వామ్మో.. వీడు నిజంగానే భలే స్మార్ట్‌ దొంగ..! | Thief dressed in party wear steals brides bag containing Rs 4 lakh cash | Sakshi
Sakshi News home page

వామ్మో.. వీడు నిజంగానే భలే స్మార్ట్‌ దొంగ..!

Feb 14 2026 8:09 PM | Updated on Feb 14 2026 8:15 PM

Thief dressed in party wear steals brides bag containing Rs 4 lakh cash

ఇప్పుడు దొంగతనాల ట్రెండ్‌ కూడా మారిపోయినట్లు ఉంది.  ముసుగులు వేసుకుని రాత్రి పూట కన్నాలకు వెళుతూ ఉంటారు  కదా.. వారినే సాధారణంగా దొంగలు అనుకుంటాం. ఇప్పుడు దొంగలు కూడా ముదరిపోయినట్లే ఉన్నారు..  వాడు దొంగ అని ముఖం మీద ఏమీ రాసుండదు కాబట్టి వారు కూడా మనలోనే కలిసిపోతున్నారు. 

మనతో పాటు ఉన్నట్లే  ఉండి వారికి కావాల్సింది దోచుకుపోతున్నారు. ఇటీవల జరిగిన పెళ్లి రిసెప్షన్‌లో జరిగిన చోరీ చూస్తే వీడు నిజంగానే భలే దొంగ అనక తప్పదు. దొంగల్లో భలే దొంగలు ఉండరు.. కానీ చోరీ చేసిన విధానం.. వాడు భలే దొంగ అని కచ్చితంగా అనుకుంటాం​. వారం రోజుల క్రితం రాజస్థాన్‌లోని జగత్పురాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో జరిగిన చోరీ చూస్తే ఔరా అనిపిస్తోంది. 

పెళ్లి విందు సందర్భంగా వధువు స్టేజ్‌పై ఉంచిన బ్యాగ్‌ను దొంగ దొంగిలించాడు. ఆ బ్యాగ్‌లో సుమారు రూ. 4 లక్షల నగదు, విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా దొంగ ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లాడు. పెళ్లి కొడుకు, వధువు స్టేజ్‌పైకి వచ్చిన వారితో మాట్లాడుతున్న సమయంలో వధువు పక్కనే ఉన్న బ్యాగ్‌ను ముందే పసిగట్టిన ఆ దొంగ.. దాన్ని వెనకాల నుంచి అతిథిలా వచ్చి తీసుకెళ్లిపోయాడు. ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement