'ఒక్క ఛాన్స్ ప్లీజ్'.. అనుకున్నంత ఈజీ కాదు! | Amardeep Chowdary Request To Hit Sumathi Satakam Movie | Sakshi
Sakshi News home page

Amardeep Chowdary: బిగ్‌బాస్ నుంచి హీరోగా.. అమర్‪‌దీప్ ఏం చేస్తాడో?

Feb 2 2026 4:14 PM | Updated on Feb 2 2026 4:26 PM

Amardeep Chowdary Request To Hit Sumathi Satakam Movie

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోలున్నారు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వస్తూనే ఉన్నారు. ఈ వారం కూడా తెలుగు బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ హీరోగా పరిచయమవుతున్న 'సుమతీ శతకం' అనే మూవీ విడుదలకు సిద్ధమైంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని వేడుకుంటున్న అమర్‌దీప్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడు? అసలు ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? గతంలో బిగ్‌బాస్ నుంచి వచ్చి హీరోలు అయినవాళ్లు ఎక్కడున్నారు?

ఇండస్ట్రీలో హీరోగా నిలబడటం అంత సులభం కాదు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో ఫేమ్ తెచ్చుకుంటున్న సొహైల్, సన్నీ లాంటి వాళ్లు.. ఆ క్రేజ్ నిజమనుకుని హీరోలుగా పలు మూవీస్ చేశారు. కాకపోతే రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీసే చేయడంతో అవి సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లకే ఇండస్ట్రీని పూర్తిగా వదిలేశారు. అమర్‌దీప్ కూడా కొన్నిరోజుల క్రితం ఇదే చెప్పాడు. బిగ్‌బాస్ ఓట్లు దేనికీ పనికిరావు అని అన్నాడు. కానీ ఇండస్ట్రీలో పరిస్థితులు కొత్త హీరోలకు కలిసొచ్చేలా ఉన్నాయా అంటే లేవనే చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

ఎందుకంటే పాన్ ఇండియా కల్చర్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత తెలుగు ఆడియెన్స్.. చిన్న సినిమాలని అందులోనూ రొటీన్ కమర్షియల్ చిత్రాలు చూసేందుకు మునుపటిలా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అమర్‌దీప్ 'సుమతీ శతకం' ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా సాధారణ సినిమాలానే అనిపిస్తుంది. దానికితోడు ఈ వారం దాదాపు 10 వరకు మూవీస్, థియేటర్లలోకి రానున్నాయి. వీటన్నింటిని దాటుకుని అమర్‌దీప్ చిత్రానికి ప్రేక్షకులు వస్తారా అనేది చూడాలి.

అలానే రీసెంట్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన అమర్‌దీప్.. 'ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో చూపిస్తా. ఇది హిట్ కాకపోతే మరెప్పుడు ఇలా ఒక్క ఛాన్స్ అని అడగను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. సుమతీ శతకం చూస్తారు. నేనేంటో మీకు తెలుస్తుంది' అని అన్నాడు. మరి ఈ మాట మీద ఎంతవరకు నిలబడతాడో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)

Advertisement
 
Advertisement
Advertisement