రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించడమే కాదు.. ఏకంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
ఈ మూవీని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించారని పాక్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. అయితే ఓటీటీలో విడుదలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో దురంధర్ దూసుకెళ్తోంది. పాకిస్తాన్‌లోనూ ఈ మూవీ నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పాకిస్థాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అగ్రస్థానంలో ఉందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్‌లో థియేటర్లలో విడుదల కాని ఈ చిత్రం.. ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే దేశంలో నంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. ఈ సినిమా 'తేరే ఇష్క్ మే', 'హక్', 'ది బిగ్ ఫేక్' లాంటి బాలీవుడ్ చిత్రాల కంటే ముందుంది.
కాగా.. ఈ చిత్రంలో సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సీక్వెల్ సైతం ఈ ఏడాది మార్చి 19న విడుదల కానుంది.


