ఈ రోజు(డిసెంబర్ 31, బుధవారం)తో 2025 ముగియబోతోంది. దీంతో ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో, సోషల్ మీడియా వేదికలలో కొత్త ఉత్సాహం పెల్లుబుకుతోంది. ప్రతి ఏటా జనవరి ఒకటిన శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి నెటిజన్లు ఒక వినూత్నమైన ట్రెండ్‌ను తెరపైకి తెచ్చారు. అదే ‘ఫైనల్ ఇమేజ్ ఆఫ్ 2025’ (2025 చివరి చిత్రం). పాత జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ, ఈ ఏడాదిలో తాము దిగిన ఆఖరి ఫోటోను షేర్ చేస్తూ, నెటిజన్లు సందడి చేస్తున్నారు.
ఈ వైరల్ ట్రెండ్ ప్రధానంగా ‘ఎక్స్’, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర ప్లాట్‌ఫారమ్‌లలో విరివిగా కనిపిస్తోంది. యూజర్స్ తమ వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ సభ్యులతో దిగిన చిత్రాలు లేదా ప్రకృతి దృశ్యాలను ‘My Final Image of 2025’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు ఈ ట్రెండ్‌లో భాగస్వాములవుతున్నారు. గడిచిన ఏడాదిలో తాము సాధించిన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకుంటూ ఈ ఫోటోలను షేర్ చేయడం విశేషం.
ఈ ట్రెండ్ కేవలం ఫోటోల షేరింగ్‌కే పరిమితం కాలేదు. ఇది నెటిజన్లలో ఒక రకమైన భావోద్వేగ అనుబంధాన్ని పెంచుతోంది. ఒక వైపు ఈ ఏడాది ముగిసిపోతున్నదనే బాధ, మరోవైపు కొత్త ఏడాదిపై ఉన్న ఆశలు.. ఈ పోస్ట్‌లలో ప్రతిబింబిస్తున్నాయి. లక్షలాది మంది ఈ ట్రెండ్‌ను అనుసరించడంతో సోషల్ మీడియా సర్వర్లు బిజీగా మారాయి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, భవిష్యత్తుపై సానుకూల దృక్పథాన్ని నింపడంలో ఈ చిన్న ప్రయత్నం పెద్ద ప్రభావాన్నే చూపుతోంది.
ఇలాంటి ట్రెండ్స్ సోషల్ మీడియాలో సరదాను నింపుతున్నప్పటికీ, వ్యక్తిగత గోప్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోటోలను షేర్ చేసేటప్పుడు లొకేషన్ వివరాలు లేదా సున్నితమైన సమాచారం బయటపడకుండా చూసుకోవడం ముఖ్యం. ఏదిఏమైనప్పటికీ 2026 నూతన సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమైంది.
ఇది కూడా చదవండి: ఎయిర్‌వేస్‌లో జాత్యహంకారం? .. ప్రయాణికురాలి మండిపాటు


