భర్తను చితకబాదేసిన భార్య, వైరల్‌ వీడియో | Woman beats husband Viral video sparks debate on violence against men | Sakshi
Sakshi News home page

భర్తను చితకబాదేసిన భార్య, వైరల్‌ వీడియో

Feb 2 2026 5:03 PM | Updated on Feb 2 2026 5:42 PM

Woman beats husband Viral video sparks debate on violence against men

భర్తపై భార్య దారుణంగా దాడిచేసిన వీడియో ఒకటి ఆందోళన పుట్టిస్తోంది. కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్నప్పటికీ ,అతనిపై హింసకు పాల్పడిన వైనం నెట్టింట భర్తలపై భార్యల హింసగురించి చర్చకు దారి తీసింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం, సీసీ కెమెరాలో బాధితుడ్ని  కొడుతున్న దృశ్యలు నమోదయ్యాయి.  తన భార్య నిర్వాకాన్ని రికార్డు చేసేందుకు,ఆధారాలు సేకరించడానికి  బాధితుడు తన భార్యపై గదిలో రహస్య కెమెరాను అమర్చాడట. ఈ  వీడియోను క్లిప్‌లో, ఆ మహిళ ఆ వ్యక్తిని మంచంపైకి విసిరి, అతనిపైకి ఎగిరి దూకి, రెండు చేతులతోనూ పిడి గుద్దుల  వర్షం కురిపించింది. ఇంతలో మహిళ గదిలోకి వెళ్లి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఫలించలేదు. ఒక బిడ్డను ఎత్తుకుని ఉన్న మరో వ్యక్తి కూడా గదిలోకి వెళ్లాడు. అయినా బాధితుడిపై దాడి కొనసాగుతూనే ఉంది.

దీంతో నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. భార్యల వేధింపులు తాళలేక  తనువు చాలించిన అతుల్ సుభాష్,మానవ్ శర్మ ఉదంతాన్ని గుర్తుకు తెస్తుందని వ్యాఖ్యానించారు.  2025లో ఏప్రిల్‌లో పోస్ట్‌ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడిది, బాధితుడు ఎవరు? అనే వివరాలపై ఎలాంటి ధృవీకరణ లేదు.  

ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?

నెటిజనుల స్పందన
ఆమెపై కేసు నమోదు చేయాలని కొంతమంది కోరగా, గృహ హింస నుండి పురుషులను రక్షించడానికి, అలాంటి మహిళలను శిక్షించడానికి ఎటువంటి చట్టాలు లేవని వాపోయారు. అదే పురుషుడు మహిళపై దాడిచేస్తే పదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు.

పేలవమైన చట్టాలు, అవినీతి న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ బాధితుడిగా మారుతున్న ప్రతి పురుషుడికి మనం అధికారం ఇవ్వాలి.అలాగే ప్రతి పురుషుడిని ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్న ఇలాంటి మహిళలకు గుణపాఠం నేర్పాలి.   వేధింపులకు గురవుతున్న  వివాహిత పురుషుడు అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాడాలి.  అంతకానీ ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవద్దు  అని ఒక నెటిజన్‌ కోరడం గమనార్హం.

అయితే వీడియో రికార్డు చేస్తున్నాడు కాబట్టి అతను కావాలనే ప్రతిఘటించడం లేదని కమెంట్‌ కూడా కనిపించింది. 
ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement