నటి ఎగ్‌ ఫ్రీజింగ్‌ ఇంజెక్షన్స్‌: రెండు రోజులు నరకం | Big Balloon Inside Me shares Akansha Ranjan Kapoor after Egg Freezing Injections | Sakshi
Sakshi News home page

నటి ఎగ్‌ ఫ్రీజింగ్‌ ఇంజెక్షన్స్‌: రెండు రోజులు నరకం

May 2 2026 4:36 PM | Updated on May 2 2026 4:39 PM

Big Balloon Inside Me shares Akansha Ranjan Kapoor after Egg Freezing Injections

న్యూఢిల్లీ : నటి ఆకాంక్ష రంజన్ కపూర్  (32) తాను తన అండాలను ఫ్రీజ్ చేయించుకున్న విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.   ఆ సమయంలో తాను ఎదుర్కొన్న శారీరక ఇబ్బందుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే  తన  ఎగ్‌ ఫ్రీజింగ్‌ నిర్ణయం  వెనుక గల కారణాన్ని ఆమె మరింత వివరంగా తెలియజేశారు.

సోహాఅలీ ఖాన్ పాడ్‌కాస్ట్ 'ఆల్ అబౌట్ హర్' తాజా ఎపిసోడ్‌లో, ఆకాంక్ష కపూర్ తాను తన అండాలను ఎందుకు ఫ్రీజ్ చేయించుకోవాలనుకున్నదీ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో,  ఆకాంక్ష  తన అండాలను ఫ్రీజ్ చేయించుకున్నారు.  

కడుపులో పెద్ద బెలూన్ ఉన్నట్టే
ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో భాగంగా ఇచ్చే ఇంజెక్షన్ల వల్ల తాను చాలా నొప్పిని అనుభవించానని ఆకాంక్ష తెలిపారు. శారీరకంగా తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. అయితే  ఇది అందరికీ ఇలాగే జరుగుతుందనుకోను, కానీ  తన విషయంలో మాత్రం విపరీతమైన నొప్పి ని భరించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.  2-3 రోజుల పాటు నేను సరిగ్గా నడవలేకపోయాను.  కడుపులో ఏదో పెద్ద బెలూన్ ఉన్నట్లుగా అనిపించేది, కనీసం నిటారుగా నిలబడలేకపోయేదాన్ని. తాను చాలా సన్నగా ఉండటం వల్ల అలా అనిపించి ఉండవచ్చని డాక్టర్ చెప్పారని వివరించింది.

ఎగ్‌ ఫ్రీజింగ్‌ వెనుక  రెండు ప్రధాన కారణాలు

తన స్నేహితులు గర్భం దాల్చుతున్న సమయంలో అందరూ పలకరిస్తుండటంతో, ఆమె కూడా AMH (Anti-Mullerian Hormone) టెస్ట్ చేయించుకున్నారు. తన వయస్సుతో పోలిస్తే ఆమెలో ఈ హార్మోన్ స్థాయి చాలా తక్కువగా ఉందని తేలింది. (AMH టెస్ట్ ద్వారా ఒక మహిళలో అండాల నిల్వ ఎంత ఉందో తెలుసుకోవచ్చు). తన చుట్టూ ఉన్న చాలా మంది మహిళలు గర్భం దాల్చడానికి ఇబ్బంది పడుతుండటం, సంతానలేమి సమస్యలు ఎదుర్కోవడం చూసి ఆమె ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు  ఆకాంక్ష తెలిపారు.

ఇది భయం కాదు..ఇన్సూరెన్స్ 
భయంతో తీసుకున్న నిర్ణయం  కాదని, తన  భవిష్యత్తు కోసం  చేసిన అని స్పష్టం చేసిన ఆకాంక్ష, పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేమన్నారు. ఇదొక బీమా లాంటిదని పేర్కొన్నారు.

ముందే చేసి ఉండాల్సింది..
ప్రస్తుతం తనకు 32 ఏళ్లని, అసలైతే 20 ఏళ్ల వయస్సులోనే లేదా 20ల మధ్యలో ఈ ప్రక్రియ చేసి ఉంటే అండాలు మరింత ఆరోగ్యంగా ఉండేవని ఆమె అభిప్రాయపడ్డారు.  తాను ఇప్పటికే ఆలస్యం చేశానని ఇది  ఎగ్‌ ఫ్రీజింగ్‌  గురించి ముందే  తెలిసి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు.

 కాగా ఆకాంక్ష రంజన్ కపూర్, దర్శకుడు శరణ్ శర్మ  పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త  బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆకాంక్ష రంజన్ కపూర్ 'గిల్టీ' (Guilty) వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. 

ఇదీ  చదవండి: షాకింగ్‌ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్‌ సూసైడ్‌!

Advertisement
 
Advertisement
Advertisement