గత నెల 29న కుమ్మరించిన వాన
11 సెంటీమీటర్లకు పైగా కురిసినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడి
బనశంకరి: కర్ణాటక రాజధాని బెంగళూరు చరిత్రలో గత నెల 29న అత్యధిక వర్షపాతం నమోదైన రోజుగా రికార్డుల్లోకి ఎక్కింది. బుధవారం సాయంత్రం బెంగళూరు మధ్య భాగంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలి, వడగండ్లతో 11 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
పోటెత్తిన వరద నీరు
అకాల వర్షానికి బెంగళూరులో వరదనీరు పోటెత్తినట్టు అధికారులు గుర్తించారు. 200 చదరపు కిలోమీటర్లు పరిధిలో భారీ వర్షం కురిసిందని గ్రేటర్ బెంగళూరు ప్రాధికార సంస్థ తెలిపింది. 20 నుంచి 22 మిలియన్ ఘనపు మీటర్ల నీరు వచి్చందని అంచనా వేశారు. భౌగోళికంగా 900 మీటర్ల ఎత్తులో ఉన్న బెంగళూరులో వార్షికంగా 95 సెంటీమీటర్ల నుంచి 110 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. ఐఎండీ వివరాల ప్రకారం బెంగళూరులో వార్షికంగా కురిసే వర్షం కన్నా సుమారు 10 శాతం అధిక వర్షం కురిసిందని తెలిపింది.


