ప్రసాదంపాడులో మావోయిస్టులు అద్దెకు ఉన్న భవనం
మావోయిస్టుల షెల్టర్‌జోన్‌గావిజయవాడ రూరల్ మండలం
రోజువారీ కూలీలంటూ ఇళ్లు అద్దెకు
మారణాయుధాలు లభించటంతో స్థానికుల భయాందోళనలు
రామవరప్పాడు/పటమట(విజయవాడతూర్పు): విజయవాడలో మావోయిస్టు కదలికలు స్థానికంగా కలకలం రేపింది. భవన నిర్మాణ కార్మికులుగా, ఆటోనగర్‌లో రోజువారీ కూలీగా పనిచేసుకుంటూ బతుకుతామని చెప్పి నగరానికి కొంచెం దూరంగా ఉండే ఇళ్లను ఎంపిక చేసుకుని ఇళ్లను అద్దెకు తీసుకుని ఉండటం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆక్టోపస్, టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్యూరోలతోపాటు స్థానికపోలీసులు రావటంతో ప్రసాదంపాడు ఉలికిపాటుకు గురైయ్యింది.
ఆపరేషన్ కగార్ తర్వాత..
ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ తర్వాత దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలకు చెక్ పడింది. దీంతో మావోయిస్టులు భారీగా నగరాల్లోకి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా, పాలమడుగు గ్రామానికి చెందిన పొడియా బీమా, బీజాపూర్ జిల్లా గోండిగూడా గ్రామానికి చెందిన మడకం లఖ్మ, బీజాపూర్ జిల్లాకు చెందిన మడవి చిన్మయి, సుక్మా జిల్లాకు చెందిన చోడిమంగీ విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడు ఎస్‌ఈఆర్ సెంటర్ దాటాక రైల్వేట్రాక్ అవతలివైపు దూరంగా ఉన్న ఓ రెండంతస్తుల భవనాన్ని రెండు నెలల క్రితం అద్దెకు తీసుకున్నారు.
మాయమాటలతో నమ్మించి..
తమది నగరంలోని అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతమని, తమ చెల్లికి, ఆమె భర్త్తకు విభేదాలు వచ్చాయని, దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీ నడుస్తుందని, కొంతకాలం విడిగా ఉండడం ఆ వివాదం ముగిసేవరకు ఉంటామని ఇంటి యజమానికి మావోలు నలుగురూ మాయమాటలు చెప్పా రు.
ఇంటికి సంబందించి రెండు నెలల అడ్వాన్స్ ఇచ్చారు. నెలనెలా అద్దెను కూడా సక్రమంగానే చెల్లించారు. ఆ మావోయిస్టుల్లో ఒక మహిళ మాత్రం ఇంటి నుంచి బయటకు రావటం, ఎవరితో మాట్లాడకపోవటంతో ఇటీవల ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. ఇల్లు ఖాళీ చేయాలని పట్టుబట్టాడు.
దీంతో పొడియా భీమా, మడకం లఖ్మ తమ చెల్లెలి వివాదం సద్దుమణుగుతుందని, త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని యజమానిని బతిమలాడాడు. సోమవారం పోలీసులు తమ ఇంటి ముందు మోహరించటంతో అవాక్కవడం యజమాని వంతైంది. వీరివద్ద మారణాయుదాలు కూడా లభ్యం కావడంతో స్థానికుల్లో కలవరం మొదలైంది.
తరచూ వచ్చేది ఎవరు..?
మావోయిస్టులు మకాం చేసిన ఇంటికి రెండు రోజులకు ఓసారి ముగ్గురు సభ్యులు వచ్చి రహస్యమంతనాలు చేసేవా రు. వారంలో రెండుసార్లు తప్పకుండా వచ్చేవారని స్థానికు లు తెలిపారు. వీరు వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న వారికి భోజ న క్యారేజీలు తీసుకువచ్చేవారు. ఇంటి యజమానితో వారు బంధువులని చెప్పి మభ్యపెట్టారు. వీరు రాని సమయంలో తరచూ ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకునేవారని, ఎవరితోనూ మాట్లాడేవారు కాదని స్థానికులు తెలిపారు.


