.తాను మాత్రం నేరుగా యాజమాన్యం, నియంత్రణ, కస్టడీ తన చేతుల్లో ఉండే “రియల్ అసెట్స్”ను ఇష్టపడతానని కియోసాకి పేర్కొన్నారు. బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ లేదా ఇతర భౌతిక ఆస్తులను నేరుగా కలిగి ఉండటం కోసం కొంత ఎక్కువ ఖర్చు, సమయం వెచ్చించాల్సి వచ్చినా, వాటి గురించి మరింత అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని రాసుకొచ్చారు.“ఇది నా వ్యక్తిగత పెట్టుబడి విధానం. కొంతమంది దీనిని నా జాగ్రత్త లేదా అనుమాన స్వభావంగా చూడొచ్చు. కానీ నా ఎంపిక ఇదే. మీ ఎంపిక ఏమిటి? డైవర్సిఫికేషన్నా? లేక డీ-వర్స్-ఇఫికేషన్నా?” అంటూ పెట్టుబడిదారులను కియోసాకి ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఈటీఎఫ్‌లు, డెరివేటివ్ ఉత్పత్తులు, భౌతిక ఆస్తులపై మరోసారి చర్చకు దారితీశాయి.DEWORSE-IFIED is not Diversified.Many people are “De-Worsified” not “Diversified.”“De-Worse-ified” means they think they are diversified, but they have all their “diversified” assets, such as gold, silver, Bitcoin, stocks, bonds, real estate, and oil, in one asset class….the…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 9, 2026 -
డబ్బు కావాలా? వీటిలో మాస్టర్స్ అవ్వాల్సిందే!
ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పంచుకున్న కొన్ని ఆర్థిక సూత్రాలు ఇప్పుడు యువతను, వర్ధమాన పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతికే సగటు ఆలోచనా విధానానికి, రూ.కోట్లకు పడగలెత్తే వ్యాపారవేత్తల మైండ్ సెట్‌కు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు.‘ ‘నేను ధనవంతుడిగా ఎలా మారాలి? దీనికోసం ఏదైనా మంత్రదండం ఉందా?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. వారంతా నా నుంచి ఏదో ఒక సంక్లిష్టమైన ఫార్ములానో లేక మాయా పెట్టుబడి వ్యూహాన్నో ఆశిస్తారు. కానీ, నేను కుర్రాడిగా ఉన్నప్పుడే మా ‘రిచ్ డాడ్’ నాకు అసలైన రహస్యం చెప్పారు. నువ్వు నిజంగా ధనవంతుడివి కావాలననుకుంటే.. కేవలం రెండు విషయాల్లో పట్టు సాధించు. ఒకటి సేల్స్ (అమ్మకాలు), రెండు రియల్ ఎస్టేట్’ అన్నారు.ఆ రెండు నైపుణ్యాలే ఎందుకు?రాబర్ట్ కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఒక వ్యక్తి ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరడానికి ఈ రెండు రంగాలు పునాదిగా పనిచేస్తాయి.సేల్స్ (అమ్మకాలు)వ్యాపార ప్రపంచంలో ఎవరైనా ఏదైనా అమ్మనంత వరకు అక్కడ ఎలాంటి చలనం ఉండదు. సేల్స్ అంటే కేవలం వస్తువులను అమ్మడం కాదు.ఎదుటివారితో ఎలా మాట్లాడాలి.ఎలా చర్చలు జరపాలిఇతరులను ఎలా ప్రభావితం చేయాలి.విలువను ఎలా సృష్టించాలి.. అనేది సేల్స్ నేర్పుతుంది.ఇదే ఉద్దేశంతో రాబర్ట్ కియోసాకి మెరైన్ కార్ప్స్ విడిచిపెట్టిన తర్వాత కేవలం సేల్స్ నేర్చుకోవడం కోసమే ‘జిరాక్స్’ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అక్కడ కెరీర్ బిల్డ్ చేయడం ఆయన ఉద్దేశం కాదు. ఒక పారిశ్రామికవేత్తకు కావలసిన అసలైన సేల్స్ నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడమే ఆయన లక్ష్యం.రియల్ ఎస్టేట్రియల్ ఎస్టేట్ అనేది కేవలం భూములు, భవనాల కొనుగోలు మాత్రమే కాదు. అది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సూత్రాలైన అప్పు, పన్నుల గురించి నేర్పుతుంది.లెవరేజ్: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టుడానికి మీ సొంత డబ్బు అక్కర్లేదు. ఇతరుల లేదా బ్యాంకుల డబ్బును ఎలా ఉపయోగించవచ్చో ఇది నేర్పుతుంది.క్యాష్ ఫ్లో: క్రమబద్ధమైన ఆదాయ వనరును ఎలా సృష్టించాలో చూపిస్తుంది.టాక్స్-ఫ్రీ వెల్త్: పన్ను నిబంధనలను చట్టబద్ధంగా ఉపయోగించుకుంటూ అతి తక్కువ పన్నుతో సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలో రియల్ ఎస్టేట్ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.నేటి ఆధునిక కాలంలో కేవలం అకడమిక్ డిగ్రీలు మాత్రమే జీవితంలో స్థిరపడటానికి సరిపోవు అనేది జగమెరిగిన సత్యం. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మనల్ని కేవలం ఒక ఉద్యోగిగా మారడానికే శిక్షణ ఇస్తాయి. కానీ, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి. రాబర్ట్ కియోసాకి చెప్పినట్లు సేల్స్, రియల్ ఎస్టేట్ రంగాలపై అవగాహన పెంచుకోవడం అంటే వ్యాపారం చేయడం మాత్రమే కాదు. సంపదను సృష్టించే మైండ్ సెట్‌ను అలవర్చుకోవడం. డిగ్రీల వేటలో పడేముందు.. ప్రతి ఒక్కరూ ఈ ప్రాథమిక ఆర్థిక నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
పాపులర్ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం రిచ్ ‘డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఆస్తులు (Assets), అప్పులు (Liabilities) మధ్య తేడాను అర్థం చేసుకోవడమే నిజమైన సంపదకు తొలి మెట్టు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఫేస్బుక్లో చేసిన పోస్టు విస్తృత చర్చకు దారి తీసింది.చాలామంది ఖర్చుతో కూడుకున్న వస్తువులను సంపదగా భావిస్తారని, అయితే అధిక ధర ఉన్నంత మాత్రాన అది ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తి కాదని కియోసాకి వివరించారు. ప్రతి నెలా మన జేబులోకి డబ్బు వస్తే అది ఆస్తి, జేబులో నుంచి డబ్బు వెళ్తే అది అప్పు అని ఆయన సరళమైన నిర్వచనం ఇచ్చారు.ఈ సందర్భంగా ఖరీదైన ఇల్లు, విలాసవంతమైన కారు వంటి వాటిని ఉదాహరణగా చూపించారు. ఇంటికి గృహ రుణం, పన్నులు, బీమా, నిర్వహణ ఖర్చులు ఉంటాయని, కారు కొనుగోలు చేసిన వెంటనే విలువ తగ్గడం ప్రారంభమవుతుందని తెలిపారు. అందువల్ల ఇవి ఎక్కువగా అప్పుల కిందకే వస్తాయని పేర్కొన్నారు.మరోవైపు అద్దె ఆదాయం వచ్చే రియల్ ఎస్టేట్, డివిడెండ్లు చెల్లించే షేర్లు, లాభాలు ఆర్జించే వ్యాపారాలు, రాయల్టీలు తెచ్చిపెట్టే మేధో సంపత్తి హక్కులు, డిజిటల్ ఉత్పత్తులు వంటి వాటిని నిజమైన ఆస్తులుగా అభివర్ణించారు. ఇవి నిరంతరం నగదు ప్రవాహాన్ని సృష్టించి యజమానికి ఆదాయం అందిస్తాయని చెప్పారు.సంపన్నులు ముందుగా ఆస్తులను కొనుగోలు చేస్తారని, మధ్యతరగతి ప్రజలు ముందుగా అప్పులను పెంచుకుని తర్వాత ఆర్థిక స్వేచ్ఛ ఎందుకు రాలేదని ఆశ్చర్యపడుతుంటారని కియోసాకి వ్యాఖ్యానించారు. పాఠశాలలు, ఆర్థిక వ్యవహారాలపై సలహాలు ఇచ్చే అనేక మంది కూడా ఈ మౌలిక సూత్రాన్ని బోధించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.అమెరికన్ డ్రీమ్ అంటే పెద్ద ఇల్లు కాదని, ఆర్థిక స్వేచ్ఛేనని కియోసాకి పేర్కొన్నారు. ప్రతి నెలా ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులను సృష్టించుకోవడం ద్వారానే నిజమైన స్వేచ్ఛ సాధ్యమవుతుందని తన పోస్టులో స్పష్టం చేశారు. -
డబ్బు కోసమే వ్యాపారం చేయాలా?: రిచ్ డాడ్ క్లారిటీ
బంగారం, వెండి గురించి.. వాటిపై పెట్టుబడుల గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) తాజాగా డబ్బు సంపాదించడానికే వ్యాపారం చేయాలా?, అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.చాలామంది డబ్బు సంపాదించడానికే వ్యాపారం చేయాలా? అనే ప్రశ్న వేస్తుంటారు. కానీ వ్యాపారవేత్త కావడం వెనుక అసలు ఉద్దేశం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకూడదని కియోసాకి చెబుతారు. డబ్బు కోసం మాత్రమే వ్యాపారం మొదలు పెడితే, అది దీర్ఘకాలంలో విజయాన్ని ఇవ్వకపోవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు.నిజానికి డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని కాదు. కానీ సంపాదించిన డబ్బును నిలుపుకోవడం, దానిని సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. చాలామంది పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినా, ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల త్వరగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే వ్యాపారం అంటే కేవలం సంపాదన కాదు, ఒక ఆర్థిక విద్య కూడా అని కియోసాకి పేర్కొన్నారు.ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో.. ఆస్తులు, బాధ్యతలు మధ్య తేడా ఏమిటో తెలుసుకోవడం అవసరం. అలాగే నగదు ప్రవాహం, అప్పుల నిర్వహణ, పన్నుల వ్యవస్థ వంటి విషయాలపై అవగాహన లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా అది నిలబడదు. ఈ జ్ఞానం లేకపోతే పెద్ద మొత్తంలో సంపాదించినా.. తిరిగి కోల్పోయే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: పెట్రోల్ రూ.26, గ్యాస్ రూ.157: పాతికేళ్లలో ఎంతలా అంటే..చాలామంది డబ్బు గురించి సలహాలు ఇస్తారు, కానీ వారు స్వయంగా వ్యాపారం చేసి అనుభవం పొందినవారు కాకపోవచ్చు. కాబట్టి ఎవరి సలహా అయినా గుడ్డిగా నమ్మకూడదు. స్వయంగా ఆర్థిక విషయాలను నేర్చుకోవడం చాలా అవసరం. వ్యాపారవేత్త కావడం అంటే రిస్క్ తీసుకోవడం మాత్రమే కాదు, ఆ రిస్క్‌ను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం కూడా.వ్యాపారం ప్రారంభించే ముందు 'నేను ఎంత డబ్బు సంపాదించగలను?' అనే ప్రశ్నకన్నా.. నేను సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించగలను? అనే ప్రశ్న చాలా ముఖ్యమైంది. సరైన ఆర్థిక జ్ఞానం ఉంటేనే సంపదను సృష్టించడంతో పాటు దానిని నిలబెట్టుకోవడం కూడా సాధ్యమవుతుందని కియోసాకి అభిప్రాయం. -
ధనవంతుల రహస్యం చెప్పిన కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాత పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండిపై తన మద్దతును వ్యక్తం చేశారు. సంపదను కాపాడుకోవాలంటే బంగారం వంటి వాస్తవ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.తాజాగా ఫేస్బుక్లో చేసిన పోస్టులో, చాలామంది బంగారం కొంటే డబ్బు సంపాదించవచ్చని భావిస్తారని, కానీ ధనవంతులు ఆ ఉద్దేశంతో బంగారం కొనరని పేర్కొన్నారు. డాలర్‌పై నమ్మకం లేకపోవడమే బంగారం కొనడానికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. తన వయోజన జీవితమంతా బంగారం, వెండి నిల్వ చేసుకుంటూ వచ్చానని, వాటి ధరలు భారీగా పెరుగుతాయని ఆశించి కాదు, డాలర్ విలువ కాలక్రమేణా తగ్గుతుందనే అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.ప్రభుత్వాలు కొత్త కరెన్సీని ముద్రించిన ప్రతిసారీ నగదు కొనుగోలు శక్తి తగ్గిపోతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం లాభాలను హామీ ఇవ్వదని, కానీ సంపదను రక్షించే సాధనంగా పనిచేస్తుందని చెప్పారు. కోట్లాది రూపాయలు అవసరం లేదని, ఒక వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలో బంగారం కొనుగోలు చేయడం ద్వారా కూడా సంపద రక్షణను ప్రారంభించవచ్చని సూచించారు.అయితే ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియాలో సమయం గడపడం, తదుపరి స్టాక్ టిప్ కోసం ఎదురు చూడడం లేదా ప్రభుత్వమే తమను కాపాడుతుందని ఆశించడం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన డబ్బు బంగారం, వెండి వంటి విలువైన లోహాలేనని, కాగితపు కరెన్సీ కేవలం నకిలీ డబ్బు లాంటిదేనని ఆయన పేర్కొన్నారు.వేల ఏళ్లుగా బంగారం, వెండి సంపద నిల్వ సాధనాలుగా కొనసాగుతున్నాయని, కానీ అమెరికా డాలర్ 1971 నుంచి క్రమంగా విలువ కోల్పోతోందని కియోసాకి అన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం ఉంచాలా, లేక బంగారంపై విశ్వాసం పెంచుకోవాలా అనేది ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయమని తన పోస్టులో పేర్కొన్నారు. -
బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది?: కియోసాకి సమాధానం ఇదే..
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది? అనే విషయాన్ని వెల్లడించారు. తనను ప్రతిరోజూ ఒక ప్రశ్న అడుగుతున్నారని, దానికి సమాధానం చాలా సులభమని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.నేను ప్రభుత్వం ముద్రించే డబ్బులో పెట్టుబడి పెట్టను. నేను స్టాక్స్,బాండ్స్, ఈటీఎఫ్స్ కొనను. నా పెట్టుబడులు మొత్తం వ్యాపారాలు, బంగారు గనులు, చమురు బావులు, పశువులపైన ఉంటాయి. నా పశువులు కూడా డబ్బు సంపాదించి పెడతాయి. అవి పిల్లలను కన్న ప్రతిసారీ, నాకు రాబడి పెరుగుతుందని కియోసాకి పేర్కొన్నారు. ధనవంతులు ఎప్పుడూ కూడా నిజమైన ఆస్తులలో పెట్టుబడి పెడతారు. అంటే వారు ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టతారన్నమాట. ప్రభుత్వం కేవలం డబ్బును ముద్రించగలదు. కానీ.. గోల్డ్, ఆయిల్, పశువులు వంటివాటిని ముద్రించలేదు. కాబట్టి ఇవే నిజమైన విలువైన ఆస్తులు. కాబట్టి డబ్బును నిజమైన ఆస్తుల్లో పెడుతున్నారా, లేదా ప్రతిరోజూ కొత్తగా ముద్రితమవుతున్న డాలర్లను ధనంగా పరిగణించే సిస్టమ్‌పై నమ్మకం పెడుతున్నారా? అనేది తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉందని కియోసాకి వెల్లడించారు.గోల్డ్, చమురు, పశువులపై పెట్టుబడి పెట్టడానికి డబ్బులేదు అని చాలామంది అనుకుంటారు. కానీ తక్కువ డబ్బుతో ప్రారభించడం మంచిది. ఉద్యోగం కాదు.. అదనపు ఆదాయం కోసం పనిచేయడం కూడా కాదు. మీరు విశ్రాంతి తీసుకున్నపుడు కూడా డబ్బు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని రిచ్ డాడ్ చెబుతారు.ఇదీ చదవండి: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్: వివరాలు లీక్! -
‘బ్యాంకులకూ బంగారంపైనే నమ్మకం’
ప్రపంచవ్యాప్తంగా బంగారం ప్రాధాన్యం మరింత పెరుగుతోందని ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో (ట్విట్టర్) చేసిన తాజా పోస్టు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.గత ఏడాదిలో బంగారం ధరలు సుమారు 65 శాతం పెరిగాయని, అదే సమయంలో బ్యాంకు పొదుపు ఖాతాలపై కేవలం 4 శాతం వార్షిక వడ్డీ మాత్రమే లభిస్తోందని కియోసాకి గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు అమెరికా ట్రెజరీ బాండ్లను విక్రయించి, వాటి స్థానంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.“ఈ పరిణామాలను గమనిస్తే పరిస్థితి ఏ దిశగా వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు” అంటూ కియోసాకి తన పోస్టులో వ్యాఖ్యానించారు. డాలర్ ఆధారిత ఆస్తుల కంటే బంగారం వంటి భౌతిక ఆస్తులపై విశ్వాసం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.కియోసాకి గత కొంతకాలంగా బంగారం, వెండి, బిట్కాయిన్లకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ ఆస్తులను పరిశీలించాలని ఆయన తరచూ సూచిస్తున్నారు.FYI:Gold up 65% in 1 year.Savings pay 4% a year.Central banks dumping US Treasuries for gold.Get the picture?— Robert Kiyosaki (@theRealKiyosaki) June 1, 2026 -
‘బంగారం, వెండి.. అలా కొన్నారంటే నష్టమే’
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికా ప్రభుత్వ బాండ్ల భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రణాళికకర్తలు అమెరికా బాండ్లు సురక్షితమైన పెట్టుబడులని చెబుతున్నప్పటికీ, అలాంటి అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని ఆయన సూచించారు.సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో, “మూర్ఖత్వం నుంచి వచ్చే ఏ పెట్టుబడీ పూర్తిగా సురక్షితం కాదు” అని వ్యాఖ్యానించారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులు కూడా కేవలం ప్రచారం లేదా హైప్ ఆధారంగా కొనుగోలు చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.ప్రస్తుతం జపాన్, చైనా వంటి ప్రధాన అమెరికా బాండ్ హోల్డర్లు తమ వద్ద ఉన్న బాండ్లను విక్రయించి బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లలో నగదు ప్రవాహం ఏ దిశగా వెళ్తుందో గమనించడం మదుపరులకు ముఖ్యమని సూచించారు.అంతేకాకుండా, ఎవరికైనా అత్యంత విలువైన ఆస్తి వారి మెదడేనని, సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలని కియోసాకి అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించాలని ఆయన సూచించారు. Don’t drink financial planners Kool- Aide when they tell you US Bonds are safe. There is nothing safe….from stupidity. Remember even gold, silver, and Bitcoin can cost you money if purchased on hype.Best watch the cash flowing. Today many major US Bond holders, like…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 30, 2026 -
బంగారం ఖరీదవడం లేదు.. కియోసాకి కామెంట్స్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి డాలర్ విలువ, ద్రవ్యోల్బణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు పెరుగుతున్నాయనే భావన తప్పని, అసలు సమస్య డాలర్ కొనుగోలు శక్తి క్షీణించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.“బంగారం ఖరీదవడం లేదు.. డాలర్ చవకబారుతోంది” అంటూ కియోసాకి తన పోస్టులో స్పష్టం చేశారు. ఆర్థిక సలహాదారుగా ఆరు సంవత్సరాలకు పైగా పని చేసిన తన స్నేహితుడు కూడా 37 ఏళ్ల వయసులోనే ఈ నిజాన్ని అర్థం చేసుకున్నాడని తెలిపారు. ప్రజలు తమ జీతాలు పెరిగాయని భావిస్తున్నా, వాస్తవానికి డాలర్ విలువ తగ్గిపోవడంతో ఎక్కువ నోట్లు చేతికి వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.తన స్నేహితుడి తండ్రి ఉదాహరణను కూడా కియోసాకి ప్రస్తావించారు. ఒకప్పుడు 10 వేల డాలర్ల విలువైన ఇల్లు, అదే సమయంలో తీసుకున్న 10 వేల డాలర్ల జీవిత బీమా పాలసీ గురించి చెబుతూ.. నేడు ఆ ఇల్లు 7.5 లక్షల డాలర్లకు చేరగా, బీమా మాత్రం ఇప్పటికీ 10 వేల డాలర్లుగానే ఉందన్నారు. “ఒకటి ద్రవ్యోల్బణాన్ని అనుసరించింది.. మరొకటి అనుసరించలేదు” అని వ్యాఖ్యానించారు.1971 నుంచి అమెరికన్ డాలర్ తన కొనుగోలు శక్తిలో 93 శాతం కోల్పోయిందని కియోసాకి పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలను అదే కరెన్సీలో పొదుపు చేయమని ఆర్థిక వ్యవస్థ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు నిరంతరం కరెన్సీ ముద్రిస్తూనే ఉంటాయని, ఫలితంగా కరెన్సీ విలువ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.రోమ్ సామ్రాజ్యం నుంచి అమెరికా వరకు చరిత్రలో ఇదే పునరావృతమైందని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో అమెరికా భారీగా డబ్బు ముద్రించిందని గుర్తుచేశారు. కరెన్సీ విలువ తగ్గినా, భూమి, బంగారం, వెండి, చమురు, వ్యాపారాల వంటి నిజమైన ఆస్తులు మాత్రం తమ విలువను నిలబెట్టుకుంటాయని అన్నారు.డాలర్‌ను ‘డబ్బు’గా కాకుండా ప్రతి ఏడాది కరిగిపోతున్న ‘కొలమానం’గా చూడాలని కియోసాకి సూచించారు. బంగారం ఐదు వేల ఏళ్లుగా తన విలువను నిలబెట్టుకుందని, పేపర్ కరెన్సీలు చివరికి విలువ కోల్పోతాయని పేర్కొన్నారు. చివరగా “డాలర్లు దాచుకోవద్దు.. నిజమైన ఆస్తులను సొంతం చేసుకోండి” అంటూ బంగారం, వెండి, బిట్‌కాయిన్, రియల్ అసెట్స్‌లో పెట్టుబడుల వైపు మొగ్గుచూపాలని ప్రజలకు సూచించారు. -
అమెరికా డాలర్‌కు చావేనా? ఇరాన్ ఏం చేసిందంటే..
ప్రముఖ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో రాబోయే ఒక భారీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అమెరికా డాలర్‌కు పొంచి ఉందంటూ ఆయన హెచ్చరించారు.ఇరాన్ దేశం తన చమురు విక్రయాల కోసం అమెరికా డాలర్ స్థానంలో చైనా కరెన్సీ 'యువాన్' (Yuan)లో చెల్లింపులను స్వీకరించడం ప్రారంభించిందని, ఇది "పెట్రో డాలర్" (Petro-dollar) వ్యవస్థ అంతానికి నాంది కానుందని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు.'పెట్రో డాలర్'కు మరణ శాసనం?రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన పరిణామమని అభివర్ణించారు."ఇరాన్ చమురు కోసం చైనా యువాన్‌ను అంగీకరించడం ప్రారంభించింది. దీని అర్థం ఏమిటి? మీ భవిష్యత్తుపై, అమెరికా డాలర్ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇరాన్‌తో యుద్ధం కంటే ఇది అత్యంత ఘోరమైన పరిస్థితి. అమెరికా డాలర్ అంతం కాబోతోందా?" అని కియోసాకి ప్రశ్నించారు.ఈ అంతర్జాతీయ మార్పుల వల్ల సామాన్యులు నష్టపోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించాలని ఆయన కోరారు. మన పాఠశాలల్లో ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఎప్పటికీ నేర్పరని ఆయన గుర్తుచేశారు.ప్రస్తుతం జరుగుతున్న ఈ భారీ ఆర్థిక సంక్షోభం గురించి ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ రే డాలియో (Ray Dalio) మాత్రమే స్పష్టంగా వివరిస్తున్నారని కియోసాకి పేర్కొన్నారు. రే డాలియో నిర్వహించిన “ఇరాన్ జస్ట్ కిల్డ్ ది పెట్రో డాలర్” అనే పాడ్‌కాస్ట్‌ను తప్పకుండా వినాలని కియోసాకి ప్రజలకు సూచించారు."మీ జీవితంలో మీరు పెట్టే అత్యుత్తమ పెట్టుబడి... మీ ఆర్థిక విద్యపై పెట్టే పెట్టుబడే" అని కియోసాకి ట్వీట్లో స్పష్టం చేశారు.అసలు ఏమిటీ పెట్రో డాలర్ సంక్షోభం?గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారం అంతా అమెరికా డాలర్లలోనే సాగుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు తిరుగులేని ఆధిక్యత లభించింది. అయితే, ఇటీవల కాలంలో అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్, రష్యా వంటి దేశాలతో పాటు చైనా కూడా డాలర్ రహిత వ్యాపారానికి (De-dollarization) తెరలేపాయి. చమురు వ్యాపారంలో చైనా యువాన్ వాడకం పెరిగితే, అది అమెరికా డాలర్ పతనానికి దారితీస్తుందనే ఆందోళనలు ప్రపంచ ఆర్థిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ ఆందోళనలనే రాబర్ట్ కియోసాకి తాజాగా తన ట్వీట్ ద్వారా మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు.WORSE THAN WAR in IRANDeath of the US Dollar?Iran began accepting payment for oil in Chinese Yuan. What does that mean to you and your future and the future of the US dollar?I strongly encourage you to invest about and hour in your financial education. I strongly…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 24, 2026 -
ఆర్థిక వ్యవస్థపై కియోసాకి సంచలన వ్యాఖ్యలు!
పెట్టుబడులకు సంబంధించిన విషయాలను గురించి చెప్పే రాబర్ట్ కియోసాకి.. కొంతమంది ఆర్ధిక నిర్ణయాలు, సాధారణ ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?, చివరికి వాళ్ల ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుంది? అనే విషయాలను వివరాయించారు.ప్రపంచంలో అత్యంత ధనవంతులైన లేదా శక్తివంతులైన కొంతమంది వ్యక్తులు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావం చూపుతాయి. చాలామంది చిన్నప్పటి నుంచి చదువుకోవడం, మంచి ఉద్యోగం చేయడం, పన్నులు చెల్లించడం వంటి నియమాలను పాటిస్తూ జీవితం సాగిస్తారు. ఇవన్నీ పాటించినప్పటికీ.. ఆర్థికంగా స్వేచ్ఛ ఉండదు.డబ్బు వ్యవస్థపై నియంత్రణ ఉన్నవారు.. ఉదాహరణకు, బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు సాధారణ ప్రజల ఆదాయం, పొదుపు, అద్దె, రిటైర్మెంట్ వంటి విషయాలను పరోక్షంగా ప్రభావితం చేస్తారు. ఈ వ్యవస్థలో రెండు రకాల నియమాలు ఉన్నాయి. ఒకటి డబ్బును నియంత్రించే వారు, మరొకటి కష్టపడి పనిచేసే సాధారణ ప్రజలు.ఇదీ చదవండి: అందుకే 'వెండి'కి డిమాండ్: కొత్త ధరలు ఇలా..సాధారణ ప్రజలు చిన్ననాటి నుంచే ఒక వ్యవస్థలోకి ప్రవేశించి, దాని నియమాలను ప్రశ్నించకుండా అనుసరిస్తారు. ఇలా జీవితం గడిపి దాదాపు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినా.. ఎక్కడ మొదలయ్యారో దాదాపు అక్కడే ఉంటారని కియోసాకి అభిప్రాయపడ్డారు. నిజానికి పెట్టుబడులు, ఇతర వ్యాపారాలు చేసేవాళ్లు తొందరగా ధనవంతులు అవుతారు. ఉద్యోగం చేసి సాఫీగా జీవితం సాగించేవాళ్లకు, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన నమ్మకం. -
బంగారం, వెండిపై కియోసాకి కొత్త అంచనాలు!
ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక సంక్షోభం (మార్కెట్ క్రాష్) రాబోతోందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో దూసుకుపోతాయని కియోసాకి అంచనా వేశారు.బంగారం, వెండిపై కియోసాకి అంచనాలు ఇవేప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు జిమ్ రిచర్డ్స్ అంచనాలను ప్రస్తావిస్తూ కియోసాకి ఈ వివరాలను పంచుకున్నారు.బంగారం ధర: ప్రస్తుతం మార్కెట్లో ఔన్స్ బంగారం ధర సుమారు 4,500 డాలర్లుగా ఉంటే... అది భవిష్యత్తులో ఏకంగా 1,00,000 (ఒక లక్ష) డాలర్లకు చేరుకుంటుందని జిమ్ రిచర్డ్స్ పేర్కొన్నట్లు కియోసాకి తెలిపారు.వెండి ధర: ప్రస్తుతం మార్కెట్లో ఔన్స్ వెండి ధర సుమారు 75 డాలర్లుగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఇది 200 డాలర్లను తాకుతుందని తాను భావిస్తున్నట్లు కియోసాకి పేర్కొన్నారు."సంక్షోభంలోనూ ధనవంతులు కావచ్చు"భవిష్యత్తును ముందుగానే ఊహించి, దానికి తగ్గట్టుగా ముందస్తు చర్యలు (పెట్టుబడులు) తీసుకోగలిగినవారే అత్యుత్తమ ఇన్వెస్టర్లు అవుతారని కియోసాకి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు."రాబోయే ఆర్థిక సంక్షోభానికి మీరు బాధితులుగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ సంక్షోభ సమయంలోనూ మీరు మరింత ధనవంతులు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.సాధారణంగా ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలోనే కియోసాకి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అంతర్జాతీయ మదుపర్లలో చర్చనీయాంశంగా మారింది.Crash imminent.Jim Richard’s calls for gold to get to$ 100,000Today gold is at $4,500I think silver will hit $200 an ounceToday silver is at $75.What do you think?The best investors are able to see the future and take action. Remember you do not have to be a…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 23, 2026 -
నేను అడ్వైజర్ కాదు.. పెట్టుబడులు మీ ఇష్టం
పెట్టుబడులకు సంబంధించిన విషయాలతో పాటు.. ఆర్థికపరమైన సమాచారం వెల్లడించే రాబర్ట్ కియోసాకి తొలిసారి ఘాటుగా స్పదించారు. తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదని, ఇతరులకు పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం లేదని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను ఆర్ధిక సలహాదారుని కారు.. అయితే నా పేరును ఉపయోగించి, కొందరు వ్యక్తులు.. నేను చెప్పినట్లు పెట్టుబడులకు సంబంధించిన విషయాలను చెబుతున్నారు. వారికి నా లాయర్ ద్వారా నోటీసులు పంపించాను. నా పేరు వాడి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని హెచ్చరించాను.I AM NOT A FINANCIAl ADVISORMy attorney has sent a “Cease and Decist” notice to someone or group who is using my name to state investments I recommend.Please be aware I will always share with you what I am investing in and why.I do not recommend anyone invest in what I am…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 19, 2026నేను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో మాత్రమే చెబుతాను. నేను ఎవరిని ఇక్కడే పెట్టుబడులు పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదని కియోసాకి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఏథీరియం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నాను అని చెప్పారు. నాకు 401(k), లేదా IRA వంటి రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాలు లేవని.. స్టాక్స్ లేదా బాండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టడం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహానేను ఏం చేస్తున్నానో చెబుతాను. కానీ ఇతరులు వాటిని తప్పకుండా అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తన ఆర్థిక నిర్ణయాలను తన ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో తీసుకోవడం మంచిది. కియోసాకి మాటలను బట్టి చూస్తే.. ఎవరుపడితే వారు చెప్పినమాటలు విని పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే!
వ్యాపారంలో విజయం సాధించాలంటే.. కేవలం డబ్బు, తెలివి, కష్టపడి పని చేయడం మాత్రమే సరిపోదు. ఒక నిజమైన వ్యాపారవేత్తకు అత్యంత ముఖ్యమైన ఆస్తులు రెండు. అవి అతని మెదడు, జీవితాంతం నేర్చుకునే తపన. వీటితో పాటు అతని సలహాదారుల బృందం ఉండాలి అంటారు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత కియోసాకి.ప్రతి వ్యాపారవేత్త తన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. ప్రపంచం ప్రతిరోజూ మారుతోంది. కొత్త ఆలోచనలు, సాంకేతికతలు, మార్కెట్ మార్పులు వస్తూనే ఉంటాయి. నేను అన్నీ తెలుసుకున్నాను అని భావించే వ్యక్తి ఎప్పటికీ ఎదగలేదు. కాబట్టి వ్యాపారవేత్త ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి.ఒక వ్యక్తి ఎంత తెలివైనవాడైనా.. ఒంటరిగా ఉంటే ఏమీ సాధించలేడు. ఒక మంచి బృందం ఉన్నప్పుడు మాత్రమే పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. ప్రతి మనిషికి ఇతరుల సహాయం అవసరం. వ్యాపారంలో కూడా ఇదే నిజం. మంచి సలహాదారులు ఉంటే వ్యాపారం బలంగా నిలబడుతుంది.వ్యాపారవేత్తకు అవసరమైన సలహాదారులుబుక్ కీపర్: వ్యాపారంలో వచ్చే ప్రతి రూపాయి లెక్కను కచ్చితంగా నమోదు చేస్తాడు. సరైన లెక్కలు లేకపోతే వ్యాపారం గందరగోళంలో పడుతుంది.అకౌంటెంట్: పన్నులు, ఆర్థిక ప్రణాళికలు, ఖర్చులకు సంబంధించిన సలహాలు ఇస్తాడు.అటార్నీ: చట్టపరమైన సమస్యల నుంచి వ్యాపారాన్ని రక్షిస్తాడు.మార్కెటింగ్ మేనేజర్: ఉత్పత్తిని ప్రజలకు చేరవేస్తాడు. మంచి మార్కెటింగ్ లేకపోతే మంచి ఉత్పత్తి కూడా గుర్తింపు పొందదు.ప్రొడక్ట్ డెవలపర్: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను రూపొందిస్తాడు.బ్యాంకర్: ఆర్థిక సహాయం, పెట్టుబడులపై మార్గనిర్దేశం చేస్తాడు.బంగారం, వెండి బ్రోకర్: విలువైన లోహాలలో పెట్టుబడులపై సలహా ఇస్తాడు.స్టాక్ అండ్ బాండ్ బ్రోకర్: షేర్లు, బాండ్లు వంటి పెట్టుబడులపై అవగాహన కల్పిస్తాడు.Entrepreneurs most important assets:1: Their brain and dedication to life long learning.2: Their team of advisors.Who is on your team of advisors?Do you have?1: Book keeper for accurate numbers2: Accountant3: Attorney4: Marketing manager5: Product…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 16, 2026 ఈ టీమ్ కలిసి పనిచేస్తే, వ్యాపారవేత్తకు సరైన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. ఒంటరిగా పని చేసే మేధావి కంటే, మంచి సలహాదారులతో కూడిన బృందం మంచి విజయాన్ని సాధిస్తుంది.పాఠశాలలో చదుకునేటప్పుడు తప్పులు చేసే టీచర్ శిక్షిస్తారు. అందుకే చాలామంది ఉపాధ్యాయులు వ్యాపార ప్రపంచంలో పెద్దగా ఎదగలేరని కియోసాకి అన్నారు. నిజ జీవితంలో తప్పులు చేయడం సహజం. వాటి నుంచి నేర్చుకోవడం ద్వారానే విజయం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: నమ్మలేని నిజం.. దేశాన్ని కాపాడిన బంగారం! -
ల్యాప్‌టాప్, ఏఐ.. వ్యాపారంలో విజయం: కియోసాకి
పెట్టుబడుల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించే రాబర్ట్ కియోసాకి.. తాజాగా పెద్ద కంపెనీలు మాత్రమే విజయం సాధిస్తాయనే విషయంపై స్పందించారు. AI సహాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారాన్ని ఎవరైనా నిర్మించగలరు అని పేర్కొన్నారు.ఈ కాలంలో పెద్ద కంపెనీలకు మాత్రమే విజయావకాశాలు ఉన్నాయనే భావన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి కూడా తన ఇంటి వంటగదిలో కూర్చొని, కేవలం ల్యాప్‌టాప్, ఏఐ సహాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారాన్ని నిర్మించగలడని కియోసాకి పేర్కొన్నారు.ఒకప్పుడు పెద్ద వ్యాపారం ప్రారంభించాలంటే భారీ పెట్టుబడి, ఉద్యోగులు, ఆఫీస్, మార్కెటింగ్ టీమ్, మౌలిక సదుపాయాలు అవసరమయ్యేవి. కాబట్టి వ్యాపారం అనేది ధనికులకు మాత్రమే లేదా పెద్ద సంస్థలకు మాత్రమే సాధ్యమని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏఐ సాయంతో ఒక వ్యక్తి ఒంటరిగా.. చాలామంది చేసే పనులు చేసేస్తున్నాడు. పెద్ద పెద్ద ఆఫీసులు లేకపోయినా, ఇంట్లో నుంచే వ్యాపార నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధించవచ్చు. AI సహాయంతో ఒక వ్యక్తి పెద్ద కంపెనీల మార్కెటింగ్ విభాగం కంటే ఎక్కువ కంటెంట్‌ను తయారు చేయగలడు. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోగలడు. కస్టమర్లకు త్వరగా స్పందించగలడు. మార్కెట్లో వచ్చే మార్పులకు పెద్ద కంపెనీల కంటే వేగంగా.. అనుగుణంగా మారగలడని కియోసాకి అన్నారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహాపెద్ద కంపెనీలకు డబ్బు, వనరులు ఎక్కువగా ఉంటాయి. కానీ చిన్న వ్యాపారులకు వేగం గొప్ప ఆయుధం ఉంది. ఈ రోజుల్లో వేగంగా ఆలోచించి, వేగంగా అమలు చేసే వారే గెలుస్తున్నారు. పెద్ద సంస్థలు ఒక నిర్ణయం తీసుకునేలోపు.. చిన్న వ్యాపారులు కొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఇది కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితం కాదు. ఏ రంగంలో అయినా.. తెలివిగా ఆలోచిస్తే తప్పకుండా విజయం సొంతం అవుతుందని కియోసాకి చెబుతున్నారు. -
డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా
పశ్చిమాసియా యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలపైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ద్రవ్యోల్బణం సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డబ్బు విలువ తగ్గితే.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత ప్రమాదంలో పడుతుంది. ఈ పరిస్థితికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.మొదటిది, ఇరాన్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు పెరగడం వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, ఉత్పత్తి ఖర్చులు, ఆహార పదార్థాల ధరలు అన్నీ పెరుగుతాయి. ఫలితంగా ప్రతి వస్తువు ఖరీదవుతుంది. ఈ పరిస్థితినే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పెరిగితే నగదు విలువ తగ్గిపోతుంది.ఇక రెండో కారణం.. దేశాలపై పెరుగుతున్న జాతీయ అప్పులు. ప్రభుత్వాలు భారీ అప్పులు తీసుకున్నప్పుడు వాటిని తీర్చడానికి మరింత కరెన్సీ ముద్రించాల్సి వస్తుంది. ఎక్కువ డబ్బు మార్కెట్లోకి వస్తే కరెన్సీ విలువ తగ్గుతుంది. అందుకే.. కియోసాకి ప్రభుత్వం ముద్రించే డబ్బును ఫేక్ మనీ అంటారు.TAKE ACTION: 2 reasons why inflation will steal your money1: As long as the war in Iran rising oil prices will cause inflation and your fist money to decline in purchasing power.2: Nation Debt will cause governments to print more fake money.Please protect your self,…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 13, 2026డబ్బును కాపాడుకోవాలంటే.. ప్రతివ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కాబట్టి బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథేరియం వంటివాటితో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇవి కష్టకాలంలో మిమ్మల్ని ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయగలవు. బంగారం, వెండి వంటి విలువ కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో వీటి ధరలు మరిం త పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?గోల్డ్, సిల్వర్ వంటివి కొనుగోలు చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, అని చాలామంది అనుకుంటారు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించినవాళ్లు మాత్రం.. బంగారం ఎలా కొనాలి?, అని ఆలోచిస్తారు. ఈ ఆలోచన మనిషిలో కొత్త అవకాశాలను వెతకడానికి ప్రేరణ ఇస్తుంది. ధనవంతుల ఆలోచన సమస్యలపై కాకుండా పరిష్కారాలపై ఉంటుందని కియోసాకి స్పష్టం చేశారు. -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెప్పే రాబర్ట్ కియోసాకి.. తాజాగా 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోందని.. భవిష్యత్తును చూడగలిగే వారికి ఇది శుభవార్త అని పేర్కొన్నారు. ఇంతకీ కియోసాకి ఇలా ఎందుకు అన్నారు?, దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? అనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.ఉత్తమ పెట్టుబడిదారులు భవిష్యత్తును చూడగలరు. ఉదాహరణకు.. నేను 1965లో వెండి ధర చాలా తక్కువ ఉండేది. ఆ సమయంలోనే వెండిని పోగు చేయడం ప్రారంభించాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఆ నాటి నుంచి పోగు చేసిన సిల్వర్ ఇప్పుడు నా అత్యుత్తమ పెట్టుబడులలో ఒకటిగా నిలిచిందని కియోసాకి తన ఎక్స్ ఖాతాలో షేర్ పేర్కొన్నారు.కియోసాకి ట్వీట్లో రెండు ప్రశ్నలను కూడా సంధించారు. ఇందులో ఒకటి 'భవిష్యత్తులో ఏమి జరగబోతోందని మీరు భావిస్తున్నారు?'. మరొకటి, భవిష్యత్తులో లాభం పొందడానికి మీరు దేనిలో పెట్టుబడి పెట్టగలరు?'. ఈ ప్రశ్నలకు నెటిజన్లు తమదైన రీతిలో జవాబులు ఇస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణపెట్టుబడుల విషయంలో జాగ్రత్త అని చెబుతూనే.. 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది. భవిష్యత్తును చూడగలిగే వారికి ఇది శుభవార్త. అంధులకు ఇది దుర్వార్త. అని కియోసాకి తన ట్వీట్ ముగించారు.వెండి ధరలు ఇలా..నిజానికి వెండి ధరలు కొన్నాళ్లుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. 2025 జనవరి రూ.90 వేల వద్ద ఉన్న కేజీ సిల్వర్ ధర, 2026 ప్రారంభంలో రూ.2.34 లక్షలకు చేరింది. ఆ తరువాత రూ.3.85 లక్షలకు చేరి కొనుగోలుదారులకు షాకిచ్చింది. కాగా ఇప్పుడు వెండి ధర రూ.2.85 లక్షల వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే.. వెండి ధరలలో ఎలాంటి పరిణామాలు జరిగాయో స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు పెరుగుతాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. -
ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణ
పెట్టుబడుల గురించి, ఆర్థికపరమైన విషయాలను చెప్పే 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు ఉద్యోగుల గురించి, వారి భవిష్యత్తు గురించి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఉద్యోగి ప్రతి వారం ఐదు రోజులు చాలా కష్టపడి పనిచేస్తాడు. ఉదయం నిద్రలేచి ఆఫీసుకు వెళ్లడం, ట్రాఫిక్‌లో ప్రయాణించడం, ఎప్పటికీ ముగియని పనులను పూర్తి చేయడం. ఇవన్నీ చేస్తూ.. చేస్తూ చివరికి అలసట మాత్రమే మిగులుతుంది. ఇలాంటి సమయంలో 'జీవితాంతం ఇలాగే కొనసాగాలా?' అనే ప్రశ్న మనసులో పుడుతుంది.అంటే.. దీని అర్థం పని చేయకుండా ఉండటం కాదు. సోమరితనం అంతకంటే కాదు, కృతఙ్ఞతలేకపోవడం కూడా కాదు. నీ కష్టం అంతా మరొకరి కలలను నిజం చేయడానికి వెళ్తోందనే భావన వల్ల కలిగే అలసట మాత్రమే అని కియోసాకి పేర్కొన్నారు.ఆర్థిక ప్రపంచంలో నాలుగు (E, S, B, I) ప్రధానమైన విభాగాలు మాత్రమే ఉన్నాయని, వీటి గురించి కియోసాకి వివరంగా వివరించారు.E – Employee (ఉద్యోగి)S – Self-Employed (స్వయం ఉపాధి పొందినవాడు)B – Business Owner (వ్యాపార యజమాని)I – Investor (పెట్టుబడిదారు)చాలామంది జీవితాంతం E విభాగంలోనే ఉంటారు. అంటే.. ఉద్యోగం చేస్తూ జీతం మీద ఆధారపడతారు. కానీ ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. వీళ్లే ఎక్కువ పన్నులు చెల్లిస్తుంటారు. జీతం చేతికి రాకముందే ప్రభుత్వం పన్ను తీసుకుంటుంది. తరువాత మిగిలిన డబ్బుతోనే ఎంప్లాయ్ జీవించాలి.ఈ సమయంలో కియోసాకి పూర్ డాడ్ గురించి పేర్కొన్నాడు. ఆయన చాలా చదువుకున్నవారు, ప్రభుత్వ ఉద్యోగం చేశారు. చాలా కష్టపడే వ్యక్తి. మంచి ఉద్యోగమే భద్రత అని నమ్మేవారు. కానీ జీవితాంతం కష్టపడి పనిచేసినా.. చివరికి అప్పులు మిగిలాయి.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?రిచ్ డాడ్ ఆలోచన మాత్రం.. పూర్ డాడ్ ఆలోచనకు భిన్నంగా ఉంటుంది. ఈయన B, I విభాగాలను ప్రధాన్యత ఇచ్చారు. ఇందులోనే జీవించారు. అంటే వ్యాపారాలు నిర్మించారు, పెట్టుబడులు కూడా పెట్టారు. ఈయన డబ్బుకోసం పనిచేయలేదు, తన కోసం పనిచేసే వ్యవస్థలను నిర్మించాడు. అందువల్ల పన్నుల చట్టాలు కూడా ఆయనకు అనుకూలంగా పనిచేశాయి.ఒక ఉద్యోగి సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం పన్నులుగా వెళ్లిపోతాయి. కానీ ఒక వ్యాపారవేత్త అదే డబ్బును వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టి, ఆస్తులు పెంచుకుని, చివర్లో మాత్రమే పన్నులు చెల్లిస్తాడు. అంటే ఒకే దేశం, ఒకే ఆర్థిక వ్యవస్థ అయినా.. నియమాలు అందరికీ ఒకేలా పనిచేయవు.Facebook Story ReferenceThis content is shared via Facebook Story (temporary content).Open Story on Facebook -
ఆ అబద్ధమే ఇంకా చెబుతున్నారు.. కియోసాకి ఆందోళన
ఇన్వెస్టర్ గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా చేసిన ఫేస్బుక్ పోస్టులో ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “స్కూల్‌కి వెళ్లి, ఉద్యోగం సంపాదిస్తే భద్రత ఉంటుంది” అనే అత్యంత ఖరీదైన అబద్ధాన్ని ఇప్పటికీ 2026లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.కియోసాకి పేర్కొన్న వివరాల ప్రకారం, 2025 సంవత్సరం ఉద్యోగుల పాలిట అత్యంత కఠినమైన కాలంగా మారింది. ఆ ఒక్క సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 లక్షల ఉద్యోగాల కోతలు నమోదయ్యాయని, ఇది 2020 తర్వాత అత్యధికమని ఆయన తెలిపారు. అలాగే 2026 జనవరిలోనే 1,08,435 ఉద్యోగాలు ఊడిపోయాయనిఇ చెప్పారు.టెక్నాలజీ రంగంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని కియోసాకి పేర్కొన్నారు. 2026లో ప్రతిరోజూ సగటున 1,003 మంది టెక్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. అమెజాన్ జనవరిలో 16 వేల ఉద్యోగాలను తొలగించగా, మెటా మే నెలలో మరో 8 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని చెప్పారు. చెవ్రాన్ 8 వేల మందిని, డెల్ 11 వేల మందిని, సిటీగ్రూప్ 20 వేల మందిని తొలగించిందని, స్పిరిట్ ఎయిర్‌లైన్స్ మూతపడటంతో 17 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన వివరించారు.ఈ పరిస్థితులకు కృత్రిమ మేధస్సు (AI) ప్రధాన కారణంగా మారుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక్క 2025లోనే ఏఐ కారణంగా అమెరికాలో 55 వేల ఉద్యోగాలు పోయాయని, 2026 ఏప్రిల్‌లో జరిగిన ఉద్యోగ కోతల్లో 26 శాతం ఏఐ కారణంగానే జరిగాయని ఆయన పేర్కొన్నారు.“ఇవేవీ విఫలమైన కంపెనీలు కావు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంస్థలు. అయినా అత్యంత చదువుకున్న, నైపుణ్యం కలిగిన ఉద్యోగులే తొలగింపులకు గురవుతున్నారు” అని కియోసాకి వ్యాఖ్యానించారు. ఉద్యోగ భద్రత అనేది అసలు ఎప్పుడూ నిజం కాదని, ఉద్యోగంపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.తన తండ్రి ఉదాహరణను ప్రస్తావిస్తూ, “నా తండ్రి పీహెచ్డీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి. ఒక్కరోజు కూడా పని మానలేదు. అయినా చివరికి అప్పులతోనే మరణించారు” అని ఆయన అన్నారు. విద్యాసంస్థలు మంచి ఉద్యోగులుగా తయారు చేస్తాయని, కానీ డబ్బు ఎలా పనిచేస్తుందో మాత్రం నేర్పవని విమర్శించారు. డబ్బు వ్యవస్థపై మాట్లాడుతూ, “సేవింగ్స్‌లో డబ్బు ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం నెమ్మదిగా దాన్ని తినేస్తుంది. ఉద్యోగుల ఆదాయం ఆగిపోయినప్పుడు వారికి ఆదాయం ఇచ్చే ఆస్తులు లేకపోవడమే అసలు సమస్య” అని ఆయన తెలిపారు.తన చిన్నప్పుడే “రేపు ఉద్యోగం పోతే నీ ఆస్తుల ద్వారా ఎంతకాలం జీవించగలవు?” అని తన ‘రిచ్ డ్యాడ్’ అడిగిన ప్రశ్నను గుర్తుచేసుకున్న కియోసాకి, ఉద్యోగ భద్రత గురించి ఆలోచించే వారికంటే, “నేను ఏ ఆస్తిని నిర్మిస్తున్నాను?” అని ఆలోచించే వారే భవిష్యత్తులో నిలబడతారని పేర్కొన్నారు.“ప్రపంచం మారిపోయింది. కానీ పాత సలహాలు మాత్రం మారలేదు. ఏఐ విప్లవం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది” అని కియోసాకి తన పోస్టులో హెచ్చరించారు. -
2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎలాంటి ఆస్తులు స్థిరంగా ఉంటాయనే విషయాన్ని చర్చించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా మంది జీవితకాలంగా కూడబెట్టుకున్న సేవింగ్ కొన్ని వారాల్లోనే కరిగిపోవడం నేను చూశాను. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి వాటిలో పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా 40 శాతం నుంచి 60 శాతం వరకు పడిపోయాయి. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వంటి భౌతిక ఆస్తులు స్థిరంగా నిలిచాయని కియోసాకి పేర్కొన్నారు.పేపర్ ఆస్తులుకియోసాకి ప్రకారం.. స్టాక్‌లు, బాండ్లు, నగదు వంటివాటిని ''పేపర్ ఆస్తులు''. ఇవి నిజంగా భౌతికంగా ఉండే వస్తువులు కావు, ఇవి కొన్ని వాగ్దానాలపై ఆధారపడతాయి.➤స్టాక్ అంటే ఒక కంపెనీ లాభదాయకంగా కొనసాగుతుందనే నమ్మకం➤బాండ్ అంటే ప్రభుత్వం లేదా సంస్థ అప్పు తిరిగి చెల్లిస్తుందనే నమ్మకం➤డబ్బు అంటే కేంద్ర బ్యాంక్ దాని విలువను స్థిరంగా ఉంచుతుందనే నమ్మకంఅంటే.. ఇవన్నీ మన నియంత్రణలో కాకుండా, వ్యవస్థపై ఆధారపడిన ఉంటాయన్నమాట. రియల్ ఆస్తులురాబర్ట్ కియోసాకి దృష్టిలో భూమి, ఇళ్లు, బంగారం, వెండి వంటి వాటిని రియల్ ఆస్తులు. ఇవి భౌతికంగా ఉండే వస్తువులు కాబట్టి, ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ వాటి విలువ పూర్తిగా తగ్గే అవకాశం లేదు.భూమి ఎప్పుడూ ఉంటుంది, బంగారం అనేక శతాబ్దాలుగా విలువను నిలుపుకుంది. అద్దె ఇల్లు ఉంటే ప్రతి నెల ఆదాయం వస్తుంది. కాబట్టి సంక్షోభ సమయాల్లో ఇవి నిలకడగా ఉంటాయి.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకిప్రతి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. స్టాక్స్, పేపర్ ఆస్తులు వేగంగా పడిపోతాయి. ఎందుకంటే ప్రజల్లో భయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలు భయంతో స్టాక్స్ అమ్మేస్తారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన వారు ఎక్కువ నష్టపోతారు. రియల్ ఆస్తులు మాత్రం స్థిరంగా ఉండడం లేదా పెరగడం జరుగుతుంది. అందుకే.. అనుభవజ్ఞులు సంక్షోభం రాకముందే తమ పెట్టుబడులను భౌతిక ఆస్తుల వైపు మార్చుకుంటారు.ఏ ప్రభుత్వం ఏర్పడక ముందే భూమి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉంది. ఒక బంగారు నాణెం రోమన్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, వాటి మధ్య వచ్చిన ప్రతి కరెన్సీ సంక్షోభాన్ని తట్టుకుని నిలిచింది. కాబట్టి నిజమైన వస్తువులకు ఉండే శాశ్వతత్వం కాగితపు వస్తువులకు ఎప్పటికీ ఉండదని రాబర్ట్ కియోసాకి విశ్వసిస్తున్నారు. -
అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి
ఆర్ధిక విషయాలకు సంబంధించిన విషయాలను, పెట్టుబడులకు సంబంధించిన సమాచారం గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki), తాజాగా బేబీ బూమర్స్ గురించి చెప్పారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''1974లోనే నేను బేబీ బూమర్ల (1946 నుంచి 1964 మధ్య పుట్టిన వారిని బేబీ బూమర్స్ అంటారు) పదవీ విరమణ విపత్తు రాబోతోందని ఊహించాను. 2026 చివరి నాటికి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. చాలామంది నిరాశ్రయులవుతారు'' అని కియోసాకి హెచ్చరించారు.ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కాస్త కఠినంగా మారుతున్నాయి. చాలా మంది వృద్ధులు ఉద్యోగాలు కోల్పోయి, సరిపడా పొదుపులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, ఇది సమాజానికి పెద్ద సవాలు. అందుకే ముందుగానే ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యమని కియోసాకి చెబుతున్నారు.మన మెదడు మనకు ఉన్న గొప్ప ఆస్తి. సరైన జ్ఞానం, సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడైనా మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. సంపదను సృష్టించడం అంత కష్టం కాదు, సరైన మార్గం తెలుసుకుంటే సరిపోతుంది.ఇదీ చదవండి: ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు: కియోసాకి హెచ్చరికకొంతమంది నిపుణులు.. భవిష్యత్తు కోసం బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, అలాగే డిజిటల్ ఆస్తులు అయిన బిట్‌కాయిన్, ఎథీరియం లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా, అవగాహనతో ముందుకు వెళ్లడం అవసరం అని రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. మొత్తం మీద.. రిటైర్మెంట్ తర్వాత సుఖంగా జీవించాలంటే ముందుగానే ప్రణాళిక అవసరం అని ఆయన పేర్కొన్నారు.BOMERS RETIREMENT DISASTER:In 1974 I saw the coming of the Baby Boomer Retirement Disaster. In 2026 millions of Boomers will be out of work in trouble financially….many homeless.I wrote two books for the Boomers and their families who wanted to prepare for this time in…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 6, 2026 -
'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయని, అప్పు చేయడం తప్పు కాదని, డబ్బును ఎలా నిర్వహించాలో తప్పకుండా తెలుసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో..కియోసాకి హెచ్చరిక!ఈ రోజు చాలా మంది విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయి. ఎందుకంటే ''బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, కష్టపడి పని చేయు, డబ్బు సేవ్ చేయు, అప్పులు తగ్గించు, దీర్ఘకాల పెట్టుబడులు పెట్టు'' అనే మాటలే ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కానీ ఇవి ఇప్పటి ప్రపంచానికి సరిపోవని కియోసాకి హెచ్చరించారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 1971లో, అధ్యక్షుడు నిక్సన్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించారు. ఆ తరువాత ప్రభుత్వాలు ఎక్కువ డబ్బు ముద్రించడం ప్రారంభించాయి. దీంతో డబ్బుకు విలువ తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సామాన్య ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది.జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో..జీతం కోసం పనిచేస్తూ మీరు ధనవంతులు కాలేరు, ఎందుకంటే ఆ జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో బంధించి ఉంచుతుంది. కాబట్టి ''డబ్బు కోసం పని చేయడం కాకుండా, ఆస్తులు సృష్టించడం లేదా సంపాదించండి అని కియోసాకి చెబుతారు. ధనవంతులు తమ డబ్బును వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడిగా పెడతారు. అప్పులు తీసుకుని కూడా ఆస్తులు కొనుగోలు చేసి వాటి ద్వారా ఆదాయం పొందుతారు. అలాగే పన్నుల వ్యవస్థను కూడా చట్టబద్ధంగా తమకు అనుకూలంగా ఉపయోగిస్తారని కియోసాకి అంటారు.జీతంపై ఆధారపడటం వల్లమరోవైపు, ఉద్యోగం చేసేవారు ఎక్కువగా జీతంపై ఆధారపడటం వల్ల ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి.. డబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ముఖ్యం. అప్పు, పన్నులు ధనవంతులను మరింత ధనవంతులుగా చేస్తాయి. ఇవి మధ్యతరగతి వారిని మరింత పేదలుగా చేస్తాయి. ఇందులో తేడా మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనే దానిలో లేదు. మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే దానిలో ఉందని కియోసాకి పేర్కొన్నారు.పాతబడిపోయే ప్రపంచంలో జీవిస్తున్నాంప్రతి 18 నెలలకు సమాచారం పాతబడిపోయే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మీరు 20 లేదా 30 సంవత్సరాల క్రితం నేర్చుకున్న ఆర్థిక విద్యతోనే ఇప్పటికీ పనిచేస్తుంటే, మీరు ఇప్పటికే వెనుకబడి ఉన్నారు. చెడ్డ ఆర్థిక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. కేవలం మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఉంది. మీ ఆలోచనా విధానం దృఢంగా లేకుంటే.. ప్రతి ఆర్థిక వ్యవస్థ చెడ్డగానే కనిపిస్తుంది. అనే విధంగా.. మీ ఆలోచనా విధానం బలంగా, విజ్ఞానవంతంగా ఉంటే, మీరు ప్రతిచోటా అవకాశాన్ని చూస్తారు అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'పాసివ్ ఇన్కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు -
చేతులు మారుతున్న ‘ప్రపంచ ఆర్థిక శక్తి’.. కియోసాకి వైరల్ పోస్ట్
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad ) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఇన్వెస్టర్లను మరోసారి హెచ్చరించారు. సరిగ్గా 12 రోజుల్లో, అంటే మే 15న, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక పీఠం (అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్) చేతులు మారబోతోంది. అయితే మెజారిటీ ప్రజలకు దీని పర్యవసానాలు ఏంటో తెలియడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేశారు.వార్ష్ చేతుల్లోకి పగ్గాలు..గత ఎనిమిదేళ్లుగా ఫెడ్ చైర్మన్‌గా ఉన్న జెరోమ్ పావెల్ మే 15న పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ నమ్మకస్తుడు కెవిన్ వార్ష్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గత 50 ఏళ్లలో ఏ ఫెడ్ చైర్మన్ ఎదుర్కోనంతటి భయంకరమైన ఆర్థిక పరిస్థితుల మధ్య వార్ష్ పదవిలోకి వస్తున్నారని కియోసాకి విశ్లేషించారు.వార్ష్ ముందున్న సవాళ్లు ఇవే..చమురు మంట: బ్యారెల్ ఆయిల్ ధర 120 డాలర్ల వద్ద ఉంది.ద్రవ్యోల్బణ సెగ: 3.3 శాతంతో ద్రవ్యోల్బణం గత రెండేళ్ల గరిష్టానికి చేరింది.వడ్డీ రేట్ల సందిగ్ధత: ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో, ఫెడ్ వడ్డీ రేట్లను 3.5% - 3.75% వద్దే కొనసాగించాల్సి వస్తోంది.కియోసాకి మాటల్లో 'వార్ష్ ట్రాప్'కెవిన్ వార్ష్ ఒక ప్రమాదకరమైన ఉచ్చులో చిక్కుకున్నారని కియోసాకి అభివర్ణించారు. ఆయన ముందున్నవి కేవలం మూడు మార్గాలు, ఆ మూడూ నష్టదాయకమే. రేట్లు తగ్గించడం: రేట్లు తగ్గిస్తే, అప్పటికే మండుతున్న ద్రవ్యోల్బణంపై పెట్రోల్ పోసినట్లవుతుంది.రేట్లు మార్చకపోవడం: ఇది అధ్యక్షుడు ట్రంప్‌ను నిరాశపరచడమే కాకుండా, యుద్ధం వల్ల కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది.రేట్లు పెంచడం: ఇది దేశాన్ని నేరుగా ఆర్థిక మాంద్యం (Recession)లోకి నెట్టివేస్తుంది. తొలగని పావెల్ నీడ!ఈ కథనంలో మరో ఆసక్తికరమైన మలుపు ఏంటంటే.. చైర్మన్ పదవి నుంచి దిగిపోయినా, జెరోమ్ పావెల్ ఫెడ్ బోర్డు నుంచి వెళ్లడం లేదు. 2028 వరకు ఆయన బోర్డు మెంబర్‌గా కొనసాగుతారు. 1951 తర్వాత ఒక మాజీ చైర్మన్ ఇలా బోర్డులో ఉండిపోవడం ఇదే తొలిసారి. అంటే, ట్రంప్ తనకిష్టమైన వారిని ఆ సీటులో కూర్చోబెట్టి వడ్డీ రేట్లు తగ్గించేలా చక్రం తిప్పాలని చూసినా, పావెల్ అక్కడ ‘వాచ్ డాగ్’లా అడ్డుపడే అవకాశం ఉంది.అసలు బాస్ ఎవరు?కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఇప్పుడు ఫెడ్ చైర్మన్ ఎవరన్నది ముఖ్యం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది వార్ష్ కాదు, ట్రంప్ అంతకన్నా కాదు. కేవలం 21 మైళ్ల వెడల్పు ఉన్న 'హార్ముజ్ జల సంధి' (Strait of Hormuz)."ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల ప్రయాణం సాధారణ స్థితికి వచ్చే వరకు.. ద్రవ్యోల్బణం 2%కి తగ్గే వరకు.. ఫెడ్ రేట్లు తగ్గించే సాహసం చేయలేదు. ఎవరు చైర్మన్ సీటులో కూర్చున్నా సరే.. ప్రస్తుతానికి 'హార్ముజ్ జలసంధి' మాత్రమే ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్ణయిస్తోంది." అని కియోసాకి తేల్చి చెప్పారు.ఇన్వెస్టర్లు కేవలం వ్యక్తుల మార్పును మాత్రమే కాకుండా, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను గమనించాలని కియోసాకి సూచించారు. వార్ష్ రాకతో అద్భుతాలు జరుగుతాయని ఆశించడం కంటే, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడం మేలని ఆయన పోస్ట్ సారాంశం. -
'పాసివ్ ఇన్కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు పాసివ్ ఇన్కమ్ గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.పాసివ్ ఇన్కమ్ గురించి చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. పాసివ్.. అంటే ఎలాంటి కష్టం లేకుండా డబ్బు వస్తుందని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. పాసివ్ ఇన్కమ్ అనేది ప్రారంభంలో చాలా శ్రమ, సమయం, జ్ఞానం అవసరమైన ప్రక్రియ. ముందుగా ఒక వ్యవస్థను నిర్మించాలి. ఆ తర్వాతే అది మనకు డబ్బు తీసుకువస్తుంది.పూర్తిగా యాక్టివ్ వర్క్ముందు పాసివ్ అనే పదం కొంచెం తప్పుదోవ పట్టిస్తుంది. ప్రారంభ దశలో.. ఇది పూర్తిగా యాక్టివ్ వర్క్. అంటే.. మీరు పెట్టుబడి పెట్టాలి, నేర్చుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉదాహరణకు.. ఒక అద్దె ఇల్లు కొనాలంటే మీరు మార్కెట్, ఖర్చులు, లాభాలు అన్నీ అర్థం చేసుకోవాలి. ఇది అనుకున్నంత సులభం కాదు. కష్టపడి నిర్మించిన ఆస్తుల ద్వారా ఆదాయం!చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. పాసివ్ ఇన్కమ్ అంటే ''ఎటువంటి శ్రమ లేకుండా వచ్చే ఆదాయం'' అని భావించడం. నిజానికి అలాంటి ఆదాయం ఉండదు. పాసివ్ ఇన్కమ్ అనేది లీవరేజ్ ఆధారంగా వస్తుంది. అంటే.. మీరు ఒకసారి కష్టపడి నిర్మించిన ఆస్తులు తరువాత మీకు ఆదాయం తీసుకువస్తాయి. ఇవి రియల్ ఎస్టేట్, వ్యాపారం, రాయల్టీలు, లేదా డివిడెండ్లు కావచ్చు.పాసివ్ ఇన్కమ్ సాధించాలంటే మూడు ముఖ్యమైన దశలుమొదటిది, ఆర్థిక విద్య. మీరు డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఇది చాలా మంది విస్మరించే అంశం.రెండవది, నిజంగా డబ్బు తెచ్చే ఆస్తిని సృష్టించడం లేదా కొనుగోలు చేయడం. ఇది కేవలం భవిష్యత్తులో పెరుగుతుందని ఆశించే ఆస్తి కాకుండా, ప్రతి నెలా ఆదాయం తెచ్చే ఆస్తి కావాలి. మూడవది.. ట్యాక్స్ ప్లానింగ్, లీగల్ స్ట్రక్చర్ ద్వారా ఆ ఆస్తిని రక్షించడం.మధ్యతరగతి ఎందుకు ఇక్కడే ఆగిపోతుంది అంటే, వారికి ఒకే మార్గం చూపించారు. మంచి ఉద్యోగం పొందాలి, డబ్బు సేవ్ చేయాలి, రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టాలి. కానీ ఇది పాసివ్ ఇన్కమ్ నిర్మించడానికి ఇది సరిపోదు. ఇది కేవలం జీవనోపాధి కోసం మాత్రమే.చివరగా, మనం తెలుసుకోవాల్సిన అంశం ''పాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి?'' కాదు. దాన్ని సాధించడానికి నేను ఏమి నేర్చుకోవాలి?. పాసివ్ ఇన్కమ్ అనేది ఒక్కసారిగా వచ్చే విషయం కాదు. ఇది మీరు సంపాదించిన జ్ఞానం, తీసుకున్న నిర్ణయాలు, నిర్మించిన ఆస్తుల ఫలితం.ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా! -
ఇండియాతో పోలిక.. పాకిస్తాన్ పరువు తీసిన కియోసాకి
ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతుంటే, పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్ల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశారు. భారత్ తన దూరదృష్టితో సంక్షోభాన్ని తట్టుకుంటుంటే, పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని ఆయన ఎత్తిచూపారు.పాక్ వద్ద ఒక్క రోజు నిల్వలు కూడా లేవు!పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కియోసాకి తన ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రస్తావించారు. ఇస్లామాబాద్ వద్ద కనీసం ఒక్క రోజుకు సరిపడా ‘వ్యూహాత్మక చమురు నిల్వలు’ కూడా లేవని మాలిక్ అంగీకరించారు.కియోసాకి ఏమన్నారంటే‘న్యూఢిల్లీ తన అత్యవసర నిల్వలను పెంచుకోవడంలో నిమగ్నమైతే, ఇస్లామాబాద్ మాత్రం తమ చమురు సరఫరా సురక్షితంగా ఉందని ప్రపంచాన్ని నమ్మించే పనిలో ఉంది. కానీ వాస్తవం వేరు. భారత్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటే, పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’పాక్‌లో భగ్గుమంటున్న ధరలుఏప్రిల్ ప్రారంభం నుండి పాకిస్తాన్లో ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.321 నుండి ఏకంగా రూ.458కి (43% పెరుగుదల) చేరింది. డీజిల్ లీటరుకు రూ.335 నుండి రూ.520కి (55% పెరుగుదల) పెరిగింది. ఈ అస్థిరత వల్ల దేశంలో సరఫరా గొలుసు విచ్ఛిన్నమై, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిని ‘జాతీయ అత్యవసర పరిస్థితి’గా అభివర్ణిస్తున్నాయి.భారత్ విజయం వెనుక రహస్యం..భారత్ ఈ స్థాయి సంక్షోభాన్ని ఎలా తట్టుకోగలుగుతుందో వివరిస్తూ కియోసాకి కీలక విషయాలు వెల్లడించారు. భారత్ నిర్మించున్న వ్యూహాత్మక నిల్వలు 60 నుండి 70 రోజులకు సరిపోతాయి. ప్రభుత్వం కేవలం ‘ఒక సంతకం’తో ఈ అత్యవసర చమురును విడుదల చేసి మార్కెట్‌ను స్థిరీకరించగలదు.భారత్ కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా రష్యా, వెనిజులా వంటి దేశాల నుండి చమురు దిగుమతులను పెంచుకుని తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద చమురు శుద్ధి దేశంగా ఉన్న భారత్, ఎగుమతి సుంకాలను సర్దుబాటు చేస్తూ దేశీయ ధరలు పెరగకుండా అడ్డుకోగలిగింది.పాక్ మంత్రి నిస్సహాయతపాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ కూడా భారత్ సన్నద్ధతను ప్రశంసించక తప్పలేదు. "భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండటమే కాకుండా, వారు ఐఎంఎఫ్ (IMF) కఠిన నిబంధనల కింద లేరు. అందుకే వారు పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించగలుగుతున్నారు. కానీ మేము ప్రతి పైసా కోసం ఐఎంఎఫ్ అనుమతి తీసుకోవాల్సి వస్తోంది" అని ఆయన వాపోయారు.యుద్ధం ఈ ఆర్థిక అంతరాన్ని సృష్టించలేదని, కేవలం ఇరు దేశాల మధ్య ఉన్న సన్నద్ధత లోపాన్ని బయటపెట్టిందని కియోసాకి విశ్లేషించారు. హోర్ముజ్ జలసంధి మూతపడితే, దిగుమతులపైనే ఆధారపడ్డ పాకిస్తాన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. -
వచ్చేది పెను సంక్షోభమే: కియోసాకి అలర్ట్
ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు చిరపరిచితమైన పేరు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki). 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad)పుస్తకంతో ఆర్థిక పాఠాలు నేర్పిన ఆయన, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026-27 మధ్య కాలంలో ప్రపంచం ఒక భారీ ఆర్థిక సంక్షోభాన్ని, బహుశా ఒక గొప్ప ఆర్థిక మాంద్యాన్ని (Great Depression) ఎదుర్కోబోతోందని ఆయన హెచ్చరించారు.సంక్షోభంలో చిక్కుకుంటారా.. లాభపడతారా?తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కియోసాకి స్పందిస్తూ.. రాబోయే ఈ భారీ క్రాష్‌లో ప్రజలు రెండు రకాలుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. ఒక వర్గం వారు ఆర్థికంగా చితికిపోతే, మరో వర్గం వారు అదృష్టవంతులుగా మారి భారీగా లాభపడతారని ఆయన విశ్లేషించారు.సంక్షోభాల్లోనే ధనవంతుడినయ్యాను..గతంలో జరిగిన ఆర్థిక పతనాలను గుర్తు చేసుకుంటూ.. "1987, 2000, 2008, 2015, 2019, 2022 సంవత్సరాల్లో వచ్చిన సంక్షోభాల్లో నేను పేదవాడిని కాలేదు, ఇంకా ధనవంతుడిని అయ్యాను. రాబోయే 2026-27 క్రాష్‌లో కూడా నేను మరింత సంపదను పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాను" అని కియోసాకి ధీమా వ్యక్తం చేశారు.ఆస్తులు చౌకగా దొరికే సమయం ఇదే!ఆర్థిక మాంద్యం సమయంలో సామాన్యులు భయపడి ఆస్తులు అమ్ముకుంటే, తెలివైన వారు పెట్టుబడులు పెడతారని కియోసాకి సూచించారు. "మార్కెట్ పతనం (Crash) అయినప్పుడు, గొప్ప ఆస్తులన్నీ తక్కువ ధరకే 'సేల్'లో లభిస్తాయి. ఆ సమయంలో వాటిని కొనుగోలు చేయడం ద్వారానే ధనవంతులు కావచ్చు" అని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని వాడుకొని అందరూ ఆర్థికంగా ఎదగాలని, ఎవరూ నష్టపోకూడదని ఆయన ఆకాంక్షించారు.అయితే కియోసాకి అంచనాలు భారతీయ ఇన్వెస్టర్లకు ఒక హెచ్చరిక వంటివి. ఒకవైపు ప్రపంచ మార్కెట్ల ప్రభావం భారతదేశంపై పడే అవకాశం ఉండగా, మరోవైపు బంగారం (Gold), వెండి (Silver) లేదా రియల్ ఎస్టేట్ (Real Estate) వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఇది గొప్ప అవకాశంగా మారవచ్చు. కానీ, తగిన ఆర్థిక ప్రణాళిక లేకుండా మార్కెట్లోకి వెళ్లడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లోకి దూసుకొస్తున్న ‘జెన్-జీ’IN THIS COMING CRASh possibly a Grest Drpression…. Will you be “FU’CD UP or LU’CD UP.”So far….in the crashes of 1987, 2000, 2008, 2015, 2019, 2022 I got richer not poorer.And again in coming giant crash of 2026-27….I plan on growing richer not poorer.I wish the same for…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 28, 2026 -
కియోసాకి కొత్త వార్నింగ్.. ఈవీలపై కీలక కామెంట్స్
ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ఆర్థిక విషయాలపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించే రాబర్ట్ కియోసాకి.. మరోసారి ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుత ప్రపంచ గందరగోళ పరిస్థితులపై ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ప్రపంచం పిచ్చెక్కిపోతోంది!ప్రస్తుత గ్లోబల్ మార్కెట్, ఆర్థిక అనిశ్చితిని ఉద్దేశిస్తూ... "ఈ ప్రపంచం పిచ్చెక్కిపోతోంది" (The World is Nuts) అంటూ కియోసాకి వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, ద్రవ్యోల్బణం లేదా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.ఈవీపై ఆసక్తికర వ్యాఖ్యఇదే క్రమంలో తన వద్ద ఉన్న వాహనాల గురించి ప్రస్తావిస్తూ.. "నా దగ్గర ఉన్న కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అయినందుకు సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు. సాంప్రదాయ ఇంధన ధరల పెరుగుదల లేదా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన పరోక్షంగా వెల్లడించారు.రాబర్ట్ కియోసాకి వద్ద ఫెరారీ, రోల్స్-రాయిస్ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అయితే ఈ కార్ల కోసం వ్యక్తిగత ఆదాయాన్ని ఉపయోగించకూడదని, ఆస్తుల నుండి వచ్చే ఆదాయంలో ఖర్చులన్నీ పోయాక మాత్రమే విలాసవంతమైన కార్లను కొనాలని ఆయన సూచిస్తారు.ఎప్పుడూ బంగారం, వెండి, బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాలని సూచించే కియోసాకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై పాజిటివ్‌గా స్పందించడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని గత కొంతకాలంగా ఆయన హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.THE WORLD IS NUTS: Glad one of my cars is an EV.— Robert Kiyosaki (@theRealKiyosaki) April 22, 2026 -
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు 2026లో సురక్షితమైన ఆస్తుల గురించి వివరించారు.కియోసాకి ప్రకారం.. అమెరికా డాలర్ వంటి ప్రభుత్వ డబ్బు “నిజమైన సంపద కాదు”, ఎందుకంటే ప్రభుత్వం అవసరమైతే ఎక్కువ డబ్బు ముద్రించగలదు. ఇలా డబ్బు ముద్రించడం వల్ల దాని విలువ తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. అందుకే ఆయన దీనిని “ఫేక్ మనీ” అని అంటారు.ప్రస్తుతం అమెరికా జాతీయ రుణం చాలా ఎక్కువగా ఉందని, రోజుకి బిలియన్ల డాలర్ల రుణం పెరుగుతుందని.. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రమాదంలో పడవచ్చని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన సురక్షితమైన ఆస్తులుబంగారం (Gold)వెండి (Silver)చమురు (Oil)ఆహారం (Food)బిట్‌కాయిన్ (Bitcoin)ఈథీరియం (Ethereum)కియోసాకి అభిప్రాయం ప్రకారం.. పరిమితంగా ఉండే వనరులు విలువైనవి. ఎందుకంటే వాటిని అంత సులభంగా తయారు చేయలేము. కాబట్టి వీటి విలువ క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు.బంగారం, వెండిబంగారం ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరిగింది. ప్రపంచంలో ఆర్ధిక అనిశ్చితి పెరిగినప్పుడు వీటి విలువ పెరుగుతుంది. కాబట్టి దీనిపై పెట్టె పెట్టుబడులు ప్రజలను ధనవంతులను చేస్తుంది. లేదా కష్టకాలంలో ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తుంది.క్రిప్టో కరెన్సీకియోసాకి బిట్‌కాయిన్, ఈథీరియంను భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా చూస్తున్నారు. ఇవి కూడా ప్రభుత్వ నియంత్రణలో లేవు కాబట్టి సంప్రదాయ డబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో పెట్టుబడి పెట్టడం అంటే కొంత రిస్క్ కూడా ఎదుర్కోవాలి ఉంటుంది.చమురు, ఆహారంచమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మౌలిక అవసరం. యుద్ధాలు లేదా సరఫరా సమస్యలు దెబ్బతింటే ధరలు పెరుగుతాయి. అదే విధంగా ఆహార ధరలు కూడా ఇంధన ధరలపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఇవి కూడా 'అవసరమైన ఆస్తులు' అని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన ఈ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు విమర్శించారు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి అంచనా నిజం కాలేదు కాబట్టి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆర్ధిక నిపుణులు ఒకే రకమైన పెట్టుబడులపై పూర్తిగా ఆధారపడకూడదని సూచిస్తారు.ఇదీ చదవండి: ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు! -
‘హెచ్చరిక: 'రిచ్ డాడ్' అంచనాలు నిజమవుతున్నాయ్’
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' (Rich Dad’s Prophecy) పుస్తకంలోని అంచనాలు 2026 నాటికి నిజమవుతున్నాయని ఆయన ‘ఎక్స్’ పోస్ట్‌లో హెచ్చరించారు.బుడగ పేలిపోనుంది!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఒక భారీ బుడగ లాంటివని, అది త్వరలోనే పగిలిపోనుందని కియోసాకి పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు."దుబాయ్ నుండి వేగాస్ వరకు, టోక్యో నుండి న్యూయార్క్ వరకు ఆర్థిక పతనాలను గమనించండి. దురదృష్టవశాత్తూ, ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య పెరగబోతోంది" అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.బాధితులుగా మిగిలిపోకండి..ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికీ, అప్రమత్తంగా ఉండేవారు విజేతలుగా నిలవవచ్చని కియోసాకి సూచించారు. ఈ సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మార్పులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఆర్థిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ కోసం పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు."ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా.. మీరు మాత్రం ఆర్థికంగా విజేతలుగా నిలవవచ్చు. అందుకు కావాల్సిన పోరాటం మీరు చేయాలి" అని కియోసాకి తన ఫాలోవర్లకు హితవు పలికారు.ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!I WARNED EVERYONEIn 2002 I released Rich Dad’s Prophecy. In 2026 the predictions in Prophecy are coming true. You don’t have to be a victim to the “Everything Bubble” as the bubbles burst and leads to the greatest depression in world history. You can still be a winner…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 17, 2026 -
ఇల్లు ఈజీగా కొనండి.. ధనవంతులు అవ్వండి!!
రాబర్ట్ కియోసాకి రాసిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, అది ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించే ఒక మార్గదర్శి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి సంపదను ఎలా సృష్టించాలో ఈ పుస్తకం అద్భుతంగా వివరిస్తుంది. అసలు తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా అడుగుపెట్టాలి? సొంత ఇంటి కల ఎలా నెరవేర్చుకోవాలి? ఆ వివరాలు మీకోసం..ఆస్తి అంటే..కియోసాకి చెప్పే ప్రాథమిక సూత్రం ఒకటే: మీ జేబులోకి డబ్బును తీసుకొచ్చేది 'ఆస్తి' (Asset), మీ జేబులో నుండి డబ్బును బయటకు పంపేది 'అప్పు' (Liability). చాలా మంది తాము నివసించే ఇంటిని అతిపెద్ద ఆస్తిగా భావిస్తారు. కానీ, కియోసాకి దృష్టిలో అది ఒక లయబిలిటీ. ఎందుకంటే దాని వల్ల ప్రతి నెలా మెయింటెనెన్స్, ట్యాక్సుల రూపంలో డబ్బు బయటకు వెళ్తుంది. అదే మీరు ఒక ఇంటిని కొని అద్దెకు ఇస్తే, అది మీకు ప్రతి నెలా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అప్పుడు మాత్రమే అది నిజమైన 'ఆస్తి' అవుతుంది.తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ శ్రీకారంరియల్ ఎస్టేట్ అంటే కోట్ల రూపాయలు ఉండాలని భయపడక్కర్లేదు. తక్కువ మొత్తంతో ప్రారంభించడానికి ఈ మార్గాలు చూడండి..ఓపెన్ ప్లాట్లు: నగరం శివార్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో చిన్న ప్లాట్లను కొనుగోలు చేయడం ఉత్తమం. వీటి ధర తక్కువగా ఉంటుంది, భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి.రీట్స్: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (REITs)తో స్టాక్ మార్కెట్ లాగే, మీరు రియల్ ఎస్టేట్‌లో నేరుగా ఆస్తి కొనకుండానే తక్కువ మొత్తంతో (కొన్ని వేల రూపాయలతో) షేర్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు.క్రౌడ్ ఫండింగ్: గ్రూపుగా ఏర్పడి నమ్మకమైన స్నేహితులు లేదా బంధువులతో కలిసి ఉమ్మడిగా ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా రిస్క్, పెట్టుబడి భారం తగ్గుతాయి.సొంతిల్లు సాకారమయ్యే టిప్స్సొంత ఇంటి కల నెరవేరాలంటే కియోసాకి స్టైల్లో ఈ వ్యూహాలు అనుసరించండి..ముందుగా ఆదాయ వనరుల సృష్టి: నేరుగా హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం కంటే, మొదట చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం (Passive Income) మీ ఇంటి EMI చెల్లించేలా ప్లాన్ చేయండి.లోకేషన్ ముఖ్యం: అభివృద్ధి చెందుతున్న హైవేలు, ఐటీ కారిడార్లు లేదా మెట్రో ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాలను గుర్తించి ముందే పెట్టుబడి పెట్టండి.పన్ను ప్రయోజనాలు: రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై లభించే పన్ను మినహాయింపుల గురించి అవగాహన పెంచుకోండి. ఇది మీ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.కియోసాకి గోల్డెన్ రూల్: 'డబ్బు కోసం పని చేయకండి'ధనవంతులు డబ్బు కోసం పని చేయరు, వారి డబ్బు వారి కోసం పని చేసేలా చూసుకుంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన మార్గం."పెద్ద ఇల్లు కొనడం తప్పు కాదు, కానీ ఆ ఇంటి ఖర్చులను మీ జేబులో నుండి కాకుండా, మీరు పెట్టిన ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలతో చెల్లించడమే అసలైన ఆర్థిక తెలివితేటలు." -
ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, ఆర్ధిక పరమైన విషయాలు చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే నిజమైన ఆర్థిక స్వేచ్ఛను ఎప్పుడు, ఎలా పొందాలనే విషయం వెల్లడించారు.రాబర్ట్ కియోసాకి ప్రకారం.. మనం జీవితాంతం ఇతరుల కోసం పని చేస్తూ ఉంటే, మనకు తక్షణ అవసరాలు తీరవచ్చు. కానీ.. దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛ సాధ్యం కాదు. ఈ మాటల అర్థం ఉద్యోగం చేయడం తప్పు అని చెప్పడం కాదు. ఉద్యోగం మనకు ఆదాయం ఇస్తుంది, కానీ అది ఒకే మార్గంగా ఉంటే, మనం సంపదను సృష్టించలేము.మనం సంపాదించే డబ్బులో కొంత భాగాన్ని పెట్టుబడులుగా మార్చి, మనకోసం పని చేసే ఆస్తులను నిర్మించాలి. ఉదాహరణకు.. ఇల్లు అద్దెకు ఇవ్వడం, షేర్లలో పెట్టుబడి పెట్టడం లేదా చిన్న వ్యాపారం ప్రారంభించడం. ఇవి మనం పని చేయకపోయినా డబ్బు తీసుకువస్తాయి.ఆదాయం కోసం పనిచేయడం అంటే.. ఆర్థికంగా మీరు స్వేచ్ఛగా లేనట్లే. అంటే మనం పని చేయలేకపోతే, ఆదాయం ఆగిపోతుంది. కాబట్టి మన దగ్గర ఆస్తులు ఉంటే.. అవి మనకోసం పని చేస్తూ డబ్బు సంపాదిస్తాయి. ఇదే నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం.చాలా మంది ''స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు, జీవితం సురక్షితం'' అని భావిస్తారు. కానీ నేటి కాలంలో ఖర్చులు పెరుగుతున్నాయి, ఆర్థిక నిర్ణయాలు క్లిష్టమవుతున్నాయి. చాలా మంది నెలాఖరులో డబ్బు మిగలకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే రాబర్ట్ కియోసాకి ఈ విధమైన పరిష్కారం చెబుతున్నారు.కియోసాకి మాటలను జీవితంలో అమలు చేయాలంటే?➤ముందుగా మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో గమనించాలి. ➤ప్రతి నెలలో కొంత మొత్తాన్ని ముందుగా పెట్టుబడిగా పెట్టాలి. ➤ఆర్థిక విషయాలపై కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.➤మన పని సమయానికి సంబంధం లేకుండా ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించాలి.➤పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ముందు.. అది మనకు లాభం తెస్తుందా లేక నష్టమా అనేది ఆలోచించాలి.మొత్తం మీద ''కేవలం కష్టపడి పని చేయడం కాదు, తెలివిగా పని చేసి మనకోసం పని చేసే వ్యవస్థలను నిర్మించాలి''. అప్పుడు మాత్రమే మనం నిజమైన ఆర్థిక స్వేచ్ఛను పొందగలం అని కియోసాకి విశ్వసిస్తారు.ఇదీ చదవండి: ఒక వైపు 30వేల లేఆఫ్స్.. మరోవైపు రూ.270 కోట్ల ఆఫర్! -
ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ ఆయన ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్ని కీలక పరిణామాలే కారణమని ఆయన విశ్లేషించారు."బ్యాడ్ న్యూస్.. చరిత్ర ముంచుకొచ్చింది" అంటూ రాబర్ట్ కియోసాకి 2026 ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.పెట్రో డాలర్ వ్యవస్థ - చమురు యుద్ధాలు1974 వరకు అమెరికా డాలర్‌కు బంగారాన్ని హామీగా ఉంచేవారని, కానీ ఆ ఏడాది నుంచి డాలర్ 'పెట్రో డాలర్'గా మారిందని కియోసాకి గుర్తుచేశారు. అంటే, బంగారం స్థానంలో చమురు (Oil) డాలర్‌కు వెన్నుముకగా మారింది. ఆ కారణంగానే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.పెన్షన్ వ్యవస్థలో మార్పు - రిటైర్మెంట్ భయం1974లో అమెరికాలో 'ERISA' చట్టం వచ్చిందని, దీనివల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయి.. 401k, IRA వంటి రిస్క్‌తో కూడిన పథకాలు వచ్చాయని ఆయన విమర్శించారు. కోట్లాది మంది బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అప్పుల ఊబిలో అమెరికాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య (Financial Education) నేర్పకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన దుయ్యబట్టారు.మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..ఈ సంక్షోభం నుండి బయటపడటానికి రాబర్ట్ కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు. నిజమైన సంపదను పొదుపు చేయండి. కేవలం కాగితపు కరెన్సీని నమ్ముకోకుండా బంగారం (Gold), వెండి (Silver), బిట్‌కాయిన్ (Bitcoin)లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.యూట్యూబ్ వంటి వేదికల్లో మంచి గురువులను ఎంచుకుని, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరారు. అయితే, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి.ఇదీ చదవండి: బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా.."1974లో మొదలైన భవిష్యత్తు ఇప్పుడు మన ముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించేలా అవకాశం ఇవ్వకండి." అని కియోసాకి తన పోస్ట్‌ను ముగించారు.BAD NEWS: History has ARRIVED.1974 was a future changing year. 1974 marked two massive changes in our world’s future.Our problem is….in 2026, our future is here.The two 1974 future changing events were:1974 the US dollar became the Petro dollar. Rather than backed by…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 4, 2026 -
యుద్ధం ఆగదు.. వాళ్లంతా నష్టపోక తప్పదు: కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రోబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన హెచ్చరికలు చేశారు. తాజా ‘ఎక్స్’ పోస్ట్‌లో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు అడ్డగోలుగా ముద్రిస్తున్న డబ్బును 'ఫేక్ మనీ'గా అభివర్ణించిన ఆయన (Robert Kiyosaki), రాబోయే రోజుల్లో సంప్రదాయ పెట్టుబడులు నష్టపోక తప్పదని హెచ్చరించారు.డాలర్ విలువ పతనం - పెరుగుతున్న అప్పులుప్రభుత్వాలు తమ ఇష్టానుసారం కరెన్సీని ముద్రిస్తుండటం వల్ల దేశాల జాతీయ అప్పులు (National Debt) విపరీతంగా పెరుగుతున్నాయని కియోసాకి పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుందని, డాలర్లను పొదుపు చేసేవారు కాలక్రమేణా తమ సంపదను కోల్పోతారని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా అమెరికా బాండ్లు సురక్షితమైనవనేది ఒక "పెద్ద అబద్ధం" అని ఆయన కుండబద్దలు కొట్టారు.చమురు సెగ.. అంతం లేని యుద్ధంప్రస్తుతం ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలను ఆయన ఒక 'పవిత్ర యుద్ధం'గా అభివర్ణించారు. ఈ వివాదాలు త్వరలో ముగిసేవి కావని, దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పాత పద్ధతులకు కాలం చెల్లింది!సాధారణంగా ప్రజలు నమ్మే "చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, 401k లేదా మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయి" అనే సూత్రం ఇప్పుడు పనికిరాదని కియోసాకి కొట్టిపారేశారు. ఈ పద్ధతిని అనుసరించేవారే భవిష్యత్తులో ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. చివరికి ఎంబీఏ (MBA) వంటి ఉన్నత డిగ్రీలు కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ముందు పనికిరావని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.2026కు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్లు ఇవే..ఏవైతే ముద్రించడానికి వీలుపడవో అవే నిజమైన ఆస్తులని కియోసాకి నమ్ముతారు. ఆయన ప్రకారం 2026లో పెట్టుబడిదారులను కాపాడేవి బంగారం, వెండి (Real Gold & Silver), చమురు (Oil), ఆహార ధాన్యాలు (Food), క్రిప్టో కరెన్సీ (Bitcoin & Ethereum) మాత్రమే."మీ మెదడులో మీరు నింపుకునే ఆర్థిక విద్య (Financial Education) మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దేనిని నమ్మాలో మీరే ఆలోచించుకోండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. INVESTOR SECRET: “lf you want to be a rich investor you have to see the future.”Seeing the future today is EASY for two reasons.1: The National Debt will only go up because governments will only keep printing fake money. That means inflation will keep going up which…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 30, 2026 -
యుద్ధం లాభదాయకమే: కియోసాకి కామెంట్స్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక విశ్లేషకుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి యుద్ధం వల్ల కలిగే ఆర్థిక పరిణామాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఎవరికీ మంచిది కాదని చెబుతూనే, అది ఏ విధంగా దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుందో ఆయన వివరించారు.నాటి యుద్ధ జ్ఞాపకాలు..వియత్నాం యుద్ధ కాలం నాటి ఒక నిరసన గీతాన్ని ప్రస్తావిస్తూ.. "యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదు" అని ఆయన పేర్కొన్నారు. స్వయంగా వియత్నాం యుద్ధంలో (1966, 1971-72) పాల్గొన్న కియోసాకి, తన స్నేహితులను కోల్పోయిన బాధను గుర్తు చేసుకున్నారు. మూడు వారాల క్రితమే తాను వియత్నాం వెళ్లి తన పాత స్నేహితులకు వీడ్కోలు పలికి, మనశ్శాంతిని పొందినట్లు ఆయన తెలిపారు.యుద్ధం వల్ల భారంగా మారుతున్న సామాన్యుడి జీవితంప్రస్తుతం 'పవిత్ర భూముల్లో' (మిడిల్ ఈస్ట్) జరుగుతున్న యుద్ధంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల కేవలం ప్రాణనష్టం మాత్రమే కాకుండా, యుద్ధానికి దూరంగా ఉన్న దేశాల్లోని ప్రజలు కూడా ద్రవ్యోల్బణం (Inflation) వల్ల ఆర్థికంగా దెబ్బతింటారని హెచ్చరించారు. యుద్ధాల వల్ల దేశాల అప్పులు విపరీతంగా పెరుగుతాయన్నారు. పెరిగే ధరల వల్ల సామాన్యుడు పేదరికంలోకి నెట్టబడతాడని, ఆర్థిక సంక్షోభం కారణంగా ఎంతోమంది ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన విశ్లేషించారు.సంక్షోభంలోనే సంపద సృష్టియుద్ధం అనేది మానవత్వానికి నష్టమే అయినా, ఆర్థికంగా అది కొంతమందికి లాభాలను తెచ్చిపెడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. "యుద్ధం వల్ల దేశాలు అప్పుల ఊబిలో ఉన్నంత మాత్రాన మీరు ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం లేదు. సరైన ఆర్థిక విద్య (Financial Education) ఉంటే ఇలాంటి కష్టకాలంలో కూడా మీరు ధనవంతులు కావచ్చు" అని ఆయన సూచించారు. మీ మెదడు, మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలే మీ గొప్ప ఆస్తులని, మంచి గురువులను ఎంచుకుని ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలని ఆయన తన అనుచరులకు పిలుపునిచ్చారు.“WAR: What is it good for?Absolutely nothing.”The above are words from a Vietnam era protest song.Tragically war is profitable. If war was not proftsble….would we have wars?FYI: I served in Vietnam twice…once in 1966 and 1971-72.I lost many friends in Vietnam. I…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 29, 2026 -
కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సూచనలు ఇచ్చే కియోసాకి.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో 2026 క్రాష్?, అని పేర్కొంటూనే.. 1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారని వెల్లడించారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే క్షమాపణలు అంటూ మరో ట్వీట్ చేశారు. కియోసాకి ఎందుకిలా చేశారు?, దీనికి గల కారణం ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మొదటి ట్వీట్''1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారు. 1950లో ఎడ్గార్ కేస్ కూడా 2026లో ఒక భారీ పతనం సంభవిస్తుందని అంచనా వేశారు. మీరేమనుకుంటున్నారు?.. 2026లో ఒక భారీ పతనం సంభవిస్తే, మీరు ధనవంతులు అవుతారా లేక పేదవారు అవుతారా?, నేను ధనవంతుడిని కావాలని అనుకుంటున్నాను'' అని కియోసాకి ట్వీట్ చేశారు.2026 CRASH?FUTURISTS:Nostradamus in 1500 said disaster would hit the world in 2026.Edgar Cayce in 1950 also predicted a massive crash occurring in 2026.What do you think?You may want to tune into YouTube videos for more details on these two famous futurist predictions.…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026రెండో ట్వీట్క్షమించండి అని పేర్కొంటూ.. మొదటి పోస్ట్‌లో, 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుందని భవిష్యత్ శాస్త్రవేత్తలైన నోస్ట్రాడమస్ (1500) మరియు ఎడ్గార్ కేసీ (1940) చేసిన అంచనాను నేను వెల్లడించాను. ఆ తరువాత ఒక స్నేహితుడు నన్ను సంప్రదించాడు.. 2026 సంక్షోభ సమయంలో నేను ధనవంతుడిని అవుతానని చెప్పినందుకు అతను నాపై కోపంగా ఉన్నాడని పేర్కొన్నారు.అతని సమస్య ఏమిటంటే.. మీలో చాలామంది అనుసరించినట్లుగా అతను నా పోస్ట్‌ను ఎప్పుడూ అనుసరించలేదు. అంతే కాకుండా.. ఒక సంక్షోభంలో ధనవంతులు కావాలని మీరు, నేను ప్రణాళిక వేసుకున్న విషయం అతనికి తెలియదు.నన్ను అనుసరించే అందరికీ.. నేను S&P 500, యూఎస్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు వంటి స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టనని, లేదా నగదును పొదుపు చేయనని ఇప్పటికే తెలుసు. ప్రభుత్వం, బ్యాంకులు లేదా వాల్ స్ట్రీట్ ముద్రించే దేనిలోనూ నేను పెట్టుబడి పెట్టను. అంతే కాకుండా.. నన్ను అనుసరించే వారికి నేను KISS (కీప్ ఇట్ సూపర్ సింపుల్) సూత్రాన్ని పాటిస్తానని కూడా తెలుసు.MY APOLOGIES:In my previous X I quoted futurists Nostradamus’ 1500 and Edgar Caycees 1940 prediction that a global economic crisi would begin in 2026. A friend contacted me. He was upset with me because I stated I was going to richer during the 2026 crisis.His problem was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026నేను పశువులను పెంచి అమ్ముతాను, టెక్సాస్, నార్త్‌లోని నా చమురు బావుల నుంచి చమురును అమ్ముతాను, అప్పుతో కొనుగోలు చేసిన 1500 అద్దె యూనిట్లను నెలవారీగా అద్దెకు ఇస్తాను, నేను అసలైన బంగారం, వెండి, బిట్‌కాయిన్, మరియు ఎథేరియంలను పొదుపు చేస్తాను. మీలో చాలా మందిలాగే, నా దగ్గర కూడా మొదట్లో డబ్బు లేదు. కానీ చిన్న చిన్న ఆస్తులను కొని సంవత్సరాల తరబడి ఉంచుకున్నాను, వాటిని ఎప్పుడూ అమ్మలేదు. మీలో చాలా మందికి నేను నా మొదటి 6 బిట్కాయిన్లను $600కి కొన్నానని తెలుసు, నా దగ్గర ఉన్న డబ్బంతా అదే, మరియు నేను కొన్ని రోజుల పాటు ఏమీ తినలేదు.ఇక చివరగా.. నోస్ట్రాడమస్, ఎడ్గార్ కేస్ చెప్పినట్లు 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా?, రాదా అని నాకు తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైతే.. నా మాట విన్న మీరు, నేను ధనవంతులమవుతామని నాకు గట్టి నమ్మకం ఉంది. అదే సమయంలో లక్షలాది మంది పేదలుగా మిగిలిపోతారు.ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!భవిష్యత్తును చూడగలిగే పెట్టుబడిదారులే ధనవంతులవుతారు. నాకు నిజమైనవి (విలువైన లోహాలు) ఇష్టం. నకిలీవి (కరెన్సీ) అంటే ద్వేషం. నువ్వేం చేయబోతున్నావు?. ఆలోచించి.. ఏమీ చేయని లక్షలాది మందిలా ఉండకు. అలోచించి నిర్ణయం తీసుకో అని కియోసాకి ట్వీట్ చేశారు. -
తీవ్ర సంక్షోభం తప్పదు.. కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి ఆర్థిక ప్రణాళికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలను ఆయన తన తాజా సోషల్ మీడియా పోస్ట్‌లో వివరించారు.నిర్లక్ష్యం.. నిశ్శబ్ద శత్రువు!తన కుటుంబ సభ్యురాలితో జరిగిన ఒక చర్చను ఉదహరిస్తూ.. "చాలా మంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించడం లేదు" అని కియోసాకి (Robert Kiyosaki) ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 80 ఏళ్ల వయస్సు ఉండి, ఎటువంటి పొదుపు లేకుండా, ఇప్పటికీ పని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ.. చాలామంది "ఏం పర్వాలేదు.. సంతోషంగా ఉంటే చాలు (Don't worry, be happy)" అనే ధోరణిలో ఉండటం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.యువతకు విలువైన హెచ్చరికఆర్థిక సంక్షోభం ఎప్పుడైనా రావచ్చని, దాన్ని ఎదుర్కోవడానికి యువతకు ఉన్న అతిపెద్ద ఆస్తి "సమయం" అని ఆయన గుర్తు చేశారు. సమయం, ఆరోగ్యం.. ఇవే మనిషికి ఉన్న గొప్ప ఆస్తులు. వీటిని వృథా చేయకుండా పెట్టుబడిగా మార్చుకోవాలి.తాను 28 ఏళ్ల వయస్సులో ఇల్లు లేకుండా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. కానీ ఆ వయస్సులో తాను నేర్చుకున్న పాఠాలే నేటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతున్నాయని ఆయన వివరించారు.ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరం!ప్రపంచ దేశాల్లో ముద్రిస్తున్న 'నకిలీ కరెన్సీ' (ఫేక్ మనీ), పెరుగుతున్న జాతీయ అప్పులు, స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలను విస్మరించడం తెలివైన పని కాదని కియోసాకి హెచ్చరించారు. వయస్సు పెరిగే కొద్దీ కొత్తగా సంపాదించే సామర్థ్యం తగ్గుతుందని, అందుకే యువత తమ సమయాన్ని తెలివిగా ఖర్చు చేయాలని ఆయన సూచించారు.(ఇది చదివారా 👉పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్)"వయస్సును, మీకు ఉన్న సమయాన్ని గౌరవించండి. ఆరోగ్యం, యవ్వనం ఉన్నప్పుడే సరైన ఆర్థిక పునాదులు వేసుకోకపోతే, రిటైర్మెంట్ సమయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు" అన్నది కియోసాకి మాటల సారాంశం.DON’T WORRY….BE HAPPY. I was talking to a family member about the national debt, the war, printing fake money, inflation, and possible crash of the stock market. She got angry and said to not talk about money, the world economy, and possible global depression. She was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 23, 2026 -
ఆ బుడగ పేలిందా!! 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తుచేసుకోండి..
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అలజడి నడుస్తున్న నేపథ్యంలో, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. త్వరలోనే చరిత్రలోనే అతిపెద్ద ఆస్తుల బుడగ (బబుల్ బస్ట్) పగిలిపోతుందని, దాని తర్వాత బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఈథేరియం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆయన పేర్కొన్నారు.కియోసాకి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన తాజా సందేశంలో, "బబుల్ పగిలే 'పిన్' ఏదైనా ఈవెంట్ త్వరలోనే జరగనుంది. అది ఏ సంఘటన అయినా.. ఇప్పుడే బిట్‌కాయిన్, బంగారం, వెండి, ఈథేరియం ఎక్కువగా సేకరించాలి" అని సూచించారు. క్రాష్ తర్వాత ఒక సంవత్సరంలో బంగారం ఒక ఔన్స్‌కు 35,000 డాలర్లు, వెండి 200 డాలర్లు, బిట్‌కాయిన్ ఒక్కో కాయిన్ 750,000 డాలర్లు, ఈథేరియం 95,000 డాలర్లకు చేరుతాయని ఆయన ధీమాగా అంచనా వేశారు."మీ లాభం అమ్మేటప్పుడు కాదు.. కొనేటప్పుడే వస్తుంది" అనే తన 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కొనుగోలు చేసి భవిష్యత్తులో ధనవంతులు కావాలని, లేకపోతే చాలామంది పేదలవుతారని హెచ్చరించారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర సుమారు 74,000–75,000 డాలర్ల మధ్య ఉండగా, ఈథేరియం 2,300–2,400 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. -
కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పెట్టుబడికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో ట్వీట్ చేసారు. చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' ఉందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' (ఒక ఆస్తి విలువ.. అసలు విలువ కంటే చాలా ఎక్కువగా పెరగడం) జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది నాకు తెలియదు, అని కియోసాకి పేర్కొన్నారు. ''అది జరుగుతుందా లేదా అన్నది ప్రశ్న కాదు. అది ఎప్పుడు జరుగుతుంది అన్నదే ప్రశ్న'' అని అన్నారు.బబుల్ బస్ట్ సంఘటన జరిగినప్పుడు.. ఒక ఏడాది తరువాత గోల్డ్ ధర ఔన్సుకు 35,000 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బిట్‌కాయిన్ ధర 7,50,000 డాలర్లకు, ఇథీరియం ధర 95,000 డాలర్లకు చేరుకుంటుంటుందని కియోసాకి వెల్లడించారు.ఆర్ధిక సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్లు కుప్పకూలిపోతాయి. అలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా పెట్టిన పెట్టుబడులు (గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్, ఇథీరియం) మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి అలోచించి ఇన్వెస్ట్ చేయండి. ధనవంతులు కావడానికి ఇదే సరైన సమయమా? అంటూ కియోసాకి ట్వీట్ ముగించారు.BIGGEST BUBBLE BUSTI do not know what pin, what event will pop the biggest bubbles in histor. What ever the event, the pin is near.It’s not IF. It’s WHEN.When the bubbles go bust I predict gold will hit $35,000 an ounce one year after the gold bubble goes pop..I predict…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 16, 2026 -
క్యాష్, ట్రాష్, క్రాష్.. మార్కెట్‌పై కియోసాకి ట్వీట్
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' క్యాష్, ట్రాష్, క్రాష్ అంటూ.. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అనే విషయాలను గురించి వివరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.క్రాష్‌లో క్యాష్ అంటే ట్రాష్ కాదు అని ట్వీట్ ప్రారంభించిన కియోసాకి.. ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ స్టాక్స్, బాండ్స్ వంటివి విక్రయించి ఎందుకు బిలియన్ల కొద్దీ నగదుతో కూర్చున్నారు? అని ప్రశ్నించారు. దీనికి కారణం ''keeping his powder dry'' అనే వ్యూహం. అంటే మార్కెట్ పడిపోయిన తర్వాత మంచి కంపెనీలు లేదా విలువైన ఆస్తులు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు వాటిని కొనడానికి చేతిలో డబ్బు ఉండాలి.నా వ్యూహం ఏమిటంటే.. నా దగ్గర ఉన్న డబ్బును మరిన్ని ఆయిల్ వెల్స్, బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి పెట్టుబడుల్లో పెట్టాను. అంటే ప్రతి వ్యక్తి లేదా పెట్టుబడిదారుడు.. తన ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే.. పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత కూడా బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు పెరిగే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు. ఇప్పుడు నా ఆలోచన తప్పుగా అనిపించవచ్చు. కానీ పెట్టుబడుల్లో ఎప్పుడూ రిస్క్ ఉంటుందని వివరించారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలుమార్కెట్ పడిపోయినప్పుడు మీ వద్ద స్పష్టమైన పెట్టుబడి ప్రణాళిక లేకపోతే, ఏమీ చేయకుండా ఉండటం కూడా ఒక మంచి నిర్ణయం కావచ్చు. తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకోవడం కంటే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని కియోసాకి స్పష్టం చేశారు.CASH is not TRASH in a CRASHQ: Why has Warren Buffet sold stocks and bonds and is sitting with billions in cash?A: Because he is “keeping his powder dry” a.k.a. He is in CASH so he can buy priceless assets….after the crash and are on sale. Q: Should you follow in…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 15, 2026 -
మార్కెట్లు క్రాష్.. కియోసాకి సంచలన ట్వీట్!
చమురు ధరల పెరుగుదల.. స్టాక్ మార్కెట్ క్రాష్ వంటివి జరుగుతున్న సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇందులో..పెట్టుబడిదారులు తమ డబ్బును ఉపసంహరించుకోవడంతో, ప్రైవేట్ క్రెడిట్ ఫండ్లు భయాందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. కొన్నిసార్లు పెద్ద మార్పులు జరుగుతాయి. స్టాక్ మార్కెట్ క్రాష్, బ్యాంకులు.. ఫైనాన్షియల్ సంస్థలు కష్టాల్లో పడటం వంటివి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో తమ డబ్బును వెనక్కి తీసుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనిని ఆర్థిక క్రాష్ లేదా మాంద్యం అని అంటారు. కొందరు ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని కొత్త మాంద్యం లేదా డిప్రెషన్ ప్రారంభమవుతోందని కూడా చెబుతారు.ప్రజలు తమ పెట్టుబడులను అమ్మేస్తారు లేదా బ్యాంకుల్లో ఉన్న డబ్బును తీసుకుంటారు. దీన్ని బ్యాంక్ రన్ అని అంటారు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బు ఎప్పుడూ పూర్తిగా మాయం కాదు. అది ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతుంది. అంటే బ్యాంకుల నుంచి బయటకు వెళ్లే డబ్బు, మరో ఆస్తి లేదా పెట్టుబడి వైపు వెళ్తుంది.CRASH ACCELERATES:Private credit funds are panicked as investors withdraw their money.Major big name banks and brand name financial institutions are in trouble.Jim Rickards formally declares the US in the New Depression.What are you going to do?If you have followed my X…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 13, 2026కొంతమంది పెట్టుబడిదారులు ఈ మార్పులను ముందుగానే అర్థం చేసుకుని తెలివిగా తమ డబ్బును.. చమురు, వెండి, బంగారం, డిజిటల్ కరెన్సీలు అయిన బిట్‌కాయిన్, ఈథీరియం వంటి వాటిలో పెట్టుబడిగా పెడుతుంటారు. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి సమయంలో ఈ ఆస్తులు కొన్నిసార్లు విలువను నిలుపుకుంటాయి.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలుమార్కెట్ పెరుగుతున్నప్పుడు మాత్రమే కాకుండా.. పడిపోయే సమయంలో కూడా తెలివైన పెట్టుబడిదారులు లాభాలు పొందగలరని. కానీ దీనికి సరైన సమాచారం, విశ్లేషణ & ఆలోచన అవసరం. భయంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కలగవచ్చు. కాబట్టి ఆర్థిక సంక్షోభ సమయంలో భయపడకుండా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఏ రంగాలు ఎదుగుతున్నాయి, ఏ పెట్టుబడులు భద్రంగా ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతాము. -
స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలు
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు కూడా ఉంటాయి, నష్టాలు కూడా వస్తాయి. ముఖ్యంగా S&P 500 వంటి పెద్ద మార్కెట్ సూచీలు పడిపోయినప్పుడు (మార్కెట్ క్రాష్ జరిగినప్పుడు) చాలా మంది పెట్టుబడిదారులు డబ్బు కోల్పోతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో మీరు డబ్బు కోల్పోయారా? లేక డబ్బు సంపాదించారా? అని ప్రశ్నించారు.మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ మంది పెట్టుబడిదారులు నష్టపోవడం సాధారణం. అయితే కొందరు పెట్టుబడిదారులు మాత్రం సరైన వ్యూహాలు, మంచి జ్ఞానం & అనుభవం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో కూడా లాభాలు పొందగలుగుతారు. అంటే మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, సరైన నిర్ణయాలు తీసుకుంటే నష్టాలను తగ్గించుకోవడం లేదా కొన్నిసార్లు లాభాలు కూడా పొందటం సాధ్యమే.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. మార్కెట్లో నష్టపోతే, అది కేవలం మార్కెట్ కారణంగా మాత్రమే కాదు. మనం నేర్చుకున్న విధానం, మనకు మార్గదర్శనం చేసిన వ్యక్తులు లేదా గురువులు కూడా కొంతవరకు కారణం కావచ్చు. ఇలాంటి సమయంలో నేను అనుసరిస్తున్న గురువు లేదా నేర్చుకుంటున్న విధానం సరైనదేనా? అనే ప్రశ్న తలెత్తుతుంది.ఇప్పుడు కూడా చాలా మంది పెట్టుబడిదారులు యూట్యూబ్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఫైనాన్స్ & స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నారు. అక్కడ అనేక మంది ఫైనాన్స్ నిపుణులు, ట్రేడింగ్ గురువులు తమ అనుభవాలను & సూచనలను పంచుకుంటారు. కానీ అందరూ నిజంగా విజయవంతమైన పెట్టుబడిదారులే అని అనుకోవడం సరైంది కాదు. కొందరు ప్రసిద్ధ యూట్యూబర్లు కూడా కొన్ని సందర్భాల్లో పెద్ద నష్టాలు చవిచూసి ఉండవచ్చు.అలాగే కొందరు తమ లాభాలను గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ నిజమైన పెట్టుబడి విద్య అంటే కేవలం లాభాలను చూపించడం కాదు. మార్కెట్ ప్రమాదాలను అర్థం చేసుకోవడం, నష్టాలను ఎలా నియంత్రించాలో నేర్చుకోవడం. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్లో డబ్బు కోల్పోయినట్లయితే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అది ఒక పాఠంగా తీసుకుని, మీ పెట్టుబడి పద్ధతిని తిరిగి పరిశీలించాలి. అవసరమైతే మంచి గురువులను, విశ్వసనీయమైన విద్యను ఎంపిక చేసుకోవాలి.మొత్తానికి, మార్కెట్ క్రాష్ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. సరైన జ్ఞానం, సరైన మార్గదర్శనం ఉంటేనే పెట్టుబడుల్లో దీర్ఘకాల విజయాన్ని సాధించవచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే అనుసరించడం చాలా అవసరం. మార్కెట్లో నష్టాలు కూడా ఒక గురువు లాంటివే.. ఎందుకంటే అవి మనకు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్పిస్తాయి.S & P MARKET CRASH: Q: Did you lose money?Q: Did you make money?A: If you lost money is it time to change teachers?Q: Who do you follow on YouTube?A: I could name some YouTube financial rock stars who lost a lot of money.But that would not be cool.And I could…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 11, 2026 -
2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
ఒకవైపు ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, మరోవైపు భారీగా పతనమవుతున్న మార్కెట్లు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం వస్తుందని ఇందులో హెచ్చరించారు.చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం గురించి నేను రిచ్ డాడ్స్ ప్రాఫసీ (2013)లో హెచ్చరించాను. అది రాబోతోంది. 2008లో ప్రపంచం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనిని గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని పిలుస్తారు. ఆ సమయంలో చాలా బ్యాంకులు & ఆర్థిక సంస్థలు కూలిపోయాయి. ముఖ్యంగా అమెరికాలోని పెద్ద పెట్టుబడి బ్యాంక్ అయిన లెమాన్ బ్రదర్స్ దివాళా తీసింది. భవిష్యత్తులో ఇంకా పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 2026లో మరో పెద్ద ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉంది. ఈ పతనం ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థలలో ఒకటైన 'బ్లాక్ రాక్'తో సంబంధం ఉన్న.. ప్రైవేట్ క్రెడిట్ వ్యవస్థ కారణంగా రావచ్చని ఆయన భావిస్తున్నారు.REPEATING A WARNINGIn Rich Dad’s Prophecy (2013) I warned the biggest stock market crash in history….was STILL coming.In 2026, I hope I am wrong…. Yet I am afraid that crash is now arriving.Why did I make that prediction?Because the cause of the 2008 crash, the GFC,…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 10, 2026ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భారీ అప్పుల్లో ఉన్నాయని, ఆ అప్పులను తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వృద్ధుల సేవింగ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం.. డబ్బును కాపాడుకోవాలంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం, ఆయిల్ వెల్స్ వంటి సహజ వనరులలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని చెబుతున్నారు.నాకు వెండి అంటే చాలా ఇష్టమని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఎందుకంటే తక్కువ డబ్బుతో కూడా వెండిని కొనుగోలు చేయవచ్చని ఆయన అభిప్రాయం. కాబట్టి మీరు కూడా కేవలం 10 డాలర్లతో వెండి నాణేలు లేదా చిన్న ముక్కలు కొనుగోలు చేయండి. అవసరమైతే ఒక రోజు తినడం ఆపేసి.. వెండిపై పెట్టుబడి పెట్టండి. తప్పకుండా మీరు ధనవంతులు అవుతారని, జాగ్రత్త వహించండి, అని కియోసాకి తన ట్వీట్ పూర్తి చేశారు. -
యుద్ధ ఆయుధాలు బంగారంతో.. కియోసాకి ట్వీట్
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. ఈ సమయంలో ఎప్పడూ బంగారం, వెండి, బిట్‌కాయిన్ గురించి సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు యుద్ధం వల్ల ఏమి జరుగుతుందో?, శాంతి స్థాపన ఎలా జరుగుతుందో? అనే విషయాలను వివరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను వియత్నాంలో రెండుసార్లు ఉన్నాను. ఒకసారి 1966-67లో విద్యార్థిగా, ఆ తరువాత 1971-72లో యూఎస్ మెరైన్ కార్ప్స్ పైలట్‌గా. అయితే 2026లోనూ వియత్నాంతో ఎందుకు పోరాడామో నాకు ఇప్పటికీ తెలియదు, ఇంకా సమాధానం దొరకలేదు. యుద్ధం వల్ల దాదాపు అందరికీ నష్టమే.ఇప్పుడు ఇరాన్ లేదా ఇజ్రాయెల్‌పైకి వెళ్తున్న ప్రతి రాకెట్ లోపల నాలుగు ఫౌండ్స్ వరకు వెండి ఉంటుంది. రాకెట్ పేలిపోయినప్పుడు సిల్వర్ విచ్చిన్నమవుతుంది. ఇది వెండి సేకరించేవారికి మాత్రమే లాభం. యుద్ధంలో పాల్గొనేవారికి మిగిలేది కన్నీళ్లు, ధన నష్టం మాత్రమే అని కియోసాకి పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనంయుద్ధ ఆయుధాలను బంగారంతో తయారుచేస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు యుద్ధం చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయుధాలు ఖరీదైనప్పుడు కొనుగోలు చేయడం తగ్గవచ్చు. కాబట్టి ఇలా శాంతి స్థాపనకు సాధ్యమవుతుందని భావిస్తున్నాను. నేను ఈ రోజు యుద్ధం కోసం కాదు, శాంతి & నిజమైన ఆర్థిక విద్య కోసం పోరాడుతున్నాను అని కియోసాకి వెల్లడించారు.TRAGICALLY: War is profitable.Still in Vietnam seeking personal answers to a war we should never have entered.FYI: I served in Vietnam twice, once in 1966-67 as a student and 71-72 as a US Marine Corps pilot. In 2026 I still do not know why we fought in Vietnam.I know…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 7, 2026 -
అదీ ‘ఆర్థిక’ యుద్ధమే: రాబర్ట్ కియోసాకి
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) వియత్నాం యుద్ధం ముగిసిన తరువాత మూడోసారి చేసిన వియత్నాం పర్యటన సందర్భంగా తన అనుభూతులను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వియత్నాం యుద్ధం (Vietnam War) తర్వాత ఆయన చేసిన ఈ పర్యటనలో వియత్నాం ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాసుకొచ్చారు.అయితే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సహ పైలట్లు, సహాధ్యాయుల జ్ఞాపకాలు తాను మర్చిపోలేకపోతున్నానని పేర్కొన్నారు. వియత్నాం యుద్ధ సమయంలో హెలికాప్టర్ పైలట్‌గా పనిచేసిన కియోసాకి, యుద్ధం వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే తాను మళ్లీ మళ్లీ వియత్నాంకు వెళ్తున్నానని తెలిపారు. “నిజాన్ని ఎంత ఎక్కువగా వెతుకుతానో, అది అబద్ధాల కింద దాగి ఉందనే విషయం అంతగా అర్థమవుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.యుద్ధాలు తరచుగా ఆర్థిక ప్రయోజనాల కోసమే జరుగుతాయని కియోసాకి తన పోస్టులో అభిప్రాయం వ్యక్తం చేశారు. పన్ను చెల్లింపుదారుల డబ్బుతో యుద్ధాలు నడుస్తాయని, అయితే యువత, వారి కుటుంబాలే ప్రాణ నష్టాన్ని భరిస్తారని ఆయన పేర్కొన్నారు. వియత్నాం యుద్ధం కూడా చమురు ప్రయోజనాల కోసం జరిగిందని ఆయన అభిప్రాయపడుతూ, ప్రస్తుతం ఇరాన్ (Iran War) చుట్టూ జరుగుతున్న ఉద్రిక్తతలతో పోల్చారు.ఇదే సందర్భంలో, యుద్ధాల వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాల గురించి వివరించే ఎంపైర్ ఆఫ్ లైస్ (Empire of Lies) అనే పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు. నిజాలను తెలుసుకోవాలనుకునే వారు ఇలాంటి పుస్తకాలను చదవాలని ఆయన పిలుపునిచ్చారు.సాంప్రదాయ విద్యా వ్యవస్థపై కూడా కియోసాకి ప్రశ్నలు లేవనెత్తారు. పాఠశాలల్లో సరైన ఆర్థిక విద్య అందకపోవడం వల్ల ప్రజలు ఆర్థిక వ్యవస్థల నిజాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.“నిజాన్ని వెతికే వ్యక్తులుగా మారండి, అబద్ధాల వల్ల మోసపోయే బాధితులుగా కాకండి” అని ఆయన తన సందేశాన్ని ముగించారు.3rd trip back to Vietnam since war ended.Happy to report the Vietnamese economy is booming. Yet…Bittersweet memories of fellow pilots and classmates who never returned.I have returned three times since the war….seeking answers….I seekthe truth….yet the more I seek…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 5, 2026 -
భగ్గుమన్న బంగారం.. కియోసాకి ‘బ్లాస్ట్ ఆఫ్’ ట్వీట్
ప్రసిద్ధ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి సాంప్రదాయ కరెన్సీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంగారం, వెండి, బిట్‌కాయిన్‌పై ఆశావాద వ్యాఖ్యలు చేశారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి తన తాజా సోషల్ మీడియా పోస్టులో బంగారం ఒకే రోజులో 128 డాలర్లు పెరిగిందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో వెండి (Silver), బిట్‌కాయిన్ (Bitcoin) త్వరలో భారీగా ఎగిసిపడతాయని (బ్లాస్ట్ ఆఫ్) అభిప్రాయపడ్డారు.బంగారం ధరలుబంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరగడం మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి పెరుగుదలలు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీ రేట్ల మార్పులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత వంటి కారణాలతో చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మళ్లడం సాధారణం.వెండి, బిట్‌కాయిన్‌పై..కియోసాకి ప్రకారం వెండి కూడా బంగారం తరహాలోనే వేగంగా పెరిగే అవకాశం ఉంది. వెండి పారిశ్రామిక వినియోగం, విలువ నిల్వ అనే రెండు కోణాల్లో ప్రాధాన్యం కలిగి ఉండటంతో, మార్కెట్ చలనం సమయంలో ఎక్కువ ఒడిదుడుకులు చూపుతుంది. అలాగే బిట్‌కాయిన్‌ను డిజిటల్ గోల్డ్‌గా పేర్కొంటూ, కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలపై అనిశ్చితి పెరిగితే క్రిప్టోకరెన్సీలకు మద్దతు పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.GOLD booms $128 in one day.Better news is silver and Bitcoin to blast off.Hang on.— Robert Kiyosaki (@theRealKiyosaki) March 2, 2026 -
ఇరాన్‌పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
బంగారం, వెండి, స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పరిణామాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు తర అభిప్రాయాలను, సమాచారాన్ని పంచుకునే ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా విభిన్న అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు.. దానికి ఇరాన్ ప్రతిదాడులతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం (#IranWar)నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా చర్చకు దారితీశాయి.కియోసాకి తన ట్వీట్లో తాను హనోయి (వియత్నాం రాజధాని)లో దిగిన సమయానికే ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఘర్షణలు మత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ రక్షణ, చమురు ప్రయోజనాల అంశాలు కూడా యుద్ధాల వెనుక ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే గతంలో జరిగిన వియత్నాం యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, ఆ సంఘర్షణలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తాను ఆ యుద్ధంలో సహచరులను కోల్పోయానని భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రపంచం ఎప్పుడు శాంతి వైపు అడుగులు వేస్తుందో అంటూ నిట్టూర్చారు.ఇదే ట్వీట్లో అమెరికా రాజకీయాలపై కూడా కియోసాకి స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ హయాంలో మొదలైన ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రశ్నించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు.తర్వాత చేసిన మరో ట్వీట్లో మిన్నెసోటా రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఓమర్, గవర్నర్ టిమ్ వాల్జ్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. సైకాలజిస్ట్, రచయిత జోర్డన్ పీటర్సన్ మాటలను ఉదహరిస్తూ, “బలహీన నాయకత్వం మరింత నష్టం కలిగిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను (Donald Trump) “దృఢ నాయకుడు”గా అభివర్ణించారు.WAR!!!! Whst is it good for?Ironically I was landing in Hanoi when the war against Iran started .If truth be told we all know the war against Iran is a war financed by American Jews and Christians against Muslims for oil and to protect Israel.Vietnam was a war of Christians…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 28, 2026 -
అలా ఆలోచిస్తేనే ‘రిచ్’ అవుతారు.. కియోసాకీ హెచ్చరిక!
అమెరికా ఫిన్‌టెక్ దిగ్గజం .. స్క్వేర్, క్యాష్ యాప్‌లకు చెందిన బ్లాక్ (Block Inc.) కంపెనీ ఊహించని నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని సుమారు 10 వేల మంది ఉద్యోగుల్లో 40 శాతం.. అంటే 4,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని స్వయంగా కంపెనీ సీఈఓ జాక్ డార్సీ (ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు) ఇటీవల ప్రకటన చేశారు. ఇది ఆర్థిక సంక్షోభం వల్ల కాదు, కంపెనీ లాభాలు బాగున్నాయి.. షేర్లు 20-25 శాతం పెరిగాయి. కారణం ఒక్కటే.. కృత్రిమ మేధస్సు (AI)!"ఇంటెలిజెన్స్ టూల్స్ (AI) వాడితే చిన్న టీమ్‌తోనే ఎక్కువ పని, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఇది కంపెనీల నడిపించే విధానాన్నే మార్చేసింది" అని డార్సీ స్పష్టంగా చెప్పారు. గతంలో ప్రతి ఉద్యోగి కంపెనీకి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినా, ఇప్పుడు వాళ్ల పనిని ఏఐ చేస్తోందని అంగీకరించారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 6 వేల దాటకుండా తగ్గించాలని నిర్ణయించారు.ఈ పరిణామంపై ప్రసిద్ధ ఆర్థిక గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకీ (Robert Kiyosak) ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ శక్తివంతమైన పోస్ట్ చేశారు. "ఏఐ ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేస్తోంది" అంటూ ఆయన హెచ్చరించారు. "ఉద్యోగిలా ఆలోచిస్తే ఏఐ మిమ్మల్ని భర్తీ చేస్తుంది. అదే వ్యాపారవేత్తలా ఆలోచిస్తే, డార్సీలా ఏఐని 'హైర్' చేసుకుని మీరు ధనికులవుతారు" అని స్పష్టంగా చెప్పారు.AI MAKES the RICH RICHER:Jack Dorsey just fired 4400 hundred employees. Not because the company needed the money.Dorsey admitted each employee made his company millions of dollars.Dorsey fired 4400 employee because AI could do their jobs.RICH DAD LESSON:Think like an…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 27, 2026 -
టైమ్ వచ్చేసింది మిత్రమా.! ఇప్పుడే కొనేయండి.. లేదంటే పేదలుగా మిగిలిపోతారు
-
అతిపెద్ద ఆర్థిక మార్పు ఎదుర్కొంటున్నాం: కియోసాకి
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఫెడరల్ రిజర్వ్ విధానాలు, ద్రవ్యోల్బణం, బిట్‌కాయిన్ భవిష్యత్తు వంటి అంశాలపై లోతైన విశ్లేషణతో రూపొందిన డాక్యుమెంటరీ ‘మనీ డిస్‌రప్టెడ్’ (Money Disrupted) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ డాక్యుమెంటరీని ఫ్రూషన్ ప్రొడక్షన్స్ తరఫున క్రిస్టఫర్ డాడ్జ్ నిర్మించారు. ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఈ డాక్యుమెంటరీని తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రోత్సహించడంతో ఇది మరింత ప్రచారం పొందింది. దీంట్లో ఆయన మాట్లాడినదానికి సంబంధించి చిన్న వీడియో క్లిప్‌ను జోడిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో కియోసాకి పోస్ట్ చేశారు.చరిత్రలో అతిపెద్ద ఆర్థిక మార్పును ప్రపంచం ఎదుర్కొంటోందని వీడియోలో చెప్పుకొచ్చిన రాబర్ట్ కియోసాకి.. దీన్ని తాను ముందే ఊహించానన్నారు. అందుకే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకాన్ని రచించానన్నారు. ఆ తర్వాత తన జీవితమే మారిపోయిందన్నారు. ఇంకా ఆయన ఏమేమి మాట్లాడారన్నది పూర్తి డాక్యుమెంటరీ విడుదలయ్యాక తెలుస్తుంది. ఫెడరల్ రిజర్వ్ నుంచి బిట్‌కాయిన్ వరకూ...డాక్యుమెంటరీలో ముఖ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ (Federal Reserve) స్థాపన తర్వాతి ఆర్థిక పరిణామాలు, 1971లో గోల్డ్ స్టాండర్డ్ ముగింపు, పెరుగుతున్న జాతీయ అప్పులు, ద్రవ్యోల్బణ ప్రభావాలను విశ్లేషించారు.నిపుణుల అభిప్రాయాలతో పాటు, సంప్రదాయ ఫియాట్ కరెన్సీ వ్యవస్థపై విమర్శాత్మక దృష్టికోణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్లాక్‌చెయిన్ సాంకేతికత, బిట్‌కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ మార్గాలుగా మారవచ్చని చిత్ర బృందం సూచిస్తోంది.ప్రముఖుల అభిప్రాయాలుఈ డాక్యుమెంటరీలో మాజీ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాన్ పాల్, ఆర్థిక విశ్లేషకులు లినెట్ జాంగ్, ఆండి షెక్ట్‌మన్ తదితరులు తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ద్రవ్య విధానాలపై వీరి విమర్శలు, “సౌండ్ మనీ” అవసరంపై వారి వాదనలు ఈ డాక్యుమెంటరీకి వైవిధ్యాన్ని తీసుకురానున్నాయి.Check out the full documentary Money Disrupted by Christopher Dodge of Fruition Productions - here is a short clip https://t.co/uojn89SCoS— Robert Kiyosaki (@theRealKiyosaki) February 23, 2026 -
25 ఏళ్లకే మిలియనీర్‌ను చేసిన బుక్
రాబర్ట్ కియోసాకి అంటే ముందుగా గుర్తొచ్చేది.. ఆయన రాసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకం. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఈ బుక్.. తన జీవితాన్ని మార్చేసిందని, మిలియనీర్‌ను చేసిందని హెచ్‌బీ క్యాపిటల్ ఫౌండర్ & సీఈఓ 'హన్నా హామండ్' వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.13 ఏళ్ల వయసులో నా దగ్గర రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఉండేది. ఈ పుస్తకం నా జీవిత దిశనే మార్చేసింది. చిన్నప్పుడే కియోసాకి నాకు హీరో అయ్యారు, అని హన్నా హామండ్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. కష్టపడి పనిచేసి, ఆర్థిక జ్ఞానం పెంపొందించుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాను. దీని ఫలితంగా 25 ఏళ్లకే మిలియనీర్ అయ్యానని ఆమె పేర్కొంది.నా జీవితంలో నేను ఊహించని విషయం ఏమిటంటే.. నా ఫ్రెండ్ జో పోలిష్ ద్వారా రాబర్ట్ కియోసాకిని కలుసుకోవడం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆమె ఇంటి దగ్గరలోనే కియోసాకి నివసిస్తున్నారని నాకు అప్పటి వరకు తెలియదు.ఈ సందర్భంలో ఆమె తన జీవితాన్ని తిరిగి ఒకేసారి నెమరు వేసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం జీవితం దుర్భరంగా ఉండేది.ఇప్పుడు నా బాల్యంలో ఆశను నింపిన వ్యక్తి పక్కన నిలబడి ఉన్నాను. ఆ పుస్తకంలోని మాటలు నన్ను కష్టకాలంలో నిలబెట్టాయి, ముందుకు నడిపించాయని హన్నా హామండ్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Hannah Hammond (@hannahbhammond) -
అది బంగారాన్ని మించిపోతుంది..: కియోసాకి
బిట్ కాయిన్ ధర కీలక మద్దతు స్థాయికి చేరువ కావడంతో మార్కెట్లో ఆందోళన పెరిగింది. బిట్ కాయిన్ ధర ఇటీవల 60,000 డాలర్ల వద్ద ఉన్న దిగువ అంచును తాకింది. ఈ పరిణామంతో పలువురు పెట్టుబడిదారులు మరింత పతనం సంభవిస్తుందని అంచనా వేస్తున్న వేళ, ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మాత్రం విభిన్న నిర్ణయం తీసుకున్నారు.ధరలు పడిపోతున్న సమయంలోనే సుమారు 67,000 డాలర్ల వద్ద మరో పూర్తి బిట్ కాయిన్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. అమెరికా ప్రభుత్వ రుణభారం పెరుగుతున్న నేపథ్యంలో డాలర్‌పై ఒత్తిడి అధికమవుతుందని, దాని ఫలితంగా భారీ స్థాయిలో డబ్బు ముద్రణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనినే ఆయన “బిగ్ ప్రింట్”గా పేర్కొన్నారు.ఇక బిట్ కాయిన్ ప్రత్యేకత దాని పరిమిత సరఫరా అని కియోసాకి గుర్తుచేశారు. గరిష్టంగా 21 మిలియన్ నాణేలు మాత్రమే ఉండేలా రూపొందించిన ఈ డిజిటల్ ఆస్తి సరఫరాను ఏ కేంద్ర అధికారం పెంచలేనని తెలిపారు. ప్రతి కొత్త బిట్ కాయిన్ ముందే నిర్ణయించిన వేగంతోనే మార్కెట్లోకి ప్రవేశిస్తుందని, తుది నాణేల మైనింగ్‌కు దగ్గరపడే కొద్దీ దాని కొరత మరింత స్పష్టమవుతుందని పేర్కొన్నారు.దీర్ఘకాలంగా కరెన్సీ బలహీనతకు వ్యతిరేకంగా బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా భావిస్తున్నన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బిట్ కాయిన్ బంగారాన్ని మించిపోవచ్చని కియోసాకి వాదిస్తున్నారు. పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, కేంద్ర బ్యాంకుల విధానాల నేపథ్యంలో కొరత గల ఆస్తుల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.Although Bitcoin is crashing I bought one more whole Bitcoinfor $67k.Why? Two reasons: # 1: Because the Big Print will begin when the US debt crashes the dollar and “The Marxist Fed” begins printing trillions in fake dollars.#2: The magical 21 millionth Bitcoin is…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 20, 2026 -
'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో.. ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటూనే.. భారీ క్రాష్ మొదలైందని అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2013లో ప్రచురించిన రిచ్ డాడ్స్ ప్రాఫసీలో.. భవిష్యత్తులో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ జరుగుతుందని హెచ్చరించాను. నేను చెప్పినట్లే.. ఆ పెద్ద ఆర్థిక సంక్షోభం సమీపంలో ఉంది. మార్కెట్ క్రాష్ అనేది కొందరికి ప్రమాదం అయినా.. స్టాక్స్ కొనుగోలు చేయాలని వేచి చూసేవారికి గొప్ప అవకాశం.ఈ సందర్భంగా కియోసాకి.. గోల్డ్, సిల్వర్ గురించి చెబుతూనే బిట్‌కాయిన్, ఎథెరియం గురించి కూడా పేర్కొన్నారు. బిట్‌కాయిన్ విలువ తగ్గిపోతున్నప్పుడు, నేను మరింత కొనుగోలు చేస్తానని అన్నారు. నా దృష్టిలో ఇవే (బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం) నిజమైన ఆస్తులని పేర్కొన్నారు.I Am Warning You: In Rich Dad’s Prophecy published 2013 I warned of the biggest stock market crash in history still coming.That giant crash is now imminent.The good news is those of you who followed my rich dad’s warning and prepared….the coming crash will make you richer…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 17, 2026ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడూ నష్టాలనే కాకుండా.. అవకాశాలను అందిస్తుంది. భయపడే వారు నష్టపోవచ్చు, కానీ ఆర్థిక జ్ఞానం కలిగి, దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టే వారు మాత్రం.. తప్పకుండా ధనవంతులు అవుతారు. ఎప్పుడైతే మార్కెట్ నష్టాలను చవి చూస్తుందో.. చాలామంది తమ స్టాక్ అమ్మేయడానికి సిద్ధపడతారు. అలాంటి సమయంలో వాటిని కొనుగోలు చేసేవారు సంపన్నులవుతారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి అనేది ఒక వ్యక్తి ఆర్థిక దృష్టికోణం మాత్రమే. ఇందులో లాభనష్టాలు సహజమే. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అవసరమైతే ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: డేంజర్లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా? -
డబ్బుతోనే చెడగొడుతున్నారు.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!
ప్రఖ్యాత ఇన్వెస్టర్, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తరచూ తన ఆర్థిక అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి ఆయన.. తల్లిదండ్రులు డబ్బుతో తమ పిల్లల జీవితాలను ఎలా చెడగొడుతున్నారో వివరించారు.5 ‘సీ’లతో పిల్లల జీవితాలు నాశనంతల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నారో కియోసాకి తన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్టులో వివరించారు. పిల్లలు ఆర్థికంగా చెడిపోవడానికి కారణమైన ఐదు ‘సీ’(C)ల గురించి ప్రస్తావించారు.1. క్యాష్ (మనీ): తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఇస్తారు. కానీ వారు స్వయంగా సంపాదించాలని ఆశించరు. దీంతో పిల్లల్లో ఆర్థిక బాధ్యత తగ్గుతుంది.2. కాలేజ్ : పిల్లల ఉన్నత విద్యకు తల్లిదండ్రులే పూర్తిగా ఖర్చు భరిస్తారు. దీంతో ఉన్నత విద్య కోసం కష్టపడే అలవాటు పిల్లలకు తగ్గిపోతుంది.3. కారు: కళాశాల ఫీజులతో పాటు, కారు కొనివ్వడం, బీమా, నిర్వహణ ఖర్చులు కూడా తల్లిదండ్రులే భరిస్తున్నారు.4. కాండో (ఇల్లు): కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తొలి ఇంటిని కూడా తామే స్వయంగా కొనిస్తున్నారు.5. క్యాష్(ట్రస్ట్ ఫండ్): పిల్లల భవిష్యత్తు కోసం ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా పిల్లలు బడ్జెట్ చేయడం, పెట్టుబడి పెట్టడం వంటి ఆర్థిక నైపుణ్యాలు నేర్చుకోరు.ఆస్తి కరిగిపోతుంది..కియోసాకి అభిప్రాయం ప్రకారం.. మొదటి తరం కష్టపడి సంపాదిస్తుంది. రెండో తరం సౌకర్యవంతమైన జీవితం గడుపుతుంది. కానీ అదే అలవాట్లు మూడో తరానికి వెళ్తే కుటుంబ ఆస్తి క్రమంగా క్షీణిస్తుంది. కష్టపడి పనిచేయడం, సంపాదించడం, పెట్టుబడి పెట్టడం, బడ్జెట్ నిర్వహించడం వంటి అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పాలని ఆయన సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!భారతీయ కుటుంబాల్లో ఇదే పరిస్థితిరాబర్ట్ కియోసాకి చెప్పిన పరిస్థితి భారతీయ కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో పిల్లలు ఉద్యోగం పొందిన తర్వాత కూడా ఇల్లు లేదా కారు కొనుగోలు సమయంలో తల్లిదండ్రులు తమ పొదుపులను, కొన్నిసార్లు ప్రావిడెంట్ ఫండ్ లేదా పదవీ విరమణ నిధుల నుంచే ఉపసంహరించుకుని సహాయం చేస్తుంటారు. ఇది తల్లిదండ్రుల ప్రేమగా కనిపించినా, దీర్ఘకాలంలో పిల్లల్లో ఆర్థిక స్వావలంబనను దెబ్బతీసే ప్రమాదం ఉందని కియోసాకి హెచ్చరిస్తున్నారు.THE 5-Cs: How to destroy a child’s life with money.I have met many parents who destroy their children’s lives with money….The parents give their child or children the 5-Cs1: CASH: they give their children money never expecting them to earn their money.2: COLLEGE:…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 12, 2026 -
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
ప్రఖ్యాత ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి తన పేరుతో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఏఐ ఆధారిత నకిలీ (డీప్‌ఫేక్) వీడియోల గురించి హెచ్చరించారు. ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి, తాను గతంలో “రియల్ ఎస్టేట్ గైస్ సెమినార్ అట్ సీ” టీ-షర్ట్ ధరించిన విషయం నిజమేనని తెలిపారు. అయితే యూట్యూబ్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న, అదే టీ-షర్ట్ ధరించి ఉన్నట్లు చూపిస్తున్న కొన్ని వీడియోలు ఏఐ ద్వారా సృష్టించిన నకిలీవని స్పష్టం చేశారు. ఆ వీడియోల్లో ఉన్న సందేశాలు కూడా అసత్యమని ఆయన పేర్కొన్నారు.“టీ-షర్ట్ నిజమే, సెమినార్ కూడా నిజమే. కానీ వీడియోలు, సందేశాలు ఏఐతో సృష్టించిన నకిలీలు” అని కియోసాకి (Robert Kiyosaki) సోషల్ మీడియాలో వెల్లడించారు. డీప్‌ఫేక్ సాంకేతికత కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించి నిజమైన వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా కనిపించే నకిలీ వీడియోలను రూపొందిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సాంకేతికతను ఉపయోగించి ప్రముఖుల పేరుతో మోసపూరిత పెట్టుబడి ప్రకటనలు రూపొందించే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ తరహా నకిలీ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కియోసాకి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు.అదేవిధంగా, ఈ సందర్భాన్ని ఉపయోగించి ఆయన తన ఆర్థిక దృక్పథాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రభుత్వ ఫియాట్ కరెన్సీని “నకిలీ డబ్బు”గా పేర్కొంటూ, బంగారం, వెండి, రియల్ ఎస్టేట్, బిట్‌కాయిన్, ఈథిరియం వంటి “నిజమైన ఆస్తుల్లో” పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, నిజమైన సమాచారాన్ని నకిలీ కంటెంట్ నుండి వేరు చేయడం సాధారణ ప్రజలకు కష్టతరమవుతోంది. అందువల్ల పెట్టుబడులకు సంబంధించిన వీడియోలు లేదా ప్రకటనలను అధికారిక వనరుల ద్వారా ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.FYI: if you see YouTube videos with me wearing a Real Estate Guys Seminar at Sea T-shirt on….the T - shirt is real and so is the seminar.The problem is the videos are AI Fakes. So are the messages.Why someone waste their time doing fake AI videos is beyond me.To those…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 11, 2026 -
వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో తాను 600 సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు.ఇటీవల నేను మరో 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేశాను. ఈ రోజు వెండి స్పాట్ ధర ఒక ఔన్సుకు 82 డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను గమనిస్తే, భవిష్యత్తులో వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉందని నా నమ్మకం. ముఖ్యంగా 2026లో వెండి ధర ఒక్క ఔన్సుకు 200 డాలర్లకు చేరుకోవచ్చు, లేదా దానికంటే కూడా ఎక్కువ కావచ్చు అని నేను భావిస్తున్నాను.ఇప్పటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ స్థితి ఆందోళనకరంగా మారుతోంది. అధిక రుణాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల డాలర్ విలువ క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ (ఫియట్ కరెన్సీ)పై మాత్రమే ఆధారపడే వారు భవిష్యత్తులో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.Just purchased another 600 US Silver Eagles.Today’s spot is $82 an ounce. Still believe silver will reach $200 an ounce….or more…. in 2026.The US dollar is in trouble.Savers of fiat currency (fake $) biggest losersTake care.— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026ఫియట్ కరెన్సీ విలువ అనేది.. కేవలం ప్రభుత్వ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కానీ వెండి, బంగారం వంటి విలువైన లోహాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇవి ద్రవ్యోల్బణం నుంచి సంపదను కాపాడే సాధనాలుగా పని చేస్తాయి. అందుకే కరెన్సీ విలువ తగ్గుతున్న సమయంలో నిజమైన ఆస్తులైన.. వెండి వంటి లోహాల్లో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం అని కియోసాకి పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఆర్థిక అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం డబ్బును దాచుకునేవారి కంటే.. నిజమైన విలువ ఉన్న ఆస్తుల్లో (బంగారం, వెండి మొదలైనవి) పెట్టుబడి పెట్టినవారే లాభపడతారు. ఈ విషయాన్ని గమనించి, భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి, అని కియోసాకి ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కియోసాకి ఒకేసారి 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేయడంతో.. వెండి రేటు తప్పకుండా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. కాగా.. ఇండియన్ మార్కెట్లో కూడా వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. నేడు (ఫిబ్రవరి 10) కేజీ రేటు రూ.3 లక్షలకు చేరుకుంది. అంటే ఒక గ్రాము 300 రూపాయలన్నమాట. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
బంగారానికి బదులుందా? బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏది?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల విషయమై తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేశారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్.. మూడింటినీ కలిపి పెట్టుబడులు పెట్టడం మంచిదేనని చెప్పిన ఆయన, ఒక్క ఆస్తినే ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తాను బిట్‌కాయిన్‌కే ప్రాధాన్యం ఇస్తానన్నారు.ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, బిట్‌కాయిన్‌కు ఉన్న పరిమిత సరఫరానే దాని అతిపెద్ద బలమని కియోసాకి వివరించారు. బంగారం ధర పెరిగినప్పుడు మరిన్ని గనులు తవ్వడం ద్వారా సరఫరా పెరిగే అవకాశం ఉందని, తాను స్వయంగా గోల్డ్ మైనర్ కావడంతో ఇది తనకు తెలుసని అన్నారు.“బంగారం ధర పెరిగితే మరిన్ని గనులు తవ్వుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. కానీ బిట్‌కాయిన్ విషయంలో అలా కాదు. దాని డిజైన్ ప్రకారం గరిష్టంగా 21 మిలియన్ బిట్కాయిన్లే ఉంటాయి” అని కియోసాకి (Robert Kiyosaki) తెలిపారు. బిట్‌కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం 21 మిలియన్లకు మించి ఒక్క బిట్‌కాయిన్ కూడా సృష్టించలేమని, ఆ స్థాయికి మెల్లగా చేరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన నిర్మాణాత్మక కొరత బిట్‌కాయిన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుందని అన్నారు.ఇది చదివారా? కియోసాకీకి కోపమొచ్చింది!“21 మిలియన్ల తర్వాత కొత్త బిట్కాయిన్లు రావు. ఇది అద్భుతమైన డిజైన్. అందుకే దీర్ఘకాలంలో బిట్‌కాయిన్ ధర పెరుగుతుందని నేను నమ్ముతున్నాను” అని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను బిట్‌కాయిన్‌ను ప్రారంభ దశలోనే కొనుగోలు చేశానని, అదే సమయంలో గోల్డ్ మైనింగ్, చమురు తవ్వకాలు వంటి సంప్రదాయ పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు.ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణనిచ్చే “హార్డ్ అసెట్స్”కే తాను మద్దతు ఇస్తానని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. అయితే నిపుణులు మాత్రం, కేవలం కొరత మాత్రమే ధరలు పెరగడానికి హామీ ఇవ్వదని, డిమాండ్, నియంత్రణలు, మార్కెట్ ఊగిసలాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.అయినప్పటికీ, బిట్‌కాయిన్‌ను బంగారానికి ప్రత్యామ్నాయంగా చూసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని కియోసాకి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.I am often asked:Which is a better investment?Gold or Bitcoin.Obviously I would say both for diversification of assets and add silver.Yet if I had to choose only one asset I would choose Butcoin.Why?Because gold is in theory infinite. When the price of gold rises…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026 -
కియోసాకీకి కోపమొచ్చింది!
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకీ, తాను బిట్‌కాయిన్‌ను 6,000 డాలర్లకి కొనుగోలు చేశానన్న వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు స్పందించారు. బిట్‌కాయిన్ కొనుగోలు చేసిన తేదీపై అనవసరంగా దృష్టి పెట్టడం ఇన్వెస్టర్ల అసలు లక్ష్యాన్ని తప్పుదారి పట్టిస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో వరుస ట్వీట్లు చేశారు.తనను “అబద్ధం చెబుతున్నాడు” అంటూ ఆరోపించిన వ్యక్తి, బిట్‌కాయిన్‌ను ఏ తేదీన కొనుగోలు చేశానన్న అంశాన్ని ప్రశ్నిస్తున్నాడని కియోసాకీ పేర్కొన్నారు. అయితే తాను గుర్తుంచుకునేది కొనుగోలు చేసిన ధర (strike price) మాత్రమేనని, తేదీ తనకు ప్రాధాన్యం కాదని చెప్పారు.“నేను ఏ తేదీన బిట్‌కాయిన్ కొన్నానో అతడికి ఎందుకు అంత ఆసక్తి?” అని ప్రశ్నించిన కియోసాకీ, ఆ విమర్శల వెనుక వ్యక్తిగత అజెండా ఉండవచ్చని ఆరోపించారు.బిట్‌కాయిన్ ధర మళ్లీ 6,000 డాలర్లకి పడితే మరోసారి కొనుగోలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో తేదీ ఏమిటన్నది తనకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. ప్రస్తుతం తాను మరింత బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నానని కూడా వెల్లడించారు.తన విమర్శకులను ఉద్దేశించి, వారు ఎన్ని బిట్కాయిన్లు, బంగారం, వెండి లేదా ఈథీరియం కలిగి ఉన్నారో చెప్పాలని సవాలు విసిరారు. అలాగే అద్దె ఇళ్లు, చమురు బావులు వంటి వాస్తవ ఆస్తులపై కూడా ప్రశ్నించారు. “నేను ఈ ఆస్తులు ఎప్పుడు కొనుగోలు చేశానో నాకు గుర్తులేదు. కానీ వాటిని కొనుగోలు చేశానన్నది మాత్రం ఆనందంగా ఉంది” అని కియోసాకీ అన్నారు.అలాగే 2026 సంవత్సరానికి చెందిన 60 అమెరికన్ సిల్వర్ ఈగిల్స్ నాణేలు, 20 మిశ్రమ తేదీల గోల్డ్ ఈగిల్స్ కొనుగోలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వెండి మార్కెట్లో ఉన్న కల్లోలం కారణంగా 2026 సిల్వర్ ఈగిల్స్ భవిష్యత్తులో కలెక్టర్ కాయిన్లుగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.చివరగా, తనను అనుసరించే ఇన్వెస్టర్లకు కియోసాకీ ఒక సూచన చేశారు. “ఆస్తి విలువ, సంఖ్య కంటే కొనుగోలు చేసిన తేదీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. దీర్ఘకాలిక సంపద ఆస్తుల సేకరణతోనే వస్తుంది, తేదీలతో కాదు.” అని ముగించారు.To the person who said I was lying that I bought Bitcoin at $6000…. I know my strike price not the date he falsely accuses me of the date I bought Bitcoin on.Why would he care what date I bought it on?Does he have a personal agenda for calling me a liar?If Bitcoin hits…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 7, 2026 -
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
“రిచ్ డాడ్ పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి, ధరలు కొత్త మార్కెట్ దిగువ స్థాయికి చేరుకునే వరకు బిట్‌కాయిన్ (BTC), బంగారం, వెండిని మరింతగా కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లకు అసలైన ప్రమాదం ధరల ఊగిసలాట కంటే, పెరుగుతున్న అమెరికా రుణ భారం అని ఆయన అభిప్రాయపడ్డారు.‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన పోస్ట్‌లో, అమెరికా ఆర్థిక పరిస్థితిని పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న “అత్యంత పెద్ద సమస్య”గా కియోసాకి అభివర్ణించారు. అమెరికా జాతీయ రుణం సుమారు 38 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలతో సంబంధం ఉన్న భవిష్యత్ బాధ్యతలను కలిపితే మొత్తం భారం 250 ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. “ఫెడ్, అసమర్థ నాయకులు, నకిలీ డాలర్లతో ప్రజలను దోచుకునే క్రిమినల్ బ్యాంకర్లే అసలైన సమస్య” అని కియోసాకి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడే కొనేది లేదువెండి ధర 60 డాలర్లు, బిట్‌కాయిన్ 6,000 డాలర్లు, బంగారం 300 డాలర్లు వద్ద ఉన్నప్పటి నుంచి తాను కొనుగోలు చేయడం ఆపేశానని కియోసాకి తెలిపారు. “నేను కొన్ని బిట్కాయిన్లు, కొంత బంగారం విక్రయించాను. కానీ నాకు అమ్మడం నచ్చదు ఎందుకంటే మూలధన లాభాల పన్ను చెల్లించడం నాకు ఇష్టం లేదు” అని చెప్పారు. కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు, ఈ రెండు ఆస్తుల్లోనూ కొత్త దిగువ స్థాయిల కోసం “ఓపికగా వేచి చూస్తున్నాను” అని అన్నారు.గురువారం సెషన్లో బిట్‌కాయిన్ ధర 60,100 డాలర్ల వరకు పడిపోయి, రాత్రికి 65,600 డాలర్లకు చేరింది. అయినప్పటికీ, గత 24 గంటల్లో ఇది ఇంకా 6.6% తగ్గుదలలోనే ఉంది. స్టాక్ట్విట్స్ ప్రకారం.. బిట్‌కాయిన్‌పై రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఏడాది కనిష్టానికి చేరి ‘అత్యంత బేరిష్’ జోన్లోకి వెళ్లింది. చర్చల స్థాయి మాత్రం ‘అత్యధికం’గా ఉంది.బంగారం, వెండి మార్కెట్ పరిస్థితిగురువారం రాత్రి బంగారం ఔన్స్‌కు సుమారు 4,400 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ, గత రోజుతో పోలిస్తే 1.95% లాభపడింది. అయితే, స్పైడర్ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్ (GLD) రెగ్యులర్ ట్రేడింగ్‌లో 2.66% పడిపోయిన తర్వాత, ఆఫ్టర్ అవర్స్‌లో మరో 0.92% తగ్గింది. స్టాక్‌ట్విట్స్‌లో పసిడిపై సెంటిమెంట్ ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి తగ్గింది.ఇదీ చదవండి: క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండిఇక వెండి ధరలు గురువారం రాత్రి 4.4% పెరిగి 73.8 డాలర్లకు చేరుకున్నాయి. రెగ్యులర్ సెషన్లో 15.77% పతనం తర్వాత, ఐషేర్స్ సిల్వర్ ట్రస్ట్ (SLV) ఆఫ్టర్ అవర్స్‌లో మరో 4.63% తగ్గింది. వెండి చుట్టూ రిటైల్ సెంటిమెంట్ కూడా ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి దిగింది. చర్చల తీవ్రత ‘చాలా ఎక్కువ’ నుంచి ‘ఎక్కువ’కు తగ్గింది.సమయం, సహనం కీలకంధరలు తక్కువ స్థాయికి చేరేవరకు వేచి ఉండాలని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. వెండి ధర 74 డాలర్లకి, బంగారం 4,000 డాలర్లకు పడితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం తగినంత ఎథీరియం ఉందని, భవిష్యత్తులో ఆ వాటాను పెంచుకోవడాన్ని పరిశీలిస్తానని తెలిపారు.“లాభం మీరు కొనుగోలు చేసినప్పుడు వస్తుంది… అమ్మినప్పుడు కాదు,” అని రిచ్ డాడ్ నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని, ధరల ర్యాలీలను వెంబడించవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. చివరగా, ఆయన తరచూ చెప్పే “పందులు లావవుతాయి… కానీ అత్యాశ పందులు మాంసంగా మారుతాయి” అన్న మాటను మరోసారి గుర్తుచేశారు.AS I POSTED on X earlier. I stopped buying silver at $60.I stopped buying Bitcoin at $6000.I stopped buying gold at $300.I have sold some Bitcoin and some gold. I hate selling because I hate paying capital gain taxes.Today…. I wait patiently for new bottoms for gold…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 6, 2026 -
కుప్పకూలిన బంగారం, వెండి!.. కియోసాకి ట్వీట్
ధనికులు, పేదల మధ్య ప్రధాన తేడా డబ్బు కాదు, ఆలోచనా విధానమే అంటున్నారు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి'. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వాల్‌మార్ట్ వంటి వాటిలో సేల్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలావరకు పేదవాళ్లే తండోపతండాలుగా వెళ్లి.. అవసరం ఉన్నా, లేకున్నా వస్తువులు కోనేస్తుంటారు. తక్కువ ధర అని తెలియగానే.. ఇప్పుడు పోతే ఇలాంటి అవకాశం మళ్లీ రాదనే భావనతో ఖర్చు చేస్తారు. ఇది తక్షణం మాత్రమే సంతృప్తిని ఇస్తుంది.. కానీ దీర్ఘకాల లాభం ఉండదు.అయితే.. మార్కెట్లో క్రాష్ వచ్చినప్పుడు (షేర్స్, బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు తగ్గినప్పుడు) పేదవాళ్లు భయంతో తమ పెట్టుబడులను అమ్ముకుంటారు. ఇంకా పడిపోతే.. నష్టం వస్తుందనే భయమే దీనికి కారణం. ఇలాంటి సమయంలోనే ధనవంతులు కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు.ధరలు పడిపోయినప్పుడు, భవిష్యత్తులో విలువ పెరిగే ఆస్తులను తక్కువ ధరకు ధనవంతులు కొనుగోలు చేస్తారు. మార్కెట్ క్రాష్ వచ్చినా వారు భయపడరు. పైగా డబ్బును పోగు చేసి లేదా ఉన్న డబ్బుతోనే.. తెలివిగా పెట్టుబడులు పెడతారు. ఇటీవల బంగారం, వెండి, బిట్‌కాయిన్ మార్కెట్లు పడిపోవడం కూడా ఇలాంటిదే. కొందరికి ఇది నష్టం లాగా కనిపించినా, మరికొందరికి ఇది గొప్ప అవకాశం.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!ధనికులు నష్టాల్లో లాభాన్ని చూస్తారు.. పేదలు భయాన్ని చూస్తారు. మార్కెట్ పైకి వెళ్లినప్పుడు కొనడం కాదు, కింద పడినప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకోవడమే ఆర్థిక విజ్ఞానం. డబ్బు కన్నా ముందు మన ఆలోచనలు మారితేనే, మన భవిష్యత్తు మారుతుందంటున్నారు కియోసాకి.బంగారం, వెండి & బిట్‌కాయిన్ మార్కెట్ ఇప్పుడే కుప్పకూలింది. అంటే అమ్మకానికి వచ్చింది. నేను వీటిని (గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్) కొనడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు ఏమి చేయబోతున్నారు? అంటూ కియోసాకి ట్వీట్ పూర్తి చేశారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతారు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.DIfFERENCE BETWEEN Rich People and Poor People:When Walmart has a SALE poor people rush in and buy, buy, buy.Yet when the Financial Asset Market has a sale….a.k.a…..CRASH…the poor sell and run….while the rich rush in….and buy, buy, buy.The gold, silver, and Bitcoin…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 1, 2026 -
కియోసాకి వెండినంతా అమ్మేసుకున్నాడా?
ప్రసిద్ద ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకికి బంగారం, వెండిపై పెట్టుబడులంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. అయితే తాను వెండిని మొత్తం అమ్మి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టానన్న వార్తలు వచ్చాయని, వాటిని ఖండించారు. అవి పూర్తిగా అసత్య ప్రచారాలు అని ఆయన స్పష్టం చేశారు.దీని గురించి రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు. వాంకూవర్‌లో జరిగిన ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఈ రూమర్ల గురించి తెలుసుకున్నానని కియోసాకి తెలిపారు. తన పెట్టుబడి వ్యూహంలో వెండికి ఇప్పటికీ ముఖ్యమైన స్థానం ఉందని, తాను ఒక్క గ్రాము వెండికూడా అమ్మలేదని చెప్పారు.అయితే, తన కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి కొంత బిట్‌కాయిన్, తరువాత కొంత బంగారం అమ్మినట్లు ఆయన అంగీకరించారు. ఆ నిర్ణయం పెద్ద తప్పు అని, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే వాటిని అమ్మకపోయి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ‘దేవుడి దయ వల్ల వెండి మాత్రం అమ్మలేదు’ అన్నారు.కియోసాకి తన పెట్టుబడి తత్వాన్ని మరోసారి వివరించారు. అప్పు ఉపయోగించి పాజిటివ్ క్యాష్ ఫ్లో వచ్చే రియల్ ఎస్టేట్ కొనుగోలు చేసి, ఆ ఆదాయంతో బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఈథీరియం వంటి ఆస్తులను కొనుగోలు చేస్తానని చెప్పారు.అమెరికన్ డాలర్ వంటి ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని పునరుద్ఘాటించిన కియోసాకి, “నకిలీ డాలర్లను అమ్మి నిజమైన ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం” అని పెట్టుబడిదారులకు సూచించారు.ద్రవ్యోల్బణం, ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అస్థిరతలపై కియోసాకి గతంలోనూ పలు హెచ్చరికలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో విలువైన లోహాలు, క్రిప్టోకరెన్సీలు రక్షణాత్మక పెట్టుబడులుగా ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయం.FYI SILVER Fact:I was at VRIC Vancouver Resource Investor Conference. Great event for anyone serious about their financial education on gold and silver.At VRIC I was informed there is a rumor I sold all my silver to buy more Bitcoin.This is not true. The facts are:I…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 27, 2026 -
పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనా
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భవిష్యత్తులో బంగారం ఎక్కడికి చేరుతుందో అనే విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు.బంగారం ధర 5000 డాలర్ల కంటే ఎక్కువగా పెరిగింది. రాబోయే రోజుల్లో 27,000 డాలర్లకు చేరుతుందని కియోసాకి వెల్లడించారు. ఇప్పటికే పలు మార్లు వెండి ధరలు పెరుగుతాయని చెప్పిన కియోసాకి.. ఇప్పుడు గోల్డ్ రేటు భారీగా పెరుగుతుందని పేర్కొన్నారు. నిజంగానే ఆయన చెప్పిన మాటలు బంగారం విషయంలో జరుగుతాయా?, లేదా అనేది తెలియాల్సి ఉంది.GOLD soars over $5000.Yay!!!!Future for gold $27,000.— Robert Kiyosaki (@theRealKiyosaki) January 26, 2026భారతదేశంలో బంగారం, వెండి ధరలుఇండియన్ మార్కెట్లో రోజు రోజుకి పెరుగుతున్న గోల్డ్ రేటు.. ఈ రోజు (జనవరి 26) కూడా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,950 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,48,450 రూపాయల వద్ద నిలిచింది. సిల్వర్ రేటు రూ. 10వేలు పెరగడంతో.. కేజీ వెండి ధర రూ. 3.75 లక్షలకు చేరింది.బంగారం ధరలు పెరగడానికి కారణాలుద్రవ్యోల్బణం, డాలర్ విలువ తగ్గడం, భౌగోళిక & రాజకీయ కారణాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, బంగారం సరఫరా పరిమితి, బంగారం పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం మొదలైన కారణాల వల్ల బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.ఇదీ చదవండి: 168 గంటల్లో రూ. 16వేలు పెరిగిన గోల్డ్ రేటు! -
సిల్వర్ సెంచరీ.. ‘రిచ్ డాడ్’ హ్యపీ
వెండి ధరలు రోజుకో రికార్డ్ కొడుతూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్ సిల్వర్ 100 డాలర్ల మార్క్‌ను దాటేసింది. వెండి ధరలపై నిరంతరం పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంతకు ముందే వెండి ధర 100 డాలర్లకు చేరువ కాగానే ఆనందంతో పోస్టు పెట్టారు.‘వెండి 100 డాలర్లు (ఔన్స్‌కు) దాటుతోంది.. యేయ్’ అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, ఫియాట్ కరెన్సీలపై నమ్మకం తగ్గడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి హార్డ్ అసెట్లకు కియోసాకి ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నారు.ఒకవైపు విలువైన లోహంగా, మరోవైపు పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే లోహం కావడం వల్ల వెండికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో వినియోగం వెండి భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. అయితే, విశ్లేషకులు వెండి ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయని, ఇది అత్యంత అస్థిరమైన లోహాల్లో ఒకటని హెచ్చరిస్తున్నారు.అయితే ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్‌కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని తన ఇంతకు ముందు పోస్ట్‌లో కియోసాకి తెలిపారు. SILVER to BREAK $100.Yay!!!!— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026 -
బంగారం, వెండి తగ్గొచ్చు పెరగొచ్చు.. కానీ..
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తుల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అన్న విషయాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తాత్కాలిక మార్కెట్ ఊగిసలాటలకంటే దీర్ఘకాలిక ఆర్థిక వాస్తవాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈమేరకు సోషల్ మీడియాలో రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక పోస్ట్ చేశారు. అమెరికా జాతీయ రుణం నిరంతరం పెరుగుతుండటం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుతుండటమే తన పెట్టుబడి దృక్పథానికి ప్రధాన కారణమని కియోసాకి తెలిపారు.“బంగారం, వెండి లేదా బిట్‌కాయిన్ ధరలు పెరుగుతాయా పడిపోతాయా అని నేను పట్టించుకోను, ఎందుకంటే అమెరికా జాతీయ రుణం పెరుగుతూనే ఉంది, అదే సమయంలో డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది” అంటూ తన ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు.కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వ ద్రవ్య విధానాలపై కియోసాకి చాలాకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజా వ్యాఖ్యల్లో, ఫెడరల్ రిజర్వ్, యూఎస్ ట్రెజరీ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను “అధిక విద్య కలిగిన కానీ అర్హత లేని పీహెచ్‌డీలు” నియంత్రిస్తున్నారని విమర్శించారు.ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్‌కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని కియోసాకి తెలిపారు. పరిమిత సరఫరా ఉన్న ఈ ఆస్తులు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణగా నిలుస్తాయని ఆయన నమ్మకం.Q: Do I care when the price of gold silver or Bitcoin go up or down?A: No. I do not care.Q: Why Not?A: Because I know the national debt of the US keeps going up and the purchasing power of the US dollar keeps going down.Q: Why worry about the price of gold, silver,…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026 -
అప్పుడు ఇనుము.. ఇప్పుడు వెండి..
ప్రఖ్యాత ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి విలువైన లోహాలపై మరోసారి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈసారి ఆయన బంగారంతో పోలిస్తే వెండికే భవిష్యత్తులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు.సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టులో.. వేల సంవత్సరాలుగా బంగారం, వెండి రెండూ డబ్బుగా ఉపయోగంలో ఉన్నాయని గుర్తు చేసిన కియోసాకి, నేటి టెక్నాలజీ యుగంలో వెండి ఒక “స్ట్రక్చరల్ మెటల్”గా మారిందని అన్నారు. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో, ఈ టెక్ యుగంలో వెండి అంతే కీలకమని పోలుస్తూ రాసుకొచ్చారు.“వెండి ఇక కేవలం డబ్బు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత అవసరమైన లోహంగా మారుతోంది” అని కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు.ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగం విస్తరిస్తుండటంతో వెండికి డిమాండ్ మరింత పెరుగుతుందనేది ఆయన అభిప్రాయం.ధరల విషయానికి వస్తే, 1990లో వెండి ధర ఔన్స్‌కు సుమారు 5 డాలర్లు ఉండేదని, 2026 నాటికి అది సుమారు 92 డాలర్లకి చేరిందని కియోసాకి చెప్పారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, 2026లోనే వెండి ఔన్స్‌కు 200 డాలర్ల వరకు చేరవచ్చని ఆయన అంచనా వేశారు.WHY SILVER is SUPERIORGold and silver have been money for thousands of years.But…in today’s Technology Age….silver is elevated into an economic structural metal…. much like iron was the structural metal of the Industrial Age.In 1990…silver was approximately $ 5.00 an…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 22, 2026 -
'వెండి దొరకడం కష్టం': కియోసాకి
సిల్వర్ ధర పెరుగుతుందని చెప్పే రాబర్ట్ కియోసాకి మాటలు నిజమయ్యాయి. వెండి రేటు రోజురోజుకు పరుగుతూ.. చూస్తుండగానే రూ. మూడు లక్షలు దాటేసింది. ఇలాంటి సమయంలో ఆయన తన ఎక్స్ ఖాతాలో చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.''టెస్లా కంపెనీకి వెండి (Silver) దొరకడం కష్టం అవుతోంది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 91 డాలర్ల నుంచి 107 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది'' అని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.TESLA cannot get silver.This Monday silver will gap upfrom $91 an ounce to $107 an ounce.Yay— Robert Kiyosaki (@theRealKiyosaki) January 15, 2026ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సిల్వర్ రేటు గణనీయంగా పెరగడం వల్ల, రాబర్ట్ కియోసాకి.. టెస్లా కంపెనీకి సిల్వర్ దొరకడం కష్టం అవుతోందని అన్నారు. కాగా ఈ రోజు భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 3.06 లక్షల వద్ద ఉంది.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.ఇదీ చదవండి: నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్! -
ఇంకా మించి పోలేదు: వెండి ధరలపై కియోసాకి
బంగారం, వెండి లోహాలపై ఎప్పుడూ బుల్లిష్‌గా ఉండే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ( Rich Dad Poor Dad ) రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి వెండిపై బలమైన ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘యేయ్.. వెండి 80 డాలర్లు దాటిందోచ్’ అంటూ ధరల పెరుగుదల ఇంకా ముగిసిపోలేదని స్పష్టం చేశారు.ఇటీవల వెండి ధరలు ఔన్సుకు 80 డాలర్లు దాటడంతో ఈ ర్యాలీ ఇక్కడితో ఆగిపోతుందా అనే పెట్టుబడిదారుల సందేహాలకు కియోసాకి (Robert Kiyosaki ) సమాధానమిచ్చారు. ‘వెండి కొనడానికి ఇప్పటికే ఆలస్యమైందా?’ అనే ప్రశ్నకు ఆయన స్పష్టంగా “లేదు” అని చెప్పారు. ధరలు 100 డాలర్ల స్థాయికి (ఔన్స్‌కు) చేరుకునే వరకు వెండిని కొనుగోలు చేస్తూనే ఉంటానని, ఆ తర్వాత పరిస్థితిని పరిశీలిస్తానని తెలిపారు.కఠిన ఆస్తులు (హార్డ్ అసెట్స్), ఫియాట్ కరెన్సీ విలువ క్షీణత, ద్రవ్యోల్బణ ప్రమాదాలపై తరచూ హెచ్చరికలు చేసే కియోసాకి.. పెట్టుబడిలో క్రమశిక్షణ అవసరాన్ని గుర్తు చేస్తూ “పందులే బలుస్తాయి. మాంసం కోసం వాటినే వధిస్తారు” అనే ప్రసిద్ధ నానుడిని ప్రస్తావించారు. అంటే, దురాశతో కాకుండా నియంత్రిత రిస్క్‌తో లాభాలు సాధించాలన్న సందేశాన్ని ఆయన ఇచ్చారు.ఈ వ్యాఖ్యలు ఆయన గత అంచనాలకు కొనసాగింపుగానే వచ్చాయి. 2025 చివర్లో వెండి ఔన్సుకు 72 డాలర్లు దాటినప్పుడు, దానిని “బంగారం, వెండి పోగు చేసేవారికి గొప్ప వార్త”గా అభివర్ణించిన కియోసాకి, అదే సమయంలో డబ్బును పొదుపుపైనే ఆధారపడే పెట్టుబడిదారులకు ఇది “చెడు వార్త” అని హెచ్చరించారు.పెరుగుతున్న ద్రవ్యోల్బణం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, 2026 నాటికి వెండి ధర ఔన్సుకు 200 డాలర్లు చేరవచ్చని ఆయన అంచనా వేశారు. పారిశ్రామిక డిమాండ్, సేఫ్-హేవెన్ పెట్టుబడులు, అలాగే గ్లోబల్ ఆర్థిక అస్థిరత కలయికే వెండి ధరలను పైకి నడిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.10-11-2026Silver over $80…..yayIs it too late to buy silver?I say “No.”I would buy silver up to $100…. Then wait and see.Always remember:“Pigs get fat. Hogs get slaughtered.”— Robert Kiyosaki (@theRealKiyosaki) January 11, 2026 -
వెండిపై అస్సలు తగ్గని కియోసాకి
అంతర్జాతీయంగా, దేశీయంగా వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే రికార్డు గరిష్టాలకు చేరాయి. అయితే బంగారం, వెండి వంటి ఆస్తులపై పెట్టుబడులను ప్రోత్సహించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై రోజుకో సంచలన అంచనా ప్రకటిస్తున్నారు.తాజాగా సోషల్ మీడియాలో మరో సరికొత్త అంచనాను వదిలారు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki). ‘వెండి ధర రేపు ఔన్స్‌కు 100 డాలర్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమై, ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరుకుంటుంది’ అంటూ తన ‘ఎక్స్’ (మునుపటి ట్విట్టర్) ఖాతాలో ట్వీట్ చేశారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? అంటూ యూజర్లలో చర్చను రేకెత్తించారు.ఈ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లు, మార్కెట్ విశ్లేషకుల మధ్య సందేహాలు రేకెత్తించాయి. ప్రపంచవ్యాప్తంగా లిక్విడ్‌గా ట్రేడ్ అయ్యే కమోడిటీ అయిన వెండి ధర ఒక్క రోజులో ఈ స్థాయికి చేరుకోవాలంటే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం లేదా సరఫరా అంతరాయం వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తితేనే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.కియోసాకి గత కొన్నేళ్లుగా ప్రభుత్వ రుణాలు, ద్రవ్యోల్బణం, ఫియాట్ కరెన్సీల విలువ తగ్గుదలపై హెచ్చరిస్తూ వస్తున్నారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి హార్డ్ అసెట్లలో పెట్టుబడులు పెట్టాలని ఆయన తరచుగా సూచిస్తుంటారు. అయితే, ఆయన అంచనాలు ఎక్కువగా దీర్ఘకాలిక ఆర్థిక ప్రమాదాలపై దృష్టి సారిస్తాయని, తక్షణ ధరల అంచనాలుగా భావించరాదని విమర్శకులు అంటున్నారు.I PREDICT:Silver opens tomorrow at $100 and goes to all time highs.What do you think?— Robert Kiyosaki (@theRealKiyosaki) January 4, 2026 -
ఉద్యోగం కంటే.. అదే అవసరం: కియోసాకి సలహా..
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ''ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడం ఎందుకు పాత ఆలోచన'' అంటూ ఒక ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఒకప్పుడు బాగా చదివితే.. మంచి ఉద్యోగం వచ్చేది.. జీవితాంతం భద్రత ఉంటుందనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నా.. ఎప్పుడు జాబ్ నుంచి తీసేస్తారో తెలియదు. ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగం చేసే వ్యక్తులకైనా.. ఊహకందని విధంగా లేఆఫ్ నోటీసులు వచ్చిన సందర్భాలు కోకొల్లలు.2025లో కంపెనీలు తొలగించిన ఉద్యోగులు➤యూపీఎస్: 48,000 ఉద్యోగాలు➤అమెజాన్: 30,000 ఉద్యోగాలు➤ఇంటెల్: 20,000 ఉద్యోగాలు➤వెరిజోన్: 15,000 ఉద్యోగాలు➤మైక్రోసాఫ్ట్: 6,000 ఉద్యోగాలు➤సేల్స్‌ఫోర్స్: 4,000 ఉద్యోగాలు➤జీఎం: 3,420 ఉద్యోగాలు➤ఐబీఎం: 2,700 ఉద్యోగాలు➤బోయింగ్: 2,500 ఉద్యోగాలు➤వాల్‌మార్ట్: 1,500 ఉద్యోగాలుఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో చాలావరకు హైటెక్ కంపెనీలే ఉన్నాయి. ఇంకెక్కడ ఉద్యోగ భద్రత ఉంది. ఉద్యోగం కంటే.. మీ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోండి. డబ్బు ఆదా చేయవద్దు. దీనికి బదులుగా బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం వంటిని ఆదా చేయడి. అవే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయని కియోసాకి పేర్కొన్నారు.ఇక్కడ కియోసాకి భావన ఏమిటంటే.. ఇంతపెద్ద ప్రైవేట్ కంపెనీ అయినా మీకు ఉద్యోగ భద్రత కల్పించదు. కాబట్టి ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. డబ్బు ఎలా పనిచేస్తుంది అన్న జ్ఞానం పెంచుకోండి. “డబ్బు సేవ్ చేయకండి” అని ఎందుకు అంటున్నారంటే.. డబ్బును బ్యాంకులో డబ్బు ఉంచితే విలువ తగ్గిపోతుందని (ద్రవ్యోల్బణం వల్ల) కియోసాకి అభిప్రాయం. కాబట్టి డబ్బును నేరుగా సేవ్ చేసుకోకుండా.. విలువ పెంచే వస్తువులలో పెట్టుబడిగా పెట్టాలి.ఇదీ చదవండి: అంబానీ ఫ్యామిలీ: ఎవరెంత చదువుకున్నారంటే..ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడం ఎందుకు పాత ఆలోచన అనే విషయానికి వస్తే.. దీని అర్థం చదువు అవసరం లేదు అని కాదు. ధనవంతులు అవ్వడానికి కేవలం చదువే సరిపోతుంది అన్న ఆలోచనకు సంబంధించింది. అంటే.. చదువుతో పాటు, డబ్బు నిర్వహణపై అవగాహన కూడా అవసరం. అప్పుడే సంపన్నులవుతారు.WHY GOING TO SCHOOL for job security is an obsolete idea:LAY OFFS 20251: UPS 48,000 jobs2: AMAZON 30,000 jobs3: INTEL 20,000 jobs4: VERIZON 15,000 jobs5: MICROSOFT 6,000 jobs6: SALES FORCE: 4,000 jobs7: GM: 3,420 jobs8: IBM: 2,700 jobs9: BOEING…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 4, 2026 -
కొత్త మార్క్‌కు సిల్వర్!: కియోసాకి ట్వీట్
వెండి ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే సిల్వర్ 80 డాలర్లను దాటుతుందని చెప్పే ఈయన.. తాజాగా కొత్త మార్క్ చేరుతుందని పేర్కొన్నారు.బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని కియోసాకి గతంలో కూడా చాలాసార్లు పేర్కొన్నారు. ఇప్పుడు సిల్వర్ 200 డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు చూస్తుంటే.. కియోసాకి మాటలు నిజమవుతాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.SILVER BREAKS $ 80.00$200 NEXt ?— Robert Kiyosaki (@theRealKiyosaki) December 28, 2025భారతదేశంలో వెండి రేటుహైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి రేటు రూ. 2.81 లక్షల వద్ద ఉంది. ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువగా ఉన్నప్పటికీ (కేజీ రూ.2.58 లక్షలు).. కొన్ని రోజులుగా ధరలు మాత్రం ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మాత్రం గరిష్టంగా రూ. 4000 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి రేటు పెరుగుదలపై మస్క్ ట్వీట్వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్‌లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025 -
సిల్వర్ సునామీ.. మళ్లీ వచ్చేశాడు కియోసాకి
వెండి ధర మళ్లీ రికార్డ్ యిలో ఎగిసింది. భారత్‌లో అయితే కేజీకి ఏకంగా రూ. 20 వేలు పెరిగి రూ.2.74 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్‌కు 80 డాలర్లకు చేరువైంది. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి.. వెండి ముచ్చట అంటే ఆగుతాడా.. మళ్లీ వచ్చేశాడు. తాజాగా సిల్వర్ గురించి మరో ముచ్చట పంచుకున్నారు.‘వెండి 80 డాలర్లను (ఔన్సుకు) దాటనుంది. తెలివిగా వెండిని పొదుపు చేస్తున్న వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ ఓపికే మీకు సంపాదన తెచ్చిపెట్టింది. ఇప్పుడు మనం సంపన్నులయ్యాం. బంగారాన్ని వెండి అధిగమించింది’ అంటూ రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.అంతకు ముందు ఈ వైట్ మెటల్‌పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి కియోసాకి ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్‌టైమ్ హై అని అనుకోవద్దని, ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.SILVER To Break $80.Happy New Year ….smart silver stackers.Your patience has paid off.Now we get richer.Happy 2026Silver is hotter than gold.— Robert Kiyosaki (@theRealKiyosaki) December 27, 2025 -
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. రోజుకో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ క్రమంలో రజతం రేటు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని, లేదు సర్దుబాటు ఉంటుందని ఇలా.. మార్కెట్ విశ్లేషకులు తలో అంచనా చెబుతున్నారు. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధర గురించి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ చేస్తున్నారు.వెండి ఔన్సుకు 70 డాలర్లను దాటిపోయిన నేపథ్యంలో ఈ వైట్ మెటల్‌పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సమాధానమిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్‌టైమ్ హై అని అనుకుంటే పొరపడినట్టేనని రాసుకొచ్చారు. ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.వెండి ధర 2026లో అనూహ్యంగా 200 డాలర్లను (ఔన్స్‌కు) దాటిపోతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఇది అతి శయోక్తి కాదని, సాధ్యకావడానికి చాలా కారణాలే ఉన్నాయని స్పష్టం చేశారు. కావాలంటే యూట్యూబ్ మొత్తం వెతికి సాధ్యసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు.ఒక్క డాలరు కన్నా తక్కువున్నప్పుడే..1965లో వెండి ధర ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువున్నప్పటి నుంచే తాను వెండి కొనడం ప్రారంభించానన్న రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు 70 డాలర్లు దాటిపోయినా సిల్వర్ కొనుగోలును ఆపనన్నారు. ధనవంతులు కావడానికి ఉత్తమ మార్గం ఎవరికి వారు సొంతంగా పరిశీలించుకోవడమేనన్నారు.‘చిన్నగా ప్రారంభించండి.... సంపద ఇక మీ బుర్రలో.. మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో పొరపాట్లు చేసినప్పటికీ, ఊరికే మాటలు చెప్పేవారి కంటే మీరు ధనవంతులు అవుతారు ’ అంటూ తనను అనుసరించేవారికి హితవు పలికారు సిల్వర్ మ్యాస్ట్రో..Silver is over $70 USD an ounce.Q: IS IT TOO LATE TO BUY SILVER?A: It depends.If you think silver is at an all time high then you’re too late.I believe silver is just getting started and I believe $70- $200 silver could be an outside reality in 2026.There are many…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 25, 2025 -
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
ప్రపంచవ్యాప్తంగా వెండి ధర భగ్గుమంటోంది. ప్రతిరోజూ కొత్త రికార్డు స్థాయికి దూసుకెళ్తోంది. ఔన్స్‌కు 72 డాలర్ల మార్కును దాటింది. దాదాపు 140% లాభాలతో, వెండి అనేక ఇతర అసెట్లను గణనీయంగా అధిగమించింది. ఈ నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఫియట్ కరెన్సీ, హార్డ్ అసెట్స్‌పై వ్యాఖ్యానానికి ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.పారిశ్రామిక డిమాండ్, స్థూల ఆర్థిక ఆందోళనల మధ్య సురక్షిత-స్వర్గధామ ఆస్తిగా భావిస్తూ పెట్టుబడులు పెంచుతుండటంతో వెండి ధరలు తారస్థాయికి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో తనదైన శైలిలో స్పందించారు.‘వెండి 70 డాలర్లు దాటింది.బంగారం, వెండి పొదుపు చేసేవారికి గొప్ప వార్త.ఫేక్ మనీ (డాలర్లు) దాచుకునే వాళ్లకు బ్యాడ్ న్యూస్’ అంటూ పోస్టును ప్రారంభించిన కియోసాకి అధిక ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, డాలర్ విలువను కోల్పోతూనే ఉన్నందున 2026 నాటికి వెండి ఔన్స్ కు 200 డాలర్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు.‘నష్టపోకండి.. వెండి ధర 2026 నాటికి 200 డాలర్లకు చేరుకుంటున్న క్రమంలో ఆ ఫేక్ డాలర్ (డబ్బు విలువ ఉండదనేది ఆయన అభిప్రాయం) కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తుంది’ అంటూ ముగించారు. రాబర్ట్ కియోసాకి అంచనా కాస్త అతిశయోక్తిలా అనిపించినా వెండి ధర అత్యంత వేగంగా పెరుగుతోందనే విషయం మాత్రం వాస్తవం. SILVER over $70.GREAT NEWS for gold and silver stackers.BAD NEWS for FAKE MONEY savers.I am concerned $70 silver may signal hyper-inflation in 5 years as the fake $ keeps losing value. Don’t be a loser. Fake $ will continue to lose purchasing power as silver goes to…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 23, 2025 -
కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనికులయ్యే మార్గాలు!
ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై సూచనలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. తన ఎక్స్ ఖాతాలో యాక్టివ్‌గా ఉంటూ.. ధనవంతులు అవ్వడం ఎలా?, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను పేర్కొంటూ ఉంటారు. ఇందులో భాగంగానే.. ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్ధిక పాఠాలను వెల్లడించారు.👉కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి, ప్రపంచ ఇంధన డిమాండ్‌ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.👉ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.👉ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని అన్నారు.👉ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి. మాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు.👉ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.👉ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్‌ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.👉ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం కొనండి.👉మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు. పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు. -
'ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు'.. కియోసాకి పదో పాఠం
తొమ్మిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 10 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ఎలా ధనవంతులు కావాలి? అనే విషయం గురించి ప్రస్తావించారు.మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు.పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ.. దాన్ని ఎలా సాదించగలను అనే విషయం గురించి ఆలోచించాలి. ఇది మన మెదడును ఆలోచింపజేస్తుంది, పరిష్కారాలు వెతకమంటుంది, కొత్త మార్గాలు, అవకాశాలు చూపిస్తుంది. ఇలా పెద్ద పెద్ద ఆర్థిక సమస్యలను పరిష్కరించడం నేర్చుకుని మరింత ధనవంతులవుతారని వెల్లడించారు.ఇదీ చదవండి: 26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం?ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. ఆస్తులు తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదాహరణకు, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో.. రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, బంగారం, వెండి అన్నీ అమ్మకానికి వచ్చాయి. ఆ సమయంలో భయపడిన వాళ్లు అమ్మేశారు. సాహసం చేసిన వాళ్లు కొనేశారు. కొన్నవాళ్లే తర్వాత ధనవంతులయ్యారు. ఇప్పుడు ధనవంతులు కావడానికి ఇది మంచి అవకాశం, కానీ మీ మాటలను నియంత్రించగలిగితేనే.. అని కియోసాకి స్పష్టం చేశారు.LESSON #10 How to get richer as the economy crashes:CONTROL YOUR WORDS: In Sunday School I learned: “The word became flesh and dwelt amongst us.”In other words “You become your words.”My rich dad forbid his son and from saying “I can’t afford it.”Rich dad said: “Poor…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 21, 2025 -
మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్
ఎనిమిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 9 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు మరింత ధనవంతులు కావడం ఎలా?, అనే విషయం గురించి వెల్లడించారు.ఫెడ్ (FED) భవిష్యత్తు కోసం తమ ప్రణాళికలను ప్రపంచానికి తెలియజేసింది. వడ్డీ రేట్లను తగ్గించింది. భవిష్యత్తులో భారీగా డబ్బు ముద్రణ జరుగుతుందని, దీనిని కియోసాకి ఫేక్ మనీ ప్రింటింగ్ అని అభివర్ణించారు. ఈ ఘటనను లారీ లెపార్డ్ తన గొప్ప పుస్తకంలో "ది బిగ్ ప్రింట్" అని పిలిచారు.ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం కొనండి.ఇదీ చదవండి: పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే నేరమా.. జరిమానా ఎంత?గత వారం ఫెడ్ రేట్ల తగ్గింపును ప్రకటించిన వెంటనే నేను మరింత వెండిని కొన్నాను. వెండి ధర భారీగా పెరగనుంది. బహుశా 2026లో ఔన్సు రేటు 200 డాలర్లకు చేరవచ్చు. ఈ ధర 2024లో 20 డాలర్ల వద్ద మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూస్తే సిల్వర్ రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.LESSON # 9: How to get richer as the world economy crashes.The FED just let the world know their plans for the future.The FED lowered interest rates…signaling QE (quantitative easing) or turning on the fake money printing press….What Larry Lepard calls “The Big Print” the…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 17, 2025 -
అతిపెద్ద ఆర్థిక పతనం వస్తోంది.. ఇది ఎనిమిదో పాఠం
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ “చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పతనం” దిశగా సాగుతోందని సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు చేస్తూ వస్తున్నారు. ఆర్థికంగా ప్రపంచం పతనమైనా అందులో చిక్కుకోకుండా ధనవంతులు ఎలా కావాలో పాఠాలు చెబుతున్నారు. అందులోభాగంగా ఎనిమిదో పాఠాన్ని తాజాగా ‘ఎక్స్’లో పంచుకున్నారు.చరిత్ర చూడండి..ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్‌ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.ఈ పరిణామాలు ప్రపంచాన్ని “రుణ ఆర్థిక వ్యవస్థగా” మార్చాయని, దీని ఫలితంగా అమెరికా జపాన్ వంటి దేశాలు భారీ రుణభారంతో సతమతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంటి అద్దెలు పెరగడంతో ఉద్యోగాలు ఉన్నవారు కూడా రోడ్డునపడుతున్నారన్నారు.కియోసాకి తన వ్యక్తిగత పెట్టుబడి అనుభవాలను కూడా పంచుకున్నారు. 1970లలో బంగారం కొనడం ఎలా ప్రారంభించారో, ఇప్పటికీ బంగారం వెండి విదేశాల్లో నిల్వ చేస్తానని చెప్పారు. దశాబ్దాల క్రితం కొన్న బంగారు నాణెం విలువ ఇప్పుడు భారీగా పెరిగిందని, ఇది ఆర్థిక అస్థిరత సమయంలో విలువ నిలుపుకొనే ఆస్తులు ఎంత ముఖ్యమో నిరూపిస్తుందని అన్నారు.ఫెడ్ ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి మూలంప్రస్తుత సంక్షోభానికి మూలం 1913లో ఏర్పడిన ఫెడరల్ రిజర్వ్‌నేనని ఆయన ఆరోపించారు. ఆధునిక ఫియట్ కరెన్సీలు విలువ కోల్పోవడానికి ఈ సంస్థ విధానాలు ప్రధాన కారణమని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి లను “దేవుని సొమ్ము”గా.. బిట్‌కాయిన్, ఈథీరియంను “ప్రజల డబ్బు”గా కియోసాకి అభివర్ణించారు.ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభం, నివాస సమస్యలు పెరుగుతున్న సమయంలో కూడా, సిద్ధపడి పెట్టుబడులు మారుస్తున్న వారు లాభపడతారని కియోసాకి పునరుద్ఘాటించారు. “వాళ్లే విజేతలు” అని, “ఫెడరల్ రిజర్వ్ లేదా ప్రభుత్వం రక్షిస్తుంది” అనే నమ్మకంతో ఉన్నవారు నష్టపోతారని హెచ్చరించారు.స్కూళ్లలో ఆర్థిక విద్యను ఎందుకు బోధించడంలేదనే ప్రశ్నను ఆయన మళ్లీ లేవనెత్తారు. ఎవరికివారే స్వయంగా ఆర్థిక జ్ఞానం పెంచుకోవాలని, రాబోయే అనిశ్చిత కాలానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.కియోసాకి గత కొన్నేళ్లుగా ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ, బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీలు వంటి ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఆర్థిక నిపుణులు ఆయన అంచనాలను కొట్టిపడేస్తున్నప్పటికీ, రుణభారం, ద్రవ్యోల్బణంపై ఆందోళన ఉన్న పలువురికి ఆయన సందేశం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. LESSON # 8: How you can get richer as the world economy collapses.CRASHES do not happen over night.CRASHES take decades to occur.For Example:Silver crashed in 1965: when the US government turned silver coins into fake coins…. Violating Greshams Law which stated when…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 10, 2025 -
వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక ట్వీట్ చేసారు. ఇందులో ''ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినప్పుడు ధనవంతులు కావడం ఎలా'' అనే విషయం వెల్లడించారు.ధనవంతుడిని $లో కొలుస్తారు.సంపన్నుడిని TIMEలో కొలుస్తారు.ఉదాహరణకు ఒక ధనవంతుడు ఇలా అనవచ్చు: “నా దగ్గర బ్యాంకులో $1 మిలియన్ ఉంది.ఒక సంపన్నుడు ఇలా అనవచ్చు: “నేను ఈ రోజు పని చేయకపోయినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడు నెలలు జీవించగలను.ఇప్పుడు చెప్పు.. నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించడానికి పనిచేస్తున్నావా?, లేక దీర్ఘకాలంగా సంపదను నిర్మించుకుని నిజమైన ధనవంతుడు కావడానికి పనిచేస్తున్నావా?. ధనవంతుడు డబ్బు సంపాదించాలి, సంపన్నుడి కోసం డబ్బు పనిచేస్తుందని కియోసాకి పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.ఆర్థిక సంక్షోభం సమయంలో మీ సంపదను పెంచుకోవడానికి మీరు ఏమి చేస్తారు?. ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కఠినమైన ఆర్థిక పరిస్థితులు తలత్తే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు అని కియోసాకి ట్వీట్ ముగించారు.LESSON # 7:: How to get richer as the world economies crash:Are you working to get rich or are you working to get wealthy?Definitions: Rich is measured in $.Wealth is measured in TIME.For example a rich person might say: “I have $1 million in the bank.”A wealthy…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 8, 2025


