breaking news
vijayawada
-
ఇబ్రహీంపట్నం పీఎస్‌కు యూట్యూబర్ రమా నందన
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ప్రముఖ యూట్యూబ్ చానల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు రమా నందన మంగళవారం విచారణకు హాజరయ్యారు. నిన్న(సోమవారం) శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్దఎత్తున డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో గతంలోనే నందనతో పాటు ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, అత్తామామలపై కేసు నమోదు చేయ డంతో పాటు లుక్ఔట్ నోటీసును కూడా జారీ చేశారు. ఇవాళ ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. యూకే వీసాల రెన్యువల్ పేరుతో కోట్లలో మోసానికి పాల్పడరంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు బాధితుడు క్రాంతికుమార్ ఫిర్యాదు చేశారు. విచారణకు సహకరిస్తానని 15 రోజుల క్రితం విజయవాడ పోలీస్ కమిషనర్, డీసీపీలకు రమా నందన మెయిల్ చేశారు. ఇండియా వచ్చి విచారణకు సహకరిస్తానని లుక్ అవుట్ నోటీసు తీసేయాలని పోలీసులను మెయిల్లో ఆమె కోరారు. లుక్ఔట్ నోటీసు తీసేయటం కుదరదని విచారణకు రావాలని చెప్పటంతో రమా నందన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లో ఇబ్రహీంపట్నం పోలీసులు 41 నోటీసులిచ్చారు. రమా నందన విచారణ పూర్తయ్యాక ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి యూకే నుంచి ఇండియాకు వచ్చి విచారణకు హాజరుకానున్నారు.ఇదీ చదవండి: 'డీఎస్సీ అక్రమాల వెనుక నారా లోకేశ్ హస్తం' -
కూటమిలో మేయర్ పోరు
సాక్షి, అమరావతి: ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న రీతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం కూటమి పార్టీల్లో అప్పుడే కుమ్ములాటలు ముదిరిపోయాయి. ఇంకా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదు, ఎప్పుడు వెలువడుతుందో కూడా తెలియదు, రిజర్వేషన్లు ఖరారు కాలేదు.. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆ పదవుల కోసం విపరీతంగా లాబీయింగ్‌లు, ఎత్తులు పైఎత్తులు, బేరసారాలు మొదలుపెట్టేశారు. బెజవాడ టీడీపీలో నువ్వా, నేనా?విజయవాడ మేయర్ పీఠం కోసం టీడీపీలోని రెండు వర్గాల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. కాపు వర్గం నుంచి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు సిద్ధార్థను అందరి కంటే ముందు రేసులో నిలబెట్టారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి తన కుమారుడికి మేయర్ సీటు ఇచ్చి కాపు వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో మేయర్ పదవిని రెండుసార్లు కమ్మ వర్గానికి ఇచ్చారని, ఈసారి తమకు ఇవ్వాలని ఆయన పట్టుబట్టడమే కాదు చంద్రబాబు వద్దకు తన కొడుకును తీసుకెళ్లి కూడా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీంతో ఉలిక్కిపడిన కమ్మ సామాజికవర్గం నేతలు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని రంగంలోకి దించి ఇంకా చాలామంది రేసులో ఉన్నారని చెప్పించారు. ఆయన కొమ్మారెడ్డి పట్టాభి, బొప్పన భవకుమార్ లేకపోతే తన వర్గానికి చెందిన ఎవరికైనా ఆ సీటు ఇప్పించాలని చూస్తున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి దేవినేని అపర్ణ గట్టి లాబీయింగ్ చేస్తున్నారు. లోకేశ్‌తో సన్నిహితంగా ఉండే ఆమె తనయుడు దేవినేని చందు.. అయితే తన తల్లికి లేకపోతే జెన్‌జెడ్ కోటాలో తన భార్యకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలివిగా పావులు కదుపుతూ తన వర్గం నుంచి ఒక మాజీ కార్పొరేటర్ పేరును తెరపైకి తెచ్చి చివరికి తన భార్య అనూరాధకు మేయర్ సీటు ఇప్పించుకునే యత్నాల్లో ఉన్నారు. మరికొందరూ రేసులో ఉండి చంద్రబాబు, లోకేశ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంతో బెజవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విశాఖ మేయర్ సీటు కోసం ఎమ్మెల్యేల హైరానా రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ సీటు కోసం టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ మేయర్ సీటు ఎలాగైనా సొంతం చేసుకోవాలని ముగ్గురు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబుతోపాటు మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, గండి బాబ్జిలు తెరవెనుక ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ తనయులకు ఆ సీటు ఇప్పించాలని తాపత్రయపడుతుండగా మిగిలిన వాళ్లు తామే నేరుగా సీటు కోసం యత్నిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు తన తనయుడు రవితేజకి మేయర్ సీటు ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్‌ను అడిగినట్లు సమాచారం. దీని గురించి ఆయనను ఇటీవల మీడియా ప్రశి్నంచగా తనకు ఆ సీటు ఇవ్వరా? అని ఎదురు ప్రశి్నంచడం విశేషం. మేయర్ రేసులో ఆయన చాలా సీరియస్ పోటీదారుగా పావులు కదుపుతున్నారు. అయితే ఎంపీగా ఉన్న లోకేశ్ తోడల్లుడు భరత్ ఇక్కడ కీలకం కావడంతో ఆయన మద్దతు కోసం చూస్తున్నట్లు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలు కుదిరితే తమ కుమారులు, మహిళా రిజర్వేషన్ అయితే తమ కుటుంబంలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆ దిశగా యత్నాలు చేస్తున్నారు. భరత్ మాత్రం తనకు అనుకూలంగా ఉండే వారికి మేయర్ సీటు ఇప్పించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. నెల్లూరులో వేమిరెడ్డి చెబితేనే మేయర్ నెల్లూరు మేయర్ సీటు కోసం టీడీపీలో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాను తమ గుప్పిట్లో పెట్టుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డిలు మేయర్ సీటును తమ అనుయాయుడు రూప్‌కుమార్ యాదవ్‌కి ఇప్పించాలని చూస్తుండడం మిగిలిన నేతలకు కంటగింపుగా మారింది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి.. వేమిరెడ్డిని కాదంటే లోకేశ్‌తో ఇబ్బంది వస్తుందని నోరు మెదపడంలేదు. ఇదిలా ఉంటే మేయర్ ఎంపికలో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరుతున్నారు. పలువురు కీలక నేతలూ వేమిరెడ్డి తీరుపై అసహనంతో రగిలిపోతున్నారు.గోదావరి జిల్లాల్లో జనసేనతో ఫైట్ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, ఏలూరు మేయర్ సీట్లు, భీమవరం, తాడేపల్లిగూడెం తదితర మున్సిపల్ చైర్మన్ సీట్ల కోసం జనసేన, టీడీపీ నేతలు నువ్వా నేనా అనేలా పోటీ పడుతున్నారు. ఇక్కడ తమకు బలం ఎక్కువగా ఉందంటూ జనసేన నేతలు ఎక్కువ మున్సిపాలిటీలు ఇవ్వాలని అడుగుతుండగా టీడీపీ నేతలు అందుకు అంగీకరించడంలేదు. కాకినాడ మేయర్ సీటుపై జనసేన, రాజమండ్రి మేయర్ సీటుపై బీజేపీ కన్నేసి చంద్రబాబు దగ్గర మంతనాలు జరుపుతుండడంతో టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. తమకు అవకాశాల్లేకుండా ఇక్కడ కూడా పొత్తు పేరుతో అన్యాయం చేస్తారా అని ముఖ్య నేతలను నిలదీస్తున్నారు. రాయలసీమలో తిరుపతి కార్పొరేషన్ తమకు ఇవ్వాలని జనసేన కోరుతుండడాన్ని టీడీపీ నేతలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. గుంటూరు కార్పొరేషన్ కోసం టీడీపీ ముఖ్య నేతలు ఎత్తులకుపైఎత్తులు వేసుకుంటున్నారు. చిత్తూరు, మచిలీపట్నం, అనంతపురం కార్పొరేషన్లు తమకు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేయడం అక్కడి టీడీపీ నేతలకు ఇరకాటంగా మారి బహిరంగంగానే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పదవులు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఉండడం, ఎక్కువ బడ్జెట్, అపరిమితమైన అధికారాలు ఉండడంతో వాటి కోసం నేతలు పోటీపడుతున్నారు. ఒక్కసారి పదవి దక్కితే రెండు చేతులా సంపాదించుకోవచ్చని వాటిపై కన్నేసి తమ కుటుంబంలోని ఎవరో ఒకరికి ఇప్పించుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. లేనిపక్షంలో తమకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవాలని చూస్తూ రాజకీయాలు చేస్తున్నారు. -
ఏపీకి భారీ వర్ష సూచన.. ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్టంలో రానున్న మూడుగంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడడంతో పాటు ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పెద్దఎత్తున గాలులు వీయడంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని,గాలివాన సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని సూచించింది. వర్ష తీవ్రత రూపుదాల్చుతున్న దృష్ట్యా, గతంలో జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్‌ను తాజాగా 'రెడ్ అలర్ట్'గా సవరించింది. -
చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉద్యోగ సంఘాల నేతల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరుపక్షాల నేతలు కాలర్లు పట్టుకుని తోసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవో నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయాలు వెల్లడించే క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వానికి తలొగ్గారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు, పీఆర్సీ, మరికొన్ని డిమాండ్లను చంద్రబాబుతో చర్చించే క్రమంలో సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాత వివిధ ఉద్యోగ సంఘాల నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. -
త్వరలో విజయవాడ–తిరుపతి విమాన సర్వీసు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వీలుగా ఉదయం వేళల్లో విజయవాడ – తిరుపతి మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. శుక్రవారం ఏపీ చాంబర్స్ ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆయన మాట్లాడుతూ ఫ్లై–91 అనే సంస్థ ఉదయం వేళల్లో విజయవాడ–తిరుపతి మధ్య సర్వీసును ప్రారంభించనుందన్నారు. కొత్త ఎయిర్‌పోర్టు టెర్మినల్ పనులు అక్టోబర్ నాటికి పూర్తి చేసి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ టెర్మినల్‌లో ఆరు ఎయిరోబ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి రోజూ 22 విమాన సర్వీసుల ద్వారా 2,000 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూరప్, అమెరికా, దుబాయ్‌కు ప్రత్యక్షంగా కనెక్టివిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. -
విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి
-
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ‘మాకు డబ్బులు బాగా అవసరం. మా తమ్ముడు, మరదలు విదేశాలకు వెళ్లాలి. నీ పేరు మీద ఉన్న ఆస్తులు విక్రయించి డబ్బులు తీసుకురా’ అంటూ భర్త, అత్తింటి వారు సాగిస్తున్న వేధింపులు తట్టుకోలేక ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. దేవీనగర్ ప్రాంతంలో నివసి స్తున్న బొమ్మిన హరీష్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. భద్రా చలం కొత్తగూడెం ప్రాంతానికి చెందిన నందిని (32)తో అతనికి 2016వ సంవత్సరంలో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. హరీష్ కొంత కాలం నుంచి పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని నందినిని వేధింపులకు గురిచేస్తున్నాడు. అతని తమ్ముడు భార్గవ్, మరదలు ఉమా విదేశాలకు వెళ్లేందుకు డబ్బులు కావాలని.. ఆమె పేరు మీద ఉన్న ఆస్తులను విక్రయించి డబ్బులు తెస్తావా? లేదా? అంటూ హరీష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు నందినిపై వత్తిడి తెస్తున్నారు. వారి వేధింపులు భరించలేని నందిని మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకూ పోలీసులు హరీష్ అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆయన పేరు చెబితే వదిలెయ్యాలి! -
విజయవాడలో CPS ఉద్యోగుల భారీ ర్యాలీ
-
‘ముకుంద జ్యూవెలరీ’ ఔట్లెట్ ప్రారంభం
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ముకుంద జ్యూవెలరీ ఫ్యాక్టరీ ఔట్లెట్ విజయవాడలో ప్రారంభించిన సందర్భంగా వినియోగదారులకు నాణ్యమైన బంగారు, వజ్రాభరణాలను మరింత అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించే ప్రారంభోత్సవ అమ్మకాల్లో 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 6.99 శాతం వీఏ, జీరో మేకింగ్ చార్జీలు వంటి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాలపై 2 నుంచి 12 శాతం వరకు వీఏ, హాల్‌మార్క్ గోల్డ్ జ్యువెల్లరీ, స్టోన్స్ ఉన్న ఆభరణాలపై 65 శాతం వరకు ఎక్సేంజ్ విలువ అందిస్తున్నట్లు చెప్పారు. డైమండ్ ఆభరణాలపైకూడా 25 శాతం వరకు వీఏ ఆఫర్‌తోపాటు క్యారెట్‌కు రూ.48,450 నుంచి ప్రత్యేక ధరలు అందుబాటులో ఉంటాయని నరసింహారెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక ప్రారం¿ోత్సవ సేల్‌ను నగరం ప్రజలు సది్వనియోగం చేసుకోవాలని కోరారు. -
AP: వివాహితపై ఐదుగురు యువకుల అత్యాచారం
సాక్షి, విజయవాడ: వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఐదుగురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. మద్యం తాగొచ్చి మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ దారుణంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పక్కనే కూర్చున్నా.. ప్రాణాలు కాపాడలేకపోయా...
కృష్ణా జిల్లా: రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రిని చూసేందుకు హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తున్న ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన యాసారపు చిన్ని(32) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తేలప్రోలు గ్రామంలోని సుందరయ్యనగర్‌లో కుటుంబంతోపాటు చిన్ని నివసిస్తుంది. ఆమె భర్త సుధాకర్ తేలప్రోలు సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్. వీరికి ఇద్దరు కుమారులు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. భర్త, పిల్లలతో ఆనందంగా జీవిస్తున్న ఆమె తండ్రి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు. తండ్రిని చూసేందుకు పదిహేను రోజుల క్రితం చిన్ని హైదరాబాద్ వెళ్లారు. ఆమెను తీసుకువచ్చేందుకు భర్త సుధాకర్ సోమవారం వెళ్లారు. ఇద్దరూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గ్రామానికి బయలుదేరారు. కోదాడ సమీపంలో జరిగిన ప్రమాదంలో చిన్ని అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త సుధాకర్ గాయాలతో బయటపడ్డాడు. చిన్ని మృతితో సుందరయ్యకాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నతల్లి మృతి చెందిన విషయం తెలుసుకుని ఇద్దరు చిన్నారులు బోరున విలపించారు. వారిని ఆపడం ఎవరి తరమూ కాలేదు. చదవండి: ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి... -
అన్నయ్య వచ్చేసరికే నేనక్కడ ఉండాలి! చెల్లెలి విషాదం!
ఆంధ్రప్రదేశ్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ప్రైవేటు బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.వీరిలో కొండూరు భావన వర్ష(23)ది విజయవాడ. హైదరాబాద్‌లో హెచ్ఆర్ ఉద్యోగం చేస్తున్న ఆమెకు తండ్రి కృష్ణారావు, తల్లి సుభాషిణి ఉన్నారు. వీరు అజిత్‌సింగ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో జ్యూయలరీ వర్క్‌షాపు ఉంది.దీంతో మంగళవారం మకాం అడవినెక్కలంకు మార్చారు. భావన వర్ష సోదరుడు రెశ్వంత్ సౌదీలో పనిచేస్తున్నారు. ఆయన రాఖీ పండగ కోసం వస్తుండడంతోపాటు తనకు బెంగళూరులో ఉద్యోగం రావడంతో కొన్ని రోజులు తల్లిదండ్రులతో ఉండాలని భావించిన భావన వర్ష చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి విజయవాడకు బయలుదేరారు.ముందు వేరే బస్సుకు టికెట్ బుక్ చేసుకున్న ఆమె ఆ బస్సు వెళ్లిపోవడంతో ప్రమాదానికి గురైన బస్సు ఎక్కారు. రూమ్మేట్స్ బుధవారం వెళ్లొచ్చుకదా అన్నా.. సోదరుడికి రాఖీ కట్టాలని, అన్నయ్య వచ్చేటప్పటికే తాను అక్కడ ఉండాలని ఉత్సాహంగా బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారారు.ఆమె మృతదేహాన్ని అంబులెన్సులో విజయవాడ మధురానగర్‌లోని తాతయ్య బ్రహ్మయ్య ఇంటి వద్దకు తీసుకురావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అమ్ములూ ఒక్కసారి కళ్లుతెరువమ్మా అంటూ ఆమె తల్లి, పెద్దమ్మలు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. సోదరుడు రెశ్వంత్ సౌదీ నుంచి వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఇవీ చదవండి: తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు -
నా భర్తపై నాకు ఫీలింగ్స్ రావడం లేదు
నాకు ముప్పై రెండు ఏళ్లు. నేను పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి నేను అమ్మాయిని కాదని, అబ్బాయినేమో అని అనుమానమే కాదు, నమ్మకం కూడా! అబ్బాయిలాగా బట్టలు వేసుకునేదాన్ని. అలాగే బైక్‌లు నడిపేదాన్ని. రఫ్ అండ్ టఫ్‌గా ఉండేదాన్ని. అమ్మాయిల మీద తప్ప అబ్బాయిల మీద ఆకర్షణ ఉండేది కాదు. అయితే నా పేరెంట్స్ నేనేదో సరదాగా ఉంటున్నానని అనుకునేవారు. నా బీటెక్ పూర్తయిన తర్వాత నా ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయితో నాకు స్నేహం ఏర్పడింది. ఇద్దరం ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. ఈ క్రమంలో మేమిద్దరం ‘బాగా క్లోజ్’ అయ్యాం. కొంతకాలం తర్వాత అమ్మాయి వాళ్ల ఇంట్లో వాళ్ల బలవంతం మీద పెళ్లి చేసుకుంది. తనలాగే నన్ను కూడా అమ్మానాన్న చెప్పినట్టు విని పెళ్లి చేసుకోమని పోరు పెట్టడమే కాదు, వాళ్ల చుట్టాలలో ఒక అబ్బాయిని చూసి నాకు పెళ్లి కూడా చేసింది. అయితే ఎంత ప్రయత్నం చేసినా, నా భర్తపై నాకు ఫీలింగ్స్ నాకు రావడం లేదు. ఈ మధ్యకాలంలో మా ఆఫీసులో పనిచేసే మరో అమ్మాయి మీద మళ్లీ నాకు ఇష్టం కలిగింది. నా ఫీలింగ్స్‌ను నేను ఆ అమ్మాయికి చెప్పాను. కానీ తను నన్ను బాగా తిట్టి దూరం పెట్టింది. దాంతో అసలు ఈ భూమ్మీద పుట్టడమే నేను చేసిన తప్పేమో అని అనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా చెప్పండి! – కావ్య, చెన్నైమీరు పడుతున్న ఈ మనోవేదనను నేను అర్థం చేసుకోగలను. అన్నింటికంటే ముందు మీరు ఈ భూమ్మీద పుట్టడమే నేను చేసిన తప్పా అని మిమ్మల్ని మీరు ఎప్పుడూ నిందించుకోవద్దు. మీలోని ఆలోచనలు, మీ లైంగిక ఆకర్షణ పూర్తిగా సహజమైనవి. అందులో ఏమాత్రం తప్పు లేదు, అది జబ్బు అంతకన్నా కాదు. ముందుగా మీ మనసులో ఉన్న సందేహాన్ని స్పష్టం చేసుకుందాం. చిన్నప్పటి నుంచి అబ్బాయిలా బట్టలు వేసుకోవడం, బైక్స్ నడపడం కేవలం మీ అలవాట్లు లేదా ఇష్టాలు మాత్రమే అయివుండి, మీ ఆకర్షణ కేవలం అమ్మాయిల మీదే ఉంటే దానిని స్వలింగ ఆకర్షణ అంటారు. అలా కాకుండా ‘నేను అసలు అమ్మాయినే కాదు, పొరపాటున అమ్మాయిగా పుట్టాను అనిపించి, మీ శరీరాన్ని అబ్బాయిలా మార్చుకోవాలని అనిపిస్తే దానిని ‘జెండర్ డిస్ఫోరియా’ అంటారు. ఇవేమీ అసాధారణమైనవి కాదు. కాకపోతే మన సమాజం ఇంకా ఇలాంటి విషయాలను అర్థం చేసుకునేంతగా పరిణతి చెందలేదు, అదే మీలాంటి వారికి పెద్ద సవాలుగా మారింది. ఇక మీ పెళ్లి విషయానికి వస్తే, మీ ఫ్రెండ్ చెప్పిన మాటల వల్ల ఎమోషనల్ అయి మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇష్టం లేని బంధంలో ఉంటూ మీ భర్త పట్ల ఫీలింగ్స్ రాలేదని బాధపడటంలో అర్థం లేదు, ఎందుకంటే అది మీ సహజ స్వభావానికి విరుద్ధం. జరిగిన దానికి మీ మీద మీరు గిల్ట్ పెంచుకోకండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మొదటగా మీలోని డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడటానికి వెంటనే ఒక మంచి సైకియాట్రిస్ట్ లేదా కౌన్సెలర్‌ను కలవండి. మనసు కొంచెం కుదుటపడ్డాక, మీ భర్తతో కూర్చుని లేదా కౌన్సెలర్ సమక్షంలో నిజాయితీగా మాట్లాడండి. ఇద్దరి జీవితాలు నరకం కాకుండా ఉండటానికి ఒక స్పష్టమైన, ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోండి. ఎలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా, ధైర్యంగా అడుగులు వేస్తే మీకంటూ ఒక ప్రశాంతమైన జీవితాన్ని నిర్మించుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ !డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comచదవండి: మనం గెలవటమే కాదు అవతలి వారినీ గెలిపించాలి! -
తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ జయప్రకాష్ నగర్‌కు చెందిన పడికిటి లక్ష్మీతేజ(30) హైదరాబాద్‌లో అమెజాన్ కంపెనీలో ఐదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తండ్రి రామ్‌ప్రసాద్, తల్లి కవిత, తమ్ముడు దేవివరప్రసాద్ ఉన్నారు. మిలాద్ ఉన్నబీ, రాఖీ, వీకెండ్ వరుస సెలవులు కావడంతో ఆమె తమ్ముడికి రాఖీ కట్టేందుకు విజయవాడకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఆనందంగా బయలుదేరారు. మంగళవారం రాత్రి తండ్రికి ఫోన్ చేసి బుధవారం ఉదయం ఆరు గంటలకల్లా విజయవాడలో ఉంటానని సంతోషంగా చెప్పింది. కూతురి కోసం ఏడు గంటల వరకు వేచి చూసిన తల్లిదండ్రులు కూతురుకు ఫోన్ చేశారు. ఫోన్ కలవకపోవడంతో ఏం జరిగిందో తెలీక కంగారు పడ్డారు. ఇంతలో కోదాడ సమీపంలో ప్రమాదం జరిగిందని టీవీలో వార్తలు ప్రసారం కావడం, మృతుల జాబితాలో లక్ష్మీతేజ పేరు ఉండడంతో తండ్రి రాంప్రసాద్ హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. అప్పటికే లక్ష్మితేజ మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురిలో ఉంచారు. రాత్రి ఫోన్ చేసి ఉదయానికి వస్తాను నాన్న అని చెప్పిన నా కూతురిని ఇలా చూస్తానని అనుకోలేదని రాంప్రసాద్ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి తీసుకొచ్చిన కూతురు మృతదేహంపై పడి తల్లి కవిత విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఇంటికి వచ్చినప్పుడల్లా నీ కాళ్ల పట్టీలు కావాలమ్మా.. అని అడిగేదానివి కదా.. లే అమ్మా పట్టీలు ఇస్తాను. తమ్ముడికి రాఖీ కడుదువుగానీ అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. గత రెండేళ్ల నుంచి లక్ష్మితేజకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని, ఈ ఏడాది ఎలాగైనా కల్యాణం జరిపించాలని అనుకున్నామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.చదవండి: ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి... -
అక్టోబరు 11 నుంచి దుర్గగుడిలో దసరా ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబరు 11 నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. -
విజయవాడ మెట్రోపై జస్ట్ ఆస్కింగ్ అంటూ కేశినేని నాని సంచలన పోస్ట్
-
YSRCP అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్
-
వైఎస్సార్సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్‌కు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరయ్యారు.నూతన వధూవరులు వర్షితరెడ్డి, క్రాంతి భాస్కర రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. -
మోసాలు.. అనుమానాస్పద మరణాలు.. రాజకీయ వివాదాలు..! సత్యనారాయణపురం PSపై ఆరోపణలెన్నో
-
విజయవాడ : భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
-
జెండా ఆవిష్కరణలో అపశ్రుతి.. వెంటనే జారుకున్న ఎంపీ
సాక్షి, విజయవాడ : ఎంపీ కేశినేని చిన్ని ఆఫీసులో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణలో అపశ్రుతి చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణ సందర్బంగా జాతీయ పతాకాన్ని టీడీపీ నేతలు తిరగేసి కట్టారు. అయితే జెండా ఎగురవేసే సమయంలో పతాకం రివర్స్‌గా ఉన్న సంగతి గమనించే వెంటనే కిందకి దించారు. ఇదంతా గమనించిన ఎంపీ కేశినేని ఏమి తెలియనట్లు మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం రద్దీ (ఫొటోలు)
-
సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ అయిఉంటే అది చాలా తీవ్రమైన వ్యవహారమంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. మే నుంచీ హెబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదంటూ పోలీసులను ధర్మాసనం నిలదీసింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.రెండు వారాలు గడువిస్తే కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరగా.. హైకోర్టు నిరాకరించింది. వారం రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ధర్మాసనం తేల్చి చెప్పింది. తదుపరి విచారణ ఈనెల 20వ తేదీకు కోర్టు వాయిదా వేసింది.కాగా, సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిల్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. -
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం
విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్టు జరిగింది. హోం గార్డ్ వెంకటరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి హోం గార్డ్ వెంకటరాజును తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చుతారు. కృష్ణలంక పోలీసు స్టేషన్లో అతడు సీసీ ఫుటేజ్ మాయం చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ సహా డీవీఆర్‌ను సైతం ధ్వంసం చేశాడు వెంకటరాజు.ఆంధ్రప్రదేశ్‌లో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ కేసులో అతడిని విజయవాడలోని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించి, అక్కడ సీఐ నాగరాజు నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఆ తర్వాత అతడు ప్రాణాలు కోల్పోయాడు. సాయికృష్ణ మరణించిన అనంతరం, విషయం బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు రహస్యంగా పలు పనులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. -
పొంతనలేని వ్యాపారాలు.. అంతులేని మోసాలు
సాక్షి, విజయవాడ: మాషా అల్లాహ్ పేరిట పక్కా ప్లానింగ్‌తోనే పసుపులేటి అంకుశం మోసాలకు పాల్పడ్డాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ సత్యనారాయణపురం కేంద్రంగా రూ.100 కోట్ల మేర దండుకుని ఆ తరువాత కంపెనీని మూసివేసిన విషయం విదితమే. కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు తమ నుంచి రూ.కోట్ల వసూలు చేసి ఉడాయించిన పసుపులేటి అంకుశం నుంచి డబ్బులిప్పించి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు.సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం నాటికి 630 మందికి పైగా బాధితులు ఫిర్యాదులు చేసినట్లు సమచారం. బాధితులు విజయవాడ కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు హాజరై తమకు న్యాయం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ‘మీరు మోస పోయారు. ఇంత డబ్బులు ఇస్తాం అంటే నమ్మారు? కేసు నమోదు చేశారు కదా.. చూద్దాం’ అంటూ కలెక్టర్ చెప్పడంతో బాధితులు తిరుగుముఖం పట్టారు. కలెక్టర్ నుంచి ఆశించిన మేర భరోసా లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. భార్యతో కలిసి బీచ్‌లో రీల్స్.. మాషా అల్లాహ్ సంస్థ ఎండీ పసుపులేటి అంకుశం ఏజెంట్లు, కస్టమర్ల నుంచి డబ్బులతో జల్సాలు చేశాడు. భార్యతో కలిసి బీచ్‌లో స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశాడు. బీర్ బాటిల్ చేతపట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో కలిసి బీరు తాగుతూ విలాసంగా గడిపేవాడు. వీటన్నింటినీ రీల్స్ చేసి సుమ అంకుశం (ఇన్‌స్టా ఐడీ) పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కార్యాలయంలో పని చేసే సిబ్బందిని సైతం ట్రిప్పులకు తీసుకెళ్లాడు. నిన్న మొన్నటి వరకు తమకు డబ్బులు చెల్లించాలంటూ బాధితులు పంపించిన వాట్సాప్ మెస్సేజులు చూసిన అంకుశం పరారీలో ఉన్నాడని, వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఆ సామాజిక వర్గాన్నే టార్గెట్ చేశాడా? పసుపులేటి అంకుశం అత్యంత పకడ్బందీగా స్కాం చేశాడు. అతను ఏర్పాటు చేసిన సంస్థ పేరు మాషా అల్లాహ్. ఇలా పెట్టడం వెనుక ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితుల్లో సైతం కడప, కర్నూలుకు చెందిన ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం వారే అధికంగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలది మంది నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేసి మోసం చేసిన అంకుశంనకు రాజకీయ పలుకుబడి ఉందని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన బాధితులను పోలీ సులు సైతం చిత్ర విచిత్ర ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.జీఎస్టీ క్లెయిమ్ చేసి.. రూ.కోట్లు కాజేసి..సత్యనారాయణపురంలోని ఓ నాలుగు అంతస్తుల భవంతిని పసుపులేటి అంకుశం అద్దెకు తీసుకుని మాషా అల్లాహ్ సంస్థను ప్రారంభించాడు. ఇక్కడి నుంచే కార్యకలాపాలన్నీ నడిపించాడు. సంస్థ సిబ్బందికి కూడా అనుమానం రాకుండా తన ఫ్యామిలీ చిత్తూరులో ఉందని నమ్మించాడు. మాషా అల్లాహ్ సంస్థ పేరిట జీఎస్టీ క్లెయిమ్ చేసుకున్నాడు. ముందు నుంచే ఎక్కడా తన వ్యక్తిగత విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. సంస్థలో ఎక్కువ మందిని చేరి్పంచిన వారికి గోల్డ్ కాయిన్ ఆఫర్ అంటూ తాయిలాలు ఎరచూపాడు. సోషల్ మీడియాలో ఏజెంట్ల ద్వారా తన బిజినెస్‌ను ప్రమోట్ చేసుకున్నాడు. స్కీమ్–1 నుంచి 4 వరకు స్క్రబ్, గ్రీన్ ప్యాడ్ మిషన్, సోనాలి రకం నాటుకోళ్ల పెంపకం, వాల్నట్స్ బిజినెస్ అంటూ ఒకదానికి ఒకటి పొంతన లేని వ్యాపారాలు ప్రారంభించాడు. ఏ బిజినెస్ అయినా ముందు రూ.30 వేలు, తరువాత రూ.లక్ష డిపాజిట్ కట్టాలని షరతు విధిస్తాడు. ఏజెంట్లు సైతం గుడ్డిగా నమ్మి... వారు కట్టడమే కాకుండా మరి కొంత మందితో డబ్బులు కట్టించారు. -
కూటమి సర్కార్‌కు జూనియర్ డాక్టర్ల వార్నింగ్
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సారె సంబరం (ఫొటోలు)
-
నేటి నుంచి విజయవాడ మునిసిపల్ కాంట్రాక్టర్ల సమ్మె
పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సోమవారం నుంచి సమ్మెబాట పడుతున్నారు. ది విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాయన ఆదిబాబు, అధ్యక్షుడు చనుమోలు వెంకట రమణ.. మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను కలిసి సమ్మె నోటీసులు అందజేశారు. విజయవాడ నగర మౌలిక సదుపాయాలు, అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా ఉన్న తాము ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, జనరల్ ఫండ్ ద్వారా ఈ ఏడాది జూలై 31 వరకు రూ.350 కోట్లు, కంటింజెంట్ బిల్లులు (సీ–బిల్లులు) రూ.40 కోట్లు, ఇతరత్రా రూ.10 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించనందున సోమవారం నుంచి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ నిలిపేయటంతోపాటు కొత్త పనులను బాయ్‌కాట్ చేస్తున్నామని ప్రకటించారు. -
సమ్మె సైరన్‌కు పిలుపిచ్చిన మున్సిపల్ కాంట్రాక్టర్లు
సాక్షి, విజయవాడ: మున్సిపల్ కాంట్రాక్టర్లు సమ్మె సైరన్‌కు పిలుపునిచ్చారు. రేపటి నుంచి విజయవాడ మున్సిపల్ పరిధిలో పనులు నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం రూ. 350 కోట్ల మేర బిల్లులు బకాయి ఉంచిన నేపథ్యంలో సమ్మెకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కాంట్రాక్టర్ల సమ్మోతో రోడ్లు ,డ్రైనేజీ.. వాటర్ సప్లై పనులకు బ్రేక్ పడనుంది.గత 10 నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ఉన్న 350 కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని బకాయిలు చెల్లించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. సమ్మెకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. మాకేమి తెలీదు.. అంత CI నాగరాజుకే..
-
ఇంతకంటే దారుణం ఉంటుందా?: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: డిఎస్పీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని వైఎస్సార్సీపీ రెండో రోజు రిలే నిరహార దీక్ష చేపట్టింది. ఆటోనగర్‌లో రిలే నిరాహార దీక్ష చేసిన వైఎస్సార్సీపీ నేతలు.. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మోసపోయిన డిఎస్పీ అభ్యర్థులకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నామన్నారు.‘‘యువతను కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీసుల పర్మిషన్ తీసుకుని శాంతియుత కార్యక్రమం చేస్తున్నాం. రెండు రోజుల ముందు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 100 మంది పోలీసులు వచ్చి మా టెంట్ పీకేశారు.. గీత గీసి ముందుకు రాకూడదని ఏసీపీ అంటున్నారు. భారతదేశంలో ఉన్నామా? ఏ కాలంలో ఉన్నాం. భారత రాజ్యాంగం ఏపీలో నడవడం లేదు. చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది’’ అంటూ దేవినేని అవినాష్ మండిపడ్డారు...మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడి గుడ్లతో దాడి చేశారు. టమోటాలతో దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు బాటిల్లో యూరిన్ పోసి దాడి చేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?. దమ్ముంటే సీబీఐ ఎంక్వయిరీ వేయండి. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పందించండి. రాత్రి అయిన తరువాత పగలు వస్తుంది.. మరో మూడేళ్లు మాత్రమే టీడీపీ అధికారంలో ఉండేది. నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు చేస్తాం’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. -
చైర్మన్ రాజీనామాకు మంత్రుల ఒత్తిడి.. ఆసుపత్రిలో చేరిన చలసాని
-
YSRCP నేతల టెంటు పీక్కెళ్లిన పోలీసులు
-
ఛీ.. మీకు మీ పరిపాలనకు దండం ఇక మీ చాప్టర్ క్లోజ్.. మహిళల ఆగ్రహం
-
YSRCP దీక్షా శిబిరాల వద్ద బోండా ఉమా కు ఏం పని..?
-
విజయవాడలో కొనసాగుతున్న ఉద్రిక్తత
-
మల్లాది విష్ణు అరెస్ట్
-
100 మంది గుండాలతో YSRCP దీక్ష శిబిరాలకు బోండా ఉమా.. కోడిగుడ్లు, టమాటాలతో దాడి!
-
బోండా ఉమా దౌర్జన్యం.. మల్లాది విష్ణు అరెస్ట్..
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెగా డీఎస్సీ పరీక్షలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ ముత్యాలపాడు వద్ద వైఎస్సార్సీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దౌర్జన్యానికి దిగారు. అనంతరం, పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులు దౌర్జన్యంగా, అత్యంత నీచంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ నేతల దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడికి దిగారు. దీక్షా శిబిరంపైకి ఎక్కి.. టీడీపీ కార్యకర్త ఒకరు టాయిలెట్ చేశారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు గుడ్లు విసిరారు. దీంతో, టీడీపీ కార్యకర్తులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడ ఉన్న సమయంలోనే ఇదంగా జరగడం గమనార్హం. టీడీపీ నేతల దాడి కారణంగా ఓ మహిళా వైఎస్సార్సీపీ కార్యకర్త స్పృహ తప్పిపోయి కిందపడిపోయినట్టు సమాచారం. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరిగాయని పార్టీ నేతలు ఆరోపించారు. అనంతరం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే గూండాయింజ చేశారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం మన దురదృష్టం. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. పోలీసుల సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దౌర్జన్యం చేశారు అని అన్నారు. దీక్షా శిబిరంలో ఉన్న మహిళలపై కూడా దాడులు చేయడం గమనార్హం. ఈ ఘర్షణల తర్వాత.. వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. టీడీపీ శ్రేణులు ఘర్షణలకు కారణమైనప్పటికీ వారిని మాత్రం పోలీసులు పట్టించుకోలేదు. -
నీట్ కోచింగ్ విద్యార్థిని ఆత్మహత్య
పెనమలూరు: విజయవాడ సమీపంలోని కానూరులో ఓ ప్రైవేట్ కాలేజీ హాస్టల్లో ఉంటూ నీట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన మేరకు.. హైదరాబాద్‌కు చెందిన కంతేటి వైష్ణవి (19) కానూరులోని శ్రీభారతి ఇనిస్టిట్యూట్‌లో నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో చేరింది. కానూరులో ఉండటం ఇష్టం లేకపోవటంతో తండ్రి అరవింద్ ప్రశాంత్ రెండు వారాల క్రితం వైష్ణవిని ఇంటికి తీసుకెళ్లి నచ్చజెప్పి తిరిగి కానూరు కాలేజీ హాస్టల్‌కు తీసుకొచ్చారు. తనను ఇంటికి తీసుకు వెళ్లాలని.. ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, వైష్ణవి మళ్లీ తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. -
అవినీతి ‘సేతు’లతో అనవసర సంతకం
సీతానగరం–కనకదుర్గ ఫ్లైఓవర్‌ను అనుసంధానిస్తూ 1.1 కి.మీ.ల పొడవున నిర్మాణానికి డీపీఆర్ తయారీకి టెండర్లుఅమరావతి–విజయవాడ మధ్య ట్రాఫిక్ సమస్య పరిష్కారం లక్ష్యమంటూ ప్రభుత్వం అబద్ధాలు!ఇప్పటికే వెస్ట్రన్ బైపాస్‌లో ప్రకాశం బ్యారేజీకి ఎగువన నాలుగు వరుసల బ్రిడ్జి నిర్మాణందానికి ఎగువన అమరావతితో హైదరాబాద్ రహదారిని అనుసంధానిస్తూ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికీ డీపీఆర్ తయారీకోల్కత–చెన్నై రహదారిని రాజధానిని అనుసంధానిస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణఇక సిగ్నేచర్ బ్రిడ్జి అవసరమేముందని ప్రశ్నిస్తున్న నిపుణులుప్రకాశం బ్యారేజీ దిగువన ఇప్పటికే 1.5 కిమీల పరిధిలో 3 రైల్వే బ్రిడ్జిలు, రెండు రోడ్డు బ్రిడ్జిలుఆరో బ్రిడ్జిగా సిగ్నేచర్ బ్రిడ్జి నిరి్మస్తే ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వదిలే వరద ప్రవాహానికి అడ్డంకేనంటున్న నిపుణులుగరిష్ట స్థాయిలో వరద వస్తే.. వెనక్కి ఎగదన్ని బ్యారేజీ భద్రతకే ముప్పు అంటూ హెచ్చరికఅధిక వడ్డీలకు అప్పు తెచ్చి సిగ్నేచర్ బ్రిడ్జి నిరి్మంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నిలదీతఅస్మదీయులకు పనులు కట్టబెట్టి కమీషన్ల వసూలుకే సిగ్నేచర్ బ్రిడ్జికి రూపకల్పన చేస్తున్నారంటూ విమర్శలుసాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదిపై సీతానగరం(కుడి గట్టు)–కనకదుర్గ ఫ్లైఓవర్(ఎడమ గట్టు)ను అనుసంధానిస్తూ సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీకి ఏజీఐసీఎల్(అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) ద్వారా ప్రభుత్వం టెండర్లు పిలిచింది. బిడ్లు దాఖలు చేయడానికి తుది గడువు ఈనెల 26వ తేది. అదే రోజున సాంకేతిక బిడ్, 27న ఆరి్థక బిడ్ తెరిచి, డీపీఆర్ తయారీ పనులు కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించనుంది. ఆ డీపీఆర్ తయారీకి మూడు నెలలు గడువు విధించింది. ఆ డీపీఆర్ ఆధారంగా సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణ పనులకుటెండర్లు పిలిచి.. కాంట్రాక్టర్‌కు అప్పగించనుంది. అమరావతి–విజయవాడ మధ్య ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఈ సిగ్నేచర్ బ్రిడ్జిని నిరి్మంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం చెబుతోండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతిని కోల్‌కత్–చెన్నై జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16)ను అనుసంధానిస్తూ.. సీడ్ యాక్సిస్ రోడ్డును కనకదుర్గ వారధి వరకూ విస్తరించే పనులు ఇప్పటికే చేపట్టింది. ఇటు ప్రకాశం బ్యారేజీ మీదుగా అమరావతికి రాకపోకలు సాగించడానికి వీలుగా కరకట్ట రోడ్డు(ఈ–1)ను రెండు వరుసల రహదారిగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సిగ్నేచర్ బ్రిడ్జిని నిరి్మంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇంజినీరింగ్ నిపుణులు ప్రశి్నస్తున్నారు. అస్మదీయులకు పనులు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికే సిగ్నేచర్ బ్రిడ్జికి రూపకల్పన చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.అమరావతికి ఎన్‌హెచ్–65తోనూ ఇప్పటికే అనుసంధానం విజయవాడ వెస్ట్రన్ బైపాస్‌ను రాజధాని అమరావతి మీదుగానే ఎన్హెచ్ఏఐ నిర్మించింది. ఈ బైపాస్‌లో అంతర్భాగంగా కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన రెండు రెండు వరుసల బ్రిడ్జిలను నిరి్మంచింది. వెస్ట్రన్ బైపాస్ ద్వారా అటు ఎన్‌హెచ్–16.. ఇటు ఎన్‌హెచ్–65(విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి)కి చేరుకోవచ్చు. ఇక రాజధాని అమరావతిని.. ఎన్‌హెచ్ 65ను అనుసంధానిస్తూ.. రాజధానిలో ఎన్–13 రోడ్డును మూలపాడు వద్ద ఎన్‌హెచ్–65తో కలుపుతూ కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికే ఇప్పటికే రూ.4.81 కోట్లు చెల్లించి నిప్పాన్ కోయి సంస్థ ద్వారా డీపీఆర్‌ను ఏజీఐసీఎల్ తయారు చేయించింది. ఆ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్‌హెచ్–65ను రాజధాని అమరావతితో అనుసంధానిస్తూ కొత్తగా కృష్ణా నదిపై ఎలాంటి బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం లేదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ.. రాజధాని అమరావతిని ఇటు విజయవాడతోనూ అటు ఎన్‌హెచ్–65తోనూ అనుసంధానం చేయడానికి సిగ్నేచర్ బ్రిడ్జి నిరి్మంచడానికి ప్రభుత్వం సిద్ధమవడం గమనార్హం. ప్రకాశం బ్యారేజీ భద్రతకే ముప్పు ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదిపై బ్రిటిషు సర్కార్ హయాంలో నిరి్మంచిన రైల్వే బ్రిడ్జి ఒకటి ఉంది. అది వాడుకలో లేకపోయినా ఆ బ్రిడ్జి స్తంభాలు(పియర్స్) ఇప్పటికీ ఉన్నాయి. రెండు రైల్వే బ్రిడ్జిలను రైల్వే శాఖ నిర్మించింది. వాటికి కొంత దూరంలోనే ఎన్‌హెచ్–16లో అంతర్భాగంగా కృష్ణా నదిపై రెండు రోడ్డు బ్రిడ్జిలను ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిరి్మంచింది. ఈ ఐదు బ్రిడ్జిలు ప్రకాశం బ్యారేజీ దిగువన 1.5 కిమీల దూరంలోనే విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపాదించిన సిగ్నేచర్ బ్రిడ్జి ఆరోది. కృష్ణా నదికి గరిష్ట స్థాయి వరద వచి్చనప్పుడు అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తారు. ఆ వరద ఉద్ధృతికి బ్రిడ్జిల స్తంభాలు అడ్డంకిగా మారుతాయని.. దీని వల్ల ప్రకాశం బ్యారేజీ దిగువన నీటి మట్టం పెరిగి.. వరద వెనక్కి ఎగదన్నే ప్రమాదం ఉంటుందని.. ఇది ప్రకాశం బ్యారేజీ భద్రతకే ముప్పుగా మారుతుందని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక సీఐ నాగరాజు కస్టడీ ముగిసింది. ఏడురోజుల పాటు సీఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుళ్లను ఐదు రోజులపాటు సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ మేరకు ఐదు రోజులపాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది.ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యను సిట్ అధికారులు నేటి నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుళ్లు ప్రస్తుతం వేర్వేరు సబ్ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. -
Vijayawada: నారా లోకేష్ పై దండయాత్ర
-
సాయికృష్ణ కేసు.. సిట్ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ కీలక ప్రకటన చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏ4గా ఉన్న సురేష్ పరారీలో ఉన్నట్లు సిట్ వెల్లడించింది. సురేష్ పరారీలో ఉన్నట్టు ఆచూకీ తెలపాలని సిట్ ప్రకటన విడుదల చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత సెటిల్మెంట్ చేసేందుకు సురేష్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లాకప్ డెత్ కేసులో అరెస్టయిన సీఐ నాగరాజుకు సురేష్ స్నేహితుడు.సిట్ ఎదుట విచారణకు హాజరైన తరువాత కేసు నమోదు కాగానే సురేష్ పరారయ్యాడు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరుగురిపై కేసు నమోదు కాగా.. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ పరారీలో ఉన్నాడని ఇప్పటికే ఏపీ హైకోర్టుకు సిట్ నివేదించింది.కాగా, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజును మూడో రోజు శనివారం సిట్ విచారించింది. సుమారు 8 గంటల పాటు ఈ విచారణ సాగింది. ఆర్ఎంపీతో ట్రీట్మెంట్ చేయించారా? మృతదేహం వివరాలు స్వర్గపురి రికార్డుల్లో రాయకుండా ఎందుకు ఒత్తిడి చేశారు? సాయికృష్ణ తల్లిని బెదిరించారా? నీ కొడుకు చనిపోయాడు.. ఫొటోకు దండవేసుకో.. అని అన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ మాజీ సీఐ నాగరాజు నుంచి మౌనమే సమాధానమైంది. సిట్ అధికారులు ఏ ప్రశ్న అడిగినా నాగరాజు తనకేమీ తెలియదని, సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో నిందితులైన కానిస్టేబుళ్లు, నాగరాజు అనుచరుడు, ఆర్ఎంపీని విచారించి వివరాలు రాబట్టారు. ఆ వివరాల ఆధారంగా నాగరాజును సిట్ ప్రశ్నిస్తోంది. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, మృతదేహాన్ని మాయం చేయడం వంటి అంశాలపై ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రక్తపు మరకలు లేకుండా చేయడంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.సాయికృష్ణను ఎవరి ఆదేశాలతో స్టేషన్‌కు తీసుకు వచ్చారని ప్రశ్నించగా, తనకేమీ సంబంధం లేదని నాగరాజు చెప్పినట్లు తెలిసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. అవేమీ తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా పుటేజీ ఎందుకు డిలీట్ అయిందని ప్రశ్నించగా తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. మరికొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. -
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మహిళ ‘రీల్స్’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మ వారి ఆలయంలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. పెద్ద రాజగోపురం వద్ద రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళ పోస్ట్ చేసింది. సెల్‌ఫోన్‌పై నిషేధం ఉన్నా కొందరు దర్జాగా రీల్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కార్యాలయం ఎదురుగా రీల్స్ చేస్తున్నా గుర్తించకుండా చోద్యం చూస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు.గతంలోనూ కొందరు పలుమార్లు అమ్మవారి మూల విరాట్‌ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వరుస వివాదాలతో దుర్గగుడి ప్రతిష్ట దెబ్బతింటుంది. మహిళ ఇన్ స్టా రీల్‌తో ఆలయ భద్రత లోపం మరోసారి బయటపడింది. -
కృష్ణలంక PSలో సీన్ రీక్రియేషన్
-
సాయికృష్ణ కేసు.. సిట్ కస్టడీకి సీఐ నాగరాజు
సాక్షి, విజయవాడ: సీఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. రాజమండ్రి నుండి విజయవాడకు తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐ నాగరాజును విజయవాడ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించే అవకాశం ఉంది. అనంతరం సీట్ కార్యాలయంలో సీఐ నాగరాజును విచారించేందుకు సిట్ సిద్ధమైంది.కాగా, సాయికృష్ణ లాకప్‌డెత్‌పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్‌స్టేషన్ అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులిచ్చిందో వాటిని తమ ముందుంచాలని కూడా ఆదేశించింది.ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
అంత్యక్రియలు చేశాక మాట మార్చిన పోలీసులు.. నాగ మహేష్ మరణంపై అక్కా.. చెల్లెళ్ల డిమాండ్స్
-
సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. సీబీఐ విచారణ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు వేసిన పిటిషన్లోనే హెబియస్ కార్పస్ అంశం పెట్టారు. సీబీఐ విచారణ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు విజయలక్ష్మితో సంతకం పెట్టించారు అడ్వకేట్.హెబియస్ కార్పస్ పిటిషన్‌పై సాయికృష్ణ పిన్ని కనకదుర్గ.. హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. పిటిషనర్‌కు తెలియకుండా హెబియస్ పిటిషన్ ఏ విధంగా వెనక్కి తీసుకుంటారంటూ అడ్వకేట్ కనకదుర్గ ప్రశ్నించారు. పిటిషనర్‌కు తెలియకుండా సంతకం తీసుకున్నారని కనకదుర్గ.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్‌కు తెలియకుండా హెబియస్ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ ఎలా ఫైల్ చేస్తారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.పిటిషన్ ఫైల్ చేసిన అడ్వకేట్‌కి నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. న్యాయవాది లైసెన్స్ రద్దుకు బార్ కౌన్సిల్‌కు రిఫర్ చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు. విచారణను రేపటి(గురువారం)కి కోర్టు వాయిదా వేసింది. -
ఇంద్రకీలాద్రిపై పండ్లు, కూరగాయలే ఆభరణాలుగా దుర్గమ్మ దర్శనం (ఫొటోలు)
-
ఏం జరిగిందో..? విషం తాగి దంపతుల బలవన్మరణం
విజయవాడ: చూడ ముచ్చటైన జంట.. అనురాగం.. ప్రేమ, ఆప్యాయతలతో సంతోషంగా సాగుతున్న సంసారం.. ఏడేళ్ల ఆ బంధానికి ఇద్దరు మగపిల్లల సంతానం.. అంతా బాగుందని అనుకున్న ఆ చిన్న కుటుంబంలో ఒక్కసారిగా పెను విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో.. ఏమో కానీ భార్యాభర్తలిద్దరూ విషం తాగి మృత్యువు ఒడికి చేరిపోయారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవీనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సోమవారం కలకలం సృష్టించింది. ఏం జరిగిందంటే.. దేవీనగర్ ప్రాంతానికి చెందిన తాడిశెట్టి బాజీ సైదులు(30), జలసూత్రం మానస(27)కు పెద్దల సమక్షంలో 2019లో వివాహమైంది. వీరికి సంజయ్(5), సంతోష్ (ఏడాదిన్నర) కుమారులు ఉన్నారు. సైదులు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మానస ఇంటి వద్దే ఉంటూ టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఆదివారం ఉదయం సైదులు తన పిల్లలిద్దరినీ ఇందిరా నాయక్‌నగర్‌లోని తన సోదరుడు నాగుల్‌మీరా వద్ద దింపి పనులకు వెళ్లగా మానస వారి ఇంటి సమీపంలోని చర్చికి ఉదయం పది గంటలకు వెళ్లి మధ్యాహ్నం రెండు గంటల తిరిగి ఇంటికి వచ్చింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో సైదులు తన మావయ్య వీరభద్రరావుకు ఫోను చేసి దంపతులిద్దరం విషం తాగేశామని.. ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పాడు. దీంతో అతను తన వియ్యంకుడు ఏడుకొండలు, సైదులు సోదరుడు నాగుల్‌మీరాకు ఫోను చేసి హూటాహూటిన వారి ఇంటికి వెళ్లి తలుపులు పగలకొట్టి అపస్మారక స్థితిలో పడి ఉన్న భార్యాభర్తలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న భార్యాభర్తలిద్దరూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందారు. దీంతో వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆన్లైన్లో ఆర్డరు పెట్టుకొని.. సైదులు, మానస ఎంతో అన్యోన్యంగా ఉంటారని, వారికి ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేవని వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలతో మాటామాటా పెరిగి క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆన్లైన్లో గడ్డిమందు, కూల్‌డ్రింక్‌ను ఆర్డర్ పెట్టుకొని డ్రింక్‌లో దానిని కలుపుకొని ఇద్దరూ తాగినట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని అజిత్‌సింగ్‌నగర్ సీఐ దాడి చంద్ర శేఖర్ తెలిపారు. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేడుకగా శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
కనకదుర్గమ్మకు బోనం సమర్పించడం ఆనవాయితీ.. తలసాని
సాక్షి, విజయవాడ: కనకదుర్గమ్మ తల్లి దీవెనలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ రోజు (ఆదివారం) విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ కు బోనం సమర్పించడం17 సంవత్సరాలుగా ఆనవాయితీ వస్తుందని మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆషాడ మాసం అంటే తెలంగాణలో ఒక పండుగ.. రాష్ట్రంలోని ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించే పండుగనే ఆషాడమాస బోనాలు. అమ్మవారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. ఈ ఏడాది రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని అమ్మవారి చల్లని దీవెనలు తెలుగు రాష్ట్రాల పై ఉండాలి... విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
మితిమీరిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఆగడాలు
గాందీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ లెనిన్ సెంటర్లో రైవస్ కాలువ ఒడ్డున గత 30, 40 ఏళ్లుగా దుకాణాలు నడుపుతున్న చిరువ్యాపారుల జోలికి వస్తే సహించేది లేదని వైఎస్సార్ సీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు అధికారపార్టీ నేతలను హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల కన్ను లెనిన్ సెంటర్‌పై పడిందని, ఈ ప్రాంతంపై గద్దల్లా వాలిపోయారని విమర్శించారు. గత ఆరు నెలలుగా మామూళ్ల కోసం వ్యాపారులను వేధిస్తున్నారని మండిపడ్డారు. మామూళ్లు ఇవ్వడానికి నిరాకరించిన చిరువ్యాపారులపై దౌర్జన్యం చేస్తున్నారని, షాపులకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం, షాపులు తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారని దుయ్యబట్టారు.చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసే వారి నుంచి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. లెనిన్ సెంటర్లో అధికారులు కరెంట్ కట్ చేసిన దుకాణాలను శనివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడారు. దుకాణాలకు విద్యుత్ సౌకర్యం కట్ చేసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లెనిన్ సెంటర్ నుంచి ఐఎంఏ హాలు వరకు పాదయాత్ర చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆగడాలు మితిమీరిపోయాయని, ఈ ప్రాంతంలో 290 దుకాణాలు ఉంటే టీడీపీ నేతలు షాపునకు రూ.5 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారని విమర్శించారు. స్కానింగ్ సెంటర్లు, డయాగి్నస్టిక్ సెంటర్లు, హాస్పిటల్స్ చివరికి డాక్టర్ల వద్ద కూడా బొండా అనుచరులు వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చేతిలో టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, పోలీసు శాఖలు కీలు»ొమ్మలుగా మారాయని మండిపడ్డారు. చిరువ్యాపారుల జోలికి వెళితే సహించేది లేదన్నారు. చిరువ్యాపారులకు అండగా వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ : ఆషాఢ సారెతో అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
విజయవాడలో అడ్వకేట్స్ ఆందోళన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
-
బూటు కాళ్లతో తన్ని.. పిడిగుద్దులు గుద్ది..
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండించడంతోపాటు నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు విజయవాడలో చేపట్టిన చలో లోక్‌భవన్ కార్యక్రమం గురువారం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు లోక్‌భవన్‌కు వెళ్లే మార్గాలన్నింటినీ దిగ్బంధించారు. మ్యూజియం రోడ్డు, బందరు రోడ్డులో అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటుచేశారు. పోలీసులు భారీగా మోహరించారు.శాంతియుతంగా ర్యాలీ చేస్తూ లోక్‌భవన్‌కు వెళ్తున్న విద్యార్థులను అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా అన్ని ఆటంకాలను అధిగమించి విద్యార్థులు, యువకులు భారీగా మ్యూజియం రోడ్డు నుంచి బందరు రోడ్డుకు చేరుకోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు. అయినా విద్యార్థులు బారికేడ్లను నెట్టుకుంటూ లోక్‌భవన్‌కు వెళ్లేందుకు బందరు రోడ్డు వెంట పరుగులు తీశారు. దీంతో పోలీసులు వారి వెంటపడ్డారు. ఈ సమయంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.సివిల్ దుస్తుల్లో ఉన్న కొందరు పోలీసులు విద్యార్థులను రోడ్డుపై పడేసి కాలర్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. వారిపై పిడిగుద్దులు కురిపించారు. రోడ్డుకేసి కొడుతూ బూటుకాళ్లతో తన్నారు. విద్యార్థినులు, యువతులపైనా విచక్షణారహితంగా దాడిచేశారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరిద్దరు పోలీసులు విద్యార్థి సంఘాల కండువాలు కప్పుకుని మరీ విద్యార్థులపై దాడికి పాల్పడడం గమనార్హం. ఏఎస్సై రవికుమార్ ఓ విద్యార్థిపై దాడి చేయడంతో మిగిలిన విద్యార్థులు ఆయనను అడ్డుకున్నారు.రోడ్డుపై బైఠాయింపు అనంతరం.. విద్యార్థి సంఘాల ప్రతినిధులను లోక్‌భవన్‌కు తీసుకెళ్తామని, గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసు అధికారులు నమ్మబలికారు. అయితే, అపాయింట్మెంట్ ఇప్పించే వరకు వెనక్కు వెళ్లేది లేదంటూ మ్యూజియం రోడ్డులో విద్యార్థులు భైఠాయించారు. గంట తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదని, వెనక్కు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. లోక్‌భవన్‌కు వెళ్లేందుకు విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు మరోసారి వారిపై దాడి చేశారు. ఈడ్చిపడేస్తూ మ్యూజియం రోడ్డులోకి నెట్టేశారు.పోలీసుల దాడిని విద్యార్థులు ప్రతిఘటించారు. పోలీసుల తీరు, చంద్రబాబు సర్కారు వైఖరిపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్నకుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ తదితరులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా శుక్రవారం జరపతలపెట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
విజయవాడలో హైటెన్షన్.. విద్యార్థులు అరెస్ట్
-
విజయవాడ మీదుగా వందేభారత్ స్లీపర్!
భారతీయ రైల్వే రవాణా వ్యవస్థలో వందేభారత్ రైలు సుదూర రాత్రి ప్రయాణాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు పగటిపూట నడిచే చైర్ కార్ వెర్షన్లతో ఆదరణ పొందిన వందేభారత్ సిరీస్ రైళ్లను అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) పరిధిలో ‘వందేభారత్ స్లీపర్’ పేరుతో కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఎస్సీఆర్ పరిధిలో దీన్ని ముందుగా విజయవాడ డివిజన్లో ప్రారంభించేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది. రాబోయే దసరా పండుగ నాటికి విజయవాడ మీదుగా ఈ అత్యాధునిక స్లీపర్ సర్వీసును పట్టాలెక్కించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ మీదుగా బెంగళూరు మార్గంలో ఈ రైలును నడిపే ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు సమాచారం. దేశంలో మొదటి వందేభారత్ స్లీపర్ ఈ ఏడాది జనవరిలోనే హౌరా-కామాఖ్య మధ్య ప్రారంభమైంది. సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో మాత్రం ఇంకా ప్రారంభంకాలేదు.విమాన తరహా ప్రయాణ అనుభూతివందేభారత్ స్లీపర్ రైళ్లను విమాన ప్రయాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతికత, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో డిజైన్ చేశారు. మొత్తం 16 ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లతో రూపొందించిన ఈ రైలులో 1 ఫస్ట్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ బోగీలు ఉంటాయి. ఒకేసారి సుమారు 823 మంది ప్రయాణించేలా సీటింగ్/బెర్త్ అమరిక ఉంది. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల డిజైన్ వేగం ఉన్నప్పటికీ ప్రస్తుత ట్రాక్ సామర్థ్యానికి అనుగుణంగా 160 కి.మీ/గం ఆపరేషనల్ వేగంతో ప్రయాణిస్తుంది. సెల్ఫ్-ప్రొపెల్డ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) సాంకేతికత వల్ల వేగవంతమైన ఆక్సిలరేషన్ సాధ్యమవుతుంది.ప్రత్యేకంగా రూపొందించిన కుషన్ బెర్త్‌లు, శబ్ద కాలుష్యం లేకుండా ఉండే సౌండ్ ప్రూఫ్ క్యాబిన్లు, సాఫ్ట్ ఎల్ఈడీ లైటింగ్, ప్రతి బెర్త్ వద్ద ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లు, వైఫై కనెక్టివిటీ, ఆటోమేటిక్ సెన్సార్ డోర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పూర్తిస్థాయి స్వదేశీ ప్రమాద నిరోధక వ్యవస్థ ‘కవచ్’, నిరంతర సీసీటీవీ నిఘా, ఏఐ ఆధారిత కోచ్ కండిషన్ మానిటరింగ్ సిస్టమ్, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడే టాక్-బ్యాక్ బటన్లు అందుబాటులో ఉంటాయి. పరిశుభ్రత కోసం బయో వాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ వాటర్ ట్యాప్‌లు అమర్చారు.రవాణా రంగంలో సరికొత్త అధ్యాయంసాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా ప్యాసింజర్ సేఫ్టీకి ఇవి ప్రాధాన్యత ఇస్తాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వ్యాపార, ఐటీ, రవాణా అవసరాలకు విజయవాడ కీలక కేంద్రంగా ఉన్నందున ఈ స్లీపర్ వందేభారత్ అందుబాటులోకి రావడం ఇక్కడి ప్రయాణికులకు ఊరటనివ్వనుంది. త్వరలోనే అధికారిక టైమ్‌టేబుల్, ప్రారంభ తేదీ వివరాలను రైల్వే బోర్డు ప్రకటించనుంది.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
విజయవాడలో ఉద్రిక్తత..
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలు లోక్‌భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. దీంతో, పోలీసులు.. విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
విజయవాడలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల కొట్లాట
సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ కౌంటర్ ఆందోళన చేపట్టింది. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాల కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విజయవాడలో మ్యూజియం రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు "డౌన్ డౌన్ రాహుల్ గాంధీ", "డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ" అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తోందని వారు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఒకేచోట చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.అనంతరం, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ..‘మోదీ ఇంటి ముట్టడి వెనుక అసలు శక్తులు బయటపడ్డాయి. దాడి వెనుక కాంగ్రెస్ అగ్రనేతల హస్తం ఉంది. జంతర్ మంతర్ నిరసనలకు కాంగ్రెసే సూత్రధారి. సోనమ్ వాంగ్చుక్ను వెనుక ఉండి నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీనే. నిరసనల్లో ఒక్క నీట్ విద్యార్థి కూడా లేరు, కేవలం లెఫ్ట్ యూనియన్ నాయకులే ఉన్నారు. నిరసనల్లో అర్బన్ నక్సల్స్, 370 రద్దును వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి. నీట్ లీకేజీకి సంబంధించి 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు. నేపాల్, బంగ్లాదేశ్ తరహా అలజడులు సృష్టిస్తే ఉపేక్షించం. విద్యార్థులకు భరోసా, నిజమైన నీట్ బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
సాయి కృష్ణ తల్లి కేసును వెనక్కి తీసుకుందంటే... పొన్నవోలు షాకింగ్ నిజాలు
-
సాయికృష్ణ కేసులో సంచలన పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, అసిస్టెంట్ కమిషనర్ మానసను నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది. జూలై 21న విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున పొన్నవోలు ఫిర్యాదు చేశారు.డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను ఏ–1గా పేర్కొన్న పిటిషనర్.. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబును ఏ–2గా, విజయవాడ సౌత్‌జోన్ ఏసీపీ ఎం.మానసను ఏ–3గా చేర్చారు. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అదృశ్యం, మరణం వరకు ఉన్నతాధికారులకు సమాచారం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. విజయవాడ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందమే మే 6న మార్కాపురంలో సాయి కృష్ణను అదుపులోకి తీసుకుందని పిటిషన్లో ప్రస్తావించారు.టాస్క్‌ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధీనంలో పనిచేస్తున్నందున కమిషనర్‌కు అరెస్టు విషయం తెలియదనడం సాధ్యం కాదని వాదన. సాయికృష్ణను మే 6న అదుపులోకి తీసుకుని మే 9 వరకు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్లు సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. జూన్ 15న హైకోర్టుకు మాత్రం సాయి కృష్ణ ఆచూకీ తెలియదని అధికారులు చెప్పారని పిటిషన్లో పేర్కొన్నారు.హైకోర్టుకు ఇచ్చిన సమాచారం, సీఐ రిమాండ్ రిపోర్టులోని వివరాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ వాదన. మే 28నే సాయికృష్ణ అక్రమ నిర్బంధం, ప్రాణహాని అనుమానాలపై డీజీపీ, కమిషనర్‌కు ఈ–మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పిటిషనర్ తెలిపారు. సమాచారం అందినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, సాయి కృష్ణను రక్షించేందుకు చర్యలు తీసుకోలేదని.. ఉన్నతాధికారుల ఉద్దేశపూర్వక మౌనం వల్ల సాక్ష్యాలను మాయం చేసేందుకు, నిందితులను కాపాడేందుకు అవకాశం కలిగిందని పిటిషన్లో ఆరోపించారు.పోలీస్‌స్టేషన్ సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ల మార్పు, ఫుటేజీ మాయం అంశాలపైనా పిటిషన్లో ప్రస్తావించారు. సాయి కృష్ణ మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడం, సెల్‌ఫోన్‌తో నకిలీ ఆధారాలు సృష్టించడం సంస్థాగత కుట్రలో భాగమని పిటిషనర్ పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ నివేదికలు, డైలీ స్టేటస్ రిపోర్టులు, అధికారుల రోజువారీ సమావేశాల ద్వారా అక్రమ నిర్బంధ సమాచారం ఉన్నతాధికారులకు చేరుతుందని పిటిషన్లో వాదన. ఇది కేవలం కిందిస్థాయి పోలీసుల చర్య కాదని, ఉన్నతస్థాయి కుట్ర–కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు.సిట్ దర్యాప్తు కిందిస్థాయి పోలీసులకే పరిమితమైందని, ఉన్నతాధికారుల పాత్రను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని పేర్కొన్న పిటిషనర్.. డీజీపీ, కమిషనర్, ఏసీపీపై హత్య, నేరపూరిత కుట్ర, అక్రమ నిర్బంధం, అధికార దుర్వినియోగం, సాక్ష్యాల మాయం అభియోగాలు ఉన్నాయన్నారు. బీఎన్ఎస్ సెక్షన్లు 61, 49, 103, 127(3), 198, 238తో పాటు సెక్షన్ 3(5) కింద చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తించే క్రమంలో చేసిన చర్యలు కావని, అందువల్ల విచారణకు ముందస్తు అనుమతి అవసరం లేదని పిటిషనర్ వాదన. పోలీస్ కస్టడీలో కొట్టడం, అక్రమంగా నిర్బంధించడం అధికారిక విధుల్లో భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పులను పిటిషన్లో ఫిర్యాదుదారు ఉదహరించారు.ప్రస్తుతం జరుగుతున్న సిట్ దర్యాప్తుతోపాటు ప్రైవేట్ ఫిర్యాదును కలిపి విచారించేందుకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 233ను అమలు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాయి కృష్ణ కేసులో డీజీపీ నుంచి కిందిస్థాయి పోలీసుల వరకు మొత్తం పాత్రను వెలికితీయాలని పిటిషన్ వేశారు. ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కాదు అనే సూత్రాన్ని అమలు చేయాలని ఫిర్యాదుదారు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదును విచారణకు స్వీకరించి డీజీపీ, కమిషనర్, ఏసీపీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టును తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. -
ఏపీలో వీసా స్కామ్.. రోడ్డున పడ్డ 700మంది బాధితులు
సాక్షి,కృష్ణ: ఇటీవల నందూస్ వరల్డ్ వీసా స్కామ్ మరువక ముందే తాజాగా మరో వీసా స్కామ్ వెలుగులోకి వచ్చింది. యూకేలో ఉద్యోగాలు, స్పాన్సర్షిప్ వీసాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ‘ఫ్లైయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ’మోసం తాజాగా విజయవాడలో బయటపడింది. సుమారు 700 మంది బాధితుల నుండి ఈ సంస్థ భారీగా డబ్బులు వసూలు చేసి ముంచేసిందని బాధితులు లబోదిబోమంటున్నారు.ఓ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ప్రకటనలు, ప్రమోషనల్ వీడియోలను నమ్మి తాము హైదరాబాద్ బేగంపేట, విజయవాడ పరిసరాల్లో ఉన్న ఫ్లైయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీని సంప్రదించామని బాధితులు తెలిపారు. ఈ సంస్థ నిర్వాహకులు సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్ తమను నమ్మించారని పేర్కొన్నారు.యూకేలో స్కిల్డ్ వర్క్ వీసాపై ఉద్యోగం ఇప్పిస్తామని, కుటుంబ సభ్యులను కూడా డిపెండెంట్లుగా తీసుకెళ్లొచ్చని నమ్మబలికారు. అక్కడ ఉద్యోగం, వసతితో పాటు పోస్ట్ ల్యాండింగ్ సపోర్ట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం ప్రక్రియకు రూ.12 లక్షలు ఖర్చవుతుందని, ముందుగా రూ.6 లక్షలు, యూకే వెళ్లిన తర్వాత మిగిలిన రూ.6 లక్షలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. వీరి మాటలు నమ్మి చాలామంది అప్పులు చేసి రూ.3 లక్షల నుండి రూ.12 లక్షల వరకూ చెల్లించారు. రిక్రూట్మెంట్ లైసెన్స్ లేకుండానే వీరు ఈ కన్సల్టెన్సీని నడుపుతున్నట్లు బాధితులు గుర్తించారు.డబ్బులు కట్టించుకున్న తర్వాతే వీరు అగ్రిమెంట్లు చూపించారని, అందులో ఉద్యోగ హామీ గురించి స్పష్టంగా లేదని బాధితులు వాపోయారు. మౌఖికంగా మాత్రం 100శాతం జాబ్ వస్తుందని నమ్మించారు. తీరా డబ్బులు కట్టాక వీసాలు రాకపోవడంతో నిలదీస్తే బాధితుల ఫోన్ నెంబర్లను బ్లాక్ చేశారు. లక్ష రూపాయలు మాత్రమే తిరిగి ఇస్తామని తేల్చి చెప్పారు.న్యాయం కోసం హైదరాబాద్ బేగంపేటలోని కార్యాలయానికి వెళ్లి వివరణ కోరగా.. నిర్వాహకులు బాధితులపైనే ఉల్టా న్యూసెన్స్ కేసులు పెట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా బాధితులపై సివిల్ సూట్లు దాఖలు చేసి, డబ్బులు అడిగితే రాజకీయ నాయకుల పేర్లు చెప్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు.తమను నిలువునా ముంచిన ఫ్లైయింగ్ బోర్డర్స్ సంస్థ యజమాని సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని, వారి బ్యాంక్ ఖాతాలను తక్షణమే సీజ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమడబ్బును తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. -
టీచర్‌ను హోటల్‌కు తీసుకెళ్లిన జిమ్ ట్రైనర్.. ఆపై నిజస్వరూపం..
విజయవాడ: ఓ యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి, నగ్న ఫొటోలు తీసినట్లు బాధిత యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌పై కేసు నమోదు చేసిన సత్య నారాయణపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బాధిత యువతి ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పని చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పరిచయమయ్యాడు. లావుగా ఉన్న టీచర్ స్లిమ్‌గా అయ్యేందుకు జిమ్ సలహాలు ఇస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ప్రైవేట్ హోటల్‌కు తీసుకువెళ్లి బరువు తగ్గడానికి షేక్ తాగాలంటూ అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడని ఆ టీచర్ తెలిపింది. మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడని పోలీసులను ఆశ్రయించిన యువతి. కేసు నమోదు చేసి యువతిని పోలీసులు వైద్య పరీక్షల కోసం తరలించారు. జిమ్ ట్రైనర్ ఖాదర్ పరారీలో ఉన్నాడు. -
విజయవాడ : ఆషాఢ వైభవం..‘ఇంద్ర’ వైభోగం (ఫొటోలు)
-
హైదరాబాద్–విజయవాడ ఇక నాన్‌స్టాప్!
సాక్షి, హైదరాబాద్: విజయవాడకు వెళ్లే ప్రైవేటు బస్సు ఎక్కి తే, ఎల్బీనగర్ దాటిన తర్వాత మధ్యలో రాత్రి భోజనానికో, టీ తాగేందుకో తప్ప మరెక్కడా ఆగకుండా నేరుగా విజయ వాడకు చేరుకుంటుంది. అదే, ఆర్టీసీ బస్సులో ఎక్కితే భోజన, టీ విరామాలతోపాటు అదనంగా కోదాడ, సూర్యా పేట బస్టాండ్లలో ఆగుతుంది. ఇది ఆక్యుపెన్సీ రేషియోపై ప్రభావం చూపుతున్నట్లు తాజాగా ఆర్టీసీ గుర్తించింది. వేగంగా విజయవాడకు చేరుకోవాలనుకునే చాలామంది, ఈ ఒక్క కారణంతో ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నట్లు తే లింది. ఇప్పుడు గరుడ, రాజధాని సహా ప్రీమియం కేటగిరీ సర్వీసులకు, ఆ హాల్టులను తప్పించి నేరుగా విజయవాడకు నాన్‌స్టాప్ సర్వీసులుగా నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. అవసరమైతే ఆ రెండు ప్రాంతాలకు మరిన్ని సర్వీసులు తిప్పాలని యోచిస్తోంది.‘బెంగళూరు ప్రయోగం’ సక్సెస్‌తో...ప్రతినెలా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఆర్టీసీ బస్సుల్లో సగటున 1.30 లక్షల మంది ప్రయాణిస్తుండగా, 90 వేల మంది మాత్రమే తిరిగి ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు. మిగతావారు ఎందుకు రావటం లేదో తెలుసుకునేందుకు ఇటీవల ఆర్టీసీ ఓ బృందాన్ని బెంగళూరుకు పంపింది. బెంగళూరు నుంచి వచ్చే క్రమంలో ప్రైవేటు బస్సులు 20 చోట్ల ఆగుతున్నాయని, ఆర్టీసీ బస్సులు కేవలం నాలుగు చోట్లే నిలుపుతున్నాయని, దీంతో చాలామంది తమకు అనుకూలమైన ప్రాంతంలోని హాల్టుల వద్దకు వెళ్లి ప్రైవేటు బస్సులు ఎక్కుతు న్నారని ఆ బృందం గుర్తించింది. వెంటనే, ఆర్టీసీ కూడా 20 ప్రాంతాల్లో హాల్టింగ్ సదుపాయం కల్పించింది. దీంతో 20 రోజుల్లో, రోజుకు 8 శాతం వరకు ఆక్యు పెన్సీ రేషియో పెరిగి రోజుకు రూ.80 వేల ఆదాయం అదనంగా సమకూరటం మొదలైంది. ఈ సక్సెస్‌తో తాజాగా, మరో బృందాన్ని విజయవాడ, గుంటూరు సెక్టార్లో అధ్యయనానికి ఆర్టీసీ పంపింది. ఇందులో భాగంగా, హైదరాబాద్–విజయవాడ మధ్య నాన్‌స్టాప్ సర్వీసులు కావాలన్న డిమాండ్ ఆ బృందం దృష్టికి వచ్చింది. గతంలో గరుడ బస్సులకు ఈ స్టాపులు ఉండేవి కాదు. కానీ, ఆక్యుపెన్సీ రేషియో పేరుతో వాటిని కూడా నాన్‌స్టాప్ కోటా నుంచి తొలగించి కోదాడ, సూర్యాపేట బస్టాండ్లలోకి వెళ్లేలా మార్చారు. దీనివల్ల దాదాపు అరగంట నుంచి 40 నిమిషాల సమయం వృథా అవుతోంది. ఫలితంగా ఆర్టీసీ ప్రయాణికుల్లో 10 శాతం మంది ప్రైవేటుకు మళ్లారని భావిస్తున్నారు. విజయవాడలో కూడా వేర్వేరు స్టాపులు...హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులు నేరుగా పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోకి వెళ్లి నిలిచిపోతాయి. కానీ, అదే హైదరాబాద్‌లో ఏపీ బస్సులు ఎంజీబీఎస్కే పరిమితం కాకుండా, అమీర్‌పేట, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, లింగంపల్లి, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ సహా చాలా ప్రాంతాలకు వెళ్లి ఆగుతాయి. ఇప్పుడు ఇదే తరహాలో విజయవాడలో కూడా బెంజ్ సర్కిల్, ఆటోనగర్, పోరంకి, గాంధీనగర్, సత్యనారాయణపురం... ఇలాంటి ప్రధాన ప్రాంతాలకు వెళ్లేలా బస్సు రూట్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. గుంటూరులో కూడా ఇదే తరహా ఏర్పాటు చేయనున్నారు. -
విజయవాడలో మళ్లీ ‘కాల్ మనీ’ కలకలం
సాక్షి, విజయవాడ: నగరంలో మరోసారి కాల్ మనీ వ్యాపారులు రెచ్చిపోయారు. కాల్ మనీ వ్యాపారీ ద్వారా మోసపోయానంటూ న్యాయం కోసం బాధితుడు రోడ్డెక్కాడు. 96 లక్షల అప్పుకు కోటి 96 లక్షలు కట్టానని బాధితుడు మోతే గోపరాజు చెబుతున్నాడు. కోటి 96 లక్షలు వడ్డీకే సరిపోయాయని.. 96 లక్షలు కట్టాలంటూ బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘లక్షకు రోజుకు 500 వడ్డీతో 96 లక్షలు అప్పు తీసుకున్నాను.. 96 లక్షలకు గాను కోటి 96లక్షలు ఇప్పటివరకు కట్టాను.. ఏప్రిల్ 11వ తేదీన కొంతమంది కుర్రవాళ్లతో బెదిరించారు. నా భార్యతో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్స్‌పై సంతకాలు తీసుకున్నారు. ఇంకా డబ్బులు కట్టకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అధికార పార్టీకి చెందిన నేతలు తన వెనుక ఉన్నారని బెదిరించడం ప్రారంభించారు...మే నెలలో పెనమలూరు స్టేషన్లో నాపై సుంకరసాయి అనే వ్యక్తి కేసు పెట్టారు. 6 సార్లు పెనమలూరు స్టేషన్‌కి వెళ్లి వివరాలు అన్ని ఇచ్చాను. పోలీస్ స్టేషన్లో పోలీసులు నన్నే బెదిరించారు. కోటి 96 లక్షలు వడ్డీకే సరిపోయాయి. 96 లక్షలు కట్టాలని పోలీసులు బెదిరించారు. చంద్రబాబుకు, డీజీపీకి లేఖ రాశాను. కాల్ మనీ వ్యాపారుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలి’’ అని బాధితుడు కోరుతున్నారు. -
క్రాంతికుమార్ కుటుంబానికి అండగా వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక కాంత్రికుమార్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జూలై 2న క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.క్రాంతి కుమార్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ మేరకు 10 లక్షల రూపాయల చెక్‌ను కాంత్రికుమార్ కుటుంబసభ్యులకు వైఎస్సార్సీపీ నేతలు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోన్రావు, మాజీ ఎంపీ నందిగామ సురేష్.. క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి చెక్ అందించారు.చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేదు?: టీజేఆర్ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తన మానవతా హృదయం చూపించారు. పేరుపొగు కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇది సామాజిక బాధ్యత. క్రాంతి కుమార్‌ని గంజాయి, డ్రగ్స్ అమ్మాలని, మర్డర్ చేయాలంటూ సీఐ వేధించాడు. క్రాంతి కుమార్ ఆవేశ పూరిత నిర్ణయంతో ముగ్గురు రోడ్డు మీద పడ్డారు. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి ఎందుకు చంద్రబాబు న్యాయం చేయలేదు?..వైఎస్ జగన్.. క్రాంతి కుమార్ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చారు. పేరూపొగు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించిన తర్వాత ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారు. రాజ్యాగం ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. దళితులను ఉచకోత కొస్తున్నారు. చంద్రబాబు దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకొంటారంటూ అన్నాడు.’’ అని టీజేఆర్ గుర్తు చేశారు.రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఇలాగే..: మొండితోక జగన్మోహన్రావుమొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రాజకీయ కోణంలో కాకుండా మానవత కోణంలో సాయం చేశారు.. ప్రభుత్వం తుతూ మంత్రంగా వ్యవహరించింది. సాయికృష్ణ బూడిద కూడా ఇవ్వని పరిస్థితి. గుంటూరులో మహిళను వివస్త్రని చేస్తే ముడు రోజుల వరకు బయటకు రాలేదు. హోమంత్రి ఏం చేస్తున్నారు? ఐటీడీపిలో పని చేసిన వ్యక్తి మంచోడు మణిరత్నంపై కూడా దాడి చేసి కొట్టారు. నందిగామలో టీడీపీ నేత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోయడు. పాము తన పిల్లలను తినేటట్లు టీడీపీ నేతలు తమ కార్యకర్తలనుని వదలడం లేదు. శాంతిభద్రతాలను కాపాడాల్సిన ప్రభుత్వం దాడులకు దిగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలాగే జరుగుతుంది.ఆర్థిక సాయమే కాదు.. ఆరోగ్య భరోసా కూడా: నందిగామ సురేష్ మాజీ ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ.. ఆర్థిక సహాయమే కాదు.. ఆరోగ్య భరోసా కూడా అందించాం. హోం మంత్రి కనీసం కుటుంబాన్ని పరామర్శించలేదు. చంద్రబాబు మొదటి నుండి దళితులను చిన్న చూపు చూస్తాడు. లోకేష్ పెత్తనం తీసుకొన్న తర్వాత మరింత విచ్చలవిడిగా దారుణాలు పెరిగాయి. రాష్టాన్ని దోచుకొని విదేశాల్లో దాచుకొంటున్నారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ అంశాల్లో వైఎస్ జగన్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం స్వందించింది..దళితులంటే చంద్రబాబుకి చిన్న చూపు: దేవినేని అవినాష్10 లక్షలు ఇచ్చి.. క్రాంతి కుమార్ కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న క్రాంతి కుమార్ చిన్న కుమారుడికి విజయవాడలో టెస్ట్‌లు చేసి హైదరాబాద్ పంపుతున్నారు. ఏ కష్టం వొచ్చిన నేనున్నాను అని చెప్పే వ్యక్తి జగన్. దళితులు అంటే చంద్రబాబుకి చిన్న చూపు. కూటమి ప్రభుత్వం నిజ స్వరూపం ప్రజలు తెలుసుకొంటున్నారు. పరిపాలన ఎలా చేయాలో జగన్‌ని చూసి నేర్చుకోవాలి.వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు: క్రాంతి కుమార్ తండ్రి క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. క్రాంతి కుమార్ విషయంలో వైస్సార్‌సీసీ సత్వరమే స్పందించింది. వైఎస్ జగన్ ఇంటికి వచ్చి భరోసా ఇచ్చారు. 10 లక్షలు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చారు. వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. -
దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. ఆ ప్రకటనలు నమ్మకండి
సాక్షి, విజయవాడ: దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉచితసేవలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆర్జిత సేవలు గురించి దేవస్థానం జారీ చేసే అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించాలని దేవాదాయ శాఖ అధికారులు ఈ రోజు (శనివారం) ప్రకటన విడుదల చేశారు. స్వామివారి దర్శనములు, సేవలు, ఉత్సవాలు, ఊరేగింపులు గురించి సోషల్ మీడియా గానీ ఇతరప్రసార మాధ్యమాలలో లేదా వ్యక్తుల వ్యక్తిగత ప్రకటనలు /ప్రచారాలు ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం చేయిస్తామని, సారె సమర్పించడానికి ఏర్పాటు చేస్తామని, అమ్మవారి దగ్గర సేవ చేయడానికి అవకాశం ఇప్పిస్తామని, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎవరైనా చెబితే వాటిని అస్సలు ఆ మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. దేవస్థానంలో సేవలు పొందడానికి, ఏదైనా విరాళాలు చెల్లింపు, భక్తులు ఉచిత సేవలు అందించడానికి మధ్యవర్తుల ప్రమేయం లేదని ఆలయ ఈవో స్పష్టం చేశారు. ఆలయ సేవలకు సంబంధించి ఏదైనా వివరాలకు భక్తులు దేవస్థానం కార్యాలయం పని వేళల్లో సంప్రదించాలని తెలిపారు. దేవస్థానం వెబ్ సైట్ : www.kanakadurgamma.org, దేవస్థానం టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ :18004259099పై సంప్రదించాలని దేవస్థానం ఈవో వికె శీనా నాయక్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. -
విజయవాడలో డయేరియా డేంజర్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని గిరిపురంపై డయేరియా పంజా విసిరింది. రెండు వీధులకు చెందిన దాదాపు 20 మంది వరకూ డయేరియా బారిన పడ్డారు. పది రోజులుగా కుళాయిల నుంచి కలుషిత, రంగుమారిన నీరు వస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బాధితులు పెద్ద ఎత్తున ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గురువారం రాత్రి ఒకేసారి ఏకంగా ఐదుగురు డయేరియా బాధితులను గుర్తించడంతో అధికారులు హడావుడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారికి విరోచనాలు కావడంతో తొలుత యూపీహెచ్‌సీలో చికిత్స అందించి అనంతరం పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డయేరియాకు గురైన సుబ్బలక్ష్మికి డీహైడ్రేషన్‌తో అనూహ్యంగా క్రియాటినిన్ పెరగడంతో కిడ్నీ వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితి తలెత్తింది. పచ్చ రంగులో నీళ్లు: స్థానికులు అత్యధికంగా నగర పాలక సంస్థ సరఫరా చేసే మంచినీటినే తాగుతుంటారు. వారం రోజులుగా కుళాయిల నుంచి రంగు మారి పచ్చ రంగులో నీళ్లు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో డ్రైయిన్లు అపరిశుభ్రంగా మారినా వీఎంసీ అధికారుల్లో చలనం లేదు. దీంతో ఒక్కొక్కరుగా డయేరియా బారిన పడుతూ వచ్చారు. కలుషిత నీరే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఎవరూ పట్టించుకోలేదు.. మంచినీటి పైపుల నుంచి రంగు మారిన నీళ్లు వస్తున్నాయి. వాటిని తాగడంతో వాంతులు, విరోచనాలు అయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందా. ఇంకా నీరసం తగ్గలేదు. రంగునీళ్లు వస్తున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. – నన్నిపోగు మణి, బొడ్డు సుందరం వీధి, గిరిపురంకిడ్నీలపై ఎఫెక్ట్.. వారం రోజుల కిందట ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు ప్రారంభం అయ్యాయి. ఒక్కసారిగా నీరసించి పడిపోవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షిస్తే క్రియాటినిన్ 15.9కి చేరింది. కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యేవని చెప్పారు. వీఎంసీ సరఫరా చేసే నీళ్లు తాగడం వల్లే ఇలా జరిగింది. – జి.సుబ్బలక్ష్మి, గిరిపురం జీజీహెచ్‌లో చేరా.. నాకు వాంతులు, విరోచనాలు కావడంతో నీరసించిపోయా. ప్రభుత్వాస్పత్రిలో నాలుగు రోజుల చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జి అయ్యా. వీఎంసీ సరఫరా చేసే రంగు మారిన నీళ్లు తాగడం వల్లే ఇలా జరిగింది. – పి.ఉదయ్‌కుమార్, గిరిపురం -
విశ్వసనీయత లేని బాబు మాటలు
-
గాదె సాయికృష్ణ పిన్ని కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘విజయలక్ష్మి తప్పుకున్నా.. మేం పోరాటం చేస్తాం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిపై ఒత్తిళ్లు ఉన్నాయి. అందుకే ఆమె మానవ హక్కుల కమిటీ సాయం వద్దంది. కేసు నుంచి ఆమె తప్పుకున్నా.. నేను పోరాడుతా’’ అంటూ కనకదుర్గ స్పష్టం చేశారు.మేము సామాన్యులం.. ఏం చెప్పమంటే అది చెప్పిస్తున్నారు. నాక్కూడా చెప్పకుండా ఆమె కోర్టుకు వచ్చారు. ఒత్తిళ్ల వల్ల అడ్వకేట్స్ను మార్చుకుంది. సాయి కృష్ణ తల్లిని కోర్టుకు తీసుకుని రావడానికి కూడా హైడ్రామా నడిపించారు. హైడ్రామా ఎవ్వరు నడిపించారూ ఆమె వెనుక ఎవ్వరు ఉన్నారో మాకు తెలియడం లేదు. సాయికృష్ణ తల్లి వెనకడుగు వేసిన మా లీగల్ బ్యాటిల్ కొనసాగుతుంది. మా అక్క విజయలక్ష్మీ పోరాటం చేయకపోయినా..నేను పిన్నిగా సాయికృష్ణ కోసం మానవ హక్కుల కమిటీ తరపున పోరాటం చేస్తాం’’ అని కనకదుర్గ తెలిపారు. -
పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు?: హైకోర్టు
విజయవాడ: సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీబీఐ విచారణ కోరుతూ గత నెల 26వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష్మి. అయితే, నిన్న అనూహ్యంగా సీబీఐ విచారణ విచారణ కోసం వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష్మి. దీంతో పిటిషన్‌ను ఎందుకు విత్ డ్రా చేసుకుంటున్నారో పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టుకు ఆదేశించింది.మొదట సీబీఐ విచారణ ఎందుకు కోరారు? మళ్లీ వద్దని ఎందుకు కోరుతున్నారో చెప్పాలని ఏపీ హై కోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషనర్ పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. -
చంద్రన్న బోడిగుండు పథకం!
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ ఉద్యోగుల కోసం చంద్రన్న బోడిగుండు పథకాన్ని అమలు చేస్తున్నారు’ అని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కే వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారికి రెగ్యులర్‌గా రావాల్సిన డీఏలు, ఐఆర్, పీఆర్సీ వంటివి కూడా ఇవ్వకుండా ఉద్యోగులు అందరికీ నున్నగా క్షవరం చేసే కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు బోడిగుండు పథకం అమలు చేస్తున్నారంటూ వెంకట్రామిరెడ్డి సహా మరో ఇద్దరు నేతలు అందరిముందర గుండ్లు చేయించుకున్నారు. ఉద్యోగులు కోల్పోయింది రూ. 37 వేల కోట్లకు పైమాటే..ప్రతినెలా ఉద్యోగులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్న క్షవరం విలువ అక్షరాలా రూ.1500 కోట్లని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో ఉద్యోగులకు చేసిన మొత్తం క్షవరం విలువ సుమారు రూ.37 వేల కోట్లని చెప్పారు. ఇవి తాను ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం చెప్పడంలేదని, పూర్తి లెక్కలు ఇస్తున్నానని చెప్పి ఆ వివరాలు విడుదల చేశారు. ఈ రూ.37 వేల కోట్లు కేవలం కూటమి రెండు సంవత్సరాల పాలనకు సంబంధించిన బకాయిలు, ఎగవేతలు మాత్రమేనన్నారు. ఉద్యోగులను ఈ స్థాయిలో ముంచిన ఘనత గతంలో ఎవరికీ లేదన్నారు. అమరావతికి సోకులు.. తుగ్లక్ పాలనకు నిదర్శనం..ఉద్యోగులకు రూ.37 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా అమరావతిలోని భవనాల సోకులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుడుతున్నారని తెలిపారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల ముందు పక్క బిగించే అద్దాల కోసం రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోందని, చదరపు అడుగుకు అద్దాల కోసం రూ.5 వేలు ఖర్చు పెడుతోందన్నారు. ఈ భవనాల నిర్మాణం సోకులు, అన్నీ కలిపి చదరపు అడుగుకి రూ.20 వేల ఖర్చు పెడుతున్నారని తెలిపారు. ఒక పక్క ఉద్యోగులకు వేల కోట్ల రూపాయిలు బకాయిలు పెట్టి, అమరావతిలో సోకులకు రూ.వేల కోట్లు ఖర్చు బెట్టడం తుగ్లక్ పాలన కాదా అని ప్రశ్నించారు. ఆర్థికేతర అంశాల్లో ప్రభుత్వం ఉద్యోగులపై సానుకూలంగా లేదన్నారు. ఆత్మహత్యలే మేలనుకుంటున్నారు..ప్రభుత్వం పెట్టే టార్చర్ భరించలేక గత జూన్ నెలలో 10 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు, గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. మరో ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేయలేమంటూ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వారు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు.ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి రాజరికపు కాలం నాటి బానిసల కంటే హీనంగా ఉందని, వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేవని అయినా అడిగే దిక్కు లేదన్నారు. గత ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు పెట్టి ఉద్యోగుల సమస్యలు వినేదని, ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు వినే వారు కూడా లేరన్నారు. ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు సరిగా స్పందించడం లేదన్నారు. -
జీతాలు ఇప్పించండి బాబూ!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ‘రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా సరిగా కల్పించడం లేదు. కనీస వేతనాలు ఇవ్వడం లేదు. కుటుంబాలను ఎలా పోషించాలి?’ అంటూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. కొత్త ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహించే సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కష్టాలను ఏకరవు పెట్టారు.వార్డుల్లో అన్ని పనులు తామే చేయాలని, తమకు సంబంధంలేని పనులూ చేయిస్తున్నారని ఆరోపించారు. జీతాలు సైతం సక్రమంగా ఇవ్వడంలేదని, రెండు నెలలుగా పెండింగ్‌లో ఉంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని మండిపడ్డారు. ప్రభుత్వం చొరవ చూపి న్యాయం చేయాలన్నారు. అనంతరం కార్మికులను పోలీసులు కలెక్టరేట్‌లోకి అనుమతించగా, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు అందించారు.అన్ని పనులూ చేయిస్తున్నారు అన్ని పనులూ చేయిస్తున్నారు. సంబంధం లేని పనులు చేయడంతో పని ఒత్తిడి పెరుగుతుంది. భోజనం కూడా చేయనీయడం లేదు. సంబంధం లేకున్నా బెడ్షీట్లు మార్పిస్తున్నారు. రోగులు బెడ్‌పై విరోచనానికి వెళ్తే ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు చేయాల్సిన పనులు కూడా మాతోనే చేయిస్తున్నారు. – మణి, పారిశుద్ధ్య కార్మికురాలుసక్రమంగా జీతాలు చెల్లించాలిజీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. రెండు, మూడు నెలలకు ఒకసారి ఇస్తే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. ప్రతిసారి జీతాల కోసం నిరసన చేయాల్సిన దుస్థితి నెలకొంది. కనీస వేతనం అమలు చేయడం లేదు. పీఎఫ్, ఈఎస్ఐ కూడా సక్రమంగా చెల్లించడం లేదు. – అఖిల, పారిశుద్ధ్య కార్మికురాలు -
పెండింగ్ జీతాల కోసం పారిశుద్ధ్య కార్మికులు ధర్నా
-
సాయి కృష్ణ కేసుకు బ్రేకులు
-
ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నిరసన మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే అసంతృప్తితో.. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. సోమవారం నగరంలో ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.రెండేళ్లు దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఫెడరేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి గుండు చేయించుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు కూడా ఇదే తరహాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా.. బాబు సర్కార్‌పై వాళ్లు ఆగ్రహం వ్యకక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని ఫెడరేషన్ ఆరోపించింది. పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఐఆర్ విషయంలోనూ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసిందని నేతలు విమర్శించారు. సరెండర్ లీవ్‌లకు సంబంధించిన చెల్లింపులు కూడా నిలిచిపోయాయని ఆరోపించారు.నెలకు రూ.1500 కోట్లు క్షవరం.. ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఫెడరేషన్ నేతలు మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1500 కోట్ల మేర ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలు ఉద్యోగులకు కూడా పూర్తిగా తెలియకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని(క్షవరం చేస్తోందని) విమర్శించారు.వలంటీర్ల హామీలపైనా ప్రశ్నలుఉద్యోగులతో పాటు వలంటీర్లకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఫెడరేషన్ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో నిర్వహించిన ఈ నిరసన రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విజయవాడ: విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆటోనగర్‌లోని ఓ మెకానికల్ షెడ్డులో పార్కింగ్ చేసిన ప్రైవేట్ బస్సులకు మంటలు వ్యాపించాయి. దీంతో, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల ధాటికి పలు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. కాగా, ప్రమాదానికి గత కారణాలు తెలియాల్సి ఉంది. -
కొడాలి నానిపై కేసు...
-
దొరికిన సాయికృష్ణ లాకప్ డెత్ CCTV ఫుటేజ్
-
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం
-
సాయి కృష్ణని ఎక్కడైతే చంపాడో అక్కడే CI నాగరాజు విచారణ
-
సర్కారుకు 3 నెలలు గడువు ఇస్తున్నాం: కాపు రిజర్వేషన్ పోరాట సమితి
విజయవాడ: కూటమి సర్కారుపై కాపు రిజర్వేషన్ పోరాట సమితి మండిపడింది. కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు చలమల్ల ప్రసాదరావు బుధవారం మాట్లాడుతూ.. కాపులను ఎన్నికల్లో కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని చెప్పారు. వెంటనే కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు 12% శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.‘‘ప్రభుత్వానికి మూడు నెలలు గడువు ఇస్తున్నాం. బీసీల మాదిరి కాపులకు కాపు రక్షణ చట్టం తీసుకురావాలి. జూలై 27న అన్ని కలెక్టరేట్లలో వినతి పత్రాలు ఇస్తాం. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు రిజర్వేషన్ల ఇస్తామని చెప్పారు. 2014లో అసెంబ్లీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై చంద్రబాబు తీర్మానం చేసి నేటికీ అమలు చేయలేదు. 2014, 2024 ఎన్నికల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించారు. కాపుల పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ చెబితే ఓట్లేశారు. కూటమిని గెలిపిస్తే ఈ రెండేళ్లలో కాపులకు మీరేం చేశారు? కాపు కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వడం లేదు. కాపుల రిజర్వేషన్లను పట్టించుకోవడం లేదు. కాపులను ఎక్కడ చంపుతున్నా పట్టించుకోవడం లేదు. కాపులకు విదేశీ విద్య పథకం లేదు. కాపు భవనాలు కట్టిస్తామన్నారు.. కట్టించలేదు. కొన్ని వేల కోట్ల రూపాయలతో రాజధాని కడుతున్న మీరు కాపులను ఎందుకు తొక్కిపెడుతున్నారు? కాపుల పట్ల ఎందుకు మీరు ఇంత వివక్ష చూపుతున్నారు? మేం ఎన్నుకున్న.. మేం గెలిపించుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకు లేదా? కాపులను కరివేపాకులా వాడుకుంటున్నారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే పవన్ పట్టించుకోరా? పెద్దన్న పాత్ర పోషించాలని అడిగారు. మరి మా గురించి మీరు అడగరా? వెంటనే ప్రత్యే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్ల కోటాను పెంచాలి. డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటం చేయకతప్పదు’’ అని చలమల్ల ప్రసాదరావు హెచ్చరించారు. -
విజయవాడ లో కలకలం రేవుతున్న మరో మిస్సింగ్
-
విజయవాడలో NIA సోదాలు
సాక్షి,కృష్ణ: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు విజయవాడలో మెరుపు సోదాలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సోహైల్ బేగ్,మహమ్మద్ రహమతుల్లా అనే ముగ్గురు యువకులను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఆన్లైన్ ద్వారా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడం, జిహాదీ కార్యకలాపాలకు ప్రణాళికలు వేయడం లాంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఈ ముగ్గురి ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం సోదాలు చేస్తున్నారుమొదట విజయవాడ వన్‌టౌన్ కొత్తపేట పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో వేర్వేరు రాష్ట్రాల లింకులు బయటపడటంతో, దీని తీవ్రతను బట్టి ఇటీవలే ఈ కేసును అధికారికంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఈ ఆన్లైన్ నెట్‌వర్క్‌పై అధికారులు నిఘా పెట్టారు.ఇప్పటికే అరెస్టయిన ఈ ముగ్గురు నిందితులకు నగరంలో లేదా ఇతర ప్రాంతాలలో మరికొందరితో ఏమైనా రహస్య సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. డిజిటల్ పరికరాలు, సోషల్ మీడియా ఖాతాలు మరియు ఏవైనా అనుమానాస్పద పత్రాలు దొరుకుతాయేమోనని ఇళ్లలో ప్రతి అంగుళాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. -
అమరావతి పై ఉన్న శ్రద్ద మాపై లేదు, సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
-
డీఎస్సీ పోస్టులు అక్రమార్కులకు కట్టబెట్టారు
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం డీఎస్సీ–2025లో టీచర్ పోస్టులను అక్రమార్కులకు కట్టబెట్టి అర్హులకు తీవ్ర అన్యాయం చేసిందని అర్హత ఉన్నా ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడితే అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రశ్నిస్తే జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. డీఎస్సీలో అర్హత సాధించినప్పటికీ, ఉద్యోగాలు రాని బాధిత అభ్యర్థులు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన దివ్యాంగుడు గెరివి అంజినప్ప, అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఉడదల ప్రభావతి సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.వీరికి ఇతర డీఎస్సీ అభ్యర్థులు, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మద్దతు పలికారు. తమకు న్యాయం చేసి, ఉద్యోగాలు ఇవ్వాలని బాధిత డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. పేదలకు, అర్హులకు న్యాయం చేయలేనప్పుడు మంత్రి పదవి ఎందుకు అని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నించారు.డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని, ఉద్యోగాలను పప్పు బెల్లాల్లా అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో అర్హులైన ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, న్యాయం కోసం నిలబడితే జైళ్లకు పంపడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభావతి సోదరుడు, టీడీపీ కార్యకర్త ఉడదల శివ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు హెచ్.వసంత్ కుమార్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, దివ్యాంగ విభాగం అనంతపురం జిల్లా కార్యదర్శి బోయ రాజేష్ తదితరులు ప్రసంగించారు.నేను ఫేక్ కాదు.. నిరూపిస్తా పది నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయా. నా ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చా. దివ్యాంగుడినైన నాకు విద్యాశాఖ మంత్రి లోకేశ్, అధికారులు చాలా అన్యాయం చేశారు. ఐఏఎస్ అధికారులంతా నేను ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. నా దగ్గర ఉన్న ఆధారాలతో ఎక్కడికి రమ్మన్నా వచ్చి నిరూపిస్తా. మరి అసలు అర్హతే లేని కురువ శ్రీనివాసులుకు ఉద్యోగం ఎలా ఇచ్చారు? మంత్రి లోకేశ్‌ను కలిసినా న్యాయం జరగలేదు. కొందరు అధికారులు కోర్టులకు కూడా తప్పుడు సమాచారం పంపుతున్నారు. – గెరివి అంజినప్ప, దివ్యాంగుడు, డీఎస్సీ బాధితుడు, సత్యసాయి జిల్లాడీఎస్సీలో 130వ ర్యాంకు వచ్చినా... నాకు డీఎస్సీలో 130వ ర్యాంకు వచ్చింది. గెరివి అంజినప్పది పీహెచ్ కోటాలో ఉద్యోగం పోయినందువల్ల హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల నా ఉద్యోగం పోయిందని చెప్పారు. కానీ అది బీసీ–ఏ కోటా. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల కాదు అధికారుల మోసం వల్లే పోయిందని సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం. మా కుటుంబమంతా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశాం. మంత్రి లోకేశ్‌ను మూడుసార్లు కలిశాం. భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డిని కలిస్తే నాలుగు రోజులు ఆగండి జాబ్స్ ఇప్పిస్తామన్నారు. మాకు అర్హత ఉందని అందరికీ తెలిసినా, మేము ఫేక్ అని మాట్లాడుతున్నారు. – ఉడదల ప్రభావతి, డీఎస్సీ అభ్యర్థని, గుంతకల్లు -
క్రాంతికుమార్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: క్రాంతికుమార్ సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రాంతికుమార్ ఆత్మహత్యపై పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. క్రాంతికుమార్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోనున్న పోలీసులు.. ఫోన్ ఇవ్వాలంటూ క్రాంతికుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నార్త్ ఏసీపీ సత్యానందరావును కలిసి క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు ఫోన్ అందజేయనున్నారు. కాగా, దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది.లాకప్‌లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
సాయి కృష్ణ కేసులో CIనాగరాజుకి అన్యాయం జరిగిన కూడా ఒప్పుకోము
-
నీకు ఓటు వేసి గెలిపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి..
-
నిన్ను వదిలితే.. నేను పెట్రోల్ పోసుకుని నడి రోడ్డుపై చస్తా
-
ఆధారాలను విచారణ అధికారికి ఇచ్చిన సాయికృష్ణ తల్లి
-
కాల్ మని కేసులో పెద్ద తలకాయలు సంచలన విషయాలు బయటపెట్టిన గాయత్రి
-
ఎముకలు బూడిద... సాయి కృష్ణ డెడ్ బాడీ దొరికింది..?
-
వేధించి చంపేశారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘‘పోలీసుల వేధింపుల వల్లే నా కొడుకు అన్యాయంగా చనిపోయాడు. ఆరోజు పోలీసులు ఇంటికి వచ్చి బెదిరించడంతో తలుపులు వేసుకుని భయంతో పురుగుల మందు గుళికలు తిని ప్రాణాలు తీసుకున్నాడు’’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట క్రాంతికుమార్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.గురువారం కృష్ణలంకలోని క్రాంతికుమార్ ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన కొడుకు వీడియో వాంగ్మూలంలో చెప్పినట్టుగా సీఐ నాగరాజు వేధింపుల వల్లే చనిపోయాడని, తనను కులం పేరుతో సీఐ దూషించాడని, ఈ రెండు విషయాలపై కేసులు కట్టి సీబీఐతో విచారణ జరిపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని క్రాంతికుమార్ తల్లిదండ్రులు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఏం జరిగిందంటే... క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటన ఏరోజు జరిగిందని వైఎస్ జగన్ అడగ్గా మే 21న జరిగిందని వెంకటేశ్వరరావు వివరించారు. ‘‘ మే 21న మా ఇంటికి పోలీసులు వచ్చారు. వారిని చూసి నా కుమారుడు భయంతో లోపలికి వెళ్లి తలుపువేసుకున్నాడు. తలుపు తీయాలని వాళ్ల అమ్మ పిలిస్తే.. తలుపు తీస్తే పోలీసులు తనను చంపేస్తారంటూ పురుగుమందుల గుళికలు తినేశాడు. వాళ్ల అమ్మ దుఖంతో కేకలు వేస్తే తలుపు తీసాడు. హడావుడిగా హెల్ప్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అయినా ప్రాణం దక్కలేదు’’ అని వెంకటేశ్వరరావు జగన్‌కు చెప్పారు.సాయికృష్ణ తరహాలోనే తనను కూడా పోలీసులు కొట్టి చంపేస్తారన్న భయంతో ప్రాణం తీసుకున్నాడని తెలిపారు. క్రాంతి కుమార్‌పై 12 ఏళ్ల క్రితం కేసులు ఉండేవని, ఇప్పుడు లేవని ఆయన వివరించాడు. ఎనిమిదేళ్లుగా ట్యాక్సీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలిపారు. గత నెల ఎనిమిదో తేదీన దళిత సంఘాలను తీçసుకొని సీపీ వద్దకు వెళ్లానన్నారు. ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. పోలీసు అధికారులు, ప్రభుత్వం తమకు న్యాయం చేస్తాయన్న నమ్మకం లేదని, దేవుడిలా వచి్చన మీరే మా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన జగన్‌కు విజ్ఞప్తి చేశారు. బాత్రూంలు కడిగించి.. బూట్లు పాలిష్ చేయించేవారు.. తన కొడుకును పోలీసులు ఎన్ని రకాలుగా వేధించారో క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు వైఎస్ జగన్‌కు వివరించారు. ‘‘పోలీసులు ఇష్టం లేని పనులు చేయించేవారు. సొంత పనులకు వాడుకునేవారు. బూట్లు పాలిష్ చేయించేవారు. బాత్రూంలు కడిగించేవారు. రౌడీషీటర్లను పట్టుకురమ్మనేవారు. కులం పేరుతో దూషించేవారు. పోలీసులు చెప్పిన పనులు చేయక పోతే ఆదివారం సంతకం పేరుతో పిలిచి, ముగ్గురు కానిస్టేబుళ్లు టైరు బెల్ట్ తీసుకొని కొట్టేవారు. ముఖ్యంగా సీఐ నాగరాజు వేధింపుల వల్లే నా కొడుకు చనిపోయాడు’’ అని క్రాంతికుమార్ తండ్రి జగన్‌కు వివరించారు. క్రాంతికుమార్ కుమారుడికి వైద్యం.. కుటుంబానికి సాయం.. ‘క్రాంతి మరణంతో నా ముగ్గురు పిల్లలు, నేను దిక్కులేనివారమయ్యాం’ అంటూ క్రాంతి భార్య ప్రభావతి కన్నీటి పర్యంతమయ్యారు. పాప లిఖిత పదోతరగతి, కుమారులు రవిచంద్ర ఏడు, వెంకటేశ్వరరావు ఐదు చదువుతున్నారని పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆమె జగన్‌కు వివరించారు. క్రాంతి కుమారుడు రవిచంద్ర ఆరోగ్య పరిస్థితి చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. కాలికి కట్టు కట్టి ఉండటాన్ని గమనించిన జగన్ దాని గురించి అడిగారు.పుట్టుకతోనే పోలియో వల్ల రెండు వేళ్లు పోయాయని, తర్వాత వెన్నుముకపై కణితి వచ్చిందని, అది తీస్తే బతకడని వైద్యులు చెప్పారని క్రాంతి భార్య వివరించారు. చాలా ఆస్పత్రులలో చూపించామని, కొంత వయసు వచి్చన తర్వాత ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారని ఆమె తెలిపారు. పోలియో వల్ల వేళ్లు పోయిన కాలికే గాయం కావడంతో కట్టుకట్టామని చెప్పారు. ఏ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారో అడిగి తెలుసుకున్న జగన్ నరాలకు సంబంధించిన ఆస్పత్రిలో చూపించాలని సూచించి అన్నీ తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు.అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పారు. బాబుకు పింఛనూ రావటం లేదని తల్లి జగన్ దృష్టి తీసుకెళ్లగా తాను చూసుకొంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావలసిన ఐదు సెంట్ల స్థలం, పొలం, చట్టబద్ధంగా రావలసిన బెనిఫిట్స్, హక్కు గా రావల్సినవన్నీ, మన ప్రభుత్వం వచి్చన నెలలోపే తాను చేస్తానని భరోసా ఇచ్చారు. బాబుకూ సమస్య లేకుండా చూస్తానని పేర్కొన్నారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్టుగా తనకు మెసేజ్ పంపితే తాను చూసుకుంటానన్నారు. కోడిని వేలాడదీసినట్లు వేలాడదీసి కొట్టారు..ఆరోజు తలుపు తీయమంటే పోలీసులకు నన్ను అప్పజెప్పవద్దమ్మా అంటూ తన కుమారుడు గట్టిగా ఏడ్చాడని క్రాంతికుమార్ తల్లి మరియమ్మ జగన్‌కు వివరిస్తూ భోరున విలపించారు. తన కొడుకును పోలీసులు అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని ఆమె అన్నారు. పాత కేసులు ఉన్నాయని పిలవడం, గంజాయి అమ్మించడం వంటి పనులు చేయించేవారని, భయపడి వెళ్లకపోతే బాగా కొట్టేవారని ఆమె చెప్పారు.ఒక రోజు రాత్రి సీఐ నాగరాజు రమ్మంటున్నారని పోలీసులు వచ్చి తీసుకెళ్లారని ఉదయం మేము స్టేషన్‌కు వెళ్లే సరికి కోడిని వేలాడదీసినట్టు వేలాడదీసి కొట్టడం చూసి తట్టుకోలేకపోయామని మరియమ్మ విలపించారు. ఈ వయసులో మమ్మల్ని చూడాల్సిన కొడుకు మా కళ్ల ఎదుటే మరణించడం చూసి బాధతో మా ప్రాణం విలవిల్లాడుతోందని మరియమ్మ జగన్‌ను పట్టుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమారుడు ఆత్మహత్మ చేసుకొనే సమయంలో తీసుకొన్న సెల్ఫీ వీడియోను జగన్‌కు చూపించారు. ఆ కుటుంబానికి అండగా ఉండి అన్ని విధాలుగా న్యాయం చేస్తానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజుకు సిట్ కస్టడీ
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజుని కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ అధికారులు 12 రోజులు కస్టడీ కోరగా.. 8 రోజుల కస్టడీ విచారణకు న్యాయస్థానం అనుమతించింది. రేపటి నుండి 10వ తేదీ వరకు కస్టడీ ఇచ్చిన న్యాయస్థానం.. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు విచారణ చేయాలని ఆదేశించింది. విచారణ చేసే సమయంలో వీడియో రికార్డ్ చేయాలని కోర్టు పేర్కొంది. రాజమండ్రిలో సిట్ విచారణ చేయనుంది.సాయికృష్ణ మెజిస్టీరియల్ విచారణ జరగనుంది. జూలై 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరపనున్నారు. ప్రజల నుంచి సమాచారాన్ని కోరుతూ మెజిస్టీరియల్ విచారణ చేపట్టనుంది. సమాచారం తెలిసిన వారు హాజరై తమ వద్ద ఉన్న సాక్ష్యాలు సమర్పించాలంటూ విజయవాడ ఆర్డీవో ప్రకటన విడుదల చేశారు. -
పోలీస్ కస్టడీలోనే CI నాగరాజును అంతం చేసే కుట్ర..
-
క్రాంతి కుమార్ కుటుంబానికి పరామర్శ, నేనున్నా అంటూ వైఎస్ జగన్ భరోసా (ఫొటోలు)
-
అయ్యా నా కొడుకును చంపేశారయ్యా... జగన్ ముందు కన్నీరు పెట్టుకున్న క్రాంతి కుమార్ తల్లి
-
ఒక అమాయకుడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: ఒక అమాయకుడ్ని అకారణంగా పోలీసులు హింసించారని, అది తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడితే కనీసం పట్టించుకునే స్థితిలో చంద్రబాబు లేరని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసులనే రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారాయన. గురువారం విజయవాడలోని పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడారు.క్రాంతి కుమార్‌పై ఏ కేసులు లేవు. కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయినా పోలీసులు అతన్ని ఎందుకు పోలీస్ స్టేషన్‌కు పిలిచారు? ఎందుకు హింసించారు?. సీఐ నాగరాజు తనను వేధిస్తున్నాడంటూ.. అది తట్టుకోలేక పోతున్నానంటూ వీడియో తీసుకుని మరీ క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబాన్ని పోలీసులే చిన్నాభిన్నం చేశారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.మూడు నెలలుగా పోలీసులు వేధిస్తున్నారని క్రాంతి తన వీడియోలో చెప్పాడు. ఆ మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు పెట్టాలని.. కానీ ఎందుకు అలా చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. కనీసం క్రాంతి కుటుంబం ఫిర్యాదు చేస్తే కేసు పెట్టలేదు. క్రాంతి కుటుంబానికి న్యాయపరంగా సహాయం చేస్తాం. ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటాం అని వైఎస్ జగన్ ప్రకటించారు.నెల వ్యవధిలోనే..విజయవాడ నడిబొడ్డులోనే రెండు దారుణ ఘటనలు జరిగాయి. నెల వ్యవధిలో ఓ లాకప్‌డెత్(గాదె సాయికృష్ణ కేసు), పోలీసుల వేధింపులు తట్టుకోలేక మరొకరు మరణించారు(క్రాంతి కేసును ఉద్దేశించి..). సాయికృష్ణ కేసులో అతని తల్లి అర్జీని కూడా పోలీసులు పట్టించుకోని పరిస్థితి. ఏకంగా సీసీటీవీ ఫుటేజీనే మాయం చేశారు. సీసీ టీవీ ఫుటేజీ మాయమైపోతే బ్యాకప్ ఉండదా?. పద్ధతి ప్రకారమే స్టేషన్లో అరాచకాలు చేస్తున్నారు. సీఐని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని సీఎం రక్షిస్తున్నారని అని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
ఇంటి పక్కనే ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావ్ చంద్రబాబు
-
క్రాంతి కుమార్ భార్యను పరామర్శించిన వైఎస్ జగన్
-
Watch Live: క్రాంతి కుమార్ ఇంటికి వైఎస్ జగన్
-
క్రాంతి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. వైఎస్ జగన్ రాకతో భారీ సంఖ్యలో స్థానికులు అక్కడికి వచ్చారు. కాగా, సీఐ నాగరాజు వేధింపులతో క్రాంతికుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన చావుకు కృష్ణలంక సీఐ కారణమంటూ సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
-
నేడు విజయవాడకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడలో పర్యటించనున్నారు. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని విజయవాడలో ఉదయం 10 గంటలకు పరామర్శించనున్నారు. -
క్రాంతికుమార్ కుటుంబానికి పీవీ సునీల్ కుమార్ పరామర్శ
సాక్షి, విజయవాడ: పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పరామర్శించారు. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు భరించలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును పివి.సునీల్ కుమార్, అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు (AIMS) సభ్యులు పరామర్శించారు.క్రాంతి కుమార్ కేసును సీబిఐకి అప్పగించాలని పీవీ సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. క్రాంతికుమార్‌పై ఉన్న అభియోగాలపై ఇప్పటి వరకూ నిరూపణ జరగలేదు. ఆరోపణలున్నంత మాత్రాన వారం వారం విచారణకు పిలిచి హింసించే అధికారం ఎవరికీ లేదు. ఎంత ఒత్తిడి లేకపోతే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటాడు. మే 21న క్రాంతి కుమార్ కోసం పోలీసులు వచ్చారు. పోలీసులు రావడంతో క్రాంతి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రాంతి కుమార్‌ను ఎందుకు అంతగా వేధించాలి’’ అంటూ పీవీ సునీల్‌కుమార్ ప్రశ్నించారు.‘‘కేసులుంటే కోర్టులు శిక్షిస్తాయి. తక్షణమే క్రాంతి కుమార్ కేసులో సెక్షన్లు మార్చాలి. క్రాంతి కుమార్ ఆత్మహత్యను బీఎన్ఎస్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం)గా మార్పు చేయాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం క్రాంతి కుమార్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలి. 15 రోజుల్లోగా ఈ పరిహారం అందించాలి. క్రాంతి కుమార్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగంతో పాటు భూమి ఇవ్వాలి. సీబీఐ విచారణ ద్వారానే క్రాంతి కుమార్‌కు న్యాయం జరుగుతుంది. క్రాంతి కుమార్ తండ్రి చేసే న్యాయపోరాటానికి నేను అండగా ఉంటా’’ అని సునీల్ పేర్కొన్నారు. -
ప్రైవేట్ చేతుల్లోకి ఆర్టీసీ భూములు
-
కానిస్టేబుళ్లకు 14 రోజుల రిమాండ్ విజయవాడ 2వ ACM కోర్టు ఆదేశాలు
-
YS Jagan: "ఫోన్లు నాగ్‌పూర్‌లో అమ్మేశారా? ఈ కథను నమ్మాలా?"
-
రేపు ఉదయం విజయవాడకు వైఎస్ జగన్..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపు(గురువారం) ఉదయం విజయవాడులో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పేరపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. కాగా, క్రాంతి కుమార్ ఇటీవల సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
రగిలిన రైతన్న
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కకపోవడం.. సీజన్లో యూరియా, విత్తనాలు అందించకుండా యాప్ పేరుతో ఇక్కట్లకు గురి చేయడం.. కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం.. ఉచిత పంటల బీమాను ఎగరగొట్టడం.. సున్నా వడ్డీ రాయితీ పథకం డబ్బులివ్వకుండా రెండేళ్లుగా తొక్కిపెట్టటాన్ని నిరసిస్తూ రైతన్నలు చంద్రబాబు సర్కారుపై కదం తొక్కారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని, రైతుల పొట్టగొట్టిన ఈ రాక్షస పాలనను తుదముట్టించేంతవరకు విశ్రమించబోమని గర్జించారు. ‘సీఎం డౌన్ డౌన్’... ‘రైతు వ్యతిరేక పాలన నశించాలి’.. ‘కష్టం రైతులది.. లాభం దళారులదా..!’ అంటూ పిడికిళ్లు బిగించారు. బాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ‘చలో విజయవాడ’ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలతో విజయవాడ ధర్నాచౌక్ ప్రాంతం దద్దరిల్లింది. ధర్నాచౌక్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వైపు దూసుకెళ్లారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అలంకార్ సెంటర్ మీదుగా ఏలూరు రోడ్డు వైపు కదం తొక్కారు. బూటుకాళ్లతో తొక్కుతూ.. పిడిగుద్దులుఎక్కడికక్కడ బారికేడ్లతో పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినా రైతన్నలు ఉద్యమ కెరటాల్లా ఎగసిపడ్డారు. అలంకార్ సెంటర్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి మూడు అంచెల బారికేడ్లతో దిగ్బంధించారు. పిడిగుద్దులు, బూటుకాళ్లతో తొక్కుతూ వారిని నిరోధించేందుకు యత్నించారు. పలువురు రైతులను పోలీసులు ఈడ్చేశారు. ధర్నాచౌక్ నుంచి లెనిన్ సెంటర్ వైపు ర్యాలీగా తరలి వెళ్లిన అన్నదాతలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసుల దాష్టీకంబారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగేందుకు యత్నించిన రైతులపై పోలీసులు బల ప్రయోగానికి దిగారు. దాదాపు గంటకుపైగా పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసుల దాష్టీకానికి పలువురు రైతులకు కాలి వేళ్లు చితికిపోయి రక్తపు గాయాలయ్యాయి. రక్తమోడుతున్నా లెక్క చేయకుండా కొదమ సింహాల మాదిరిగా బారికేడ్లను తోసుకుంటూ ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లా వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. దారిపొడవునా రైతులను అడ్డగిస్తూ బలవంతంగా ఈడ్చి పారేయగా, మరి కొంత మంది రైతులను పోలీసులు బూటుకాళ్లతో అడ్డగించే యత్నం చేశారు. అలంకార్ సెంటర్లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య బ్యారికేడ్ల పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. రైతుల న్యాయమైన డిమాండ్లను వినకుండా ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసు ఉన్నతాధికారులు బుజ్జగించడంతో రైతులు కొద్దిగా శాంతించారు. అంతకుముందు ధర్నాచౌక్ వద్ద 2 గంటల పాటు ధర్నా చేశారు. రైతులు ప్లకార్డులు, డిమాండ్లతో కూడిన బ్యానర్లు చేతబట్టి తలపై ఆకుపచ్చ కండువాలు కట్టుకుని ముందుకు సాగారు. ధర్నా చౌక్ వద్ద బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకుంటున్న పోలీసులు ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు..చంద్రబాబు పాలనలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ఒక్కరైనా సంతృప్తికరంగా ఉన్నారని నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా సంక్షోభంలో కూరుకుపోయేలా చంద్రబాబు చేశారని ఆరోపించారు. ధర్నాచౌక్‌లో జరిగిన సభలో ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య, ఏపీ, కౌలు రైతుల సంఘ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఏ.కాటమయ్య, ఉపాధ్యక్షుడు ఏ.రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు.రైతుల పరిస్థితి దారుణం400 ఎకరాల్లో మొక్కజొన్న వేశాం. కొనేవారు లేరు.. ఐదుసార్లు కలెక్టర్ చుట్టూ తిరిగాం. పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల వెంటపడ్డాం. పట్టించుకోలేదు. చేసేది లేక క్వింటాల్ రూ.1,600కు తెగనమ్ముకున్నాం. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. – డి.మల్లిఖార్జునరెడ్డి, వీరపునాయనపల్లి, వైఎస్సార్ కడప జిల్లాఏ పంటకూ మద్దతు ధరలేదుఐదెకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, మినుము సాగు చేశా. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదు. మొక్కజొన్న క్వింటాల్ రూ.1,600కు అమ్ముకుంటే.. ధాన్యం 75 కేజీల బస్తా రూ.1,350కు అమ్ముకున్నాం. జొన్న క్వింటాల్‌కు రూ.1,800 మాత్రమే దక్కితే మినుము పూర్తిగా దెబ్బతింది. ఐదెకరాలకు రూ.3 లక్షల మేర నష్టపోయా. – కూరపాటి శింగయ్య, చిర్రావూరు, గుంటూరు జిల్లా -
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు.. సిట్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
సాయి కృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ మరో ఇద్దరిని నిందితులుగా చేర్చింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ బాబురావు A5, A6గా సాంబయ్యలను చేరుస్తున్నట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.సాయి కృష్ణ లాకప్‌డెత్ లో అశోక్, నాని మా ఎదుట సరండర్ అయ్యారు. వారిని అరెస్టు చేసినప్పుడు మొబైల్స్ ఫోన్స్ ఇవ్వాలని అడిగితే అమ్మేశామంటూ చెప్పారు. అయితే తమ ఫోన్లను నాగపూర్ లో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మినట్లు తెలిపారు. అయితే సాయి కృష్ణను అక్రమంగా నిర్బంధించడం నుంచి హత్య చేయడం వరకు సాక్ష్యాలు మాయం చేయడంలో అశోక్, నానిలు కీలకంగా వ్యవహరించారు. కుట్రలో భాగంగానే వీరు ముందస్తు చర్యల్లో భాగంగా భాగంగా అన్ని సాక్ష్యాలను ధ్వంసం చేశారు. అయితే సాయికృష్ణ మృతదేహాన్ని ఇప్పటివరకు గుర్తించలేదు. ఈ కేసు ఇంకా కీలక విచారణ దశలోనే ఉంది. మృతదేహాన్ని మాయం చేయడంలో ఇంట్లో ఎవరు పాత్ర ఉందో విచారణ జరపాలి ఇంకా ఎవరి పాత్ర ఉందో విచారణ జరపాల్సి ఉంది. అశోక్, నానిని మరింత విచారించాల్సిన అవసరముంది. మే 6న సాయి కృష్ణ ను అదుపులోకి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తరలించారు. సాయి కృష్ణను విజయవాడలో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకువచ్చినట్టు టవర్ లోకేషన్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చినట్టుగా స్పష్టంగా ఆధారాలు లభించాయి.. సాక్షులు నిందితుల మొబైల్ ఫోన్లో నెట్వర్క్ లు ఒకే ప్రాంతంలో చూపించాయి. సాయి కృష్ణ లాక్ అప్ డెత్ లో అశోక్, నాని ఇద్దరి పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తోంది.ప్రత్యక్ష సాక్షులు విచారించిన తర్వాత A 1గా వున్నా నాగరాజుని సాయికృష్ణకి అప్పగించారు. సాయికృష్ణ ని అశోక్, నాని, నాగరాజు తీవ్రంగా కుట్టారని శరీరం మీద గాయాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తీవ్రమైన హింస కారణంగా సాయికృష్ణ లాక్ అప్ డెత్ అయ్యాడు అని మేము విశ్వసిస్తున్నాం.’అని చెప్పుకొచ్చారు. -
విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని బీబీ గూడెం వద్ద విజయవాడ పశ్చిమ బైపాస్‌పై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల కుమారుడు సహా తల్లి, మరో వ్యక్తి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పెంచికలపర్రు గ్రామానికి చెందిన జయమంగళ వెంకటవిజయ్కుమార్, వెంకటరాజు సోదరులు పొక్లెయిన్లు నడుపుతుంటారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి తల్లి రమాదేవి చూసేందుకు కుటుంబ సభ్యులతో కారులో వచ్చారు.వెంకరాజు భార్య, పిల్లలు ఆస్పత్రి వద్ద ఆగిపోగా, మిగిలిన వారు కైకలూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారి పశ్చిమ బైపాస్‌పై బీబీ గూడెం సమీపంలోకి రాగనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ముందు టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు వెళ్తున్న ట్యాంకర్ లారీతో పాటు వీరి కారును ఢీకొట్టి కొంత దూరం పాటు ఈడ్చుకువెళ్లింది.ఈ ప్రమాదంలో కంటైనర్, ట్యాంకర్ మధ్య కారు ఇరుక్కుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో వెనుక సీటులో కూర్చోన్న వెంకటవిజయ్కుమార్ భార్య బాలవెంకటనాగదుర్గ (28), కుమారుడు కారుణ్య నాగసాయి(4) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలోనే ట్యాంకర్ లారీ ఢీకొని స్కూటీపై వెళ్తున్న విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన హోటల్ కార్మికుడు దాసరి వెంకటేశ్వరరావు (49)కు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు.కారు నడుపుతున్న వెంకటరాజు, ముందు సీట్లో కూర్చున్న వెంకటవిజయ్కుమార్ గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంకటేశ్వరరావుతో పాటు కారులో ఇరుక్కుపోయిన తల్లి, కుమారుడి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో పశ్చిమ బైపాస్‌పై గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు, హైవే సిబ్బంది పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు
-
సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు
-
విజయవాడ: రైతులపై పోలీసుల దాష్టీకం
సాక్షి, విజయవాడ: ధర్నాచౌక్‌లో తీవ్ర ఉధ్రిక్తత చోటుచేసుకుంది. రైతులపై పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ధర్నా చౌక్‌లో రైతులపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. సీఎం ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు రైతులు యత్నించగా.. బారికేడ్లు పెట్టి రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను దాటి సీఎం ఇంటికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ధర్నాచౌక్, స్వర్ణపాలెస్ జంక్షన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లి తీరుతామని రైతులు అంటున్నారు.అన్నదాతల కష్టాలపై ఏపీ రైతు సంఘం నిరసనలు చేపట్టింది. పొగాకు, మామిడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, కౌలు రైతుల బకాయిలు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
Big Intro : హెడ్ కానిస్టేబుళ్లపై సంచలన ఆరోపణలు.. వెలుగులోకి వచ్చిన నిజాలు!
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో కీలక సాక్షుల నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణకు పోలీస్‌స్టేషన్‌లోనే ఆర్ఎంపీతో వైద్యం చేయించినట్లు గుర్తించారు. సాయికృష్ణ లాకప్‌డెత్ ఎపిసోడ్ బయటకు రాగానే ఆర్ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీని సిట్ బృందం ప్రశ్నిస్తోంది.సాయికృష్ణ లాకప్‌డెత్, శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజుకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని విజయవాడ సౌత్‌జోన్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం లొంగిపోయారు. అనంతరం పోలీసులు వీరిని సిట్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే సిట్ వీరి ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు కోర్టులో మెమో జారీ చేసింది. వీరిద్దరు గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు.వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని విచారణకు హాజరుకావాలని కుటుంబ సభ్యులకు సైతం నోటీసులు అందజేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్లో క్రైం కానిస్టేబుల్ బాబూరావును ఇప్పటికే సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఇక మాజీ సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్‌ను కూడా అదుపులోకి తీసుకొని, ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను విచారిస్తే ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి రావడంతోపాటు ఈ దారుణంలో ఉన్న అనుమానాల చిక్కుముడులు వీడతాయనే భావన వ్యక్తమవుతోంది. కాగా, కృష్ణలంక పోలీసు స్టేషన్లో మరో 10 మంది కానిస్టేబుళ్లను ఇప్పటికే విచారించినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించే దిశలోనే దర్యాప్తు! మొత్తం మీద ఈ దారుణంలో ప్రభుత్వ, పోలీసు పెద్దల పాత్రను రక్షించే విధంగానే సిట్ దర్యాప్తు పక్కా ప్లాన్‌తో జరుగుతోందన్న భావన పోలీసు వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను లేకుండా చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్, స్వర్గపురి పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీ మొత్తం మాయం చేశారు. నాలుగు హార్డ్ డిస్క్‌లను ఫార్మెట్ చేశారని తెలుస్తోంది. దీనిని రికవరీ చేయడం సాధ్యమే అయినా, ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. సిట్ కూడా ఫోరెన్సిక్ ద్వారా సీసీ ఫుటేజీ రికవరీ దిశగా ప్రయత్నాలు చేయటం లేదు. సీసీ ఫుటేజిని రికవరీ చేయడం కష్టమనే భావన వ్యక్తం అవుతుంది. కేసులో కీలక ఆధారమైన సీసీ ఫుటేజీ లేకపోతే,, కేసులో పురోగతి కష్టమనే భావన పోలీసు వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు కేవలం స్టేట్మెంట్ల పరిశీలన, అనుమానాస్పందంగా ఉన్నవారిని విచారించడం మినహా, కేసులో కీలక ఆధారాలు మాత్రం సేకరించలేదని సమాచారం. క్రాంతి ఆత్మహత్యపై ‘సాగు’తున్న దర్యాప్తు మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయిన క్రాంతికుమార్ ఉదంతంపైన చేస్తున్న దర్యాప్తు మందకొడిగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి ఏసీపీ సత్యానందం రెండు రోజుల క్రితమే క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి అతని తండ్రి, కుటుంబ సభ్యులనుంచి స్టేట్మెంటు రికార్డు చేశారు. స్టేషన్‌కు సోమవారం తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావును పిలిచి పలు అంశాలపై ఏసీపీ విచారించారు.సస్పెండ్ అయిన కానిస్టేబుల్ సురేశ్ గురించి కూడ వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. సీఐ నాగరాజు ఎలా వేధించింది క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోనే చెబుతోంది కదా అని విచారణాధికారికి తండ్రి నివేదించినట్లు సమాచారం. ప్రధానంగా మాదిగ పుట్టుక పుట్టడం, బూటు పాలిష్ చేయడం వంటి అంశాలతో తీవ్ర వేదన చెందినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. కాగా నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న డిమాండ్లపై అధికారులు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం
సాక్షి, నల్గొండ జిల్లా: కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. భీమవరం నుండి హైదరాబాద్ వెళుతున్న ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు.. టైర్ పంక్చర్‌తో అదుపుతప్పి.. డివైడర్‌ను దాటి విజయవాడ వెళ్తున్న లారీని ఢీకొట్టింది.బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరికిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బస్సు డ్రైవర్‌ను బయటకుతీశారు. ట్రావెల్స్ బస్సు, లారీ డ్రైవర్లకు గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు ముప్పు తప్పింది.విశాఖలో కంటైనర్ బోల్తావిశాఖలోని షీలా నగర్ జంక్షన్లో కంటైనర్ లారీ బోల్తా పడింది. గాజువాక నుంచి పోర్టుకు వెళ్తున్న లారీ అదుపు తప్పింది. ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.నెల్లూరు జిల్లాలో..నెల్లూరు జిల్లాలో సంగం మండలం తరుణవాయు దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి నెల్లూరు రొట్టెల పండగకు వస్తుండగా ఘటన జరిగింది. యాత్రికుల టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
కానిస్టేబుళ్ల లొంగుబాటు... నిజమా? నాటకమా? కోర్టులో ఏంజరిగిదంటే
-
నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తాను మహిళలపై ఎలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదని.. తనను రెచ్చగొట్టిన వ్యక్తిపై మాత్రమే విమర్శలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉద్ఘాటించారు. తన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో మహిళా కమిషన్‌కు పూర్తిగా వివరిస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. యావత్ మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వ్యక్తినే విమర్శించానని చెప్పారు."ప్రతి మనిషికి ఒక సహనం ఉంటుంది. ఆ సహనం కోల్పోయేలా ఎదుటి వ్యక్తులు మాట్లాడకూడదు. నా వ్యాఖ్యలను మహిళలకు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారే నవ్వులపాలయ్యారు" అని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మహిళల భద్రతపై కూడా అమర్నాథ్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, అలాంటి ఘటనలపై మహిళా కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సాయి కృష్ణ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన మహిళా కమిషన్‌కు కనిపించలేదా? అని ప్రశ్నించిన ఆయన.. నడిరోడ్డుపై ఓ మహిళపై జనసేన నేతలు దాడి చేసిన ఘటనపై కూడా మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.తనపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి మహిళా కమిషన్‌కు పూర్తి వివరణ ఇస్తానని, తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ వివాదంగా మార్చారని అమర్నాథ్ అన్నారు. మహిళా కమిషన్ ఎదుట ఆయన ఇవ్వబోయే వివరణ, అనంతరం కమిషన్ స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
Big Question Full : అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తోందా ?
-
హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది? ఫోన్ డేటా డిలీట్ కేసులో టెన్షన్!
-
AP: పలు జిల్లాల్లో భారీ వర్షం.. ఎల్లో అలెర్ట్ జారీ
సాక్షి, విజయవాడ: రాగల మూడుగంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా పల్నాడు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా ప్రస్తుతం విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. -
నల్గొండ: హైవేపై ఘోర ప్రమాదం
నల్గొండ జిల్లా: చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు వెళ్తున్న వాహనం టైర్ పేలడంతో అదుపుతప్పింది. డివైడర్ దాటి హైదరాబాద్ వైపు రోడ్డుపై బోల్తా పడింది. బోల్తా పడిన వాహనాన్ని హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో రెండు కార్లు ఢీకొట్టాయి. వరుసగా మూడు కార్లు బోల్తా పడటంతో హైదరాబాద్ వైపు సుమారు 5 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాం అయ్యింది.ప్రమాదంలో సుమారు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న ట్రాఫిక్, ఎన్హెచ్ఏఐ సిబ్బంది పోలీసులు.. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. -
సాయికృష్ణ కేసు కంచికే.. పోలీసులే పోలీసులపై విచారణ.. కృష్ణలంక క్రిమినల్స్
-
నా కొడుకు కేసును CBIకి ఇవ్వండి.. సాయికృష్ణ తల్లి పిటిషన్
-
పరారీలో ఉన్న కానిస్టేబుళ్ల కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు..
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సిట్ అదుపులో సీఐ నాగరాజు సన్నిహితుడు..
-
Big Update: సాయి కృష్ణ శవం మాయం చేసింది.. హెడ్ కానిస్టేబుల్ అశోక్
-
కీలక పరిణామం.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సాయికృష్ణ తల్లి
విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అతడి తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చేవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు. మొదట అదృశ్యం కేసుగా నమోదైంది ఈ వ్యవహారం. ఆ తర్వాత కస్టడీలో మృతి చెందాడన్న ఆరోపణలు వచ్చాయి.సాయికృష్ణను 2026 మే నెలలో ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు నాన్-బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో అదుపులోకి తీసుకువచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకపోవడంతో పాటు ఇంటికి కూడా రాకపోవడంతో, అతని తల్లి విజయలక్ష్మి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు కస్టడీలోనే తన కుమారుడిని హింసించి చంపేశారని, ఆ తర్వాత ఆధారాలు మాయం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. -
సాయికృష్ణ లాకప్‌డెత్‌పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
ఢిల్లీ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్‌పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. పోలీసుల అధికార దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఎన్‌హెబ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. వారంలోగా ఘటనపై యాక్షన్ టేకెన్ రిపోర్టు పంపాలని ఆదేశించింది సిట్ దర్యాప్తు వివరాలు, పోలీసులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.పోలీసు స్టేషన్లో డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ రికవరీ చేయాలి. గాదె సాయి కృష్ణ అస్థికలను కనుగొనాలి. సాయికృష్ణ తల్లికి రక్షణ కల్పించాలి. ఈ ఘటనలో సాక్షులను కాపాడాలి. బాధితులకు ఇచ్చిన మధ్యంతర నష్టపరిహారం సహాయం వివరాలను అందజేయాలి’’ ఎన్హెచ్ఆర్సీ కోరింది. తదుపరి విచారణ వారం తర్వాత చేపడతామని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. -
కృష్ణ లంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఎక్కడ మేడం..
-
సాయి కృష్ణ తల్లి ఓడిపోవడం ఖాయం ఎందుకంటే..! అడ్వొకేట్స్ సంచలన నిజాలు
-
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. ఇద్దరు పై అనుమానాలు
-
సాయికృష్ణ కేసులో పెద్ద తలకాయలు.. కమిషనర్, కలెక్టర్ మెడకు ఉచ్చు.. కోర్టు నోటీసులు
-
జాగ్రత్త నాగరాజు.. నిన్ను జైల్లోనే...! CIపై చంద్రబాబు బిగ్ స్కెచ్..!?
-
‘చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పోలీసులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పోలీసులు చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. సాయికృష్ణపై రెండు నాన్ బాయిల్ వారెంట్లు ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని కృష్ణ లంక పోలీసులు కలిపి హింసించి చంపారు. ఎక్కడ కుడా సీసీ ఫుటేజ్ లేకుండా మాయం చేశారు’’ అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జగ్గయ్యపేటలోని ఒక ల్యాండ్ డీల్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడితో లాకప్ డెత్ జరిగింది. సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు మరికొందరు కలసి హింసించి సాయికృష్ణని అతి కిరాతకంగా చంపారని రాచమల్లు ఆరోపించారు‘‘ప్రజా సంఘాలు, వైఎస్సార్ పార్టీ కలిసి వారికి మద్దతు తెలపడంతో సీఐ నాగరాజుపై కేసు కట్టారు. ఈ హత్యకు సూత్రధారులు, పాత్రధారులపై కేసు నమోదు చేయాలి. రిమాండ్ రిపోర్టులో ఎన్నిగంటలకు చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు అనేది రాయలేదు. ఈ రిపోర్టు చంపిన వారే రాసినట్టు ఉంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపాలి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ
-
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
-
గంగమ్మ లాకప్‌డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్‌పై దాఖలైన పిల్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. దుర్గప్ప ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని రిపోర్టులను ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్.. సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు. రిపోర్టులు మొత్తాన్ని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. పిటిషనర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. గంగమ్మ కుమార్తె లక్ష్మిని పోలీసులు భయపెడుతున్నారన్నారు.ఆమె స్వగ్రామంలోకి ఎవరిని వెళ్లనివ్వట్లేదని.. గంగమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు. గంగమ్మ ఎలా చనిపోయిందని ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో గంగమ్మ ఏ కారణం చేత చనిపోయిందని రాసి ఉందంటూ హైకోర్టు ప్రశ్నించింది.గంగమ్మ ఒంటిపై గాయాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించగా.. కార్డియాక్ అరెస్ట్‌తో పాటు మరికొన్ని కారణాలతో గంగమ్మ చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్ట్‌లో పేర్కొన్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. గంగమ్మ కూతురు లక్ష్మికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్, రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా 17 మంది
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం ..
-
‘సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటకు రావాలి’
సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. అతన్ని పోలీసులు ఇబ్బంది పెట్టటానికి వేరే కారణాలు ఉన్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవన్నీ వెలుగులోకి రావాలంటే సీబిఐతోనే విచారించాలని డిమాండ్ చేశారు.‘‘సాయికృష్ణపై అత్యాచారం కేసు అబద్ధం. తన మరదలు, సాయికృష్ణ ప్రేమించుకున్నారు. ఇరువైపులా కుటుంబాల్లో ఒప్పుకోకపోవటంతో పెళ్లి చేయలేదు. ఈ విషయంలో ఆ అమ్మాయిని బెదిరించి.. సాయికృష్ణపై అక్రమంగా కేసు పెట్టించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సాయికృష్ణపై పోక్సో కేసు పెట్టారు. అది అబద్ధపు కేసని ఆ అమ్మాయే కోర్టులో చెప్పింది’’ అని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు.‘‘అసలు సాయికృష్ణ మీద పోలీసులు ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంటి?. సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ వాళ్లు తీసుకువచ్చి విచారించాల్సినంత కేసు ఏం ఉంది?. అతన్ని పోలీసు శాఖ ఎందుకు వాడుకుందో తెలియాలి. సీపీ, డీజీపీ, హోంమంత్రి నోరు తెరిచి వాస్తవాలను వెల్లడించాలి. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారంటే వాళ్లు ఎంతపెద్ద క్రిమినల్స్?. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వెంకట్, రాజులను బెదిరించి సీసీ కెమెరా పుటేజీని డిలీట్ చేయించారు. సాయికృష్ణ కేసులో వాస్తవాలన్నీ బయటకు రావాలంటే సీబీఐతోనే విచారించాలి’’ అని వంగవీటి నరేంద్ర డిమాండ్ చేశారు. -
నేనే చంపా..! రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు ఇవే
-
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు
-
నా ముందే నా కొడుకుని కొట్టారు.. విజయలక్ష్మి కంప్లైంట్ తో కొత్త ట్విస్ట్..


