మగవాళ్ల కోసమే ప్రత్యేక పత్రిక..! | International Men's Day 2025: Some Interesting Facts | Sakshi
Sakshi News home page

అలా మొదలైంది మెన్స్‌ డే..! ఆఖరికి మగవాళ్ల కోసమే ప్రత్యేక పత్రిక..

Nov 19 2025 11:22 AM | Updated on Nov 19 2025 11:30 AM

International Men's Day 2025: Some Interesting Facts

తల్లికి తనయుడిగా... భార్యకు భర్తగా...చెల్లికి అన్నగా... అక్కకు తమ్ముడిగా...బిడ్డకు తండ్రిగా.. కుటుంబానికి గొడుగుగా..చెలిమికి తోడుగా.. స్నేహానికి వారధిగా అన్నింటా తానే అయి కొవ్వొత్తిలా కరిగిపోతూ సమాజానికి వెలుగులా తనను తాను సమర్పించుకునే పురుషోత్తములకు అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో మగమహారాజులకు సంబంధించి..చరిత్రలో దాగున్న కొన్ని ఆసక్తికర విషయాలను గురించి తెలుసుకుందామా 

అలా మొదలైందన్నమాట...
మిగిలిన దేశాల సంగతి  ఎలా ఉన్నా, మన దేశంలో మాత్రం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నవంబర్‌ 19, 2007లో మొదలైంది. పురుషుల హక్కుల సంస్థ ‘ఇండియన్‌ ఫ్యామిలీ’ దీన్ని ప్రారంభించింది.ఈ సంవత్సరం మెన్స్‌ డే థీమ్‌ ‘సెలబ్రేటింగ్‌ మెన్‌ అండ్‌ బాయ్స్‌’ గత సంవత్సరం థీమ్‌ పాజిటివ్‌ మేల్‌ రోల్‌మోడల్స్‌’

‘మీరు తండ్రి, గురువు, విద్యావేత్త కావచ్చు. ఆరోగ్య నిపుణుడు కావచ్చు. ఎవరైనా కావచ్చు... మీ కమ్యూనిటీలోని పురుషుల గురించి శ్రద్ధ వహించే వ్యక్తి మీరు అయితే ఈ దినోత్సవం మీ కోసమే’ అని అధికారిక అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వెబ్‌సైట్‌ ప్రకటించింది. 

వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌

పురుష పాఠకులను దృష్టిలో పెట్టుకొని లండన్‌ కేంద్రంగా జనవరి 1731లో ‘ది జెంటిల్‌మ్యాన్స్‌’ మ్యాగజైన్‌ మొదలైంది. ‘మ్యాగజైన్‌’ అనే మాటను తొలిసారిగా ఉపయోగించిన పత్రిక ఇది.

 స్త్రీ పాత్రలు లేని సినిమాలను ఊహించడం కష్టం. అయితే గతంలోకి వెళితే... కేవలం పురుషులు మాత్రమే నటించిన హాలీవుడ్‌ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక సినిమా... 12 యంగ్రీ మెన్‌. 
‘లైఫ్‌ ఈజ్‌ ఇన్‌ దెయిర్‌ హ్యాండ్స్,...డెత్‌ ఈజ్‌ ఆన్‌ దెయిర్‌ మైండ్స్‌’ కాప్షన్‌తో 1957లో విడుదలైంది.

 

(చదవండి: Top Mens Health Issues: ఇది నవంబర్‌ కాదు మోవంబర్‌!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement