ఆకుపచ్చని చీరలో మెరిసిపోతున్న మాధురి దీకిత్‌..! | Madhuri Dixit at 58 glows in regal green saree worth More Than Rs 1 Lakh | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చని చీరలో మెరిసిపోతున్న మాధురి దీకిత్‌..! అంత ఖరీదా..!?

Feb 1 2026 5:30 PM | Updated on Feb 1 2026 5:35 PM

Madhuri Dixit at 58 glows in regal green saree worth More Than Rs 1 Lakh

బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహ సీజన్‌ని తలంపుకి వచ్చేలా ఆమె లుక్‌ మెస్మరైజ్‌ చేస్తోంది. ఆరు గజాల బాటిల్‌ గ్రీన్‌ షేడ్‌ సిల్క్‌ చీరలో ఈ ఐదు పదుల బ్యూటీ ముగ్దమనోహరంగా ఉంది. కనుచూపుని తిప్పుకోనివ్వనంత ఆకర్షణీయమైన లుక్‌తో ఆకర్షిస్తోంది. జనవరి 31న, మాధురి ఇన్‌స్టాగ్రామ్‌లో “పియా తోసే నైనా లాగే రే (1965 చిత్రం గైడ్ నుండి లతా మంగేష్కర్ పాట)” అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో తన బ్యూటీఫుల్‌ ఫోటోలను షేర్‌ చేశారామె. 

ఆ పచ్చదనం మాధురికి రాచరికపు లుక్‌ని అందించింది. ఈ చీర అంచుల వెంబరడి  జర్దోజీ ఎంబ్రాయిడరీ చీర విలాసవంతమైన లుక్‌ని హైలెట్‌ చేసింది. ఆ చీరకు సరిపోయేలా అదే కలర్‌లోని ఎంబ్రాయిడరీ బ్లైజ్‌ ఈ వివాహ వేడుకలకు లేటెస్ట్‌ ఫ్యాషన్‌స్టైల్‌గా నిలిచింది. స్టైలిష్‌గా కూర్చొన్న తీరు..జాలు వారుతున్న ఆ శారీ పల్లు రాజదర్బారులో కూర్చొన్న మహారాణిలా హుందాగా కనిపించింది మాధురి.  

జయంతి రెడ్డి లేబుల్ నుంచి వచ్చిన ఈ ఆకుపచ్చని చీర ధర వింటే నోరెళ్లబెడతారు. ఎంతంటే..అక్షరాలు రూ. 1,39,900లు పలుకుతుంది. ఆ చీరకు తగ్గట్టు మాధురి ఎంచుకున్న మేకప్‌, హెయిర్‌స్టయిల్‌ ఆమె లుక్‌ని మరింత గ్రాండ్‌గా కనబడేలా చేసింది.

 

(చదవండి: కిచెన్‌పై బడ్జెట్‌ ప్రభావం..ఏం తగ్గనున్నాయంటే..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement