breaking news
Bollywood
-
కాంతారపై రణ్వీర్ సింగ్ కాంట్రవర్సీ.. స్పందించిన సీనియర్ హీరో భార్య..!
బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ఇటీవల కాంతార మూవీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకల్లో కాంతార సీన్‌ను ఇమిటేట్ చేశాడు. అదే కాంతార ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. తమ దైవాన్ని కించపరిచేలా మాట్లాడారని.. క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.ఈ వివాదం కాస్తా మరింత ముదరడంతో రణ్వీర్ సింగ్ క్షమాపణలు కోరాడు. రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశమని వివరణ ఇచ్చాడు. తాజాగా ఈ వివాదంపై సీనియర్ హీరో గోవిందా సునీతా అహుజా స్పందించారు. ఈ విషయంలో రణ్వీర్ సింగ్‌కు ఎలాంటి చెడు ఉద్దేశం ఉండకపోవచ్చని అన్నారు. కానీ దక్షిణాది ప్రజలు చాలా సున్నితంగా ఉంటారు.. అందుకే వారికి అది నచ్చలేదని సునీతా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా... రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.అసలేం జరిగిందంటే..ఈవెంట్లో స్టేజీపై రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'రిషబ్.. నేను థియేటర్లో కాంతార: చాప్టర్ 1 సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండీ) మీకు ఆవహించే సీన్లో మీ నటన అద్భుతంగా ఉంది' అని ప్రశంసించాడు. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన 'ఓ..' అనే హావభావాన్ని చేసి చూపించాడు. ఇది సీరియస్‌గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది. దీంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్నంతా సోషల్ మీడియాలో ఓ రేంజులో రణ్‌వీర్‌ని విమర్శించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.కాంతార మూవీ..రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 రిలీజైంది. జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. -
నాకు 33 ఏళ్లు.. అందుకే ఎగ్ ఫ్రీజింగ్: రియా చక్రవర్తి
2020లో హిందీ చిత్రపరిశ్రమ ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది. వారిలో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి సెలబ్రిటీలున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మాత్రం వార్తల్లో సంచలనమైంది. అతడి ఆత్మహత్యకు ప్రేయసి రియా చక్రవర్తి కారణమంటూ నెట్టింట సదరుహీరోయిన్పై తీవ్ర ట్రోలింగ్ జరిగింది. జైలుకుఅలాగే సుశాంత్ మృతి కేసులో ఆమె అరెస్టయి జైలుకు కూడా వెళ్లొచ్చింది. అయితే అతడి మరణానికి రియా చక్రవర్తికి ఎటువంటి సంబంధం లేదంటూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రియాకు ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో ఆమె పాడ్‌కాస్ట్‌తో పాటు చాప్టర్ 2 డ్రిప్ పేరిట బట్టల బిజినెస్ మొదలుపెట్టింది. ఈరోజు ఆ బ్రాండ్ విలువ రూ.40 కోట్లుగా ఉంది.ఎగ్ ఫ్రీజింగ్తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు 33 ఏళ్లు. ఈ మధ్యే గైనకాలజిస్ట్‌ను కలిశా.. ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే ఓపక్క కెరీర్లో సెట్ అవ్వాలి. మరోపక్క సామాజిక ఒత్తిడి. మన శరీరం ఓ వయసు రాగానే పిల్లల గురించి ఆలోచించమని చెప్తుంది. కానీ మనసు మాత్రం.. నీ బిజినెస్, బ్రాండ్, కెరీర్.. అవే పిల్లలని, వాటి ఎదుగుదల గురించి ఫోకస్ చేయమని చెప్తుంది. నేనింకా సాధించాల్సింది చాలా ఉంది. సినిమాఅందుకే ఇప్పుడే పెళ్లి, ఫ్యామిలీ అని ఆలోచించదల్చుకోలేదు. కాకపోతే ఎగ్ ఫ్రీజింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. రియా చక్రవర్తి (Rhea Chakraborty).. తూనీగ తూనీగ అనే తెలుగు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మేరే డాడ్ కీ మారుతి, సోనాలి కేబుల్, జిలేబి, చెహరె సినిమాలు చేసింది. దొబారా, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది.చదవండి: నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్... రజనీకాంత్ ఏమన్నారంటే? -
ముంబైలో లైఫ్ స్టైల్ ఆసియా అవార్డ్స్ 2025.. సందడిగా సినీ తారలు (ఫోటోలు)
-
ఇడియట్స్ మళ్లీ కలిస్తే?
ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన ‘3 ఇడియట్స్’ మూవీ సీక్వెల్‌కి సన్నాహాలు మొదలయ్యాయని బాలీవుడ్ టాక్. రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్ హీరోగా, ఆర్. మాధవన్ , శర్మన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ప్రధానపాత్రల్లో నటించిన హిందీ సినిమా ‘3 ఇడియట్స్’. విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలై, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.‘3 ఇడియట్స్’ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించే పనిలో ఉన్నారట రాజ్‌కుమార్ హిరాణి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, కథ పూర్తయిన తర్వాత ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రావొచ్చనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. ‘3 ఇడియట్స్’ చిత్రం తొలిపార్టులో నటించిన ప్రధాన తారాగణ మంతా సీక్వెల్లోనూ నటిస్తారట. అంతేకాదు.. ఈ సినిమాలోని ప్రధానపాత్రధారులు 15 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ‘3 ఇడియట్స్’ కథనం సాగుతుందని బాలీవుడ్ భోగట్టా.ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆమిర్‌ఖాన్ , రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్ లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్ రానుందని ఓ ప్రకటన వచ్చింది. మరి.. ‘3 ఇడియట్స్’ సీక్వెల్ ముందు సెట్స్‌కి వెళుతుందా? లేక దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ మొదలవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. -
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సీక్వెల్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలు వచ్చాక ఆడియన్స్ సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. క్రైమ్ అండ్ సెస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. కంటెంట్ నచ్చితే చాలు ఓటీటీల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అలా 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మర్టర్ మిస్టరీ థ్రిల్లర్ రాత్ అకేలి హై. కోవిడ్ సమయంలో ఈ మూవీ రిలీజైంది.తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా రాత్ అకేలి హై.. ది బన్సల్ మర్డర్స్ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సీక్వెల్ మూవీ డిసెంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదకగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే మరోసారి తమ పాత్రల్లో అలరించనున్నారు. ఈ సీక్వెల్లో కొత్తగా చిత్రాంగద సింగ్, రజత్ కపూర్, రేవతి, దీప్తి నావల్, సంజయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఇటీవల గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రీమియర్ షో ప్రదర్శించారు.ఈ సినిమాకు హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించారు. స్మితా సింగ్ రాసిన ఈ థ్రిల్లర్ మూవీని ఆర్వీఎస్‌పీ, మాక్‌గఫిన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. #RaatAkeliHai : #TheBansalMurders Tamil Dubbed Movie OTT Release Sets To Premiere From December 19th on Netflix Also In Telugu Hindi pic.twitter.com/dxhpWaJ15l— SRS CA TV (@srs_ca_tv) December 7, 2025 -
రాత్రిపూట మనోజ్ ఫోన్ కాల్.. ఎంతో ఏడ్చా: బాలీవుడ్ నటుడు
సినిమా లేదా సిరీస్ బాగుందంటే జనం ఆటోమేటిక్‌గా చూస్తారు. సెలబ్రిటీలు కూడా ఆయా ప్రాజెక్ట్‌ను మెచ్చుకుంటూ పోస్టులు పెడతారు. అయితే బాలీవుడ్లో ఇలా మెచ్చుకునే ప్రోగ్రామ్స్ ఉండవంటున్నాడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. ఈ సిరీస్ మూడో సీజన్ ఇటీవలే రిలీజవగా మంచి రెస్పాన్స్ వచ్చింది.జీవితంలో మర్చిపోలేనుతాజాగా ఫ్యామిలీ మ్యాన్ టీమ్ అంతా ఓ చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా జైదీప్ అహ్లావత్ మాట్లాడుతూ.. పాతాళ్ లోక్ సీజన్ 1 రిలీజైనప్పుడు మనోజ్ రాత్రిపూట నాకు ఫోన్ చేసి పావుగంటపైనే మాట్లాడాడు. అది నేను నా జీవితంలో మర్చిపోలేను. ఆ ఫోన్‌కాల్ తర్వాత నేనెంతో ఏడ్చాను అని చెప్పాడు. ఇంతలో మనోజ్ మాట్లాడుతూ.. ఆ రోజు ఫోన్లో ఏం చెప్పానంటే అతడు ఒక ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తే అందులో తాను ఒక విద్యార్థిగా చేరతానన్నాను అని గుర్తు చేసుకున్నాడు. అభద్రతా భావం ఎక్కువఆ వెంటనే ఇండస్ట్రీలో ఇలా ఒకరినొకరు పొగడటం చాలా తక్కువ అని చెప్పాడు. ఏ సెలబ్రిటీ కూడా ఫోన్ చేసి నీ యాక్టింగ్ బాగుంది, నీ ప్రాజెక్ట్ బాగుంది అని చెప్పరు. ఎందుకంటే వాళ్లకు అభద్రతా భావం ఎక్కువ. ఇప్పటికీ నేను మంచి పాత్రల కోసం ఫోన్ చేసి అడుగుతుంటాను. కష్టజీవిగా ఉండటానికే నేను ఇష్టపడతాను అని మనోజ్(Manoj Bajpayee) చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్ బాజ్‌పాయ్, జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat).. గతంలో గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్ అనే వెబ్ సిరీస్‌లో, చిట్టగ్యాంగ్ మూవీలో నటించారు.చదవండి: చిన్న వయసులో చాలా చూశా.. ఏడ్చేసిన కృతీ శెట్టి -
స్టార్ డైరెక్టర్‌తో సినిమా.. రూమర్స్‌పై స్పందించిన అమిర్ ఖాన్..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూలీ మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఈ చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటించగా.. బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత అమిర్ ఖాన్‌తో మూవీ తెరకెక్కించేందుకు లోకేశ్ రెడీ అయ్యారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అటు కోలీవుడ్.. ఇటు బాలీవుడ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా రద్దైనట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే స్టోరీని మరో నటుడితో లోకేశ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ స్పందించారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిర్ ఈ విషయంపై మాట్లాడారు. కాగా.. అమిర్‌తో సినిమా పవర్ఫుల్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తానని లోకేశ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.మరోవైపు లోకేశ్ కనగరాజ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోగా డీసీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వామిక గబ్బి హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా రజనీకాంత్- కమల్‌హాసన్‌లతో లోకేశ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో పాటు ఖైదీ -2 మూవీని ఎప్పుడో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్ బిజీగా ఉండడం వల్లే అమిర్ ఖాన్‌తో చిత్రంపై రూమర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. -
60 ఏళ్లకు లవ్‌లో పడాలనుకోలే..
అరవై ఏళ్లకు ఎవరైనా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ సినిమా హీరోలు మాత్రం యంగ్ హీరోలకు పోటినిచ్చేలా ఎలాంటి సినిమాలు తీయాలన్న ప్లానింగ్‌లో ఉంటారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఆ పనితో పాటు మరో పనిలో కూడా ఉన్నాడు. గౌరీ స్ప్రాట్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయాన్ని గతంలోనే అధికారికంగా వెల్లడించాడు.మూడోసారి ప్రేమలో..రెండు పెళ్లిళ్లు - విడాకుల తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డానని తెలిపాడు. కానీ ఈ ఏజ్‌లో లవ్‌లో పడతానని అస్సలు ఊహించలేదని, ప్రేమ కోసం పాకులాడలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ వేదికపై ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను మళ్లీ రిలేషన్షిప్లో అడుగుపెడతానని అస్సలు అనుకోలేదు. కానీ గౌరీ నా జీవితంలో చాలా ప్రశాంతతను, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. తనొక అద్భుతమైన వ్యక్తి. తనను కలవడమే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. గొడవల్లేవ్వైవాహిక బంధంలో సక్సెస్ అవకపోయినప్పటికీ మాజీ భార్యలు రీనా, కిరణ్‌లను కలుస్తూ ఉంటాను. ఇప్పుడు గౌరీ కూడా యాడ్ అయింది. నేను వ్యక్తిగా ఎదిగేందుకు వీళ్లంతా చాలా దోహదపడ్డారు. అందుకు నేను వారిని ఎంతో గౌరవిస్తాను. రీనా దత్తాతో నేను విడిపోయినప్పటికీ మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మంచి స్నేహితులుగా కలిసే ఉంటాం. ఫస్ట్ పెళ్లికిరణ్ విషయంలోనూ అంతే.. తను కూడా ఎంతో అద్భుతమైన వ్యక్తి. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా మాత్రం కలిసే ఉన్నాం. రీనా.. ఆమె పేరెంట్స్, కిరణ్.. ఆమె పేరెంట్స్.. నా తల్లిదండ్రులు.. అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఆమిర్ ఖాన్.. 1986లో రీనా దత్తాను పెళ్లాడాడు. వీరికి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ సంతానం. రెండో పెళ్లికొంతకాలానికి దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2022లో విడిపోయారు. ఆ తర్వాత ఆమిర్ (Aamir Khan).. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు . వీరికి కుమారుడు ఆజాద్ సంతానం. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడు.చదవండి: తనూజ చెల్లి వివాహం.. ఫోటోలు వైరల్ -
దురంధర్ బాక్సాఫీస్.. అంచనాలను మించిపోయిన వసూళ్లు..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. ఈ చిత్రం ఇటీవల డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ శుక్రవారం రిలీజైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలైన రెండు రోజుల్లో రూ.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు వీకెండ్ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా రూ.72 కోట్ల గ్రాస్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. శనివారం రాత్రి షోల్లో 63 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఆదివారం రోజు వరల్డ్ వైడ్ వందకోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్ ఉహించినా దానికంటే అధిక కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రణవీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. పాకిస్తాన్ నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ మూవీని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ గూఢచారి పాత్ర పోషించారు. -
బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?
టీమిండియా యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ డేటింగ్ అంటూ వార్తలు కొత్తేం కాదు. గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు తెలుగు యాంకర్ వర్షిణితో ఇతడు డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వచ్చాయి. తర్వాత తర్వాత అవి కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయాయి. ఇప్పుడు సుందర్, ఓ బాలీవుడ్ నటి, స్పోర్ట్స్ ప్రెజెంటర్‌తో డేటింగ్ చేస్తున్నాడని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?) క్రికెటర్లు.. హీరోయిన్లతో డేటింగ్, పెళ్లి చేసుకోవడం లాంటివి కొత్తేం కాదు. ఇప్పుడు ఆ లిస్టులోకి సుందర్ చేరుతాడా అనిపిస్తుంది. ఎందుకంటే హిందీ నటి సాహిబా బాలీతో ఓ కేఫ్‌లో సుందర్ జంటగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఎప్పటిది అనేది తెలియట్లేదు గానీ సుందర్-సాహిబా డేటింగ్ గురించి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు.సాహిబా బాలీ విషయానికొస్తే.. ఈమె కశ్మీరీ కుటుంబానికి చెందిన అమ్మాయి. నాటకాలతో మొదలుపెట్టి హిందీలో పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఐపీఎల్లో స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గానూ కనిపించి ఆకట్టుకుంది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ టైంలోనూ క్రికెట్ యాంకర్‌గా పనిచేసింది. అయితే సుందర్-సాహిబా మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా అనేది తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం డేటింగ్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్‌కి ఓ గుణపాఠం!) -
రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ
బుల్లితెర నటి సారా ఖాన్ రెండో పెళ్లి చేసుకుంది. నటుడు క్రిష్ పాఠక్‌ను రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. రామాయణ సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లాహిరి కుమారుడే క్రిష్ పాఠక్. డిసెంబర్ 5న ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులు, బుల్లితెర తారల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. రెండో పెళ్లిఇందుకు సంబంధించిన ఫోటోలను సారా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ కొత్త జంట తమ సంగీత్‌లో కూలీ సినిమాలోని మోనికా సాంగ్‌కు స్టెప్పులేశారు. అలాగే హిందీ పాటలకు సైతం కాలు కదిపారు. కాగా సారా ఖాన్.. సాప్న బాబుల్ కా బిడాయి సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది. బుల్లితెరపై, వెండితెరపై..పలు సీరియల్స్‌తో పాటు జర నాచ్కే దిఖా, నాచ్ బలియే 4 వంటి డ్యాన్స్ రియాలిటీ షోలలోనూ పాల్గొంది. డార్క్ రెయిన్బో, సైనైడ్, హమారీ అధూరీ కహాని వంటి చిత్రాల్లోనూ నటించింది. ఓటీటీలో లాక్ అప్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. హిందీ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో సారా (Sara Khan) పాల్గొంది. అదే షోలో నటుడు అలీ మర్చంట్ కూడా పాల్గొన్నాడు. బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.మొదటి పెళ్లిబయటకు వచ్చాక 2010లో పెళ్లి చేసుకున్నారు. కానీ, వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. తర్వాత అలీ మర్చంట్ 2016లో అనమ్ మర్చంట్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేకపోయింది. 2021లో దంపతులిద్దరూ విడిపోయారు. దర్వాత తన స్నేహితురాలు ఆండ్లీబ్ జైదీని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Saaraa Khan (@ssarakhan) చదవండి: సమంత ఆ ఒక్క పని చేస్తే చాలు: హీరోయిన్ చిన్నత్త -
చెల్లి పెళ్లి చేసిన యంగ్ హీరో.. ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో పెళ్లి సందడి. ఇతడి చెల్లి కృతికకు శుక్రవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్‌తో ఏడడుగులు వేసింది. కార్తీక్ ఆర్యన్ సొంతూరు అయిన గ్వాలియర్‌లోని ఓ రిసార్ట్‌లో ఈ శుభకార్యం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన కార్తీక్.. భావోద్వేగానికి గురై పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్‌కి ఓ గుణపాఠం!) 'నీ ప్రపంచం చాలా మారింది. అందులో ఈ రోజు ఒకటి. నా కికీని పెళ్లి కూతురిలా చూస్తుంటే ఇన్నేళ్లు ఒక్క క్షణంలా అనిపిస్తుంది. నువ్వు నా వెనక పరుగెత్తడం దగ్గర నుంచి ఇప్పుడు ఎంతో ఆనందంగా పెళ్లి కూతురిలా నడిచి వస్తున్నావ్. నిన్ను ఇలా చూస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. కానీ ఎప్పటికీ నువ్వు నా చిట్టి చెల్లిలివే. ఈ ప్రయాణం నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తుందనుకుంటున్నాను' అని కార్తీక్ ఆర్యన్ ఎమోషనల్ అయిపోయాడు.కార్తీక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011 నుంచి బాలీవుడ్లో మూవీస్ చేస్తున్నాడు. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్ని ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, చందు ఛాంపియన్, భూల్ భులయ్యా 3 తదితర చిత్రాలతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతడి చెల్లి పేరు కృతిక తివారీ. ఈమె డాక్టర్. ఇప్పుడు ఈమెకే పెళ్లయింది. కార్తీక్ ప్రస్తుతం 'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరీ తు మేరీ' అనే సినిమా చేశాడు. ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఈ ఏడాది టాప్- 10 సినిమాలు ఇవే.. తెలుగు నుంచి ఒకే ఒక్కటి) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ త్వరలోనే రెండోసారి తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియాలో వెల్లడించింది. తాజాగా ఈ నటి తన బేబీ బంప్ ఫోటోలను ఆన్లైన్లో షేర్ చేసింది. నల్లటి బనారస్ చీరలో బేబీ బంప్‌తో ఉన్న నటి ఫోటోలను చూసిన అభిమానులు బేబీ ఆన్ ద వే అంటూ కామెంట్లు చేస్తున్నారు.వ్యాపారవేత్తతో పెళ్లిప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో వాయు అనే కుమారుడు జన్మించాడు. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో 'సావరియా' మూవీతో సోనమ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సినిమాలుబాంబే టాకీస్, బ్లైండ్, ప్రేమ రతన్ ధన్‌పాయో, నీర్జా, సంజు, థాంక్యూ, రాంఝన, ఖుబ్సూరత్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సోనమ్ (Sonam Kapoor) బ్యాటిల్ ఫర్ బిట్టోరా సినిమా చేస్తోంది. ఇది అనూజా చౌహాన్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇది ప్రకటించి రెండేళ్లవుతున్నా మళ్లీ దానిపై ఎటువంటి అప్డేట్ లేదు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) చదవండి: జుట్టు పీక్కునేలా గొడవలు పడ్డాం: హీరోయిన్ -
రేపు హైదరాబాద్‌కు హీరో సల్మాన్ ఖాన్ (ఫోటోలు)
-
జుట్టు పీక్కునేంతలా మామధ్య గొడవలు: సోనాక్షి
ఈరోజుల్లో ప్రేమపెళ్లి అనేది కామన్. కానీ భిన్న వర్గాలవారు పెళ్లి చేసుకుంటేనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ అలాంటి ట్రోలింగ్ బారిన పడింది. ఈమె జహీర్ ఇక్బాల్‌ను ప్రేమించి పెళ్లాడింది. అయితే అన్ని ప్రేమకథల్లోలాగే తమ లవ్‌స్టోరీలో కూడా చాలా గొడవలు జరిగాయంటోంది.గొడవలుసోనాక్షి మాట్లాడుతూ.. మేము మూడేళ్లపాటు ప్రేమలో ఉన్నాక మామధ్య చాలా గొడవలు జరిగాయి. ఎంతలా అంటే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని పీక్కునేంతలా! అసలు ఒకరి ఆలోచనలను మరొకరం అర్థం చేసుకోలేకపోయాం. అలా అని విడిపోవాలనుకోలేదు. దీన్ని పరిష్కరించుకోవాలనుకున్నాం. నెగెటివ్‌గా చూడొద్దని..కపుల్స్ థెరపీకి వెళ్దామని జహీర్ ఐడియా ఇచ్చాడు. ఈ ఆలోచనేదో బాగుందనిపించింది. రెండు సిట్టింగ్స్‌లోనే మా మధ్య గొడవలు పరిష్కారమయ్యాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. ప్రతీది నెగెటివ్‌గా చూడకూడదని తెలుసుకున్నాం అని చెప్పుకొచ్చింది. అలా ఏడేళ్లు ప్రేమలో మునిగి తేలిన సోనాక్షి (Sonakshi Sinha), జహీర్ 2024 జూన్ 23న పెళ్లి చేసుకున్నారు. ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. సల్మాన్ పార్టీలో తొలిసారి..ఇకపోతే వీరిద్దరూ డబుల్ XL (2022) అనే మూవీలో నటించారు. అంతకంటే ముందు వీరు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన పార్టీలో కలిశారు. తర్వాత 2017లో ట్యూబ్‌లైట్ ప్రీమియర్‌లో మరోసారి కలుసుకున్నారు. అప్పుడే సరదాగా ఐదుగంటల పాటు మాట్లాడుకున్నారు. అప్పుడే ఈ బంధం ఏదో స్పెషల్‌గా ఉందని సోనాక్షికి అర్థమైంది. తర్వాత అదే నిజమై వైవాహిక బంధంగా మారింది. సోనాక్షి చివరగా జటాధర అనే తెలుగు మూవీలో నటించింది.చదవండి: పవన్ కల్యాణ్.. బిగ్‌బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా? -
ముంబై : స్వదేశ్ ఫ్లాగ్షిప్ స్టోర్ వేడుకలో నీతా అంబానీతో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
తండ్రయిన వెంటనే ఖరీదైన కారు కొన్న హీరో
బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. నవంబర్ 7న కత్రినా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబును ఆడించడంలోనే ఈ దంపతులిద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. బాబు పుట్టాక తొలిసారి ఓ ఖరీదైన వస్తువు కొన్నారు.లగ్జరీ కారులెక్సస్ బ్రాండ్‌కు LM350h 4S మోడల్ కారును తమ సొంతం చేసుకున్నారు. దీని విలువ రూ.3.20 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. విక్కీ కౌశల్ ఈ కారును నడుపుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కారులో ప్రీమియం సౌండ్‌తో పాటు 48 ఇంచుల హెచ్డీ డిస్ప్లే ఉంది. సీటింగ్ కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది.అదో కొత్త ఫీలింగ్ఇకపోతే ఈ ఏడాది తనకు ఎక్కువ సంతోషాన్నిచ్చిన క్షణం.. తాను తండ్రవడమేనని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు విక్కీ కౌశల్. అది మాటల్లో చెప్పలేని అనుభూతి అని, ఒక మ్యాజికల్ మూమెంట్ అని పేర్కొన్నాడు. ఈ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా భావోద్వేగానికి లోనవుతానని తనకు తెలుసని.. బాబును చేతుల్లోకి తీసుకున్నప్పుడు మనసుకెంతో ప్రశాంతంగా అనిపించిందన్నాడు. అలాంటి అనుభూతి అంతకుముందెన్నడూ కలగలేదని గుర్తు చేసుకున్నాడు. కాగా విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రినా 2021 డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)చదవండి: అఖండ 2.. ఇప్పట్లో రిలీజ్ లేనట్లేనా? -
లండన్‌లో రాజ్... సిమ్రాన్
సినిమా ప్రేమికులందరూ అమితంగా ఇష్టపడిన ప్రేమ కావ్యం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’. ఈ సినిమాలో రాజ్ (షారుక్ ఖాన్), సిమ్రాన్ (కాజోల్)ల ప్రేమకథ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో తెలిసిందే. తాజాగా లండన్స్ లోని లీసెస్టర్ స్క్వేర్‌లో రాజ్, సిమ్రాన్‌ల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయడం విశేషం. లండన్ లీసెస్టర్ స్క్వేర్‌లో విగ్రహ రూపంలో ఆవిష్కరింపబడ్డ తొలి ఇండియన్ సినిమా ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ కావడం ఓ అరుదైన గౌరవం. షారుక్ ఖాన్, కాజోల్ జోడీగా ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన చిత్రం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’.యశ్ చోప్రా నిర్మించిన ఈ సినిమా 1995 అక్టోబరు 20న విడుదలైంది. అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా అరుదైన ఘనతను సాధించిన చిత్రం కూడా ఇదే. తెలుగులో ‘ప్రేమించి పెళ్లాడుతా’ పేరుతో రిలీజై, ఇక్కడా భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీలో షారుక్–కాజోల్‌ల సిగ్నేచర్ పోజుతో కూడిన కాంస్య విగ్రహాలను రూపొంందించారు. లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను షారుక్, కాజోల్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి యశ్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయ్ విదానీ, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాస్ మోర్గన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని స్వచ్ఛమైన మనసుతో ఎంతగానో ప్రేమించి తీశాం. ఈ చిత్రం రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు నేను, కాజోల్ ప్రేక్షకుల నుంచి ప్రేమను పొంందుతూనే ఉన్నాం’’ అని తెలిపారు. కాజోల్ మాట్లాడుతూ– ‘‘లండన్‌లో విగ్రహం ఆవిష్కరించిన దృశ్యాన్ని చూసినప్పుడు... ఆ చారిత్రాత్మక అనుభూతిని మళ్లీ పొంందినట్లుగా అనిపించింది’’ అని పేర్కొన్నారు. -
'బాలీవుడ్ అంతా మొసళ్లతో నిండిపోయింది'.. నటి సంచలన కామెంట్స్..!
ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మొసళ్లతో నిండిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్య ఖోస్లా ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడింది. తాను విలువలతో రాజీ పడకుండా నిజాయితీగా ఉంటానని తెలిపింది. అవకాశాల కోసం తానెప్పుడు ఆత్మ గౌరవాన్ని అమ్ముకోనని దివ్య ఖోస్లా పేర్కొంది. ఆస్క్ మీ ఎనిథింగ్ పేరుతో నిర్వహించిన ఈ సెషన్లో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.దివ్య ఖోస్లా మాట్లాడుతూ..'బాలీవుడ్లో చాలా మొసళ్లు ఉన్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ నువ్వు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. పని కోసం నా ఆత్మ గౌరవాన్ని నేను ఎప్పుడూ అమ్ముకోను. యూకేలో ఓ సినిమా కోసం సున్నా డిగ్రీల టెంపరేచర్లో దాదాపు 42 రోజుల పని చేశా. అది నా కెరీర్లో అత్యంత అద్భుతమైన షూట్. దాదాపు మైనస్ 10 డిగ్రీలు.. అయినా కూడా నాన్-స్టాప్‌గా చిత్రీకరించాం. ఇతర సినిమాలతో పోల్చడానికి నాకు ఒక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది.' అని తెలిపింది.అంతేకాకుండా భూషణ్‌కుమార్‌తో విడాకులపై కూడా దివ్య ఖోస్లా స్పందించింది. మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని అడగ్గా.. ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. కానీ మీడియా అది నిజం కావాలని కోరుకుంటుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా.. ఆమె 2005లో టీ-సిరీస్ ఛైర్మన్, ఎండీ భూషణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే దివ్య ఖోస్లా చివరిసారిగా నీల్ నితిన్ ముఖేష్‌తో కలిసి నటించిన థ్రిల్లర్-కామెడీ ఏక్ చతుర్ నార్లో కనిపించింది. -
విమానాలు రద్దు.. 'లక్షలు' ఖర్చు చేసిన సెలబ్రిటీలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం విమాన సర్వీసులు రద్దు అనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా మారిన నిబంధనల వల్ల ఎక్కడిక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో విమానాలు రద్దయ్యాయి. చాలామంది సామాన్యులు.. విమానాశ్రయాల్లో గంటలు గంటలు పడిగాపులు కాస్తున్నారు. వీళ్లలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. విమానాలు వాయిదా, రద్దు కారణంగా తామెంత ఫస్టేషన్కి గురవుతున్నామో చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' పునర్నవి)రెండు రోజుల క్రితం తెలుగు సీనియర్ నటుడు నరేశ్.. విమాన సర్వీస్ ఆలస్యం కారణంగా తనెలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారో రాసుకొచ్చారు. చెప్పిన టైమ్‌కి చేరుకున్నా సరే విమానాలు లేటు అయ్యాయని, దీనికి తోడు తమ లాంటి నటులకు ప్రైవసీ కూడా కరువైందని, జనాలు గుర్తుపట్టేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ వీడియోని పోస్ట్ చేశారు.మరోవైపు బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య.. స్టేజీ ప్రోగ్రాం కోసం గోవా-ముంబై, ముంబై నుంచి కోల్‌కతా వెళ్లాల్సి ఉంది. అయితే తన ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ కావడంతో ఏకంగా రూ.5.40 లక్షలు ఖర్చు చేసి వేరే విమానంలో వెళ్లాల్సి వచ్చిందని చెప్పి అసహనం వ్యక్తం చేశారు. నటి నియా శర్మ కూడా ఇలా తను బుక్ చేసుకున్న ఫ్లైట్ రద్దయిన కారణంగా.. ఏకంగా రూ.54 వేలు చెల్లించి మరో విమానంలో తన గమ్యస్థానానికి చేరాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన టీమ్ సభ్యుల్లో నలుగురు.. మూడు వేర్వేరు విమానల్లో గమ్యస్థానానికి చేరుకున్నామని కూడా చెప్పుకొచ్చింది. వీళ్లే కాదు ఇలా తమ ఇబ్బందిని బయటపెట్టని సెలబ్రిటీలు మరికొందరు కూడా ఉండొచ్చు.(ఇదీ చదవండి: 'అఖండ 2' విడుదల వాయిదాకు కారణాలివే!)The fun of Flying ended in the 90s 🥹. Reached in time at HYD Indigo terminal at 8:15 AM. All Indigo flights delayed . Packed food by then to eat in the flight. Shopping & rush back to see a full scale battle between the ground crew and passenger. Filth🤬. To make matters worse,… pic.twitter.com/rj7bCArbgD— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) December 3, 2025 View this post on Instagram A post shared by Vidyullekha / Vidyu Raman (@vidyuraman) -
మొదట ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడొద్దు.. అమ్మ సలహా!
కెవ్వు కేక, చయ్యచయ్య చయ్యా, మున్నీ బద్నాం హూయి.. వంటి పాటలతో దుమ్ములేపింది మలైకా అరోరా. ఆకర్షణీయమైన అందం, అదిరే స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించింది. ఇటీవలే థామా సినిమాలోనూ 'పాయిజన్ బేబీ' పాటలో తళుక్కుమని మెరిసింది. ఐటం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను చూసింది.పెళ్లి - విడాకులుఓ కాఫీ యాడ్ షూట్లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్‌ను కలిసింది మలైకా. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వెంటనే మరేం ఆలోచించకుండా పెళ్లి చేసుకుంది. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ సంతానం. రానురానూ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2015లో వీరిద్దరూ విడిపోయారు. యంగ్ హీరోతో డేటింగ్అనంతరం తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన వీరు ఆ తర్వాత సడన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ హర్ష్ మెహతా అనే వ్యాపారితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి ఇచ్చిన సలహాను ఎలా పెడచెవిన పెట్టిందో చెప్పుకొచ్చింది. డేట్ చేసినవాడితో పెళ్లెందుకు?ఆమె మాట్లాడుతూ.. మా అమ్మ ఎప్పుడూ జీవితాన్ని ఎంజాయ్ చేయమని చెప్తుండేది. ఫస్ట్ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చింది. కానీ, నేనదే చేశాను. నేను ప్రేమించిన మొదటి వ్యక్తినే పెళ్లాడాను. నా నిర్ణయాన్ని అమ్మ తప్పుపట్టింది. అప్పుడే పెళ్లి చేసుకుంటే నీకోసం బయట ఏం దాగి ఉందో నీకెలా తెలుస్తుంది? అని కంగారుపడింది. ఏం కాదమ్మా.. అని సర్ది చెప్పాను. మేం ఏం చేయాలనుకున్నా సరే తనెన్నడూ అడ్డు చెప్పలేదు.మగవాళ్లను తప్పుపట్టరుకానీ ఈ ప్రపంచంలో మగవాడు ఏం చేయాలనుకున్నా ఎవరూ తప్పుపట్టరు. విడాకులు తీసుకున్నా.. తన వయసులో సగం ఏజ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సరే.. వావ్ అని పొగుడుతారు. అదే పని మహిళ చేస్తే మాత్రం ఆమెను నానామాటలంటారు. అంతెందుకు? ఆడవాళ్లు ధైర్యంగా నిలబడి ముందుకెళ్తుంటే కూడా చూసి ఓర్వలేరు అని మలైకా అరోరా (Malaika Arora) చెప్పుకొచ్చింది.చదవండి: టికెట్ టు ఫినాలే గెలిచేదెవరు? -
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3.. ఓటీటీలో క్రేజీ రికార్డ్..!
బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్‌పాయ్ కీలక పాత్రలో వచ్చిన సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో తాజాగా మూడో సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3 అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ సిరీస్ క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధికమంది వీక్షించిన వెబ్‌సిరీస్‌గా నిలిచింది. ఈ క్రమంలో గత రెండు సీజన్ల వ్యూస్‌ను అధిగమించింది. అంతే కాకుండా భారత్ సహా 35 దేశాల్లో టాప్-5లో ట్రెండింగ్‌లో ఉంది. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్, మలేషియా దేశాల్లోనూ ఆదరణ దక్కించుకుంది.రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 21 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో జైదీప్ అహ్లావత్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. -
తనకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తున్న మరో హీరోయిన్!
సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. ఒకవేళ వీళ్లకు చెల్లి లేదా తమ్ముడు ఉంటే వాళ్లకు ముందుగా వివాహం చేసేస్తారు. తర్వాత ఎప్పుడో టైమ్ చూసుకుని వీళ్లు కొత్త జీవితం ప్రారంభిస్తారు. గతంలో సాయిపల్లవి ఇలానే తనకంటే ముందు చెల్లి పెళ్లి చేసింది. ఇప్పుడు లిస్టులోకి మరో స్టార్ హీరోయిన్ చేరబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అత్తారింట్లోకి సామ్.. రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్)మహేశ్ బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్ అయిన కృతి సనన్.. తర్వాత 'దోచేయ్' అనే మరో తెలుగు మూవీ చేసింది. ఈ రెండు ఫ్లాప్ అయ్యేసరికి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. బాగానే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అడపాదడపా మూవీస్ చేస్తూ బిజీగానే ఉంది. ఈమె చెల్లి నుపుర్ కూడా నటినే. గతంలో ఆల్బమ్ సాంగ్స్‌లో యాక్ట్ చేసింది. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఫెయిలైంది. ఈమె యాక్టింగ్ కూడా తేలిపోవడంతో తెలుగులో మరో ఆఫర్ రాలేదు. ప్రస్తుతానికైతే హిందీలో ఓ చిత్రంలో నటిస్తోంది.అలాంటిది ఇప్పుడు నుపుర్ పెళ్లి చేసుకోనుందనే న్యూస్ బయటకొచ్చింది. రాజస్థాన్‌లోని ఉదయపుర్ వేదికగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తోంది. సింగర్ స్టెబిన్ బెన్‌తోనే నుపుర్ కొత్త జీవితం ప్రారంభించనుందని టాక్. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయని.. జనవరి 8,9 తేదీల్లో ఈ శుభాకార్యం జరగనుందని సమాచారం. ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు ఇండస్ట్రీకి చెందిన కొద్ది మంది మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. అయితే నుపుర్ లేదా స్టెబిన్ ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.(ఇదీ చదవండి: బుకింగ్ ఓపెన్.. ఆ విషయంలో టెన్షన్ పెడుతున్న 'రాజాసాబ్') -
మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత
-
లవ్ ఫెయిల్... సరదాగా నవ్వించే మూవీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఫెయిల్యూర్నాటి దేవదాసు నుండి నేటి గర్ల్ ఫ్రెండ్ వరకు ప్రేమను ఓ అందమైన దృశ్య కావ్యంగా చిత్రీకరించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. సక్సెస్ఫుల్ ప్రేమ ముందుగా ఫెయిల్యూర్‌తోనే పుడుతుంది. అది ఏ కాలమైనా, ప్రాంతమైనా, భాష అయినా ఇదే సిద్ధాంతం. అందుకేనేమో ఈ థీమ్‌తో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల మదిలో అలా పదిలంగా నిలిచిపోతాయి. కానీ ఓ సీరియస్ ప్రేమ అయిన స్వీట్‌కు కామెడీ అనే కారం తగిలిస్తే ఎలా ఉంటుందో తెలిపేదే ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’.ఎలా ఉందంటే?ఈ సినిమా పేరుతోనే దర్శకుడు ప్రేక్షకుడికి కాస్తంత గిలిగింతలు పెట్టించాడు. కాస్త లోతుగా గమనిస్తే సెటైరికల్ మోడ్‌లో మహా గమ్మత్తుగా ఉందీ టైటిల్. శశాంక్ ఖేతన్ ఈ కథ రాసి, దర్శకత్వం వహించారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రూ. వంద కోట్ల వసూళ్లు దక్కించుకుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం.సన్నీ సంస్కారి తన గర్ల్ ఫ్రెండ్ అయిన అనన్యకు వినూత్న రీతిలో... ఇంకా చెప్పాలంటే బాహుబలి సెటప్‌లో కాస్త భారీగానే ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. సెటప్, గెటప్ అంతా బాగానే ఉన్నా అనన్య మాత్రం కోటీశ్వరుడైన విక్రమ్‌తో తన తల్లిదండ్రులు తనకు పెళ్ళి నిర్ణయించారని సంస్కారికి ససేమిరా నో చెబుతుంది. ఇది విన్న సన్నీ బాగా బాధపడి ఎలాగైనా అనన్యను సొంతం చేసుకోవాలని విక్రమ్ గురించి ఆరా తీస్తాడు. తులసీ కుమారి అనే అమ్మాయితో ఇటీవలే విక్రమ్‌కు బ్రేకప్ అయిన విషయం తెలుసుకొని తులసీ కుమారిని కలవడానికి వెళతాడు. ఈ లోపల అనన్య, విక్రమ్‌ల పెళ్ళి ఆహ్వాన పత్రిక సన్నీతో పాటు తులసీ కుమారికి కూడా అందుతుంది. తులసీతో కలిసి సన్నీ ఈ పెళ్ళి చెడగొట్టడానికి ఓ కుట్ర పన్నుతాడు (Sunny Sanskari Ki Tulsi Kumari Movie Review). మరి... సన్నీ ప్లాన్ సక్సెస్ అయి, అనన్యను పెళ్ళి చేసుకుంటాడా? అలాగే విక్రమ్, తులసీ కుమారి మళ్ళీ కలిసిపోతారా? అన్న విషయం మాత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ సినిమాలోనే చూడాలి. వరుణ్ తన ఈజ్‌తో... అలాగే జాన్వీ తన క్రేజ్‌తో యూత్‌ని బాగా అలరించే సినిమా ఇది. అక్కడక్కడా కాస్త ఓవర్ యాక్షన్ అనిపించినా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు... సరికదా సరదాగా సాగిపోతుంది. వర్త్ టు వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
ఆయనతో పదేపదే కిస్ సీన్ చేయనన్న హీరోయిన్
షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సన్నీ డియోల్ వంటి హీరోలతో ఎక్కువగా జోడీ కట్టింది జూహీ చావ్లా. అలా సన్నీ డియోల్‌తో లూటెరే అనే హిట్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. ఆ విశేషాల గురించి నిర్మాత సునీల్ దర్శన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. 'జూహీ కెరీర్లో ముఖ్య పాత్ర పోషించిన సినిమాల్లో లూటెరె ఒకటి. దివ్య భారతిని కాదని..ఆమె నటించిన సుల్తానాత్ (1986), ఖయామత్ సే ఖయామత్ టక్ (1988) సినిమలను నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. తను చాలా బాగా యాక్ట్ చేయగలదు. అందుకే లూటెరె మూవీలో తనను హీరోయిన్గా తీసుకున్నాం. నిజానికి దివ్య భారతి అప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. తను ఈ సినిమాలో భాగం కావాలని కోరుకుంది. కానీ, ఆమె ఈ పాత్రకు సరిపోదని భావించాం. దర్శకుడు ధర్మేశ్, నేను.. తనను కాదని జూహీ చావ్లాను తీసుకున్నాం.గ్లామర్‌గా చూపించాంఅయితే ఈ సినిమాలో మే తేరీ రాణి తు రాజా అని ఓ బీచ్ సాంగ్ ఉంటుంది. అందులో ఆమె బీచ్‌లో షర్ట్ ధరించి నీళ్లలో తడవాల్సి ఉంటుంది. అప్పటిదాకా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌తో ఉన్న జూహీ చావ్లా.. సడన్‌గా గ్లామర్‌గా కనిపించాలంటే కొంత భయపడింది. కానీ కథ మొత్తం చెప్పాకే తను సినిమా చేసేందుకు ఒప్పుకుంది. కాబట్టి చేయక తప్పలేదు. ముద్దు సన్నివేశంఅలాగే హీరోతో ముద్దు సన్నివేశం ఉంటుందని కూడా చెప్పాం. అలా మొదట్లో సీన్ షూట్ చేశాం. అయితే ఔట్డౌర్లో ఆ సీన్ తీస్తే బాగుంటుందనుకున్నాం. అంతా సిద్ధం చేసుకున్నాక జూహీ రాలేదు. తనకు వేరే షూటింగ్ ఉందని సాకు చెప్పి తప్పించుకుంది. సినిమాకు ఆ సన్నివేశం కీలకమని, ఏదో సంచలనం కోసం దాన్ని షూట్ చేయట్లేదని దర్శకుడు అన్నాడు.రీటేక్‌కు ఒప్పుకోలేదుఅలా సన్నీ డియోల్ , జూహి (Juhi Chawla)తో ముద్దు సీన్ తీశారు. అప్పటికీ అది సరిగా రాలేదని రీటేక్ చేయాలన్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన జూహి.. కాంట్రాక్ట్‌లో ఒక ముద్దు సన్నివేశంలో మాత్రమే నటిస్తానని చెప్పాను. అది ఆల్రెడీ చేశానుగా అని వాదించింది. అందుకని ఆమెను బలవంతం చేయకుండా ఫస్ట్ తీసిన సీన్‌ను అలాగే ఉంచాం. ఆ సినిమా జూహీ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది' అని సునీల్ దర్శన్ (Suneel Darshan) చెప్పుకొచ్చాడు.చదవండి: కాంతార దైవాన్ని దెయ్యంగా వర్ణించిన బాలీవుడ్ స్టార్ -
'గుస్తాఖ్ ఇష్క్' చిత్రం ప్రీమియం షోలో బాలీవుడ్ నటుడులు సందడి (ఫొటోలు)
-
గుల్మొహర్ రివ్యూ.. మనసును హత్తుకునే సినిమా
ఇల్లు అంటే కేవలం నాలుగు గదులు అంతేనా? కాదు, ఇల్లు అంటే కుటుంబంలో ఒక భాగం. కుటుంబసభ్యుల ప్రేమానురాగాలకు, అలకలకు, కోపతాపాలకు, రహస్యాలకు, విషాదాలకు.. ఇలా అన్నిరకాల జ్ఞాపకాలకు నిలువెత్తు నిదర్శనం. ఏళ్ల తరబడి ఉన్న సొంతింటిని వీడాలంటే కన్నతల్లికే దూరమవుతున్నట్లు మనసు తల్లడిల్లుతుంది. అలా ఇంటి చుట్టూ తిరిగే కథ గుల్మొహర్.అందరి ఇంటి కథమనోజ్ బాజ్‌పాయ్, షర్మిల ఠాగోర్, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన మూవీ గుల్మొహర్. రాహుల్ చిట్టెల, అర్పిత ముఖర్జీ ఇల్లు, అందులో ఉండే కుటుంబం గురించి కథ రాసుకున్నారు. చూడటానికి సింపుల్‌గా ఉన్నా కొన్ని సన్నివేశాలు మనసును కదిలిస్తాయి. కుసుమ్ బాత్రగా షర్మిల నటన ఆకట్టుకుంటుంది. అందరి ఇంట్లోలాగే తను కూడా ఇంటిపెద్దగా, నాయినమ్మగా పెత్తనం చెలాయిస్తుంటుంది. కానీ, తన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు.కథఅందరం కలిసికట్టుగా జీవించాలనుకునే వ్యక్తి అరుణ్ (మనోజ్ బాజ్‌పాయ్). కానీ అతడి కుమారుడు ఆది (సూరజ్ శర్మ) భార్యతో కలిసి విడిగా ఉండాలనుకుంటాడు. తండ్రి సాయం లేకుండా సొంతంగా తన కాళ్లపై నిలబడాలనుకుంటాడు. అది అరుణ్‌కు నచ్చదు. కుటుంబం ఎప్పుడూ ఒకేచోట ఉండాలన్నది అతడి విధానం. ఇంతలో అతడి తల్లి కుసుమ్ కూడా పుదుచ్చేరిలో ఇల్లు కొన్నానని, ఒక్కతే అక్కడ ఉండబోతున్నానని చెప్పి బాంబు పేలుస్తుంది. ఇది ఎవరికీ మింగుడు పడకపోయినా ఆమెను ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయరు.ఎలా ఉందంటే?చేతి ఐదువేళ్లు ఒకేలా ఎలా ఉండవో.. ఇంట్లోని మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కొరిది ఒక్కో స్వభావం. దాన్ని సినిమాలో చాలా బాగా చూపించారు. (Gulmohar Movie Review) క్లైమాక్స్‌లో మనోజ్ తన నటనతో ఏడిపించేశాడు. ఆ ఇంట్లో చివరి హోలీ చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది. అది చూశాక మన మనసులు కూడా కాస్త తేలికపడతాయి. అందర్నీ ఇంతలా మెప్పించిన ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. -
దీపికా పదుకొణె చెల్లి పెళ్లి.. ఈమె కూడా సినీ ఫ్యామిలీలోకే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. గతేడాది 'కల్కి 2989' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత కొన్నిరోజుల నుంచి ఏదో రకంగా వార్తల్లో ఉంటూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈమె కుటుంబం గురించి ఓ రూమర్ వినిపిస్తుంది. దీపిక చెల్లి కూడా సినీ నేపథ్యమున్న కుటుంబంలోకే కోడలిగా వెళ్లనుందని అంటున్నారు. ఈ మేరకు అబ్బాయి ఎవరు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ)ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణెకి ఇద్దరు కుమార్తెలు అందులో దీపిక పెద్దమ్మాయి. చిన్నమ్మాయి అనీషా. నటిగా దీపిక గుర్తింపు తెచ్చుకోగా.. అనీషా మాత్రం ప్రొఫెషనల్ గోల్ఫర్గా పేరు సంపాదించింది. ప్రస్తుతం అక్కకు చెందిన 'లివ్ లవ్ లాఫ్' అనే స్వచ్ఛంద సంస్థకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తోంది. అనీషా గత కొన్నాళ్ల నుంచి రోహన్ ఆచార్య అనే బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉందని, త్వరలో వీళ్ల పెళ్లి జరగనుందనే న్యూస్ ఇప్పుడు వినిపిస్తోంది.రోహన్ విషయానికొస్తే ఇతడి ముత్తాత బిమల్ రాయ్.. గతంలో బాలీవుడ్లో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రోహన్ సోదరిని.. ధర్మేంద్ర మనవడు (సన్నీ డియోల్ కొడుకు) కరణ్ డియోల్ పెళ్లి చేసుకున్నాడు. అలా రోహన్ కుటుంబానికి సన్నీ డియోల్ కుటుంబానికి బంధుత్వం ఏర్పడింది. ఇప్పుడు దీపిక సోదరి అనీషా.. రోహన్‌ని పెళ్లి చేసుకుంటే.. ఈమె కూడా ధర్మేంద్ర కుటుంబంలో ఒకరు అవుతుంది. అక్కలానే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబంలోకే కోడలిగా వెళ్లినట్లు అవుతుంది. ప్రస్తుతానికి దీని గురించి ఇంకా అధికారికంగా చెప్పనప్పటికీ రాబోయే కొన్ని నెలలో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'పెద్ది' ఫైట్.. స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో!) -
గుడ్‌న్యూస్ చెప్పిన 'జాట్' విలన్
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా శుభవార్త చెప్పాడు. 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. రణ్‌దీప్ హుడా నటి లిన్ లైశ్రామ్ను 2023లో పెళ్లి చేసుకున్నాడు. నేడు (నవంబర్ 29న) వారి పెళ్లి రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ బ్యూటిఫుల్ ఫోటో షేర్ చేశారు. అందులో దంపతులిద్దరూ పచ్చని చెట్ల మధ్య చలి మంట కాచుకుంటున్నారు. త్వరలో బుజ్జి పాపాయిఈ పోస్ట్ కింద.. రెండేళ్ల ప్రయాణం, ఇప్పుడు మా ఇంట్లోకి ఓ బుజ్జి పాపాయి రాబోతోంది.. అని క్యాప్షన్ జోడించారు. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు రణ్‌దీప్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లిన్ లైశ్రామ్.. ఓం శాంతి ఓం, మేరీ కోమ్, ఉమ్రిక, రంగూన్ వంటి పలు సినిమాలు చేసింది. సినిమా నటుడు రణ్‌దీప్ (Randeep Hooda).. రిస్క్, లవ్ కిచిడీ, జన్నత్ 2, హీరోయిన్, మర్డర్ 3, హైవే, సుల్తాన్, లవ్ ఆజ్ కల్, భాగీ 2 వంటి పలు సినిమాలు చేశాడు. స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగానూ వ్యవహరించాడు. చివరగా జాట్ సినిమాలో విలన్‌గా నటించాడు. ప్రస్తుతం అమెరికన్ ఫిలిం మ్యాచ్బాక్స్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) చదవండి: శ్రావణ భార్గవితో విడాకులు.. హేమచంద్ర ఏమన్నాడంటే? -
ఇఫీ ముగింపు వేడుకల్లో రజనీ, రిషబ్ శెట్టి సందడి (ఫొటోలు)
-
చీప్ పాత్రలు చేయను: రాశీ ఖన్నా
ఊహలు గుసగుసలాడే, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, టచ్ చేసి చూడు.. ఇలా తెలుగులో బోలెడన్ని సినిమాలు చేసింది హీరోయిన్ రాశీఖన్నా.. కానీ, ఈమధ్య తెలుగులో కంటే పరభాషా చిత్రాలతోనే ఎక్కువ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఏకైక మూవీ చేస్తోంది. హిందీలో 120 బహదూర్ మూవీతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించింది. అలాంటివాటికి నోఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ.. ఒక మెట్టు దిగి చీప్ పాత్రలు చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతోంది. రాశీ ఖన్నా మాట్లాడుతూ.. దక్షిణాదిన నేను ఎన్నో కమర్షియల్ సినిమాలు చేశాను. ఓ అడుగు ముందుకేసి హిందీలో బలమైన పాత్రల్నే చేయాలనుకున్నాను. కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టమే.. కానీ, దానికి కూడా లిమిట్ ఉంటుంది. దిగజారిపోయేలా ఉంటే మాత్రం..ఒక్కో యాక్టర్‌కు ఒక్కో రకంగా పరిమితులు ఉంటాయి. నావరకు వస్తే నన్ను చీప్‌గా చూపించే పాత్రలు చేసేందుకు నేను ఒప్పుకోను. ఆ పాత్ర నేను పెట్టుకున్న నిబంధనలను దాటడంతోపాటు, అందులో నేను మరింత దిగజారిపోయినట్లు కనిపిస్తానంటే మాత్రం వెంటనే నో చెప్పేస్తా.. అని రాశీ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో చివరగా 'తెలుసు కదా' సినిమాలో మెప్పించింది.చదవండి: బిగ్‌బాస్ 9: కెప్టెన్ కల్యాణ్ రిపోర్టింగ్ సర్! -
సినిమాలు శుక్రవారమే ఎందుకు విడుదల చేస్తుంటారు?
మీరు ఏ వయసు వాళ్లయినా సరే ఎప్పుడో ఓసారి ఏదో ఓ సినిమా.. థియేటర్లో చూసే ఉంటారు కదా! అలానే ప్రతి శుక్రవారం టాలీవుడ్లో కావొచ్చు బాలీవుడ్లో కావొచ్చు.. కొత్త మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే ప్రతిసారీ శుక్రవారమే ఎందుకు రిలీజ్ చేస్తున్నారనని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఏంటి? లేదంటే మరేదైనా నమ్మకాలు ఉన్నాయా?(ఇదీ చదవండి: పైరసీ ఎప్పుడు మొదలైంది? ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నారు?)మన దేశంలో శుక్రవారమే సినిమాలని విడుదల చేయాలనే ఆచారం మొదటి నుంచి ఏం లేదు. 1940-50ల్లో వారంలో ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేసేవారు. కానీ 1960లో 'మొఘల్ ఏ ఆజం' అనే హిందీ సినిమా.. ఆగస్టు 5న విడుదలై అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. దీంతో అప్పటినుంచి చాలామంది నిర్మాతలు.. శుక్రవారం కొత్త చిత్రాలని విడుదల చేస్తూ వచ్చారు. అలా అదో అలవాటుగా మారిపోయింది. శుక్రవారం అనే కాదు.. గురువారం, శనివారం కూడా కొన్నిసార్లు సినిమాల్ని రిలీజ్ చేస్తుంటారు. తెలుగులో ఇలాంటి సందర్భాలు ప్రస్తుతం అప్పడప్పుడు కనిపిస్తుంటాయి.శుక్రవారమే రిలీజ్ చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది వీకెండ్ కలిసొస్తుందని. చాలా కంపెనీల్లో శుక్రవారంతో వర్క్ పూర్తవుతుంది. శని, ఆదివారాలు సెలవులు ఉంటాయి. వరసగా సెలవులు కావడం వల్ల చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్.. సినిమాల్ని చూసేందుకు ఇష్టపడతారు. మిగతా రోజుల్లో వీళ్లకు సినిమాలు చూసేంత తీరిక ఉండదు. అలా కూడా శుక్రవారం ట్రెండ్ పాతుకుపోయింది.స్వాతంత్ర్యం వచ్చాక చాలా ఏళ్ల పాటు మన దేశంలో కలర్ టీవీలు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రజలు.. సినిమాలని థియేటర్‌కి వెళ్లి మాత్రమే చూసేవారు. దీంతో అప్పట్లో కంపెనీలన్నీ శుక్రవారం.. సగం రోజు తర్వాత సెలవుగా ప్రకటించేవి. తద్వారా ఉద్యోగులు.. తమ కుటుంబ సభ్యుల్ని తీసుకుని థియేటర్లకు వెళ్లేవారని కూడా అంటుండేవారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 20 మూవీస్)ఇవన్నీ సాధారణంగా అనుకునేవి. కానీ శుక్రవారం రిలీజ్ విషయంలో మతపరమైన కారణాలు ఉన్నాయనేది మరికొందరి వాదన. లక్ష్మీ దేవికి శుక్రవారం చాలా ఇష్టమైన రోజు. హిందూ సంప్రదాయంలో శుక్రవారం నాడు చాలామంది కొత్త పనిని ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా సినిమాలని కూడా ఇదేరోజున విడుదల చేస్తే మంచి కలెక్షన్స్, లాభాలు వస్తాయనేది చాలామంది నిర్మాతల నమ్మకం.జ్యోతిష్యంలోనూ శుక్రవారానికి మంచి సంబంధం ఉంది. సినిమా, నిర్మాణం, వినోదం, ఇవన్నీ శుక్ర గ్రహానికి సంబంధించినవి. శుక్రుడు సంపద, ఆనందం, శ్రేయస్సుకు కారకంగా కూడా పరిగణిస్తుంటారు. అందుకే శుక్రవారం సినిమాలని విడుదల చేయడం మరింత పుణ్యమని భావిస్తుంటారు. శుక్రవారం.. శుక్ర గ్రహానికి సంబంధించిన పనులు చేయడం వల్ల కూడా విజయం చేకూరుతుందని చాలామంది నమ్ముతుంటారు. ఇలా చాలా కారణాల దృష్ట్యా.. ఇండస్ట్రీలో 'శుక్రవారం'కి చాలా ప్రాధాన్యం పెరిగిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
కూతురి పేరు వెల్లడించిన గేమ్ ఛేంజర్ బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్, గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది. కియారా- సిద్దార్థ్జంటకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. శుక్రవారం నాడు పాప పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే ఓ ఫోటోను సైతం షేర్ చేశారు. మా ప్రార్థనల నుంచి మా చేతుల్లోకి వచ్చిన మా బుజ్జిపాపాయి.. సరాయా మల్హోత్రా (Saraayah Malhotra) అని రాసుకొచ్చారు. సిద్దార్థ్‌లోని స అక్షరాన్ని, కియారా(Kiara Advani) లోని యారా అక్షరాలను కలిపితే వచ్చేలా సరాయా అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. సరాయా అంటే అరబిక్‌లో యువరాణి అని అర్థం. అయితే పాప ముఖాన్ని మాత్రం చూపించలేదు. కేవలం సాక్సులు తొడిగిన పాప కాళ్లను పట్టుకున్న ఫోటో మాత్రమే షేర్ చేశారు. ఏదేమైనా కియారా జంటకు అభిమానులు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిద్దార్థా- కియారా 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 15న వీరికి కూతురు పుట్టింది.సినిమాలుసినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కియారా తెలుగులో మాత్రం పెద్దగా క్లిక్కవ్వలేదు. మహేశ్‌బాబు సరసన 'భరత్ అనే నేను', రామ్‌చరణ్ సరసన 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' చిత్రాలు చేసింది. ఈ ఏడాది హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్ 'వార్ 2' మూవీలో తళుక్కుమని మెరిసింది. ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా చివరగా 'పరమ సుందరి' సినిమా చేశాడు. ప్రస్తుతం 'వాన్: ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్' మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) చదవండి: -
నేను జవాన్ కూతుర్ని.. ధైర్యం నా రక్తంలోనే ఉంది!
ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ (Celina Jaitly) భర్త నుంచి విడాకులు ఇప్పించమని కోరుతోంది. భర్త, ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ గృహహింస కేసు పెట్టింది. అతడి వల్ల కోల్పోయిన రూ.50 కోట్లు తిరిగిప్పించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు యూఏఈలో నిర్బంధంలో ఉన్న తన సోదరుడు, మాజీ ఆర్మీ మేజర్ విక్రాంత్ జైట్లీని తిరిగి తీసుకురావడం కోసం పోరాడుతోంది.ఒంటరి పోరాటంఈ క్రమంలో సెలీనా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. నా జీవితాన్ని అల్లకల్లోలం చేసే తుపాను ఒకటి వస్తుందని.. అప్పుడు పేరెంట్స్ లేకుండా, ఎవరి అండ లేకుండా ఇలా ఒంటరి పోరాట్సం చేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తల్లిదండ్రులు, సోదరుడు, పిల్లలు, ఏ కష్టం వచ్చినా నాతో పాటు నిలబడతానని వాగ్దానం చేసిన వ్యక్తి.. వీళ్లెవరూ లేని రోజు వస్తుందనుకోలేదు.సైనికుడి కూతుర్నిజీవితం ప్రతీది దూరం చేసింది. నేను నమ్మినవాళ్లు వదిలేసి వెళ్లిపోయారు. నాతో ఉంటానని హామీ ఇచ్చినవాళ్లు మౌనంగా మాట తప్పారు. అయినా ఈ తుపాను నన్ను నిలువునా ముంచేయలేదు. సముద్రంలోకి తీసుకెళ్లకుండా అలల్లా నన్ను ఒడ్డుకు విసిరేసింది. నాలోని ధైర్యాన్ని తట్టిలేపింది. చావును సైతం ఎదిరించే స్త్రీగా నిలవమంది. ఎందుకంటే నేను ఒక సైనికుడి కూతురిని. క్రమశిక్షణ, ధైర్యసాహసాలు, పట్టుదల మా రక్తంలోనే ఉన్నాయి.పోరాడుతూనే ఉంటా..ప్రపంచం నన్ను పడగొట్టాలనుకున్నప్పుడు ధైర్యంగా లేచి నిలబడటం నేర్చుకున్నా.. గుండె ముక్కలవుతున్నా పోరాడటం నేర్చుకున్నా.. అన్యాయం జరిగినప్పుడు కనికరం అవసరం లేదని తెలుసుకున్నా.. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసేవరకు ప్రయత్నించడం నేర్చుకున్నా... నా సోదరుడి కోసం నేను పోరాడుతూనే ఉంటా.. అని రాసుకొచ్చింది.నిర్బంధంలో నటి సోదరుడుసెలీనా జైట్లీ, పీటర్ హాగ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. సెలీనా.. నో ఎంట్రీ, మనీ హైతో హనీ హై, గోల్మాల్ రిటర్న్స్, థాంక్యూ సినిమాల్లో నటించింది. ఇకపోతే ఈమె సోదరుడు, రిటైర్డ్ మేజర్ విక్రాంత్ కుమార్ జైట్లీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 2024 నుంచి నిర్బంధంలో ఉన్నారు. #courage #divorce | In the middle of the strongest most turbulent storm of my life I never imagined I would spend fighting alone, without any parents, without any support system I never thought there would come a day without all the pillars on which the roof of my world once… pic.twitter.com/J3algtzAO0— Celina Jaitly (@CelinaJaitly) November 27, 2025 చదవండి: సౌత్ సినిమాల్లో బాలీవుడ్ హీరోలు విలన్లా? ఇదేం బాలేదు -
సౌత్‌లో విలన్లుగా బాలీవుడ్ హీరోలు.. నచ్చట్లేదు!
కొంతకాలంగా సౌత్ సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ విలన్‌గా మెప్పిస్తున్నారు. ఈ ధోరణి తనకు నచ్చలేదంటున్నాడు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty). దక్షిణాది చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను మాత్రమే ఆఫర్ చేయడం సబబు కాదంటున్నాడు. ద లాలంటాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. నాకు సౌత్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. నచ్చట్లే..కానీ ఇక్కడేం జరుగుతుందంటే మాకు నెగెటివ్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. హిందీ హీరోలను శక్తివంతమైన విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు, ప్రేక్షకులకు అదే కిక్కిస్తుందని చెప్తున్నారు. నాకది ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే అలాంటి ఆఫర్లను తిరస్కరిస్తున్నాను. రజనీకాంత్ దర్బార్‌లోనూ నెగెటివ్ రోల్ చేశాను. కాకపోతే రజనీ సర్‌తో కలిసి నటించాలన్న ఏకైక కోరికతోనే ఆ సినిమా ఒప్పుకున్నాను. కంటెంటే కింగ్ఈ మధ్యే 'జై' అనే తుళు సినిమా చేశాను. ప్రాంతీయ సినిమాలను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే అందులో యాక్ట్ చేశా.. ఆ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ రోజుల్లో సినిమాకు భాషా సరిహద్దులంటూ లేవు. కంటెంట్ ఒక్కటే కింగ్. కంటెంట్ బాగుందంటే అది అన్ని హద్దులు దాటుకుని విజయజెండా ఎగరేస్తుంది అని చెప్పుకొచ్చాడు. సునీల్ శెట్టి చివరగా కేసరి వీర్, నడానియన్ సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్, హెరా ఫెరి 3 మూవీస్ చేస్తున్నాడు. ఈయన తెలుగులో మోసగాళ్లు, గని సినిమాలు చేశాడు.చదవండి: తనూజతో అతి చేసిన యావర్.. చివరి కెప్టెన్ ఎవరంటే? -
ధర్మేంద్ర మరణం.. తొలిసారి స్పందించిన భార్య హేమమాలిని
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర.. మూడు రోజుల క్రితం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. కొన్నాళ్ల క్రితమే చనిపోయారనే రూమర్స్ వచ్చాయి. కానీ కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. ఈ సోమవారం ధర్మేంద్ర చనిపోయిన తర్వాత నుంచి అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు తొలిసారి భర్త మరణంపై హేమమాలిని స్పందించారు. ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో తన బాధని పంచుకున్నారు.'ధరమ్ జీ. ప్రేమించే భర్త, నా కూతుళ్లకు ఆరాధ్యుడైన తండ్రి, స్నేహితుడు, గైడ్, కవి, ఎప్పుడైనా వెళ్లగలిగే చనువున్న వ్యక్తి. చెప్పాలంటే ఆయనే నా సర్వస్వం. నా మంచి చెడుల్లో తోడున్నారు. నాతో పాటు నా కుటుంబ సభ్యులపై కూడా ఎంతో ప్రేమ చూపించారు. ఓ సెలబ్రిటీగా ప్రతిభ, మానవత్వం, పాపులారిటీ లాంటి వాటితో దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు. ఆయన ఘనతలు చిరస్థాయిగా నిలిచిపోతాయి'(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'నా వ్యక్తిగత నష్టం వర్ణించలేనిది. ఏర్పడిన శూన్యత జీవితాంతం కొనసాగుతుంది. ఇన్నేళ్ల పాటు కలిసున్న తర్వాత ఆయనని గుర్తుపెట్టుకునేందుకు లెక్కలేనన్ని జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి' అని హేమమాలిని రాసుకొచ్చాడు. భర్తని మనసారా గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిపోయారు.ధర్మేంద్రకు హేమామాలిని రెండో భార్య. వీళ్లకు ఈషా డియోల్, అహనా డియోల్ అని కూతుళ్లు ఉన్నారు. అంతకు ముందు ధర్మేంద్రకు పెళ్లి కాగా.. ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్లే సన్నీ డియోల్, బాబీ డియోల్. వీళ్లిద్దరూ తండ్రిలానే హిందీలో నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.(ఇదీ చదవండి: కొడుకు సమక్షంలో సీఎస్కే క్రికెటర్ తో బిగ్‌బాస్ బ్యూటీ మరో పెళ్లి) View this post on Instagram A post shared by Dream Girl Hema Malini (@dreamgirlhemamalini) -
ఓటీటీకి జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ ఏడాది ఎడాపెడా సినిమాలు చేస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరసన పెద్దిలోనూ కనిపించనుంది. ఇక హిందీలో హిట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలతో అలరిస్తోంది. అలా ఈ ఏడాదిలో వచ్చిన మరో రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి.ఈ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన మెప్పించింది దేవర భామ. ఈ సినిమా దసరా కనుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2 న థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.98.35 కోట్లు వసూలు చేసింది.దాదాపు నెలన్నర్ర రోజుల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది సన్నీ సంస్కారీ కి తులసి కుమారి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. Muhurat nikal gaya guys 🥳#SSKTKonNetflix pic.twitter.com/xU2N5bKcej— Netflix India (@NetflixIndia) November 26, 2025 -
సినిమాల్లో ఫెయిల్.. ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడేమో వేలకోట్ల సామ్రాజ్యం..!
సినిమా రంగం అందరికీ కలిసి రావడం అనేది చాలా అరుదు. ఒక్క మూవీ డిజాస్టర్ అయిందంటే చాలు కెరీర్ కొనసాగించడం చాలా కష్టమే. అలా అని అందరికీ పరిస్థితి ఇలానే ఉంటుందని కాదు. కొందరికీ మొదటి సినిమానే సూపర్ హిట్ కావొచ్చు.. మరికొందరికీ డిజాస్టర్ కావొచ్చు. కానీ ఒకట్రెండు సినిమాలు ఫెయిల్ అయినా కూడా.. తర్వాత సక్సెస్ బాట పట్టొచ్చు. మరి ఎన్ని సినిమాలు చేసిన సక్సెస్ తలుపు తట్టలేదంటే కారణం.. మనకు ఈ రంగం సెట్ కాదని ఫిక్సయిపోవచ్చు. అలాంటి హీరో కథే ఈ స్టోరీ. ఇలా జరగడం చాలా అరుదనే చెప్పాలి. కానీ ఇదే అతన్ని ఈ రోజు మరో స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టింది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందామా?తొలి మూవీనే కొత్త కథతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. కానీ గిరీశ్ కుమార్ తౌరానీ మాత్రం టాలీవుడ్ రీమేక్‌తో తన జర్నీ మొదలెట్టారు. అయితే ఆయన తొలి సినిమాకే స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించారు. తెలుగులో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే మూవీ రీమేక్‌తో బాలీవుడ్ హీరో గిరీశ్ కుమార్ తౌరానీ ఎంట్రీ ఇచ్చారు. హిందీలో ఈ మూవీని జూనియర్ ఎన్టీఆర్ చిత్రం రామయ్యా.. వస్తావయ్యా అనే టైటిల్‌తో తెరకెక్కించారు. అయినా కూడా గిరీశ్ కుమార్ లక్ కలిసి రాలేదు. తన మొదటి చిత్రం కొత్త కథతో చేసి ఉంటే బాగుండేది. అంతేకాకుండా ఈ చిత్రంలో గిరీశ్ సరసన కోలీవుడ్ స్టార్ శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. 2013లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి గిరీశ్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది.ఆ తర్వాత గిరీశ్ కుమార్ 2016లో విడుదలైన 'లవేష్ షుదా' అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో హీరోగా కనిపించారు. ఇది కూడా గిరీశ్‌కు కలిసి రాలేదు. ఈ సినిమా విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విఫలం కావడంతో గిరీశ్ తన కెరీర్లో కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితికి దారితీసింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. కేవలం రెండు సినిమాల్లో మాత్రమే హీరోగా చేసిన గిరీశ్.. సినిమాలు తనకు సెట్ కావని డిసైడ్ అయిపోయాడు. తన రెండో సినిమా రిజల్ట్‌తోనే బయటకొచ్చేశాడు.బిజినెస్‌లో సక్సెస్..సినీ నిర్మాత కుమార్ ఎస్ తౌరానీ కుమారుడైన గిరీశ్ బిజినెస్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన తండ్రితో పాటు మేనమామ రమేష్ ఎస్ తౌరానీ ఆధ్వర్వంలో నడుస్తోన్న టిప్స్ ఇండస్ట్రీస్‌లో అడుగుపెట్టారు. కుటుంబ వ్యాపారంలోకి ప్రవేశించిన గిరీశ్ టిప్స్ కంపెనీ నడపడంలో సక్సెస్ అయ్యారు. సినిమాల్లో ఫెయిల్ అయినప్పటికీ.. టిప్స్ ఇండస్ట్రీస్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్ విలువు దాదాపు పదివేల కోట్లకు పైమాటే. డిసెంబర్ 2024 నాటికి మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. రూ.10,517 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో గిరీశ్ షేరింగ్ దాపు రూ.2164 కోట్లుగా ఉంది. ఈ క్రమంలోనే సంపాదనలో రణబీర్ కపూర్ (రూ.400 కోట్లు), రణవీర్ సింగ్ (రూ.245 కోట్లు), వరుణ్ ధావన్ (రూ.380 కోట్లు), ఆమిర్ ఖాన్ (₹రూ.1900 కోట్లు) లాంటి సూపర్ స్టార్స్‌ను అధిగమించారు.బిజినెస్‌లో సక్సెస్ అయిన గిరీష్ తన చిన్ననాటి ప్రియురాలు కృష్ణ మంగ్వానీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బిడ్డ ఉంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబయిలో నివసిస్తున్నారు. గిరీశ్ ప్రస్తుతం టిప్స్ కంపెనీలో ప్రమోటర్ అండ్ ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగుతున్నారు. -
వస్తావా? గంటకు ఎంత? అని అడుగుతున్నారు
సడన్‌గా బోలెడంత పాపులారిటీ వస్తే ఏ సెలబ్రిటీ సంతోషపడడు? మరాఠి నటి గిరిజ ఓక్ (Girija Oak) కూడా అంతే.. ఓ ఇంటర్వ్యూ క్లిప్స్ వల్ల సడన్‌గా సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. లేటు వయసులో ట్రెండ్ అయింది. తన ఫాలోవర్లు అమాంతం పెరిగారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 20 ఏండ్ల తర్వాత ఈరేంజ్ పాపులారిటీ చూసి గిరిజ సైతం షాకైపోయింది. ఏ మార్పూ లేదుఇదే మంచి తరుణంగా భావించి కెరీర్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. కానీ, రియాలిటీలో అదేమీ జరగడం లేదు. పేరొచ్చింది కానీ అవకాశాలైతే రావడం లేదంటోంది. తాజాగా ద లాలన్టాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే లేదనే చెప్తాను. నాకేమీ ఎక్స్ట్రా సినిమా ఆఫర్లు రావడం లేదు. పైగా నెగెటివ్ కామెంట్లు కూడా చాలా వస్తున్నాయి. గంటకు ఎంత?నా రేటెంత? అని అడుగుతున్నారు. నాతో గంటసేపు గడపాలంటే ఎంత తీసుకుంటానని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లకు లెక్కే లేదు. వీళ్లకు నిజ జీవితంలో నేను తారసపడితే కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఒకవేళ చూసినా.. గౌరవంతో మాట్లాడతారే తప్ప ఇలాంటి నీచపు కామెంట్లు చేయరు. కానీ ఈ ఆన్లైన్ చాటున నోటికి ఏదొస్తే అది అనేస్తున్నారు అని గిరిజ అసహనం వ్యక్తం చేసింది.సినిమాకాగా మరాఠి నటి గిరిజ ఓక్ 2004లో మానిని అనే మరాఠి సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. తారే జమీన్ పర్, షోర్ ఇన్ ద సిటీ, సైకిల్ కిల్, కాలా, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్స్పెక్టర్ జిండె వంటి హిందీ సినిమాల్లో నటించింది. హిందీతో పాటు మరాఠి, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది.చదవండి: కాస్త మర్యాద ఇవ్వండి.. బలుపుతో చెప్పట్లేదు: నిర్మాత -
తరగని ఉత్తేజం తారా లోక విహారం
గోవాలోని పంజిమ్‌లో 56వ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ నెల 20న ఆరంభమైన ఈ చిత్రోత్సవం మరో 2 రోజుల్లో ముగియనుంది. ఈ ఉత్సవంలో 81 దేశాల నుంచి 240కి పైగా సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. వీటిలో 13 ప్రపంచ ప్రీమియర్లు, అనేక అంతర్జాతీయ ఆసియా ప్రీమియర్లు ఉన్నాయి. ఈ చిత్రోత్సవానికి జపాన్ కంట్రీ ఆఫ్ ఫోకస్‌గా, స్పెయిన్ ‘భాగస్వామి దేశం’గా ఆస్ట్రేలియా ‘స్పాట్లైట్ దేశం’గా వ్యవహరిస్తున్నాయి.తెలుగు చిత్రాల సందడి... పలు టాలీవుడ్ చిత్రాలకు ఈ చిత్రోత్సవంలో చోటు దక్కింది. నేడు (26వ తేదీ బుధవారం) ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను, 28న ‘సంక్రాంతికి వస్తున్నాం’ను ప్రదర్శించనున్నారు. ప్రారంభ చిత్రాల్లో ఒకటిగా తమిళ చిత్రం ‘అమరన్’ చోటు దక్కించుకోగా, మరికొన్ని తమిళ, మలయాళ చిత్రాలను కూడా ప్రదర్శించారు. పనోరమా విభాగంలో 25 చలన చిత్రాలు, 20 నాన్–ఫీచర్ చిత్రాలు ఉన్నాయి.సినిమా... అంతకు మించి... ఈసారి చిత్రోత్సవంలో సినిమాల ప్రదర్శనతో పాటు మరెన్నో వైవిధ్యభరిత, ఆసక్తికరమైన కార్యక్రమాలకు చోటు కల్పించారు. కొత్త తరాన్నిప్రోత్సహించడం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచడం వంటి లక్ష్యాలతో వీటిని నిర్వహిస్తున్నారు. క్రియేటివిటీకి క్లాప్... చిత్రోత్సవాల్లో సినిమాల ప్రదర్శనతో పాటు నూతన తరాన్నిప్రోత్సహించడమే లక్ష్యంగా ‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో‘ (సీఎమ్ఓటి) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 128 మంది యువతీ యువకులు 48 గంటల చిత్ర నిర్మాణ ΄ోటీలో పాల్గొన్నారు. వీరిని 5 విభాగాలుగా విభజించి ΄ోటీ నిర్వహించారు. దీనిలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఎంపిక అవడం విశేషం. మాస్టర్ క్లాస్... సూపర్ హిట్... చిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మాస్టర్ క్లాస్‌లు అత్యంత ఆదరణ పొందుతున్నాయి. బాలీవుడ్ సినీ ప్రముఖుడు విధు వినోద్ చోప్రా నిర్వహించిన మాస్టర్ క్లాస్ ఆకట్టుకుంది. అందులో ఆయన పంచుకున్న జీవితానుభవాలు యువతను మేల్కొలిపేలా ఉన్నాయి. అలాగే చిత్రోత్సవాల్లో దాదాపు పూర్తి స్థాయిలో కనిపించిన మరో సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సమర్పించిన మాస్టర్ క్లాస్ సినీరంగంలో రాణించాల్సిన వారికి ఉండాల్సిన ఓర్పు పట్టుదల అవసరాన్ని నొక్కి చెప్పింది. సెషన్స్... లెసన్స్... ‘ఇన్ –కన్వర్జేషన్ ’ పేరిట కీలకమైన అంశాలపై సాగుతున్న పలు చర్చలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సుహాసిని, ఖుష్బూ నిర్వహించిన చర్చా కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అలాగే సినిమా రంగంలో మహిళల అంశంపై దేశ విదేశీ ప్రముఖులు సాగించిన చర్చ కూడా ఆలోచనలు రేకెత్తించేలా ఉండి, ఆకట్టుకుంది. ఏఐ ఫెస్ట్... రేపటికి మస్ట్... ఇఫీలో తొలిసారిగా ‘సినిమాఏఐ హ్యాకథాన్’ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సినిమాటిక్ సృజనాత్మకథ కలయికలో హ్యాకథాన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన ఫిల్మ్‌లు ప్రదర్శిస్తున్నారు. ఇఫీస్టా... మరోవైపు ప్రధాన ఉత్సవానికి సమాంతరంగా ‘ఇఫెస్టా’ సాంస్కృతిక సంబరం ఏర్పాటైంది. ఇది సంగీతాభిమానులను తనివి తీరా ఆనందింపజేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, జానపద నృత్యాలు.. వంటివి ఉంటున్నాయి. ‘బాటిల్ ఆఫ్ బాండ్స్’ (భారతీయ, అంతర్జాతీయ బ్యాండ్స్) మరో ఆకట్టుకునే కార్యక్రమం. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన కళాబృందాల్లో మన తెలంగాణ నుంచి గుస్సాడీ నృత్య కళాకారుల బృందం కూడా ఒకటి. అలలోత్సవం... వేవ్స్ బజార్... మారియట్ హోటల్ వేదికగా నిర్వహిస్తోన్న వేవ్స్ బజార్ పెద్ద సంఖ్యలో ఆహుతుల్ని ఆకర్షిస్తోంది. ఈప్రాంగణంలో రోజూ పదుల సంఖ్యలో సినిమాల ప్రదర్శనతో పాటు స్టార్టప్స్ వేదికలు, సాంకేతిక పరికరాల ప్రదర్శనలు... ఇంకా మరెన్నింటికో చోటు కల్పించారు. ఎన్ఎఫ్డీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ఈవెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫిల్మ్ + టెక్‌ను కలిపే ఉద్దేశంతో స్టార్ట్–అప్ – ఇన్నోవేషన్‌ను కలుపుతూ వేవ్ ఎక్స్ అనే జోన్ కూడా ఏర్పాటు చేశారు. సెలబ్రిటీకి రైట్ రైట్... రెడ్ కార్పెట్.. సినిమాల ప్రదర్శన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్‌పై సినీ సెలబ్రిటీలు వాక్ చేస్తున్నారు. ఆ సందర్భంగా వీరు సందర్శకులు, మీడియాతో ముచ్చటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో అతిర«థ మహారధుల వంటి సినిమా ప్రముఖులు కనపడుతుండడంతో ఔత్సాహిక రూపకర్తలకు అభిమానులకు అవధుల్లేని ఆనందం కలుగుతోంది. ప్రత్యేక ఆకర్షణలు...ఇఫీలో ఆహుతులను ఆకట్టుకుంటున్న అనేక ప్రదర్శనల్లో కొన్ని మరింత విశేషంగా అనిపిస్తున్నాయి. వాటిలో.. ∙‘షోలే’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో వినియోగించిన బైక్‌ను ఈ ఈవెంట్లో ప్రదర్శిస్తున్నారు. దాంతో ఆహుతులు ఆ బైక్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ∙కళా అకాడమీలో ఏర్పాటైన కెమెరా ప్రదర్శన ఔరా అనిపిస్తోంది. అక్కడ వందల సంఖ్యలో కొలువుదీరిన అనేక కెమెరాల్లో శతాధిక వయస్సు ఉన్నవి కూడా ఉండడం విశేషం. పలు కెమెరాలు మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. మహారాష్ట్రకు చెందిన సర్వేష్ అనే కెమెరాల సేకర్త ఈ ప్రదర్శనను సమర్పిస్తున్నారు. ఆహుతులు పెద్ద సంఖ్యలో ఈ కెమెరాలను తమ కెమెరాల్లో నిక్షిప్తం చేసుకుంటున్నారు. ⇒ప్రాంగణంలో నెలకొల్పిన అనేక స్టాల్స్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాంకేతిక ప్రగతికి చిహ్నంగా కనిపించే అనేక విశేషాలను ఈ స్టాల్ ప్రదర్శిస్తోంది. పైగా యువతను ఆకట్టుకునేలా అప్పటికప్పుడు గెలు΄ోటముల్ని తేల్చేసే టెక్ గేమ్స్ నిర్వహిస్తుండడంతో యువత పెద్ద సంఖ్యలో గుమి కూడుతోంది. పంజిమ్‌లోని పీబీబి సెంటర్, ఐనాక్స్ థియేటర్ప్రాంగణం, కళా అకాడమీ, మారియట్ హోటల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియం... తదితర ప్రదేశాల్లో ఇఫీ విస్తరించింది. ఈ దఫా ఓపెన్ ఎయిర్ స్క్రీనింగ్స్‌కు కూడా చోటు కల్పించడం మరో విశేషం. వందల సంఖ్యలో ఈవెంట్లు ఆకర్షణలు, విశేషాలతో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది ఆహుతులను ఆకర్షిస్తోంది. మరో 2 రోజుల్లో ముగియనున్న ఇఫీ... మరో ఏటా తన కోసం వేచి చూసేవారి సంఖ్యని ఈ ఏడాది కార్యక్రమాలతో మరింతగా పెంచుకోనున్నదని చెప్పవచ్చు. – సత్యబాబుదక్షిణ కొరియా ఎంపీ జేవాన్ కిమ్ మన వందే మాతరంను అత్యంత శ్రావ్యంగా గానం చేయడం గోవాలో జరిగిన వేవ్స్ ఫిల్మ్ బజార్ప్రారంభ వేడుకలో హర్ష ధ్వానాలు అందుకుంది. ఒక విదేశీయురాలు ఇంత అందంగా పాడగలగడం చూడటం గొప్ప విషయం అని పలువురు అతిథులు అభినందనలు కురిపించారు.భానుమతి శత జయంతుత్సవాలు... ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా దిగ్గజాలు గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్ భూపేన్ హజారికా, సలీల్ చౌదరిలతో పాటు మన తెలుగు సినీరంగానికి చెందిన దివంగత నటి స్వర్గీయ పి. భానుమతి శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ఆమె నటించిన సూపర్ హిట్ సినిమా ‘మల్లీశ్వరి’ని చిత్రోత్సవాల్లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఇదే ఫెస్టివల్లో భాగంగా గత ఏడాది స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా సినిమా రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకుప్రారంభ వేడుకలో టాలీవుడ్ నటుడు బాలకృష్ణను సన్మానించారు. ముగింపు వేడుకలో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను సన్మానించనున్నారు అలాగే ఆయన సినిమాలు లల్ సలామ్, జైలర్’ లను చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తున్నారు. -
23 ఏళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న బుల్లితెర జంట (ఫొటోలు)
-
144 సినిమాల్లో 'ఒకే' పాత్ర.. ఈ నటుడి గురించి తెలుసా?
ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సరే ఇప్పటికే వేలాది సినిమాలు వచ్చాయి. ఎందరో నటీనటులు కొత్తగా వస్తున్నారు. పాత నటీనటులు కనుమరుగైపోతూనే ఉన్నారు. మనం సరిగా గమనించం గానీ కొన్నిసార్లు చిత్రమైనవి జరుగుతూనే ఉంటాయి. ఒకే నటుడు వరసగా ఒకే తరహా పాత్రల్లో కనిపిస్తూ ఉంటారు. తెలుగులోనూ ఇలాంటి వాళ్లని చూసే ఉంటారు. అయితే ఇలా ఒకే పాత్రలో ఓ వ్యక్తి ఏకంగా 144 సినిమాలు చేసి గిన్నీస్ రికార్డ్ సాధించాడని మీకు తెలుసా? ఇంతకీ ఆ నటుడెవరు? ఏంటా రికార్డ్?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన)ఒక యాక్టర్ నాలుగైదు సినిమాల్లో ఒకే లాంటి పాత్ర చేస్తే 'మూస' నటుడు అని ట్యాగ్ వేసేస్తారు. ఇలాంటివి పడేందుకు సాధారణంగా నటీనటులు పెద్దగా ఇష్టపడరు. కాస్త పేరున్న వాళ్లయితే వైవిధ్యమైన పాత్రలు చేయాలని అనుకుంటారు. కానీ అప్పట్లో హిందీ చిత్రసీమలో జగదీశ్ రాజ్ అనే నటుడు ఉండేవాడు. ఈయన్ని అందరూ బాలీవుడ్ 'ఇన్స్పెక్టర్ సాబ్' అని పిలిచేవారు. ఎందుకంటే 144 సినిమాల్లో పోలీస్ పాత్రల్లోనే కనిపించాడు. ఇది గిన్నీస్ రికార్డ్‌తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ నమోదైంది.1928లో బ్రిటీష్ ఇండియాలోని పాకిస్థాన్‌లో సర్గోదా అనే ఊరిలో జగదీష్ పుట్టారు. పుట్టిన పదకొండేళ్లకే అంటే 1939లోనే బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1955 నుంచి పూర్తిస్థాయి నటుడిగా మారారు. అప్పటినుంచి 2004 వరకు వరసగా దాదాపు 260 చిత్రాలు చేశారు. 1956లో వచ్చిన 'సీఐడీ'లో తొలిసారి పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించారు. తర్వాత దీవార్, డాన్, శక్తి, మజ్దూర్, ఇమాన్ ధరమ్, జాసూస్, సిల్సిలా, ఐనా, బేషరమ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఈయన పోలీస్‌గానే కనిపించారు. చివరగా 'మేరీ బీవీ కా జవాబ్ నహిన్' అనే సినిమా చేశారు. ఈ మూవీలోనూ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా నటించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9.. మళ్లీ ఈ ట్విస్టులేంటి?)260కి పైగా సినిమాలు చేసిన జగదీష్ రాజ్.. పోలీస్ పాత్రలతో పాటు విలన్, న్యాయమూర్తి లాంటి ఇతర పాత్రల్లోనూ కనిపించారు. కానీ ఈయన సినీ పోలీస్‌గానే అందరికీ గుర్తుండిపోయారు. శ్వాసకోస సంబంధ సమస్యలతో బాధపడుతూ 2013 జూలై 29న ముంబైలోని జుహు నివాసంలో జగదీశ్ తుదిశ్వాస విడిచారు. జగదీష్ కూతురు అనితా రాజ్ కూడా నటిగా సుపరిచతమే. 1981లో 'ప్రేమ్ గీత్' నటిగా కెరీర్ ప్రారంభించింది. 80, 90లలో చాలా హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు మూవీస్ చేస్తోంది.ఏదేమైనా ఒకేలాంటి పాత్రని 144 సినిమాల్లో చేయడం అంటే మాములు విషయం కాదు. ఇప్పటి నటులకైతే ఇలా చేయడం పక్కనబెడితే అసలు ఇది సాధ్యమేనా?(ఇదీ చదవండి: కుక్క కాటు పెద్ద మేటర్ కాదు.. టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు) -
బాలీవుడ్ హీ మేన్
‘ధరమ్ జీ’ ‘ధరమ్ పాజీ’ ‘వీరూ’ ‘ధరమ్ వీర్’... అంటూ ఇండస్ట్రీ, ప్రేక్షకులూ యాభై ఏళ్లుగా ప్రేమగా పిలుచుకున్న బాలీవుడ్ హీమేన్ ధర్మేంద్ర కన్నుమూశారు. రొమాంటిక్ సినిమాలతో మొదలు యాక్షన్ సినిమాల వరకు అన్నీ చేసి ‘సకల నటనా వల్లభుడు’ అనిపించుకున్న ధర్మేంద్ర మృతితో ఒక శకం ముగిసింది.ధర్మేంద్ర గారూ... దేశానికి అమితాబ్ మంచి హెయిర్ స్టయిల్ ఇచ్చాడు. రాజేష్ ఖన్నా ఫ్యాషనబుల్ కుర్తా ఇచ్చాడు. మిథున్ డిస్కో డాన్స్ ఇచ్చాడు. మీరేం ఇచ్చారు?’ ధర్మేంద్ర ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి సమాధానం ఇచ్చారు. ‘ఆరోగ్యం ఇచ్చాను. నన్ను చూసి దేశంలో ఎందరో యువకులు జిమ్ వైపు నడిచారు. నేను దేశానికి కండ ఇచ్చాను. అంతకు మించింది ఏముంది?’13 ఏళ్ల పిల్లవాడుగా ధర్మేంద్ర ఉన్నప్పుడు లూథియానా మినర్వా థియేటర్లో ‘షహీద్’ అనే సినిమా చూశాడు. అందులో ఒకతను ‘వతన్ కే రాహ్ మే వతన్ కే నౌజవాన్ షహీద్ హో’... అని చేతిలో జెండా పట్టుకుని పాడుతున్నాడు. అతణ్ణి హీరో అంటారని, అతని పేరు దిలీప్ కుమార్ అని ధర్మేంద్రకు తెలియదు. కాని థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయానికి ఒకటే నిశ్చయించుకున్నాడు– ‘నేను అతనిలాగే మా ఊరి థియేటర్లో తెర మీద కనిపిస్తా’.అది ఏ సమయమో. ఆ మాటను ఏ నక్షత్రాలు విన్నాయో.ధర్మేంద్ర తండ్రి స్కూల్ టీచర్. పెద్ద కొడుకు ధర్మేంద్ర తన మార్గంలో నడిచి ప్రొఫెసర్ కావాలని ఆయనకు ఉండేది. ధర్మేంద్రకు చదువు వంటబట్టలేదు. పైగా సినిమా పురుగు కుట్టింది. దాంతో క్లాసులో ఏమీ వినలేక, చెప్పలేక తండ్రి చేతిలో రోజూ తిట్లే. ఇంటికి వచ్చి తల్లితో ‘నన్ను స్కూల్‌కు పంపకు. నాన్న నన్ను మిగిలిన పిల్లల కంటే ఎక్కువ తిడుతున్నాడు’ అని ఫిర్యాదు చేసేవాడు. మొత్తానికి మెట్రిక్‌తో చదువు ఆగి, రైల్వే శాఖలో క్లర్క్ ఉద్యోగం దొరికి, 19 ఏళ్లకు పెళ్లి కూడా అయిపోయింది. కాని అతణ్ణి వెండితెర పిలుస్తూ ఉంది. రోజూ అతడి బాధ చూసిన తల్లి ‘నీకు అంతగా నటించాలని ఉంటే ఒక అర్జీ పడేయొచ్చు కదరా’ అంది అమాయకంగా. ఉద్యోగానికి అర్జీగానీ హీరో కావడానికి అర్జీ ఉంటుందా? ఏమో... అర్జీ పెట్టాలేమో అనుకుంటున్న ధర్మేంద్రకు అప్పుడే ‘ఫిల్మ్‌ఫేర్ టాలెంట్ హంట్’ ప్రకటన పేపర్లో కనిపించింది.బిమల్ రాయ్, గురుదత్‌ల పర్యవేక్షణలో కొత్త నటీనటుల అన్వేషణ. అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి అప్పటికప్పుడు ‘మలేర్కోట్లా’ అనే టౌన్‌కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. కారణం ఫొటో స్టూడియో అక్కడే ఉంది. అక్కడ జాన్ మహమ్మద్ అనే ఫొటోగ్రాఫర్‌తో ‘నన్ను దిలీప్‌కుమార్‌లా ఫొటో తియ్యి’ అనంటే అతను అంతకన్నా అందంగా ఫొటో తీశాడు. వెంటనే బొంబాయి నుంచి పిలుపు వచ్చింది. మహా దర్శకులైన బిమల్‌రాయ్, గురుదత్ స్క్రీన్ టెస్ట్ చేశారు. గురుదత్ ఏ సినిమా ఆఫర్ చేయలేదుగానీ బిమల్‌రాయ్ ‘నీకు వేషం ఇస్తున్నా’ అన్నాడు. సినిమా పేరు ‘బందినీ’.సినిమా రంగంలో ఇదిగో అంటే ఆర్నెల్లు. ‘బందినీ’ నిర్మాణం లేటయ్యింది. ఈలోపు ధర్మేంద్రకు పస్తులు మొదలయ్యాయి. బిమల్‌రాయ్ బుక్ చేసిన నటుడు కాబట్టి ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ (1960) అనే సినిమాలో హీరోగా 51 రూపాయల అడ్వాన్సుతో పని దొరికింది. మొదటి సినిమాగా అదే రిలీజైంది. కాని ఫ్లాప్. ఆ కష్టకాలంలో తనలాగే వేషాల కోసం ప్రయత్నిస్తున్న మనోజ్ కుమార్ ఫ్రెండ్ అయ్యాడు. రోజుల తరబడి స్టూడియోల చుట్టూ తిరగడం, భార్యనూ... ఉద్యోగాన్నీ వదిలేసి బొంబాయిలో ఏం చేస్తున్నావ్ అని తండ్రి అక్షింతలతో ఉత్తరాలు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం వేల వేదనలు అనుభవించాడు. అప్పుడు ‘బందినీ’ (1963) విడుదలైంది. కొద్దిగా గుర్తింపు. ‘ఆయి మిలన్ కీ బేలా’ (1963) నెగెటివ్ రోల్. రాజేంద్ర కుమార్ హీరో. కాస్త హిట్ అయ్యింది. ఈ సమయంలోనే అతను మన మహానటి సావిత్రి (Savitri) పక్కన హీరోగా ‘గంగాకీ లహరే’ (1964)లో నటించాడు. ఆ సంగతి సావిత్రికి, ధర్మేంద్రకు తప్ప ప్రేక్షకులకు తెలియదు. అంత ఫ్లాప్ ఆ సినిమా. ధర్మేంద్ర స్ట్రగుల్ కొనసాగింది.సినిమా పరిశ్రమలో ‘గాడ్‌ఫాదర్’ ఉండాలని అంటూ ఉంటారు. ధర్మేంద్రకు ‘గాడ్‌మదర్’ దొరికింది. ఆమె పేరు మీనా కుమారి. మన ‘నాదీ ఆడజన్మే’ సినిమాను హిందీలో ‘మై భీ లడ్కీ హూ’ (1964)గా రీమేక్ చేస్తుంటే మొదటిసారి మీనాకుమారితో నటించాడు ధర్మేంద్ర. మీనాకుమారి అప్పటికే తన వివాహ బంధం నుంచి బయటపడింది. ఆమె మనసు ఒక మంచి మిత్రుడి కోసం చూస్తోంది. ఆ సమయంలో సిగ్గరిగా, స్నేహంగా ఉన్న ధర్మేంద్ర ఆమెకు ఆప్తుడుగా అనిపించాడు. మీనాకుమారి పేరు మీద ఇంకా సినిమాలు ఆడుతున్న రోజులు అవి. అందువల్ల మీనాకుమారి ధర్మేంద్రను చాలా ప్రమోట్ చేసింది. వారిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. పూర్ణిమ (1965), కాజల్ (1965), ఫూల్ ఔర్ పత్థర్ (1966), చందన్ కా పల్నా (1967), ‘బహారోంకి మంజిల్’ (1968)... వీటిలో ఫూల్ ఔర్ పత్థర్ సూపర్‌హిట్. ఆ తర్వాత ధర్మేంద్ర ఆగలేదు. అతణ్ణి పెద్ద హీరో చేసిన మీనాకుమారి అతని జ్ఞాపకాల్లో మిగిలిపోయింది.ఆశాఫరేఖ్, ధర్మేంద్ర జోడి ప్రేక్షకులకు నచ్చింది. ‘ఆయా సావన్ ఝూమ్ కే’... పాట రేడియోలో పెద్ద హిట్. సినిమా కూడా సూపర్‌హిట్. ‘ఆయా సావన్ ఝూమ్ కే’ సినిమాతో ధర్మేంద్ర కెరీర్ పూర్తిగా సెటిల్ అయ్యింది. ఇతను యాక్షన్, సెంటిమెంట్, రొమాంటిక్ సినిమాలు చేయగలడు అని ఇండస్ట్రీకి తెలిసిపోయింది. హీరోయిన్లు మాలాసిన్హా, సైరాబాను, వహీదా రెహమాన్, షర్మిలా టాగోర్ అందరూ ధర్మేంద్ర పక్కన నటించడానికి పోటీలు పడ్డారు. అయితే అతను నటించడానికి పోటీ పడిన హీరోయిన్ ఆ తర్వాతి రోజుల్లో వచ్చింది. హేమమాలిని!ధర్మేంద్రలో ఒక మంచి, సెన్సిబుల్ నటుడు ఉన్నాడు. ఆ సంగతిని హృషికేష్ ముఖర్జీ పసిగట్టాడు. ‘అనుపమ’ (1966), ‘సత్యకామ్’ (1968), ‘చుప్కే చుప్కే’ (1975)... ఇవన్నీ ధర్మేంద్రతో తీశాడు. ధర్మేంద్ర మొత్తం కెరీర్లో అత్యుత్తమ నటన ప్రదర్శించిన సినిమాగా ‘సత్యకామ్’ను విమర్శకులు గుర్తిస్తారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ‘చుప్కే చుప్కే’లో ధర్మేంద్ర వేసిన ‘ప్యారేమోహన్’ అనే పాత్రకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ధర్మేంద్ర కామెడీని ప్రేక్షకులు ఈ సినిమాలో ఎంతో ఎంజాయ్ చేశారు. విశేషం ఏమంటే ఇందులో ధర్మేంద్ర బోటనీ ప్రొఫెసర్. సినిమా రిలీజయ్యాక తండ్రికి చూపించి ‘నువ్వు కోరినట్టుగా నేను బోటనీ ప్రొఫెసర్ అయ్యాను చూడు’ అనంటే ఆయన ఎప్పటిలానే ‘ఏడ్చావులే బడుద్దాయి’ అని అని అక్షింతలు వేశాడు.ధర్మేంద్ర హీరో. అతను హీరోగా ఉంటే పక్క పాత్ర ఉంటుంది తప్ప వేరెవరో హీరోగా ఉంటే అతను పక్కపాత్ర కాదు. ‘షోలే’లో హీరో ధర్మేంద్ర. సినిమాలో ప్రాణాలతో మిగిలేది కూడా అతడే. కాని అమితాబ్ కూడా అసాధ్యుడిగా నటించాడు. ధర్మేంద్రకు రాజకీయాలు చేయడం తెలియదు. కొత్త తరం వస్తే అసూయ లేదు. ఒడ్డూ పొడవూ ఉన్న అమితాబ్ తనను దాటేస్తాడనే భయం లేకుండా ‘జయ్’ పాత్రకు అమితాబ్‌ను తీసుకోండని తనే ఒక మాట వేశాడు దర్శకుడికి. ‘షోలే’ (1975) విడుదలయ్యి మరికొన్ని రోజుల్లో 4కెలో రీరిలీజ్ అవనుంది. యాభై ఏళ్లుగా షోలే ఖ్యాతి ధర్మేంద్రను భారత ప్రేక్షకులకు చేరువ చేస్తూనే ఉంది. ప్రతి కొత్తతరం ఈ సినిమా చూసి ధర్మేంద్రకు ఫ్యాన్స్ అయ్యారు. ‘కుత్తే మై తేరా ఖూన్ పీజావూంగా’ డైలాగ్ ధర్మేంద్ర ఒక్కసారి చెప్తే ఆ తర్వాతి తరాలు వందసార్లు చెప్తూనే ఉన్నాయి.1980ల తర్వాత ధర్మేంద్ర మల్టీస్టారర్ సినిమాల్లో హీరోగా క్షణం తీరిక లేకుండా గడిపాడు. అదే సమయంలో తన కుమారుడు సన్ని డియోల్‌ను ‘బేతాబ్’ (1983)లో లాంచ్ చేసి హీరోగా నిలబెట్టాడు. కొడుకుతో ధర్మేంద్ర తీసిన ‘ఘాయల్’ కూడా సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. ఈ కాలంలో హీరోగా ధర్మేంద్ర కొన్ని సినిమాలు చేస్తుంటే హీరోగా సన్నిడియోల్ సినిమాలు చేస్తూ వచ్చాడు. డింపుల్ కపాడియా (Dimple Kapadia) వంటి హీరోయిన్లు ఇద్దరి సరసనా నటించారు. ఆ తర్వాత చిన్న కొడుకు బాబీ డియోల్‌ను ‘బర్సాత్’తో లాంచ్ చేశాడు ధర్మేంద్ర.ధర్మేంద్ర ఎప్పుడూ తన పని గురించి తప్ప ఎత్తులు పైఎత్తులు వేస్తూ కూచోలేదు. పంచాయతీలకు దిగలేదు. అనవసరంగా మీడియా ముందుకు రాలేదు. ఇన్నేళ్లలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా తక్కువ. అవార్డు ఫంక్షన్లకు హాజరవడం, పార్టీలు ఇవన్నీ చాలా పరిమితంగా చేసేవాడు. ధర్మేంద్రకు రైతుగా ఉండడటం ఇష్టం. అందుకే కుమారులిద్దరూ కలిసి లోనావాలా దగ్గర 100 ఎకరాల ఫామ్‌హౌస్ ఏర్పాటు చేశాడు. సినిమాలను పూర్తిగా తగ్గించుకున్నా ఆ ఫామ్‌హౌస్‌లోనే ఎక్కువగా గడిపాడు ధర్మేంద్ర, ‘మీ వయసు ఎంత?’ అని ధర్మేంద్రను అడిగితే ‘అది కెమెరా చెప్తుంది’ అనేవాడు. కెమెరా తన కంటితో ఆయనను ఎప్పుడూ యంగ్‌గా, ఆరోగ్యవంతుడిగా, ధీరుడిగా, హీమాన్గానే చూపిస్తూ వచ్చింది. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఆయన ఆ రూపంతోనే మిగిలిపోతాడు. ధర్మేంద్ర నటించిన ‘గాడీ బులా రహీహై’ పాటలో ‘గాడీ’ అంటే మృత్యువుకు సంకేతం. ఇన్నాళ్లకు మబ్బుల సెట్టింగ్, మెరుపుల ఆర్క్ లైట్లు ఉన్న చోటుకు తీసుకెళ్లే గాడీ ఎక్కి తరలిపోయాడు ధర్మేంద్ర. గాడీ బులా రహీహై... సీటీ బజా రహీహై.హేమమాలినితో ప్రేమకథహిందీ సినిమాల్లో హేమమాలిని (Hema Malini) రాకను బాంబేలో పెద్ద దుమారంగా మార్చిన వ్యక్తి రాజ్‌కపూర్. హేమమాలిని హిందీలో హీరోయిన్గా నటించిన మొదటి సినిమా ‘సప్నోంకా సౌదాగర్’ (1968)లో రాజ్‌కపూర్ హీరో. ఆ సినిమా పబ్లిసిటీ కోసం ‘డ్రీమ్ గర్ల్ హేమమాలిని’ అంటూ బాంబే అంతా హోర్డింగ్స్ పెట్టించాడు. అలా ఆమె బాలీవుడ్ హీరోల దృష్టిలో పడింది. ఆ వెంటనే ధర్మేంద్రతో ‘తుమ్ హసీ మై జవాన్’ (1969)లో నటించింది. ధర్మేంద్ర అప్పటికే వివాహితుడైనా, నలుగురు పిల్లల తండ్రయినా హేమమాలిని ఆకర్షణలో పడ్డాడు. సౌత్ హీరోయిన్లు హిందీలో ఎప్పుడూ టాప్స్టార్స్గానే ఉన్నారు. వహీదా రహెమాన్, వైజయంతీమాల, రేఖ... ఇప్పుడు హేమమాలిని. ఆమె స్నేహం కోసం అందరూ ఎదురు చూసిన వారే. వీరిలో మనోజ్ కుమార్, జితేంద్ర, సంజీవ్ కుమార్, ధర్మేంద్ర ఉన్నారు. ‘షోలే’ (1975) చేసే సమయానికి ధర్మేంద్ర ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకే ఆమెకు దగ్గరవడానికి ఆమెతో నటించే సీన్లలో రీటేక్‌ల కోసం లైట్బాయ్స్ను ఏదో ఒక తప్పు చేయమని తప్పుకు వంద రూపాయలు ఇచ్చేవాడు– ఆ రోజుల్లో. దాంతో హేమమాలినికి ధర్మేంద్ర అవస్థ తెలిసి వచ్చింది. అయినప్పటికీ ఇంట్లో అనంగీకారం, ధర్మేంద్ర మొదటి పెళ్లి కారణంగా హేమ మనసు ద్వైదీభావంతో ఉండేది. ఆ సమయంలోనే జితేంద్రతో దాదాపుగా ఆమె వివాహం వరకూ వెళ్లడం, మద్రాసుకు అందుకై వాళ్లు చేరుకోగా ధర్మేంద్ర మరో ఫ్లయిట్లో అక్కడకు వెళ్లి ఆమెను ఒప్పించి పెళ్లి కేన్సిల్ చేయడం ఆ రోజుల్లో వార్తగా వచ్చింది. చివరకు ధర్మేంద్ర, హేమమాలిని 1980లో వివాహం చేసుకున్నారు. ఇది పెద్ద వార్త. అయితే ధర్మేంద్ర తన కుటుంబాన్ని హేమమాలిని జీవితంలో జోక్యం చేసుకోకుండా, హేమమాలిని తాను అతని కుటుంబంలో జోక్యానికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ (Prakash Kaur) ఎప్పుడూ ఈ విషయమై ఒక్క మాట బయటకు వచ్చి మాట్లాడలేదు. వారి ఇద్దరు కుమార్తెల్లో ఇషా డియోల్ సినిమాల్లో రావడం ధర్మేంద్రకు అంగీకారంగా లేకపోయినా తర్వాత ఆమెతో పాటు కలిసి నటించాడు కూడా. ‘నేను నా కుమార్తెను నటించ వద్దు అన్నాను నిజమే. నన్ను నా తండ్రి నటించ వద్దు అన్నాడు కదా. సినిమా రంగంలో కెరీర్ ఎంపికపై తల్లిదండ్రుల అభిప్రాయం ఉండటం తప్పు కాదు’ అంటాడు ధర్మేంద్ర. అయితే ధర్మేంద్ర కుమారులు సన్ని డియోల్, బాబీ డియోల్ (Bobby Deol) తమ సవతి తల్లి కుమార్తెలతో అంత మంచి అనుబంధంలో ఉన్నట్టుగా ఎప్పుడూ కనిపించలేదు. వారు నలుగురూ కలిసిన సందర్భాలు దాదాపుగా లేనట్టే.నేను వెళ్లే గుడి పేరు ‘జిమ్’ధర్మేంద్ర (Dharmendra) మద్యపాన ప్రియుడు అనేది జగద్విదితం. సాయంత్రం ఏడు తర్వాత హరిహరాదులు ఏకమైనా ఆయన పెగ్ చేతిలోకి తీసుకోకుండా ఉండడు. రాత్రిళ్లు ఎంతసేపు ఎన్ని పెగ్గులు పుచ్చుకున్నా ఉదయం ఐదు గంటలకంతా జిమ్‌లో ఉండటం ఆయనకు అలవాటు. తుఫాను వచ్చినా కూడా ఈ అలవాటు చివరి వరకూ మానలేదు. ‘నేను, నా ఇద్దరు కుమారులు, ఇంటి స్త్రీలు కూడా జిమ్‌కు రోజూ వెళతారు. మా ఇంట్లో ఉండే జిమ్ మాకు గుడితో సమానం’ అంటారు ధర్మేంద్ర. ఆయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాస్తి. లోనావాలాలో ఫామ్‌హౌస్ పెట్టాక అక్కడి నుంచి రోజూ 15 లీటర్ల పాలు రైల్లో ముంబైకి చేరేది ధర్మేంద్ర పరివారం అవసరాలకు. ముంబైలో దొరికే పాలు కల్తీ అవుతాయనే కారణాన. ధర్మేంద్ర టాప్ 10 పాటలు1. యా దిల్ కి సునో దునియా వాలో ∙అనుపమ2. ఆప్ కే హసీన్ రుఖ్మె ఆజ్ నయా నూర్ హై ∙బహారె ఫిర్ భి ఆయేగీ3. బహారోంనె మేరా చమన్ లూట్ కర్ ∙దేవర్4. సాథియా నహీ జానా కె జీనా లగే ∙ఆయా సావన్ ఝూమ్ కే5. ఆజ్ మౌసమ్ బడా బే ఇమాన్ హై ∙లోఫర్6. పల్ పల్ పల్ దిల్ కే పాస్ ∙బ్లాక్ మెయిల్7. కోయి హసీనా జబ్ రూఠ్ జాతీ హై తో ∙షోలే8. ఓ మెరి మెహబూబా ∙ధరమ్ వీర్9. హమ్ బేవఫా హర్గిజ్ న థే ∙షాలిమార్10. జిల్మిల్ సితారోంకా ఆంగన్ హోగా ∙జీవన్ మృత్యుమాఫియాకి ధర్మేంద్ర హడల్1980లలో ప్రతి చిన్నా చితకా హీరోలకు మాఫియా నుంచి కాల్స్ వచ్చేవి. ‘భాయ్ మాట్లాడతాడట’ అనంటే అందరూ ఒణికిపోయేవారు. డబ్బులు కొందరు ఇచ్చేవారు. ఇలాగే ఒకసారి ధర్మేంద్రకు కూడా ఫోన్ వచ్చింంది. ధర్మేంద్ర ఫోన్ అందుకుని ‘మీరు ఎంత మంది ఉంటారు. ఒక పది మంది ఉంటారా? మీకు నేనొక్కణ్ణే చాలు. కాదు కూడదన్నారో ఒక ఫోన్ కొడితే మా పంజాబ్ నుంచి లారీలకు లారీలు కత్తులతో దిగుతారు. రండి చూసుకుందాం’ అన్నాడు. అంతే! మళ్లీ మాఫియా నుంచి ధర్మేంద్రకు ఫోన్ లేదు.నేను వెళ్లే గుడి పేరు ‘జిమ్’ధర్మేంద్ర మద్యపాన ప్రియుడు అనేది జగద్విదితం. సాయంత్రం ఏడు తర్వాత హరిహరాదులు ఏకమైనా ఆయన పెగ్ చేతిలోకి తీసుకోకుండా ఉండడు. రాత్రిళ్లు ఎంతసేపు ఎన్ని పెగ్గులు పుచ్చుకున్నా ఉదయం ఐదు గంటలకంతా జిమ్‌లో ఉండటం ఆయనకు అలవాటు. తుఫాను వచ్చినా కూడా ఈ అలవాటు చివరి వరకూ మానలేదు. ‘నేను, నా ఇద్దరు కుమారులు, ఇంటి స్త్రీలు కూడా జిమ్‌కు రోజూ వెళతారు. మా ఇంట్లో ఉండే జిమ్ మాకు గుడితో సమానం’ అంటారు ధర్మేంద్ర. ఆయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాస్తి. లోనావాలాలో ఫామ్‌హౌస్ పెట్టాక అక్కడి నుంచి రోజూ 15 లీటర్ల పాలు రైల్లో ముంబైకి చేరేది ధర్మేంద్ర పరివారం అవసరాలకు. ముంబైలో దొరికే పాలు కల్తీ అవుతాయనే కారణాన. -
బాలీవుడ్ హీ మ్యాన్ ఇకలేరు
సాక్షి, సినిమా డెస్క్: బాలీవుడ్ హీ మ్యాన్‌గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన దిగ్గజ సీనియర్ నటుడు, లోక్‌సభ మాజీ ఎంపీ ధర్మేంద్ర (89) ఇకలేరు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను గత నెల 31న కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొంది, డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం రాత్రి మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు మరోసారి ఆస్పత్రికి తరలించగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.సోమవారం ముంబైలోని విల్లే పార్లీ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ధర్మేంద్ర భౌతికకాయం వద్ద నివాళులర్పించగా పలువురు సంతాపం తెలిపారు. ధర్మేంద్ర గత నెలలో ఆస్పత్రిపాలైనప్పుడు ఆయన మరణించారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ వార్తలను ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ అప్పట్లో ఖండించింది. అయితే అలా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ధర్మేంద్ర తుదిశ్వాస విడవడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్కూలు రోజుల్లోనే నాటకాలు.. ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లోని ఫాగ్వారాలో జన్మించారు. చదువులో ప్రతిభావంతుడు కానప్పటికీ చిన్నప్పటి నుంచి ధర్మేంద్ర ఎంతో క్రమశిక్షణ కలిగి ఉండేవారు. స్కూలు రోజుల్లోనే ఆయన నాటకాలు వేసేవారు. దీంతో ఆయనకు సినిమాలపై మక్కువ పెరిగింది. అప్పట్లో ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ధర్మేంద్ర విజేతగా నిలిచి ముంబైలో అడుగుపెట్టారు. తన 19వ ఏట సినిమాల్లోకి రాక ముందే 1954లో ప్రకాశ్ కౌర్‌ని మొదటి వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం. వారిలో కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు విజిత, అజీత ఉన్నారు. నట ప్రస్థానం అర్జున్ హింగోరాని దర్శకత్వం వహించిన ‘దిల్ బీ తేరా హమ్ బీ తేరే’(1960) సినిమాతో ధర్మేంద్ర బాలీవుడ్లో నటుడిగా అడుగుపెట్టారు. ఈ చిత్రానికిగాను ఆయన తీసుకున్న తొలి పారితోషికం రూ.51. ఆ తర్వాత ‘బాయ్ ఫ్రెండ్, బందినీ, అనుపమ, ఆయా సావన్ జూమ్ కే’వంటి సినిమాలతో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘షోలే, ధర్మవీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్, డ్రీమ్ గర్ల్’వంటి చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నారు. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగానూ ఆయన రాణించారు. ‘ఆయే మిలన్ కీ బేలా’వంటి చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా పోషించారు. 1966లో వచ్చిన ‘ఫూల్ ఔర్ పత్తర్’సినిమా ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది.1971లో విడుదలైన ‘మేరా గావ్ మేరా దేశ్’తో యాక్షన్ హీరోగా స్థిరపడ్డ ధర్మేంద్రకు.. ‘ప్యార్ హి ప్యార్, ఆయా సావన్ ఝూమ్ కే, మేరే హమ్దమ్ మేరే దోస్త్’వంటి చిత్రాలు రొమాంటిక్ హీరో ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. ‘రాజా జానీ’(1972), ‘జుగ్ను’(1973) వంటి చిత్రాలు ఆయన్ను యాక్షన్ హీరోగా మరింత నిలబెట్టాయి. ‘షోలే’(1975) చిత్రానికి రూ. 1.5 లక్షల పారితోషికం తీసుకున్నారు. ఆ సినిమా నటీనటుల్లో అత్యధిక పారితోషికం అందుకున్నది ఆయనే కావడం విశేషం. అలాగే అందాల తార హేమమాలినితో కలిసి నటించిన ‘తుమ్ హసీన్ మై జవాన్, షరాఫత్, సీతా ఔర్ గీతా, రాజా జానీ, జుగ్ను, ప్రతిజ్ఞ, షోలే, చరస్, ఆజాద్, దిల్లగి’వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. వెండితెరపై హిట్ పెయిర్‌గా నిలిచిన ధర్మేంద్ర–హేమమాలిని 1980లో వివాహం చేసుకొని రియల్ లైఫ్ జోడీగా మారారు. వారికి ఇషా డియోల్, అహనా డియోల్ సంతానం. ఎన్నో రికార్డులు... ఆరు దశాబ్దాలకుపైగా సినీ కెరీర్లో ధర్మేంద్ర 300కుపైగా సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో అత్యధిక హిట్ చిత్రాల్లో నటించిన రికార్డు ఆయన సొంతం. 1973లో ఎనిమిది, 1987లో వరుసగా ఏడు హిట్స్‌తోపాటు అదే ఏడాది తొమ్మిది విజయవంతమైన చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ చరిత్రలో ఇప్పటికీ ఇది ఒక రికార్డుగా ఉంది. కండలు తిరిగిన శరీర సౌష్టవంతో సినిమాల్లో కనిపించిన ధర్మేంద్ర.. అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచారు. శరీర సౌష్టవానికి తోడు యాక్షన్ చిత్రాల్లో పోషించిన పాత్రలు ఆయనకు ‘హీ మ్యాన్’ట్యాగ్‌ని తెచ్చిపెట్టాయి.పోరాట సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించి యాక్షన్ కింగ్ అనే బిరుదు సొంతం చేసుకున్నారు. 1983లో విజేత ఫిలింస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి బేతాబ్, ఘాయల్, బర్సాత్ తదితర చిత్రాలను నిరి్మంచారు. ముఖ్యంగా తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్‌తో తీసిన ‘ఘాయల్’సూపర్‌హిట్‌గా నిలిచింది. తన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్‌లతో కలిసి ‘అప్నే, యమ్లా పగ్లా దీవానా’వంటి సినిమాల్లో నటించారు. 2011లో ప్రముఖ రియాలిటీ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’మూడవ సిరీస్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.2023లో ధర్మేంద్ర తొలిసారి ‘తాజ్: డివైడెడ్ బై బ్లడ్’అనే టీవీ సీరియల్లో నటించారు. ధర్మేంద్ర నటించిన ఆఖరి చిత్రం ‘ఇక్కీస్’(2025). శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ధర్మేంద్ర రాజకీయాల్లోనూ కొంతకాలం పనిచేశారు. 2004లో రాజస్తాన్‌లోని బికనీర్ లోక్‌సభ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2009లో తన పదవీకాలం ముగిసిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అవార్డులు... కళామతల్లికి చేసిన సేవలకుగాను 2012లో కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్రను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆయన్ను వరించింది. 1991లో వచ్చిన ‘ఘాయల్’సినిమాకుగాను ఆయన నిర్మాతగా జాతీయ అవార్డు అందుకున్నారు. 2016లో వరల్డ్ యూనివర్సిటీ ఫోరమ్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 1970లో ప్రపంచంలోని అందగాళ్లలో ఒకడిగా ధర్మేంద్ర నిలిచారు. పలు ప్రముఖ సంస్థలు ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరించాయి. -
స్టార్ హీరోయినే.. కానీ డాన్‌తో ప్రేమ.. చివరకు జైలుపాలు
సినీ పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం లాంటిది. ఎంత పెద్ద హీరోహీరోయిన్ అయినా సరే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. సినిమాలు చేయడంతో పాటు ఎవరితో పరిచయం పెంచుకుంటున్నామో కూడా అప్పుడప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అంతే సంగతులు. ఈ హీరోయిన్ కూడా అలానే ఓ క్రేజీ హీరోయిన్. కానీ డాన్ని ప్రేమించి జైలుపాలైంది. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మోనికా బేడీ. ప్రస్తుత జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ 90ల్లో తెలుగు, హిందీ సినిమాలు చూసిన వాళ్లకు ఈమె సుపరిచితమే. పంజాబ్‌లోని చబ్బేవాల్ గ్రామానికి చెందిన ఈమె.. 1994లో హిందీలో తొలి మూవీ చేసింది. తర్వాతి ఏడాది శ్రీకాంత్ హీరోగా నటించిన 'తాజ్ మహల్' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత శివయ్య, సోగ్గాడి పెళ్లాం, సర్కస్ సత్తిపండు, చూడాలని ఉంది తదితర చిత్రాల్లో నటించింది. హిందీలో అయితే సల్మాన్, షారుఖ్ లాంటి హీరోలతో చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక్కడివరకు బాగానే ఉంది.(ఇదీ చదవండి: దుబాయిలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్) హీరోయిన్గా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు మాఫియా డాన్ అబు సలేంతో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని స్వయంగా మోనికానే వెల్లడించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'దుబాయిలో ఈవెంట్ కోసం నాకు ఫోన్ చేశారు. చేసింది అబు సలేం. ఈవెంట్ కోసం దుబాయి వెళ్లినప్పుడు మొదటి సారిగా ఆయనని కలిశాను. చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడేవాడు. అలా 9 నెలల పాటు మాట్లాడుకున్నాం. అబు మాటలు, కేరింగ్ నచ్చి ప్రేమలో పడిపోయాను. కానీ డాన్ అనే విషయం తెలియకుండానే ప్రేమలో పడ్డానని మెనికా చెప్పింది.డాన్‌తో ప్రేమలో పడిన తర్వాత సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. 2022 సెప్టెంబరులో నకిలీ పత్రాలతో దేశంలోకి వచ్చినందుకుగానూ పోర్చుగల్‌లో మోనికాతో పాటు అబూ సలేంని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత ఐదేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించింది. అలా డాన్‌తో ప్రేమలో పడటం అనే ఒక్క తప్పటగుడు ఈమె కెరీర్ ఇబ్బందుల్లో పడటానికి కారణమైంది. తర్వాత మళ్లీ నటిగా పలు సినిమాలు చేసింది. 2017లో చివరగా ఓ పంజాబీ చిత్రంలో నటించింది. బిగ్‌బాస్ హిందీ 2వ సీజన్లోనూ పాల్గొంది గానీ ఓకే ఓకే అనిపించింది. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో అడపాదడపా కనిపిస్తూనే ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Monica Bedi (@memonicabedi) -
ధర్మేంద్ర తొలి సినిమా పారితోషికం.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ శకం ముగిసింది. దిగ్గజ నటుడు, 300లకి పైగా చిత్రాల్లో నటించిన తన పేరు చిరస్థాయిగా లిఖించుకున్న ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. చివరిశ్వాస వరకు సినిమాల్లో నటించిన ఆయన.. అనారోగ్యంతో కన్నుమూశారు. ధర్మేంద్ర మృతితో బాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ సినీ లోకానికి తీవ్ర విషాదం మిగిల్చింది. షోలే మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న ధర్మేంద్ర ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు.ఈ నేపథ్యంలో ధర్మేంద్ర తొలి సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఆయన నటించిన మొదటి చిత్రమేది? అప్పట్లో ఎంత పారితోషికం అందుకున్నారని నెటిజన్స్‌తో పాటు అభిమానులు ఆరా తీస్తున్నారు. దీనిపై ఆసక్తకరి విషయం బయటకొచ్చింది. ఆయన 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అర్జున్ హింగోరానీ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌లో బల్రాజ్ సాహ్ని, కుంకుమ్ సినీతారలు కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఆయీ మిలన్ కీ బేలా, ఆయే దిన్ బహార్ కే లాంటి చిత్రాల్లో కనిపించారు. ఫూల్ ఔర్ పత్తర్ అనే మూవీ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. షోలే మూవీతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు.అయితే ఆయన తన తొలి సినిమాకు తీసుకున్న వేతనం(పారితోషికం) కేవలం జీతం రూ.51 లేనని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సల్మాన్ ఖాన్ గేమ్ షో దస్ కా దమ్‌కు హాజరైనప్పుడు ఈ విషయాన్ని పంచుకున్నారు. తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్‌తో ఈ షోలో కనిపించారు. ఈ గేమ్ షోలో రూ.లక్ష గెలుచుకున్న తర్వాత.. సల్మాన్ ఖాన్ ఆయన మొదటి రెమ్యునరేషన్ గురించి ప్రశ్న అడిగాడు. నాకు కెరీర్ మొదట్లో రూ.3500 నుంచి రూ.7 వేల వరకు వచ్చేదని అన్నారు. కానీ నా ఫస్ట్ సినిమాకు రూ.5 వేల పారితోషికం ఇస్తారని అనుకున్నానని తెలిపారు. తీరా సంతకం చేసేటప్పుడు చూస్తే కేవలం రూ.51 మాత్రమే ఉందని ధర్మేంద్ర వెల్లడించారు. ఆ డబ్బులతో ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవడానికి మద్యం కొనుగోలు చేశానన్నారు. పోలీసులు పట్టుకుంటే నా కెరీర్ ముగిసిపోతుందని.. మందు తాగేటప్పుడు నా వేలిముద్రలు గ్లాస్‌పై పడకుండా రుమాలు పట్టుకుని తాగానని ధర్మేంద్ర పంచుకున్నారు.కాగా.. ధర్మేంద్ర తన కెరీర్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సీతా ఔర్ గీతా, షోలే, యాదోం కి బారాత్ వంటి చిత్రాల్లో ఆయన నటనను మరోస్థాయికి తీసుకెళ్లాయి. కొద్ది సమయంలోనే అత్యంత ధనిక నటులలో ఒకరిగా మారిపోయారు. 1970ల వరకు తన స్టార్డమ్తో పాటు యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనతో హీ-మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఐకానిక్ బిరుదును సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిన కెరీర్లో 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. -
70 ఏళ్ల స్నేహం, సరిగ్గా ఆయన పుట్టినరోజు నాడే మాయం
ముంబై: 70 ఏళ్ల అపురూపమైన స్నేహం వారిది. ఇద్దరూ లెజెండ్స్. లెజెండరీ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ (నవంబర్ 24)న 90 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మరికొన్ని మరో లెజెండ్రీ నటుడు ధర్మేంద్ర (డిసెంబర్ 8) కూడా 90 ఏళ్లు నిండుతాయనగా జరుపుకునే వారు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఇటీవల తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి చేరిన ప్రముఖ బాలీవుడ్ ధర్మేంద్ర ఇక సెలవంటూ ఈ లోకాన్ని వీడారు. అదీ తన ప్రాణ స్నేహితుడు సలీం ఖాన్ బర్త్‌డే రోజు కావడం మరింత విషాదాన్ని కలిగించింది. తనకు షోలే, సీతా ఔర్ గీతా చిత్రాలతో లాంటి సూపర్‌హిట్స్ అందించిన రచయిత సలీం ఖాన్ 90వ పుట్టినరోజున, 89 ఏళ్ల వయసులో మరణించడం యాదృచ్చికమే అయినా బాధాకరమైందని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్రకు అంజలి ఘటించారు.అపూర్వ స్నేహితుల పరిచయం1935వ సంవత్సరంలో వీరిద్దరూ రోజుల తేడాతో జన్మించారు. బ్లాక్‌బస్టర్ మూవీ సీతా ఔర్ గీత చిత్రంతో 1972లో సలీం ఖాన్ ,ధర్మేంద్ర తొలిసారి కలిశారు. నిజానికి సలీం-జావేద్ ఇద్దరూ దిగ్గజ రైటర్స్‌గా చలామణి అయ్యారు. ధర్మేంద్ర హీరోగా, నటి హేమ మాలిని టైటిల్ డబుల్ రోల్లో వచ్చిన చిత్రం సీతా ఔర్ గీత భారీ హిట్ అందించింది. ఆ తరువాత ధర్మేంద్ర, సలీం ఖాన్, జావేద్ అక్తర్‌తో కలిసి మరో మూడు చిత్రాలలో పనిచేశారు. వాటిల్లో ఈ ఏడాది ప్రారంభంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఐకానిక్ ‘షోలే’ కూడా ఉంది. మల్టీస్టారర్ యాదోం కి బారాత్ (1973),చాచా భటిజా (1977) ఉన్నాయి. రమేష్ సిప్పీ దర్శకత్వంలో వచ్చిన షోలే కేవలం ధరేంద్ర కరియర్లోనేకాదు, హిందీ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం నాలుగు సినిమాలకే రచయితగా, నటుడిగా కలిసి పనిచేసినప్పటికీ, వార స్నేహసంబంధం కాలక్రమేణా వ్యక్తిగతంగా వికసించింది. చదవండి: పెళ్లయ్యి ఏడాది కాలేదు, డెంటిస్ట్ అత్మహత్య : మంత్రి సన్నిహితుడు అరెస్ట్ఫిట్నెస్లో ఆయనే స్ఫూర్తి1998లో సలీం ఖాన్ చిన్న కుమారుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో, సల్మాన్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన చిత్రం ప్యార్ కియా తో డర్నా క్యాలో ధర్మేంద్ర తండ్రి పాత్ర పోషించారు. ఈసందర్బంగా సలీంఖాన్ గురించి ధరేంద్రతో తన ఫ్రెండ్షిప్గురించి మాట్లాడారు. తమ అనుబంధం 1958-1959 నాటిదనీ, తమ స్నేహం చాలా గొప్పది, తనకు అన్నయ్య లాంటివాడు అని సలీం ఖాన్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఖతార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ధర్మేంద్ర పట్ల తన ప్రేమ గురించి మాట్లాడాడు. 90లలో ఆయన ఫిట్నెస్ తనకు స్ఫూర్తి అనీ, ఆయన తన తండ్రిలాంటి వారు అని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ముంబై-వారణాశి చిన్నారి ఆరోహి : సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా కళ్లు చెమర్చే కథ) -
ధర్మేంద్ర మృతిపై జగన్ దిగ్భ్రాంతి
-
డ్రీమ్ గర్ల్నే మెప్పించిన 'ధర్మేంద్ర'.. కెరీర్‌నే మార్చిన సంఘటన ఇదే
బాలీవుడ్లో ఓ శకం ముగిసింది. హీ మ్యాన్ ధర్మేంద్ర (89) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఇంట్లోనే కన్నుమూశారు. ఈయన మృతి విషయాన్ని ఇంకా కుటుంబ సభ్యులు బయటపెట్టలేదు కానీ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ క్రమంలోనే సినీ రాజకీయ ప్రముఖులు ఈయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఇంతకీ ధర్మేంద్ర ఎవరు? ఆయన జీవితంలోని విశేషాలు ఏంటనేది ఈ స్టోరీలో చూద్దాం.1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరం సింగ్ డియోల్. 1960ల నుండి 1980ల వరకు ఈయన నటించిన చిత్రాలు యాక్షన్, రొమాన్స్, కామెడీకి ఐకాన్‌గా నిలిచాయి. 300కు పైగా మూవీస్ చేసిన ఈయన ఎక్కువగా యాక్షన్ చిత్రాలతోనే మెప్పించారు. దీంతో అభిమానులు కూడా "యాక్షన్ కింగ్", "హీ-మ్యాన్" అని ముద్దుగా పిలుచుకుంటారు. షోలే (1975) చిత్రం ఆయన కెరీర్లో పెద్ద మలుపు. ఆ తర్వాత సీత ఔర్ గీత, చుప్కే చుప్కే, ధరమ్ వీర్ వంటి క్లాసిక్ చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆయన ఎంతమంది దర్శకులతో చేసినా, అన్నీ వేటికవే వైవిధ్యభరితంగా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు.. ధర్మేంద్ర కళ్లు చెదిరే సంపద)బాలీవుడ్‌లలో కండలు తిరిగిన సౌష్టవంతో కనిపించి ఆరోజుల్లోనే ధర్మేంద్ర ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆరోజుల్లో చాలామంది అమ్మాయిల కలల రాకుమారునిగా నిలిచారు. ఏకంగా అందరి ‘డ్రీమ్ గర్ల్’గా పేరొందిన హేమామాలిని అంతటి అందాలతారను ఆయన తన సొంతం చేసుకున్నారు. ‘మేచో మేన్’గా పేరొందిన తొలినటుడిగా పేరుగాంచిన ధర్మేంద్ర.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ ప్రస్తుత ట్రెండ్ వరకు తన చిత్రాలకు కలెక్షన్స్ వర్షం కురిసింది. బాలీవుడ్ నుంచి సౌత్ ఇండియా వరకు సుమారు రెండు దశాబ్దాల కాలం పాటు సినిమా పరిశ్రమలో ఎదురులేని మనిషిగా రాణించారు.టాలెంట్‌తో తొలి ఛాన్స్లూధియానా సమీపంలోని లాల్టోన్ కలాన్ అనే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ధర్మేంద్ర తండ్రి ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. దీంతో ఆయన అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. చదువులు పెద్దగా చురుకుగా ఉండేవాడు కాదు. ఏదో రకంగా తన మెట్రిక్యులేషన్ పాసయ్యారు. అయితే, స్కూల్ రోజుల్లోనే స్టేజీలపై నాటకాలు వేయడం ఇష్టం. అప్పట్లో ‘పిలిమ్ ఫేర్’ మేగజైన్ కొత్తవారి టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ పోటీలో ధర్మేంద్ర విజేతగా నిలవడంతో కెరీర్ మలుపు తిప్పింది. ముంబైకి వస్తే సినిమా ఛాన్సులు ఇస్తామని వారు చెప్పడంతో అటువైపు అడుగులు వేశారు. (ఇదీ చదవండి: ధర్మేంద్ర వద్దన్నా హేమమాలిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?)ముంబై వెళ్లిన ఆయనకు నిరాశే ఎదురైంది. కానీ, పట్టువదలకుండా అక్కడే ఉంటూ తన వేట సాగించారు. సరిగ్గా అలాంటి సమయంలోనే దర్శకుడు అర్జున్ హింగోరానీ కంటికి ధర్మేంద్ర పర్సనాలిటీ చూసి ఫిదా అయిపోయాడు. దీంతో తన సినిమాలో హీరోగా అవకాశం కల్పించారు. అలా తన మొదటి సినిమా ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’లో మెప్పించారు. అందులో బలరాజ్ సహానీ వంటి మేటి నటునితో కలసి ధర్మేంద్ర నటించడం విశేషం. అయితే, అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ మెప్పించలేదు. ఆ తరువాత కొన్ని చిత్రాలలో సైడ్ హీరోగానూ నటించాల్సి వచ్చింది. 1962లో విడుదలైన ‘అన్ పడ్’ చిత్రం సూపర్ హిట అయింది. కానీ, 1966లో వచ్చిన ‘ఫూల్ ఔర్ పత్థర్’ చిత్రం ధర్మేంద్రను స్టార్ హీరోను చేసింది.హేమమాలినితో ప్రేమ.. రెండో పెళ్లి1970 ధర్మేంద్ర, హేమమాలినితో జోడీ మొదలైంది. వారిద్దరి కాంబినేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాజా-జానీ, సీతా ఔర్ గీతా, షరాఫత్, నయా జమానా, పత్థర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, చరస్, దోస్త్, మా, షోలే, ఆజాద్ వంటి సినిమాలు వారిద్దరి కాంబినేషన్లో సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే, అప్పటికే ధర్మేంద్రకు పెళ్లి అయిపోయింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ, హేమ మనసు ఆయనతో కలిసి అడుగులు వేయాలని కోరుకుంది. దీంతో వీరిద్దరూ 1980లో వివాహం చేసుకున్నారు. ఈ జోడికి జన్మించిన వారే ఇషా డియోల్, అహనా డియోల్ . ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌కు జన్మించిన వారిలో సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉన్నారు. వారిద్దరూ కూడా హీరోలుగా మెప్పించారు. హేమామాలినితో పెళ్లి తర్వాత కూడా తన కుమారులని ఆయన దూరం పెట్టలేదు. నిర్మాతగా వారిద్దరిని హీరోలుగా పరిచయం చేస్తూ చిత్రాలు నిర్మించారు.ధర్మేంద్ర కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. రాజకీయాల్లోనూ సత్తా చాటారు. రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. 2012లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.(ఇదీ చదవండి: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మంద్ర జీవితంలోని స్పెషల్ ఫొటోలు) -
బాలీవుడ్ యాక్షన్ కింగ్ 'ధర్మేంద్ర' కన్నుమూత
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Actor Dharmendra Death) విడిచారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బందిపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి వద్దే వ్యైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో ధర్మేంద్ర మరణించారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. యాక్షన్ కింగ్‌గా, బాలీవుడ్ హీ మ్యాన్‌గా గుర్తింపు దక్కించుకున్నారు.(ఇదీ చదవండి: ధర్మేంద్ర వద్దన్నా హేమమాలిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?)1935 డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ధర్మేంద్ర-ప్రకాశ్ కౌర్‌కు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర-హేమామాలిని ఇషా డియోల్, ఆహానా డియోల్ సంతానం. అత్యంత ప్రాచుర్యం పొందిన 'షోలే'లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.ధర్మేంద్ర చనిపోయినట్లు ప్రస్తుతం జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశాన వాటికకు ధర్మేంద్ర భార్య హేమమాలిని, కూతురు ఈషా డియోల్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వచ్చిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్.. ధర్మేంద్ర మృతి విషయాన్ని ధ్రువీకరించారు. ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.(ఇదీ చదవండి: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మంద్ర జీవితంలోని స్పెషల్ ఫొటోలు)#HemaMalini reaches the cremation ground after #Dharmendra Ji's demise. #FilmfareLens pic.twitter.com/fGwcgb2CSX— Filmfare (@filmfare) November 24, 2025Daughter #EshaDeol arrives at the Pawan Hans Cremation Centre for #Dharmendra ji’s last rites.#FilmfareLens pic.twitter.com/fpqOIUT2uv— Filmfare (@filmfare) November 24, 2025#WATCH | Maharashtra: Actors Amitabh Bachchan and Abhishek Bachchan arrive at Vile Parle Crematorium in Mumbai. An official statement on veteran actor Dharmendra's health is awaited. pic.twitter.com/JIXuoWvq5L— ANI (@ANI) November 24, 2025 -
23 ఏళ్ల ప్రేమ.. గుళ్లో పెళ్లి చేసుకున్న సీరియల్ జంట
బుల్లితెర జంట అశ్లేష సావంత్ (Ashlesha Savant)- సందీప్ బస్వాన (Sandeep Baswana) పెళ్లిపీటలెక్కారు. వీళ్లది రెండు మూడేళ్ల ప్రేమ కాదు.. ఏకంగా 23 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇన్నాళ్లకు తమ ప్రేమబంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఈమేరకు తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్ చంద్రోదయ ఆలయం ఈ పెళ్లికి వేదికగా మారింది.ఆ గుడికెళ్లాకే..నవంబర్ 16న ఈ పెళ్లి జరగ్గా ఆలస్యంగా బయటకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. అశ్లేష, నేను ఏప్రిల్‌లో బృందావనానికి వెళ్లాం. అక్కడి రాధాకృష్ణుడి గుడి మమ్మల్ని కట్టిపడేసింది. ఆ ట్రిప్ తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న కోరిక పుట్టింది. 23 ఏళ్లుగా జంటగా ఉన్న మేము అలా వైవాహిక జీవితంలో అడుగుపెట్టాం. అలా మొదలైందిమా పేరెంట్స్ ఈ శుభవార్త కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. సింపుల్‌గా మా పెళ్లి జరుపుకున్నాం. కృష్ణుడి గుడిలో వెడ్డింగ్ జరగడం కన్నా ఉత్తమమైనది ఇంకేముంటుంది? అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అశ్లేష వయసు 41 కాగా, సందీప్ వయసు 47. వీరిద్దరూ 2002లో వచ్చిన 'క్యూంకీ సాస్బీ కభీ బహుతీ' సీరియల్లో కలిసి నటించారు. కొన్నిసార్లు షూటింగ్ ఆలస్యమైనప్పుడు అశ్లేష తన ఇల్లు దూరంగా ఉండటంతో సందీప్ ఇంటికి వెళ్లి అక్కడే బస చేసేది. సీరియల్స్అలా వీరిమధ్య బంధం మొదలైంది. చాలా ఏళ్లుగా వీరు కలిసే జీవిస్తున్నారు. ప్రస్తుతం అశ్లేష.. జనక్ సీరియల్ చేస్తోంది. గతంలో అనుపమ సీరియల్లో నెగెటివ్ పాత్ర పోషించింది. సందీప్ చివరగా 'అపొల్లెనా- సప్నోకీ ఉంచి ఉడాన్' సీరియల్లో కనిపించాడు. View this post on Instagram A post shared by 𝑨𝒔𝒉𝒍𝒆𝒔𝒉𝒂 🧿 (@ashleshasavant) చదవండి: బిగ్‌బాస్9: 12వ వారం నామినేషన్స్‌లో ఎవరంటే? -
అప్పుడు ముంబై వదిలేద్దామనుకున్నా!: అనుపమ్ ఖేర్
‘‘సారాంశ్’ (1984) చిత్రంలో నాకు ప్రధాన పాత్ర (బీవీ ప్రధాన్) చేసే అవకాశం దక్కింది. అయితే ఆ సినిమా షూటింగ్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు ఆ పాత్ర నాకు దక్కే పరిస్థితి కనిపించలేదు. ఆ సమయంలో నేను తీవ్రంగా కుంగిపోయాను. ఆ పాత్ర కోసం దాదాపు ఆరు నెలలు సమయం కేటాయించాను. అయితే బీవీ ప్రధాన్ క్యారెక్టర్ నాకు దక్కేలా లేదని తెలిసినప్పుడు ఏర్పడిన నిరాశ నన్ను బాగా కుంగదీసింది. ఆ నిరాశ నన్ను ముంబై వదిలేద్దాం అని నిర్ణయించుకునేలా చేసింది’’ అని బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనుపమ్ ఖేర్ ‘ఇఫీ’ వేదికపై ఎంతో భావోద్వేగంగా గతం తాలూకు తన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా ‘గివింగ్ అప్ ఈజ్ నాట్ ఏ ఛాయిస్’ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక సెషన్లో అనుపమ్ ఖేర్ పాల్గొన్నారు. అప్పుడు ‘సారాంశ్’ గురించి గుర్తు చేసుకున్నారు. అయితే బీవీ ప్రధాన్ పాత్ర తనకు దక్కేలా లేదని తెలిసిన తర్వాత చివరిసారిగా ఆ చిత్రదర్శకుడు మహేశ్ భట్‌తో మాట్లాడి, వెళ్లిపోదామనుకున్నారట అనుపమ్ ఖేర్.అదే ఆయన జీవితాన్ని మార్చింది. ఆ విషయం గురించి అనుపమ్ ఖేర్ చెబుతూ – ‘‘చివరిసారిగా మహేశ్ భట్‌ను కలవడం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన నా ఆవేదనని అర్థం చేసుకున్నారు. ఆ పాత్ర కోసం నేను ఆరు నెలలు వెచ్చించడం, సినిమాపై నాకున్న శ్రద్ధ, గౌరవాలను గుర్తించి బీవీ ప్రధాన్ పాత్రను నాతోనే చేయించారాయన. కాబట్టి అందరికీ నేను చెప్పేదొక్కటే... ఆశను ఎప్పుడూ వదులు కోవద్దు’’ అంటూ ‘మాస్టర్ క్లాస్’లో ఆయన స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు.ఇదో అనూహ్యమైన అనుభవం – నటి–నిర్మాత నిహారిక ‘ఇఫీ’ వేడుకల్లో నటి–నిర్మాత నిహారిక సందడి చేశారు. తాను నిర్మించిన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అలాగే చిత్రదర్శకుడు యదు వంశీకి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా నామినేషన్ దక్కడం తనకు ఆశ్చర్యానందాన్ని కలిగిస్తోందనీ, ఇదొక అసాధారణమైన అనుభవం అనీ నిహారిక పేర్కొన్నారు.ఇంకా చిత్రోత్సవాలకు హాజరైన ఇతర భాషలవారితో ‘సినిమా’ గురించిన విశేషాలను చర్చించారు. ఈ వేడుకల్లో పలు దేశ విదేశీ చిత్రాల ప్రదర్శనలు, వర్క్ షాప్స్, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం కావడంతో సందర్శకులు భారీగా తరలివచ్చారు. చిత్ర ప్రదర్శనలు జరిగే చోట భారీ క్యూలు కనిపించాయి. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
బుల్లితెర బ్యూటీ సడన్ సర్ప్రైజ్.. ప్రియుడితో ఎంగేజ్మెంట్!
ప్రముఖ బుల్లితెర నటి నికితా శర్మ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలను షేర్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బుల్లితెర భామ నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నికితకు కంగ్రాట్స్ చెబుతున్నారు.కాగా.. ఢిల్లీకి చెందిన నికితా శర్మ బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించింది. ఫీర్ లౌట్ ఆయే నాగిన్, దో దిల్ ఏక్ జాన్, స్వరాగిని, మహాకాళి, ప్యార్ తునే క్యా కియా, మహారక్షక్, అక్బర్ కా బల్ బీర్బల్ లాంటి సీరియల్స్‌తో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా పలు టీవీ రియాలిటీ షోలలో కనిపించింది. సోషల్ మీడియాలో ఎప్పుడు బోల్డ్‌గా కనిపించే ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) -
ధనుశ్ బాలీవుడ్ మూవీ.. ఆసక్తిగా తెలుగు టైటిల్!
కోలీవుడ్ హీరో ధనుశ్ బాలీవుడ్లో నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరే ఇష్క్ మే(Tere Ishq Mein Movie). ఈ మూవీకి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆదిపురుష్ భామ కృతి సనన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ తెలుగు టైటిల్‌ను ఖరారు చేశారు. టాలీవుడ్లో అమరకావ్యం అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 28న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్లో ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించారు.A love story etched into history ❤️🔥#TereIshqMein arrives in Telugu as #AmaraKavyam ❤️🔥In cinemas 28th November ✊🏾@dhanushkraja @kritisanon @arrahman @aanandlrai #BhushanKumar #HimanshuSharma #KrishanKumar @Irshad_kamil @neerajyadav911 @ShivChanana @NeerajKalyan_24 @TSeries… pic.twitter.com/AeTgFO1omf— Vamsi Kaka (@vamsikaka) November 23, 2025 -
డబ్బుల్లేవన్న ఓటీటీ.. కట్ చేస్తే జాతీయ అవార్డులు!
12th ఫెయిల్ (12th Fail Movie).. అందరినీ కంటతడి పెట్టించిన సినిమా. అందరి మనసులు గెల్చుకున్న మూవీ. కానీ ఈ సినిమా రిలీజ్‌కు ముందు దీన్ని కొనేందుకు ఓటీటీలు వెనకడుగు వేశాయంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra). ఈయన ఇప్పటితరానికి 12th ఫెయిల్ డైరెక్టర్‌గా తెలుసు.. కానీ ఇతడు పరిండా, 1942:ఎ లవ్ స్టోరీ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించాడు. వినోద్ చోప్రా తాజాగా 56వ ఇఫీ(ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకకు హాజరయ్యాడు. థియేటర్లో రిలీజ్ చేయొద్దన్నారు'అన్స్క్రిప్ట్డ్: ద ఆర్ట్ అండ్ ఎమోషన్ ఆఫ్ ఫిలింమేకింగ్' పేరిట జరిగిన చర్చలో విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ.. 12th ఫెయిల్ తీసినప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాదన్నారు. నా భార్యతో సహా అందరూ దీన్ని థియేటర్లో రిలీజ్ చేయొద్దన్నారు. ఇలాంటి సినిమాను ఎవరూ వెళ్లి చూడరని చెప్పారు. ఎంతో ప్రేమతో ఈ సినిమా చేశాం.. జనాలు కచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం నాకుందన్నాను.దర్శకుడు విధు వినోద్ చోప్రాడబ్బుల్లేవన్న ఓటీటీనా నమ్మకం నిజమైంది. థియేటర్లలో ఏడు నెలలపాటు ఆడింది. ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయితే సినిమా చూశాక తమ దగ్గర కొనేంత డబ్బు లేదని చెప్పింది. మీకు సినిమా అర్థం కాలేదేమో అన్నాను. అందుకో వ్యక్తి.. సినిమాలో చూపించిన మనుషులు నిజ జీవితంలో ఉండరు అన్నాడు. అలా వారు మా సినిమాను కొనేందుకు ఇష్టపడలేదు అని గుర్తు చేసుకున్నాడు. తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టవడం జియో హాట్‌స్టార్‌లో రిలీజవడం చకచకా జరిగిపోయాయి. జాతీయ అవార్డులు మొన్నటి మొన్న (ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీల్లో) రెండు జాతీయ అవార్డులు సైతం సాధించింది. 12th ఫెయిల్ మూవీ విషయానికి వస్తే ఇందులో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించగా మేధా శంకర్ హీరోయిన్గా నటించింది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ- ఐఆర్ఎస్ అధికారిణి శ్రద్ధా జోషిల జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 2023 అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: చెత్త అమ్ముకునేవాడిని..షాప్ అమ్ముకునే దుస్థితి: జబర్దస్త్ కమెడియన్ -
పాటలు వినేందుకు వెళ్తే రూ.18 లక్షలు స్వాహా
రీసెంట్ టైంలో మ్యూజికల్ కన్సర్ట్స్ అనేది ట్రెండ్ అవుతుంది. ప్రముఖ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ర్యాపర్స్ పలు నగరాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అలానే ఇంటర్నేషనల్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ కన్సర్ట్.. ముంబైలో శుక్రవారం రాత్రి జరిగింది. కానీ చాలామందికి ఇదో పీడకలలా మిగిలింది. ఎందుకంటే లక్షలు విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ముంబైలోని మహాలక్ష్మీ రేస్ కోర్సులో ఈ కన్సర్ట్ జరిగింది. వేలాదిమంది హాజరయ్యారు. స్టేజీకి దగ్గరలో చాలామంది గుమిగూడారు. ఇదే అదనుగా తీసుకున్న దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 24 ఖరీదైన మొబైల్ ఫోన్స్, 12 గోల్డ్ చెయిన్స్ దొంగతనానికి గురయ్యాయి. వీటి విలువ రూ.18 లక్షల వరకు ఉంటుంది. ఈ మేరకు కన్సర్ట్కి వచ్చిన చాలామంది.. సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ దొంగతనం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. గోల్డ్ చెయిన్స్, ఫోన్స్‌కి సంబంధించిన వివరాలన్నీ తీసుకున్నారు. వీటిని పోగొట్టుకున్న వాళ్లలో ముంబై, సూరత్, బెంగళూరు, కేరళకు చెందిన పలువురు ఉన్నారు. ఏదేమైనా కన్సర్ట్కి వెళ్దామనుకునే చాలామందికి ఈ సంఘటన మేలుకొలుపు లాంటిదని చెప్పొచ్చు. చూడాలి మరి పోలీసులు ఈ కేసులో తర్వాత ఏం చేస్తారో? -
'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్
సాధారణంగా హీరోలు తమ సినిమా ఫ్లాప్ అయితే జీర్ణించుకోలేరు. ఒకవేళ ఇదే జరిగితే వీలైనంత వరకు దానిగురించి మాట్లాడరు. కచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తప్పించుకుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం కొందరు నిజాయితీగా ఒప్పేసుకుంటారు. ఇప్పుడు కూడా అలానే జరిగింది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.. అందరిముందు తన మూవీ ఫ్లాప్ అని చెప్పాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.ఈ ఏడాది రిలీజైన పాన్ ఇండియా సినిమాల్లో 'వార్ 2' ఒకటి. ఇందులో హృతిక్ రోషన్‌తో పాటు తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటించాడు. విడుదలకు ముందు చాలా హంగామా చేశారు. అభిమానులు కాలర్ ఎత్తుకుంటారని తారక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కట్ చేస్తే థియేటర్లలో మూవీ ఫ్లాప్ అయింది. తర్వాత ఎన్టీఆర్ సైలెంట్ అయిపోయాడు. కొత్త ప్రాజెక్టులో బిజీ అయిపోయాడు. కానీ హృతిక్ మాత్రం ఈ ఫలితాన్ని మర్చిపోలేకపోతున్నాడు.(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)కొన్నిరోజుల క్రితం 'వార్ 2' గురించి హృతిక్ ఓ ట్వీట్ చేశాడు. తన పని తాను చేశానని, కానీ అనుకున్న ఫలితం రాలేదన్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చాడు. కానీ తాజాగా దుబాయిలో జరిగిన ఓ లాంచ్ ఈవెంట్లో మాత్రం పబ్లిక్‌గా ఫ్లాప్ అని ఒప్పుకొన్నాడు. చెప్పాలంటే తనపై తానే ట్రోలింగ్ చేసుకున్నాడు.ఈ ఈవెంట్‌ని హోస్ట్ చేసిన యాంకర్.. హృతిక్‌ని పొగుడుతూ సూపర్‌స్టార్‌ని చప్పట్లతో వెల్కమ్ చెప్పాలని అన్నాడు. స్టేజీ మీదకు వచ్చిన హృతిక్.. 'మీ అందరికీ ధన్యవాదాలు. నా లేటెస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్ అయింది. అయినా సరే మీరు ఇంత ప్రేమ, అభిమానం చూపుతున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా' అని హృతిక్ చెప్పాడు. మూవీ వచ్చి దాదాపు నాలుగు నెలలు అవుతున్నా హీరో.. మూవీ రిజల్ట్‌ని మర్చిపోలేకపోతున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ బోల్డ్ సిరీస్.. కొత్త సీజన్ టీజర్ రిలీజ్)My film just bombed at box office so this just feels good to get all the love 😭😭#HrithikRoshan and his way to troll the haters 🤣🤣pic.twitter.com/9PTWvu9XO6— Pan India Review (@PanIndiaReview) November 21, 2025 -
ఫస్ట్ సినిమాకే హీరోయిన్‌తో ప్రేమ? క్లారిటీ ఇచ్చిన హీరో
బాలీవుడ్లో ఈ ఏడాది సంచలనం సృష్టించిన మూవీ సయారా (Saiyaara Movie). చిన్న చిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. లైగర్ బ్యూటీ అనన్య పాండే కజిన్ అహాన్ పాండే (Ahaan Panday) కథానాయకుడిగా పరిచయం అవగా, బాలీవుడ్ నటి అనీత్ పడ్డా (Aneet Padda) హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తను నా బెస్ట్ఫ్రెండ్ఆన్స్క్రీన్పై జంటగా కనిపించిన వీరు రియల్ లైఫ్‌లోనూ ప్రేమలో పడ్డట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై అహాన్ పాండే స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అనీత్ నా బెస్ట్‌ఫ్రెండ్. సోషల్ మీడియాలో అనుకున్నట్లుగా మేము ప్రేమికులమైతే కాదు. మా మధ్య కెమిస్ట్రీ ఉంది. కానీ అది మీరనుకునే కెమిస్ట్రీ కాదు. కెమిస్ట్రీ అంటే రొమాంటిక్ అని అర్థం కాదు. కంఫర్ట్, భద్రత, ఒకరినొకరు చూసుకోవడం. ఇప్పుడైతే సింగిల్మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. తనతో ఉన్నట్లుగా నేనెవరితోనూ లేను. అలా అని తను నా ప్రేయసి మాత్రం కాదు. ప్రస్తుతానికి నేను సింగిల్ అని చెప్పుకొచ్చాడు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సయారా మూవీ జూలై 18న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.570 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.చదవండి: పక్కా ప్లాన్‌తో స్క్రిప్ట్ రాస్తున్నా: కీర్తి సురేశ్ -
నాకు తల్లవ్వాలని లేదు, ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్!
కొందరు పెళ్లయిన వెంటనే పిల్లలు కావాలనుకోరు. ముందుగా కెరీర్లో స్థిరపడ్డాకే పిల్లలను ప్లాన్ చేసుకుంటారు. కానీ అసలు పిల్లలే వద్దనుకునేవారు చాలా తక్కువమంది. హిందీ బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) భార్య ఆకాంక్ష (Akanksha) ఈ కోవలోకే వస్తుంది. గౌరవ్ హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్లో పాల్గొన్నాడు.తల్లవ్వాలన్న ఆశ లేదుఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఆకాంక్ష చమోలా హౌస్‌లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా వీరి తొమ్మిదో పెళ్లి రోజును హౌస్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో తనకు తల్లవ్వాలన్న ఆశ లేదంది ఆకాంక్ష. ఆ మాట విని గౌరవ్ నిశ్చేష్టుడయ్యాడు. అమ్మ అని పిలిపించుకోవాలని నాకెప్పుడూ అనిపించడలేదు. భవిష్యత్తులో కూడా పిల్లల్ని ప్లాన్ చేయాలనుకోవడం లేదు. చాలా కారణాలుపిల్లలుంటే బాగుండన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఇలా పిల్లలు వద్దనుకోవడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేదు. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఏదో వంటకం చేసినంత ఈజీ కాదు. అది పెద్ద బాధ్యత. నేను దానికి న్యాయం చేయలేను అని నా ఫీలింగ్. ఇప్పుడే కాదు, ఇకముందు కూడా ఆ బాధ్యత నిర్వర్తించలేను. ప్రస్తుతం నాకు నా కెరీర్ ముఖ్యం. నాకు చాలా లక్ష్యాలున్నాయి. నా కెరీర్ ముఖ్యంజనాలు నన్ను స్వార్థపరురాలిని అనుకున్నా మరేం పర్లేదు. నాకు నా కెరీర్ ముఖ్యం అని చెప్పుకొచ్చింది. అది విన్న గౌరవ్.. నీ సమాధానం తనను మరింత భయపెడుతుందన్నాడు. గౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా రియాలిటీ షో విజేతగా నిలిచాడు. గౌరవ్ - ఆకాంక్ష 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.చదవండి: రీతూని నిలదీసిన తల్లి -
ప్రియాంక పీఆర్ స్టంట్? వాళ్లు నిజమైన ఫ్యాన్స్ కాదా?
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీ ప్లీజ్ అని జనాలు వెంటపడతారు. ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వెంట సైతం ఫ్యాన్స్.. ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అని వెంటపడుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ప్రియాంకను ఇద్దరు అభిమానులు పదేపదే ఆటోగ్రాఫ్ అడిగారు. పీఆర్ స్టంట్?తను కూడా వారి అభ్యర్థనను తిరస్కరించకుండా రెండుసార్లు ఆటోగ్రాఫ్ ఇచ్చింది. ఇది చూసిన జనాలు ఇది కచ్చితంగా పీఆర్ స్టంటే, వాళ్లసలు అభిమానులే కాదని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ వైరల్ వీడియోపై హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ స్పందించింది. 'ఇది పీఆర్ స్టంట్ అని నేననుకోవడం లేదు. వాళ్లు ఆమెను విమానాశ్రయం లోపల నుంచి వెంబడిస్తున్నారు. అది నిజం కాదువీలైనన్ని సార్లు ప్రియాంక సంతకాన్ని సేకరించారు. ఆ ఆటోగ్రాఫ్స్ని వారు ఆన్లైన్లో అమ్ముకుంటారు. నేను కూడా మొదట మీలాగే పొరబడ్డాను. కానీ వాళ్లిద్దరూ ఆమెను వదిలిపెట్టలేదు. తన వెంటపడ్డారు. దాంతో ప్రియాంక.. మంచితనంతో ఓపికగా అడిగిన ప్రతిసారి సంతకం చేసిందంతే! అని చెప్పుకొచ్చింది.తెలుగులో ఎంట్రీఇకపోతే బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా చాలాకాలం తర్వాత ఇండియన్ సినిమాకు రీఎంట్రీ ఇస్తోంది. అది కూడా తెలుగు సినిమా వారణాసితో! టాలీవుడ్లో ఇదే తన తొలి మూవీ కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Timesapplaud Buzz (@timesapplaudbuzz) చదవండి: పవన్ తండ్రికి క్యాన్సర్.. నోరు తిరగక, తిండి తినక.. -
మళ్లీ తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ (Sonam Kapoor) రెండోసారి తల్లి కాబోతుంది. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్‌మీడియాలో క్రేజీగా పోస్ట్ చేసింది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, 2022లో వారికి వాయు అనే కుమారుడు జన్మించాడు. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివబోతున్నట్లు ఆమె ప్రకటించింది.కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే సోనమ్ ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత భర్త, పిల్లలే తన ప్రపంచం అంటూ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ, సోషల్‌మీడియాలో ఆమె ఎప్పుడూ కూడా యాక్టివ్గానే కనిపిస్తుంది. అయితే, తాజాగా సోనమ్ కపూర్ క్రేజీగా రెండో ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించగానే అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పింక్ డ్రెస్ ధరించి కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ.. సంతోషంగా కనిపించింది.నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనం 2007లో ‘సావరియా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ-6, బాంబే టాకీస్, ప్రేమ రతన్ ధన్ పాయో, నీర్జా, సంజు వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
బాలీవుడ్ టు కార్పొరెట్ వరల్డ్
బాలీవుడ్లో ఒక వెలుగు వెలుగుతున్న కాలంలోనే కార్పొరెట్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన మయూరి కాంగో ఒక్కో మెట్టు ఎక్కుతూ కార్పొరెట్ ప్రపంచంలో గెలుపు జెండా ఎగరేసింది. ఐఐటీ, కాన్పూర్ స్టూడెంట్ అయిన మయూరి సినిమాల మీద పాషన్‌తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. పాప కెహ్తే హై, హోగీ ప్యార్ కీ జీత్లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంబీఏ పూర్తిచేసిన తరువాత కార్పొరెట్ జర్నీ ప్రారంభించింది. అమెరికన్ డిజిటల్ ఏజెన్సీ ‘360ఐ’లో అసోసియెట్ మీడియా మెనేజర్‌గా చేరింది. ఆ తరువాత న్యూయార్క్‌లోని అడ్వర్టైజింగ్ సంస్థ ‘రిజల్యూషన్ మీడియా’లో చేరింది. కొద్దికాలం తరువాత బోస్టన్లోని ‘డిజిటాస్’లో అసోసియేట్ డైరెక్టర్(మీడియా), ఆ తరువాత పెర్ఫార్మమెన్స్ మార్కెటింగ్ ఏజెన్సీ ‘పెర్ఫార్మిక్స్’లో చేరిన మయూరి 2019లో గూగుల్‌లో చేరింది. ప్రస్తుతం ‘పబ్లిసిస్ గ్లోబల్ డెలివరీ’ కంపెనీ’ సీయీవోగా బాధ్యతలు నిర్వహిస్తోంది.(చదవండి: జరగబోయేవన్నీ చెప్పగలనంటాడు!) -
రూ.252 కోట్ల డ్రగ్స్ కేసు.. ఓర్రీకి నోటీసులు
బాలీవుడ్లో ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకున్న ఓర్రీ (ఓర్హాన్ అవత్రమణి) వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్.. 'బాలీవుడ్ బీఎఫ్ఎఫ్'గా ఒర్రీ పాపులర్. ఎక్కడ ఏ సెలబ్రిటీ ఫంక్షన్ జరిగినా వాలిపోతూ ఉంటాడు. తన చేష్టలతో నెట్టింట హల్చల్గా మారతాడు. అయితే, తాజాగా డ్రగ్స్ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఓర్రీకి నోటీసులు జారీ చేశారని హిందీ మీడియా నివేదించింది.రూ.252 కోట్ల రూపాయల మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి బాలీవుడ్ ఇన్‌సైడర్‌గా పేరున్న ఓర్రీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేసినట్లు ANI సంస్థ నివేదించింది. నేడు ఉదయం 10 గంటలకు యాంటీ-నార్కోటిక్స్ సెల్ (ANC) ఘట్కోపర్ యూనిట్ ముందు హాజరు కావాలని ఓర్రీని పోలీసులు కోరారు. విచారణలో మాత్రమే అతని పేరు కనిపిస్తుంది, అయితే ఈ కేసులో ఓర్రీ పాత్ర ఏమిటో పోలీసులు వెల్లడించలేదు.అనేక నివేదికల ప్రకారం, ఇటీవల UAE నుండి వచ్చిన సలీం డోలా కుమారుడు తాహెర్ డోలాకు సంబంధించిన అనేక విచారణ పత్రాలలో ఓర్రీ పేరు బయటపడింది. సలీం డోలా భారతదేశంతో పాటు విదేశాలలో సెలబ్రిటీ పార్టీలలో బహిరంగంగా మాదకద్రవ్యాలను వినియోగించే భాగమని ఇండియా టుడే నివేదించింది. -
కొడుకు పేరు రివీల్ చేసిన హీరోయిన్.. అలాంటి అర్థం వచ్చేలా!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా గతనెలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రముఖ పొలిటీషియన్ రాఘవ్ చద్దాను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. రెండేళ్ల తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 19న మొదటి బిడ్డను తమ జీవితంలో ఆహ్వానించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.తాజాగా తమ ముద్దుల చిన్నారికి బారసాల కార్యక్రమం నిర్వహించారు ఈ జంట. బాబు పుట్టిన నెల రోజులకు పేరు పెట్టారు. తమ బిడ్డకు నీర్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. జలస్య రూపం, ప్రేమస్య స్వరూపం - తత్ర ఏవ నీర్.. మా హృదయాలు జీవితంలో శాశ్వతమైన శాంతిని పొందాయి.. మా అబ్బాయికి నీర్ అని పేరు పెట్టాం అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నీర్ అంటే స్వచ్ఛమైన, దైవిక, పరిమితం లేని అనే అర్థం వస్తుందని వెల్లడించారు. పరిణీతిలోని నీ... రాఘవ్‌లోని రా కలిసి వచ్చేలా తమ ముద్దుల బిడ్డకు నామకరణం చేశారు.(ఇది చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా.. సోషల్ మీడియాలో పోస్ట్)ఈ ఏడాదిలో ఆగస్టులో పరిణీతి, రాఘవ్ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. వీరిద్దరు సెప్టెంబర్ 2023లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలో జరిగిన వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన పరిణీతి చోప్రా కనిపించింది. ఈ ఏడాది కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించింది. View this post on Instagram A post shared by @parineetichopra -
ఒళ్లు జలదరించేలా 'ధురంధర్' ట్రైలర్
గత కొన్నాళ్లుగా సినిమాలతై చేస్తున్నాడు గానీ బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌కి సరైన హిట్ పడట్లేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్సయినట్లు ఉన్నాడు. ఈ క్రమంలోనే 'ఉరి' మూవీ తీసిన ఆదిత్య ధర్‌తో కలిసి ఓ మూవీ చేశాడు. అదే 'ధురంధర్'. భారత్ vs పాక్ ఉగ్రవాదం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రాన్ని డిసెంబరు 5న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు)4 నిమిషాలకు పైగానే ఉన్న ట్రైలర్ చూడటానికి బాగుంది. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలు, ఒళ్లు జలదరించే కొన్ని సీన్స్‌తో నింపేశారు. రణ్వీర్ సింగ్ హీరో కాగా ఇతడికి జోడీగా సారా అర్జున్ నటించింది. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మరి ఈసారైనా రణ్వీర్ హిట్ కొడతాడేమో చూడాలి?(ఇదీ చదవండి: రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత) -
చెంప పగలగొట్టాడు.. సారీ కూడా చెప్పలేదు!
నన్ను చాలామంది కొట్టారు. కానీ, ఇంత గట్టిగా, కోపంగా కొట్టింది మాత్రం గుల్షన్ గ్రోవర్ (Gulshan Grover) ఒక్కడే అంటున్నాడు బాలీవుడ్ నటుడు సానంద్ వర్మ (Saanand Verma). 'ఫస్ట్ కాపీ' వెబ్ సిరీస్‌లో వీరిద్దరూ కలిసి నటించారు. ఓ సీన్ చిత్రీకరణలో భాగంగా గుల్షన్.. సానంద్ చెంప చెళ్లుమనిపించాలి. అయితే అతడు కొడుతున్నట్లుగా యాక్టింగ్ చేయకుండా నిజంగానే కొట్టానంటున్నాడు సానంద్.నిజంగా చేయి చేసుకున్నాడుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సానంద్ వర్మ మాట్లాడుతూ.. ఫస్ట్ కాపీ వెబ్ సిరీస్‌లో గుల్షన్ నన్ను కొట్టే సీన్ ఉంటుంది. అతడు నన్ను సీరియస్‌గానే కొట్టాడు. ఆ క్షణం నాకు అతడి పీక పిసికేయాలన్నంత కోపం వచ్చింది. కానీ, నన్ను నేను తమాయించుకుని సైలెంట్‌గా ఉన్నాను. ఇప్పటివరకు ఒక్కమాట కూడా అనలేదు. ఫస్ట్ టైం ఈ విషయాన్ని బయటపెడుతున్నాను.ముందు చెప్పాలిగా!నిజంగా కొట్టేముందు కనీసం ఓ మాటయినా నాకు చెప్పాలిగా! అప్పుడు నేను సిద్ధంగా ఉండేవాడిని. ఇంత ఫీలయ్యేవాడిని కాదు. అప్పటికీ ఆ సీన్ షూటింగ్ అయ్యాక నేను లోలోపలే బాధపడ్డాను తప్ప ఎవరితోనూ ఏమీ అనలేదు. దగ్గర్లో ఉన్న కుర్చీ అందుకుని కొట్టాలనిపించినా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాను. ఒక నటుడిగా దెబ్బలు తినడం నాకు కొత్తేమీ కాదు. నిజమైన దెబ్బలు కావుఎక్కువశాతం నాకు అలాంటి సీన్లే పడుతుంటాయి. 'బాబీ జీ ఘర్ పర్ హే' సీరియల్లో నేను చాలా చెంపదెబ్బలు తిన్నాను. కానీ, వాటికి ఓ పద్ధతి ఉంటుంది. అవేవీ నిజమైన దెబ్బలు కావు. మర్దానీ సినిమాలో కూడా నన్ను కొట్టే సీన్ ఉంటుంది. ఆ సన్నివేశం సరిగా రాకపోవడంతో నటుడు దిగ్విజయ్. నన్ను రియల్‌గా కొడతానని అడిగారు. క్షమాపణలు కూడా చెప్పలేదునేను అంగీకారం తెలిపాకే నాపై చేయి చేసుకున్నాడు. ఇది ఒక పద్ధతి. నటుడు అనిల్ కపూర్ కూడా నిజంగానే కొడతారని విన్నాను. కానీ, ఆయన కొట్టిన వెంటనే క్షమాపణలు అడుగుతాడు. గుల్షన్ కనీసం ఆ పని కూడా చేయలేదు. తన లోకంలో తనే ఉంటాడు అని సానంద్ వర్మ చెప్పుకొచ్చాడు.చదవండి: రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. నామినేషన్స్‌లో ఎవరంటే? -
నా నిర్ణయం సరైనదే: దీపికా పదుకోన్
‘‘నేనో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మగారిపై మరింత గౌరవం పెరిగింది. వృత్తి జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని బ్యాలెన్స్ చేయొచ్చని చాలామంది అంటుంటారు. కానీ అది చాలా కష్టమైన పని. కొత్తగా తల్లయిన వారు తిరిగి పనికి వచ్చినప్పుడు వారికి అందరూ సపోర్ట్ చేయాలి’’ అని దీపికా పదుకోన్ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు 8 గంటలు మాత్రమే పని చేసే వెసులుబాటును కల్పించాలని దీపిక కొంత కాలంగా పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో మరోమారు ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ– ‘‘రోజుకి 8 గంటల పని మానవ శరీరానికి, మనసుకు సరిపోతుంది.మనం ఆరోగ్యంగా ఉండి, పని చేసినప్పుడే అవుట్‌పుట్ బాగా వస్తుంది. ఒత్తిడితో పని చేస్తే సరైన ఫలితం రాకపోవచ్చు. మా ఆఫీసులో సోమవారం నుంచి శుక్రవారం వరకు మేం 8 గంటలే పని చేస్తాం. వినేవారికి బోరింగ్‌గా ఉండొచ్చు. టైమ్ అనేది మన చేతుల్లో ఉన్న ధనంతో సమానం. దీన్ని ఎవరితో, ఎప్పుడు, ఎలా స్పెండ్ చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు ఉండాలి. నా దృష్టిలో సక్సెస్ అంటే ఇదే. 8 గంటలు మాత్రమే పని చేయాలనే నా నిర్ణయం కరెక్టే’’ అని చెప్పుకొచ్చారు దీపికా పదుకోన్. -
ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త సినిమా
వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో ఉన్న ఇండియన్ సినిమా 'హౌమ్ బౌండ్'. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అఫీషియల్‌గా దీనికి ఎంట్రీ దొరికింది. థియేటర్లలోకి రావడానికి ముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలు కూడా అందుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది.ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కరోనా కష్టాలు, కులం కారణంగా ఎదురయ్యే అవమానాలు, ఉద్యోగాల్లో ఎదురయ్యే అణిచివేత, ఆర్థిక అసమానతలు తదితర అంశాలని తీసుకుని ఈ సినిమా తీశారు. పలు చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకోగా.. సెప్టెంబరు 26న థియేటర్లలో రిలీజ్ చేశారు. యావరేజ్ టాక్ దగ్గరే అగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం నవంబరు 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)'హౌమ్ బౌండ్' విషయానికొస్తే.. మహమ్మద్ షోయబ్ అలీ(ఇషాన్ ఖట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) ఫ్రెండ్స్. వీళ్లిద్దరూ ముస్లిం, దళిత వర్గానికి చెందిన వాళ్లు కావడంతో సమాజంలో అవమానాలు, అణిచివేతకు గురవుతారు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ అయితే తమకు గౌరవం లభిస్తుందని వీళ్లిద్దరూ భావిస్తారు. పరీక్ష రాస్తారు. ఫలితాలు రావడం ఆలస్యం కావడంతో కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ కంపెనీలో అలీ ఉద్యోగానికి చేరతాడు. సుధ(జాన్వీ కపూర్) కోసం చందన్ కాలేజీలో చేరతాడు.మరి కలిసి ఉండే అలీ, చందన్ మధ్య గొడవలు ఎందుకొచ్చాయి? కాలేజీ మానేసిన చందన్.. ఆఫీస్ బాయ్ ఉద్యోగం వదిలేసిన షోయబ్.. సూరత్ వెళ్లి ఫ్యాక్టరీలో పనికి ఎందుకు చేరారు?వీరిద్దరి జీవితాల్లో కరోనా ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేది మిగతా సినిమా. ఇద్దరు స్నేహితులుగా ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా అద్భుతంగా నటించారు. ఓ చిన్న పాత్రలో ఎలాంటి మేకప్ లేకుండా జాన్వీ కపూర్ ఆకట్టకుంది.(ఇదీ చదవండి: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఒక్క సంఘటనతో రాజమౌళి ఫ్రస్టేషన్!) -
కళ్ల ముందే ఓ ప్రాణం పోయింది, నెక్స్ట్ నా వంతే!
పులి కడుపున పులే పుడుతుందంటారు. లెజెండరీ యాక్షన్ డైరెక్టర్ వీరు దేవ్‌గణ్ ఎన్నో సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా చేశారు. కొన్ని చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. తన శరీరంలో ఎన్ని ఎముకలు విరిగినా సరే ఏమాత్రం జంకకుండా ఎన్నో సినిమాలకు స్టంట్‌మెన్‌గా వ్యవహరించారు. తండ్రి ధైర్యమే కొడుక్కీ వచ్చింది.ప్రాక్టీస్ చేయకుండా దూకేశాడుబాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) కూడా సాహసోపేతమైన సన్నివేశాలకు వెనకడుగు వేయడు. దేదే ప్యార్ దే 2లోనూ అలాంటి స్టంట్లు చేశాడు. 'విమానంలోనుంచి దూకే సన్నివేశం అది.. కనీసం ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయకుండానే విమానంలో నుంచి సడన్‌గా దూకి స్కైడైవింగ్ చేశాడు' అని నటుడు మాధవన్ అజయ్ గురించి గొప్పగా చెప్పాడు.కళ్ల ముందే ఓ ప్రాణంఇంతలో అజయ్ అందుకుంటూ.. నేను షూటింగ్ లొకేషన్‌కు వెళ్లగానే ఓ బాధాకర సంఘటన జరిగింది. నా కళ్లముందే ఒక వ్యక్తి పారాచూట్ పని చేయక లోయలో పడి చనిపోయాడు. తర్వాత నావంతు వచ్చింది. ఇది ప్రమాదకరమైనప్పటికీ నేనే రిస్క్ చేసి దూకుతున్నాను తప్ప ఎవరి బలవంతం లేదు అని ఓ వీడియో రికార్డ్ చేసి నా సీన్ పూర్తి చేశాను. ఆ హీరోకీ తప్పలేదు!హాలీవుడ్ స్టార్ లినార్డో డికాప్రియోకి కూడా ఈ లొకేషన్లో చేదు అనుభవం ఎదురైంది. ఒకసారి సినిమా షూటింగ్లో భాగంగా ఇక్కడే స్కైడైవింగ్ చేశాడు. అతడి పారాచూట్ పనిచేయకపోయేసరికి అక్కడున్న ఇన్స్ట్రక్టర్ వెంటనే దూకి అతడి ప్రాణాలు కాపాడాడు అని గుర్తు చేసుకున్నాడు.చదవండి: కుమిలి కుమిలి ఏడ్చా!: మంచు లక్ష్మి -
దానికంటే ముందు చాలా సినిమాలు రిజెక్ట్ చేశా!
'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది దీపికా పదుకొణె (Deepika Pdukone). తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. అయితే ఓం శాంతి ఓం కంటే ముందు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయని, వాటన్నింటినీ తాను వదిలేసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. కొన్నిసార్లు మనం చూస్తుండగానే అన్నీ జరిగిపోతుంటాయి. నేను రెండేళ్లు మోడల్‌గా చేశాను. రెడీగా లేనుఅప్పటినుంచే సినిమా ఛాన్సులు రావడం మొదలైంది. చాలామంది దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. కానీ, అప్పటికి నేను సిద్ధంగా లేను. గ్లామర్ ప్రపంచంలో మోడల్‌గా అప్పుడే కదా కెరీర్ ప్రారంభించాను. ఇక్కడినుంచి సినిమాలకు షిఫ్ట్ అవడానికి ఇంకాస్త సమయం తీసుకోవాలనుకున్నాను. అందువల్లే నాకు వచ్చిన ఆఫర్లను ఎంతో సున్నితంగా రిజెక్ట్ చేశాను. నన్ను నమ్మి ఛాన్సులిచ్చిన అందరికీ నేనెంతో కృతజ్ఞురాలిని.ఎప్పుడూ నేర్చుకుంటూనే..ఓం శాంతి ఓం ఆఫర్ చేసినప్పుడు ఇదే కరెక్ట్ టైం అనిపించి సెట్లోకి అడుగు పెట్టాను. ర్యాంప్ వాక్ అయినా, యాక్టింగ్ అయినా.. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండేదాన్ని. ఇండస్ట్రీని, కళను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పటికీ సెట్లో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. కాకపోతే గతంలో కంటే ఇప్పుడు నేను ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నాను. అప్పుడు నేను చేసేది కరెక్టేనా? జనాలు ఏమనుకుంటారు? ఇలాంటి ఆలోచనలుండేవి. సినిమాకానీ, ఇప్పుడు నాకు నచ్చింది చేస్తున్నా.. నాకు నచ్చినట్లే ఉంటున్నా అని చెప్పుకొచ్చింది. దీపికా.. ఓం శాంతి ఓం సినిమా కంటే ముందు కన్నడలో ఐశ్వర్య అనే మూవీ చేసింది. తర్వాత మళ్లీ సాండల్‌వుడ్‌లో కనిపించనేలేదు. ఈమె తెలుగులో కల్కి 2898 ఏడీ సినిమా చేసింది. అయితే కొన్ని ప్రత్యేక డిమాండ్లు చేసిందన్న కారణంతో కల్కి సీక్వెల్ నుంచి ఆమెను తప్పించారు. అలాగే ప్రభాస్ స్పిరిట్ మూవీలోనూ నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ సడన్‌గా ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ, షారూఖ్ ఖాన్ 'కింగ్' సినిమాలు చేస్తోంది.చదవండి: సస్పెన్స్‌కు బ్రేక్.. వీడియో షేర్ చేసిన తెలుగు సీరియల్ నటి -
ఒకే హీరోతో డేటింగ్ చేశాం: ఇద్దరు స్టార్ హీరోయిన్లు
బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్ (Kajol), ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna) వ్యాఖ్యాతలుగా కొనసాగుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘టూ మచ్’ (Two Much) గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో తాజాగా విడుదలైన ఎపిసోడ్లో వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.గతంలో వీరిద్దరు ఒకేసారి.. ఒకే హీరోతో డేటింగ్ చేసినట్లు షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే, అదంతా తమ పెళ్లికి ముందేనంటూ క్లారిటీ ఇచ్చారు. గతంలో ఇలాంటి సీక్రెట్స్ చెప్పాలంటే ఎవరైనా కాస్త ఆలోచించేవారు. అయితే, ప్రస్తుతం చాలా సింపుల్‌గా బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. వారిద్దరితో డేటింగ్ చేసిన ఆ హీరో ఎవరంటూ సోషల్‌మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కొందరు అభిషేక్ కపూర్ అంటూ కామెంట్ చేస్తే ఇంకొందరు మాత్రం అక్షయ్ కమార్ అని పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా వారిద్దరూ మాత్రం నిజ జీవితంలో వేరువేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారనేది నిజం. కాజోల్ అజయ్ దేవగన్‌ను పెళ్లి చేసుకుంటే.. ట్వింకిల్ ఖన్నా మాత్రం అక్షయ్‌ను వివాహం చేసుకుంది. -
పెళ్లిరోజే గుడ్‌న్యూస్ చెప్పిన హీరో
బాలీవుడ్ జంట రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) - పాత్రలేఖ (Patralekhaa) గుడ్‌న్యూస్ చెప్పింది. తమ పెళ్లిరోజునాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు దంపతులు వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నవంబర్ 15న రాజ్‌కుమార్- పాత్రలేఖల పెళ్లిరోజు. వెడ్డింగ్ యానివర్సరీ నాడే బిడ్డ జన్మించడంతో దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందిన వీరికి సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.2014లో లవ్..రాజ్‌కుమార్ రావు- పాత్రలేఖ సిటీలైట్స్ (2014) సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమకు పెద్దలు సైతం పచ్చజెండా ఊపడంతో 2021 నవంబర్ 15న పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 9న పాత్రలేఖ తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది. న్యూజిలాండ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు తాను గర్భం దాల్చిన విషయాన్ని కనుగొంది. డెలివరీ తర్వాత బిడ్డతో కలిసి న్యూజిలాండ్ ట్రిప్‌ను పూర్తి చేస్తానంది. అలాగే బిడ్డను ఎత్తుకుని బంగీ జంప్ కూడా చేస్తానంది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. రాజ్‌కుమార్ రావు 2010లో రణ్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టాడు. లవ్ సెక్స్ ఔర్ ధోఖా, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2, తలాష్, కై పో చె, సిటీ లైట్స్, హమారీ అదూరీ కహాని, స్త్రీ, లవ్ సోనియా, లూడో, హిట్: ద ఫస్ట్ కేస్, భేడియా, శ్రీకాంత్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, స్త్రీ 2 వంటి పలు సినిమాలతో అలరించాడు. పాత్రలేఖ.. లవ్ గేమ్స్, నానూ కీ జాను, బద్నాం గాలి, వైల్డ్ వైల్డ్ పంజాబ్, పూలె వంటి పలు మూవీస్ చేసింది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) చదవండి: కల్యాణ్, ఇమ్మూ గుండెలో ఇంత బాధుందా? -
ధనుశ్ బాలీవుడ్ మూవీ.. అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ హీరో ధనుశ్ బాలీవుడ్లో నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరే ఇష్క మే. ఈ మూవీకి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు.తాజాగా తేరే ఇష్క్ మే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆదిపురుష్ భామ కృతి సనన్ హీరోయిన్గా కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే ధనుశ్ ఈ మూవీలో ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీతో పాటు ఫుల్ అగ్రెసివ్ మూవీగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 28న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్లో ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించారు. Tere ishk mein trailer @aanandlrai @arrahman @kritisanon @TSeries https://t.co/zpdoOh0SIe— Dhanush (@dhanushkraja) November 14, 2025 -
పెళ్లి చేసుకునేముందు ఆ రెండూ చూడాలి, తప్పేం కాదు!
బుల్లితెర నటి వాబిజ్ దొరబ్జీ (Vahbbiz Dorabjee) ఒంటరిగానే కాలం వెళ్లదీస్తోంది. గతంలో ఆమెకు నటుడు వివియన్ డిసేనతో పెళ్లయింది. 2013లో వీరి వివాహం జరగ్గా దాదాపు ఎనిమిదేళ్లపాటు కలిసున్నారు. 2021 డిసెంబర్లో విడాకులు తీసుకున్నారు. కానీ, ఈ విడాకుల తర్వాత నటిపై చాలా ట్రోలింగ్ జరిగింది. తను భారీగా భరణం డిమాండ్ చేసిందని, ఆ డబ్బు కోసమే వివియన్‌ను వలలో వేసుకుందని విమర్శించారు. ఇప్పటికీ అలాంటి కామెంట్స్ చేస్తున్నవారికి గట్టి కౌంటర్ ఇచ్చింది వాబిజ్.అందులో తప్పేముంది?తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాబిజ్ దొరబ్జీ మాట్లాడుతూ.. పెళ్లి చేసుకునే ప్రతి మహిళ తనకు భర్త దగ్గర ఆర్థిక భద్రత ఉందా? లేదా? అని చూసుకుంటుంది. అంతమాత్రానికే తను గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసమే పురుషలతో సంబంధం పెట్టుకోవడం) ఎలా అవుతుంది? నిజానికి నేటికాలం పురుషులు చాలా అదృష్టవంతులు. ఈరోజుల్లో మహిళలు బాగా సంపాదిస్తున్నారు, మీతో సమానంగా పని చేస్తున్నారు. అందులో ఎటువంటి తప్పు లేదా చెడు కనిపించడం లేదు.వాళ్లు చాలా డేంజర్జీవిత భాగస్వామి దగ్గర స్థిరత్వాన్ని, ఆర్థిక భద్రతను కోరుకోవడం తప్పేం కాదు. దానికి గోల్డ్ డిగ్గర్ అని ముద్ర వేస్తున్నారంటే వారికి ఆ పదం అర్థమే తెలిసుండదు. ఈరోజుల్లో చాలామంది మగవాళ్లు మనగురించి అంతా తెలుసుకుని మనతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంటారు. వారికి డబ్బు అవసరమైనప్పుడల్లా.. కాస్త మనీ ఇస్తావా? అని అడుగుతుంటారు. అలాంటి వాళ్లు చాలా డేంజర్. కొందరు అలా నా దగ్గర డబ్బు కొట్టేయాలని చూశారు. అన్నింటిపైనా కన్నేశాడుఒక వ్యక్తి అయితే నాకు పెద్ద టోపీ పెట్టాలని చూశాడు. ఎమోషనల్ డ్రామాలాడి ఒకటీరెండుసార్లు నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. తర్వాత ఆలోచిస్తే అతడు నా దగ్గరున్న డబ్బు, ఇల్లు.. ఇలా అన్నింటిమీదా కన్నేశాడని అర్థమైంది. ఇలాంటివాళ్లే అసలైన గోల్డ్ డిగ్గర్స్ అని చెప్పుకొచ్చింది. వాబిజ్ దొరబ్జీ.. ప్యార్‌కీ యే ఏక్ కహానీ, సావిత్రి, సరస్వతిచంద్ర, బాహు మహారీ రజనీకాంత్, దీవానియత్ వంటి పలు సీరియల్స్ చేసింది.చదవండి: పూటకు గతి లేక మట్టి బుక్కేది: ఏడ్చేసిన ఇమ్మాన్యుయేల్ -
ప్రముఖ బాలీవుడ్ నటి ఇకలేరు: ఒక శకం ముగిసింది!
ప్రముఖ బాలీవుడ్ నటి కామిని కౌశల్ (Kamini Kaushal ) (98) కన్నుమూశారు. దీంతో బాలీవుడ్లో ఒక శకం ముగిసింది అంటూ బాలీవుడ్ పెద్దలు ఆమె మరణంపై సంతాపం వెలిబుచ్చారు. బాలీవుడ్ స్వర్ణయుగం నాటి మిగిలిన చివరితారల్లో కామిని కౌశల్ ఒకరంటూ గుర్తు చేసుకున్నారు. ఈ కష్టసమయంలో తమ గోప్యతను గౌరవించాలని కామిని కౌశల్ కుటుంబం విజ్ఞప్తి చేసింది.కామిని కౌశల్ 1927, ఫిబ్రవరి 24న జన్మించారు. 1946లో 'నీచా నగర్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ఈ మూవీ మొదటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకుంది. పామ్ డి'ఓర్‌ను గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రంగా మిగిలిపోయింది. అంతేకాదు ఇదే చిత్రానికి కామిని కౌశల్ మాంట్రియల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును గెలుచుకున్నారు.చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుని, పాపులర్ నటిగా ఎదిగారు. 1946 -1963 వరకు అనేక చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. దో భాయ్ (1947), షహీద్ (1948), నదియా కే పార్ (1948), జిద్ది (1948), షబ్నం (1949), పరాస్ (1949), నమూన (1949), అర్జూ (1950), ఝంజర్ (1953), ఆబ్రూ (1956), బడే సర్కార్ (1957), జైలర్ (1958), గోదాన్ (1963) మొదలైనవి ఆమెకు పేరు తెచ్చిన గొప్ప చిత్రాలు. కొత్తవారితో పాటు, స్టార్ హీరోలైన రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్, అశోక్ కుమార్, కిషోర్ సాహు, సజ్జన్, శేఖర్, అభి భట్టాచార్య, సోహ్రాబ్ మోడీ, అజిత్, మురాద్ , రాజ్ కుమార్ వంటి వారందరితోనూ నటించారు. 70ల వరకు కూడా ఆమె నటనను కొనసాగించారు. దో రాస్తే (1969), ప్రేమ్ నగర్ (1974), మహా చోర్ (1976 అన్హోనీ (1973) చిత్రాలలో నటించి, యువ నటులు కూడా అసూయ పడేలా తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. చివరిసారిగా 2022లో లాల్ సింగ్ చద్దా సినిమాలో కనిపించారు. కామిని కౌశల్.పిల్లల కోసం కామిని కౌశల్సినిమాలతో పాటు, కామిని కౌశల్ పిల్లల పత్రిక పరాగ్ కోసం అనేక కథలు రాశారు. 70ల చివరలో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. ఖేల్ ఖిలోన్ సహా దూరదర్శన్‌లో పిల్లల కోసం అనేక టీవీ సీరియల్స్ కూడా చేశారు. తన బ్యానర్ గుడియా ఘర్ ప్రొడక్షన్స్ (1989 - 1991 వరకు) కింద చాంద్ సితారే, చాట్ పానీ , చందమామ వంటి తోలుబొమ్మ ఆధారిత టీవీ కార్యక్రమాలను నిర్వహించారు. ఆమె స్వయంగా తోలుబొమ్మలను తయారు చేసి, విభిన్న పాత్రలకు అనుగుణంగా తన గొంతుతో ప్రాణం పోశారు. ఒక నటిగా ఆమె సినిమా రంగం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవడం మాత్రమే కాదు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి డిజిటల్ యుగానికి భారతీయ సినిమా పరుగులు తీసిన పరిణాక్రమం నుంచి కూడా నిష్క్రమించడం. అయితే భారతీయ సినిమాలో ఆమె పేరు ఎప్పటికీ శాశ్వతమే అంటూ పలువురు కామిని కౌశల్ అస్తమయంపై నివాళులర్పించారు. -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ డైరెక్టర్ సినిమా
బాలీవుడ్ స్టార్ దర్శకుల్లో అనుగార్ కశ్యప్ ఒకడు. 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' లాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో తనదైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. రీసెంట్ టైంలో నటుడిగా మారిపోయి దక్షిణాదిలో మూవీస్ చేస్తున్న ఈయన.. బాల్ ఠాక్రే మనవడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ మూవీ తీశారు. తొలి భాగం థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు రెండో భాగం ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?: గిరిజా ఓక్)బాల్ ఠాక్రే మనవడు ఐశ్వరీ ఠాక్రే హీరోగా నటించిన సినిమా నిశాంచి. ఇందులో ఐశ్వరీ ద్విపాత్రాభినయం చేశాడు. వేదిక పింటో హీరోయిన్గా చేసింది. సెప్టెంబరు 19న థియేటర్లలో 'నిశాంచి' రిలీజ్ కాగా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి ఆ మూవీ వచ్చింది. అయితే రెండో భాగం థియేటర్లలోకి వస్తుందనుకంటే నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఈ రోజు(నవంబరు 14) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది.'నిశాంచి' విషయానికొస్తే.. కాన్ఫూర్‌లో జబర్దస్త్ సింగ్ అనే బిల్డర్ ఉంటాడు. కుస్తీ పోటీల్లో పాల్గొనాలనేది ఇతడి కల. కానీ ఓ గొడవలో చిక్కుకోవడంతో ఇతడిని హత్య చేస్తారు. అతడి కొడుకులు ఇద్దరి కథే ఈ సినిమా. తండ్రిని హత్య చేయడంతో కొడుకులు ఇద్దరు ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. క్రైమ్ డ్రామా మూవీస్ అంటే ఇష్టముంటే ఇది మీకు నచ్చేయొచ్చు. తొలి భాగంలో కాస్త సాగదీత సీన్స్ ఉన్నప్పటికీ.. మంచి ట్విస్ట్‌తో తొలి భాగాన్ని ముగించారు. మరి రెండో భాగం ఎలా ఉందో చూడాలి? ప్రస్తుతం ఈ రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: నా యాక్టింగ్‌పై నాకే డౌట్: దుల్కర్) -
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
కొందరు తారలు ఫస్ట్ సినిమాకే క్లిక్ అవుతుంటారు.. మరికొందరు పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే కానీ క్లిక్ అవరు. కానీ, మరాఠి నటి గిరిజ ఓక్ (Girija Oak Godbole) సోషల్ మీడియా వల్ల సడన్‌గా పాపులర్ అయిపోయింది. హిందీ, మరాఠి, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఆమె ఇంటర్వ్యూ క్లిప్పింగ్సే కనిపిస్తున్నాయి.చాలా హ్యాపీ..ఇలా సడన్‌గా వైరల్‌గా మారడంపై సంతోషం వ్యక్తం చేసింది గిరిజ. అయితే తన ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. అందులో గిరిజ మాట్లాడుతూ.. ఆన్లైన్లో నాకు వస్తున్న సడన్ అటెన్షన్ చూసి షాకైపోయాను. చాలామంది నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. గ్యాప్ లేకుండా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రేమ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. కొన్ని మీమ్స్ చూస్తుంటే భలే సరదాగా ఉన్నాయి. నా 12 ఏళ్ల కొడుకుస్తే..కానీ కొన్ని మీమ్స్‌లో మాత్రం ఏఐ (కృత్రిమ మేధ)ను ఉపయోగించి నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. అవి చూడటానికి కూడా చాలా అసౌకర్యంగా ఉన్నాయి. ఆ ఎడిటింగ్స్ అస్సలు బాగోలేవు. ఏదైనా వైరలయితే చాలు ఇలా ఏవేవో ఇష్టమొచ్చినట్లు ఎడిట్లు చేస్తుంటారు. దీనికి హద్దులు, పరిమితులంటూ ఏవీ ఉండవు. అదే నాకు వచ్చిన పెద్ద సమస్య! నాకు 12 ఏళ్ల కొడుకున్నాడు. ప్రస్తుతానికైతే వాడు సోషల్ మీడియా వాడడు. కానీ, రేప్పొద్దున వాడు కూడా ఈ ఆన్లైన్ ప్రపంచంలో అడుగుపెట్టక మానడు. చీప్ ట్రిక్స్ మానుకోండిఅప్పుడు నా మార్ఫింగ్ ఫోటోలు వాడి కంట పడతాయని భయంగా ఉంది. మా అమ్మ అభ్యంతరకర ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయేంటి? అని వాడు బాధపడతాడన్న ఆలోచనే నన్ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వ్యూస్ కోసమే మీరిలాంటి అసభ్య ఫోటోలు సృష్టిస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోండి. ఒకమ్మాయి ఫోటోలను ఇలా ఎడిట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అంతకంటే ఏం కావాలి!అలాంటి ఎడిటింగ్ ఫోటోలను చూసి ఆస్వాదించేవారు కూడా ఈ తప్పుడు పనిలో భాగమైనట్లే లెక్క! దయచేసి అలాంటివి ఆపేయండి. ఇదంతా పక్కనపెడితే సడన్‌గా వచ్చిన ఈ పాపులారిటీ వల్ల ఎక్కువమంది జనాలు నా సినిమా, సిరీస్‌లు చూస్తే అంతే చాలు అని వీడియో ముగించింది. గిరిజ ఓక్... హిందీలో తారే జమీన్ పర్, షోర్ ఇన్ ద సిటీ, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్స్పెక్టర్ జిండె సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Girija Oak Godbole (@girijaoakgodbole) చదవండి: నా యాక్టింగ్‌పై నాకే డౌట్: దుల్కర్ -
కదల్లేని స్థితిలో ధర్మేంద్ర.. వీడియో వైరల్
ఒకప్పటి హీరో, బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర చనిపోయారని చెప్పి రెండు రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇవి వచ్చిన కాసేపటికే ఈయన భార్య హేమమాలిని, కూతురు ఈషా డియోల్.. వీటిని ఖండించారు. ధరేంద్ర బ్రతికే ఉన్నారని, ఇలాంటి పుకార్లు సృష్టించడం సరికాదని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో క్లారిటీ కూడా ఇచ్చారు.(ఇదీ చదవండి: రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు)ఇప్పుడు ధర్మేంద్రకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో మంచంపై కదల్లేని స్థితిలో ఆయన కనిపించారు. ఎదురుగా కొడుకు బాబీ డియోల్ బాధపడుతూ కనిపించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి, ఇంటికి వచ్చేసినప్పటికీ ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఈ వీడియో చూస్తుంటేనే అర్థమవుతోంది. ఈయన త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు, బాలీవుడ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లీగల్ కామెడీ మూవీ.. అధికారిక ప్రకటన)The Full Video From Dharmendra ji His discharge from the Hospital But health is not Well Please Pray For Dharmendra ji 🙏 #DharmendraDeol #dharmendra pic.twitter.com/D7Z56vrbVo— Jolly Christian (@Jolly7294) November 13, 2025 -
ఓటీటీలోకి లీగల్ కామెడీ మూవీ.. అధికారిక ప్రకటన
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అల తెలుసు కదా, కె ర్యాంప్, డ్యూడ్ లాంటి హిట్ చిత్రాలు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు లిస్టులో లేటెస్ట్ హిందీ మూవీ ఒకటి చేరింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ లీగర్ కామెడీ చిత్రం ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని అనౌన్స్ చేశారు. ఇంతకీ ఎప్పటినుంచి ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు)గతంలో వచ్చిన జాలీ ఎల్ఎల్బీ, జాలీ ఎల్ఎల్బీ 2 సినిమాలకు కొనసాగింపుగా ఈ ఏడాదా సెప్టెంబరు 19న మూడో భాగం వచ్చింది. ఇందులో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి ప్రధాన పాత్రలు చేశారు. తొలి రెండు చిత్రాల్ని తీసిన సుభాష్ కపూర్.. దీన్ని కూడా డైరెక్ట్ చేశారు. 2011లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలోనే నవంబరు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రావొచ్చని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది.'జాలీ ఎల్ఎల్బీ 3' విషయానికొస్తే.. రాజస్థాన్‌లోని బికనీర్ గ్రామంలో ఓ ధనవంతుడైన పారిశ్రామికవేత్త హరి భాయ్ (గజరాజ్) చేసిన ఓ ప్రయత్నాన్ని ఊరిలోని వ్యవసాయదారులందరూ వ్యతిరేకిస్తారు. ప్రభుత్వాధికారులు తన చేతిలో ఉండేసరికి హరి భాయ్.. మతలబు చేసి రైతుల భూముల్ని తన సొంతం చేసుకుంటాడు. న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించిన రైతులకు.. ఇద్దరు జాలీలు (అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ) ఎలాంటి సాయం చేశారు? చివరకు ఏమైందనేదే ఈ సినిమా స్టోరీ. తొలిరోజు చిత్రాలతో పోలిస్తే ఇది ఓ మాదిరి స్పందన మాత్రమే అందుకుంది. పెద్దగా కలెక్షన్స్ కూడా రాలేదు.(ఇదీ చదవండి: ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!) -
పెళ్లికి ఎక్స్పైరీ డేట్.. ఎక్కువకాలం భరించాల్సిన పని లేదు!
మనం తినే ఆహారపదార్థాలకు, వాడే వస్తువులకు ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలంటోంది బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol). అది తప్పేం కాదని సమర్థిస్తోంది. కాజోల్, ట్వింకిల్ ఖన్నా జంటగా హోస్ట్ చేస్తున్న షో 'టూ మచ్ విత్ కాజోల్'. తాజా ఎపిసోడ్‌కు విక్కీ కౌశల్, కృతి సనన్ గెస్టులుగా విచ్చేశారు. వీరితో ముచ్చటించే క్రమంలో పెళ్లికి ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలా? అన్న ప్రశ్న తలెత్తింది.ఎక్స్పైరీ డేట్ ఉండాల్సిందే!వివాహానికి ఎక్స్పైరీ ఏంటి? అని కృతి సనన్, విక్కీ కౌశల్, ట్వింకిల్ ఖన్నా తల బాదుకుంటే.. కాజోల్ మాత్రం ఆ ఐడియాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. అది చూసిన ట్వింకిల్.. ఇది పెళ్లి, వాషింగ్ మెషిన్ కాదని గుర్తు చేసింది. అందుకు కాజోల్.. వివాహబంధానికి ఎక్స్పైరీ డేట్ ఉంటే మంచిదే అనిపిస్తోంది. కరెక్ట్ పర్సన్నే పెళ్లి చేసుకున్నామన్న గ్యారెంటీ ఏంటి? అలాంటి సందర్భాల్లో ఈ ఎక్స్పైరీ డేట్ పుణ్యమా అని జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండదు. ఓటీటీలో టాక్ షోఅలాగే రెన్యువల్ ఆప్షన్ ఉంటే ఉన్నచోటే ఆగిపోకుండా ముందడుగు వేయొచ్చు అని పేర్కొంది. 'టూమచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' (Two Much with Kajol and Twinkle) టాక్ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ప్రతి గురువారం ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. కాజోల్ విషయానికి వస్తే.. 1999లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కూతురు నైసా దేవ్‌గణ్ సంతానం.చదవండి: 14 ఏళ్లుగా ప్రేమ లేకపోయినా కలిసుంటున్నాం: నటి -
నటుడు ధర్మేంద్ర హెల్త్ అప్డేట్
ప్రముఖ నటుడు ధర్మేంద్ర పూర్తి ఆరోగ్యంతో బుధవావరం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. బ్రీచ్ కాండీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించినట్లు పిటిఐ పేర్కొంది. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని నవంబర్ 10న చికిత్స కోసం ఐసీయూలో చేరారు. అయితే, రొటీన్ చెకప్ కోసమే వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అదే సమయంలో విజ్ఞప్తి చేశారు.కానీ , ఆయన మరణించారని మొదట నేషనల్ మీడియాలో వార్తలు రావడంతో అందరిలో ఆందోళన మొదలైంది. దీంతో ఆయన కుమార్తె సోషల్‌మీడియా ద్వారా తన తండ్రి క్షేమంగా ఉన్నారని చెప్పడంతో ఫేక్ వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ధర్మేంద్ర డిశ్చార్జి సమయంలో ఆయన కుమారుడు బాబీ డియోల్ ఉన్నారు. -
100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద
ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర (89)పై వస్తున్న అనేక ఫేక్ న్యూస్ మధ్య ఆయన కోలుకుంటున్నారనే వార్త ఎంతోమంది అభిమానులకు ఊరట నిచ్చింది. ఫూల్ ఔర్ పత్తర్, మేరా గావ్ మేరా దేశ్, షోలే, ఖామోషి, జానీ గద్దర్, ఇలాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ఐకాన్‌గా నిలిచారు. కళా రంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును కూడా పొందారు ధర్మేంద్ర. అయితే తాజాగా ఆయన ఆస్తి ఎంత అనేది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అసలైన హీ-మ్యాన్‌గా పాపులర్ అయిన ధర్మేంద్ర, బాలీవుడ్‌లోని అత్యంత ధనిక స్టార్స్ లో ఒకరు. నటనతోపాటు ఆయన వ్యాపారం రంగంలోకూడా తనదైన ముద్రను వేసుకున్నారు. 2015లో న్యూఢిల్లీలోని గరం ధరం ధాబాతో రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు ధర్మేంద్ర. 2022లో, కర్నాల్ హైవేలో హీ-మ్యాన్ అనే మరో హోటల్‌ను కూడా స్థాపించారట.100 ఎకరాల విశాలమైన ఫామ్హౌస్ధర్మేంద్ర తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్నప్పటికీ, నగరానికి దూరంగా ప్రశాంతతకు మారు పేరైన లోనావాలాలో విశాలమైన 100 ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. ఆధునిక సౌకర్యాలతో ముఖ్యంగా ఆక్వా థెరపీ తీసుకునేందుకు వీలుగా వేడి నీటితో కూడిన స్విమ్మింగ్ పూల్ ఉండే ఇక్కడికి తరచూ వెళుతూ ఉంటారు కూడా. అంతేకాదు ఇక ఒక రిసార్ట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా హాస్పిటాలిటీ వ్యాపారంలోకి మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు సమాచారం.పలు నివేదికల ప్రకారం ధర్మేంద్రకు మహారాష్ట్రలో రూ.17 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. రూ.88 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమి, రూ.52 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి కూడా ఉన్నాయి. ఒక రెస్టారెంట్ చైన్‌తో భాగస్వామ్యంతో 12 ఎకరాల స్థలంలో 30-కాటేజ్ రిసార్ట్‌ను నిర్మించారుట. ఆరు దశాబ్దాల కెరీర్ మొత్తంలో, 300 కి పైగా చిత్రాలలోనటించిన ఆయన ఆస్తుల విలువ,సుమారు రూ.335– 450 కోట్లు ఉంటుందని అంచనా. అయితే డియోల్ కుటుంబ మొత్తం సంపద 1,000 కోట్లకు మించి ఉంటుందని మరో అంచనా.ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యంలగ్జరీ కార్లు లగ్జరీ కార్లు అంటే ధర్మేంద్రకు చాలా ఇష్టం. ఆయన దగ్గరున్న అద్భుతమైన కార్ల కలెక్షనే ఇందుకు నిదర్శనమంటారు. వింటేజ్ ఫియట్ కారు విలువ రూ. 85.74 లక్షలు. రూ. 98.11 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవోక్ మెర్సిడెస్-బెంజ్ SL500 వంటి ఆధునిక లగ్జరీ కార్లతో అతని గ్యారేజ్ నోస్టాల్జియా , ఐశ్వర్యానికి ప్రతిబింబంగా ఉంటుంది. ప్రొడక్షన్ హౌస్నటనతో పాటు, ధర్మేంద్ర నిర్మాతగా కూడా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు.. 1983లో తన నిర్మాణ సంస్థ విజయ్తా ఫిల్మ్స్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్ కింద, అతను తన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లను బేతాబ్ (1983), బర్సాత్ (1995) సినిమాలతో వరుసగా విజయ వంతమైన అరంగేట్రాలతో బాలీవుడ్‌కు పరిచయం చేశారు. 2019లో తన మనవడు కరణ్ డియోల్‌ను తొలి చిత్రం పాల్ పల్ దిల్ కే పాస్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ధర్మేంద్రకు రెండు పెళ్లిళ్లు. సినీ జీవితంలోకి అడుగుపెట్టకముందే 1954లో ప్రకాష్ కౌర్ పెళ్లాడారు. మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. బాలీవుడ్ స్టార్‌హీరోగా మారిన తరువాత ప్రకాష్ కౌర్ నుంచి విడాకులు తీసుకోకుండానే 1980లో డ్రీమ్‌గర్ల్ హేమా మాలినిని వివాహం చేసుకున్నారు. వీరికి ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు. -
3800 మంది పిల్లల ప్రాణాలు కాపాడిన సింగర్.. ఏకంగా గిన్నిస్ బుక్‌లో!
జీవితంలో కెరీర్, సంపాదన మాత్రమే ముఖ్యం కాదు. సమాజానికి కూడా ఉపయోగ పడే పనులు చేయాలంటోంది సింగర్ పాలక్ ముచ్చల్. తాజాగా ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆమె రికార్డ్ సాధించింది సింగర్‌గా అనుకుంటే పొరపాటే. తన గాత్రంతో అభిమానులను అలరించే పాలక్ ముచ్చల్.. పసిపిల్లల ప్రాణాలను కూడా కాపాడుతోంది. తన ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.ఇండోర్‌కు చెందిన పాలక్ సమాజానికి తన వంతుగా సేవ చేస్తోంది. ఇప్పటి వరకు పేద పిల్లల కోసం దాదాపు 3,800కి పైగా గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చింది. ఆమె సేవలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. అంతకుముంందే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సింగర్.. తాజాగా గిన్నిస్ బుక్‌లోనూ తన పేరును లిఖించుకుంది.సింగర్ పాలక్ ముచ్చల్ తన చిన్నప్పటి నుంచే సేవభావాన్ని అలవరచుకుంది. తన సంపాదనలో కొంతభాగం పేద పిల్లల సంక్షేమం కోసం వెచ్చిస్తోంది. ఆమె కేవలం పిల్లలకు మాత్రమే కాదు.. కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు సైతం అండగా నిలిచింది. అంతేకాకుండా గుజరాత్ భూకంప బాధితుల కోసం రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చింది. సామాజిక సంక్షేమం పట్ల ఆమె నిబద్ధతను చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.కాగా.. సింగర్ పాలక్ ముచ్చల్ బాలీవుడ్లో 'మేరీ ఆషికి', 'కౌన్ తుఝే', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' వంటి పాటలతో ఫేమ్ తెచ్చుకుంది. అలా తన పాటల ద్వారా వచ్చిన సంపాదనను ఫౌండేషన్‌కు కేటాయిస్తోంది. ఈ విషయంలో ఆమె భర్త, స్వరకర్త మిథూన్ కూడా అండగా ఉన్నారు. ఆమె సేవ ప్రయాణంలో కూడా భాగస్వామిగా ఉన్నారు. మాకు ఆదాయం లేకపోయినా కూడా పిల్లల శస్త్రచికిత్స ఎప్పటికీ ఆగదని మిథున్ అన్నారు. ఎన్ని ఆర్థిక అడ్డంకులు ఉన్నప్పటికీ మా సంకల్పం కోసం కృషి చేస్తామని వెల్లడించారు. దీంతో వీరిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. -
ట్రెండింగ్ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?
గత మూడు నాలుగు రోజుల నుంచి ఓ నటి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి కారణం ఓ ఇంటర్వ్యూ. అలా అని ఆమె గ్లామరస్ హీరోయిన్ కాదు, ఇంటర్వ్యూలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఏం చేయలేదు. అయినా సరే ఈమె గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈమె ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే నటి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎందుకు వైరల్ అవుతుందనేది చూద్దాం.సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు వైరల్ అవుతారనేది చెప్పలేదు. తాజాగా ఓ హిందీ ఇంటర్వ్యూలో మరాఠీ నటి గిరిజా ఓకే పాల్గొంది. తన గురించి పలు విషయాలు చెప్పింది. 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య.. తనతో ఓ రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు నువ్వు ఓకేనా అని 17 సార్లు తనని అడిగాడని, అలాంటి యాక్టర్స్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుందని గిరిజా చెప్పుకొచ్చింది. ఈ బిట్‌తో పాటు ఇంటర్వ్యూకి సంబంధించిన పలు వీడియో క్లిప్స్ ట్విటర్లో తెగ కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)స్లీవ్ లెస్ బ్లౌజ్, స్కై బ్లూ చీరలో గిరిజా ఓకే చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ.. నెటిజన్లు ఎందుకో ఈమెని చూసి ఫిదా అయిపోయినట్లు ఉన్నారు. అందుకే ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యేసరికి ఈమె ఎవరా అని తెగ కామెంట్స్ పెడుతున్నారు. అలా అని ఈమేం కొత్తగా ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన నటి కాదు. 2004 నుంచి సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది.స్వతహాగా మరాఠీ నటి అయిన గిరిజా ఓక్.. హిందీలోనూ పలు మూవీస్ చేసింది. బాలీవుడ్లో 'తారే జమీన్ పర్' ఈమె మొదటి చిత్రం. ఇందులో చిన్న రోల్ చేసినప్పటికీ ఫేమ్ సంపాదించింది. తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోర్ ఇన్ ద సిటీ(2010), కాలా, జవాన్ (2023) చిత్రాలు చేసింది. రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ఇన్స్పెక్టర్ జెండే మూవీలోనూ కనిపించింది. ఇప్పుడు ట్రెండ్ కావడం ఏమో గానీ ఈమె యాక్ట్ చేసిన పాత మూవీ క్లిప్స్ అన్నీ ఇప్పుడు వైరల్ చేస్తున్నాడు. ఇలా వైరల్ అయిన వీడియోల్లో సందీప్ కిషన్‌తో గిరిజ చేసిన రొమాంటిక్ సీన్ కూడా ఒకటుంది.గిరిజ వ్యక్తిగత జీవితానికొస్తే.. తండ్రి గిరీష్ ఓకే కూడా నటుడే. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత థియేటర్స్‌లో చేరింది. తొలుత అడ్వర్టైజ్మెంట్స్ చేసి గుర్తింపు తెచ్చుకుని తర్వాత నటిగా మారింది. సుహ్రుద్ గోడ్బోలే అనే నిర్మాతని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇన్నాళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా 37 ఏళ్ల వయసులో ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతానని ఈమె కూడా అనుకుని ఉండదేమో?(ఇదీ చదవండి: తిరుమలలో పెళ్లి చేసుకున్న 'కేజీఎఫ్' సింగర్) -
నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్
బాలీవుడ్ దిగ్గజ హీరో ధర్మేంద్ర చనిపోయారని ఉదయం నుంచి వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాన్న మరణించలేదని, మీడియాలో వస్తున్నవి అవాస్తవాలని ఈయన కూతురు ఈషా డియోల్ అంటోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో తాజాగానే పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు తికమక పడుతున్నారు.గత కొన్నాళ్లుగా శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈయన.. వెంటిలేటర్‌పై ఉన్నారని సోమవారం సాయంత్రం వార్తలొచ్చాయి. దీంతో స్పందించిన ఆయన టీమ్.. ఏం ఇబ్బంది లేదని, బాగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు (మంగళవారం) ఉదయానికల్లా మొత్తం మీడియాలో ధర్మేంద్ర చనిపోయారని న్యూస్ వచ్చింది. కానీ ఈయన కూతురు ఈషా మాత్రం తండ్రి ప్రస్తుతం కోలుకుంటున్నారని క్లారిటీ ఇచ్చింది.అలానే ధర్మేంద్ర భార్య, నటి హేమమాలిని కూడా చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు. 'జరిగిన దాన్ని క్షమించలేం. చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్న వ్యక్తి గురించి అవాస్తవాలు ఎలా ప్రచారం చేస్తారు? ఇది ఆయన్ని అగౌరవపరచడమే. మా కుటుంబానికి గౌరవం ఇవ్వడంతో పాటు కాస్త ప్రైవసీ కూడా ఇవ్వండి' అని హేమమాలిని ట్వీట్ చేశారు.ధరేంద్రకు ఇద్దరు భార్యలు ప్రకాశ్ కౌర్, హేమమాలిని. ప్రకాశ్ కౌర్‌కి పుట్టిన కొడుకు సన్నీ డియోల్, బాబీ డియోల్. హేమామాలినికి ఈషా డియోల్, అహనా డియోల్ అని కూతుళ్లు ఉన్నారు.What is happening is unforgivable! How can responsible channels spread false news about a person who is responding to treatment and is recovering? This is being extremely disrespectful and irresponsible. Please give due respect to the family and its need for privacy.— Hema Malini (@dreamgirlhema) November 11, 2025 -
Dharmendra: బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర జీవితంలో స్పెషల్ (ఫొటోలు)
-
వెంటిలేటర్‌పై సీనియర్ నటుడు ధర్మేంద్ర.. స్పందించిన టీమ్!
బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని నెట్టింట వార్తలొచ్చాయి. ఇటీవలే ఆయన ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్రపై వస్తున్న కథనాలపై ఆయన టీమ్ స్పందించింది.అయితే ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న కథనాలన్నీ అవాస్తమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని తెలిపింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారన్న వార్తలు నిజం కాదని టీమ్ స్పష్టం చేసింది. ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా ఆస్పత్రికి వెళ్లి వచ్చారని వెల్లడించింది. అలాంటిది ఏదైనా జరిగి ఉంటే అతని కుటుంబం మొత్తం ఆసుపత్రిలో ఉండేదని పేర్కొంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ తెలిపింది.కాగా.. ధర్మేంద్ర అక్టోబర్ 31న సాధారణ చెకప్ కోసం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో అతని భార్య హేమ మాలిని కూడా ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు. ఇక సినిమాల విషయానికొస్తే ధర్మేంద్ర చివరిసారిగా 2024లో విడుదలైన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన నటించిన అగస్త్య నందా ఇక్కిస్ చిత్రం ఉంది ఈ ఏడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. -
27 ఏళ్లుగా నాతో ఉన్నావ్.. నీ కాళ్లకు మొక్కిన తర్వాతే ఏదైనా..
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తనయుడు, హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) భావోద్వేగానికి లోనయ్యాడు. తన దగ్గర 27 ఏళ్లుగా పని చేస్తున్న మేకప్ ఆర్టిస్టు అశోక్ చనిపోయాడంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అతడితో కలిసి దిగిన ఫోటోను సైతం జత చేశాడు. 'అశోక్ దాదా.. నా దగ్గర 27 ఏళ్లుగా పని చేస్తున్నాడు. నా ఫస్ట్ సినిమా నుంచి అతడే నాకు మేకప్ వేస్తున్నాడు. అతడు కేవలం నా టీమ్‌లో ఒక వ్యక్తి మాత్రమే కాదు, నా కుటుంబసభ్యుడు కూడా! ఆయన లేకుండా షూటింగ్‌కు వెళ్లలేదుఅతడి అన్న దీపక్.. మా నాన్న దగ్గర దాదాపు 50 ఏళ్లుగా మేకప్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా తన ఆరోగ్యం బాగుండటం లేదు. దానివల్ల కొన్నిసార్లు నాతోపాటు సెట్‌కు రావడం లేదు. కానీ నాకు మంచిగా మేకప్ వేయమని తన అసిస్టెంట్‌కు మరీమరీ చెప్పేవాడు. అంతకుముందు వరకు ఆయన లేకుండా నేను షూటింగ్‌కు వెళ్లిందే లేదు. చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవాడు. కనిపించిన వెంటనే ఆలింగనం చేసుకునేవాడు. బ్యాగ్‌లో తినడానికి ఏదో ఒకటి తెచ్చుకునేవాడు.ఆయన పాదాలకు నమస్కరించాకే..నేను ఏదైనా సినిమా ఒప్పుకున్నప్పుడు మొదట ఈయన కాళ్లకు నమస్కరించిన తర్వాతే కెమెరా ముందుకు వెళ్తాను. అలా ప్రతి సినిమాకు ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను. ఇప్పటినుంచి తన కోసం ఆకాశంవైపు చూస్తాను.. స్వర్గంలో ఉన్న ఆయన నన్ను కచ్చితంగా దీవిస్తాడు. నీ ప్రేమాభిమానాలకు, కేరింగ్‌కు, టాలెంట్‌కు.. అన్నింటికీ థాంక్యూ దాదా. నువ్వు నాతో లేవంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇకపై నువ్వు లేకుండానే సెట్‌కు వెళ్లాలని తల్చుకుంటేనే మనసు ముక్కలవుతోంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా..' అంటూ అభిషేక్ బచ్చన్ భావోద్వేగానికి లోనయ్యాడు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) చదవండి: మరణాన్ని ముందే ఊహించిన హీరో.. -
ఒంటరితనం.. పిచ్చోడినైపోయా.. డిప్రెషన్‌తో బాధపడ్డా!
హీరోయిన్ తమన్నాతో డేటింగ్‌తో ఆ మధ్య వార్తల్లో నిలిచాడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma). ఎక్కడికి వెళ్లినా జంటగానే కనిపించేవారు. కానీ, సడన్‌గా బ్రేకప్ చెప్పుకుని అందరికీ షాకిచ్చారు. ఇద్దరూ విడిపోయి ఎవరి కెరీర్లో వారు బిజీ అయిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్.. గతంలో డిప్రెషన్‌తో బాధపడిన విషయాన్ని బయటపెట్టాడు. నటి రియా చక్రవర్తి పాడ్‌కాస్ట్‌లో అతడు మాట్లాడుతూ.. ముంబైలోని నా అపార్ట్మెంట్లో ఒక్కడినే ఉంటాను. పిచ్చోడినయ్యా..అక్కడ ఒక చిన్న టెర్రస్ ఉండేది. అక్కడ ఆకాశాన్ని చూస్తూ గడిపేవాడిని. లేదంటే నాకు పిచ్చిపట్టేదేమో! నిజం చెప్పాలంటే పిచ్చోడ్నయ్యాను కూడా.. షూటింగ్స్ అంటూ ఎప్పుడూ పరిగెత్తే నాకు సడన్‌గా బ్రేక్ వచ్చింది. అప్పుడు నా చుట్టూ ఒంటరితనం ఆవరించింది. ఎందుకో భయమేసేది. గదిలో నుంచి బయటకు రాకపోయేవాడిని. రోజుల తరబడి సోఫాకే ఎందుకు అతుక్కుపోయేవాడినో నాకే తెలిసేది కాదు.. ఏం జరుగుతుందో అర్థం కాలేదు.ఆమిర్ కూతురి వల్లే..అలాంటి సమయంలో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ (Ira Khan), నటుడు గుల్షన్ దేవయ్య నాకు అండగా నిలబడ్డారు. దహాడ్ వెబ్ సిరీస్ షూటింగ్‌లోనే మేము ముగ్గురం ఫ్రెండ్సయ్యాం. అప్పుడప్పుడు వీడియో కాల్ చేసుకునేవాళ్లం, కలిసి డిన్నర్‌కు వెళ్లేవాళ్లాం. అప్పటికీ నా మనసు బాగోలేదు. ఆ విషయం ఇరా పసిగట్టింది. ఇలా ఆగిపోకు, ముందుకు సాగాలని భుజం తట్టింది. వీడియోకాల్‌లో వర్కవుట్స్ చేయించింది. డిప్రెషన్ఓ థెరపిస్ట్‌తో మాట్లాడినప్పుడు నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు చెప్పాడు. ధ్యానం చేయమని సూచించాడు. అదే విషయం తనకు చెప్పి దాన్నుంచి బయటకు వచ్చేందుకు నేనే ప్రయత్నిస్తానన్నాను. అలా సూర్య నమస్కారాలు, యోగా ద్వారా ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పుకొచ్చాడు. విజయ్ చివరగా ఐసీ 814: ద కాందహర్ హైజాక్ వెబ్ సిరీస్‌లో, మర్డర్ ముబారక్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం అతడు నటించిన గుస్తాఖ్ ఇష్క్ నవంబర్ 28న రిలీజ్ కాబోతోంది.చదవండి: మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం -
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలతో వివాదాస్పద దర్శకుడిగా వివేక్ అగ్నిహోత్రి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన చివరి చిత్రం 'ద బెంగాల్ ఫైల్స్'. 1947లో ఇండియా-పాక్ విభజన బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే చర్చనీయాంశమైన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'ద బెంగాల్ ఫైల్స్' సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివితో దీన్ని తీశారు. తొలి రెండు చిత్రాల్లానే ఇది కూడా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. ఈనెల 21 నుంచి హిందీ భాషలో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'కె- ర్యాంప్'.. అధికారిక ప్రకటన)'ద బెంగాల్ ఫైల్స్' విషయానికొస్తే.. 1947వ సంవత్సరంలో భారత్-పాక్ ఎలా విడిపోయాయి. ఈ విషయంలో గాంధీ ఎలాంటి పాత్ర పోషించారు. అప్పుడు హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు చేలరేగాయి. ఎవరు ఎవరిని ఎందుకు చంపారు. ఈ అనర్థాలన్నీ ఎందుకు జరిగాయనేది ఈ సినిమా స్టోరీ.ప్రధానంగా భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయే సమయంలో గాంధీ, మహమ్మద్ అలీ జిన్నాని ఇదంతా వద్దని అంటారు. జిన్నా మాత్రం.. ముస్లింలు ఎప్పుడూ ముస్లింలే, హిందూ ముస్లిం భాయ్ భాయ్ కాదు అని అంటాడు. తర్వాత జిన్నా మనుషులు అప్పటి దేశ రాజధాని అయిన కలకత్తాలో మారణహోమం సృష్టిస్తారు. హిందూ స్త్రీలని, మహిళలని, చిన్నపిల్లలని చూడకుండా దారుణంగా కాల్చి చంపేస్తారు. ఇలాంటి సమయంలో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటీషర్లు ఏం చేశారు? ముస్లింలపై భారతీయులు ఎలా తిరుగుబాటు చేశారు? తమని తాము ఎలా కాపాడుకున్నారనే అంశాల్ని ఇందులో చూపించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓరీపై ట్రోలింగ్.. కొంచెమైనా బుద్ధుందా? అవేం మాటలు!
సెలబ్రిటీలందరికీ కామన్ ఫ్రెండ్ ఓరీ (Orhan Awatramani). ఎక్కడైనా ఏదైనా పార్టీ జరుగుతుందన్నా.. ఈవెంట్ అవుతుందన్నా వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోతాడు. హీరోహీరోయిన్లపై చేతులు వేసి చనువుగా ఫోటోలు దిగుతుంటాడు. ముఖ్యంగా జాన్వీ, ఖుషి కపూర్లకైతే బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పొచ్చు. విచిత్ర వేషధారణతో కనిపించే ఓరీ.. తాజాగా విమర్శలపాలయ్యాడు.ఆడవేషంలో ఉన్నవారిపై జోక్స్కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan) నిర్వహిస్తున్న టాలెంట్ షో ఆంటీ కిస్కో బోలాకి ఓరీ హాజరయ్యాడు. ఆడవారిలా చీర కట్టుకుని రెడీ అయిన అబ్బాయిల మధ్యలో ఓరీ కూర్చున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఓ కామెడీ షోకి వచ్చా.. ఇద్దరు చెక్కగాళ్లు నా ముందే గొడవపడుతున్నారు. ఇలా కొట్టుకుంటున్నారేంటి? అని రాసుకొచ్చాడు.సరదాగా ఉందా?ఈ వీడియో వైరల్‌గా మారగా ఓరీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్క అనే పదాన్ని వాడటం నీకు సరదాగా ఉందా? అలా ఎలా అనగలిగావు? కొంచెమైనా బుద్ధి లేదా? అని మండిపడుతున్నారు. కొందరు పేరుకే ధనవంతులు కానీ, విలువలు తెలియవు.. ఒక కమ్యూనిటీని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఆగ్రహిస్తున్నారు.ఓరీ ఏం చేస్తుంటాడు?ఓరీ.. ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఇతడు న్యూయార్క్‌లో మోడలింగ్ నేర్చుకున్నాడు. న్యూయార్క్‌లో పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఓ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గానూ వర్క్ చేశాడు. సెలబ్రిటీల పార్టీలకు మాజరై అక్కడున్నవారితో ఫోటోలు దిగుతాడు. ఇలా పార్టీలకు వెళ్లి, ఫోటోలు దిగి రూ.20-30 లక్షలు సంపాదిస్తాడు. మోడల్‌గానూ ప్రాజెక్టులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. తనకు ఐదుగురు మేనేజర్లున్నారు. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) చదవండి: నాకోసం యుద్ధాలు చేయాలి.. విజయ్‌నే పెళ్లాడతా..: రష్మిక -
ప్రముఖ గాయని, నటి కన్నుమూత, సరిగ్గా అదే రోజు
ప్రముఖ నటి, గాయని సులక్షణా పండిట్ (71) (Sulakshana Pandit) గురువారం (నవంబర్ 6) అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. . దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతున్న గాయని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మనోహరమైన గాత్రం, చిరస్మరణీయ నటనకు పేరుగాంచిన ప్రముఖ గాయని మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. యాదృచ్ఛికంగా దివంగత నటుడు, తాను ఎంతో ప్రేమించిన సంజీవ్‌కుమార్ వర్ధంతి రోజే 40 ఏళ్లకు ఆమె ఈ లోకంనుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది.సులక్షణ పండిట్ -సంజీవ్ కుమార్ ప్రేమ1975లో వచ్చిన ఉల్జాన్ సినిమాలో సులక్షణ పండిట్ ,సంజీవ్ కుమార్ కలిసి నటించారు. ఆ సినిమా సెట్స్ లో ఆమె అతనితో ప్రేమలోపడింది. పెళ్లి చేసుకోవాలని భావించి, పెళ్లి ప్రపోజ్ చేసింది కూడా. అయితే దీర్ఘకాలిక గుండె జబ్బుతో బాధపడుతున్న తాను ఎక్కువ కాలం అనేభావనతో ఆమె ప్రేమను సున్నితంగా తిరస్కరించారట. 1985, నవంబర్ 6న సంజీవ్ కుమార్ మరణించాడు. అయితే సంజీవ్ కుమార్ మరణం తర్వాత తాను మానసికంగా కలత చెందాను, కుంగిపోయాను, చాలా కృంగిపోయానని ఒక సందర్భంలో స్వయంగా చెప్పారు సులక్షణ పండిట్ .అటు సినిమా ఆఫర్లు, పాడు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత ఆమె తల్లి మరణం సులక్షణ పండిట్‌ను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా దెబ్బతీసింది. ఆమె స్టార్డమ్ నుండి క్రమంగా దూరమైంది. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు, పేదరికంతో బాధపడింది. అనుభవించింది. సోదరి, నటుడు విజయత పండిట్ , ఆమె భర్త, సంగీత స్వరకర్త ఆదేశ్ శ్రీవాస్తవతో కలిసి జీవించేది 2007లో తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి కూడా ప్రయత్నించింది.సులక్షణ పండిట్,కొన్ని ఆసక్తికర సంగతులు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జూలై 12, 1954న జన్మించిన సులక్షణ పండిట్ సంగీతం కుటుంబం నుంచి వచ్చారు. ఆమె ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ మేనకోడలు , సంగీత స్వరకర్త ద్వయం జతిన్-లలిత్ సోదరి. సులక్షణ తొమ్మిదేళ్ల వయసులోనే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. 1967లో తన నేపథ్య గాయనిగా అరంగేట్రం చేసింది. సంకల్ప్ (1975)లోని ‘తు హి సాగర్ హై తు హి కినారా’ పాట ఏకంగా ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది.తక్దీర్ (1967) చిత్రం నుండి లతా మంగేష్కర్తో ఆమె యుగళగీతం ‘సాత్ సమందర్ పార్ సే’ మరో అద్భుతమైన గీతం. నటిగా కూడా ఆమెది ప్రత్యేక స్థానమే. సంజీవ్ కుమార్ సరసన ఉల్జాన్ (1975) చిత్రంతో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది. సంకోచ్ (1976), హేరా ఫేరి, అప్నాపన్, ఖండాన్ మరియు వక్త్ కి దీవార్ వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోలు రాజేష్ ఖన్నా, జీతేంద్ర, వినోద్ ఖన్నా, శశి కపూర్ , శత్రుఘ్న సిన్హాతో నటించి ప్రశంసలందుకుంది. చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : చిన్మయి ఫైర్ -
ఇండో-చైనా యుద్ధంపై సినిమా.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ లేటెస్ట్ మూవీ '120 బహదూర్'. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఫర్హాన్ అక్తర్, రాశీఖన్నా లీడ్ రోల్స్ చేశారు. రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్)మన దేశానికి చెందిన 120 మంది సైనికులు.. ఏకంగా 3000 మంది చైనా సైన్యంతో ఎలా పోరాడారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారనేది '120 బహదూర్' మూవీ స్టోరీ. ట్రైలర్ చూస్తుంటే ఇదివరకే వచ్చిన వార్ బ్యాక్ డ్రాప్ మూవీలా ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలరించేలా ఉన్నాయి.(ఇదీ చదవండి: తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్) -
ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నింటిని మాత్రం సర్ప్రైజ్ స్ట్రీమింగ్ అనేలా అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలా ఓ హిందీ కామెడీ థ్రిల్లర్ రిలీజ్ గురించి ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రజల సొమ్ము దొచుకునే కొందరిపై ఓ మహిళ పాములా పగబడితే అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. ఇంతకీ ఇది ఏ ఓటీటీలో ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: దుల్కర్ సల్మాన్ 'కాంత' ట్రైలర్ రిలీజ్)2004లో వచ్చిన ఉదయ్ కిరణ్ 'లవ్ టుడే' సినిమాతో హీరోయిన్ అయిన దివ్య ఖోస్లా.. తర్వాత ఏడాదే బాలీవుడ్ బడా నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌ని పెళ్లి చేసుకుంది. నటన పక్కనబెట్టేసింది. 2016 నుంచి నటి, దర్శకురాలిగా సినిమాలు చేస్తున్న ఈమె.. ఇప్పుడు 'ఏక్ చతుర్ నార్' అనే సినిమాతో వచ్చింది. డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబరు 12న థియేటర్లలోకి రాగా.. శుక్రవారం(నవంబరు 07) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.ఏక్ చతుర్ నార్ విషయానికొస్తే.. లక్నోలోని ఓ మురికివాడలో మమత (దివ్య ఖోస్లా).. కొడుకు, అత్తతో కలిసి జీవిస్తుంటుంది. మెట్రో స్టేషన్లో ఉద్యోగం చేస్తుంటుంది. ఓ రోజు మమత పనిచేస్తున్న చోట పెద్ద ఫైనాన్షియర్ అభిషేక్ వర్మ (నీల్ నితిన్ ముఖేష్) ఫోన్ దొంగతనానికి గురవుతుంది. ఆ ఫోన్‌ని పట్టుకోవడానికి వెళ్లిన మమత ఏం చేసింది? అసలు ఫైనాన్షియర్‌కి మమతకు మధ్య గొడవేంటి? ఆ ఫోన్లో ఏముంది? దీన్ని అడ్డం పెట్టుకుని మమత ఏమేం పనులు చేసిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి బిగ్ బాస్ ఫేమ్ కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్)Ek Chatur Naar, joh hai tez tarrar jaise chaaku ki dhaar 👀 Jeetega is khel mein kaun? 😏Watch Ek Chatur Naar, out 7 November, on Netflix.#EkChaturNaarOnNetflix pic.twitter.com/IwpE0kUXNN— Netflix India (@NetflixIndia) November 6, 2025 -
మగాళ్లకూ ఆ నరకం తెలియాలి: రష్మిక మందన్నా
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఏది పట్టినా బంగారమే అవుతోంది. యానిమల్ నుంచి కుబేర వరకు ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే.. ఒక్క సికిందర్ తప్ప! ఈ ఏడాది రష్.. ఇప్పటివరకు నాలుగు సినిమాల(ఛావా, సికిందర్, కుబేర, థామా)తో అలరించింది. ఇప్పుడేకంగా ఐదో మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్' (The Girlfriend Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.టాక్ షోలో రష్మికరాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ కోసం బాగానే కష్టపడుతోందీ బ్యూటీ. ఈ మధ్యే తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ స్టేజీపైనా సందడి చేసింది. తాజాగా జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి హాజరైంది. ఈ టాక్ షోలో సినిమా కోసమే కాకుండా ఇతరత్రా విషయాలపైనా మాట్లాడింది.మగాళ్లకు పీరియడ్స్ రావాలిముందుగా ఆమె మనసులో ఉన్న కోరిక గురించి జగపతిబాబు ప్రస్తావించాడు. మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని ఫీలైనట్లున్నావ్? అని అడిగాడు. అందుకు రష్మిక క్షణం ఆలోచించకుండా అవునని తలూపింది. మగాళ్లకు ఒక్కసారైనా పీరియడ్స్ వస్తే.. ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.చదవండి: ఓటీటీలో 'మిత్రమండలి'.. 20 రోజుల్లోనే స్ట్రీమింగ్ -
54 ఏళ్ల బ్యాచిలర్ హీరోయిన్.. పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)
-
విడాకుల రూమర్స్.. ఐశ్వర్య రాయ్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ పాల్గొన్న ఒప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూలో ఒప్రా ఐశ్వర్య, అభిషేక్‌ల పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించగా ఆ దృశ్యాలు ప్రేక్షకులలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి.భారతీయ పెళ్లిళ్ల ప్రత్యేకతపై మాట్లాడిన అభిషేక్ బచ్చన్, “భారతీయులు సంబరాలు చేసుకోవడాన్ని ఎంతో ఇష్టపడతారు. అందుకే మా పెళ్లి వేడుక కూడా అనేక రోజులు కొనసాగింది” అని తెలిపారు.అయితే ఒప్రా “ఇంత పెద్ద పెళ్లి తర్వాత విడాకులు తీసుకోవడం కష్టం కదా?” అని ప్రశ్నించగా దానికి ఐశ్వర్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా “మేం ఆ ఆలోచనను ఏ మాత్రం మనసులోకి రానివ్వం” అని స్పష్టంగా సమాధానమిచ్చింది. ఆ సమాధానంతో ఐశ్వర్య రాయ్‌కు భారతీయ వైవాహిక బంధంపై ఉన్న నిబద్ధతను, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించిందని అభిమానులు పేర్కొంటున్నారు. ఆమె మాటలతో బచ్చన్ జంట మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. -
'వార్ 2' ఫ్లాప్ దెబ్బకు నిర్మాత షాకింగ్ నిర్ణయం
ఈ ఏడాది భారీ అంచనాలతో రిలీజైన సినిమాల్లో 'వార్ 2' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తొలిసారి హిందీలో చేసిన చిత్రం, హృతిక్ రోషన్ మరో హీరో కావడంతో విడుదలకు ముందు చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత రిజల్ట్ మారిపోయింది. పాన్ ఇండియా లెవల్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో ఘోరమైన నష్టాలు వచ్చాయని మొన్నీమధ్యే ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.'వార్ 2' తర్వాత ఈ స్పై యూనివర్స్ నుంచి 'ఆల్ఫా' అనే సినిమా రావాలి. ఆలియా భట్, శర్వారీ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ మూవీని ఈ ఏడాది డిసెంబరు 25న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు వాయిదా ప్రకటన బయటకొచ్చింది. వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 17న చిత్రం థియేటర్లలోకి వస్తుందని అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: శివగామిని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇలా మార్చేశారేంటి!)ఇదంతా చూస్తుంటే నిర్మాణ సంస్థ రిలీజ్ విషయంలో కావాలనే ఇలా చేసిందా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే 'వార్ 2' వల్ల ఈ యూనివర్స్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ఒకటే స్టోరీని ఎన్నిసార్లు తిప్పితిప్పి తీస్తారా అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో థియేటర్లలోకి 'ఆల్ఫా' వస్తే 'వార్ 2' ఫెయిల్యూర్ ప్రభావం దీనిపై పడే అవకాశముంది. అందుకే నాలుగు నెలలు వాయిదా వేశారా అనిపిస్తుంది.ఈ యూనివర్స్‌లో ఇప్పటివరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, టైగర్ 3, పఠాన్, వార్ 2 చిత్రాలు వచ్చాయి. ఒకప్పటితో పోలిస్తే ఈ యూనివర్స్‌పై ఇప్పుడు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనిపించట్లేదు. దీంతో 'ఆల్ఫా' ఫలితం అనేది నిర్మాణ సంస్థకు చాలా కీలకం. ఒకవేళ మూవీ హిట్ అయితే పర్లేదు. తేడా కొడితే మాత్రం తర్వాత అనుకున్న 'పఠాన్ vs టైగర్' లాంటివి అటకెక్కేయొచ్చు.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?) -
ఇట్స్ షో టైమ్
‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత హీరో షారుక్ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘కింగ్’ అనే టైటిల్ ఖరారైంది. ఆదివారం (నవంబరు 2) షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ ప్రకటన వీడియోను రిలీజ్ చేశారు.‘ఎంత మందిని చంపానో గుర్తు లేదు’, ‘వాళ్లు మంచివారా? చెడ్డవారా అని నేను అడగలేదు’, ‘వాళ్ల కళ్లలో నాకు భయం కనిపిస్తే అదే వారి ఆఖరి శ్వాస అవుతుంది’, ‘ఇట్స్ షో టైమ్’ అనే డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్గా, షారుక్ తనయ సుహానా కీలక పాత్ర చేస్తున్నారు. -
సందీప్ రెడ్డి వంగా దెబ్బకు బాలీవుడ్ గల్లంతు.. ఇప్పటికీ
'అర్జున్ రెడ్డి'తో తెలుగులో హిట్ కొట్టి.. తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయిన సందీప్ రెడ్డి వంగా.. కబీర్ సింగ్, యానిమల్ అంటూ హిందీలోనే మూవీస్ తీశాడు. ఇవి బ్లాక్ బస్టర్ హిట్ అయి వందల కోట్ల కలెక్షన్ తెచ్చుకున్నా సరే ఇతడిపై బాలీవుడ్ సెలబ్రిటీల కడుపు మంట చల్లారలేదని చెప్పొచ్చు. అవకాశం దొరికినా ప్రతిసారి ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు. వాటికి సందీప్ కూడా ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇస్తూనే ఉంటాడు.గత నెలలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'స్పిరిట్' మూవీ నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ పేరు ముందు 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్' అని సందీప్ ప్రస్తవించాడు. ఈ ట్యాగ్ వల్ల బాలీవుడ్ గల్లంతు అయిపోయింది. అటు సల్మాన్ ఇటు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్.. మా హీరో సూపర్‌స్టార్ అంటే మా హీరో సూపర్‌స్టార్ తెగ ట్వీట్స్ పెట్టి హడావుడి చేశారు. మరోవైపు పలువురు పీఆర్స్ కూడా ప్రభాస్ కంటే సల్మాన్, షారుఖ్ తోపు అన్నట్లు రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ప్రశాంత్ వర్మ రూ.200 కోట్ల వివాదం.. నిర్మాత ఫిర్యాదు)ఇదంతా జరిగి వారంపైనే అయిపోయింది. తాజాగా ఈ ట్యాగ్ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. దీనికి కారణం షారుఖ్ ఖాన్ 'కింగ్' మూవీ అనౌన్స్మెంట్. షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం(నవంబరు 02) గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇందులో.. 'సూపర్‌స్టార్ అనే ట్యాగ్ మించిన స్టార్స్ ఉంటే వాళ్లని కింగ్ అని పిలుస్తారు. హ్యాపీ బర్త్ డే ఇండియాస్ కింగ్' అని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రాసుకొచ్చాడు.డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ చేసిన ట్వీట్ చూస్తే కచ్చితంగా సందీప్ రెడ్డి వంగా కౌంటర్ ఇవ్వడం కోసమే ఇలా పెట్టాడా అనే సందేహం వస్తుంది. చూస్తుంటే సందీప్ రేపిన రచ్చ బాలీవుడ్లో ఇప్పట్లో చల్లారేలా లేదుగా అనిపించడం గ్యారంటీ. రాబోయే రోజుల్లో ఈ ట్యాగ్ గోల ఎంతవరకు వెళ్తుందో చూడాలి?(ఇదీ చదవండి: వాట్సాప్‌లో మార్ఫ్డ్ వీడియోలు.. ఏడాదిపాటు డిప్రెషన్లో: విష్ణుప్రియ)When stars go beyond being “just a superstar” they are called 👑 Happy Birthday INDIA’s KING pic.twitter.com/NZmChE3OIy— Siddharth Anand (@justSidAnand) November 2, 2025 -
బుజ్జి తల్లి వదిలేస్తున్నావా...!
-
డేట్ ఫిక్స్
బాలీవుడ్లో రెండు చిత్రాలకు సంబంధించిన రిలీజ్ అప్డేట్ అందింది. ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ ఒకటి. రెండోది ‘చాంద్ మేరా దిల్’. ఈ రెండు చిత్రాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలుసుకుందాం.⇒ వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేష్ తౌరాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2026 జూన్ 5న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ‘‘ఈ సినిమాలో లవ్, డ్రామా, కామెడీ... ఇలా ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ⇒ లక్ష్య, అనన్యా పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘చాంద్ మేరా దిల్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్స్‌గా లక్ష్య, అనన్య నటిస్తున్నారు. వివేక్ సోని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. -
మాజీ కోడలిపై ఎంత ప్రేమో? బర్త్‌డే మనవరాలిదైతే బహుమతులు..!
బుల్లితెర నటి చారు అసోపా భర్తకు విడాకులిచ్చి కూతురితో ఒంటరిగా బతుకుతోంది. సింగిల్ పేరెంట్ అయిన తనకు ముంబైలో ఇల్లు దొరక్క, సరైన సంపాదన లేక.. రాజస్తాన్‌లోని బికనీర్‌లో పుట్టింటికి వెళ్లిపోయింది. నటనకు బ్రేక్ ఇచ్చి చీరల బిజినెస్ చేస్తోంది. పుట్టింట్లో ఉండిపోకుండా కొత్తిల్లు కట్టుకుని కూతురు జియానాతో కలిసి జీవిస్తోంది.నటి కోసం వచ్చిన మాజీ మామతాజాగా చారు అసోపా (Charu Asopa)ను ఆమె మాజీ మామ కలిశాడు. బికనీర్‌లో తనింటికి తొలిసారి వెళ్లాడు. మనవరాలి బర్త్‌డే కోసం కానుకల్ని వెంటపెట్టుకుని వెళ్లాడు. మనవరాలికే కాకుండా మాజీ కోడలి కోసం కూడా గిఫ్టులు కొనుగోలు చేశాడు. మామ వస్తున్నాడని తెలిసి ఇంటిని అందంగా ముస్తాబు చేసింది చారు. విమానాశ్రయానికి వెళ్లి అతడికి సాదర ఆహ్వానం పలికింది. తర్వాత డిన్నర్ కోసం ప్యాలెస్‌కు తీసుకెళ్లింది. ప్యాలెస్‌లో నచ్చిన విందు ఆరగించాక.. అక్కడి ఫోక్ డ్యాన్సర్లతో కలిసి చారు, జియానా స్టెప్పులేశారు.పెళ్లి- విడాకులుబుల్లితెర నటి చారు అసోపా.. హీరోయిన్ సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్‌ను 2019లో గోవాలో పెళ్లి చేసుకుంది. వీరి దాంపత్యానికి గుర్తుగా కూతురు జియానా పుట్టింది. కానీ తర్వాత వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎంత సర్దుకుపోదామన్నా అవి తగ్గకపోగా, పెద్దవి కావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా 2023లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న మొదట్లో ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకున్నారు. కోపావేశాలు చల్లారాక ఫ్రెండ్స్ అయిపోయారు. రాజీవ్, చారు, జియానా.. ఆ మధ్య నగరాలు, దేశాలు చుట్టేస్తూ సరదాగా గడిపారు. ఇప్పటికీ ఒక ఫ్యామిలీలా కలిసిమెలిసి ఉంటున్నారు. View this post on Instagram A post shared by Charu Asopa (@asopacharu) చదవండి: శ్రీజ ఎలిమినేట్, కొత్త కెప్టెన్‌గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి! -
'దావూద్ ఇబ్రహీం టెర్రరిస్ట్ కాదు'.. హీరోయిన్ వివాదాస్పద కామెంట్స్!
అలనాటి అందాల భామ, బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి చాలా రోజుల తర్వాత ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 24 ఏళ్ల పాటు విదేశాల్లో ఉన్న నటి.. ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చింది. సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం సన్యాసిగా మారి బ్యూటీ మూడు రోజుల ఆధ్యాత్మిక పర్యటన కోసం గోరఖ్‌పూర్ చేరుకుంది. ఈ సందర్భంగా మమతా వివాదాస్పద కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది. ఇంతకీ మమతా ఎలాంటి కామెంట్స్ చేసింది? అవీ వివాదానికి ఎందుకు దారితీశాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం టెర్రిరిస్ట్ కాదంటూ క్లీన్ చీట్ ఇచ్చిపడేసింది మమతా కులకర్ణి. అతను ముంబయిలో పేలుళ్లకు పాల్పడలేదంటూ కామెంట్స్ చేసింది. అతను ఎలాంటి బాంబు బ్లాస్ట్ చేయలేదని.. దేశ ద్రోహి కాదంటూ మాట్లాడింది. మమతా కామెంట్స్ కాస్తా వైరల్ కావడంతో హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.దీంతో హీరోయిన్ మమతా కులకర్ణి తన వ్యాఖ్యలపై స్పందించింది. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చింది. నేను మాట్లాడింది.. దావూద్ ఇబ్రహీం గురించి కాదు.. విక్కీ గోస్వామి గురించి అని తెలిపింది. దావూద్ నిజంగా ఉగ్రవాదినే అని వెల్లడించింది. కాగా.. గతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో అరెస్టైన గోస్వామికి.. ఈమెతో రిలేషన్ ఉంది.దావూద్‌ను నేనెప్పుడు కలవలేదు..అంతేకాకుండా తాను దావూద్‌ను ఎప్పుడూ కలవలేదని.. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. నాకు ఇప్పుడు రాజకీయాలతో కానీ.. సినిమా పరిశ్రమతో కానీ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ప్రస్తుతం పూర్తిగా ఆధ్యాత్మికతపై అంకితభావంతో ఉన్నానని పేర్కొంది. సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా.. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులతో నాకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. కాగా.. 1993 ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌కు పారిపోయాడు. రెండు దశాబ్దాలకు పైగా కరాచీలో నివసిస్తున్నట్లు సమాచారం.మమతా కులకర్ణి సినీ జీవితం1990ల ప్రారంభంలో మమతా కులకర్ణి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. క్రాంతివీర్, కరణ్ అర్జున్, చైనా గేట్ వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత 2002లో నటనకు పూర్తిగా స్వస్తి పలికింది. 2016లో, థానే పోలీసులు ఆమెను 2 వేల కోట్ల అంతర్జాతీయ మాదకద్రవ్యాల కేసుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 2024లో ఆమెపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టేసింది. గత కొన్ని సంవత్సరాలుగా మమతా సన్యాసిగా జీవనం సాగిస్తోంది. -
ఒక్క దెబ్బతో జీవితమే తలకిందులు.. భిక్షాటన చేస్తున్న నటి
మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చిందంటే ఏ ఎమోషన్ అయినా ఇట్టే పండించగలదు. అందుకే శక్తిమాన్ సహా 150కి పైగా సీరియల్స్ చేసింది. ఎక్కువగా గ్లామరస్‌గానే కనిపించేది. కానీ, సడన్‌గా తనకు అన్నింటిపైనా విరక్తి వచ్చింది. బంధాలు, బాంధవ్యాలు అన్నింటినీ కాదనుకుని సన్యాసం పుచ్చుకుంది. పీంతబర మాగా మారింది. హిమాలయాల్లో సన్యాసిగా జీవిస్తోంది.జీవితంపై విరక్తితాజాగా ఓ ఇంటర్వ్యూలో నుపుర్ అలంకార్ (Nupur Alankar) అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. గూగుల్‌లో చూస్తే నా జీవితంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుస్తుంది. పీఎంసీ (పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్) బ్యాంక్ కుంభకోణం జరిగినప్పుడు జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఈ స్కామ్ తర్వాతే అమ్మ అనారోగ్యంపాలైంది. మెరుగైన చికిత్స అందించడనికి బ్యాంకులో డబ్బున్నా.. దాన్ని బయటకు తీసుకుని వాడలేని పరిస్థితి. అమ్మ, సోదరి చావులు చూశాక నా జీవితం కూడా ముగిసిపోయిందనుకున్నా.. ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలనుకున్నాను. భిక్షాటనఅందుకే అన్ని కనెక్షన్లు తెంచేసుకున్నాను. ప్రాపంచిక జీవితానికి దూరంగా.. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాను. ఆధ్యాత్మిక జీవితంలో సంతోంషంగా ఉన్నాను. ఇక్కడ భిక్షాటన ఉంటుంది. నేను కూడా భిక్షాటన చేస్తుంటాను. అందరూ నాకు దానధర్మాలు చేసినదాంట్లో కొంత దేవుడికి, మరికొంత నా గురువుకి ఇస్తాను. ఈ భిక్షాటన వల్ల మనిషిలో ఇగో అనేది చచ్చిపోతుంది. ఇకపోతే నాలుగైదు జతల బట్టలతోనే కాలం గడిపేస్తున్నాను. ఆశ్రమానికి వచ్చేవారు కొన్నిసార్లు దుస్తులు కూడా ఇస్తుంటారు. వాటినే ఉపయోగిస్తూ ఉంటాను. కొన్నిసార్లు మంచు తుఫానులు వంటివి వచ్చినప్పుడు గుహలో జీవించాను అని చెప్పుకొచ్చింది.PMB స్కామ్..నటి నుపుర్ సన్యాసం పుచ్చుకోవడానికి ప్రధాన కారణం తల్లి, సోదరి చావు! ఆ చావులకు ప్రధాన కారణం 2019లో జరిగిన పీఎంసీ బ్యాంక్ స్కామ్. వేల కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చినవెంటనే ఆర్బీఐ.. పీఎంబీ బ్యాంక్‌పై ఆరునెలలపాటు ఆంక్షలు విధించింది. వినియోగదారులు కేవలం రూ.1000 మాత్రమే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని కఠిన నిబంధనలు పెట్టింది. దీంతో ఆ బ్యాంక్‌లో నగదు డిపాజిట్ చేసుకున్న వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తర్వాత విత్‌డ్రా పరిమితులను సవరించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 200 మందికి పైగా కస్టమర్లు ప్రాణాలు కోల్పోయారు.చదవండి: వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు -
వారసత్వ వెలుగులు
కాలంతో పాటు ఫ్యాషన్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ, కొన్నింటికి కాలం అడ్డంకి కాదు. అవి భావాలూ, జ్ఞాపకాలూ కలిపిన అందంతో మరింత ప్రత్యేకతను చాటుతుంటాయి. అలాంటి వారసత్వ ఆభరణాలు బాలీవుడ్–టాలీవుడ్లలోనూ కొత్తగా వెలుగుతున్నాయి. వివాహ వేడుకలు, ఫ్యాషన్ వేదికలు, సినిమా ఈవెంట్లలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఆభరణం ఒక కథను, ఒక బంధాన్ని, ఒక జ్ఞాపకాన్ని మన ముందుంచుతుంది.వెండితెరమీద మెరిసే తారలు మోడర్న్ను మాత్రమే పరిచయం చేస్తారు అనుకుంటేపొరబాటు. తమ కుటుంబ వారసత్వాన్ని, ఆత్మీయతను ఆభరణాలలోనూ చూపుతుంటారు. శోభిత ధూళిపాళవివాహానికి ముందు జరిగే వేడుక సమయంలో శోభిత తన తల్లి, తాతమ్మగారి వారసత్వ ఆభరణాలు ధరించింది. వీటిలో సంప్రదాయ పసిడి హారం, కాసులపేర్లు ఉన్నాయి. ఆమె మాటల్లో – ‘మా అమ్మమ్మ ఈ ఆభరణాలు ధరించినప్పుడు నేను చిన్నపిల్లను. ఇప్పుడు అవే ఆభరణాలను నేను వేసుకున్నప్పుడు ఆమె నాకు మరీ మరీ గుర్తుకొచ్చింది’ అని చెబుతుంది. ఈ ఒక్క మాటతోనే ఆ ఆభరణం బంగారం కాదు, బంగారం లాంటి జ్ఞాపకం అని మనకు తెలిసిపోతుంది.కుటుంబ వారసత్వం అలియా తన వివాహ వేడుకలో పాత కాలపుపొల్కీ నెక్లెస్ ధరించింది. ఆ పీస్ ఆమె తల్లి సోనీ రాజ్దాన్ కానుకగా ఇచ్చినది. ‘ఇది కేవలం ఒక ఆభరణం కాదు. తల్లి ప్రేమకు ప్రతీక అని చెబుతుంది. ఆమె ఆ తర్వాత కూడా ఆ నెక్లెస్‌ని రీ–స్టైల్ చేసి మనీష్ మల్హోత్రా ఈవెంట్లో వాడింది.కీర్తీ సురేశ్తల్లి మేనక ఇచ్చిన టెంపుల్ జ్యువెలరీని కీర్తి పబ్లిక్ ఈవెంట్స్‌లో కూడా రీ–స్టైల్ చేసి వేసుకుంటుంది. ఆమె చెప్పినట్టుగా ‘మా అమ్మ ఆభరణాలు నేను మళ్లీ వేసుకుంటే, అది ఫ్యాషన్ కాదు గౌరవం’ అని చెబుతుంది.వారసత్వ రత్నాలుబాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన వివాహ వేడుకలో ధరించిన చోకర్ నెక్లెస్ వందేళ్ల కిందట ఆమె కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చింది. దానిని రాజస్థానీ డిజైనర్లు పొల్కీ ఆభరణంగా రూపొందించారు. ‘ఈ నెక్లెస్ మా అమ్మమ్మ ధరించింది. ఇప్పుడు నేను వేసుకుంటున్నానంటే అందుకు మా మధ్య ఉండే ఆత్మీయ బంధమే కారణం’ అని చెబుతుంది సోనమ్. ఇప్పుడు ఆభరణాల డిజైనర్లు కూడా ‘సెంటిమెంట్ స్టైల్’ అనే కొత్త లైన్ ను ఎంచుకుంటున్నారు. పాత ఆభరణాలను మోడర్న్ టచ్‌తో రీ–డిజైన్ చేయడం, వాటి కథను చెప్పేలా ప్రదర్శించడం ట్రెండ్ అయ్యాయి. వారసత్వ ఆభరణం అంటే కేవలం అలంకారమే కాదు అది ప్రేమ, గౌరవం, జ్ఞాపకం కూడా! -
ప్రియాంక మెడలో కొండచిలువ.. భయమనేదే లేదు!
తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగానే కాదు, ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు సృష్టించడంతో అందరి కన్ను టాలీవుడ్‌పై పడింది. అలా దీపికా పదుకొణె కల్కి 2898ఏడీతో తెలుగులో ఎంట్రీ ఇస్తే, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. #SSMB29 మూవీతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం కానుంది. డేర్ అండ్ డాషింగ్‌గా కనిపించే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో అరుదైన ఫోటోలు షేర్ చేసింది. అందులో కొండచిలువ సహా మరో భారీ పామును తన భుజాలపై వేసుకుంది. భర్త నిక్ జోనస్ కూడా పక్కనే నిల్చుని చూస్తూ ఉన్నాడు. భయమే లేదువీరి ముఖంలో కంగారు, భయం వంటివి మచ్చుకైనా కనిపించడం లేదు. పైగా.. నీ జ్యువెలరీ బాగుంది బేబ్ అని భార్యకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. పాములను మెడలో వేసుకుని దిగిన పలు ఫోటోలను తన పోస్ట్‌లో జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అదిగో పాము అనగానే అరకిలోమీటర్ దూరం పడిగెతుంటారు జనాలు.. అలాంటిది ప్రియాంక ఏకంగా పామును మెడలో వేసుకుందంటే గుండెధైర్యం చాలానే ఉందని మెచ్చుకుంటున్నారు. రాజమౌళి-మహేశ్‌బాబు సినిమాలో ఇలాంటి సాహసాలు ఎన్ని చేసిందో చూడాలని కామెంట్లు చేస్తున్నారు.మిస్ వరల్డ్ నుంచి హీరోయిన్గా..జార్ఖండ్‌కు చెందిన ప్రియాంకచోప్రా.. 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం గెలిచింది. ఆ తర్వాతే బిగ్స్క్రీన్పై తళుక్కుమంది. 2002లో వచ్చిన తమిళన్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ద హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై చిత్రంతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. అండాజ్, ముజ్సే షాదీ కరోగి, అయిత్రాజ్ వంటి పలు హిట్స్‌తో బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా మారింది. క్రిష్, డాన్, ఫ్యాషన్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. రచయిత్రిగానూబర్ఫీ, బాజీరావు మస్తానీ, మేరీ కోమ్, ద స్కై ఈజ్ పింక్ ఇలా అనేక సినిమాలు చేసింది. రామ్‌లీలా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. బాలీవుడ్ రాజకీయాలు తట్టుకోలేక హాలీవుడ్‌కు వెళ్లిపోయింది. సిటాడెల్ వంటి వెబ్ సిరీస్‌లతో పాటు అనేక ఇంగ్లీష్ చిత్రాల్లో కథానాయికగా నటించింది. ‘అన్ఫినిష్డ్: ఏ మెమోయిర్’ పుస్తకంతో రచయిత్రిగా ఆరంగేట్రం చేసింది ప్రియాంకచోప్రా. తన జీవితంలో ఎదురైన జ్ఞాపకాలను ఈ పుస్తకం ద్వారా పాఠకులతో పంచుకుంది.పెళ్లి- కూతురుహాలీవుడ్ సింగర్,యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోనస్‌ని 2018లో పెళ్లి చేసుకుంది. వీరికి సరోగసి ద్వారా కూతురు మాల్తీ మేరి జన్మించింది. భర్త, కూతురితో కలిసి ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లోనే ఉంటోంది. పెళ్లయ్యాక ఇండియన్ సినిమాలపై ఫోకస్ తగ్గించేసిన ప్రియాంక.. ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్లోని సినిమాలో నటించడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra)చదవండి: ప్లేటు తిప్పేసిన మాధురి.. రీతూ తల్లి ఏడుస్తూ ఫోన్ చేసిందా? -
సల్మాన్ ఖాన్‌కు రూ.200 కోట్లు.. నిర్మాత ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పేరు ఇటీవల తెగ వినిపిస్తోంది. ఆయనపై పాకిస్తాన్ ఉగ్రవాద ముద్ర వేయడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. సౌదీ అరేబి యాలోని రియాద్‌లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించారు. దీంతో పాక్ తన వక్రబుద్ధిని చూపుతూ సల్మాన్‌పై టెర్రిరిస్ట్ ముద్ర వేసింది.ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్-19కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అత్యంత భద్రతా వలయంలో ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. అయితే గతంలో సల్మాన్ రెమ్యునరేషన్‌పై పెద్దఎత్తున రూమర్స్ వినిపించాయి. ఈ షో కోసం ఏకంగా రూ.200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి.(ఇది చదవండి: సల్మాన్‌పై పాక్ ఉగ్ర ముద్ర)తాజాగా ఈ వార్తలపై బిగ్‌బాస్ రియాలిటీ షో నిర్మాత రిషి నెగి రియాక్ట్ అయ్యారు. ఆయనకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా.. అందుకు అర్హుడని అన్నారు. ఆయనకు జియో హాట్‌స్టార్‌తో ఉన్న ఒప్పంద ప్రకారమే పారితోషికం ఉంటుందని తెలిపారు. అయితే అది ఎంత అనేది మాత్రం తాను చెప్పలేనన్నారు. కాగా.. సల్మాన్ ఖాన్.. బిగ్‌బాస్ హోస్ట్‌గా రూ.150 నుంచి రూ.200 కోట్లు తీసుకున్నారంటూ రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. -
రోజుకు 22 గంటలు షూటింగ్‌లోనే.. నేలపై నిద్రపోయేవాడిని!
కార్పొరేట్ ఆఫీసుల్లో ఎలాగైతే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉద్యోగాలు చేస్తారో.. సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి టైమింగ్ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్స్ అంటే కష్టం.. అందులోనూ లెక్క లేకుండా రోజంతా ఎక్కువ గంటలు పని చేయించుకుంటామంటే కుదరదు, 8 గంటల షిఫ్టే ఉండాలి అని దీపికా పదుకొణె వంటి స్టార్ హీరోయిన్స్ కొత్త కండీషన్స్ పెడుతున్నారు.సరిగా నిద్రుండేది కాదుఈ డిమాండ్లకు కొందరు నిర్మాతలు కుదరదని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. అయితే రోజుకు ఎనిమిది గంటలు కాదు, ఏకంగా 22 గంటలు పని చేసేవాడిని అని చెప్తున్నాడు హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, బుల్లితెర నటుడు హితేన్ తేజ్వాని (Hiten Tejwani). తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. కెరీర్ తొలినాళ్లలో నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదు. నెలలో 30 ఎక్స్ట్రా షిఫ్టులు చేసేవాడిని. నా చెక్ నేనే వెళ్లి తెచ్చుకునేవాడిని. రూ.1 లక్ష చెక్ అందుకోగానే సంబరపడిపోయేవాడిని.ఛాన్స్ దొరికితే నేలపై నిద్రపొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ అనేవారు. తీరా అది ఉదయం ఐదింటివరకు సాగేది. రెండు గంటల గ్యాప్‌తో నెక్స్ట్ షిఫ్ట్ మొదలయ్యేది. అలా 22 గంటలు పనిచేసేవాడిని. మిగతా రెండుగంటలు నేలపై నిద్రించేవాడిని. నా టైమింగ్స్ నచ్చక చాలామంది డ్రైవర్స్ సడన్‌గా పని మానేసేవారు. దాంతో నేనే కారు నడిపేవాడిని, ఓసారైతే డివైడర్‌ను ఢీ కొట్టాను. నిజానికి వేరే ఉద్యోగం చూసుకుంటే పనిగంటలు తక్కువ ఉండేవి, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదని చాలాసార్లు అనుకున్నాను. అయినా ఇష్టపడి, కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అని చెప్పుకొచ్చాడు.సీరియల్స్హితేన్.. సుకన్య, ఘర్ ఏక్ మందిర్, కభీ సౌతన్ కభీ సహేలి సీరియల్స్‌లో చిన్న పాత్రలు చేసేవాడు. కుటుంబ్ సీరియల్‌తో బ్రేక్ అందుకున్నాడు. క్యూంకీ సాస్ భీ కభీ బహుతీ, కుసుమ్, బాలికా వధు, కసౌటీ జిందగీ కే వంటి పలు ధారావాహికలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యూంకీ సాస్ భీ కభీ బహు తీ 2 సీరియల్ చేస్తున్నాడు. హిందీ బిగ్‌బాస్ 11వ సీజన్లోనూ పాల్గొన్నాడు.చదవండి: టాస్కుల్లో పవన్‌ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి! -
నా ప్రేమ ఈ రోజే పుట్టింది! లవ్ లేడీకి లవ్లీ గ్రీటింగ్స్ (ఫొటోలు)
-
కొందరు నటులు అసలు సెట్‌కే రారు.. 'ఓజీ' విలన్ కామెంట్స్
రీసెంట్ టైంలో నటీనటుల పనివేళలు, సెట్‌కి సమయానికి రావడం అనే విషయాలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అడపాదడపా నటీనటులు, సినీ ప్రముఖులు ఈ టాపిక్ గురించి నేరుగానో, పరోక్షంగానో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 'ఓజీ'లో విలన్‌గా చేసిన ఇమ్రాన్ హష్మీ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొందరు నటులు అస్సలు సెట్‌కి రారనే ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'సలార్' కాటేరమ్మ ఫైట్‌లో నేనే చేయాలి.. కానీ: టాలీవుడ్ హీరో)అసలు విషయానికొస్తే.. 'హక్'(HAQ) అనే హిందీ సినిమా చేసిన ఇమ్రాన్ హష్మీ దాని ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సహనటి యామీ గౌతమ్‌ని ప్రశంసించాడు. సెట్‌కి సమయానికి వచ్చేస్తుందని చెప్పుకొచ్చాడు. మరి ఈ కాలంలో కూడా టైమ్‌కి రాని యాక్టర్స్ ఉంటారా? అని యాంకర్ అడగ్గా.. 'కొందరు నటులు అసలు సెట్‌కే రారు' అని కామెంట్స్ చేశాడు.అయితే ఇమ్రాన్ హష్మీ వ్యాఖ్యల్ని ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటున్నారు. పలువురు నార్త్ నెటిజన్లు సల్మాన్ ఖాన్ గురించి అన్నాడని అంటుండగా.. మరికొందరు మాత్రం పవన్ కల్యాణ్ గురించి ఈ కామెంట్స్ చేశాడా అనే సందేహపడుతున్నారు. ఎందుకంటే 'ఓజీ'లో పవన్ కొన్నిరోజులే షూటింగ్‌కి రాగా మిగిలిన చోట్ల పవన్ డూప్‌ని పెట్టి మేనేజ్ చేశారు. ఇమ్రాన్ గతంలో సల్మాన్‌తో కలిసి 'టైగర్ 3' చేశాడు. అప్పుడేమైనా సల్మాన్ సెట్‌కి రాలేదా అని అనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఫ్యామిలీ మ్యాన్ 3')About whom Emraan Hashmi talking ????Recently he worked in #TheyCallHimOG #EmraanHashmi pic.twitter.com/MncfXvbTG2— TFI Movie Buzz (@TFIMovieBuzz) October 27, 2025 -
ఇండస్ట్రీలో విషాదం మిగిల్చిన అక్టోబరు
వయసు పెరిగిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తుదిశ్వాస విడువక తప్పదు. అయితే ఇండస్ట్రీలో గత కొన్నిరోజులుగా సంభవిస్తున్న సెలబ్రిటీల వరస మరణాలు మాత్రం చాలా విషాదాన్ని నింపాయని చెప్పొచ్చు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు వరకు రోజుల వ్యవధిలో మరణించారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఆయా నటీనటులు ఎవరు?నటి డ్యాన్సర్ మధుమతి.. అనారోగ్య సమస్యల కారణంగా 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. 1960, 70ల్లో పలు సినిమాలు చేసిన ఈమె.. అక్షయ్ కుమార్, గోవింద లాంటి స్టార్స్‌కి డ్యాన్స్ నేర్పించింది. ఈమె అక్టోబరు 15న చనిపోయింది.మధుమతి చనిపోయిన రోజునే పంకజ్ ధీర్ అనే సీనియర్ నటుడు కూడా మృతి చెందారు. 'మహాభారతం'లో కర్ణుడిగా చేసిన ఈయన.. చాన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు. 'చంద్రకాంత'లో ఈయన యాక్టింగ్ చాలా పాపులర్.నటుడు, కమెడియన్ గోవర్ధన్ అశ్రానీ(84).. ఈ అక్టోబరు 20న చనిపోయారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ఈయన మరణానికి కారణం. ఈయన షోలే సినిమాలో జైలర్ పాత్ర పోషించి ఫేమ్ సొంతం చేసుకున్నారు. ఈయన యాక్టర్, కమెడియన్, దర్శకుడిగా పలు విభాగాల్లో పనిచేశారు.సింగర్ రిషభ్ టండన్.. దీపావళి పండగని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొనేందుకు ఢిల్లీ వెళ్లారు. కానీ అక్టోబరు 21న గుండెపోటుతో మరణించారు. ఈయన వయసు అయితే 35 ఏళ్లే. మరీ చిన్న వయసులో చనిపోవడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మనం చూసిన ఎన్నో యాడ్స్ సృష్టించిన పీయూష్ పాండే.. అక్టోబరు 24న కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా న్యూమోనియాతో పోరాడిన ఈయన 70 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్ తదితరులు ఈయనకు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.ప్రముఖ నటుడు-కమెడియన్ సతీష్ షా.. 74 ఏళ్ల వయసులో ముత్రపిండాల సమస్యతో ఇబ్బంది పడుతూ అక్టోబరు 25న మరణించారు. సరాభాయ్ vs సరాభాయ్, దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే తదితర చిత్రాలతో ఈయన చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఈ నెల 15-25వ తేదీల్లో ఏకంగా ఆరుగురు బాలీవుడ్ సెలబ్రిటీలు చనిపోవడం బాధాకరమైన విషయం. -
జాబ్ చేస్తూ యాక్టింగ్.. కానీ 25 ఏళ్లకే తనువు చాలించి
ఈనెలలో బాలీవుడ్లో పలువురు సెలబ్రిటీల మరణాలు కలిచివేశాయి. వీటి నుంచి తేరుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం. 'జమత్ర' అనే వెబ్ సిరీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నమరాఠీ నటుడు సచిన్ చంద్వాడే (25) తనువు చాలించాడు. ఇంట్లోనే ఊరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రస్తుతం జమత్ర 2, అసురవన్ అనే సిరీస్‌లు చేస్తున్న సచిన్.. మరోవైపు విప్రో పుణె బ్రాంచ్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కారణం ఏంటో తెలీదు గానీ ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో ఇంట్లోనే ఊరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇది తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు.. సచిన్‌ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ధులే సిటీకి తీసుకెళ్లారు. అలా దాదాపు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడి 24వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో తుదిశ్వాస విడిచాడు.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమున్న సచిన్.. అందుకు తగ్గట్లే ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు సినిమాలు, సిరీస్‌ల్లో నటిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం కూడా 'జమత్ర 2'లో తన పాత్ర గురించి పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే ఇలా ప్రాణాలు తీసుకోవడంతో సన్నిహితులు, సహ నటీనటులు షాక్ అవుతున్నారు. -
ఎలక్ట్రిక్ కారు కొన్న శంకర్ మహదేవన్.. ధర ఎంతంటే?
సంగీత దిగ్గజం శంకర్ మహదేవన్ (Shankar Mahadevan) లగ్జరీ కారు కొన్నాడు. ఎంజీ ఎమ్ 9 ఎలక్ట్రిక్ కారును తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో శంకర్ మహదేవన్.. కొత్త కారును ఇంటికి తీసుకొచ్చి హారతిచ్చాడు. అనంతరం కారు ముందు దర్జాగా నిలబడి ఫోటోలకు పోజిచ్చాడు.కారుఎంజీ ఎమ్9 మోడల్లో సీట్ మసాజ్, డ్యుయెల్ సన్‌రూఫ్, హీటింగ్, వైర్లెస్ చార్జింగ్ వంటి అనేక సదుపాయాలున్నాయి. సౌండ్ సిస్టమ్ కూడా అదిరిపోతుంది. కేవలం 30 నిమిషాల్లోనే దాదాపు 80 శాతం చార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 548 కి.మీ ప్రయాణించవచ్చు. ఈ కారు ధర రూ.80 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది.సింగర్‌గా, సంగీత దర్శకుడిగా..శంకర్ మహదేవన్ 1967లో జన్మించాడు. బాల్యంలోనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. చదువు పూర్తవగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. కొంతకాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠి, తుళు, పంజాబీ, హిందీ భాషల్లో అనేక పాటలు ఆలపించాడు. ఉట్టిమీద కూడు, ఏమి చేయమందువే.., ఒకటే జననం ఒకటే మరణం.., స్నేహమంటే ఇదేరా, ఓం మహాప్రాణ దీపం.., భం భం బోలే.., చంద్రుల్లో ఉండే కుందేలు.. అఖండ టైటిల్ సాంగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాడిన పాటలు చాలానే ఉన్నాయి. అలాగే ఎన్నో సినిమాలకు ఆయన మ్యూజిక్ కూడా అందించాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? -
14 ఏళ్ల బంధానికి స్వస్తి! భర్తకు టాలీవుడ్ హీరోయిన్ విడాకులు!
పెళ్లి అనేది మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా కనిపించే జంటలు కూడా చివరకు విడాకుల బాటలో పయనిస్తుండటం కొంత షాకింగ్‌గానే ఉంది. తాజాగా బుల్లితెర జంట జే భానుషాలి (Jay Bhanushali)- మహి విజ్ (Mahhi Vij) విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. 14 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మీకెందుకు చెప్పాలి?ఈ మేరకు కొద్ది నెలల క్రితమే విడాకులకు దరఖాస్తు చేశారట! ముగ్గురు పిల్లల్ని పంచుకోనున్నారట! గతంలోనూ ఈ దంపతులు విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. అప్పుడు మహి స్పందిస్తూ.. ఒకవేళ నిజంగా విడిపోయినా మీకెందుకు చెప్పాలి? మీరేమైనా నా చుట్టాలా? లాయర్ ఫీజు కడతారా? ఛాన్స్ దొరికిందని ఎవరినో ఒకర్ని నిందించడం తప్ప ఏమీ చేయరు అని సీరియస్ అయింది. బుల్లితెర జంటమహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్గా నటించింది. మలయాళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేసింది. వెండితెరను నమ్ముకోకుండా బుల్లితెరపైనే సెటిల్ అయిపోయింది. హిందీలో అనేక సీరియల్స్ చేసింది. జే భానుషాలి హేట్ స్టోరీ 2ల, దేసి కట్టే, ఏక్ పహేలీ లీలా సినిమాలు చేశాడు. బుల్లితెరపై పలు సీరియల్స్ చేశాడు. జే భానుషాలి, మహి 2011లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా నాచ్ బలియే సీజన్ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.ఐవీఎఫ్ ప్రయత్నాలుజే.. హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్లోనూ పాల్గొన్నాడు. సింగింగ్, డ్యాన్సింగ్ షోలకు యాంకరింగ్ చేస్తుంటాడు. జే- మహిలకు పెళ్లయిన తర్వాత చాలా ఏళ్లవరకు సంతానం కలగలేదు. దీంతో బాబు రాజ్వీర్, పాప ఖుషిలను 2017లో దత్తత తీసుకున్నారు. అప్పటికీ సంతానం కోసం ప్రయత్నించే క్రమంలో మూడుసార్లు ఐవీఎఫ్ ఫెయిలవగా నాలుగోసారికి సక్సెస్ అయింది. 2019లో ఐవీఎఫ్ ద్వారా కూతురు తార జన్మించింది. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్.. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే? -
బార్బీ బొమ్మలా యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ కు లాస్ట్ ఛాన్స్..
-
యాష్ బాలీవుడ్ ఎంట్రీ.. షారుఖ్ సినిమాలో విలన్ గా ఛాన్స్!
-
సినీ ఇండస్ట్రీలో పురుషాహంకారం.. ఎన్నో పోరాటాలు చేశా!
సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో తాను ఎన్నో పోరాటాలు చేశానని జాన్వీ కపూర్ వెల్లడించారు. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ టాక్ షోలో సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కొన్ని సమస్యలపై జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘‘ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. ఇక్కడికి వచ్చాకే కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాలి. ఈ విషయంలో ఎన్నో పోరాటాలు చేశాను.నలుగురు మహిళలు ఉన్న ప్రదేశంలో నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలను. అదే ప్రదేశంలో నలుగురు పురుషులు ఉంటే మాత్రం నా అభిప్రాయాన్ని నేను స్వేచ్ఛగా చెప్పలేక పోతున్నాను. ఎందుకంటే వారు నొచ్చుకోకుండా చె ప్పాలి. ఇందుకు చాలా నేర్పు కావాలి. ఒక్కోసారి మనల్ని మనం తక్కువ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు నచ్చని విషయాలను నచ్చలేదని స్ట్రయిట్‌గా చెప్పకుండా నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.కొన్నిసార్లు మౌనంగా ఉండి పోవాల్సి వచ్చింది. ఇలా ఎన్నో రాజకీయాలను ఎదుర్కొన్నాను’’ అని చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్. ఈ షోకు ఓ వ్యాఖ్యాతగా ఉన్న ట్వింకిల్ ఖన్నా కూడా జాన్వీ కపూర్ మాటలను స పోర్ట్ చేస్తూ, 1990 సమయంలో తాను ఈ తరహా పరిస్థితులను ఫేస్ చేశానని చె ప్పారు. -
షారుక్ ఖాన్ ఫిల్మ్ ఫెస్టివల్
బర్త్ డేకి ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేశారు షారుక్ ఖాన్. నవంబరు 2న షారుక్ 60వ బర్త్ డే. ఈ సందర్భంగా ‘షారుక్ ఖాన్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరిట షారుక్ నటించిన కొన్ని సూపర్‌హిట్ సినిమాలు ఈ నెల 31 నుంచి థియేటర్స్‌లో ప్రదర్శితం కానున్నాయి. ‘‘అక్టోబరు 31న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం అవుతుంది. ‘దిల్ సే, దేవ్‌దాస్, మై హూ నా, ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్’... ఇలా నా కెరీర్‌లోని కొన్ని సూపర్‌హిట్ సినిమాలు థియేటర్స్‌లో మళ్లీ ప్రదర్శితం కానున్నాయి. ఈ సినిమాల్లోని మనిషి (తనను తాను ఉద్దేశించి) మారలేదు. జస్ట్ హెయిర్ మాత్రం మారింది.ఇంకాస్త అందంగా తయారయ్యాడు. పీవీఆర్ ఐనాక్స్ అసోసియేషన్‌తో భారతదేశంలోని కొన్ని థియేటర్స్‌లో మాత్రమే ఈ సినిమాలు ప్రదర్శితం అవుతాయి. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూరప్ దేశాల్లో వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిల్మ్స్) సంస్థ ఈ సినిమాలను రిలీజ్ చేస్తోంది’’ అని షారుక్ పేర్కొన్నారు. అక్టోబరు 31న ప్రారంభమయ్యే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నవంబరు 14 వరకు కొనసాగుతుందట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘కింగ్’ సినిమాతో షారుక్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంతో ద్వారా కుమార్తె సుహానా నటిగా పరిచయం కానున్నారు. -
బాలీవుడ్ ఎంట్రీ?
తమిళ హీరో శివ కార్తికేయన్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందనే టాక్ తెరపైకొచ్చింది. ‘దేవదాస్, రామ్‌లీల, పద్మావత్’ వంటి సూపర్‌హిట్ సినిమాలను తెరకెక్కించిన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్‌కు వెళ్లొచ్చారు శివ కార్తికేయన్. దీంతో భన్సాలీతో ఈ హీరో ఓ సినిమా చేయనున్నారనే టాక్ బాలీవుడ్లో ఊపందుకుంది.మరి... భన్సాలీ దర్శకత్వంలోని సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తారా? లేక శివ కార్తికేయన్ హిందీలో నటించే తొలి సినిమాకు భన్సాలీ నిర్మాతగా ఉంటారా? అనే విషయాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ చిత్రం ‘లవ్ అండ్ వార్’తో బిజీగా ఉన్నారు సంజయ్ లీలా భన్సాలీ. ఈ సినిమా రిలీజ్ తర్వాత శివ కార్తికేయన్‌తో భన్సాలీ సినిమా గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
లెక్క తగ్గేదే లే! నవంబరులోనూ సినిమాల సందడి
అక్టోబరు నెలలో చిన్నా పెద్దా కలుపుకుని దాదాపు డజను సినిమాలకు పైగానే విడుదలయ్యాయి. ఫైనల్లీ ‘మాస్ జాతర, ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాల విడుదల (అక్టోబరు 31)తో ఈ నెల ముగుస్తుంది. ఆ తర్వాత మొదలయ్యే నవంబరులోనూ ‘లెక్క తగ్గేదే లే’ అంటూ... సినిమాల సందడి జోరుగా ఉండబోతోంది. ‘జటాధర, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా, ది గర్ల్ ఫ్రెండ్’ వంటి పలు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా పలు బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ కూడా ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం...యాక్షన్ డ్రామా... మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించిన తాజా పాన్ ఇండియన్ చిత్రం ‘వృషభ’. రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేష్, నయన సారిక ముఖ్య పాత్రలు పోషించారు. నందకిశోర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్, అభిషేక్ ఎస్. వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం నవంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, మలయాళ భాషల్లోనే కాదు... హిందీ, కన్నడలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ‘‘హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘వృషభ’లో అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. బంధాలు, త్యాగాల కలయికగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్పగా కనెక్ట్ అవుతుంది. అలాగే చక్కని అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. సరికొత్త ప్రేమకథ ఓ వైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా దూసుకెళుతున్నారు రష్మికా మందన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాలో రష్మికకి జోడీగా దీక్షిత్ శెట్టి నటించారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ మూవీ నిర్మించారు.ఈ సినిమా నవంబరు 7న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ‘‘సరికొత్త ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీని తనదైన శైలిలో చక్కగా తెరకెక్కించారు రాహుల్ రవీంద్రన్. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టిల జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. సూపర్ నేచురల్ బ్యాక్‌డ్రాప్‌లో... సుధీర్ బాబు హీరోగా రూపొందిన పాన్ ఇండియన్ చిత్రం ‘జటాధర’. ఈ సినిమాలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, అవసరాల శ్రీనివాస్, రవిప్రకాశ్, ఇందిరా కృష్ణన్, రోహిత్ పాఠక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సాల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సుధీర్ బాబు పాత్ర కొత్తగా ఉండనుంది.బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా ధన పిశాచి అనే పవర్ఫుల్ రోల్ చేశారు. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘జటాధర’. అద్భుతమైన కథ, భావోద్వేగాలతో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతి ఇచ్చేలా ఉంటుంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఎంతో కష్టపడ్డారు. రాయిస్, జైన్, సామ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే విడుదల కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సినీ ప్రయాణంలో ‘జటాధర’ ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.మైథలాజికల్ థ్రిల్లర్ రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చిరంజీవ’. ఈ సినిమాకి ‘జబర్దస్త్’ ఫేమ్ అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కుషిత హీరోయిన్ గా నటించగా, శ్రీరంజని, అమిత్ భార్గవ్, గడ్డం నవీన్, ఇమ్మాన్యుయేల్, టేస్టీ తేజ కీలక పాత్రధారులు. స్ట్రీమ్ లైన్ ప్రోడక్షన్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్, సుహాసిని నిర్మించారు. ఈ మూవీని నేరుగా ఆహా ఓటీటీలో నవంబరు 7న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దసరా పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం టీజర్లో ‘నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటో తెలుసా?.. అంబులెన్స్ డ్రైవర్.. ’ వంటి డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. ‘‘మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘చిరంజీవ’. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నారు. తనకి సూపర్ పవర్స్‌తో పాటు ఎవరి చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలిసే పవర్ ఉంటుంది. ఈ పవర్స్ వల్ల శివ ఎలా లాభపడ్డాడు? ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడు? వంటి విషయాలు మా చిత్రంలో ఆసక్తిగా ఉంటాయి’’అని మేకర్స్ తెలిపారు. నవ్వుల్ నవ్వుల్ ‘మసూద’ (2022) సినిమాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తిరువీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్గా నటించారు. 7 పి.ఎం ప్రోడక్షన్స్, పప్పెట్ షో ప్రోడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేసిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘ఈ మూవీ టీజర్ చూడగానే సినిమా చూడాలనిపిస్తోంది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడానికి ధైర్యం, ΄్యాషన్ ఉండాలి’’ అంటూ శేఖర్ కమ్ముల చెప్పడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కథ వింటున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ కథ నచ్చడంతో పప్పెట్ షో అనే బ్యానర్‌ని స్థాపించి, పారితోషికం తీసుకోకుండా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యాను’’ అని తిరువీర్ పేర్కొనడం విశేషం. పీరియాడికల్ డ్రామా ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సముద్ర ఖని కీలక పాత్ర పోషించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ ΄÷ట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్ కానుంది.‘‘పీరియాడికల్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘కాంత’. 1950 చెన్నై నేపథ్యంతో పాటు గోల్డెన్ ఏజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రమిది. అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఝను చంతర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ, వింటేజ్ లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. వినోదాల సంతాన ప్రాప్తిరస్తు విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, తరుణ్ భాస్కర్, శ్రీలక్ష్మి, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్యకృష్ణ, తాగుబోతు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్ అవుతోంది.‘‘మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఒక సమకాలీన అంశాన్ని కథలో చూపిస్తూ వినోదాత్మకంగా తీశాడు సంజీవ్ రెడ్డి. విక్రాంత్, చాందినీ చౌదరి జోడీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలోని వినోదం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కల్యాణి ఓరుగంటి పాత్రలో చాందినీ చౌదరి ఆకట్టుకోనున్నారు. రచయిత షేక్ దావూద్ జి. అందించిన స్క్రీన్ ప్లే మా చిత్రానికి అదనపు ఆకర్షణ. సునీల్ కశ్యప్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. వీరాభిమాని సందడి రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ ΄÷లిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈ మూవీలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, తులసి రామ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరు 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో సూర్య కుమార్ అనే ఆన్ స్క్రీన్ సూపర్ హీరో పాత్రలో నటిస్తున్నారు ఉపేంద్ర. ఆయన వీరాభిమానిగా రామ్ కనిపించనున్నారు.వివేక్– మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం కోసం రామ్ స్వయంగా ఓ పాట పాడటం విశేషం. ‘‘ఈ చిత్రంలో సూపర్ స్టార్ సూర్య కుమార్ (ఉపేంద్ర) వీరాభిమాని సాగర్‌గా రామ్ నటిస్తున్నారు. ఆయన నటన సూపర్బ్‌గా ఉంటుంది. ప్రతి హీరో అభిమాని... రామ్ పాత్రలో తమను తాము చూసుకుంటారు. భాగ్యశ్రీ అందం, అభినయం ఈ చిత్రానికి ప్లస్. తొలి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ ΄÷లిశెట్టి’తో పెద్ద విజయాన్ని అందించిన డైరెక్టర్ మహేశ్‌బాబు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే మరో మంచి కథతో రాబోతున్నాడు. టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు నవంబరులో విడుదలకు ముస్తాబయ్యే అవకాశాలున్నాయి. టాలీవుడ్లోనే కాదు... బాలీవుడ్లో, హాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇమ్రాన్ హష్మి, యామీ గౌతమ్ జోడీగా నటించి ‘హక్’ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. అలాగే ‘ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్’ అనే హాలీవుడ్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఇక అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, రకుల్‌ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ ‘దే దే ΄్యార్ దే 2’ నవంబరు 14న విడుదల కానుంది. అదే విధంగా అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించిన ‘120 బహదూర్’ అనే హిందీ చిత్రం, ‘వికెడ్ 2’ అనే హాలీవుడ్ మూవీ నవంబరు 21న రిలీజ్ అవుతున్నాయి. అలాగే ధనుష్, కృతీ సనన్ జోడీగా నటించిన హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’, ‘జూటోపియా 2’ అనే హాలీవుడ్ మూవీ నవంబరు 28న విడుదలకు ముస్తాబయ్యాయి. వీటితో పాటు మరికొన్ని మూవీస్ కూడా రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
శారీరక సంబంధాలు తప్పే కాదన్న హీరోయిన్స్.. షాకైన జాన్వీ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna), కాజోల్ (Kajol) టూ మచ్ అనే టాక్ షో హోస్ట్ చేస్తున్నారు. పేరుకు తగ్గట్లుగానే కొన్ని విషయాల్లో కాస్త టూమచ్‌గా మాట్లాడేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్లో వారి కామెంట్స్ విని హీరోయిన్ జాన్వీ కపూర్ షాకవ్వాల్సిన పరిస్థితి! ఇంతకీ ఏం జరిగింది? టూమచ్‌గా ఏం మాట్లాడారో చూసేద్దాం..ఎమోషనల్ చీటింగ్ పెద్ద తప్పు!'టూమచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్' షోకి జాన్వీకపూర్ (Janhvi Kapoor), కరణ్ జోహార్ హాజరయ్యారు. ఈ నలుగురు శారీరక బంధం (ఫిజికల్ రిలేషన్), ఎమోషనల్ కనెక్షన్ (ఎమోషనల్ రిలేషన్) గురించి చర్చ మొదలుపెట్టారు. ఫిజికల్ చీటింగ్ కన్నా ఎమోషనల్ చీటింగ్ పెద్ద ద్రోహం అని కాజోల్, ట్వింకిల్, కరణ్ ఏకాభిప్రాయానికొచ్చారు. కానీ, జాన్వీ ఎటూ తేల్చుకోలేకపోయింది. తన దృష్టిలో రెండూ తప్పేనని సమాధానమిచ్చింది. అందుకు హోస్ట్స్ ఒప్పుకోలేదు. పార్ట్నర్స్.. శారీరకంగా వేరేవారితో సంబంధం పెట్టుకోవడం అసలు మ్యాటరే కాదన్నట్లుగా మాట్లాడారు. ఆ ఎఫైర్స్ తప్పు కావుకరణ్ (Karan Johar) కూడా.. ఫిజికల్ చీటింగ్ వల్ల బంధాలేమీ కుప్పకూలవు అన్నాడు. దాన్ని జాన్వీ సమర్థించలేదు.. వేరేవారితో కనెక్షన్ పెట్టుకుంటే కచ్చితంగా రిలేషన్స్ పాడవుతాయని వాదించింది. ఎమోషనల్ చీటింగ్, ఫిజికల్ చీటింగ్.. రెండూ తప్పేనని బల్లగుద్ది చెప్పింది. అందుకు ట్వింకిల్ స్పందిస్తూ.. తనింకా 20'sలో ఉంది కదా.. ఇలాగే ఉంటదిలే.. 50 ఏళ్లు వచ్చాక మనం చెప్పేదే కరెక్ట్ అంటుంది. మనం చూసినవేవీ ఇంకా తను చూడలేదుకదా! అని కాజోల్, ట్వింకిల్ సెటైర్లు వేశారు. ఛీ, ఇలా ఉన్నారేంటి?వీరి అభిప్రాయాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రియుడు లేదా భర్త ఇంకొకరితో సంబంధం పెట్టుకుని మోసం చేస్తే తప్పు కాదా? ఛీ, ఇలా ఉన్నారేంటి? అని తిట్టిపోస్తున్నారు. అదే సమయంలో జాన్వీ మెచ్యురిటీని అభినందిస్తున్నారు. కాగా హీరోయిన్ ట్వింకిల్‌కు అక్షయ్ కుమార్‌తో 2001లో పెళ్లయింది. అంతకంటే ముందు అక్షయ్‌కు రవీనా టండన్‌తో ఎంగేజ్మెంట్ అయంది, కానీ, అది పెళ్లివరకు రాకుండానే రద్దయిపోయింది. అలాగే శిల్పా శెట్టితోనూ ప్రేమాయణం సాగించాడు. కానీ అది సుఖాంతం కాలేదు.కొన్ని వినబడనట్లే ఉండాలి!కాజోల్ విషయానికి వస్తే.. అజయ్ దేవ్‌గణ్‌ను 1999లో పెళ్లాడింది. ఈ పెళ్లికంటే ముందు అజయ్.. కరిష్మా కపూర్‌తో కొంతకాలం లవ్‌లో ఉన్నాడు. ఆమెతో బ్రేకప్ అయ్యాక కాజోల్‌తో ప్రేమలో పడ్డాడు. దాదాపు 26 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. తన దాంపత్య జీవితం గురించి కాజోల్ ఓసారి మాట్లాడుతూ.. భర్త విషయంలో కొన్ని చూసీచూడనట్లుగా ఉండాలి, వినకూడనివి వినాల్సి వచ్చినా సరే.. వాటిని వెంటనే మర్చిపోవాలి. అదే నా సంసార జీవితం చక్కగా సాగేందుకు దోహదపడుతోంది అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.చదవండి: అల్లు అర్జున్ స్పెషల్ వీడియో.. రెండు లారీల థాంక్స్ చెప్పిన నాగ్ -
ఇషా, ఆకాష్ అంబానీ బర్త్‌డే పార్టీ : తరలి వెళ్లిన తారలు
రిలయన్స్ సామ్రాజ్యవారసులు, యువ పారిశ్రామిక వేత్తలు, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ పుట్టిన రోజు వేడుకలకోసం అంబానీ ఫ్యామిలీ మరో గ్రాండ్ పార్టీని ఏర్పాడు చేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇషా , ఆకాష్ అంబానీల గ్రాండ్ బర్త్‌డే పార్టీ ఫోటోలు ,వీడియోల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కవల పిల్లలు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ అక్టోబర్ 23న తమ 34వ పుట్టినరోజును జరుపుకున్నారు. బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేతోపాటు, అనన్య పాండే, కరణ్ జోహార్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు అనన్య, కరణ్ జోహార్ ఈ వేడుకలకు హాజరయ్యారు.పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్, షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, దిశా పటానీ, అర్జున్ కపూర్, ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ తదితర సెలబ్రిటీలు జామ్‌నగర్‌కు చేరుకున్నారు. ప్రింటెడ్ హాఫ్-స్లీవ్ షర్ట్, ఫ్రేమ్ ఉన్న సన్ గ్లాసెస్‌తో దీపికాతోపాటు, రణ్వీర్ సింగ్ నల్ల ప్యాంటు , బిగ్ సైజు తెల్లటి టీ-షర్టులో క్యాజువల్ లుక్‌లో విమానాశ్రయంలో దర్శన మిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడిగా మారాయి. ఈ ట్విన్స్ బర్త్‌డే సందర్భంగా ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇషా అంబానీతో ఉన్న సెల్ఫీని షేర్ చేసి, "హ్యాపీ బర్త్‌డే! అంటూ విషెస్ తెలిపింది. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్) View this post on Instagram A post shared by Snehkumar Zala (@sneyhzala) -
ఆశ్చర్యం.. ఐటమ్ బ్యూటీ ఇంత మోసం చేసిందా?
సామాన్యులైనా సెలబ్రిటీలు అయినా సరే మనుషులే. కాబట్టి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం లాంటివి చేస్తుంటారు. ఈసారి బాలీవుడ్ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరా.. అలాంటి ఓ పొరపాటు చేసి దొరికిపోయింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇంతకీ అసలేమైంది? ఏంటి విషయం?ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరాకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే 'గబ్బర్ సింగ్' చిత్రంలో కెవ్వు కేక పాటలో డ్యాన్స్ చేసి ఇక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది. చాన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మలైకా.. ఈ మధ్యనే మళ్లీ సాంగ్స్ చేస్తోంది. రీసెంట్గా థియేటర్లలో రిలీజైన 'థామా'లోనూ ఓ క్రేజీ సాంగ్ చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా 50వ పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు) సినిమా సెలబ్రిటీ.. బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం, సెలబ్రిటీలు సందడి చేయడం సాధారణమే. అయితే మలైకా తన 50వ పుట్టినరోజు అని చెప్పింది. కానీ నెటిజన్లు మాత్రం ఆమె అబద్ధం చెబుతోందని అంటున్నారు. ఎందుకంటే గతంలో 2019లో 46వ బర్త్ డేని జరుపుకొంది. అంటే ఇప్పుడు 52వ ఏడాదిలోకి వస్తుంది. కానీ విచిత్రంగా కేక్‌పైన 50 అని నంబర్ కనిపించింది. వికిపీడియా లేని టైంలో ఇలాంటివి ఏమైనా చేశారంటే సరేలే అనుకోవచ్చు. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలోనూ ఇలాంటి రెండేళ్ల వయసు తగ్గించుకోవడం ఏంటోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.మలైకా విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ని 1998లో పెళ్లి చేసుకుంది. కానీ 2017లో విడాకులు ఇచ్చేసింది. వీళ్లకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నారు. అర్భాజ్కి విడాకులు ఇచ్చేసిన తర్వాత మలైకా.. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉంటోంది.(ఇదీ చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న 'జయం' చైల్డ్ ఆర్టిస్ట్) -
పెళ్లి పేరుతో మోసం : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు, సచిన్ సంఘ్వి (Sachin Sanghvi) పై లైంగిక ఆరోపణలు సంచలనం రేపాయి. మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని నమ్మిం,ఇ వివాహం హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.సచిన్-జిగర్ జంటలోని సంగీత దర్శకుడు, తమ్మా, స్త్రీ 2, భేదియా , జరా హట్కే, జరా బచ్కే వంటి చిత్రాలకు హిట్ పాటలతో పాపులర్ అయిన సంఘ్విని లైంగిక ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అయితే అనంతరం బెయిల్‌పై విడుదలైనారు. తన 20 ఏళ్ల వయస్సులో, ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం ఏర్పడిందని, అతను ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనమ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని, వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత ఆమెను తన స్టూడియోకు పిలిపించి, పెళ్లి ప్రపోజ్ చేశాడని, తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసు అధికారి తెలిపారు. చదవండి: వైద్యురాలిపై పోలీసుల అఘాయిత్యం, అరచేతిలో సూసైడ్ నోట్ కలకలంఇది ఇలా ఉంటే ఈ కేసులో సచిన్ సంఘ్వి తరపున వాదిస్తున్న న్యాయవాది ఆదిత్య మిథే తన క్లయింట్‌పై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించారు. సంఘ్వీ అరెస్ట్ చట్టవిరుద్ధం అన్నారు. ఈ విషయంపై సచిన్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అతని అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా @soulfulsachin ఇన్‌యాక్టివ్‌గా ఉంది. అటు జిగర్ కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.కాగా రష్మిక మందన్న , ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించి , దీపావళికి విడుదలైన థమ్మాకి సచిన్ అండ్ జిగర్ సంగీతం అందించారు. గత ఏడాది స్త్రీ 2 కోసం ఈ ద్వయం స్వర పర్చిన చేసిన "ఆజ్ కీ రాత్" బాగా హిట్అయిన సంగతి తెలిసిందే.చదవండి: కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే! -
ఖరీదైన కారు కొన్న బాలీవుడ్ హీరో.. ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar) ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. దాదాపు మూడు కోట్లకు పైగా విలువైన మెర్సిడెజ్ బెంజ్‌ను తన సొంతం చేసుకున్నారు. ముంబయిలోని బాంద్రాలో తన కొత్త కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫర్హాన్ తన భార్య శిబానీ దండేకర్‌తో కలిసి కనిపించారు. ఈ లగ్జరీ కారును ఇతర బాలీవుడ్ ప్రముఖులు దీపికా పదుకొనే, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, కృతి సనన్ గతంలోనే కొన్నారుఇక సినిమాల విషయానికొస్తే ఫర్హాన్ అక్తర్ 120 బహదూర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని రెజాంగ్ లా యుద్ధం (1962) నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత మేజర్ షైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి రజనీష్ రాజీ ఘాయ్ దర్శకత్వం వహించారు. అమిత్ చంద్రతో కలిసి ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్‌కపుల్
బాలీవుడ్లో స్వీటెస్ కపుల్ అనగానే గుర్తొచ్చే జంట సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్. తాజాగా దీపావళి సందర్బంగా గుడ్ న్యూస్ చెప్పారు. ముంబైలోని తమ డ్రీమ్ హౌస్గురించి కొన్ని అద్భుతమైన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.ఇటీవల తన ప్రేమమందిరం గురించి యూట్యూబ్ వ్లాగ్‌లో పంచుకున్న సోనాక్షి, ఇక్భాల్ జంట అందమైన ఇల్లు కుటుంబ సభ్యులతోపాటు , దబాంగ్ బ్యూటీ ,భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి తన ముంబైలోని కొత్త ఇంటిని అభిమానులకు చూపించింది. కొన్ని స్టైలిష్, రొమాంటిక్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఇవి అభిమానులకు ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ జంట తమ వివాహానికి ముందే ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశామని, తన డ్రీమ్ హౌస్ పునరుద్ధరణ పనులు చేపట్టామని వెల్లడించింది. వంటగది ,లివింగ్ స్పేస్ గురించి వివరించారు ఇద్దరూ. ఈ సందర్బంగా ఇంటీరియర్ డిజైనర్ పాయల్ మక్వానా , గార్నెట్ కాంట్రాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు శుభ్రమైన, స్వచ్ఛమైన ప్లేస్‌ను ఊహించుకున్నానని సోనాక్షి అంటే, జహీర్ తనకు గట్టి ఫర్నిచర్ కావాలని "కాబట్టి ఎవరైనా దానిపై ఎప్పుడైనా నృత్యం చేయవచ్చు" అని చమత్కరించిన సంగతి తెలిసిందే.సోనాక్షి అప్‌కమింగ్ యాక్షన్ చిత్రం "జటాధార" నవంబర్ 7న తెలుగు, హిందీ భాషలలో థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో సోనాక్షి ఇంతకు ముందెప్పుడూ చూడని, విలక్షణమైన కొత్త అవతారంలో సూపర్ నేచురల్ విలన్‌గా కనిపించనుంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో సుధీర్ బాబు, దివ్య ఖోస్లా , శిల్పా శిరోద్కర్ కూడా నటించారు. -
స్టార్ హీరోయిన్ బర్త్ డే.. విషెస్ చెప్పిన మాజీ ప్రియుడు!
బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలో పాయిజన్ బేబీ పాట అనే ఐటమ్ సాంగ్‌తో అలరించింది. అంతేకాకుండా ఆమె ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ సిరీస్‌లో జడ్జిగా వ్యవహరిస్తోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇవాళ 53వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పలువురు సినీతారలు మలైకాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మలైకా పుట్టినరోజున ఆమె మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ సైతం బర్త్ డే విషెస్ చెప్పారు. ఆమె ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే మలైకా.. మీరు ఎప్పుడు ఇలాగే ఎగురుతూ.. నవ్వుతూ ఉండాలి.. అంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన మలైకా తన మాజీ ప్రియుడి పోస్ట్‌కు రిప్లై కూడా ఇచ్చింది. ధన్యవాదాలు అంటూ లవ్ సింబల్ ఎమోజీని జతచేసింది. కాగా.. ఈ ఏడాది జూన్‌లో అర్జున్ కపూర్ పుట్టినరోజున.. మలైకా సోషల్ మీడియా ద్వారా అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపింది.అర్జున్ కపూర్‌తో డేటింగ్..మలైకా అరోరా- అర్జున్ కపూర్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు గతేడాది విడిపోయినట్లు తెలిసింది. దీపావళి సందర్భంగా ఓ ఈవెంట్లో మాట్లాడిన అర్జున్ కపూర్.. తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానంటూ మలైకాతో బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చాడు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో ఆమె తండ్రి అనిల్ మెహతా మరణించిన తర్వాత అర్జున్ కపూర్ ఆమెను ఇంటికెళ్లి పరామర్శించాడు. ఇటీవలే వీరిద్దరు ముంబయిలో జరిగిన హోమ్‌బౌండ్ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకరినొకరు హృదయపూర్వకంగా చిరునవ్వుతో పలకరించుకున్నారు.అర్బాజ్ ఖాన్‌తో పెళ్లి- విడాకులు..కాగా.. మలైకా అరోరా గతంలో అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. 1998లో వివాహం చేసుకున్న ఈ జంటకు అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. వీరిద్దరు 2016లో విడిపోతున్నట్లు ప్రకటించి.. 2017లో విడాకులు తీసుకున్నారు. -
పండగపూట ప్రమాదం.. నా భుజం వరకు మంటలు..: బుల్లితెర నటి
దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఇంటి ముంగిట దీపాలు వెలిగించడంతో పాటు పలురకాల పటాసులు కాలుస్తుంటారు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హిందీ బిగ్‌బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్, బుల్లితెర నటి ప్రియా మాలిక్ (Priya Malik) కూడా అందరిలాగే దీపావళిని వేడుకగా సెలబ్రేట్ చేసుకుంది. ఇరుగుపొరుగువారితో కలిసి ఫోటోలు దిగింది. ఈ సమయంలో తన వెనకున్న దీపానికి ఆమె డ్రెస్ అంటుకుంది.ఫోటోలు దిగుతుండగా..క్షణాల వ్యవధిలోనే అది పెద్ద మంటగా మారింది. కుడి భుజం దగ్గరివరకు అగ్నిరవ్వలు ఎగిసిపడ్డాయి. అది చూసిన నటి తండ్రి.. ఆమె డ్రెస్ చింపేశి ఆమెను కాపాడాడు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ఈ సంఘటన తల్చుకుంటేనే భయంగా ఉంది. నేను, నా కుటుంబసభ్యులు ఇంకా షాక్‌లోనే ఉన్నాం. ఫోటోలు దిగే సమయంలో నా డ్రెస్‌కు నిప్పంటుకుంది. నన్ను కాపాడటం కోసం నాన్న డ్రెస్ చింపేశాడు. దానివల్లే నేను బతికిబట్టకట్టాను.నాకే ఆశ్చర్యం!చాలామంది ఏమనుకుంటారంటే.. ఇలాంటివి మనకెందుకు జరుగుతాయిలే అని లైట్ తీసుకుంటారు. కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల నా ప్రాణాలే పోయేవి. నాన్న హీరోలా వచ్చి కాపాడాడు. భుజాలు, వీపు, చేతివేళ్లపై కాలిన గాయాలున్నాయి. చిన్నపాటి గాయాలతో బయటపడ్డందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. సంతోషకర విషయమేంటంటే.. ఆ ప్రమాదం జరిగిన సమయంలో నా చేతిలో నా కొడుకు లేడు అని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ 9తో పాపులర్ అయిన ప్రియ మాలిక్.. 2022లో ఎంటర్ప్రెన్యూర్ కరణ్ బక్షిని పెళ్లాడింది. వీరికి 2024లో కుమారుడు జోరావర్ జన్మించాడు.చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ -
దీపికా పదుకోన్ దివాలీ సర్ప్రైజ్.. మహారాణిలా బుజ్జి ‘డింపుల్ క్వీన్’ (ఫొటోలు)
-
ఓటీటీలో ఒళ్లు గగుర్పొడ్చే హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ జోనర్ చిత్రాలకు ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇలాంటి చిత్రాలు చూసేందుకు ఓటీటీ ప్రియులు ఎప్పుడు ఆసక్తి చూపిస్తుంటారు. 2023లో విడుదలై నేషనల్ అవార్డ్ దక్కించుకున్న హారర్ మూవీ వాష్. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గుజరాతీలో తెరకెక్కించిన ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేశారు.ఈ చిత్రానికి సీక్వెల్‌గా వాష్ లెవెల్-2 మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. రిలీజైన రెండు నెలల్లోపే డిజిటల్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 22 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది. గుజరాతీ భాషతో పాటు హిందీలోనూ అందుబాటులోకి రానుంది. అయితే సౌత్ భాషల్లో మాత్రం స్ట్రీమింగ్ కావడం లేదు. కాగా.. ఈ చిత్రానికి కృష్ణదేవ్ యాగ్నిక్ దర్శకత్వం వహించారు. Darr ka mahaul hai. Iss baar bachna hoga mushkil 👀 Watch Vash Level 2, out 22 October, on Netflix.#VashLevel2OnNetflix pic.twitter.com/5fIrKyBR5J— Netflix India (@NetflixIndia) October 21, 2025 -
పింక్ బాల్ ఈవెంట్ : ష్యాషన్‌తో మెస్మరైజ్ చేసిన తల్లీ కూతుళ్లు (ఫొటోలు)
-
విలక్షణం, విశిష్టం 'కుమార్ సాను' గాత్రం!
(అక్టోబర్ 20 ప్రముఖ గాయకుడు 'కుమార్ సాను'(Kumar Sanu) పుట్టినరోజు)“సాంసోం కీ జరూరత్ హై జైసే జిందగీ కే లియేబస్ ఎక్ సనమ్ చాహియే ఆషికీ కే లియే!”80s కిడ్స్‌కి పరిచయం అక్కర్లేని పాట ఇది. ఈ పాట పాడినవారికి కూడా పరిచయం అక్కర్లేదనుకోండి! దశాబ్దానికి పైగా బాలీవుడ్ సినీ సంగీతాన్ని ఏలిన మెలోడీ కింగ్ కేదార్ నాథ్ భట్టాచార్య ఉరఫ్ కుమార్ సాను పాడిన పాట ఇది.నదీమ్-శ్రవణ్‌తో స్వర ప్రయాణం:నదీమ్-శ్రవణ్ జోడీతో కలిసి 'కుమార్ సాను'(Kumar Sanu) పాటలు పాడిన కాలాన్ని బాలీవుడ్ కి స్వర్ణ యుగంగా చెప్పకోవచ్చు. ‘ఆషికీ’లో ప్రతి పాటా ఎన్ని వందలసార్లు విన్నా ఎప్పటికీ పాతబడదు. ‘సాంసోంకీ జరూరత్’, ‘తూ మేరీ జిందగీ హై’, ‘నజర్ కే సామ్ నే’ ఎంత మెలోడీయస్ గా ఉంటాయో ‘అబ్ తేరే బిన్’ అంత ఆవేశపరుస్తుంది. కాబట్టే ఈ పాట కుమార్ సానుకి ఫిలింఫేర్ అవార్డు తెచ్చి పెట్టింది. 1991లో ఈ పాటకుగాను మొదటిసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్న కుమార్ సాను వరసగా ఐదేళ్ళు, అంటే 1995 వరకు ఈ అవార్డు అందుకుంటూనే ఉన్నారు. ‘సాజన్’లోని ‘మేరా దిల్ భీ కిత్నా పాగల్ హై’ కుమార్ సాను ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్న పాటల్లో ఒకటి. గొంతులో ఒక రకమైన జీరతో, నాసల్ వాయస్లో పాడే కుమార్ సాను మెలోడీస్ వింటే చాలు అప్పట్లో సంగీత ప్రియుల గుండెలు విలవిల్లాడిపోయేవి. ‘దిల్ హై కె మాన్తా నహీ’ టైటిల్ సాంగ్, ‘తుమ్హే అప్నా బనానే కీ కసమ్’ (సడక్), ‘ధీరే ధీరే ప్యార్ కో బఢానా హై’ (ఫూల్ ఔర్ కాంటే), ‘గవా హై చాంద్ తారే’ (దామిని), ‘సోచేంగే తుమ్హే ప్యార్ కర్కే నహీ’ (దీవానా), ‘ఘూంఘట్ కీ ఆడ్ సే’ (హమ్ హై రాహీ ప్యార్ కే), ‘పర్ దేసీ జానా నహీ’ (రాజా హిందూస్తానీ), ‘దో దిల్ మిల్ రహే హై’, ‘మేరీ మెహబూబా’ (పర్ దేస్)- ఇలా నదీమ్-శ్రవణ్ స్వరపరిచిన పాటలను కుమార్ సాను తన గొంతుకతో ఎవర్ గ్రీన్ హిట్స్ గా మలిచారు. మొత్తమ్మీద ఈ జోడీ కాంబినేషన్ లో కుమార్ సాను 300 దాకా పాటలు పాడారు. అను మల్లిక్‌తో :నదీమ్ శ్రవణ్ తర్వాత కుమార్ సాను ఎక్కువగా పని చేసింది అను మల్లిక్ కే. ‘బాజీగర్’ కోసం కుమార్ సాను పాడిన ‘యే కాలీ కాలీ ఆంఖే’ ఫిలింఫేర్ సాధించుకుంది. అనుమల్లిక్ స్వర కల్పనలో కుమార్ సాను ‘చురాకే దిల్ మేరా’ లాంటి ఎన్నో హిట్ నంబర్స్ పాడారు. ‘దిల్ జలే’ లోని ‘జిస్కే ఆనే సే’ అనే పాట లిరిక్స్, కంపోజిషన్ పరంగా ‘ఎక్ లడ్కీ కో దేఖా తో’ పాటను పోలి ఉన్నా దానికి వచ్చినంత గుర్తింపు అయితే రాలేదు. కానీ కుమార్ సాను పాడిన క్లాసిక్ సాంగ్స్ లో ఇదీ ఒకటి. 1990ల నాటి బ్యాక్ గ్రౌండ్ తో ఆయుష్మాన్ ఖురానా, భూమి పడ్నేకర్ హీరో హీరోయిన్లుగా 2015లో వచ్చిన సినిమా ‘దమ్ లగాకే హైషా’. 90ల నాటి సినిమా గనక నేచరల్ గానే ఇందులోని హీరో హీరోయిన్లకు కుమార్ సాను పాటలంటే పిచ్చి అన్నట్లు చూపిస్తారు. ఈ సినిమాలో అను మల్లిక్, కుమార్ సానుతో రెండు పాటలు పాడించారు. ఒక పాటలో ఆయన కేమియో అప్పియరెన్స్ కూడా ఇచ్చారు. జతిన్-లలిత్‌తో:జతిన్-లలిత్ కాంబినేషన్ లో కుమార్ సాను పాడిన మెలొడీలు శ్రోతలను తన్మయత్వంలో ఓలలాడిస్తాయి. "దిల్ వాలే దుల్హనియా లేజేయేంగే" కోసం కుమార్ సాను లతా మంగేష్కర్ తో కలిసి పాడిన ‘తుఝే దేఖా తో యే జానా సనమ్’ ఇప్పటికైనా ఎప్పటికైనా మర్చిపోగలమా? ‘సీనే మే దిల్ హై’, ‘తు మేరే సాథ్ సాథ్’ (రాజు బన్ గయా జంటిల్ మ్యాన్), ‘ఐ కాష్ కే హమ్’(కభీ హా కభీ నా), ‘మై కోయీ ఐసా గీత్ గావూ’, ‘ఏక్ దిన్ ఆప్’(యస్ బాస్),‘దుష్మన్’ కోసం లతా మంగేష్కర్తో కలిసి పాడిన ‘ప్యార్ కో హో జానే దో’ లాంటి పాటలు షారుఖ్ ఖాన్ కెరీర్ లో మైలురాళ్ళ లాంటివి. కానీ జతిన్ లలిత్ కాంబినేషన్ లో కుమార్ సాను పాడిన ‘జబ్ కిసీ కీ తరఫ్’ (ప్యార్ తో హోనా హీ థా) వీటన్నింటినీ మించిన ఆల్ టైం హిట్. ఇక ‘ఖూబ్ సూరత్’సినిమా కోసం కవితా కృష్ణమూర్తితో కలిసి కుమార్ సాను పాడిన‘మేరా ఎక్ సప్నా హై’వింటే కలల్లో తేలిపోవడం ఖాయం. రాజేశ్ రోషన్‌తో:‘జబ్ కోయి బాత్ బిగడ్ జాయే’ – జుర్మ్ సినిమా కోసం రాజేశ్ రోషన్ మ్యూజిక్ డైరెక్షన్ లో కుమార్ సాను పాడిన ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘కరణ్ అర్జున్’, ‘సబ్సే బడా ఖిలాడీ’, ‘కోయ్ లా’, ‘క్యా కెహ్ నా’ లాంటి సినిమాలు వచ్చాయి. 1996లో వచ్చిన ‘పాపా కెహ్తే హై’ అట్టర్ ఫ్లాప్ సినిమా. కానీ రాజేశ్ రోషన్ పాటలు మాత్రం సూపర్ హిట్. ఇందులో ఉదిత్ నారాయణ్ పాడిన ‘ఘర్ సే నికల్తే హీ’తో పాటు కుమార్ సాను పాడిన ‘యే జో థోడే సే హై పైసే’, ‘ప్యార్ మే హోతా హై క్యా జాదూ’ పాటలు చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. ఇక ‘కహో నా ప్యార్ హై’లో కుమార్ సాను పాడిన ‘చాంద్ సితారే’ చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది. ఆర్డీ బర్మన్తో: 1995కిగాను ‘ఎక్ లడ్కీ కో దేఖా తో’ (1942 ఎ లవ్ స్టోరీ) అనే పాట కుమార్ సానుకి ఫిలింఫేర్ సాధించింది. ఆర్డీ బర్మన్ చివరిసారిగా కంపోజ్ చేసిన ఈ పాట కుమార్ సాను జర్నీకి ఒక క్లాసిక్ టచ్ ఇచ్చింది. సంగీతం, స్వరం, విధు వినోద్ చోప్రా పిక్చరైజేషన్తో పాటు జావేద్ అఖ్తర్ లిరిక్స్ వల్ల ఈ పాట అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇదే సినిమాలో కుమార్ సాను పాడిన ‘కుఛ్ నా కహో’ చాలా హాయిగా అనిపిస్తుంది. ఎ. ఆర్. రెహమాన్‌తో సింగిల్ సాంగ్! ఎందుకంటే...:ఉదిత్ నారాయణ్ లాంటి సింగర్స్ తో ఎన్నో పాటలు పాడించిన రెహమాన్, కుమార్ సానుతో ఒకే ఒక్క పాట పాడించడం జీర్ణం కాదు. ‘కభీ న కభీ’ లో ‘మిల్ గయీ మిల్ గయీ’ అనే ఈ పాట ‘అంజలి అంజలి పుష్పాంజలి’ అనే పాట ట్యూన్ లో సాగుతుంది. ఒక ఇంటర్ వ్యూలో రహమాన్ని అసలు మ్యూజిక్ డైరెక్టర్ గానే గుర్తించను అని కుమార్ సాను చెప్పారు. ఎందుకని అడిగితే ఆయన నన్ను సింగర్ గా గుర్తించలేదు కాబట్టి అని సమాధానమిచ్చారు. ఈ మాటలు వింటే ఇద్దరికీ ఎక్కడో కుదరలేదని అర్థమవుతుంది.బెస్ట్ కో-సింగర్ ఎవరంటే...: కుమార్ సాను లతా మంగేష్కర్, అనురాధా పౌడ్వాల్, సాధనా సర్గమ్ లాంటి సింగర్స్ తో కలిసి ఎన్ని పాటలు పాడినా అల్కా యాగ్నిక్ తో పాడిన పాటలు వింటే మాత్రం తేనెలో ముంచి తేల్చినట్లే అనిపిస్తుంది. ‘ముఝ్ సే మొహబ్బత్ కా’, ‘యే ఇష్క్ హై క్యా’, ‘తేరీ మొహబ్బత్ నే’, ‘హమ్ కో సిర్ఫ్ తుమ్ సే ప్యార్ హై’, ‘జాదూ హై తేరా హీ జాదూ’, ‘జో హాల్ దిల్ కా’ లాంటి పాటలు ఈ కాంబినేషన్‌కి గొప్ప ఉదాహరణలు. కుమార్ సాను పేరు వెనక కథ:కుమార్ సానుకి లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ అంటే గొప్ప గౌరవం. 1983లో సాను భట్టాచార్యగా బెంగాలీలో సింగింగ్ కెరీర్ ఆరంభించిన కేదార్ నాథ్ భట్టాచార్య, 1988లో ‘హీరో హీరాలాల్’ అనే హిందీ సినిమాలో తొలిసారి పాడారు. 1989లో జగ్ జీత్ సింగ్ ఆయన్ను కల్యాణ్ జీ-ఆనంద్ జీ జోడీలోని కల్యాణ్ జీకి పరిచయం చేశారు. వాళ్ళ సూచనతో కిశోర్ కుమార్ పేరులోని కుమార్ కి ‘సాను’ కలిపి కుమార్ సాను గా తన పేరు మార్చుకున్నారు. అంతే కాదు ‘కిశోర్ కుమార్ కీ యాదే’ పేరుతో కిశోర్ దా పాపులర్ సాంగ్స్ పాడుతూ ఒక ఆల్బమ్ కూడా రిలీజ్ చేశారు.కుమార్ సాను తెలుగులో ఏ పాటలు పాడారంటే...:మన తెలుగులోనూ కుమార్ సాను ‘దేవుడు వరమందిస్తే’, ‘మెరిసేటి జాబిలి నువ్వే’, ‘ఒక్కసారి చెప్పలేవా’, 'నీ నవ్వులే వెన్నలని' లాంటి హిట్ సాంగ్స్ పాడారు. ఆయన విలక్షణమైన గొంతుక తెలుగువారికి బాగా నచ్చేసింది. కుమార్ సాను సెకండ్ ఇన్నింగ్స్:2004లో పాలిటిక్స్ లోకి వెళ్ళిన కుమార్ సాను ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి తిరిగి వచ్చారు. ‘రౌడీ రాథోడ్’, ‘గన్స్ & గులాబ్స్’ లాంటి సినిమాల్లో పాడారు. అక్టోబర్ 20, 1957లో పుట్టిన కుమార్ సానుకి ఇప్పుడు 68 ఏళ్ళు. ఈ వయసులోనూ ఆయన గొంతు ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ మధ్యనే ‘కుమార్ సాను అఫీషియల్’ పేరుతో యూట్యూబ్‌లో ఆయన సొంత మ్యూజిక్ లేబుల్ ఒకటి ప్రారంభించారు. అందులోని పాటలు వింటే ఈ విషయం అర్థమవుతుంది.మొత్తం ఎన్ని పాటలు పాడారంటే...:కుమార్ సాను మాతృభాష అయిన బెంగాలీతో పాటు హిందీ, తెలుగు సహా 16కి పైగా భాషల్లో పాటలు పాడారు. ఒకే రోజు 28 పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. బీబీసీ రూపొందించిన ‘ఆల్ టైం 40 సాంగ్స్ ఆఫ్ బాలీవుడ్’లో కుమార్ సాను పాటలే ఎక్కువగా కనిపిస్తాయి. 2009లో పద్మశ్రీ అందుకున్నారు. మెలోడీ కింగ్ అని శ్రోతలతో పిలిపించుకున్న కుమార్ సాను ఇప్పుడు ఎక్కువగా పాడలేకపోతుండవచ్చు. కానీ ఆయన పాడిన ప్రతి పాటా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో మార్మోగుతూనే ఉంటుంది.-శాంతి ఇషాన్ (Shanti Ishan) -
బిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా.. సోషల్ మీడియాలో పోస్ట్
బాలీవుడ్ భామ పరిణితి చోప్రా (Parineeti Chopra) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్యూటీ.. ఈ దివాళీని మరింత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోనుంది. తమకు బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు విషెస్ చెబుతున్నారు. కాగా.. 2023లో పరిణీతి చోప్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన పరిణీతి చోప్రా కనిపించింది. ఈ ఏడాది కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించింది. ఇటీవల పరిణితి చోప్రా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో పాల్గొన్న తర్వాత తాను గర్భంతో ఉన్నట్లు శుభవార్తను పంచుకున్న సంగతి తెలిసిందే.(ఇది చదవండి: ప్రెగ్నెన్సీతో పరిణీతి చోప్రా.. పుట్టబోయే బిడ్డకు స్టార్ హీరోయిన్ గిఫ్ట్!)అంతేకాకుండా పరిణీతి చోప్రా ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్‌ను తిరిగి ప్రారంభించింది. ఓ వీడియోను సైతం తన ఛానెల్లో అప్లోడ్ చేసింది. బాలీవుడ్లో ఆమె నటించిన ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు పరిణీతి చోప్రాకు మంచి పేరు తీసుకొచ్చాయి. View this post on Instagram A post shared by Raghav Chadha (@raghavchadha88) -
టీమిండియా మహిళ స్టార్ క్రికెటర్‌తో పెళ్లి.. హింట్ ఇచ్చిన దర్శకుడు
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రముఖ దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్‌ను పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై స్మృతి బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన పలాశ్ ముచ్చల్‌కు స్మృతితో పెళ్లి విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ముచ్చల్.. ఆమె త్వరలోనే ఇండోర్‌కు కోడలిగా రానుంది.. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే అంటూ ఆ వార్తలను ధృవీకరించారు.కాగా.. గతంలో స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. స్మృతి బర్త్ డే సందర్భంగా అతను విషెస్ తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. కానీ వీరిద్దరు తమపై వస్ుతన్న ఊహాగానాలపై స్పందించలేదు. కాగా.. పలాష్ ముచ్చల్ ప్రస్తుతం 'రాజు బజేవాలా'మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అవికా గోర్, చందన్ రాయ్ జంటగా నటిస్తున్నారు. ముచ్చల్ తన సోదరి పాలక్ ముచ్చల్‌తో కలిసి అనేక బాలీవుడ్ చిత్రాలకు సంగీతమందించారు.తాజాగా ఇవాళ ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడుతున్న సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు ముచ్చల్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందనకు నా శుభాకాంక్షలు' తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రతి మ్యాచ్‌లో గెలిచి దేశానికి కీర్తి తీసుకురావాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని అన్నారు. -
డేట్ ఫిక్స్
ఆయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘పతీ పత్నీ ఔర్ వో దో’. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా నిర్మించారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 4న విడుదల చేయనున్నట్లుగా శనివారం మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఓ సస్పెన్స్ ఎలిమెంట్‌తో రూపొందిన సినిమా ఇది.ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, కథను మలుపు తిప్పే పాత్రలో రకుల్ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. ఇక కార్తీక్ ఆర్యన్ హీరోగా, భూమి ఫడ్నేకర్, అనన్య పాండే హీరోయిన్లుగా నటించిన సక్సెస్ఫుల్ మూవీ ‘పతీ పత్నీ ఔర్ వో’ (2019) సినిమాకు సీక్వెల్‌గా ‘పతీ పత్నీ ఔర్ వో దో’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. -
ఎమోషనల్‌గా కనెక్ట్ కావడమే స్టార్డమ్: షారుక్ ఖాన్
‘‘స్టార్ అనే ట్యాగ్ మాకు నచ్చదు. మా ఇంట్లో మేం అందరిలానే ఉంటాం. మాతో కలిసి పని చేసిన దర్శకులు, రచయితలు, నిర్మాతలు, ప్రేక్షకుల ఆదరణ వల్లే ప్రస్తుతం మేం ఈ స్థాయిలో ఉన్నాం’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ పాల్గొని, సందడి చేశారు. ఈ వేడుకలో ఈ ఖాన్ త్రయం వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.‘‘నాకు, ఆమిర్ ఖాన్‌కు సినీ నేపథ్యం ఉంది. కానీ షారుక్ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి, ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ప్రతిభతోనే ఇండస్ట్రీలో ఎదిగాడు’’ అని సల్మాన్ మాట్లాడగా, ఇదే విషయంపై షారుక్ స్పందించారు. ‘‘సల్మాన్, ఆమిర్‌ల కుటుంబ సభ్యుడిగా నన్ను నేను భావిస్తాను. ఈ విధంగా నాకు ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్లే’’ అని షారుక్ చెప్పారు. అలాగే అభిమానులతో ఎమోషనల్‌గా కనెక్ట్ కావడమే స్టార్డమ్ అని కూడా షారుక్ తెలిపారు.అది సాధ్యమే: సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్‌లో సల్మాన్, ఆమిర్, షారుక్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. మంచి కథ కుదిరితే ఆమిర్, షారుక్‌లతో కలిసి సినిమా చేయడానికి తాను రెడీ అని సల్మాన్ చెప్పారు. కానీ మా ముగ్గర్నీ భరించడం మేకర్స్‌కి సులభం కాదని సరదాగా అన్నారు సల్మాన్ ఖాన్. -
25 ఏళ్లకే పెళ్లి చేసుకున్న దంగల్ నటి
దంగల్ ఫేమ్ జైరా వాసిం (Zaira Wasim) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించింది. తాజాగా ఆమె పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నిఖా జరిగినట్లు రెండు ఫోటోలను షేర్ చేసింది. అందులో తన ముఖం చూపించలేదు కానీ భర్తతో నెలవంకను చూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.దంగల్‌తో ఫేమ్16 ఏళ్ల వయసులో దంగల్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టింది జైరా. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో చిన్నప్పటి గీతా ఫొగట్ పాత్రలో యాక్ట్ చేసింది జైరా. ఈ మూవీకిగానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. తర్వాత సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. సినిమాలకు గుడ్‌బైaఈ రెండు సినిమాలకుగానూ నేషనల్ చైల్డ్ అవార్డు గెలుచుకుంది. ఆమె నటించిన మూడో సినిమా ద స్కై ఈజ్ పింక్. ఇదే తన ఆఖరి సినిమా! తన విశ్వాసాలకు ఈ గ్లామర్ ప్రపంచం సరిపోదంటూ 2019లో సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. సోషల్ మీడియాలో ఉన్న తన ఫొటోలను డిలీట్ చేయాలని అభిమానులను కోరింది. View this post on Instagram A post shared by Zaira Wasim (@zairawasim_) చదవండి: ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం -
వెండితెరపై సినీ జీవితం
సైన్స్, స్పోర్ట్స్, పాలిటిక్స్... ఇలా వివిధ రంగాల్లోని ప్రముఖుల జీవితాల ఆధారంగా రూపొందే బయోపిక్స్‌లో సినీ తారలు నటించడం చూస్తూనే ఉన్నాం. ఈ కోవలో ఇప్పటివరకు చాలా బయోపిక్స్ వచ్చాయి. మరికొన్ని బయోపిక్స్ రానున్నాయి. అయితే వీటిలో సినీ తారల బయోపిక్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ సడన్‌గా ఇప్పుడు బాలీవుడ్లో సినీ తారల జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్స్ సంఖ్య ఎక్కవైంది. మరి... ఏ స్టార్స్ బయోపిక్స్ వెండితెరపైకి రానున్నాయి? ఈ తారల బయోపిక్స్‌లో ఎవరు నటించనున్నారు? అన్న వివరాలపై ఓ లుక్ వేయండి.ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా సాహెబ్ ఫాల్కేను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకుంటాం. పూర్తి నిడివితో తొలి భారతీయ సినిమా తీసిన వ్యక్తిగా దాదా సాహెబ్ ఫాల్కే ఘనత గొప్పది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏటా దాదా సాహెబ్ ఫాల్కే పేరిట అవార్డును ప్రదానం చేస్తుంది. ఇలాంటి ప్రముఖ వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాదు... ఇండస్ట్రీ వర్గాల్లోనూ క్రేజ్ ఉంటుంది. దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఆమిర్ ఖాన్ నటించనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కేగా ఆయన కనిపిస్తారు.ఆమిర్ ఖాన్‌తో గతంలో ‘పీకే, 3 ఇడియట్స్’ వంటి సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ తీసిన రాజ్‌కుమార్ హిరాణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో నటించనున్నట్లుగా ఆమిర్ ఖాన్ కూడా వెల్లడించారు. రాజ్‌కుమార్ హిరాణి, అజిభిత్ జోషి, హిందుకుష్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్ ఈ సినిమా స్క్రిప్ట్‌పై నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఈ బయోపిక్కు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు ఇటీవలి కాలంలో మరింత ఊపందుకున్నాయట. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం. ఈ సినిమాకు దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స పోర్ట్ చేస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా: ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 2023 సెప్టెంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందీ చిత్రం ‘నోట్ బుక్’ ఫేమ్ నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లుగా, కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మించనున్నట్లుగా ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ అనౌన్స్మెంట్లో ఉంది.అయితే దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని, అందుకే రాజమౌళి ఈ సినిమాలో భాగమయ్యారని, ఇందులో దాదా సాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాను 2023 సెప్టెంబరులో ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. సో... ఈ చిత్రంపై స్పష్టత రావాల్సి ఉంది.మ్యూజిక్ మేస్ట్రో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బయోపిక్ వెండితెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో ఇళయరాజాగా ధనుష్ నటిస్తారు. గత ఏడాది మార్చిలో ఇళయరాజా బయోపిక్‌ను అధికారికంగా ప్రకటించారు. ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తీసిన అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈపాటికే పూర్తి స్థాయిలో ప్రారంభం కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుందట.ప్రస్తుతం ధనుష్ రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో వైపు దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను హీరోగా పరిచయం చేసే సినిమా పనుల్లో అరుణ్ బిజీగా ఉన్నారు. ఇలా ధనుష్, అరుణ్‌ల ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ‘ఇళయరాజా’ బయోపిక్ సెట్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఇళయరాజా బయోపిక్‌లో రజనీకాంత్, కమల్‌హాసన్‌లు గెస్ట్ రోల్స్‌లో నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రోడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సంస్థలు ఈ బయోపిక్‌ను నిర్మించనున్నట్లు అనౌన్స్మెంట్ పోస్టర్‌పై ఉంది.ఆమిర్ లేదా రణ్‌బీర్ ప్రఖ్యాత గాయకులు కిశోర్ కుమార్ బయోపిక్ వెండితెర పైకి రానుంది. ఈ బయోపిక్‌పై దర్శకుడు అనురాగ్ బసు ఎప్పట్నుంచో వర్క్ చేస్తున్నారు. ఈ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన నటించలేక పోయారు. ‘‘కిశోర్ కుమార్‌గారి బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్‌ను అనుకున్న మాట వాస్తవమే. కాక పోతే ఈ బయోపిక్కు బదులు ‘రామాయణ’ సినిమాను రణ్‌బీర్ కపూర్ ఎంపిక చేసుకున్నాడు. అప్పటి పరిస్థితుల్లో అతను మంచి నిర్ణయమే తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు అనురాగ్ బసు.కాగా కిశోర్ కుమార్ బయోపిక్‌లో ఆమిర్ ఖాన్ నటించనున్నారనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్లో తెరపైకి వచ్చాయి. ఇటీవల ఓ సందర్భంలో కిశోర్ కుమార్‌గారి బయోపిక్‌లో నటించే చాన్స్ వస్తే తప్పుకుండా చేస్తానన్నట్లుగా ఆమిర్ ఖాన్ కూడా చె΄్పారు. ఈ నేపథ్యంలో ఈ బయోపిక్‌లో ఆమిర్ ఖాన్ నటించే అవకాశం ఉందని ఊహించవచ్చు. కానీ కిశోర్ కుమార్ బయోపిక్కు అనురాగ్ బసు తొలుత రణ్‌బీర్ కపూర్‌ను అనుకున్నారు. అప్పట్లో కుదర్లేదు. అయితే ఇప్పుడు ‘రామాయణ’ సినిమా పూర్తి కావొచ్చింది. రణ్‌బీర్ కపూర్ చేస్తున్న మరో సినిమా ‘లవ్ అండ్ వార్’ చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంటోంది.ఈ నేపథ్యంలో కిశోర్ కుమార్ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ నటించే అవకాశం లేక పోలేదు. పైగా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌తో ఆమిర్ ఖాన్ బిజీ కానున్నారు. ఒకేసారి రెండు బయోపిక్స్‌లో ఆమిర్ ఖాన్ నటించడం సాధ్యం కాక పోవచ్చు కనుక కిశోర్ కుమార్‌గా వెండితెరపై రణ్‌బీర్ కపూర్ కనిపించే అవకాశం లేక పోలేదు.ఫైనల్‌గా కిశోర్ కుమార్ బయోపిక్‌లో ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మరోవైపు కిశోర్‌కుమార్ బయోపిక్ చేయాలని బాలీవుడ్ దర్శకుడు సూజిత్ సర్కార్ ఓ కథ రెడీ చేశారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్‌ను హీరోగా అనుకున్నారు. కానీ అనురాగ్ బసు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న సూజిత్ సర్కార్ తన ప్రయత్నాలను ఆపేశారు. ఈ విషయాలను సుజిత్ సర్కార్ ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు.గురుదత్ బయోపిక్‌లో విక్కీ? ‘సైలాబ్, కాగజ్ కె పూల్, ఫ్యాసా’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్ ఫిల్మ్స్ తీసిన లెజెండరీ దర్శకుడు గురుదత్ జీవితం వెండితెర పైకి రానుందని బాలీవుడ్ సమాచారం. అల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ బయోపిక్కు భావనా తల్వార్ దర్శకత్వం వహిస్తారని, ‘ ఫ్యాసా’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం బాలీవుడ్లో జరుగుతోంది. అంతేకాదు... ఈ సినిమాలో గురుదత్‌గా విక్కీ కౌశల్ నటిస్తారని, ఇందుకోసం మేకర్స్ ఆల్రెడీ ఈ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారని బాలీవుడ్ భోగట్టా. మరి... వెండితెరపై గురుదత్‌గా విక్కీ కౌశల్ నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.మధుబాల బయోపిక్ ‘ ఫ్యార్ కియాతో డర్నా క్యా...’ అంటూ వెండితెరపై అనార్కలిగా మధుబాల నటన అద్భుతం. 1960లో విడుదలైన ‘మొఘల్ ఏ అజం’ సినిమా మధుబాలకు అప్పట్లో దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాయే కాదు... పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు మధుబాల. దాదాపు 60 సినిమాల్లో నటించిన మధుబాల 36 సంవత్సరాల చిన్న వయసులో తుది శ్వాస విడిచారు. కాగా, మధుబాల బయోపిక్ రానుంది. గత ఏడాది మార్చిలో ఈ బయోపిక్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన ‘డార్లింగ్స్’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన జస్మీత్ కె. రీన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్ సంస్థతో బ్రిజ్ భూషణ్ (మధుబాల సోదరి) మధుబాల బయోపిక్‌ను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో మధుబాలగా ఆలియా భట్ లేదా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ నటించనున్నారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మనీష్ మల్హోత్రా కూడా మధుబాల బయోపిక్‌ను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో మధుబాలగా కృతీ సనన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ మనీష్ మల్హోత్రా నిర్మించే మధుబాల బయోపిక్‌పై తమకు సమాచారం లేదన్నట్లుగా బ్రిజ్ భూషణ్ ఓ సందర్భంలో వెల్లడించారనే వార్తలు బాలీవుడ్ ఉన్నాయి.ట్రాజెడీ క్వీన్ దివంగత ప్రముఖ నటి, ట్రాజెడీ క్వీన్‌గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న మీనా కుమారి జీవితం ఆధారంగా హిందీలో ‘కమల్ ఔర్ మీనా’ అనే సినిమా రానుంది. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో ఈ సినిమా ప్రారంభం కాలేదు. తొలుత ‘కమల్ ఔర్ మీనా’ చిత్రానికి మనీష్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపించింది. ప్రస్తుతం ఈ మూవీకి దర్శకుడిగా సిద్ధార్థ్. పి మల్హోత్రా ఉన్నారు. అలాగే ఈ ‘కమల్ ఔర్ మీనా’లో మీనా కుమారిగా తొలుత కృతీ సనన్ పేరు వినిపించింది.కానీ ఆ తర్వాత కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని దర్శకుడు కమల్ అమ్రోహిగా ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు వంటి హీరోల పేర్లు బాలీవుడ్లో వినిపిస్తున్నాయట. అయితే ఈ అంశాలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ ఏడాది జూలైలో కియారా అద్వానీ ఓ పాపకు జన్మనిచ్చారు. దీంతో కియారాకు సెట్స్‌కు వచ్చేందుకు వీలుపడదు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని బాలీవుడ్ సమాచారం. అమ్రోహీ ఫ్యామిలీతో కలిసి సిద్ధార్థ్. పి. మల్హోత్రా, సరెగమా సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి.ది అన్‌టోల్డ్ స్టోరీ గ్లామరస్ క్వీన్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సిల్క్ స్మిత. ఆ తరం స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేశారు. అయితే సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నారామె. ఎవరూ ఊహించని రీతిలో 1996 సెప్టెంబరు 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చింది.విద్యాబాలన్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా సిల్క్ స్మిత జీవితం ఆధారంగానే మరో సినిమా రానుంది. ‘సిల్క్ స్మిత: ది అన్‌టోల్డ్ స్టోరీ’గా వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో సిల్క్ స్మితగా చంద్రికా రవి నటిస్తున్నారు. ఈ మూవీతో జయరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇలా సినిమా తారల జీవితాల ఆధారంగా రూపొందనున్న మరికొన్ని బయోపిక్స్ చర్చల దశల్లో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
ముంబైలో ల్యాండ్ కొన్న సోనూసూద్.. ధర ఎంతంటే?
విలక్షణ నటుడు సోనూసూద్ (Sonu Sood) ప్లాట్ కొనుగోలు చేశాడు. కుమారుడు ఇషాన్‌తో కలిసి ముంబై పన్వేల్‌లోని 777 చదరపు గజాల భూమిని తన సొంతం చేసుకున్నాడు. దీనికోసం రూ.1.09 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కోసం రూ.30 వేలు, స్టాంప్‌డ్యూటీ కింద రూ. 6.3 లక్షలు చెల్లించాడు. ముంబై-పుణె మార్గంలో పన్వేల్ ప్రాంతం ఉంది. పన్వేల్‌లో ఐటీ సంస్థలు, విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రాబోతున్నాయి.ఇటీవలే అపార్ట్మెంట్ కొనుగోలుముంబై రెండో అంతర్జాతీయ విమానాశ్రయం (Navi Mumbai International Airport) కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. కాగా సోనూసూద్ కుమారుడు ఇషాన్.. ఇటీవల ఆగస్టులో సైతం ముంబైలోని అంధేరి వెస్ట్‌లో ఓ అపార్ట్మెంట్ కొన్నాడు. దీనికోసం రూ. 2.6 కోట్లు ఖర్చు చేశాడు. అదే నెలలో సోనూసూద్.. ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో తన అపార్ట్‌మెంట్‌ను రూ.8.10 కోట్లకు అమ్మేశాడు. దీన్ని 2012లో రూ.5 కోట్లకు కొనుగోలు చేయగా దాదాపు 13 ఏళ్ల తర్వాత 8 కోట్లకు అమ్మేశాడు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. సోనూసూద్ చివరగా ఫతే సినిమాలో నటించాడు. స్వీయదర్శకత్వంతో పాటు సోనూసూద్ హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఇతడు పుష్కరకాలం క్రితం నటించిన తమిళ మూవీ మదజగరాజ మాత్రం జనవరిలో రిలీజై సూపర్ హిట్ అందుకుంది.చదవండి: కొత్తింట్లోకి యాంకర్ లాస్య.. ఘనంగా గృహప్రవేశం -
డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ 35వ 'ఫ్యాషన్ గాలా'లో బాలీవుడ్ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఆలియా భట్ ఇంటికి ప్రత్యేకమైన గణేశుడు.. 17న పూజలు
ప్రముఖ బాలీవుడ్ స్టార్ జంట రణ్ బీర్ కపూర్, ఆలియా భట్(Alia Bhatt) కోసం మైసూరు శిల్పకారుడు అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) ఒక గణపతి మూర్తిని రూపొందించారు. ముంబైలోని రణ్‌బీర్(Ranbir Kapoor) దంపతులు కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే తమ ఇంటికి గణపతి విగ్రహం కావాలని యోగిరాజ్‌కు వారు గతంలోనే ఆర్డర్ ఇచ్చారు. అయోధ్య శ్రీరామ మూర్తిని యోగిరాజే రూపొందించడం తెలిసిందే. అప్పటి నుంచి యోగిరాజ్ పేరు ప్రతిష్టలు దేశ్యాప్తంగా వ్యాపించాయి. గత ఆరు నెలల నుంచి కష్టపడి నల్ల ఏకశిలతో ఆకర్షణీయమైన గణపతి విగ్రహాన్ని యోగిరాజ్ తీర్చిదిద్దారు. నాలుగు అడుగుల ఎత్తుతో ఈ విగ్రహం ఉంది. ఈనెల 17న ఆలియా దంపతులు ఇంటిలో ప్రతిష్టించి పూజలు చేయనున్నారు. విగ్రహం ధర ఎంత అన్నది మాత్రం గుట్టుగా ఉంచారు.కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాల రాముడి (శ్రీ రామ్ లల్లా) విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించారు. ముగ్గురు శిల్పులు వేర్వేరు శిలలతో రాముడి శిల్పాలను చెక్కగా అందులో యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్నే ఎంపిక చేశారు. రామ్‌లల్లా అని భక్తులు పిలుచుకునే ఈ చిన్నారి రాముడి విగ్రహాన్ని దాదాపు 4.25 అడుగుల ఎత్తుతో ఎంతో ఆకర్షణీయంగా కృష్ణశిలతో ఆయన తీర్చిదిద్దారు. ఇప్పుడు మరోసారి అలియా భట్ దంపతుల కోసం గణేశుడి విగ్రహాన్ని అందించనున్నారు. -
దీపికా పదుకొణెతో మీరు కూడా మాట్లాడొచ్చు.. తొలి భారతీయ సెలబ్రిటీగా రికార్డ్
భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంటారు నటి దీపికా పదుకొణె (Deepika Padukone). కేవలం తన నటనతోనే కాకుండా తన స్పీచ్లతోనూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. అందుకే ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కింది. మెటా AIకి తన గొంతును అందించిన తొలి భారతీయ సెలబ్రిటీగా ఆమె నిలిచింది. తాను ఇప్పుడు మెటా ఏఐలో భాగమైనట్లు ఒక వీడియోతో సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఆమెకు మరోసారి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది.మెటా ఇటీవల ప్రత్యేక ఏఐ చాట్‌బాట్ యాప్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వివిధ రకాల టెక్స్ట్, ఇమేజ్, వీడియో డేటాతో శిక్షణ ఇవ్వడం వల్ల మీరు అడిగే ప్రశ్నను కూడా విస్తృత స్థాయిలో అర్థం చేసుకుంటుంది. మీతో చాటింగ్ చేయడమే కాకుండా వాయిస్‌తో సలహాలు, కబుర్లు కూడా చెబుతుంది. మీకు కావాల్సింది ప్రాంప్ట్‌లను అందిస్తే చాలు మాట్లాడేస్తుంది. ఏదైనా అంశం మీద లోతుగా తెలుసుకోవాలనుకుంటే విశ్లేషణ కూడా చేస్తుంది. ఇప్పుడు ఇవ్వన్ని మీ అభిమాన నటి దీపికా పదుకొనె వాయిస్‌తో మీరు వినేయవచ్చు. ఆమెతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. కానీ, ఆమె వాయిస్ మాత్రం ఏఐ ఆధారంగా మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది.వాయిస్ ఇన్‌పుట్స్‌తో మెటా ఏఐ అసిస్టెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు దానికి దీపికా పదుకొణె వాయిస్ తోడవుతుంది. అంటే స్నేహితుడితో మాట్లాడినట్టుగా ఎప్పుడైనా దీపికతో మాట్లాడొచ్చన్నమాట. మెటా ఏఐలో హాలీవుడ్ నుంచి కొంతమంది ప్రముఖుల వాయిస్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇండియా నుంచి మాత్రం కేవలం దీపికా పదుకొనె వాయిస్ మాత్రమే అందుబాటులోకి రానుంది.ఈ క్రమంలోనే దీపిక ఒక వీడియోను షేర్ చేసుకున్నారు. ఇది చాలా బాగుంది అని తాను అనుకుంటున్నట్లు పేర్కంది. తాను ఇప్పుడు మెటా AIలో భాగమయ్యానని దీంతో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ అంతటా తన వాయిస్‌తో ఇంగ్లీషులో చాట్ చేయవచ్చని ఆమె పంచుకున్నారు. ఒక్కసారి దీనిని ప్రయత్నించి ఏమనుకుంటున్నారో తెలియజేయాలని ఆమె కోరారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
ప్రెగ్నెన్సీతో పరిణీతి చోప్రా.. పుట్టబోయే బిడ్డకు స్టార్ హీరోయిన్ గిఫ్ట్!
బాలీవుడ్ భామ పరిణితి చోప్రా (Parineeti Chopra) ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. 2023లో రాజకీయ నాయకుడితో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా సినిమాలు చేయడం తగ్గించింది. గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించింది. ప్రస్తుతం కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లో నటించింది.సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది ఆగస్టులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే హీరోయిన్ పరిణితి చోప్రా బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలోనే పరిణీతికి మరో స్టార్ హీరోయిన్ గిఫ్ట్‌ను పంపి సర్ప్రైజ్ ఇచ్చింది. డెలివరీకి ముందే పుట్టబోయే బిడ్డ కోసం బహుమతి పంపిన విషయాన్ని పరిణీతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.(ఇది చదవండి: అలాంటి డ్రెస్‌లో సోనాక్షి.. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసినట్టేనా!) మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న పరిణీతి చోప్రాకు స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) సర్ప్రైజ్ ఇచ్చింది. తన సొంత బ్రాండ్ అయిన ఎడ్-ఎ-మమ్మా నుంచి సరికొత్త హ్యాంపర్‌ను గిఫ్ట్‌గా పంపింది. ఆలియా భట్ బహుమతిపై పరిణీతి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. తన బిడ్డకోసం గిఫ్ట్ పంపినందుకు ధన్యావాదాలు తెలిపింది. కాగా.. పరిణితి చోప్రా ఇటీవలే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కనిపించింది. ఆ తర్వాత తాను గర్భంతో ఉన్నట్లు శుభవార్తను పంచుకుంది.అంతేకాకుండా పరిణీతి చోప్రా ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్‌ను తిరిగి ప్రారంభించింది. ఓ వీడియోను సైతం తన ఛానెల్లో అప్లోడ్ చేసింది. బాలీవుడ్లో ఆమె నటించిన ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు పరిణీతి చోప్రాకు మంచి పేరు తీసుకొచ్చాయి. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు పంకజ్ ధీర్(Pankaj Dheer) ( 68) ఇవాళ కన్నుమూశారు. కొన్నేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే క్యాన్సర్‌కు పలుసార్లు శస్త్ర చికిత్స జరిగినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పంకజ్ మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికాగ సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం ముంబయిలోని విలే పార్లేలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (ఇది చదవండి: తొలి తెలుగు సింగర్ ఇక లేరు)కాగా.. పంకజ్ ధీర్ నవంబర్ 9.. 1956న పంజాబ్‌లో జన్మించారు. 1980 ప్రారంభంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలీవుడ్లో బుల్లితెరతో పాటు సినిమాల్లో నటించారు. బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత్ సీరియల్లో కర్ణుడి పాత్రలో మెప్పించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. మహాభారతంతో పాటు చంద్రకాంత(1994–1996), ది గ్రేట్ మరాఠా, ససురల్ సిమర్ కా లాంటి సీరియల్స్‌లో నటించారు. అంతేకాకుండా సడక్, బాద్షా, సోల్జర్ వంటి చిత్రాలలో కూడా కనిపించారు.అయితే అనితా ధీర్‌ను పంకజ్ వివాహం చేసుకున్నాడు. వీరికి నికితిన్ ధీర్ అనే కుమారుడు ఉన్నాడు. అతను కూడా నటనలో రాణిస్తున్నారు. ఆయన కుమారుడు నికితిన్ బుల్లితెర నటి క్రతికా సెంగర్‌ను వివాహం చేసుకున్నాడు. అతను తన తండ్రి పంకజ్ ధీర్‌తో దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. Actor Pankaj Dheer, played Karn in Mahabharat, Passed Away. Om Shanti🙏#pankajdheer pic.twitter.com/uJSTFoOb4b— Sumit Kadel (@SumitkadeI) October 15, 2025 -
అశ్లీల సన్నివేశం.. నిజ జీవితంలోనూ అంతేనని ముద్ర.. ఎంతో ఏడ్చా!
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఐటం గర్ల్‌గా పలు సినిమాలు చేసింది దీప్షిక నగ్పాల్ (Deepshikha Nagpal). షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'కోయిల' మూవీ (Koyla Movie)లో ఓ అభ్యంతకర సన్నివేశంలో యాక్ట్ చేసింది. అందులో దుస్తులు తొలగిస్తున్నట్లుగా కనిపించినప్పటికీ.. అది నిజం కాదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కోయిల మూవీ డైరెక్టర్ రాకేశ్ సర్ నాకు ఆ సన్నివేశం గురించి ముందే చెప్పారు. నా తల్లి ఎదురుగానే సీన్ వివరించారు. సరే, షూటింగ్ ఎప్పుడు? అని ఎటువంటి బెరుకు లేకుండా అడిగాను.డ్రెస్ ధరించే సీన్ కంప్లీట్ చేశానేను చెప్పింది అంతా గుర్తుందిగా? అని ఆయన మరోసారి క్రాస్‌చెక్ చేసుకున్నారు. గుర్తుందని బదులిస్తూనే మీరేం భయపడవద్దని ధైర్యం చెప్పాను. కెమెరాను నా ఎదురుగా కాకుండా టాప్ యాంగిల్లో పెట్టమన్నాను. కేవలం నా భుజాల వరకే కనిపించేలా జాగ్రత్తపడ్డాను. నేను డ్రెస్ తీసేస్తున్నట్లుగా మీకు కనిపించింది కానీ, మినీ టాప్, అలాగే జీన్స్ నా ఒంటిపై అలాగే ఉన్నాయి. బట్టలు ధరించే ఎంతో సులువుగా ఆ సీన్ పూర్తి చేశాం. కానీ సినిమా రిలీజయ్యాక ఆ సీన్ ఎంతో వివాదాస్పదమైంది. హేళన చేశారుకెమెరా ముందు దుస్తులు తొలగించావా? అని నా అనుకున్నవాళ్లే నన్ను దారుణంగా విమర్శించారు. ఆ మాటలకు ఎన్నోసార్లు ఏడ్చాను. ఒకసారి నా కూతురు కోయిల సినిమా సీడీని కోపంతో విరిచేసింది కూడా! సినిమాల్లోలాగే నిజ జీవితంలో కూడా నేను అలాగే చేస్తానని నా క్యారెక్టర్‌ను తప్పుపట్టారు. నా పిల్లలు కూడా నన్ను గౌరవించరని హేళన చేశారు అని చెప్తూ ఎమోషనలైంది. ఒకప్పుడు సినిమాలు చేసిన దీప్షిక.. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ చేస్తోంది. ఈమెకు రెండు పెళ్లిళ్లవగా రెండుసార్లు విడాకులయ్యాయి. హిందీ బిగ్‌బాస్ 8వ సీజన్లో పాల్గొనగా మూడు వారాల్లోనే ఎలిమినేట్ అయింది.చదవండి: బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోను: ఫ్లోరా సైనీ -
సల్మాన్ తో దిల్ రాజు.. క్రేజీ కాంబో
-
దత్తత కూతురి బర్త్ డే సెలబ్రేషన్లో సన్నీ లియోన్ (ఫొటోలు)


