బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ! | heart breaking story World Ugliest Woman feeds her children | Sakshi
Sakshi News home page

బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!

Mar 18 2026 3:22 PM | Updated on Mar 18 2026 4:27 PM

heart breaking story World Ugliest Woman feeds her children

ప్రపంచంలో అందమైన మహిళ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ బాహ్య సౌందర్యానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే  ప్రపంచంలో,  బిడ్డలకోసం ఎంతో అవమానాన్ని నెత్తిన వేసుకున్న మహిళ గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించక మానదు. కుటుంబ పోషణ కోసం 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ' అ‍న్న బిరుదును  స్వీకరించిన సాహసి పేరు మేరీ ఆన్ బెవాన్. తన పిల్లల ఆకలి తీర్చడం కోసం తన ఆత్మగౌరవాన్ని సైతం పణంగా పెట్టి ఈ తల్లి  గొప్ప పోరాటమే చేసింది. ఇంతకీ ఎవరా మాతృమూర్తి? ఎందుకు వికారమైన మహిళగా మారింది తెలుసుకుందాం పదండి..!

1874లో లండన్‌లోని న్యూహామ్‌లో పేద కుటుంబంలో  జన్మించింది మేరీ ఆన్ బెవాన్,  నర్సింగ్‌ కోర్స్‌ చదివి 1894లో నర్సుగా మారింది.  ఆ తరువాత థామస్ బెవాన్ అనే వ్యక్తిని ప్రేమిం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు  నలుగురు పిల్లలు కలిగారు. జీవితం ఎంతో సాఫీగా సాగిపోతున్న తరుణంలో 32 ఏళ్ల మేరీ జీవితంలో అనూహ్య ఘటన  చోటు చేసుకుంది. వైద్యులకు పెద్దగా తెలియని అక్రోమెగాలీ(Acromegaly) అనే అరుదైన వ్యాధి మేరీకి సోకింది. దీంతో కుటుంబమంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైంది.  

అంతుచిక్కని వ్యాధి - వికృత రూపం
మేరీకి అక్రోమెగాలీ సోకడంతో, శరీరంలో వింత మార్పులు మొదలయ్యాయి. ముఖంలోని ఎముకలు, కండరాలు ఉబ్బి, సాధారణం కంటే మూడు రెట్లు పెద్దవిగా మారాయి.  చేతులు, కాళ్లు పెద్దవిగా పెరగడం ప్రారంభించాయి.  దవడ కిందికి సాగిపోయి ముఖం ఆకారం మారిపోయింది ముక్కు వెడల్పుగా మారింది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే, ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన మునుపటి 'అందమైన' రూపానికి ఏమాత్రం పోలిక లేకుండా పోయింది.శరీరంలో గ్రోత్ హార్మోన్ అధికంగా విడుదలవ్వడం వల్ల వచ్చే సమస్య. ఇది ఇలా కొనసాగుతుండగానే దురదృష్టం మరోసారి వెంటాడింది. 1914లొ ఆమె భర్త థామస్ మరణించాడు. ఫలితంగా నలుగురు పిల్లలతో మేరీ ఒంటరిదైపోయింది.

ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్‌ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు

పిల్లల కోసం తల్లి మనసు ఆరాటం

రూపం మారిపోవడంతో ఆమెకు ఎక్కడా పని దొరకలేదు. ప్రజలు ఆమెను చూసి నవ్వుతుంటే, మరికొందరు భయపడేవారు. పిల్లలకు తిండి పెట్టడమే కష్టమైన తరుణంలో, 1920వ దశకంలో  "ప్రపంచంలోనే అత్యంత వికృతమైన మహిళ కావాలి - భారీ వేతనం ఇవ్వబడును."  అనే  ఒక ప్రకటన చూసింది: కుటుంబానికి సహాయపడే బహుమతి డబ్బును గెలుచుకోవాలనే ఆశతో పోటీకి దిగింది. ఆమె ప్రయత్నాలు ఫలించాయి, ఆమె ఆ పోటీలో గెలిచి 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ'గా పేరు పొందింది. ఎన్నో ఫ్రీక్ షో లలో చేరింది. వేదికపై నిలబడితే జనం ఎగతాళి చేసేవారు. కానీ ఆ తర్వాత ప్రసిద్ధ షోమాన్ పి.టి. బర్నమ్ పిలుపు మేరకు ఆమె అమెరికాకు వెళ్లి కోనీ ఐలాండ్‌లో ప్రదర్శనలు ఇచ్చింది.అలా   త్వరలోనే సర్కస్‌లో స్పెషల్‌ ఎ‍ట్రాక్షన్‌గా మారిపోయింది.  1933లో చనిపోయే వరకు కోనీ ఐలాండ్‌లోని డ్రీమ్‌ల్యాండ్ సైడ్‌షోలో 'ఫ్రీక్ షో' ప్రదర్శకురాలిగా  పనిచేసింది.

మేరీ ఆన్ బెవాన్ 1933, డిసెంబరు 26న లో తన 59వ ఏట కన్నుమూసింది. తన రూపంతో జీవితాంతం ఎన్నో అవమానాల్ని మోసింది. కానీ ఆ అవమానాల నుండి వచ్చిన డబ్బుతోనే తన బిడ్డల కడుపు నింపింది.  వారిని గౌరవప్రదంగా పెంచి పెద్ద చేసిన  విద్యావంతుల్ని చేసింది.

తన పిల్లల భవిష్యత్తు కోసం, బిడ్డలుఆకలితో అలమటించకూడదని మేరీ పోటీలో పాల్గొంది. ఆ పోటీలో ఆమె గెలిచి అవమానకరమైన కిరీటాన్ని జీవితాంతం మోసింది. కానీ అది ఒక తల్లిగా ఆమె మనసును ఎంతగా గాయపరిచిందో ఊహించగలమా? కానీ వాటన్నింటినీ అధిగమించి పిల్లల్నిప్రయోజకుల్ని చేయడమే కాదు, అక్రోమెగలీతో బాధపడే చాలా మందికి మేరీ స్ఫూర్తిదాయక వ్యక్తిగా  నిలిచింది. లోకం దృష్టిలో ఆమె కేవలం ఒక "వికృత మనిషి" కానీ పిల్లల దృష్టిలో తమను ప్రాణప్రదంగా కాపాడుకున్న "అమ్మ".  చరిత్రలో  "అత్యంత అందమైన మనసున్న తల్లి"గా  నిలిచిపోతుంది. ఏమంటారు? 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement