కోమాలో ఉన్న వ్యక్తుల కుటుంబాలకు ఈ ఘటన సరికొత్త ఆశను అందిస్తోంది. అచ్చం సినిమాని తలపించే సన్నివేశంలా..ఈ కేసులో ఆ బిడ్డ కోమా నుంచి బయటపడ్డాడు. వైద్యులు సైతం చేతులెత్తేశారు. కానీ మాటలు, సందేశాలే మంత్రాలుగా మారి మిరాకిల్ చేశాయి. ఆ బిడ్డకు ఊపిరిపోసి..కోమా నుంచి పూర్తిగా బయటపడేలా చేశాయి. ఆ తల్లి కళ్లల్లో ఆనందం వెల్లివెరిసేలా చేశాయి.
అసలేం జరిగిందంటే..ఈ అద్భుత ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని యుయాంగ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు లియుచుక్కి నవంబర్ 2025లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డు ప్రమాదంలో చిన్నారి చుక్కికి మెదడు, ఊపిరితిత్తులకు తీవ్ర గాయలయ్యాయి. దాంతో పరిస్థితి విషమంగా మారి కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు సైతం కోమా నుంచి బయటడే అవకాశాలు తక్కువని అని తేల్చి చెప్పేశారు.
కానీ ఆ బాలుడు తల్లి ఆశ వదులుకోలేదు. వైద్యుల సూచనల మేరకు అతడికి రోజు సుపరిచితమైన శబ్దాలు, మాటలు..వినేలా వాతావరణం కల్పించాలని చెప్పారు. దాంతో ఆ బాలుడు పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించి వారి మద్దతు..స్కూల్‌లో అసెంబ్లీలో ప్లే అయ్యే సాంగ్స్, ప్రార్థన గీతాలు వినిపించేలా చేసింది. అలాగే వీడియో కాల్ ద్వారా ఆ బాలుడి స్నేహితుల మాటలు అతనికి వినిపించేలా చేసింది ఆ బాలుడి తల్లి. రోజు అతడి స్నేహితులు..
రేయ్..! చుక్కి కళ్లుతెరవరా..,
మాతో మాట్లాడరా,
ఫుట్‌బాల్ ఆడదాం త్వరగా లేగు
అన్న మాటలు ఆ బాలుడిలో స్పందన తెప్పించాయి. ఆ తల్లి అలా అతడి క్లాస్‌మేట్స్ మాటలు రోజు వినేలా చేయడంతో.. అతడి పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. అంతేగాదు 45 రోజుల కోమా అనంతరం తొలిసారిగా కనురెప్పలు కదపడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన ఉపాద్యాయుడి గొంతు విని నవ్వాడు.
అలా 55వ రోజుకి స్పృహలోకి వచ్చి తన ఎడమ చేతిని కదిపాడు. తన పాఠశాల సంగీతం, సహ విద్యార్థులు సందేశాల రికార్డింగ్ ఆ బాలుడుని కోమా నుంచి బయటపడటానికి, కోలుకోవడానికి హెల్ప్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా కదిస్తోంది.
A touching story😭😭An 8-year-old boy in Hunan, #China, woke from a 55-day coma after hearing the collected messages of love and well wishes from classmates🥺🥺
It's the power of #friendship and #hope. ❤️ pic.twitter.com/M8sEcX8o9Z— GeoSight (互fo) (@ShanxiDaily) January 22, 2026
(చదవండి: ఒబెసిటీ డాక్టర్ వెయిట్‌లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..)


