
ఢిల్లీ: తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి వ్యాఖ్యలు చేశారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.
ఇటీవల తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్‌లో ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సిబల్ వాదనలు వినిపిస్తూ.. 2014-21 వరకు రాష్ట్ర ప్రభుత్వమే అవినీతి ఆరోపణలపై 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. కానీ, ఈడీ 2025లో టాస్మాక్ హెడ్ క్వార్టర్లలో సోదాలు చేసి ఉద్యోగుల ఫోన్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుందన్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం స్పందిస్తూ.. వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయవచ్చు కానీ.. మొత్తం కార్పొరేషన్‌ను దీనికి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించింది. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, తమిళనాడు లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
CJI: We have granted stay;
Sibal: they are investigating-why are ED coming here?
ASG Raju: We have done nothing wrong
CJI: If they have registered FIR, why ED should come?
Raju: 1000 crore fraud
CJI: Where is the predicate offence? ED passing all limits— Live Law (@LiveLawIndia) May 22, 2025
ఇదిలా ఉండగా.. తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో 1,000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు తమిళనాడులో రాజకీయ గందరగోళాన్ని సృష్టించింది. తమిళనాడులో మద్యం విక్రయాలపై పూర్తి గుత్తాధిపత్యం కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ TASMAC, రాష్ట్ర ఆదాయంలో గణనీయమైన భాగం (సంవత్సరానికి దాదాపు రూ. 45,000 కోట్లు) సమకూరుస్తుంది.

ఇది రాష్ట్రంలో 4,700కు పైగా రిటైల్ షాపుల ద్వారా మద్యం పంపిణీ చేస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకారం.. TASMAC కార్యకలాపాలలో బహుళ అవకతవకలు జరిగాయి. ఇందులో టెండర్ మానిప్యులేషన్, అక్రమ నగదు లావాదేవీలు, రూ. 1,000 కోట్లకు పైగా మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపించింది. కాగా ఇటీవల ఈ కేసులో భాగంగా టాస్‌మార్క్ అధికారుల ఇళ్లు, ఆఫీస్‌లలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఈడీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా TASMAC అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.