
ఆర్ధిక సంక్షోభం రాబోతోందని చెప్పిన.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసా'కి తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్‌లో గోల్డ్ రేటు గణనీయంగా పెరుగుతుంది స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుందని తెలుస్తోంది. ఆర్ధిక నిపుణులు కూడా పసిడి ధరలు అమాంతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు
''ఇక్కడ ముగింపు ఉంది. లక్షలాది మంది యువకులు, వృద్ధులు ఆర్థికంగా తుడిచిపెట్టుకుపోతారు. బంగారం 25,000 డాలర్లకు చేరుతుంది. వెండి 70 డాలర్లకు చేరుతుంది. బిట్‌కాయిన్ 500000 డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ది బిగ్ ప్రింట్ పుస్తకాన్ని చదవండి. నేను ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న ముగింపు ఇక్కడ ఉందిని.. దేవుడు మన ఆత్మలపై దయ చూపాలి'' అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ చేశారు.
THE END is HERE:
WHAT if you threw a party and no one showed up?
That is what happened yesterday.
The Fed held an auction for US Bonds and no one showed up.
So the Fed quietly bought $50 billion of its own fake money with fake money.
The party is over. Hyperinflation is…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 21, 2025