రామ్ చరణ్ దంపతులకు బన్నీ విషెస్.. చిరంజీవి ఫేస్ చూస్తుంటే? | Tollywood Hero Allu Arjun Congratulates ram charan and upasana | Sakshi
Sakshi News home page

Allu Arjun: రామ్ చరణ్ దంపతులకు కంగ్రాట్స్.. చిరంజీవి ఫేస్ చూస్తుంటే?

Feb 2 2026 3:38 PM | Updated on Feb 2 2026 3:48 PM

Tollywood Hero Allu Arjun Congratulates ram charan and upasana

రామ్ చరణ్ దంపతులకు ఐకాన్  స్టార్ అల్లు అర్జున్‌ అభినందనలు తెలిపారు. ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందం మరింత రెట్టింపైదన్నారు. ట్విన్స్ రాకతో చిరంజీవి ముఖంలో ఆ గర్వం, సంతోషం కనిపిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులందరి చిరునవ్వుల ముఖాలను చూసి చాలా సంతోషంగా ఉందన్నారు.  ఈ అందమైన కొత్త ప్రారంభానికి రెట్టింపు ప్రేమ, ఆనందం కలుగుతోందన్నారు.

కాగా.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విన్స్‌కు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉపాసనకు ఓ బాబు, పాప పుట్టారని అన్నారు. బిడ్డలతో పాటు తల్లి కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు. కవలల రాకతో తమ కుటుంబంతో పాటు అభిమానులు సంతోషంలో మునిగిపోయారని అన్నారు. మాపై మీరందరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఉపాసన- చెర్రీ దంపతులకు ఇప్పటికే క్లీంకార అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement