హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు! | Weight loss Tips: Australian fitness coach shares how she lost body fat | Sakshi
Sakshi News home page

హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు!

May 4 2026 12:04 PM | Updated on May 4 2026 12:47 PM

Weight loss Tips: Australian fitness coach shares how she lost body fat

బరువు తగ్గడం ప్రస్తుత రోజుల్లో ఒక ట్రెండ్‌గా మారింది. అంతా శరీరంలోని కొలెస్ట్రాల్‌ తగ్గించుకుని స్మార్ట్‌గా మారడంపైనే ఫోకస్‌ పెడుతున్నారు. అంతేగాదు ఆరోగ్యస్ప్రుహతో ఆ దిశగా పోషకాహార నిపుణులు, ఫిట్‌నెస్‌ నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తున్నారు. బరువు తగ్గడం అంటే తక్కువగా తీసుకోవడం, కేలరీలు మితంగా ఉండేలా కేర్‌ తీసుకోవడంపై ఆధారపడి ఉంటుందనేది అందరి నమ్మకం కానీ, ఇది అందరికీ వర్తించదని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ఫిట్‌నెస్‌ కోచ్‌ హన్నా బటన్. కొందరిలో ఈ విధానం దీర్ఘకాలిక కొవ్వు నష్టానికి దారితీస్తుందని అంటున్నారు. అలాంటివాళ్లు, జీవక్రియ , హర్మోన్ల సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా డైట్‌ తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. అదెలాగో సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదిక వివరించారామె.  

ఆస్ట్రేలియాకు చెందిన ఫిట్‌నెస్ కోచ్ హన్నా బటన్ తాను సాధారణంగా తినే విధానం కంటే ఎక్కువగా తింటూ కోరుకున్న విధంగా బరువు ఎలా తగ్గొచ్చో ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు. ఆ పోస్ట్‌లో మనకు స్థిరమైన కొవ్వు నష్టం జరగకుండా మంచి డైట్‌ని అనుసరించాలని అన్నారామె. అయితే చాలామంది నిపుణులు తక్కువ తినండి, కార్బోహైడ్రేట్లు తగ్గించండి, అలాగే ప్రతి కేలరీని లెక్కించడని సూచిస్తుంటారు. ఒక ప్రొఫెషనల్‌ అథ్లెట్‌గా ఈ విధానం వల్ల కండరాలు కోల్పోయాను, హార్మోన్లు దెబ్బతిన్నాయ్‌, పైగా మరింత అధ్వాన్నంగా కనిపించానని చెప్పుకొచ్చింది. ఈ సలహా ముమ్మాటికీ తప్పు మాత్రమే కాదు హానికరం అని అంటున్నారామె.

తక్కువగా తినడం వల్ల శక్తిని ఆదా చేసేందుకు జీవక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా కొవ్వు నిల్వలు, కండరాలు తగ్గిపోతాయ్‌, అలసిపోతారు కూడా. అలాగే మీ బరువులో ఎలాంటి మార్పు కనిపించదు కూడా. అందువల్ల ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు డైటింగ్‌ పద్ధతిని మార్చాలంటున్నారామె.

ప్రోటీన్ ఆటను మార్చేస్తుంది
ఫిట్‌నెస్ కోచ్ హన్నా ప్రతిరోజూ శరీర బరువులో ప్రతి పౌండ్‌కు 0.7–1 గ్రాముల ప్రోటీన్‌ను లక్ష్యంగా పెట్టుకోమని సూచిస్తున్నారు. శరీరం ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోవడం ద్వారానే దాని నుంచి వచ్చే కేలరీలలో 30% ఖర్చు చేస్తుంది. కొవ్వును తగ్గించుకుంటున్నప్పుడు ఇది లీన్ కండరాలను కాపాడుతుంది. చాలా మంది తమకు వాస్తవంగా అవసరమైన దానిలో సగం మాత్రమే తింటారు.

ఎక్కువగా తింటే.. చురుకుగా జీవక్రియ..
తీవ్రమైన ఆహార నియంత్రణ ఆకలికి సంకేతం, దీని ఫలితంగా కార్టిసాల్ స్థాయిలు పెరిగి, శరీరం కొవ్వును తీవ్రంగా నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. తీవ్రమైన ఆహార నియంత్రణ కంటే 300-400 కేలరీల లోటు ఎల్లప్పుడూ ఉత్తమమైనది. హన్నా ప్రకారం, తీవ్రమైన ఆహార నియంత్రణ కంటే నిలకడగా పాటించగలిగే డైట్‌ను ఎంచుకోవాలి.

కండరాలే కొవ్వును కరిగించే చోదక శక్తి
ఎంత ఎక్కువ కండరాలను పెంచుకుంటే, విశ్రాంతి జీవక్రియ అంత ఎక్కువగా ఉంటుంది. అంటే విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కొవ్వును కరిగించడం ప్రారంభిస్తారు. ఇక్కడ కండరాలను పెంచుకోవాలంటే, తగినంత ఆహారం తీసుకుంటూ..బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.  అలా​​కాకుండా నియంత్రణ పేరుతో ఆకలితో ఉండటం అనేది కండరాలను నాశనం చేస్తుంది, పైగా జీవక్రియ మందగించి, అదనంగా కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.

40 ఏళ్లు పైబడిన వారిలో హార్మోన్లు చాలా ముఖ్యం
దీర్ఘకాలంగా తక్కువగా తిన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరిగి, శరీరం ఎక్కువ కొవ్వును నిల్వ చేసుకునేలా చేస్తాయి. అదే సమయంలో, నిరంతరం తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల, కడుపు నిండినట్లు సంకేతం ఇచ్చే లెప్టిన్ అనే హార్మోన్‌ను అణచివేస్తుంది. ఇది మీకు అంతులేని ఆకలిని కలిగించి, మిమ్మల్ని అతిగా తినేలా చేస్తుంది.

తినవలసిన ఆహారం
హన్నా చికెన్, చేపలు, గుడ్లు మరియు గ్రీక్ యోగర్ట్ వంటి లీన్ ప్రోటీన్‌ను ఎక్కువగా తినమని సిఫార్సు చేస్తుంది. కూరగాయలను ఎక్కువ పరిమాణంలో, తక్కువ కేలరీలతో తీసుకోవాలి. డైట్‌కు అనుగుణంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను నియంత్రిత మోతాదులో తీసుకోవాలి.

ఫలితాలు
తాను స్ట్రిక్ట్‌ డైట్‌ నుంచి సరైన ఆహారానికి మారిన తర్వాత, వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపించాయని అంటోంది హన్నా. ముఖ్యంగా శరీర కొలెస్ట్రాల్‌ పూర్తిగా కరిగిపోయింది, పైగా తన శక్తి, పనితీరు పుంజుకున్నాయని చెప్పుకొచ్చింది. ఆమె అత్యంత సన్నగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువగా తింటున్నప్పటి నుంచే, మునుపెన్నడూ లేనంత ఆరోగ్యంగా కనిపిస్తోందని చెబుతోంది.

"1960లలో శారీరక శ్రమ లేని వారి కోసం 1,200-కేలరీల నమూనా రూపొందించారు, కానీ ఇది అందరికీ వర్తించదని అంటోంది. సాధ్యమైనంతవరకు పనితీరును పెంచే పోషకాహార ప్రణాళిక అవసరం. ఇది సరళమైనది. ప్రభావవంతమైనది. ఎవ్వరైనా దీన్ని సరిగా అనుసరిస్తే..వాటంతటే అవే మంచి మెరుగైన ఫలితాలు వస్తాయని నమ్మకంగా పేర్కొంటూ తన పోస్ట్‌ని ముగించింది హన్నా.

 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్‌లాస్‌ సీక్రెట్‌..! నో ‍స్ట్రిక్ట్‌ డైట్‌, నో వర్కౌట్లు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement