రోడ్డు మధ్యలో బోరింగ్‌ పంపు.. వీడియో వైరల్‌ | Hand pump middle of UP road In Mirzapur Video Viral | Sakshi
Sakshi News home page

రోడ్డు మధ్యలో బోరింగ్‌ పంపు.. వీడియో వైరల్‌

Mar 19 2026 8:56 AM | Updated on Mar 19 2026 12:55 PM

Hand pump middle of UP road In Mirzapur Video Viral

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పీడబ్ల్యూడీ ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా వింత ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మధ్యలో బోరింగ్ ఉండగానే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టిన అంశం బయటకు రావడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు తేరుకుని దిద్దుబాటు చర్యలకు దిగారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గతేదాడి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మీర్జాపూర్ జిల్లాలో పర్యటించేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ షెడ్యూల్ ఖరారైంది. కాగా, సీఎం యోగి వస్తున్నారని.. అధికారులు ఏర్పాట్లపై ఫోకస్‌ పెట్టారు. యోగి వస్తున్న కారణంగా మీర్జాపూర్ జిల్లాలో అధికారులు హడావిడి చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలోని కాంతిత్ ప్రాంతంలో రోడ్డు వెడల్పు పనులను కూడా యమ స్పీడ్‌గా చేశారు. రోడ్డు పనులు చకచకా కానిచ్చేశారు కానీ.. నడిరోడ్డు మధ్యలో ఉన్న బోరింగ్‌ పంపును తీసివేయడం మర్చిపోయారు.

బోరింగ్ పంపు నడిరోడ్డుపైన ఉండగానే కొత్త రోడ్డు వేశారు. బోరింగ్‌ తొలగించకుండానే కొత్త రోడ్డు వేసి కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు చేతులు దులుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది. దీంతో, నెటిజన్లు యూపీ ప్రభుత్వం, అధికారులపై మండిపడుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. బోరింగ్‌ పంపు ఘటన ముఖ్యమంత్రి ఆఫీసుకు కూడా చేరడంతో​ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. తాజాగా రోడ్డుపై ఉన్న పంపును తొలగించారు. ఈ వీడియో సైతం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ పంపు వ్యవహారం సోషల్‌ మీడియాలో కొత్త చర్యలకు దారి తీసింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement