
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు అంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గా మల్లేశ్వర స్వామి వార్లతో పాటు ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మ వారు, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో దేవతా మూర్తులను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించారు.

శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లతో అలంకారం ప్రత్యేకత. ఆ కూరగాయలను ఉపయోగించే తయారు చేసే కదంబ ప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు.

ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని శాకంబరీగా అలంకరించిన ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సారెను స్వీకరించారు.


























