పుదుచ్చేరి : కాంగ్రెస్‌ కూటమికి ఓటమి షాక్‌, లీడ్‌లో ఏఐఎన్‌ఆర్‌సీ | Puducherry Assembly Election Results 2026 Here You Can Get Live Updates | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి : కాంగ్రెస్‌ కూటమికి ఓటమి షాక్‌, లీడ్‌లో ఏఐఎన్‌ఆర్‌సీ

May 4 2026 8:54 AM | Updated on May 4 2026 2:50 PM

Puducherry Assembly Election Results 2026 Here You Can Get Live Updates

 

తొలి ఫలితం : సీఎం ఎన్.రంగస్వామి (N Ranga Swamy) విజయకేతనం

  • సీఎం ఎన్.రంగస్వామి తట్టంచావడి నుంచి ఘన విజయం సాధించారు.

4,336 ఓట్ల ఆధిక్యంతో  సీఎం రంగస్వామి లీడ్‌  కొనసాగుతోంది 
 

  • అధికారిక గణాంకాల ప్రకారం, AINRC అభ్యర్థులైన ఆర్. రవికుమార్, వైయాపురి మణికందన్, సి. అయ్యప్పన్, ఇ. మోహన్‌ దాస్, పి. రాజవేలు , పి.ఆర్.ఎన్. తిరుమురుగన్ వరుసగా విల్లియనూర్, ముత్యాలపేట, అరియంకుప్పం, ఎంబాలం, నెట్టపాక్కం , కారైకాల్ ఉత్తర నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు.


తట్టంచావడి నియోజకవర్గంలో, INRC వ్యవస్థాపకుడు,ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి, కాంగ్రెస్ అభ్యర్థి వి. వైతిలింగం  కంటే  3,591  ముందంజలో ఉన్నారు.

 

  • ప్రస్తుతం ట్రెండ్స్‌ ప్రకారం బీజేపీ 6 సీట్లలోనూ, కాంగ్రెస్‌ కూటమి 2, ఇతరులు 3 సీట్లలో ఆధిక్యంలో  కొనసాగుతున్నాయి. 
     

లీడ్‌లో  ఏఐఎన్‌ఆర్‌సీ

  • ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగా ఏఐఎన్‌ఆర్‌సీ లీడ్‌లో కొనసాగుతోంది.

 

ఎన్నికల ఫలితాలకుముందు  పుదుచ్చేరి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి కోరిమేడులోని అప్ప పైత్యస్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 
 

పుదుచ్చేరి శాసనసభలోని మొత్తం 30 స్థానాలకు ఎన్నికలు, కేంద్ర పాలిత ప్రాంతం అంతటా ఏప్రిల్ 9న ఒకే దశలో జరిగాయి. ఈ ఎన్నికల్లో 89.87శాతం పోలింగ్ నమోదైంది. పుదుచ్చేరి చరిత్రలోనే అత్యధికం. కాంగ్రెస్ కూటమి కంటే AINRC నేతృత్వంలోని కూటమే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 

 ప్రధానంగా రెండు కూటముల మధ్య పోటీ నెలకొంది.  ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) - ఇందులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా భాగస్వామిగా ఉంది. రెండోది కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) భాగస్వామిగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement