కపటనాటక సూత్రధారి | Wedding Incident In Chamarajnagar | Sakshi
Sakshi News home page

కపటనాటక సూత్రధారి

Feb 3 2026 8:26 AM | Updated on Feb 3 2026 11:08 AM

 Wedding Incident In Chamarajnagar

బెంగళూరు: వివాహ రిసెప్షన్‌కు వెళ్తున్న వరుడిపై కత్తితో దాడి చేసిన ఘటనను చామరాజనగర్‌ జిల్లా కొల్లేగాళ టౌన్‌ పోలీసులు ఛేదించారు. వధువుతోపాటు, ఆమె ప్రియుడు దర్శన్, ఒక మైనర్‌ను అరెస్టు చేశారు. గోకుల్, మరో నిందితుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కొళ్లేగాల తాలూకా కుణగళ్లికి చెందిన ఎల్‌.రవీశ్‌కు కొళ్లేగాల తాలూకాఆ హొసఅణగళ్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. 

కొళ్లేగాల పట్టణంలోని వేంకటేశ్వర మహల్‌లో గతనెల 30న రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. వరుడు రవీశ్‌ తన గ్రామం నుంచి కారులో వస్తుండగా ఎంజీఎస్‌వీ రోడ్డు వద్ద దుండగులు అడ్డుకొని కత్తితో దాడి చేశారు. గాయపడిన రవీశ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే కొన్ని రోజుల క్రితం అతనికి గుర్తు తెలియని యువకుడు ఫోన్‌ చేసి పెళ్లి రద్దు చేసుకోవాలని బెదిరించాడు. ఈ విషయంపై యువతిని ప్రశ్నించగా తాను గతంలో అతన్ని ప్రేమించిన విషయం వాస్తవమేనని, అయితే ఇప్పుడు విడిపోయామని, ఇష్టంతోనే పెళ్లికి అంగీకరించినట్లు పేర్కొంది. 

అయితే వరుడు ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. కాగా రవీశ్‌పై జరిగిన దాడికి సంబంధించి కేసు దర్యాప్తును చామరాజనగర్‌ ఎస్పీ ముత్తురాజ్‌ ఒక ప్రత్యేక బందానికి అప్పగించారు. కొల్లేగల్‌ డీఎస్పీ ధర్మేంద్ర, సీఐ శివమాదయ్య, కొల్లేగల్‌ టౌన్‌  ఎస్‌ఐ వర్షలు యువతి ప్రియుడు దర్శన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రియురాలి సూచనతోనే దాడి చేసినట్లు వెల్లడించడంతో ఆమెను కూడా అరెస్ట్‌ చేశారు. దాడికి ఉపయోగించిన కారును స్వా«దీనం చేసుకున్నారు.

సంబంధిత వార్త వరుడిపై కత్తితో దాడి.. ఆగిపోయిన పెళ్లి

    
 

Advertisement
 
Advertisement
Advertisement